బీఆర్‌ఎస్ సభ్యులు– మంత్రుల మధ్య వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలతో శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం కాసేపు ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశం ఏ స్థితిలో ఉంది..దాని అమలులో జాప్యానికి కారణాలు చెబుతూ.. ఎప్పట్లోగా అమలు చేస్తారో చెప్పాలని బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ముఠాగోపాల్, సంజయ్‌లు ప్రశ్నించారు. ఆ ప్రతిపాదన పరిశీలనలో ఉందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచి్చన సమాధానంపై..జాప్యం లేదు అని చెప్పటమేంటని హరీశ్‌రావు నిలదీశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరీ్టసీపై చెప్పిన హామీలను ప్రస్తావించారు. 2015 నాటి వేతన సవరణ బాండు బకాయిలు విడుదల చేస్తున్నట్టు గత ఫిబ్రవరిలో నెక్లెస్ రోడ్డు వద్ద జరిగిన సభలో స్వయంగా సీఎం ప్రకటించి నమూనా చెక్కును చూపారని, ఇప్పటి వరకు ఆ చెక్కు నిధులు నెక్లెస్ రోడ్డు నుంచి బస్‌భవన్‌కు చేరలేదని, మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం ఆరీ్టసీకి నిధులు సరిగా రీయింబర్స్ చేయటం లేదని పేర్కొన్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆరీ్టసీని చంపేసి ఎన్నికల ముందు ఓట్ల కోసం అసంబద్ధంగా, సంప్రదింపులు లేకుండా విలీనం చేశారని ఎదురుదాడికి దిగారు.
గవర్నర్ సంతకం చేయటం లేదంటూ కారి్మకులను బీఆర్‌ఎస్ నేతలు రెచ్చగొట్టి రాజ్‌భవన్ ముందు ఆందోళన చేయించారన్నారు. త్వరలో అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి నుంచి సానుకూల సమాధానం రానందున తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిని స్పీకర్ తిరస్కరించారు. తమకు నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ సభ్యులు కోరినా ఇవ్వలేదు. అదే సమయంలో సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావుకు అదే అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంతో బీఆర్‌ఎస్ సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.
దీనిని మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన వ్యక్తం చేసే ప్రొవిజన్ లేదన్నారు. మరి ఆ ప్రశ్న అడిగిన వారిలో కూనంనేని లేకున్నా, ఆయనకు స్పీకర్ అవకాశం ఇవ్వటం నిబంధనకు విరుద్ధం కాదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని..ఒకసారి ప్రశ్న ఆమోదం కాగానే అది సభ ఆస్తిగా మారుతుందని, దానిపై ఇతర సభ్యులకు మాట్లాడే అధికారం లేదని ఏ రూల్ చెప్పటం లేదని పేర్కొన్నారు. సభ్యులు పోడియం వద్దకు వస్తే బయటకు పంపే నిబంధన కూడా ఉందని, కానీ స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు.
కారి్మక సంఘానికి అప్పట్లో హరీశ్‌రావు గౌరవాధ్యక్షుడిగా ఉంటే ఆయన్ను ఎలా తొలగించాలో ఆ పార్టీ నాయకుడికి తెలియక కారి్మక సంఘాలనే రద్దు చేశారని, అది వారి కుటుంబగొడవ అని, దానితో తమకు సంబంధం లేదని సీఎం అన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండగానే, స్పీకర్ వాయిదా తీర్మానాలను తిరస్కరించి ఇటీవల చనిపోయిన మాజీ సభ్యుల మృతికి సంతాపం వ్యక్తం చేసి టీ విరామ సమయం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment