టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో జాప్యం | Delay in transfers and promotions of teachers | Sakshi
Sakshi News home page

టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో జాప్యం

Published Fri, Sep 22 2023 2:31 AM | Last Updated on Fri, Sep 22 2023 11:57 AM

Delay in transfers and promotions of teachers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రి య మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయుల సీని యారిటీ వ్యవహారం పీటముడిగా మారడ మే దీనికి కారణం. స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎం పోస్టులకు పదోన్నతి కోసం గురు వారం నుంచి ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయి తే రాత్రి పొద్దుపోయే వరకూ ఈ ప్రక్రియ మొదలుకాలేదు. ఆప్షన్లు ఇచ్చేందుకు టీచర్లు సిద్ధపడ్డా, వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదు. రోస్టర్‌ విధానం, మల్టీజోన్ల వారీగా సీనియారిటీ, నాట్‌–విల్లింగ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు అవసర మైన సాఫ్ట్‌వేర్‌ ఏర్పాటులో సాంకేతిక సమ స్యలొచ్చినట్టు అధికారులు తెలిపారు.

శుక్ర వారం నుంచి ఆప్షన్లు అందుబాటులోకి రావ చ్చని అధికారులు తెలిపారు. మల్టీజోన్‌–2లోని 14 జిల్లాల్లో కోర్టు ఆదేశాల కార ణంగా హెచ్‌ఎంల పదోన్నతి ప్రక్రియ ఆగిపోయింది. ఇది ముందుకెళితేనే స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీలపై స్పష్టత వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,974 హెచ్‌ఎం పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. 6,500 మంది ఎస్‌జీటీలకు పదోన్నతులు లభించాల్సి ఉంటుంది. తొలిదశలోనే సమస్యలు మొదలుకావడంతో మిగతాప్రక్రియ ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు.

షెడ్యూల్‌ ప్ర కారం అక్టోబర్‌ 3, 4 తేదీల నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు, పదో న్నతుల ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంది. అన్నిస్థాయిల్లోనూ ఆర్డర్లు కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే హెచ్‌ఎంల సీనియారిటీ సరిగాలేదనే కారణంగా మల్టీజో న్‌–2లో ప్రక్రియ ఆగిపోవడంతో బదిలీలు, పదోన్నతులు కిందస్థాయిలోనూ బ్రేక్‌ పడుతున్నాయి. కోర్టు స్టే తొలగించేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇది కొలిక్కి వచ్చినప్పటికీ అక్టోబర్‌ నెలాఖరునాటికి అన్నిస్థాయిల్లో బదిలీలు, పదోన్నతులు ముందుకెళ్లే అవకాశం కన్పించడంలేదు. స్టే ఎత్తివేయడంలో ఆలస్యమైతే మరికొంత జాప్యం తప్పదని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement