RTC employees
-
నైట్ డ్యూటీ అలవెన్స్‌లో కోత
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. నైట్ డ్యూటీ అలవెన్స్‌ల్లో భారీ కోత విధించింది. దీంతో రాష్ట్రంలో సగటున రోజుకు నైట్‌డ్యూటీలు చేసే 10వేలమంది ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భారీగా నైట్ డ్యూటీ అలవెన్స్‌లు తీసుకున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం అందులో సగానికి పైగా కోత పడనుంది. నైట్ డ్యూటీ అలవెన్స్‌లను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటిస్తూనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులను నిండా ముంచిన తీరు ఇలా ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీతాలతోపాటే నైట్‌డ్యూటీ అలవెన్స్లుఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బందికి నైట్ డ్యూటీ అలవెన్స్‌లను అమలు చేసింది. అంతేకాదు నైట్ డ్యూటీ అలవెన్స్‌లను ప్రతి నెలా జీతాలతోపాటే చెల్లించింది. నైట్ డ్యూటీ చేస్తే రోజుకు కనీసం రూ.300 అలవెన్స్‌గా నిర్ణయించింది. గరిష్టంగా రోజుకు రూ.500వరకు కూడా వచ్చేట్టుగా చూసింది. దాంతో నైట్ డ్యూటీ చేసే ఒక్కో డ్రైవర్, కండక్టర్, గ్యారేజీ సిబ్బంది నెలకు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు అదనపు ప్రయోజనం చేకూరేది.కూటమి ప్రభుత్వంలో అలవెన్స్ నిలిపివేత... భారీ కోతరాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నైట్ డ్యూటీ అలవెన్స్‌లను నిలిపివేసింది. దాంతో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది తీవ్రంగా నష్టపోయారు. నైట్‌డ్యూటీ అలవెన్స్‌లను పునరుద్ధరించాలని ఆర్టీసీ యూనియన్లు ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతునే ఉన్నాయి. దాంతో తప్పక నైట్‌డ్యూటీ అలవెన్స్‌లను పునరుద్ధరించిన టీడీపీ ప్రభుత్వం వాటిలో భారీ కోత విధించి తన అసలు బుద్ధిని ప్రదర్శించింది. నైట్ డ్యూటీ అలవెన్స్ రోజుకు రూ.150కు పరిమితం చేసింది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఏకంగా 50శాతం కోత విధించింది. దాంతో నైట్‌డ్యూటీ చేసే కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బందికి నెలకు రూ.2వేల నుంచి రూ.3వేలే దక్కనుంది.రోజుకు 10వేలమందికి నష్టంఆర్టీసీ 10వేల బస్ సర్వీసులను నిర్వహిస్తోంది. రోజుకు దాదాపు 4వేల బస్‌లు ఇతర ప్రాంతాల్లో నైట్ హాల్ట్‌గా ఉంటాయి. ఒక బస్సుకు ఇద్దరు (కండక్టర్, డ్రైవర్) చొప్పున 4వేల బస్‌లకు 8వేల మంది నైట్ డ్యూటీ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో 129 ఆర్టీసీ గ్యారేజ్‌ల్లో నైట్ డ్యూటీ సిబ్బందితో కలిపి రోజుకు దాదాపు 10వేలమంది ఉద్యోగులు నైట్‌డ్యూటీలు చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం నైట్ డ్యూటీ అలవెన్స్‌లలో 50శాతం కోత విధించడంతో రోజుకు 10వేలమంది ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు ఆర్థికంగా నష్టకలిగించే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
ఆ రూ.200 కోట్లు ఎటుపోయాయి?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అధిక పెన్షన్ కాంట్రిబ్యూషన్ సొమ్ముపై గందరగోళం నెలకొంది. ఉద్యోగులు చెల్లించిన సుమారు రూ.125 కోట్లు, వాటిపై వడ్డీ కలిపి.. మొత్తం రూ.200 కోట్ల మొత్తానికి లెక్కతేలకుండా పోయింది. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ స్కీమ్ కోసం పదేళ్ల కింద ఉద్యోగులు చెల్లించిన సొమ్ము ఏమైందో తెలియడం లేదని.. ఇప్పుడు అధిక పెన్షన్ కోసం మొదటి నుంచీ లెక్కేసి మొత్తం డబ్బులు కట్టాలంటున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యవహారాన్ని పరిష్కరించాల్సిన ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ పీఎఫ్ బకాయిలు సకాలంలో చెల్లించకపోవటం, పీఎఫ్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకోవటం, విషయం కోర్టు వరకు వెళ్లటం, అయినా బకాయిలు చెల్లించక ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం దాకా ఇప్పటికే ఎన్నో ఆందోళనకర పరిణామాలు జరిగాయి. దానికితోడు అధిక పెన్షన్ల వ్యవహారం మరో వివాదానికి కారణమవుతోంది.అసలేం జరిగింది?ఉద్యోగులకు అధిక పెన్షన్ కోసం 1995 నవంబరులో భవిష్యనిధి సంస్థ ఆప్షన్లను కోరింది. భవిష్య నిధి వ్యవహారాల కోసం ఆర్టీసీలో ప్రత్యేకంగా పీఎఫ్ ట్రస్టు ఉంటుంది. ఆ ట్రస్టు ఉమ్మడి ఆర్టీసీ ఉద్యోగుల నుంచి హయ్యర్ పెన్షన్ కాంట్రిబ్యూషన్‌ను వసూలు చేసి ఈపీఎఫ్ఓకు జమ చేసింది. 2014 ఆగస్టు వరకు ఇది కొనసాగింది. మొత్తంగా 16,307 మంది ఇలా హయ్యర్ పెన్షన్ కోసం వారి వేతనాల నుంచి 8.33 శాతం చొప్పున కాంట్రి బ్యూషన్ చెల్లించారు. అందులో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు 7,373 మంది ఉన్నారు. వారు హ య్యర్ పెన్షన్‌కోసం చెల్లించిన మొత్తం సుమారు రూ.125 కోట్ల వరకు ఉంది. కానీ సాంకేతిక కారణాలతో వారి ఆప్షన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీనితో అప్పటివరకు వారు చెల్లించిన కాంట్రిబ్యూషన్ సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉన్నా.. ఈపీఎఫ్ఓ వద్దే ఉండిపోయింది. పీఎఫ్ వ్యవహారాలు చూసేందుకు ఆర్టీసీలో ప్రత్యేకంగా ట్రస్టు ఉన్నా.. అది పట్టించుకోలేదు. ఉద్యోగులు చెల్లించిన సొమ్ము రూ.125 కోట్లకు వడ్డీ కలిపి రూ.200 కోట్ల వరకు అవుతుందని.. ఆ సొమ్ము లెక్క తేలడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.ఇప్పుడూ పూర్తిగా కట్టాలంటూ నోటీసులతో..సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ఓ గతేడాది మరోసారి హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్లు తీసుకుంది. అప్పట్లో తిరస్కరణకు గురైనవారిలో కొందరు రిటైరవగా.. మిగతావారిలో చాలా వరకు హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్లు ఇచ్చారు. ఈసారి వేతనాల నుంచి 8.33 శాతం కాంట్రిబ్యూషన్తోపాటు ఎంప్లాయీస్ హయ్యర్ పెన్షన్ స్కీం నిర్వహణ చార్జీల పేరిట మరో 1.16 శాతం మొత్తాన్ని చెల్లించాలని ఈపీఎఫ్ఓ సూచించింది. స్కీం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం సొమ్మును చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది. గతంలో ఆప్షన్ రిజెక్ట్ అయి ఇప్పుడు మళ్లీ ఆప్షన్ ఇచ్చినవారు.. అప్పట్లో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి, మిగతా మొత్తాన్ని వసూలు చేసుకోవాలని అభ్యర్థించారు. కానీ స్పందన లేదు. ఈ విషయాన్ని పీఎఫ్ ట్రస్టు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు..హయ్యర్ పెన్షన్ ఆప్షన్లను తిరస్కరించిన వెంటనే ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని వాపసు చేయాల్సి ఉంది. కానీ ఎన్ని సార్లు కోరినా ఎవరూ పట్టించుకోలేదు. సమస్య ఎక్కడుందో చెప్పేవారు కూడా లేకపోవటం విడ్డూరం. ఈ విషయంలో చొరవ చూపాల్సిన ఆర్టీసీ మిన్నకుండిపోతోంది. ఇప్పటికైనా దీన్ని పరిష్కరించి 7,373 మంది ఉద్యోగులకు ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉంది – ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావుఏపీలోనూ ఇదే సమస్య..ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి 8,934 మంది ఉద్యోగులు కూడా ఇదే తరహాలో ఎదు రుచూస్తున్నారు. వారు అప్పట్లో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి తాజా కాంట్రిబ్యూషన్‌ను లెక్కించాల్సి ఉంది. దీన్ని ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టు సీరియస్‌గా తీసుకుని కొలిక్కి తేవాల్సి ఉంది– ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత దామోదర్వెంకట్రావు.. ప్రస్తుతం ఆర్టీసీలో డిపో క్లర్కు. 1996లో ఆయన కండక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో.. హయ్యర్ పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓకు ఆప్షన్ ఇచ్చారు. కాంట్రిబ్యూషన్‌గా రూ.2.60 లక్షలు చెల్లించారు. ఆయన ఆప్షన్ రిజెక్ట్ అయింది. కానీ ఈ విషయం వెంకట్రావుకు తెలియలేదు. సమాచారం ఇవ్వాల్సిన ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పట్టించుకోలేదు. తాజాగా 2022లో ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ కోసం మళ్లీ ఆప్షన్ స్వీకరించింది.దీనికి వెంకట్రావు దరఖాస్తు చేసుకోగా.. 1996 నాటి నుంచి ఇప్పటివరకు కలిపి కాంట్రిబ్యూషన్ రూ.4.80 లక్షలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ నోటీసు ఇచ్చింది. ఇదేమిటని ఆయన ఆరా తీయగా.. 1996లోనే తన దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలిసింది. అప్పట్లో చెల్లించిన మొత్తం మినహాయించి మిగతాది చెల్లిస్తానని ఆయన చెబితే.. మొత్తం చెల్లించాల్సిందేనని ఈపీఎఫ్ఓ నుంచి సమాధానం వచ్చింది. మరి నాడు చెల్లించిన సొమ్ము ఏమైందో అంతుపట్టని పరిస్థితి. తెలంగాణ ఆర్టీసీలో వేల మంది ఉద్యోగుల సమస్య ఇది.. -
ఆర్టీసీ ఉద్యోగులకు సర్కారు షాక్
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నైట్ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌లను జీతాల బిల్లులతో కలిపి ఇవ్వకూడదని నిర్ణయించింది. దాంతో రాష్ట్రంలోని దాదాపు 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతిననున్నాయి. తమకు జీతాలతోపాటే నైట్ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర అలవెన్స్‌లు చెల్లించాలని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే నిధుల కొరత లేదా ఇతర కారణాలతో అలవెన్స్‌లు ఏళ్ల తరబడి చెల్లించేవారు కాదు. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ అంశంపై కూడా సానుకూలంగా స్పందించింది. అలవెన్స్‌లను కూడా గ్రేడ్–1 ఉద్యోగులకు రూ.600 నుంచి రూ.800కు, గ్రేడ్–2 ఉద్యోగులకు రూ.400 నుంచి రూ.600కు, గ్రేడ్–3 ఉద్యోగులకు రూ.300 నుంచి రూ.400కు పెంచింది. ఆ అలవెన్స్‌లను జీతాల బిల్లులతోపాటే ఆమోదించి ప్రతి నెలా జీతాలతోపాటే చెల్లించాలని నిర్ణయించింది. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డ్రైవర్లు, కండక్టర్లకు జీతాలతోపాటు అలవెన్స్‌లను కూడా చెల్లిస్తూ వచ్చారు. కాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించింది. ఆగస్టు నెల జీతాల బిల్లులతో నైట్‌డ్యూటీ అలవెన్స్‌లు, టీఏలు, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌లను కలపవద్దని విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు షాక్‌కు గురయ్యారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో తమకు అలవెన్స్‌లు ఏళ్లకు ఏళ్లు పెండింగులో ఉండే విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతమయ్యేలా ఆందోళన చెందుతున్నారు. నేడు నిరసనప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని డిపోల్లో ఉద్యోగులు ఈ నెల 30న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని నిర్ణయించాం. నిరసన ప్రదర్శన నిర్వహిస్తాం. రిటైరైన ఉద్యోగులకు సకాలంలో సెటిల్మెంట్ చేయకుండా ట్రెజరీ శాఖ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఈ అంశంపై కూడా నిరసన తెలుపుతాం. – పీవీ రమణారెడ్డి, అధ్యక్షుడు, – వై.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్ -
ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై సభలో దుమారం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలతో శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం కాసేపు ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశం ఏ స్థితిలో ఉంది..దాని అమలులో జాప్యానికి కారణాలు చెబుతూ.. ఎప్పట్లోగా అమలు చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ముఠాగోపాల్, సంజయ్‌లు ప్రశ్నించారు. ఆ ప్రతిపాదన పరిశీలనలో ఉందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచి్చన సమాధానంపై..జాప్యం లేదు అని చెప్పటమేంటని హరీశ్‌రావు నిలదీశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరీ్టసీపై చెప్పిన హామీలను ప్రస్తావించారు. 2015 నాటి వేతన సవరణ బాండు బకాయిలు విడుదల చేస్తున్నట్టు గత ఫిబ్రవరిలో నెక్లెస్ రోడ్డు వద్ద జరిగిన సభలో స్వయంగా సీఎం ప్రకటించి నమూనా చెక్కును చూపారని, ఇప్పటి వరకు ఆ చెక్కు నిధులు నెక్లెస్ రోడ్డు నుంచి బస్‌భవన్‌కు చేరలేదని, మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం ఆరీ్టసీకి నిధులు సరిగా రీయింబర్స్ చేయటం లేదని పేర్కొన్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆరీ్టసీని చంపేసి ఎన్నికల ముందు ఓట్ల కోసం అసంబద్ధంగా, సంప్రదింపులు లేకుండా విలీనం చేశారని ఎదురుదాడికి దిగారు. గవర్నర్ సంతకం చేయటం లేదంటూ కారి్మకులను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి రాజ్‌భవన్ ముందు ఆందోళన చేయించారన్నారు. త్వరలో అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి నుంచి సానుకూల సమాధానం రానందున తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిని స్పీకర్ తిరస్కరించారు. తమకు నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరినా ఇవ్వలేదు. అదే సమయంలో సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావుకు అదే అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంతో బీఆర్ఎస్ సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీనిని మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన వ్యక్తం చేసే ప్రొవిజన్ లేదన్నారు. మరి ఆ ప్రశ్న అడిగిన వారిలో కూనంనేని లేకున్నా, ఆయనకు స్పీకర్ అవకాశం ఇవ్వటం నిబంధనకు విరుద్ధం కాదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని..ఒకసారి ప్రశ్న ఆమోదం కాగానే అది సభ ఆస్తిగా మారుతుందని, దానిపై ఇతర సభ్యులకు మాట్లాడే అధికారం లేదని ఏ రూల్ చెప్పటం లేదని పేర్కొన్నారు. సభ్యులు పోడియం వద్దకు వస్తే బయటకు పంపే నిబంధన కూడా ఉందని, కానీ స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు. కారి్మక సంఘానికి అప్పట్లో హరీశ్‌రావు గౌరవాధ్యక్షుడిగా ఉంటే ఆయన్ను ఎలా తొలగించాలో ఆ పార్టీ నాయకుడికి తెలియక కారి్మక సంఘాలనే రద్దు చేశారని, అది వారి కుటుంబగొడవ అని, దానితో తమకు సంబంధం లేదని సీఎం అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండగానే, స్పీకర్ వాయిదా తీర్మానాలను తిరస్కరించి ఇటీవల చనిపోయిన మాజీ సభ్యుల మృతికి సంతాపం వ్యక్తం చేసి టీ విరామ సమయం ప్రకటించారు. -
గతుకుల రోడ్డుపై.. బతుకు బండి!
వందల సంఖ్యలో బస్సులు.. లక్షల మంది ప్రయాణికులు.. వారిని సకాలంలో క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిలో నిమగ్నమవుతున్నారు. పని భారాన్ని భరిస్తూ ఆర్టీసీ ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు.ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మీ’ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఉద్యోగులపై తీవ్ర పనిఒత్తిడి పడింది. వీటన్నింటినీ తట్టుకుని నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నా.. వారి బతుకు బండి సురక్షితంగా సాగడంలేదు. ఒకవైపు తీవ్ర పనిఒత్తిడి, డబుల్ డ్యూటీలు.. మరోవైపు అనారోగ్య సమస్యలు, అధికారుల వేధింపులు, ఇలా అనేక సమస్యలతో ఆర్టీసీ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్–1, నిజామాబాద్–2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2400కు పైగా మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్షా 90వేల మంది ప్రయాణించేవారు. కాగా.. మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రెండు లక్షల 90 వేలకు చేరింది.పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికుల సామర్థ్యం 50 మంది వరకు ఉంటుంది. గతంలో సామర్థ్యానికి మించి అదనంగా 10 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో 80 నుంచి 100 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణించడానికి వయస్సు పైబడినవారు, చిన్న పిల్లలు అవస్థలు పడుతున్నారు.నిజామాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికుల కిటకిట8 గంటల డ్యూటీ లేదు..డ్రైవర్లు, కండక్టర్లకు గతంలో 8 గంటల డ్యూటీ ఉండేది. కానీ ఇప్పుడు పని గంటల నిబంధన లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లిన డ్రైవర్లు, కండక్టర్లు డేడ్యూటీ చేస్తారు. కానీ ఉదయం వెళ్లిన వారు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో తిరిగి వచ్చే సరికి రాత్రి అవుతోంది. నిజామాబాద్ – హైదరాబాద్ మధ్య అప్ అండ్ డౌన్ 360 కిలోమీటర్లు అవుతుండగా.. నిజామాబాద్ – వరంగల్ మధ్య అప్ అండ్ డౌన్ 460 కిలోమీటర్లు పడుతుంది.దీంతో పాటు వారికి టార్గెట్ ఒత్తిడి కూడా ఉంటుంది. దీంతో కార్మికులకు పనిభారం పెరుగుతోంది. ఇలా డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం 10 నుంచి 12 గంటల పాటు పని చేస్తున్నారు. దీంతో నిద్ర కరువై అనారోగ్యాల భారిన పడుతున్నారు. నిద్రలేమి కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. యూనియన్లు లేకపోవడంతో డిపోలోని అధికారులు సిబ్బందికి ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేయడంతో పనిఒత్తిడి పెరుగుతోంది.ప్రశ్నిస్తున్న అధికారులు..ఆర్టీసీ బస్సులకు డైవర్లు కేఎంపీఎల్ తీసుకురాకపోతే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. రూట్లో వెళ్లే బస్సులు కేఎంపీఎల్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. డైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి కేఏంపీఎల్ వచ్చేటట్లు చూడాలని సూచనలు చేస్తున్నారు. కండక్టర్లకు మహాలక్ష్మి పథకంతో పాటు టిక్కెట్లకు టార్గెట్ నిర్దేశిస్తున్నట్లు ఆరీ్టసీలో చర్చ జరుగుతోంది. దీంతో టార్గెట్ కాకపోతే తాము ఏం చేయగలమని కండక్టర్లు వాపోతున్నారు.రెండు డ్యూటీలు చేస్తేనే స్పెషల్ ఆఫ్..ఆర్టీసీ ఉద్యోగులు లీవ్‌లు తీసుకోవాలంటే కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కండక్టర్, డ్రైవర్లకు డే డ్యూటీ, నైట్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ ఉంటుంది. రోజంతా పనిచేస్తేనే మరుసటి రోజు స్పెషల్ ఆఫ్ ఇస్తున్నారు. అలాగే అనార్యోగం పాలైన సిబ్బంది సంబంధిత డాక్టర్ల నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర సెలవులు కావాలంటే అధికారుల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే. -
ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాల స్తంభన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై భవిష్యనిధి (పీఎఫ్) సంస్థ తీవ్ర చర్యకు ఉపక్రమించింది. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలను తీవ్రంగా పరిగణిస్తూ ఏకంగా ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. తనకున్న ప్రత్యేక అధికారాలతో ఆర్టీసీ ప్రధాన కార్యాలయంతో ముడిపడిన ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఆర్టీసీ రోజువారీ ఆదాయం ఈ ఖాతాల్లోనే డిపాజిట్ అవుతుంది. ఆ మొత్తం నుంచే సంస్థ రోజువారీ కార్యకలాపాలు సాగుతుంటాయి. ఇప్పుడు బ్యాంకు ఖాతాలు స్తంభించడంతో ఆర్టీసీలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రూ.వేయి కోట్లకు చేరువలో బకాయిలు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన భవిష్యనిధి ఖాతాల్లో ప్రతినెలా కంట్రిబ్యూషన్ జమ అవుతుంటుంది. సాధారణ సంస్థల్లాగా కాకుండా, భవిష్యనిధి ఖాతాలను సంస్థనే నిర్వహిస్తుంది. వాటిల్లో ఉద్యోగుల కంట్రిబ్యూషన్, వారి పక్షాన సంస్థ కంట్రిబ్యూషన్ జమ చేస్తుంది. గతంలో ఈ కంట్రిబ్యూషన్ ఠంచన్‌గా జమయ్యేది. కానీ, పదేళ్లుగా సంస్థ పనితీరు సరిగా లేకపోవటంతో.. సంస్థ అవసరాల కోసం భవిష్యనిధి మొత్తాన్ని ఆర్టీసీ వినియోగించుకోవడం ప్రారంభించింది. ఏడాదిన్నర క్రితం వరకు అలా రూ.1,200 కోట్లకు ఆ బకాయిలు పేరుకుపోయాయి.పలు దఫాలుగా భవిష్యనిధి సంస్థ నిలదీసింది. కానీ ఆర్టీసీ స్పందించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో, విడతల వారీగా రూ.300 కోట్ల వరకు చెల్లించింది. ఆ తర్వాత ఆ చెల్లింపులు ఆగిపోయాయి. ప్రస్తుతం భవిష్యనిధి సంస్థకు రూ.950 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ప్రతినెలా కంట్రిబ్యూషన్ల కింద రూ.25 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీన్ని ఇప్పుడు పీఎఫ్ కమిషనరేట్ తీవ్రంగా పరిగణించి నిలదీయటం ప్రారంభించింది. ఇప్పుడు ఏకంగా తన ప్రత్యేక అధికారాలను వినియోగించి ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. రీజినల్ ఖాతాల్లోకి జమ..భవిష్యనిధి సంస్థ చర్యతో వెంటనే తేరుకున్న ఆర్టీసీ.. రోజువారీ ఆదాయాన్ని బస్‌భవన్‌కు ఉన్న ప్రధాన ఖాతాల్లో కాకుండా రీజినల్ కార్యాలయాలతో అనుసంధానమైన ఇతర ఖాతాల్లో జమ చేయటం ప్రారంభించింది. ఈమేరకు అన్ని కార్యాలయాలకు బస్‌భవన్ నుంచి లిఖితపూర్వక ఆదేశాలందాయి. ఈ ఖాతాలు ఫ్రీజ్ కానందున వాటిల్లో జమ చేసి వాటి నుంచే డ్రా చేసుకుంటూ రోజువారీ కార్యకలాపాలు సాగించాలని ఆదేశించింది. భవిష్యనిధి సంస్థ వాటినీ ఫ్రీజ్ చేయబోతోందని సమాచారం అందడంతో హైకోర్టును ఆశ్రయించి ఫ్రీజ్కాకుండా స్టే పొందాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు తెలిసింది.అలా జరగని పక్షంలో ఆర్టీసీ రోజువారీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు ఉన్న టోల్గేట్ల ఫాస్టాగ్‌లకు సంబంధించి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంది. దాన్ని కూడా పీఎఫ్ సంస్థ ఫ్రీజ్ చేయబోతోందని ఆరీ్టసీకి సమాచారం అందింది. అదే జరిగితే, ఫాస్టాగ్‌ల నుంచి టోల్ రుసుము మినహాయింపునకు వీలుండదు. దీంతో టోల్ గేట్ల వద్ద నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌తో కాకుండా నగదు చెల్లిస్తే, రుసుము రెట్టింపు ఉంటుంది. ఇది ఆర్టీసీపై రోజువారీ రూ.లక్షల్లో భారం పడుతుంది. దీంతో ఫాస్టాగ్ ఖాతాకు కూడా ప్రత్యామ్నాయ చర్య లకు ఉపక్రమించింది. సోమవారం సెలవు కావటంతో, మంగళవారం దాన్ని కొలిక్కి తేవాలని భావిస్తోంది. పీఎఫ్ బకాయిలకు సాయం సాధ్యమా?హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేనిపక్షంలో కచి్చతంగా పీఎఫ్ బకాయిలు చెల్లించాల్సిందే. అన్ని నిధులు ఆర్టీసీ వద్ద సిద్ధంగా లేనందున.. ప్రభుత్వమే జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, 2013 వేతన సవరణ బాండు బకాయిలకు సంబంధించి ఉద్యోగుల చెల్లింపునే ప్రభుత్వం అర్ధంతరంగా వదిలేసిన ప్రస్తుత తరుణంలో, పీఎఫ్ బకాయిలకు సాయం చేయటం సాధ్యమా అన్న మీమాంస ఉత్పన్నమవుతోంది. బాండు బకాయిలను ఆర్టీసీ డ్రైవర్లకు చెల్లించి, మిగతా వారికి చెల్లించలేదు. బాండు బకాయిలకు రూ.280 కోట్లు అవసరం కాగా, కేవలం రూ.80 కోట్లే అందినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని గత ఫిబ్రవరిలో డ్రైవర్ కేటగిరీ ఉద్యోగులకు చెల్లించారు. మిగతా వారికి చెల్లించలేదు. దీంతో భవిష్యనిధి బకాయిల విషయంలో గందరగోళం నెలకొంది. -
ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త వేతనాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త వేతనాల చెల్లింపు మొదలైంది. 2017 నాటి వేతన సవరణకు సంబంధించి గత మార్చిలో ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటించటంతో, ఆ మేరకు కొత్త వేతనాలను జూన్ 1న చెల్లించారు. మే నెలకు సంబంధించి వేతనాలు తాజాగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నమోదయ్యాయి. 21 శాతం ఫిట్మెంట్ ప్రకారం కొత్త వేతనాలు అందుకోవటంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోని ఆర్టీసీ ఉద్యోగుల్లో సంబరాలు నెలకొన్నాయి. ఏడేళ్ల క్రితం నాటి వేతన పెంపుతో.. 2017లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవటంతో ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను ప్రకటించలేదు. దీంతో కార్మిక సంఘాలు అప్పట్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. వాటితో చర్చించేందుకు నాటి ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. వేతన సవరణ చేయకుంటే సమ్మెను ఆపబోమని కారి్మక సంఘాలు తేల్చి చెప్పటంతో, మధ్యే మార్గంగా 16 శాతం ఇంటీరియమ్ రిలీఫ్‌కు కమిటీ ప్రతిపాదించింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఫిట్మెంట్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. దీనికి కార్మిక సంఘాలు సమ్మతించి సమ్మెను విరమించాయి. అప్పటినుంచి ఐఆరే కొనసాగుతూ వచ్చింది. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి మార్చిలో 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. ఇక అప్పటివరకు ఉన్న 82.6 శాతం కరువు భత్యంలోంచి, 2017 వేతన సవరణ గడువు నాటికి ఉన్న 31.1 శాతాన్ని ఉద్యోగుల మూలవేతనంలో చేర్చారు. మిగిలిన కరువు భత్యాన్ని 43.2 శాతానికి న్యూట్రలైజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా ఆర్టీసీ ఉద్యోగుల హెచ్ఆర్ఏను తగ్గించారు. మొత్తంగా కాస్త సంతృప్తికరంగానే ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఏడేళ్ల క్రితం నాటి వేతన పెంపు అమలులోకి రావటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు మాత్రం ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తామనటంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ. 360 కోట్ల భారం ఈ వేతన సవరణతో ఆరీ్టసీపై సాలీనా రూ.360 కోట్ల భారం పడనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవటంతో, రోజువారీ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు సంస్థ ప్రత్యేక కసరత్తు నిర్వహిస్తోంది. ఇది కొంతవరకు సత్ఫలితాలనిస్తోంది. -
తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ ఉద్యోగుల విలీన’ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదున్నర నెలలు దాటినా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కిమ్మనటం లేదు. ఇప్పటికిప్పుడు సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే, వారి జీతాలు పెంచాలి. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. 2015 నాటి వేతన సవరణ బకాయిలను చెల్లించేందుకే ప్రభుత్వం కిందామీదా పడుతోంది. ఈ తరుణంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల భారాన్ని తలపైకెత్తుకోవటం ఎందుకన్న ఉద్దేశంతో దాన్ని పక్కనపెట్టిందన్న అనుమానాలున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎన్ని పర్యాయాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నోరు మెదపటం లేదు. 2019లోనే విలీనంపై చర్చ ⇒ ఆర్టీసీలో 2019లో సుదీర్ఘ సమ్మె జరిగిన సమయంలో ఉద్యోగుల విలీనంపై కొంత చర్చ జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ నేతలు కూడా నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అది చల్లారిపోయింది. ⇒గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనూహ్యంగా 2023 ఆగస్టులో విలీనం అంశాన్ని ఉన్నట్టుండి తెరపైకి తెచి్చంది. ⇒అదే నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానిపై సానుకూలత వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ⇒సెపె్టంబర్ మొదటివారంలో బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేయటంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టు అయ్యింది. ⇒విధివిధానాలకు ఓ కమిటీ ఏర్పాటు చేసి వదిలేసింది. ⇒ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. ఎన్నికల హామీలో ఉంది.. నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున వెంటనే, ఆ హామీని నెరవేర్చాలి. విలీనం కోసం ఉద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్నామన్న ఆవేదన నుంచి ఉపశమనం పొందే ఆ ప్రక్రియను వెంటనే చేపట్టి వారికి న్యాయం చేయాలి. –అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘం నేత కొత్త కమిటీ వేసి నివేదిక తెప్పించాలి విలీన ప్రక్రియ 90 శాతం పూర్తయింది. విధివిధానాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కొత్త కమిటీ వేసి వీలైనంత తొందరలో నివేదిక తెప్పించుకొని దాన్ని అమలు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగేందుకు ప్రభుత్వం సహకరించినట్టవుతుంది. – మర్రి నరేందర్ఉద్యోగుల్లో తీవ్ర నైరాశ్యంఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ ఉన్నందున వీరికి పీఆర్సీ వర్తించదు. విలీనమయితేనే పీఆర్సీ పరిధిలోకి వస్తారు. జీతాలు కూడా కాస్త అటూఇటుగా ప్రభుత్వ ఉద్యోగుల దరికి చేరుతాయి,. అయితే విలీన ప్రక్రియ కాలయాపన జరిగే కొద్దీ, పదవీ విరమణ పొందే ఆర్టీసీ ఉద్యోగులు ఆ లబి్ధకి దూరమవుతున్నారు. ఇప్పటికే 1,800 మంది పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందితే ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలుంటాయి. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. -
ఆర్టీసీ ఎంతో హ్యాపీ..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఈ పేరు వింటనే ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు...ఈ పేరు చెవిలో పడితేనే ఆ ఉద్యోగుల్లో హడల్ ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ఉద్యోగుల దీర్ఘకాలిక పోరాటం...కల కూడా. గతంలో చంద్రబాబుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విలీనం సాధ్యం కాదని కొట్టిపారేశారు. అంతేకాదు ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించి తన రాజగురువు రామోజీరావుకు అప్పగించాలన్న దురాలోచన కూడా చేశారన్నది బహిరంగ రహస్యమే. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.దశాబ్దాల ఆర్టీసీ ఉద్యోగుల కలను సాకారం చేస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ చరిత్రాతి్మక నిర్ణయం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో నవోదయాన్ని తీసుకువచి్చంది. ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలను కలి్పంచడమే కాకుండా ఆర్టీసీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోంది. ఆర్టీసీ పట్ల చంద్రబాబు వైఖరి? ఆయన విధానాలు ...ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన అనే అంశాలను ఓసారి సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.జగన్ విలీన హాసం..!⇒ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం.⇒ ఉద్యోగుల జీతాల కోసం ఒక్క నెల కూడా అప్పు చేయలేదు. ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లించింది. ఇప్పటికి 52 నెలల్లో రూ.15,600 కోట్లు చెల్లించిన ప్రభుత్వం. ⇒ జీతాల కోసం అప్పులే చేయలేదు కాబట్టి...వడ్డీ సమస్యే లేదు ⇒ వైస్సార్సీపీ కోసం అద్దెకు తీసుకున్న బస్సులకు తక్షణమే పార్టీ ఖాతా నుంచి బిల్లుల చెల్లింపు ⇒ జీతాల చెల్లింపునకు ఐదేళ్లలో రూ.2,500 కోట్లు అప్పు తీర్చింది. అప్పు రూ.2 వేల కోట్లకు తగ్గింది. ⇒ ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సంఘం బకాయి రూ.200 కోట్లు చెల్లింపు దాంతో ఉద్యోగులకు సులభంగా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు ⇒ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద ప్రమాద బీమా సదుపాయం ప్రమాద బీమా మొదట రూ.45 లక్షలకు...అనంతరం ఏకంగా రూ.1.10 కోట్లకు పెంపు ⇒ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు ⇒ 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కల్పన ⇒ 2016 నుంచి 2019 మధ్య పెండింగులో ఉన్న 845 మందికి ఉద్యోగాలు ⇒ 2020 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు ⇒ 2020 తరువాత అనారోగ్య కారణంతో పదవీ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు. ⇒ 2020 తరువాత రిటైరైన ఉద్యోగులకు గ్రాడ్యుటీ రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కింద రూ.271.89 కోట్లు, సరెండర్ లీవుల కింద రూ.165 కోట్లు చెల్లింపు ⇒ ఇప్పటికి 1,406 కొత్త బస్సులు కొనుగోలు. మరో 1,500 కొత్త బస్సుల కొనుగోలుకు ప్రతిపాదన. తొలిసారిగా ఈ–బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ. తిరుమల–తిరుపతి ఘాట్‌లో 100 ఈ–బస్సులు. రానున్న ఐదేళ్లలో 7 వేల ఈ–బస్సుల కొనుగోలుకు నిర్ణయం ⇒ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.బాబు మాటల మోసం..!⇒ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు. ⇒ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా అప్పులు చేయాల్సిన దుస్థితి. ⇒ ఉద్యోగుల జీతాల కోసం చేసిన అప్పులే ఏడాదికి రూ.350 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది.⇒ టీడీపీ అవసరాల కోసం బస్సుల వినియోగం. బిల్లులు చెల్లించని టీడీపీ.⇒ రూ.4,500 కోట్ల నష్టాల్లో ఉండేది.⇒ ఉద్యోగుల పరపతి సంఘానికి రూ.200 కోట్ల బకాయి పడడంతోరుణాలు ఇవ్వలేని దుస్థితి.⇒ ప్రమాద బీమా రూ.30 లక్షలు మాత్రమే.⇒ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకే పరిమితం.⇒ కారుణ్య నియామకాలు చేపట్ట లేదు.⇒ గ్రాడ్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలు, సరెండర్ లీవులు పెండింగ్..⇒ కొత్త బస్సులు కొనుగోలు లేదు.⇒ పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు సన్నాహాలుఇవి చదవండి: పిఠాపురంతోనే సీఎం జగన్ లాస్ట్ పంచ్.. -
ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 43.2%
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43.2 శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. వేతన సవరణ అనంతరం ఉండే మూలవేతనంపై అంతమేర కరువు భత్యాన్ని లెక్కించి జీతంలో భాగంగా చెల్లించనున్నారు. ప్రభుత్వం సవరించిన ఇంటిఅద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తాజా వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తించనున్న విషయం తెలిసిందే. హెచ్ఆర్ఏ భారీగా తగ్గిపోవటంతో ఉద్యోగుల వేతనంపై పెద్ద ప్రభావమే చూపనుంది. హెచ్ఆర్ఏలో కోత వల్ల, కొత్త జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉద్యోగులు కొంత ఆందోళనతో ఉన్నారు. కానీ, ఇప్పుడు మెరుగైన కరువు భత్యం అందనుండటంతో.. ఆ వెలితి కొంత తీరినట్టేనని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగుల డీఏ 82.6 శాతం ఉంది. ఇప్పుడు 2017 ఏప్రిల్ నాటి వేతన సవరణను అమలులోకి తెస్తున్నందున, అప్పటికి ఉన్న 31.1 శాతం డీఏ ఉద్యోగుల మూల వేతనంలో కలిసి పోతుంది. అది పోయిన తర్వాత 51.5 శాతం డీఏ ఉంటుంది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మూలవేతనంపై లెక్కించరని తెలుస్తోంది. వేతన సవరణ పద్ధతిలో భాగంగా దాన్ని న్యూట్రలైజ్ చేసి కొత్త డీఏను ఖరారు చేస్తారు. ఆ లెక్క ప్రకారం.. తాజా డీఏ 43.2 శాతంగా తేలింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ నాలుగు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం అన్ని విడతల డీఏలు చెల్లించటం విశేషం. 2024 జనవరి విడతకు సంబంధించి 3.9 శాతాన్ని తాజా వేతన సవరణలో భాగంగా చెల్లించనుండటం విశేషం. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఏకంగా ఏడు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉండేవి. అయితే కార్మిక సంఘాల ఒత్తిడి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృషి ఫలితంగా తక్కువ సమయంలోనే ప్రభుత్వం డీఏ బకాయిలను చెల్లించింది. కొన్ని విడతలు మిగిలి ఉండగా, గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం వాటిని కూడా ప్రకటించింది. దీంతో మొత్తం బకాయిలు క్లియర్ అయి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు తాజా విడత కరువు భత్యం కూడా అందబోతోంది. -
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయ్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయి. 2017 వేతన సవరణను అములు చేయాలని వారం క్రితం ప్రభుత్వం నిర్ణయించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం తెలిసిందే. 2018 నుంచి 16 శాతం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్)ను కొనసాగిస్తున్నందున దాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త ఫిట్‌మెంట్‌ను చేర్చి ఏ ఉద్యోగికి ఎంత మేర వేతనాన్ని సవరించాలో తాజాగా అధికారులు లెక్కలు సిద్ధం చేశారు. డిపో మేనేజర్, ఆ పైస్థాయి అధికారులకు సంబంధించిన సవరణ లెక్కలను విడిగా ఖరారు చేయనున్నారు. డిపో మేనేజర్ స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న ఉద్యోగుల లెక్కలను సిద్ధం చేసి శనివారం ఆయా డిపోలకు పంపారు. కరువు భత్యంపై సందిగ్ధం.. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 82.6 శాతం కరువు భత్యం (డీఏ) అమలవుతోంది. ఇందులో 31.1 శాతం 2017 వేతన సవరణ గడువుకు పాతది. దీంతో తాజా వేతన సవరణలో ఈ 31.1 శాతాన్ని జోడించారు. 2017 వేతన సవరణ గడువు తర్వాత ఉద్యోగులకు వర్తింపజేసిన మిగతా 51.5 శాతం కరువు భత్యాన్ని మూల వేతనంలో కలిపే వీల్లేదు. దాన్ని ఎంత మేర వర్తింపజేయాలన్న విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఆ వివరాలను తర్వాత వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రేడ్ పే కొనసాగింపు.. ప్రభుత్వ ఉద్యోగులకు లేని గ్రేడ్ పే వెసులుబాటు ఆర్టీసీలో అమలవుతోంది. ఆయా అధికారుల హోదాను బట్టి జీతం కాకుండా అదనంగా గ్రేడ్ పే పేరుతో కొంత మొత్తాన్ని ప్రతినెలా చెల్లిస్తారు. అది సూపర్వైజర్ స్థాయి అధికారుల నుంచి మొదలవుతుంది. ఆ దిగువ హోదాలో ఉండే కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు ఉండదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి రీత్యా ఈ విధానాన్ని తొలగించాలని గతంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తాజా వేతన సవరణ తర్వాత కూడా దాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. హెచ్ఆర్ఏ తగ్గింపుపై ఆందోళన.. వేతన సవరణతో జీతాలు పెరుగుతాయన్న ఆనందం ఉద్యోగుల్లో ఓవైపు ఉన్నప్పటికీ మరోవైపు ఇంటి అద్దె భత్యం తగ్గిపోనుండటంతో అంçతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం పలు రకాల సూచీల ఆధారంగా ఇంటి అద్దె భత్యంలో మార్పులు చేసింది. దాన్ని అమలు చేయాల్సి రావడంతో మూడేళ్ల క్రితమే ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్ సమయంలో అమలులోకి తెచ్చింది. ఆర్టీసీలో వేతన సవరణ జరగకపోవటంతో అప్పటి నుంచి పాత హెచ్ఆర్ఏలే కొనసాగుతున్నాయి. తాజా వేతన సవరణ నేపథ్యంలో 2020 నుంచి హెచ్ఆర్ఏ తగ్గింపును అమలు చేయబోతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు ఇక నుంచి 30 శాతం బదులు 24 శాతమే హెచ్ఆర్ఏ అందుతుంది. దీనిప్రభావంతో చిరుద్యోగుల జీతాల్లో దాదాపు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు కోత పడబోతోంది. హెచ్ఆర్ఏ సీలింగ్ పరిమితిని రూ. 43 వేలకు పెంచారు. ఇది ఉన్నతాధికారులకు మేలు చేయనుండగా ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడదు. -
ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చే యాల్సిన రెండు వేతన సవరణ బకాయిల్లో ఒకదా న్ని ప్రభుత్వం క్లియర్ చేసింది. 2017లో జరగాల్సిన వేతన సవరణకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ఫిట్మెంట్ కాకుండా మధ్యంతర భృతితో సరిపెట్టింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 21 శా తం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. జూన్ ఒకటో తేదీ న అందుకోబోయే మే నెల వేతనంతో దీని చెల్లింపు ప్రారంభం కానుంది. ఈ ఏడేళ్లకు సంబంధించిన బ కాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లించను న్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీ లేకుండా బకా యిలను మాత్రమే చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. ఇలా పేరుకుపోయి: రాష్ట్ర విభజనకు ముందు 2013లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, నాటి విభజన హడావుడిలో ఉమ్మడి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అప్పట్లో నాటి సీఎం కేసీఆర్ ఏకంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ లో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంటుంది. 2013 వేతన సవరణ తర్వాత 2017లో, మళ్లీ 2021లో జరగాల్సి ఉంది. ఈ రెండూ అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. 2017 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు 2018లో సమ్మె నోటీసు ఇచ్చాయి. అప్ప టి ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న ఉద్దేశంతో ప్రభు త్వం దాన్ని అమలు చేయలేదు. కార్మిక సంఘాలతో చర్చించేందుకు నాటి మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. పలు దఫాల చ ర్చల అనంతరం 16 శాతం మధ్యంతర భృతిని కమిటీ ప్రకటించింది. 2018 జూన్ నుంచి అది కొనసాగుతోంది. ఈలోపు 20 21లో మరో వేతన సవరణ గడువు దాటి పోయింది. గత కొన్ని రోజులుగా కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు బకాయిల చెల్లింపుపై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. త్వరలో పార్ల మెంటు ఎన్నికలు కూడా ఉండటంతో ప్రభుత్వం, ఒక వేతన సవరణను అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బస్‌భవన్‌లో ప్రకటించారు. ఎంత పెరుగుతుందంటే..: గత ఆరేళ్లుగా 16 శాతం ఐఆర్‌ను లెక్కగడుతూ ఆర్టీసీ చెల్లిస్తోంది. ఇప్పుడు దాన్ని తొలగించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను లెక్కగట్టి చెల్లిస్తారు. ఉద్యోగుల మూల వేతనంపై మాత్రమే ఐఆర్‌ను లెక్కిస్తారు. దీంతో ఆ పెరుగుదల తక్కువ గా ఉంటుంది. ఫిట్‌మెంట్‌ను మూలవేతనంతో పా టు కరువు భత్యం, ఇంక్రిమెంట్లపై లెక్కిస్తారు. దీంతో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీపై రూ.418.11కోట్ల భారం పడనుందని అంచనా. కాగా, ఆర్టీసీ ఉద్యో గుల్లో 41.47 శాతం మంది కండక్టర్లు, 35.20 శాతం మంది డ్రైవర్లు, 5 శాతం మంది మెకానిక్‌లు, 3.34 శాతం మంది శ్రామిక్లున్నారు. వీరి వేతనాల్లో పెరుగుదల ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం. స్వాగతిస్తున్నాం: టీఎంయూ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్మెంట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికులకు సంబంధించిన పే స్కేలు, బాండ్స్ డబ్బులు ఇచ్ఛిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్‌కు శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నిర్ణయం: ఎన్ఎంయూ ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ చేయడం గొప్ప నిర్ణయమని టీఎస్ఆర్టీసీ ఎన్ఎంయూ అధ్యక్షుడు పి.కమల్‌రెడ్డి, నరేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా పీఎఫ్ వెంటనే చెల్లించాలని, డీఏ బకాయిల సమస్యను పరిష్కరించాలని కోరారు. ‘30 శాతం అనుకుంటే.. 21 శాతమే ఇచ్చారు’ వేతన సవరణ 30 శాతం చేస్తుందనుకుంటే 21శాతంతో సరిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణగౌడ్, సుద్దాల సురేశ్ ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు. -
విలీనం లేదు.. వేతన సవరణ 'ఊసే లేదు'!
సాక్షి, హైదరాబాద్: ‘ఇటు ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంపై స్పష్టత లేదు.. అటు బకాయి ఉన్న రెండు వేతన సవరణల జాడ లేదు’ఆర్టీసీకి సంబంధించి ఈ కీలక అంశాలకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. బడ్జెట్లో ప్రతిపాదించటం ద్వారా శుభవార్త అందుతుందని ఎదురు చూసిన ఆర్టీసీ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే నెక్లెస్ రోడ్డు సమీపంలో వంద ఆర్టీసీ కొత్త బస్సులను స్వయంగా ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో ఆ కార్యక్రమంపై కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సందర్భంగా కూడా కేవలం 2013 వేతన సవరణకు సంబంధించి బకాయి ఉన్న బాండ్ల మొత్తం విడుదల ప్రకటన తప్ప ప్రధాన అంశాలను కనీసం మాట వరసకు కూడా ప్రస్తావించకపోవటంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటినా ఆర్టీసీ పెండింగు అంశాలపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవటంతో.. అసలు తమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ పంథా ఏంటో అర్ధం కాక అయోమయంలో పడిపోయారు. ‘మహాలక్ష్మి’ పథకాన్ని సక్సెస్ చేసినా.. పట్టించుకోరా? ప్రభుత్వం కొలువు దీరిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటును ఆర్టీసీ ఆరంభించింది. గత డిసెంబరు 9న ఒక్క కొత్త బస్సు లేకుండా, ఉన్న సిబ్బందితోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతకు ముందు సగటున రోజుకి 28 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఈ పథకం మొదలయ్యాక అది 45 లక్షలకు చేరింది. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆ సంఖ్య 52 లక్షలకు చేరినట్టు అధికారులు చెబుతున్నారు. 30 శాతం డొక్కుగా ఉన్న బస్సుల్లో ఓవర్‌లోడ్ వల్ల ఎక్కడ ఎప్పుడు ఏ బస్సు అదుపు తప్పుతుందోనని ఆర్టీసీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కానీ, నిత్యం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, సిబ్బందికి జాగ్రత్తలు సూచిస్తుండటంతో ఎక్కడా ప్రమాదాలు చోటుచేసుకోకుండా పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. బస్సులు కిక్కిరిసి ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి ఉన్నా ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఒక్క కొత్త బస్సు కూడా సమకూర్చకుండానే తమతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించినా తాము విజయవంతంగా అమలు చేస్తున్నామని, కానీ తమకు అందాల్సిన ఆర్థిక లబ్ధి విషయంలో ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించటం ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు జీఓ ఇచ్చినా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కానీ, విధివిధానాలకు కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంది. విధివిధానాలు ఖరారయ్యేలోపే ఎన్నికల కోడ్ రావటంతో ఆ విషయం మరుగున పడింది. విధివిధానాలు వచ్చేలోపు తమ జీతాలను ట్రెజరీ ద్వారా చెల్లించేలా ఆదేశించాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరినా అది నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో వెంటనే ఆ ప్రక్రియ కొనసాగుతుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆశించారు. కానీ, రెండు నెలలైనా దాని జాడలేదు. అన్నీ వదిలేసి తక్కువ మొత్తం విడుదల చేసి 2017, 2021 సంవత్సరాల్లో వేతన సవరణలు జరగాల్సి ఉంది. కానీ అవి నాటి నుంచి పెండింగులోనే ఉన్నాయి. ఇక 2013లో జరిగిన వేతన సవరణకు సంబంధించి బాండ్ల రూపంలో చెల్లించాల్సిన రూ.281 కోట్ల మొత్తం కూడా పెండింగ్‌లోనే ఉంటూ వచ్చింది. ఇవి కాకుండా, ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడే ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్)కు సంబంధించి దాదాపు రూ.1100 కోట్లు, పీఎఫ్‌కు సంబంధించి రూ.1400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వీటన్నింటినీ పెండింగులో ఉంచి కేవలం తక్కువ మొత్తం ఉన్న బాండ్ల నిధులను మాత్రమే విడుదల చేస్తున్నట్టు కొత్త ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వం కూడా అంతేనా? శాసనసభ ఎన్నికలకు ముందు, ప్రధాన కార్మిక సంఘాల నేతలు.. వారివారి సొంత సంఘాలు వదిలేసి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. బడ్జెట్ ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తీరును ప్రశంసిస్తూ పోస్టులు వైరల్ చేశారు. కానీ, బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా వారిపై కార్మికుల నుంచి ఒత్తిడి పెరగటంతో తాజాగా కార్మిక నేతలు ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరు కంటితుడుపు చర్యగా కూడా లేదని, కార్మికుల ఓపిక నశించకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ తీరు నిరుత్సాహానికి గురిచేసిందని, అప్రజాస్వామిక, నియంత పాలనను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించనుందా అంటూ రాజిరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయమని చెప్తున్న ఈ ప్రభుత్వం చేతల్లో చూపటం లేదని వీఎస్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేతన సవరణ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కార్మికులను ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరిచిందని సీనియర్ కార్మిక నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
-
ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా కలిపి చెల్లించాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ‘పే ఇన్ టు’లో డ్యూటీ బేస్డ్ అలవెన్సులను జీతాలతోపాటు కలిపి చెల్లించనుంది. ఈ మేరకు ఖజానా శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2024 జనవరి నుంచి ఈ విధానం అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల నైట్ అవుట్, డే అవుట్ అలవెన్సులు, ఓవర్ టైమ్ అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించనున్నారు. దాంతో దాదాపు 50వేలమంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత నైట్ అవుట్, డే అవుట్, ఓటీ అలవెన్సులు విడిగా చెల్లిస్తున్నారు. ఆ విధంగా కాకుండా విలీనానికి ముందు ఉన్నట్టుగానే జీతాలతోపాటు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించాలని నిర్ణయించింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు, ఎస్ఆర్బీఎస్ ట్రస్ట్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా త్వరలోనే దశలవారీగా చెల్లించాలని నిర్ణయించింది. పదోన్నతులకు త్వరలో మార్గదర్శకాలు ప్రభుత్వంలో విలీనానికి (2020 జనవరి 1కి) ముందు నుంచి ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న వారికి పదోన్నతుల కల్పనకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 1,026 మందికి పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలపై అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఆర్టీసీలో ఉద్యోగ నిర్వహణకు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నిర్వహణకు ఉన్న వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకోవాలని విన్నవించారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా క్రమశిక్షణ చర్యలు అమలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. క్రమశిక్షణ చర్యలపై ఆర్టీసీ ఉద్యోగులు అప్పీల్ చేసేందుకు.. తదనంతరం సత్వరం పరిష్కరించేలా విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిపై రూపొందించిన ముసాయిదాను న్యాయశాఖ పరిశీలనకు పంపారు. త్వరలోనే క్రమశిక్షణ చర్యలపై ప్రత్యేకంగా అప్పీళ్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయనుంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలతోపాటు అలవెన్సులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. – పల్లిశెట్టి దామోదరరావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులకు ప్రయోజనకరం ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై సాను కూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. డ్యూటీబేస్డ్ అలవెన్సులను ప్రతి నెల జీతాలతోపాటు చెల్లించడం ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – పీవీ రమణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వై.శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్ -
రెండున్నర లక్షల ఓట్లు.. ఆర్టీసీ ఉద్యోగులు ఎటు వైపో?
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో ‘ఆర్టీసీ ఓటర్లు’ కీలకంగా మారబోతున్నారు. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యో గులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల వరకు ఓట్లున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వారి సంఖ్య అధికంగా ఉంది. నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో 10 వేల వరకు ఉన్నాయి. ఇలాంటి నియోజకవర్గాలు మరికొన్ని ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో అంతగా లేనప్పటికీ, వేలల్లోనే ఉండటం విశేషం. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 20 వేలమంది ఉన్నారు. వారి కుటుంబాలకు సంబంధించి దాదాపు 2.43 లక్షల ఓట్లు ఉన్నట్టు అంచనా. గత రెండు ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. ఈసారి వారి ఓట్లను సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ వారి ఓట్లు తనకే అధికంగా వస్తాయని ఆ పార్టీ నమ్మకంగా ఉంది. చదవండి: ‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం ప్రచారంలో ఆర్టీసీ ప్రస్తావన.. నష్టాల్లో కూరుకుపోయి దివాలా దిశలో ఉన్న ఆర్టీసీని ఆదుకుని తిరిగి నిలబెట్టిన ఘనత తమదే అని బీఆర్ఎస్ నేత లు ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందని, వారికి అందాల్సిన దీర్ఘకాలిక బకాయిలను కూడా చెల్లించక ఇబ్బంది పెడుతోందని చెబుతోంది. బస్సుల సంఖ్య తగ్గించి ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఆర్టీసీలో నియామకాలే చేపట్టలేదని, ఫలితంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని పేర్కొంటోంది. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు రుణాలు ఇస్తూ ఉపయోగపడే సహకార పరపతి సంఘం నిధులు వాడేసుకుందని, సంస్థకు ప్రభు త్వం నుంచి నిధులు రాక సహకార పరపతి సంఘం మూతపడబోతోందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు అందబోతున్నాయని బీఆర్ఎస్ చెప్తోంటే, విలీనం పేరుతో కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క నెల కూడా వేతనాలు అందించలేకపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బీజేపీ కూడా ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి మద్దతుగా ఉద్యోగులు బీఆర్ఎస్కు అండగా నిలుస్తారో, ఏళ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవటం, సీసీఎస్‌ను నిర్వీర్యం చేయటం, నియామకాలు లేకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుని వేరే పార్టీలకు మద్దతుగా నిలుస్తారో వేచి చూడాలి. -
ఆర్టీసీ ఉద్యోగులపై అవాస్తవాలేల!
సాక్షి, అమరావతి: పచ్చ పత్రిక ఈనాడుకు, దాని అధినేత రామోజీరావుకు ఒకటే ఎజెండా.. నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో ఒక రూపేణా విషం చిమ్మడమే. ఇందులో భాగంగానే ‘ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంతో సర్కారు చెలగాటం’ అంటూ అవాస్తవాలతో ఒక కథనాన్ని మంగళవారం ఈనాడులో వండివార్చారు. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సాహసించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదంత సులువైన పని కాదని అక్కడ చేతులెత్తేశారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సులువుగా 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. తద్వారా వారికి ప్రభుత్వ ఉద్యోగులకు లభించినట్టే అన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేశారు. ఆర్టీసీ ఉద్యోగులు తమకు అనారోగ్యం కలిగితే ఈహెచ్ఎస్ కింద రాష్ట్రంలో మెరుగైన వైద్యం పొందుతున్నారు. అయినా ఇదంతా కళ్లుండి కూడా చూడలేని కబోధి రామోజీరావు యథేచ్ఛగా విషం కక్కారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కింద వైద్యం దక్కడం లేదంటూ అవాస్తవాలను అచ్చేశారు. అసలు వాస్తవాలేవో వివరిస్తూ ఈ ఫ్యాక్ట్ చెక్.. ♦ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఈహెచ్ఎస్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం అందిస్తున్న అన్ని రిఫరల్ ఆస్పత్రుల్లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా నాణ్యమైన వైద్య సేవలు పొందుతున్నారు. ఎంతోమంది ఉద్యోగులు ఆ సేవలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. ♦ఈహెచ్ఎస్ రిఫరల్ ఆస్పత్రుల్లోనే కాకుండా 21 ఆర్టీసీ ఆస్పత్రుల్లో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఓపీ, చికిత్స విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ప్రతి జిల్లాకు ఒక సమన్వయ అధికారిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందితే.. ఆ మేరకు బిల్లులను ఈహెచ్ఎస్ పోర్టల్‌లో సమర్పించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ♦ఆర్టీసీ ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కార్డియాక్ కేర్ ట్రై–ఓఆర్జీ మెషిన్ల ద్వారా గుండెపోటు సమస్యను ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందిస్తున్నారు. ఆ విధంగా ఇప్పటివరకు 149 మందికి గుండెపోటు నివారణ చికిత్స అందించారు. ♦ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే మౌలిక వసతులను ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంది. 5 రకాల వైద్య సేవలు అందించే వైఎస్సార్ ఆర్టీసీ ఏరియా ఆస్పత్రిని కడపలో 2021లోనే నెలకొల్పింది. అనంతపురం, రాజమండ్రిలో ఆర్టీసీ డిస్పెన్సరీలు ఏర్పాటు చేశారు. తిరుపతి, నరసరావుపేట, మచిలీపట్నంలలో కొత్తగా ఆర్టీసీ ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టారు. -
ఉద్యోగుల ఆరోగ్యంపై రాజీ ప్రసక్తే లేదు: APSRTC
సాక్షి, ఎన్టీఆర్: ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సదుపాయలు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. ప్రభుత్వ ఉద్యోగులతో ఆర్టీసీ ఉద్యోగుల్ని సమానంగా చూస్తోందని.. పైగా వైద్య సదుపాయాలు అందించే విషయంలో ప్రత్యేక చొరవ కనబరుస్తోందని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ చెబుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంతో సర్కార్ చెలగాటం పేరిట ఇవాళ ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ఖండిస్తూ.. పూర్తి వివరాలను తెలియజేసింది. ‘‘ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు అనేక సదుపాయాలు పొందుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా హెల్త్ కార్డులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు రిఫర్ చేయబడిన ఆసుపత్రులలోనే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా మెరుగైన వైద్యం అందుతోంది. ఈహెచ్ఎస్ ఆసుపత్రుల్లో చికిత్స, ఓపీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జిల్లాకొక లైజనింగ్ అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూడా.. .. ఇటీవల కాలంలో ఉద్యోగులకు తలెత్తుతున్న అనారోగ్య సమస్యలపై ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. కార్డియాక్ కేర్ Try-cog మెషీన్ల ద్వారా ఉద్యోగులకు ఏర్పడే హృద్రోగ సమస్యలను ముందుగానే పసిగట్టి వైద్యం అందిస్తున్నాం. అలా ఇప్పటి వరకూ 149 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ముందస్తు పరీక్షల ద్వారా ఆరోగ్య భద్రత కల్పించాం’’ అని తెలిపింది. వైద్య సేవల విషయానికొస్తే.. అనారోగ్యం బారినపడిన ఆర్టీసీ ఉద్యోగులకు వైద్యపరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. తద్వారా సకాలంలో చికిత్స అందేలా చూస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అన్నిడిస్పెన్సరీలలో నిరంతరం వైద్యం.. ఔషధాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 2021లో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో వైఎస్సార్ జిల్లాలో డా.వైఎస్సార్ ఏరియా ఆర్టీసీ ఆసుపత్రి ఏర్పాటైంది. తిరుపతి, నరసరావుపేట, మచిలీపట్నంలో ఉద్యోగుల కోసం శరవేగంగా ఆర్టీసీ ఆస్పత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి. -
Fact Check: ‘ప్రగతి రథం’పై ‘పిచ్చి’ కథ
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు చూసి ఆవేదన చెందిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని పాదయాత్ర సందర్భంగా చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చెప్పిన మాట ప్రకారం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ప్రభుత్వంలో విలీనం చేశారు. దీని ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రజల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. స్వప్రయోజనాలే పరమావధిగా పనిచేసే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని చెప్పడమే కాదు.. ఆ సంస్థను అడగడుగునా నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఇవి వాస్తవాలు. కానీ, రామోజీరావుకు చంద్రబాబు ప్రయోజనాల పరిరక్షణ ఓ ‘పిచ్చి.’ చంద్రబాబు తప్ప ప్రజలు, ఉద్యోగులు సంతోషంగా ఉంటే సహించలేరు. అందుకే వాస్తవాలను విస్మరించి ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఓ విష కథనాన్ని ఈనాడులో ప్రచురించారు. అవాస్తవాలు, అభూతకల్పనలతో కథనాన్ని అల్లారు. విలీన ప్రక్రియ సందర్భంగా వివిధ దశల్లో ఉన్న అంశాలను వక్రీకరిస్తూ ఉద్యోగులను తప్పుదారి పట్టించేందుకు కుట్రలు పన్నారు. కానీ వాస్తవాలు ఆర్టీసీ ఉద్యోగులకు తెలుసు. వారి సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కనబరుస్తున్న నిబద్ధత తెలుసు. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం నుంచి ఇతరత్రా ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన కార్యాచరణ చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలను ఓసారి పరిశీలిద్దాం.. కార్పొరేట్ శాలరీ (ప్రమాద బీమా) ప్యాకేజీ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ (ప్రమాద బీమా) ప్యాకేజీని మొదట రూ.45 లక్షలకు అనంతరం ఏకంగా రూ.1.10 కోట్లకు ప్రభుత్వం పెంచడం విశేషం. అందుకోసం ఎస్బీఐతో ఒప్పందం చేసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది. జీతాలతోపాటు అలవెన్స్‌లు డ్యూటీ సంబంధిత అలవెన్స్‌లను ఆర్టీసీ గతంలో జీతంతో కలిపి ఇచ్చేది. కానీ ప్రభుత్వ శాఖల్లో ఆ విధానం అమలులో లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, ఆ సంస్థ ఉద్యోగులకు మాత్రం జీతంతోపాటే అలవెన్స్‌లను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఆ ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉంది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయిని ప్రభుత్వం చెప్పింది. సమగ్రంగా సర్వీసు నిబంధనలు ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలపైనా ఈనాడు వక్రభాష్యం చెప్పింది. గతంలోఆర్టీసీ రెగ్యులేషన్ నిబంధనలు అమలులో ఉండేవి. ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఉద్యోగుల ప్రవర్తన, క్రమశిక్షణ నిబంధనలకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఆచరణలోకి తెచ్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ ప్రక్రియ తుది దశలో ఉంది. త్వరలోనే సర్వీసు నిబంధనలను ఖరారు చేయనున్నారు. ఆ నిబంధనలు విడుదలైన తరువాత ఆ ప్రకారం ప్రస్తుతం పెండింగులో ఉన్న అప్పీళ్లు అన్నీ పరిష్కరిస్తారు. మెరుగైన పింఛన్ విధానం ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ–2022 ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా సీఎం వైఎస్ జగన్ వర్తింపజేశారు. అదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు పీఎఫ్ సంస్థ ద్వారా అమలయ్యే పింఛన్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. ఎందుకంటే అప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న సీపీఎస్ పింఛన్ విధానంలో కూడా మార్పులు చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. జీపీఎస్‌ను అమలులోకి తేవడానికి సర్వం సిద్ధమైంది. జీపీఎస్ అమలుపై తుది ఆదేశాలు వచ్చిన తరువాత ఆర్టీసీ ఉద్యోగుల పింఛన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మెరుగైన రీతిలో ఈహెచ్ఎస్ ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సదుపాయం కోసం ఈహెచ్ఎస్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల పనివేళలు, ఉండే ప్రదేశాలు కాస్త భిన్నంగా ఉంటాయి. అందుకే ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేసే ఈహెచ్ఎస్ విధానంలో తగిన మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. పథకాలు ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో వర్తించిన ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ పథకాలను నిపుణుల కమిటీ రద్దు చేసింది. ఎందుకంటే ఆ పథకాలకు సరిసమానమైన పథకం ఏపీజీఎల్ఐ ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతోంది. వాటినే ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తింపజేసింది. అందువల్ల 2026 ఏప్రిల్ వరకు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు ‘ఎస్ఆర్ఎంబీ’ లో జమ అయిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించారు. 2030 ఏప్రిల్ వరకు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు ‘ఎస్బీటీ’లో జమ అయ్యే మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించారు. మిగతా ఉద్యోగులకు కూడా చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీతో సహా వారి ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరిన వేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది దీర్ఘకాలిక డిమాండ్. దశాబ్దాలు గడిచిపోతున్నా ఆ డిమాండ్ కలగానే మిగిలిపోతుందా అని ఆర్టీసీ ఉద్యోగులు నిర్వేదంలో కూరుకుపోయిన వేళ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విధాన నిర్ణయం వారి జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రజా రవాణా విభాగంగా మార్చారు. అంతకు ముందు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని నిర్ద్వందంగా తిరస్కరించిన అంశాన్ని వైఎస్ జగన్ సుసాధ్యం చేసి చూపించారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచే నెలనెలా జీతాలు అందుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా రూ.275 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ఆ విధంగా ఇప్పటివరకు రూ.10,336 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. దాంతో ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గి, దీర్ఘకాలికంగా ఉన్న అప్పులను తీరుస్తూ ఆ సంస్థ లాభాల బాటలో ప్రయాణిస్తోంది. సీసీఎస్ వంటి సంస్థల నుంచి తీసుకున్న రూ.2,415 కోట్ల అప్పులు తీర్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు రూ.307 కోట్ల ఎరియర్స్‌ను కూడా చెల్లించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సంస్థను మూసుకోవాల్సిందే అని హేళన చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. నాలుగేళ్ల తరువాత తన మాటను వెనక్కి తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ బాటను అనుసరించి తెలంగాణ ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. అదీ సీఎం వైఎస్ జగన్ దార్శనికత. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అంటే ఇదే అని వేల మంది ఆర్టీసీ ఉద్యోగులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలు గర్వంగా తమ ముఖ్యమంత్రి గురించి చెప్పుకునేలా చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు ఉద్యోగుల ప్రయోజనాలే కాదు ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలోనూ ఆర్టీసీది అగ్రస్థానం. కొత్త విద్యుత్ బస్సులు కొనడంతోపాటు డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మారుస్తోంది. 1,500 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టింది. 2023–24లో కొత్తగా వేయి విద్యుత్ బస్సులు కొనాలని నిర్ణయించింది. దేశంలో వివిధ పుణ్య క్షేత్రాల సందర్శన, పుష్కరాల కోసం కొత్త బస్సులు నడుపుతోంది. రెండు వైపులా టికెట్లు తీసుకునే ప్రయాణికులకు 10 శాతం రాయితీ కల్పిస్తోంది. ఇలా ప్రయాణికులకు అనేక మెరుగైన సేవలతో వారి మన్ననలు పొందుతోంది. -
ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.10 కోట్ల బీమా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగంలో సేవలందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ (బీమా)ని రూ.45 లక్షల నుంచి ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచింది. ఈమేరకు ఆర్టీసీ గురువారం ఎస్బీఐతో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత మూడేళ్ల క్రితం రూ.45 లక్షల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలులోకి తెచి్చంది. తాజాగా దీన్ని ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచడం విశేషం. కొత్త శాలరీ ప్యాకేజీ 2026 సెప్టెంబరు 2 వరకు అమలులో ఉంటుంది. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం: పినిపె విశ్వరూప్, రవాణా శాఖ మంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త చరిత్ర సృష్టించారని రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ పేర్కొన్నారు. శాలరీ ప్యాకేజీ ఒప్పందం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. అధిక పెన్షన్ విధానంతో అప్పటి వరకు రూ.5 వేలు పింఛన్ పొందిన ఉద్యోగులకు ఏకంగా రూ.40 వేల వరకు పెన్షన్ పెరిగిందన్నారు.ఇప్పుడు ప్రమాద బీమాను రూ.1.10 కోట్లకు పెంచడం ఉద్యోగుల కుటుంబాలకు భరోసానిస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం పట్ల ఎస్బీఐ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. రూ.1.10 కోట్ల ప్రమాద బీమాతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు మరణిస్తే వారి పిల్లల చదువుల కోసం అబ్బాయిలకు రూ.8 లక్షలు, అమ్మాయిలకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందిస్తున్నామన్నారు. ఉద్యోగుల పిల్లల వివాహ రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ ఎంకే సిన్హా, ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, ఏ.కోటేశ్వరరావు, కృష్ణమోహన్,ఎఫ్ఏ–సీఏ రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈయూ హర్షం ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.10 కోట్ల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలు చేయడంపట్ల ఈయూ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కృతజ్ఞతలు తెలిపింది.ఈమేరకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.దామోదరరావు, జీవీ నరసయ్య ఓ ప్రకటన జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఇలా.. ప్రమాద బీమా రూ.30 లక్షల నుంచి రూ.85 లక్షలకు పెంపు రూపే డెబిట్ కార్డ్ లింకేజీ ద్వారా రూ.10 లక్షలు కొత్త రూపే కార్డ్ ద్వారా మరో రూ.10 లక్షలు సహజ మరణానికి రూ.5 లక్షలు మొత్తం మీద రూ.1.10 కోట్లు -
వేతన సవరణనా..ఉన్న బేసిక్నేనా?
సాక్షి, హైదరాబాద్: రెండు విడతల వేతన సవరణ జరపకుండానే విలీన ప్రక్రియ పూర్తిచేస్తే తీవ్రంగా నష్టపోతామన్న ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. రెండు రోజుల క్రితమే, విలీనచట్టం అమలులోకి తెస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం విదితమే. విలీనానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ♦ ఆర్టీసీ ఉద్యోగులు ప్రస్తుతం 2013 వేతన సవరణ మీద కొనసాగుతున్నారు. 2015లో జరిగిన ఆ వేతన సవరణలో భాగంగా 44 శాతం ఫిట్మెంట్ పొందారు. వాటికి సంబంధించిన బకాయిలు బాండ్లరూపంలో ఇచ్చే 50 శాతం ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. ♦2017లో జరగాల్సిన వేతన సవరణ చేపట్టలేదు. దాని బదులు, నాటి మంత్రులకమిటీ 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించింది. ప్రస్తుతం అదే కొనసాగుతోంది. ♦ 2021లో జరగాల్సిన వేతన సవరణ కూడా జరగలేదు. ఈ రెండు వేతన సవరణలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల లేదు. ఫలితంగా వారు పదేళ్ల నాటి బేసిక్‌పైనే కొనసాగుతున్నారు. ♦ ఈ రెండు వేతన సవరణలు లేకుండా, ప్రస్తుతమున్న బేసిక్ ప్రాతిపదికగా తీసుకొని వారిని ప్రభుత్వంలోని కేడర్‌లో తత్సమాన బేసిక్ వద్ద ఫిక్స్ చేస్తే భారీగా నష్టపోవాల్సి ఉంటుందనేది ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనకు ప్రధాన కారణం. ♦ 1990లో ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఆర్టీసీ ఉద్యోగుల బేసిక్ ఎక్కువ. ఆ సమయంలో కొందరు ఉపాధ్యాయ, ఆర్టీసీలో పోస్టుల్లో చాన్స్ వస్తే.. బేసిక్ ఎక్కువగా ఉన్న ఆర్టీసీ వైపే మొగ్గు చూపారు. ♦ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ టీచర్ బేసిక్..ఆర్టీసీ డీఎం బేసిక్ కంటే రెట్టింపునకు చేరింది. ఈ తరుణంలో ప్రస్తుత బేసిక్ ఆధారంగా ప్రభుత్వంలోని కేడర్ ఫిక్స్ చేస్తే, సీనియర్ డిపోమేనేజర్ స్థాయి ఆర్టీసీ అధికారి సెకండ్ గ్రేడ్ టీచర్ స్థాయిలో ఉండిపోవాల్సి వస్తుంది. ♦ అదే రెండు వేతన సవరణలు చేసి, ఆ బేసిక్ ఆధారంగా ఫిక్స్ చేస్తే జిల్లాఅధికారి స్థాయిలో ఉంటారు. ఇదే తరహా పరిణామాలు డ్రైవర్, కండక్టర్, అసిస్టెంట్ డీఎం, ఇతర స్థాయి ఉద్యోగుల్లో కూడా ఉంటుంది. ఉద్యమానికి కార్యాచరణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, సంబరాలు చేసుకోవాల్సిన కార్మికులు ఆందోళన బాట పట్టడం ప్రస్తుత పరిణామాలకు అద్దం పడుతోంది. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేయటంతోపాటు, ఇతర బకాయిలు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేక్రమంలో ఈనెల 26న ఆర్టీసీ కా ర్మిక సంఘాల జేఏసీ (3 సంఘాల కూటమి) ఇందిరాపార్కు వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. కొద్ది రోజులుగా అన్ని డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వేతన సవరణలు చేయకుంటే తీవ్రంగా నష్టపోవటమే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం శుభపరిణామం. కానీ, 2017, 2021 విడతల వేతన సవరణలు ముందు చేపట్టాలి. అప్పుడు ఉద్యోగుల స్థూల వేతనం పెరుగుతుంది. ఆ మొత్తం ప్రభుత్వంలో ఏఏ కేడర్లతో సమంగా ఉందో చూసి ఆయా ఉద్యోగులను ఆయా స్థాయిల్లో ఫిక్స్ చేస్తే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మా జీతాలు కనిపిస్తాయి. అప్పుడే విలీన ప్రక్రియకు న్యాయం జరుగుతుంది. లేదంటే, భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ముందు రెండు వేతన సవరణలు చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నాం. – వీఎస్‌రావు కార్మిక నేత -
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల ఆరో తేదీన ఈమేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపగా, అందులో కొన్ని సందేహాలను నివృత్తి చేసుకుని గత గురువారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దానిపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ బిల్లును చట్టరూపంగా ఇప్పుడు అమలులోకి తెస్తూ, సెప్టెంబరు 15వ తేదీతో మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌ను న్యాయ శాఖ కార్యదర్శి జారీ చేశారు. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టయింది. ఇక విలీన విధివిధానాలను ఖరారు చేసేందుకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వు జారీ చేయనుంది. ఆ కమిటీ కూలంకుషంగా పరిశీలించి, ఆర్టీసీ ఉద్యోగులు– ప్రభుత్వంలో ఏయే కేడర్లతో సమంగా ఉండాలి, వారి పే స్కేల్ ఎలా ఉండాలి, రిటైర్మెంట్ వయసు, పింఛన్ విధానం, ప్రస్తుతం ఆర్టీసీలో కొనసాగుతున్న ప్రత్యేక ఆర్థిక బెనిఫిట్స్ ఉండాలా వద్దా.. వంటి చాలా అంశాలపై స్పష్టతనిస్తూ ప్రభుత్వానికి సిఫారసులు అందించనుంది. వాటిని ఏ రోజు నుంచి అమలులోకి తేవాలో ఓ అపాయింటెడ్ డేæను కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఈ నెల జీతాలు ఆర్టీసీ నుంచేనా? గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో.. వచ్చే నెల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. కానీ, ట్రెజరీ వేతనాలు ఎప్పటి నుంచి చెల్లించాలో స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వు జారీ చేయాల్సి ఉన్నందున, అప్పటి వరకు ఆర్టీసీ నుంచే యథావిధిగా జీతాలు చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీలైనంత తొందరలో ఉత్తర్వు జారీ అయితే ఆ సందిగ్ధం వీడుతుందంటున్నారు. కాగా ప్రస్తుతం ఆర్టీసీ ఎంత చెల్లిస్తుందో, ప్రభుత్వం కూడా అంతే చెల్లిస్తుందని, విధివిధానాలు ఖరారయ్యాక అసలు జీతాలపై స్పష్టత వస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కారుణ్య నియామకం వర్తించదు
సాక్షి, హైదరాబాద్: సర్వీ సులో ఉన్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేదని ఆర్టీసీ తేల్చి చెప్పింది. ఆయా కేసుల్లో మానిటరీ బెనిఫిట్ కింద కుటుంబ సభ్యులకు నగదు మాత్రమే అందిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగి సర్విసులో ఉండగా సహజ మరణం పొందితేనే కారుణ్య నియామకం (బ్రెడ్ విన్నర్ స్కీం) కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 2008లో జారీ చేసిన సర్క్యులర్‌ను ఉటంకిస్తూ కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. అలాగే స్టాఫ్ బెనెవలెంట్ ట్రస్ట్ (ఎస్బీటీ) పథకం కింద చనిపోయిన ఉద్యోగుల కు అందించే ఎక్స్‌గ్రేషియాను సైతం సర్విసులో ఉండగా ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు అందించడం సాధ్యం కాదని ఆ సర్క్యులర్‌లో ఆర్టీసీ పునరుద్ఘాటించింది. ఇవి మినహా ఎస్ఆర్బీఎస్, ఈడీఎల్‌ఐఎఫ్, ఇతర బెనిఫిట్స్‌ను సెటిల్మెంట్ రూపంలో అందించనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్న తరుణంలో పాత సర్క్యులర్లను కోట్ చేస్తూ ఆర్టీసీ కొత్తగా సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నాడు అనుమతించి... సాధారణంగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో కారుణ్య నియామకానికి వెసులుబాటు ఉంది. ఆర్టీసీలో కూడా అది అమలులో ఉంది. కొన్నేళ్లుగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవటంతోపాటు ఖాళీలు లేవన్న సాకుతో కారుణ్య నియామకాలను సంస్థ పెండింగ్‌లో పెట్టింది. కానీ ఆ వెసులుబాటు మాత్రం అమలులోనే ఉంది. 2019లో దీర్ఘకాలం ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో కొందరు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబ సభ్యులకు అప్పట్లో కారుణ్య నియామకాలకు సంస్థ అనుమతించింది. కానీ ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం. ఎస్బీటీ పథకం ఉన్నా... ఆర్టీసీ ఉద్యోగులు ఎస్బీటీ పథకం కింద ప్రతినెలా వేతనంలో రూ.100 చొప్పున ఆ పథకం ట్రస్టుకు జమ చేస్తారు. ట్రస్టును ఆర్టీసీనే నిర్వహిస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు వారు నెలనెలా చెల్లిస్తూ పోగు చేసిన మొత్తాన్ని వడ్డీతో కలిపి సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీసు పూర్తి కాకుండానే మరణిస్తే ఆ మొత్తంతోపాటు రూ. లక్షన్నర ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లిస్తుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం సాధ్యం కాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇందుకు 1983లో జారీ చేసిన సర్క్యులర్‌ను కోట్ చేసింది. -
ఆర్టీసీ విలీనం బిల్లు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశం మరోసారి గందరగోళంగా మారుతోంది. ఆగమేఘాల మీద శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏమైందో స్పష్టత లేకపోవటం కార్మికుల్లో ఆందోళనకు, అయోమయానికి కారణమవుతోంది. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపడంలో జాప్యం జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులు ఏకంగా రెండు గంటలపాటు బస్సులు దిగ్బంధం చేసి రాజ్‌భవన్‌ను ముట్టడించారు. ఆ సమయంలో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ మరుసటి రోజు హైదరాబాద్ వచ్చిమరీ ఆమోదం తెలిపారు. అంత వేగంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఇక బిల్లు ఆమోదం, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనానికి వీలుగా కమిటీ ఏర్పాటు కావటం, మార్గదర్శకాలు రూపొందటం, విలీన ప్రక్రియ పూర్తి కావటం కూడా అంతే వేగంగా జరుగుతుందని భావించారు. కానీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి సరిగ్గా నెల గడిచింది. గత నెల ఆరో తేదీన శాసనసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అది గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు చేరింది. అయితే కొన్ని సందేహాల నివృత్తి కోసం దానిని న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్టు తర్వాత గవర్నర్ ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. 183 మంది ఉద్యోగులకుటుంబాలకు నిరాశ గత నెలలో పదవీ విరమణ పొందిన 183 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు నెలాఖరు వరకు ఉత్కంఠగా ఎదురుచూసి నిరాశ చెందాల్సి వచ్చింది. ఇప్పుడు మరో 200 కుటుంబాలు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. న్యాయశాఖ కార్య దర్శి కార్యాలయానికి వచ్చిన బిల్లు అప్పటినుంచి తెలంగాణ సచివాలయంలోనే ఉండిపోయిందంటూ కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై రాజ్‌భవన్ వర్గా లను ‘సాక్షి’వివరణ కోరగా, ఆర్టీసీ బిల్లు ఇంకా రాజ్‌భవన్‌కు చేరుకోలేదని పేర్కొన్నాయి. వేరే 3 బిల్లులు మాత్రం వచ్చాయని వివరించాయి. ఆ రెండు వేతన సవరణలు చేయాలి: కార్మిక సంఘాలు బిల్లును తిరిగి రాజ్‌భవన్‌కు పంపటంలో జాప్యం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు, ఇప్పుడు మరో అంశంపై పట్టుపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 2017, 2021 వేతన సవరణలు పెండింగులో ఉన్నందున, వాటిని క్లియర్ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంటున్నాయి. విలీన ప్రక్రియ లోపే ఆ రెండు వేతన సవరణలు చేస్తే, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను కొంత ఉన్నత స్థాయిలో స్థిరీకరించేందుకు వీలుంటుందని, లేకుంటే తక్కువ వేతన స్థాయిలోనే ఫిక్స్ అవుతాయని, ఇది కార్మికులను తీవ్రంగా నష్టపరుస్తుందని వివరిస్తున్నాయి. ఆయా అంశాలపై మరోసారి ఆందోళనకు సిద్ధమని అంటున్నాయి. ఇప్పుడు ఏ కార్యాలయాన్నిముట్టడించాలి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలియజేయడంలో జాప్యం జరిగిందంటూ రాజ్‌భవన్‌ను ముట్టడించేలా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వమే జాప్యం చేస్తోంది. ఇప్పుడు ఏ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించాలి. బిల్లును ఇప్పటికీ రాజ్భవవన్కు పంపకుంటే వెంటనే పంపాలి. ఈలోపు కార్మికులకు బకాయి ఉన్న వేతన సవరణలు చేయాలి. – అశ్వత్థామరెడ్డి, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ సంతకం కోసం వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి. జాప్యం చేయకుండా రెండు వేతన సవరణలు జరిపి, సీసీఎస్ బకాయిలు చెల్లించి, ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేయాలి. – రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ -
ఆర్టీసీ ఉద్యోగులకు ఇక ట్రెజరీ జీతాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వ ట్రెజరీ నుంచి జీతాలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుదిరితే ఈ నెల నుంచే ప్రభుత్వ జీతాలు అందేలా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్ ఆమోదముద్ర పడగానే చట్టబద్ధత రానుంది. ఈ క్రమంలో అటు గవర్నర్ ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తూనే.. ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ నుంచి కాకుండా నేరుగా ప్రభుత్వం నుంచే జీతాలు విడుదలయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో.. ఉద్యోగి పేరు, హోదా (డెజిగ్నేషన్), పనిచేస్తున్న విభాగం, ఆధార్‌కార్డు, ప్రస్తుతం అందుకుంటున్న జీతం వివరాలను ఆధార సహితంగా జాబితా రూపంలో ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. ఈ నెల 16 తర్వాత బదిలీలు వద్దు ఉద్యోగులు, జీతాల జాబితాలను ఆయా విభాగాదిపతులు సిద్ధం చేసి బస్‌భవన్‌కు పంపితే, అక్కడి నుంచి ఆర్థిక శాఖకు చేరనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది ఎక్కడివారు అక్కడే ఉంటే జాబితాలో అయోమయం లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో.. ఆర్టీసీలో ఈనెల 16వ తేదీ తర్వాత బదిలీలు, పదోన్నతులకు వీలు లేకుండా ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతులు, బదిలీల వంటివి ఆలోగానే పూర్తి చేయాల్సి ఉంటుంది. 16వ తేదీ తర్వాత ఉద్యోగుల వివరాలను సిద్ధం చేసి, ఆర్థిక శాఖకు పంపనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ జీతాల పద్దును సిద్ధంచేసి ట్రెజరీకి పంపుతుంది. ఆలోగా ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం వస్తే.. ప్రస్తుత నెల జీతాలను ట్రెజరీ నుంచి విడుదల చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ జాప్యం జరిగితే.. ఈ నెలకు ఆర్టీసీ నుంచే జీతాలిచ్చి, వచ్చే నెల నుంచి ట్రెజరీ ద్వారా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కొంతకాలం ప్రస్తుత వేతనాలే..! ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనా కొంతకాలం ప్రస్తుతమున్న వేతనాలే అందనున్నాయి. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోని వివిధ హోదాలు, కేడర్లకు సమానంగా నిర్ధారించాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా కేడర్లను బట్టి వేతనాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. త్వరలో ప్రభుత్వం నియమించనున్న అధికారుల సబ్ కమిటీ దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుంది. సదరు కమిటీ ఏర్పాటై, వివరాలు కోరగానే అందజేసేందుకు వీలుగా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఏపీలో ఇంతకుముందే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంచేసిన నేపథ్యంలో.. అక్కడ అనుసరించిన పద్ధతులు, ఎదురైన ఇబ్బందులు, వాటి పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించేందుకు ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు విజయవాడ వెళ్లి వచ్చారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కూడా విజయవాడ వెళ్లి అధ్యయనం చేసి వస్తున్నారు. -
TSRTC: సీసీఎస్ నిధులు వాడుకుని.. వడ్డీకి ఎసరు పెట్టిన ఆర్టీసీ!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చే ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను ఇన్నాళ్లూ ఎడాపెడా సొంతానికి వాడేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం తీరా ఇప్పుడు తిరిగి చెల్లించాల్సి వచ్చేసరికి వాడుకున్న మొత్తంపై వడ్డీ ఎగ్గొట్టాలని చూస్తోంది. అందుకే వడ్డీని కలపకుండా సీసీఎస్ బకాయిలను చూపుతోంది. ఈ పరిణామం సీసీఎస్ నుంచి రుణాల కోసం దరఖాస్తు చేస్తున్న దాదాపు 9 వేల మంది కార్మికుల్లో గుబులు రేపుతోంది. అంత మేర నష్టపోవాల్సిందేనా.. రాష్ట్రం విడిపోవడానికి ముందు ఎండీగా పనిచేసిన ఓ అధికారి అత్యవసరం కింద సీసీఎస్ నుంచి కొంత మొత్తాన్ని వాడగా ఆ తర్వాత అది అలవాటుగా మారింది. రాష్ట్రం విడిపోయే నాటికి కొన్ని రూ. కోట్లను యాజమాన్యం వాడేసింది. అలా వాడిన మొత్తంపై లెక్కించిన వడ్డీలో విభజన తర్వాత టీఎస్ఆర్టీసీకి రూ. 7 కోట్లు పంచారు. 2014లో రూ. 7 కోట్ల వడ్డీ బకాయి ఉంటే ఆ తర్వాత రూ. వందల కోట్ల మొత్తాన్ని వాడుతూ కొంత మేర తిరిగి చెల్లిస్తూ, మళ్లీ వాడుతూ.. ఇలా రూ. 400 కోట్లకు వడ్డీ బకాయిలు చేరుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నేపథ్యంలో సీసీఎస్‌కు చెల్లించాల్సిన బకాయిల్లో వడ్డీ మొత్తాన్ని చేర్చకుండానే నివేదిక రూపొందించడం పెద్ద చర్చకు దారితీస్తోంది. యాజమాన్యం తీరు వల్ల కొన్ని వందల మందికి కావాల్సిన రుణాలకు సరిపోయే రూ. 400 కోట్లను సీసీఎస్... తద్వారా తాము నష్టపోవాల్సిందేనా అన్న ఆవేదన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. వడ్డీ చెల్లించకుంటే ఊరుకోం.. కార్మికులు, ఉద్యోగులు వారి జీతాల నుంచి ప్రతి నెలా 7 శాతం మొత్తం జమ చేయడం ద్వారా ఏర్పడ్డ నిధి అది. ఆ నిధిని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకొని ఇప్పుడు దానిపై రూ. 400 కోట్ల వడ్డీ ఎగ్గొడతామంటే కార్మికలోకం ఊరుకోదు. దాన్ని నయాపైసాతో సహా చెల్లించాల్సిందే. – అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ కార్మికులను బలిపశువులను చేయటమే ఏదైనా కారణాలతో సీసీఎస్‌ను మూసేసి అందులోని మొత్తాన్ని కార్మికులకు వారి వాటా ప్రకారం పంచాల్సి వస్తే రూ. 400 కోట్లను ఎలా చూపుతారు? అంతమేర కార్మికులకు తక్కువగా చెల్లించడం తప్ప ఏముంటుంది. అంటే కార్మికులను బలిపశువు చేసినట్టే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఆ వడ్డీ మొత్తాన్ని సీసీఎస్‌కు జమ చేయాల్సిందే. – వీఎస్ రావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ ,వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి -
ఆర్టీసీ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో కొన్ని గంటల పాటు ఉత్కంఠ రేపిన ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు కథ సుఖాంతమైంది. ఆదివారం ఉభయసభలు బిల్లును ఆమోదించాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు గవర్నర్ నుంచి ఈ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. కొన్ని అంశాలపై సూచనలు చేస్తూ.. గవర్నర్ ముసాయిదా బిల్లును సభలో ప్రవేశ పెట్టడానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టగా సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో పాటు బాన్సువాడ మున్సిపాలిటీ నుంచి కోయగుట్ట తండా వార్డును, ఆలేరు మున్సిపాలిటీలోని సాయిగూడెం వార్డును తొలగించి విడిగా గ్రామపంచాయతీలుగా చేస్తూ రెండు బిల్లులకు కూడా సభలు ఆమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన బిల్లులను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పీఆర్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తరఫున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సభ ముందు పెట్టారు. ఆర్టీసీ బిల్లుతో పాటు ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలుపుతున్నట్టు శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలిలో చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. ఆస్తులు యధాతథంగా కార్పొరేషన్లోనే ఉంటాయి : మంత్రి అజయ్ సంస్థ ఆస్తులు యధాతథంగా ఆర్టీసీ కార్పొరేషన్లోనే ఉంటాయని మంత్రి అజయ్ స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంలో భాగంగా వారితో ముడిపడిన వివిధ అంశాలకు సంబంధించి త్వరలోనే నియమ, నిబంధనలను రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పూర్తి పీఆర్సి వర్తిస్తుందని, టీఎస్ఆర్టీ కార్పొరేషన్ అనేది కొనసాగుతున్నందున ఆస్తులు, అప్పులు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కార్పొరేషన్ చెలిస్తుందని, సీసీఎస్ బకాయిలు వంటివి దాని పరిధిలోకే వస్తాయని చెప్పారు. జీతభత్యాల వరకే ప్రభుత్వం చూస్తుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలోనూ బిల్లు పాసయ్యాక వీలైనంత తొందరలో మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు. ఆయా అంశాలపై ఉద్యోగులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 43,055 మంది పర్మినెంట్ ఎంప్లాయిస్.. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం 43,055 మంది పర్మినెంట్ ఎంప్లాయిస్‌కు సంబంధించినదని, 240 మంది కాంట్రాక్ట్ డెయిలీవేజ్ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్.. కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా విధులో కొనసాగుతారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఐతే ఉద్యోగులకు భద్రత, సీసీఎస్ బకాయిలు, టీఏ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్,డెయిలీవేజ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో స్పష్టత నివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. వాటిపై స్పందిస్తూ మంత్రి అజయ్ వివరణనిచ్చారు. ఈ బిల్లుకు ఎంఐఎం సభ్యుడు మౌజంఖాన్ మద్దతు తెలిపారు. -
ఆర్టీసీ బిల్లుపై లొల్లి!.. గవర్నర్ వర్సెస్ సర్కార్‌గా సాగుతున్న వివాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023’ అంశం మలుపుల మీద మలుపులు తీసుకుంటోంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న ఉత్తర, ప్రత్యుత్తరాలు, ప్రశ్నలు, సమాధానాలు, వివరణలు.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. శుక్రవారం గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుపై ఐదు ప్రధాన సందేహాలను లేవనెత్తుతూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు కోరారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా అంశాలపై వివరణలు ఇస్తూ గవర్నర్ కార్యదర్శికి శనివారం లేఖ పంపారు. కానీ ఈ వివరణలతో గవర్నర్ సంతృప్తి చెందకపోవడం, పలు అంశాలపై పూర్తిస్థాయి స్పష్టత కోరడం, ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి.. వారి ప్రయోజనం కోసమే తాను ప్రయత్నిస్తున్నట్టు చెప్పడం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తే.. రెండు గంటల్లోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తానని గవర్నర్ పేర్కొన్నట్టు తెలిసింది. గవర్నర్ ఆదివారం ఉదయానికల్లా ఆర్టీసీ బిల్లుకు అనుమతిస్తే.. అసెంబ్లీ సమావేశాల చివరిరోజున సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజుకుంటున్న రాజకీయాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత నెల 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో.. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే ఆర్టీసీ బిల్లు ఆర్థిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉండటంతో, అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి కోసం ఈనెల 2న రాజ్‌భవన్‌కు పంపించింది. గవర్నర్ ఆ బిల్లును పరిశీలించి.. పలు సందేహాలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వంలో అలజడి మొదలైంది. గవర్నర్ కావాలనే బిల్లును ఆపారంటూ బీఆర్ఎస్ నుంచి రాజకీయ విమర్శలు వచ్చాయి. దీంతో కనీసం బిల్లును చదవనీయకుండా గవర్నర్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ బీజేపీ నేతలు ప్రతివిమర్శలకు దిగారు. మరోవైపు బిల్లుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడించగా.. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నుంచి వివరణలు కోరానని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. శనివారం రాత్రి తర్వాత కూడా ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. తొలుత గవర్నర్ కోరిన వివరణలు, ప్రభుత్వమిచ్చిన సమాధానాలు ఇవీ.. 1. గవర్నర్: 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాలు, ఇతర సాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు. ప్రభుత్వం: సమైక్య రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి వాటాలు రూ.61.07 కోట్లు, రూ.140.20 కోట్లుగా ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకే ఈ బిల్లు పరిమితం. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఇతర అన్ని విషయాల్లో ఆర్టీసీ సంస్థ ప్రస్తుత స్వరూపం, రీతిలో యథాతథంగా పనిచేస్తుంది. వాటాలు, రుణాలు, గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయాలు, ఇతర అంశాల నిర్వహణ విషయంలో, ఆర్టీసీ చట్టం–1950 కింద అపెక్స్ బాడీగా ఆర్టీసీ బోర్డు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అంశాలను బిల్లులో పొందుపర్చాల్సిన అవసరం లేదు. 2: రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ ఐగీ ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు. ప్రభుత్వం: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా.. సంస్థ ప్రస్తుత స్వరూపంలోనే కొనసాగుతుంది. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారమయ్యే వరకు సంస్థ స్వరూపం మారదు. విభజన అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. పూర్తయ్యే వరకు ఇదే విధానం కొనసాగుతుంది. 3: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని ప్రభుత్వం చెప్తోంది. మరి వారి సమస్యలకు పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా? వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి? ప్రభుత్వం: ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యాక.. వారికి పారిశ్రామిక వివాదాల చట్టం వర్తింపు అంశం అందులోని నిబంధనలకు లోబడి ఉంటుంది. ఈ విషయంలో బిల్లులో ఎలాంటి నిబంధనలు పొందుపర్చాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తేనే వారికి అత్యుత్తమ ప్రయోజనాలు లభిస్తాయి. 4: ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వండి. ప్రభుత్వం: ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిబంధనలు, ఇతర ప్రయోజనాల నిబంధనలను ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేసే విషయంలో బిల్లులో ఎలాంటి అస్పష్టత లేదు. ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా.. అలాంటి నిబంధనలను రూపొందించి, ప్రకటించే అధికారాలను బిల్లులోని 4, 5 సెక్షన్లు రాష్ట్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం అన్ని భాగస్వామ్యపక్షాలతో విస్తృత చర్చలు జరిపి ఓ అభిప్రాయానికి వస్తుంది. అప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుత ఆర్టీసీ నియమ, నిబంధనలే వర్తిస్తాయి. 5: ప్రభుత్వ ఉద్యోగుల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి పోస్టులు లేవు. మరి ప్రమోషన్లు, కేడర్ నార్మలైజేషన్ అంశాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు జరిగే న్యాయం, ఇతర ప్రయోజనాలపై స్పష్టమైన వివరాలు ఇవ్వండి. ప్రభుత్వం: ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన నిబంధనలు బిల్లులోని సెక్షన్ 4, 5లలో పొందుపరిచాం. జీతాలు, అలవెన్సుల విషయంలో ఏ ఉద్యోగినీ ఇబ్బందిపెట్టం. విలీనం తర్వాత ఆర్టీసీలోని ప్రస్తుత కేటగిరీలు, కేడర్ల కొనసాగింపునకు ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని నిషేధించే.. ‘తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ ఇన్‌టూ పబ్లిక్ సర్వీస్ యాక్ట్ 1997’ నుంచి మినహాయింపు కల్పించడం కోసమే ఈ బిల్లును తెచ్చాం. మరిన్ని వివరణలు కావాలన్న గవర్నర్ గవర్నర్ తమిళిసై లేవనెత్తిన సందేహాలపై రాష్ట్ర ప్రభుత్వం తొలుత సమాధానం ఇచ్చినా.. ఆయా అంశాల్లో మరింత స్పష్టత, అదనపు వివరణలు కావాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారని రాజ్‌భవన్ ప్రకటించింది. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌కు అడ్డంకులు సృష్టించడం తమ ఉద్దేశం కాదని.. వారి సర్వహక్కులను పరిరక్షించడానికే వివరాలు కోరాల్సి వస్తోందని స్పష్టం చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనల విషయంలో భవిష్యత్తులో నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చిన ఇచ్చిన నేపథ్యంలో.. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపర చిక్కులు రాకుండా, ఉద్యోగుల విలీన ప్రక్రియ సజావుగా జరిగేలా గవర్నర్ ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి అంశాలను ప్రతిపాదిత బిల్లు పరిష్కరించగలదా? అన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో కింది వివరణలను ప్రభుత్వం నుంచి కోరినట్టు తెలిపింది. ► కేంద్రం నుంచి సమ్మతి పొందారా? కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీలో 30శాతం వాటా కలిగి ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరణలో పేర్కొంది. ఈ మేరకు కేంద్రం నుంచి సమ్మతి తీసుకున్నారా? ఒకవేళ సమ్మతి పొంది ఉంటే అందుకు సంబంధించిన ప్రతిని అందజేయాలి. లేనిపక్షంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా తీసుకున్న జాగ్రత్తలను తెలపాలి. ► డిపోల వారీగా అన్ని కేటగిరీల శాశ్వత ఉద్యోగుల సంఖ్య ఎంత? డిపోల వారీగా అన్ని కేటగిరీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, క్యాజువల్, ఇతర తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య ఎంత? తాత్కాలిక ఉద్యోగుల విషయంలో అవలభించనున్న విధానం ఏమిటి? ► ఇకపైనా ఆర్టీసీ సంస్థ ప్రస్తుత స్వరూపంలోనే కొనసాగుతుందని ప్రభుత్వం వివరణ ఇచ్చిన నేపథ్యంలో.. సంస్థ చర, స్థిరాస్తులు సంస్థతోనే కొనసాగుతాయా? రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? ముఖ్యంగా భవనాలు, భూములు ఎవరి వద్ద ఉంటాయి? ► బస్సు సర్వీసుల నిర్వహణ విషయంలో అజమాయిషీ, బాధ్యత ఎవరిది? ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అవుతున్నందున వారి విధులను నియంత్రించే బాధ్యత ఎవరిది? ఉద్యోగులు, ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో కార్పొరేషన్ బాధ్యత ఏమిటి? ► ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆర్టీసీలో డిప్యూటేషన్‌పై కొనసాగుతారా? అలాంటి ఇతర ఏర్పాట్లు ఏమైనా చేస్తారా? రెండో దఫాలో గవర్నర్ కోరిన వివరణలు ► ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉంది. అలాంటప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవడంపై కేంద్రం నుంచి సమ్మతి పొందారా? ► ఆర్టీసీ చర, స్థిర ఆస్తులను ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటుందా? ► ఆర్టీసీలో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం ఎంత మంది ఉన్నారు? ► ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే.. వారిపై, బస్సు సర్వీసులపై అజమాయిషీ ఎవరికి ఉంటుంది? కార్పొరేషన్ ఏం చేస్తుంది? ఉద్యోగులను ఆర్టీసీలో డిప్యుటేషన్‌పై నియమిస్తారా? లేక ఏదైనా ఏర్పాటు చేస్తారా? -
ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది. వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కల్పించేందుకు టీఎస్ఆర్టీసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2023ను రూపొందించిన ప్రభుత్వం.. దాని ని శాసనసభలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ తమిళిసై అనుమతి కోరుతూ రాజ్‌భవన్‌కు పంపింది. కానీ గవర్నర్ దీనికి అనుమతి ఇవ్వకపోవడంతో.. చట్టరూపంలోకి రాని బిల్లుల జాబితాలో చేరిపోయింది. రేపటితో అసెంబ్లీ ముగుస్తుండటంతో.. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఆర్టీసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కల్పించాలని ఇటీవలి కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆదివారంతో రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగుస్తున్నాయి. ఆలోగా బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి లభించడం అనుమానమేనని అభిప్రా యం వ్యక్తమవుతోంది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇదే తొలిసారి ద్రవ్య వినిమయం (బడ్జెట్), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించిన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇక శాసనసభ పాస్ చేసిన ఏ బిల్లునైనా గవర్నర్ ఆమోదానికి రాజ్‌భవన్‌కు పంపాలి. ఆపై బిల్లులు చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తాయి. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకోనుండటంతో వారికి ప్రతినెలా జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆర్థికపరమైన వ్యవహారం కావడంతో ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందే గవర్నర్ అనుమతికి పంపాల్సి వచ్చింది. అయితే గతంలో కూడా.. ఇలాంటి బిల్లుల ను సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతిని వాయిదా వేసిన/నిరాకరించిన సందర్భాలు లేవని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం వివరణ ఇస్తే నిర్ణయం! ఆర్టీసీ బిల్లుకు సంబంధించి రాజ్‌భవన్ శుక్రవారం మధ్యాహ్నం, అర్ధరాత్రి రెండు ప్రకటనలు విడుదల చేసింది. తొలుత ‘‘ఈ నెల 3న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. 2న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023 ప్రతిపాదన రాజ్‌భవన్‌కు చేరింది. బిల్లు పరిశీలన, న్యాయ నిపుణుల సలహా తీసుకుని ప్రభుత్వ విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోవడానికి మరో కొంత సమయం అవసరం’’ అని పేర్కొంది. రాత్రి విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘ఆర్టీసీ బిల్లును గవర్నర్ పరిశీలించారు. సంస్థ, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని.. పలు అంశాలపై వివరణలు, స్పష్టతను కోరుతూ ప్రభుత్వానికి వర్తమానం పంపించారు. ప్రభుత్వం తక్షణమే వివరణలతో బదులిస్తే.. బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు’’ అని తెలిపింది. ఆర్టీసీ బిల్లుకు అనుమతి ఇవ్వకుంటే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. -
నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వంలో విలీనంతో ఊపిరి
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక కష్టనష్టాలతో దివాలా దిశలో ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు.. ప్రభుత్వంలో విలీనం ద్వారా ఊపరిలూదినట్టయింది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయంతో సంస్థ మనుగడకు భరోసా, అందులోని 43,373 సిబ్బందికి ఉద్యోగ భద్రత లభించనుంది. పింఛన్ సదుపాయం సైతం లభించనుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న సిబ్బంది మొత్తం రాష్ట్ర ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారనున్నారు. అయితే ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ, తెలంగాణ ఆర్టీసీ మాత్రం మనుగడలోనే ఉండనుంది. అందులో కేంద్ర ప్రభుత్వ ఈక్విటీ ఉన్నందున, కార్పొరేషన్‌ను రద్దు చేయటం అంత సులభమైన ప్రక్రియ కాదు. అందువల్ల ప్రస్తుతానికి కార్పొరేషన్‌గా కొనసాగుతూనే.. ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ సిబ్బందిగా చెలామణి కానున్నారు. విలీన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ఇచ్చే నివేదిక అధారంగా విధివిధానాలు ఖరారు కానున్నాయి. 2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విష యం తెలిసిందే. ఫలితంగా అక్కడి ప్రజా రవాణా సంస్థ బలపడింది. ఉద్యోగుల ఆర్థిక స్థితిగతుల్లో మెరుగుదలతో వారిలో సంతృప్తి వ్యక్తమవుతోంది. తీరనున్న అప్పులు! ఈ విలీన ప్రక్రియతో ఆరీ్టసీపై జీతాల భారం పూర్తిగా తొలగనుంది. ప్రస్తుతం సంస్థ ప్రతి నెలా రూ.200 కోట్ల మేర జీతాల రూపంలో భరిస్తోంది. విలీనం తర్వాత జీతాలను ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా చెల్లించనున్నందున, తద్వారా మిగిలే రూ.200 కోట్లను సంస్థ అప్పులు, బకాయిలు తీర్చేందుకు వినియోగించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణ ఆరీ్టసీకి రూ.2,400 కోట్ల బ్యాంకు అప్పులున్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, భవిష్యనిధి, ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) బకాయిలు మరో రూ.3,600 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్ ప్రభుత్వంలో విలీనం నేపథ్యంలో ఆర్టీసీలోని శ్రామిక్, అటెండర్, డ్రైవర్, కండక్టర్ మొదలుకుని రీజినల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. ఇలా సంస్థలోని అన్ని పోస్టులను ప్రభుత్వంలోని తత్సమాన పోస్టుల్లోకి మారుస్తారు. ఆయా పోస్టులకు వచ్చే వేతన స్కేల్‌ను వర్తింపజేస్తారు. ఇక విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు పింఛన్ సదుపాయం లభించనుంది. సిబ్బంది ఆర్టీసీలో చేరిన సంవత్సరం ఆధారంగా పింఛన్ విధానాన్ని ఖరారు చేస్తారు. ఐదేళ్లకోసారి పీఆర్సీ: ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 2017, 2021 పే స్కేల్ పెండింగులో ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. విలీనంతో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ప్రకారం స్కేల్‌ను వర్తింపజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆరీ్టసీలో ప్రతి నాలుగేళ్లకు పే రివిజన్ జరుగుతుండగా, విలీనం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ ద్వారా జీతాల పెంపు ఉంటుంది. ఆర్టీసీకి 1,500 ఎకరాల సొంత భూములు న్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం నేపథ్యంలో, ఈ భూములను ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంటుందా? కార్పొరేషన్ అధీనంలోనే ఉంచుతుందా? అన్నది చూడాల్సి ఉంది. కార్మిక సంఘాల హర్షం ‘తెలంగాణ వచ్చినప్పటి నుంచి చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉంది. అయితే విలీన విధివిధానాలు ఖరారు చేసే కమిటీలో ఆర్టీసీ కారి్మక సంఘాలకు కూడా చోటు కల్పించాలి..’అని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంలో ఎన్ఎంయూ పాత్ర ఉంది. తెలంగాణలోనూ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి అది నెరవేరింది. కారి్మకులకు అధిక లబ్ధి కలిగేలా విలీన విధివిధానాలు రూపొందించాలి..’అని ఎన్ఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ అన్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగు నింపారు: బాజిరెడ్డి గోవర్దన్ సీఎం కేసీఆర్‌ది ఎంతో గొప్ప మనసని, ఎప్పట్నుంచో కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు గొప్ప వరం అందించి, వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా సంస్థ విలీనంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
తెలంగాణ ఆర్టీసీ ఇక ప్రభుత్వంలో విలీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఐదుగంటలకు పైగా జరిగిన సమావేశం అనంతరం.. కేబినెట్ భేటీ సారాంశాన్ని మీడియాకు వివరించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఇక నుంచి 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని, ఈ మేరకు కేబినెట్ భేటీలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విలీనం, విధివిధానాలు నిర్ణయించేందుకు ఒక కమిటీని(సబ్ కమిటీ) ఏర్పాటు చేయనున్నట్లు, త్వరలోనే అసెంబ్లీలో బిల్లు తేనున్నట్లు తెలిపారాయన. ► హైదరాబాద్‌లో మెట్రో రైలును విస్తరిస్తాం. రూ. 60వేల కోట్లతో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. Lb నగర్ పెద్ద అంబర్ పేట వరకు, ఉప్పల్ నుంచి బీ బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి ECIL దాకామెట్రో నిర్మాణం చేపడుతున్నాం. మూడు-నాలుగేళ్లలో మెట్రో విస్తరణ పూర్తవుతుంది. ప్యాట్నీ నుంచి కండ్లకోయ ORR వరకు, అలాగే.. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో రహదారి.. ఆపైనే మెట్రో నిర్మాణం ఏర్పాటు చేస్తాం. ► పది జిల్లాల్లో వరద నష్టం తీవ్రంగా ఉంది. వరదలు వచ్చినప్పుడు కేంద్రం ఏనాడూ ఆదుకోలేదు. నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వమే ఆదుకుంటోంది. ► ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేసేలా గవర్నర్ వ్యవస్థ ఉంది. చట్టపరంగా ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. తిరిగి పంపిన మూడు బిల్లులను అసెంబ్లీలో మరోసారి పాస్ చేస్తం. రెండోసారి పాస్ చేశాక.. గవర్నర్ ఆమోదించాల్సిందే. ► గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను కేబినెట్ ఎంపిక చేసింది. ఎస్టీ కేటగిరి కుర్రా సత్యనారాయణ, బీసీ కేటగిరీలో దాసోజు శ్రవణ్‌ను ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తున్నాం. ఎమ్మెల్సీల ఎంపికలో గవర్నర్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాం. ► నిమ్స్‌లో కొత్తగా 2వేల పడకల ఏర్పాటుకు నిర్ణయం. ► వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు 253 ఎకరాలు కేటాయింపు. ► బీడీ టేకేదార్లకు పెన్షన్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ► తెలంగాణలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటు ► సౌత్ ఇండియా కాపు సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం. ► అనాథ పిల్లల కోసం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం ► హకింపేట్ ఎయిర్‌పోర్ట్‌ను పూణే తరహాలో పౌరవిమానయాన సేవలకు వినియోగించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదన పంపుతున్నాం. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే కేంద్రం లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అందులో బీఆర్ఎస్ కీలకంగా వ్యవహరిస్తుంది. -
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణకు లైన్‌క్లియర్?
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణకు ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఈనెల 31న జరిగే మంత్రివర్గ సమావేశ ఎజెండాలో ఆర్టీసీ ఆర్థికపరమైన అంశాలను చేర్చటంతో ఈ చర్చ జరుగుతోంది. 44 శాతం ఫిట్మెంట్తో... 2013 సంవత్సరానికి సంబంధించి 2015లో ప్రభుత్వం వేతన సవరణ చేసిన విషయం తెలిసిందే. 30 శాతం మేర ఫిట్మెంట్ ప్రకటిస్తారని కార్మిక సంఘాలు భావించగా, ప్రభుత్వం ఏకంగా 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. దీంతో ఆర్టీసీపై రూ.850 కోట్ల వార్షికభారం పడింది. అప్పటి నుంచి ప్రభుత్వం తర్వాత వేతన సవరణల జోలికి పోలేదు. వేతన సవరణ 2017లో చేయాల్సి ఉండగా.. 2017లో వేతన సవరణ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం స్పందించలేదు. దీంతో అప్పట్లో కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టాయి. మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. వేతనసవరణ రూపంలో పడే భారాన్ని తట్టుకునే పరిస్థితి లేక, మధ్యంతర భృతితో సరిపెట్టింది. 16 శాతం ఇంటీరియమ్ రిలీఫ్ ఇవ్వగా, ఇప్పటికీ అదే కొనసాగుతోంది. 2021లో ఇవ్వాల్సిన వేతన సవరణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే 16 శాతాన్ని ఖాయం చేస్తే రూ.40 కోట్ల భారం ప్రస్తుతం 2017కు సంబంధించిన 16 శాతం మధ్యంతర భృతి కొనసాగుతోంది. అంతే శాతాన్ని ఫిట్‌మెంట్‌గా మారిస్తే నెలవారీ భారం ఏకంగా రూ.40 కోట్లుగా ఉంటుందని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న మధ్యంతర భృతికి అదనంగా ఒక్కశాతం అదనంగా ఫిట్మెంట్ ప్రకటించినా ప్రతినెలా రూ.3 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. 18, 20, 22, 24 శాతం లెక్కలను కూడా పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ‘ఆసరా’పై దెబ్బ
హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండికి చెందిన ఆయన వయసు 73 సంవత్సరాలు.. ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులను ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ చేయగా దానిపై నెలకు రూ.15 వేల వడ్డీ వస్తోంది. ఇప్పుడు ఆయన పూర్తిగా ఈ వడ్డీపైనే ఆధారపడి ఉన్నారు. కానీ మూడు నెలలుగా రాకపోతుండటంతో ఆయనకు దిక్కుతోచని దుస్థితి ఎదురైంది. వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రిటైర్ అయి పదేళ్లయింది. తన రిటైర్మెంట్ బెనిఫిట్‌ను సీసీఎస్‌లో దాచుకోగా నెలకు రూ.9 వేల వడ్డీ వస్తోంది. చిన్నచిన్న పనులు చేసుకుంటూ తనకు వచ్చే వడ్డీ ఆసరాగా భార్యతో కలిసి బతుకీడుస్తున్నాడు. కానీ ఇప్పుడు వడ్డీ నిలిచిపోవటంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలా వీరిద్దరిదే కాదు.. చాలామంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వేదన ఇది. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సీసీఎస్ నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో ఇప్పుడు ఆ సంస్థ విశ్రాంత ఉద్యోగులకు దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. ఉద్యోగం చేస్తున్న కాలంలో నెలవారీ వాటాగా నమోదైనమొత్తం, పదవీ విరమణ సమయంలో వచ్చిన బెనిఫిట్ మొత్తాలను చాలా మంది సీసీఎస్‌లో పొదుపు చేసుకున్నారు. బ్యాంకు కంటే మెరుగైన వడ్డీ పొందే వీలుండటమే దీనికి కారణం. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వారి సంగతి పక్కన పెడితే, పేదరికంలో మగ్గుతున్నవారు మాత్రం ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీపైనే ఆధారపడుతున్నారు. కానీ సీసీఎస్ నిధులను ఆర్టీసీ వాడేసుకుని ప్రస్తుతం రూ.932 కోట్లు బకాయిపడింది. నెలవారీగా ప్రస్తుతం సీసీఎస్ కోసం ఉద్యోగుల జీతాల నుంచి మినహాయిస్తున్న రూ.19 కోట్లను ఆర్టీసీ సీసీఎస్‌కు పూర్తిగా చెల్లించటం లేదు. గత నెల కేవలం రూ.కోటి మాత్రమే ఇచ్చింది. దీంతో డిసెంబరు నుంచి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే వడ్డీ పంపిణీ నిలిచిపోయింది. దీంతో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీఎస్ కార్యాలయం చుట్టూ తిరిగి ఫలితం లేక ఉస్సూరు మంటున్నారు. రూ.కోటి కూడా కష్టమేనా.. సీసీఎస్‌లో ప్రస్తుతం ఐదున్నర వేల మంది విశ్రాంత ఉద్యోగులు డిపాజిట్లు పెట్టుకున్నారు. వారి డిపాజిట్ల మొత్తం దాదాపు రూ. 150 కోట్లు. దీనిపై ప్రతినెలా రూ.కోటి వరకు వడ్డీని చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఆ రూ.150 కోట్లు లేవు. నెలవారీ వడ్డీకి సరిపడా రూ.కోటి కూడా అందుబాటులో లేదు. దీంతో మూడు నెలలుగా వడ్డీ చెల్లింపు ఆపేశారు. గతంలో పది వేల మంది విశ్రాంత ఉద్యోగుల డిపాజిట్లు ఉండగా, సీసీఎస్ పరిస్థితి గందరగోళంగా మారటంతో సగం మంది డిపాజిట్లు వెనక్కు తీసుకున్నారు. తాజా గందరగోళంతో ఇప్పుడు కొత్తగా 150 మంది సభ్యత్వం రద్దుకు దరఖాస్తు చేసుకున్నారు. మందులకు కూడా డబ్బుల్లేవు ‘‘సీసీఎస్‌లో దాచుకున్న రిటైర్మెంట్ బెనిఫిట్ మొత్తం సహా ఇతర డిపాజిట్ల నుంచి నాకు నెలకు రూ.15 వేలు వస్తాయి. నాకు, హృద్రోగ బాధితురాలైన నా భార్యకు నెలకు మందులకే రూ.20 వేల ఖర్చవుతుంది. సీసీఎస్ వడ్డీ మమ్మల్ని ఆదుకుంటోంది. కానీ గత మూడు నెలలుగా వడ్డీ అందటం లేదు. ఒకప్పుడు ఆసియాలోనే గొప్ప పొదుపు సంస్థగా వెలిగిన సీసీఎస్‌కు మళ్లీ పూర్వవైభవం తెప్పించి నా లాంటి వారిని ఆదుకోవాలి.’’ – ప్రభాకరరావు, రిటైర్డ్ ఏడీసీ -
AP: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
కదిరి (శ్రీసత్యసాయి జిల్లా): పదోన్నతి పొందిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఈ నెల 24న ఉత్తర్వులు విడుదలయ్యాయి. సవరించిన కొత్త పీఆర్సీ ప్రకారం మార్చి 1వ తేదీన వారంతా వేతనాలు అందుకోనున్నారు. దీనికితోడు పదోన్నతి పొందిన నాటి నుంచి వారికి రావాల్సిన వేతన బకాయిలు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ)లో రాష్ట్ర వ్యాప్తంగా 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2,096 మందికి పదోన్నతి లభించింది. డీపీసీ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా పదోన్నతి కల్పించారంటూ ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పీఆర్సీ వీరికి వర్తింపజేయడం కుదరదని తెగేసి చెప్పింది. పదోన్నతి పొందిన వారిని మినహాయించి 49,392 మందికి 2022 సెప్టెంబర్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాయి. సీఎం సానుకూలంగా స్పందించి.. వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫలితంగా పదోన్నతి పొందిన వారికి కూడా కొత్త పీఆర్సీ వర్తింపజేస్తూ బకాయిలతో సహా చెల్లించేలా ఈ నెల 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో 2,096 మందికి లబ్ధి చేకూరనుంది. వీరిలో 27 మంది డిపో మేనేజర్లు, 18 మంది అసిస్టెంట్ డీఎంలు, 148 మంది గ్రేడ్–1 కండక్టర్లు, 332 మంది గ్రేడ్–1 డ్రైవర్లు, 197 మంది అసిస్టెంట్ డిపో క్లర్కులు, 345 మంది ఆర్టిజాన్లు, 198 మంది మెకానిక్‌లు, 322 మంది సూపర్వైజర్లు, 44 మంది సెక్యూరిటీ విభాగం వారితో పాటు ఇతరులు 465 మంది ఉన్నారు. మనసున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్థిక శాఖ అనుమతి లేకున్నా సరే 2,096 మందికి పదోన్నతులు కల్పించారు. ప్రస్తుతం వారికి పే రివిజన్‌ను క్రమబద్ధీకరించారు. మనసున్న సీఎంవైఎస్ జగన్‌కి ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటికీ మద్దతుగా నిలుస్తారు. – చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్టీసీ వైఎస్సార్ యూనియన్ సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్మికులకు దేవుడయ్యారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతి పొందిన మాలాంటి 2,096 మందికి కొత్త పీఆర్సీ అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. సీఎంకు ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది మొత్తం జీవితాంతం రుణపడి ఉంటాం. – మోకా హరిమోహన్, అసిస్టెంట్ మేనేజర్, కదిరి డిపో -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు మరో డీఏ విడుదల చేసింది యాజమాన్యం. ఈ నెల జీతంతో కలిపి దీన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో టీఎస్ఆర్టీసీ మొత్తం 7 డీఏలకు గానూ 6 డీఏలను ఇచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు మరో విడత కరవు భత్యం (డీఏ) మంజూరు చేయాలని యాజమాన్యం ఇదివరకే నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి నుంచి దీన్ని చెల్లించనుంది. -
ప్రగతి రథంపై పాడు ఏడుపు
సాక్షి, అమరావతి: ‘వినే వాడుంటే చెప్పే వాడు ఎన్నయినా చెబుతాడు’ అన్నట్లుగా.. చదువుతున్నారు కదా అని పాఠకులంటే ఆ పత్రికకు అలుసు. నిత్యం అనేకానేక అబద్ధాలు రాసేస్తోంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెంచుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం అక్కసు వెళ్లగక్కుతోంది. అదే ధోరణిలో ఆర్టీసీపైనా అబద్ధాలు అచ్చేసింది. ‘అద్దె బస్సులతో ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల కోత అంటూ’ ఓ రోత కథనాన్ని సోమవారం ప్రచురించింది. ఈనాడు కథనం అవాస్తవమని అంశాలవారీగా తేల్చిచెబుతున్న ఫ్యాక్ట్ చెక్ ఇలా ఉంది.. 1979 నుంచే అద్దె బస్సుల విధానం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అద్దె బస్సుల విధానంతో సంస్థ నిర్వీర్యమవుతోందని ఈనాడు చెప్పుకొచ్చింది. కానీ అద్దె బస్సుల విధానం ఆర్టీసీలో 1979 నుంచీ అమలులో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లలో కూడా అద్దె బస్సుల విధానం కొనసాగింది. అదేమీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. ఒక్క అద్దె బస్సూ పెరగ లేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్టీసీలో అద్దె బస్సులు పెరిగాయన్న ఈనాడు కథనం పూర్తిగా అవాస్తవం. ప్రస్తుత ప్రభుత్వం ఆరీ్టసీలో కొత్తగా ఒక్క అద్దె బస్సును కూడా తీసుకోలేదు. ప్రస్తుతం ఆర్టీసీలో 11,214 బస్సులు ఉండగా వాటిలో 2,360 మాత్రమే అద్దె బస్సులు. అంటే అద్దె బస్సులు 21 శాతమే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకముందు కూడా 2,360 అద్దె బస్సులను ఆర్టీసీ నిర్వహించింది. గతంలో తీసుకున్న అద్దె బస్సుల కాల పరిమితి ముగియడంతో వాటి స్థానంలో అదే సంఖ్యలో కొత్త అద్దె బస్సులను టెండర్ల విధానంలో తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అద్దె బస్సుల సంఖ్యను పెంచనే లేదు. కొనసాగుతున్న కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ ఆర్టీసీ కొత్త బస్సులను కొనేందుకు ప్రభుత్వం అనుమతించలేదన్న ఈనాడు ఆరోపణ పూర్తిగా అవాస్తవం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్టీసీ కొత్తగా 406 బస్సులను కొనుగోలు చేసింది. త్వరలో మరో వెయ్యి బస్సులు కొనేందుకు నిర్ణయించింది. ఒక్క ఉద్యోగంలో కూడా కోత లేదు వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగంలో కూడా కోత పడలేదు. ఇక ముందు కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గించే యోచన ప్రభుత్వానికి లేదు. పైగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను సీఎం జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. దాంతో 52 వేల మంది ఆర్టీసి ఉద్యోగులు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. తద్వారా ఉద్యోగ భద్రతతోపాటు అదనపు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. సంస్థ లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి నెలనెలా వారికి జీతాలు అందుతున్నాయి. -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు బకాయి ఉన్న మరో విడత కరువు భత్యం మంజూరైంది. గత నెలలో రెండు విడతల పెండింగ్ డీఏ మంజూరు కాగా, ఇప్పుడు మరో విడతగా 3.9 శాతం కరువు భత్యాన్ని ఆర్టీసీ మంజూరు చేసింది. దీన్ని బుధవారం చెల్లించనున్నారు. ఈ డీఏను మంగళవారమే మంజూరు చేసినందున, నెల జీతంలో దా న్ని కలిపేందుకు ఒక రోజు సమయం పట్టనుంది. ఇందుకోసం ఈనెల జీతాలు ఒకటో తేదీన కాకుండా 2న చెల్లించనున్నారు. ప్రస్తుతానికి కరువు భత్యంతో సరి.. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు దీర్ఘకాలం పెండింగులో ఉన్న బకాయిల చెల్లింపుపై దృష్టి సారించింది. మునుగోడు ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య పేరుతో కార్మిక సంఘాలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారానికి దిగటంతో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఆ సమాఖ్య నేతలను పిలిపించి చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ డీఏను ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో రెండు విడతల డీఏ ఇవ్వగా ఇప్పుడు మూడో విడత ఇవ్వటంతో మొత్తం డీఏ 63.9 శాతానికి చేరింది. దీంతోపాటు 2019 జనవరికి చెందిన డీఏ ను ఆలస్యంగా విడుదల చేసినందున దాని తాలూకు ఎరియర్స్‌ను కూడా ఈనెల జీతంతో ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇక దసరా పండగ అడ్వాన్సును కూడా చెల్లించనున్నారు.ఇక 2022 సంవత్సరానికి సంబంధించిన రెండు విడతల డీఏలు మాత్రమే పెండింగులో ఉంటాయి. -
ఆర్టీసీ ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలుపై హర్షం
సాక్షి, అమరావతి: పీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలివ్వడంపై పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం థాంక్యూ సీఎం సార్.. అంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు డీఎస్పీ రావు, ముఖ్య ఉపాధ్యక్షుడు నాయుడు, ప్రధాన కార్యదర్శి అబ్రహాంలు ప్రసంగించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు. 52,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ 2020 జనవరి 1న నూతన సంవత్సర కానుక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చి పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతన స్కేల్స్ ద్వారా పీఆర్సీని అమలు చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్‌కు ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్లలోనూ ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ కృతజ్ఞత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఏపీ పీటీడీ ఈయూ హర్షం ఆర్టీసీ ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలివ్వడంపై ఏపీ పీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వైవీరావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, చీఫ్ వైస్‌ప్రెసిడెంట్ సుబ్రమణ్యంరాజు, ఉప ప్రధాన కార్యదర్శులు జీవీ నరసయ్య, ఆవుల ప్రభాకర్‌లు శనివారం ప్రకటనలు విడుదల చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో దసరా పండగకు ముందే ఆర్టీసీ ఉద్యోగులకు పండుగొచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు. -
AP: సీఎం జగన్‌ను కలిసిన ఆర్టీసీ ఉద్యోగులు
సాక్షి, తాడేపల్లి: ఆర్టీసీ ఉద్యోగులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కలిశారు. తమకు పీఆర్సీ అమలు చేయడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నారని ప్రస్తావించారు. కరోనా సమయంలోనూ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇబ్బంది లేకుండా చేశారని గుర్తు చేశారు. తాజాగా అక్టోబర్ 1 నుంచి వారికి పీఆర్సీ అమలు చేయబోతున్నట్లు తెలిపారు. గురుకుల, ఎయిడెడ్, యూనివర్సిటీ ఉద్యోగుల వయోపరిమితి పెంచే విషయంపై సీఎం సానుకూలంగా స్పందించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. 52 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (ఏపీపీటీడీ) వైఎస్సార్ ఎంప్లాయ్ అసోసియేషన్ నేత చల్లా చంద్రయ్య కొనియాడారు. తమకు 10 వేల కోట్ల జీతాలు చెల్లించి ఆర్టీసీ భవిష్యత్తును కాపాడినట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పే స్కేల్ అమలు చేయబోతున్న క్రమంలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యమంత్రికి రుణపడాల్సి ఉందన్నారు. పెన్షన్ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. పదోన్నతుల ఫైల్ కూడా ప్రభుత్వానికి పంపినట్లు, ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. చదవండి: ఆర్గానిక్ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలి: సీఎం జగన్ -
ఆర్టీసీ ఉద్యోగులకు ఒక విడత డీఏ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరువుభత్యం బకాయిల్లో ఒకదాన్ని చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆరు విడతల డీఏ బకాయి ఉండగా, అందులో ఒక విడత 5.4 శాతం డీఏను చెల్లించనున్నట్టు ప్రకటించింది. దీంతో 45.9 శాతంగా ఉన్న కరువు భత్యం 51.6 శాతానికి పెరిగింది. ఈనెల జీతంతో దీన్ని చెల్లించనున్నారు. 2013 వేతన సవరణకు సంబంధించిన మూలవేతనంపై లెక్కించి ఇవ్వనున్నారు. ఇంకా ఐదు విడతల డీఏ చెల్లించాల్సి ఉంది. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు కరువు భత్యం చెల్లించడం లేదు. ఒక విడత డీఏ ప్రకటించటం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎరియర్స్ లేకుండా కేవలం డీఏ చెల్లించటం సరికాదని సీనియర్ కార్మిక నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. డీజిల్ సెస్ పెంచిన తర్వాత నష్టాలు రూ.641 కోట్ల మేర తగ్గాయని ప్రకటించిన తర్వాత కూడా ఎరియర్స్ ఇవ్వకపోవటం దారుణమన్నారు. ఇప్పుడు ప్రకటించిన డీఏ ఏ విడతదో కూడా తెలపకపోవటం వెనక ఎరియర్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశం ఉన్నట్టు స్పష్టమవుతోందని టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి పేర్కొన్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం
రాజమహేంద్రవరం సిటీ: ఆర్టీసీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఉద్యోగులకు అక్టోబర్ నుంచి పీఆర్సీ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటనతో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పీఆర్సీ అమలు ప్రకటనను స్వాగతిస్తున్నామంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న పీఆర్సీతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో (ప్రస్తుత తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు) సుమారు 3,600 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (ఏపీఎస్‌పీటీడీ)గా మార్చారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పదోన్నతి కల్పించారు. కార్మికుల సంబరాలు అక్టోబర్ నుంచి పీఆర్సీ అమలు కానుండడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ఆర్టీసీని అప్పుల ఊబిలో నుంచి కొంతమేర బయటకు తీసుకువచ్చి, ఆర్టీసీ కార్మికులకు అనేక రాయితీలు కల్పించి అండగా నిలిచారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆర్టీసీపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరిన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత 2020 జనవరిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు ప్రకటించారు. అయితే సంస్థాగత, సాంకేతిక, విధాన పరంగా కొన్ని చిక్కులు రావడంతో ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించారు. అనంతరం అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పెరగనున్న జీతాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, రావులపాలెం, రామచంద్రపురం, రాజోలు, ఏలేశ్వరం, తుని, గోకవరం, కొవ్వూరు, నిదడవోలు ఆర్టీసీ డిపోలున్నాయి. ఈ డిపోల్లోని సుమారు 3600 మంది ఉద్యోగులకు నూతన పీఆర్సీ ప్రకారం కొత్త జీతాలు అందనున్నాయి. వీరిలో పర్యవేక్షణ అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, క్లీనర్లు, ఎల్రక్టీíÙయన్లు ఉన్నారు. వీరికి వారి ఉద్యోగ స్థాయి ప్రకారం రూ.2 వేల నుంచి 6 వేల వరకు అదనంగా జీతాలు పెరగనున్నాయి. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాలో 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. రోజుకు సుమారు రూ.కోటి వరకు ఆదాయం వస్తుంది. దీంతో పాటు కార్గో ద్వారా ఆదాయం సమకూరుతోంది. పీఆర్సీని స్వాగతిస్తున్నాం మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తరువాత మొదటిసారి అమలు చేస్తున్న పీఆర్సీని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి నిర్ణయం ఆనందాన్ని నింపుతోంది. పాత బకాయిలు సైతం విజయదశమి నాటికి అందజేస్తే ఉద్యోగులకు మరింత ఊరట కలుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – గిడ్ల చిరంజీవి, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ, రాజమహేంద్రవరం సీఎం జగన్‌కు ధన్యవాదాలు ఇప్పటివరకూ చిన్నపాటి మొత్తంలో జీతాలు తీసుకుంటున్న మాకు కొత్త పీఆర్సీ ద్వారా వచ్చే జీతాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. మా దశాబ్దాల కల నెరవేరింది. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారు. మా ఉద్యోగులు అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – సీహెచ్ఎన్ లక్ష్మీ, ఏపీపీటీడీ ఎంప్లాయూస్ యూనియన్, మహిళా కమిటీ కోశాధికారి, రాజమహేంద్రవరం చాలా సంతోషం ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మార డం సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్ని రాయితీలు మాకు అందుతున్నాయి. కొత్త పీఆర్సీ అమలుతో జీతాలు కూడా పెరుగుతాయి. మేము ప్రభుత్వ ఉద్యోగులమని గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు సమాజంలో గౌరవం పెరిగింది. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. – పోలిశెట్టి లక్ష్మణరావు, ఏపీపీటీడీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు, రాజమహేంద్రవరం సాహసోపేతం ఆరీ్టసీని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్ మెంట్‌గా మార్చి ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడం సాహసోపేత నిర్ణయం. ఎన్ని అవరోధాలు ఏర్పడినా సీఎం జగన్ తాను ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఉద్యోగుల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పీఆర్సీ అమలుతో కొత్త జీతాలు రావడం ఆనందంగా ఉంది. – వీరమల్లు శివ లక్ష్మణరావు, డ్రైవింగ్ స్కూల్ కోచ్, రాజమహేంద్రవరం -
ఆర్టీసీ ఉద్యోగులకు వచ్చేనెల నుంచి కొత్త పీఆర్సీతో వేతనాలు
విజయనగరం గంటస్తంభం: ఆర్టీసీ ఉద్యోగులు వచ్చేనెల 1వ తేదీన కొత్త పీఆర్సీ వేతనాలు అందుకుంటారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. న్యాయ అంశాలు, నిబంధనలన్నీ పరిశీలించాక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణ ఉంటుందని, ఈ విషయంలో నెలరోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) 4వ వార్షికోత్సవ రాష్ట్ర సభ విజయనగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడానికే తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, సీపీఎస్ కంటే మెరుగైన ప్రయోజనాలు కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రుల కమిటీకి సీఎం సూచించారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపీఎస్ అమలు సాధ్యంకాదన్నారు. తాము ఇచ్చిన ఎన్నికల హామీల్లో 95 శాతం నెరవేర్చామని, ఐదు శాతంలో సీపీఎస్ కూడా ఉందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములమన్న భావనతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమన్నారు. పెండింగ్ డీఏల సమస్య తొందరలోనే పరిష్కారమవుతుందన్నారు. పీహెచ్సీ మొదలుకుని అన్నిస్థాయిల్లోని ఆస్పత్రుల్లో పోస్టులన్నీ డిసెంబర్ ఆఖరుకు భర్తీ చేస్తామన్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా అదే సమయానికి భర్తీ చేస్తామని చెప్పారు. తెలంగాణ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఎటువంటి పెన్షన్ స్కీం వర్తింపచేయాలన్నది రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, ఇతర సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు
సాక్షి, అమరావతి: ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖతో మంగళవారం జరిపిన సంప్రదింపులు ఫలించాయి. ఆర్టీసీలో మొత్తం 51,500 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో దాదాపు 2 వేల మందికి ఇటీవల పదోన్నతులు కల్పించారు. పదోన్నతులు పొందిన వారు మినహా మిగిలిన ఉద్యోగులు అందరికీ సెప్టెంబరు ఒకటిన కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పదోన్నోతులు పొందిన వారి ఫైల్‌ను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. పదోన్నతులను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వారికి కూడా కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ అనుమతినిస్తుందని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో ప్రభుత్వ ఆమోదం లభిస్తే వీరికి కూడా సెప్టెంబరు ఒకటిన కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తారు. లేకపోతే ఆక్టోబరు ఒకటి నుంచి కొత్త జీతాలు చెల్లిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ఎరియర్స్‌తో సహా జీతాలు చెల్లిస్తారని, ఎవరికీ ఇబ్బంది ఉండదని ఆర్టీసీవర్గాలు చెబుతున్నాయి. -
TSRTC: స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు స్పందన కరువు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు స్పందన కరువైంది. చాలా కాలంగా వీఆర్ఎస్ కోసంఎదురు చూస్తున్న వేలాది మంది కార్మికులు సైతం సందిగ్ధంలో పడ్డారు. వీఆర్ఎస్ పథకంలో స్పష్టత లేకపోవడం, కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలపై విధివిధానాల్లో స్పష్టత లోపించడం వల్ల వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వయోభారం దృష్ట్యా ఉద్యోగ విరమణ చేయాలని భావిస్తున్నప్పటికీ పదవీ విరమణ ప్రయోజనాల్లో నష్టం వాటిల్లవచ్చుననే ఆందోళన వల్ల కార్మికులు ఈ పథకానికి దూరంగా ఉన్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో ఇప్పటి వరకు సుమారు 300 మంది ఉద్యోగులు మాత్రమే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ పథకానికి అర్హులైన వారు సుమారు 7000 మంది ఉన్నారు. ఈ ఏడాది కనీసం 2000 మంది వీఆర్ఎస్ తీసుకోవచ్చునని అధికారులు అంచనా వేశారు. కానీ అనేక రకాల అనుమానాల దృష్ట్యా చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ప్రయోజనాలపై స్పష్టత లేదు... ‘వీఆర్ఎస్ తీసుకొని ఉన్నపళంగా రోడ్డున పడుతామేమో అనిపిస్తోంది. ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు’ అని రాణిగంజ్ డిపోకు చెందిన సీనియర్ డ్రైవర్ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. వీఆర్ఎస్ కోసం రెండేళ్లుగా ఎదురుచూశామని, చివరకు దాంట్లో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలియకపోవడం వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు పలువురు సీనియర్ మహిళా కండక్టర్లు అభిప్రాయపడ్డారు. కనీసం 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు లేదా 55 ఏళ్ల వయసు నిండిన వాళ్లు దీనికి అర్హులు. కానీ 2013 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వీఆర్ఎస్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 పీఆర్సీలు పెండింగ్ జాబితాలో ఉన్నాయి. వీటి కోసంఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అలాగే మరో 6 డీఏలు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు వీఆర్ఎస్ తీసుకొంటే అటు పీఆర్సీకి నోచక, ఇటు డీఏలు దక్కక తీవ్రంగా నష్టపోవలసి ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. ‘ఉద్యోగ విరమణ అనంతరం వైద్య సదుపాయం ఉంటుందో లేదో కూడా స్పష్టత లేదు. 20 ఏళ్లు పూర్తి చేసిన వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా సాగనంపుతున్నట్లుగానే ఉంది’ అని బండ్లగూడ డిపోకు చెందిన సీనియర్ ఉద్యోగి ఒకరు చెప్పారు. వయోభారంతో ఎదురు చూపులు.. ► ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 2019లో రెండేళ్లకు పెంచింది. దీంతో ఆ సంవత్సరం ఉద్యోగ విరమణ చేయవలసిన వాళ్లు 2021 వరకు విధులు నిర్వహించారు. కానీ చాలా మంది రెండేళ్ల పెంపును భారంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే డ్రైవర్లు, మహిళా కండక్టర్లు స్వచ్ఛంద పదవీ విరమణ వైపే మొగ్గు చూపుతున్నారు. వయోభారం కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులతో బాధపడేవాళ్లు విశ్రాంతిని కోరుకుంటున్నారు. (క్లిక్: బాసర ట్రిపుల్ ఐటీ.. సిబ్బంది గురించి వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు!) ► గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలు, కార్యాలయాల్లో సుమారు 18 వేల మందికి పైగా పని చేస్తున్నారు. వీరిలో 55 ఏళ్లు నిండిన వాళ్లు లేదా, 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లు కనీసం7 వేల మంది ఉన్నట్లు అంచనా. (క్లిక్: ప్రైవేటు డిస్కంలకు లైన్ క్లియర్!) -
గ్రేటర్ ఆర్టీసీలో వీఆర్‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ఉద్యోగులు బారులు తీరుతున్నారు. వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెలాఖరు వరకు గడువు విధించడంతో నగరంలోని వివిధ డిపోలకు చెందిన సీనియర్ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణకు ఆర్టీసీ యాజమాన్యం గతంలోనే ఒకసారి అవకాశం కల్పించింది. దాంతో అప్పట్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. పదవీ విరమణకు చేరువలో ఉన్న సుమారు 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ పథకంపై అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచారు. అప్పటి నుంచి వీఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లతో పాటు కొత్తగా మరికొందరికి అవకాశం కలి్పంచేందుకు తాజాగా మరోసారి దరఖాస్తులు ఆహా్వనించారు. ఈ నెలాఖరు వరకు గడువు విధించడంతో వివిధ డిపోలకు చెందిన సీనియర్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వయోభారమే కారణం.. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 2019లో రెండేళ్లకు పెంచింది. దీంతో ఆ సంవత్సరం ఉద్యోగ విరమణ చేయాల్సిన వాళ్లు 2021 వరకు విధులు నిర్వహించారు. కానీ.. చాలా మంది రెండేళ్ల పెంపును భారంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే డ్రైవర్లు, ఆ తర్వాత కండక్టర్లు స్వచ్ఛంద పదవీ విరమణ వైపే మొగ్గు చూపుతున్నారు. వయోభారం కారణంగా అధిక రక్తపో టు, మధుమేహం, గుండెజబ్బులతో బాధపడేవా ళ్లు విశ్రాంతిని కోరుకుంటున్నారు. అప్పట్లోనే సు మారు 1500 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా తాజా ప్రకటనతో మరికొంత మంది అదనంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. తగ్గనున్న ఆర్థిక భారం.. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో వివిధ విభాగాల్లో సుమారు 18 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పీకల్లోతు నష్టాల్లో నడుస్తున్న సంస్థలో ఇంధనం, విడిభాగాల కొనుగోళ్లు, బస్సుల నిర్వహణతో పాటు ఉద్యోగుల జీతభత్యాలు కూడా భారంగానే మారాయి. ఈ క్రమంలో అదనపు భారాన్ని తగ్గించుకొనేందుకే మరోసారి ఈ పథకాన్ని ముందుకు తెచ్చినట్లు సమాచారం. 2019లోనే వీఆర్ఎస్ ప్రస్తావన వచి్చనప్పటికీ అప్పట్లో ఉద్యోగ సంఘాలు గట్టిగా వ్యతిరేకించడంతో విరమించుకున్నారు. ఆ తర్వాత వీఆర్ఎస్ ప్రతిపాదన ముందుకు వచ్చింది. అప్పటికి విధానపరమైన అంశాల్లో కారి్మక సంఘాల జోక్యం లేకపోవడంతో వీఆర్ఎస్ను ప్రతిపాదించారు. దీంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు ఒక అవకాశంగా భావిస్తున్న అధికారులు తాజాగా వీఆర్ఎస్ను ప్రకటించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను డిపోల నుంచి సేకరించడం గమనార్హం. (చదవండి: నవీకరణ.. నవ్విపోదురు గాక!) -
గుడ్‌న్యూస్: ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే పేస్కేల్
తిరుపతి అర్బన్: ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే పేస్కేల్ ప్రకటించనున్నట్లు ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసీ) ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గురువారం ఆయన తిరుపతి, అలిపిరి, మంగళం, చంద్రగిరి బస్టాండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అదేవిధంగా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులకు నూతన పే స్కేల్స్ కూడా ప్రకటించనున్నారని చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆ మేరకు చర్యలు చేపట్టామని.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి బస్సులను వినియోగిస్తున్నారో అదే తరహాలో 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. జూలై 1న తొలి బస్సు అలిపిరి డిపోకు చేరుకుంటుందన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మిగిలిన బస్సులను కూడా తిరుపతి జిల్లాకు తీసుకొస్తామన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు కోసం 30–50 బస్సులు, రేణిగుంట ఎయిర్‌పోర్టు, నెల్లూరు, కడప, ప్రముఖ దేవాలయాలున్న పట్టణాలకు మరో 50 బస్సులు కేటాయిస్తామని చెప్పారు. బస్సులకు చార్జింగ్ పాయింట్లు, విద్యుత్ చార్జీలు, కండక్టర్లను ఆర్టీసీ ఏర్పాటు చేసుకుంటుందని.. డ్రైవర్లు, బస్సుల మరమ్మతులను మాత్రం యజమానులే చూసుకుంటారని వెల్లడించారు. రాష్ట్రంలో తొలి ఎలక్ట్రిక్ బస్సుల బస్టాండ్‌గా అలిపిరి నిలుస్తుందన్నారు. అలాగే ఆర్టీసీకి చెందిన డీజిల్ బస్సులను కన్వర్షన్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తిరుపతి డిపోకు చెందిన సప్తగిరి బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్పు చేయించామని పేర్కొన్నారు. అనంతరం ద్వారకా తిరుమలరావు అలిపిరి డిపోలో ఏర్పాటు చేసిన 48 చార్జింగ్ పాయింట్లను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు కృష్ణమోహన్, గోపినాథ్‌రెడ్డి, రవివర్మ, బ్రహ్మానందయ్య, చెంగల్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రగతి రథానికి ప్రభుత్వం దన్ను
దశాబ్దాల డిమాండ్.. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక స్వప్నం.. ఎడతెగని సాగదీత... గందరగోళం.. వీటన్నింటికీ ఒక్క నిర్ణయం ముగింపు పలికింది. అదే.. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయం. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రజా రవాణా విభాగం (పీటీడీ)ని ఏర్పాటు చేశారు. ఫలితం కళ్లముందు కనిపిస్తోంది. – సాక్షి, అమరావతి ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ► పీఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి. ► ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సొసైటీకి 2014 నుంచి ఉన్న బకాయిలు రూ.200 కోట్లను యాజమాన్యం చెల్లించింది. దాంతో సొసైటీ ద్వారా ఉద్యోగులు రుణాలు పొందుతున్నారు. ► ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ప్రకటించారు. అందు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున, సహజ మరణానికి కూడా రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ► 2020 జనవరి తరువాత రిటైరైన ఉద్యోగుల గ్రాట్యుటీ కోసం రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం రూ.271.89 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ► 2020–21, 2021–22లో ఉద్యోగుల సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ కోసం రూ.165 కోట్లు చెల్లించింది. ► ఏపీ గవర్నమెంట్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్ ద్వారా 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న 44,500 మందికి ప్రయోజనం కలుగుతుంది. ఏపీ గవర్నమెంట్ స్టేట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్‌ను కూడా వర్తింపజేశారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను కూడా ఉద్యోగులు పొందుతున్నారు. ► 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ► 2020 జనవరి 1 తరువాత అనారోగ్య సమస్యలతో ఉద్యోగ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ► 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య మరణించిన 845 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు, 2020 జనవరి 1 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఉద్యోగుల జీతాల కోసం ఏటా రూ.3,600 కోట్లు దశాబ్దాల ఆర్టీసీ చరిత్ర మొత్తం ఉద్యోగుల జీతాల కోసం నెల నెలా అప్పులు చేయడం. నెలకు దాదాపు రూ.300 కోట్లు జీతాలకు చెల్లించాలి. ఆ అప్పుల మీద ఏడాదికి వడ్డీల భారమే దాదాపు రూ.350 కోట్లు. విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నంబర్లు కేటాయించి సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు సక్రమంగా చెల్లిస్తోంది. ఇందుకోసం నెలకు ఏడాదికి రూ.3,600 కోట్ల భారాన్ని మోస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా బస్సు సర్వీసులు తగ్గించింది. టికెట్ల ద్వారా వచ్చే రాబడి గణనీయంగా పడిపోయింది. అటువంటి గడ్డు పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వమే నెల నెలా జీతాలు చెల్లిస్తోంది. జీతాల భారం తప్పడంతో ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి బయటపడుతోంది. 2020 జనవరి నాటికి ఆర్టీసీకి దాదాపు రూ.4 వేల కోట్ల అప్పులున్నాయి. ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుండటంతో ఈ రెండేళ్లలో ఆర్టీసీ రూ.1,500 కోట్ల అప్పులు తీర్చింది. జీవితాల్లో వెలుగులు నింపారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న గొప్ప నిర్ణయం 52 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. నెల నెలా జీతాల కోసం పడిన ఇబ్బందులు తొలగిపోయాయి. ఉద్యోగ భద్రత కల్పించారు. ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారు.’. – బీఎస్ రాములు, డ్రైవర్, విజయనగరం రీజియన్ ఉద్యోగుల ప్రయోజనాలకు కట్టుబడ్డ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వంలో విలీనం ద్వారా ఉద్యోగ భద్రత, ఆర్థిక భరోసా కల్పించింది. ఏ ప్రభుత్వ శాఖలో లేని రీతిలో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ప్రకటించింది. త్వరలో పే స్కేళ్లను నిర్ధారించనుంది. దీంతో ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. – ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సీఎం జగన్ నిర్ణయం చరిత్రాత్మకం ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకుంటామని ఎందరో చెప్పారు గానీ ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే గొప్ప నిర్ణయం తీసుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరాయి. ఉద్యోగ భద్రత, పని వేళలు వంటి ప్రభుత్వ విధానాలు అమల్లోకి రావడంతో మాకు ప్రయోజనం కలుగుతోంది.’ – పీహెచ్ వెంకటేశ్వర్లు, మెకానిక్, నెల్లూరు రీజియన్ ఒక్క కి.మీ. తిరగకపోయినా జీతాలు చెల్లించారు ‘కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఒక్క కిలోమీటరు కూడా తిరగకపోయినా ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందాయి. ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు. మన రాష్ట్రంలో మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించడంతోపాటు ఇతర ప్రయోజనాలూ కల్పిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం ఫలితమే ఇది. ఆర్టీసీ ఉద్యోగులు సీఎంకు కృతజ్ఞతతో ఉంటారు.’ – కొండలు, ఆర్టీసీ సూపర్వైజర్, గుడివాడ -
ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు
సాక్షి, అమరావతి: ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెందిన నిపుణులు విజయవాడ విద్యాధరపురంలోని ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చారని ఏపీఎస్ఆర్టీసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డీవీఎస్ అప్పారావు తెలిపారు. ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వైద్య సేవల సమయాలను ఆయన శనివారం మీడియాకు విడుదల చేశారు. క్యాపిటల్ హాస్పిటల్స్, అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్, శ్రీగాయత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వంశీ హార్ట్ కేర్ సెంటర్ యాజమాన్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత కన్సల్టేషన్ సూపర్ స్పెషాలిటీ సేవలను అందించనున్నాయన్నారు. ► యూరాలజీ: ప్రతి నెల 1వ, 3వ మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు క్యాపిటల్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది చూస్తారు. ► అంకాలజీ: 1వ, 3వ బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు శ్రీగాయత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు. ► అంకాలజీ: 2వ, 4వ బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వారు చూస్తారు. ► కార్డియాలజీ: 1వ, 3వ గురువారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు క్యాపిటల్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తారు. ► కార్డియాలజీ: 2వ, 4వ గురువారం మధ్యాహ్నం 12–2 గంటల వరకు వంశీ హార్ట్ కేర్ సెంటర్ వైద్య సేవలు అందిస్తారు. ► దీంతోపాటు ప్రతి గురువారం ఒక రేడియాలజిస్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అల్ట్రా సౌండ్ స్కాన్ నిర్వహించేందుకు అందుబాటులో ఉంటారు. -
ఆర్టీసీలో మళ్లీ కార్మిక సంఘాల ఉద్యమబాట
సాక్షి, హైదరాబాద్: ‘దీర్ఘకాలంగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీ కార్మికులను ఆర్థికంగా కుంగదీస్తున్నారు. కార్మిక సంఘాల అస్థిత్వం ఆర్టీసీలో లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోంది. సంఘాలు లేవని కార్మికులపై పనిభారం పెంచి వేధిస్తున్నారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబీకులకు కారుణ్య నియామక వెసులుబాటు వర్తించకుండా చేస్తున్నారు. ఇక ఈ నిర్లక్ష్యాన్ని సహించం. రోడ్డెక్కి ఉద్యమిస్తాం’ అని ఆర్టీసీ సంఘాలు హెచ్చరించాయి. దాదాపు రెండున్నరేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు మళ్లీ రోడ్డెక్కి ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ) పేరుతో ఉద్యమానికి సిద్ధమయ్యాయి. గతంలో గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఉండి సీఎం ఆగ్రహానికి గురై ఆర్టీసీకి దూరమైన అశ్వత్థామరెడ్డి మళ్లీ టీఎంయూ గూటికి చేరారు. ఆదివారం టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన్ను సంఘం గౌరవాధ్యక్షుడిగా తిరిగి ఎంపిక చేశారు. ఆయన ఆధ్వర్యంలో సంఘం ఉద్యమబాట పట్టనుందని తెలుస్తోంది. ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నట్టు అశ్వత్థామరెడ్డి తెలిపారు. బాండ్ల తాలూకు చెల్లింపులేమాయె? గతంలో జరిగిన వేతన సవరణ బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించేందుకు జరిగిన ఒప్పందం అమలు కాలేదు. 2020 అక్టోబర్‌తో గడువు ముగిసి నా బాండ్ల తాలూకు చెల్లింపులు జరగకపోవటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒక్కొక్కరికి రూ. లక్షన్నరకు తగ్గకుండా లబ్ధి చేకూరాల్సి ఉన్నా అందకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2019 నుంచి అందాల్సిన 6 డీఏలనుకూడా వర్తింప చేయ కపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. 1,200 కుటుంబాలకు కారుణ్య నియామకాల రూ పంలో ఉద్యోగావకాశాలు రావాల్సి ఉన్నా అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలను మనుగడలో లే కుండా చేసినందుకే ఉద్యోగులకు అన్యా యం జరుగుతోందని ఆరోపిస్తూ ఇప్పుడు అన్ని సంఘాలు సంయుక్తంగా ఉద్యమబా ట పడుతున్నాయి. అన్ని ప్రధాన సంఘాల తో కూడిన జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దీక్ష జర గాల్సి ఉన్నా పోలీసు అనుమతి రాక వాయి దా పడింది. త్వరలో డిపోల ముందు నిరసన ప్రదర్శనలు, నల్లబ్యాడ్జీలతో నిరసనలు వరుసగా చేయాలని నిర్ణయించారు. ఇటీవల బల్క్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడాన్నీ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మునుపటి ధరలకే డీజిల్ అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. -
సమ్మెలోకి మమ్మల్ని లాగొద్దు
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ): స్వార్థ రాజకీయాలకు వంతపాడబోమని, అందుకే తామెవ్వరం సమ్మెలో పాల్గొనడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేశారు. పీఆర్సీ సాధన సమితి చేస్తున్న రాజకీయాలకు ప్రజా రవాణా విభాగం (పీటీడీ) వంత పాడదని చెప్పారు. సమ్మెను ఎదుర్కొంటామని తెలిపారు. పీటీడీలో అతిపెద్ద సంఘాల్లో ఒకటైన వైఎస్సార్ ఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. రాష్ట్ర, జోనల్, డివిజనల్, నాన్ ఆపరేషన్ నాయకులు అధిక సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు. సమ్మె ఆవశ్యకత, జేఏసీల తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేది లేదని సంఘం 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తేల్చి చెప్పారు. పీఆర్సీ సాధన సమితికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ వివరాలను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు డీఎస్పీ రావు, ప్రధాన కార్యదర్శి ఎం.అబ్రహాం, ముఖ్య ఉపాధ్యక్షుడు జేఎం నాయుడు మీడియాకు తెలిపారు. పీటీడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎల్లవేళలా సిద్ధమని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, సమ్మెలో పాల్గొనవద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఆర్టీసీని వాడుకోవాలని జేఏసీ చూస్తోంది ‘ఆర్టీసీ రూ.6,900 కోట్ల నష్టంలో ఉంది. ప్రతి నెలా రూ.150 కోట్లు అప్పు చేస్తే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆర్టీసీ ఏమవుతుందో అనుకున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవదూతలా వచ్చి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఉద్యోగులు ఎవరూ కోరలేదు. పోరాటాలు చేయలేదు. అయినా ఇచ్చిన మాట కోసం ప్రభుత్వంలో విలీనం చేసి చరిత్ర సృష్టించారు. 54 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ఆర్టీసీ నుంచి రూపాయి ఆదాయం రాకపోయినా రూ.6 వేల కోట్లు జీతభత్యాలు చెల్లించి ఉద్యోగులను ఆదుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి ఎటువంటి మెమోరాండం ఇవ్వకుండా, చర్చలు జరపకుండా కొందరు హఠాత్తుగా బస్సులు నిలిపివేస్తామనడం సరికాదు. ఆర్టీసీ బస్సులు ఆగిపోతే ఎన్జీవోల సమ్మెకు ఉపయోగం. ఆర్టీసీ ఉద్యోగులను వాడుకోవాలని జేఏసీ చూస్తోంది. మనకు సంబంధం లేని సమ్మెలోకి వెళ్లొద్దు. అడుగడుగునా సమ్మెను అడ్డుకోవాలి’ అని ఆర్టీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సమావేశంలో మాట్లాడుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చల్లా చంద్రయ్య పీఆర్సీ సాధన సమితికి సంధించిన ప్రశ్నలివీ ► పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పీటీడీ ఉద్యోగుల అంశాలు ఏమైనా ఉన్నాయా? ► మీరు పెట్టిన 75 డిమాండ్లలో పీటీడీ ఉద్యోగులకు సంబంధించినవి ఎన్ని? ఎన్నింటిపై చర్చించారు? ఎన్ని సాధించారు? ► పీటీడీ ఉద్యోగులకు వేతన స్థిరీకరణ, క్యాడర్, ఫిట్మెంట్, ఇళ్ల స్థలాలు ఏ మేరకు ఇస్తారో తెలియక ముందే మీ స్వార్థం కోసం సమ్మెకు ఉసిగొల్పడం ఎంత వరకు సమంజసం? ► ఈ ఉద్యమం నాయకుల మనుగడ కోసమా? ఉద్యోగుల మేలు కోసమా? అనేది అర్థంకాని పరిస్థితి ఉద్యోగుల్లో ఉంది. ►పీఆర్సీ సాధన సమితి స్వార్థ రాజకీయాలకు పీటీడీలోని సంఘాలు ఎందుకు వంత పాడుతున్నాయి? దీని ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకొంటున్నాయి? ఇదీ మా వినతి ‘పీటీడీ ఉద్యోగులకు క్యాడర్, వేతన స్థిరీకరణ, ఫిక్సేషన్ అమలు చేయాలి. పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు, పీటీడీ ఉద్యోగుల జీత భత్యాల్లో వ్యత్యాసం ఉన్న 19 శాతం ఫిట్‌మెంట్‌ను వర్తింపజేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలి. బకాయిలు చెల్లించాలి. ఇహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య సదుపాయం అందించాలి. కారుణ్య నియామకాలు 2016 నుంచి చేపట్టాలి’ అని ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
ఆర్టీసీ ఉద్యోగులకూ న్యాయం చేయండి
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతన వ్యత్యాసం సరిచేసి, పాతపెన్షన్‌కు అనుమతించాలని, ఇంటి అద్దెలు, సీసీఏలు పాతవి కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్‌కి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్ఎంయుఎ) విజ్ఞప్తి చేసింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసిన సీఎంకు కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో నాలుగేళ్లకు ఓసారి వేతన సవరణ జరిగేదని తెలిపారు. 2017 ఏప్రిల్ 1న 25శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ జరిగిందని పేర్కొన్నారు. అనంతరం 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసిందని, అప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు 19శాతం వేతన వ్యత్యాసం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2020 జనవరి 1 నుంచి బకాయి ఉన్న కరువు భత్యంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఫిట్‌మెంట్‌ను కలిపి 2021 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ చేసి.. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని కోరారు. -
సీఎం జగన్ మా జీవితాల్లో వెలుగునింపారు: ఆర్టీసీ ఉద్యోగులు
-
Andhra Pradesh: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2019 మార్చి 1 నుంచి, 2021 నవంబర్ 30లోగా రిటైరైన ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2017– పే స్కేల్ బకాయిలను రెండు విడతలుగా చెల్లించాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడత మొత్తాన్ని సోమవారమే వారి ఖాతాల్లో జమ చేసింది. తద్వారా 5 వేల మందికి ప్రయోజనం కలగనుంది. త్వరలోనే రెండో విడత బకాయిలను కూడా చెల్లించనుంది. ఈ నిర్ణయంపై ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, దామోదరరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వి.రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.అబ్రహం, వర్కింగ్ ప్రెసిడెంట్ డీఎస్పీ రావు, ముఖ్య ఉపాధ్యక్షుడు నాయుడు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్‌గా రమణారెడ్డి ) -
‘ఆర్టీసీ’లో ఎన్నికల హారన్
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు–పరపతి సహకార సొసైటీ ఎన్నికల నగారా మోగింది. రెండేళ్ల కాల పరిమితితో 210 మంది ప్రతినిధులను ఎన్నుకునేందుకు డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం ఎన్నికైన సొసైటీ ప్రతినిధులు 9 మంది పాలక మండలి సభ్యులను డిసెంబర్ 29న ఎన్నుకుంటారు. ఈ మేరకు సొసైటీ ఎన్నికల షెడ్యూల్ బుధవారం వెలువడింది. దాని ప్రకారం.. సొసైటీ నూతన పాలకమండలి ఎన్నికలకు నోటిఫికేషన్‌ను 15న విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి సొసైటీలో సభ్యులుగా నమోదైన వారు ఓటర్లుగా ఉంటారు. కనీసం ఏడాది సర్వీస్‌ను పూర్తి చేసుకుని, సీసీఎస్ ఫామ్ సమర్పించడంతో పాటు రూ.300 షేర్ క్యాపిటల్ చెల్లించిన ఆర్టీసీ ఉద్యోగులు ఓటర్లుగా నమోదయ్యేందుకు అర్హులు. నూతన ఓటర్ల నమోదు ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది. ప్రస్తుతం సొసైటీలో 50,300 మంది ఓటర్లున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను ఈ నెల 22 వరకూ స్వీకరిస్తారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 12 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 10 వరకూ అవకాశం కల్పిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను డిసెంబర్ 10న ప్రకటిస్తారు. పోలింగ్‌ను డిసెంబర్ 14న నిర్వహించి.. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికైన ప్రతినిధులు 9 మంది పాలక మండలి సభ్యులను ఎన్నుకుంటారు. ఆర్టీసీ నాలుగు జోన్ల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులు, హెడ్ ఆఫీస్ నుంచి ఒక సభ్యుడు.. మొత్తం మీద 9 మంది పాలక మండలి సభ్యులను ఎన్నుకుంటారు. ఆర్టీసీ ఎండీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ సొసైటీకి వైస్ చైర్మన్‌గా ఆర్టీసీ ఈడీతో పాటు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా ఉంటారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలో సొసైటీ ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. హామీలు నెరవేర్చాం.. మరోసారి అవకాశం ఇవ్వండి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తమ సభ్యులతో విజయవాడలో బుధవారం సమావేశం నిర్వహించింది. ఈయూ నేతృత్వంలోని పాలక మండలి.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిందని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, దామోదరరావు చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. సొసైటీకి రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు బుధవారం హామీ ఇవ్వడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మరిన్ని సేవలందించేందుకు ఈయూ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఎన్ఎంయూ అభ్యర్థులను గెలిపించండి సొసైటీ ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) అభ్యర్థులను గెలిపించాలని ఆ సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి కోరారు. విజయవాడలో ఎన్ఎంయూ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గం వైఫల్యంతో కుటుంబ నేస్తం, జనతా వ్యక్తిగత బీమా పథకాలు రద్దయ్యాయని విమర్శించారు. సొసైటీకి సంస్థ నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టలేకపోయారని విమర్శించారు. -
ఉన్నత స్థానాలు చేరుకునేందుకే నైపుణ్య శిక్షణ
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ఉన్నత స్థానాలు చేరుకునేందుకు నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ (సీహెచ్ఎస్ఎస్) సౌజన్యంతో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం నిర్వహించిన ఉచిత ఇంటెర్న్షిప్ కార్యక్రమం ముగింపు వేడుకను విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో సోమవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఉద్యోగుల పిల్లల కెరీర్ గైడెన్స్ కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఆన్లైన్లో నిర్వహించిన ఈ శిక్షణకు 700 మంది హాజరయ్యారన్నారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. -
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మంచి రోజులు.. మళ్లీ రుణాలు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ఆసియాలోనే గొప్ప సహకార పరపతి సంఘాల్లో ఒకటిగా గుర్తింపు పొంది, ఆ తర్వాత ఆర్టీసీ నిర్వాకంతో దివాలా తీసిన ఆ సంస్థ సహకార పరపతి సంఘం (సీసీఎస్) మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. చాలాకాలం తర్వాత మళ్లీ దాని ద్వారా ఉద్యోగులకు రుణాల పంపిణీ మొదలైంది. ఎన్నో ఏళ్లుగా నిధులు వాడేసుకోవటమే కాని, తిరిగి చెల్లించని ఆర్టీసీ.. కొత్త ఎండీ సజ్జనార్ చొరవతో బకాయిల చెల్లింపు ప్రారంభించింది. తాజాగా రూ.100 కోట్లను సహకార పరపతి సంఘానికి విడుదల చేసింది. దీంతో దాదాపు 2 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు రుణాలు, విశ్రాంత ఉద్యోగుల డిపాజిట్లపై వడ్డీ బకాయిల చెల్లింపునకు మార్గం సుగమమైంది. 2019 జూన్ నుంచి పెండింగులో ఉన్న లోన్ దరఖాస్తులను క్లియర్ చేసే పని మొదలైంది. తాజా నిధులతో ఆరునెలల కాలానికి సంబంధించిన పెండింగు దరఖాస్తులకు రుణాల చెల్లింపు జరగనుంది. అంటే 2020 జనవరి వరకు ఉన్న వాటికి రుణాలు అందుతున్నాయి. ఇంకా రూ.950 కోట్ల బకాయిలు సీసీఎస్‌కు ఆర్టీసీ రూ.1,050 (సెప్టెంబరు నెలతో) కోట్ల బకాయి ఉంది. ఇందులో తాజాగా రూ.100 కోట్లు చెల్లించటంతో మరో రూ.950 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి సీసీఎస్‌కు రూ.500 కోట్లను ప్రభుత్వ పూచీకత్తు రుణం తెచ్చి చెల్లించేందుకు ఇప్పటికే ఆర్టీసీ నిర్ణయించింది. దీనికి సంబంధించి నేషనల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో అధికారులు చర్చించారు. కానీ ఇది ప్రభుత్వ పూచీ కత్తు రుణం అయినందున ముఖ్యమంత్రి నుంచి అనుమతి పొందాల్సి ఉంది. దానికి సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయంలో ఉంది. అక్కడి నుంచి రావటంలో జాప్యం జరుగుతుండటంతో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. దీంతో ఇటీవలే బ్యాంకు నుంచి తీసుకున్న రుణం నుంచి రూ.100 కోట్లు విడుదలయ్యేలా ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. మళ్లీ సీసీఎస్వైపు ఉద్యోగుల చూపు సీసీఎస్‌లో సభ్యత్వం కలిగిన ఉద్యోగుల జీతం నుంచి ప్రతినెలా 7 శాతం చొప్పున కోత పెట్టి దాన్ని సొసైటీకి ఆర్టీసీ బదలాయించాల్సి ఉంటుంది. ఆ మొత్తం నుంచి ఉద్యోగుల సొంత అవసరాలకు రుణాలు సీసీఎస్ అందజేస్తుంది. అయితే కొన్నేళ్లుగా ఆ నిధులను ఆర్టీసీ వాడేసుకుని, ప్రతినెలా డిపాజిట్ చేయాల్సిన మొత్తాన్ని ఎగవేస్తోంది. దీంతో సీసీఎస్ దివాలా తీసింది. దీంతో చాలామంది ఉద్యోగులు సభ్యత్వాన్ని రద్దు చేసుకునేందుకు పోటీ పడ్డారు. అలా 12 వేల మంది దరఖాస్తు చేసుకోవడంతో వారందరికీ సెటిల్మెంట్లు చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ సీసీఎస్ నుంచి రుణాల పంపిణీ మొదలు కావటంతో కొత్తగా సభ్యత్వ రద్దుకు దరఖాస్తు చేసుకునేవారు తగ్గిపోయారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది తిరిగి సభ్యత్వాన్ని పునరుద్ధరించుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
ఆర్టీసీ సురక్ష ఆగింది
సాక్షి, హైదరాబాద్: ఈ ఇద్దరి మృతి మధ్య పక్షం రోజులే తేడా. కానీ ఒకరికి బీమా సాయం అందితే, మరొకరికి అందకపోవటానికి ఆర్టీసీ నిర్వాకమే ప్రధాన కారణం. నర్సయ్య కుటుంబానికే కాదు, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక ముందు కూడా ఉద్యోగులెవరైనా చనిపోతే ఆ కుటుంబాలకు బీమా సాయం అందే పరిస్థితి లేదు. రూ.5 లక్షల చేయూతనందించేలా రైతు బీమా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం కంటే దాదాపు ఏడాది ముందుగానే ఆర్టీసీలో పథకం ప్రారంభమైంది. ఇప్పటివరకు 1,100 ఆర్టీసీ కుటుంబాలకు అండగా నిలిచింది. ఇప్పుడా పథకం ఆగిపోయింది. దీనిపై ఉద్యోగులు, పథకం నిలిచిపోవడంతో సాయం అందకుండా పోయిన కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అండగా నిలిచిన సురక్ష ఆర్టీసీ సహకార పరపతి సంఘం 2017లో సురక్ష పేరుతో బీమా పథకం అమలులోకి తెచ్చింది. ఆర్టీసీ ఉద్యోగుల జీతం నుంచి ప్రతినెలా 7% సంఘానికి జమ చేయటం ద్వారా సమకూరిన సీసీఎస్ నిధిని బ్యాంకులో డిపాజిట్ చేయటం ద్వారా వడ్డీ వచ్చేది. ఆ క్రమంలోనే బీమా పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో ఉద్యోగికి సాలీనా రూ.1,500 ప్రీమియం చెల్లిస్తే.. ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి బీమాసంస్థ రూ.5 లక్షలు చెల్లిస్తుంది. ఉద్యోగుల నుంచి పైసా వసూలు చేయకుండా ఈ పథకం ప్రారంభమైంది. ఒప్పందం కుదుర్చుకున్న బీమా సంస్థకు ప్రీమియంగా రూ.7.5 కోట్లు చెల్లించగా.. ఆ ఏడాది 220 మంది ఉద్యోగులు చనిపోవటంతో సదరు సంస్థ ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.11 కోట్లు చెల్లించింది. ఇలా వేర్వేరు బీమా సంస్థలు 1,100 కుటుంబాలను ఆదుకున్నాయి. ఏటా జూన్ ఆఖరుతో బీమా ఒప్పందం ముగిసేది. గతేడాది వారం ఆలస్యంగా ఒప్పందం జరగటంతో, గత జూలై ఏడు వరకు పథకం కొనసాగింది. కోవిడ్ వల్ల ఎక్కువమంది చనిపోగా రూ.2,750 ప్రీమియంతో ఒప్పందం కుదుర్చుకున్న బీమా సంస్థ జూలై ఏడు వరకు చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి అన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. సీసీఎస్ వద్ద నయాపైసా లేక.. జూలై ఏడుతో పథకం ముగిసిపోగా, అది కొనసాగేందుకు మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలంటే సీసీఎస్ వద్ద నయా పైసా నిల్వ లేకుండా పోయింది. డబ్బులన్నీ ఆర్టీసీ వాడేసుకోవటమే దీనికి కారణం. రూ.1,000 కోట్లకు పైగా ఏర్పడ్డ బకాయిలను ఆర్టీసీ చెల్లించకపోగా ప్రతినెలా ఇచ్చే మొత్తాన్ని ఇవ్వటం మానేయటంతో సీసీఎస్ పూర్తిగా దివాలా తీసింది. దీంతో బీమా పథకం ప్రీమియాన్ని చెల్లించే పరిస్థితిలేకుండా పోయింది. దీంతో ఏ కంపెనీతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదు. దీంతో జూలై 8 నుంచి చనిపోయిన ఏడుగురు ఉద్యోగుల కుటుంబాలకు బీమా పథకం అందకుండా పోయింది. దీంతో తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఆర్టీసీ సహకరిస్తేనే.. బీమా ప్రీమియంకు కావల్సిన మొత్తాన్ని సీసీఎస్‌కు ఆర్టీసీ చెల్లిస్తే.. వేలాది మంది అల్పాదాయ కార్మికుల కుటుంబాలకు మళ్లీ బీమా సాయాన్ని పునరుద్ధరించే వీలుంది. లేదంటే ఉద్యోగులే ప్రతినెలా నిర్ధారిత మొత్తాన్ని ప్రీమియం కింద చెల్లించడం ద్వారా ఏర్పడే నిధి నుంచి ఈ సాయం అందేలా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. దీనిపై ఆర్టీసీయే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పునరుద్ధరిస్తాం సురక్ష మంచి పథకమని దీనిని పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తామని సీసీఎస్ కార్యదర్శి మహేష్ చెప్పారు. ఇప్పటికే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కూడా సాయం అందేలా చూస్తామని తెలిపారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పీఎస్ నారాయణ. జనగామ బస్ డిపోలో కండక్టర్. కోవిడ్ బారిన పడి కోలుకున్నట్టే కోలుకుని ఆరోగ్యం విషమించి గత జూన్ 29న చనిపోయారు. ఆ కుటుంబానికి ఆయన సంపాదనే ఆధారం. ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్)లో బీమా పథకం అమలులో ఉండటంతో వారికి రూ.5 లక్షల సాయం అందింది. ఆ మొత్తం ఆ కుటుంబానికి ఎంతో ఉపయుక్తంగా మారింది. ఈయన పేరు నర్సయ్య. గోదావరిఖని డిపోలో డ్రైవర్. గత జూలై 14న బస్సు నడుపుతుండగానే గుండెపోటుకు గురయ్యారు. బాధతో విలవిల్లాడుతూనే ప్రమాదం జరక్కుండా బస్సును క్షేమంగా నిలిపి ప్రాణాలు వదిలారు. ఆయనది నిరుపేద కుటుంబం. కానీ ఇన్సూరెన్సు పథకం నుంచి నయాపైసా రాలేదు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. -
సీసీఎస్ బకాయిల కోసం రూ.500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను పూర్తిగా వాడేసుకుని ఉద్యోగులకు రుణాలు, విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ చెల్లించకుండా గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దేందుకు సిద్ధపడింది. కేవలం సీసీఎస్ బకాయిలు చెల్లించేందుకు వీలుగా నేషనల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి రూ.400 కోట్ల రుణం తీసుకుని ఆర్టీసీకి అందించాలని నిర్ణయించింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వనుంది. సీసీఎస్ నిల్వ మొత్తాన్ని వాడుకోవడం, ప్రతినెలా దానికి జమ చేయాల్సిన మొత్తాన్ని ఎగ్గొడుతున్న ఫలితంగా దానికి ఆర్టీసీ దాదాపు రూ.950 కోట్ల వరకు బకాయి పడింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం కష్టంగా మారడంతో ముందుగా రూ.500 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్సీడీసీ నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. అప్పుడు వద్దనుకుని.. నిజానికి ఎన్సీడీసీ నుంచి రుణం తీసుకునే అంశం దాదాపు మూడు నెలల క్రితమే చర్చకొచ్చింది. అప్పుడు ఆ కార్పొరేషన్‌తో అధికారులు చర్చించారు. సాధారణంగా ఎన్సీడీసీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు చెందిన సహకార సంస్థలకే రుణాలిస్తుంది. సీసీఎస్ కూడా సహకార సంస్థే కావటంతో రుణం ఇచ్చేందుకు అప్పట్లో అంగీకరించినట్లు తెలిసింది. అయితే రుణం నేరుగా సీసీఎస్‌కే ఇస్తామని, ఆర్టీసీకి ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నట్టు సమాచారం. తీసుకునే రుణంలో కొంత సీసీఎస్‌కు ఇచ్చి, మిగతాది తమ అవసరాలకు వాడుకోవాలన్న యోచనలో ఉన్న ఆర్టీసీ అందుకు అంగీకరించలేదు. ఫలితంగా అప్పట్లో ఆ రుణ అంశం అటకెక్కిందని తెలిసింది. ఇప్పుడు సీసీఎస్ పరిస్థితి దారుణంగా తయారు కావటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో డబ్బు దాచుకుని నెలనెలా వడ్డీ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులు ఇటీవల బస్‌భవన్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. దీనికి సంబంధించి ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. సీసీఎస్‌లో సభ్యత్వం ఉండటం.. నెలనెలా జీతంలో కోత పడుతుండటంతో ఏకంగా సభ్యత్వాలనే మూకుమ్మడిగా రద్దు చేసుకోవాలని ఉద్యోగులు భావిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సీసీఎస్ మూసివేతకు రంగం సిద్ధం అయిన తీరుపై ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. దీంతో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. గతంలో వద్దనుకున్న ఎన్సీడీసీ రుణాన్ని తిరిగి తీసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు ఇవ్వాలనే విషయంపై చర్చించారు. దీనికి ఆర్థిక శాఖ అంగీకరించడంతో ఆ రుణం పొందేందుకు మార్గం సుగమమైంది. బడ్జెట్లో పేర్కొన్న రుణం అందినట్టే.. బడ్జెట్(2021–22)లో ఆర్టీసీకి రూ.1,500 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రభుత్వ బ్యాంకు నుంచి రూ.వేయి కోట్ల రుణంపై చర్చించగా, తొలుత రూ.500 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మొత్తం దాదాపు నెలన్నర క్రితం అందింది. అది ఖర్చు చేశాక మరో రూ.500 కోట్ల రుణం ఇవ్వనున్నట్లు ఆ బ్యాంకు పేర్కొంది. వెరసి రూ.వేయి కోట్లు అక్కడి నుంచి రానుండగా, తాజాగా ఎన్సీడీసీ నుంచి మరో రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించడంతో ప్రభుత్వ రుణం దాదాపు ఆర్టీసీకి అందినట్లు అవుతుంది. ఉద్యోగుల బకాయిలకు వినియోగం? దాదాపు నెలన్నర క్రితమే అందిన రూ.500 కోట్ల బ్యాంకు రుణాన్ని ఎలా ఖర్చు చేయాలనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేక అలాగే ఉంచారు. ఇప్పుడు వాటిని ఉద్యోగుల బకాయిల కింద వాడాలని భావిస్తున్నట్లు సమాచారం. సీసీఎస్‌కు ఎన్సీడీసీ రుణాన్ని ఇవ్వనుండగా, ఉద్యోగులకు ఉన్న బాండ్ల బకాయిలు, వేతన సవరణ బకాయిలు, విశ్రాంత ఉద్యోగుల బకాయిలకు వాటిని వాడాలని భావిస్తున్నట్లు తెలిసింది. అద్దె బస్సు బకాయిలు కూడా చెల్లించాలని అనుకుంటున్నట్లు సమాచారం. వాటి వ్యయంపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టత వచ్చాక వెల్లడించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. -
ఆక్సిజన్ పైపులేశారు.. వదిలేశారు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు పనులను గాలికొదిలేశారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 4 వేల మంది వ్యాధి బారినపడి, 120 మంది వరకు చనిపోయారు. ఈ నేపథ్యంలో 200 పడకల సామర్థ్యంతో కరోనా సెంటర్‌ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైద్య, ఆరోగ్య శాఖలోని మౌలిక వసతుల కల్పన సంస్థ హడావుడిగా ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటు పనులను కొంతమేర పూర్తి చేసింది. ఈలోపు కోవిడ్ కేసులు తగ్గడంతో ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేదు. త్వరలో మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడో వేవ్ వరకైనా కోవిడ్ సెంటర్ సిద్ధమవుతుందని భావించారు. మొదటి రెండు దశల్లో పడకలు దొరక్క ఆర్టీసీ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలోనే ఉద్యోగులు తమ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ కోసం గళమెత్తారు. అయితే కోవిడ్ కేంద్రం పనులు చేసినట్లే చేసి మధ్యలోనే గాలికొదిలేశారు. ఆశలు వదులుకుని సొంతంగా.. రూ.2 కోట్లు నిధులు కేటాయిస్తే తామే పనులు చేసుకుంటామని ఆర్టీసీ ఆస్పత్రి అధికారులు వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ చుట్టూ తిరిగినా ప్రయో జనం లేకుండా పోయింది. దీంతో సొంతంగా విరాళాలు సేకరించటం, స్వచ్ఛంద సంస్థలను కోరి కొన్ని పనులు పూర్తి చేయించుకునేలా నడుం బిగించారు. హైదరాబాద్ రీజియన్‌కు చెం దిన డీవీఎంలు, డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారులు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు విరాళాలిచ్చారు. వాటితో 50బెడ్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. నిర్మాణ్ అనే సంస్థ 10 లీటర్ల సామర్థ్యమున్న 25 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఇచ్చింది. సెర్చ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున ఓ ప్రతినిధి 40 సాధారణ పడకలు, 10 ఫౌలర్ బెడ్లు, సైడ్ టేబుల్స్, ఐవీ ఫ్లూయిడ్ స్టాండ్లు, స్టెతస్కోపులు అందజేశారు. రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న మరో సంస్థను కూడా సంప్రదించి పెద్ద ఆక్సిజన్ సిలిండర్ల కోసం చర్చిస్తున్నారు. వంద ఇస్తే చాలు.. ఆర్టీసీలో 45 వేల మంది ఉద్యోగులున్నారు. వీరంతా నెలకు రూ.100 చొప్పున చెల్లిస్తే ప్రతినెలా రూ.45 లక్షలు సమకూరుతాయి. అలా 4 నెలలు ఇస్తే కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు ఇతరులపై ఆధారపడాల్సిన పని ఉండదు. ప్రతినెలా వసూలయ్యే మొత్తంతో అప్పటికప్పుడు కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలు పడుతుంది. తొలుత 50 బెడ్ల సామర్థ్యంతో ప్రారంభించి క్రమంగా పెంచు కుంటూ పోవాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో హన్మకొండలో ఆర్టీసీ డిస్పెన్సరీని ఇలాగే ఉద్యోగుల విరాళంతో ఏర్పాటు చేశారు. తక్కువ విరాళంతో ప్రతినెలా ఓ బస్సు చొప్పున కొని నడిపిన ఉదంతాలున్నాయి. కావాల్సినవి ఇవి.. ►పూర్తయిన ఆక్సిజన్ పైపులైన్‌కు ఆక్సిజన్ సిలిండర్లు అమర్చాలి. ►200 పడకలకు 45 లీటర్ల సామర్థ్యం ఉన్న 600 సిలిండర్లు. ►ఒక్కో సిలిండర్ ధర రూ.22 వేల వరకు ఉందని అధికారులు తేల్చారు. అంటే వీటికే రూ.1.32 కోట్లు అవసరం. ►ఐసీయూకు సంబంధించిన పరికరాలు కావాలి. ►7 వెంటిలేటర్లు. అంబులెన్సు, మందులు. -
ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. కోవిడ్ కర్ఫ్యూ సడలింపులు ఇవ్వడంతో బస్ సర్వీసులను అమాంతంగా పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రీజనల్ మేనేజర్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తం 55 వేల మంది ఉద్యోగుల్లో 45 ఏళ్ల దాటినవారు 33 వేల మంది ఉన్నారు. వారిలో 29 వేల మందికి మొదటి డోస్ వ్యాక్సిన్లు వేయగా, కేవలం 6 వేల మందికే రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి. 45 ఏళ్లు దాటిన ఉద్యోగులందరికీ జూలై 31 నాటికి రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తి చేయాలని ఎండీ స్పష్టం చేశారు. తక్కినవారికి జూలై 31 నాటికి మొదటి డోసు వ్యాక్సిన్లు వేసి, ఆగస్టు 31 నాటికి రెండు డోసులు పూర్తి చేయాలన్నారు. -
ఆర్టీసీ: కార్మికులకు ఇంకా అందని జీతాలు.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఇంకా జీతాలు అందలేదు. జీతాలు చెల్లించేందుకు కావాల్సిన రూ.120 కోట్లు అందుబాటులో లేకపోవటంతో ఆర్టీసీ చేతులెత్తేసింది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా రోజువారీ ఆదాయం నామమాత్రంగా మారింది. రూ. 2.5 కోట్లకు ఆదాయం పడిపోవటంతో డీజిల్ ఖర్చులకు కూడా సరిపోవట్లేదు. దీంతో బ్యాంకు నుంచి వచ్చే రుణం కోసం ఆర్టీసీ ఎదురుచూస్తోంది. ఇటీవలే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లకు పూచీకత్తు ఇవ్వటంతో ఓ బ్యాంకుకు ఆర్టీసీ దరఖాస్తు చేసుకుంది. అయితే గతంలో తీసుకున్న రుణానికి సంబంధించి రూ.190 కోట్ల మొండిబకాయిలు ఉండటంతో ఆర్టీసీ ఎన్పీఏ జాబితాలో చేరింది. ఫలితంగా వెంటనే రుణం పొందే వీల్లేకుండా పోయింది. ఎట్టకేలకు ఆ మొండి బకాయిలు చెల్లించే పని ప్రారంభం కావటంతో రుణం పొందేందుకు మార్గం సుగమమైంది. రెండు రోజుల కింద దీనిపై ఆ బ్యాంకు బోర్డు సమావేశంలో చర్చించి, రుణాన్ని మంజూరు చేయాలని తీర్మానించినట్లు తెలిసింది. ఆ మొత్తం అందితే గానీ జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఈసారి ఆర్థిక సాయం బదులు రుణానికి పూచీకత్తు ఇవ్వడం వల్లే ఆర్టీసీకి ఈ పరిస్థితి తలెత్తింది. కాగా, మరో రెండు రోజుల్లో రూ. వెయ్యి కోట్లు చేతికందే అవకాశం ఉందని, అప్పుడే జీతాలు చెల్లిస్తారని సమాచారం. చదవండి:Telangana: పోలీసులకు తీపికబురు -
నెలన్నరలో ఉద్యోగులకు వందశాతం టీకాలు
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, సిబ్బందికి పూర్తిగా కరోనా వ్యాక్సిన్లు వేయించేందుకు ఆర్టీసీ యాజమాన్యం కార్యాచరణ చేపట్టింది. అందుకోసం ఆర్టీసీ డిపోల్లో సోమవారం నుంచి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలుపెడుతోంది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే తమ డ్రైవర్లు, కండక్టర్లు, అందుకు సహకరించే ఇతర సిబ్బందికి వెంటనే కరోనా టీకాలు వేసే ప్రక్రియ చేపట్టింది. ఆర్టీసీలో మొత్తం 51,500 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు 8,117 మంది అంటే 16 శాతం టీకాలు వేయించుకున్నారు. ఇంకా 43,383 మందికి టీకాలు వేయాలి. అందుకు ఉద్యోగుల కోసం ఆర్టీసీ డిపోల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా సోమవారం నుంచి ప్రత్యేకంగా టీకాలు వేసే ప్రక్రియ మొదలుపెడుతున్నారు. అందుకోసం జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య కనీసం నాలుగువారాల వ్యవధి ఉండాలి. కాబట్టి మొత్తం ఉద్యోగులు, సిబ్బంది అందరికీ నెలన్నరలో రెండో డోసుల టీకాలు వేయడం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజన బకాయిలన్నీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 2017–19 మధ్య కాలంలో రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు అప్పటి చంద్రబాబు సర్కారు వేతనాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించకుండా బకాయిపెట్టింది. ఆ మొత్తాలని చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులను గతంలోనే ఆదేశించారు. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు విడతల చెల్లింపులు జరిపిన ఆర్టీసీ అధికారులు చివరి రెండు విడతల బకాయిలను కూడా ఈ నెలాఖరు నాటికి చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో నాలుగేళ్లుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్న 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. సీనియార్టీ ప్రాతిపదికన చెల్లింపులు చంద్రబాబు ప్రభుత్వం 2017–19 మధ్యలో రిటైరైన 5,027మంది ఆర్టీసీ ఉద్యోగులకు రూ.146.4 కోట్ల మేర వేతన బకాయిలు, ఆర్జిత సెలవులు, గ్రాట్యుటీ బకాయిలు చెల్లించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో సీనియారిటీ ప్రాతిపదికన ఆ బకాయిలు చెల్లింపు ప్రక్రియ చేపట్టింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2017 సెపె్టంబర్ 30 మధ్యలో రిటైరైన 1,653 మంది బకాయిలు రూ.33.77 కోట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 27న చెల్లించారు. 2017 అక్టోబరు 1 నుంచి 2018 మార్చి 31 మధ్యలో రిటైరైన 1,069 మంది ఉద్యోగులకు రూ.28.65 కోట్లను ఈ ఏడాది మార్చి 25న చెల్లించారు. మిగిలిన రెండు విడతలను ఈ నెల 27, 30 తేదీల్లో చెల్లించాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. 2018 ఏప్రిల్ 1 నుంచి 2018, సెపె్టంబర్ 30 మధ్యలో రిటైరైన 1,643 మందికి బకాయిల మొత్తం రూ.55.53 కోట్లు ఈ నెల 27న చెల్లిస్తారు. 2018 అక్టోబర్ 1 నుంచి 2019 ఫిబ్రవరి 28న మధ్యలో రిటైరైన 662 మందికి బకాయిల మొత్తం రూ.28.08 కోట్లు ఈ నెల 30న చెల్లిస్తారు. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన ఆదేశించారు. ఆ మేరకు నాలుగు విడతల్లో మొత్తం రూ.146.04 కోట్లు చెల్లించే ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తాం. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు 2013, 2014 సంవత్సరాలకు చెందిన ఆర్జిత సెలవుల మొత్తం రూ.4 5కోట్లు కూడా ఇప్పటికే చెల్లించాం. – ఆర్పీ ఠాకూర్, ఆర్టీసీ ఎండీ -
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన రామచంద్రపురం డిపోను మంత్రి నాని ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అయినప్పటికీ వివిధ యూనియన్లు కార్మికులలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కార్మికులకు సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు అందించడంతోపాటు ఆరోగ్య కారణాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో రిటైర్ కావాల్సిన ఉద్యోగులను ఇతర విభాగాల్లో సర్దుబాటు చేయడం, పెన్షన్ సౌకర్యం ఇంకా మెరుగుపర్చడం వంటి విషయాల్లో ప్రభుత్వం కార్మికులకు అండగా నిలబడుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ విషయాన్ని కూడా పరిశీలించనున్నట్టు తెలిపారు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు బస్సులు నడిపే కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు రామచంద్రపురంలో కొత్త డిపో ఏర్పాటు చేశామన్నారు. బస్సుల పార్కింగ్, డ్రైవర్లకు వసతి సౌకర్యం కల్పించేందుకు అనువుగా సుమారు రూ.16 కోట్లు వెచ్చించి విశాలమైన ప్రాంగణంలో ఈ డిపో నిర్మించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశారని, అందుకు కృతజ్ఞతగా సిబ్బంది సంస్థ పురోగతికి కృషి చేయాలని కోరారు. సిబ్బంది అంతా ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించి ప్రభుత్వానికి గౌరవం తీసుకురావాలన్నారు. ఉద్యోగుల పే ఎరియర్స్ బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) ఎ.కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) కేఎస్ బ్రహ్మానందరెడ్డి, సీఏవోఎన్ వి.రాఘవరెడ్డి, చీఫ్ సివిల్ ఇంజినీర్ శ్రీనివాస్, దూర ప్రాంత సర్వీసుల అధికారి నాథ్, ఏటీఎం సుధాకర్ పాల్గొన్నారు. -
ఆదర్శం నుంచి అధోగతికి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్నో సహకార పరపతి సంఘాల ఆవిర్భావానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఆసియాలోనే ఉన్నత పొదుపు సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం ప్రస్తుతం పతనం అంచుకు చేరుకుంది. ఆర్టీసీ స్వయంగా ఈ సహకార సంఘం పతనాన్ని లిఖిస్తోంది. ఉద్యోగుల వేతనాల్లోంచి పోగు చేసిన రూ. వేల కోట్ల నిధిని ఆర్టీసీ దిగమింగి తిరిగి కట్టకపోవటమే దీనికి కారణం. అత్యవసరాలకు రుణం అందించే నిధి మాయమవడంతో ఆర్టీసీ ఉద్యోగులు బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇక జీతంలో కోత లేకుండా చూసుకుంటే ఎక్కువ అప్పు పుడుతుందన్న ఉద్దేశంతో ఉద్యోగులు ‘అమ్మ’లాంటి సహకార సంఘంలో సభ్యత్వాన్ని వదులుకుంటున్నారు. 48 వేల మంది సభ్యులున్న ఆ పరపతి సంఘం నుంచి ఇప్పటికే 6 వేల మంది సభ్యత్వాలు ఉపసంహరించుకున్నారు. ప్రతినెలా కొత్తగా వందల సంఖ్యలో ఉపసంహరణ దరఖాస్తులందుతున్నాయి. చివరకు ఆర్టీసీలో అత్యున్నత పోస్టుగా భావించే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కూడా సహకార సంఘం నుంచి వైదొలుగుతున్నారు. ఎందుకీ దుస్థితి? రాష్ట్రం విడిపోయే వేళ ఈ సంఘంలో సాలీనా రూ. 3 వేల కోట్లకు పైచిలుకు నిధి జమయ్యేది. దాన్నుంచి లక్ష మందికి రుణాలు అందించేవారు. విభజన తర్వాత తెలంగాణ ఆర్టీసీ పరిధిలోని సీసీఎస్‌కు రూ. 1,500 కోట్ల వాటా వచ్చింది. ఇప్పుడా విలువ రూ. 2 వేల కోట్లను దాటాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా దివాలా దిశలో సాగుతున్న ఆర్టీసీ.. సొంత ఖర్చులకు ఈ నిధిని వాడుకొని చేతులెత్తేసింది. అడపాదడపా కొంత మొత్తం తిరిగి చెల్లిస్తూ ప్రతినెలా పోగయ్యే కొత్త నిధిని వాడేసుకోవడం అలవాటు చేసుకుంది. గత రెండేళ్లుగా తిరిగి చెల్లింపు దాదాపు నిలిచిపోయింది. దీంతో సీసీఎస్ బ్యాలెన్స్ సున్నాగా మారిపోయింది. అప్పట్నుంచి రుణాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం దాదాపు 10 వేల వరకు దరఖాస్తులు పేరుకుపోయాయి. మధ్యలో కోర్టు ఆదేశం మేరకు రూ. 200 కోట్లు తిరిగి జమ చేసిన ఆర్టీసీ... ఆ తర్వాత మళ్లీ మొహం చాటేసింది. ఆ రూ. 200 కోట్లతో కొంత మందికి లోన్లు అందాయి. మిగతా సుమారు 8 వేల దరఖాస్తులు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. తొలిసారి సభ్యత్వాల రద్దు వైపు ఉద్యోగులు.. సీసీఎస్ నుంచి రుణాలు రాకపోవడంతో ఉద్యోగులు గత్యంతరం లేక బ్యాంకుల నుంచో లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచో అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయినా ప్రతి నెలా సీసీఎస్‌కు జమ కట్టే పేరుతో ఆర్టీసీ వారి జీతాల నుంచి 7.5 శాతాన్ని కట్ చేస్తోంది. కానీ ఆ మొత్తాన్ని సీసీఎస్‌కు ఇవ్వకుండా సొంతానికి వాడేసుకుంటోంది. దీంతో వారి జీతం తగ్గి బ్యాంకు రుణం కూడా తక్కువగా ఉంటోంది. అదే ఈ కోత లేకుంటే, అంతమేర రుణం కూడా పెరుగుతుంది. అలాగే తీసుకున్న అప్పు కిస్తీలు కట్టడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఉద్యోగులు సీసీఎస్ నుంచి సభ్యత్వాలు రద్దు చేసుకోవడం ప్రారంభించారు. అలా రద్దు చేసుకుంటే అప్పటివరకు దాచుకున్న మొత్తం కూడా పొందే వీలుంటుంది. చిరుద్యోగులకైతే ఆ మొత్తం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు, పెద్ద ఉద్యోగులకు అంతకంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఆ మొత్తం చెల్లించాలంటే కొత్తగా నిధి పోగు కాకపోతుండటంతో అదీ సాధ్యం కావటం లేదు. కానీ చూస్తుండగానే 6 వేల మంది సభ్యత్వం రద్దు చేసుకున్నారు. మరో 4–5 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతినెలా ఆ సంఖ్య పెరుగుతోంది. ఉలుకూపలుకు లేని సంస్థ.. ఆర్టీసీ చరిత్రలో తొలిసారి ఈ విపరీత పరిణామం నెలకొనడంతో సంస్థ షాక్‌కు గురైంది. దీన్ని ఆపాలంటే మళ్లీ సీసీఎస్‌లో కొత్త నిధి ఏర్పడాలి. దానికి ఆర్టీసీ బకాయిపడ్డ రూ. 1800 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. కానీ ప్రతినెలా జీతాలు చెల్లించేందుకు బడ్జెట్ కేటాయింపుల కోసం ఆర్థిక శాఖ వైపు చూసే ఆర్టీసీ... ఇంత భారీ బకాయి చెల్లించడం వల్ల కాక మిన్నకుండిపోయింది. కళ్ల ముందే సభ్యత్వాలు పెద్ద సంఖ్యలో రద్దవుతున్నా మిన్నకుండిపోయింది. ఇప్పటికే ఆర్టీసీ తీరుపై సీసీఎస్ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. గతంలో కోర్టు సూచన మేరకు రూ. 200 కోట్లను కనాకష్టంగా ఆర్టీసీ చెల్లించింది. ఇప్పుడా కేసు ఇంకా కొనసాగుతోంది. ఆర్టీసీలో ఫైనాన్స్ వ్యవహారాలు చూసే విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి, లీగల్ వ్యవహారాలు చూసే మరో ఉన్నతాధికారి, ఈడీలు కూడా సభ్యత్వం రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసిన విషయం గుప్పుమనడంతో ఇక ఇంతకాలం అందులో పోగైన నిధులు కూడా భవిష్యత్తులో తిరిగి రావేమోనన్న భయంతో సాధారణ ఉద్యోగులు సైతం సభ్యత్వాల రద్దు కోసం పోటెత్తుతున్నారు. ఏమిటీ పొదుపు సంఘం? ఆర్టీసీ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా 7.5 శాతాన్ని సహకార పరపతి సంఘాని (సీసీఎస్)కి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని మినహాయించిన తర్వాతే వారికి జీతాలు అందుతాయి. అలా మినహాయించిన మొత్తాన్ని ఆర్టీసీ ఈ సీసీఎస్‌లో జమ చేయాలి. అలా పోగయ్యే మొత్తాన్ని సీసీఎస్ పాలకవర్గం బ్యాంకుల్లో పెట్టి వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందుతుంది. ఆ మొత్తం నుంచి కార్మికుల కుటుంబ అవసరాల కోసం తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవడం, చదువులు, ఆరోగ్యానకి సంబంధిం చిన ఖర్చులకు ఇస్తుంది. ఉద్యోగులు రిటైరైతే అప్పటి దాకా జమ అయిన మొత్తాన్ని బ్యాంకు రేట్ల స్థాయి వడ్డీతో కలిపి చెల్లిస్తుంది. నాడు వైభవం.. ఉత్తరాదికి చెందిన రైల్వే ఉద్యోగుల బృందం ఆ సంస్థ సందర్శనకు వచ్చి అంతర్గతంగా సహకార పరపతి సంఘం ఎలా ఉండాలో అధ్యయనం చేసింది. ఏడాదిలో రూ.3వేల కోట్లను పొదుపు రూపంలో సేకరించి లక్ష మందికి దరఖాస్తు చేసిన 3రోజుల్లోనే రుణాలు అందిస్తున్న తీరు చూసి అచ్చెరువొందింది. ఠంచన్‌గా రుణాల జమ, మళ్లీ కొత్త రుణాలు... నయాపైసా అవినీతి లేకుండా సాగుతున్న ఆ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయింది. నేడు ప్రశ్నార్థకం.. అంత సమున్నత సంస్థ నిలువునా కూలిపోతోంది. దివాలాకు దగ్గరై మూతపడే దిశగా కదులుతోంది. ఆ సంస్థకు వెన్నెముకగా ఉండే సభ్యులు క్రమంగా సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ఇప్పటికే 6 వేల సభ్యత్వాలు రద్దవగా సగటున ప్రతి నెలా 350 మంది ఉససంహరణ దరఖాస్తులు అందజేస్తున్నారు. వెరసి.. ఆసియాలోనే ఉత్తమ సహకార సంఘాల్లో ఒకటిగా వెలుగొందిన ఆ సంస్థ ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. కూతురు పెళ్లి లోన్ కోసం సభ్యత్వం వదులుకున్నా నా కూతురు పెళ్లి కోసం ఏడాది కింద సీసీఎస్‌కు దరఖాస్తు చేశా. నిధులు లేక ఇవ్వలేదు. దీంతో ప్రైవేటుగా అప్పు తెచ్చా. ఇందుకు ప్రతినెలా రూ. 20 వేల కిస్తీ కడుతున్నా. జీతంలో సీసీఎస్ కోత ఉంటే ఇబ్బందిగా ఉంటోందని దాన్ని రద్దు చేసుకున్నా. ఏడు నెలలు గడుస్తున్నా నాకు అందులో ఉన్న నా సొమ్ము ఇవ్వట్లేదు. – వెంకటేశ్వర్లు, కంట్రోలర్, నల్లగొండ అప్పు తీర్చేందుకు సభ్యత్వం రద్దు చేసుకుంటున్నా పిల్లల చదువుకు రూ. లక్షన్నర, ఇంటి కోసం రూ. లక్షన్నర కోసం రెండు దరఖాస్తులు సమర్పించా. ఏడాదిగా అవి పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రూ. 2 లక్షలు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నా. సకాలంలో జీతం రాక చెక్ బౌన్స్ అవుతుండటంతో కిస్తీల మందం ఉంచేందుకు ప్రైవేటుగా కొంత అప్పు తెచ్చా. అవి కట్టేందుకు జీతం సరిపోక, సీసీఎస్ కటింగ్ లేకుండా ఉండేందుకని సభ్యత్వమే రద్దు చేసుకునేందుకు దరఖాస్తు పెట్టా. – జియాఉద్దీన్, డ్రైవర్ ఇబ్రహీంపట్నం ఇది రైఫీజన్ చిత్రంతో ఉన్న పురస్కారం. సహకార పరపతి సంఘం విధానాలకు ఆద్యుడైన ఈ జర్మనీ మేధావి ఆశయాన్ని సుసంపన్నం చేస్తోందన్న ఉద్దేశంతో ఆర్టీసీ సహకార పరపతి సంఘం ఆయన చిత్రంతో కూడిన ఈ పురస్కారాన్ని పొందింది. ఇప్పుడు సీసీఎస్ గోడకు వేళ్లాడుతూ దాని దయనీయ స్థితికి మూగ సాక్ష్యంగా నిలిచింది. -
టీఎస్ఆర్టీసీలో ఉద్యోగ భద్రత; ఫైలుపై సీఎం సంతకం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఎట్టకేలకు ఉద్యోగ భద్రత అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. 2019లో దీర్ఘకాలం పాటు జరిగిన సమ్మె అనంతరం ఆర్టీసీ ఉద్యోగులతో ప్రగతి భవన్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఉద్యోగ భద్రతపై సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు కొత్త మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. అప్పటి నుంచి అది పెండింగులో ఉండటంతో కొద్ది రోజులుగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైలుపై సీఎం సంతకం చేయటంతో అది త్వరలో అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రేపోమాపో విడుదల కానున్నాయి. చిన్న విషయాలకే సస్పెన్షన్.. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లపై చిన్న చిన్న అంశాలకే ఉద్యోగాలను తొలగించే కఠిన చర్యలు అమలవుతున్నాయి. టికెట్ల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం, టికెట్ల రూపంలో వచ్చిన డబ్బులో పూర్తి మొత్తాన్ని డిపోలో డిపాజిట్ చేయకపోవటం, ప్రయాణికులతో దురుసుగా వ్యవహరించటం వంటివాటికే కండక్టర్లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. టిమ్ యంత్రాలు వచ్చాక డ్రైవర్లు కూడా టికెట్లు జారీ చేస్తుండటంతో వారిపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంటున్నారు. బస్సు నడపటంలో చిన్న చిన్న నిర్లక్ష్యాలకు పాల్పడినా కూడా డ్రైవర్లపై చర్యలుంటున్నాయి. ఇప్పుడేం మార్చారు.. తప్పు చేసిన వెంటనే కఠినచర్య తీసుకోకుండా కొన్నిసార్లు అవకాశం ఇచ్చేలా తాజాగా మార్గదర్శకాలు రూపొందించారు. బస్సులో 100 శాతానికి మించి ప్రయాణికులున్నప్పుడు ఒకరిద్దరికి టికెట్లు జారీ చేయకపోతే వెంటనే చర్యలు తీసుకోరు. అలాగే డబ్బు కాస్త తగ్గినా వెంటనే చర్యలుండవు. రెండు, మూడుసార్లు అదే తప్పు చేస్తేనే సస్పెన్షన్ వేటు పడుతుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ మహిళా కండక్టర్ ప్రయాణికుడితో ‘తెలుగు రానప్పుడు తెలంగాణలో ఎందుకున్నావ్’అన్నందుకే సస్పెండ్ చేశారు. అదే సమయంలో వరంగల్‌లో లేని ఉద్యోగులు ఉన్నట్లుగా చూపి నిధులు స్వాహా చేసిన విషయంలో అధికారిపై చర్యకు మీనమేషాలు లెక్కించారు. ఆ అధికారికి సహకరించారన్న ఆరోపణ ఉన్న మరో ఉన్నతాధికారిని మాత్రం వదిలేశారు. విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో ఓ ఉన్నతాధికారి రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నా కూడా ఎలాంటి చర్యలు లేవు. టికెట్ డబ్బులు కలెక్ట్ చేయకపోవడం, టికెట్ ఇవ్వని సందర్భంలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ కండక్టర్లకు మొదటి దఫా చర్యలు ఉండవు. ఇది పునరావృతం అయితే తొల గించకుండా ఇతర చర్యలు తీసుకుంటారు. డీలక్స్ అంతకన్నా పెద్ద బస్సు అయితే సీట్ల సంఖ్య కంటే ప్రయాణికులు తక్కువున్నప్పుడు ఈ తప్పుకు సస్పెన్షన్ చేస్తారు. రుసుము వసూలు చేసి టికెట్ ఇవ్వకుంటే డీలక్స్ కంటే తక్కువ కేటగిరీ బస్సుల్లో తొలగించకుండా ఇతర చర్యలు తీసుకుంటారు. డీలక్స్ అంతకంటే ఎక్కువ కేటగిరీ బస్సులు అయితే సస్పెన్షన్‌లో ఉంచుతారు. అవసరం అయితే తొలగిస్తారు. ఇలా మార్గదర్శకాల్లో పలు మార్పులు చేశారు. వేధింపులుండవు: మంత్రి పువ్వాడ ఆర్టీసీ కార్మికులను కొందరు అధికారులు చిన్నచిన్న తప్పులకే వేధిస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉద్యో గభద్రతకు అవకాశం కల్పించటం గొప్ప విషయం. వేధింపులు లేకుండా ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది. ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించుకోవచ్చు. సంబంధిత ఫైలుపై సంతకం చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. వేధింపులు లేకుండా మాత్రమే ఉద్యోగ భద్రత, అలా అని తప్పులు చేసినా పట్టించుకోరని అనుకోవద్దు. -
జీతాలివ్వండి మహాప్రభో..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచుతాం.. అని ప్రభుత్వం బీరాలు పలికిందే తప్ప కనీసం సమయానికి జీతాలివ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండగ ఉన్న తరుణంలో తమకు వెంటనే జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకటో తారీఖు దాటిపోయి పది రోజులవుతున్నా జీతాలు చెల్లించకపోవడంతో సిరిసిల్లలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సోమవారం నిరసన చేపట్టారు. జీతాలు పెంచుతున్నట్లు జనాల్లో అపోహలు సృష్టిస్తున్నారే తప్ప చేసిందేమీ లేదని పెదవి విరుస్తున్నారు. ఇంకా ఒక్క రూపాయి కూడా చేతికి రాకపోవడంతో పండగ ఎట్లా జరుపుకునేదని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు పడేట్లు చూడాలని కోరుతున్నారు. (చదవండి: మేం మారం.. మార్చం!) 5న జీతాలివ్వండి సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో లోన్ల విషయంలో చాలా ఇబ్బంది అవుతోంది. పెనాల్టీలు పడుతున్నాయి. కుటుంబాన్ని పోషించుకోలేని దుఃస్థితికి వెళుతున్నాం. కాబట్టి ప్రభుత్వం మా మీద దయ చూపి కనీసం ఐదో తారీఖున జీతాలు పడేలా చర్యలు తీసుకోవాలి. - పాపన్నగారి దేవయ్య, ఆర్టీసీ కండక్టర్, సిరిసిల్ల డిపో -
అప్పు పుట్టేదెట్లా?
శ్రీహరి.. ఆర్టీసీలో డ్రైవర్.. కూతురు పెళ్లి కోసం గతేడాది ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో పొదుపు చేసుకున్న మొత్తం నుంచి రుణం ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. సీసీఎస్‌లో నిధులు లేక రుణమివ్వలేదు. దీంతో గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారి వద్ద రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాడు. లోన్ సకాలంలో అందక అప్పు తీర్చకపోవటంతో వడ్డీ వ్యాపారి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో మధ్యవర్తి ద్వారా బ్యాంకులో రుణం తీసుకుని అప్పు తీర్చాడు. బ్యాంకు రుణం ఇప్పించిన పేరుతో మధ్యవర్తి లక్షకు రూ.10 వేలు చొప్పున కమీషన్ వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు బ్యాంకు అప్పు గొంతుమీద ఉంది. దాని కిస్తీలు కట్టేందుకు నానాఇబ్బంది పడాల్సి వస్తోంది. సురేందర్.. హైదరాబాద్‌లో కండక్టర్.. తన కుమారుడికి ఐఐటీ మద్రాస్‌లో సీటొచ్చింది. అందుకు వెంటనే రూ.లక్షన్నర చెల్లించాలి. విద్యా రుణం కోసం ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో దరఖాస్తు చేసుకుంటే డబ్బులు లేవన్నారు. దీంతో గత్యంతరం లేక వడ్డీవ్యాపారి నుంచి రూ.2 లక్షలు అప్పు తెచ్చాడు. మూడు నెలల్లో తీర్చేస్తానన్న హామీతో అప్పు పుట్టింది. కానీ ఇప్పటికీ పరపతి సంఘం లోన్ రాకపోవటంతో ఆ అప్పు తీర్చలేక, వడ్డీ వ్యాపారి ఒత్తిడి భరించలేక సతమతమవుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఇదీ ప్రస్తుతం ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) పరిస్థితి. అందులో కార్మికులు పొదుపు చేసుకున్న మొత్తాన్ని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకోవటంతో రెండేళ్లుగా నిధులు లేకుండా పోయాయి. కుటుంబ అత్యవసరాల కోసం ఉద్యోగులు రుణం పొందాలంటే వీల్లేకుండా పోయింది. ప్రస్తుతం సీసీలో కుటుంబ అత్యవసరాలకు సంబంధించి రుణాల కోసం ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు ఏకంగా 11,800లకు చేరుకున్నాయి. ఈ దరఖాస్తులన్నింటికీ సంబంధించి రుణాలు ఇవ్వాలంటే రూ.300 కోట్లు కావాలి. సీసీఎస్‌కు ఆర్టీసీ బకాయిపడ్డ రూ.776 కోట్లలో భాగంగా వాటిని చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీ ఆ నిధులను పెండింగులో పెట్టడం ఉద్యోగులకు శాపంగా మారింది. ఇదీ జరిగింది.. ఆర్థిక పరిస్థితి సరిగా లేక చాలాకాలంగా అందుబాటులో ఉన్న నిధులన్నింటినీ ఆర్టీసీ వాడుకుంటోంది. ఈ క్రమంలో ఉద్యోగుల (కార్మికుల)కు సంబంధించిన సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను కూడా వాడేసుకుంది. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు వారి జీతాల నుంచి ప్రతినెలా సీసీఎస్‌కు 7.5 శాతం చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని మినహాయించిన తర్వాతే వారికి ఆర్టీసీ జీతాలు చెల్లిస్తుంది. అలా మినహాయించిన మొత్తాన్ని సీసీఎస్‌లో జమ చేయాలి. అలా పోగయ్యే మొత్తాన్ని సీసీఎస్ పాలకవర్గం కారి్మకుల కుటుంబ అవసరాలకు రుణాలు మంజూరు చేస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవటం, చదువులు, ఆరోగ్య సంబంధిత ఖర్చులకు వాడతారు. ఈ నిధులన్నింటినీ ఆర్టీసీ వాడేసుకోవటంతో సీసీఎస్ ఖజానా ఖాళీ అయింది. దీంతో గతేడాది జనవరి నుంచి ఆ రుణాలు ఇవ్వటం ఆపేశారు. తొలుత 18 వేల దరఖాస్తులు పేరుకుపోగా, ఇటీవల కొంత మందికి అతి కష్టమ్మీద రుణాలిచ్చారు. జూన్ నుంచి 11,800 దరఖాస్తులు పెండింగులో ఉండిపోయాయి. (చదవండి: ఆర్టీసీ నిధులన్నీ హాంఫట్! ) ఆదాయం పెరిగితేనే.. ఇటీవల కార్గో బస్సులు ప్రారంభించిన ఆరీ్టసీ.. సరుకు రవాణా ద్వారా నిత్యం రూ.10 లక్షలకు పైగా ఆదాయం పొందుతోంది. పెట్రోల్ బంకులు సొంతంగా ఏర్పాటు చేసి రూ.25 లక్షల ఆదాయం సమకూర్చుకుంటోంది. అయితే సీసీఎస్‌కు ఉన్న బకాయి పెద్దది కావటంతో ప్రభుత్వం సాయం చేస్తేనే తీరే పరిస్థితి కని్పస్తోంది. గత జనవరిలో ప్రభుత్వ పూచీకత్తుపై రూ.650 కోట్ల బ్యాంకు రుణం వచ్చినా అది కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలకే ఖర్చయింది. దీంతో సీసీఎస్ బకాయిలు ఉండిపోయాయి. సీసీఎస్ దాఖలు చేసిన కోర్టు కేసులో కంటెమ్ట్ రావటంతో ఇటీవల రెండు దశలుగా ఆర్టీసీ రూ.50 కోట్లు, రూ.85 కోట్లు సీసీఎస్‌కు చెల్లించి చేతులెత్తేసింది. పెండింగులో ఉన్న కోర్టు ధిక్కార కేసు కొట్టేయాల్సిందిగా హైకోర్టులో ఆర్టీసీ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇంకా పెద్ద మొత్తం లో బకాయిలు పెండింగులో ఉన్నందున మిగతా మొత్తం చెల్లించే లా ఆదేశించాలంటూ సీసీఎస్ కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. మధ్యవర్తుల దందా.. సీసీఎస్‌లో నిధులు లేకపోవటంతో కొందరు దళారులు అక్కడే తిష్టవేసి దందాకు పాల్పడుతున్నారు. మధ్య వర్తిత్వం నెరిపి బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తూ లక్షకు రూ.10 వేలు చొప్పున కమీషన్ దండుకుంటున్నారు. ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా వసూలు చేసుకుంటుండటం విశేషం. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ రవాణాకు వజ్ర?) చిల్లిగవ్వ లేదు ఆరీ్టసీ సీసీఎస్ పరిస్థితి దుర్భరంగా మారింది. నయా పైసా నిల్వ లేదు. రుణాల కోసం 11 వేలకు పైగా దరఖాస్తులు పేరుకుపోయి ఉన్నాయి. ఉద్యోగులు నిత్యం మా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. బకాయిల కోసం మేం ఆర్టీసీ చుట్టూ తిరుగుతున్నాం. –బి.మహేశ్, ఆర్టీసీ సహకార పరపతి సంఘం కార్యదర్శి నిధులు రాగానే ఇస్తాం కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆర్టీసీ బస్సులు తిరుగుతూ క్రమంగా ఓఆర్ పెరుగుతోంది. దీంతో రోజువారీ ఆదాయం కూడా మెరుగవుతోంది. రుణం కోసం ప్రభుత్వాన్ని కూడా కోరాం. అవి రాగానే సీసీఎస్‌కు బకాయిలు చెల్లిస్తాం’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త
-
ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్తను అందించారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటి కోరకు దాదాపు 120 నుంచి 130 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై త్వరలో విధానపర నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పార్సిల్ సర్వీసుల బిజినెస్ 1 మిలియన్ దాటిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఇకపై హైదరాబాద్ లో 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్ ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్ ఆర్టీసిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో గాడిన పడుతూ లాభాల బాట పడుతున్న ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని, అయినా వెనకడుగువేయకుండా ఆర్టీసి ని తిరిగి బతికించుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తున్నది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భధ్రతనిస్తున్నది. ఇటీవల విద్యుత్ శాఖలో ప్రయివేటు భాగస్వామ్యం పెంచాలని ఎవరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. పైగా వేలాది మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యలరైజ్ చేసింది. ఆధారపడిన కుటుంబాలను కాపాడింది. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ సహా, ప్రభుత్వ రంగం సంస్థలను ప్రయివేటు పరం చేసుకుంటూ వస్తున్నది. అయినా తెలంగాణ ప్రభుత్వం వెకకకు పోలేదు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటుంది. నేనుంత కాలం ఆర్టీసీని బతికించుకుంటా అందులో భాగంగా ఆర్టీసీ సంస్థను బతికించుకోని తిరిగి గాడిన పెట్టేదాక నీను నిద్రపోను. నేనుంత కాలం ఆర్టీసీని బతికించుకుంటా. ఆర్టీసీ మీద ఉద్యోగులు సహా ఆధారపడిన కటుంబాలు పెద్ద సంఖ్యలో వున్నాయి. దాంతో పాటు పేదలకు ఆర్టీసీ అత్యంత చౌకయిన రవాణా వ్యవస్థ. ఈ కారణాల చేత ప్రభుత్వం లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజా రవాణా వ్యవస్థ, ఆర్టీసిని కాపాడుకోవాలనుకుంటున్నది. ప్రభుత్వం ఆర్టీసి కి ఆర్ధికంగా అండగా నిలుస్తుంది. ఆర్టీసి కార్మికులకు ఇప్పటకే పెండింగులో వున్న రెండు నెల్ల జీతాలను తక్షణమే చెల్లించాలి .అందుకు తక్షణమే ఆర్ధికశాఖ 120 కోట్ల రూపాయలను విడుదల చేయాలి..’’ అని సిఎం స్పష్టం చేశారు. లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు కరోనా భయంతో కొంత, వ్యక్తిగత వాహనాల వాడకం పెరిగిపోయిన కారణం చేత, కొన్ని నెలలుగా ఆర్టీసీలో ఆక్యేపెన్సీ రేషియో తగ్గిపోయిందని తద్వారా ఆర్టీసీ తిరిగి నష్టాల బాటపట్టిందని అధికారులు సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ కు వివరించారు. కాగా, కరోనా కష్టాలను దాటుకుంటూ తగు నిర్ణయాలను తీసుకోవాలని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్టీసీకి తిరిగి కోరోనా ముందటి పరిస్థితిని తీసుకురాగలమో అధికారులు విశ్లేషించుకోవాలని సిఎం ఆదేశించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని ఈ సందర్బంగా సీఎం తెలిపారు. రాను రాను భవిష్యత్తులో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవల తో లాభాలను గడిస్తుందనిఆశాభావం వ్యక్తం చేశారు. కార్గో సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే మిలియన్ పార్సెల్ ట్రాన్స్ పోర్టు చేసిన రికార్డును ఆర్టీసీ సొంతం చేసుకోవడం పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడను అధికారులను అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తెలంగాణ ఆర్టీసీకి అధనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని, అందుకు ఆర్టీసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ అధికారులు, సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘కరోనా అనంతర పరిస్థితులనుంచి వొక్కొక్క వ్యవస్థ గాడిన పడుతున్నది. ప్రజలు బైటికొస్తున్నరు. హోటల్లు దాబాలు తదితర ప్రజావసరాల రంగాలు తిరిగి కోలుకుంటున్నవి. జన సంచారం క్రమ క్రమంగా పుంజుకుంటున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆర్టీసిని తిరిగి ఆదరించాలంటే ఎటువంటి విధానాలను అవలంభించాల్నో లోతుగా చర్చించండి.’’ అని సీఎం అధికారులను ఆదేశించారు. హైద్రాబాద్ సిటీలో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా హైద్రాబాద్‌కు జిల్లాల నుంచి వచ్చి పోయే ప్రయాణీకులకు రవాణా భరోసా దొరుకుదుందని, అందుకోసం హైద్రాబాలో బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలని సిఎం తెలిపారు. ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్.. సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్., సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు , రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంవో అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు ,ఆర్టీసి ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి నాని
సాక్షి, అమరావతి: కరోనాతో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. విజయవాడలో కరోనాతో మరణించిన ఆర్టీసీ ఉద్యోగులు శుభాకరరావు, ఎస్కే లాల్ కుటుంబాలను రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు పరామర్శించారు. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున చెక్కును అందించారు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కోవిడ్–19 సమయంలో ఆర్టీసీ కార్మికులు విశేష సేవలందించారని కొనియాడారు. ఆయనేమన్నారంటే.. ఆర్టీసీలో 4,700 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 73 మంది మరణించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ నుంచి వచ్చే బకాయిలు, ఇతరత్రా కాకుండా సంస్థ ఉద్యోగులు ఒక రోజు వేతనం ఇస్తున్నారు.ఆ 73 మంది కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున అందిస్తాం. (వాళ్లుండాల్సింది ఫీల్డ్‌లోనే.. సచివాలయాల్లో కాదు) -
ఉద్యోగులకు పల్స్ ఆక్సీమీటర్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారిన పడిన ఆర్టీసీ ఉద్యోగులకు పల్స్ ఆక్సీమీటర్లతో కూడిన కరోనా కిట్ పంపిణీ చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. రెండు రోజుల్లో ఆ కిట్లు సరఫరా కానున్నాయి. ఇప్పటికే ఆర్టీసీలో దాదాపు 450 మంది కోవిడ్ బారినపడ్డారు. వీరిలో దాదాపు 20 మందికిపైగా చనిపోగా మిగతావారు కోలుకున్నారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చాలా అధికంగా ఉండటంతో ఆర్టీసీలో కరోనా బారిన పడుతున్నవారి సం ఖ్య పెరుగుతోంది. ఒత్తిడి, వయసు ప్రభావం కారణంగా డ్రైవర్, కండక్టర్లలో చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారికి పల్స్ ఆక్సీమీటర్లు ఉచితంగా అందించాలని మంత్రి పువ్వాడ నిర్ణయించారు. శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంటే, ముందే గుర్తించి వెంటనే ఆసుపత్రిలో చేరితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్న వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి కిట్.. టిమ్స్‌లో వైద్యం కోవిడ్ సోకితే ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకునేవారికి వైద్యులు సూచించే మందులు, శానిటైజర్, మాస్కులు తదితరాలతో కూడిన కిట్‌ను పంపిణీ చేయనున్నారు. వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగానే వారికి ఈ కిట్ అందిస్తారు. ఆరోగ్య సమస్యలు లేకుంటే ఇంట్లోనే చికిత్స పొందుతారు. ఏవైనా సమస్యలు పెరిగి వైద్యుల పర్యవేక్షణ అవసరమైతే ఆసుపత్రికి తరలిస్తారు. ఇందుకోసం గచ్చిబౌలి లోని టిమ్స్‌ను గుర్తించారు. మంత్రి సూచన మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ వైద్య అధికారులతో చర్చించారు. ప్రస్తుతం టిమ్స్‌లో పడకలు కావాల్సినన్ని ఖాళీగా ఉన్నాయని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో వైద్యం అవసరమైనవారు అప్పటికప్పుడు అటు, ఇటు వెతుక్కునే సమస్య లేకుండా నేరుగా టిమ్స్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అవకాశం కల్పించండి: కార్మిక సంఘాలు ‘మంత్రిగారు టిమ్స్‌లో చేరేలా చర్యలు తీసుకున్నారు. కానీ, టిమ్స్‌కు ఎవరైనా వెళ్లొచ్చు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండాలి. ఇందుకోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్సకు అవకాశం కల్పించాలి’అని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. వెయ్యి ఆక్సీమీటర్లు కొంటాం: పువ్వాడ ‘ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నాం. కోవిడ్ బారిన పడితే ఎక్కువగా శ్వాస సమస్యలు వస్తున్నాయి. నిరంతరం పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించుకుంటే సమస్యను ముందే గుర్తించొచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. వేయి వరకు ఆక్సీమీటర్లు కొని అందిస్తాం. అవసరమైతే మరిన్ని కొంటాం’ -
మాస్క్ లేకుండానే రైట్ రైట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని కరోనా వణికిస్తోంది. శనివారం ఒక్కరోజే ముగ్గురు ఉద్యోగులు మరణించగా ఇప్పటివరకు ఆ సంఖ్య 30కి చేరింది (అనధికారిక సమాచారం). మరో 250 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ సిటీ మినహా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సర్వీసులు తిరుగుతుండటంతో అన్ని డిపోల్లో సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. నగరంలోని అన్ని డిపోలకు నిత్యం 30 శాతం మంది సిబ్బంది హాజరవుతున్నారు. తాజా పరిణామాలతో సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదీ అవగాహన? బెంగళూరు హైవేపై నగర శివారులో కంట్రోలర్‌గా పనిచేసే ఉద్యోగి ఇటీవల వైరస్ బారినపడి చనిపోయారు. ఆయన మాస్కు సరిగా ధరించేవాడు కాదన్నది ఆ తర్వాతగాని అధికారులు గుర్తించలేకపోయారు. మాస్కు ధరించి నిత్యం వాట్సాప్‌లో ఫొటో పంపాలని సంబంధిత డిపో మేనేజర్ ఆదేశాలుండటంతో కేవలం ఫొటో కోసమే ధరించేవాడు, ఆ తర్వాత తొలగించేవాడని గుర్తించారు. ఆయనకు ఆస్తమా సమస్య ఉండటంతో మాస్కు ధరిస్తే సరిగా ఊపిరాడదన్న ఉద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఫలితం.. వైరస్ సోకి శ్వాసతీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది తలెత్తి చనిపోయాడు. ఇంత జరుగుతున్నా.. కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆర్టీసీ ఇప్పటి వరకు సిబ్బందిలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టలేదు. లాక్డౌన్ ప్రారంభమైన కొత్తలో కొన్ని కరపత్రాలను పంచటం మినహా తర్వాత చర్యలు శూన్యం. దీంతో చాలామంది డ్రైవర్లు, ప్రయాణికులతో నేరుగా ప్రమేయం ఉండే కండక్టర్లలో కొందరు మాస్కులు కూడా సరిగా ధరించట్లేదు. నిర్లక్ష్యమే రిస్క్‌లో పడేస్తోంది వరంగల్‌కు చెందిన ఓ డ్రైవర్ తాను కూర్చునే ప్రదేశం చుట్టూ ప్లాస్టిక్ కాగితాన్ని అతికించి క్యాబిన్‌లాగా మార్చుకున్నాడు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్న వారు కనిపిస్తున్నా.. చాలామంది ఊపిరాడట్లేదనో, చుట్టూ ఉన్నది తోటి ఉద్యోగులే కదా అన్న భావనతోనో, అవగాహన లేకో మాస్కులు సరిగా ధరించట్లేదు. ప్రస్తుతం నగరంలో ఆర్టీసీ సిటీ బస్సులు నడవట్లేదు. కానీ ఇటీవల ముషీరాబాద్ సహా పలు డిపోల్లో పనిచేసే సిబ్బంది కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం చనిపోయిన వారిలో సగం మంది నగరానికి చెందినవారే. డిపోలకు వచ్చాక వీరు మాస్కులను మెడ వరకు లాగేసి తోటి సిబ్బందే కదాని కలివిడిగా గడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం కూకట్పల్లి డిపో ఉద్యోగి ఒకరు తల్లి ఆరోగ్యరీత్యా ఆసుపత్రుల చుట్టూ తిరిగి వైరస్ బారినపడ్డాడు. లక్షణాలు కనిపించినా వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. ఇంతలో ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రికి వెళ్లేలోపే చనిపోయాడు. మాస్కులు సరిగా ధరించటం, శానిటైజర్ వినియోగం, లక్షణాలు కనిపిస్తే అనుసరించాల్సిన తీరుపై ఆర్టీసీ అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు. కొందరు డిపో మేనేజర్లు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి నిత్యం సూచనలు మాత్రం అందిస్తున్నారు. బస్సులు నడవనప్పుడు సిబ్బంది ఎందుకు? ప్రస్తుతం సిటీలో బస్సులు తిరగట్లేదు. పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, విమాన ప్రయాణికుల తరలింపు కోసమే బస్సులు నడుస్తున్నాయి. మిగతావన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కానీ అన్ని డిపోల్లో 15 శాతం మందికంటే ఎక్కువే విధులకు హాజరవుతున్నారు. డిపోల్లో బస్సులు నిండిపోయి ఉండటంతో వీరు కూర్చునే స్థలం కూడా ఉండట్లేదు. ఫలితంగా భౌతికదూరం కరువవుతోంది. ఇదే ప్రమాదకరంగా మారుతోంది. కాగా, వందల మంది సిబ్బంది వైరస్ బారినపడుతున్న నేపథ్యంలో ఏదైనా ఆర్టీసీ భవనంలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేయాలని, సిబ్బందికి ఫేస్‌షీల్డ్‌లు, మెరుగైన మాస్కులు అందించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హన్మంతు కోరారు. మృతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. -
టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా కలవరం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి ఏ రంగాన్ని వదలి పెట్టడం లేదు. సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకు కరోనా పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో 30 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వగా, కరోనాతో పోరాడి నలుగురు మృత్యువాతపడ్డారు. ఆర్టీసీలో కరోనా వెంటాడుతుంటే యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనియన్లు లేకపోవడంతో తమ బాధలను ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. (ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ రూ.లక్ష!!) సింగరేణి-రైల్వే తరహాలో తార్నాక హాస్పిటల్లో ప్రత్యేకంగా 100 పడకలను కరోనాకు కేటాయించాలని కార్మికులు విజ్ఙప్తి చేశారు. నిత్యం ప్రజల్లో తిరిగే కండక్టర్లు, డ్రైవర్లకు ప్రభుత్వం కనీస వసతులను కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు ఆర్ఠీసీ బస్సులో పాజిటివ్ రోగులు తిరిగినట్లు నిర్ధారణ అయ్యిందని, ఆర్టీసీ కార్మికులకు సైతం 50 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. (చొక్కాలు చింపుకున్న డాక్టర్లు) -
క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ
సాక్షి, హైదరాబాద్ : కార్మిక శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం శాసన మండలిలో క్షమాపణలు చెప్పారు. ఆర్టీసీ అధికారులు... ప్రజా ప్రతినిధుల ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, వారికి సమాచారం అందివ్వకపోవడం తప్పేనని ఆయన అంగీకరించారు. మండలిలో ఆర్టీసీపై మంత్రి పువ్వాడ మాట్లాడుతూ...ఆర్టీసీ పార్సిల్ సర్వీసుల ద్వారా సంవత్సరానికి రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. నెలాఖరుకు 100 కార్గో బస్సులు సిద్ధం చేస్తామని అన్నారు. ఆర్టీసీకి రోజుకు కోటిన్నర లాభం వస్తోందని, మంత్రి పేర్కొన్నారు. గతంలో రూ. 11 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 12.50కోట్ల ఆదాయం వస్తుందన్నారు. గత రెండు నెలల నుంచి ఆర్టీసీ ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఆర్టీసీ సమ్మె కాలపు జీతాలు రూ. 235 కోట్లు చెల్లించడంపై ఆర్టీసీ జెఏసీ నాయకులే కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సీసీఎస్ బకాయిలు, పీఎఫ్ బకాయిల చెల్లింపు కోసం రూ. 600 కోట్లు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగాలని అధికారులకు సూచించామని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించామని, జూలై నాటికి రూ. 20 కోట్లతో ఖమ్మం జిల్లా కేంద్రంలో అధునాతన బస్టాండ్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. కాగా ఎమ్మెల్సీల సీడీసీ నిధుల కోసం అందరూ సభ్యులకు లేఖలు రాయాలని మంత్రికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. వరంగల్‌ను టూరిస్ట్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ‘త్వరలోనే రామప్పకు యునెస్కో గుర్తింపు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధిలో నిర్లక్ష్యం లేదు. రామప్ప ఐలాండ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాము. తెలంగాణలోని అనేక ప్రాంతాలను పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తోంది. బోగత, మేడారం, తాడ్వాయి, సోమశిల, నాగార్జున సాగర్ వద్ద కాటేజ్‌ల నిర్మాణం, బోటింగ్ సౌకర్యం కల్పించాం. భద్రాచలం రాముని కల్యాణం సందర్భంగా హెలికాప్టర్ సేవలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటాము’. అని పేర్కొన్నారు -
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ స్థితిని గాడిలో పెట్టడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనే విషయం మరోమారు రుజువైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చెప్పిన విధంగా సమ్మె కాలానికి సంబంధించిన జీతాల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం శుభపరిణామం అన్నారు. (ఒక్క కార్మికుడిని సస్పెండ్ చేయలేదు) కాగా.. సమ్మె కాలానికి జీతాల చెల్లింపుల కోసం రూ. 235 కోట్లు విడుదల చేసి ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని పువ్వాడ తెలిపారు. ఇది ఆయన పెద్ద మనసుకు నిదర్శనమన్నారు. ఒకే దఫాలో నిధులను విడుదల చేయడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. మార్చి 31వ తేదీలోగా సమ్మె కాలం జీతభత్యాలు ఉద్యోగులకు చెల్లించనున్నట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్టీసీ అభ్యున్నతి కోసం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల బాగోగుల కోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని, సంస్థ ఆర్థిక స్థితిని మరింత మెరుగు పరచడానికి సమిష్టిగా ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో చెప్పినట్లుగానే బడ్జేట్‌లో ఆర్టీసీకి రూ. 1000 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. సంస్థ పురోగతికై అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేసి సీఎం ఆశించిన ఫలితాలు తీసుకురావాలని మంత్రి సూచించారు. -
హమ్మయ్య.. ‘పరపతి’ దక్కింది
సాక్షి, హైదరాబాద్ : పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇళ్ల నిర్మాణం తదితరాల కోసం కొంతకాలంగా గుట్టలుగా పేరుకుపోయిన ఆర్టీసీ ఉద్యోగుల దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం లభించబోతోంది. తమ జీతాల నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేసి ఏర్పాటు చేసుకున్న నిధిని ఆర్టీసీ సొంత అవసరాలకు వాడేసుకోవటంతో ఈ సమస్య వచ్చి పడింది. తిరిగి దాన్ని చెల్లించే పరిస్థితి లేకపోవటంతో సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఉద్యోగుల దరఖాస్తులు పేరుకుపోవడంతో రుణాలు రాక వారి కుటుంబాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు బ్యాంకు నుంచి రుణం పొంది ఆ బకాయిలను తీర్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అవి రాగానే ఉద్యోగుల దరఖాస్తులు కొలిక్కిరానున్నాయి. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేక ఉద్యోగుల సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను వాడేసుకుంటూ వచ్చింది. అలా ఏకంగా రూ.560 కోట్లు వినియోగించుకోవటంతో ఆ నిధి కాస్తా ఖాళీ అయింది.దీంతోపాటు ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్)కు సంబంధించి కూడా దాదాపు రూ.800 కోట్లు వాడేసుకుంది. దీనిపై ఇటీవల హైకోర్టు కూడా తీవ్రంగా పరిగణించింది. వాడేసుకున్న భవిష్య నిధి మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఈ రెండు బకాయిలను వెంటనే చెల్లించాల్సిన పరిస్థితి ఆర్టీసీ ముందుంది. కానీ చేతిలో నిధులు లేక బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు రూ.1400 కోట్లు బ్యాంకు రుణాలు పేరుకుపోయి ఉన్నాయి. వాటి వడ్డీ కూడా కొంతకాలంగా సరిగ్గా చెల్లించటం లేదు. బ్యాంకు రుణాలు సహా ఇతర అప్పులకు గాను సాలీనా రూ.180 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఉంది. అదీ చెల్లించటం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ రుణం అంటే బ్యాంకులు స్పందించడం లేదు. ఇటీవల ఆర్టీసీ బస్సుల చార్జీలు పెంచటంతో ఒక్కసారిగా ఆదాయం పెరిగింది. కొన్ని పొదుపు చర్యలతో ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా ఆదాయం అదనంగా పెరిగినట్టయింది. ఈ నేపథ్యంలో ‘పరపతి’పెరగటంతో బ్యాంకులు అప్పులు ఇస్తాయన్న నమ్మకం ఆర్టీసీకి కలిగింది. గతంలో రూ.600 కోట్ల అప్పు కోసం ప్రభుత్వ పూచీకత్తు కావాలంటూ చేసిన ప్రతిపాదన పెండింగులో ఉండటంతో, దాన్ని మరోసారి ప్రభుత్వం ముందుంచింది. కానీ దానికి స్పందన రాలేదు. బుధవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ ఈడీలు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. సమావేశానంతరం మంత్రి సీఎం కేసీఆర్ కార్యాలయానికి వెళ్లి ఈ విషయంపై చర్చించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటంతో మరో రెండుమూడు రోజుల్లో రూ.600 కోట్ల పూచీకత్తు లోన్‌కు సంబంధించి ఉత్తర్వు విడుదల కాబోతోంది. ఆ వెంటనే రుణం పొంది æ సీసీఎస్, పీఎఫ్ బకాయిలను ఆ మేరకు తీర్చాలని నిర్ణయించారు. వారంలో ఉద్యోగ భద్రత విధివిధానాలు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించి ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లో విధివిధానాలను రూపొందించాలని మంత్రి అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బస్సుల్లో ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే కండక్టర్లను సస్పెండ్ చేసే విధానం కొనసాగుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన ఉంది. చిన్నచిన్న ప్రమాదాలకు కూడా డ్రైవర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటాన్నీ వారు తప్పు పడుతున్నారు. ఈ రెండు విషయాల్లో వారిలో ఉద్యోగ భద్రత ఉండేలా చూడనున్నారు. టికెట్ తీసుకునే బాధ్యత ఇక ప్రయాణికులదే. తీసుకోకుంటే వారిపైనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు రానున్నాయి. కండక్టర్లు, డ్రైవర్లపై క్రమశిక్షణ చర్యల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై త్వరలో స్పష్టత రానుంది. ఇక డిపోల్లో ఉద్యోగులను వేధిస్తున్నారంటూ అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నందున వీటిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగులతో స్నేహభావంతో మెలిగి సంస్థ పురోగతి కోసం యత్నించాలని ఆయన ఆదేశించారు. ఇక నుంచి ప్రతి మంగళవారం ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలు, ఇతర అత్యవసర సెలవుల విషయంలో మానవతాధృక్పథంతో స్పందించాలన్నారు. బస్సుల్లో సిబ్బంది ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రత్యేక సందర్భాల్లో వారిని విధిగా విష్ చేయాలని ఎండీ సునీల్‌శర్మ పేర్కొన్నారు. సిటీ బస్టాపులు, కూడళ్లలో బస్సుల వివరాలు తెలిపే ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ఈడీలు పురుషోత్తం, వినోద్, టీవీరావు, యాదగిరి, వెంకటేశ్వరరావు, ఎఫ్ఏ రమేశ్, ఎస్ఎల్ఓ శ్రీలత, సీపీఎం సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో ఉద్యోగుల భద్రతే ప్రధాన ఎజెండా
సుందరయ్య విజ్ఞానకేంద్రం: ఆర్టీసీ ఉద్యోగుల భద్రతే మా ప్రధాన అజెండా అని, ఏ ఉద్యోగినీ అకారణంగా తొలగించకూడదనేది తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్‌ను సక్రమంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీసీ కల్యాణ మండపంలో తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సుదీర్ఘకాలంగా ఎలాంటి ప్రమాదాలు చేయని డ్రైవర్లను రోడ్డు భద్రత అవార్డులతో పాటు నగదు పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రయాణ మే సురక్షితమైందని అన్నారు. తాగి వాహనాలు నడపటం, వేగంగా నడపటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఆర్టీసీని మనం రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుందని చెప్పారు. డ్రైవర్ల భాగస్వామ్యంతోనే.. ఆర్టీసీ అభివృద్దిలో డ్రైవర్ల భాగస్వామ్యం కూడా ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు.ప్రమాదాలు జరగకుండా చూడటమే కాదని, ప్రయాణికులతో మాట్లాడే తీరూ ముఖ్యం అన్నారు. రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. ప్రజా రవాణాలో ఆర్టీసీ అత్యంత ముఖ్యమైంది, భద్రతతో కూడుకుందన్నారు. అనంతరం హైదరాబాద్ దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన జి.ఎన్.రెడ్డికి స్టేట్ ప్రథమ, మిర్యాలగూడ డిపోకు చెందిన ఎ.ఎస్.ఎన్.రెడ్డికి స్టేట్ ద్వితీయ, సికింద్రాబాద్ కుషాయిగూడ డిపోకు చెందిన కె.ఆర్.రెడ్డిలకు స్టేట్ తృతీయ బహుమతితో పాటు నగదు పురస్కారాలను అందజేశారు. జోనల్, రీజియన్ల వారీగా ఉత్తమ డ్రైవర్లను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేశారు. -
ఒక్క కార్మికుడిని సస్పెండ్ చేయలేదు: మంత్రి పువ్వాడ
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులుకు మార్చి 31 లోపు సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో కొత్త ఛాంబర్‌ను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, సందీప్ కుమార్ సుల్తానీయ, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఈ-బిడ్డింగ్ విధానం ప్రారంభించామని తెలిపారు. ఫాన్సీ నంబర్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, వాహనాలకు నెంబర్ ఫోర్ట్ బులిటీకి ప్రయత్నిస్తున్నామన్నారు. రవాణా శాఖ 59 ఆన్లైన్ సర్వీస్‌లు అందిస్తుందన్నారు. ఆర్టీసీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని, కేసీఆర్ ఫోటోలతో త్వరలో కొత్త స్లొగన్స్ అవిష్కరిస్తామని మంత్రి తెలిపారు. కార్గో సేవలు ఫిబ్రవరి 10 లోపు ప్రారంభిస్తామని, కార్గో సేవల ధరలను ఇంకా నిర్ణయించలేదని అన్నారు. అలాగే ఒక్కో ఆర్టీసీ డిపోని ఒక్కో అధికారి దత్తత తీసుకుంటారని తెలిపారు. సంక్రాంతి ఒక్క రోజే ఆర్టీసీ రూ. 16.8 కోట్ల ఆదాయం వచ్చిందని, మేడారం జాతరకు 4 వేల బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. జనవరి 31న రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకుని రోడ్డు ప్రమాదాలు నివారించాలని సూచించారు. ఈసారి బడ్జెట్లో రూ. 1500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి కోరుతున్నట్లు వెల్లడించారు. చదవండి : ఆర్టీసీలో సంక్షేమ బోర్డులు ఆర్టీసీ ఉద్యోగ భద్రతే తమకు ప్రధానమన్నారు. మూడు మాసాలుగా ఏ ఒక్క కార్మికుడిని సస్పెండ్ చెయ్యలేదని పువ్వాడ అజయ్ తెలిపారు. ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చమని, ఆర్టీసీ సిబ్బందికి సొంతగా యాజమాన్యం వేతనాలు ఇచ్చిందన్నారు. వాహనాల కొనుగోలు సంఖ్య తగ్గడంతో టాక్స్ రెవెన్యూ పడిపోయిందని పేర్కొన్నారు. మాంద్యం ప్రభావం రవాణా శాఖపై కూడా ఉంటుందన్నారు. ప్రభుత్వానికి రవాణా శాఖ ద్వారా రూ. 3 వేల కోట్ల ఆదాయము వస్తుందని, రవాణా శాఖ ఖర్చు రూ.180 కోట్లు మాత్రనని, ఇంకా ఖర్చులను తగ్గించుకుంటామని చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు పెంచలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. -
ఆర్టీసీలో సంక్షేమ బోర్డులు
గోదావరిఖనిటౌన్ (రామగుండం): ఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ, ఆర్టీసీ సంస్థ సూచనల మేరకు బస్ డిపోలలో సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేశారు. సంక్షేమ బోర్డులో ఎంపిక చేసిన సభ్యులతో ప్రతీ వారం సమావేశం నిర్వహించి డిపో విధులు నిర్వహిస్తు ఉద్యోగులతో వారి సమస్యలపై సమావేశమవుతారు. సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవడం ఈ బోర్డల లక్ష్యం. డిపోకు ఐదుగురు సభ్యలను నియమిస్తారు. డిపో మేనజర్ ఈ కమిటీకి ముఖ్య అధికారిగా వ్యవహరిస్తారు. ఇద్దరు కార్మికులు, డిపో గ్యారేజీ ఇన్చార్జి, డిపో ట్రాఫిక్ ఇన్చార్జి ఇలా మోత్తం ఐదుగురు సభ్యులు ప్రతీవారం సమావేశమై డిపో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌ల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తారు. సమావేశం ఇలా..... ప్రస్తుతం ఆర్టీసీ డిపో నియమించిన సంక్షేమ కమిటీ అన్ని విషయాలలో కీలకంగా పని చేస్తుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించిన విషయాలకు ప్రధాన్యత ఉంటుంది. ఆర్టీసీ పని చేస్తున్న ఉద్యోగుల విధుల కేటాయింపు, జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, సెలవులు, ఇతర అంశాలపై చర్చలు జరుపుతారు. ఏమైన సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే సంస్థ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. ఉద్యోగులకు మరింత మేలు జరిగే విధంగా ఎలాంటి అంశాలనైన ఈ సమావేశంలో పొందుపర్చవచ్చు. వారానికోరోజు, నెలలో నాలుగు రోజు లు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. నెలకు ఒక్కసారి జిల్లా ఆర్ఎం కార్యాలయంలో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేస్తారు. రెండు నెలలకోసారి జోనల్ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్ స్థాయిలో మూడు నెలలకు ఒక్కసారి సమస్యలు పరిష్కరిస్తారు. జిల్లాలో ఇలా... జిల్లాలో గోదావరిఖని, మంథని బస్ డిపోలు ఉన్నాయి. గోదావరిఖని బస్ డిపోలో 129 బస్సు ఉండగా, 640 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మంథని డిపోలో 92 బస్సులు ఉండగా 310 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గోదావరిఖని సంక్షేమ బోర్డు సభ్యులు.. 1. ఎ.కొంరయ్య 2. బి.నారాయణ 3. వి.ఇందిరాదేవి 4. మాధవి 5. డీకే.స్వామి మంథని సంక్షేమ బోర్డు సభ్యులు.. 1. డీఆర్.రావు 2. విజయ్‌కుమార్ 3. బేగం 4.పార్వతమ్మ 5. సడవలయ్య డిపోలలో ఫిర్యాదు బాక్సులు.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన అనంతరం బస్ డిపోలో సూచనల కోసం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ప్రతీ ఉద్యోగి ఈ ఫిర్యాదు బాక్స్‌ను వినియోగించుకోవచ్చు. ప్రతీ కార్మికుని సెవులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్టీసీ సంస్థ కోసం సూచించే ప్రతి అంశాన్నీ ఈ ఫిర్యాదు బాక్స్‌లో వేయవచ్చు. వారంలో జరిగే సమావేశంలో ఈ బాక్స్‌ను తెరిచి ప్రతీ కార్మికుడి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడం ఈ బాక్స్ లక్ష్యం. క్షేత్రస్థాయి అంశాలపై వచ్చిన ఫిర్యాదులను జిల్లాస్థాయిలో జరిగే సమావేశంలో ప్రతిబింబింపజేస్తారు. మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు సంక్షేమ బోర్డులో భాగంగా డిపోలలో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ల కోసం, మహిళ అధికారుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు, సౌకర్యలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రత్యేక అవసరాల కోసం ప్రత్యేక సౌకర్యాలను, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసమే.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ కోసం ఆర్టీసీలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు. దీని కోసం బస్ డిపోలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేశాం. ప్రతీ ఉద్యోగి వారివారి సమస్యలను, సంస్థ అభివృద్ధి కోసం ఇచ్చే సూచనలు స్వీకరించి ప్రతీవారం పరిష్కరిస్తాం. దీంతో డిపోలో ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. – వెంకటేశ్వర్లు, గోదావరిఖని డిపో మేనేజర్