Technical issue
-
ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత ఆ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో విమానాన్ని విమానాశ్రయంలోనే ఉంచారు. విమానంలో సమస్యను చక్కదిద్దేందుకు నిపుణులు పనిచేస్తున్నారు. ఈ లోపు మోదీ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని డియోఘర్‌కు పంపారు. దీంతో మోదీ ఢిల్లీ తిరుగు ప్రయాణం ఆలస్యం కానుంది.జార్ఖండ్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి (జనజాతీయ గౌరవ్ దివస్) కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం డియోఘర్ పట్టణానికి వచ్చారు. అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ అక్కడ ప్రచారాన్ని కూడా నిర్వహించారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. కాగా నవంబర్ 20వ తేదీన జార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉంది.మరోవైపు డియోఘర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో గొడ్డాలో రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమంతి ఆలస్యమైంది. దీంతో క్లియరెన్స్ కోసం 45 నిమిషాలు గ్రౌండ్పైనే ఉండిపోయింది. అయితే ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నాయకుడి ప్రచార షెడ్యూల్‌కు అంతరాయం కలిగించారని కాంగ్రెస్ ఆరోపించింది. -
Video: వందే భారత్ రైలులో సాంకేతిక లోపం.. లాక్కెళ్లిన మరో ఇంజిన్
లక్నో: భారత రైల్వే తీసుకొచ్చిన సెమీ స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. అంతే స్పీడ్‌తో పలు రూట్లలో పరుగులు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఈ రైళ్లపై అంతే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి . గతంలో ఎన్నోసార్లు రైళ్లపై రాళ్లు రువ్వడం, గేదేలు వంటివి ఢీకొని రైళ్లు ధ్వంసమైన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.తాజాగా ఓక వందే భారత్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యలో ఆగిన ఆ రైలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. చివరకు మరో రైలు ఇంజిన్ ద్వారా వందే భారత్ రైలును సమీపంలోని స్టేషన్ వరకు లాక్కెళ్లారు. ఈ ఘటన న్యూఢిల్లీ- వారణాసి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. రైలు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో సోమవారం ఉదయం 9.15 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో అది ఆగిపోయింది. సమాచారం రైల్వే టెక్నికల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని వందే భారత్ రైలు ఇంజిన్‌లోని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చివరకు మూడు గంటల తర్వాత మరో రైలు ఇంజిన్‌ను రప్పించారు. దాని ద్వారా వందే భారత్ రైలును భర్తానా రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లారు.What a sight.The old engine comes to rescue the famed Vande Bharat which ran into technical glitch and got stranded in Etawah, UP. Happened to the Varanasi bound Vande Bharat adversely affecting operations of other trains on the route. pic.twitter.com/rvOwbkDz4K— Piyush Rai (@Benarasiyaa) September 9, 2024మరోవైపు ఈ సంఘటన వల్ల వందే భారత్ ట్రైన్‌లోని ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపార్ట్‌మెంట్స్‌లోని ఏసీలు పని చేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. చివరకు వందే భారత్ ట్రైన్‌లోని సుమారు 750 మంది ప్రయాణికులను ఇతర రైళ్లలో వారి గమ్యస్థానాలకు చేర్చారు. కాగా, వందే భారత్ ట్రైన్‌ను మరో రైలు ఇంజిన్ ద్వారా లాక్కెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వేతోపాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
ఈ–పంట నమోదుకు సర్వర్ కష్టాలు!
సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదుకు సర్వర్ కష్టాలు వెంటాడుతున్నాయి. వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, యాప్ సరిగా పనిచేయకపోవడం వంటి సాంకేతిక సమస్యలకు తోడు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ పంట నమోదులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నది. దాదాపు రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ పంట నమోదు నత్తనడకన సాగుతున్నది. గడిచిన నెల రోజుల్లో కేవలం 31 శాతం మాత్రమే పూర్తయింది. మరొక వైపు ఏది ఏమైనా సెపె్టంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తుండడంతో క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.సర్వర్లు పనిచేయక..ఫొటోలు అప్లోడ్ కాక.. రాష్ట్రంలో సాగుయోగ్యమైన భూముల వివరాలను మండల వ్యవసాయాధికారులు సర్వే నంబర్ల వారీగా ఈ–పంట వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. తొలుత గ్రామాల సర్వే నంబర్ల ఆధారంగా భూముల వివరాలను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్బీకే రైతులు సాగు చేసే పంట వివరాలను ఈ–పంట వెబ్సైట్లో నమోదు చేయాలి. ఈ ప్రొసీజర్ మొత్తం కంప్యూటర్లో మాత్రమే చేయాలి. గతంలో మాదిరిగా మొబైల్లో నమోదుకు అవకాశం ఇవ్వలేదు. మార్పులు, చేర్పులు చేయాలంటే పొలాల నుంచి మళ్లీ ఆఫీసుకు వచ్చి ఎడిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. రెండో దశలో మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్‌లలో ఈ–పంట అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని రిజి్రస్టేషన్ చేసుకుని ఈ–పంట వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వివరాల ఆధారంగా రైతు పొలం వద్దకు వెళ్లి జియో కో–ఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. నెట్వర్క్ సమస్యల వల్ల పంట ఫొటోలు తీసుకోవడం లేదు. రోజుకు 10 కిలోమీటర్లకు పైగా.. 200 మీటర్ల వరకు మాగాణి, 50 మీటర్ల వరకు మెట్ట పొలాలకు వెసులుబాటు ఇచ్చినప్పటికీ రోజుకు 10 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో దశలో అప్లోడ్ చేసిన పంట వివరాలు, ఫొటోలను తొలుత వీఏఏలు,ఆ తర్వాత వీఆర్వోలు, చివరగా రైతులు అథంటికేషన్ (ఈ కేవైసీ) చేయాలి. కొన్ని జిల్లాలకు మాత్రమే సర్వర్లు ఇవ్వడం, ఆ సర్వర్లు కాస్తా సరిగా పనిచేయకపోవడంతో ఈ కేవైసీ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రోజుకు వంద ఎకరాలు చేయాలంటూ ఒత్తిడి! ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు వ్యవసాయ, ఉద్యాన, పట్టు తదితర పంటలకు సంబంధించి 1,34,48,611 ఎకరాలు సాగవగా, వీఏఏలు 59,27,115 ఎకరాల వివరాలను మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారు. వాటిలో ఇప్పటి వరకు 31 శాతం మాత్రమే ఈ–పంట నమోదు పూర్తయింది. వెబ్సైట్, యాప్, సర్వర్లు మొరాయిస్తుండడంతో రోజుకు ఆర్బీకే పరిధిలో 30–40 ఎకరాలకు మించి ఈ–పంట నమోదు చేయలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ రోజుకు 100 ఎకరాల్లో పంట నమోదు చేయాల్సిందేనంటూ ఉన్నతాధికారులు జారీ చేస్తున్న ఆదేశాలు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.జియో కో– ఆర్డినేట్స్ పరిధిని పెంచాలి.. రాష్ట్రంలో ఈ–క్రాప్ నమోదు సజావుగా సాగడం లేదు. సర్వర్ సరిగా పనిచేయక, యాప్ సకాలంలో ఓపెన్ కాక నమోదులో జాప్యం జరుగుతోంది. నిర్ణీత గడువులోగా పూర్తికాకపోతే పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకోవడంలో కానీ, సంక్షేమ ఫలాలు పొందడంలో రైతులు నష్టపోతారు. విత్తనాల పంపిణీలో మహిళా కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లను ఏ విధంగా సహాయకులుగా నియమించారో అదేరీతిలో ఈ–పంట నమోదులో వీఏఏలకు సహాయకులుగా వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లను నియమించాలి. జియో ఫెన్సింగ్ మాగాణిలో 500 మీటర్లు మెట్టలో 250 మీటర్లకు పెంచాలి. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం -
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి
జైపూర్: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానం గాల్లో దూసుకెళ్తుండగా అనూహ్యమైన సంఘటన జరిగింది. సాంకేతిక సమస్యతో పలురకాల వైమానిక సామగ్రి జారిపడింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. యుద్ధ విమానం అనుకోకుండా నిర్మానుష్య ప్రాంతంలో సామగ్రిని జారవిడిచినట్లు అధికారులు తెలియజేశారు. ప్రాణ, ఆస్తి నష్టమేమీ జరగలేదన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. జారిపడిన సామగ్రి ఏమిటన్నది బయటపెట్టలేదు. సైనిక భాషలో బాంబు, క్షిపణులు, ఆయుధాలు, చమురు ట్యాంక్‌లను కూడా వైమానిక సామగ్రిగా పిలుస్తుంటారు. -
ఐఆర్సీటీసీ డౌన్: మండిపడుతున్న వినియోగదారులు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) వెబ్సైట్ గురువారం మరోసారి డౌన్ అయింది. దీంతో సర్వీసులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు ఇబ్బందుల నెదుర్కొన్నారు. దీంతో సోషల్‌మీడియాలో వినియోగదారులు ఐఆర్సీటీసీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఐఆర్సీటీసీ కూడా ట్విటర్ ద్వారా స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా తమ వెబ్సైట్ (నవంబర్ 23, గురువారం ) సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగినట్టు వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. (డీప్‌ఫేక్‌లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు) గురువారం ఉదయం 10 గంటల నుంచే సాంకేతిక సమస్యను ఎదుర్కొంటోంది.. తత్కాల్ విండో ఓపెన్ కాగా యూజర్లు ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా కేన్సిల్ చేయాల్సిన టికెట్లు కేన్సిల్ కాగా, తత్కాల్ ద్వారా టికెట్లు బుక్ కాక యూజర్లు నానా అగచాట్లు పడ్డారు. దీంతో అధ్వాన్నమైన వెబ్ సైట్, దారుణమైన సేవలు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. IRCTC వెబ్సైట్ ద్వారా రేల్వే ప్రయాణికులు టిక్కెట్ల బుకింగ్ రైళ్ల స్థితిని తనిఖీ చేయడం, ఇతర సంబంధిత సమాచారాన్ని పొందుతారు. E- ticket booking is temporarily affected due to technical reasons. Technical team is working on it and booking will made available soon. — IRCTC (@IRCTCofficial) November 23, 2023 -
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో జాప్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రి య మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయుల సీని యారిటీ వ్యవహారం పీటముడిగా మారడ మే దీనికి కారణం. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పోస్టులకు పదోన్నతి కోసం గురు వారం నుంచి ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయి తే రాత్రి పొద్దుపోయే వరకూ ఈ ప్రక్రియ మొదలుకాలేదు. ఆప్షన్లు ఇచ్చేందుకు టీచర్లు సిద్ధపడ్డా, వెబ్సైట్ ఓపెన్ కాలేదు. రోస్టర్ విధానం, మల్టీజోన్ల వారీగా సీనియారిటీ, నాట్–విల్లింగ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవసర మైన సాఫ్ట్వేర్ ఏర్పాటులో సాంకేతిక సమ స్యలొచ్చినట్టు అధికారులు తెలిపారు. శుక్ర వారం నుంచి ఆప్షన్లు అందుబాటులోకి రావ చ్చని అధికారులు తెలిపారు. మల్టీజోన్–2లోని 14 జిల్లాల్లో కోర్టు ఆదేశాల కార ణంగా హెచ్ఎంల పదోన్నతి ప్రక్రియ ఆగిపోయింది. ఇది ముందుకెళితేనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలపై స్పష్టత వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,974 హెచ్ఎం పోస్టులను స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. 6,500 మంది ఎస్జీటీలకు పదోన్నతులు లభించాల్సి ఉంటుంది. తొలిదశలోనే సమస్యలు మొదలుకావడంతో మిగతాప్రక్రియ ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు. షెడ్యూల్ ప్ర కారం అక్టోబర్ 3, 4 తేదీల నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు, పదో న్నతుల ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంది. అన్నిస్థాయిల్లోనూ ఆర్డర్లు కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే హెచ్ఎంల సీనియారిటీ సరిగాలేదనే కారణంగా మల్టీజో న్–2లో ప్రక్రియ ఆగిపోవడంతో బదిలీలు, పదోన్నతులు కిందస్థాయిలోనూ బ్రేక్ పడుతున్నాయి. కోర్టు స్టే తొలగించేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇది కొలిక్కి వచ్చినప్పటికీ అక్టోబర్ నెలాఖరునాటికి అన్నిస్థాయిల్లో బదిలీలు, పదోన్నతులు ముందుకెళ్లే అవకాశం కన్పించడంలేదు. స్టే ఎత్తివేయడంలో ఆలస్యమైతే మరికొంత జాప్యం తప్పదని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
విమానం ఎక్కాలన్న సరదా ఇప్పుడు తీరినట్లుంది..
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా వద్దికేరె గ్రామం సమీపంలో తపస్07 ఎ–14 రకం డ్రోన్ కుప్పకూలింది. చిత్రదుర్గం వద్ద డీఆర్డీఓ ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్ (ఏటీఆర్) ఉంది. నిత్యం ఇక్కడ డ్రోన్లు, మానవ రహిత విమానాల పరీక్షలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా చెళ్లకెర తాలూకా హిరియూరు వద్ద పొలంలో పెద్ద శబ్ధంతో కుప్పకూలింది. దాని భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. డీఆర్డీవో అధికారులు, పోలీసులు ధ్వంసమైన డ్రోన్‌ను అక్కడి నుంచి తరలించారు. సాంకేతిక లోపంతోనే అది కూలిందని, విచారణ జరుపుతున్నామని డీఆర్డీవో అధికారులు చెప్పారు. -
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
తిరువనంతపురం: తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి షార్జాకు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, విమానాన్ని ముందు జాగ్రత్తగా కేరళలో తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. 154 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో సోమవారం ఉదయం 10.45 గంటలకు తిరుచిరాపల్లి నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకుంది. కొద్దిసేపటికే ఇంజిన్‌లో సమస్యలు తలెత్తినట్లు గుర్తించిన పైలట్ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితి ప్రకటించి, మధ్యాహ్నం 12.01 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. తిరువనంతపురం–బహ్రెయిన్ ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపంతో నిలిచిపోయిందని ఎయిరిండియా పేర్కొంది. -
అనంతపురం: సీఎం జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. నార్పల నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్లో వెళ్లాల్సిన సీఎం.. రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి బుధవారం.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ‘జగనన్న వసతి దీవెన’ పథకం నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. చదవండి: పేదరికపు సంకెళ్లు తెంచే అస్త్రం చదువు: సీఎం జగన్ -
ఉప్పల్ మెట్రో ఓసీసీకి చుక్కలుచూపిస్తున్న మూసీ కాలుష్యం, ఇలాగైతే ఎలా?
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రోపై మూసీ కాలుష్యం పంజా విసురుతోంది. ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మూడు మార్గాల్లో పరుగులు తీసే మెట్రో రైళ్లను నియంత్రించే ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)కు మూసీ కాలుష్యం పొగబెడుతోంది. బల్క్ డ్రగ్, ఫార్మా కంపెనీల వ్యర్థ జలాలు ప్రవహిస్తున్న మూసీ నది నుంచి తరచూ వెలువడుతున్న ఘాటైన వాసనలు ఈ కేంద్రంలోని సున్నితమైన ఎల్రక్టానిక్, హార్డ్‌వేర్, కంప్యూటర్ ఆధారిత సేవలను దెబ్బతీస్తున్నాయి. ఈ కాలుష్యం కారణంగా ఓసీసీ కేంద్రంలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామంతో కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ దెబ్బతింటోంది. దీంతో పట్టాలపై ఉన్నపళంగా మెట్రో రైళ్లు నిలిచిపోతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మెట్రో అధికారులు సైతం తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో హతాశులవుతున్నారు. ఉప్పల్‌లో సుమారు 104 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మెట్రో డిపోను, ఓసీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ ప్రాంగణంలో రైళ్లను నిత్యం శుభ్రపరచడం, రైళ్ల గమనాన్ని నియంత్రించడం, తరచూ తలెత్తే సమస్యలు, ఇతర నిర్వహణ, మరమ్మతులు చేపడుతున్నారు. దీనిపై మెట్రో నిర్మాణ,నిర్వహణ సంస్థ ఎల్అండ్టీతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఈ అంశంపై మాట్లాడేందుకు వారు నిరాకరించడం గమనార్హం. పరిష్కారమిదే.. నగరంలో బాపూఘాట్– ప్రతాపసింగారం (44 కి.మీ)మార్గంలో మూసీ నదిలో బల్క్‌డ్రగ్, ఫార్మా వ్యర్థాలు అత్యధికంగా చేరుతున్నాయి. ప్రధానంగా కూకట్పల్లి నాలా నుంచి నిత్యం సుమారు 400 మిలియన్ లీటర్ల మేర హానికారక రసాయనాలు కలిసిన వ్యర్థజలాలు మూసీలో కలుస్తుండడంతో తరచూ ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం జలమండలి వ్యర్థజలాల్లోని మురుగు,ప్లాస్టిక్ ఇతర ఘన వ్యర్థాలను పలు ఎస్టీపీల్లో తొలగిస్తోంది. కానీ రసాయనాలను తొలగించేందుకు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మూసీ ప్రవాహ మార్గంలో నిర్మించాల్సి ఉంది. ఈటీపీల్లో శుద్ధి చేసిన తరవాతనే నాలా నీరు మూసీలోకి చేరే ఏర్పాట్లు చేస్తే కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు మెట్రో రైళ్ల గమనానికి వినియోగిస్తున్న కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్‌కంట్రోల్ వ్యవస్థను మన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మెట్రో అధికారులు మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని స్పష్టంచేస్తున్నారు. చదవండి: Telangana: రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు.. -
భారీ సాంకేతిక లోపం.. అమెరికా అంతటా నిలిచిపోయిన విమానాలు
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో విమాన సర్వీసులకు ఆటంకం తలెత్తింది. దీంతో అమెరికా వ్యాప్తంగా దాదాపు 400 విమానాలు నిలిచిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య ఏర్పడటంతో యునైటెడ్ స్టేట్స్ అంతటా విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు, చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి పైలెట్లు, విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేసేందుకు ఎఫ్ఏఏ ఇచ్చే నోటామ్ (నోటీస్ టు ఎయిర్‌మిషన్)లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఎక్కడి విమానాలు అక్కడే అగిపోవడంతో దేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ‘ఫ్లైట్ అవేర్ యూఎస్’ ప్రకారం ఉదయం 5:31 గంటలకు యునైటెడ్ స్టేట్స్లో 400 విమానాలు ఆలస్యమైనట్లు తెలిపింది. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ సిస్టమ్‌ను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు ఎఫ్ఏఏ ఓ ప్రకటనలో తెలిపింది. జాతీయ గగనతల వ్యవస్థ అంతటా కార్యకలాపాలు ప్రభావితమవుతాయని పేర్కొంది. ఎప్పుడు పునరుద్ధరించబడుతుందనే ప్రశ్నకు సమయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం. చదవండి: కోవిడ్ దెబ్బకు కుదేలవుతున్న చైనా! చికిత్స అందిచేందుకు కూడా.. -
పిచ్చ కొట్టుడు కొట్టారు.. డీఆర్ఎస్ కూడా లేకపాయే!
పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల తర్వాత వచ్చిన ఇంగ్లండ్ తొలి టెస్టులోనే అదరగొట్టే ప్రదర్శన ఇస్తుంది. మ్యాచ్ తొలి రోజునే ఇంగ్లండ్ బ్యాటర్లు పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వన్డే తరహాలో రెచ్చిపోయిన ఇంగ్లండ్ జట్టు తొలిరోజు ఆట ముగిసేసమయానికి 75 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 506 పరుగుల భారీస్కోరు చేసింది. ఇక తొలి టెస్టుకు డీఆర్ఎస్ లేకపోవడంతో పాకిస్తాన్‌కు చుక్కలు కనబడుతున్నాయి. ఎల్బీల విషయంలో డీఆర్ఎస్ లేకపోవడంతో పాక్ జట్టు తెగ ఇబ్బంది పడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను నసీమ్ షా వేశాడు. ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మూడో ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన నసీమ్ షా ఒక మంచి డెలివరీ వేశాడు. బంతి జాక్ క్రాలీ ప్యాడ్లకు తాకింది. అయితే థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేస్తే ఔటయ్యే అవకాశాలున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం డీఆర్ఎస్కు వెళ్లలేకపోయింది. ఏవో సాంకేతిక సమస్యల కారణంగా ఈ మ్యాచ్‌కు డీఆర్ఎస్ అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్ డీఆర్ఎస్ కోరుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది చూసిన అభిమానులు పీసీబీని ఒక రేంజ్లో ఆడుకున్నారు. ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ తన ఇన్నింగ్స్‌ను ఓవర్‌కు ఆరుకు పైగా రన్‌రేట్‌తో కొనసాగించడం విశేషం. ఇంగ్లండ్ బ్యాటర్లలో నలుగురు బ్యాటర్లు శతకాలతో రెచ్చిపోయారు. తొలుత ఓపెనర్లు జాక్ క్రాలీ(122 పరుగులు), బెన్ డకెట్(107 పరుగులు) చేయగా.. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన ఓలీ పోప్ 108 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ప్రస్తుతం హ్యారీ బ్రూక్(81 బంతుల్లోనే 101 నాటౌట్) సూపర్ ఫాస్ట్‌తో బ్యాటింగ్ కొనసాగిస్తుండగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక పాకిస్తాన్ బౌలర్లంతా దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జునైన్ మహమూద్ 23 ఓవర్లు వేసి ఏకంగా 160 పరుగులు ఇచ్చుకోవడం విశేషం. నసీమ్ షా కూడా 15 ఓవర్లలో 96 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. First ball of a historic series! ☄️#PAKvENG | #UKSePK pic.twitter.com/n442yzcVTE — Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022 No DRS available due to a glitch in Pakistan Vs England Test match. #engvspak #PAKvsEng — Dhruv Barot (@dhruv_441) December 1, 2022 No DRS😂🤣🤣🤣, someone please raise funds for Pakistan Cricket... So they can afford these technology in historic series😜 — Anshul (@Anshulkhandal03) December 1, 2022 చదవండి: టెస్ట్ మ్యాచా లేక టీ20నా.. ఇంగ్లండ్ బ్యాటర్ల మహోగ్రరూపం, ఒకే రోజు నలుగురు సెంచరీలు -
HYD: సాంకేతిక లోపంతో మరోసారి నిలిచిపోయిన మెట్రో రైలు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లు మళ్లీ మొరాయించాయి. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్–మియాపూర్, మియాపూర్–ఎల్బీనగర్ రూట్లో సుమారు 30 నిమిషాలకు పైగా నిలిచిపోవడంతో ఆయా స్టేషన్లలో రైళ్ల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు, రైళ్లలో జర్నీ చేస్తున్న వారు నరక యాతన అనుభవించారు. సిగ్నలింగ్ సమస్యల కారణంగా ఖైరతాబాద్, లక్డీకాపూల్, అమీర్‌పేట్ తదితర స్టేషన్లలో రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. ప్రయాణికులు ఆందోళన చెందడంతో రంగంలోకి దిగిన అధికారులు..సాంకేతిక సమస్యల కారణంగా రైళ్లను నిలిపివేసినట్లు రైళ్లలో అనౌన్స్మెంట్ చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరమ్మతుల అనంతరం రైలు సర్వీసులను పునరుద్ధరించారు. కాగా నగరంలో మెట్రో రైళ్లను కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టం(సీబీటీసీ)సాంకేతికత ఆధారంగా నడుపుతున్నారు. ఈ విధానం మన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడంతో తరచూ రైళ్లు పట్టాలపైనే నిలిచిపోతున్నాయి. ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమౌతున్నారని ప్రయాణీకులు విమర్శిస్తున్నారు. నగరంలో వాయు కాలుష్యం పెరిగిన ప్రతీసారీ సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు తలెత్తి రైళ్లు నిలిచిపోతున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైబిగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 9:45 గంటలకు శంషాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోండియా వెళ్లాల్సిన ఫ్లైబిగ్ విమానం రన్‌వే పైకి వెళ్లగానే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి రన్‌వేపై నిలిచిపోయింది. అయితే ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు విమానం బయలుదేరకపోవడంతో అధికారులపై అసహం వ్యక్తం చేస్తున్నారు. ఆధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రన్ వేపై ప్రయాణికులు ధర్నాకు దిగారు. చదవండి: భయ్యా.. ఇదేమయ్యా! నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్‌లో -
ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం.. పాకిస్తాన్లో అత్యవసర ల్యాండింగ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ నుంచి దోహాకు బయలుదేరిన ఖతార్ ఎయిర్వేస్ విమానం అత్యవసరంగా పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యింది. ఖతార్ ఎయిర్వేస్ క్యూఆర్-579 విమానంలో పొగలు రావడంతో కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి దోహాకు బయలుదేరిన ఖతార్ ఎయిర్వేస్ క్యూఆర్-579 విమానం కార్గో విభాగం నుంచి పొగలు వచ్చాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా పాకిస్తానలోని కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, సోమవారం తెల్లవారుజామున 3.20కి ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 5.30 గంటలకు కరాచీలో ల్యాండ్ అయింది. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే విమానంలో ప్రయాణిస్తున్న 283 మందిని మరో విమానంలో దోహాకు తరలించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. విమానంలో పొగలు రావడంపై సదరు ఖతార్ ఎయిర్వేస్ సంస్థ స్పందించింది. ఈ సమస్య తలెత్తడంపై దర్యాప్తు చేపట్టినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో మిగతా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. -
ప్రాజెక్ట్ వద్ద సాంకేతిక సమస్యను పరిశీలించిన మంత్రి అనిల్
-
కమలా హ్యారిస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి మేరీ ల్యాండ్‌లో ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందనీ, ఉపాధ్యక్షురాలు మరో విమానంలో బయలుదేరాలని భావిస్తున్నట్లు ప్రతినిధి సిమోన్ సాండర్స్ వెల్లడించారు. ఇది సాంకేతిక సమస్యమాత్రమే. భద్రతా సమస్యలు ఏవీ లేవని సాండర్స్ చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అటు తాము క్షేమంగా ఉన్నామని కమలా హ్యారిస్ కూడా ప్రకటించారు. ఉపాధ్యక్షురాలిగా పదవీబాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విదేశీ యాత్రకు బయలుదేరారు. మేరిల్యాండ్ నుంచి గ్వాటెమాల, మెక్సికో పర్యటన నిమిత్తం ఎయిర్‌ఫోర్స్ 2 లో బయలుదేరారు. అయితే టెకాఫ్ అయిన 25 నిమిషాల తరువాత విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.దీన్ని గుర్తించిన ఫైలెట్లు.. వెంటనే విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించారు. -
మళ్లీ ఆగిన హైదరాబాద్ మెట్రో
సాక్షి, హైదరాబాద్ : సాంకేతిక సమస్యల కారణంగా బుధవారం మెట్రో రైలు మరోసారి ఆగిపోయింది. ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో 20 నిమిషాలకు పైగా రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా మెట్రోరైలు లోగడ చాలాసార్లు నిలిచిపోయింది. గత జనవరిలో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ బయల్దేరిన రైలు పంజాగుట్ట మెట్రోస్టేషన్‌కు చేరుకోగానే నిలిచిపోయింది. సిబ్బంది వెంటనే ప్రయాణికులను దింపేశారు. ఒక్కసారిగా రైలు ఆగిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ( వావ్.. వజీర్..) కాగా, మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభమై మూడేళ్లయింది. అన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. దాని భద్రత పర్యవేక్షణకు అంశాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రత్యేక విభాగం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆదిలోనే అటకెక్కాయి. సాధారణ రైళ్లల్లో జరిగే నేరాలు, రైల్వేస్టేషన్ల పర్యవేక్షణకు గవర్నమెంట్ రైల్వేపోలీసు (జీఆర్పీ) విభాగం ఉన్నట్లే.. మెట్రో రైల్ కోసం మెట్రో రైల్ పోలీస్ ఫోర్స్ (ఎంఆర్‌పీఎఫ్) విభాగాన్ని ఏర్పాటు చేయాలని 2017లో ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ఇప్పటికీ అమలులోకి రాలేదు సరికదా.. ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. -
ఇన్‌స్టా మొరాయింపు: ‘నేను ఎలా బ్రతకగలను’
న్యూఢిల్లీ : మంగళవారం ఉదయంనుంచి ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ సేవలు మొరాయించటంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. భారత కాలమానం ప్రకారం నిన్న ఉదయం 4.07 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో, వీడియో అప్లోడ్, షేరింగ్‌లో వినియోగదారులకు సమస్యలు ఎదురయ్యాయి. దీంతో తమ సమస్యలను ట్విటర్ వేదికగా ఏకరువు పెడుతున్నారు. ‘‘ ఇన్‌స్టాగ్రామ్‌కి ఏమైంది.. నేను రోజంతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చేయలేకపోయాను.. అప్డేట్ను పూర్తిచేయండి లేదా, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించండి... నిన్నటి నుంచి ఫోటో అప్లోడ్ చేయలేకపోతున్నా. నేను ఎలా బ్రతకగలను... ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (యూట్యూబ్ ఛానల్స్ పెట్టేందుకు నో ఛాన్స్...) కాగా, ఇన్స్టాగ్రామ్ మంగళవారం ఉదయం ‘షేర్ యువర్ లైట్’ అనే రియాలిటీ ఫీచర్‌ను రాబోయే దీపావళీ పండుగ దృష్ట్యా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. తమ ఆలోచనలను అందరితో పంచుకోవడానికి ఉపయోగపడే విధంగా దాన్ని రూపొందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎఫెక్ట్స్ గాలరీ ఓపెన్ చేయగానే ‘ఫెస్టివ్ దియా’ ఫీచర్ కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్స్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ న్యూ అప్డేట్ కారణంగానే ఇన్స్టాగ్రామ్ సేవలు మొరాయించాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Me, not being able to post on Instagram for a full day...#instagramdown pic.twitter.com/HiwhwUswd0 — Cristiane Stoll (@StollCristiane) November 11, 2020 -
వేదాంత డీలిస్టింగ్ విఫలం
న్యూఢిల్లీ: సాంకేతిక సమస్యల కారణంతో వేదాంత లిమిటెడ్ డీలిస్టింగ్ ప్రక్రియ సాధ్యపడలేదు. కన్ఫర్మ్ కాని ఆర్డర్ల సంఖ్య భారీ స్థాయిలో ఉండటం, షేర్లను దఖలు చేసే ప్రక్రియలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడం వంటి అంశాలు దీనికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బైబ్యాక్ ప్రక్రియను మరొక్క రోజు పొడిగించే అంశం సహా పలు ప్రత్యామ్నాయాలను కంపెనీ పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీఎస్ఈ గణాంకాల ప్రకారం అక్టోబర్ 9 సాయంత్రం నాటికి షేర్‌హోల్డర్ల దగ్గర 169.73 కోట్ల షేర్లు ఉండగా, ప్రమోటర్లకు వాటాదారులు 137.74 కోట్ల షేర్లను ఆఫర్ చేశారు. వాస్తవానికి 134.12 కోట్ల షేర్ల లభిస్తే ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్ కంపెనీలో 90 శాతాన్ని దాటి డీలిస్టింగ్‌కు మార్గం సుగమమయ్యేది. కానీ కస్టోడియన్ల నుంచి ఆమోదముద్ర లభించకపోవడంతో కొన్ని బిడ్లు ప్రాసెస్ కాలేదు. దీంతో ఆఫర్ చేసిన షేర్ల సంఖ్య 125.47 కోట్లకు తగ్గింది. డీలిస్ట్ చేయడానికి ఇంతకు మించిన స్థాయిలో షేర్లను కొనుగోలు చేయాల్సి ఉండటంతో డీస్టింగ్లో దాఖలైన షేర్లను వాపసు చేసే అవకాశం ఉందని వేదాంత తెలిపింది. డేటా ప్రకారం డీలిస్టింగ్‌కు సంబంధించి చాలా మటుకు షేర్లను రూ. 320 రేటు చొప్పున షేర్హోల్డర్లు ఆఫర్ చేశారు. శుక్రవారం నాటి ముగింపు ధర రూ. 120తో పోలిస్తే ఇది భారీ ప్రీమియం కావడం గమనార్హం. -
ఎన్టీపీసీ రెండవ యూనిట్లో సాంకేతిక లోపం
సాక్షి, విశాఖపట్నం: సింహాద్రి సూపర్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎన్టీపీసీ)లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మంగళవార ప్రాజెక్టులోని రెండవ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం సింహాద్రిలో మూడవ యూనిట్ నుంచి మాత్రమే 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కాగా సింహాద్రిలో ఇప్పటికే ఒకటో యూనిట్, నాలుగో యూనిట్లలో సాంకేతిక కారణాలతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా.. నేడు మరో యూనిట్లో సాంకేతిక లోపంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీని పునరుద్దరణకు సాంకేతిక సిబ్బంది మరమ్మత్తులు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: పరిశ్రమలకు ఊరట, ఉద్యోగులకు షాక్ -
ముందుంది మరో నవోదయం
బెంగళూరు: చంద్రయాన్ –2 ప్రయోగం చివరి క్షణంలో ఎదురైన అడ్డంకిని చూసి శాస్త్రవేత్తలు నిరాశపడొద్దని, సరికొత్త నవోదయం మరోటి మనకోసం ఎదురుచూస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్–2లోని విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయిన క్షణం నుంచే ఇస్రో శాస్త్రవేత్తలను ఊరడించిన ప్రధాని శనివారం ఉదయం ఎనిమిదిగంటలకు వారందరిని కలసి మాట్లాడారు. ‘భారత్ మాతా కీ జై’ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. శాస్త్రవేత్తల్లో నెలకొన్న నిస్తేజాన్ని పోగొట్టి, ఉత్సాహపరిచేందుకు సాంత్వన వచనాలు పలికారు. లక్ష్యాన్ని సాధించే కొద్ది క్షణాల ముందు వైఫల్యం ఎదురవడం తనకూ తెలుసని, సైంటిస్ట్‌ల భావోద్వేగాలను అర్థం చేసుకోగలనని చెప్పారు. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ నిలిచిపోయినపుడు శాస్త్రవేత్తల బాధను చూడలేకే ఇస్రో కేంద్రం నుంచి వెళ్లిపోయానని, ఏదో బోధించడానికి కాకుండా.. మీ నుంచి స్ఫూర్తి పొందేందుకే మళ్లీ ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు. ఇస్రో సాధించిన గత ఘనతలన్నింటికీ భారత్ ఎంతో గర్విస్తోందని, భారత్ మీ వెన్నంటే ఉందన్నారు. ‘లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చాం. భవిష్యత్తులో మరింత పట్టుదలతో పనిచేయాలి. ఈ రోజు నేర్చుకున్న పాఠాలు మనల్ని భవిష్యత్తులో మరింత మెరుగుపరుస్తాయి. శక్తిమంతులుగా తీర్చిదిద్దుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో అసలైన ఘన విజయాలు ముందున్నాయని, కొత్త లక్ష్యదూరాలకు వెళ్లాలని, ఈ ప్రయాణంలో దేశ ప్రజలందరూ ఇస్రో వెన్నంటే ఉన్నారని భరోసా ఇచ్చారు. చంద్రయాన్ –2 సక్సెస్ కోసం శాస్త్రవేత్తలు చేసిన కృషి చాలా విలువైందని కొనియాడారు. విక్రమ్ జాబిల్లిని కౌగిలించుకుంది.. కవులు, కథల్లో జాబిల్లిని భావాత్మకంగా వర్ణించారని, బహుశా విక్రమ్ వీటి ప్రభావానికి లోనై, చివరి క్షణాల్లో జాబిల్లిని కౌగిలించుకుని ఉంటుందని మోదీ చమత్కరించారు. ఈ సంఘటన జాబిల్లిని అందుకోవాలన్న మన సంకల్పాన్ని దృఢం చేసిందన్నారు. ల్యాండర్‌తో సమాచారం తెగిపోయిందని తెలీగానే మీరంతా భావోద్వేగానికి లోనయ్యారు. కానీ, ఈ వైఫల్యం తాత్కాలికం మాత్రమేనని భవిష్యత్ విజయాలకు శక్తినిచ్చే విషయమన్నారు. ‘సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు. ప్రయత్నాలు, ప్రయోగాలే ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. -
పట్టాలపై నిలిచిపోయిన మెట్రో
హైదరాబాద్ : నగరంలోని మెట్రో ప్రయాణికులకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ సమీపంలో రైలు నిలిచిపోయింది. ఉదయం పూట కావడంతో మెట్రోలో జనాలు అధికంగా ఉన్నారు. మెట్రో ట్రాక్‌పై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో 20 నిమిషాల పాటు ప్రయాణికులు ఇబ్బంది పడినట్టుగా సమాచారం. మెట్రో రైలు పట్టాలపై నిలిచిపోవడంతో పలువురు సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విమానంలో సాంకేతిక లోపం; ఏసీ లేకుండానే ప్రయాణం
సాక్షి, తిరుపతి: తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో అధికారులు దానిని నిలిపివేశారు. ఈ కారణంగా ప్రయాణికులు మూడు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. ఆ తర్వాత ఏసీ పనిచేస్తుందని విమానాన్ని ప్రయాణానికి సిద్ధం చేశారు. తీరా బయలుదేరిన సమయంలో ఏసీ మళ్లీ పనిచేయలేదు. దీంతో ఏసీ లేకుండానే ప్రయాణికులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. స్పైస్‌జెట్ సేవలపై ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
సాంకేతిక సమస్యలు మా నెత్తిన వేయకండి
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో సాంకేతిక సమస్యల వల్ల దొర్లిన తప్పులకు రెవెన్యూ ఉద్యోగులను బాధ్యులను చేయడం అన్యాయమని తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి, అధ్యక్షుడు గౌతంకుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి వెబ్సైట్లో ఇచ్చిన ఆప్షన్లు సాంకేతికంగా, లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. ఈ వెబ్సైట్ సిబ్బందికి సరైన నైపుణ్యం లేదని ఆరోపించారు. ధరణి వెబ్సైట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే సబ్ రిజిస్ట్రార్‌కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకంలో దొర్లిన తప్పులను సరి చేయడానికి జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు ఇవ్వాలని తెలిపారు. పార్టు బీ కేసులను పీఓటీ, సాదాబైనామా కేసులను పరిష్కరించడానికి తగిన సమయం ఇవ్వాలని విన్నవించారు. ఈ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సీఎంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.