కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో 500 మెగావాట్ల యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం తలెత్తింది.
జ్యోతినగర్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో 500 మెగావాట్ల యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం తలెత్తింది. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో అధికారులు వెంటనే మరమ్మతులు ప్రారంభించారు. అదేవిధంగా 200 మెగావాట్ల మరో యూనిట్‌లో గత పది రోజుల నుంచి మరమ్మతులు సాగుతున్నాయి. దీంతో మొత్తం 2600 మెగావాట్ల విద్యుత్‌కు గాను ప్రస్తుతం 1900 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది.