సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభు త్వాలు ప్రజలకు ఇచ్చిన హా మీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని, అదే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలకు అందుబాటులో తెచ్చి చరిత్ర సృష్టిస్తోందని నల్లగొండ ఎంపీ కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో బుధవారం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా గాందీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీనేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, బొల్లు కిషన్, నగేశ్‌ముదిరాజ్ తదితరులతో కలిసి ఆయన మాట్లా డారు. ‘రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ 99 హామీలిచ్చి ఇప్పటివరకు 9 మాత్రమే నెరవేర్చింది. రుణమాఫీ నుంచి నిరుద్యోగ భృతి వరకు ఏ హామీని అమలు చేయలేకపోయింది.
ఇక, బీజేపీ ఇచ్చిన హామీలకు దిక్కూదివానం లేకుండా పోయింది. కర్ణాటక ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఐదు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు తిరగకముందే నాలుగింటిని అమలుపరచింది.’అని చెప్పారు. తెలంగాణలోనూ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని చెప్పారు.
అహంకారమే గద్దె దించుతుంది
అహంకారమే బీఆర్‌ఎస్‌కు ప్రధాన శత్రువని, ఆ అహంకారమే వారిని గద్దె దించబోతుందని ఉత్తమ్ చెప్పారు. సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వడాన్ని బట్టి కేసీఆర్ తన ఎమ్మెల్యేల అవినీతికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు ఉందన్నారు. తాను హుజూర్‌నగర్‌లో, తన భార్య పద్మ కోదాడలో పోటీ చేస్తారని, ఏదైనా ఏఐసీసీ నిబంధనలు, ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు అనుగుణంగానే తమ పోటీ ఉంటుందని చెప్పారు. ఇద్దరికీ 50 వేల మెజారిటీ కంటే తక్కువ వస్తే.. రాజకీయాలను వదిలేస్తానని ఆయన పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment