కాంగ్రెస్ లక్ష్యం అదే.. జగన్‌ను దెబ్బ తీసేందుకు నన్ను వాడుకుంది: యూట్యూబ్ ఇంటర్వ్యూ లో సబితా ఇంద్రారెడ్డి
ఆయన్ను టార్గెట్ చేసేందుకు నామీద సీబీఐ కేసులు పెట్టారు
హోంమంత్రి పదవి ఇచ్చి నాకేమీ ప్రయోజనం చేకూర్చలేదు
జగన్‌పై అక్రమ కేసుల వెనుక లోగుట్టు మరోసారి బట్టబయలు
కాంగ్రెస్ అధిష్టానం కుట్రలను గతంలోనే వెల్లడించిన ఆజాద్, మొయిలీ
సోనియా ఆదేశాలతోనే నాడు పిటిషన్ దాఖలు చేశానన్న శంకర్‌రావు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గతంలో కక్షపూరితంగా అక్రమ కేసులు నమోదు చేసినట్లు మరోసారి స్పష్టమైంది. ఉమ్మడి రాష్ట్రంలో గనులు, హోం శాఖలను నిర్వహించిన నాటి కాంగ్రెస్ నేత, ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న పి.సబితా ఇంద్రారెడ్డి తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో నాటి కుట్రలు స్పష్టంగా బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తనను ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిని చేసిందన్న వ్యాఖ్యలపై సబిత తీవ్రంగా ప్రతిస్పందించారు.
హోంమంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తనకేమీ ప్రయోజనం చేకూర్చలేదని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బ తీసేందుకు ఆ పార్టీ తనను వాడుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేయడానికి తన మీద ఐదు సీబీఐ కేసులు పెట్టారని తెలిపారు. ‘నేను రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఉన్నాను కాబట్టి నామీద కేసులు పెడితే జనం నమ్ముతారని భావించారు. నన్ను ముందు పెట్టి జగన్‌ను దెబ్బ కొట్టాలని ప్రయత్నించారు. జగన్ తరువాత ఎక్కువ కేసులు నామీదే ఉన్నాయి.
నామీద ఐదు సీబీఐ కేసులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కాదా ఇది? ఏ తప్పూ చేయని నేను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. వైఎస్ రాజశేఖరరెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారనే కారణంతో.. నామీద ఐదు సీబీఐ కేసులు బనాయించినా 24 ఏళ్ల రాజకీయ జీవితంలో 20 ఏళ్లు ఆ పార్టీలోనే పనిచేశా’ అని చెప్పారు. మహిళలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గౌరవం లేదన్నారు.
అధిష్టానం చెబితేనే పిటిషన్ దాఖలు చేశా– కాంగ్రెస్ మాజీ మంత్రి శంకర్‌రావు
వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు బనాయించేందుకు కాంగ్రెస్ పార్టీ పావుగా వాడుకున్న దివంగత మాజీ మంత్రి శంకర్‌రావు కూడా గతంలోనే ఆ కుట్రను బయటపెట్టడం గమనార్హం. జగన్‌కు వ్యతిరేకంగా శంకర్‌రావుతో న్యాయస్థానంలోపిటిషన్ దాఖలు చేయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ కుట్రలకు తెర తీసింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో శంకర్‌రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘సాక్షాత్తూ సోనియాగాంధీ ఆదేశించడంతోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశా’ అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో ఉంటే జగన్ కేంద్రమంత్రి అయ్యేవారు - గులాం నబీ ఆజాద్
యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్‌్జగా ఉన్న గులాం నబీ ఆజాద్ సైతం వైఎస్ జగన్‌పై అక్రమ కేసుల వెనుక ఉన్న కుట్రను బయటపెట్టారు. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన గతంలోనే మీడియా ప్రతినిధులకు అసలు విషయాన్ని వెల్లడించారు. ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవారు’ అని ఆజాద్ వ్యాఖ్యానించారు. తద్వారా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం వల్లే వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు నమోదు చేశారన్న వాస్తవాన్ని బహిర్గతం చేశారు. కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే అక్రమ కేసులు ఉండేవి కావు.. పైగా జగన్ కేంద్ర మంత్రి కూడా అయ్యేవారు అని ఆనాడే స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో ఉంటే మంచోడే – వీరప్ప మొయిలీ
ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్‌్జగా వ్యవహరించిన దివంగత వీరప్ప మొయిలీ సైతం వైఎస్ జగన్‌పై అక్రమ కేసుల వెనుక లోగుట్టును గతంలోనే బయటపెట్టారు. ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే మంచి వ్యక్తే. ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం దురదృష్టకరం’ అని నాడు మీడియాతో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment