విద్యుత్ కార్మికుల నిరాహార దీక్షలు
Published Tue, Nov 22 2016 3:54 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM
ఖమ్మం: నగరంలోని ట్రాన్‌సకో కార్యాలయం ఎదుట 13 సంఘాల ఐక్యఫ్రంట్ టీఎఫ్ (టీఈటీయూఎఫ్) తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్ ఫ్రం ట్ ఇచ్చిన పిలుపు మేరకు టీఎస్‌ట్రాన్‌సకో 13 సబ్‌స్టేషన్‌ల కార్మికులు, మూడు గ్యాంగ్ కార్మికులు, ఆఫీస్ స్టాఫ్, టీఆర్‌ఎస్ స్టాఫ్ ఆధ్వర్యంలో సోమవారం నిరాహార దీక్షను ప్రారంభించారు. ఫ్రంట్ చైర్మన్ టి.శేషగిరిరావు, కన్వీనర్ శ్రీనివాసరావు, కో చైర్మన్ ఎం.ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కలుగ చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీక్షలు ఈనెల 25 వరకు కొనసాగుతాయని తెలిపారు. దీక్షలో జి.శ్రీను (మధిర), ఎండి.మౌలానా (ఇల్లెందు), నర్సింహారావు, రవి (మణుగూరు), కె.శ్రీను, డి.రాజు, డి.రామకృష్ణ కూర్చున్నారు. కార్యక్రమంలో ఎండి.యాకూబ్‌పాషా, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఎస్‌ఈ కార్యాలయం ఎదుట..
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నగరంలోని ట్రాన్‌సకో సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. టీఈటీయూఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.శేషగిరిరావు, ఎం.సత్యనారాయణరెడ్డి, కోకన్వీనర్ నాగేశ్వరరావు, 327 యూని యన్ కంపెనీ అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావు, సీఐటీయూ కంపెనీ కార్యదర్శి ఎం.ప్రసాద్, కె.నాగేశ్వరరావు, రవికుమార్, సీతారామయ్యలు మా ట్లాడారు. వచ్చేనెల 6 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. దీక్ష లో యుగంధర్, ఆదిదీపక్, ఎం.అరుణ్,జానీపాషా, రామారావు, ఎస్.రామా రావు, బి.వీరబాబు, సిహెచ్.కిషోర్, టి.సూర్యం పాల్గొన్నారు.
Advertisement
Advertisement