umen chandi
-
ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదు కానీ..
సాక్షి, విజయవాడ : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఉమెన్ చాందీ తెలిపారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలుపుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పొత్తులపై తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీదేనని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదు గానీ బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మాత్రం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమతో ఉంటారని తెలిపారు. ఫిబ్రవరి 1న రాష్ట్ర బంద్‌లో పాల్గొంటాం : రఘువీరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. విభజన హామీలు అమలు చేసేది, ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేది కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని, ఫిబ్రవరి 1న జరిగే రాష్ట్ర బంద్‌లో పాల్గొంటామని తెలిపారు. పొత్తులపై నిర్ణయం తీసుకుంది ఏఐసీసీయేనని, ప్రియాంక గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించడం శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేశారు. -
11,12 తేదీల్లో దుబాయిలో రాహుల్ పర్యటన
గల్ఫ్ డెస్క్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 11, 12 తేదీలలో దుబాయిలో పర్యటించనున్నారు. దుబాయి క్రికెట్ స్టేడియంలో గల్ఫ్ ఎన్నారైలతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ,ఏఐసీసీ కార్యదర్శి హిమాన్షు సి.వ్యాస్ గతకొన్ని రోజులుగా దుబాయిలో ఉండి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాశ్చ) కన్వీనర్ మన్సూర్ పల్లూర్ రాహుల్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, అన్ని గల్ఫ్ దేశాల నుంచి ఎన్నారైలు ఇందులో పాల్గొంటారని పీసీసీ ఎన్నారై సెల్ దుబాయి కన్వీనర్ ఎస్.వేణురెడ్డి తెలిపారు. -
వైఎస్ జగన్‌పై దాడి దారుణం: కాంగ్రెస్
అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి దారుణమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీ, ఏపీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరా రెడ్డిలు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిపై సమగ్ర విచారణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్‌పోర్టులో ఈ దాడి జరగడం నిఘా వైఫల్యమేనని, ఈ దాడి వెనక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో కలకలం
విజయవాడ: కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో కలకలం రేగింది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఎదుట పీసీసీ సభ్యుడు శివాచారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. పక్కనున్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. నెల్లూరు రూరల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని తాను భావించానని, నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తన చేత రూ.50 లక్షలు ఖర్చు పెట్టించాడని, ఇప్పుడు తనను పక్కకు పెట్టి వేరే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని శివాచారి తెలిపారు. అతని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని వెల్లడించారు. సంఘటన జరిగిన సమయంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఊమెన్ చాందీ కూడా అక్కడే ఉన్నారు. -
హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: ఉమెన్
ఏలూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ స్పష్టం చేశారు. ఏలూరులో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు అని యూపీఏ ప్రతిప్రాదిస్తే కాదు పదేళ్లు ఇవ్వాలన్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రజలను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో నాలుగేళ్లుగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తాజా తీర్పుపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కాపులకు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ వెనుకడుగు వేయడం దారుణమన్నారు. 25 మంది ఎంపీలుంటే ప్రత్యేక హోదా తీసుకు వస్తానని వైఎస్ జగన్ ఎలా అన్నారు...ప్రత్యేక హోదా కూడా కేంద్ర పరిధిలోనిదే కదా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వగలదన్నారు. ప్రత్యేక హోదా, కాపుల రిజర్వేషన్ల విషయంలో ప్రాంతీయ పార్టీలు ఏమీ చేయలేవని చెప్పారు. ఏపీలో 44000 బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలిపారు. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్ల గురించి నేను ఎలా మాట్లడతా..నేను ఏపీకి మాత్రమే ఇన్చార్జిని అని స్పష్టం చేశారు. తమిళనాడులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి...అదే విధంగా ఏపీలో కూడా ఇబ్బందులు రాకుండా రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆలోచన చేస్తామని వ్యాఖ్యానించారు. కొంగ దీక్షలు చేస్తే జనం ఒప్పుకోరు: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఏపీకి జరిగిన అన్యాయంపై, పార్లమెంట్లో అవిశ్వాసం చర్చపై మొదట మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఎన్డీఏపై అవిశ్వాసంపై టీడీపీతో పాటు మిత్ర పక్షాలు కూడా నోటీసులు ఇచ్చాయని..టీడీపీ నోటీసులకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని చంద్రబాబు చెప్పుకోవడం ముఖ్యమంత్రి స్ధాయికి తగదన్నారు. చంద్రబాబు నాలుగేళ్లు ఎన్డీఏలో ఉండి ఇపుడు బయటకు వచ్చి కొంగ దీక్షలు చేస్తే జనం ఒప్పుకోరు...ఎవరూ నమ్మరని విమర్శించారు. ప్రత్యేక హోదా పై ఏఐసీసీ సమావేశంలో తీర్మానం చేశాం...రాహుల్ ప్రధాని అయిన వెంటనే తొలిసంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు తప్పితే ఏపీకి మరే పార్టీ న్యాయం చేయలేవని వ్యాఖ్యానించారు. -
విభజన హామీల అమలు కాంగ్రెస్‌తోనే సాధ్యం
కడప వైఎస్సార్ సర్కిల్ : రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి మొయప్పన్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్‌చాందీ రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే విభజచట్టంలోని ప్రత్యేకహోదా, జిల్లాలో ఉక్కు పరిశ్రమపై ఇచ్చిన హామీలపై తొలి సంతకం చేస్తామన్నారు. వీటిపై ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందని అన్నారు. మాజీ మంత్రి కమలమ్మ మాట్లాడారు. మాజీ మంత్రి అహ్మదుల్లా మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పక వస్తుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు నిలబడి ఉందన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు అహ్మద్ ఆలీఖాన్‌ను నగర మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ ఖాన్ సన్మానించారు. సభలో నేతలు ప్రసంగిస్తుండగా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్ చాందీ కునుకు తీశారు. పార్టీ అభివృద్ధి గురించి చెప్పాల్సిన ఇన్చార్జే ఇలా కునుకు తీస్తే ఎలాగని కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండి జకరయ్య, నీలి శ్రీనివాసరావు, జి.నాగరాజు, సత్తార్, పది నియోజకవర్గాల ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఏపీలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి
-
9 నుంచి ఏపీలో ఉమెన్ చాందీ పర్యటన
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం కోసం కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులతో భేటి అయ్యారు. ఆదివారం ఇందిరా భవన్లో ఊమెన్ చాందీ సమావేశం నిర్వహించారు. తనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో జరిగే పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలలో పర్యటనలు చేస్తామని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా పర్యటన జరుగుతుందని అన్నారు. ఈ పర్యటనలో గ్రామస్థాయి నాయకుల నుంచి అసెంబ్లీ స్థాయి నేతల వరకు అందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీలోని కార్యకర్తల మధ్య ఎటువంటి అంతరం లేకుండా సమన్వయంతో పనిచేసేలా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు క్రిస్టోఫర్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కేవీపీ రామచంద్రారావు, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పళ్ళంరాజు, జేడీ శీలం, రుద్రరాజు పద్మరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు. -
సమయం వచ్చినపుడు చెబుతా: కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ భేటీ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు గతంలో కాంగ్రెస్‌ను వీడిన వారందరినీ తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని సమావేశం అనంతరం ఊమెన్ చాందీ తెలిపారు. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం అయ్యామని వివరించారు. తమ ఆహ్వానంపై కిరణ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని, పార్టీని పటిష్ట పర్చాల్సిన అవసరం ఉందన్నారు. కిరణ్ కాంగ్రెస్ కుటుంబ మనిషి అని, కాంగ్రెస్ పార్టీలో తప్పక తిరిగి చేరతారనే నమ్మకం ఉందని ఊమెన్ చాందీ చెప్పారు. సమయం వచ్చినపుడు ఏపార్టీలో చేరేదీ, అసలు చేరనిదీ అన్ని విషయాలు తానే మీడియాకు చెబుతానని కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. -
సహాయక చర్యలు పూర్తయ్యాయి: ఊమెన్ చాందీ
తిరువనంతపురం : కొల్లం పుట్టంగల్ ఆలయంలో సహాయక చర్యలు పూర్తయ్యాయని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వెల్లడించారు.క్షతగాత్రుల వైద్య సహాయం పై దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఆయన హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీతో ఊమెన్ చాందీ ఫోన్లో వివరించారు. అన్ని విధాల సహాయ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఊమెన్ చాందీకి మోదీ హామీ ఇచ్చారు. అలాగే ప్రమాద ఘటన స్థలాన్ని కేరళ హోంశాఖ మంత్రి రమేష్ చెన్నితాల సందర్శించారు. మంటలు అదుపులోకి వచ్చాయని... గాయపడిన వారిని తిరువనంతపురం తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కొల్లం పుట్టంగల్ ఆలయ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి రమేష్ చన్నితాల ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో కేరళ మంత్రి వర్గం ఆదివారం మధ్యాహ్నం తిరువనంతపురంలో అత్యవసర సమావేశం కానుంది. ఇదిలా ఉంటే మోదీ కేరళ బయలుదేరారు. అలాగే కేరళలో నిర్వహించిన వలసిన ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రద్దు చేసుకున్నారు.