
నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తన చేత రూ.50 లక్షలు ఖర్చు పెట్టించాడని, ఇప్పుడు తనను పక్కకు పెట్టి వేరే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని శివాచారి తెలిపారు.
విజయవాడ: కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో కలకలం రేగింది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఎదుట పీసీసీ సభ్యుడు శివాచారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. పక్కనున్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
నెల్లూరు రూరల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని తాను భావించానని, నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తన చేత రూ.50 లక్షలు ఖర్చు పెట్టించాడని, ఇప్పుడు తనను పక్కకు పెట్టి వేరే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని శివాచారి తెలిపారు. అతని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని వెల్లడించారు. సంఘటన జరిగిన సమయంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఊమెన్ చాందీ కూడా అక్కడే ఉన్నారు.