hunger strikes
-
Global Hunger Report 2022: ఆకలి కేకలు
న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి కేకలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రపంచ ఆకలి సూచిలో మన దేశం ఏకంగా ఆరు స్థానాలు పడిపోయింది. 101 నుంచి 107కు దిగజారిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల కంటే మనం వెనుకబడి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 121 స్థానాలకు గాను భారత్ 107 స్థానంలో ఉన్నట్టుగా 2022 సంవత్సరానికి గాను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెల్లడించింది. చైల్డ్ వేస్టింగ్ రేటులో (పోషకాహార లోపంతో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం) 19.3 శాతంతో ప్రపంచంలోనే భారత్ తొలి స్థానంలో ఉంది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫ్ ఈ ఆకలి సూచి నివేదికని రూపొందించాయి. నివేదిక ఏం చెప్పిందంటే... ► 2021లో ప్రపంచ ఆకలి సూచిలో 116 దేశాలకు గాను భారత్ 101వస్థానంలో నిలిచింది. ఈ ఏడాది 121 దేశాల్లో 107 ర్యాంకుకి చేరుకుంది. 2020లో భారత్ 94వ స్థానంలో ఉంది. ► జీహెచ్ఐ స్కోర్ తగ్గుతూ వస్తోంది.. 2000 సంవత్సరంలో 38.8 ఉన్న స్కోర్ 2014–2022లలో 28.2–29.1 మధ్య ఉంటూ వస్తోంది. ► ఆసియా దేశాల్లో యుద్ధంతో అతాలకుతలమవుతున్న అఫ్గానిస్తాన్ మాత్రమే 109వ ర్యాంకుతో మన కంటే వెనుకబడి ఉంది. జీహెచ్ఐ స్కోరు అయిదు కంటే తక్కువగా ఉన్న దాదాపుగా 17 దేశాలు తొలి పది స్థానాల్లో నిలిచాయి. చైనా, కువైట్‌లు తొలి స్థానాలను దక్కించుకున్నాయి. ► ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్తాన్ (99), బంగ్లాదేశ్ (84), నేపాల్ (81), శ్రీలంక (64) మన కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి ► చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్ (పౌష్టికహార లోపంతో అయిదేళ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు) రేటులో కూడా భారత్ బాగా వెనుకబడి ఉండడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ► భారత్, పాకిస్తాన్, అప్ఘానిస్తాన్‌లో చైల్డ్ స్టంటింగ్ రేటు 35 నుంచి 38శాతం మధ్య ఉంది. ► పౌష్టికాహారలోపంతో బాధపడేవారు 2018–2020లో 14.6శాతం ఉంటే 2019–2021 నాటికి 16.3శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది పౌష్టికాహార లోప బాధితుల్లో 22.4 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. ► పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల వయసు లోపు పిల్లల మరణాలు 2014లో 4.6శాతం ఉంటే 2020 నాటికి 3.3శాతానికి తగ్గాయి. ► భారత్‌లోని ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపాల్లో తగ్గుదల కనిపిస్తోంది. ► ఆహార భద్రత, ప్రజారోగ్యం, ప్రజల సామాజిక ఆర్థిక హోదా, తల్లి ఆరోగ్యం విద్య వంటి అంశాల్లో భారత్‌లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా వేర్వేరు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ► కోవిడ్–19 దుష్పరిణామాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి ప్రపంచ దేశాల్లో ఆకలి కేకల్ని పెంచేస్తున్నాయి. భారత్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టనను దిగజార్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రపంచ ఆకలి సూచిని రూపొందించారని కేంద్ర ప్రభుత్వం ధ్వజమెత్తింది. ఆకలి సూచిని లెక్కించే పద్ధతిలోనే తప్పులు తడకలు ఉన్నాయని విరుచుకుపడింది. ఈ అంశాన్ని ఆహార, వ్యవసాయ సంస్థ దష్టికి తీసుకువెళుతున్నట్టుగా కేంద్ర మహిళా, శిశు అభివద్ధి మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించకుండా భారత్ ప్రతిష్టను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. విరుచుకుపడిన విపక్షాలు దేశంలో రోజు రోజుకి ఆకలి కేకలు పెరిగిపోతూ ఉండడంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఎనిమిదన్నరేళ్లలోనే మోదీ ప్రభుత్వం దేశాన్ని చీకట్లోకి నెట్టేసిందని ధ్వజమెత్తాయి. పెరిగిపోతున్న ధరలు, తరిగిపోతున్న ఆహార నిల్వలు గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి ఆరోపించారు. ఇకనైనా కేంద్రం తాను చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపేయాలన్నారు. -
World Population Day: ప్రభం‘జనం’..800
ప్రపంచ జనాభా ఈ ఏడాది ఒక మైలు రాయికి చేరుకోబోతోంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభా 800 కోట్లు కానుంది. వనరులు చూస్తే పరిమితం. జనాభా చూస్తే అపారం వీరందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పిస్తే అధిక జనాభా విసిరే సవాళ్ల నుంచి బయటపడతామా ? ఐక్యరాజ్యసమితి ఇప్పుడు ఈ దిశగానే కృషి చేస్తోంది. ప్రస్తుతం 795 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. ఈ సారి ప్రపంచ జనాభా దినోత్సవం రోజు ఐక్యరాజ్య సమితి ప్రజల సుస్థిర భవిష్యత్‌పై దృష్టి సారించింది. భూమ్మీద ఉన్న పరిమితమైన వనరులతో తమకున్న అవకాశాలను, హక్కుల్ని వినియోగించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడడంతో ఆ దిశగా అందరిలోనూ అవగాహన కల్పించడానికి యూఎన్ నడుం బిగించింది. జనాభా పెరుగుదల కారణంగా ఏర్పడే ప్రతికూల ప్రభావాలు, ప్రకృతి సమతుల్యతకు పెరుగుతున్న జనాభా ఎలా గొడ్డలి పెట్టుగా మారుతుందో ప్రజల్లో అవగాహన కల్పించడానికి సిద్ధమైంది. తరాల మధ్య అంతరాలు, వనరులు అందరికీ అందుబాటులో లేకపోవడం నిరుపేద దేశాల్లో ఆకలి కేకలు, ఆరోగ్యం అందకపోవడం వంటి సమస్యలుంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు బాగా చదువుకొని, మంచి ఆరోగ్యంతో , మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికే మన భూమి పునరుత్పాదక శక్తి కంటే రెండింతలు ఎక్కువగా వనరుల్ని వాడేస్తున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి మన అవసరాలు తీర్చడానికి మూడు భూమండలాలు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 80 కోట్ల మందికి కావల్సినంత పోషకాహారం దొరకకపోతే మరోవైపు 65 కోట్ల మందికి సమృద్ధిగా ఆహారం లభించి ఊబకాయం బారిన పడుతున్నారు. 2050 నాటికి ఇప్పుడు లభిస్తున్న ఆహారం కంటే 70% ఎక్కువ అవసరం ఉంటుంది. వ్యవసాయ దిగుబడులకు చేసే ప్రయత్నాలతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. నాణేనికి రెండువైపులా ఉన్నట్టే పెరిగిపోతున్న జనాభా అనేది సమస్య కాదని, ఎన్నో సమస్యలకు అది పరిష్కారం కూడా అవుతుందని మన అనుభవాలే పాఠాలు నేర్పిస్తున్నాయని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్పీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నటాలియా కనెమ్ వ్యాఖ్యానించారు. జనాభా ఒక రకంగా శాపం. మరో రకంగా చూస్తే వరంగా మారే పరిస్థితులు వచ్చాయన్న అభిప్రాయం బలపడుతోంది. అత్యధిక దేశాల్లో జనాభా నియంత్రణపై అవగాహన ఉండడంతో ఇప్పుడు వనరుల సమాన పంపిణీపై అవగాహన పెంచే పరిస్థితులు వచ్చాయి. పిల్లల్ని కనకపోవడం వల్ల జపాన్, ఇటలీ వంటి దేశాల్లో వృద్ధులు పెరిగిపోయి ఒక సమస్యగా మారింది. చైనా కూడా వన్ చైల్డ్ పాలసీని రద్దు చేయాల్సి వచ్చింది. అదే భారత్‌ను తీసుకుంటే యువచోదక శక్తితో అభివృద్ధి పథంలో దూసుకువెళుతోంది. యువ భారతం ప్రపంచ జనాభాలో అయిదో వంతు మంది భారత్‌లోనే ఉన్నారు. ప్రతీ ఏడాది సగటున 1 శాతం జనాభా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ దేశాల్లోనే యువశక్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో భారత్ ఉంది. దేశంలోని 130 కోట్ల జనాభాలో 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు 25 శాతంపైనే ఉంది. దేశంలో యువ జనాభా సగటు వయసు 28 ఏళ్లు అయితే చైనాలో 38 ఏళ్లు, జపాన్‌లో 48గా ఉంది. ఈ యువశక్తితోనే భారత్ ప్రపంచంలో శక్తిమంత దేశంగా అవతరిస్తుంది. ఇక జనాభా మితిమీరి పెరిగితే మాత్రం వారి అవసరాలు తీర్చలేక సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి. వృద్ధ జపాన్ ఆసియా, యూరప్ దేశాల్లో అత్యధిక వృద్ధులు నివసిస్తున్నారు. 65 ఏళ్లకు మించి ఉన్న వారు జపాన్ జనాభాలో 28% ఉంటే, 23 శాతం వృద్ధ జనాభాతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఆయుర్దాయం పెరిగిపోవడం, జననాలు తగ్గిపోవడంతో జపాన్, ఇటలీల్లో పని చేసే వారి సంఖ్య తగ్గిపోవడం వల్ల సమస్యలు ఎదురుకానున్నాయి. 2025–2040 మధ్య కాలంలో జపాన్‌లో పని చేసే ప్రజలు (20–64 ఏళ్లు) కోటి మందికి పడిపోతుందని, దానిని ఎదుర్కోవడానికి ఆ దేశం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. యూఎన్ తాజా నివేదిక ► ప్రపంచ జనాభా 600 కోట్ల నుంచి 700 కోట్లకి చేరుకోవడానికి 12 ఏళ్లు పడితే, అంతే సమయంలో 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోబోతోంది. ► ప్రపంచ జనాభాకి మరో 100 కోట్ల మది పెరగడానికి ఈసారి 14.5 సంవత్సరాలు పట్టవచ్చునని యూఎన్ అంచనా వేసింది. ► 2080 నాటికి ప్రపంచ జనాభా అత్యధికంగా వెయ్యి కోట్లకు చేరుకొని, 2100 వరకు అలాగే స్థిరంగా ఉంటుంది ► 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోవడంలో సగం జనాభా ఆసియా దేశాల నుంచి ఉంటే, ఆఫ్రికా దేశాలు రెండో స్థానంలో ఉన్నాయి. 40 కోట్ల జనాభా ఆఫ్రికా దేశాల నుంచి పుట్టుకొచ్చింది. ► ప్రస్తుతం జనాభా అత్యధికంగా పెరుగుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత స్థానాల్లో చైనా, నైజీరియా ఉన్నాయి. ► అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పని చేసే జనాభా (25 నుంచి 64 ఏళ్ల వయసు) పెరుగుతూ వస్తోంది. ► ప్రపంచ సగటు ఆయుఃప్రమాణం 72.8 ఏళ్లకు చేరుకుంది. 1990 నుంచి చూసుకుంటే ఆయుర్దాయం తొమ్మిది సంవత్సరాలు పెరిగింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
COVID-19: షాంఘైలో ఆకలికేకలు
షాంఘై: చైనాలోని అతిపెద్ద నగరం షాంఘైలో పరిస్థితులు భయానకంగా మారాయి. జీరో కోవిడ్ విధానంలో భాగంగా అమలవుతున్న కఠిన ఆంక్షలతో జనం ఆహారం తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేకుండాపోతోంది. దీంతో, ప్రజలు ఆకలితో అలమటిస్తూ చనిపోవడం కంటే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆక్రందనలు చేస్తున్నా రు. జైలుకెళ్తే అయినా కడుపు నిండుతుందనే ఆశతో తమను అరెస్ట్ చేయండంటూ పోలీసులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. కరోనా బారిన పడిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టిచంపుతున్నారు. ఇటువంటి దారుణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రుల్లో అరకొర వసతులు, చెత్తాచెదారంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దారుణాలకు సంబంధించిన వీడియోలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తొలగిస్తూ జాగ్రత్తపడుతోంది. షాంఘైలో భారీగా కరోనా కేసులు వెలుగులోకి వస్తుండటంతో మార్చి28వ తేదీ నుంచి కఠినాతి కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. దీంతో, నిత్యావసర వస్తువులు లభించక, ఆహారం దొరక్క షాంఘైలోని లక్షలాది మంది ప్రజలు అల్లాడుతు న్నారు. ఇళ్లలోని బాల్కనీలు, కిటికీల్లోంచి అరుపులు, పాటలతో నిరసనలు తెలుపుతున్నారు. ‘కడుపు నింపుకునేందుకు మా వద్ద ఏమీలేదు. మమ్మల్ని కాపాడండి. ఆకలితో బతకడం కష్టంగా ఉంది...’అంటూ అధికారులను వేడుకుంటున్న ట్లున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కోకొల్లలు కనిపిస్తున్నాయి. అధికారులు సరఫరా చేస్తున్న ఆహార వస్తువులు చాలక మార్కెట్లను లూటీ చేస్తున్న ఘటనలు కూడా ఇటీవల చోటుచేసుకున్నాయి. మూగ జీవులపై పాశవికం కరోనా బాధితుల ఇళ్లలో ఉండే పెంపుడు జీవులను అధికారులు వదలడం లేదని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టి చంపుతున్నారని చెబుతున్నట్లున్న వీడియోలను జనం సోషల్ మీడియాలో పెడుతున్నారు. షాంఘైలోని పుడోంగ్‌లో ఓ పెంపుడు కుక్కను ఆరోగ్య కార్యకర్త పారతో కొట్టి చంపుతున్న వీడియోను ఇటీవల సీఎన్ఎన్ వెలుగులోకి తెచ్చింది. ఇదే కాకుండా, క్వారంటైన్లో ఉన్న బాధితుల ఇళ్ల తాళాలను పగులగొట్టి మరీ వారి పెంపుడు జంతువులను చంపేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆత్మహత్య శరణ్యం అంటూ.. లాక్డౌన్ వేళ ఆకలిచావు కంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ టియాంజిన్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్యతో కలిసి అపార్టుమెంట్ కిటికీలో నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చైనాలోనే అత్యంత ధనిక నగరం షాంఘై జనాభా 2.60 కోట్లు కాగా, అక్షరాస్యత 97%. ప్రముఖ పర్యాటక ప్రాంతం డిస్నీల్యాండ్ కూడా ఇక్కడుంది. ఇన్ని ఉన్నా ప్రజలు ఆకలితో ఆత్మహత్యలకు పాల్పడటం, మూగజీవాలను కొట్టి చంపడం వంటి దారుణాలు చోటుచేసుకోవడంపై పాలకులు ఆలోచించాలని అమెరికాలోని మీడియా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. -
ఇక మహా పోరాటమే
న్యూఢిల్లీ/చండీగఢ్/మథుర: తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని రైతు సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే మహా పోరాటం తప్పదని తేల్చిచెప్పారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 14న సింఘు బోర్డర్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్ వద్ద రైతు సంఘం నాయకుడు, సంయుక్త కిసాన్ ఆందోళన్ ప్రతినిధి కన్వల్‌ప్రీత్ సింగ్ పన్నూ మీడియా సమావేశంలో మాట్లాడారు. వేలాది మంది రైతులు ట్రాక్టర్లపై ఆదివారం రాజస్తాన్‌లోని షాజహాన్‌పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారని చెప్పారు. వారు ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిని దిగ్బంధిస్తారని అన్నారు. ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. తమ తల్లులు, సోదరీమణులు, బిడ్డలు సైతం త్వరలో ఈ పోరాటంలో భాగస్వాములవుతారని తెలిపారు. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి రైతులు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వారు గమ్య స్థానానికి చేరుకుంటారని అన్నారు. చట్టాల రద్దుపై చర్చించిన తర్వాతే ఇతర అంశాలపై ప్రభుత్వంలో చర్చలు సాగిస్తామని స్పష్టం చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. అదే రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట రైతన్నలు ధర్నాలు చేస్తారని వెల్లడించారు. రైతు సంఘాల మధ్య చిచ్చుపెట్టి, ఉద్యమాన్ని బలహీనపర్చాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, సర్కారు ఎత్తులు సాగవని కన్వల్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ నగరంతోపాటు సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లో శనివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. రద్దు చేస్తే ఉద్యమిస్తాం కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు వీధుల్లోకి వస్తున్నారు. మరోవైపు ఈ చట్టాలను సమర్థించే వారు కూడా తమ వాదనకు పదును పెడుతున్నారు. హరియాణాకు చెందిన 29 మంది రైతులు శనివారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిశారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని, వీటిని రద్దు చేస్తే సహించబోమని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు. టోల్‌ప్లాజాల ముట్టడి తమ పోరాటంలో భాగంగా హరియాణా రైతులు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రంలోని టోల్ ప్లాజాలను ముట్టడించారు. వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయకుండా అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో: రైతుల పోరాటానికి మద్దతుగా బీకేయూ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వే పై ఉన్న మాంత్ టోల్‌ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. కొంత సేపు టోల్ రుసుములు వసూలు చేయనివ్వలేదు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. టోల్ రుసుములు వసూలు చేయొద్దంటూ డిమాండ్ చేశారు. ఘాజీపూర్ వద్ద పోలీసులు బ్లాక్ చేసిన రోడ్డుపై నిద్రిస్తున్న రైతు -
ముఖ్యమంత్రి సారూ.. స్పందించరూ..
లక్డీకాపూల్: తమను ఆదుకోవాలని కోరుతూ ప్రైవేట్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆకలి దీక్ష తలపెట్టారు. ప్రైవేటు యాజమాన్యాలు జీతాలు చెల్లించలేకపోతున్న కరోనా కష్ట కాలంలో ప్రభుత్వమే ఆదుకోవాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం డిమాండ్ చేస్తున్నది. ఫోరం పిలుపు మేరకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ తమ ప్రాంతాల్లోనే ఆదివారం ఆకలి దీక్షలో పాల్గొన్నట్టు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి పి.పట్టాభిరెడ్డి తెలిపారు. మూడు మాసాలుగా లెక్చరర్లకు జీతాలు లేవు, వచ్చే ఆగస్టు వరకు కూడా జీతాలు చెల్లించడం కుదరదని యాజమాన్యాలు తెగేసి చెపుతున్నాయని ఆవేదన చెందారు. తమ శ్రమ, నిబద్ధతతో వందల, వేల కోట్లు కూడబెట్టుకున్న ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తమ ధీనావస్థను గుర్తించడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఊసే ఎత్తడం లేదన్నారు. ఈ దయనీయ స్థితిని పాలకుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ ఆకలి దీక్షను తలపెట్టామన్నారు. ఇకనైనా తమ ఆవేదనను పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా స్పందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. -
విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష
-
మూడు రాజధానులకు మద్దతుగా నిరాహార దీక్షలు
సాక్షి, వైఎస్సార్ కడప: రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వ్యతిరేక విధానాలకు నిరసనలు వ్యక్తం చేశారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ మాజీ కార్పొరేటర్లు, కో అప్షన్ మెంబర్లు దీక్ష చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన ఈ దీక్షలు జిల్లాలోని అంబెద్కర్ కూడలి వద్ద కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మద్దతు తెలిపారు. పలువురు నేతలు, కార్యకర్తలు మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేస్తూ దీక్షకు సంఘీభావం తెలిపారు. (పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష) కడప: నగరంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు మూడు రాజధానులకు మద్దతుగా... భిక్షాటన, అర్థ నగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టారు. ఈ నిరసన వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా ఆధ్వర్యం జరిగింది. అదేవిధంగా బస్సులు, కార్ల అద్దాలు శుభ్రం చేస్తూ వినూత్న రీతిలో విద్యార్థులు తమ నిరసన తెలిపారు. తూర్పు గోదావరి పెద్దాపురం: మూడు రాజధానులకు మద్దతుగా కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు దవులూరి సుబ్బారావు, నెక్కంటి సాయి, ఆవాల లక్ష్మీ నారాయణ, కనకాల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. జిల్లాలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ముమ్మిడివరం సమైక్యాంధ్ర శిబిరం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రాజధానులకు కావాలని నాయుకులు నినాదాలు చేశారు. (వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి) పిఠాపురం: అధికార వికేంద్రీకరణ కు మద్దతుగా వైఎస్సార్‌సీపీనేతలు రిలే దీక్షలు, వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వంహించారు. ఈ కార్యమాన్ని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎల్లో మీడియా ఏదో జరుగుతుందని తప్పుడు సమాచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయారని అన్నారు. అమరావతిలో ఎటువంటి వసతులు లేకపోయినా అధికారులతో పని చేయించి కష్టపెట్టారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన బాగుందంటే.. టీడీపీ మాత్రం సీఎం జగన్‌పై తప్పుగా మాట్లాడుతూ అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. (అభివృద్ధికి ఊతమివ్వండి) తూర్పు గోదావరి: పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా రాజమండ్రి రూరల్ వైస్సార్సీపీ యువజన విభాగం రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: మూడు రాజధానులకు మద్దతుగా పదోరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్ష కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్ పాల్గొన్నారు. ఈయన ఈ దీక్షలో పాల్గొన్న నాయుకులకు ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. గుంటూరు: వికేంద్రీకరణను అడ్డుకుంటున్న టీడీపీ నేతల వైఖరికి వైఎస్సారపీసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు తహశీల్దారు కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ముస్తఫా సహా పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, చైతన్య, కార్యకర్తల నిరసన చేట్టారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు బాపట్లలోని రథంబజార్ సెంటర్లో నిరసనదీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజని ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేశారు. కృష్ణా: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, ముత్తినేని విజయశేఖర్, చౌడవర పు జగదీష్, తుమ్మల ప్రభాకర్ మర్కపూడి గాంధీ, చిలుకూరు శ్రీనివాసరావు, పోతుమర్తీ స్వామి. రామ శెట్టి రామారావు, ప్రజలు, అభిమానులు పాల్లొన్నారు. గాజువాక: విశాఖకు పరిపాలన రాజధాని కావాలంటూ పాతగాజువాక జంక్షన్లో వైఎస్సార్సీపీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎమ్మేల్యే తిప్పల నాగిరెడ్డితోపాటు కార్యకర్తలు.. దేవన్ రెడ్డి, పల్లా చినతల్లి, ప్రగడ వేణుబాబు, రమణ, గోవింద, రోజారాణి పాల్గోన్నారు. విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోరుతూ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి విభాగం నాయకుడు బి కాంతారావు ఆధ్వర్యంలో విద్యార్థులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి సంఘీభావం తెలిపారు. విశాఖ ఈస్ట్ కన్వీనర్ అక్రమాణి విజయనిర్మల, పార్టీ సీనియర్ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి, ప్రొఫెసర్ ప్రేమ నందం, మహిళా ప్రతినిధులు గరికిన గౌరీ, పీలా వెంకటలక్ష్మి పాల్గొన్నారు. విశాఖపట్నం: మూడు రాజధానులకు మద్దతుగా తగరపువలస జంక్షన్లో వైఎస్సార్సీపీ పట్టణ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు జగుపల్లి ప్రసాద్, రాంభుక్త ప్రభాకర్ నాయుడు, బంగి హరికిరణ్లో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం: రాయదుర్గం పట్టణం వినాయక సర్కిల్లో మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు రిలే దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. తిరుపతి: అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఎస్వీయూలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వంటావార్పు కార్యక్రమం విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, యువజన విభాగాం నేత ఓబుల్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. శ్రీకాకుళం: జిల్లాలోని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో ‘ మూడు రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం’ పై మేధావులు, కార్మికులు, రచయితలు, వ్యాపారులు పలు సంఘాలుతో చర్చా వేదిక జరిగింది. పెద్ద ఎత్తున కార్మికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఆరో రోజుకు హజారే దీక్ష
రాలెగావ్ సిద్ధి (మహారాష్ట్ర): లోక్‌పాల్, లోకాయుక్తాల నియామకాలు చేపట్టాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరింది. దీక్ష కారణంగా అన్నాహజారే 4.25 కేజీల బరువు తగ్గారని, బీపీ పెరిగిందని డాక్టర్ ధనంజయ్ పొటే తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్నా హజారే ప్రాణాలను కాపాడాలని శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే,, సామాజిక కార్యకర్త రాజేంద్ర సింగ్ సోమవారం హజారేను కలిశారు. ‘హజారే 2013లో చేసిన దీక్ష కారణంగానే బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. హజారే వల్లే కేజ్రీవాల్ ఎవరో దేశానికి తెలిసింది. అలాంటి వ్యక్తి కనీసం ధర్నాకు మద్దతు తెలియజేయలేదు’ అని ఠాక్రే అన్నారు. -
హమీలను తక్షణమే నెరవేర్చాలి..
-
పార్టీ పదవుల్లో సముచిత స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ టికెట్లు దక్కని నేతలకు పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో సముచితస్థానం కల్పించి న్యాయం చేస్తా మని ఆశావహులకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ఆర్.సి.కుంతియా బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. టికెట్ల కేటాయింపులో బీసీ లకు అన్యాయం జరుగుతోందని పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం నిరాహార దీక్షకు దిగారు. కొల్లాపూర్ బరిలో నిలవాలనుకుంటున్న మాజీమంత్రి చిత్తరంజన్‌దాస్ భవన్‌లోని వసతి గృహంలోనే దీక్షకు దిగారు. షాద్‌నగర్ పై ఆశలు పెట్టుకున్న కడియం పల్లి శ్రీనివాస్, మక్తల్ నుంచి వాకటి శ్రీహరి, దేవరకద్ర సీటు ఆశిస్తున్న ప్రదీప్ గౌడ్లు భవన్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరాహార దీక్షకు దిగా రు. కుంతియా అక్కడికి చేరుకొని వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ బీసీలకు 19 సీట్లు ఇస్తే కాంగ్రెస్ 94 స్థానాలకుగాను 22 సీట్లు ఇవ్వనుందన్నారు. -
ఏపీఎండీసీ ఎండీనా.. టీడీపీ నాయకుడా..?
వైఎస్ఆర్ జిల్లా, మంగంపేట(ఓబులవారిపల్లె): కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగంపేట నిర్వాసితులు సోమవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఏపీఎండీసీ అధికారులు పోలీసుల సాయంతో అడ్డుకున్నారు. దీక్షలకు మద్దతు ప్రకటించేందుకు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వత్తలూరు సాయికిశోర్రెడ్డితో కలిసి బయలుదేరిన ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబులను సైతం మార్గమధ్యంలోనే అడ్డుకోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రెండు వందల మంది పోలీసు బలగాలను మోహరించి మంగంపేట పరిపాలన భవనం దారులన్నీ దిగ్బంధం చేసి అటువైపు ఎవరినీ అనుమతించలేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఏపీఎండీసీ ఎండీ వెంకయ్య చౌదరి ఓ ప్రభుత్వ అధికారిలా వ్యవహరించడం లేదని టీడీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీఎండీసీ ఎండీ మాటలు విని పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేందుకు సిద్ధపడ్డారా అని ప్రశ్నించారు. రిలే నిరాహారదీక్షల ద్వారా గ్రామాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించమని కోరడం తప్పా అని నిలదీశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిన ఏపీఎండీసీ ఎండీ వెంకయ్యచౌదరి అందుకు విరుద్ధంగా తెలుగుదేశంపార్టీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అతని మాటలు విని ప్రజా ప్రతినిధి అయిన తనను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు మాట్లాడుతూ మంగంపేట నిర్వాసితుల రిలేనిరాహారదీక్షలను అడ్డుకునేందుకు ఏపీఎండీసీ ఎండీ వెంకయ్యచౌదరి ఇంతమంది పోలీసులను మోహరించి భగ్నం చేయడం అప్రజాస్వామ్యం అన్నారు. మంగంపేట ఏపీఎండీసీ ప్రారంభం అయిన నాటినుంచి వచ్చిన ఎండీలు ప్రజల సమస్యలు విని వాటినిపరిష్కరించే వారని, అయితే ప్రస్తుతం ఉన్న ఎండీ ప్రజల సమస్యలు సంవత్సరాలుగా పరిష్కారం చేయకుండా, న్యాయం చేయమని అడిగిన ప్రజలను అణగదొక్కేందుకు పోలీసుల సహకారం తీసుకోవడం తగదన్నారు. నిర్వాసితుల సంఘం ప్రతినిధి గల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ తాము న్యాయపరంగానే ముందుకు వెళతామని మంగంపేట గనుల్లో ఏ విధంగా మైనింగ్ చేస్తారో చూస్తామన్నారు. కౌలూరు మధురెడ్డి మాట్లాడుతూ తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు పోరాటం సాగిస్తామని తెలిపారు. మంగంపేట కాపుపల్లె, దళితవాడ, అరుంధతీవాడ గ్రామాల ప్రజలను ఏపీఎండీసీ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకోవడంతో గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి, పులపత్తూరు రామసుబ్బారెడ్డి తదితర నాయకులు గ్రామాల ప్రజలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీఎండీసీ ఎండీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంగంపేట, కాపుపల్లె, దళితవాడ, అరుంధతీవాడ, అగ్రహారం గ్రామస్తులకు 2013 ఆర్ఆర్ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని, భూసేకరణలో జరిగిన తప్పులను సవరించాలని, నిర్వాసితులకు ఒప్పందం ప్రకారం డీజెడ్లు, ఇంటిపట్టాలు, ఉద్యోగభద్రత, కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీఎండీసీ కార్యాలయం వైపు దూసుకెళుతున్న మహిళలు, గ్రామస్తులు, నాయకులను రాజంపేట ఇన్చార్జి డీఎస్పీ నాగేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గల్లా శ్రీనివాసులు, గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి, పులపత్తూరు రామసుబ్బారెడ్డి, వడ్డి సుబ్బారెడ్డి, కౌలూరు మధుసూదన్‌రెడ్డి, పోతుల లక్ష్మీనారాయణ, మధురెడ్డి, కౌలూరు బ్రహ్మానందరెడ్డి మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పుల్లంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాయకులను అదుపులోకి తీసుకున్న వెంటనే కాపుపల్లె, దళితవాడ, అరుంధతీవాడ గ్రామాల ప్రజలు, మహిళలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి వారితో మాట్లాడి శాంతపరిచారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రిలేనిరాహారదీక్షలు కొనసాగిస్తామని నిర్వాసితుల సంక్షేమసాధన కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. మంగంపేట లారీ, టిప్పర్ అసోసియేషన్ స్వచ్ఛందంగా రిలే నిరాహారదీక్షలకు మద్దతుగా లారీలను నిలిపివేసింది. అంతేకాకుండా త్రివేణీ ఎర్త్మూవర్స్లో పనిచేస్తున్న స్థానికులు కూడా రిలేనిరాహార దీక్షలకు మద్దతుగా తమ విధులను బహిష్కరించారు. ప్రభుత్వ వైఖరితోనే మంగంపేట వాసులకు అన్యాయం రైల్వేకోడూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే మంగంపేట ముగ్గురాయి గనులలో పనిచేసే కార్మికులు, మిల్లుల యజమానులు, భూములిచ్చిన స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు విమర్శించారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యత విస్మరించి పరిపాలిస్తోందన్నారు. మిల్లులకు ప్రభుత్వ ముగ్గురాయి గతంలో లాగా సక్రమంగా సరఫరా చేసి ఉంటే మిల్లులు మూత పడే పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి గనులశాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి, గ్రామ పరిరక్షణ కమిటీ, కార్మిక నాయకులు సమావేశమై చర్చలు జరిపి న్యాయం చేయాలన్నారు. -
మూడో రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్ష
-
న్యాయమైన పరిహారం కోరుతూ ఆమరణ దీక్షకు సిద్ధమైన రాజా
-
రైతులను ఆదుకోకుంటే 19 నుంచి...ఆమరణ దీక్ష
తూర్పుగోదావరి, సీతానగరం (రాజానగరం): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతులను, రఘుదేవపురంలో వరి కుప్పలు కాలి నష్టపోయిన అన్నదాతలను రెండు వారాల్లో ఆదుకోకుంటే ఈ నెల 19న రఘుదేవపురం పంచాయతీలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అల్టిమేటం జారీచేశారు. బుధవారం చినకొండేపూడి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూసేకరణలో ఇంకా 55 మంది రైతులకు పరిహారం అందించాల్సి ఉందన్నారు. రెండేళ్ల క్రితం రఘుదేవపురంలో 30 ఎకరాల వరి కుప్పలు కాలిపోయాయని, సుమారు 40 మంది రైతులు పూర్తిగా నష్టపోయారని వివరించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతులకు ప్రభుత్వం అందించే పరిహారం తక్షణమే అందించాలని, రఘుదేవపురంలో వరి కుప్పలు కాలిపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రెండు వారాల్లో రైతులను ఆదుకోని పక్షంలో ఈ నెల 19న రఘుదేవపురం పంచాయతీలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. కాపు కార్పొరేషన్ రుణాలకు రెండువేల మంది దరఖాస్తు చేసుకున్నారని, మండలంలో రూ.2.96 కోట్లు రాగా, కేవలం 200 మందికి రుణాలుగా ఇచ్చారన్నారు. మిగిలిన అర్హులు ప్రశ్నిస్తారని భయపడి వచ్చిన నగదును రుణాలుగా ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్పొరేషన్ రుణాలు పొందేవారి నుంచి రూ.5 వేలు చొప్పున టీడీపీ నాయకులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రఘుదేవపురంలో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని, ఇక్కడ జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లు టీడీపీకి చెందిన వారైనా ఎటువంటి అభివృద్ధి కానరావడం లేదని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు రాజకీయాలను ఆదాయ వనరులుగా మార్చుకుని, ఇసుక, మట్టి, లంచాలతో నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని రాజా దుయ్యబట్టారు. పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చల్లమళ్ళ సుజీరాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొంచ బాబురావు, గెద్దాడ త్రిమూర్తులు పాల్గొన్నారు. -
నేడు సామూహిక రిలే నిరాహార దీక్ష
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : గుంటూరులో జరిగిన నారా హమారా – టీడీపీ హమారా సభలో 8 మంది ముస్లిం యువకులపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక పుట్టపర్తి సర్కిల్లో సామూహిక రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ఈ దీక్షకు రిటైర్డు డీఐజీ ఇక్బాల్, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అంజాద్‌బాషా, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఇక్బాల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలో ఉంటారన్నారు. గుంటూరులో ముస్లిం మైనారిటీ సదస్సు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలను పిలిపించుకుని గత నాలుగేళ్లుగా ముస్లింల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనందు వల్ల ముస్లిం యువకులు శాంతియుతంగా తాము ఉన్న స్థానంలో నుంచే ప్లకార్డుల ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారన్నారు. అందుకు సీఎం చంద్రబాబు కోపోద్రిక్తుడై తన తప్పులను వేలెత్తి చూపారనే ఉక్రోశంతో కేవలం ప్రశ్నించిన పాపానికి ఆ యువకుల పెడరెక్కలు విరచి కుక్కల్లాగా పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చుకుపోయి, అర్ధనగ్నంగా లాఠీలతో, బూటు కాళ్లతో విచక్షణ రహితంగా కొట్టారని తెలిపారు. కొట్టింది పోలీసులే అయినా, కొట్టించింది ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు అని అన్నారు. బలమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారన్నారు. దేశద్రోహం, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర, సభను విధ్వంసం చేయడానికి ప్రయత్నించారని 505, 505(2), 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం ఇలాంటి కేసులు పెట్టడం ఈ రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నో సభల్లో పౌరులు ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలియజేశారన్నారు. అలాంటి వారిని పోలీసులు తాత్కాలికంగా అరెస్టు చేసి సభ అయిపోయిన తర్వాత 165 సెక్షన్ కింద స్టేట్మెంట్ నమోదు చేసుకుని ఇంటికి పంపేవారన్నారు. అయితే ఈ ప్రభుత్వం మాత్రం ముస్లిం యువకులను కొట్టడం, దేశద్రోహం, విధ్వంసకర సంఘటనలకు సంబంధించిన బలమైన సెక్షన్లను నమోదు చేయడం ఇదే ప్రథమమని తెలిపారు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం ఓ తప్పు అయితే వారిని సభకు పిలిపించుకుని అవమానం చేసి సబ్ జైలుకు పంపడం మరో పెద్ద తప్పన్నారు. చంద్రబాబు చేసిన ఈ సంఘటనలకు ఏ ముస్లిం సోదరుడు కూడా క్షమించరన్నారు. ఎన్నికల్లో తప్పక శిక్షిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు జీవించాలంటే ప్రజాస్వామ్యం బతకాల్సిన అవసరం ఉందని, ప్రజా స్వామ్యం బతకాలంటే చంద్రబాబు దిగిపోవాల్సిందేనని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల పట్ల, ప్రజల హక్కుల పట్ల గౌరవం కలిగిన ఎమ్మెల్యేగా ఈ ప్రభుత్వం చేసిన పనికి సిగ్గుపడుతూ ముస్లిం కుటుంబాలకు జరిగిన అన్యాయానికి విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. చేసిన పనికి సిగ్గుపడకుండా ప్రభుత్వం అహంభావపూరితంగా వ్యవహరిస్తుండటంతో గురువారం సామూహిక రిలే నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించామన్నారు. దీక్షకు వందలాది మంది ప్రజా స్వామ్య వాదులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు.ప్రతి ఒక్కరూ ఈ దీక్షకు సంఘీభావం తెలపాలని, ప్రజా స్వామ్యం వైపు నిలబడి పోరాటం చేయాలని ఆహ్వానిస్తున్నానన్నారు. నా వినయ పూర్వక విజ్ఞప్తిని స్వీకరించి తనను బలపరుస్తారని ఆకాంక్షిస్తున్నానన్నారు. -
వీలునామా సిద్ధం చేసుకున్న హార్దిక్
అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్లతోపాటు రైతు రుణమాఫీ చేయాలంటూ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ చేస్తున్న అమరణ నిరాహార దీక్షకు ఆదివారంతో 9రోజులు పూర్తయ్యాయి. అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలోనే హార్దిక్ తన ఆస్తులను పంచుతూ వీలునామా రాయడం సంచలనం సృష్టిస్తోంది. హార్దిక్ ఖాతాలో రూ.50 వేలున్నాయి. ఇందులో తల్లిదండ్రులకు 20వేలు, పంజ్రపోల్ గ్రామంలో ఆవులకు షెడ్ కోసం రూ.30వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. ‘తన జీవితగాథపై వస్తున్న పుస్తకం హూ టుక్ మై జాబ్‌పై వచ్చే రాయల్టీ, ఇన్సూరెన్స్ డబ్బులు, తన కారు అమ్మగా వచ్చిన మొత్తాన్ని తల్లిదండ్రులు, చెల్లెలితోపాటు మూడేళ్ల క్రితం పటీదార్ ఉద్యమంలో చనిపోయిన 14 మందికి పటేళ్లకు సమానంగా పంచాలని హార్దిక్ పేర్కొన్నారు’ అని పటీదార్ సంఘం అధికార ప్రతినిధి మనోజ్ పనారా వెల్లడించారు. ఒకవేళ ఈ దీక్షలో తను చనిపోతే.. కళ్లను దానం చేయాలని సూచించారు. వీలునామాలో పేర్కొన్న వివరాల ప్రకారం హార్దిక్ ఆస్తిలో 15%తల్లిదండ్రులకు, 15% చెల్లెలికి మిగిలిన 70% 14 మంది పటీదార్లకు చెందుతుంది. -
రెండో రోజుకు చేరిన చట్ట పరిరక్షణ సమితి దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని పరిరక్షించుకునే వరకు పోరా డతామని చట్ట పరిరక్షణ సమితి సోమవారం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని షెడ్యూల్–9లో చేర్చాలని డిమాండ్ చేస్తూ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ వద్ద చేపట్టి న రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా సమితి చైర్మన్ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. చట్టంలోని పాత నిబంధనల అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందే వరకు కేంద్రాన్ని విశ్వసించలేమన్నారు. ఎన్నో బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో నిలిచిపోయాయని గుర్తు చేశా రు. షెడ్యూల్–9లో చేర్చితేనే చట్టాన్ని పూర్తి స్థాయి భద్రత కల్పించినట్టవుతుందని, అప్పటిదాకా పోరాడతామని చెప్పారు. అంతకుముందు ఏపీలోని చుం డూరులో 1991 ఆగస్టు 6న జరిగిన దళితుల ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించా రు. దీక్షలో సమితి కన్వీనర్లు అద్దంకి దయాకర్, జేబీ రాజు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాత నిబంధనలనే అమలు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనలను యథాతథంగా అమలుచేసేలా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో చట్టం తేవాలని చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేతలు ఆదివారం ఢిల్లీలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సమితి చైర్మన్ మంద కృష్ణమాదిగ, సమితి కన్వీనర్లు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, చెన్నయ్య దీక్షలో పాల్గొన్నారు. చట్టాన్ని షెడ్యూల్–9లో చేర్చే వరకు ఉద్యమాన్ని విరమించబోమని స్పష్టం చేశారు. ఈ నెల 8న దేశవ్యాప్తంగా అన్ని దళిత సంఘాలతో కలసి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో సింహగర్జన సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. రిలే నిరాహార దీక్షలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పాల్గొన్నారు. దళితుల హక్కులకు భంగం కలిగిస్తారా? ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను సడలించి దళితుల హక్కులకు భంగం కలిగిస్తారా? అని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ప్రశ్నించారు. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. నిరసనలో టీఎమ్మార్పీఎస్ గౌరవాధ్యక్షు డు పరమేశ్వర్, మాదిగ జేఏసీ అధ్యక్షుడు రాందాస్ పాల్గొన్నారు. -
ఏపీ రాజధానిలో భూములిచిన రైతులు ఆమరణ నిరాహారదీక్ష
-
రిజర్వేషన్ల కోసం ఆఖరి పోరాటం: హార్దిక్
అహ్మదాబాద్: పటేల్ వర్గీయులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆగస్టు 25 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్లు పటీదార్ ఆందోళన్ సమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్ ప్రకటించారు. తన వర్గీయులకు రిజర్వేషన్లు సాధించడమే తన లక్ష్యమని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కోటా సాధనలో తన ప్రాణాలు పోయినా లెక్కచేయనన్నారు. ‘ఈ పోరాటంలో మీ అందరి మద్దతు కోరుతున్నా. పటీదార్ క్రాంతి దివస్ అయిన ఆగస్టు 25 నుంచి నిరాహార దీక్షకు దిగబోతున్నా. రిజర్వేషన్లు సాధించే వరకు ఆహారం, నీరు ముట్టుకోను’ అన్నారు. -
కోమా దరిదాపుల్లో ఉండి.. ఇంతసేపు ఎలా మాట్లాడగలిగారు?
కడప రూరల్ : కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీ సీఎం రమేశ్‌నాయుడు చేపట్టిన ఉక్కు దీక్షలకు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా జిల్లాలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఉపయోగించారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది డిపోలు ఉండగా, మొత్తం 800 బస్సులు ఉన్నాయి. అందులో ఉక్కు దీక్షలకు 281 బస్సులను ఉపయోగించారు. ఇక ఇతర వాహనాల సంగతైతే లెక్కే లేదు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా చాలా మార్గాల్లో బస్సు సర్వీసులను రద్దు చేశారు. ఉదయం వేళ ఈ నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర సమస్య నెలకొంది. విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వివిధ రకాల పనులపై రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కడపకు వచ్చిన బస్సులు మూడు గంటల తర్వాత తిరుగుముఖం పట్టాయి. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం సేవలోనే ఆర్టీసీ బస్సులు తరించాయి. అధికార పార్టీ చేపట్టిన ఉక్కు దీక్ష తమకు పెద్ద ‘పరీక్ష’గా మారిందని పలువురు వాపోయారు. బాగా లేదంటూనే.. ఎనిమిది నిమిషాలకుపైగా సీఎం రమేష్ ప్రసంగం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో 11 రోజులపాటు దీక్ష చేపట్టిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. అతని శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయని సీఎం పేర్కొన్నారు. అతను కోమాలోకి వెళ్లే ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. అనంతరం ఉక్కు దీక్షల నుంచి సీఎం రమేష్‌ను విరమింపజేసి తాను నెల్లూరుకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి వెళ్లగానే సీఎం రమేష్ తన ప్రసంగాన్ని మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషాల 20 సెకండ్ల ప్రాంతంలో ప్రారంభించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెబుతూనే.. దాదాపు ఎనిమిది నిమిషాలకు పైగా మాట్లాడారు. ఈ ప్రసంగంపై చాలా మంది విస్మయం వ్యక్తం చేశారు. కోమా దరిదాపుల్లోకి వెళ్లే వ్యక్తి ఇంత సేపు ఎలా మాట్లాడగలిగారు..? అంటూ ఆశ్చర్యపోయారు. -
కొండను తవ్వి ఎలుకను పట్టారు!
సాక్షి ప్రతినిధి, కడప: వరుసగా మంత్రుల ప్రకటనలు టీడీపీ నాయకుల ప్రసంగాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కడప ఉక్కుపైన స్పష్టత ఇస్తారని ఆశించారు. కాగా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా దీక్షలకు ముగింపు పలికారు. నాలుగేళ్లు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. జిల్లా ఉన్నతికి కృషి చేయనున్నామంటూ గతంలో జిల్లాలో పర్యటించిన 23 సార్లు ఇదే విషయం చెప్పుకొచ్చారు. శనివారం సాయంత్రం కూడా నిర్ధిష్టమైన స్పష్టత ప్రభుత్వ ఉత్తర్వులుంటాయని ఆశించిన వారి ఆశలు అడియాశలే అయ్యాయి. ఇదివరకే మెకాన్ సంస్థ నేతృత్వంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ నాయకులు ప్రకటించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి 2నెలలు గడువు అంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. తర్వాతైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మిస్తుందా అంటే అదీ లేదు, నాలుగైదు మార్గాలున్నాయి, అన్వేషిస్తామని.. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేసిందంటూ తెలుగుదేశం పార్టీ ఉద్యమబాట పట్టింది. నాలుగేళ్లుగా కలిసి కాపురం చేసిన టీడీపీకి అకస్మాత్తుగా విభజన చట్టంలోని అంశాలు గుర్తుకు వచ్చాయి. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా రాజకీయ పార్టీల ఉద్యమాలతో నిమిత్తం లేకుండా కార్యాచరణ రూపొందించింది. రాజకీయ ప్రయోజనాలు మినహా ప్రజాప్రయోజనాలు కాదని గుర్తిం చిన వామపక్షపార్టీలు, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, జనసేన పార్టీలు టీడీపీ తీరును ఎండగట్టాయి. కడప ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఉద్యమాలు చేసిన రాజకీయ పక్షాలను అవమానపర్చిన టీడీపీ ముందుగా బహిరంగ క్షమాపణ కోరి ఆపై ఉద్యమ కార్యచరణ చేపట్టింటే ప్రజలు కాస్తోకూస్తో అభిమానించే వారని విశ్లేషకులు అభిప్రాయపడుతోన్నారు. వక్రభాష్యం పలకడంలో టీడీపీ ముందంజ.. ‘తాము చేస్తే ఒప్పు..ఎదుటోళ్లు చేస్తే తప్పు’ అన్న ధోరణిని టీడీపీ ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉంటుందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఉక్కు ఉద్యమం చేపట్టిన అఖిలపక్షం వినతి పత్రం స్వీకరించేందుకు కూడా ముఖ్యమంత్రి అంగీకరించని పరిస్థితి. ఎయిర్‌పోర్టులో 2నిమిషాలు సమయం కేటాయించాలని కోరినా తిరస్కరించి, పోలీసులను ఉసిగొల్పారు. పైగా ఉద్యమకారులందరినీ వైఎస్సార్సీపీ వర్గీయులుగా చిత్రీకరించారు. అప్పట్లో బీజేపీ నాయకత్వంలోని ఏన్డీయే భాగస్వామ్యపక్షంలో టీడీపీ కూడా ఉండడమే అసలు కారణం. ఇక్కడ ఉద్యమాలు చేస్తే వస్తే ప్రయోజనం ఏమిటంటూ పోలీసుల ద్వారా వాటిని నీరుగార్చేవారని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కడపలో సీఎం రమేష్ దీక్షలో ప్రసంగిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు నిన్ననే బంద్ చేపట్టాయి. ఇక్కడ బంద్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటంటూ ప్రశ్నించారు. మరి రమేష్ కడప కేంద్రంగా ఆమరణదీక్ష చేపట్టడం వెనుక మతలబు ఏమిటని పలువురు నిలదీస్తున్నారు. మంత్రుల పరేడ్..ఎంపీల హల్చల్.... జిల్లా కేంద్రమైన కడప జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ దీక్షకు మంత్రుల పరేడ్ నిర్వహించారు. దీక్ష చేపట్టినప్పటి నుంచి ప్రతిరోజు వీఐపీల తాకిడి అధికంగా ఉంది. మంత్రులు, ఎంపీలు,ప్రముఖులు దీక్షాశిబిరం సందర్శించేలా ప్రణాళిక రచించారు.ఎవరు ఎప్పుడు హాజరు కావాలి, ఎవరి ప్రసంగం ఎలా ఉండాలి అన్న విషయం సీఎంఓ ఆదేశాల మేరకు జిల్లాలో ఆచరించారు. ఉక్కు దీక్ష చేపట్టిన టీడీపీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఉద్యమించాల్సి ఉండగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్నే అధికంగా టార్గెట్ చేశారు.రమేష్ దీక్షకు సంఘీభావం ప్రకటించి హాజరైన మంత్రులు ప్రతి ఒక్కరూ ప్రతిపక్షనేతనే విమర్శించడాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 22 మంది రాష్ట్ర మంత్రులు, 15మంది ఎంపీలు పర్యటించడం మొత్తం వ్యవహారం పక్కా ప్రణాళికబద్ధంగా చేపట్టారని విశ్లేషకులు వివరిస్తున్నారు. 11రోజుల దీక్షాపరుడు గంటలో డిశ్చార్జి...!? 11రోజులు తిండి లేకుండా ఆమరణదీక్ష చేపట్టిన రాజ్యసభ సభ్యుడు రమేష్ రిమ్స్‌లో గంటలోపు చికిత్సల అనంతరం డిశ్చార్జి అయ్యారు. శనివారం సాయంత్రం 3.35 గంటలకు ఆస్పత్రిలో చేరిన ఆయన, 4.20 డిశ్చార్జి అయ్యారు. 11రోజులుపాటు ఆమరణదీక్ష చేపట్టిన వ్యక్తి గంటలోపే ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకొని హుషారుగా ఇంటికి వెళ్లడంపై వైద్యవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ‘రాజ్యసభ సభ్యుడు రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణదీక్ష ఓ బూటకం’ అనేందుకు అనేక కారణాలు బలపడుతున్నాయి. బీటెక్ రవి షుగర్ పేషేంట్, తొలిరోజు సాయంత్రానికే తీవ్రంగా నీరసించిపోయారు. అలాంటి వ్యక్తి 7రోజులు దీక్షను కొనసాగించారు. షుగర్ పేపేంట్ వరుసగా మూడు రోజులు ఏమి తినకుండా ఉంటే కోమాకు వెళ్తారని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే రమేష్ బ్లడ్ రిపోర్టు పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. మూడోరోజు నుంచి ఐదోరోజు వరకు ఆయన బరువులో ఒక గ్రాము కూడా తేడా కన్పించలేదు. ఏమి తినకుండా నీరు మాత్రమే తాగుతూ ఆమరణదీక్ష చేపట్టే వ్యక్తి బరువులో వ్యత్యాసం లేకపోవడం ఆయన చేపట్టిన దీక్ష ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. బ్లడ్ షుగర్ తగ్గిపోవాల్సి ఉండగా మధ్యలో పెరుగుతూ రావడాన్ని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిమ్మరసం ఇచ్చి రమేష్ దీక్ష విరమింపజేయగా మాట్లాడే పరిస్థితిలో లేనంటూ మైకు తీసుకున్న ఆయన దాదాపు ఏడున్నర్ర నిమిషాలు ప్రసంగించారు. ఆపై రిమ్స్‌కు వెళ్లిన ఆయన 45 నిమిషాలకే డిశ్చార్జి అయ్యారు. 7రోజులు దీక్ష అనంతరం ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఆస్పత్రికి తరలించగా నాలుగురోజులు చికిత్స పొందారు.దీనిని బట్టి వీరి దీక్ష ఏస్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చుని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం ఎలా ఉన్నా పట్టులేని జిల్లాలో రాజకీయంగా పట్టుసాధించడమే లక్ష్యంగా కొనసాగిందని విశ్లేషకులు వెల్లడిస్తుండడం విశేషం. కడప దశ మారుస్తా! సాక్షి, కడప : రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన కడపజిల్లా దశ మారుస్తా నని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరం వద్ద ఉక్కు దీక్షలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలను పరామర్శించిన అనంతరం సీఎం మాట్లాడుతూ తలసరిఆదాయంలో రాష్ట్రం దూసుకుపోతోందని, 2022 నాటికి దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్‌గా నిలుస్తుందని పునరుద్ఘాటించారు.కేంద్రంపై ఉక్కు కోసం పోరాటం సాగిస్తానని...తాడోపేడో తేల్చుకుంటానని తెలియజేశారు. చప్పట్లు కొట్టండి..హర్షాన్ని తెలియజేయండి.. సీఎం మాట్లాడుతూ అనేక సందర్భాల్లో రాష్ట్రానికి అన్నీ తానే చేసినట్లు చెప్పడంతో వదిలి పెట్టకుండా మీరు నమ్మినట్లయితే చప్పట్లు కొట్టండంటూ అడిగి కొట్టించుకోవడం కనిపించింది. సరిగా వినిపించడం లేదు....గట్టిగా వినిపించేలా కొట్టండి..జిల్లా నలుమూలలకు వినిపించాలన్నా పెద్దగా సభికుల నుంచి స్పందన లేదు. పదేపదే హర్షం ప్రకటించాలంటూ సీఎం స్థాయిలో అడిగి ఆమోదం తెలుపమని కోరడం కనిపించింది. ఉక్కు పరిశ్రమ నెలకొల్పొతాం...మీరు నమ్ముతున్నారా అంటూ జనాలను అడిగినపుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కు పరిశ్రమతోపాటు టీడీపీ నేతల దీక్ష.. ధర్మపోరాటమంటూ ఊకదంపుడు ఉపన్యాసం చేస్తున్న బాబుకు పలుమార్లు ప్రత్యేక హైకోర్టు నినాదం వినిపించింది. సభలో బాబు మాట్లాడుతున్న సందర్భలో పలువురు న్యాయవాదులు సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఉక్కు దీక్షలో కనిపించని వరద టీడీపీ మైలేజ్‌కోసం చేపట్టిన ఉక్కు దీక్షలో మాజీమంత్రి వరదరాజులరెడ్డి కనిపించలేదు. దీక్షకు వారంరోజుల ముందే సీఎం రమేష్‌పై విమర్శల వర్షం కురిపించిన మాజీ ఎమ్మెల్యే అదే పట్టుదలతో హాజరు కాలేదు. 11 రోజులపాటు దీక్ష చేసినా ఏ ఒక్క రోజూ సంఘీభావం తెలుపడానికి రాలేదు. సీఎం వచ్చినా ఎయిర్ పోర్టు వద్ద కలిసి మాట్లాడిన వరద అనంతరం వెళ్లిపోయారు.జిల్లాలోని పులివెందుల, ప్రొద్దుటూరు, మైదకూరు, కడప, కమలాపురం తదితర ప్రాంతాల నుంచి జనాలను భారీగా తరలించారు. డ్వాక్రా మహిళలతోపాటు పార్టీ కార్యకర్తలను ప్రత్యేక బస్సుల ద్వారా తీసుకొచ్చారు. వారికి ఇక్కడ స్థలం లేకపోవడంతో అగచాట్లు పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 30న జిల్లాకు వస్తున్నారు. ఆమరణ దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు సంఘీభావం ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి తెలివైన నాయకుడు ఎప్పుడు ఏమి చేయాలో అది చేస్తాడు. ఉక్కు పరిశ్రమకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారు. –మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేసింది. హక్కుగా వచ్చిన అంశాలను కూడా అమలు చేయలేదు. రమేష్ చేపట్టిన ఆమరణదీక్ష సందర్శనకు ముఖ్యమంత్రి రానున్నారు. ఉక్కు పరిశ్రమపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. –మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. -
దొంగ దీక్షలు చేస్తున్న సీఎం రమేష్
నంద్యాల వ్యవసాయం: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని సీఎం చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగా సీఎం రమేష్‌తో దొంగదీక్షలు చేయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. నంద్యాల టౌన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉక్కుపరిశ్రమ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం వేసిన మెకాన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వడం లేదన్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక మంత్రులతో చర్చించిన తరువాతే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చిందన్నారు. జీఎస్టీ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని, ఉద్దేశపూర్వకంగా టీడీపీ ప్రభుత్వం ప్రజలను, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వల్లే కరెన్సీ కష్టాలు నెలకొన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోట్లను టీడీపీ నాయకులు తరలించారన్నారు. రాయలసీమ జిల్లాలకు కృష్ణాజలాలు సక్రమంగా అందించేందుకు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం అత్యవసరమని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అస్పష్టమైన ప్రకటనతో ప్రాజెక్టు విషయమై ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. పప్పుధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పించే విషయమై ప్రధానమంత్రితో చర్చిస్తానని వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో స్థానిక మెడికేర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బుడ్డా శ్రీకాంతరెడ్డి బీజేపీలో చేశారు. -
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దీక్ష విరమణ
-
ఢిల్లీ డిప్యూటీ సీఎం నిరాహార దీక్ష భగ్నం
-
రేపు నెల్లూరులో ‘వంచనపై గర్జన’
-
రేపు ‘వంచనపై గర్జన’
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూన్ 2వ తేదీన నెల్లూరులో ‘వంచనపై గర్జన’ దీక్ష నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమైంది. శనివారం నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో జరిగే ‘వంచనపై గర్జన’ నిరాహార దీక్షకు పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్ సీపీ లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. దీక్షలో పాల్గొనేవారు తప్పనిసరిగా నల్ల దుస్తులు ధరించి రావాలని పార్టీ ఇప్పటికే అందరికీ సూచనలు జారీ చేసింది. విశాఖ వేదికగా తొలి గర్జన ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నేతలతో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వంచిస్తున్న తీరుకు నిరసనగా ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్టణం వేదికగాతొలిసారి ‘వంచనపై గర్జన’ జరిగింది. నెల్లూరులో ఇప్పుడు రెండోసారి ఈ ఆందోళనను నిర్వహిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న వీఆర్ కళాశాల మైదానం వేదికగా వైఎస్సార్ సీపీ నేతలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టనున్నారు. విభజన వల్ల రాష్ట్రం ఇప్పటికే అన్ని విధాలా అన్యాయమై పోయిన పరిస్థితుల్లో అనుభవజ్ఞుడినంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగి కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారనే అంశాన్ని గర్జన ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. విభజన చట్టంలోని హామీల సాధనను పట్టించుకోకుండా చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారనే అంశాన్ని ఎలుగెత్తి చాటేందుకు వైఎస్సార్ సీపీ నేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని వైఎస్సార్ సీపీ తొలి నుంచి చేస్తున్న ఆందోళనలు, ఉద్యమాలను అణగదొక్కేందుకు ప్రయత్నించిన చంద్రబాబు అవకాశవాద రాజకీయాలతో చివరికి మాట మార్చడం, హోదా కోసం పోరాడుతున్నట్లు ధర్మ పోరాట దీక్షలు చేయటంలో డొల్లతనాన్ని ఎండగట్టనున్నారు. భారీగా తరలిరానున్న శ్రేణులు అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు దాకా 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ నేతలు ‘వంచనపై గర్జన’ దీక్షకు తరలి రానున్నారు. విశాఖలో జరిగిన తొలి గర్జనకు ప్రజల్లో మంచి స్పందన లభించడం, పార్టీ శ్రేణులు ఉత్తేజం పొందడం లాంటి అంశాల నేపథ్యంలో నెల్లూరులో గర్జన కోసం పార్టీ నేతలు ద్విగుణీకృత ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గర్జనకు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం నెల్లూరు చేరుకుని వీఆర్ కళాశాల ఆవరణలో ఏర్పాట్లను పరిశీలించారు. నెల్లూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ముక్కాల ద్వారకానాథ్, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులతో చర్చించారు. పాలకుడికి దయా గుణం ఉండాలి: బొత్స కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనను బహిర్గతం చేసి ప్రత్యేక హోదా ఆకాంక్షను మరింత బలంగా వినిపించేందుకు నెల్లూరులో గర్జన దీక్ష నిర్వహిస్తున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికార పార్టీ నేతల స్వార్థం, అరాచకాలు, దోపిడీ విధానాలను గర్జన సభ ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర లేదని, కరువుతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం సిగ్గుచేటని మండిపడ్డారు. పెట్రోలు ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. గతంలో ధరలు పెరిగిన సమయంలో దివంగత వైఎస్సార్ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 సబ్సిడీ ఇచ్చి ప్రజలపై ఆర్థికభారం లేకుండా చేశారని తెలిపారు. దయా గుణం కలిగిన పాలకులు ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. టీడీపీ మరో మోసం: సజ్జల టీడీపీ, బీజేపీ నాలుగేళ్లపాటు మిత్రపక్షాలుగా కొనసాగి ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ మహానాడు సాక్షిగా ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీపైకి నెట్టి మరో మోసానికి తెర తీసిందన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో ధర్నాలు, దీక్షలు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. అవిశ్వాసం పెట్టి వైఎస్సార్ సీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి దీక్ష చేసినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. -
గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకుల దీక్ష
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణకై ఏప్రిల్ 9న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీభవన్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదీతరులు ఉన్నారు. వీరికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో దళితులకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ మార్చిపోయారని గుర్తు చేశారు. మంథనిలో దళితులపై దాడులు జరిగాయని అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు ఉన్నదని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. శాసనసభలో దళితుల గురించి మాట్లాడకుండా దళిత ఎమ్మెల్యేగా ఉన్న సంపత్ కుమార్‌ని బయటకు పంపించారని విమర్శించారు.గిరిజనులకు రిజర్వేషన్లు రాకుండా సీఎం కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 23న ఢిల్లీలో దళిత విచారణ సమ్మేళనం జరుగుతుందని, రాహుల్ గాంధీ దాంట్లో పాల్గొంటారని తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న దళిత నేతలంతా హాజరు కావాలని కోరారు. రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దళితులు, మహిళలు,మైనారిటీలు, గిరిజనులకు ఒక రక్షణ కవచం లాంటిది పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిన తరువాత బ్రిటిష్ పాలన గుర్తొస్తుందని వ్యాఖ్యానించారు. అన్నివర్గాలకు సమాన హక్కులు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీనని అన్నారు. బీజేపీ దళితులను, మైనారిటీలను ద్వేషిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రేమిస్తుందని చెప్పారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు వారంతా ఒక్కటేనని, ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. -
హోదా హోరు!
సాక్షిప్రతినిధి, విజయనగరం: మండుటెండలు సైతం లెక్క చేయకుండా... రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్సార్సీపీ జిల్లా నేతలు శనివారం జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ‘పదవులు మా కొద్దు... ప్రత్యేక హోదా కావాలం’టూ రాజీనామా చేసిన ఐదుగురు ఎంపీలు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టగా వారికి జిల్లాలో సంపూర్ణ మద్దతు లభిస్తోంది. రాష్ట్రానికి పట్టిన చీకట్లు తొలగిపోయి ప్రత్యేక హోదా రావాలని కాంక్షిస్తూ కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలతో మొదలైన ఈ సంఘీభావ ఉద్యమంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులు స్వయంగా దీక్షల్లో కూర్చొని ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ► ఎంపీల రాజీనామాలకు మద్దతుగా కురుపాంలోని రావాడ కూడలిలో వైఎస్సార్సీపీ నాయకులు శనివారం రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో జరి గిన ఈ దీక్షలో అరుకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, ఎంపీ పీ ఆనిమి ఇందిరా కుమారి, ఐదు మండలాల కన్వీనర్లు, జిల్లా అధికార ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. ► విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పార్టీ నగర కన్వీనర్ ఆశపు వేణుతో పాటు ఇతర నాయకులు పాల్గొనగా పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి దీక్షలో పాల్గొన్న వారికి పూలదండలు వేసి ప్రా రంభించారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ జి ల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు దీక్షా శిబి రాన్ని సందర్శించి సంఘీభావం తెలి పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, మున్సిప ల్ కౌన్సిలర్ ఎస్.వి.వి.రాజేష్ పాల్గొన్నారు. సాయంత్రం భారీ ఎత్తున మానవహారం నిర్వహించి హోదాకాంక్షను వెల్లడించారు. కోలగట్ల, మజ్జిశ్రీనివాసరావు ఇందులో పాల్గొన్నారు. ► గజపతినగరం గణేష్ కూడలి వద్ద మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలేదీక్షలో గంట్యాడ మండల పార్టీ అధ్యక్షుడు వ ర్రి నర్సింహమూర్తి, జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ చైర్మన్ పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా నాయకులు కోడెల ముత్యాలనాయుడు పాల్గొన్నారు. వీరికి గజపతి నగరం, బొండపల్లి, దత్తిరాజేరు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు పలికారు. ► చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్లో రిలే నిరాహార దీక్షలను పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల నమన్వయకర్త మజ్జిశ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభిం చారు. తొలిరోజు గరివిడి మండలానికి చెం దిన మండల పార్టీ అధ్యక్షుడు వాకాడ శ్రీనివాసరావు, ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ పొన్నాడ వెంకటరమణ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ► బొబ్బిలి వైఎస్సార్సీపీ కార్యవర్గం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించగా బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పోల అజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల రామసుధీర్, జిల్లా క్రమశిక్షణ సంఘం సభ్యుడు మర్రాపు జగన్నాథంనాయుడు, మున్సి పల్ మాజీ చైర్మన్ ఇంటి గోపాలరావు, రామభద్రపురం, తెర్లాం మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ∙సాలూరు బోసుబొమ్మ జంక్షన్లో రిలేనిరాహార దీక్షలు సాలూరు మండల పార్టీ అధ్యక్షుడు సువ్వాడ రమణ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో జెడ్పీటీసీ, జిల్లా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, సర్పంచ్ జన్ని సీతారాం, పార్టీ రాష్ట్ర నాయకులు జరజాపు ఈశ్వరరావు పాల్గొన్నారు. ► ఎస్.కోట నియోజకవర్గ సమన్వయకర్త ఎ.కె.వి.జోగినాయుడు నేతృత్వంలో స్థానిక దేవి జంక్షన్లో రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. దీక్షకు ఆయనతో పాటు రాష్ట్ర కార్యదర్శులు రొంగలి జగన్నాథం, నెక్కల నాయుడుబాబు, గుడివాడ రాజేశ్వరరావుతో పాటు ఐదు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే కుంభారవిబాబు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. సాయంత్రం భారీ ఎత్తున మానవహారం నిర్వహించారు. ► పార్వతీపురంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షల్లో పార్టీ సీనియర్ నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, జిల్లా అధికార ప్రతినిధి వెంపల గుర్రాజుతో పాటు నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ సారధ్యంలో హోదా సాధిస్తాం – ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం మునిసిపాలిటీ: విభజనతో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధించి తీరుతామని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన మానవహారంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలే కారణమన్నారు. నాలుగేళ్లుగా జగన్మోహన్రెడ్డి వివిధ రూపాల్లో నిరసనలు, ధర్నాలు, బంద్‌లు, దీక్షలు చేపట్టడం ద్వారా హోదా ఆవశ్యకతను గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లారన్నారు. నాలుగేళ్లపాటు ప్యాకేజీల పేరిట స్వప్రయోజనాలను చూసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు ఛీకొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే ఆయన యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన ఎంపిలతో రాజీనామాలు చేయించి పోరాటానికి కలసిరావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు తాకట్టు –ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కురుపాం: ఓటుకు నోటు కేసు, ప్రత్యేక ప్యాకేజీల కోసం రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను మోదీ కాళ్లదగ్గర తాకట్టు పెట్టారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. కురుపాంలో నిర్వహించిన నిరాహార దీక్ష శిబిరంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు స్వార్ధ బుద్ధిని రాష్ట్రప్రజలు ఎప్పుడో గుర్తించారని తెలిపారు. హోదాకోసం నాలుగేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌సీపీయేనన్నారు. హోదా ఆవశ్యకతను జగన్మోహన్రెడ్డి ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పించారని తెలిపా రు. ప్రజల్లో వ్యతిరేకతకు భయపడి హోదాపై చంద్రబాబు మాయపోరాటం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ ఢిల్లీలో రాజీనామా చేసిన ఎంపీలు చేపడుతున్న ఆమరణ దీక్షకు ఎన్నిరోజులైనా నియోజకవర్గ కేంద్రాల్లో రిలేదీక్షలు చేపడతామని తెలిపారు. -
‘హోదా’ ఉద్యమం హోరెత్తాలి
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా–ఆంధ్రుల హక్కు నినాదం మిన్నంటడంతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఎంపీలు చేపట్టే ఆమరణ దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు ప్రారంభించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన శ్రేణులకు పిలుపునిచ్చింది. హోదాపై తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్దేశించిన ఈ పోరాటంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక హోదా నినాదం ఊరూవాడా మార్మోగేలా చూడడంతోపాటు హోదా అవసరాన్ని ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేస్తూ కేంద్ర పార్టీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించండి: ఉద్యమాన్ని పెద్దఎత్తున నిర్వహించేలా కార్యాచరణను రూపొందించేందుకు తక్షణమే జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలంది. పార్టీ ముఖ్య నాయకులతో పాటు పార్టీ విద్యార్థి, యువజన, మహిళా విభాగాల నాయకులను ఆహ్వానించి, చర్చించి కార్యాచరణ రూపొందించాలని పేర్కొంది. ఈ పోరాటంలో వైఎస్సార్సీపీతో కలసి వచ్చే పార్టీలను, ప్రజా, ఇతర సంఘాల వారిని లిఖితపూర్వకంగా సంప్రదించి ముఖ్యులతో నేరుగా మాట్లాడి వారి మద్దతు కూడగట్టేలా చూడాలని పార్టీ కోరింది. -
మూకుమ్మడిగా నిరాహార దీక్షలు!
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీలో 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రత్యక్ష ఆందోళనలకు దిగిన టీపీసీసీ నేతలు.. అధికార పార్టీ తీరును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇద్దరు సభ్యులను బహిష్కరించిన విషయంపై న్యాయ పోరాటం చేయడం, జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని చర్చనీయాంశం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలోని ప్రజానీకం దృష్టిని ఆకర్షించేలా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఏఐసీసీ ప్లీనరీ నుంచి రాగానే దీనిపై కార్యాచరణ ఖరారు చేయనున్నట్లు సమాచారం. మూకుమ్మడిగా నిరాహార దీక్షలు ప్రజాసమస్యలపై అసెంబ్లీ వేదికగా చర్చకు అవకాశమివ్వకుండా తమను బయటికి పంపారన్న ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈ అంశాన్ని వదిలిపెట్టకూడదని నిర్ణయించింది. దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలను సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెండ్ చేయడం, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఓటేయాల్సిన ఇద్దరు సభ్యులను బహిష్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. అయితే హైదరాబాద్ కేంద్రంగా పోరాటాలు చేయాలా, క్షేత్రస్థాయికి వెళ్లాలా అన్న దానిపై టీపీసీసీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమం చేయడం ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళుతోందని.. 48 గంటల నిరాహార దీక్ష కూడా తమ వాదనను హైలైట్ చేసేందుకు ఉపయోగపడిందని కొందరు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలంతా కలసి మూకుమ్మడి నిరాహార దీక్షలకు దిగాలని యోచిస్తున్నారు. గాంధీభవన్ వేదికగా 12 మంది నిరాహార దీక్ష చేపట్టి.. పార్టీ కేడర్‌ను ఉద్యమానికి సమాయత్తం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే పోరుబాట ఈనెల 12న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఆందోళనపై అధికార పక్షం దూకుడుగా వ్యవహరించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరి సభ్యత్వాలను రద్దు చేసింది. దీంతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ వెంటనే పోరుబాట పట్టింది. బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు 48 గంటలు నిరాహార దీక్ష చేశారు. తర్వాత మూకుమ్మడి రాజీనామాల దిశగా సీఎల్పీ యోచన చేసినా.. ఏకాభిప్రాయం రాకపోవడంతో విరమించుకుంది. అయితే ప్రభుత్వ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టునూ ఆశ్రయించింది. పార్టీ ఎన్నికల కంట్రోల్ కమిషన్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేసింది. అటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఉన్న టీపీసీసీ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. నేడో, రేపో కొందరు ఏఐసీసీ పెద్దలతో కలసి టీపీసీసీ నాయకత్వం రాష్ట్రపతిని కలిసే అవకాశముంది. రెండు మూడు రోజుల్లో కార్యాచరణ ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సభలు పెట్టాలన్న దిశగా టీపీసీసీ నేతలు చర్చించారు. అయితే ఎలాగూ బస్సుయాత్రలో భాగంగా జిల్లాలకు వెళతాం కాబట్టి.. అప్పుడే సభలు పెట్టాలని కొందరు నేతలు పేర్కొన్నారు. వీలైతే బస్సుయాత్రను వెంటనే ప్రారంభించాలని, మంచి ఊపు మీదున్న బస్సుయాత్రలోనే ప్రభుత్వ చర్యను ఎండగట్టాలని ప్రతిపాదించారు. కానీ షెడ్యూల్ ప్రకారమే బస్సుయాత్ర జరపాలని, ఆలోగా హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమాలు చేయాలని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. సస్పెండైన ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలసి మాక్ అసెంబ్లీ నిర్వహించడం ద్వారా మీడియా దృష్టికి ఆకర్షించాలని దాదాపుగా నిర్ణయించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలపై మరోసారి క్షుణ్నంగా చర్చిస్తామని, సోమ, మంగళవారాల్లో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు. -
నేడు ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు
సాక్షి, హైదరాబాద్: కార్మికుల పనిభారాన్ని తగ్గించకపోవటం, వేతన సవరణ గడువు తీరినా అమలు చేయకపోవ టాన్ని నిరసిస్తూ సోమవారం అన్ని రీజినల్ కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తున్నట్టు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత రాజిరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో జూబ్లీ బస్‌స్టేషన్, ముషీరాబాద్–2 డిపోల వద్ద చేపట్టనున్నామన్నారు. -
శాంతియుత పోరాటం చేస్తాం
నెల్లూరు(అర్బన్): తమ సమస్యల పరిష్కారానికి మహాత్మాగాంధీ పద్ధతుల్లో శాంతి యుతంగా దీర్ఘకాలిక పోరాటం చేస్తామని పలువురు మహిళా డాక్టర్లు పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక పెద్దాస్పత్రి వద్ద డాక్టర్లు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 31వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ నాయకురాలు శోభారాణి మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని తాము కోరితే ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం దారుణమన్నారు. చర్చలకు ప్రభు త్వ పెద్దలు తప్పించుకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి డాక్టర్లతో వెంటనే చర్చలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీదేవి, శోభారాణి, పరంజ్యోతి, అపర్ణ, మీనా పాల్గొన్నారు. -
ధర్నాచౌక్ పరిరక్షణకు ఉద్యమం : చాడ
ఈ నెల 15 నుంచి మే 9 వరకు నిరాహార దీక్షలు: చాడ సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌ను పరిరక్షించుకునేందుకు ప్రజా ఉద్య మాలు ప్రారంభిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ప్రజా, విద్యార్థి, కార్మిక, కర్షక, మహిళా సంఘాలతో దశలవారీగా ఉద్యమాలు నిర్వహించి ధర్నాచౌక్‌ను ఇందిరాపార్క్ వద్దే కొనసాగిం చేలా ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. గురువారం మగ్దూంభవన్‌లో ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. చాడ వెంకట్‌రెడ్డి మాట్లా డుతూ ధర్నా చౌక్ ఎత్తివేయొద్దని గవర్నర్, హోంమంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఈ నెల 15 నుంచి మే 9 వరకు మగ్దూంభవన్ ఎదుట రోజుకో సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహిస్తామ న్నారు. మే 10న ఇందిరాపార్క్ వద్ద భారీ సభ ఏర్పాటు చేస్తామన్నారు. సమా వేశంలో పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, ప్రజా తెలంగాణ వేదిక గాదె ఇన్నయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రవిచంద్ర, ఎంసీపీఐ సాంబయ్య, సీపీఐ నేత ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిరాహార దీక్షలు చేపడతా: జస్టిస్ కర్ణన్
కోల్‌కతా: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాను దళితుడైనందునే ఉన్నత న్యాయస్థానం వేధిస్తోందని కర్ణన్ ఆరోపిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా త్వరలోనే తాను నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌ను వెనక్కి తీసుకోవాలని, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రద్దు చేసిన తన అధికారాలు, విధులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన విధులకు ఆటకం కలిగించినందుకు గాను రూ.14 కోట్ల పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధనకు త్వరలోనే కోల్‌కతా, లక్నో, ఢిల్లీ, చెన్నై నగరాలలో నిరాహార దీక్షలు చేపడతానని తన ప్రతినిధి రమేశ్ పీటర్ కుమార్ ద్వారా ఆయన వెల్లడించారు. ఢిల్లీలో అయితే రాష్ట్రపతి భవన్ ఎదుటగానీ, లేక రామ్‌లీలా మైదానంలో ఎక్కడ పర్మిషన్ ఇస్తే అక్కడ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు వారంట్ నేపథ్యంలో ఈ దీక్షలను మార్చి 31వ తేదీ తర్వాత చేపట్టాలా? అంతకు ముందే ప్రారంభించాలా? అనేది తాను ఇంకా నిర్ణయించుకోలేదని జస్టిస్ కర్ణన్ చెప్పారు. -
వేడెక్కిన తమిళనాడు.. దీక్షలకు స్టాలిన్ సై
చెన్నై: తమిళనాడులో మరోసారి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ డీఎంకే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసన తర్వాత ఈ నెల 22 నుంచి నిరసన కార్యక్రమాలకు డీఎంకే పిలుపునిచ్చింది. తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించింది. ఆ రోజు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ దీక్షలకు దిగాలని డీఎంకే పిలుపునిచ్చింది. తమిళనాడు పోలీసులు డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తలతో కలిసి మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం ముందు పోలీసుల అనుమతి లేకుండానే ఆందోళన నిర్వహించి నానా రచ్చచేశారని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు దిగారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పార్టీ కార్యాలయంలో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులతో స్టాలిన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయాలు వెలువరించారు. శాంతియుతంగా ఆవేదనను, నిరసనను తెలియజేసిన తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 22న నిరహార దీక్షలకు పిలుపునిచ్చారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి స్టాలిన్‌పై కేసు నమోదు స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ -
విద్యుత్ కార్మికుల నిరాహార దీక్షలు
ఖమ్మం: నగరంలోని ట్రాన్సకో కార్యాలయం ఎదుట 13 సంఘాల ఐక్యఫ్రంట్ టీఎఫ్ (టీఈటీయూఎఫ్) తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్ ఫ్రం ట్ ఇచ్చిన పిలుపు మేరకు టీఎస్ట్రాన్సకో 13 సబ్స్టేషన్ల కార్మికులు, మూడు గ్యాంగ్ కార్మికులు, ఆఫీస్ స్టాఫ్, టీఆర్ఎస్ స్టాఫ్ ఆధ్వర్యంలో సోమవారం నిరాహార దీక్షను ప్రారంభించారు. ఫ్రంట్ చైర్మన్ టి.శేషగిరిరావు, కన్వీనర్ శ్రీనివాసరావు, కో చైర్మన్ ఎం.ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కలుగ చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీక్షలు ఈనెల 25 వరకు కొనసాగుతాయని తెలిపారు. దీక్షలో జి.శ్రీను (మధిర), ఎండి.మౌలానా (ఇల్లెందు), నర్సింహారావు, రవి (మణుగూరు), కె.శ్రీను, డి.రాజు, డి.రామకృష్ణ కూర్చున్నారు. కార్యక్రమంలో ఎండి.యాకూబ్‌పాషా, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎస్ఈ కార్యాలయం ఎదుట.. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నగరంలోని ట్రాన్సకో సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. టీఈటీయూఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.శేషగిరిరావు, ఎం.సత్యనారాయణరెడ్డి, కోకన్వీనర్ నాగేశ్వరరావు, 327 యూని యన్ కంపెనీ అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావు, సీఐటీయూ కంపెనీ కార్యదర్శి ఎం.ప్రసాద్, కె.నాగేశ్వరరావు, రవికుమార్, సీతారామయ్యలు మా ట్లాడారు. వచ్చేనెల 6 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. దీక్ష లో యుగంధర్, ఆదిదీపక్, ఎం.అరుణ్,జానీపాషా, రామారావు, ఎస్.రామా రావు, బి.వీరబాబు, సిహెచ్.కిషోర్, టి.సూర్యం పాల్గొన్నారు. -
22 నుంచి రేషన్ డీలర్ల ఆమరణ నిరాహార దీక్షలు
హన్మకొండ చౌరస్తా : రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు రూ. 20వేల వేతనం ఇవ్వాలని కోరుతూ ఈనెల 22 నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల రమేష్‌బాబు తెలిపారు. హన్మకొండ రెడ్డికాలనీలోని బిందాస్గార్డెన్లో శుక్రవారం రేషన్ డీలర్ల జిల్లా ముఖ్య కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ గతంలో ఐదు రోజుల పాటు నిరాహార దీక్షలు, ఆరో రోజు శాంతియుత మహార్యాలీ నిర్వహించామన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధపడినట్లు తెలిపారు. గత 40 ఏళ్లుగా చాలీచాలనీ కమిషన్లతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్, ఈ–పాస్, సీసీ కెమెరాలు, బినామీ డీలర్ల ఏరివేత, బోగస్ కార్డుల తొలగింపు ప్రక్రియను స్వాగతిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు పార్టీలకతీతంగా పాల్గొని సంఘం పో రాటాలకు మద్దతుగా నిలవాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్, నాయకులు పి. వీరన్న, జి.రాధాకృష్ణ, ఎం.రవీందర్, లింగయ్య, నర్సింహులు, వాణిరామరాజు, రమేష్, మల్లయ్య, విజయ్‌పాల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మా ప్రాంతాన్నే.. కొత్త మండలం చేయాలి
► జిల్లా పునర్విభజన నేపథ్యంలో డిమాండ్ ► పలుచోట్ల కొనసాగుతున్న ఆందోళనలు, నిరాహార దీక్షలు ► అధికారులకు వినతిపత్రాల సమర్పణ ► కలెక్టర్ కాన్వాయ్‌ని అడ్డుకున్న రాజోలివాసులు ► మండల కేంద్రాలుగా ఏ గ్రామాలు ఆవిర్భవించేనో.. ► కొత్త మండలాల ఏర్పాటుపై పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి కలెక్టర్ కాన్వాయి అడ్డగింత... వడ్డేపల్లి మండలంలోని పడమటి గార్లపాడులో గ్రామజ్యోతిలో పాల్గొని తిరిగి వెళ్తున్న కలెక్టర్ శ్రీదేవిని రాజోలి గ్రామస్తులు అడ్డుకున్నారు. 10రోజులుగా రాజోలిని మండలం చేయాలని రిలే దీక్షలు చేపడుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు కలె క్టర్ కాన్వాయ్కి అడ్డుగా నిల్చున్నారు. రాజోలిని మండల కేంద్రం చేస్తామని ప్రకటించేవరకు పోనివ్వబోమని భీష్మించుకుని కూర్చున్నారు. పరిస్థితి గమనించిన పోలీసులు వారిని పక్కకు తప్పుకోవాలని సూచించారు. పదినిమిషాల అనంతరం పోలీసులు గ్రామస్తులను పక్కకుతోసి కలెక్టర్ కాన్వాయ్‌ను పంపించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త మండలాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తమ గ్రామాలను మండలాలుగా చేయాలన్న డిమాండ్ పెద్దఎత్తున వస్తోంది. సకల సౌకర్యాలు కలిగిన తమ ప్రాంతాన్ని మండల కేంద్రంగా చేయాలని జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఏకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. శనివారం ఏకంగా రాజోళి వాసులు కలెక్టర్ కాన్వాయ్‌నే అడ్డుకున్నారు. భౌగోళికంగా రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో ఇప్పటికే 64 మండలాలున్నాయి. ఈ మండలాల తో కూడిన ప్రాంతాలను మూడు జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వ చ్చింది. పాలన సౌలభ్యం కోసం గ్రామీ ణ ప్రాంతాల్లో మండల వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు కొత్త మండలాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భా విస్తోంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జి ల్లాలో 5 అర్బన్ మండలాలను, 6 గ్రామీ ణ మండలాలను కొత్తగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు జిల్లా అధికారులను ఆదేశిం చింది. దీనిపై అన్ని హంగులు ఉన్న గ్రా మీణ ప్రాంతాలను మండల కేంద్రంగా మార్చడానికి ఆయా ప్రాంతాలకు ఉన్న అర్హతలపై జిల్లా అధికారులు కసరత్తు చే శారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 6 మండలాలు మాత్రమే ఏర్పాటుచేయడానికి అవకాశముండగా దాదా పు ప్రతి మండలం నుంచి ఒకటి రెండు గ్రామా లు తమ ప్రాంతాన్ని మండల కేంద్రాలు గా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఆందోళనబాట.. మండలాలుగా చేయాలని ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేయడమే కాక వివిధ రూపాల్లో ఆందోళన చేశారు. రాజోళిలో అయితే దీక్షలు చేపట్టారు. మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు వినతిపత్రాలు అందజేశారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రంగా చేయాలని డిమాండ్ రావడంతో రాజకీయ పార్టీల నేతలకు ఆ గ్రామాల ప్రజల కోరిక నెరవేర్చడం శక్తికి మించిన భారంగా మారింది. మూడు దశాబ్దాల తర్వాత కొత్త మండలాలను ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం సంకల్పించడంతో ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా ఆయా గ్రామాల ప్రజలు రాజకీయంగా పార్టీల నేతలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల డిమాండ్‌పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో.. ఏ గ్రామాలను మండల కేంద్రాలుగా ఏ ప్రాతిపదికన ప్రకటిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మండలాల డిమాండ్ ఇలా.. అచ్చంపేట మండలంలోని సిద్ధాపూర్, అమ్రాబాద్ మండలంలోని పదర, మన్ననూర్లను మండలాలు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మన్ననూర్ను మండలం చేయాలని చెంచులు కోరుతున్నారు. వంగూర్ మండలంలోని చారకొండ, మానవపాడు మండలంలోని ఉండవెల్లి, అలంపూర్, ఇటిక్యాల మండలంలోని ఎర్రవెల్లి చౌరస్తా, వడ్డేపల్లి మండలంలోని రాజోళి, మాన్‌దొడ్డి, కొల్లాపూర్ మండలంలోని సింగోటం, పెంట్లవెల్లి, గట్టు మండల పరిధిలోని నందిన్నె, కుట్టినెర్ల, ఆలూరు, సింగనదొడ్డి గ్రామాల పేర్లు సూచిస్తున్నారు. కోస్గి మండలంలోని గుండూమాల్, బాలానగర్ మండలంలోని రాజాపూర్, ఉదిత్యాల, నవాబుపేట మండలంలోని కొల్లూర్, ఆమన్‌గల్ మండలంలో కడ్తాల్, ధరూర్ మండలంలోని ఉప్పేర్, పాతపాలెం, అల్వాల్‌పాడు, కొత్తకోట మండల పరిధిలో మదనాపురం, పామాపురం, అజ్జకొలు, బిజినేపల్లి మండలంలో పాలెం గ్రామాలను మండలాలుగా చేయాలని ఆ ప్రాంతాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి చేరిన కొత్తమండలాల పేర్లు . జిల్లా అధికారులకు మాత్రం కొత్త మండల కేంద్రాలుగా కొన్ని గ్రామాల పేర్లను ఇప్పటికే సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆత్మకూరు మండలంలోని అమరచింత, బాలానగర్ మండలంలోని రాజాపూర్, వీపనగండ్ల మండలంలోని చిన్నం బావి, గట్టు మండలంలోని నందిన్నె, ధన్వా డ మండలంలోని మల్దకల్ గ్రామాలు మం డల కేంద్రాలుగా రూపొందడానికి అర్హతలు కలిగి ఉన్నాయని ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక సమర్పించారు. అయితే కొత్త మండలాల ఏర్పాటుపై ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ప్రభుత్వ ప్రతిపాదనల్లో మరికొన్ని చోటుచేసుకొనే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. . -
ప్రత్యేక నినాదాల హోరు
ప్రత్యేక హోదా నినాదాలతో జిల్లాలోని ఆర్టీసీ డిపోలు బుధవారం దద్దరిల్లాయి. రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకోగా మరో పక్క కొవ్వొత్తుల ర్యాలీలు.. కాగడాల ప్రదర్శనలు జరిగాయి. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్సీపీ అధినాయకత్వం పిలుపుతో జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు, బస్కాంప్లెక్స్ల ఎదుట ధర్నాలు. బైఠాయింపులు జరిపారు. అనకాపల్లిలో పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాడుగులలో ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. -
‘హోదా’పై అదే పోరు
- రాష్ట్రవ్యాప్తంగా ఉధృతమవుతున్న ఆందోళనలు - కొనసాగుతున్న దీక్షలు, ర్యాలీలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అలుపెరగని పోరు కొనసాగుతోంది. ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ర్యాలీలు, నిరాహార దీక్షలు, వినూత్న నిరసన కార్యక్రమాలతో ప్రజలు తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో మంగళవారం వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించారు. నెల్లూరు: విడవలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఆత్మకూరు బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. కావలిలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటాచలంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. అనంతపురం: కదిరిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సీపీఐ, సీపీఎం, పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. రాయదుర్గంలో నాలుగో రోజు దీక్షలను మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పెనుకొండ, మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. గుత్తి, గుంతకల్లులో బైక్ ర్యాలీ చేపట్టారు. తాడిపత్రిలో నాలుగో రోజూ రిలే దీక్షలు కొనసాగాయి. కడప: వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బద్వేలు లో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ప్రొద్దుటూ రు, రాయచోటి, కడప, రాజంపేటలో రిలే దీక్షలు కొనసాగాయి. కర్నూలు: పాణ్యం, కర్నూలు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, భూమా అఖిలప్రియారెడ్డి, ఐజయ్యలు పాల్గొన్ని సంఘీభావం తెలిపారు. తిరుపతి: తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట సర్కిల్, పలమనేరు, నారాయణవనం, ఐరాల, నగరి, పుంగనూరు, కుప్పం, చిత్తూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు, దీక్షలు జరిగాయి. శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని వైఎస్సార్ కూడలి వద్ద దీక్షా శిబిరాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాధరావు ప్రారంభించారు. పట్టణంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఆమదాలవలస, నరసన్నపేట, రాజాం, టెక్కలి, పలాస, ఎచ్చెర్ల, పాలకొండ, ఇచ్ఛాపురంలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. విజయనగరం: తొమ్మిది నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. విజయనగరం పట్టణం, సాలూరు, కురుపాం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్.కోటలో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. బొబ్బిలిలో రిలే దీక్షలను కొనసాగించారు. తూర్పుగోదావరి: రాజమండ్రి కోటగుమ్మం సెంటర్, రామచంద్రాపురం రిలే దీక్షలు కొనసాగాయి. ఏలేశ్వరం, ప్రత్తిపాడుల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తునిలో జరిగిన రిలే దీక్షల్లో కోటనందూరు మండల కార్యకర్తలు పాల్గొన్నారు. రావులపాలెం, అమలాపురం హైస్కూల్ సెంటర్లో దీక్షలను వైఎస్సార్సీపీ నేతలు ప్రారంభించారు. ఏజెన్సీ, జగ్గంపేట, రాజానగరం, కరప మండలం, పిఠాపురం, అనపర్తి, పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో దీక్షలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి: జిల్లావ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, వైఎస్సార్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించారు. దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. తణుకు, ఆచంట తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ: పాడేరు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మాడుగులలో రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. విశాఖలో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. తగరపువలసలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని తెలిపారు. చోడవరం, పాయకరావుపేటలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడ: కంకిపాడు ప్రధాన సెంటరులో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్సీపీ నాయకుడు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. పామర్రులో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఒంగోలు: గిద్దలూరు, చీరాల, టంగుటూరు, సంతనూతల పాడు, గిద్దలూరు, దర్శి, చీరాల, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాల్లో ఆందోళనలు, రిలే దీక్షలు కొనసాగాయి. గుంటూరు: బాపట్ల, సత్తెనపల్లి, వినుకొండ, తెనాలి నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. రిలే నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా కోసమే జగన్ నిరవధిక దీక్ష
అందరూ అండగా నిలవాలి 27 నుంచి జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలి వైఎస్సార్సీపీ శ్రేణులకు జ్యోతుల నెహ్రూ పిలుపు జగ్గంపేట :రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడుతుందని, ఇందులో భాగంగానే తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో గురువారం జరిగిన గ్రామ, మండల కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా జగన్ గుంటూరులో శనివారం నుంచి నిరవధిక దీక్ష చేపడుతున్నారన్నారు. దీనికి మద్దతుగా గ్రామ, నియోజవర్గ నాయకులు సమన్వయంతో జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాలన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరుగుతోందని, ఆర్థిక వనరులు లేక ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పరిశ్రమలు రాకుంటే నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుందని, యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని జ్యోతుల ఆవేదన వ్యక్తం చేశారు. ‘బాబు వస్తే జాబు’ అన్నారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆదర్శ రైతులను తొలగించారని, ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు చూస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు 2600 ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి ముఖ్య కారకుడైన చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని రాజ్యసభలో చేసిన ప్రకటన, వెంకయ్యనాయుడు హామీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ చేస్తున్న పోరాటానికి అండగా ఉండాలని ప్రజలకు జ్యోతుల విజ్ఞప్తి చేశారు. జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్‌కుమార్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పే చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్పేలా చైతన్యం తీసుకురావల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఉందని, ప్రజాపక్షాన నిలచి పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురామ్, జెడ్పీటీసీ సభ్యులు వీరంరెడ్డి కాశీబాబు, పాలూరి బోస్‌బాబు, ఎంపీపీలు గుడేల రాణి, కంచుమర్తి రామలక్ష్మి, అత్తులూరి సాయిబాబు, మారిశెట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు. -
కల ఫలించింది.. దీక్ష విరమించారు!
ఢిల్లీ: గత కొంతకాలంగా ఒకే పింఛను-ఒకే హోదా(వన్ పెన్షన్-వన్ ర్యాంక్) కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ సైనికులు ఆదివారం తమ దీక్షను విరమించారు. గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. 42 ఏళ్లుగా ఎదురుచూసిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ సైనికులు.. తమ డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేరిన తర్వాతే దీక్ష విరమిస్తామని చెప్పారు. కానీ, అంతకుముందే దీక్ష విరమించారు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన ముగ్గురు ప్రముఖులు జంతర్ మంతర్ వద్ద భోజన కార్యక్రమం పూర్తి చేశారు. రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ 2014 జూలై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా అమలుచేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. -
రంజాన్‌లోగా స్పందించకుంటే సమ్మె ఉధృతం
కార్మిక సంఘాల జేఏసీ ఆల్టిమేటం 17న సీఎం క్యాంపు కార్యాలయాల ముట్టడి జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు విజయవాడ (గాంధీనగర్) : కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. రంజాన్‌లోగా కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ దమనకాండకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపడతామని, అలాగే ఈనెల 17న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. పదవ పీఆర్సీ కనీసం వేతనం రూ.13,170గా నిర్ణయించినప్పటికీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు రూ.10 వేలకు మించి ఇవ్వలేమని ప్రకటించడం దుర్మార్గమన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాలన గాడి తప్పిందన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందని తెలిపారు. కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె బాట పడితే రోజుకు రూ.275లు ఇచ్చి ప్రైవేటు వర్కర్లను పెట్టుకుంటామని ప్రకటించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. కనీస వేతనం రూ.13,170 చెల్లించాలని జీవోలు చెబుతున్నా కార్మికులకు కేవలం రూ.6,500 మాత్రమే చెల్లిస్తున్నారని మండిపడ్డారు. సీఐటీయూ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతున్న పాలన వ్యవహారాలపై ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి బాధ్యత లోపించిందన్నారు. సమావేశంలో బీఎంఎస్ నాయకులు దశరథరామరాజు, ఐఎన్టీయూసీ నాయకులు వెంకటసుబ్బయ్య, ఇఫ్టూ నాయకులు ప్రసాద్, చలసాని రామారావు తదితరులు పాల్గొన్నారు. -
బాబోయ్ కంపు..!
♦ పారిశుధ్య కార్మికుల సమ్మె ఉధృతం ♦ చెత్తకుప్పలుగా మారిన పట్టణాలు ♦ జిల్లా వ్యాప్తంగా పొంచి ఉన్న వ్యాధుల ముప్పు ♦ గుంటూరులో కమిషనర్, ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు... ♦ మంచినీరు, వీధిదీపాల సేవలను సైతం నిలిపివేస్తామని హెచ్చరిక అరండల్‌పేట(గుంటూరు) : పురపాలక సంఘాలు, కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పారి శుధ్య కార్మికుల సమ్మె ఉధృతమైంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తుండడంతో వీధులన్నీ చెత్తతో పేరుకుపోయాయి.ప్రధానంగా జిల్లాలోని 12పట్టణాలు, గుంటూరు నగరం మురికి కూపాలుగా మారిపోయాయి. రోడ్లపై చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. దీనికితోడు వర్షం కురవడంతో చెత్త నుంచి వస్తున్న దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ వీధి చూసినా చెత్త, చెదారంతో నిండిపోయి కంపుకొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే రోగాల బారిన పడుతున్నారు. వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు త్వరితగతిన వ్యాపించే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మలేరియా, డెంగీ, వంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే దోమలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కార్మికుల నిరవధిక నిరాహార దీక్షలు కార్మికులకు కనీసవేతనం రూ.15వేలు ఇవ్వాలని, అలాగే పదవ వేతన సవరణను పర్మనెంట్ కార్మికులకు అమలు చేయాలని, జీఓ నంబరు 261 అమలుతో పాటు మొత్తం 17 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. అయితే రాష్ట్రప్రభుత్వం రెండు విడతలుగా వీరితో చర్చలు జరిపినా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. తొలివిడత చర్చల్లో కార్మికులకు కనీస వేతనం రూ.13వేలు ఇస్తామని ఒప్పుకున్న ప్రభుత్వం తర్వాత మాటమార్చి తొమ్మిది, పదివేలంటూ బేరాలాడుతోందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు రెండు రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలకు దిగారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లోని పురపాలక సంఘాల ఎదుట దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. గుంటూరులో కమిషనర్, ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు... జిల్లాలోని అన్ని పట్టణాల్లో పర్మనెంట్ కార్మికులతో పారిశుధ్య పనులు చేయించాలని ఉన్నతాధికారులు కమిషనర్లను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు, కమిషనర్లు పర్మనెంట్ కార్మికులు విధుల్లోకి రావాల్సిందిగా హెచ్చరికలు జారీచేశారు. దీన్ని ఖాతరు చేయక పోవడంతో వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేశారు. అదేసమయంలో గుంటూరు నగరంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఇన్చార్జి కమిషనర్ సి.అనురాధలు మార్కెట్ల వద్ద చెత్తను త రలించేందుకు బుధవారం ప్రయత్నించగా కార్మికులు, యూనియన్ నాయకులు అడ్డుకున్నారు. అదేవిధంగా చెత్తను తరలించే వాహనాల్లో గాలి తీశారు. దీంతో అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లాలోని అన్ని పట్టణాల్లో మంచినీరు, వీధిదీపాల సేవలను సైతం నిలిపివేస్తామని యూనియన్నాయకులు ప్రకటించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం : వైఎస్సార్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం
కొనసాగిన మున్సిపల్ కార్మికుల నిరసనలు విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని మున్సిపల్ కార్యాలయాల వద్ద మంగళవారం మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహించారు. ఇదిలాఉండగా ప్రభుత్వం ఒకవైపు చర్చల పేరుతో బుజ్జగిస్తూనే మరోవైపు సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నాలు చేస్తోంది. సమ్మెకు దిగిన పర్మినెంట్ ఉద్యోగులకు సర్వీస్ బ్రేక్ అవుతుందని,బెదిరిస్తోంది. కాగా విశాఖలో మున్సిపల్ కార్మికులతో మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.బుధవారం రాజమండ్రిలో జేఏసీతో చర్చలు జరుపుతామని గంటా ప్రకటించారు. -
రెండో రోజూ కొనసాగిన రిలే నిరాహార దీక్షలు
ఆనందపేట (గుంటూరు): ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజు మంగళవారం కూడా కొనసాగాయి. రెండోరోజు శిబిరానికి పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు బీజేపీ విషబీజాన్ని నాటిందని, తెలుగుదేశం పార్టీ ఆ విష వృక్షాన్ని నీరు పోసి పెంచి పోషించిందని ఆరోపించారు.రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపిన తరువాతే కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకుందన్నారు. విభజన తరువాత రాష్ట్రానికి మేలు జరిగేలా అనేక అంశాలతో ఆర్డినెన్స్ జారీ చేశామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయాలని, రూ.5 లక్షల కోట్లతో పథకాలను రూపొందించాలని చట్టం రూపంలో చేశామని ఆయన వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టనవసరం లేదని, విభజన చట్టంలోని అంశాలను అమలుచేస్తే చాలని ఆయన అన్నారు. బీజేపీ, టీడీపీలు వారి స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలి చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్‌పార్టీ జిల్లా పరిశీలకుడు ఆకుల శ్రీనివాసరావు, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, నగర అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు షేక్ మస్తాన్‌వలి, మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు, చదలవాడ జయరాంబాబు, యర్రం వెంకటేశ్వరరెడ్డి, జిల్లాపరిషత్ మాజీ చైర్పర్సన్ కూచిపూడి విజయ, కాంగ్రెస్‌పార్టీ నాయకులు కూచిపూడి సాంబశివరావు, వణుకూరి శ్రీనివాసరెడ్డి, షేక్ అబ్దుల్ వహీద్, కొరివి వినయ్‌కుమార్, మిరియాల రత్నకుమారి, ఈరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల ఆమరణ దీక్ష విరమణ
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయూలని కోరుతూ గత మూడు రోజులుగా జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు కొనసాగిస్తు న్న ఆమరణ నిరాహార దీక్షను శనివారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. అంతకు ముందు కేటీఆర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఎస్ఆర్ఎస్పీ సమీపంలో వాటర్‌గ్రిడ్ ఇన్‌టేక్ వెల్‌ను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ హై కోర్టు కోసం న్యాయవాదుల ఆందోళన ⇒ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు ⇒ ఉదయం పూట నడవని ఆర్టీసీ బస్సులు ⇒ మూడో రోజు సాగిన నిరాహార దీక్షలు ⇒ క్షీణించిన ఆరోగ్యాలు ⇒ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ ⇒ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్ క్రైం: తెలంగాణ ప్రత్యేక హై కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నగర బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలను స్వచ్ఛందగా మూసివేశారు. తెరిచి ఉంచిన దుకాణాలను న్యాయవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మూసివేయించారు. బస్సులు ఉదయం నడువలేదు. పెట్రోల్ బంక్‌లను సాయంత్ర వరకు మూసిఉంచారు. సినిమా హాళ్లలో ఉదయం ఆటను రద్దు చేశారు. న్యాయవాదులు ఉదయం ఆరుగంటల నుంచి డీసీఎం వ్యాన్‌లో జిల్లా కేంద్రంలో తిరుగుతూ బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బంద్ కారణంగా రద్దీగా ఉంటే గాంధీచౌక్, నెహ్రుపార్కు ప్రాంతాలు బోసి పోయాయి. న్యాయవాదులు ఉదయం బస్టాండ్‌కు చేరుకుని బస్టాండ్ ఎదుట బైఠాయించారు. దాంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయూరుు. బస్టాండ్ ఎదుట ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం 10 గంటల తర్వాత బస్సులు నడిచారుు. ప్రయివేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒక రోజు ముందుగానే సెలవు ప్రకటించారు. బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్ఎల్ శాస్త్రి, ఐకాస కన్వీనర్ ఎం రాజేందర్‌రెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు డీసీఎం వ్యాన్‌లో నగరమంతా తిరుగుతూ బంద్ పాటించాలని ప్రజలను, వ్యాపారులను కోరారు. న్యాయవాదుల ఆందోళనకు మద్దతుగా న్యూడెమెక్రసీ, పీడీఎస్‌యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవేణు ఆధ్వర్యంలో న్యాయవాదులకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌భవన్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై దీక్ష శిబిరానికి చేరుకుంది. అక్కడి నుంచి నగరంలో తిరుగుతూ తెరిచి ఉం చిన దుకాణాలను మూసివేయించారు. ఈ బైక్ ర్యాలీలో మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ పాల్గొన్నారు. బీపీ తగ్గిన న్యాయవాదులు న్యాయవాదులు చేపట్టిన నిరహార దీక్షలు మూడవ రోజుకు చేరుకోగా వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. దీక్ష శిబిరంలో ఉదయం, సాయంత్రం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు న్యాయవాదులకు బీపీ తగ్గిపోతుండటంతో వైద్యులు తగు సూచనలు చేసి వెళ్తున్నారు. తెలంగాణ హై కోర్టు ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చేంతవరకు దీక్షకు వీడబోమని న్యాయవాదులు పేర్కొంటున్నారు. పలు జిల్లాల బార్ కౌన్సిల్ అధ్యక్షుల సంఘీభావం నిజామాబాద్ న్యాయవాదులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి బార్ కౌన్సిల్ అధ్యక్షులు బిపిన్‌కుమార్, ప్రతాప్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఖమ్మం బార్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌రెడ్డి, జిల్లాలోని ఆర్మూర్, బిచ్కుంద బార్ కౌన్సిల్ సభ్యులు సందర్షించి సంఘీభావాన్ని తెలిపారు. తెలంగాణ హై కోర్టు కోసం వివిధ జిల్లాలో జరుగుతున్న ఉద్యమాలు, నిరసనలు సక్రమంగా జరుగటంలేదని, ఆంధ్ర జడ్జీలను బాయికాట్ చేయాలని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. హై కోర్టు కోసం మేం జిల్లాలో ఉద్యమిస్తుంటే, ఉమ్మడి హై కోర్టులో మీరేందుకు ఉద్యమించటంలేదని న్యాయవాదులు హై కోర్టు సాధన కమిటీ సభ్యులను ప్రశ్నించారు. దీనిపై వారు స్పందిస్తూ హై కోర్టు విధుల బహిష్కరణకు బార్ కౌన్సిల్ సభ్యులే ముందుండి నడిపించాలని అప్పుడే సక్సెస్ అవుతామని వారు సమాధానం ఇచ్చారు. దీక్షల విరమణ నిజామాబాద్ క్రైం: పంచాయతీ రాజ్ శాఖ, ఐటీ మంత్రి కె తారక రామారావు శనివారం రాత్రి న్యాయవాదుల దీక్షలను విరమింపజేరుుంచారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ న్యాయవాదుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హై కోర్టు సాధించేవరకు కృషి చేస్తోందన్నారు. 41(ఏ) సెక్షన్‌తో పోలీస్స్టేషన్లలో జరుగుతున్న అవినీతి గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. హై కోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫైల్ చేసిందన్నారు. దీనిపై వచ్చే మంగళవారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం కేటీఆర్ న్యాయవాదులకు నిమ్మరసం ఇచ్చి దీక్షల ను విరమింపచేశారు. కేటీఆర్ వెంట మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, జీవన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత, జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు తదితరులు ఉన్నారు. విధులు బహిష్కరిస్తేనే హైకోర్టు వస్తుంది నిజామాబాద్ క్రైం : ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరిస్తేనే తెలంగాణ హైకోర్టు ఏర్పడుతుందని సాధన కమిటీ కన్వీనర్ సహోదర్‌రెడ్డి అన్నారు. తక్షణమే విధులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో న్యాయవాదుల ఆమరణ నిరహార దీక్ష శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల దీక్షలు తెలంగాణ జిల్లాలలో ప్రతి ఒక్క న్యాయవాదికీ ఆదర్శమన్నారు. తెలంగాణ హైకోర్టు కోసం గవర్నర్‌కు వినతిపత్ర ం సమర్పించామన్నారు. దానికి ఆయన స్పందించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రకు ప్రత్యేక హైకోర్టు కావాలని లెటర్ ఇస్తే తెలంగాణ హైకోర్టు ఏర్పా టుకు మార్గం సుగమమవుతుందని చెప్పారన్నారు. సోమవారం చంద్రబాబును, కేసీఆర్‌ను కలువనున్నామన్నారు. హైకోర్టు ఏర్పడితే మన ఉద్యోగాలు మనకు వచ్చే అ వకాశాలు ఉంటాయన్నారు. హైకోర్టులో ఒక్క రోజు ఉద్యమం చేస్తే చాలని న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం. రాజేందర్‌రెడ్డి అన్నారు. వారం రోజులపాటు విధులు బ హిష్కరిస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. హైకోర్టు ఏర్పాటు కోసం కేంద్ర న్యాయశాఖ విభాగానికి లేఖ ఇచ్చామని, దానిని వారు సుప్రీంకోర్టుకు పంపారని చెప్పారు. ఈ నెల 24న ఏదో ఒకటి తేలిపోనుందన్నారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కోరుతూ న్యాయవాదులు ఇచ్చిన నిజామాబాద్ నగర బంద్ శనివారం ప్రశాంతం గా ముగిసింది. -
రెండో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
నగరం(మామిడికుదురు) :పైప్‌లైన్ విస్ఫోటంతో తీవ్రంగా నష్టపోయిన నగరం గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌తో అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం రెండో రోజుకు చేరాయి. స్థానిక జీసీఎస్ ఎదురుగా ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి విదితమే. నగరం గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు స్థానిక పీహెచ్‌సీని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం, మినర ల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని, గ్రామంలో ప్రతి పేటకు సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని, తదితర డిమాండ్లతో అభివృద్ధి సంక్షేమ సంఘం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వీరి దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. పార్టీ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అభివృద్ధి సంక్షేమ సంఘం డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు డిమాండ్ చేశారు. రిలే దీక్షల్లో సంక్షేమ సంఘం ప్రతినిధులు బొంతు మణిరాజు, జాలెం సుబ్బారావు, ముకరం హుస్సేన్, మొల్లేటి సత్యనారాయణ, వీరవల్లి చిట్టిబాబు, బొక్కా సత్యనారాయణ, మొల్లేటి కృష్ణమూర్తి, వానరాశి తాతాజీ, మొల్లేటి ఏడుకొండలు, మొల్లేటి నాగేశ్వరరావు, మొల్లేటి పద్మావతి, కడలి అనంతలక్ష్మి, చెల్లింగి ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
మెట్టు దిగని ప్రభుత్వం..పట్టువీడని జూనియర్ డాక్టర్లు
-
ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక...
సాక్షి నెట్వర్క్: ‘ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయండి.. లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి’ అనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు సంఘీభావంగా సీమాంధ్ర జిల్లాల్లో వైఎస్సార్ సీపీ నేతలు చేపట్టిన ఆమరణ దీక్షలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక మొక్కవోని ధైర్యంతో కొనసాగిస్తున్న వీరికి జనమద్దతు పోటెత్తుతోంది. పార్టీలు, వర్గాలకతీతంగా ప్రజలు దీక్షాశిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటిస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో డాక్టర్ హరికృష్ణలు చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారంతో ఐదో రోజులు పూర్తి చేసుకుని శనివారం ఆరోరోజుకు చేరాయి. ఆరోగ్యం క్షీణించినా దీక్ష విరమించేదిలేదని వారు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ కర్నూలు నియోజకవర్గం సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష శనివారంతో ఆరో రోజుకు చేరింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కన్వీనర్ విజయ చందర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి ఎస్వీ మోహన్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్బాష, నాగిరెడ్డి దీక్షలు శుక్రవారంతో ఐదవ రోజులు పూర్తయి శనివారంతో ఆరోరోజుకు చేరాయి. శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్దఎత్తున తరలిరావడంతో కలెక్టరేట్ ప్రాంతం జనసంద్రమైంది. శ్రీకాకుళంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారంతో మూడురోజులు పూర్తి చేసుకుని శనివారంతో నాలుగురోజుకు చేరింది. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్, చింతలపూడిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కర్రా రాజారావు, ధర్మాజీగూడెంలో మట్టా సురేష్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఎన్ఎండీ ఇస్మాయిల్ ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఇక సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లోనూ విజయమ్మ దీక్షకు మద్దతుగా చేపట్టిన రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. కాపు భారతి, పైలాల దీక్ష భగ్నం సాక్షి నెట్వర్క్: వైఎస్ విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్శింహయ్య గత ఐదురోజులుగా చేపట్టిన ఆమరణ దీక్షలను శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. రాయదుర్గంలో ఐదురోజులుగా దీక్ష చేస్తున్న భారతి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు సూచించడంతో పోలీసులు మధ్యాహ్నం పెద్దసంఖ్యలో శిబిరం వద్దకు చేరుకున్నారు. పోలీసుల రాకతో శిబిరంలో ఒక్కసారిగా ఉద్రిక్తవాతావరణం నెలకొంది. భారతి ప్రతిఘటించినా, కార్యకర్తలు అడ్డుకున్నా పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యసేవలకు సహకరించకుండా ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తానని ఆమె పట్టుబట్టారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తోందని చెప్పిన వైద్యులు ఎట్టకేలకు ఆమెను ఒప్పించి సాయంత్రం నుంచి వైద్యసేవలు ప్రారంభించారు. తాడిపత్రిలో పైలా నర్శింహయ్య దీక్షను శుక్రవారం రాత్రి 9.30 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. సాయంత్రం ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్యం క్షీణించిందని పోలీసులకు చెప్పడంతో దీక్ష స్థలికి చేరుకున్న వారు పైలాను బలవంతంగా 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. దీక్ష విరమణకు ఆయన ససేమిరా అనడంతో బలవంతంగా సెలైన్ ఎక్కించారు. -
క్షీణించిన ఆరోగ్యం.. ఐదోరోజు దాటిన శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌ల ఆమరణ దీక్ష
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ జిల్లా కడపలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్రెడి ్డలు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారం నాటికి ఐదు రోజులు పూర్తిచేసుకుని, శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక దీక్ష చేస్తున్న వీరిద్దరికీ సంఘీభావం తెలిపేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. శుక్రవారం నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ, 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో నాలుగురాష్ట్రాలు కావాలని అక్కడి అసెంబ్లీ తీర్మానాన్ని చేసి, పార్లమెంట్‌కు పంపినా విభజించని కేంద్రం ఇక్కడ మాత్రం వద్దంటే ఎందుకు విడగొడ్తోందని ప్రశ్నించారు. తెలుగువారిని విభజించేందుకు కారణమేంటో కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జననేత, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హవాను తగ్గించేందుకే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని అందరికీ అర్ధమవుతోందని మేకపాటి పేర్కొన్నారు. అయితే జగన్ జనశక్తి రెండుప్రాంతాల్లోనూ బలంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో ఇరు ప్రాంతాల్లో కలిపి తమకు 30-35 పార్లమెంట్ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారంతో రెండవరోజు పూర్తిచేసుకున్నాయి. వీరి దీక్షలకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. -
‘దీక్షా’ధారులు .. వైఎస్సార్ సీపీ నేతల నిరశన
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు నిరవధిక నిరహారదీక్షలు చేపడుతున్నారు. ఆరోగ్యపరిస్థితి విషమిస్తున్నా సమైక్యమే ధ్యేయంగా దీక్షలు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డిలు చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారంతో మూడోరోజుకు చేరింది. వీరికి సంఘీభావం పలికేందుకు వస్తున్న జనసందోహంతో ఆ ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. బుధవారం రాత్రికి రవీంద్రనాథరెడ్డికి షుగర్ లెవెల్స్ 50, శ్రీకాంత్‌రెడ్డికి 70కి పడిపోయినా మొక్కవోని లక్ష్యంతో దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరులో మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవడు గొట్టిపాటి భరత్ చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారం 5వ రోజుకు చేరింది. భరత్‌తో పాటు దీక్షలో కూర్చున్న పొదిలి రాఘవ, యద్దనపూడి హరిప్రసాద్, భూక్యా రాజానాయక్ల ఆరోగ్యం క్షీణించడంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భరత్‌కు మద్దతుగా బుధవారం పర్చూరులో బంద్ పాటించారు. ఇక కనిగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త రాజాల ఆదిరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చౌళ్లూరు రామకృష్ణారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష మూడవ రోజుకు చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాజమండ్రి నగర కన్వీనర్ గుర్రం గౌతం, మరో ఇద్దరు యువజన నాయకులు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, సాల్మన్‌రాజు బుధవారం రాజమండ్రిలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన దళిత నేత గొసుమస్తాన్రావు బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నెల్లూరు వేదాయపాళెంలో వైఎస్సార్సీపీ రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన నిరసన దీక్షను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండల కేంద్రంలో వైఎస్సార్ సీపీ నేత మక్కువ శ్రీధర్ మంగళవారం చేపట్టిన 48 గంటల నిరవధిక నిరాహార దీక్ష బుధవారం కూడా కొనసాగింది. నేటి నుంచి ఆకేపాటి, కొరముట్ల ఆమరణదీక్ష వైఎస్సార్ జిల్లా రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటిఅమర్నాథ్రెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గురువారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు.