గాంధీభవన్‌లో నిరాహార దీక్షకు కూర్చున్న నాయకులు
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణకై ఏప్రిల్ 9న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీభవన్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదీతరులు ఉన్నారు. వీరికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో దళితులకు ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ మార్చిపోయారని గుర్తు చేశారు. మంథనిలో దళితులపై దాడులు జరిగాయని అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు ఉన్నదని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. శాసనసభలో దళితుల గురించి మాట్లాడకుండా దళిత ఎమ్మెల్యేగా ఉన్న సంపత్ కుమార్‌ని బయటకు పంపించారని విమర్శించారు.గిరిజనులకు రిజర్వేషన్లు రాకుండా సీఎం కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 23న ఢిల్లీలో దళిత విచారణ సమ్మేళనం జరుగుతుందని, రాహుల్ గాంధీ దాంట్లో పాల్గొంటారని తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న దళిత నేతలంతా హాజరు కావాలని కోరారు.
రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దళితులు, మహిళలు,మైనారిటీలు, గిరిజనులకు ఒక రక్షణ కవచం లాంటిది పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిన తరువాత బ్రిటిష్ పాలన గుర్తొస్తుందని వ్యాఖ్యానించారు. అన్నివర్గాలకు సమాన హక్కులు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీనని అన్నారు. బీజేపీ దళితులను, మైనారిటీలను ద్వేషిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రేమిస్తుందని చెప్పారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు వారంతా ఒక్కటేనని, ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment