
సాక్షి, హైదరాబాద్: కార్మికుల పనిభారాన్ని తగ్గించకపోవటం, వేతన సవరణ గడువు తీరినా అమలు చేయకపోవ టాన్ని నిరసిస్తూ సోమవారం అన్ని రీజినల్ కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తున్నట్టు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత రాజిరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో జూబ్లీ బస్‌స్టేషన్, ముషీరాబాద్–2 డిపోల వద్ద చేపట్టనున్నామన్నారు.