
ఏపీ మంత్రులు దద్దమ్మలు: రఘువీరా
విజయవాడ: ఏపీ ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. ఆంధ‍్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని మంత్రులు దద్దమ్మలని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో చట్టం ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని, కేంద్ర కేబినెట్ తీర్మానంతో కూడా హోదా కావాలంటే ఇవ్వచ్చని తెలిపారు.
గతంలో చాలా రాష్ట్రాలకు కేబినెట్ తీర్మానం ద్వారా ప్రత్యేక హోదా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హోదాపై చంద్రబాబు, వెంకయ్య నాయుడుతో చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. టీడీపీ, బీజేపీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. పుష్కరాల కోసం రహదారుల అభివృద్ధి పేరుతో విజయవాడలో దేవాలయాలను కూల్చివేయడాన్ని రఘువీరా ఖండించారు.