బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కంటతడి
ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారంటారా?
సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చాలా బాధించాయి
సాక్షి, హైదరాబాద్: ‘‘మమ్మల్ని నమ్మితే బతుకు బస్టాండేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్న మాటలు చాలా బాధించాయి. అక్క లను నమ్ముకుంటే బతుకు ఆగమైపోతుందని రేవంత్ అన్న మాటలు మమ్మల్ని మాత్రమే కాదు, తెలంగాణ మహిళలను అవమానించినట్టే. అంతేకాదు ఏం ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారని మమ్మల్ని డిప్యూటీ సీఎం భట్టి అనడం దారుణంగా అవమానించడమే’’అని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మా ట్లాడారు. అక్కలుగా తాము అందరి మంచి కోరుతామని, కానీ ఖర్మకాలి అసెంబ్లీకి వచ్చామని సబితారెడ్డి కంటతడి పెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పక్కదారి పట్టించేందుకే అవమానించారు!
కేటీఆర్ శాసనసభలో బడ్జెట్‌పై నిజాలు మాట్లాతుంటే.. దాన్నుంచి పక్కదారి పట్టించేందుకే సీఎం తమపై అవమా నకర వ్యాఖ్యలు చేశారని సబిత మండిపడ్డారు. ‘‘మీ వెనుక కూర్చొన్న అక్కలు అంటూ మమ్మల్ని అవమానపరిచారు. సీఎంకు మహిళలంటే ఎంత గౌరవమో తెలుస్తోంది. నేను మోసం చేశానని రేవంత్‌రెడ్డి అంటున్నారు. అప్పట్లో ఆయన ను కాంగ్రెస్‌లో రమ్మనడమే నేను చేసిన తప్పా?’’అని నిలదీశారు. దివంగత సీఎం వైఎస్సార్ తమను రాజకీయా ల్లోకి తీసుకువచ్చారని, మహిళలను ఆయన ఎంతో ప్రోత్స హించారని సబిత గుర్తుచేశారు. తాను గత 24 ఏళ్లలో చాలా మంది సీఎంలను చూశానన్నారు. సీఎం సీటు రేవంత్ సొంతం కాదని, 4 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన పదవి అన్న విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. తామెక్కడ నిలదీస్తామోనని అసెంబ్లీ నుంచి పారి పోయారన్నారు.
ఏం ముఖం పెట్టుకుని వచ్చారంటారా?
అసెంబ్లీకి ఏం ముఖం పెట్టుకుని వచ్చారన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని సబిత డిమాండ్ చేశా రు. ‘‘నేను ఏ తప్పు చేయలేదు. చాలామంది పార్టీలు మారా రు. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాల కుండా చూస్తామన్న రేవంత్ మాటలేమయ్యాయి? ఇప్పుడు పార్టీ మారిన వాళ్లను మీ పక్కన ఎందుకు పెట్టుకున్నారు? తాను కాంగ్రెస్ నుంచి బయటికి ఎందుకు రావాల్సి వచ్చిందో, ఎలా మెడబట్టి బయటికి గెంటే ప్రయత్నం చేశారో తెలుసు. నా కారణంగానే గతంలో భట్టి విక్రమార్కకు ప్రతి పక్ష నేత పదవి పోయిందన్నారే.. మరి ఇప్పడు ఆయన సీఎం ఎందుకు కాలేదు’’ అని నిలదీశారు.
ఏ పార్టీలో ఉన్నా కమిట్‌మెంట్‌తో పనిచేశాం: సునీతా లక్ష్మారెడ్డి
తాము ఏ పార్టీలో ఉన్నా కమిట్‌మెంట్‌తో పనిచేశామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. అధికా రం ఉన్నా, లేకున్నా పార్టీ జెండా మోసి కార్యకర్తలను కాపాడుకున్నామన్నారు. డీకే అరుణ, సబితారెడ్డితో పాటు తనను అవమానించారని, దొంగలే దొంగ అన్న ట్టుగా ఉందని మండిపడ్డారు. సీతక్క ఏ పార్టీ నుంచి వ చ్చారో ప్రజలకు తెలుసన్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment