కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ మాటలతో 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని తేలిపోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు తదితరులతో కలసి రఘవీరా రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు.