వైఎస్‌ జగన్‌పై దాడి దారుణం: కాంగ్రెస్‌ | Congress Leaders Umen Chandi And Raghuveera Condemns Attack On YS Jagan In Vizag Airport | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై దాడి దారుణం: కాంగ్రెస్‌

Published Thu, Oct 25 2018 3:10 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Leaders Umen Chandi And Raghuveera Condemns Attack On YS Jagan In Vizag Airport - Sakshi

కాంగ్రెస్‌ నేతలు ఉమెన్‌ చాందీ, ఎన్‌ రఘువీరా రెడ్డి

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి దారుణమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్‌ చాందీ, ఏపీసీసీ అధ్యక్షులు ఎన్‌ రఘువీరా రెడ్డిలు వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిపై సమగ్ర విచారణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

జగన్‌ మోహన్‌ రెడ్డికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్‌పోర్టులో ఈ దాడి జరగడం నిఘా వైఫల్యమేనని, ఈ దాడి వెనక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement