
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతోందని ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ నేతలు తెలిపారు. విద్యాశాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డిని సంఘం నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీఎమ్మెల్సీ పూల రవీందర్ కలిశారు.
ప్రభు త్వం బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు గతంలో జారీ చేయగా, ఇందుకు సంబంధించిన జీఓ నంబరు 5కు అసెంబ్లీ చట్టబద్ధత లేదనే కారణంగా కొంతమంది కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలైనా ఆగిపోయా యి. అయితే, జీఓ 5 అమలుకు శాసనసభ ఆ మోదం పొందే ప్రతిపాదనలు విద్యాశాఖ సమర్పించినట్టు మంత్రి సబిత శుక్రవారం పీఆర్‌టీయూ టీఎస్ నేతలకు తెలిపారు. ఇందుకు మంత్రి సబితకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment