సాక్షి,నిజామాబాద్: బీఆర్‌ఎస్ బీజేపీలో ఎప్పటికీ విలీనం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. ఇది కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. శుక్రవారం(ఆగస్టు23) అర్వింద్ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, కవితను బీజేపీ ఎప్పటికీ దగ్గరకు రానివ్వదని చెప్పారు.
తనకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నాందేడ్ జిల్లా ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ‘బీజేపీ సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడే వారిని, పార్టీని గెలిపించేవారినే రాష్ట్ర బీజేపీ అధ్యకుడిగా ఎంపికచేయాలి. పార్టీ అభ్యర్థులను ఎన్నికలలో గెలిపించే సత్తా ఉన్నవారికి నాయకత్వ భాధ్యతలను అప్పగించాలి.
రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది. సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ఏమయ్యాడో అందరికీ తెలుసు. కేసీఆర్‌కు రేవంత్ కు తేడా లేదని ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. రుణమాఫీలో పనికిమాలిన కండిషన్లు పెట్టి రైతులను దగా చేశారు. సంపూర్ణ రుణమాఫీ కోసం రేపు రైతు సంఘాలు రైతులు ఆర్మూరులో చేపడుతున్న మహాధర్నాకు బీజేపీ మద్దతు ఇస్తుంది’అని అర్వింద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment