Sabita Indra Reddy
-
నరేందర్‌రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్ర: సబితా
హైదరాబాద్, సాక్షి: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. వికారాబాద్ లగచర్లలో ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని అన్నారు. ఆమె బుధవారం సాక్షి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారులపై జరిగిన ఘటన కూడా బాధాకరం. అహంకారంగా భూమి లాక్కోవడం ఎంతవరకు సమంజసం. అహంకారంతో భూమి లాక్కుంటే ప్రతిఘటన ఏవిధంగా ఉంటుందో రుచి చూపించారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్?. మాజీ శాసనసభ్యుడు కాబట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు. ప్రతిసారి ఇష్యూను సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నారు. అక్కడి ఘటనలో బీఆర్ఎస్ నేతలే కాదు.. కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. మూసి దగ్గర సమస్య వచ్చినప్పుడు అక్కడున్న ఇల్లు కూలగొడతామన్నారు. సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కారం చేయకుండా ప్రతిపక్షాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. కొడంగల్‌లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడగోట్టాడు కాబట్టే రాజకీయ ప్రత్యర్థిని తొక్కేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారు’’ అని అన్నారు. -
టార్గెట్ చేసి రచ్చ చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉధృతంగా ముందుకు వెళుతున్నందునే, ప్రభుత్వం టార్గెట్ చేసి రచ్చచేస్తోందని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల సొంతంగా ఫామ్‌హౌస్ కట్టుకుని గృహ ప్రవేశం చేశారని, దాన్ని రేవ్‌పార్టీ అంటూ కుట్రలకు తెరతీశారని వారు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వా రు మాట్లాడారు.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ప్రభుత్వంపై కేటీఆర్ దూకుడుగా వెళ్తున్నందునే ఆయనను టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ బావమరిది కాబట్టి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలు రాజకీయాల్లో ఇప్పుడే చూస్తున్నాం అన్నారు. వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారని, ఆయనపై కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.పోలీసు కుటుంబాలు రోడ్డెక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదని, రాజ్ పాకాల విషయంలో మా త్రం వీడియో రిలీజ్ చేశారని విమర్శించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు లేవని, ఇప్పుడు కొత్తగా అలాంటి సంస్కృతిని తీసుకురావద్దని అన్నారు. లేని ఆధారాలను సృష్టించి నా తమ్ముడిని అరెస్ట్ చేశారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కాగా, మాజీ మంత్రి కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తు న్నారని బీఆర్ఎస్ సీని యర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నమిదికాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమ లు చేయకుండా, సమస్యలపై నిలదీస్తున్న కేటీఆర్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్, నాయకు లు గెల్లు శ్రీనివాస్, సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. జన్వాడ పార్టీ వ్యవహారంలో ఆయనను కావాలనే ఇరికిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వారు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. -
‘మూసీ కంటే రేవంత్ నోరే కంపు’.. బీఆర్ఎస్ నేతల కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగిన రైతు రుణమాఫీ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ‘సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. టీవీ ముందు కూర్చున్న రాష్ట్ర ప్రజలు కూడా తలదించుకులే ఉంది. హరీష్ రావు గురించి కూడా ఏదేదో మాట్లాడారు. రుణమాఫీపై హరీష్ రావు ముక్కు నేలకు రాయాలని అన్నారు. ఇప్పుడు రెండు లక్షల రుణం మాఫీ కాలేదు.. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి ముక్కు నేలకు రాయాలి. మీరిచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటాం. హరీష్ రావు పైన కూడా వాడకూడని భాషతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేరు తీయకుండా రేవంత్‌రెడ్డికి నిద్ర పట్టదు.సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే.. భద్రాద్రి రాముడి సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ‘బహిరంగ సభలో పచ్చి భూతులు మాట్లాడారు.. కాంగ్రెస్‌లో ఉన్న మంత్రులు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 30 వేల ఉద్యోగాలు కాదు.. 30 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ప్రాజెక్ట్ కట్టింది మేమే అన్నట్టు కాంగ్రెస్ తీరు ఉంది. ఒక మంత్రి నీళ్ళు జల్లుకోవడం, మరో మంత్రి పూలు జల్లడం. ఇదంతా కేసిఆర్ ప్రాజెక్ట్ నిర్మించటం వల్లే. కష్టపడి నీళ్ళు తెచ్చామని చెప్పుకోవడానికి వారికి సిగ్గుండాలి. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితం చేసింది మీరు కాదా?. రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు’ అని ధ్వజమెత్తారు.ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలి..సీఎం రేవంత్‌రెడ్డి ఏమాత్రం సిగ్గు లేకుండా హరీష్ రావుపై అసభ్య విమర్శలు చేశాని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ‘దేవుళ్ళను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి. సూటిగా చెప్పు రూ. 31 వేల కోట్ల రుణ మాఫీ చేశావా లేదా?. కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే అకౌంట్లలో వేశావ్. సిగ్గుంటే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేయాలి. 2018లో రేవంత్‌ను కొడంగల్‌లో హరీష్ రావు చిత్తు చిత్తుగా ఓడించారు. హరీష్ రావును విమర్శలు చేసే స్థాయి రేవంత్‌కు లేదు. మూసి కంటే కంపు రేవంత్ నోరు. ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలి’అని మండిపడ్డారు. -
‘టార్గెట్ జగన్’.. సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గతంలో కక్షపూరితంగా అక్రమ కేసులు నమోదు చేసినట్లు మరోసారి స్పష్టమైంది. ఉమ్మడి రాష్ట్రంలో గనులు, హోం శాఖలను నిర్వహించిన నాటి కాంగ్రెస్ నేత, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న పి.సబితా ఇంద్రారెడ్డి తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో నాటి కుట్రలు స్పష్టంగా బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తనను ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిని చేసిందన్న వ్యాఖ్యలపై సబిత తీవ్రంగా ప్రతిస్పందించారు. హోంమంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తనకేమీ ప్రయోజనం చేకూర్చలేదని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని దెబ్బ తీసేందుకు ఆ పార్టీ తనను వాడుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేయడానికి తన మీద ఐదు సీబీఐ కేసులు పెట్టారని తెలిపారు. ‘నేను రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఉన్నాను కాబట్టి నామీద కేసులు పెడితే జనం నమ్ముతారని భావించారు. నన్ను ముందు పెట్టి జగన్‌ను దెబ్బ కొట్టాలని ప్రయత్నించారు. జగన్ తరువాత ఎక్కువ కేసులు నామీదే ఉన్నాయి. నామీద ఐదు సీబీఐ కేసులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కాదా ఇది? ఏ తప్పూ చేయని నేను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. వైఎస్ రాజశేఖరరెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారనే కారణంతో.. నామీద ఐదు సీబీఐ కేసులు బనాయించినా 24 ఏళ్ల రాజకీయ జీవితంలో 20 ఏళ్లు ఆ పార్టీలోనే పనిచేశా’ అని చెప్పారు. మహిళలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గౌరవం లేదన్నారు. అధిష్టానం చెబితేనే పిటిషన్ దాఖలు చేశా– కాంగ్రెస్ మాజీ మంత్రి శంకర్రావు వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు బనాయించేందుకు కాంగ్రెస్ పార్టీ పావుగా వాడుకున్న దివంగత మాజీ మంత్రి శంకర్రావు కూడా గతంలోనే ఆ కుట్రను బయటపెట్టడం గమనార్హం. జగన్‌కు వ్యతిరేకంగా శంకర్రావుతో న్యాయస్థానంలోపిటిషన్ దాఖలు చేయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ కుట్రలకు తెర తీసింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో శంకర్రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘సాక్షాత్తూ సోనియాగాంధీ ఆదేశించడంతోనే వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశా’ అని స్పష్టం చేశారు.కాంగ్రెస్‌లో ఉంటే జగన్ కేంద్రమంత్రి అయ్యేవారు - గులాం నబీ ఆజాద్యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్‌్జగా ఉన్న గులాం నబీ ఆజాద్ సైతం వైఎస్ జగన్‌పై అక్రమ కేసుల వెనుక ఉన్న కుట్రను బయటపెట్టారు. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన గతంలోనే మీడియా ప్రతినిధులకు అసలు విషయాన్ని వెల్లడించారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవారు’ అని ఆజాద్ వ్యాఖ్యానించారు. తద్వారా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం వల్లే వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు నమోదు చేశారన్న వాస్తవాన్ని బహిర్గతం చేశారు. కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే అక్రమ కేసులు ఉండేవి కావు.. పైగా జగన్ కేంద్ర మంత్రి కూడా అయ్యేవారు అని ఆనాడే స్పష్టం చేశారు.కాంగ్రెస్‌లో ఉంటే మంచోడే – వీరప్ప మొయిలీఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్‌్జగా వ్యవహరించిన దివంగత వీరప్ప మొయిలీ సైతం వైఎస్ జగన్‌పై అక్రమ కేసుల వెనుక లోగుట్టును గతంలోనే బయటపెట్టారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే మంచి వ్యక్తే. ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం దురదృష్టకరం’ అని నాడు మీడియాతో వ్యాఖ్యానించారు. -
మళ్లీ అట్టుడికిన అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గురువారం కూడా శాసనసభ అట్టుడికింది. బీఆర్ఎస్ సభ్యులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పదేపదే స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. అక్కడే బైఠాయించారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ అసెంబ్లీ కొనసాగినంత సేపూ తమ సీట్ల వద్ద నిలబడే ఉండి నిరసన వ్యక్తం చేశారు.తమకు మాట్లాడే అవకాశమివ్వాలని స్పీకర్‌ను కోరారు. ప్రతిపక్షం నిరసనను అధికార పక్షం పట్టించుకోలేదు. గందరగోళం మధ్యే కీలకమైన స్కిల్ వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి, చర్చ చేపట్టారు. సభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్ బాబు సభ నిర్వహణకు సహకరించాలంటూ పలుమార్లు బీఆర్ఎస్ సభ్యులను కోరారు. నల్లబ్యాడ్జీలతో వచి్చ..గురువారం బీఆర్ఎస్ సభ్యులంతా నల్లబ్యాడ్జీ లతో శాసనసభకు వచ్చారు. సభ ప్రారంభం కాగానే సబితను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలపై చర్చకు పట్టుబట్టారు. సబితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని వారు కోరి నా స్పీకర్ అనుమతించలేదు.అదే సమయంలో స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టాలని మంత్రికి స్పీకర్ సూచించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ పోడి యం వద్దకు దూసుకెళ్లారు. ‘సీఎం డౌన్ డౌన్.. సీఎం అహంకార పూరిత వైఖరి నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. సభ గందరగోళంగా ఉండగానే.. సీఎం రేవంత్ ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణపై ప్రకటన చేశారు. ఆ సమయంలో కాసేపు శాంతించిన విపక్ష సభ్యులు తర్వాత మళ్లీ నిరసన మొదలుపెట్టారు. గందరగోళం మధ్య చర్చ ఎలా?: అక్బరుద్దీన్ సభలో గందరగోళం కొనసాగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ జోక్యం చేసుకున్నారు. సభలో ఎవరిపై అయినా వ్యాఖ్యలు చేసినప్పుడు.. స్పష్టత ఇచ్చే హక్కు వారికి ఉంటుందని రూల్ పొజిషన్ లేవనెత్తారు. విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమైనా ఇవ్వాలని, లేదా వారిని సస్పెండైనా చేయాలని సూచించారు.ఇంత గందరగోళం మధ్య కీలకమైన అంశాలపై చర్చ సరికాదని స్పష్టం చేశారు. సభను దారిలో పెట్టాల్సిన బాధ్యత సభాపతికి, సభా నాయకుడికి ఉంటుందన్నారు. సభను వాయిదా వేసి విపక్ష, అధికారపక్ష సభ్యులతో మాట్లాడటం సాంప్రదాయమని.. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సభ కొనసాగించడం సరికాదని పేర్కొన్నారు. దీనికి స్పీకర్ బదులిస్తూ.. సభను అదుపులో పెట్టేందుకు తాను ఉదయం నుంచీ ప్రయతి్నస్తూనే ఉన్నానని చెప్పారు. తర్వాత కూడా నిరసనలు, నినాదాల మధ్యే సభ కొనసాగింది. తనిఖీల నుంచి తరలింపు దాకా.. గురువారం ఉదయం అసెంబ్లీకి వచి్చన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. ప్లకార్డులు ఏవైనా తెస్తున్నారా అని ఆరా తీశారు. దీనిపై ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక సభ ప్రారంభానికి పది నిముషాల ముందే నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సుమారు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. సభ ముగిశాక అసెంబ్లీలోని సీఎం చాంబర్ ముందు ధర్నాకు దిగారు.సుమారు అరగంట పాటు ఆందోళన చేయగా.. మార్షల్స్ రంగప్రవేశం చేసి ఎమ్మెల్యేలను అసెంబ్లీ భవనం బయటికి తరలించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి ఆందోళన కొనసాగించారు. పోలీసులు కలి్పంచుకుని.. కేటీఆర్, హరీశ్‌రావు, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, విజయుడు, మాణిక్‌రావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులను వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చివరికి అందరినీ బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌కు తరలించారు. నేడు కూడా ఆందోళనకు నిర్ణయం శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ముగియనున్న నేపథ్యంలో.. తమ మహిళా సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తామని.. ఇందుకోసం మాట్లాడే చాన్స్ ఇవ్వాలని పట్టుబడతామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. తాను సీఎం నుంచి క్షమాపణ కోరుకోవడం లేదని.. మాట్లాడే అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నానని పేర్కొన్నారు. స్పీకర్‌కు తమ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. -
సీఎం కుర్చీ విలువను తగ్గించారు
సాక్షి, హైదరాబాద్: ‘శాసనసభలో సీఎం స్థానంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి, కేసీఆర్ వంటి ముఖ్యమంత్రులను చూశాం. మహిళా శాసనసభ్యులు నిలబడి మైక్ అడిగితే గతంలో సీఎంలు స్పందించేవారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు మైక్ ఇచ్చేందుకు భయపడుతున్నారు. మహిళా ఎమ్మెల్యేలు నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిల్చుని మాట్లాడే అవకాశం ఇవ్వాలని అడిగినా ఇవ్వకుండా సీఎం సహా, అధికార పక్షం రాక్షసానందం పొందుతోంది. స్పీకర్ మనసు మారుతుందేమోనని గంటల కొద్దీ నిల్చున్నాం. మహిళా ఎమ్మెల్యేలను కించ పరిచినా సభ స్పందించలేదు. సీఎం కుర్చీ విలువను రేవంత్ తగ్గించారు..’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.అక్కలు అంటూనే పంగనామాలు‘ఆడబిడ్డలను అవమానించడం సీఎంకు నిత్యకృత్యంగా మారింది. రేవంత్‌ను నమ్ముకున్న రాహుల్‌గాంధీ బతుకుని సికింద్రాబాద్ స్టేషన్ చేస్తారా? సభలో లేని ఎమ్మెల్సీ కవిత పేరును రేవంత్ ప్రస్తావించడం సరికాదు. నేను రేవంత్‌ను నడిబజారులో నిలబెట్టలేదు, రాజ్‌భవన్‌లో కూర్చోబెట్టాను. గతంలో నన్ను చేవెళ్ల చెల్లెమ్మ అని పిలిచింది కాంగ్రెస్ కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. ఈ సీఎం మాత్రం అక్కలు అంటూనే పంగనామాలు పెడుతున్నారు.గతంలో పీసీసీ అధ్యక్షులు కూడా పార్టీలు మారారు. సీఎం రేవంత్ సహా అసెంబ్లీలో ఇప్పుడున్న వారిలో ఎంత మంది పార్టీలు మారలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మమ్మల్ని టార్గెట్ చేయడం ఎందుకు? టీడీపీ రేవంత్ సీఎం పదవి లాక్కున్నా భట్టికి బాధ లేదు. మాకు సీఎం క్షమాపణ చెప్పడం ముఖ్యం కాదు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వం నుంచి సమాధానం కోసం శుక్రవారం సభలో పట్టుబడతాం. మాకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. శాసనసభలో మహిళల గౌరవాన్ని కాపాడాలి..’ అని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మాపై వ్యాఖ్యలు బాధాకరం: సునీత‘నాలుగున్నర గంటలు సభలో నిల్చున్నా పాలకపక్షం స్పందించక పోగా హేళన చేసింది. జూనియర్ ఎమ్మెల్యేలు మాపై చేసిన వ్యాఖ్యలు బాధాకరం. గతంలో నా తరఫున నర్సాపూ ర్ ప్రచారానికి వచ్చిన రేవంత్ చేసిన వ్యాఖ్యల వల్లే నాపై మూడు కేసులు నమోదయ్యాయి. సమాచారం లేకుండా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఎస్సీ వర్గీకరణకు మేము వ్యతిరేకం అన్నట్లుగా కాంగ్రెస్ సభ్యులు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు..’ అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. సీఎం ఓ వైపు ఇందిర, సోనియా పేర్లు చెపుతూ మరోవైపు మహిళా ఎమ్మెల్యేలను అవమాన పరుస్తున్నారని కోవా లక్ష్మి విమర్శించారు. చట్ట సభల్లో్లనూ మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు.తాలిబన్ సంస్కృతికి వారసుడిలా సీఎం: మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్రెడ్డిసీఎం రేవంత్ ఫ్యూడల్ మనస్తత్వంతో తాలిబన్ సంస్కృతికి వారసుడిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో సహచర ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, మర్రి జనార్దన్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ ఎమ్మెల్యేలు సబిత, సునీతా లక్ష్మా రెడ్డిపై ఆయన వ్యాఖ్యలు జుగుప్సా కరమన్నారు.పూటకో పార్టీ మారిన రేవంత్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో రేవంత్‌కు తగిన శాస్తి జరుగు తుందని హెచ్చరించారు. సబిత, సునీతపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడం దుశ్శాసన పర్వాన్ని తలపిస్తోందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌పై ఉన్న కోపాన్ని భట్టి విక్రమార్క సబితపై చూపించారన్నారు. అసెంబ్లీలో గొంతు నొక్కితే ప్రజాక్షేత్రంలో మాట్లాడతామని చెప్పారు. -
అక్కలను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయం
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీపై చర్చ జరగకూడదని బీఆర్ ఎస్ నేతలు అక్కలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, కావాలనే సభను స్తంభింపజేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను తాను సొంత అక్కలుగానే భావించానని.. కానీ వారు దొర పన్నిన కుట్రలో బందీ అయ్యారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలకు రాజకీయ ప్రయోజనమే తప్ప.. ప్రజల ప్రయోజనం పట్టదని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను నేను సొంత అక్కలుగానే భావించా. ఒక అక్క నన్ను నడిబజారులో వదిలేసింది. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. అప్పుడు నమోదైన కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. తన కోసం ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఆమె ఎప్పుడైనా చెప్పారా? నన్ను నమ్ముకున్న సీతక్క, సురేఖ అక్క ఇద్దరూ మంత్రులై ముందు వరుసలో ఉన్నారు.సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా రాజకీయాలుబీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో సీతక్కను అవమానించేలా మీమ్స్ పెడుతున్నారు. ఆ మీమ్స్‌ను ఇక్కడ చూపిస్తే సభా గౌరవం పోతుంది. అలా మీమ్స్ పెట్టిన వాళ్లను చెప్పుతో కొట్టాలి. వారు ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్టు కాదా? సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా.. ఢిల్లీ వెళ్లి రాజకీయాలు చేస్తున్న నీచులు వారు. సొంత చెల్లిల్ని ఏడాదిపాటు జైల్లో ఉంచినా ఫర్వాలేదు. మా జోలికి రాకండి అన్నవిధంగా వారి వ్యవహారశైలి ఉంది. మైక్ ఇస్తే శాపనార్థాలు.. ఇవ్వకపోతే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారు. నా చెల్లెలు జైల్లో ఉంటే నేను రాజకీయాల కోసం బజార్లో తిరిగే వాడిని కాదు. నేను అక్కను అవమానించే నీతిలేని వాడిని కాదు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారు. అక్కా మీరు వాళ్ల ఉచ్చులో పడొద్దు.కేసీఆర్ చర్చలో పాల్గొంటే బాగుండేది..ఎస్సీ వర్గీకరణపై అందరూ పండుగ చేసుకుంటుంటే.. బీఆర్ఎస్ వాళ్లకు అదేమీ పట్టడం లేదు. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే.. రాక్షసులు భగ్నం చేయడానికి వచ్చినట్టుగా బీఆర్ఎస్ నేతల వైఖరి ఉంది. దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసి వెళ్లిపోయింది. వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నా. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. కేసీఆర్ కూడా దీనిపై మాట్లాడితే బాగుండేది. ఇంత కీలక అంశం సభలో చర్చకు వస్తున్నప్పుడు స్వయంగా కేసీఆర్ చర్చలో పాల్గొంటే బాగుండేది. స్పీకర్ దళితుడు కాబట్టే ఆయన ముందు కింద కూర్చోకూడదనే కేసీఆర్ సభకు రావడం లేదు..’’అని రేవంత్ పేర్కొన్నారు. అసలు కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీయే రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. హరీశ్‌రావుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. స్కిల్స్ యూనివర్సిటీ భూమిపూజకు అందరూ రావాల్సిందిగా రేవంత్ కోరారు. -
విపక్ష నేతగా నిలబెట్టాల్సింది పోయి మోసం చేశారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తనకు 2018లో సీఎల్పీ నేతగా, ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించిందని, ఒక దళితుడికి సీఎల్పీగా అవకాశం లభించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌లో దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి తన వెనక ఉండి ప్రతిపక్ష నేతగా నిలబెట్టాల్సింది పోయి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది నేతలతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి పార్టీ విడిచి వెళ్లవద్దని, మీరు వెళ్తే సభ్యుల సంఖ్య తగ్గి ప్రతిపక్ష నేత హోదాను కోల్పోతానని, కాంగ్రెస్ పరువుపోతుందని ఆవేదన పడినా ప్రయోజనం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మధ్య జరిగిన వాగ్వాదానికి స్పందిస్తూ ఆయన మాట్లాడారు. ‘అధికారం, స్వార్థం కోసం కాంగ్రెస్ వదిలి టీఆర్ఎస్లో చేరిన మీరు బాధపడుతూ మాట్లాడుతున్నా అంటున్నారు. అసలు బాధ పడాల్సింది నేనా? కాంగ్రెస్ పార్టీనా? మీరా? ఇంకా ఏం ముఖం పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడతా రు? పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’ అని భట్టి విక్రమార్క తీవ్ర స్వరంతో మాట్లాడారు. వేరే పార్టీలో ఉన్న సబితను 2004లో కాంగ్రెస్‌లో చేర్చుకుని టికెట్ ఇచ్చి ఐదేళ్లు మంత్రిగా చేసినట్టు గుర్తు చేశారు. 2009లో మళ్లీ టికెట్ ఇచ్చి మళ్లీ ఆమెను మంత్రిని చేసి అత్యంత ముఖ్యమైన శాఖలు అప్పగించారన్నారు. 2014లో పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చిందని, వాళ్ల అబ్బాయికి కూడా ఎంపీ టికెట్ ఇచ్చిందని భట్టి చెప్పారు.మోసం చేశారు: మంత్రి సీతక్క కాంగ్రెస్‌లో చేరిన (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేయించారని బీఆర్ఎస్పై మంత్రి సీతక్క మండిపడ్డారు. వారితో రాజీనామా చేయించి బీఆర్ఎస్లోకి తీసుకున్నారా? సబితతో రాజీనామా చేయించారా? అని నిలదీశారు. మీతో వస్తామని చెప్పి ఒకరిద్దరు మహిళలు ఏం చేశారో తనకు తెలుసని, ఆ బాధను సీఎం అనుభవించారని చెప్పారు.(కాంగ్రెస్‌లో చేరేందుకు) ఢిల్లీకి వస్తున్నామని వారు చెప్పడంతో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ వద్ద సమయాన్ని తీసుకున్నారని, ఆ తర్వాత రాకుండా మోసం చేశారన్నారు. ఆ బాధ అనుభవించిండు కాబట్టే కేటీఆర్‌కు సీఎం సూచన చేశారన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆమెను ఉద్దేశించి నీకేం తెలియదు అనగా, నీ దురహంకారాన్ని బంద్ చేసుకో అని సీతక్క తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వారికి ఎంతో చేసిందని, అదే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వారిద్దరు చప్పట్లు కొట్టడం సబబేనా? అని సబిత, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆసక్తి లేకుంటే వెళ్లిపోవచ్చు: మంత్రి శ్రీధర్‌బాబు సభా నాయకుడు సీఎం మాట్లాడుతున్నప్పుడు సభ్యులందరూ సభలో కూర్చొని ఉండాలనే సంప్రదాయం ఉందని, కూర్చునే ఆసక్తి లేని వాళ్లు వెళ్లిపోవచ్చని శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ వెల్ వద్ద చేరి ఆందోళన చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా తనకున్న అధికారాలను సైతం ప్రశ్నిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపారని మండిపడ్డారు. తీరు మారకపోతే సభలో (సస్పెన్షన్ తరహా) తీర్మానం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఈ అవమానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిలది మాత్రమే కాదని.. మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకే అవమానకరమని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. ‘‘మహిళా ఎమ్మెల్యేలను అకారణంగా, అసభ్యంగా హీనాతిహీనంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు అవమానించారు.మహిళా ఎమ్మెల్యేలు ఎంతో కష్టపడి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. అంతేతప్ప రేవంత్ మాదిరిగా విన్యాసాలు చేస్తూ రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ల కుటుంబాలకు ఉన్న ఆదరణతో స్వశక్తితో రాజకీయాల్లో రాణిస్తున్నారు. అలాంటి మహిళలను పట్టుకుని నోటికి వచ్చినట్టు వాగడం సీఎం రేవంత్‌కు తగదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలి..’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందన్నట్టుగా సీఎం మాట్లాడటం హేయమని మండిపడ్డారు. సీఎం కుర్చీలో కూర్చునేందుకు రేవంత్ అనర్హుడని, ఆయనకు ఆడబిడ్డల ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు.భట్టికి ఎంత గుండె ధైర్యం?‘‘ముఖ్యమంత్రి ఇట్లా ఉంటే.. ఉప ముఖ్యమంత్రి మమ్మల్ని ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చినవ్ అంటారా? మీరు ఏ ముఖం పెట్టుకుని వచ్చారో మేము కూడా అదే విధంగా అసెంబ్లీకి వచ్చాం. మా ఆడబిడ్డలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడటానికి డిప్యూటీ సీఎం భట్టికి ఎంత గుండె ధైర్యం?’’ అని కేటీఆర్ నిలదీశారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చినది ఇష్టమొచ్చినట్టు మాట్లాడటానికా అని ప్రశ్నించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నా ఎప్పుడైనా ఇలా మహిళలను అవమానించామా అని పేర్కొన్నారు. సీఎంను ఏకవచనంతో సంబోధిస్తే వెంటనే సరిచేసుకు న్నానని, అది కేసీఆర్ తమకు నేర్పిన సంస్కారమని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. -
అక్కలను నమ్ముకుంటే.. బతుకు ఆగమవుతుందంటారా?
సాక్షి, హైదరాబాద్: ‘‘మమ్మల్ని నమ్మితే బతుకు బస్టాండేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్న మాటలు చాలా బాధించాయి. అక్క లను నమ్ముకుంటే బతుకు ఆగమైపోతుందని రేవంత్ అన్న మాటలు మమ్మల్ని మాత్రమే కాదు, తెలంగాణ మహిళలను అవమానించినట్టే. అంతేకాదు ఏం ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారని మమ్మల్ని డిప్యూటీ సీఎం భట్టి అనడం దారుణంగా అవమానించడమే’’అని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మా ట్లాడారు. అక్కలుగా తాము అందరి మంచి కోరుతామని, కానీ ఖర్మకాలి అసెంబ్లీకి వచ్చామని సబితారెడ్డి కంటతడి పెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.పక్కదారి పట్టించేందుకే అవమానించారు!కేటీఆర్ శాసనసభలో బడ్జెట్‌పై నిజాలు మాట్లాతుంటే.. దాన్నుంచి పక్కదారి పట్టించేందుకే సీఎం తమపై అవమా నకర వ్యాఖ్యలు చేశారని సబిత మండిపడ్డారు. ‘‘మీ వెనుక కూర్చొన్న అక్కలు అంటూ మమ్మల్ని అవమానపరిచారు. సీఎంకు మహిళలంటే ఎంత గౌరవమో తెలుస్తోంది. నేను మోసం చేశానని రేవంత్‌రెడ్డి అంటున్నారు. అప్పట్లో ఆయన ను కాంగ్రెస్‌లో రమ్మనడమే నేను చేసిన తప్పా?’’అని నిలదీశారు. దివంగత సీఎం వైఎస్సార్ తమను రాజకీయా ల్లోకి తీసుకువచ్చారని, మహిళలను ఆయన ఎంతో ప్రోత్స హించారని సబిత గుర్తుచేశారు. తాను గత 24 ఏళ్లలో చాలా మంది సీఎంలను చూశానన్నారు. సీఎం సీటు రేవంత్ సొంతం కాదని, 4 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన పదవి అన్న విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. తామెక్కడ నిలదీస్తామోనని అసెంబ్లీ నుంచి పారి పోయారన్నారు.ఏం ముఖం పెట్టుకుని వచ్చారంటారా?అసెంబ్లీకి ఏం ముఖం పెట్టుకుని వచ్చారన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని సబిత డిమాండ్ చేశా రు. ‘‘నేను ఏ తప్పు చేయలేదు. చాలామంది పార్టీలు మారా రు. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాల కుండా చూస్తామన్న రేవంత్ మాటలేమయ్యాయి? ఇప్పుడు పార్టీ మారిన వాళ్లను మీ పక్కన ఎందుకు పెట్టుకున్నారు? తాను కాంగ్రెస్ నుంచి బయటికి ఎందుకు రావాల్సి వచ్చిందో, ఎలా మెడబట్టి బయటికి గెంటే ప్రయత్నం చేశారో తెలుసు. నా కారణంగానే గతంలో భట్టి విక్రమార్కకు ప్రతి పక్ష నేత పదవి పోయిందన్నారే.. మరి ఇప్పడు ఆయన సీఎం ఎందుకు కాలేదు’’ అని నిలదీశారు.ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పనిచేశాం: సునీతా లక్ష్మారెడ్డితాము ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పనిచేశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. అధికా రం ఉన్నా, లేకున్నా పార్టీ జెండా మోసి కార్యకర్తలను కాపాడుకున్నామన్నారు. డీకే అరుణ, సబితారెడ్డితో పాటు తనను అవమానించారని, దొంగలే దొంగ అన్న ట్టుగా ఉందని మండిపడ్డారు. సీతక్క ఏ పార్టీ నుంచి వ చ్చారో ప్రజలకు తెలుసన్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
అవసరమైతే ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావొచ్చు
సాక్షి, హైదరాబాద్: ‘బహిష్కరణలు, సస్పెన్షన్లు, మార్షల్స్ అవసరం లేకుండా సభ నడపాలనేది మా ప్రభుత్వ ఆలోచన. కానీ అలాంటి అవసరం, సందర్భం వస్తే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావొచ్చు. ఏ నిర్ణయమైనా సమయం, సందర్భాన్ని బట్టి ఉంటుంది. శాసనసభలో నేను ఒక్కమాట కూడా అసభ్యంగా మాట్లాడలేదు. నేను మాట్లాడిన దాంట్లో అన్ పార్లమెంటరీ పదం లేదు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభ వాయిదా అనంతరం ఆయన తన చాంబర్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై సభలో చేసిన వ్యాఖ్యలు, ఇతర అంశాలపై స్పందించారు.నేను వాళ్ల పేర్లు ప్రస్తావించలేదు‘మోసానికి పర్యాయపదం సబిత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మని చెప్పిన సబిత అక్క నాకు అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారింది. నా ఎన్నికల బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను నామినేషన్ వేసేటప్పటికే వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. సునీతా లక్ష్మారెడ్డి కోసం 2018 ఎన్నికల్లో ప్రచారానికి పోతే నా మీద కౌడిపల్లి, నర్సాపూర్‌లో రెండు కేసులు పెట్టారు. అధికార పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ పదవి తీసుకున్న సునీత తాను ఎమ్మెల్యే అయినా తన ప్రచారం కోసం వెళ్లిన తమ్ముడి మీద కేసులు తీయించలేదు. ఈ నేపథ్యంలోనే అక్కల మాటలు నమ్మి నేను మోసపోయాను అని కేటీఆర్‌కు చెప్పా. నేను వాళ్ల పేర్లు ప్రస్తావించలేదు. సబిత వ్యక్తిగత విషయాలను మాట్లాడినందుకే, నేను మిగతాది పూర్తి చేశా..’ అని సీఎం చెప్పారు.కేసీఆర్‌ను ఫ్లోర్‌లీడర్‌గా తొలగించాలి‘సబితక్కకు అవమానం, అన్యాయం జరిగి అవేదన చెందితే కేసీఆర్, హరీశ్‌రావు అసెంబ్లీకి ఎందుకు డుమ్మా కొట్టారు. సభలోకి వచ్చి సబితక్కకు అండగా నిలబడకుండా, పార్టీ సభ్యులను పట్టించుకోకుండా కేసీఆర్ ఎందుకు పత్తా లేకుండా పోయారు. సభలో మాట్లాడేందుకు కేటీఆర్, హరీశ్‌రావు చాలు అనుకుంటే, కేసీఆర్‌ను ఫ్లోర్‌లీడర్ పదవి నుంచి తొలగించాలి. కేసీఆర్‌కు రాష్ట్రం పట్ల బాధ్యత, పట్టింపు లేదు. కేసీఆర్‌కు అధికారం తప్ప ప్రజలను పట్టించుకోవాలనే మంచి ఆలోచన లేదు..’ అని రేవంత్ విమర్శించారు. విపక్ష సభ్యులకే ఎక్కువ సమయంఒక రోజు 17 గంటలపైనే సభ జరగడాన్ని బట్టి చూస్తే వారం రోజులకు పైగా సభ జరిగినట్లే. ఎన్ని రోజులు సమావేశాలు జరిగాయనే దానికంటే ఎన్ని గంటలు జరిగిందనేదే ముఖ్యం. గడిచిన పదేళ్లతో పోలిస్తే అసెంబ్లీని ప్రజాస్వామికంగా నడుపుతున్నాం. సభలో విపక్ష సభ్యులకే ఎక్కువ సమయం ఇచ్చాం. బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ముగ్గురు కలిసి ఆరు గంటల సేపు మాట్లాడారు. నాతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. ముగ్గురం కలిసినా అంతసేపు మాట్లాడలేదు’ అని సీఎం చెప్పారు. కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదుగద్వాల ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నారనే వార్తపై స్పందిస్తూ.. ‘టీ తాగేందుకు కలుసుకోవటం, రాజకీయాలకు, పార్టీల్లో చేరటానికి సంబంధం లేదు. ఇటీవల ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నా చాంబర్‌కు వచ్చి టీ తాగారు. అంతమాత్రాన వారు మా పార్టీలో చేరినట్లా..?’ అని రేవంత్ ప్రశ్నించారు.ప్రజాస్వామికంగా అసెంబ్లీ సమావేశాలు‘గతంలో బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వాలు రద్దు చేశారు. నన్ను కూడా ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేయడంతో నా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని హైకోర్టులో పిటిషన్ వేశా. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభలోనూ ఎమ్మెల్యేగా ఉన్నా. కానీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు పూర్తి ప్రజాస్వామికంగా, బాధ్యతగా జరిగాయి. చర్చను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినా మేము బాధ్యతగా వ్యవహరించాం. ఈసారి బడ్జెట్ సమావేశాలు తక్కువ రోజులు జరిగినా బడ్జెట్, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపై అందరికీ మాట్లాడే అవకాశం దొరకడంతో వీలైనంత చర్చ జరిగింది. -
ఇక్కడ ముంచి.. అక్కడ తేలిండ్రు
సాక్షి, హైదరాబాద్: ‘మేము కలిసి వస్తాం. ప్రభుత్వానికి సహకరిస్తాం అని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. మీరు కలిసి వస్తారా?! అన్నం ఉడికిందా లేదా? అన్నది ఒక్క మెతుకు పట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు (కేసీఆర్) సభకే రారు. వీరు కలిసి వస్తా అంటే నమ్మేది ఎవరు? నేను అందుకే వారికి (కేటీఆర్) సూచన చేస్తున్నా. నీ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ (కాంగ్రెస్‌లో) ఉండి చెప్పి చెప్పి, ఇక్కడ ముంచి అక్కడ (బీఆర్ఎస్)తేలిండ్రు.. ఆ అక్కల మాటలు విన్నడు అనుకో, జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తది..’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.శాసనసభలో బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ మాట్లా డారు. ఆయన ప్రసంగం ముగించగానే ఆయన వెనకాల ఉన్న బీఆర్ఎస్ సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు గట్టిగా బల్లలు చరుస్తూ మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే సీఎం మాట్లాడుతూ.. ‘వెనకాల ఉండే అక్కలు..’ అనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి అరుపులు, నినాదాలు, కాంగ్రెస్ సభ్యుల ప్రతి నినాదాలతో గందరగోళం మధ్యే రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అండగా నిలబడతానని చెప్పి మోసం చేశారు: రేవంత్ ‘ప్రజాజీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత, ప్రజాజీవితానికి సంబంధించిన చర్చ ఉంటుంది. నాకు, సబితక్కకి మధ్య జరిగిన వ్యక్తిగత చర్చను ఆమె సభలో చెప్పారు. కాబట్టి దానికి కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలను నేను సభలోనే చెప్పాల్సిన అసవరముంది. కాంగ్రెస్ పారీ్టలోకి నన్ను సబిత ఆహ్వానించడం, పెద్ద లీడర్ అవుతావని చెప్పడం వాస్తవమే. నేను ఆమె మాటను విశ్వసించి, సొంత అక్కగా భావించి, కుటుంబ సంబంధాలు, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు కాంగ్రెస్‌లో చేరా. 2019లో కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమంది.అప్పుడు సబితక్క నన్ను పిలిచి మల్కాజిగిరి నుంచి పోటీ చెయ్యి.. ఎన్నికల్లో అండగా నిలబడతానని మాట ఇచ్చారు. కానీ నన్ను పార్టీ ఎంపీ అభ్యరి్థగా ప్రకటించిన మరుక్షణమే ఆమె టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ మాయమాటలను నమ్మి అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముడిని మోసం చేశారు. (ఇది నిజమా? కాదా? అని సబితారెడ్డినుద్దేశించి ప్రశ్నించారు) కాబట్టే ఆమెను నమ్మవద్దని కేటీఆర్‌కు సూచించా. బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవులు పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెబితే మేము ఏమైనా అమాయకులమా?..’ అంటూ సీఎం ప్రశ్నించారు. ‘మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదని కేటీఆర్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. 2014–19 మధ్యకాలంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపించారు. ప్రభుత్వానికి సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుడిని సభలో కూర్చోమని చెప్పండి..’ అని రేవంత్ అన్నారు. తాను కొత్త గవర్నర్‌కు ఆహా్వనం పలకడానికి విమానాశ్రయానికి వెళ్తున్నానని, తిరిగి వచి్చన తర్వాత అందరికీ సమాధానమిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి సభ నుంచి వెళుతుండగా బీఆర్ఎస్ సభ్యులు ‘షేమ్ ..షేమ్’ అంటూ నినాదాలు చేశారు. దీనికి ముందు బీఆర్ఎస్ సభ్యుల నిరసనల నేపథ్యంలో స్పీకర్ అవకాశం ఇవ్వడంతో సబిత గద్గద స్వరంతో మాట్లాడారు. ఏం మోసం చేశాం: సబితా ఇంద్రారెడ్డి ‘రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పారీ్టలో చేరినప్పుడు నేను అక్కగా ఆశీర్వదించా. నువ్వు చాలా ఎదుగుతావు.. ఈ రాష్ట్రానికి సీఎం అవుతావు..అంటూ పారీ్టలోకి ఆహా్వనించా. సీఎం గుండెల మీద చెయ్యి వేసుకుని ఇది నిజమా? కాదా? చెప్పాలి. ఈ రోజు నాపై ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ప్రతిసారీ అసెంబ్లీలో ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండ్రు. నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు.. మోసం చేస్తరని అన్నడు? ఏం మోసం చేశాం? ఏం ముంచినం? వీళ్లను ముంచినమా? ఎన్నికల సమయంలో కూడా నా నియోజకవర్గంలో మాట్లాడుతూ సబితక్క పొద్దునొక్క మాట, రాత్రి ఒక్క మాట మాట్లాడతది అన్నాడు.పొద్దునొక్క మాట, రాత్రి ఒక్క మాట ఏం మాట్లాడిన? ఎవరిని, ఎందుకు అవమానిస్తున్నవు? ఎందుకీ కక్ష ? ప్రతిసారీ టార్గెట్ చేస్తున్నరు. ఏం చేసినం మేము ఆడబిడ్డలం. సీఎం తన మాటలను ఉపసంహరించుకోవాలి..’ అని సబిత డిమాండ్ చేశారు. సబిత ఆ మాట అనగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. అంతకు ముందు ‘సీఎం రేవంత్ ఏ పార్టీలో నుంచి వచ్చారు? కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి నా ఇంటిపై వాలినా కాలి్చవేస్తా అని గతంలో అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అంత మందిని ఎందుకు చేర్చుకున్నారు..’ అని సబిత నిలదీశారు. -
ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వíహిస్తున్న నియోజకవర్గాల్లో తమపై ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తో భేటీ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆరునెలలుగా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ తనపై పోటీచేసి ఓడిన కాంగ్రెస్ అభ్యరి్థతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బీఆర్ఎస్ తరపున ఓడిన అభ్యర్థులను వేదిక మీదకు పిలవాలన్నారు. సీఎం రేవంత్ కూడా కొడంగల్‌లో ఓడిన బీఆర్ఎస్ అభ్యరి్థని వేదిక మీద కూర్చోబెట్టాలని చెప్పారు. హుజూరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఆసిఫాబాద్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు పెడుతున్నారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎర్రబుగ్గలు వేసుకొని తిరుగుతున్నారు: సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలను కాదని, కాంగ్రెస్ నాయకులను అతిథులుగా పిలుస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు వాహనాలపై ఎర్రబుగ్గలు వేసుకొని తిరుగుతున్నారని, స్పీకర్‌కు తెలియకుండా ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీకి కూడా అనుమతించండి : పద్మారావుగౌడ్ తమపై ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రభుత్వ కార్యక్రమాలకు అనుమతి ఇస్తున్నారని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ అన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను కూడా శాసనసభకు అనుమతించాలని స్పీకర్‌కు సూచించానని చెప్పారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. -
ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన
నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తోంది ప్రజాపాలన కాదని.. రాక్షస పాలనని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను శనివారం మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. పార్టీ తరపున ఆమెకు రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆమెకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అక్కడి నుండే కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి బాధితురాలికి వెంటనే మహిళా వైద్యురాలి పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం సత్యవతి రాథోడ్ విలేకరులతో మాట్లాడుతూ ఒక ఆడబిడ్డపై ఇలాంటి దారుణ ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. తనపై దాడికి పాల్పడిన వారి పేర్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు బాధపడుతోందని చెప్పారు. బాధితురాలికి మహిళా వైద్యురాలి పర్యవేక్షణ కూడా లేదని, తూతూమంత్రంగా డ్రెస్సింగ్ చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. బాధితురాలి కుటుంబానికి వెంటనే రూ.50 లక్షల పరిహారం ప్రకటించి, ఆమె ముగ్గురు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులకు పోలీస్ స్టేషన్లో కొత్త అల్లుడిలా మర్యాదలు చేస్తుండడం బాధాకరమని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జిల్లా మంత్రి బాధితురాలిని పరామర్శించి.. ఆమె వద్ద మహిళా వైద్యులు లేరని గుర్తించకపోవడం దారుణమన్నారు. దాడిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు బీఆర్ఎస్ తరపున పోరాడతామన్నారు. జిల్లా ఆస్పత్రిలో కేవలం నలుగురు మహిళా వైద్యులుండటం ఘోరమని విమర్శించారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల మాట్లాడుతూ ఆడబిడ్డపై ఘోరమైన పాశవిక దాడి జరిగి వారం రోజులు దాటినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. -
MLC Kavitha: తీహార్ జైలులో కవితను కలిసిన సబిత, సత్యవతి రాథోడ్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు కలిశారు. వీరిద్దరూ ఢిల్లీకి వెళ్లి తీహార్ జైలులో ఉన్న కవితలో ములాఖత్ అయ్యారు.మరోవైపు.. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్.. కవితను కలిసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కవితతో కేసీఆర్, కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు. కవిత యోగ యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. కవితను ఆమె భర్త అనిల్ వారానికి రెండుసార్లు కలుస్తున్నారు. కుటుంబ సభ్యులు కవితతో రోజూ ఐదు నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుతున్నారని సమాచారం.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కవిత అరెస్ట్ అయి మూడు నెలలు కావస్తోంది. కవిత గత 80 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత, మార్చి 26న, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు 14 రోజులకు ఒకసారి పొడిగించింది.అనంతరం, తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత, సీబీఐ కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీకి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈడీ కేసులోనూ కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటుపై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా నలుగురు వ్యక్తులు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్‌సింగ్, చరణ్‌ప్రీత్‌పై చార్జిషీటు దాఖలు చేశామని, వారి పాత్రపై ఆధారాలను పొందుపరిచామని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని వాదించారు. కాగా.. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, విడుదల చేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జ్యుడీషియల్ కస్టడీని జూన్ మూడో తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. -
కూతురు ముందే పిస్టల్‌తో కాల్చుకుని..
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ‘గోలీ కొట్టుకుంటా’.. అంటూ రెండుమూడు రోజులుగా సన్ని హితుల వద్ద చెపుతున్న రాచకొండ ఏఆర్ ఎస్సై మహ్మద్ ఫజల్ అలీ (59) పిస్టల్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న అలీ, తన చిన్న కుమార్తెతో కలసి ఆదివారం ఉదయం డ్యూటీలో చేరడానికి వచ్చి, ఆమె సమక్షంలోనే ఉసురు తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆర్థిక కారణాల నేపథ్యంలో అలీ సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన ఫజల్ అలీ రాచకొండ కమిషనరేట్‌లో ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసినా.. భర్తలతో విడాకులు తీసుకున్న వీళ్లు ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన కుమారుడు ఓ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న కుమార్తె వివాహం చేయాలని భావించిన అలీ.. అందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.10 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయనకు కేవలం రెండేళ్లు మాత్రమే సర్విసు ఉండటంతో బ్యాంకు అధికారులు రుణ దరఖాస్తును తిరస్కరించారు. రెండు వారాల క్రితం బ్యాంకు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఫజల్ అలీ, రుణం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు. నోట్ బుక్‌లో రాసుకుని.. ఈ క్రమంలో రెండుమూడు రోజులుగా తన సన్నిహితులు, సహోద్యోగుల వద్ద ఆర్థిక ఇబ్బందులు, రుణం సమస్య గురించి చెప్పుకుంటున్న ఫజల్ అలీ నిరాశతో ‘గోలీ కొట్టుకుంటా’అంటూ వాపోయారు. ఓ నోట్ బుక్‌లోనూ తన ఆర్థిక పరిస్థితుల విషయం రాసి ఆ పేజీని తన వెంట ఉంచుకున్నారు. ఆదివారం ఉదయం చిన్న కుమార్తె ఫాతిమాను తీసుకొని శ్రీనగర్ కాలనీలోని మంత్రి ఇంటి వద్దకు డ్యూటీ కోసం వచ్చారు. ముందుగా ఆ సమీపంలో ఒక హోటల్ వద్ద కూతురిని దించి మంత్రి ఇంటికి వెళ్లారు. డ్యూటీ ఎక్కిన తర్వాత తన సర్వీస్ పిస్టల్ (9 ఎంఎం క్యాలిబర్) తీసుకొని కుమార్తె ఉన్న చోటుకి వచ్చారు. వీడియో తీయా ల్సిందిగా కుమార్తెకు చెప్పి తన సెల్‌ఫోన్ ఇచ్చారు. కొన్ని మాటలు నవ్వుతూ చెప్పిన అలీ, ఆపై ఫోన్ తీసుకుని, ఆమెను వెళ్లమని చెప్పారు. కుమార్తె వెనక్కు తిరిగిన వెంటనే ఫోన్ జేబులో పెట్టుకుని పిస్టల్‌తో తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకున్నారు. కుడి చెవిపై నుంచి దూసుకుపోయిన తూటా ఎడమ వైపు నుంచి బయటకు వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఫజల్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అలీ కుటుంబీకులకు అప్పగించారు. కాగా, ఫజల్ అలీ తండ్రి ఇబ్రహీం అలీ కూడా గతంలో హైదరాబాద్‌లో ఏఆర్ ఎస్ఐగా పనిచేశారు. ఆయన కూడా ఇలాగే కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంతో 1986లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఏఎస్ఐ ఫజల్ మృతి పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫజల్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
CM's Breakfast Scheme: సీఎం అల్పాహారంలో ఇడ్లీ సాంబార్, పూరీ కుర్మా కూడా!
సాక్షి, హైదరాబాద్: సాంబార్ ఇడ్లీ, పూరీ–ఆలూ కుర్మా, ఉప్మా, వెజిటబుల్ పలావ్, ఉగ్గాని.. ఇలా సర్కార్ బడులలో విద్యార్థులకు ఉచితంగా.. వేడి వేడిగా రోజుకో అల్పాహారం అందించేలా మెనూ ఖరారయ్యింది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకం ప్రారంభించేందుకు అధికా రులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మహేశ్వరం మండలం రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్‌కి బదులు.. మంత్రి హరీశ్‌రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అల్పాహార పథకం ప్రారంభిస్తారు. విద్యార్థులను బడికి రప్పించడం, వారికి తగిన పౌష్టికాహారం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,147 పాఠశాలల్లో 1–10వ తరగతి వరకు చదివే 23 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. హెచ్ఎంలకు నిర్వహణ బాధ్యత రాష్ట్ర విద్యాశాఖ, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో అమలయ్యే ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని తొలుత నియోజకవర్గానికి ఒకటీ రెండు పాఠశాలల్లో లాంఛనంగా ప్రారంభిస్తారు. దసరా నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠ శాలల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను, మెనూను విద్యా శాఖ వెల్లడించింది. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం అమలు తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక ట్రాకింగ్ మొబైల్ యాప్‌ను కూడా రూపొందించింది. అన్ని రకాల విటమిన్స్ లభించే పౌష్టికాహారంతో రోజుకో రకమైన బ్రేక్‌ఫాస్ట్ ఉంటుందని అధికారులు తెలిపారు. పథకం నిర్వహణ బాధ్యత సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యా యులపైనే పెట్టారు. మండల నోడల్ అధికారి మండల స్థాయిలో, జిల్లా విద్యాశాఖాధికారి జిల్లా స్థాయిలో, పాఠశాల విద్య శాఖ రాష్ట్ర స్థాయిలో పథకం అమలు తీరును పర్యవేక్షిస్తుంది. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థల అధికారులకు అల్పాహారం అందుతున్న తీరును పర్యవేక్షించే అధికారాలు ఇచ్చారు. బ్రేక్‌ఫాస్ట్ అందించే వేళలివే..: మధ్యాహ్న భోజనం పథకం కార్మికులే అల్పాహారం తయారు చేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలు ఉదయం 9.30 మొదలవుతాయి. ఆయా చోట్ల ఉదయం 8.45 గంటలకు విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. జంటనగరాల్లో ప్రైమరీ స్కూళ్ళు ఉదయం 8.45 గంటల నుంచి మొదలవుతాయి. దీనివల్ల ఈ స్కూళ్ళలో ఉదయం 8 గంటలకే బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8.45 గంటలకు, జంటనగరాల్లో ఉదయం 8 గంటలకు అల్పాహారం అందిస్తారు. ఆరు రోజులు..ఆరు రకాలు సోమవారం: ఇండ్లీ సాంబార్ లేదాపచ్చడితో కూడిన గోధుమరవ్వ ఉప్మా మంగళవారం: ఆలూ కుర్మాతో పూరీ లేదా టమాటో బాత్ సాంబార్‌తో బుధవారం: సాంబార్ ఉప్మా లేదా చట్నీతో కూడిన బియ్యం రవ్వ కిచిడీ గురువారం: మిల్లెట్స్ ఇడ్లీ విత్ సాంబార్ లేదా సాంబార్‌తో పొంగల్ శుక్రవారం: ఉగ్గానీ, పోహా,మిల్లెట్ ఇడ్లీ విత్ చట్నీలో ఏదో ఒకటి లేదా గోధుమరవ్వ కిచిడీ చట్నీతో శనివారం: సాంబార్‌తో పొంగల్ లేదా వెజిటబుల్ పలావ్, రైతా, ఆలూకుర్మా డ్రాపౌట్లు తగ్గిస్తుంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికా హారం అందించే ఈ పథకం విద్యార్థుల డ్రాపౌట్ల (బడి మానేవారి సంఖ్య)ను తగ్గిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.672 కోట్లు తన వాటాగా ఖర్చు చేస్తోందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యంతో కూడిన భోజనం, వారానికి మూడు గుడ్లను అందిస్తున్నామని తెలిపారు. ఐరన్, సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే ఉద్దేశంతో రూ. 32 కోట్లు వెచ్చించి రాగి జావను ఇస్తున్నామని చెప్పారు. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి -
పాఠశాల విద్యార్థుల కథలు చరిత్రకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా ఒకేరోజు.. ఒకే సమయానికి 5 లక్షల మంది పాఠశాల విద్యార్థులు ‘మన ఊరు మన చెట్టు’అనే అంశంపై కథలు రాసి నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. మంగళవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సబిత ‘మన ఊరు మన చెట్టు’పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ తరహా ప్రయత్నం దేశ చరిత్రలోనే తొలిసారి కావడం గొప్ప విషయమని, రాష్ట్ర విద్యార్థులు కలం పట్టి తమ ఊరి ప్రకృతిని అద్భుత కథలుగా మలచి దేశానికే మోడల్‌గా నిలిచారని కొనియాడారు. 33 జిల్లాలకు చెందిన విద్యార్థులు రాసిన కథలను 33 పుస్తకాలుగా తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించి విద్యార్థులకు అందించడం అభినందించదగిన విషయమన్నారు. బాల సాహిత్య విస్తృతికి కృషి చేయడమే కాకుండా రాష్ట్రంలో పుస్తక ప్రదర్శనలతో జ్ఞాన తెలంగాణ కోసం కృషి చేస్తున్న సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌ను మంత్రి సబిత శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి నామోజు, తెలంగాణ విద్యా మౌలికవసతుల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, ప్రొ. నారా కిశోర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆరీ్టయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డి. శ్రీపాల్‌రెడ్డి, బి. కమలాకర్‌రావు పాల్గొన్నారు. దసరా నుంచి స్కూల్ విద్యార్థులకు అల్పాహారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దసరా పండుగ నుంచి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’అమలు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యారి్థనీ విద్యార్థులకు దసరా పండుగ రోజు నుంచి ఉచిత అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకం అమలు తీరుతెన్నులపై ఆమె మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. పథకానికి సంబంధించిన మెనూను త్వరగా నిర్ణయించాలని, విధివిధానాలు రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. -
త్వరలో ఇంటర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో టీచింగ్, నాన్–టీచింగ్ సిబ్బంది బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. వాస్తవానికి అధ్యాపక సంఘాల నేతలు గత కొంతకాలంగా బదిలీల కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాల విద్యలో బదిలీలు చేపట్టడం, ఈ వ్యవహారం కోర్టు స్టేతో ఆగిపోవడం తెలిసిందే. తాజాగా స్పౌజ్ కేసులను పరిశీలించిన కోర్టు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, కాలేజీ సిబ్బందినీ బదిలీ చేయాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. విద్యామంత్రి ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇటీవల ఇంటర్, కాలేజీ విద్య ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో అధికారులు బదిలీల ప్రక్రియపై కసరత్తు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. బదిలీల్లేక ఐదేళ్లు: 2018 జూన్ నెలాఖరులో సాధారణ బదిలీలు చేపట్టారు. అప్పటి మార్గదర్శకాలను అనుసరించి 500 మంది ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. 2016–17లో జూనియర్ లెక్చరర్స్‌కు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతులు కల్పించారు. ఈ విధంగా పదోన్నతులు రావడంతో 2018లో జరిగిన బదిలీల్లో కనీసం రెండేళ్లు పనిచేసిన సర్వీస్ లేకపోవడంతో వారికి బదిలీ అవకాశం రాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో 317 జీవో అమలు చేశారు. పదవీ విరమణ వయసును ప్రభుత్వం 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. దీంతో చాలామంది దూర ప్రాంతాల్లో ఉంటూ, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని కాలేజీ అధ్యాపక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. తాజా నిర్ణయం వల్ల 6 వేల మందికిపైగా న్యాయం జరుగుతుంది. మార్గదర్శకాలపై కసరత్తు: బదిలీలు చేపట్టాలనే యోచన చేసిన నేపథ్యంలో మార్గదర్శకాలపై కూడా స్పష్టత ఉండాలని విద్యాశాఖ కార్యదర్శి అధికారులకు సూచించినట్టు సమాచారం. 317 జీవో తర్వాత ఏర్పడిన పరిస్థితులు, ఎన్ని సంవత్సరాలను కనీస, గరిష్ట అర్హతగా తీసుకోవాలనే అంశాలపై అధికారులు తర్జనభర్జనలో ఉన్నారు. స్పౌజ్ కేసులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి జాబితాను, ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలున్నాయి? అనే అంశాలపై వివరాలు తెప్పిస్తున్నారు. వచ్చేవారం బదిలీలపై స్పష్టత రావొచ్చని చెబుతున్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులకు అర్హుల ఎంపికను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ అవార్డులకు అర్హతలున్న వారికి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేసింది. ఇందులో భాగంగా నాలుగు కేటగిరీల్లో 97 ప్రతిపాదనలు పరిశీలించిన పరిశీలన కమిటీ... 42 మందిని ఎంపిక చేసింది. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో మరో 12 మందికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 54 మందిని ఎంపిక చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్... శనివారం వారి పేర్ల జాబితాను ప్రకటించింది. మంత్రి సబితతో ఉత్తమ ఉపాధ్యాయుల భేటీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ నెల 4వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్ఐ)లో భేటీ కానున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యాభివృద్ధికి దోహదపడే ఆలోచనలను వారు మంత్రితో పంచుకోనున్నారు. ఉత్తమ ఉపాద్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 2గంటల కల్లా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు... ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. -
టీచర్ పోస్టుల లెక్కలు వేరయా!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ ఖాళీలపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. నిరుద్యోగుల ఆందోళనలు, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నుంచి అసంతృప్తి ఎక్కువవుతోంది. దీంతో విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. టీచర్ల నియామక ప్రకటన రాజకీయంగా కలిసి వస్తుందని ప్రభుత్వం భావిస్తుంటే, అసంతృప్తి, విమర్శలకు దారి తీస్తుందని ప్రభుత్వ వర్గాలు కంగారు పడుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి తాజాగా నివేదిక కోరారు. నియామక పోస్టులు పెంచడం సాధ్యమా? వాస్తవ ఖాళీలను వెల్లడించడం వీలవు తుందా? టీచర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా ఏర్పడే ఖాళీలను తర్వాత భర్తీ చేస్తామనే భరోసా ఇవ్వగలమా? అని ఆమె అధికారులను అడిగినట్టు తెలిసింది. అయితే దీనిపై విద్యాశాఖ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం. పొంతన లేని లెక్క పాఠశాల విద్యలో 22 వేల ఖాళీలు ఉండే వీలుందని ఏడాది క్రితం విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. గెజిటెడ్ హెచ్ఎం పోస్టులు 1,974, ప్రైమరీ హెచ్ఎం పోస్టులు 2,043, స్కూల్ అసిస్టెంట్లు 7,200, పీడీలు 25, ఎస్జీటీలు 6,775, లాంగ్వేజ్ పండిట్లు 688, పీఈటీలు 172, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులు 1,733 ఖాళీలున్నాయని తేల్చింది. దీంతోపాటు ఎంఈవోలు 467, బాలికల పాఠశాలల హెచ్ఎంలు 15, డైట్ లెక్చర్లు 271, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు 58, డీఈవోలు 12 మందిని నియమించాలని సర్కార్‌కు నివేదించారు. ఇందులో 13 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ ఇప్పుడు 5,089 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు వెల్లడించింది. దీంతో నిరుద్యోగులు ప్రతీ రోజూ పాఠశాల విద్య డైరెక్టరేట్ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా 22 వేల ఖాళీలుంటే, 5 వేల పోస్టుల భర్తీ ఏంటని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం టీచర్లకు పదోన్నతులు ఇస్తే కొన్ని ఖాళీలు ఏర్పడతాయని చెబుతోంది. ఈ ప్రక్రియ ముందుకెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. నిరుద్యోగులను మోసం చేయడమే టీచర్ పోస్టులు 22 వేల వరకూ ఖాళీగా ఉంటే, 5,089 పోస్టులే భర్తీ చేస్తామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే. దీనిపై ఆందోళనకు దిగితే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యమంత్రే 13,500 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడా పోస్టులు ఎక్కడికి పోయాయి? 22 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం. – కోటా రమేష్ (డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు) ఇదేం రేషనలైజేషన్ విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను కేటాయించే హేతుబద్దిణ అశాస్త్రీయమైంది. ఒక్కో పాఠశాలలో ఎంత మంది విద్యార్థులున్నా, అన్ని తరగతుల బోధన జరగాలి. అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండాలి. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చడం, అతి తక్కువ పోస్టుల భర్తీకి పూనుకోవడం ఎంతమాత్రం సరికాదు. – చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) హేతుబద్దిణే ముంచిందా? ♦టీచర్ నియామక ప్రకటన వెలువడేందుకు ముందు విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖాధికారులతో సమావేశం నిర్వ హించారు. రేషనలైజేషన్ ప్రకారం చూస్తే ఎన్ని ఖాళీలుంటాయని ఆరా తీశారు. టీచర్ పోస్టులు భారీగా కుదించుకుపోవడానికి డీఈవోల హేతుబద్దిణ నివేదికే కారణ మని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ 30 మందికి ఒక టీచర్ చొప్పున అధికారులు లెక్క గట్టారు. దీన్ని కొలమానంగా తీసుకోవడం అశాస్త్రీయమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. రాష్ట్రంలో మూడోవంతు బడుల్లో విద్యార్థుల సంఖ్య 30లోపే ఉంది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు 26,337 ఉన్నాయి. ఇందులో 8,782 (33.35 శాతం) చోట్ల 1–30 మంది విద్యార్థులున్నారు. ఈ తరహా హేతుబద్ధీకరణను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 30 మంది కన్నా తక్కువ ఉన్నా, అన్ని తరగతులకు టీచర్లు కావాలని, కానీ హేతుబద్దిణ పేరుతో ఒకే టీచర్‌ను ఇవ్వడం వల్ల అన్ని తరగతులు ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నాయి. దీనివల్లే అసలైన ఖాళీలు బయటకు రాకుండా పోయాయని వాపోతున్నాయి. -
ఖాళీల్లో మూడో వంతే భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించడం.. ఓవైపు అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించినా, తక్కువ పోస్టులనే భర్తీ చేయడం ఏమిటనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటన విద్యాశాఖలో టీచర్ల కొరతను తీర్చేదిగా లేదని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. నియామక ప్రక్రియలో స్పష్టమైన విధానం లేదని ఆరోపిస్తున్నారు. పదోన్నతులతో ముడిపడి ఉన్న స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), ప్రధానోపాధ్యాయుల పోస్టుల విషయంపై మంత్రి స్పష్టత ఇవ్వలేదని.. విద్యాశాఖను వేధిస్తున్న పర్యవేక్షణ పోస్టులైన డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోల కొరత విషయాన్నీ ప్రస్తావించలేదని అంటున్నారు. 22 వేల పోస్టులు ఖాళీ రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 13,086 ఖాళీ పోస్టులు ఉన్నాయని స్వయంగా సీఎం కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించారు. అందులో 10 వేల వరకు టీచర్ పోస్టులే ఉంటాయని అంచనా వేశారు. మిగతా వాటిలో 24 డిప్యూటీ డీఈవో ఖాళీలని ప్రభుత్వం తెలిపింది. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా 72 డిప్యూటీ డీఈవో పోస్టులు ఉండగా.. ప్రస్తుతం నలుగురే పనిచేస్తున్నారు. 68 పోస్టులు ఖాళీయే. ఇక ఎంఈవోలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, డైట్ అధ్యాపకుల ఖాళీలు భారీగా ఉన్నాయి. మరోవైపు ఇటీవలి విద్యాశాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 21,433 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంతర్గత పరిశీలనలో గుర్తించారు. పాఠశాలలు, టీచర్ల హేతుబద్దీకరణ చేపట్టిన తర్వాత వాటిని ప్రకటించాలనుకున్నారు. కానీ ఆ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. స్కూళ్లలో 1,974 హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి ఇవ్వడం ద్వారా వీటిని భర్తీ చేయాలి. ఇదే సమయంలో 7,200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్జీటీలకు పదోన్నతి ద్వారా 70 శాతం, నేరుగా నియామకాల ద్వారా 30 శాతం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులు చేపడితే గానీ అసలు ఖాళీలు ఎన్ని అనే స్పష్టత వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.31 లక్షల మంది టీచర్ పోస్టులు ఉంటే.. ప్రస్తుతం పనిచేస్తున్నది 1.09 లక్షల మంది మాత్రమే. అంటే దాదాపు 22 వేల ఖాళీలు ఉన్నట్టు తెలుస్తోంది. పదోన్నతుల కోసం ఎదురుచూపులు రాష్ట్రంలో ఏడేళ్లుగా టీచర్లకు పదోన్నతులు కల్పించలేదు. గత నాలుగేళ్లుగా సాధారణ బదిలీలు కూడా లేవు. మూడుసార్లు నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లలో పాసైన 4 లక్షల మంది టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే బదిలీలు, పదోన్నతులకు కోర్టు కేసులు, ఇతర అడ్డంకులు ఉండటంతో.. 1,974 హెచ్ఎం పోస్టులు, 2,043 ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులు, 7,200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,775 ఎస్జీటీలు, 467 ఎంఈవో పోస్టుల భర్తీ చేపట్టలేదని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వం 6,612 పోస్టులే భర్తీ చేస్తుండటం.. ఇందులో సాధారణ టీచర్ పోస్టులు 5,089 మాత్రమే ఉండటంపై నిరాశ వ్యక్తమవుతోంది. పోస్టులను కుదించేస్తారా? వాస్తవంగా 22 వేల ఖాళీలు ఉన్నా.. హేతుబద్దీకరణ చేపడితే పోస్టుల సంఖ్య బాగా తగ్గుతుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 8,782 స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 20లోపే ఉందని.. ఇందులో 8,665 ప్రాథమిక పాఠశాలలు, 117 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయని అంటున్నాయి. వంద మంది పిల్లల కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లు 6,833 మాత్రమేనని వివరిస్తున్నాయి. వీటిని హేతుబద్దీకరిస్తే టీచర్ పోస్టులు తగ్గుతాయని పేర్కొంటున్నాయి. అయితే ఈ తరహా హేతుబద్ధీకరణతో పాఠశాలలను, టీచర్ పోస్టులను కుదించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పిల్లల సంఖ్యను బట్టి కాకుండా.. స్కూళ్లలో తరగతులు, టీచర్ల అవసరాన్ని చూడాలని స్పష్టం చేస్తున్నాయి. -
‘చెలిమి’కి అంకురం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా వ్యవస్థలో శాస్త్రీయతను జోడిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వివిధ రూపాల్లో విద్యార్థులకు ఎదురయ్యే ఒత్తిడులను తట్టుకునేలా ‘చెలిమి’ విద్యార్థుల్లో వ్యాపార దృక్పథాన్ని పెంచడంతో పాటు, వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేందుకు ‘అంకురం’అనే కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో చెలిమి, అంకురం కార్యక్రమాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. చెలిమి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న ఆలోచన శక్తిని పెంపొందించేలా కృషి చేస్తామన్నారు. పిల్లలు తమ నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, వేగంగా పురోగమిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా తమను తాము సమాయత్తం చేసుకొనేలా తరగతి గదిలో సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లోని అభిరుచులను తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఏయే రంగాల్లో రాణిస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రీయ మదింపు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో ఒక్కో ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి చెలిమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంకురం కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా 8 జిల్లాల్లో 35 కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో 11వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నామని చెప్పారు. మంచి భవిష్యత్‌ను అందించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్‌కుమార్ అన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు ప్రకాశ్ గౌడ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకురాలు దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో విద్యపై కేంద్రం వివక్ష!
సాక్షి, హైదరాబాద్: విద్య విషయంలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. జాతీయ సంస్థల కేటాయింపులో ప్రతి సారీ రాష్ట్రానికి మొండిచేయి చూపుతోందన్నారు. ‘విద్య, వైద్య రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పురోగతి’పై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చకు ఆమె బదులిచ్చారు. ‘రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2020 వరకూ విద్యపై రూ.96 వేల కోట్లు ఖర్చు చేసిందని కాగ్ వెల్లడించింది. ఈ ఏడాది రూ.29 వేల కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణ వచ్చాక 1,342 గురుకులాలు ఏర్పాటు చేశాం. ఉన్నత విద్యకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం. ఫలితంగా రాష్ట్రంలో విద్యార్థుల ప్రవేశాల రేటు 36.2 శాతం ఉంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ..’అని సబిత తెలిపారు. -
టీచర్ల బదిలీలు,పదోన్నతులకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతోందని ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ నేతలు తెలిపారు. విద్యాశాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డిని సంఘం నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీఎమ్మెల్సీ పూల రవీందర్ కలిశారు. ప్రభు త్వం బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు గతంలో జారీ చేయగా, ఇందుకు సంబంధించిన జీఓ నంబరు 5కు అసెంబ్లీ చట్టబద్ధత లేదనే కారణంగా కొంతమంది కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలైనా ఆగిపోయా యి. అయితే, జీఓ 5 అమలుకు శాసనసభ ఆ మోదం పొందే ప్రతిపాదనలు విద్యాశాఖ సమర్పించినట్టు మంత్రి సబిత శుక్రవారం పీఆర్టీయూ టీఎస్ నేతలకు తెలిపారు. ఇందుకు మంత్రి సబితకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
మహేశ్వరం నియోజకవర్గం చరిత్రను తిరగరాసేది ఎవరు..?
మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాలుగోసారి విజయం సాదించి తన సత్తా చాటారు. హైదరాబాద్ పరిసరాలలో మొత్తం టిఆర్ఎస్ హవా కొనసాగగా మహేశ్వరంలో మాత్రం కాంగ్రెస్ ఐ పక్ష అభ్యర్ధిగా సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు.ఆమె తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ధి తీగల కృష్ణారెడ్డిపై 9227 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆమె టిఆర్ఎస్ లో చేరిపోవడం విశేషం.తదుపరి కెసిఆర్ మంత్రివర్గంలో సభ్యురాలు కూడా అయ్యారు. తన కుమారుడు కార్తిక్ విషయంలో కాంగ్రెస్ ఐ అన్యాయం చేసిందన్న బాద ఆమెకు ఉంది. మహేశ్వరం నుంచి 2014 లో టిడిపి పక్షాన గెలిచిన తీగల కృష్ణారెడ్డి కూడా ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరిపోతే,ఇప్పుడు సబిత కూడా అదే ప్రకారం అదికార పార్టీలోకి మారిపోయారు. సబితా ఇంద్రారెడ్డికి 95481 ఓట్లు రాగా, తీగల కృష్ణారెడ్డికి 86254 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి తరపున పోటీచేసిన శ్రీరాములు యాదవ్ కు కూడా 38వేలకు పైగా ఓట్లు రావడం విశేషం. హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి 2014లో మహేశ్వరంలో. కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా రంగంలో ఉన్న ఎమ్.రంగారెడ్డిపై 30784 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2009 లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఆనాటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీచేసి గెలుపొందగా 2014లో ఆమె పోటీలో లేరు. ఆమె కుమారుడు చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్,సిపిఐ ల మధ్య పొత్తు కుదిరినా, మాజీ ఎమ్మెల్యే ఎమ్.రంగారెడ్డి కాంగ్రెస్ బిఫారం పై పోటీచేశారు. ఇక్కడ మూడుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలే గెలుపొందారు. చేవెళ్ల చెల్లెమ్మగా ప్రసిద్ధికెక్కిన సబిత ఇంద్రారెడ్డి అంతకుముందు చేవెళ్ల నుంచి రెండుసార్లు గెలిచారు. 2009లో చేవెళ్ల రిజర్వుడ్ నియోజకవర్గంగా మారడంతో సబిత మహేశ్వరం నుంచి 2009, 2018లలో పోటీచేసి గెలిచారు. 2004 నుంచి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబిత 2009లో హోంశాఖ బాధ్యతలను చేపట్టి ఉమ్మడి ఏపీ రాష్ట్ర చరిత్రలో ఈ శాఖను నిర్వహించిన తొలి మహిళగా నమోదయ్యారు. రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోనూ ఉన్నారు. అయితే జగన్ ఆస్తుల కేసులో చిక్కుకున్న సబితా ఇంద్రారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఈమె భర్త ఇంద్రారెడ్డి చేవెళ్ల నుంచి మూడుసార్లు టిడిపి పక్షాన ఒకసారి కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. ఆయన గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో వివిధ శాఖలు నిర్వహించారు. 1994లో ఇంద్రారెడ్డి కూడా హోంశాఖకు మంత్రిగా ఉన్నారు. ఈ రకంగా దంపతులు ఇద్దరూ ఒకే శాఖకు మంత్రులు అవడం కూడా అరుదైన విషయం. ఇంద్రారెడ్డి 1995లో టిడిపి చీలినప్పుడు ఎన్.టిఆర్ పక్షాన నిలిచారు. తరువాత కొంతకాలం ఎన్.టి.ఆర్ టిడిపి (లక్ష్మీపార్వతి)లో కొనసాగి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో సబిత కాంగ్రెస్‌లోనే కొనసాగి నాలుగుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. మహేశ్వరం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ప్రైవేటు మాయకు చెక్ పెట్టండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులను చేర్చుకుని కూడా ఇంటర్ బోర్డ్‌కు ప్రవేశాలు చూపని ప్రైవేటు కాలేజీలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27లోగా ప్రతి విద్యార్థి అడ్మిషన్ వివరాలను పంపేలా జిల్లా ఇంటర్ అధికా రులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ‘ఇంటర్ లెక్కల్లో కాలేజీల మాయ’ శీర్షికతో ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించా రు. 2లక్షల మంది టెన్త్ పాసయిన విద్యార్థులు ఎక్కడ చేరారు? వారి వివరాలు తెలియజేయాలని ఆమె అధికారు లను కోరారు. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులు చేరినా, వాటి డేటా ఇంటర్ బోర్డ్‌కు చేరలేదనే విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ అధికారులతో చర్చించారు. పనులు పూర్తికాకపోతే ఎలా: సబిత రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశా లల్లో అవసరమైన నూతన భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.60 కోట్లు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం పట్ల మంత్రి సబిత అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా, ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రతీ వారం పనుల పురోగతిని సమీక్షించాలని నవీన్ మిత్తల్‌కు సూచించారు. కళాశాల నిర్వహణ అవసరాలకోసం, ల్యాబ్‌ల ఆధునికీకరణ వంటి పనుల కోసం మరో రూ.4.43 కోట్లు మంజూరు చేశామని, వీటిని వెంటనే చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారంలోగా పుస్తకాలు అందాలి విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై సంబంధిత అధికారులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయ డానికి ఆర్టీసీపైనే ఆధారపడకుండా ప్రయివేట్ ఆపరేటర్ల సహాయంతో శుక్రవారం నాటికి చేరేవిధంగా చర్యలు చేపట్టా లని ఆదేశించారు. మారుమూల జిల్లాల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తుండగా అన్ని వనరులు ఉండి కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాలు వెనుకబడి ఉండటం సమర్థనీయం కాదన్నారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వివిధ జిల్లాల ఇంటర్ విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. డేటా పంపకపోతే విద్యార్థికి రూ.500 చొప్పున కాలేజీకి జరిమానా ఈ నెల 27లోగా ప్రైవేటు కాలేజీల్లో చేరిన విద్యార్థుల డేటా పంపాలని, అలా చేయకుండా తర్వాత పంపితే నెలాఖరు వరకూ ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున కాలేజీపై జరిమానా విధించాలని బోర్డ్ అధికారులకు మిత్తల్ సూచించారు. ఆ గడువు కూడా దాటితే విద్యా ర్థికి రూ. వెయ్యి చొప్పున కాలేజీపై జరిమానా విధించా లని తెలిపారు. ఆఖరి నిమిషం వరకూ వేచి చూసి ఆ తర్వాత సెక్షన్లు పెంచుకోవడం, ఒక క్యాంపస్‌లో ప్రవే శాలు, మరో క్యాంపస్‌లో అడ్మిషన్లు చేపట్టే ప్రైవేటు కాలేజీలపై నిఘా పెట్టాలని, ఇలాంటి చర్యలకు పాల్ప డే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నని, అవసరమైతే సదరు కాలేజీ అనుమతి కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని జిల్లా అధికారు లను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆదేశించారు. -
నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులలో మానసిక ఉల్లాసం, నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉన్నతాధికారులతో కలసి సోమవారం ఆమె విద్యాశాఖ పనితీరుపై సమీక్ష జరిపారు. ఢిల్లీ తరహాలో మన రాష్ట్రంలోని విద్యార్థులకు ఆత్మ విశ్వాసం, మానసిక ధృడత్వం పెంపొందించే లా మనోస్థైర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒక పాఠశాల చొప్పున 6, 7వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. అలాగే విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. మొదటి దశలో 8 జిల్లాల్లోని 24 మోడల్ స్కూళ్లను ఎంపికచేసి అందులో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 2,500 మంది విద్యార్థులను వ్యాపార ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఇందులో మెరుగైన 1,500 ఆవిష్కరణలను ఎంపిక చేసి ఒక్కో ఆవిష్కరణకు ప్రభుత్వం రెండు వేల రూపాయలను అందజేస్తుందని వివరించారు. వీరితో ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఏర్పాటుచేసి, భవిష్యత్తులో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. -
మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపు ఈనెల నుంచే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈనెల నుంచి ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్–కమ్ హెల్పర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. శనివారం తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యాసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారీగా భాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్ లెవెల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం.... పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.కోటి కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు (ఎస్.ఎం.సి) అప్పగించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తులు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల దత్తతకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి
గచ్చిబౌలి (హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, స్కూళ్లు, పారిశ్రామికవేత్తలు, నాయకులు ముందుకు రావాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గచ్చిబౌలి డివిజన్లోని కేశవ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు చేయూతతో పునర్నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేద పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని సీఎం కేసీఆర్‌లో తపన, ఆరాటం ఉంటుందన్నారు. అలాగే రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లో, ఆయన తనయుడు హిమాన్షులోను సామాజిక బాధ్యత ఉందన్నారు. తాత నుంచి వచ్చిన సామాజిక దృక్పథం వల్లే హిమాన్షు పేద పిల్లలు చదివే పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. యువత పుట్టినరోజును ఎలా ఎంజాయ్ చేయాలా అని చూస్తారని, హిమాన్షు మాత్రం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. హిమాన్షు సూచనల మేరకు కేశవ్‌నగర్ పాఠశాలకు అవసరమైన టీచర్లను నియమిస్తామన్నారు. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ, హిమాన్షు సామాజిక బాధ్యత చూస్తుంటే.. మీరేం చేస్తారని మౌనంగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టు ఉందన్నారు. నియోజకవర్గంలోని 62 పాఠశాలలను దత్తతకు తీసుకునే విధంగా కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. కేసీఆర్ నాకు స్ఫూర్తి: హిమాన్షు ‘చదువుకున్న వారు సమాజాన్ని, సమస్యలను అర్థం చేసుకుంటారు... పేదరికాన్ని అరికట్టేందుకు కృషి చేస్తారని మా తాత కేసీఆర్ ఇంగ్లిష్‌లో పెద్ద కొటేషన్ చెప్పారు. అదే నాకు స్ఫూర్తినిచ్చింది’ అని కేసీఆర్ మనవడు హిమాన్షురావు పేర్కొన్నారు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కాస్ (క్రియేటివ్ యాక్షన్ సర్వీస్) ప్రెసిడెంట్‌గా మొక్కలు నాటడం తనకు సంతృప్తి ఇవ్వలేదని, కేశవ్‌నగర్ పాఠశాలలో దుర్భర పరిస్థితులను చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. ఆడపిల్లల టాయిలెట్ ముందు పందుల గుంపు ఉండటం చూసి ఎంతో బాధపడ్డానని చెప్పారు. ఓక్రిడ్జ్ కాస్ ఆధ్వర్యంలో రెండు పెద్ద ఈవెంట్లు నిర్వహించేందుకు పాఠశాల యాజమాన్యం అనుమతివ్వడంతో రూ.40 లక్షల నిధులు సమకూర్చామని, సీఎస్ఆర్, స్నేహితుల ద్వారా సేకరించిన నిధులతో కేశవ్‌నగర్ పాఠశాలను ఆధునికంగా తీర్చిదిద్దామని హిమాన్షు వివరించారు. పాఠశాలను కట్టించామని, భవిష్యత్తులో ఈ బడి నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల మధ్య బర్త్ డే జరుపుకున్నారు. విద్యార్థులు, మంత్రితో కలిసి భోజనం చేశారు. -
త్వరలో టెట్ పరీక్ష! తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.. ‘కానీ, ఎందుకు?’
సాక్షి, హైదరాబాద్: త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే కసరత్తు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం దీనికి ఆమోదం తెలిపింది. మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యాశాఖలో దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంశం ఇందులో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తవకుండా నియామకాలు చేపట్టలేమని అధికారులు మంత్రులకు వివరించినట్టు సమాచారం. దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తిని పోగొట్టేందుకు తక్షణమే టెట్ నిర్వహించాలని భావించినట్టు తెలిసింది. భర్తీ కోసం ఎదురుచూపులే..! రాష్ట్ర అవతరణ తర్వాత 2016లో తొలిసారిగా టెట్ నిర్వహించారు. తర్వాత 2017, 2022లలోనూ నిర్వహించారు. ఇందులో గతేడాది టెట్ పరీక్ష సమయంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆశతో ఎక్కువ మంది పరీక్ష రాశారు. కానీ ఏడాది గడచినా నియామకాలేవీ చేపట్టలేదు. 2016 నుంచి టెట్ అర్హత పొందిన వారంతా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావుడి జరిగినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది. 22వేల ఖాళీలు.. బోధనకు ఇబ్బంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గతంలో విద్యాశాఖ అంచనా వేసింది. కానీ 12 వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరతతో చాలా పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది అవుతోంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టిన నేపథ్యంలో ఈ సమస్య ఇంకా పెరిగింది. కొన్ని పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)లను ఉన్నత తరగతుల బోధనకు పంపుతున్నారు. కోర్టు వివాదాలకు దారితీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీలు ముందుకెళ్లడం లేదని.. టెట్ చేపట్టినా ఉపయోగం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. పోస్టుల భర్తీ లేకుండా టెట్ దేనికి? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 22వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే లక్షల మంది టెట్ ఉత్తీర్ణులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే నియామకాలు చేపట్టవచ్చు. ఇవేవీ చేయకుండా టెట్ చేపడితే ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వం నియామకాలపై దృష్టి పెట్టాలి. – చావా రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి.. సీఎం నాటిన మొక్కకు హ్యాపీ బర్త్‌డే
సాక్షి, మహేశ్వరం: విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు పయనంలో మన్సాన్పల్లి చౌరస్తా వద్ద తన కాన్వా య్‌ను ఆపారు. నాగారం వైపు వెళ్తున్న బస్సు ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ముచ్చటించారు. ఏ పాఠశాలలో చదు తున్నారు? బస్సులు సమయానికి వస్తున్నాయా? ప్రభుత్వ పాఠశాలలో బోధన, వసతులు బాగున్నాయా?.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో ఆమె ఫొటోలు దిగారు. కాసేపు బస్సులో ప్రయాణించిన తర్వాత మంత్రి .. తిరిగి తన కారులో హైదరాబాద్ బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...తన ఇంటి వద్ద ఎనిమిదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ మొదటి విడత హరితహారంలో నాటిన మొక్కకు గురువారం పుట్టినరోజు వేడుక నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ చొరవ వల్ల 7.7 శాతం అడవులు పెరిగాయన్నారు. -వేల్పూర్ అరక పట్టిన అమాత్యుడు నిర్మల్ జిల్లాలో గిరిజనులకు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సారంగాపూర్ మండలం రవీంద్రనగర్ తండాకు వెళ్లి పోడు భూమిలో ఇలా అరక పట్టి దుక్కి దున్నారు. పోడు భూముల్లో రతనాలు పండించి ఆదర్శంగా నిలవాలని ఆదివాసీ రైతులకు సూచించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ అల‘గెల’గా సాధారణంగా ఒక అరటి చెట్టుకు ఒక గెల మాత్రమే కాస్తుంది. ఇందుకు భిన్నంగా ఒకే చెట్టుకు రెండు అరటి గెలలు కాశాయి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ మద్దిపుట్టులో ఓ గిరిజనుడి ఇంటి వద్ద ఈ అద్భుతాన్ని పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. – హుకుంపేట -
టెన్త్‌లో 86.60% పాస్.. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ వివరాలివే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో 86.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ తరహాలోనే టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి బుధవారం హైదరాబాద్‌లో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావులతో కలసి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తంగా 4,94,504 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,91,862 మంది పరీక్షలు రాశారని, ఇందులో 4,22,795 మంది (86.60 శాతం) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైందని... 25 స్కూళ్లలో సున్నా ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా 99శాతం ఉత్తీర్ణతతో ముందు వరుసలో ఉండగా.. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరన నిలిచినట్టు తెలిపారు. ప్రభుత్వ గురుకులాలు 98.25 శాతంతో టాప్‌లో నిలిచాయని.. రెసిడెన్షియల్, సోషల్, బీసీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూళ్లు కూడా సగటుకుపైగా ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయని వివరించారు. ఫెయిలైన వారు ఆందోళనకు గురికావొద్దని.. ఆత్మస్థైర్యంతో మళ్లీ పరీక్షలు రాసి విజయం సాధించాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులు క్షణికావేశంతో బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల ఆవేదనను గుర్తు చేసుకోవాలన్నారు. 15 రోజుల పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదలైన 15 రోజుల్లోగా విద్యార్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున స్టేట్ బ్యాంకు ద్వారా రుసుము చెల్లించాలని.. దరఖాస్తులను పోస్టు ద్వారా తమ కార్యాలయానికి పంపాలని సూచించారు. రీవెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు సంబంధిత పాఠశాల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి దరఖాస్తు పంపాలని చెప్పారు. దరఖాస్తు నమూనా bse.telangana.gov.in వెబ్సైట్లో లభిస్తుందని తెలిపారు. రీ వెరిఫికేషన్ జిల్లా స్థాయిలో జరుగుతుందని, దీనికోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు. జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను ఎస్సెస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు బుధవారం విడుదల చేశారు. విద్యార్థులు ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110 ఫీజు, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులకు అయితే రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సైన్స్ సబ్జెక్టుకు అదనంగా 20 నిమిషాలు సమయం ఉంటుందన్నారు. 2,793 స్కూళ్లలో అందరూ పాస్ పదో తరగతిలో రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇందులో ప్రైవేటు స్కూళ్లు 13 ఉంటే.. ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూళ్లు 9, ఎయిడెడ్ స్కూళ్లు 3 ఉన్నాయి. జీరో ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల్లో పనితీరుపై సమీక్ష చేపడతామని మంత్రి సబిత తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో ఎక్కువ పాస్ పదో తరగతి పరీక్షల్లో మాధ్యమం (మీడియం) వారీగా చూస్తే.. ఆంగ్ల మాధ్యమం వారిలో ఉత్తీర్ణత ఎక్కువగా ఉంది. ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసినవారిలో 90.50 శాతం ఉత్తీర్ణులుకాగా.. ఉర్దూ మీడియంలో 73.45, తెలుగు మీడియంలో 72.58 శాతం పాస్ అయ్యారు. ఇక ప్రధాన సబ్జెక్టుల్లో సాంఘిక శాస్త్రంలో, భాషా సబ్జెక్టుల్లో హిందీ (సెకండ్ లాంగ్వేజ్)లో ఎక్కువ శాతం పాస్ అయ్యారు. మొత్తంగా అన్ని భాషల్లోనూ 90శాతంపైనే ఉత్తీర్ణత కనిపించింది. -
ఇంటర్ రెండేళ్ల ఫలితాల్లోనూ అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో మరోసారి బాలికలు సత్తా చాటారు. మొదటి, రెండో సంవత్సరం రెండింటిలోనూ బాలురను మించి ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం పాసయితే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్ కావడం గమనార్హం. మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ రెండేళ్ల పరీక్షలు కలిపి మొత్తంగా 9,48,153 మంది హాజరయ్యారని తెలిపారు. ఫస్టియర్‌లో 61.68 శాతం, సెకండియర్‌లో 63.49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వెల్లడించారు. ఫస్టియర్‌లో 1,75,505 మంది, సెకండియర్‌లో 1,91,698 మంది ఏ గ్రేడ్ (75శాతంపైన మార్కులతో)లో ఉత్తీర్ణులైనట్టు వివరించారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ (75% పాస్) మొదటి స్థానంలో, రంగారెడ్డి (73% పాస్) ద్వితీయ స్థానంలో నిలిచా యని మంత్రి తెలిపారు. సెకండియర్‌లో ములుగు (85% పాస్) మొదటి స్థానంలో, కొమురం భీం (81 శాతం పాస్) రెండో స్థానంలో నిలిచినట్టు స్పష్టం చేశారు. ఫెయిలైతే ఆందోళన పడొద్దు ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసి పాసవ్వాలని మంత్రి సూచించారు. ఎంసెట్‌లో ఈ ఏడాది ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదని, అందువల్ల ఇంటర్ మార్కులు తక్కువ వచ్చినా ఆందోళన పడొద్దని చెప్పారు. నేటి నుంచి రీవెరిఫికేషన్.. ఇంటర్ జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ ప్రక్రియను ఈ నెల 10 నుంచి 16 వరకు చేపడుతున్నామని.. విద్యార్థులు సంబంధిత కాలేజీల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. రీవెరిఫికేషన్‌కు రూ.100, రీవ్యాల్యూయేషన్‌కు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులతోపాటు పాసైనా ఇంప్రూవ్మెంట్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 16 లోగా ఫీజు చెల్లించాలని సూచించారు. మార్కుల మెమోలు, కలర్ ప్రింట్లను ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. మానసిక ఆందోళనకు గురైన విద్యార్థులు 14416 టోల్ ఫ్రీనంబర్‌కు కాల్ చేసి నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ పొందవచ్చని తెలిపారు. వీలైనంత త్వరగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఇంటర్ బోర్డ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా.. ఏ కాలేజీలోనూ అడ్మిషన్లు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎంపీసీలో అత్యధిక ఉత్తీర్ణత.. రెండో స్థానంలో బైపీసీ – హెచ్ఈసీ, సీఈసీ కోర్సుల్లో 50 శాతంలోపే పాస్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ గ్రూపుల్లోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండింటిలోనూ ఎంపీసీ (మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూపులో ఎక్కువ మంది పాసయ్యారు. తర్వాత స్థానంలో బైపీసీ ఉండగా.. సీఈసీ, హెచ్ఈసీ వంటి సంప్రదాయ గ్రూపుల్లో తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. తగ్గిన ఉత్తీర్ణత శాతం – వంద శాతం సిలబస్ కారణమంటున్న నిపుణులు – కోవిడ్‌కు ముందుతో పోలిస్తే ఉత్తీర్ణత ఎక్కువే ఇంటర్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెండింటి ఫలితాలూ ఇలాగే ఉన్నాయి. కోవిడ్ కారణంగా 2021లో పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. తర్వాత 2022లోనూ 75శాతం సిలబస్‌తో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది వంద శాతం సిలబస్‌తో పరీక్షలు పెట్టారు. పూర్తి సిలబస్ నేపథ్యంలోనే ఇంటర్ జనరల్ విభాగంలో ఉత్తీర్ణత స్వల్పంగా తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. అయితే 2019తో పోలిస్తే మాత్రం పాస్ పర్సంటేజీ ఎక్కువగానే ఉంది. కొన్నేళ్లుగా ఇంటర్ ఉత్తీర్ణత శాతం (శాతాల్లో) ఏడాది ఫస్టియర్ సెకండియర్ 2018–19 60.60 64.94 2019–20 61.07 69.61 2020–21 100 100 2021–22 64.85 68.68 2022–23 62.85 67.27 -
ఉచితంగా వర్క్‌బుక్స్, నోట్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ ఏడాది నుంచి వర్క్‌బుక్స్, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కూడా అందుబాటులోకి తేవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరుపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. వర్క్ బుక్స్‌ను, నోటు పుస్తకాలను పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అందజేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ ద్విభాషా పాఠ్యపుస్తకాలను పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి అందించాలని అదేశించారు. గత సంవత్సరం పాఠ్యపుస్తకాల పంపిణీ కోసం రూ.132 కోట్లు ఖర్చు చేయగా, రానున్న విద్యా సంవత్సరంలో రూ.200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నా మని మంత్రి తెలిపారు. దాదాపు రూ.150 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్‌ను పాఠశాలల పునః ప్రారంభం నాటికి అందించాలని సూచించారు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నందున బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని మంత్రి సబిత అధికారులకు చెప్పారు. స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫామ్‌లను విద్యార్థులకు అందజేసే విధంగా కార్యక్రమాల్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతి నిధులు పాఠశాలకు హాజరయ్యే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని మంత్రి సబిత అధికారులకు సూచించారు. మన ఊరు – మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకురాలు దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
టెన్షన్ లేకుండా టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సన్నద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను కోరారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని, వారికి అసౌకర్యం కలగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చే నెల 3 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పాఠశాల విద్య సంచాలకురాలు దేవసేనతో కలసి మంత్రి సబిత బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షల్లో విద్యార్థులు హాజరవుతున్న పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారని, వీరి కోసం 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించే ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్ష పేపర్లను 11 నుంచి 6 కు కుదించామని, సైన్స్ పరీక్ష రోజున భౌతిక శాస్త్రం, జీవ స్త్రాస్తానికి సంబంధించి ప్రశ్న పత్రాలను విడివిడిగా అందిస్తామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం చేసే సౌకర్యం కూడా కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష ఎకరాల్లో పంట నష్టం!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ అగ్రికల్చర్/ మర్పల్లి/ వికారాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు అన్నదాతలను నిండా ముంచాయి. సుమారు లక్ష ఎకరాల్లో పంటలను దెబ్బతీశాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానలతో వరి, మామిడి, నిమ్మ, బత్తాయి, పుచ్చ, టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుము పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అనేక చోట్ల వరి నేలవాలగా కొన్ని ప్రాంతాల్లో మక్కలు తడిసి ముద్దయ్యాయి. అలాగే మామాడి, బత్తాయి, నిమ్మ తోటల్లో పిందెలు, కాయలు రాలిపోయాయి. పచ్చిమిరప చేన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వికారాబాద్ జిల్లాలో అత్యధిక పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో 1,060 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో దెబ్బతిన్న ఉద్యాన, వ్యవసాయ పంటలను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాబేజీ, ఉల్లి, మొక్కజొన్న, పుచ్చకాయ, క్యాప్సికం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామని మంత్రి పేర్కొన్నారు. సాగు విధానంలో మార్పు అవసరం మన దేశంలో వ్యవసాయానికి ఓ విధానమంటూ లేదని, దీనిని సరిచేసే విషయమై కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని వివరించారు. మార్చి, ఏప్రిల్‌లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని, ఈలోగా పంటలు చేతికి వచ్చేలా సాగువిధానంలో మార్పులు రావాలన్నారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, సూర్యాపేట ప్రాంతాల్లో రైతులు పంటలు నష్టపోకుండా సీజన్లో మార్పులు చేసుకుంటున్నారని, ఈ ప్రాంత రైతులు కూడా ఆ దిశగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, ఉద్యానవన శాఖ సంచాలకులు హన్మంతారావు, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. రైతులకు వ్యవసాయ వర్సిటీ సూచనలు... రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, కూరగాయలు పండించే రైతులు పొలాల్లో అధిక వర్షపు నీరు బయటకు పోవడానికి వీలుగా మురుగు కాల్వలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం.వెంకటరమణ సూచించారు. చీడపీడలు, తెగుళ్ల ఉధృతి అధికం కాకుండా ఉండేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
ఆడబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
దిల్సుఖ్నగర్: రాష్ట్రంలోని ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) తెలంగాణ స్టేట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్కేపురంలోని కిన్నెర గ్రాండ్ హోటల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత మహిళలు, యువతుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో ధైర్యం నింపేందుకు షీ–టీమ్స్ ఏర్పాటు చేసిందన్నారు. మహిళలను తమను తాము రక్షించుకునేందుకు సిద్ధం కావాలన్నారు. అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు, దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా జీహెచ్ఎంసీలో అదనంగా మరో పది సీట్లు కేటాయించారన్నారు. మార్కెట్ కమిటీల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిం చి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిం చారన్నారు. ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ప్రతి మగవాడి విజయం వెనుక మహిళ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఒక మొక్క నాటాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఐవీఎఫ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళ రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, యాంకర్ రవి, బిగ్ బాస్ ఫేమ్ హిమాజా రెడ్డి, లహరి , ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, ఐవీఎఫ్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, ఐవీఎఫ్ మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, స్టేట్ ట్రెజరర్ కోడిప్యాక నారాయణ గుప్తా, యూత్ విభాగం నరేష్ గుప్తా, మహిళా విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ప్రైవేటు ఇంటర్ కాలేజీ యాజమాన్యాలతో సబిత భేటీ
సాక్షి, హైదరాబాద్/మణికొండ/ షాద్‌నగర్ రూరల్: ప్రైవేటు ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపక సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం భేటీ అవుతా రు. ఇంటర్, పోటీ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె సమీక్షించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల మానసిక స్థితిగతులు, యాజమాన్యాల నుంచి విద్యార్థులకు మార్కుల కోసం వస్తున్న ఒత్తిడిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ విద్యాశాఖ కార్యదర్శి కరుణ హాజరవుతారు. సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర నివేదిక ఇటీవల నార్సింగ్ పరిధిలోని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఇంటర్ బోర్డ్ అధికారులను సబిత ఆదేశించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారి ప్రాథమిక నివేదిక అందజేశారు. విద్యార్థి తను చదువుతున్న కాలేజీలో కాకుండా, అదే కాలేజీకి చెందిన మరో క్యాంపస్‌లో మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. వేరే క్యాంపస్‌కు అతను ఎందుకు వెళ్లాడు? అతని అడ్మిషన్ ఎక్కడ? ఆత్మహత్యకు గల కారణాలపై సోమవారం సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి సాత్విక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఆస్పత్రిపై అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక సమర్పించారని మృతుడి తల్లిదండ్రులు నాగుల రాజు, అలివేలు ఆరోపించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి పోస్టుమార్టం చేస్తే, గాం«దీలో చేసినట్లు తప్పుడు నివేదిక ఇచ్చారని, తమ కుమారుడు అసలు శ్రీ చైతన్య కాలేజీలో చదవడం లేదని రిపోర్టు ఇచ్చి ఇచ్చారని ఆరోపించారు. ఆ నివేదికపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్లో తారాస్థాయికి విభేదాలు .. రాజకీయం.. రసకందాయం
‘ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు’ అనే నానుడి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలకు అతికినట్టు సరిపోతుంది. కొత్త, పాతల మధ్య కుదిరిన సయోధ్య చెదరడంతో భవిష్యత్తు రాజకీయం రసకందాయంగా మారనుంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని కీలక నాయకుల అంతర్గత కుమ్ములాటలు, ధిక్కార స్వరాలు క్రమక్రమంగా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. నాయకుల వైఖరి అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. సాక్షి, రంగారెడ్డి: జిల్లా రాజకీయాలను శాసించే మహేశ్వరం, తాండూరు, మేడ్చల్ నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలు రోజురోజుకూ ముదిరి పాకాన పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసంతృప్తి మరింత పెరిగేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నంమహేందర్రెడ్డి, మేడ్చల్‌లో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య చాలాకాలంగా విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అవి మెల్లమెల్లగా రాజుకుంటూ ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ ఒకటే అయినా వైరివర్గం ఆధిపత్యం మింగుడుపడక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలనే భావనలో అసంతృప్త నేతలు ఉన్నారు. తమ కుటుంబ సభ్యులు జిల్లా పరిషత్ పీఠాలపై కూర్చున్నా సరే ప్రత్యర్థుల పెత్తనాన్ని ఒప్పుకొనేది లేదని తెగేసి చెబుతూ తిరుగుబాటుకు సిద్ధపడుతుండడం గమనార్హం. పైలెట్‌తో పట్నం ఢీ గత ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో అనూహ్య ఓటమిని చవిచూశారు. తర్వాత తన సోదరుడి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవడంతో సంతృప్తి పడ్డారు. అనంతరం జెడ్పీ ఎన్నికలు రావడంతో సారథిగా సతీమణి సునీతను గెలిపించుకోవడం ద్వారా వికారాబాద్ జిల్లాలో తన రాజకీయ పలుకుబడి తగ్గలేదని నిరూపించుకున్నారు. అయితే, తనను ఓడించిన పైలెట్‌ను అధిష్టానం అక్కున చేర్చుకోవడంతో డీలా పడ్డారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రెండువర్గాలు విడిపోవడంతో గులాబీ శిబిరంలో లుకలుకలు మొదలయ్యాయి. వీరి ఆధిపత్యపోరులో శ్రేణులు కూడా చీలిపోవడం.. ప్రొటోకాల్ సమస్యలతో తాండూరు రాజకీయ రంజుగా మారింది. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో ప్రగతిభవన్‌కు దగ్గరయిన పైలెట్ మెడకు ఈడీ కేసు బిగుసుకుంటుందని.. తద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమనే ధీమాలో పట్నం వర్గీయులు ఉన్నారు. రోహిత్ మాత్రం తన కెరీర్‌ను ఫణంగా పెట్టి బీజేపీపై కేసీఆర్‌కు పోరాటాస్త్రం అందించానని, ఈ సారి గులాబీ బీఫారం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ సమీకరణలకు అనుగుణంగా అడుగువేయాలని భావిస్తున్న పట్నం అవసరమైతే కండువా మార్చయినా జిల్లా రాజకీయాలపై మళ్లీ పట్టు సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సబిత వర్సెస్ తీగల మహేశ్వరంలో మంత్రి సబిత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి పొసగడం లేదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తీగలపై సబిత విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆమె కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరి కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. అప్పటి నుంచి కినుక వహించిన కృష్ణారెడ్డి పలుమార్లు మంత్రి వ్యవహారశైలిని తప్పుబడుతూ వస్తున్నారు. అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం.. ఆయన కోడలు అనితారెడ్డిని జెడ్పీ చైర్‌పర్సన్‌గా నియమించింది. దీంతో కొన్నాళ్లు గుంభనంగా వ్యవహరించిన కృష్ణారెడ్డి తిరిగి మంత్రిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అభివృద్ధి జరగడంలేదని,తన వర్గీయులను అణిచివేస్తున్నారని పెదవి విరుస్తున్నారు. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్‌ను కాదని తనకు టికెట్ ఇచ్చే అవకాశం మృగ్యమనే ప్రచారం నేపథ్యంలో పక్కపారీ్టలవైపు చూస్తున్నారు. మేడ్చల్‌లోనూ సేమ్ సీన్ 2018 ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో మిన్నకుండిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఈసారి మాత్రం అధిష్టానంతో చావోరేవో తేల్చుకునేదిశగా అడుగులేస్తున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన చామకూర మల్లారెడ్డి అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు సంపాదించారు. ఈ పరిణామం మింగుడుపడని మలిపెద్ది.. తన అనుచరవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయనను సంతృప్తి పరిచేందుకు కుమారుడు శరత్‌చంద్రారెడ్డికి మేడ్చల్ జెడ్పీ పీఠాన్ని అప్పగించారు. దీంతో కొన్నాళ్లపాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే, సుధీర్‌రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసిన మల్లారెడ్డి.. నెమ్మదిగా అన్ని మండలాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోని సుధీర్.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బరిలో దిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబీకులపై జరిగిన ఐటీ దాడులతో మంత్రి ప్రతిష్ట మసకబారిందని.. ఈసారి తనకు టికెట్ ఖాయమనే భావనలో ఉన్నారు. అధిష్టానం నుంచి రిక్తహస్తం ఎదురైతే ప్రత్యర్థి పార్టీ కండువా కప్పుకొనేందుకు కూడా వెనుకాడరనే ప్రచారం జరుగుతోంది. -
Telangana: టీచర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఈ నెల 27 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. 37 రోజుల్లో దీన్ని పూర్తి చేయనున్నారు. వీలైనంత త్వరగా అధికారిక షెడ్యూల్ విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ మేర కు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. శుక్రవారం సాయంత్రం మంత్రి సబిత విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. కాగా కొన్ని మార్పుచేర్పులతో శని వా రం షెడ్యూల్‌ను విడుదల చేస్తామని అధికారులు తెలిపాయి. దీనికి గతంలో బదిలీలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేయాల్సి ఉంది. కలెక్టర్ కన్వీనర్‌గా.. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై కొన్ని రోజులుగా అధికారవర్గాలు తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉపాధ్యాయ సంఘాలతో ఉన్నతాధికారులు విస్తృతంగా చర్చలు జరిపారు. గతానికి భిన్నంగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ కన్వీనర్‌గా, జిల్లా పరిషత్ చైర్మన్, సీఈవో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచనలో ఉన్నారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో ముఖ్య భూమిక పోషించేవారు. దీనివల్ల అనేక సమస్యలు వచ్చాయని, ఐఏఎస్‌లకు బాధ్యత అప్పగిస్తే ఎలాంటి తలనొప్పులు ఉండవని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రమోషన్లకు అర్హుల జాబితా సిద్ధం ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా, ఎస్ఏల నుంచి హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు అర్హత గల వారి జాబితాను శుక్రవారం అధికారులు సిద్ధం చేశారు. జిల్లాల వారీగా వీటిని కలెక్టర్ల పరిశీలనకు పంపుతున్నట్టు ఓ అధికారి తెలిపారు. మార్గదర్శకాలపై ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కోర్టు వివాదాలున్న కారణంగా భాషా పండితుల విషయంలో బదిలీలు, పదోన్నతులు చేపట్టే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. కాగా షెడ్యూల్ విడుదల రోజునే ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. -
Telangana: టెన్త్ ప్రశ్నపత్రంలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులపై వస్తున్న విమర్శల నేపథ్యంలో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసి.. పరీక్ష విధానం కాస్త తేలికగా ఉండేలా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ‘టెన్‌్త’కు కఠిన పరీక్ష శీర్షికన ఈ నెల 2న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. చాయిస్ తగ్గించడం, వ్యాసరూప ప్రశ్నల విధానాన్ని కఠినం చేయడం, ఒకేరోజు సైన్స్ సబ్జెక్టుకు సంబంధించిన రెండు పేపర్లు నిర్వహించడంపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను ఈ కథనం వెలుగులోకి తెచ్చింది. పలు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఈ అంశాలను ఎత్తిచూపుతూ.. విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై స్పందించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో సమాలోచనలు జరిపారు. ఇబ్బందికరంగా ఉన్న ప్రశ్నపత్రాలు, విధానంలో మార్పు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రంగంలోకి దిగింది. అభ్యంతరాలను పరిశీలించి, పరీక్ష పేపర్లలో మార్పులు తెస్తూ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఆమోదించగానే ప్రశ్నపత్రాలను మార్చనున్నారు. చాయిస్ పెంపు.. ప్రశ్నల తగ్గింపు.. రెండేళ్ల కరోనా కాలం తర్వాత ఈసారి వందశాతం సిలబస్‌తో టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి పరీక్షల నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈసారి 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతోనే పరీక్షలు ఉంటాయంటూ.. సంబంధించిన మోడల్ పేపర్లను విడుదల చేసింది. ఆ పేపర్లను చూశాక విద్యార్థులు, విద్యారంగ నిపుణులు ఆశ్చర్యపోయారు. రెండు, మూడు మార్కుల సూక్ష్మప్రశ్నలకు గతంలో ఉన్న చాయిస్ ఎత్తివేయడంతో.. ఏ ఒక్క ప్రశ్నకు జవాబు తెలియకపోయినా విద్యార్థి ఆ మేర మార్కులు కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళన మొదలైంది. ఇక వ్యాసరూప ప్రశ్నలను సెక్షన్ మాదిరి కాకుండా, గ్రూపులుగా ఇచ్చారు. సెక్షన్ మాదిరిగా అంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి అందులోంచి ఆరింటికి సమాధానాలు రాయాలని కోరుతారు. దీనిలో విద్యార్థులకు చాయిస్ ఎక్కువగా ఉండి, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మోడల్ పేపర్లలో రెండు ప్రశ్నల చొప్పున ఆరు గ్రూపులుగా ఇచ్చి.. ప్రతి గ్రూప్‌లో ఒకదానికి సమాధానం రాయాలని పేర్కొన్నారు. ఆ గ్రూపులోని రెండు ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే.. ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. మిగతా గ్రూపుల్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగినా ప్రయోజనం ఉండదు. ఈ ఆందోళనను ఎస్సీఈఆర్టీ అధికారులు పరిగణనలోనికి తీసుకున్నారు. సూక్ష్మప్రశ్నలకు ఎక్కువ చాయిస్ ఇవ్వడం మంచిదని.. వ్యాసరూప ప్రశ్నలనూ సెక్షన్ విధానంలో ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. అంతేగాకుండా వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్–కెవిుస్ట్రీ/బయాలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహించాలనే డిమాండ్‌ను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నట్టు తెలిసింది. మార్పులను పరిశీలిస్తున్నాం.. త్వరలో వెల్లడిస్తాం టెన్త్ ప్రశ్నపత్రాల విధానం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని వివిధపక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. అధికారుల నివేదిక వచ్చాక ఏతరహా మార్పులు చేయాలనేది నిర్ణయిస్తాం. ఇప్పటికే సంబంధిత విభాగం ప్రశ్నపత్రాల మార్పులపై నిశితంగా అధ్యయనం చేస్తోంది. విద్యార్థుల ప్రయోజనం కోసం అవసరమైన మార్పులు చేస్తాం. – వాకాటి కరుణ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ -
విద్యార్థుల భద్రతపై సమావేశం
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల్లో విద్యార్థులకు భద్రత, రక్షణ వ్యవస్థ ఏర్పా టుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా జరిగే ఈ కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, అదనపు డీజీ స్వాతిలక్రా సహా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులు పాల్గొంటారని ఆయ న తెలిపారు. కళాశాలల్లో చేరే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవ్వకుండా, సైబర్ నేరాలకు ఆకర్షితులవ్వకుండా, వివిధ కారణాల వల్ల ఆత్మన్యూనత భావానికి లోనవ్వకుండా ఏ తరహా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. -
900 మందికి ఒకే టాయిలెట్టా..!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో తొమ్మి ది వందల మంది చదివే ఓ ప్రభుత్వ కళాశాలలో ఒక్క బాత్రూం ఉండటమా? అదీ విద్యా శాఖ మంత్రి ఇలాకాలోనా? ఇలా టాయిలెట్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కడం సిగ్గుచేటని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుది దరిద్రపు పాలనని చెప్పేందుకు ఇదొక్కటిచాలని మంగళవారం తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. పిల్లలకు కనీసం బాత్ రూంలు కూడా కట్టలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత?..విద్యాశాఖ మంత్రి ఊడితే ఎంత అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాత్ రూంకు వెళ్లకుండా, పీరియడ్స్ రాకుండా టాబ్లె ట్ వేసుకుంటున్నామన్న బాలికల మాటలు వినడానికే భయానకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రం వస్తుందేమోనని నీళ్లు కూడా తాగడం లేదని చెప్తుంటే మనమింకా ఏ సమాజంలో ఉన్నామని నిలదీశారు. -
‘నిజాం’ మహిళా హాస్టల్ ఏర్పాటు సమంజసమేనా?
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలేజీలో మ హిళా హాస్టల్ ఏర్పా టుచేయాలన్న విద్యా ర్థిసంఘాల డిమాండ్ నేపథ్యంలో దాని సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారుల ను విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించా రు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రవీందర్, కాలేజీ విద్య కమిషన్ నవీన్‌మిట్టల్ సహా పలువురు అధికారులతో బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. నిజాం కాలేజీలో హాస్టల్ ఏర్పాటుపై వచ్చిన డిమాండ్ ఎంత వరకు సమంజసమో పరిశీలించి నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. ఈ డిమాండ్ లేవ నెత్తిన విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సంప్ర దించాలన్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ చదువు తున్న బాలురకు ఏళ్లుగా హాస్టల్ సౌకర్యం ఉందని, కానీ బాలికలకు అక్కడ హాస్టల్ సదు పాయం లేదని అధికారులు మంత్రికి వివరించారు. హాస్టల్ ఏర్పాటు చేసే స్థలం కూడా లేదని అధికారులు తెలిపినట్లు సమాచారం. చదవండి: కోమటిరెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు -
బాసరకు మంత్రి కేటీఆర్
నిర్మల్: ఎట్టకేలకు బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కలవనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఆర్జీయూకేటీకి రానున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తల్లి ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడకు వెళ్లనున్నారు. అక్కడ జోగు రామన్నను పరామర్శించి బాసరకు రానున్నారు. విద్యార్థులతో మాటాముచ్చట.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రులు ఆర్జీయూకేటీ చేరుకోనున్నారు. ముందుగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆ తర్వాత వారితో మాట్లాడనున్నారు. రెండు గంటలు కేటీఆర్‌తోపాటు సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి వర్సిటీలో ఉండనున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఇందుకు సీఎం లేదా మంత్రి కేటీఆర్ తమవద్దకు రావాలని జూన్‌లో విద్యార్థులు వారంపాటు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అప్పుడిచ్చిన హామీ మేరకు కేటీఆర్ క్యాంపస్‌కు వస్తున్నట్లు చెబుతున్నారు. కేటీఆర్ రాకతో తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు. -
ఇంజనీరింగ్‌లో పాత ఫీజులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు కాలేజీల్లో ఈ ఏడాది ఫీజుల పెంపు లేనట్టే. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే వీలుంది. ఈ సంవత్సరం పాత ఫీజులే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ) ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. దీన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదించారు. ఈ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వీలుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. 2022–23 నుంచి కొత్త ఫీజులు అమలు కావాల్సి ఉంది. దీనిపై ఎఫ్ఆర్సీ కసరత్తు చేసింది. కాలేజీల ఆడిట్ నివేదికలను పరిశీలించడంతోపాటు యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపింది. రూ. 35 వేలున్న కనిష్ట ఫీజును రూ. 45 వేలకు, రూ. 1.43 లక్షలున్న గరిష్ట ఫీజును రూ. 1.73 లక్షలకు పెంచాలని భావించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. చదవండి: అగ్గి రాజేసిన ఫీజు -
ఇంజనీరింగ్ ఫీజుపై నిర్ణయించలేదు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో వార్షిక ఫీజుల పెంపు నిలిపివేతపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అసలు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనే ప్రభుత్వానికి రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఎంసెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా శుక్రవారం మంత్రి వద్ద ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఫీజులు పెంచాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. దీనికోసం ఏర్పాటైన కమిటీ అన్నీ పరిశీలించాక అవసరమైన సిఫార్సులు చేస్తుందని వివరించారు. రాష్ట్ర అడ్మిషన్ల కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ఇప్పటి వరకూ తమ దృష్టికి ఎలాంటి ప్రతిపాదన తీసుకురాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. యాజమాన్యాలతో చర్చించిన తర్వాత కనిష్టంగా రూ.45 వేలు, గరిష్టంగా రూ.1.73 లక్షల వరకూ ఫీజుల పెంపునకు సమ్మతించింది. అయితే, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈఏడాది పాత ఫీజులే అమలు చేయాలని భావించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ దిశగా నివేదిక పంపినట్టు ఎఫ్ఆర్సీ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. దీంతో ఈ ఏడాది ఫీజుల పెంపు ఉండదని అందరూ భావించారు. కానీ మంత్రి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఫీజుల పెంపు వ్యవహారం మళ్లీ తెరమీదకొస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్లో బాలికలు -
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: గత నెలలో జరిగిన తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సెట్లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్ జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేశారు. ➤ టీఎస్ ఎంసెట్-2022 (ఇంజనీరింగ్) ఫలితాల కోసం క్లిక్ చేయండి ➤ టీఎస్ ఎంసెట్-2022 (అగ్రికల్చర్) ఫలితాల కోసం క్లిక్ చేయండి ➤ టీఎస్ ఈసెట్-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి ఇంజనీరింగ్: ఫస్ట్ ర్యాంక్-లక్ష్మీసాయి లోహిత్ సెకండ్ ర్యాంక్- సాయిదీపిక థర్డ్ ర్యాంక్- కార్తికేయ అగ్రికల్చర్: ఫస్ట్ ర్యాంక్- నేహ సెకండ్ ర్యాంక్-రోహిత్ థర్డ్ ర్యాంక్-తరుణకుమార్ గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం, 30, 31 తేదీల్లో అగ్రి, మెడికల్ ఎంసెట్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విభాగానికి 1.52 లక్షలమంది, అగ్రి ఎంసెట్‌కు 80 వేలమంది హాజరయ్యారు. ఎంసెట్, ఈసెట్ ఫలితాల కోసం www.sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వొచ్చు. -
అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది? సైలెంట్ అవ్వడం తాత్కాలికమేనా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీలో అసమ్మతి స్వరం పెరుగుతోంది. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా, తాజాగా మహేశ్వరంలో మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సబితారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం అభివృద్ధే ధ్యేయమంటూ హస్తం పార్టీకి బైబై చెప్పి.. గులాబీ కండువా వేసుకున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక్కడ అధికార పార్టీ తరఫున పోటీచేసి ఓటమి పాలైన నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి అధిష్టానం హామీతో తాత్కాలికంగా సైలెంట్ అయ్యారు. కోడలు అనితారెడ్డికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టడంలో సఫలీకృతుడయ్యారు. ఇదిలా ఉండగా పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో తనకు సరైన ప్రాధాన్యః దక్కడం లేదంటూ ఇటీవల ధిక్కార స్వరం అందుకున్నారు. భగ్గుమంటున్న విభేదాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. తుక్కుగూడ మున్సిపాలిటీలో టీఆర్ఎస్కు మెజార్టీ స్థానాలు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఆయనను చైర్మన్‌గా ఎన్నుకుంది. ఆ తర్వాత మంత్రితో చైర్మన్‌కు పొసగకపోవడంతో ఆయన టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. అధికార పార్టీ ఇక్కడ మేయర్లుగా ఎన్నికయ్యారు. వీరిలో బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత.. మంత్రి సబితకు మధ్య అంతర్గత విబేధాలు తార స్థాయికి చేరాయి. మంత్రితో పొసగక మేయర్ దంపతులు, మరో ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అసమ్మతి వర్గం కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్న సమయంలోనే అనూహ్యంగా గత మంగళవారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మంత్రినే టార్గెట్ చేస్తూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఇదంతా టీ కప్పులో తుఫాను వంటిదేనని, అన్నతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతానని సబిత ప్రకటించారు. నేతల చూపు.. కాంగ్రెస్ వైపు పరిస్థితి చక్కబడకముందే బుధవారం అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత కొత్త మనోహర్‌రెడ్డి మంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. మొదటి నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న మనోహర్‌రెడ్డితో పాటు మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు బడంగ్పేట్, మీర్‌పేటకు చెందిన మరికొందరు కార్పొరేటర్లు కూడా అసమ్మతి స్వరం వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన జిల్లా అధిష్టానం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసమ్మతి స్వరం పెంచిన సీనియర్లంతా త్వరలోనే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. -
దేవుడు అన్యాయం చేసినా.. సీఎం న్యాయం చేస్తున్నారు
వెంగళరావునగర్: అవిభక్త కవలలైన వీణావాణీలకు దేవుడు కొంత అన్యాయం చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన వంతుగా తగిన న్యాయం చేస్తున్నారని మం త్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్ పరీక్షల్లో వీణావాణీలు ఫస్ట్‌క్లాస్ మార్కులతో బీ–గ్రేడ్‌లో పాసైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధ వారం మధురానగర్‌లోని మహిళా శిశుసం క్షేమ శాఖ కార్యాలయం శిశువిహార్‌లో ఆశ్రయం పొందుతున్న వీరిని మంత్రులు కలిశారు. తొలుత వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత చదువులు ఏం చదవాలని అనుకుంటు న్నారని వీణావాణీలను ప్రశ్నించగా.. దానికి వారు తాము సీఏ చదవాలని అనుకుంటున్నామని సమాధానం చెప్పారు. కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే పరిస్థితి లేని కారణంగా సీఏ చదివితే ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వారి మాటలకు స్పందించిన మంత్రులు తప్పనిసరిగా మీ చదువులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే వీణావాణీల తల్లికి ఇక్కడే ఉద్యోగం ఇచ్చారు. వీణావాణీలు సీఏ చదవడానికి శ్రీమేధ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా కోర్సులు ఇప్పిస్తున్నామని, వారికి కావాల్సిన ల్యాప్‌టాప్‌లు కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పరస్పర బదిలీలకు ఓకే..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో కదలిక వచ్చింది. హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని సమ్మతిపత్రం అందజేసిన దరఖాస్తుదారుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పరస్పర బదిలీలపై వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని అన్ని ప్రభుత్వశాఖలను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలగనుందని అధికారులు వెల్లడించారు. విద్య, హోంశాఖల నుంచి అధికసంఖ్యలో పరస్పర బదిలీల కోసం దరఖాస్తులొచ్చాయి. విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సోమవారం ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు పరస్పర బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాకాటి కరుణ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోనల్, జోనల్, జిల్లా క్యాడర్లకు పలువురు ఉపాధ్యాయుల పరస్పర బదిలీల జాబితాలను ఈ ఉత్తర్వుల్లో వెల్లడించారు. బదిలీపై వెళ్లేవారికి కొత్త లోకల్ క్యాడర్లోని ప్రస్తుత రెగ్యులర్ చివరి ఉద్యోగి తర్వాతి ర్యాంక్‌ను కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీలకు టీఏ, డీఏ వర్తించదని తెలిపారు. ఇదిలా ఉండగా, పరస్పర బదిలీల్లో భాగంగా ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు వెళ్తే మొత్తం సీనియారిటీని కోల్పోవాల్సి ఉంటుందని గతంలో జారీ చేసిన జీవోలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ అప్పట్లో కొందరు హైకోర్టులో కేసు వేయడంతో బదిలీల ప్రక్రియ ఆగిపోయింది. ఈ అంశంపై తుదితీర్పునకు లోబడి తుదినిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణపత్రం జారీ చేయడంతో పరస్పర బదిలీలకు అనుమతిస్తూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలపై హైకోర్టు తుదితీర్పునకు కట్టుబడి ఉంటామని దరఖాస్తుదారుల నుంచి సమ్మతిపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. -
అవకతవకలకు ఆస్కారం లేకుండా..నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి జరిగే ఇంటర్మీడియెట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. పరీక్ష కేంద్రాలన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉండబోతున్నా యని చెప్పారు. పరీక్షల నేపథ్యంలో జలీల్ గురువా రం మీడియాతో మాట్లాడారు. ‘ఇంటర్ పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తు న్నాం. పరీక్ష కేంద్రంలో జరిగే ప్రతీ కదలి కను రాజ ధాని నుంచే పరిశీలించే ఏర్పాట్లు చేశాం. మొత్తం 1,443 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని జిల్లా, రాష్ట్ర కార్యాలయా లకు అనుసంధానం చేశాం. ఎక్కడా పేపర్ లీకేజీకి అస్కారం లేకుండా ఆధునిక టెక్నాలజీని వాడుతున్నాం. ఎగ్జామినర్ మినహా... పరీక్ష కేంద్రంలోకి ఎవరినీ సెల్‌ఫోన్ తీసుకెళ్లనివ్వం. విద్యార్థులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఓఎంఆర్ షీట్లో ఏమైనా సమస్యలుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి. తక్షణమే వాటిని పరిష్కరిస్తారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు’అని చెప్పారు. 15 రోజుల్లో సప్లిమెంటరీ ‘ఇంటర్ పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు నుంచే మూల్యాంకనం చేపడతాం. జూన్ 24 కల్లా ఫలితాలు వెల్లడించాలనే సంకల్పంతో ఉన్నాం. మంచిర్యాల, నిర్మల్ కొత్తగా ఏర్పాటు చేసినవి కలుపుకుని 14 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుంది. ఫలితాలు వెలువడిన 15 రోజుల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. వాటి ఫలితాలు కూడా వీలైనంత త్వరగా వెల్లడిస్తాం’అని జలీల్ వెల్లడించారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: సబిత ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాసి, మంచి మార్కులతో పాసవ్వాలని ఇంటర్ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలుంటాయని, ప్రశ్నల చాయిస్ కూడా పెంచామని తెలిపారు. సకాలంలో పరీక్ష కేంద్రానికి వచ్చేలా ప్రణాళికబద్ధంగా వ్యహరించాలని సూచించారు. -
స్కిల్, అప్‌స్కిల్, రీ–స్కిల్
గోల్కొండ: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు, టీచర్లు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు సూచించారు. ఇందుకోసం వారంతా స్కిల్, అప్ స్కిల్ రీ–స్కిల్ అనే మంత్రాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలతోపాటు ప్రైవేటు బడ్జెట్ స్కూళ్లకు చెందిన 6–10వ తరగతి విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్–2021 ఫినాలే సోమవారం హైదరాబాద్ గోల్కొండలోని తారామతి–బారాదరిలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌తోపాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తుది పోటీలో గెలిచిన ఐదు విద్యార్థుల బృందాలకు అవార్డులు, చెక్కులు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకతకు పదును పెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా పిల్లలు, యువత కోసం ‘వై–హబ్’ఇంక్యుబేటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో అందుబాటులోకి రానున్న టీ–హబ్ 2.0 భవనంలో 10 వేల చ.అ. విస్తీర్ణంలో వై–హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్, ఇంజనీర్నే చేయాలన్న ధోరణి వద్దు.. తల్లిదండ్రులు వారి పిల్లల్ని కేవలం డాక్టర్, ఇంజనీర్ లేదా లాయర్‌గా తయారు చేయాలన్న ఆలోచనా ధోరణిని వదిలేయాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు. తల్లిదండ్రుల ధోరణి వల్ల విద్యార్థులకు కేవలం ర్యాంకులు, మార్కులు తప్ప ఇంకేమీ తెలియట్లేదని.. ముఖ్యంగా హైదరాబాద్‌లో చదివే చాలా మందికి బియ్యం, కూరగాయలు ఎలా పండుతాయో, పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ఉదహరించారు. అందువల్ల పిల్లల భవిష్యత్తును వారే నిర్ణయించుకొనే హక్కును వారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యార్థులు సైతం ఉద్యోగం కోరుకొనే స్థాయి నుంచి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలనే ధోరణిని పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్నో ఆవిష్కరణలు... తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో విద్యార్థులు వైవిధ్యంతో కూడిన ఎన్నో ప్రాజెక్టులు తయారు చేశారని, వారికి విద్యాశాఖ అధికారులు అండగా ఉండి ప్రోత్సహించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ చాలెంజ్‌లో 5,387 పాఠశాలలకు చెందిన 25,166 మంది విద్యార్థులు, వారికి దిశానిర్దేశం చేసేందుకు 7,003 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని చెప్పారు. మొత్తం 11,037 బృందాలు తమ ఆలోచనలను సమర్పించగా పలు వడపోతల అనంతరం వాటిలో ఐదు బృందాలను న్యాయ నిర్ణేతలు విజేతలుగా ఎంపిక చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కమిషనర్ ఎ. దేవసేన, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, యునిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మురళీకృష్ణ, ఇంక్వి–ల్యాబ్ ఫౌండేషన్ డైరెక్టర్ వివేక్ సిద్ధంపల్లి తదితరులు పాల్గొన్నారు. -
జూలై 14 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ను జూలై 14 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసెట్‌ను ఇదే నెల 13న నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మంగళవారం ఈ మేరకు షెడ్యూల్ వెల్లడించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సహా పలువురు ఉన్నతాధికారులతో ఆమె వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై చర్చించారు. వీటికి అవసరమైన నోటిఫికేషన్లను సంబంధిత విభాగాలు త్వరలో విడుదల చేస్తాయని ఆమె ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ జూలై 14, 15 తేదీల్లో, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు చేపట్టే ఎంసెట్ పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో ఉంటుందని చెప్పారు. మొత్తం 23 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 105 పరీక్ష కేంద్రాలను ఈ సెట్స్ కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు సమష్టిగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ వెయిటేజీ లేదు.. ఇంటర్మీడియెట్ మార్కులను ఎంసెట్‌లో వెయిటేజ్‌గా తీసుకోవడం లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి స్పష్టంచేశారు. కరోనా నేపథ్యంలో గతేడాది కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంసెట్ రాసే ఇంటర్ సెకండియర్ విద్యార్థులు గత ఏడాది ఆఖరులో జరిగిన ఇంటర్ ఫస్టియర్‌లో కేవలం 49 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్ వాస్తవానికి ఎంసెట్‌ను జూన్‌లోనే నిర్వహించాలని తొలుత భావించారు. అనూహ్యంగా జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేయడంతో ఎంసెట్‌ను ఆలస్యంగా చేపట్టాల్సి వస్తోందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టులో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాతే ఎంసెట్ కౌన్సెలింగ్ చేపట్టడం సరైన నిర్ణయంగా భావించినట్టు చెప్పాయి. ఈ విధానం వల్ల సీట్ల లభ్యతపై స్పష్టత ఉంటుందని, గత ఏడాది కూడా ఇలాగే చేసినట్టు ఎంసెట్ నిర్వహణ విభాగం పేర్కొంది. -
టెన్త్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలి
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు వీలుగా కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. కరోనా వల్ల జరి గిన నష్టాన్ని పూడ్చుకునేందుకు, పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. గురువారం ఆమె డీఈవోలు, వివిధ శాఖల ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రత్యేక తరగతులు నిర్వహించా లని సూచించారు. సిలబస్‌ను 70 శాతానికి పరి మితం చేయడం, పరీక్షా సమయాన్ని పెంచడం, చాయిస్ పెంచడం, ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఎక్కువ ఇవ్వడం వంటి మార్పులపై విద్యార్థులకు అవగా హన కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు–మనబడి, ఇంగ్లిష్ మీడి యం విద్య రాబోయే కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆమె అన్నారు. స్కూళ్ల నిర్మాణం, మరమ్మతుల విషయంలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఇంజనీర్లకు సూచిం చారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఎండి పార్థసారథి పాల్గొన్నారు. -
తెలంగాణలో విద్యాసంస్థల మొదలు అప్పటినుంచేనా..?
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలను ఈనెల 31 నుంచి పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడితే దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని బుధవారం స్పష్టం చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఈనెల 30 వరకూ పొడిగించింది. అయితే దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో విద్యా బోధన కుంటుపడిందన్న వాదన కూడా విన్పిస్తోంది. తాజా పరిస్థితిని గమనిస్తే కోవిడ్ తీవ్రత నెలాఖరుకు క్రమంగా తగ్గుతుందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 31 నుంచి విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌పై అధికారుల నుంచి నివేదిక కోరినట్టు మంత్రి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అయితే, కరోనా తీవ్రత పెరిగితే సెలవులు పొడిగించకతప్పదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఆన్లైన్ క్లాసులపై క్లారిటీ ఇవ్వకపోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించగా, కొద్ది రోజుల కోసం ఎందుకన్నట్టు బదులిచ్చారు. దీన్నిబట్టి పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం బలమైన నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది. పరీక్షల రద్దు ప్రసక్తే లేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పరీక్షల రద్దు, ప్రమోట్ చేయడం వంటివి ఉండబోవని సబిత తేల్చి చెప్పారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని ఆమె అన్నారు. విద్యార్థులు ఇలాంటి ఆశలు పెట్టుకోకుండా వీలైనంత వరకూ పరీక్షల్లో విజయం సాధించేందుకు కష్టపడాలని చెప్పారు. -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈసారికి అంతా పాస్
ధైర్యం కోల్పోవద్దు.. పరీక్షలు ఫెయిలైన విద్యార్థులు ధైర్యంగా మళ్లీ పరీక్షకు సిద్ధం కావాలే తప్ప పాస్ చేయాలని ఒత్తిడి తేవడం, ప్రాణాలు తీసుకోవడం మంచిది కాదు. విద్యార్థి జీవితంలో ఇంటర్ కీలకమైన దశ. దీన్ని కూడా రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు తగదు. ఆన్లైన్ పాఠాలు చెప్పాం కరోనా కాలంలోనూ ఆన్లైన్ విద్యను అందుబాటులోకి తెచ్చాం. దూరదర్శన్, టీశాట్ ద్వారా పాఠాలు చెప్పాం. ఇంటర్ విద్య బలోపేతం ప్రభుత్వ లక్ష్యం. అందుకే 620 గురుకులాలు, 172 కస్తూర్బా కళాశాలలతోపాటు సంక్షేమ పాఠశాలలను ఇంటర్ స్థాయికి పెంచాం. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం. 10 వేల మందికి 95% మార్కులు.. విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు పెట్టాం. ప్రభుత్వ కాలేజీల్లోనే తక్కువ ఫలితాలొచ్చాయనడం సరికాదు. ఆన్లైన్ విద్యపై నిందలేయడం సముచితం కాదు. 10 వేల మంది 95 శాతం మార్కులు తెచ్చుకున్నారు. – మంత్రి సబిత ఇకపై కుదరదు ఇప్పుడే చెబుతున్నాం. ఇక మీదట ఇలా పాస్ చేయడం కుదరదు. ఇప్పట్నుంచే విద్యార్థులు అందరూ కష్టపడి చదవండి. మంచి మార్కులు తెచ్చుకోండి. సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది ఫెయిల్ కావడంపై తలెత్తిన వివాదానికి తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనివల్ల 2,35,230 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మంత్రి సబిత అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికీ ఉంది. అందుకే గ్రేస్ మార్కులపై సమీక్షించాం. ఫెయిల్ అయింది 2.35 లక్షల మంది. 10 మార్కులు కలిపినా 8,076 మందే పాసయ్యేలా ఉన్నారు. 15 కలిపితే 24 వేలు, 20 కలిపితే 58 వేలు, 25 కలిపితే 72 వేలు, 30 మార్కులు కలిపితే 83 వేల మంది పాసవుతారు. అయినా పెద్ద సంఖ్యలో పాసయ్యే అవకాశం లేదు. అందుకే ఉత్తీర్ణతకు కనీస మార్కులైన 35ను ఫెయిలైన వారందరికీ ఇవ్వాలని నిర్ణయించాం’ అని తెలిపారు. విద్యార్థుల మనోవేదనను గుర్తించే పాస్ చేస్తున్నామని, ఇదే వ్యాకులతతో ఉంటే సెకండియర్ దెబ్బతింటుందని భావించి పాస్ చేశామని సబిత చెప్పా. అంతే తప్ప ఎవరో ఆందోళనలు చేశారని మాత్రం కాదన్నారు. వద్దనుకుంటే సొమ్ము వెనక్కి..: రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వాటిని వద్దనుకుంటే చెల్లించిన సొమ్మును తిరిగిస్తామని మంత్రి సబిత చెప్పారు. ఒకవేళ కావాలనుకుంటే ఎవరైనా రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ చేయించుకోవచ్చని, అప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వబోమన్నారు. విద్యార్థులు తమ ఐచ్ఛికాన్ని ఇంటర్ బోర్డుకు తెలియజేయవచ్చన్నారు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు లేకుండా అందరినీ పాస్ చేశామని, ఇంటర్ సెకండియర్‌లో విద్యార్థులు వారి సామర్థ్యాలను మెరుగుపరుచుకొనేందుకే ఫస్టియర్ పరీక్షలు పెట్టామని సబిత తెలిపారు. కానీ 51 శాతం విద్యార్థులు ఫెయిల్ కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవడం విచారకరమన్నారు. దీన్ని అడ్డుపెట్టుకొని కొన్ని రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు స్వార్థ ప్రయోజనాలకు ఆందోళనలు చేపట్టడం న్యాయం కాదన్నారు. విలేకరుల సమావేశంలో ఇంటర్ విద్య అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. -
విజయ మెగా డెయిరీ లక్ష్యం.. 8 లక్షల లీటర్లు
తుక్కుగూడ: పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. కులవృత్తులకు చేయూత ఇచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన విజయ తెలంగాణ మెగా డెయిరీ నిర్మాణ పనులకు మంత్రి సబితారెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నామని తలసాని చెప్పారు. దీన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. గతంలో ఈ డెయిరీ ద్వారా రోజూ లక్ష లీటర్ల పాలను మాత్రమే సేకరించేవారని, ప్రస్తుతం 4 లక్షల లీటర్లకు పెరిగిందని చెప్పారు. మెగా డెయిరీ పూర్తయితే రోజుకు 8 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విజయ డెయిరీకి 2014లో రూ.300 కోట్ల ఆదాయం ఉండగా.. ఇప్పుడు రూ.750 కోట్లకు పెరిగిందన్నారు. విజయ డెయిరీ దేశంలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. 15 రోజుల్లో బీమా పరిహారం చెల్లిస్తాం పాడి రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రతి లీటర్‌పై రూ.4 బోనస్ ప్రకటించారని తలసాని గుర్తు చేశారు. బోనస్‌రాని రైతులకు తమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో చెల్లిస్తామన్నారు. మంత్రి సబితారెడ్డి సూచన మేరకు రంగారెడ్డి జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టి రైతులకు సబ్సిడీపై పశువులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. బీమా ఉండి మరణించిన పశువులు, గేదెలకు 15 రోజుల్లో పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ‘విజయ డెయిరీ కేవలం పాల ఉత్పత్తులే కాకుండా నెయ్యి, పెరుగు, బటర్ మిల్క్, లస్సీ, ఫ్లేవర్డ్ మిల్క్ ఇలా 28 రకాలను ఉత్పత్తి చేస్తోంది. ఇవి తెలంగాణలోనే కాకుండా ఏపీ, ఢిల్లీ, ముంబైలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఏడాది పొడవునా రైతుల నుంచి పాలను సేకరిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 200 అవుట్లెట్లు, 600 పార్లర్లు ఉన్నాయి. రాష్ట్రంలో 2 లక్షల 13 వేల మంది రైతులు సహకార సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గొల్లకుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రూ.11 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేశాం’అని తలసాని చెప్పారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. రావిర్యాలలో మెగా డెయిరీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీని ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుం దని చెప్పారు. ప్రైవేట్ రంగానికి దీటుగా విజయ డెయిరీ పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ: పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. కరోనా కారణంగా ఈసారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫలితాల కోసం bsetelangana.org ను సంప్రదించండి. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించినట్లు మంత్రి సబిత తెలిపారు. పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు వెల్లడించారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని వివరించారు. ఉత్తీర్ణత సాధించిన వారు బాలురు 2,62,917 బాలికలు 2,53,661 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు 2,10,647 10/10 జీపీఏ సాధించిన పాఠశాలలు 535 పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని మంత్రి సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్సెస్సీ బోర్డుకు పంపాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్‌లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. ఆయా సబ్జెక్టులకు ఎఫ్ఏ–1లో నిర్దేశిత 20 శాతం మార్కుల ప్రకారం ప్రతి విద్యార్థి వాటిల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చింది. ఎఫ్ఏ–1 పరీక్షలకు 5.21 లక్షలమంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించిన విద్యాశాఖ వారికి ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఐదింతలు చేసి (20 శాతాన్ని 100 శాతానికి పెంచి) గ్రేడ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కుల ప్రకారం గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ)ను ప్రకటించింది. 2.2 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. -
ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుందా.. ఉండదా?
సాక్షి, హైదరాబాద్: లక్షల మంది నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామకాలు రాష్ట్రంలో ఇప్పట్లో జరిగేనా? అంటే స్పష్టమైన సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించిన 50 వేల ఉద్యోగాల్లో 10 వేల వరకు టీచర్ పోస్టులున్నాయి. అయితే వాటి భర్తీ విధానమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను నాలుగేళ్లుగా నిర్వహించకుండా, ఉపాధ్యాయ నియామకాలను పట్టించుకోకుండా పక్కన పడేసిన విద్యాశాఖ.. ఇప్పుడు టెట్ నిర్వహిస్తుందా.. లేదా? అన్నది గందరగోళంగా మారింది. ఓవైపు ఒకే పరీక్ష ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెబుతూనే మరోవైపు టెట్ నిర్వహిస్తామని సమాధానమిస్తోంది. దీంతో టెట్ పరిస్థితేంటి? టీచర్ల నియామకాలు ఎలా చేపడతారన్న దానిపై గందరగోళం నెలకొంది. మంత్రిది ఓ మాట.. విద్యాశాఖది మరో మాట టెట్, టీఆర్టీల విషయంలో ప్రభుత్వ వర్గాల నుంచే భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ నియామకాలను పాత పద్ధతిలో ఒకే పరీక్ష ద్వారా చేపడతామని అసెంబ్లీలోనే వెల్లడించారు. అంటే టెట్ ఉండదా? లేదంటే టెట్‌ను కలుపుకొని టెట్ కమ్ టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు) నిర్వహిస్తారా అన్న స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయాన్ని మంత్రి ప్రకటించి 15 రోజులు గడిచినా దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని గవర్నింగ్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దానిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ రాష్ట్రంలో టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు టెట్ వ్యాలిడిటీ విషయంలో ఎన్సీటీఈ తుది నిర్ణయం తీసుకున్నాక రాష్ట్రంలో టెట్ నిర్వహిస్తామని విద్యా శాఖ వెల్లడించింది. ఈ లెక్కన టెట్ ఉంటుందా.. ఉండదా? లేదంటే టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. టెట్ లేదా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే.. రాష్ట్రంలో 2017లో టెట్ నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ టెట్ నిర్వహించలేదు. దీంతో గతంలో టెట్‌లో అర్హత సాధించినా, ఆ తర్వాత ఏడేళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన వారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. ఈ నాలుగేళ్లలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసుకొని టెట్ రాసేందుకు ఎదురుచూస్తున్న వారు మరో 2 లక్షల మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం టెట్ కమ్ టీఆర్టీని నిర్వహించే అంశంపై ఆలోచనలు చేస్తోంది. అది నిర్వహిస్తే పాత టెట్లలో అర్హత సాధించి ఇప్పటికీ వ్యాలిడిటీ కలిగిన 3 లక్షల మంది విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలక అంశం. మరోవైపు పాత టెట్లలో అర్హత సాధించి ఏడేళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన మరో 3 లక్షల మంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదీ ప్రధానమే. వ్యాలిడిటీ కోల్పోయిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకుని విధానపర నిర్ణయం ప్రకటిస్తామని ఎన్సీటీఈ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. ఏపీలో నిర్వహించినా.. ఆంధ్రప్రదేశ్‌లో టెట్ కమ్ టీఆర్టీ కలిపి నిర్వహించారు. అయితే ఆ నియామకాల్లో గతంలో టెట్‌లో అర్హత సాధించిన వారి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. టెట్ కమ్ టీఆర్టీలో భాగంగా 50 మార్కులకు నిర్వహించిన టెట్‌కు సంబంధించిన పార్ట్–ఏలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని, లేదంటే పాత టెట్‌లో ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేపట్టారు. ఇక గతంలో టెట్‌లో అర్హ్హత సాధించని వారి విషయంలో మాత్రం టెట్ కమ్ టీఆర్టీలోని పార్ట్–ఏలో అర్హత సాధిస్తే టీఆర్టీకి సంబంధించిన పేపరును మూల్యాంకనం చేసి నియాకమల్లో పరిగణనలోకి తీసుకున్నారు. దీనివల్ల కొంత గందరగోళం నెలకొంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలన్నా టెట్‌లో అర్హత సాధించి ఉండాలని ఎన్సీటీఈ స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే ప్రైవేటు టీచర్లకు టెట్ ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు జాతీయ స్థాయిలో రెండూ కలిపి నిర్వహించిన సందర్భమూ లేదు. ఈ గందరగోళం నేపథ్యంలో టెట్‌ను వేరుగానే నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం గత నెల 17న జీవో 23ని జారీ చేసింది. సెంట్రల్ స్కూళ్లకు టెట్ తప్పనిసరి జాతీయ స్థాయిలో కేంద్రం ఏటా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (సీటెట్) నిర్వహిస్తోంది. అందులో అర్హత సాధించిన వారిని మాత్రమే సీబీఎస్ఈ స్కూళ్లు, ఇతర కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో ఇంతవరకు టెట్‌ను, ఉపాధ్యాయ నియామక పరీక్షను కలిపి నిర్వహించే ఆలోచన చేయలేదు. రెండింటినీ వేర్వేరుగానే చూస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఉపాధ్యాయ నియామకాలు ఎప్పుడు చేపడుతుందో వేచి చూడాల్సిందే. వివాదాల్లోకి వెళ్లొద్దు.. టెట్ నిర్వహించాలి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగంగా జరగాలంటే ప్రభుత్వం వివాదాల్లోకి వెళ్లొద్దు. వెంటనే టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆ పరీక్ష అయిన 15 రోజుల్లో టీఆర్టీ పరీక్ష నిర్వహించినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించే వీలున్నా వివాదాలు చుట్టుముట్టే ఆస్కారం ఉంది. 2017 వరకు నిర్వహించిన టెట్లలో అర్హత సాధించిన వారి విషయంలో వెయిటేజీ ఇవ్వడం, లేదా పాత, కొత్త టెట్లలో ఎందులో ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదీ సమస్యాత్మకమే. మరోవైపు ప్రైవేటు టీచర్‌గా పని చేయాలన్నా టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే. కాబట్టి వారికోసం టెట్‌ను నిర్వహించక తప్పదు. ఇలాంటప్పుడు సులభ విధానాన్నే ప్రభుత్వం ఎంచుకుంటే సమస్య ఉండదు. - పి.శంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యా విభాగం సామర్థ్యాలను నిర్ణయించేదెలా? రెండున్నర గంటల్లో టెట్ కమ్ టీఆర్టీ పరీక్ష నిర్వహించి 30 ఏళ్ల పాటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడి సామర్థ్యాలను నిర్ణయించడం సాధ్యమా? టెట్ వేరు. టీఆర్టీ వేరు. ఉపాధ్యాయుడు కావాల్సిన అర్హతలు ఉన్నాయా? లేదా? నిర్ణయించేందుకు నిర్వహించేది టెట్. ఉపాధ్యాయులుగా నియమించేందుకు నిర్వహించేది టీఆర్టీ. అలాంటప్పుడు రెండింటినీ కలిపి ఎలా నిర్వహిస్తారు. కోచింగ్ తీసుకొని, బిట్స్ బట్టీ పట్టి వచ్చే వారికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి వారు విద్యార్థులను ఎలా తీర్చిదిద్దుతారు. అందుకే టెట్ వేరుగానే ఉండాలి. నియామక పరీక్షను కఠినతరం చేయాలి. డిస్క్రిప్టివ్ విధానం ఉండాలి. క్లాస్‌రూం డెమాన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూ పద్ధతిలో టీచర్లను నియమించాలి. అప్పుడే వారికి సామర్థ్యాలు ఉన్నాయా.. లేదా? తెలుస్తాయి. - ఉపేందర్‌రెడ్డి, ఎస్సీఈఆర్టీ రిటైర్డ్ ప్రొఫెసర్ చదవండి: ఆదమరిస్తే అంతే! -
వారంలో ఇంటర్ సిలబస్, పరీక్షల షెడ్యూలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్ష తేదీలు, ప్రాక్టికల్స్‌కు సంబంధించిన అంశాలపై వారం రోజుల్లో స్పష్టత ఇస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా ఎంసెట్ పరీక్ష సిలబస్ ఉం టుందని, ఈ విషయంలో మరింతగా చర్చించి స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధులతో మంగళవారం మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రతి విద్యా సంస్థ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలలను ప్రారంభించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రైవేటు విద్యా సంస్థలు సహకారం అందించాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యాకమిషనర్ దేవసేన పాల్గొన్నారు. 14 డిమాండ్లు పరిష్కరించండి కాగా, పాఠశాలలు, కాలేజీలకు సంబంధించి యాజమాన్యాలు ఎదుర్కొంటున్న 14 అంశాలను, సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు యాజమాన్యాలు మంత్రిని కోరాయి. ఫీజలు రాక ఏడాది నుంచి విద్యా సంస్థల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొన్నాయి. జూన్ వరకు విద్యా సంవత్సరం కొనసాగించాలని, కనీస హాజరు ఉండేలా నిబంధనను విధించాలని కోరాయి. అన్ని తరగతులను కూడా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నాయి. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు
-
జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు జూన్ రెండోవారంలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే పేపర్ కోడింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షా పేపర్లు వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందన్నారు. మంత్రి సబితా గురువారమిక్కడ మాట్లాడుతూ గతంలో 12 వాల్యుయేషన్ సెంటర్లు ఉంటే ఇప్పుడు 33 కేంద్రాలకు పెంచామన్నారు. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇక ప్రయివేట్ స్కూల్స్ గత ఏడాది ఫీజులే ఈ విద్యా సంవత్సరంలోనూ వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అధిక ఫీజలు వసూలు చేస్తున్న స్కూళ్లపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. (జూన్‌లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్!) -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. పరీక్షలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మెరుగైన పద్ధతులను అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 8:45 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, దానికి నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా 040–24601010, 040–24732369, 040–24655027 నెంబర్లలో సంప్రదించాలని, నోడల్ అధికారి పరిష్కరిస్తారన్నారు. పరీక్షల నిర్వహణ సజావుగా సాగేందుకు జిల్లా కలెక్టర్లు తగిన శ్రద్ధ వహించాలని ఆదేశించారు. çపరీక్షా కేంద్రాలన్నింటిలోనూ కనీస సౌకర్యాలు కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు. 20లోగా నివేదిక ఇవ్వండి జిల్లాల్లో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై చెక్ లిస్టు ప్రకారం ఈనెల 20లోగా నివేదికలు అందజేయాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ కోరారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలకు సరైన భద్రత కల్పించే విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎస్పీలు పర్యవేక్షించాలన్నారు. 9,65,840 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ ప రీక్షలకు 1,339 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో 50 ప్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్లు, 24,750 మం ది ఇన్విజిలేటర్లు పాల్గొంటారన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటర్మీడియెట్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. -
అడవిలోని అనుభూతి కలిగించే జంగల్ క్యాంపు
మహేశ్వరం: నగరవాసులకు మానసికోల్లాసంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం జంగల్ క్యాంపులో లభిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం మండలం హర్షగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మజీద్‌గడ్డ రిజర్వు ఫారెస్టులో 450 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.34 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ‘జంగల్ క్యాంపు’ను ఇంద్రకరణ్‌రెడ్డి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంగల్ పార్కులో వినోదంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నారు. ఇక్కడ అడ్వెంచర్ క్యాంపు థీమ్‌తో సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. నగరవాసులు కుటుంబంతో వచ్చి రోజంతా గడిపేందుకు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలియజేశారు. జంగల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జంగల్ క్యాంపు ప్రత్యేకతలు ఫైర్ (చలికి కాచుకునే ప్రదేశం) క్యాంపును పరిశీలిస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, అధికారులు నగర ఉద్యాన యోజన, కంపా, అటవీశాఖ నిధులతో జంగల్ క్యాంపును అభివృద్ధి చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలియజేశారు. ప్రధానంగా అడ్వెంచర్ జోన్, జంగల్ క్యాంపు సెక్టార్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాకింగ్, రన్నింగ్ సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు క్యాంపింగ్ సౌకర్యాలు, సాహస క్రీడలు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఆటస్థలం, గజీబోలు, మల్టీపర్పస్ షెడ్స్, కుటుంబంతో గడిపేందుకు పిక్నిక్ స్పాట్లు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పార్కులో వంట చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా స్థలాలు ఉన్నాయన్నారు. సందర్శకుల రక్షణ చర్యలో భాగంగా క్యాంపింగ్ ఏరియా చుట్టూ చైన్‌లింక్డ్ ఫెన్సింగ్, పాములు చొరబడకుండా ప్రూఫ్ ట్రెంచ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ పార్కులో ఉన్న రోడ్లకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ అటవీవీరుల పేర్లను పెట్టి వారి త్యాగాలకు స్మరించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. నగరవాసులకు వరం హైదరాబాద్ శివారులో మంచి వాతావరణం కల్పించేందుకు జంగల్ క్యాంపు పార్కును ఏర్పాటు చేశామని, ఈ పార్కు నగరవాసులకు వరంగా మారిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇతర నగరాల మాదిరిగా హైదరాబాద్ కాంక్రీట్ జంగల్‌గా మారొద్దనే ఉద్దేశంతో అర్బన్ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో జంగల్ క్యాంపును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మరిన్ని అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అంతకు ముందు మంత్రులు జంగల్ క్యాంపును ప్రారంభించి, అడ్వెంచర్ జోన్‌ను పరిశీలించారు. అనంతరం సాహస క్రీడలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కలెక్టర్ హరీష్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి శోభ, జిల్లా అటవీశాఖ అధికారి భీమ, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, డివిజనల్ ఫారెస్టు అధికారి శివయ్య, మంఖాల్ ఫారెస్టు రేంజ్ అధికారి విక్రంచంద్ర తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలి: మంత్రి
సాక్షి, రంగారెడ్డి: ‘ప్రాజెక్టులు పూర్తికావాలి.. బీడు భూముల్లో నీళ్లు పారి జిల్లా సస్యశ్యామలం కావాలి. పుష్కలంగా పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలి. ఇదే మా లక్ష్యం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి జిల్లా వాసుల కలను నెరవేరుస్తాం’ అని విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్‌పై తనకు కొండంత విశ్వాసం ఉందని, కాళేశ్వరం స్ఫూర్తితో పాలమూరు–రంగారెడ్డిని కూడా పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రాతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణాన్ని మూడేళ్ల వ్యవధిలోనే పూర్తిచేశారని.. ఇదే తరహాలో ఇక్కడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తారని అన్నారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సబిత మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషిచేస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరుస్తామన్నారు. బడుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కష్టంగా మారిందని, ఈ సమస్య పరిష్కారానికి ప్రముఖ కంపెనీలు, సంస్థలను సంప్రదించి వాటి సహకారం తీసుకుంటామన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద నిధులను పాఠశాలల కోసం ఖర్చుచేసేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌లు కూడా దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. అంతేగాక రియల్టర్లు, బిల్డర్లు కొన్ని పాఠశాలలను దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఎంతో కొంత చేయాలన్న దృక్పథం ప్రతిఒక్కరిలో ఉండాలన్నారు. త్వరలో సమీక్ష.. జిల్లాలో ప్రభుత్వ విభాగాల వారీగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తామని పేర్కొన్న మంత్రి.. వాటిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు. అన్ని విభాగాల అధికారులతోపాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమీక్షకు హాజరయ్యేలా చూస్తానని అన్నారు. వీటిపైనా దృష్టి.. మ్యుచువల్లీ ఎయిడెడ్ ట్రిప్‌టైన్డ్ కోఆపరేటివ్ సొసైటీ (ఎంఏటీసీఎస్) బ్యాంకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరలో పరిష్కారం చేస్తానని చెప్పారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అధికంగా ఉన్నాయని, ఇక్కడికి ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి కంపెనీలో స్థానికులకు 20 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాల్సిందేనన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన జీఓ స్పష్టం చేస్తున్నా.. కొన్ని కంపెనీలు పాటించడం లేదన్నారు. జీఓ ప్రకారం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూస్తానని పేర్కొన్నారు. అనంతగిరిని తీర్చిదిద్దుతాం ఎత్తయిన గుట్టలు, పచ్చని చెట్లతో అలరారే అనంతగిరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ విషయమై సీఎంతో ప్రత్యేకంగా మాట్లాడి కార్యరూపం దాల్చేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువులో ఇంతటి సుందరమైన ప్రాంతం మరోటి లేదన్నారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు కృషిచేస్తామని సబిత అన్నారు. విస్తరణపై తాజాగా ఓ వ్యక్తి కేసు వేశారని, ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. తాండూరు ప్రాంతంలో కంది బోర్డు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని, దానిని సాధిచేందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సహకారం తీసుకుంటామని ఆమె చెప్పారు. -
మూడోసారి మంత్రిగా.. సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, రంగారెడ్డి: తాండూరు ఆడపడచు, సీనియర్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి ముచ్చటగా మూడోసారి అమాత్యపదవిని దక్కించుకున్నారు. సీఎం కేసీఆర్ ఆమెకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఆదివారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో సబితకు చోటు లభించింది. మూడోసారి మహిళా మంత్రిగా పదవిని అలంకరించిన ఆమె ఇప్పటికే తనదైన ముద్రవేశారు. సీఎం కేసీఆర్ సబితకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించగా.. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌కు దూరమై అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరిన ఆమె స్వల్పకాలంలోనే ప్రభుత్వంలో కీలక పదవిని దక్కించుకోవడం విశేషం. గతంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన సబితమ్మకు తాజాగా మరోసారి ఆ యోగం లభించింది. జిల్లాకు చెందిన పలువులు ఆయా పార్టీల నుంచి మంత్రులుగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ... మూడు పర్యాయాలు మంత్రిగా పనిచేసే అవకాశం కొందరికే లభించింది. ఈ జాబితాలో చేవెళ్ల చెల్లమ్మ ఒకరు. మలుపు తిప్పిన నిర్ణయం.. టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన జిల్లా కాంగ్రెస్‌ను శాసిస్తున్నారని, పార్టీ అధిష్టానం కూడా ఆయనకే ప్రాధాన్యం ఇచ్చిందని సబితా ఇంద్రారెడ్డి మనస్తాపం చెందారు. మరోపక్క పార్టీలో తనకు రోజురోజుకూ గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ టికెట్‌ను తన కుమారుడు కార్తీక్‌రెడ్డి ఆశించగా అది సాధ్యపడలేదు. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు ఆమెను దూరం చేయగా.. టీఆర్ఎస్కు చేరువ చేశాయి. ఈ క్రమంలో సబిత తన కుటుంబంతో కలిసి కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి కార్తీక్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌కు భరోసా, సబితకు భవిష్యత్‌లో మంత్రి పదవిగా అవకాశం కల్పిచేందుకు హామీ ఇచ్చినట్లు అప్పట్లో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్ఎస్ఎల్పీలో విలీనమవగా ఆ పార్టీలోని ఎమ్మెల్యేల్లో సబిత ఒకరు. ఇలా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆరు నెలల్లోపే ఆమెకు అమాత్యయోగం లభించింది. అభివృద్ధికి అవకాశం మంత్రివర్గ విస్తరణలో సబిత రూపంలో మరోసారి ఉమ్మడి జిల్లాకు ప్రాతినిథ్యం దక్కడం శుభపరిణామం. ఇప్పటికే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2004లో తొలిసారిగా వైఎస్సార్ హయాంలో సబిత గనులశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రాగానే హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. రెండు దఫాలుగా విజయవంతంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. అందరినీ ఆప్యాయంగా పలకరించే సబితమ్మకు మరోసారి పదవి రావడం పట్ల జిల్లా నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. సస్యశ్యామలం చేస్తా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు సస్యశ్యామలం చేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్ నమ్మకంతో నాకిచ్చిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తా. మంత్రిగా అవకాశమిచ్చిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా పనిచేసేందుకు అవకాశం రావడం నా అదృష్టం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరలో పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తాం. కృష్ణానీటితో జిల్లాలోని పంటపొలాలను పారించి అన్నదాతలకు మేలు చేస్తా. విద్యాశాఖను పటిష్టం చేయడంతోపాటు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తా. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన నాణ్యమైన విద్యను అందజేసేలా చర్యలు తీసుకుంటా’నని పేర్కొన్నారు. ప్రొఫైల్ పేరు: పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి భర్త: పట్లోళ్ల ఇంద్రారెడ్డి సంతానం: ముగ్గురు కుమారులు పుట్టిన తేదీ: 05–05–1963 చదువు: బీఎస్సీ గతంలో నిర్వహించిన పదవులు: గనులు, హోంశాఖ మంత్రిగా పనిచేశారు. చేవెళ్ల నుంచి ప్రస్థానం చేవెళ్ల/మహేశ్వరం: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చేవెళ్ల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి భార్యాభర్తలు పట్లోళ్ల ఇంద్రారెడ్డి, సబితారెడ్డి రాష్ట్ర హోంమంత్రులుగా పనిచేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వీరిది చేవెళ్ల మండలం కౌకుంట్ల స్వగ్రామం. స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి 1980లో రాజకీయాల్లోకి వచ్చారు. కౌకుంట్ల సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 1984లో జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల అసెంబ్లీ నుంచి పోటీచేసి ఓటమిచెందారు. అనంతరం 1985లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఘన విజయం సాధించారు. వరుసగా 1989, 1994, 2000 సంవత్సరంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోవటం తదితరాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు సీఎంగా పదవి చేపట్టారు. దీంతో ఇంద్రారెడ్డి సైతం తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇంద్రారెడ్డి కార్మిక, ఉపాధిశాఖ మంత్రిగా, హోంశాఖమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగుసార్లు గెలిచిన సబితారెడ్డి ఇంద్రారెడ్డి 2000 సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయన రాజకీయ వారసురాలిగా సబితారెడ్డి కొన్నిరోజుల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి అఖండ విజయం సాధించారు. ఆ తరువాత 2004లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో వైఎస్సాఆర్ మంత్రి వర్గంలో మొదటిసారిగా భూగర్భ గనుల, జలవనరుల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో (డీ లిమిటేషన్) చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్ అయింది. దీంతో ఆమె నియోజకవర్గం మారాల్సి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సూచన మేరకు జిల్లాలోని మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. దీంతో వైఎస్సాఆర్ రాష్ట్ర హోంమంత్రిగా కీలకమైన పదవిని కట్టబెట్టారు. దీంతో ఆమె రాష్ట్రంతోపాటు దేశ చరిత్రలో మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా భార్యాభర్తలు పి.ఇంద్రారెడ్డి, సబితారెడ్డి హోంమంత్రులుగా పదవిని అలంకరించి సరికొత్త చరిత్ర లిఖించారు. వైఎస్సార్ అప్పట్లో ప్రతి సంక్షేమ పథకాన్ని చేవెళ్ల నుంచి ప్రారంభించారు. చేవెళ్లను ఆయన సెంటిమెంట్‌గా భావించారు. 2014 ఎన్నికల్లో సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేశారు. కుటుంబంలో ఒక్కరికే అవకాశం అని అధిష్టానం సూచించడంతో ఆమె మిన్నకుండిపోయారు. 2018లో మళ్లీ మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన విజయం సాధించారు. ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ ఆమెకు విద్యాశాఖ అప్పగించారు. -
రాఖీ పండుగ వచ్చిందంటే.. రాజన్నే గుర్తొస్తడు
సాక్షి, మహేశ్వరం: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని చాటేది రాఖీ పండుగ. అన్ని పండుగలకంటే రాఖీ నాకు ఎంతో ఇష్టం. దివంగత నేత, అన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ప్రతి రాఖీ పండుగకు ఇంటికి వెళ్లి మొదటి రాఖీ నేనే కట్టేదానిని. నాకు ఒక తమ్ముడు నర్సింహారెడ్డి ఉన్నాడు. రాజశేఖరరెడ్డి అన్నయ్యకు రాఖీ కట్టిన తర్వాతే మా తమ్ముడికి కట్టేదానిని. రాజన్న కూడా నన్ను సొంత చెల్లెలుగా చూసుకునేవారు. రాఖీ పండుగ వచ్చిందంటే రాజశేఖరరెడ్డి అన్నే గుర్తొస్తడు. నేను చదువుకునే రోజుల్లో రాఖీ పండుగ రోజున మా తమ్ముడికి రాఖీని పోస్టులో పంపించేదాన్ని. ఇప్పుడు రాఖీ పండుగ రోజున మా తమ్ముడి ఇంటికి వెళ్తున్నానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. -
సబిత పార్టీ వీడినా నష్టమేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడి వెళ్లినా నష్టమేమీ లేదని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు, అధికారాన్ని ఏళ్ల పాటు అనుభవించి ఇప్పుడు ఆమె పార్టీని ఎందుకు వీడి వెళ్లాల్సి వచ్చిందో పార్టీ కార్యకర్తలు, ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్), టి.రామ్మోహన్‌రెడ్డి (టీఆర్ఆర్), ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, అధికార ప్రతినిధి మురళీకృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడి వెళ్లినా కార్యకర్తలు, నేతలెవరూ అధైర్యపడాల్సిన పనిలేదని చెప్పారు. కార్యకర్తల వెంట తాముంటామని, పార్టీని బతికించుకుంటామని వెల్లడించారు. సబితా కుటుంబంతో పాటు టీఆర్ఎస్లో చేరాలని కొందరు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను బెదిరిస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు ఎవరూ భయపడొద్దన్నారు. చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే రాహుల్ కేబినెట్లో ఆయన కేంద్రమంత్రి అవుతారని, అప్పుడు తమ ప్రాంత సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న కేసీఆర్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వారు ఆరోపించారు. -
కారెక్కనున్న సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కురాలు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. తనకు మంత్రి పదవితోపాటు కుమారుడు కార్తీక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు టీఆర్ఎస్ నుంచి భరోసా లభించడంతో ఆమె కాంగ్రెస్‌ను వీడనున్నారు. సబిత బుధవారం తన రాజకీయ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉంది. బుధ లేదా గురువారాల్లో కాంగ్రెస్‌కి రాజీనామా చేసే అవకాశముంది. కేసీఆర్ సమక్షంలో సబిత, కార్తీక్ గులాబీ కండువా వేసుకోనున్నారు. ఫలించని బుజ్జగింపులు... కాంగ్రెస్‌లోనే కొనసాగాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా బుజ్జగించే ప్రయత్నం చేసినా తన ఆలోచనను సబిత మార్చుకోలేదు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి తదితరులు ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి నచ్చజెప్పేందుకు యత్నించినా వెనక్కి తగ్గకపోవడం తో మంగళవారం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని సబిత ఇంటికెళ్లిన రేవంత్.. కాంగ్రెస్‌ను వీడాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని సబిత ను కోరారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారని సాయంత్రం వరకు ప్రచారం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే సాయంత్రానికి మళ్లీ సీన్ మారింది. రేవంత్ తనను కలిసిన సమయంలోనే తాను పార్టీని వీడనున్నట్లు ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ఉత్తమ్ వ్యవహార శైలితోపాటు జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో సబిత, కార్తీక్ తీవ్ర కలత చెందినట్లు తెలిసింది. దీంతోపాటు టీఆర్ఎస్ నుంచి ఆమెకు మంత్రి పదవి, కుమారుడికి రాజకీయ భవిష్యత్తుపై కేసీఆర్, కేటీఆర్, కవితల నుంచి భరోసా లభించడంతో చివరకు పార్టీ మారాలనే నిర్ణయించుకున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని తన అనుచరులు, పార్టీ సీనియర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన సబిత, కార్తీక్రెడ్డిలు ఇదే విషయాన్ని వారికి చెప్పారు. -
కాంగ్రెస్‌లోనే ఉంటాం
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో తాము చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఖండించారు. టీఆర్ఎస్లో చేరట్లేదని, చేరే ఉద్దేశం కూడా తమకు లేదని స్పష్టం చేశారు. అరడజను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోందంటూ శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది తమ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారని టీఆర్ఎస్ నేతలు పదేపదే వ్యాఖ్యానించడం, దానికి తగ్గట్టే కొందరి పేర్లు ప్రచారంలోకి రావడం తెలిసిందే. అయితే తాము ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను వీడటం లేదని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, పోదెం వీరయ్య స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఇలాంటి వార్తలు కేడర్‌ను అయోమయానికి గురి చేస్తాయని సబితారెడ్డి అన్నారు. తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. ‘నేను మొదటి నుంచి కాంగ్రెస్‌వాదిని. 1986లో కార్పొరేటర్ అయిన నాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఏ పరిస్థితుల్లోనూ నేను కాంగ్రెస్‌ను వీడను.. టీఆర్ఎస్లో చేరను’ అని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెప్పారు. మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘నేను కాంగ్రెస్‌ను వీడను. ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు మీడియా ముందు వెల్లడించాను. అయినా ఇంకా అలాంటి వార్తలే రావడం తీవ్ర బాధ కలిగించింది. అసలు ఇలాంటి ప్రచారం చేసేవారిని ఏమనాలో అర్థం కావట్లేదు’ అని పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను మొదటి నుంచీ కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్నానని, విలువలతో కూడిన రాజకీయాలే తనకు ప్రాణమని భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పేర్కొన్నారు. -
మోదీకి భయపడుతున్న కేసీఆర్
-
మోదీకి భయపడుతున్న కేసీఆర్
► కేంద్ర మాజీ మంత్రి సర్వే ► కేంద్ర నిధులపై శ్వేతపత్రం ప్రకటించాలి: సబిత సాక్షి, హైదరాబాద్:టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈడీ, సీబీఐ కేసులకు భయపడే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించడంలేదని ఆరోపించారు.శుక్రవారం ఇక్కడ గాంధీభవన్‌లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వంశీ చంద్‌రెడ్డి, టీపీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి వేర్వేరుగా విలేకరులతో మా ట్లాడారు. సీబీఐ, ఈడీ కేసులవల్లే ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ భయపడిపోతున్నారని సర్వే అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన తెలంగాణలో తుస్సుమన్నదన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు చీమూ నెత్తురుంటే అమిత్ షాను తిట్టిన కేసీఆర్‌ను ప్రతిఘటించాలన్నారు. బీజేపీపై కేసీఆర్ చేసిన విమర్శలు నిజమే అయితే, ఈడీ, సీబీఐ కేసుల భయమే కేసీఆర్‌కు లేకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా ఉంటారా అని ప్రశ్నించారు. హైకోర్టు విభజన, బయ్యారం ఉక్కు ఫాక్టరీ, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటివాటిపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. టీఆర్ఎస్ని చీల్చుతారనే భయంతోనే మోదీ ని కేసీఆర్ నిలదీయడంలేదని అన్నారు. కేంద్రం లక్ష కోట్లు ఇచ్చామని చెబుతుంటే, కేసీఆర్ ఇవ్వలేదంటున్నారని,వాస్తవాలేమిటో ప్రజల ముందుంచడానికి శ్వేతపత్రం విడుదల చేయాలని సబిత డిమాండ్ చేశారు. ఆదాయంలో రాష్ట్రం నంబర్ వన్ అంటున్న సీఎం ఎందుకు అప్పులు చేస్తున్నారో, ఆదా యాన్ని ఏంచేస్తున్నారో చెప్పాలన్నారు. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసి జాతీయహోదా రాకుండా కేసీఆర్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి బలమే లేదని, రాష్ట్రంలో ఎప్పుడూ జీరోయేనని వ్యాఖ్యానించారు. నిధుల మళ్లింపు ఆర్థికనేరమే... ప్రజల సొమ్మును వాడుకోవడం, నిధులను మళ్లించడం ద్వారా సీఎం కేసీఆర్ ఆర్థిక నేరానికి పాల్పడుతున్నారని కోదండరెడ్డి విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై అమిత్‌షా, కేసీఆర్ తలోమాట మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి, ఎన్ని నిధులను ఇచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం వాటిని దేనికోసం ఖర్చు చేసిందో వివరించాలని డిమాండ్ చేశారు. -
ఈ ఎన్నికలు ప్రభుత్వానికి గుణపాఠం కావాలి
► ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నా టీఆర్ఎస్ అధికార దాహం తీరడం లేదు ► ప్రభుత్వ పాఠశాలల మూసివేతను సమర్థ్ధిస్తూ గురుకులాలకు తెరలేపింది ► మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: విద్యారంగం, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఓటర్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకతీతంగా జరగాల్సిన ఎన్నికలను ప్రభుత్వం కలుషితం చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ‘ఒకే ఇంట్లో ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ పదవులు ఉన్నా..ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్నా ఇంకా అధికారదాహం తీరకపోవడం దారుణం. ఆఖరికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను కూడాపార్టీ అభ్యర్థులుగా ప్రకటించుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనం’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతను సమర్థిస్తూ గురుకులాలకు తెరలేపిందని, ప్రవేశ పరీక్ష ద్వారా తెలివైన పిల్లలను ఎంపిక చేసుకొని ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టు పట్టిస్తోందని అన్నారు. సరైన వసతులు కల్పించకుండా, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా సర్కారు బడులను కేసీఆర్ సర్కారు నిర్వీర్యం చేసిందన్నారు. దీనికి బాధ్యులుగా టీచర్లను చిత్రీకరిస్తోందని సబిత అన్నారు. 610 జీఓకు విరుద్ధంగా జరుగుతున్న బదిలీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.రెండున్నరేళ్లవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటికీ పీఆర్సీ బకాయిలు ఇవ్వకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. ఈ నెల 9న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘లొంగిపోయే గొంతుకు గాకుండా...ప్రశి్నంచే వ్యక్తిని’ ఎన్నుకోవాలని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. -
జీవో 111ను సమీక్షించాల్సిందే: సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని రెండు చెరువుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన జీవో 111 వల్ల రైతులు ఇబ్బందులు పడుతు న్నారని, దాన్ని పునర్‌సమీక్షించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గాంధీ భవన్లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ..శాస్త్రీయఅధ్యయనం చేయకుండా 1996 లో చంద్రబాబు సీఎంగా ఉన్నçప్పుడు ఈ జీవో తెచ్చారన్నారు. జాతీయగ్రీన్ ట్రిబ్యున ల్, హైకోర్టులు కూడా జీవోను సమీక్షించా లని ఆదేశాలివ్వడాన్ని స్వాగతిస్తున్నామని, 20 ఏళ్లుగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు. ప్రధాని మోదీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని టీపీసీసీ ఉపాధ్య క్షుడు మల్లు రవి విమర్శిం చారు. నోట్ల రద్దు దిక్కుమా లిన నిర్ణయమని వ్యాఖ్యా నించిన సీఎం కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి రాగానే మోదీ జపం చేస్తున్నారన్నారు. సామాన్య ప్రజల కష్టాల గురించి పట్టించుకోకుండా కేసీఆర్ మాట్లాడటం దారుణమన్నారు. -
దేవుడిచ్చిన అన్న వైఎస్సార్
మాజీ హోంమంత్రి సబితారెడ్డి చేవెళ్ల: తనకు దేవుడిచ్చిన అన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి అన్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆ మహానేతతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే.. ఆత్మీయత, అనురాగాన్ని పంచి ‘చేవెళ్ల చెల్లెమ్మగా’ కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టిన జననేత వైఎస్. నా భర్త, మాజీమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి 2000 సంవత్సరంలో మరణించినప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన మా స్వగ్రామమైన కౌకుంట్లకు వచ్చి ఓదార్చారు. ‘మీ అన్నయ్యలా నేనున్నాను.. అధైర్యపడొద్దు అంటూ ఓదార్చిన మాటలు నాలో స్థైర్యాన్ని నింపాయి. ఇంద్రారెడ్డి మరణించినప్పుడు కోలుకోవడానికి ఎన్నేళ్లు పట్టిందో.. వైఎస్ మరణం తరువాత కూడా కోలుకోవడానికి అంతే సమయం పట్టింది. రాజశేఖర్‌రెడ్డి మా కుటుంబానికి రాజకీయంగా కాకుండా ఆత్మీయుడిగా, కుటుంబ పెద్దగా చూసుకున్నారు. ఇప్పటికీ ప్రతి అడుగులో, నేను చేసే ప్రతి పనిలో ఆయన గుర్తుకొస్తుంటారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళను హోంమంత్రిగా చేసిన ధీశాలి. నాయకుడనేవాడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవచేయాలనే ఆయన మాటలకే నాకు ఇప్పటికీ.. ఎప్పటికీ స్ఫూర్తి. నిబద్ధత, విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం ఆయన. మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ధీశాలి. ఆడపడచుగా అన్నను, రాజకీయంగా మంచి నాయకుడిని, సేవను కాంక్షించే వ్యక్తిగా సేవాతత్పరున్ని కోల్పోయానన్న బాధ ఇప్పటికీ గుండెల్లో మిగిలే ఉంది అంటూ చెమర్చిన కళ్లతో గుర్తుచేసుకున్నారు. -
విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న సర్కారు
మాజీ హోంమంత్రి సబితారెడ్డి శంషాబాద్ : విద్యావ్యవస్థను రాష్ట్ర సర్కారు భ్రష్టు పట్టిస్తోందని మాజీ హోంమంత్రి సబితారెడ్డి విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఎంసెట్-2 పరీక్షా తీరుకు నిరసనగా శుక్రవారం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శంషాబాద్ చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఉన్నత విద్యనందించేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో సమర్థవంతంగా అందించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఇప్పుడు రాష్ట్ర సర్కారు గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఫాంహౌస్‌కే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో అత్యున్నతమైన ఎంసెట్ పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని స్థాయిలో ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో చదువులు పూర్తయినా సర్టిఫికెట్లు అందుకోలేని దుస్థితి కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో వర్సిటీల పాలన కూడా గాడి తప్పిందని ఆమె విమర్శించారు. విద్యార్థులకు అండగా ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటమాడుతున్న ప్రభుత్వానికి భవిష్యత్తులో విద్యార్థులే బుద్ధి చెప్పాలని యువనేత కార్తీక్‌రెడ్డి అన్నారు. కేటీఆర్, కవితలకు రూ.కోట్లు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్ విద్యార్థులకు సంబంధించిన ఫీజులు విడుదల చేయడానికి మాత్రం వెనుకాడుతున్నారన్నారు. కార్యక్రమంలో శంషాబాద్ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు సతీష్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రావణ్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేణుగౌడ్, శంషాబాద్ సర్పంచ్ సిద్ధేశ్వర్, రాజేంద్రనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్, యూత్‌కాంగ్రెస్ నాయకులు వంశీ, శ్రావణ్‌గౌడ్, పవిత్ర సాగర్, రాఘవేందరెడ్డి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి విద్యార్థులే బుద్ధి చెప్పాలి
మాజీ హోం మంత్రి సబితారెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ధర్నా శంకర్పల్లి : విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. విద్యార్థుల పీజురీయింబర్స్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ఎన్ఎస్యూఐ, యూత్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో శంకర్‌పలి్్ల ప్రధాన చౌరస్తాలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబితారెడ్డితో పాటు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కార్తీక్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి లోకం కదిలి వచ్చినప్పుడు వారిని ఉపయోగించుకొని ఇప్పుడు వారి సమస్యను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పేద విద్యార్థుల ఉన్నత చదువులు అందించేందుకు ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తే చాలా మంది నిరుపేద విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారన్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం ఫీజులు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యం ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై వత్తిడి తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చాలా మంది ఫీజులు కట్టలేక చదువులకు దూరమై కూలీ పనులకు వెళుతున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు పాల్గొనడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అదే యూనివర్సిటిలో విద్యార్థుల మెస్ బిల్లులు రూ.7 కోట్లు పెండింగ్‌లో ఉన్నా.. ఇంత వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని ప్రచారం చేసి ఇప్పుడు నిరుద్యోగులను రోడ్డుకీడ్చి తన ఇంట్లో మాత్రం నలుగురికి ఉద్యోగాలు కల్పించుకొని కుటుంబపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అనేకంటే.. తుగ్లక్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. అనవసరమైన వాటికి కోట్ల ఖర్చు చేస్తూ నిరుపేద విద్యార్థుల చదువులకు డబ్బు ఇవ్వడం లేదన్నారు. కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని ప్రచారం చేసి ఇప్పుడు దానిపై కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, ఎంపీపీ నర్సింలు, జెడ్పీటీసీ కళావతి విఠలయ్య, వైస్ ఎంపీపీ శశిధర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు పాండురంగారెడ్డి, భూషణం, నర్సింహారెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు ప్రశాంత్, విక్రాంత్సింగ్, శ్రీనివాస్‌రెడ్డి, టంగటూర్ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ యాదిరెడ్డి, జనవాడ ఎంపీటీసీ మైసయ్య, సీనియర్ నాయకులు విఠలయ్య, మాణిక్‌రెడ్డి, ప్రకాశ్, రవీందర్, పార్శిబాలకృష్ణ, గౌస్ఖురేషి, ఖాదర్‌పాష, మహిళ సంఘం నాయకులు నాగమణి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. -
ధరల పెంపుపై ప్రతిపక్షాల గళం
ఆర్టీసీ, కరెంటు చార్జీల పెంపుపై శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టగా.. ఆయా చోట్ల భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా నిరసనలు తెలిపారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. నిర్మల్‌లో రాస్తారోకో నిర్మల్ టౌన్ : రూ. 10వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడిన చార్జీల పెంపు ఎందుకని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జీ సబితాఇంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని వివేకనందచౌక్ వద్ద గల జాతీయ రహదారిపై శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఏర్పడుతుందని ప్రజలను మభ్యపెడుతూ చార్జీలను పెంచడం ఎంతవరకు సమంజసమన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలను పెంచలేదని పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా కరెంట్‌ను సరఫరా చేసిన ప్రజలపై ఆ భారం మోపలేదని తెలిపారు. సామాన్య ప్రజలపై ప్రభుత్వం చార్జీల భారం వేయడం సరికాదన్నారు. పెంచిన చార్జీలను త గ్గించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మాజీ డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీలు హేమలత అగర్వాల్, శ్రీనివాస్, నాయకులు జాదవ్ నరేష్, బోథ్ నియోజకవర్గ ఇంచార్జి జాదవ్ అనిల్, అరవింద్‌రెడ్డి, రామలింగం, సత్యంచంద్రకాంత్, దావోజి, తక్కల రమణారెడ్డి, దశరత రాజేశ్వర్, దుర్గభవాని, సాద సుదర్శన్,సరికెల గంగన్న, జెడ్పీటీసీలు సుజాత, ేహ మలత, నాయకులు జమాల్, అజర్, జుట్టు దినేష్, సంతోష్ పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో రెబ్బెనలో రాస్తారోకో రెబ్బెన : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్,ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేసరి అంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు. చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం మండల కేంద్రం లోని రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపేలా ఒకేసారి విద్యుత్, బస్సు చార్జీలను పెంచటం సరికాదన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు నందకిషోర్, సతీష్‌గౌడ్, అజయ్‌గౌడ్, వెంకటేష్, శ్రీకాంత్, ప్రవీణ్, మహేష్‌లు పాల్గొన్నారు. పెంచిన చార్జీలు తగ్గించాలని రాస్తారోకో బెల్లంపల్లి : బస్, విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శనివారం బెల్లంపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. పట్టణంలోని కాంటా చౌరస్తా స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)కు వెళ్లే మార్గమధ్యంలోని కల్వర్టు వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వన్‌టౌన్ అదనపు ఎస్సై గంగారాజగౌడ్ సిబ్బందితో వచ్చి రాస్తారోకో విరమింపజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, డీసీసీ సెల్ ఉపాధ్యక్షుడు ఎండి అఫ్జల్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి సి.హెచ్.శంకర్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ కటకం సతీశ్, ఐఎన్టీయూసీ నాయకులు సి.హెచ్.వెంకటరమణ, మల్లారపు చిన్నరాజం, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ప్రభాకర్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎనగందుల వెంకటేశ్, కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు రొడ్డ తులసీదాస్, బి.ఆనందం, ఎన్ఎస్యూఐ నాయకులు ఆదర్శ్‌వర్ధన్‌రాజు, వినీశ్ పాల్గొన్నారు. పెంచిన ధరలు తగ్గించాలి మంచిర్యాల సిటీ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై భారం పడేలా పెంచిన విద్యుత్, బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరల పెంపును నిరసిస్తూ శనివారం మంచిర్యాల పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ తయారు చేస్తానని, ప్రజలకు హామీ ఇచ్చిన కేసీఆర్ గద్దె ఎక్కిన తరువాత ప్రజలకు భారమైనాడని ఆరోపించారు. ప్రజలు సుఖసంతోషాలు విడిచి, కరువుతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో ధరలు పెంచడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ఆందోళను ఉదృతం చేస్తుందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మున్నారాజ్ సిసోధ్య, గోలి రాము, లింగన్నపేట విజయ్‌కుమార్, శశి కుమార్ ఉన్నారు. చార్జీల పెంపుపై బీజేపీ రాస్తారోకో ఆదిలాబాద్ రిమ్స్ : ధనిక రాష్ట్రంలో ప్రభుత్వం పేదలపై భారంమోపుతోందని బీజేపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట గల జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగులు బడ్జెట్‌ఉన్న రాష్ట్రమని చెబుతున్న ప్రభుత్వం చార్జీలు పెంచే అవసరమేందున్నారు. ప్రభుత్వం ఏర్పాటు నుంచి సక్రమంగా పాలన సాగిస్తే చార్జీలు పెంచే అవసరం ఉండేది కాదన్నారు. ఇష్టారీతిన నిధులు ఖర్చు చేస్తూ ప్రజలపై భారం మోపడం సిగ్గుచేటన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామంటూ ప్రజలను భాదలు పెడుతోందన్నారు. ప్రజావ్యతిరేక విధానలు అవలంబిస్తూ ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేణుగోపాల్,సురేష్‌జోషి, జోగురవి, రాము, సంతోష్, శ్రీనివాస్ ఉన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో.. మంచిర్యాల సిటీ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మిగులు బడ్జెట్ ఉంటుందని ప్రకటించిన కేసీఆర్, అటువంటి రాష్ట్రంలో ధరలు ఎందుకు పెరగాలని మాజీ మంత్రి, టీడీపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు బోడ జనార్ధన్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్, బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం మంచిర్యాల పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి అక్కడ ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గోపతి మల్లేష్, మేరడికొండ శ్రీనివాస్, రాజారాం, వెంకటేశ్వర్లు, గౌసోద్దిన్, సత్యం, మధుకర్, కిరణ్, రాకేష్, రాజ్‌కుమార్ ఉన్నారు.