raghuveerareddy
-
ఫలితం రేపే!
43 రోజుల ఉత్కంఠకు 24 గంటల్లో తెరపడనుంది. ఎవరు విజేతగా నిలుస్తారో.. ఎవరు పరాజయాన్ని చవిచూస్తారో.. కొన్ని గంటల్లో తేలిపోనుంది. అందుకే యువకుల నుంచి వృద్ధులదాకా.. తోపుడుబండ్ల వ్యాపారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ అంతా ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తి చూపుతున్నారు. ఎప్పుడు 23వ తేదీ వస్తుందా ? ఫలితాలు ఎప్పుడొస్తాయా ? జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ‘ఎగ్జిట్‌పోల్స్’తో ఇప్పటికే ఫలితాలపై స్పష్టమైన అవగాహనకు వచ్చినా, ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల వెల్లడికి సాయంత్రం దాకా సమయం పట్టినా అనధికారికంగా అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం ఒంటి గంటకే తెలిసిపోనుంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికల ఫలితాల కోసం యావత్ రాష్ట్రం ఎదురుచూస్తోంది. జిల్లాలోనూ కౌంటింగ్ టెన్షన్ నెలకొంది. రాష్ట్రంలోని 13 జిల్లాల ఫలితాలతో పోలిస్తే అనంతపురం జిల్లా ఫలితాలపై జిల్లావాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక్కడ మెజార్టీ సీట్లు ఏ పార్టీ సాధిస్తే ఆ పార్టీనే అధికారం చేపట్టనుంది. పైగా ఈ సారి జిల్లా నుంచి జేసీ దివాకర్‌రెడ్డి, పరిటాల సునీత వారసులు రాజకీయ ఆరంగేట్రం చేయడం.. ముఖ్యమంత్రి బావమరిది నందమూరి బాలకృష్ట ‘పురం’ బరిలో ఉండటంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. రెండు పార్టీల మధ్య పోటీ జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి 14 మంది, హిందూపురం పార్లమెంట్ నుంచి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 14 అసెంబ్లీస్థానాల నుంచి 163 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. ఫలితాలు వెల్లడైతే ఎవరి జాతకం ఎలా ఉండబోతుందనే చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో టీడీపీకి చాలా చోట్ల జనసేన అభ్యర్థులు సహకరించగా.. ప్రజాశాంతిపార్టీని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లుపోలిన వారితోనే నామినేషన్లు దాఖలు చేయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఈ నెల 19న వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్‌లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనమేనని స్పష్టమైంది. అలాగే అనంతపురంలో 10 నుంచి 12 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తుందని ‘పోల్స్’ స్పష్టం చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అనంత’లో వైఎస్సార్సీపీ ఫ్యాన్ గాలి బాగా వీచిందని, అందులో పెద్దపెద్ద రాజకీయవటవృక్షాలు నెలకొరిగి కొట్టుకుపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిటాల కుటుంబానికి తొలి ఓటమి తప్పదా? జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది రాప్తాడు ఫలితం గురించే. పరిటాల కుటుంబంపై రెండుసార్లు పోటీచేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మూడోదఫా బరిలో ఉన్నారు. మంత్రి సునీతపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆమె బరిలో ఉంటే ఓటమి తథ్యమని భావించిన టీడీపీ అధిష్టానం... శ్రీరామ్‌ను బరిలో నిలపింది. అయితే ఈ నియోజకవర్గంలో కురుబ, బోయలాంటి ప్రధాన కులాలతో పాటు బీసీలు టీడీపీని కాదని ప్రకాశ్‌రెడ్డి పక్షాన నిలిచినట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. నియోజకవర్గంలో ఏ పల్లెలో ఏ పదిమందిని పలకరించినా... ఈ దఫా ప్రకాశ్ గెలుస్తాడని 10 మందిలో ఏడు మంది చెబుతున్నారు. టీడీపీ శ్రేణులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో వారసుడిగా బరిలోకి దిగిన శ్రీరామ్‌కు ఓటమి తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఈ కుటుంబానికి తొలిఓటమి ఎదురైనట్లే. కీలక స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ హవా రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ర్యాంకింగ్ ఇస్తే బాలకృష్ణ చివరిస్థానంలో ఉంటారు. ఐదేళ్లు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించినా...సీఎం చంద్రబాబు నోరు మొదపలేదు. కానీ ‘పురం’ ప్రజలు మాత్రం బాలకృష్ణ పనితీరుపై తీర్పు ఇచ్చినట్లే తెలుస్తోంది. ఇక్కడ కూడా నిజాయతీగల పోలీసు అధికారిగా పేరుపొందిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ పక్షానే ప్రజలు నిలిచినట్లు ‘పోల్స్’ స్పష్టం చేస్తున్నాయి. అలాగే టీడీపీ కంచుకోటగా చెప్పుకునే పెనుకొండలో ఈ దఫా బీకే పార్థసారథిని కాదని, సౌమ్యుడైన శంకర్‌నారాయణను ప్రజలు ఆశీర్వదించినట్లు ‘ఎగ్జిట్ పోల్స్’ స్పష్టం చేస్తున్నాయి. మంత్రి కాలవ శ్రీనివాసులకు కూడా ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినట్లేనని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మూడోస్థానంలోనే పీసీసీ చీఫ్ రఘువీరా? కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యారని ‘ఎగ్జిట్ పోల్స్’ స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నా, విజయం మాత్రం వైఎస్సార్సీపీనే వరించే అవకాశాలున్నాయి. అలాగే ఉరవకొండ, అనంతపురం, గుంతకల్లు, శింగనమల, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. వైఎస్సార్సీపీ గాలి బాగా వీచిందని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే టీడీపీ అభ్యర్థులు మాత్రం లగడపాటి సర్వేపై ఆశపెట్టుకుని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏదిఏమైనా రేపటి మధ్యాహ్నంలోపు అభ్యర్థుల భవితవ్యంతో పాటు వీరిపై రూ.కోట్లలో పందెం కాసిన బెట్టింగ్ రాయుళ్ల జాతకం తేలనుంది. జేసీ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ రాప్తాడు తర్వాత అదేస్థాయిలో ఆసక్తి నెలకొన్న నియోజకవర్గం తాడిపత్రి. ఇక్కడ జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి బరిలో ఉన్నారు, దీంతో పాటు అనంతపురం పార్లమెంట్ బరిలో జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్ పోటీలో నిలిచారు. ఈ రెండుస్థానాల్లో కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగిందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ అంతర్గత సర్వేల్లో రాష్ట్రంలోని 25 పార్లమెంట్లలో 6 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని తేలింది. ఆరుస్థానాల్లో జిల్లాలోని రెండు పార్లమెంట్లు లేవు. దీనికి తోడు పోలింగ్ సరళి కూడా వైఎస్సార్సీపీకి అనుకూలంగా జరిగింది. జేసీ దివాకర్‌రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడి జనాల్లో చులకన అయ్యారు. తాడిపత్రిలో జేసీ కుటుంబం అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా జనాలు ఓట్లేశారు. దీంతో ఈ దఫా ఎన్నికల్లో జేసీ కుటుంబానికి ఓటమి తప్పదని తెలుస్తోంది. ఇదే జరిగితే 40 ఏళ్ల జేసీ కుటుంబ రాజకీయ ప్రస్థానానికి ఈ ఎన్నికలతో కాలం చెల్లినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రఘవీరాకు చంద్రబాబు లిఫ్ట్!
-
ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తాం
-
కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో కలకలం
విజయవాడ: కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో కలకలం రేగింది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఎదుట పీసీసీ సభ్యుడు శివాచారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. పక్కనున్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. నెల్లూరు రూరల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని తాను భావించానని, నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తన చేత రూ.50 లక్షలు ఖర్చు పెట్టించాడని, ఇప్పుడు తనను పక్కకు పెట్టి వేరే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని శివాచారి తెలిపారు. అతని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని వెల్లడించారు. సంఘటన జరిగిన సమయంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఊమెన్ చాందీ కూడా అక్కడే ఉన్నారు. -
గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకుల దీక్ష
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణకై ఏప్రిల్ 9న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీభవన్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదీతరులు ఉన్నారు. వీరికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో దళితులకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ మార్చిపోయారని గుర్తు చేశారు. మంథనిలో దళితులపై దాడులు జరిగాయని అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు ఉన్నదని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. శాసనసభలో దళితుల గురించి మాట్లాడకుండా దళిత ఎమ్మెల్యేగా ఉన్న సంపత్ కుమార్‌ని బయటకు పంపించారని విమర్శించారు.గిరిజనులకు రిజర్వేషన్లు రాకుండా సీఎం కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 23న ఢిల్లీలో దళిత విచారణ సమ్మేళనం జరుగుతుందని, రాహుల్ గాంధీ దాంట్లో పాల్గొంటారని తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న దళిత నేతలంతా హాజరు కావాలని కోరారు. రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దళితులు, మహిళలు,మైనారిటీలు, గిరిజనులకు ఒక రక్షణ కవచం లాంటిది పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిన తరువాత బ్రిటిష్ పాలన గుర్తొస్తుందని వ్యాఖ్యానించారు. అన్నివర్గాలకు సమాన హక్కులు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీనని అన్నారు. బీజేపీ దళితులను, మైనారిటీలను ద్వేషిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రేమిస్తుందని చెప్పారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు వారంతా ఒక్కటేనని, ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. -
మోదీ వ్యాఖ్యల పట్ల రఘువీరా ఆగ్రహం
అమరావతి : పార్లమెంటులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల పట్ల ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ను, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ అవమానానికి గురిచేసిందంటూ మోదీ వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. నెహ్రూ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని, ప్రేమను కనబరుస్తూ నెహ్రూకే లేఖ రాసిన పటేల్ గురించి మీరు(మోదీ) మాట్లాడటం మీ కుటిల రాజకీయ ఎత్తుగడ తప్ప మరేమీ కాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. లేఖలో ఏం పేర్కొన్నారంటే.. ఏపీ విభజన జరిగి 4 సంవత్సరాలు గడుస్తున్నా పునర్వవస్తీకరణ చట్టంలోని అంశాలు అమలు కావడం లేదని అన్నారు. రాష్ర్ట విభజనను దేశ విభజనతో పోల్చి మోదీ మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. 1. పార్లమెంటు తలుపులు వేసి రాష్ర్ట విభజన చేసింది కాంగ్రెస్ అని విమర్శించారు. ఏదైనా బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరిగేటపుడు తలుపులు మాస్తారా లేక తెరుస్తారా? మీరు(మోదీ) సమాధానం చెప్పాలి. 2. తలుపులు మూసి కాంగ్రెస్ విభజన చేసినపుడు ఆనాటి ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఎందుకు విభజన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ బిల్లును ఎందుకు వ్యతిరేకించలేదు? 3. తిరుపతి ఎన్నికల సభలో.. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మించి ఇస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువే ఇస్తామని మమ్మల్ని గెలిపించమని కోరారా లేదా? 4. 2014 ఎన్నికల్లో నెల్లూరులో ఏపీకి ప్రత్యేక హోదా వెంకయ్యనాయుడే సాధించారని కనుక ఆ ఘనత తమదేనని మీరు చెప్పారా లేదా? 5. 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదాను 10 ఏళ్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారా లేదా? 6. మీరు అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాలపాటు హోదా అమలు చేస్తామన్నా అమలు చేయకపోవడంతో ప్రజా ఉద్యమం పెల్లుబికి ఏపీ అసెంబ్లీ రెండు సార్లు హోదా అమలుల చేమయని ఏకగ్రీవంగా తీర్మానం చేసి మీకు పంపిందా లేదా? మీ పార్టీ ఆ తీర్మానాన్ని రాష్ర్టంలో బలపర్చింది వాస్తవమా కాదా? 7. ఏపీ ముఖ్యమంత్రికి 16 నెలల పాటు మీరు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానానికి గురి చేయడం కిందకు వస్తుందా రాదా? ఏపీ విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా నష్టపోయింది కానీ ఏపీ ప్రజలకు అన్యాయం చేయలేదన్నారు. అందుకే ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ హోదా, లాంటి అనేక అంశాలను ఏపీకి ఇస్తూ చట్టం చేసిందని గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను, కేబినేట్ నిర్ణయాలను అమలు చేయాలని ఏపీ ప్రజల తరపున తమరికి(మోదీ) అభ్యర్థిస్తున్నట్లు లేఖ ద్వారా తెలిపారు. -
ఓట్ల గారడీ బడ్జెట్: రఘువీరా రెడ్డి
విజయవాడ : కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది పూర్తిగా ఓట్ల గారడీ బడ్జెట్ అని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరా రెడ్డి విమర్శించారు. విభజన చట్టంలోని చట్టబద్ధమైన హామీలకు కేటాయింపులే లేవన్నారు. కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం, విశాఖ-చెన్నైపారిశ్రామిక కారిడార్, విశాఖ రైల్వేజోన్ హామీలపై ప్రకటన ఉంటుందనుకున్న ప్రజలకు ఈసారీ నిరాశే ఎదురైందన్నారు. కర్ణాటకలో ఎన్నికల దృష్ట్యా మెట్రో రైలుకు రూ.17 వేల కోట్లు కేటాయించడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, కేంద్ర విశ్వవిద్యాలయాలకు రూ.11,500 కోట్లు అవసరం కాగా కేవలం రూ.385 కోట్లు మాత్రమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాకట్టుపెట్టారని, ప్రత్యేక హోదాను చంద్రబాబు అడగనేలేదని స్వయంగా బీజేపీ నేతలే చెప్పడం చూస్తుంటే..ఏపీకి బీజేపీ, టీడీపీలు ఇద్దరూ ఉమ్మడిగా ద్రోహం చేశారని స్పష్టం అవుతోందన్నారు. 16 నెలలుగా ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, ముఖ్యమంత్రి తనకున్న అవినీతి, ఇతర అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టారని విమర్శించారు. కేంద్రం మరోసారి ఏపీకి మొండి చేయి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సమస్యలు పరిష్కరించకుండా పండగ చేసుకోమంటే ఎలా..?
విజయవాడ : ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఒక్క శాతం కూడా పరిష్కరించకుండా ఇప్పుడు చేపడుతోన్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం పండగ ఎలా అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ ఎన్ రఘవీరా రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటన సారాంశం..జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై రఘవీరారెడ్డి స్పందిస్తూ..ఈ కార్యక్రమంలోనైనా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలని సూచించారు. అనంతపురం జిల్లాలో మడకశిర, కల్యాణదుర్గం, పెనుగొండ నియోజకవర్గంలో వందలాది గ్రామాలలో పర్యటించినపుడు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన్నట్లు గుర్తు చేశారు. మడకశిర నియోజకవర్గంలో 61 వేల మంది, కల్యాణదుర్గం నియోజకవర్గంలో 49 వేల మంది, పెనుగొండలో 45 వేల మంది ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇచ్చారన్నారు. ఈ అర్జీలను స్థానిక రెవెన్యూ అధికారికి, కలెక్టర్‌కు తానే స్వయంగా అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో పింఛన్లు నిలిపేశారని, మరుగుదొడ్ల బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలవరంపై ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి
-
కుక్కలు చింపిన విస్తరిగా పోలవరం ప్రాజెక్టు..
ఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ మాటలతో 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని తేలిపోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు తదితరులతో కలసి రఘవీరా రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..పోలవరం పునరావాసంపై కేంద్రానికి బాధ్యత లేనట్లుగా చెబుతున్నారని మండిపడ్డారు. పోలవరంపై టీడీపీ, బీజేపీ డ్రామాలాడుతున్నాయని వ్యాఖ్యానించారు. పంపకాలలో తేడాలు రావడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కుక్కలు చింపిన విస్తరిగా మారిందని విమర్శించారు. గడ్కరీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, పార్లమెంటులో ఈ అంశాలను లేవనెత్తుతామని తెలిపారు. -
పుర పథకం నిలిపివేతలో సీఎం కుట్ర: రఘువీరా
-
పుర పథకం నిలిపివేతలో సీఎం కుట్ర
ఇబ్రహీంపట్నం (మైలవరం): గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పుర పథకం నిలిపివేయటం వెనుక సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి ఉమామహేశ్వరరావు కుట్ర దాగి ఉందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. పుర పథకం పనుల అమలు తీరును పరిశీలించేందుకు గురువారం ఆయన ఇబ్రహీంపట్నం విచ్చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పనులు ప్రారంభించనందుకు వ్యతిరేకంగా అక్కడ మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ ఆ పథకం పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి మంచిపేరు వస్తుందని సీఎం చంద్రబాబు, మంత్రి ఉమా కుట్ర పన్ని పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహించారు. -
ప్రభుత్వాల తీరును ఎండగడతాం
అనంతపురం సప్తగిరి సర్కిల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానానులు ఎండగడతామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అవలంభిస్తోన్న బీజేపీ లౌకికత్వానికి తూట్లు పొడుస్తోందన్నారు. యూపీలో బీజేపీ తరఫున ఒక్క ముస్లింకు కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ర్టంలోని టీడీపీ ప్రభుత్వం కూడా ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కేటాయించకుండా ఆ వర్గాన్ని మోసం చేసిందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ విధానంతో ప్రజల ముందుకు వెళ్తున్నాయో రాజకీయ పార్టీలన్నీ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ విస్మరించారు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీలు ఆనాడు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలును పూర్తిగా విస్మరించాయని రఘువీరారెడ్డి మండిపడ్డారు. విభజించి పాలించడం కాంగ్రెస్ విధానం కాదన్నారు. అట్టడుగున ఉన్న వారికీ సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో గ్యాస్ ధరను పెంచితే మోదీ, జైట్లీ, చంద్రబాబులు నెత్తినోరు కొట్టుకున్నారనీ...ఇపుఽడు వారే ధరలు పెంచుతూ సామాన్యున్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రభుత్వాల తీరును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అంతకుముందు జాతీయపతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పీసీసీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా, నగర అధ్యక్షుడు దాదాగాంధీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులొస్తున్నాయ్
పెనుకొండ: ప్రజా, రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు, రైతులు తిరగబడే రోజులు ఎంతో దూరం లేవని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమాలో అవినీతిని నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్సర్కిల్లో డీసీసీ కార్యదర్శి కేటీ.శ్రీధర్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మూడేళ్ల చంద్రబాబు పాలనలో ఇన్పుట్ సబ్సిడీ కాని బీమా కాని సక్రమంగా అందించిన పాపాన పోలేదన్నారు. ఎక్కడ చూసినా చంద్రబాబుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. అనేక మంది టీడీపీ నాయకులు పంట పెట్టకపోయినా ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశారని, పంట పెట్టిన వారికి పరిహారం అందలేదన్నారు. ఇతర పార్టీలకు చెందిన వారన్న అక్కసుతో రైతులకు అన్యాయం చేశారన్నారు. రొద్దం మండలం బూచెర్లకు చెందిన పలువురు రైతుల అక్రమాల జాబితాను చదివి వినిపించారు. జన్మభూమి కమిటీల పేరుతో బ్రోకర్లు పర్సెంటేజీలు దండుకోవడానికే ఈ అక్రమాలకు తెరలేపారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో లక్షల కోట్లు, మంత్రులు వేల కోట్లు, ఎమ్మెల్యేల స్థాయిలో వందల కోట్లు, జన్మభూమి కమిటీలు వేలు,లక్షలు దోచుకుంటున్నారన్నారు. గత ఏడాది రెయిన్గన్ల పేరుతో వందల కోట్లు దోపిడీ జరిగిందని, ఒక్క ఎకరా కూడా బతికించలేకపోయారని, మళ్ళీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెయిన్గన్ల జపం వల్లించడం దోపిడీ చేయడానికేనన్నారు. అనంతరం ఆర్డీఓ రామ్మూర్తిని కలిసి ఇన్పుట్ సబ్సిడీలో తలెత్తిన లోపాలను వివరించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షులు కోటాసత్యం, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, డీసీసీ ఉపాధ్యక్షులు గుట్టూరు చినవెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
దోచుకునేందుకే రెయిన్గన్ల ప్రయోగం
అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఎం కన్ను – యాజమాన్యానికి ప్రభుత్వం వత్తాసు – 40లక్షల మంది బాధితుల జీవితాలతో ఆటలు – పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి మడకశిర : అధికార పార్టీ నేతలు రూ.వేల కోట్లు దోచుకునేందుకు మరోసారి రక్షకతడుల పేరిట రెయిన్గన్లను తెరపైకి తీసుకొచ్చారని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. గత ఏడాది రెయిన్గన్ల ద్వారా అనంతపురం జిల్లాలో ఎన్ని వేల ఎకరాలకు రక్షక తడులు ఇచ్చి వేరుశనగ పంటను కాపాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో గురువారం రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రాజీవ్‌గాంధీ సర్కిల్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికార పార్టీ నేతల కన్ను పడిందన్నారు. 40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం యాజమాన్యానికే వత్తాసు పలుకుతోందన్నారు. సీబీఐ విచారణతోనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలో హంద్రీనీవా పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ త్వరలోనే డీసీసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నీలకంఠాపురంలో సామూహిక వివాహాలు
మడకశిర : మండలంలోని నీలకంఠాపురంలో గురువారం పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో 30 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు చేశారు. హాజరైన వారందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. గ్రామంలోని శ్రీనీలకంఠేశ్వరస్వామి సన్నిధిలో ఉదయం 8గంటలకు కర్నాటక రాష్ట్రం శిర తాలూకా పట్టనాయకనహళ్ళి శ్రీ నంజావధూతస్వామి ఆశీస్సులతో ఈ వివాహాలు జరిపించారు. ప్రతి ఏడాదీ శ్రీరామనవమి సందర్భంగా రఘువీరారెడ్డి కుటుంబసభ్యులు 1982 నుంచి క్రమం తప్పకుండా సామూహిక వివాహాలు చేయిస్తున్నారు. వధూవరులకు తాళిబొట్లు, కొత్త బట్టలు, కాలిమెట్టెలు తదితర పెళ్లి సామగ్రిని ఉచితంగా అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం, స్థానిక మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్, పెనుకొండ కాంగ్రెస్ ఇన్చార్జ్ కేటీ శ్రీధర్, పీసీసీ చీఫ్ సోదరుడు చెలువమూర్తి, అనిల్‌కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎస్ ప్రభాకర్‌రెడ్డి, బచ్చలయ్యపాళ్యం నరసింహమూర్తి, నాగేంద్ర, మంజునాథ్, మందలపల్లి నాగరాజు, విశ్వనాథ్‌గుప్త తదితరులు పాల్గొన్నారు. -
కరువుపై అసెంబ్లీలో చర్చ జరగాలి
- కరువు– చంద్రబాబు అవిభక్త కవలలు - ఉగాది తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు - ‘కరువుపై సామూహిక సత్యాగ్రహం’లో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అనంతపురం సెంట్రల్ : అసెంబ్లీ సమావేశాల్లో కరువుపై చర్చించి, పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఉగాది తర్వాత గ్రామగ్రామానా తిరిగి ప్రజా ఉద్యమాన్ని చేపడుతామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి హెచ్చరించారు. కరువు - ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివక్త కవలలు అని అన్నారు. శనివారం నగరంలో కేఎస్ఆర్ కళాశాల ఎదురుగా ‘కరువుపై సామూహిక సత్యాగ్రహం’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పీసీసీ రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కరువును ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా చతికిల పడ్డారన్నారు. 2014–15 సంవత్సరానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కూడా చెల్లించలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నారన్నారు. ఉపాధిహామీ పథకం నీరుగారిపోయిందన్నారు. అధికారంలోకి వస్తే రూ.10 వేలు చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని, నాలుగేళ్ల కాలానికి ఎకరాకు రూ.40వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో రెయిన్గన్ల ద్వారా పంటలను కాపాడినట్లు సీఎం గొప్పలు చెప్పారని, ఇక్కడికొచ్చి చూశాక చంద్రబాబు శుద్ధ అబద్ధాల కోరు అని అర్థమైందన్నారు. సీఎం సొంత బామ్మర్ది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలోనే నీటి సమస్య తీవ్రంగా ఉండడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లామన్నారు.పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును జాతీయ సమస్యగా సృష్టించినా అప్పట్లో వెనక్కి తగ్గలేదన్నారు. కేంద్ర మాజీ మంత్రి సూర్యప్రకాష్‌రెడ్డి, అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శైలజానాథ్, కొండ్రుమురళీ, మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్‌వలీ, మల్లాది విష్ణు, సుధాకర్, నాగరాజరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యనారాయణ, నగర అధ్యక్షుడు దాదాగాంధీ, పీసీసీ అధికారప్రతినిధులు రమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రైతు రుణమాఫీకి బడ్జెట్లో అన్యాయం:రఘువీరా
అమరావతి: అంకెలు ఘనంగా ఉన్నాయ్... చూపడానికే తప్ప ఖర్చు చేసేందుకు కాదన్నట్లుగా ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించి అపహాస్యం చేసిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభ, మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017–18 బడ్జెట్ కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మూడు బడ్జెట్లలో కేటాయించిన నిధుల్లో 30 శాతం మించి ఖర్చు చేయలేదని, ఈ ఏడాది కూడా అంతేనని అన్నారు. రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్లోనూ అన్యాయమే జరిగిందన్నారు. ప్రస్తుతం కేటాయించిన రూ.3,600 కోట్లు వడ్డీకి కూడా సరిపోవన్నారు. మొత్తంగా ఇప్పటివరకు కేటాయించిన నిధులు రూ.12,200 కోట్లు మాత్రమేనన్నారు. అంటే చంద్రబాబు కుదించిన రూ. 24 వేల కోట్లకు కూడా రుణమాఫీ చేయడం లేదని కేటాయింపులనుబట్టి అర్థమవుతోందన్నారు. డ్వాక్రా గ్రూపు సభ్యులకు రూ.1600 కోట్లు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ పేరుతో కేటాయింపులు చేశారని, దీన్నిబట్టి చూస్తే డ్వాక్రా రుణాల మాఫీ కూడా లేనట్లేనని ఆయన అన్నారు. నిరుద్యోగ యువతకు రూ.2 వేలు ఇస్తామని ఎన్నికలపుడు హామీ ఇచ్చి ప్రస్తుత బడ్జెట్లో వారికి ఆర్థిక సహాయం పేరిట రూ.500 కోట్లు కేటాయించారని, ఈ లెక్కన ఒక్కొక్కరికి రూ.100లు కూడా రావన్నారు. బడ్జెట్ సందర్భంగా ఇప్పటివరకు కేవలం 869 ఉద్యోగాలు ఇచ్చామని, మరో 10 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన విషయాన్ని పరిశీలిస్తే ఇంటికో ఉద్యోగం హామీ కూడా మోసమేనని తేలిపోయిందన్నారు. విద్యుత్ రంగానికి బడ్జెట్లో రూ.3,735 కోట్ల కేటాయింపులు చూపించారని, అయితే ఇందులో సుమారు రూ.2 వేల కోట్లు సబ్సిడీకే సరిపోతుందన్నారు. కనుక విద్యుత్ చార్జీలను పెంచి ఆర్థిక లోటును పూడ్చుకోవాలనే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటు అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు పేదలకు ఒక్క ఇల్లూ నిర్మించలేదు.. ఈ బడ్జెట్లో కేటాయించిన రూ.1457 కోట్లు జీతభత్యాలకే సరిపోతాయన్నారు. గూడు లేని పేదలకు ఈ బడ్జెట్లో కూడా తీవ్ర అన్యాయమే చేశారన్నారు. ప్రత్యేక హోదాను 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పిందనడం పచ్చి అబద్ధమన్నారు. బడ్జెట్ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని ఆర్థిక మంత్రి ప్రకటించడం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనని రఘువీరా విమర్శించారు. కరవు సహాయం ప్రస్తావన కూడా బడ్జెట్లో లేకపోవడం శోచనీయమన్నారు. -
నేడు పీసీసీ చీఫ్ రాక
మడకశిర : పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ఆదివారం మడకశిరకు వస్తున్నట్లు స్థానిక మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్ తెలిపారు. ఆయన ఆదివారం ఉదయం 10.30గంటలకు పట్టణంలోని శ్రీ నీలకంఠకోల్డ్ స్టోరేజ్‌లో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పీసీసీ చీఫ్ పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
నేడు పీసీసీ అధ్యక్షుడి పర్యటన
చిలమత్తూరు : మండలంలోని చెక్‌పోస్టు ప్రాంతంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శనివారం పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు నాగరాజు యాదవ్ తెలిపారు. ఆయన శనివారం ఉదయం 8.30 గంటలకు చెక్‌పోస్టుకు చేరుకుంటారని అనంతరం మండలంలో ఎండిపోయిన వేరుశనగ పంట పరిశీలిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని ఆయన కోరారు. -
స్వలాభం కోసం ఏపీలో ప్రత్యేక ప్యాకేజీలు
⇒ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజం అనంతపురం : రాష్ట్రంలోని టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులకు లబ్ధి చేకూర్చడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీలు కోరుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అనంతపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయన్నారు. పరిశ్రమలొస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. రాష్ట్ర ప్రజల హక్కుగా ఉన్న ప్రత్యేక హోదాను పక్కన పెట్టి స్వలాభం కోసం ప్రత్యేక ప్యాకేజీలు కోరడం బాధాకరమన్నారు. ‘ప్రాజెక్టు అనంత’ను ‘ఎన్టీఆర్ ఆశయం’గా మార్చేశారు! కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ అయ్యప్పన్ నేతృత్యంలో అనంతపురం అభివృద్ధి కోసం రూపొందించిన ‘ప్రాజెక్టు అనంత’ను కాపీ కొడుతూ ‘ఎన్టీఆర్ ఆశయం’ పేరుతో రూ. 6,500 కోట్ల ప్యాకేజీని సీఎం ప్రకటించారని తెలిపారు. అయితే.. ప్రాజెక్టు అనంతలో రూపొందించిన అంశాలన్నీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఆర్థికశాఖ ఆమోదం కూడా పొందిన ప్రాజెక్టు అనంతను యథావిధిగా అమలు చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి కోసం సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించిన అంశాలే అమలుకాలేదని, ఈ ప్యాకేజీనైనా ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఏ రాజకీయ పార్టీకీ ఆహ్వానం లేకుండా టీడీపీ కార్యక్రమంలా నిర్వహించడం బాధాకరమన్నారు. -
ఏపీ మంత్రులు దద్దమ్మలు: రఘువీరా
విజయవాడ: ఏపీ ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని మంత్రులు దద్దమ్మలని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో చట్టం ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని, కేంద్ర కేబినెట్ తీర్మానంతో కూడా హోదా కావాలంటే ఇవ్వచ్చని తెలిపారు. గతంలో చాలా రాష్ట్రాలకు కేబినెట్ తీర్మానం ద్వారా ప్రత్యేక హోదా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హోదాపై చంద్రబాబు, వెంకయ్య నాయుడుతో చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. టీడీపీ, బీజేపీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. పుష్కరాల కోసం రహదారుల అభివృద్ధి పేరుతో విజయవాడలో దేవాలయాలను కూల్చివేయడాన్ని రఘువీరా ఖండించారు. -
రఘువీరా.. నోటిని అదుపులో పెట్టుకో !
► కనీసం డిపాజిట్టు కూడా సాధించలేని నువ్వా.. జగన్ గురించి మాట్లాడేది? ► శంకరనారాయణ ఫైర్ అనంతపురం : పదేళ్లు మంత్రిగా పని చేశావు. గత ఎన్నికల్లో కనీసం డిపాజిట్టు కూడా దక్కించుకోలేక పోయావు.. అలాంటి నువ్వా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి విమర్శలు చేసేది.. నోటిని అదుపులో పెట్టుకో..’ అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డిపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ శివాలెత్తారు. సోమవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జనాదరణ కలిగి, ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక వ్యకి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్, అందుకు సహకరించిన టీడీపీ రెండూ తమ అధ్యక్షుడి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పెనుకొండ ప్రజలు డిపాజిట్టు కూడా ఇవ్వని స్థితిలో ఉన్న మీరు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నువ్వు ప్రాతినిధ్యం వహించిన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అభ్యర్థి లేకుండా చేశావు.. అలాంటి నీవు రాజకీయంగా నీవు ఎంత దిగజారిపోయావో జిల్లా ప్రజలకు తెలుసన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ వారితో అనైతిక పొత్తులు పెట్టుకుని కాంగ్రెస్‌లోని ఓ వర్గాన్ని దెబ్బ తీయడాన్ని మరువలేద న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టాలంటే జగన్మోహన్రెడ్డి లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు అవసరమని చింతా మోహన్ అన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అలాంటివన్నీ కప్పి పుచ్చుకుని, రాహుల్‌గాంధీ వద్ద మెప్పు పొందేందుకు నేడు తమ పార్టీపైన, జగన్మోహన్రెడ్డి పైనా అవాకులుచవాలకులు పేలుతున్నావని, నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. ఆ రోజు వైఎస్ పుణ్యమా అని రాష్ట్రంలో, కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం, ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఆయన మరణానంతరం తుంగలో తొక్కిన కారణంగానే సోనియాగాంధీకి ఎదురొడ్డి రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్సీపీని స్థాపించారన్నారు. -
వారి కోసం ఏం చేశారు?
సీఎం చంద్రబాబుపై మండిపడ్డ రఘువీరారెడ్డి అనంతపురం సెంట్రల్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. దళితులకు, గిరిజనులకు, మైనార్టీ ప్రజలకు ఏమైనా చేశావా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. గిరిజనులు, మైనార్టీ వర్గాల వారికి మంత్రి పదవులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత, ఆదివాసీ, బీసీ, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారిత యాత్ర (బస్సుయాత్ర) ఆదివారం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలో స్థానిక కేఎస్ఆర్ బాలికల కళాశాల ఎదుట బహిరంగసభ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు కోసం పెద్ద మాదిగను నేనవుతా అంటూ చెప్పిన సీఎం చంద్రబాబు ఏం చే శాడని ప్రశ్నించారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ భావిస్తే బీజేపీ దాని అనుబంధ ఆర్ఎస్ఎస్ కోర్టుకు పోయి రద్దు పరిచాయని వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి దళిత, గిరిజనుల, మైనార్టీల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని, సంచులతో డబ్బులు మోస్తాడని నారాయణకు, వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ఆర్థిక నేరగాడుగా ముద్రపడిన సుజనాచౌదరికి మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జేడీ శీలం, పీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, డీసీసీ అధ్యక్షులు కోటా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్, నాగరాజరెడ్డి, ఎస్టీసెల్ రాష్ర్ట అధ్యక్షులు సుధాకర్‌బాబు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, మైనార్టీ సెల్ రాష్ట అధ్యక్షులు అలీఖాన్, డీసీసీ నగర అధ్యక్షులు దాదాగాంధీ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. రాజధానికి మూడుసార్లు శంకుస్థాపనలా?
అవనిగడ్డ: రాజధాని నిర్మాణానికి మూడు సార్లు శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి వింత పనులు ఎన్నడూ చూడలేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ వద్ద స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకసారి చంద్రబాబు, మరోసారి ప్రధానమంత్రి, మళ్లే తానే రాజధాని కోసం శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణం కోసం మూడుసార్లు శంకుస్థాపనలు చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. రాష్ట్రం విడిపోయి రెండేళ్లయినా శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి రూ.40 వేల కోట్లు అవసరం కాగా, చంద్రబాబు రూ.1,500 కోట్లు అడిగితే కేంద్రం రూ.200 కోట్లు భిక్షమేసిందన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు అందజేయాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని, ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణంతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం తప్ప ప్రయోజనం ఉండదని, కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకేనని విమర్శించారు. రాజధాని పేరుతో రైతుల దగ్గర భూములు లాక్కుని బడా పారిశ్రామికవేత్తలు, విదేశీ కంపెనీలకు వాటిని కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. ప్రజావిశ్వాసం కోల్పోయిన చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని రఘువీరా డిమాండ్‌చేశారు. కర్ణాటక, తమిళనాడుల్లో అమలులో ఉన్న విధానాన్ని అవలంబించేందుకు చంద్రబాబు చర్యలు చేపట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయాడని. ఇందులోనూ ఆయన రికార్డు సృష్టించాడని ఎద్దేవా చేశారు. తొలుత మోపిదేవి వార్పు నుంచి మోటార్ సైకిళ్లతో ర్యాలీగా పీసీసీ అధ్యక్షుడిని తీసుకొచ్చారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవనేని అవినాష్, డీసీసీ కార్యదర్శి ఆది రామ్మోహనరావు, మండల పార్టీ అధ్యక్షుడు దిడ్ల వీరరాఘవులు, నాయకులు మహ్మద్‌గౌస్ తిలక్, శీలం నారాయణ, వరలక్ష్మి పాల్గొన్నారు. -
'బాబు పంచభూతాలను అమ్ముకుంటున్నారు'
అనంతపురం: కరువు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపే తీరిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేదా అని కాంగ్రెస్ పార్టీ నేత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రశ్నించారు. వరదసాయం కింద తమిళనాడుకు రూ.వెయ్యి కోట్లు మంజూరు అయితే ఏపీకి చిల్లిగవ్వ కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు. హంద్రీ-నీవా పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. చంద్రబాబు పంచభూతాలను అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వర్షప్రభావిత జిల్లాల్లో కాంగ్రెస్ నేతల పర్యటన
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలకి నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న మూడు జిల్లాల్లో వీరి పర్యటన కొనసాగనుంది. ఈ నెల 27న వైఎస్ఆర్ జిల్లా, 28న చిత్తూర్, 29న నెల్లూరు జిల్లాల్లో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేతృత్వంలో పర్యటన సాగనుంది. ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్యతోపాటూ మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ పర్యటనలో పాల్గోనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, ఆస్తులు నష్టపోయిన వారి వివరాలు తెలుసుకోనున్నారు. -
ఇద్దరు సీఎంల బాగోతంపై గవర్నర్‌కు లేఖ
హైదరాబాద్ : ఎమ్మెల్యే కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్, ఇద్దరు ముఖ్యమంత్రుల బాగోతంపై గవర్నర్‌కు లేఖ రాసినట్లు ఆంధ్రప్రద్రేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఇందిరాభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జైలుకెళతానన్న భయంతోనే చంద్రబాబు నాయుడు సెక్షన్-8 తెరపైకి తెచ్చారని రఘువీరా విమర్శించారు. సెక్షన్-8 సహా రాష్ట్ర విభజన చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ అవసరాల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు సెక్షన్-8పై ప్రజలను గందరగోళపరుస్తున్నారని అన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు దోషులేనని రఘువీరా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్‌పై నిగ్గు తేల్చాలని, కేంద్ర పెద్దలు మధ్యవర్తులుగా ఉండి ఇద్దరు సీఎంల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను గందరగోళపరుస్తున్నారని రఘువీరా మండిపడ్డారు. -
రైతులకు ఏనాడైనా మేలు చేశావా?
చంద్రబాబుపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ధ్వజం సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై రైతాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా వంచించారంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఇందిరాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఏనాడూ రైతులకు మేలు చేసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రధానికి లేఖ రాయడంపై రఘువీరారెడ్డి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శుక్రవారం నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టనున్నామని పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్థలం వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు సంతకాల సేకరణను ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ పాల్గొంటారు. విభజన హామీలను కేంద్రం అమలు చేసేలా రాష్ట్రం ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
అనంతపురం టౌన్ : 'ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపర్చండి' అని అనంతపురం జిల్లాలోని మండల పార్టీ కార్యవర్గ సభ్యులకు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సూచించారు. సభ్యత్వ నమోదును గ్రామ స్థాయి నుంచి చేయించాలన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రఘువీరారెడ్డితో పాటు మాజీ మంత్రి శైలజానాథ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. రైతులకు రుణమాఫీ మొదలు ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఇలా దొంగ దెబ్బ తీయడం తెలుగుదేశం పార్టీకి అలవాటే అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి నవమాసాలు కాకముందే ప్రజలతో పెట్టుకున్న బంధం తెగిపోతోందన్నారు. ప్రజలు ఆ పార్టీని విశ్వసించడం లేదన్నారు. ఆ పార్టీ కూడా ప్రజలను విశ్వసించడం లేదన్నారు. హామీలను అమలు చేయడంలో ఘోరం గా విఫలమైన ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపర్చాలని సూచించారు.