'చేవెళ్ల ఎంపీ, మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి'
'చేవెళ్ల ఎంపీ, మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి'
Published Sun, Mar 23 2014 1:16 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
చేవెళ్ల ఎంపీ స్థానాన్ని తన కుమారుడు కార్తీక్ రెడ్డికి, మహేశ్వరం ఎమ్మెల్యే సీటును తనకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ను మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్క్షప్తి చేశారు. లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే ల జాబితాపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వార్ రూమ్ లో కసరత్తు చేస్తోంది.
సిట్టింగ్ ఎంపీలందరికి టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నందున్న చేవెళ్ల ఎంపీ స్థానానికి తన కుమారుడికి టికెట్ కోసం సబితా ఇంద్రారెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోని వార్ రూమ్ లో కాంగ్రెస్ పెద్దలను కలిశారు.
సామాజిక న్యాయం, గెలిచే సత్తా, ప్రత్యర్థుల బలాబలాలను బట్టి అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టారు. అభ్యర్థుల ఎంపికపై వార్ రూమ్ లో తెలంగాణ కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ భేటి అయ్యింది. మరో నాలుగు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Advertisement
Advertisement