NTPC
-
ఎన్టీపీసీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట
జిందాల్ ఐటీఎఫ్ లిమిటెడ్‌కు రూ.1,891 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)ను ఆదేశించిన 2019 మధ్యవర్తిత్వ తీర్పును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ‘పేటెంట్ చట్టవిరుద్ధం’, ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించడమని కోర్టు గుర్తించింది.వివాదం నేపథ్యంఎన్టీపీసీ, జిందాల్ ఐటీఎఫ్ లిమిటెడ్, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) మధ్య 2011లో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం కారణంగా ఈ వివాదం తలెత్తింది. పశ్చిమ బెంగాల్‌లోని ఎన్టీపీసీకి చెందిన ఫరక్కా థర్మల్ పవర్ ప్లాంట్‌కు జాతీయ జలమార్గం ద్వారా బొగ్గు రవాణా చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం. బొగ్గు రవాణాకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి జిందాల్ ఐటీఎఫ్ బాధ్యత వహించింది. మౌలిక సదుపాయాల నిర్మాణ సమయంలో జాప్యం జరిగింది. ఫేజ్ 1 పనులు.. 400 రోజులు, ఫేజ్ 2 పనులు.. 674 రోజులు ఆలస్యం అయ్యాయి. 2017లో జిందాల్ ఐటీఎఫ్ మధ్యవర్తిత్వ చర్యలను ప్రారంభించింది. జాప్యం వల్ల జరిగిన ఆదాయ నష్టానికి ఎన్టీపీసీ పరిహారం కోరింది. తర్వాత జిందాల్ ఐటీఎఫ్తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.ఇదీ చదవండి: మనిషిలా తెలివి మీరుతున్న ఏఐఎన్టీపీసీ ఒప్పందాన్ని రద్దు చేసినందుకు 2019 జనవరిలో మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ జిందాల్ ఐటీఎఫ్‌కు మద్దతుగా రూ.1,891 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కాంట్రాక్ట్ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం, ‘నో డ్యామేజీ’ క్లాజ్ ఉండటం సహా పలు కారణాలను చూపుతూ ఎన్టీపీసీ ఢిల్లీ హైకోర్టులో ఈ తీర్పును సవాలు చేసింది. ట్రిబ్యునల్ నష్టపరిహారాలను సరైన రీతిలో లెక్కించలేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించడమని కోర్టు గుర్తించింది. తగిన శ్రద్ధ, నైపుణ్యంతో ప్రొసీడింగ్స్ నిర్వహించడం మధ్యవర్తి బాధ్యతని కోర్టు నొక్కి చెప్పింది. ఈ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయాలని జిందాల్ ఐటీఎఫ్ యోచిస్తోంది. -
జనాన్ని కాలుష్యంలో ముంచెత్తుతారా?
డిసెంబర్ 19న జరగనున్న ఎన్టీపీసీ 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ జీవించే హక్కుకే వ్యతిరేకం. దీన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి. రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్ టీఎస్టీపీపీ 4,000 మెగా వాట్ల (మె.వా.) విస్తరణలో భాగంగా రెండోదశలో 3గీ800 మె.వా. స్థాపనకు, విద్యుత్పత్తికి పర్యావరణ అనుమతి కోసం (ఈసీ) పెద్దపల్లి కలెక్టర్ ఆధ్వర్యంలో నియమానుసారం... ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నది. కేవలం 13 కి.మీ. దూరంలో గోదావరి నది పక్కన మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఎస్సీసీఎల్ సొంత 1,200 మె.వా. థర్మల్ ప్లాంట్‌కు తోడుగా రామగుండం ఎన్టీపీసీలోని 4,200 మెగా వాట్లకు ఇది నూతన స్థాపిత సామర్థ్య ప్రతిపాదన. కొత్తగా టీజెన్‌కో రామగుండంలో 1,200 మెగావాట్లు, సింగరేణి వారు జైపూర్‌లోనే మరో 1,200 మెగావాట్ల విస్తర ణకు ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వ, ప్రజామోదంతో ఈ పరిశ్రమల ప్రతిపాదనలన్నీ కార్యరూపానికి వస్తే... కేవలం 13 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు ఆధార విద్యుదుత్పత్తి సామర్థ్యం (10,200 మె.వా.) ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర కాలుష్య కేంద్రంగా మారుతుంది.రాక్షసి బొగ్గు, విద్యుత్తు ప్లాంట్లు, సిమెంటు, ఎరువుల పరిశ్రమలన్నీ దేశాభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. వీటికోసం స్థానికంగా రామగుండం, కమాన్‌పూర్, మంచిర్యాల మండలాల్లో సేకరించిన 90,000 ఎకరాల భూమికి ఇప్పుడున్న మార్కెట్ ధరలతో పోల్చితే అత్యంత స్వల్ప పరిహారం సమర్పించారు. ఈ 15 కి.మీ. పరిధిలోని దాదాపు 3 లక్షల పైచిలుకు కుటుంబాలలోని 12 లక్షల మంది ప్రజలు తమ శాశ్వత జీవనాధార వ్యవసాయ, ఉపాధులను కారు చౌకగా త్యాగం చేశారు. అయినా స్థానిక యువతకు భూములు కోల్పోయిన కారణాన పరిహారంగా పట్టుమని 100 ఉద్యోగాలు కూడా అందలేదు. ఈ పచ్చినిజాన్ని అసత్యమని ఎవ్వరైనా అనగలరా?విద్యుత్ భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం క్రిటికల్, సూపర్, అల్ట్రా సూపర్, సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ల ఇంధన దహన సామర్థ్యం 35– 40 శాతం లోపే కదా! దూర ప్రాంతాల థర్మల్ విద్యుత్ స్టేషన్లకు బొగ్గు రవాణా చేసే ఖర్చు ఆదా చేయడానికి రామగుండం నుండి 13 కిలోమీటర్ల పరిధిలో 10,200 మె.వా. సాంద్ర స్థాయిన థర్మల్ విద్యుత్పత్తి చేయ డాన్ని, చౌకధరకు (యూనిట్ 12 రూపాయలు) విద్యుత్పత్తి చేసే నెపంతో అనుమతించడమంటే... రామగుండం నుండి 15 కిలోమీటర్ల పరిధిలో 21,000 మెగావాట్లకు సమానమైన ఉష్ణరాశితో, పరిసరాలను వేడిచేసే హీటర్లతో నిరంతరాయంగా మంటలు పెట్టినట్టే కదా?భారత ప్రభుత్వ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, నవరత్న ఎన్టీపీసీ సంస్థ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారందరూ కలసి స్థానిక ప్రజారోగ్యాలను, జీవన నాణ్యతను రాజ్యాంగ నియమాలను పణంగా పెట్టి ఈ విస్తరణ చేపట్టడం సబబేనా? 15 కిలోమీటర్ల పరిధిలోని పర్యావరణ కాలుష్య మోతాదు తీవ్రతను పరిగణనలోకి తీసుకొన్న తర్వాతే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, ఎమ్ఓఎఫ్ఈసీసీ వారు కొత్త పరిశ్రమలకు, పాతవాటి విస్తరణలకు అనుమతులివ్వా లని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్నెలా విస్మరించారు?సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అధిక లాభాపేక్షతో 706 చ.కి.మీ. విస్తీర్ణంలో అధిక సాంద్ర పారిశ్రా మికీకరణ చేపట్టడమే కదా! తక్కువ స్థలంలో ఎక్కువ ఒత్తిడితో, మనుషులు, జంతువులు కనీసం జీవించలేని పరిస్థితులను సృష్టిస్తున్న వైనాన్ని ప్రశ్నించడం ప్రజల రాజ్యాంగబద్ధ హక్కే కదా! పక్కనే పారుతున్న గోదావరి నది నీరు నాణ్యతా ప్రమాణాల్లో ఏ, బీ, సీ, డీ కేటగిరీలు దాటి హెచ్ కేటగిరీలోకి చేరింది. ఈ నీరు కనీసం జంతువులు తాగడానికి కూడా పనికి రాదు. 1,465 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే గోదావరిని అతి ఎక్కువగా కలుషితపరిచేది, ట్రీట్మెంట్ చేయకుండా రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి మైన్స్ వాడుకొని వదిలేస్తున్న వ్యర్థ జలాలు. ఇందుకు కారణం అది కాదని, పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చెప్పగలరా?ప్రజారోగ్య సంరక్షణార్థం ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్లు విధిగా థర్మల్ స్టేషన్ల నిర్వహణలో అంతర్భాగంగా నిర్మించాలి. పర్యావరణంలోకి విడుదలవుతున్న సల్ఫర్ డయాక్సైడ్ను 2022 నాటికే నివారించవలసిందిగా భారత సుప్రీంకోర్టు కఠినమైన డెడ్‌లైన్ విధించింది. ఇంతవరకు దేశంలో ఎన్నో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వీటి నిర్మాణం ప్రారంభమే కాలేదు. ఉన్నవి కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు.ఎన్టీపీసీ వెబ్సైట్లో స్పష్టంగా చెప్పిన ప్రకారం... 76,531 మె.వా. విద్యుదుత్పత్తి కోసం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 17,794. ఒక మెగా వాట్ విద్యుదుత్పత్తికి ఆరుగురికి ఉద్యోగం కల్పిస్తామని ఎన్టీపీసీ సంస్థ ప్రారంభంలో చెప్పారు. ప్రస్తుత ప్రతిపాదిత 2,400 మెగావాట్లకు 96 మందికి ఉద్యో గాలిస్తామని ఈఐఏ రిపోర్ట్ ‘సోషల్ ఇంపాక్ట్’ సెక్షన్లో చెప్పారు. అంటే, 25 మెగావాట్ల స్థాపనకు ఒక ఉద్యోగాన్ని కల్పించగలుగుతారట. రేపు ఆచరణలో ఏం చేస్తారో తెలియదు.చదవండి: మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?ఈ ప్రాంతంలో స్థానికంగా ప్రతిపాదిత ప్లాంట్‌కు 15 కి.మీ. పరిధిలోని పరిసర ప్రాంతాలలో 12 లక్షల జనాభా ప్రతీ క్షణం పీల్చుకుంటున్న సాధారణ గాలి నాణ్యతా ప్రమాణం 45కు దిగువన ఉందనీ, ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు దిగువన, ధ్వని తీవ్రత 50 డెసిబల్స్‌కు దిగువన ఉన్నాయనీ... అంటే అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని అవాస్తవ సమాచారాన్ని నివేదికలో సమర్పించి, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ద్వారా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పొందారు. మరిన్ని పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజాభిప్రాయ సేకరణకు రామగుండం ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టుకు పూనుకుంటున్నది.ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టులో సుప్రీంకోర్టు ఆర్డర్లు, పర్యావరణ చట్టాలు తెలియనట్లు అమాయక రీతిలో 10 కి.మీ. పరిధిలో సర్వే చేసినామని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదించిన ప్రాంతంలో... గాలి నాణ్యత 48 ఏక్యూఐ కన్నా దిగువన ఉన్నట్టు, ధ్వని తీవ్రత 40 డెసిబెల్స్ కన్నా తక్కువ ఉన్నట్టు, స్థానికంగా అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లు రాయడం పచ్చి అబద్ధాలే.చదవండి: మళ్లీ తెరపైకి రెండో రాజధాని?నిరూపిత శాస్త్ర సాంకేతిక సత్యాల పరిమితిలో విషయాలను అర్థం చేసుకోవాలి. రామగుండం ఎన్టీపీసీ– టీఎస్ఎస్టీపీపీ ప్రతిపాదిత 2,400 మె.వా. విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయదలచిన వేదికపై ఈ విషయాలన్నీ కలెక్టర్ గారు అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి చొరవ చూపాలి.ఇదివరకే జంతువులు, మనుషులు జీవించడానికి వీలుకాకుండా పరిసరాలు అధిక సాంద్ర పారిశ్రామికీకరణ వల్ల విధ్వంసమైపోయాయి. అందుకే జల, వాయు, ఘన వ్యర్థాల కాలుష్యాన్ని పరిహరించాలి. గాలి నాణ్యతను మెరుగుపరచాలి. సర్వత్రా కలుషితమైన భూగర్భ జలాలనూ, గోదావరి నదినీ మెరుగుపరిచే అన్ని చర్యలూ తీసుకోవాలి. ఇకముందు సుస్థిరాభివృద్ధికి దోహదం చేసే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ పరి శ్రమలనే ఈ కాలానికి కావలసినవిగా గుర్తించాలి. దేశాభివృద్ధి కోసం అంతటా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిర్మించాలి.- ఉమామహేశ్వర్ దహగామపర్యావరణ నిపుణులు -
అదే ఒప్పందం మళ్లీ..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)తో ఒప్పందం చేసుకుంటే.. సీఎం చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే సంస్థతో మరోసారి ఒప్పందం చేసుకున్నారు. నిజానికి.. గత ఏడాది ఫిబ్రవరి 9న నాటి సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ).. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. అనంతరం.. ఈ ఏడాది ఫిబ్రవరి 24న సీఎస్ సమక్షంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్–రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కూడా జరిగింది. అయితే, ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పనులు ప్రారంభించలేదు. అలాగే, అప్పట్లోనే ఎన్టీపీసీకి థర్మల్ పవర్ కోసం కేటాయించిన భూములను కూడా గ్రీన్ ఎనర్జీ కోసం కేటాయిస్తూ నాటి జగన్ ప్రభుత్వమే మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో.. గురువారం అదే ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీతో మళ్లీ ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్జీఈఎల్) మధ్య ఈ ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు రూ.1,87,000 కోట్లు ఎన్జీఈఎల్ పెట్టుబడి పెట్టనుందని ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనిద్వారా రాష్ట్రంలో దాదాపు 1,06,250 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందని.. అలాగే, రానున్న 25 ఏళ్లలో దాదాపు రూ.20,620 కోట్ల లబ్ధి రాష్ట్రానికి చేకూరనుందని తెలిపింది.పునరుత్పాదక విద్యుత్‌దే భవిష్యత్తు..ఈ ఒప్పందం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా చేసే క్రమంలో ఇది కీలక అడుగన్నారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. భవిష్యత్తు అంతా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్‌ను 2027 ఏప్రిల్ మే నాటికి పూర్తిచేయాలని సీఎం తెలిపారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 78.50 గిగావాట్ల సౌరశక్తి, 35 గిగావాట్ల పవన శక్తి, 22 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ, 1.50 ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ లక్ష్యంతో రాష్ట్ర ఇంధన మౌలిక అవసరాలు తీరడమే కాకుండా, రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎన్టీపీసి గ్రీన్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ గురుదీప్ సింగ్, ఎన్జీఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్. సారంగపాణి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ట్రాన్స్‌కో, జెన్కో అధికారులున్నారు. -
ఎన్టీపీసీ గ్రీన్ రూ. లక్ష కోట్ల పెట్టుబడి
ముంబై: ఐపీవో బాటలో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 2026–27 నాటికి సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ.1 లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిలో 20 శాతం ఈక్విటీ రూపంలో రావాలంటే.. విస్తరణ కోసం రూ.20,000 కోట్ల సొంత నిధులు అవసరమవుతాయని సంస్థ సీఎండీ గుర్దీప్ సింగ్ వెల్లడించారు.రాబోయే ఐపీవో ద్వారా రూ.10,000 కోట్ల నిధులు వస్తాయని అన్నారు. కంపెనీ అంతర్గత వనరుల ద్వారా మిగిలిన మొత్తాన్ని సేకరించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ఏజెన్సీల నుండి కంపెనీ మెరుగైన క్రెడిట్ రేటింగ్‌ను పొందుతోందని, ఇది పోటీ కంపెనీలతో పోల్చినప్పుడు తక్కువ రేట్లతో రుణాన్ని అందుకునేందుకు వీలు కల్పిస్తుందని సింగ్ చెప్పారు. ఇతర విభాగాల్లోకీ ఎంట్రీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకూడదని, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ పవర్, ఎనర్జీ స్టోరేజీ విభాగాల్లో ఎంట్రీపై కూడా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌ను నెలకొల్పడానికి విశాఖపట్నం సమీపంలోని 1,200 ఎకరాల భూమిని చాలా సంవత్సరాల క్రితం ఎన్టీపీసీ తీసుకుంది. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని సింగ్ వెల్లడించారు. 2027కల్లా 19,000 మెగావాట్లు.. ప్రస్తుతం 3,220 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. 2025 మార్చికి 6,000 మెగావాట్లకు, 2026 మార్చి నాటికి 11,000 మెగావాట్లకు, 2027 మార్చి కల్లా 19,000 మెగావాట్లకు సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 11,000 మెగావాట్లకు సమానమైన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని సింగ్ వెల్లడించారు.నవంబర్ 19 నుంచి ఐపీవో.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో నవంబర్ 19న ప్రారంభమై 22న ముగుస్తుంది. ఒక్కొక్కటి రూ.102–108 ప్రైస్ బ్యాండ్‌తో రూ.10,000 కోట్ల వరకు విలువైన తాజా షేర్లను జారీ చేయడానికి కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం 138 షేర్లతో కూడిన లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి వాటాలు కావాల్సినవారు మరిన్ని లాట్స్‌కు బిడ్లు వేసుకోవచ్చు.ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 75 శాతం, నాన్–ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాలు కేటాయిస్తారు. అర్హత కలిగిన కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.5 డిస్కౌంట్‌ను ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆఫర్ చేస్తోంది. ఉద్యోగుల కోటాకై రూ.200 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. హ్యుండై మోటార్ ఇండియా, స్విగ్గీ తర్వాత ఈ ఏడాది మూడవ అతిపెద్ద ఐపీవోగా ఇది నిలవనుంది. -
ఎన్టీపీసీతో చేతులు కలిపిన ఓఎన్జీసీ: ఎందుకంటే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ తాజాగా చేతులు కలిపాయి. తద్వారా నూతన, పునరుత్పాదక ఇంధన విభాగంలో అవకాశాలను అన్వేషించనున్నాయి. ఇందుకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ అనుబంధ సంస్థల ద్వారా భాగస్వామ్య కంపెనీ(జేవీ)కి తెరతీయనున్నాయి.చమురు దిగ్గజం ఓఎన్జీసీ సహకారంతో కొత్తతరం ఇంధన అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు విద్యుత్ రంగ దిగ్గజం ఎన్టీపీసీ పేర్కొంది. ఓజీఎల్తో సమాన భాగస్వామ్య(50:50 వాటా) కంపెనీ(జేవీసీ) ఏర్పాటుకు వీలుగా కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఎన్జీఈఎల్ దరఖాస్తు చేసినట్లు తెలియజేసింది.సోలార్, విండ్, ఎనర్జీ స్టోరేజీ, ఈమొబిలిటీ, కార్బన్ క్రెడిట్స్ తదితర న్యూ ఎనర్జీ అవకాశాలపై జేవీ పనిచేయనున్నట్లు వివరించింది. పునరుత్పాదక ఇంధన ఆస్తుల కొనుగోలుతోపాటు.. తమిళనాడు, గుజరాత్‌లలో రాబోయే ఆఫ్‌షోర్ విండ్ టెండర్లలో పాలుపంచుకునే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. -
నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్‌లు ఇవే..
పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి దేశంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిద్ధం చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌కు ఇటీవల ప్రధాన నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.800 కోట్లతో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందులో 56 మెగావాట్లు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా, మరో 120 మెగావాట్ల పవర్‌ను గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ద్వారా సమకూర్చాలని ప్రతిపాదించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ కాంట్రాక్ట్ పొందింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సాధారణంగా అధిక విస్తీర్ణంలో భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అదే నీటిపై తేలాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ ఇబ్బంది ఉండదు. రెండింటిలో ఏ ప్లాంటైనా మౌలిక సదుపాయాల ఖర్చు ఎలాగూ ఉంటుంది. దాంతో తక్కువ ఖర్చుతో కూడుకున్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌లకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ రామగుండం: స్థాపిత సామర్థ్యం-100 మెగావాట్లు, ఇది 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కాయంకులం: స్థాపిత సామర్థ్యం-92 మెగావాట్లు. కేరళలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 450 ఎకరాల సరస్సుపై ఏర్పాటు చేశారు.రిహాండ్ డ్యామ్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్: స్థాపిత సామర్థ్యం-50 మెగావాట్లు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది.సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్: దీని స్థాపిత సామర్థ్యం-25 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 75 ఏకరాల్లో ఇది విస్తరించి ఉంది.ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్: దీని అంచనా సామర్థ్యం-600 మెగావాట్లు. మధ్యప్రదేశ్‌లో దీని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
ఎన్టీపీసీ రూ. 2.50 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ లాభం 14 శాతం ఎగిసి రూ. 5,380 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 4,726 కోట్లు. అయితే, ఆదాయం రూ. 45,385 కోట్ల నుంచి రూ. 45,198 కోట్లకు తగ్గింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ గల షేర్లపై రూ. 2.50 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ఇచ్చే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ నవంబర్ 18గా ఉంటుంది. లడఖ్‌లోని చుషుల్‌లో సోలార్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు భారతీయ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. రెండో త్రైమాసికంలో స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్ యూనిట్ల నుంచి 88.46 యూనిట్లకు తగ్గింది. క్యాప్టివ్ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి 5.59 మిలియన్ టన్నుల నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది. గ్రూప్ స్థాయిలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 73,824 మెగావాట్ల నుంచి 76,443 మెగావాట్లకు చేరింది. -
ఐపీవోల హవా
రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతున్న సెకండరీ మార్కెట్ల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం భారీ సంఖ్యలో ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా రెండు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వివరాలు ఇలా.. –సాక్షి, బిజినెస్డెస్క్ఐపీవో చేపట్టేందుకు సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ వారీ ఇంజినీర్స్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందింది. ఇదేవిధంగా డిజిటల్ పేమెంట్ల సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. వారీ సెబీకి 2023 డిసెంబర్లో, మొబిక్విక్ 2024 జనవరిలో దరఖాస్తు చేశాయి. వారీ ఇంజినీర్స్.. రూ. 3,000 కోట్లకుపైగా వారీ ఇంజినీర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 32 లక్షల షేర్లను ప్రమోటర్‌తోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఒడిషాలో 6 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ 2023 జూన్‌కల్లా 12 గిగావాట్ల పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొబిక్విక్.. రూ. 700 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మొబిక్విక్ రూ. 700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సై అంటోంది. ఐపీవో నిధుల్లో రూ. 250 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ వృద్ధికి వినియోగించనుంది. రూ. 135 కోట్లు పేమెంట్ సరీ్వసుల బిజినెస్‌కు దన్నుగా వెచ్చించనుంది. మరో రూ. 135 కోట్లు డేటా, మెషీన్ లెర్నింగ్, ఏఐ, ప్రొడక్ట్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో పేమెంట్ పరికరాలపై రూ. 70 కోట్లు పెట్టుబడి వ్యయాలుగా కేటాయించనుంది. రూ. 10,000 కోట్లపై కన్ను విద్యుత్ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ భారీ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గత వారమే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా నవంబర్ తొలి వారంలో ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ముంబైసహా.. సింగపూర్ తదితర దేశాలలో రోడ్‌షోలకు ప్రణాళికలు వేసింది.ఇష్యూ నిధుల్లో రూ. 7,500 కోట్లు అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ రుణ చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఈ మహారత్న కంపెనీ 2024 ఆగస్ట్‌కల్లా 3,071 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 60 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచి్చన నేపథ్యంలోనూ మరిన్ని కంపెనీలు ఇందుకు తెరతీస్తుండటం విశేషం! ఇదే బాటలో లీలా ప్యాలెస్ లీలా ప్యాలెస్ హోటళ్ల నిర్వాహక సంస్థ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. వెరసి దేశీ ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. కాగా.. ఇష్యూలో భాగంగా లీలా ప్యాలెస్ రూ. 3,000 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ డీఐఎఫ్సీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ దన్నుగల ష్లాస్ బెంగళూరు వెల్లడించింది. 2024 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 4,053 కోట్లుగా నమోదైంది. ద లీలా బ్రాండ్‌తో కంపెనీ విలాసవంత హోటళ్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. మొత్తం 3,382 గదులను కలిగి ఉంది.రూ. 1,100 కోట్ల సమీకరణరియల్టీ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తెరతీసింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీతోపాటు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాసాగ్రాండ్ బ్రాండుతో కంపెనీ రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతోంది. 2023–24లో రూ. 2,614 కోట్ల ఆదాయం, రూ. 257 కోట్ల నికర లాభం ఆర్జించింది.14ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ ఐపీవోలకు 28 కంపెనీలు ఈ నెల(సెప్టెంబర్) 14 ఏళ్ల తదుపరి సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెపె్టంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు పరివర్తనలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెపె్టంబర్ బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌్రస్కయిబ్ అవుతున్నట్లు వివరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోలలో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
ఎన్టీపీసీ విద్యుత్తు తెలంగాణకు అక్కర్లేదా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాష్ట్ర ప్రజలకు వీలైనంత ఎక్కువ కరెంట్‌ను అందుబాటులో ఉంచాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు రాష్ట్ర సర్కారు సహకరించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన పలు దఫాలుగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖల వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు.పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేపట్టే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఆమోదముద్ర వేశారని గుర్తుచేశారు. ‘దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. ఎస్టీపీపీ–2 ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తిని పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగా పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి 4 సార్లు లేఖలు రాసినా జవాబు రాలేదు’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రం స్పందించని పక్షంలో ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. ‘గత మేనెల 30న దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. అలాగే మార్చి 2024లో తెలంగాణలో గరిష్టంగా (పీక్ పవర్ డిమాండ్) 15.6 గిగావాట్ల డిమాండ్ ఎదురైంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనాల ప్రకారం.. 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుంది.దీనిని దృష్టిలో ఉంచుకుని పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు.. రెండోదశ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరముంది. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తొలి హక్కు రాష్ట్ర ప్రజలదే. కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా, దానిని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని మరోసారి నిరూపితమైంది’అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలని సూచించారు. -
ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో సన్నాహాలు
ముంబై: పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల ఎంపికను చేపట్టినట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా పునరుత్పాదక రంగ కంపెనీ రూ. 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తద్వారా 2022లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ తదుపరి అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తెరతీయనుంది. నిధులను సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా తదితర భవిష్యత్ ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలకు పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఐపీవో కోసం ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ను షార్ట్‌లిస్ట్ చేసింది. -
ఎన్టీపీసీ విద్యుత్ ఇక చాలు..!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 2,400 (3్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రెండో దశ తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో అది రాష్ట్రానికి పెనుభారంగా మారే ప్రమాదముందని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 5–8 ఏళ్ల సమయం పట్టనుందని, దీని ద్వారా వచ్చే విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 8–9 ఎగబాకుతుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. బహిరంగ మార్కెట్లో దీనికన్నా తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండగా ఇంత భారీ ధరతో 25 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే రాష్ట్ర ప్రజలపై రూ. వేల కోట్ల అనవసర భారం పడుతుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీతో రెండో దశ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. సత్వరమే ఒప్పందం చేసుకోకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని ఎన్టీపీసీ ఇటీవల రాష్ట్రానికి అల్టిమేటం జారీ చేయడంతో దీనిపై సమీక్షించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది. విభజన చట్టం కింద ఏర్పాటు..: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇచ్చింది. అందులో తొలి దశ కింద 1,600 (2 ్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. రెండో దశ కింద 2,400 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించాల్సి ఉంది. తొలి దశ ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 5.90 ఉండగా ఒప్పందం కారణంగా కొనుగోలు చేయకతప్పని పరిస్థితి ఉంది. గత సర్కారు తప్పిదమే! రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్‌లో 2,400 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందకపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వ తప్పిదమేనని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రెండో దశ కింద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వీలుగా ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా పదేళ్లపాటు కాలయాపన చేయడమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అప్పట్లో ఒప్పందం చేసుకొని ఉంటే ఇప్పటికే నిర్మాణం పూర్తై తక్కువ ధరకు విద్యుత్ రాష్ట్రానికి వచ్చేదని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పడు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత సర్కారు అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేయడంతోపాటు విచ్చలవిడి విధానాలను అనుసరించడం వల్ల గత పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు దివాలా తీశాయని కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. ఇక కొత్త థర్మల్ ప్లాంట్లకు స్వస్తి.. దామరచర్లలో తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నాలుగేళ్ల కిందే పూర్తికావాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఈ జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ. 6–10 కోట్లకు పెరిగింది. కాలంచెల్లిన సబ్–క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి విద్యుత్ కేంద్రం వ్యయం సైతం భారీగా పెరగడంతో దాని విద్యుత్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ సర్కారు న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చింది. ప్రత్యామ్నాయంగా మార్కెట్లో రూ. 2–4కు యూనిట్ చొప్పున లభిస్తున్న పునరుద్పాదక విద్యుత్‌తో రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం సౌర, జల, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ విద్యుత్‌పై సర్కారు దృష్టిపెట్టనుంది. -
కరెంట్ కొంటారా .. లేదా ?
సాక్షి, హైదరాబాద్: రామగుండంలోని రెండో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై నేషనల్ థర్మల్ పవర్‌కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమ్మతి తెలపకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు ఆ విద్యుత్‌ను సరఫరా చేస్తామని హెచ్చిరించింది. రెండో విడత విద్యుత్ కేంద్ర నిర్మాణంలో పురోగతిపై సమాచార హక్కుచట్టం కింద జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ వివరాలు కోరగా, ఎన్టీపీసీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఎన్టీపీసీ విధించిన గడువు ముగిసినా, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేయలేదు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధనశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. మూడు లేఖలు రాసినా స్పందించని రాష్ట్రం తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇవ్వగా, తొలి విడత కింద రామగుండంలో 1600(2గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంటేనే కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. తొలి విడత ప్రాజెక్టులోని 1600 మెగావాట్ల విద్యుత్‌లో 85 శాతం కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎన్టీపీసీతో ఒప్పందం(పీపీఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగానే బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించి తొలి విడత విద్యుత్ కేంద్రాన్ని ఎన్టీపీసీ నిర్మించింది. రెండో విడత కింద 2400 (3గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి ఎన్టీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన రుణాల సమీకరణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గతేడాది అక్టోబర్ 5న లేఖ రాసింది. స్పందన లేకపోవడంతో మళ్లీ గత జనవరి 9న రెండోసారి లేఖ రాసింది. అయినా స్పందన లేకపోవడంతో జనవరి 29న మూడోసారి రాసిన లేఖలో 12రోజుల్లోగా అనగా, గత ఫిబ్రవరి 10లోగా సమ్మతి తెలపాలని అల్టిమేటం జారీ చేసింది. సమ్మతి తెలపని పక్షంలో తెలంగాణ రెండో విడత ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా లేదని భావించి ఇతరులకు ఆ విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ ఆసక్తి చూపిస్తే తొలి ఏడాది యూనిట్‌కు రూ.4.12 చొప్పున విద్యుత్ విక్రయిస్తామని తెలిపింది. దేశంలో గణనీయంగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టూ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, సత్వరంగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది. తొలి విడత ప్రాజెక్టు వ్యయం రూ.11,572 కోట్లు రెండో విడత ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్టుకు ఆమోదం లభించిందని, టెక్నికల్ స్టడీ పురోగతిలో ఉందని ఎన్టీపీసీ తెలిపింది. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసిందని వెల్లడించింది. శక్తి పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు సింగరేణి బొగ్గు కేటాయిస్తూ గత జనవరి 3న స్టాండింగ్ లింకేజీ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. 1600 మెగావాట్ల తొలి విడత ప్రాజెక్టు నిర్మాణానికి గత జనవరి 31 వరకు రూ.11,572 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. -
తెలంగాణకు విద్యుత్.. ఎన్టీపీసీ నోఖ్రా ప్రాజెక్ట్ నేడు జాతికి అంకితం
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ఎన్టీపీసీకి చెందిన 300 మెగావాట్ల నోఖ్రా సోలార్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిబ్రవరి 16న జాతికి అంకితం చేస్తున్నారు. బికనీర్ జిల్లాలో 1,550 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు విస్తరించింది. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి అందించడానికి రూ.1,803 కోట్ల పెట్టుబడితో సీపీఎస్‌యూ పథకం (ఫేజ్– ఐఐ) కింద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. 13 లక్షల పైచిలుకు సోలార్ పీవీ మాడ్యూల్స్ వినియోగించారు. ప్రాజెక్టు పూర్తి అయితే ఏటా 730 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఎన్టీపీసీ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ 1.3 లక్షలకుపైగా గృహాల్లో వెలుగులు నింపుతుందని వివరించింది. అలాగే ఏటా 6 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని తెలిపింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులతో 3.4 గిగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. 26 గిగావాట్ల సామర్థ్యం గల వివిధ ప్రాజెక్టులు పలు నిర్మాణ దశల్లో ఉన్నాయి. -
ఓఎన్జీసీ, ఎన్టీపీసీ జేవీ
గోవా: దేశీ చమురు–గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ, అతిపెద్ద విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ జాయింట్ వెంచర్ ఒప్పందంపై ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమం వేదికగా బుధవారం సంతకం చేశాయి. ఈ జేవీ ద్వారా భారత్‌తోపాటు విదేశాల్లో పవన విద్యుత్ ప్రాజెక్టులను ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేస్తాయి. స్టోరేజ్, ఈ–మొబిలిటీ, కార్బన్ క్రెడిట్, గ్రీన్ క్రెడిట్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారంతోపాటు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ వంటి విభాగాల్లోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తాయి. -
18లోగా బకాయిలు చెల్లించకపోతే కరెంట్ కట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన రూ.930 కోట్ల బకాయిలను ఈనెల 18 లోగా చెల్లించని పక్షంలో రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో గడువులోగా బకాయిలు చెల్లించేందుకు తెలంగాణ ట్రాన్స్ కో యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. బకాయిలు చెల్లించడంలో విఫలమైతే ఎన్టీపీసీ నుంచి రాష్ట్రానికి వస్తున్న విద్యుత్ సరఫరా ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి నిలుపుదల కానుంది. ఉత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కి సంబంధించిన బిల్లులను నిర్దేశిత గడువులోగా చెల్లించడంలో విఫలమైతే ఆయా రాష్ట్రాలకు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయాలని రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం లేట్ పేమెంట్ సర్‌చార్జ్ రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారమే రాష్ట్రానికి విద్యుత్ ఆపేస్తామని ఎన్టీపీసీ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు సకాలంలో బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తున్నాయి. -
ఇక ఆపండి.. కిషన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. తెలంగాణలో కరెంట్‌పై కట్టుకథలు మానుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత.. రాష్ట్రంలో కరెంటు సరఫరాపై కట్టు కథలు చెప్పడం మానుకోండి కిషన్ రెడ్డి. తెలంగాణ విద్యుత్తు పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతోంది. అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్తులో పెద్దపల్లి ఎన్టీపీసీ ద్వారా వస్తున్నది కేవలం నాలుగు శాతం మాత్రమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయవద్దని కిషన్ రెడ్డికి సూచించారు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని, విద్యుత్తు లోటు నుంచి మిగులు విద్యుత్ వరకు రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. Telangana’s peak demand is 15500 MWs, this NTPC plant gives 680 MWs to Telangana. Essentially that accounts to only 4% of power that Telangana utilises. @kishanreddybjp Anna … kindly stop spreading lies about how uninterrupted power is given by Central Government. It is the… https://t.co/M4kP42JVOy — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 7, 2023 ఇక, అంతకుముందు కిషన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా..పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలకు కవిత కౌంటిరిచ్చారు. -
పని పూర్తి చేసే సంస్కృతి మాది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్‌ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్‌నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్‌తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు. తెలుగులో ప్రారంభించి.. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. ప్రధాని మోదీ నిజామాబాద్‌లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ.. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్‌కు పచ్చజెండా.. ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్‌నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం -
కొత్త రకం బస్సు.. దేశంలో తొలిసారి
దేశంలో ఇప్పటి వరకూ ఎన్నో రకాల బస్సులను చూశాం. డీజిల్ నడిచే బస్సులతోపాటు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బస్సులు కూడా పెరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారిగా కొత్త రకం బస్సు పరుగులు తీయనుంది. అదే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు. అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని లేహ్ రోడ్లపై తిరగనుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) చేపట్టింది. కార్బన్-న్యూట్రల్ లడఖ్‌ను సాధించే దిశగా ఎన్టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. లేహ్ ఇంట్రాసిటీ రూట్లలో ఆపరేషన్ కోసం ఐదు ఫ్యూయల్ సెల్ బస్సులను అందజేస్తున్నట్లు కంపెనీ ప్రకటన తెలిపింది. మూడు నెలలపాటు ఉండే ఫీల్డ్ ట్రయల్స్, రోడ్వర్తీనెస్ టెస్ట్‌లు, ఇతర చట్టబద్ధమైన ప్రక్రియల్లో భాగంగా మొదటి హైడ్రోజన్ బస్సు ఆగస్టు 17న లేహ్‌కు చేరుకుంది. దేశంలో హైడ్రోజన్ ఇంధన బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి. 11,562 అడుగుల ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా 1.7 మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ప్రతికూల వాతావరణానికి సరిపోరిపోయేలా ఈ బస్సులను రూపొందించారు. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలవాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బస్సుల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను 2020 ఏప్రిల్‌లో దక్కించుకున్న అశోక్ లేలాండ్ సంస్థ.. ఒక్కొక్కటి రూ. 2.5 కోట్లకు అందజేసింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ బస్సుల్లో ఛార్జీలు సాధారణ డీజిల్ బస్సుల్లో ఛార్జీల మాదిరిగానే ఉంటాయి. దీనివల్ల వాటిల్లే నష్టాన్ని ఎన్టీపీసీనే భరించనుంది. -
నెలాఖరులోగా గ్రిడ్‌కు ‘సూపర్ థర్మల్’!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న 1,600 (2 *800) మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి దశలోని 800 మెగావాట్ల యూనిట్‌ను ఈ నెలాఖరులో గా గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. తొలి యూనిట్ ద్వారా గత రెండు వారాలుగా 650 మెగావాట్ల వరకు నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్తగా నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు, సామర్థ్యం పరీక్షల్లో భాగంగా నిరంతరంగా 72 గంటల పాటు పూర్తి స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాణిజ్యపరమైన ఉత్పత్తికి అర్హత సాధించిన తేదీ(కమర్షియల్ ఆపరేటింగ్ డేట్/సీఓడీ)ని ప్రకటిస్తారు. సీఓడీ ప్రకటన తర్వాత విద్యుత్ కేంద్రాన్ని గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 800 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యంతో తొ లి యూనిట్లో విద్యుదుత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ ఏ ర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను 27 నుంచి గ్రిడ్‌కు సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్‌కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) నుంచి ఇటీవల స్లాట్లను పొందింది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులోగా తొలి యూనిట్ సీఓడీ ప్రకటన ప్రక్రియ పూర్తి చేసుకుని గ్రిడ్‌కు అనుసంధానం కానుంది. వచ్చే అక్టోబర్‌లో రెండో యూనిట్‌కు సీఓడీ ప్రక్రియ నిర్వహించాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణంలో మూడున్నరేళ్ల జాప్యం ! ఎన్టీపీసీ తొలి యూనిట్ నుంచి జూన్ 2020, రెండో యూనిట్ నుంచి నవంబర్ 2020 నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును జూలై 2023కు పొడిగించారు. యూనిట్–1 నిర్మా ణం దాదాపు 8 నెలల కిందటే పూర్తయింది. కాగా, బాయిలర్‌లోని రీహీటర్ ట్యూబ్స్‌కు పగుళ్లు రావడంతో గత డిసెంబర్లో జరగాల్సిన సీఓడీ ప్రక్రియను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరమ్మతుల్లో భా గంగా ట్యూబ్స్‌కు పగుళ్లు వచ్చి న చోట కట్ చేసి వెల్డింగ్‌తో మళ్లీఅతికించారు. ఏకంగా 7,500 చోట్లలో వెల్డింగ్ చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచి్చన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాల్సి ఉండగా, తొలి దశ కింద 1,600 మెగా వాట్ల కేంద్రాన్ని నిర్మి స్తున్న విషయం తెలిసిందే. రూ.10,599 కోట్ల అంచనా వ్య యంతో తొలి దశ ప్రాజెక్టును చేపట్టగా, గత మార్చి నాటికి రూ.10,437 కోట్ల వ్య యం జరిగింది. పనుల్లో జాప్యంతో అంచనా వ్యయా న్ని రూ.10,998 కోట్లకు పెంచారు. డిస్కంలకు ఊరట..! ఎన్టీపీసీ తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే నిరంతరం పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు వీలుపడుతుంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్‌ను రాష్ట్ర పంపిణీ సంస్థ (డిస్కం)లు అధిక ధరలతో పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే విద్యుత్ కొనుగోళ్ల భారం కొంత వరకు తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు. -
ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి
సాక్షి, అనకాపల్లి/ విశాఖపట్నం: అనకాపల్లిలోని పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎన్టీపీసీలో కేబుల్ ట్రాక్ విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాంలో మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో 50 అడుగుల ఎత్తులో కేబుల్ ట్రాక్ నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కేబుల్ ట్రాక్ విరిగిపడటంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్ -
ఎన్టీపీసీ లాభం రూ.4,907 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.4,907 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,978 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం రూ.43,561 కోట్ల నుంచి రూ.43,390 కోట్లకు తగ్గింది. జూన్ క్వార్టర్లో 103.98 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 104.42 బిలియన్ యూనిట్లుగా ఉంది. కోల్ ప్లాంట్లలో లోడ్ ఫ్యాక్టర్ 77.43 శాతంగా ఉంది. -
రూ.లక్ష కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్
సాక్షి, విశాఖపట్నం : తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ఎన్టీపీసీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంది. సుమారు రూ.లక్ష కోట్లతో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తొలి విడత పనులను 2026కు, మొత్తం 2030నాటికి పూర్తి చేసే దిశగా ఎన్టీపీసీ ప్రణాళికలు సిద్ధంచేసింది. 1,200 ఎకరాల్లో ఏర్పాటు... రాబోయే 20 ఏళ్లలో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులను క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఏపీ సిద్ధమవుతోంది. ఈ స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా భూతాపం, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇందులో భాగంగా దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయిన ఎన్టీపీసీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ పరిష్కృత ప్రాజెక్టు ఏర్పాటుపై జరిగిన ఒప్పందంలో భాగంగా పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు తొలి విడత పనులను ఇటీవల ఎన్టీపీసీ ప్రారంభించింది. తొలి విడతలో 1,500 టన్నుల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ హబ్‌లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సంబంధిత ఎక్వీప్మెంట్ ఉత్పత్తి, ఎగుమతులకు అవసరమైన మాన్యుఫ్యాక్చరింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీఐఐసీ 1,200 ఎకరాలను ఎన్టీపీసీకి కేటాయించింది. ఈ భూమిని చదును చేసే ప్రక్రియ మొదలైంది. మొదటి విడత ప్రాజెక్టు ప్రక్రియ పనులకు అవసరమైన మేర స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు ఎన్టీపీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 9,000 ఎండబ్ల్యూహెచ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లు వారంలో ఖరారు ఇప్పటికే ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు ఫేజ్–1 పనులు ప్రారంభించిన ఎన్టీపీసీ... 9,000 మెగావాట్‌హవర్ (ఎండబ్ల్యూహెచ్) స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లని ఈ వారంలో ఖరారు చేయనుంది. మొదటి విడత పనులను 2026 నాటికి పూర్తి చేయనుంది. సుమారు రూ.లక్ష కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొత్తం పనులను 2030నాటికి పూర్తి చేసి దేశానికి అంకితమిచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎన్టీపీసీ డైరెక్టర్(ఫైనాన్స్) శ్రీనివాసన్ తెలిపారు. ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్స్, షెడ్లను నిర్మించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్పత్తి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. సోలార్ రూఫ్‌టాప్‌లు, ఎలక్ట్రోలైజర్స్, ఫ్యూయల్ సెల్స్, బ్యాటరీలు, సోలార్ వేపర్స్, సోలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్ ఎక్విప్మెంట్, కార్బన్ క్యాప్చర్ సిస్టమ్స్ తదితర కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఉత్పత్తులు ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లో తయారు కానున్నాయి. దక్షిణాసియా దేశాల మార్కెట్ కోసం రోజుకు 1,300 టన్నుల గ్రీన్ అమ్మోనియా, 1,200 టన్నుల గ్రీన్ ఇథనాల్ సహా గ్రీన్ హైడ్రోజన్, ఇతర ఉత్పత్తులు ఎగుమతి చేసే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి 13.4 గిగావాట్ల సోలార్, 20 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం, నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఎన్టీపీసీ ప్రకటించింది. -
సింగరేణి @ 4000 మెగావాట్లు !
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ విద్యుదుత్పత్తి రంగంలో తెలంగాణ జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానంగా కొత్త విద్యుత్ కేంద్రాల స్థాపన ద్వారా తమ థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 4000 మెగావాట్లకు పెంచుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిపిన సింగరేణి సంబురాల్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఈ విషయాన్ని ప్రకటించారు. సింగరేణి సంస్థ ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 2 వేల ఎకరాల్లో 1,200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల కొత్త సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను ఇటీవలే ప్రారంభించింది. 800 మెగావాట్ల మరో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2800 మెగావాట్లకు పెంచుకోలని ఈ ఏడాది ప్రారంభంలోనే సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా 4000 మెగావాట్లకు థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించడంతో, మరో 1200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉండనుంది. 4400 మెగావాట్లకూ పెరిగే అవకాశం.. కొన్నేళ్ల నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 600 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు. దాంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 1600(2్ఠ800) మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లను సింగరేణి నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సింగరేణి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 4400 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉంది. జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ.. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) రాష్ట్రంలో మొత్తం 4042.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ పూర్తి సామర్థ్యం 8042.5 మెగావాట్లకు పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎన్టీపీసీ’ రామగుండంలో 2600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలోని 1600(2్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ సామర్థ్యం 4200 మెగావాట్లకు పెరగనుంది. అదే సమయంలో 4400 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో సింగరేణి ఎన్టీపీసీని వెనక్కి నెట్టి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. సౌర విద్యుత్ రంగంలో సైతం.. సింగరేణి సంస్థ భారీగా సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి, 224 మెగావాట్ల ప్లాంట్ల పనులు పూర్తయి విద్యుదుత్పత్తి జరుగుతోంది. మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. భూపాలపల్లి, మందమర్రి, మణుగూరులో మరో 250 మెగావాట్ల సౌర విద్యత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సంస్థ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 550 మెగావాట్లకు పెంచుకోవాలని నిర్ణయించింది. -
‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: నేటి ఆధునిక ప్రపంచంలో విద్యుత్ లేనిదే ఎవరికీ పూట గడిచే పరిస్థితి లేదు. తలసరి విద్యుత్ వినియోగమే రాష్ట్ర, దేశ పురోగతికి సంకేతం. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య తలసరి విద్యుత్ వినియోగం మధ్య వ్యత్యాసం చాలానే ఉంది. పునరుత్పాదక విద్యుత్ (రెన్యూవబుల్ ఎనర్జీ) రావడానికి ముందు థర్మల్, జల, అణు, గ్యాస్ ఇంధనమే ప్రధానమైన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు. ప్రస్తుతం పవన, సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం వేగంగా సాగుతోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం రెన్యూవబుల్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే పరిమితమైన ఎన్టీపీసీ సైతం ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో వేగం పెంచింది. మరోవైపు ప్రైవేటు రంగం పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతోంది. థర్మల్ కేంద్రాల నిర్మాణంలో ఐదేళ్లుగా ప్రైవేటు రంగం గణనీయంగా పడిపోతూ వస్తోంది. 2023లో ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా ప్రైవేటు రంగంలో గ్రిడ్‌కు అనుసంధానం కాకపోవడం గమనార్హం. రానురాను కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు తలకు మించిన భారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలోనే కాదు.. దాని ఉత్పత్తి వ్యయం కూడా ఏటేటా పెరుగుతోంది. బొగ్గు ధరలు, బొగ్గు ఉత్పాదన కేంద్రం నుంచి ప్లాంట్ వరకు రవాణా వ్యయం కూడా పెరగడం వల్ల అంతిమంగా విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలకు వచ్చేసరికి తడిసి మోపెడవుతోంది. అది కాస్తా వినియోగదారులపై భారం మోపక తప్పని పరిస్థితి. 2030 నాటికి కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యమా..? దేశంలో ప్రస్తుతం ఉన్న 2,36,680 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలతో దాదాపు 910 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. వీటిని గణనీయంగా తగ్గించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కేంద్ర ఇంధన శాఖలోని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) 2029–30 నాటికి శిలాజ ఇంధనలతో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడం, సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తద్వారా పర్యావరణ సమతౌల్యతను కాపాడటానికి సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించనున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న మెగావాట్ ధరలూ ఓ కారణమా..? దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యయం ఒక మెగావాట్‌కు గడిచిన ఏడేళ్లుగా పెరిగిన తీరు పరిశీలిస్తే... అవి రాబోయే కాలంలో లాభసాటిగా అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 2015లో ఒక మెగావాట్‌కు రూ. 4.88 కోట్లు, 2016లో రూ. 5.33 కోట్లు, 2019లో రూ. 6.79 కోట్లు, 2023లో రూ. 8.34 కోట్లు చేరినట్లు సీఈఏ గణాంకాలు చెబుతున్నాయి. సౌర విద్యుత్ మెగావాట్ వ్యయం దాదాపు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేరకు ఉంటోంది. ఒకప్పుడు సౌర ఫలకాల ధరలు అధికంగా ఉండటంతో యూనిట్ విద్యుత్ రూ.14కు కూడా విద్యుత్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే సౌర విద్యుత్ రూ. 3.50 నుంచి రూ. 4.50 మధ్య అందుబాటులోకి వచ్చింది. 2030 నాటికి... దేశంలో థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం, సౌర, పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ప్రకారం 2029–30 నాటికి దేశంలోని అన్ని రకాల విద్యుదుత్పాదన ప్లాంట్ల సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. వాటిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యం 2,66,911 మెగావాట్లకు చేరుకుంటే... సౌర, పవన విద్యుత్‌ల స్థాపిత సామర్థ్యం ఏకంగా 2,25,160 మెగావాట్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వాటితోపాటు జల, బయోమాస్, బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేసింది. తద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలన్న నిర్ణయం కూడా ఇమిడి ఉంది. కానీ తాజాగా విడుదల చేసిన అంచనా ప్రకారం మొత్తం స్థాపిత సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉండనుంది. -
కరెంట్‌కు ‘సెంట్రల్’ ఆంక్షలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అదీనంలోని ‘సెంట్రల్ పూల్’నుంచి కరెంట్‌ను రాష్ట్రాలకు కేటాయించే విషయంలో కేంద్ర విద్యుత్ శాఖ కొత్త ఆంక్షలు తెచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు సబ్సిడీ బకాయిలను చెల్లించకపోయినా, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై పన్నులు విధించినా, అంతర్రాష్ట్ర విద్యుత్ క్రయవిక్రయాలకు అడ్డంకిగా మారినా ఆయా రాష్ట్రాలకు ‘సెంట్రల్ పూల్’నుంచి కరెంట్ కేటాయించబోమని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ గత నెల 31న ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులేటరీ ఆస్తులు కలిగిన రాష్ట్రాలకు సైతం సెంట్రల్ పూల్ నుంచి కరెంట్ కేటాయించబోమని తేల్చి చెప్పింది. ఓ ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే మొత్తం వ్యయాన్ని వారి నుంచి బిల్లుల రూపంలో వసూలు చేసుకునేందుకు వీలుగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు టారీఫ్‌ను నిర్ణయించాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఈఆర్సీలు తక్కువ టారీఫ్‌ను నిర్ణయిస్తే డిస్కంలకు మిగిలే నష్టాలను విద్యుత్ రంగ పరిభాషలో రెగ్యులేటరీ అసెట్స్‌గా పేర్కొంటారు. ఏటేటా రెగ్యులేటరీ అసెట్స్ రూపంలో డిస్కంల నష్టాలు రూ.వేల కోట్లకు పేరుకుపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. డిస్కంలకు నష్టాలు మిగలకుండా పెరిగే వ్యయానికి తగ్గట్టూ ఏటేటా విద్యుత్ చార్జీలను పెంచాలని ఈ నిబంధన ద్వారా కేంద్రం స్పష్టం చేస్తోంది. జల, సౌర విద్యుత్ వంటి గ్రీన్ఎనర్జీ, అంతర్రాష్ట్ర క్రయవిక్రయాలపై పన్నులు, సెస్‌లను విధించే రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి కరెంట్‌ను కేంద్రం కేటాయించదు. ఇకపై షరతులు పాటిస్తేనే కరెంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ, ఇతర కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 80 శాతం మేర దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా రాష్ట్రాలకు కేంద్రం విక్రయిస్తోంది. మిగిలిన 20 శాతాన్ని ఎవరికీ కేటాయించని విద్యుత్ పేరుతో ‘సెంట్రల్ పూల్’కింద తమ వద్దే ఉంచుకుంటుంది. ఉదాహరణకి రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన విద్యుత్‌లో రాష్ట్రానికి 1,280 మెగావాట్ల(80 శాతం) విద్యుత్‌ను మాత్రమే రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. మిగిలిన 320 మెగావాట్ల(20 శాతం) విద్యుత్‌ను సెంట్రల్ పూల్ కింద తన వద్దే ఉంచుకుంది. రాష్ట్రాల నుంచి విజ్ఞప్తుల ఆధారంగా ఈ విద్యుత్‌ను తాత్కాలిక కేటాయింపులు చేస్తుంది. ఇకపై ఏదైనా రాష్ట్రం సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్ కావాలని విజ్ఞప్తి చేస్తే ఆ రాష్ట్రం సంబంధిత అంశాలను పాటిస్తుందా? లేదా ? అని కేంద్రం పరిశీలిస్తుంది. ఒక వేళ పాటించడం లేదని గుర్తిస్తే సెంట్రల్ పూల్ నుంచి ఆయా రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులు జరపదు. -
హైడ్రోజన్‌తో స్వావలంబన దిశగా..
సాక్షి, హైదరాబాద్: ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన సాధించేందుకు హైడ్రోజన్ ఉపయోగపడుతుందని, ఈ దిశగా పరిశోధనలూ వేగంగా సాగుతున్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) హైడ్రోజన్ విభాగం జనరల్ మేనేజర్ డీఎంఆర్ పాండా వెల్లడించారు. జాతీయ సైన్స్ దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డీఎంఆర్ పాండా ‘గ్రీన్ హైడ్రోజన్ ఎమర్జింగ్ ట్రెండ్స్’’అన్న అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలమైన విధానాల్లో హైడ్రోజన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా లేహ్, ఢిల్లీల్లో హైడ్రోజన్ బస్సులు ఇప్పటికే నడుస్తుండగా, సౌర విద్యుత్ సాయంతో హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వలకు కూడా పైలెట్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గింది.. దేశంలో సౌర, పవన విద్యుదుత్పత్తులకు అపార అవకాశాలున్నాయని, ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌తో వేర్వేరు పద్ధతులను ఉపయోగించుకుని హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా దేశం పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని పాండా వివరించారు. అలాగే కర్బన ఉద్గారాల తగ్గింపూ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువైనప్పటికీ, ఐఐసీటీ, ఇతర విద్యా, పరిశోధన సంస్థల సహకారంతో దాన్ని తగ్గించి విస్తృత వినియోగంలోకి తేవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గిందని గుర్తు చేశారు. ఎలక్ట్రలైజర్లు, ఒత్తిడిని తట్టుకోగల సిలిండర్లు, హైడ్రోజన్‌ను చిన్న చిన్న సిలిండర్లలోకి పంపేందుకు అవసరమైన కంప్రెషర్ల విషయంలో దేశం ఇప్పటికీ విదేశాలపైనే ఆధారపడుతోందని, ఫలితంగా ఈ ఇంధనాన్ని అందరికీ అందుబాటులోకి తేవడంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సమీర్ దవే, డాక్టర్ నెట్టెం వి.చౌదరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగంపై జరుగుతున్న ప్రయత్నాలను క్లుప్తంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రోజన్ హబ్ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగాలను పెంచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రోజన్ హబ్ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ (హైడ్రోజన్ విభాగం) డీఎంఆర్ పాండా తెలిపారు. విశాఖపట్నంలోని ఎన్టీపీసీ కేంద్రానికి దగ్గరగా ఈ హబ్ ఏర్పాటు కానుందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం 1200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే హైడ్రోజన్ హబ్‌లో హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు దానికి సంబంధించిన టెక్నాలజీలు, రవాణా వ్యవస్థలపై విస్తృతమైన పరిశోధనలు జరగనున్నాయని, సౌర శక్తి కోసం పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ హబ్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, అన్నీ సవ్యంగా సాగితే ఇంకో వారం రోజుల్లో ఎన్టీపీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య దీనిపై ఒక అవగాహన ఒప్పందం కూడా జరగనుందని వివరించారు. రానున్న పదేళ్లలో ఈ హబ్ ఏర్పాటుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు పాండా తెలిపారు. ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’ ఈ నెల ఏడు నుంచి! కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధనశాలల కార్యకలాపాలను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆరు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐసీటీలో జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నామని చెప్పారు. పరిశోధకులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజిస్టులు, స్టార్టప్‌లు, సాధారణ ప్రజలు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని సూచించారు. -
ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రంలో భారీ లోపం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1600 (2x800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో భారీ లోపం బయటపడింది. విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల తొలి యూనిట్ నిర్మాణం పూర్తయినా బాయిలర్‌లోని రీహీటర్ ట్యూబ్స్ విఫలం కావడంతో గత డిసెంబర్లో జరగాల్సిన ట్రయల్ రన్ వాయిదా పడింది. మరమ్మతుల్లో భాగంగా ఈ గొట్టాలకు లోపాలున్న చోట కట్ చేసి వెల్డింగ్ చేస్తున్నారు. ఏకంగా 7,500 చోట్ల వెల్డింగ్ చేస్తున్నారని, ఇందుకు మరో నెల రోజుల సమయం పట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆలోగా మరమ్మతులు పూర్తయితే మార్చిలో తొలి యూనిట్ ద్వారా ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి జరిపి ట్రయల్ రన్ నిర్వహించే అవకాశాలున్నాయి. రీహీటర్ ట్యూబులే కీలకం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో హై ప్రెషర్, ఇంటర్మీడియేటరీ ప్రెషర్, లో ప్రెషర్ టర్బైన్లు ఉంటాయి. బాయిలర్లలో వేడిచేసిన నీళ్లు ఆవిరిగా మారి 600 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత, భారీ పీడనంతో గొట్టాల ద్వారా ‘హైప్రెషర్ టర్బైన్’లోకి ప్రవేశించి దాన్ని తిప్పుతూ మళ్లీ వెనక్కి మళ్లుతుంది. బాయిలర్‌లోకి తిరిగి చేరే సమయానికి ఆవిరి ఉష్ణోగ్రత 300 సెంటిగ్రేడ్లకు పడిపోతుంది. రీహిటర్ ట్యూబ్స్‌లో మళ్లీ 600 సెంటిగ్రేడ్లకు వేడెక్కిన తర్వాత ‘ఇంటర్మీడియేటరీ ప్రెషర్ టర్బైన్’లోకి గొట్టాల ద్వారా ఆవిరి ప్రవేశించి దాన్నీ తిప్పుతూ చివరకు ‘లోప్రెషర్ టర్బైన్ ’లోకి చేరుతుంది. అక్కడ చల్లబడిన ఆవిరి మళ్లీ బాయిలర్‌లోకి నీళ్ల రూపంలో ప్రవేశిస్తుంది. మళ్లీ ఆవిరిగా మారి ‘హై ప్రెషర్ టర్బైన్’లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఒక లూప్గా జరుగుతుంది. నీళ్లు రీసైకిల్ అవుతూ ఉంటాయి. నాసిరకం గొట్టాలతో సమస్యే ఆవిరి టర్బైన్లను తిప్పడం ద్వారా వెలువడే యాంత్రికశక్తిని ఎలక్ట్రిక్ జనరేటర్ విద్యుచ్ఛక్తిగా మార్చుతుంది. ఈ ప్రక్రియలో కీలకమైన ‘రీహీటర్ ట్యూబ్స్’లో నాణ్యత లేకుంటే అవి 600 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలతోపాటు తీవ్ర పీడనాన్ని తట్టుకోవడం సాధ్యం కాదు. నాసిరకం ముడిసరుకుతో తయారైన గొట్టాలు తరచూ కోతకు గురికావడం, తుప్పుపట్టడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో ఆవిరి ఉష్ణోగ్రతలు పడిపోయి విద్యుదుత్పత్తి నిలిచిపోతుందని చెబుతున్నారు. రీహీటర్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలతోనే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి అధిక శాతం అంతరాయాలు కలుగుతాయి. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న గొట్టాలను ఎన్టీపీసీ వినియోగించినా విఫలం కావడంపట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వెల్డింగ్ చేసి మరమ్మతులు చేసినా భవిష్యత్తులో అవి మళ్లీ విఫలమయ్యే అవకాశముందని పేర్కొంటున్నారు. రీహీటర్ గొట్టాలకు లీకేజీలతో గత డిసెంబర్లో నిర్వహించాల్సిన తొలి యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియ వాయిదా పడింది. నిర్మాణ జాప్యంతో రాష్ట్రంపై భారం తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని తొలి యూనిట్ నుంచి 2020 జూన్‌లో, రెండో యూనిట్ నుంచి 2020 నవంబర్ నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. కానీ నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును 2023 జూలైకు ఎన్టీపీసీ పొడిగించింది. రీహీటర్ ట్యూబ్స్ విఫలం కాకుంటే గత జనవరి నాటికి తొలి యూనిట్, మార్చి నాటికి రెండో యూనిట్ అందుబాటులో కి వచ్చేదని అధికార వర్గాలు తెలిపాయి. వేసవి విద్యుత్ అవసరాల కోసం ప్రస్తుతం రాష్ట్రం ఒక్కో యూనిట్‌ను సగటున రూ.7.20 ధరకు నిత్యం రూ.60 కోట్ల విలువైన విద్యుత్‌ను ఎక్ఛ్సేంజీల నుంచి కొంటోంది. ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం సకాలంలో పూర్తై ఉంటే యూనిట్‌కు రూ. 5 ధరతో విద్యుత్ లభించేది. దీంతో అధిక ధర విద్యుత్ కొనుగోళ్ల భారం తప్పేదని, ప్రస్తుత ఫిబ్రవరిలోనే రూ.50 కోట్ల మేర ఆదా అయ్యేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఎన్టీపీసీ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్టీపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 5 శాతం బలపడి రూ. 4,854 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,626 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,784 కోట్ల నుంచి రూ. 44,989 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4.25 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ కాలంలో సగటు విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు 3.95 నుంచి రూ. 4.96కు పుంజుకుంది. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ల సామర్థ్య వినియోగం(పీఎల్ఎఫ్) 1.1 శాతం మెరుగై 68.85 శాతానికి చేరింది. 2022 డిసెంబర్ 31కల్లా భాగస్వామ్య కంపెనీలు, అనుబంధ సంస్థలతో కలిపి ఎన్టీపీసీ గ్రూప్ విద్యుదుత్పాదక సామర్థ్యం 70,884 మెగావాట్లుగా నమోదైంది. స్థూల విద్యుదుత్పత్తి 75.67 బిలియన్ యూనిట్ల నుంచి 78.64 బి.యూనిట్లకు ఎగసింది. చదవండి: ఓలా సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్.. కస్టమర్ల కోసం అదిరిపోయే బెనిఫిట్స్ -
3 గిగావాట్ల సామర్థ్యానికి ఎన్టీపీసీ
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ రంగంలో 3 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నట్టు ఎన్టీపీసీ వెల్లడించింది. రాజస్తాన్‌లోని బికనీర్ వద్ద నోఖ్రా సోలార్ పీవీ ప్రాజెక్టులో 100 మెగావాట్లు తోడవడంతో డిసెంబర్ 20న ఈ ఘనతను సాధించామని ప్రకటించింది. 2022 జూన్ 24న ఎన్టీపీసీ గ్రూప్ 2 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంది. 12 రాష్ట్రాల్లో సంస్థ ఖాతాలో 36 ప్రాజెక్టులకుగాను 3,094 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కొత్తగా 4.8 గిగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియలో మరో 7.3 గిగావాట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలన్నది ఎన్టీపీసీ లక్ష్యం. -
అమ్మకానికి కోల్ ఇండియా వాటాలు, కేంద్రం మరో కీలక నిర్ణయం?
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో కేంద్రానికి దిగుమతుల ఖర్చు, రాయితీల భారం పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన వాటాల్ని అమ్మగా వచ్చిన మొత్తంతో వాటిని సర్ధు బాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కోల్ ఇండియా, హిందుస్తాన్ జింక్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ సంస్థలకు చెందిన 5 నుంచి 10 శాతం వాటాను విక్రయించనుందని, వాటిలో కొన్ని షేర్లని ఆఫర్ ఫర్ సేల్ మెకానిజం ద్వారా సేల్ చేయనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది.అమ్మే ఈ కొద్ది మొత్తం వాటాతో సంబంధిత సంస్థల షేర్లు లాభాల్లో పయనించడంతో పాటు ఫైనాన్షియల్ ఇయర్ చివరి త్రైమాసికం సమయానికి ఆర్ధికంగా వృద్ధి సాధించ వచ్చని కేంద్రం భావిస్తున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక పేర్కొంది. 16500 కోట్లు ఇక ప్రభుత్వ రంగం సంస్థల్లోని వాటాల్ని అమ్మగా రూ.16500 కోట్లు సమకూరున్నట్లు సమాచారం. ఇప్పటికే వాటాల విక్రయాలపై కేంద్రం కేబినెట్ ఈ ఏడాది మేలో ఆమోదం తెలపగా..వాటాల విక్రయాన్ని వేగ వంతం చేస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ డిజ్‌ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్‌లో భాగంగా కోల్ ఇండియా,ఎన్టీపీసీ, హిందుస్తాన్ జింక్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్, ఎకనామిక్స్ సర్వీస్ లిమిటెడ్ (ఆర్ఐటీఈఎస్) వాటాల్ని ఆఫర్ ఫల్ సేల్కు పెట్టనుంది. 10-20శాతం వాటాల విక్రయం పలు నివేదికల ప్రకారం.. రాష్ట్రియ కెమికల్స్ ఫర్టిలైజర్స్, నేషనల్ ఫర్టిలైజర్స్ సంస్థల వాటాల్ని 10 నుంచి 20 శాతం వరకు అమ్మనున్నట్లు సమాచారం. టార్గెట్ రూ.65 వేల కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ (డిజ్ఇన్వెస్ట్మెంట్) ద్వారా 2023-2024 సమయానికి మొత్తం రూ.65వేల కోట్లను సేకరించేలా కేంద్రం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్లో డిజ్ఇన్వెస్ట్మెంట్ ద్వారా మొత్తం రూ.24వేల కోట్లు సమకూరినట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం)వెబ్సైట్ పేర్కొంది. అనిల్ అగర్వాల్ చేతిలో 2002లో నాటి కేంద్ర ప్రభుత్వం హిందుస్తాన్ జింక్ 26 శాతం వాటాని వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌కు విక్రయించింది. ఆ తర్వాత అదే సంస్థకు చెందిన భారీ మొత్తంలో వాటాను కొనుగోలు చేశారు. ఆ మొత్తం వాటా కలిపి 64.92శాతంగా ఉంది. -
ఎలక్ట్రిక్‌గా డీజిల్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఎన్టీపీసీతో కలసి సంయుక్తంగా కేంద్రం ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కూడా భాగం పంచుకోనుంది. ప్రయోగాత్మకంగా మొదటి దశలో హైదరాబాద్‌లో నడుస్తున్న 100 బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చనున్నారు. మరో 2–3 నెలల్లో ఇవి పొగలేని కాలుష్యరహిత వాహనాలుగా నగర రోడ్లపై పరుగుపెట్టనున్నాయి. మలిదశలో మరిన్ని బస్సులను కూడా మార్చనున్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచే క్రమంలో కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది. కేంద్రం నుంచి కిట్.. ఎన్టీపీసీ నుంచి బ్యాటరీ.. కొత్త ఎలక్ట్రిక్ బస్సు కొనాలంటే రూ. కోటిన్నరకుపైగానే ఖర్చు కానుంది. అదే ఏసీ బస్సుకు రూ. 2 కోట్ల వరకు వ్యయం చేయాల్సిందే. ఇంత భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆర్టీసీ వాటిని సమకూర్చుకోలేకపోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అక్కడి ఆర్టీసీలు ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాత బస్సులనే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని తెలంగాణ ఆర్టీసీ గతంలో ప్రయత్నించింది. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ముషీరాబాద్ డిపోలోని ఓ బస్సును మార్చి పరిశీలిస్తోంది. ఇలా మార్చడానికి కూడా దాదాపు రూ.65 లక్షల వరకు ఖర్చు కానుండటంతో ఆ ప్రక్రియ కూడా ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీకి తీపికబురు అందించింది. స్వయంగా ఈ మార్పిడి ప్రక్రియ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ కూడా అందుకు అంగీకరిస్తూ ప్రయోగాత్మకంగా తొలిదశలో 100 బస్సులను కన్వర్ట్ చేసుకోవడానికి ముందుకొచ్చింది. తాజా ప్రాజెక్టు ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం కన్వర్షన్ కిట్ కోసం ఒక్కో బస్సుకు రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఆ కిట్ సరఫరాకు కూడా ఏర్పాట్లు చేయనుంది. ఇక ఎన్టీపీసీ రూ. 40 లక్షల విలువైన బ్యాటరీని సరఫరా చేయనుంది. ఇందుకోసం బ్యాటరీ తయారీ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. వెరసి ఆర్టీసీకి నయాపైసా ఖర్చు లేకుండా ఒక్కో బస్సుకు రూ.60 లక్షల విలువైన పరికరాలు అందనున్నాయి. అద్దె వసూలు చేసుకోనున్న ఎన్టీపీసీ.. ఎలక్ట్రిక్ బస్సులుగా కన్వర్ట్ అయిన బస్సులను ఆర్టీసీనే నడపనుంది. టికెట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీనే తీసుకోనుంది. కానీ జీసీసీ పద్ధతిలో ఆర్టీసీకి సమకూర్చే బస్సులకు కిలోమీటరుకు నిర్ధారిత మొత్తం అద్దె చెల్లిస్తున్నట్టుగా ఈ కన్వర్ట్ అయిన బస్సులకుగాను ఎన్టీపీసీకి నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. బస్సుల చార్జింగ్ ఏర్పాట్లను ఆర్టీసీ సొంతంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ►సాధారణంగా ఒక డీజిల్ బస్సుకు కి.మీ.కు రూ. 20 వరకు నిర్వహణ ఖర్చు వస్తుంది. ►అదే బ్యాటరీ బస్సుకు ఆ ఖర్చు రూ. 6గానే ఉంటుంది. వెరసి కి.మీ.కు రూ. 14 వరకు ఆదా అవుతుంది. ►కేంద్ర ప్రాజెక్టు వల్ల ఆర్టీసీకి కన్వర్షన్ భారం లేనందున వీలైనన్ని బస్సులను ఎలక్ట్రిక్‌లోకి మార్చుకొనే వెసులుబాటు కలుగుతుంది. ►ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3 వేలకుపైగా అద్దె బస్సులున్నాయి. త్వరలో 300 ఎలక్ట్రిక్ బస్సులు, 10 డబుల్ డెక్కర్ బస్సులను, కొన్ని స్లీపర్ బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకోనుంది. వాటికి చెల్లిస్తున్నట్టుగానే కన్వర్షన్ బస్సులకు కూడా అద్దె చెల్లిస్తుంది. ఇది ఆర్టీసీకి పెద్ద భారం కాబోదు. -
NTPC: భారతావనికి వెలుగు దివ్వె.. ఎన్టీపీసీ
పెద్దపల్లి/జ్యోతినగర్: భారతావనికి వెలుగు ది వ్వెగా విరాజిల్లుతున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) లిమిటెడ్ నేటితో 47 వసంతా లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సంస్థ దేశంలో 77 విద్యుత్ కేంద్రాల ద్వారా 70,254 మెగావాట్ల వి ద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 2032 నాటికి 1,28,000 మెగావాట్ల లక్ష్యంతో నూతన ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తూ ముందుకు సాగుతోంది. 1975 నవంబర్ 7న నామకరణం స్వాతంత్య్రం అనంతరం దేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో కేంద్ర పరిధిలో ఒక విద్యుత్ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం భావించింది. విద్యుత్ ప్రాజెక్టు పంపిణీ విధానం తమ ఆధీనంలో ఉండాలనుకుంది. విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రానికి ఎక్కువ శాతం కేటాయించి. మిగతా విద్యుత్‌ను ప్రాంతాల వారీగా పంపిణీ చే యాలని తీర్మానం చేశారు. అప్పటికప్పుడు విద్యుత్ కేంద్రం నిర్మించాలంటే సమయం పడుతుందని ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని టేకోవర్ చేసింది. 1975 నవంబర్ 7న ఎన్టీపీసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌గా నమోదు చేసి, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంగా నామకరణం చేసి, ఎన్టీపీసీగా గుర్తించారు. దినదినాభివృద్ధి చెందుతూ.. ఎన్టీపీసీ దేశంలో బొగ్గు గనులు, గ్యాస్, నీరు, స్థలం అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతూ దినదినాభివృద్ది చెందుతూ అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచస్థాయి విద్యుత్ సంస్థలతో పోటీ పడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పవర్ ప్లాంట్ సామర్థ్యం, పీఎల్ఎఫ్, మెయింటెనెన్స్, విధానాలు, రక్షణ, విద్యుత్ పొదుపు, పర్యావరణ సమతుల్యం, మేనేజ్మెంట్ విధానాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎన్టీపీసీ సంస్థ విద్యుదుత్పత్తిలో అగ్రభాగాన నిలుస్తూ నవరత్న కంపెనీగా ఉన్న ఎన్టీపీసీ 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం చెందింది. ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రాలు.. ఎన్టీపీసీ సొంతంగా బొగ్గు, గ్యాస్, హైడ్రో, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, జాయింట్ వెంచర్స్తోపాటు మొత్తంగా 77 విద్యుదుత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. ప్రస్తుతం సూపర్ క్రిటికల్ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఎన్టీపీసీ తన ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి కన్సల్టెన్సీ, పవర్ ట్రేడింగ్, విద్యుత్ నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల రంగాల్లో ముందుకు సాగుతోంది. మైనింగ్ రంగంలో వేగవంతమైన ప్రగతి నమోదు చేసింది. ఇతర సంస్థలతో కలిసి వ్యాపారం.. ఒకప్పుడు కేవలం విద్యుదుత్పత్తి మాత్రమే చేసిన ఎన్టీపీసీ ప్రస్తుతం ఉత్పత్తి, పంపిణీ, విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు, సొంత బొగ్గు గనుల ఏర్పాటు, జాయింట్ వెంచర్లు తదితర ఎన్నో రంగాల్లో ఇతర సంస్థలతో కలిసి వ్యాపారాలు చేస్తూ దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగింది. జాయింట్ వెంచర్లతో బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. 2032 నాటికి, శిలాజ ఇంధనం ఆధారిత ఉత్పత్తి సామర్థ్యం ఎన్టీపీసీ యొక్క పోర్ట్‌ఫోలియోలో దాదాపు 30% ఉంటుంది. ఈ సంస్థ జాతీయ సామర్థ్యంలో 16.78% కలిగి ఉంది. ఎకనామిక్ టైమ్స్ సర్వే ప్రకారం దేశంలోనే అత్యుత్తమ 50 కంపెనీల్లో గుర్తింపు పొందింది. -
ఎన్టీపీసీ లాభం క్షీణత, క్యూ2లో రూ. 3,418 కోట్లకు పరిమితం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 3,418 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,691 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 33,096 కోట్ల నుంచి రూ. 44,681 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 28,950 కోట్ల నుంచి రూ. 40,001 కోట్లకు పెరిగాయి. దిగుమతి చేసుకున్న బొగ్గు సరఫరా 0.42 ఎంఎంటీ నుంచి 5.58 ఎంఎంటీకి జంప్ చేసింది. దేశీయంగా బొగ్గు సరఫరా 44.83 ఎంఎంటీ నుంచి 48.72 ఎంఎంటీకి పుంజుకుంది. సొంత వినియోగ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 2.79 ఎంఎంటీ నుంచి 4.32 ఎంఎంటీకి పెరిగింది. సెప్టెంబర్ చివరికల్లా విద్యుదుత్పత్తి సామర్థ్యం భాగస్వామ్యం, అనుబంధ సంస్థలతో కలిపి 70,254 మెగావాట్లకు చేరింది. స్థూల విద్యుదుత్పత్తి 77.42 బిలియన్ యూనిట్ల నుంచి 85.48 బీయూకి మెరుగుపడింది. -
పెన్నార్‌కు రూ.1,167 కోట్ల ఆర్డర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ పరికరాల తయారీ సంస్థ పెన్నార్ గ్రూప్ సెప్టెంబర్‌లో రూ.1,167 కోట్ల ఆర్డర్లను చేజిక్కించుకుంది. వీటిలో ఎన్టీపీసీ రెనివేబుల్ ఎనర్జీ నుంచి కూడా ఆర్డర్ పొందామని పెన్నార్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ కూరం వెల్లడించారు. ‘రాజస్తాన్‌లో ఎన్టీపీసీ 500 మెగావాట్ల ఏసీ/625 మెగావాట్ల డీసీ సోలార్ పీవీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. డిజైన్, సరఫరా, నిర్మాణం ప్రాతిపదికన పెన్నార్ ఇండస్ట్రీస్ 12.5 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్లపాటు కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు సంస్థ స్వీకరిస్తుంది’ అని వివరించారు. రిలయన్స్, టీసీఐ లిమిటెడ్, థెర్మాక్స్, టాటా నుంచి సైతం పెన్నార్ గ్రూప్ కంపెనీలు ఆర్డర్లను పొందాయి. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి! -
భళా బూడిద..!
సాక్షి, అమరావతి: బూడిద అనగానే ఎందుకూ పనికిరాదని తేలిగ్గా తీసేస్తాం. కానీ, అలా తీసిపడేసిన బూడిదతోనే కంకర తయారు చేసి పటిష్టంగా రహదారులు, భవనాలను నిర్మించవచ్చు. అది కూడా సిమెంటు అవసరం లేకుండానే. ఈ మేరకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లిమిటెడ్ చేసిన ప్రయోగం ఫలించింది. దీనివల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే బూడిదతో ఇబ్బందులు తొలగి జీవరాశులకు, పర్యావరణానికి మేలు కలుగనుంది. రోడ్లు, భవనాల నిర్మాణంలో ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. బూడిద విక్రయాల వల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఆదాయమూ పెరగనుంది. ఫలించిన పరిశోధనలు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వ్యర్థాల్లో బూడిద (ఫ్లై యాష్) ప్రధానమైంది. దేశంలో బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఏటా సుమారు 258 మిలియన్ మెట్రిక్ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోంది. ఇందులో 78 శాతం బూడిదను సిమెంట్, సిరామిక్ వంటి పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. బూడిద స్వభావాన్ని బట్టి వేరుచేసి టన్ను రూ.80 చొప్పున విక్రయిస్తారు. మిగిలినది యాష్ పాండ్లలో మిగిలిపోతుంది. అది గాలి, నీరులో కలిసి వాటిని కలుషితం చేస్తోంది. ఫలితంగా వాతావరణం దెబ్బతిని, దాని ప్రభావం జీవరాశులపై పడుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలని ఓ వైపు ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు ప్రస్తుతం వస్తున్న బూడిద వినియోగంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లిమిటెడ్... బూడిదను ఉపయోగించి జియో పాలిమర్ ముతక కంకరను అభివృద్ధి చేసింది. ఈ కంకర జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ (ఎన్‌సీసీబీఎం) ధ్రువీకరించింది. ఇది సహజ కంకరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఏటా దేశంలో 2వేల మిలియన్ మెట్రిక్ టన్నుల కంకరకు డిమాండ్ ఉంటుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడిన బూడిదతో చేసిన కంకర ఈ డిమాండ్‌ను చాలావరకు తీర్చే అవకాశం ఉంది. రాతి కంకర కోసం కొండలు, భూమిని తవ్వడం వల్ల ఏర్పడే పర్యావరణ అసమతౌల్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఖర్చు తగ్గుతుంది జియో పాలిమర్ కంకర ఉపయోగించినప్పుడు సిమెంట్ అవసరం లేదు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే బూడిద ఆధారిత జియోపాలిమర్ కంకరే బైండింగ్ ఏజెంటుగా పని చేస్తుంది. ఈ కంకర కర్బన ఉద్గారాలను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. నీటి వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. మరోవైపు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయిన బూడిదను మూడేళ్లలో వంద శాతం వినియోగించాలి. అందువల్ల త్వరలోనే జియో పాలిమర్ కంకర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
పరిశ్రమల ఆటోమేషన్‌కు ‘కల్పతరువు’
సాక్షి, అమరావతి: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సంయుక్తంగా నాలుగోతరం ఇండస్టీ–4 టెక్నాలజీ అభివృద్ధికి ‘కల్పతరువు’ పేరుతో విశాఖపట్నంలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ) కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అనేక పారిశ్రామిక సంస్థలకు.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ఆటోమేషన్‌కు ‘కల్పతరువు’ అన్ని విధాలా ఉపయోగపడనుంది. మంగళవారం ఆర్ఐఎన్ఎల్ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సీఎండీ అతుల్ భట్, ఢిల్లీ నుంచి ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ కలిసి కల్పతరువు ఓపెన్ ఛాలెంజ్ ప్రోగ్రాం – 1 (ఓసీపీ–1)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతుల్ భట్ మాట్లాడుతూ ఆర్ఐఎన్ఎల్కు చెందిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ ఛాలెంజ్‌ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారం అందించే స్టార్టప్‌లు అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సమస్యలకు పరిష్కారాన్ని కూడా అందించే అవకాశం లభిస్తుందన్నారు. విశాఖపట్నంలో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్–హెచ్‌వీపీవీ, హెచ్ఎస్ఎల్, హెచ్‌పీసీఎల్, వీపీటీ, బీఏఆర్సీ వంటి సంస్థలు ఈ సీవోఈని వినియోగించుకోవాలని కోరారు. ఈ సీవోఈతో రాష్ట్రంలో స్టార్టప్‌లు పెరుగుతాయని, పారిశ్రామిక కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయని తెలిపారు. అరవింద్ కుమార్ మాట్లాడుతూ ఎస్టీపీఐకి దేశవ్యాప్తంగా 20 సీవోఈలు ఉండగా కల్పతరువు 21వదని, కాని ఇది అన్ని సీవోఈలకు తల్లిగా అవతరించనుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, ఎనలటిక్స్ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకొని స్మార్ట్ ఆటోమేషన్‌ను పెంచుకోవచ్చని చెప్పారు. ఆర్ఐఎన్ఎల్ లానే ఇతర పీఎస్‌యూలు కూడా వారి సమస్యల పరిష్కారానికి కల్పతరువును వినియోగించుకోవాలని కోరారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కల్పతరువు రాకతో 2025 నాటికి రాష్ట్ర తయారీ రంగంలో 25 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఓసీపీ–1 కార్యక్రమంలో పాల్గొనే స్టార్టప్‌లు అక్టోబర్ 19 వరకు www.kalpataru.stpi.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాతా తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన 1,032 మంది పాల్గొన్నారు. -
రామగుండం ఎన్టీపీసీ వద్ద ఉద్రిక్తత
జ్యోతినగర్ (రామగుండం): పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ రామగుండం కర్మాగారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 2018 నాటి ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్‌చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం గేట్ సమావేశం నిర్వహించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంస్థ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఒక దశలో కార్మికులు ప్లాంట్ గేట్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో 30 మందికిపైగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీచార్జి చేసి దాడిచేశారని కార్మికు లు ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే చందర్ సీఐఎస్ఎఫ్ లాఠీచార్జిలో గాయపడిన కాంట్రాక్టు కార్మికులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిలకుపై లాఠీచార్జి చేయడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్ ఆలీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని వెల్లడించార. -
పర్యావరణహిత ‘పవర్’
సాక్షి, అమరావతి: పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి దిశగా రాష్ట్రంలో వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన మొట్టమొదటి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్(ఎఫ్‌జీడీ) ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి నాటికల్లా విశాఖ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)లో అందుబాటులోకి రానుంది. వ్యవసాయానికి పూర్తిగా సౌర విద్యుత్‌నే వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్లాంటు స్థాపించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీలో కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి ఉత్సాహం చూపిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ ఎన్టీపీసీలో పర్యావరణ అనుకూల ఎఫ్‌జీడీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. బొగ్గును కాల్చే ప్రక్రియలో విడుదలయ్యే హానికర వాయువుల తీవ్రతను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. దాదాపు 90 శాతం నిర్మాణం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది మార్చి కల్లా అందుబాటులోకి తీసుకువస్తామని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.871 కోట్ల వ్యయంతో 2 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఎఫ్‌జీడీ దక్షిణ భారతదేశంలోనే తొలి ప్రాజెక్టు కావడం విశేషం. ఎఫ్‌జీడీలతో కాలుష్యానికి అడ్డుకట్ట! ఎన్టీపీసీ దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరహా ఎఫ్‌జీడీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 38 ఎన్టీపీసీ ప్లాంట్లలో 60 గిగావాట్ల సామర్థ్యంతో ఎఫ్‌జీడీలను అందుబాటులోకి తీసుకురావాలనేది తమ లక్ష్యమని కేంద్ర విద్యుత్ శాఖ ఇటీవల లోక్‌సభలో వెల్లడించింది. దేశంలోని విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 71 శాతం వాటా కలిగిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు 80 శాతం పారిశ్రామిక ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. దీంతో థర్మల్ కేంద్రంలోనే కాలుష్యాన్ని తగ్గించేలా సాంకేతికతను అభివృద్ధి చేశారు. విశాఖ ప్రాజెక్టులో 143 మీటర్ల పొడవున్న నాలుగు ఎఫ్‌జీడీ చిమ్నీలను ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యానికి అడ్డుకట్ట వేయనున్నారు. ఇవి నేరుగా కర్బన ఉద్గారాలను గాలిలో కలవనివ్వవు. వాటి తీవ్రతను తగ్గించి విడుదల చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. -
‘థర్మల్’కు కళ్లెం!.. ఆ మేరకు కేంద్రం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: థర్మల్ విద్యుత్ కేంద్రాల కనీస విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని మూడేళ్లలో 55 శాతం నుంచి 40 శాతానికి కుదించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. విద్యుత్ కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి అంశం. అంటే ఏ నిర్ణయమైనా రెండు ప్రభుత్వాల అంగీకారం మేరకు జరగాలి. కానీ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తమ అభ్యంతరాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా విద్యుత్ రంగంలో తన నిర్ణయాలను అమలు చేయాల్సిందిగా బలవంతం చేస్తోందని తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. తన నిర్ణయాలను అమలు చేయని రాష్ట్రాలపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధిస్తోందని మండిపడుతున్నాయి. 2025–26 నాటికల్లా.. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) మార్గదర్శకాల ప్రకారం.. సాంకేతికంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల కనీస ఉత్పత్తి (టెక్నికల్ మినిమమ్) సామర్థ్యం 55 శాతం ఉండాలి. కానీ వచ్చే మూడేళ్లలో దీనిని 40 శాతానికి తగ్గించాలని, థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సౌర, పవన తరహా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్రాల, ప్రైవేటు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా సుమారు 58,000 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి ఆ మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడం సాధ్యమేనని కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు 2025–26 నాటికి థర్మల్ ఉత్పత్తిని తగ్గించాలని ఆదేశించింది. జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీకి నష్టాలే.. రాష్ట్రంలో ఎన్టీపీసీ, సింగరేణి, రాష్ట్ర జెన్కోల యాజమాన్యంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సాధారణంగా 70–85 శాతం వార్షిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సామర్ధ్యంతో విద్యుదుత్పత్తి చేస్తాయి. స్థాపిత సామర్థ్యంతో పోల్చితే వాస్తవిక ఉత్పత్తి శాతాన్ని పీఎల్ఎఫ్ అంటారు. ఉదాహరణకు..100 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ సగటున 80 మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తే 80 శాతం పీఎల్ఎఫ్ సాధించిందని సాంకేతిక పరిభాషలో చెబుతారు. కాగా సాధ్యమైనంత అధిక పీఎల్‌ఎఫ్‌తో విద్యుదుత్పత్తి చేస్తేనే జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి వంటి సంస్థలు లాభాలు ఆర్జించగలుగుతాయి. ఈ విధంగా అధిక పీఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి చేసినందుకు గతంలో కేంద్ర ఇంధన శాఖ నుంచి సింగరేణి థర్మల్ ప్లాంట్ పురస్కారాలను సైతం అందుకుంది. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం కనీస ఉత్పత్తి సామరŠాధ్యన్ని తగ్గించాలని ఆదేశించడం గమనార్హం. కాగా కేంద్రం నిబంధనలను అమలు చేస్తే నష్టాలు తప్పవని జెన్కో, సింగరేణి వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలపై ఫిక్స్డ్ చార్జీల మోత? విద్యుదుత్పత్తి సంస్థలకే కాదు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో పాటు వినియోగదారులకు సైతం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు భారంగా మారబోతున్నాయి. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కనీస జీవిత కాలం 25 ఏళ్లు. పెట్టుబడి రుణాలతో కలిపి వీటి మొత్తం నిర్మాణ వ్యయాన్ని 25 ఏళ్ల కాలంలో రాబట్టుకునేందుకు వీలుగా వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు సంబంధించిన స్థిర చార్జీలు (ఫిక్స్డ్ కాస్ట్) నిర్ణయిస్తారు. మొత్తం వ్యయాన్ని ఈ 25 ఏళ్ల గడువులోగా రాబట్టుకోవడానికి వీలుగా జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి వంటి ఉత్పత్తి కంపెనీలు డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటాయి. సాధారణంగా 85 శాతం పీఎల్‌ఎఫ్‌ను ప్రామాణికంగా తీసుకుని ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌పై స్థిర చార్జీలను లెక్కిస్తారు. ఈ విధంగా ఒక్కో యూనిట్ థర్మల్ విద్యుత్ స్థిర వ్యయం రూ.2–3 వరకు అవుతోంది. ఇప్పుడు కేంద్ర ఆదేశాల మేరకు కనీస పీఎల్‌ఎఫ్‌ను 40 శాతానికి తగ్గిస్తే.. విద్యుత్ స్థిర చార్జీలు రెట్టింపవుతాయని ,ఇవి వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు కాబట్టి భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోక తప్పదని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. బొగ్గు వినియోగం ప్రశ్నార్ధకం రాష్ట్రంలో బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు పూర్తిగా సింగరేణే సమకూరుస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ (విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే ముడిసరుకులకు అయ్యే వ్యయం) కూడా కాస్త తక్కువే. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ బొగ్గు వినియోగం కూడా ప్రశ్నార్ధకంగా మారుతుందని అంటున్నారు. తగ్గనున్న ప్లాంట్ల జీవిత కాలం... కొత్త విధానం ప్లాంట్ల జీవిత కాలాన్ని కుదిస్తుందన్న అభిప్రాయాన్ని కూడా విద్యుత్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం వల్ల థర్మల్ ప్లాంట్ల యంత్రాల పనితీరు సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. తెలంగాణ జెన్కో ప్రస్తుతం 4042 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది. వచ్చే ఏడాది, రెండేళ్లలో మరో 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న మరో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం మరో కొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది. వీటిద్వారా రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందన్న ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల్లో కనీస ఉత్పత్తి సామరŠాధ్యన్ని 40 శాతానికి కుదించడం ప్రస్తుత ప్లాంట్లతో పాటు కొత్త ప్లాంట్ల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. సంప్రదాయేతర విద్యుత్ మేలు: కేంద్రం థర్మల్ విద్యుత్‌తో పోల్చితే పునరుత్పాదక విద్యుత్ తక్కువ ధరలకు లభిస్తోందని కేంద్రం పేర్కొంటోంది. కాలుష్య కారకమైన థర్మల్ స్టేషన్ల కంటే సంప్రదాయేతర విద్యుత్ మేలని చెబుతోంది. అయితే ఇప్పటికే భారీ వ్యయంతో నిర్మించిన విద్యుత్ ప్లాంట్లు, కొత్తగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమవుతున్న ప్లాంట్ల పరిస్థితేంటని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. 2020–21లో జెన్కో 72.35 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసింది. గత ఐదేళ్లుగా 72–80 శాతం సామర్థ్యంతో ఉత్పత్తి సాధిస్తోంది. అయితే థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో కోతపెట్టైనా సరే థర్మల్ విద్యుదుత్పత్తిని తగ్గించాలని కేంద్రం పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల..సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్నదానికి అదనంగా 30 వేల మెగావాట్లు పెంచాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. -
దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: రామగుండం (ఎన్టీపీసీ)లో ఏర్పాటు చేసిన భారతదేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్) సౌర విద్యుత్ ప్లాంట్ శుక్రవారం నుంచి పూర్తి సామర్థ్యంతో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటికే 80 మెగావాట్ల మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నారు. తాజాగా మిగిలిన 20 మెగావాట్ల పనులను కూడా పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభించారు. ఇక్కడి థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేసే జలాశయం (500 ఎకరాల విస్తీర్ణం)పై రూ.423 కోట్ల వ్యయంతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. సాధారణంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా భూమి అవసరం అవుతుంది. ఫ్లోటింగ్ ప్లాంట్ల ఏర్పాటుతో పెద్ద మొత్తంలో భూసేకరణ ఖర్చు తగ్గుతుంది. అలలపై తేలియాడుతూ.. ఫ్లోటింగ్ ప్లాంట్ అంటే.. ఫోటో వోల్టాయిక్ సోలార్ ప్యానెల్స్ (సౌర ఫలకాలు) మాత్రమే కాదు.. ఇన్వర్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, హెచ్‌టీ బ్రేకర్లు, స్కాడా వంటి పరికరాలతో ఏర్పాటైన మొత్తం సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థ అంతా నీటిపైనే తేలియాడుతూ ఉంటుంది. హైడెన్సిటీ పాలిథిలీన్ మెటీరియల్‌తో తయారైన ఫ్లోటర్స్‌పై సోలార్ ప్యానెల్స్‌ను బిగించారు. ఒక్కొక్కటి 2.5 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 40 బ్లాకులుగా (తేలియాడే వేదికలు) విభజించి దీన్ని నిర్మించారు. ప్రతి తేలియాడే వేదిక (ఫెర్రో సిమెంట్ ఫ్లోటింగ్ ప్లాట్ఫార్మ్)పై 11,200 సోలార్ ప్యానెల్స్‌తో పాటు ఒక ఇన్వర్టర్, ట్రాన్స్ఫార్మర్, హెచ్‌టీ బ్రేకర్ ఉంటాయి. మొత్తం వ్యవస్థ నీటిపై తేలియాడుతూ ఒకేచోట ఉండేలా రిజర్వాయర్ అడుగున ఉన్న కాంక్రీట్ బ్లాకులకు లంగరు వేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను 33 కేవీ అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా దగ్గర్లోని స్విచ్‌యార్డ్‌కు సరఫరా చేస్తారు. ప్రయోజనాలెన్నో.. ►భారీ భూసేకరణ ఖర్చు తగ్గడంతో పాటు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అన్ని రకాలుగా పర్యావరణ అనుకూలతను కలిగి ఉంటుంది. ►జలాశయంపై సౌర విద్యుత్ వ్యవస్థకు సంబం ధిం చిన బ్లాకులు తేలియాడుతూ ఉండడంతో జలాశ యంలో నీటి ఆవిరి నష్టాలు తగ్గుతాయి. అంటే ఇది జల సంరక్షణకు దోహదపడుతుందన్న మాట. ఏటా 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి ఆవిరి నష్టాలను నివారించవచ్చని ఎన్టీపీసీ అంచనా వేసింది. ►సోలార్ ప్యానెల్స్ కింద నీళ్లు ఉండడంతో వాటి పరిసరాల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. దీంతో వాటి పని సామర్థ్యంతో పాటు ఉత్పాదకత పెరుగుతుంది. ►థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుండడంతో ఏటా 1.65 లక్ష టన్నుల బొగ్గు వినియోగాన్ని, 2.1 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించవచ్చు. దక్షిణాదిలో 217 మె.వా. ఫ్లోటింగ్ పవర్ రామగుండంలో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో దక్షిణాదిలో తమ ఫ్లోటింగ్ ప్లాంట్ల సామర్థ్యం 217 మెగావాట్లకు పెరిగిందని ఎన్టీపీసీ ప్రాంతీయ సంచాలకులు (దక్షిణ) నరేష్ ఆనంద్ వెల్లడించారు. కాయంకులం (కేరళ)లో 92 మెగావాట్లు, సింహాద్రి (ఏపీ)లో 25 మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. -
బయోమాస్‌పెల్లెట్లతో పవర్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో బొగ్గు సంక్షోభం తీవ్రమవడంతో ప్రత్యామ్నాయాలపై నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బయోమాస్ పెల్లెట్లను బొగ్గుతో కలిపి విద్యుదుత్పత్తికి వాడాలని నిర్ణయించింది. టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్ల ఉత్పత్తికి భారతీయ స్టార్టప్ కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించింది. సరఫరాదారులతో ఏడేళ్ల కాలవ్యవధితో ఒప్పందాలు చేసుకోనుంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గుతో పాటు 5–10 శాతం బయోమాస్‌ను ఇంధనంగా వాడాలని కేంద్రం ఆదేశించడంతో ఎన్టీపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. బొగ్గు కొరత, ధరలు పెరిగి దేశ విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు తీవ్రమై ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కేంద్రం పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి బొగ్గు రవాణా పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. దీనికి తోడు బయోమాస్ పెల్లెట్ల వాడకానికీ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తప్పనిసరి కొత్త బయోమాస్ వినియోగ పాలసీ ప్రకారం.. బాల్ మిల్, ట్యూబ్ మిల్ తరహావి మినహా మిగతా అన్ని థర్మల్ ప్లాంట్లు బొగ్గులో 5–10 శాతం బయోమాస్‌ను కలిపి వాడాలి. బాల్ మిల్ తరహా విద్యుత్ కేంద్రాలు రెండేళ్లపాటు 5 శాతం, తర్వాతి నుంచి 7 శాతం బయోమాస్‌ను వాడాలి. బాల్ అండ్ రేస్ మిల్ తరహావి 5 శాతం బ్లెండ్ చేసిన బయోమాస్ పెల్లెట్లను.. బాల్ అండ్ ట్యూబ్ మిల్ తరహా ప్లాంట్లు 5 శాతం టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లను తప్పనిసరిగా వాడాలి. ఇప్పటినుంచి 25 ఏళ్లు, లేదా విద్యుత్ కేంద్రాల జీవితకాలం పాటు ఈ విధానం అమలు చేయాలి. బయోమాస్.. టొర్రిఫైడ్ పెల్లెట్లు జంతువుల అవశేషాలు, విసర్జితాలు, చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. అన్నింటిని పొడిచేసి యంత్రాల సాయంతో స్తూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వీటినే సాధారణ బయోమాస్ పెల్లెట్స్ అంటారు. ఇప్పటివరకు సాధారణ బాయోమాస్ పెల్లెట్ల వాడకంపై దృష్టి సారించిన ఎన్టీపీసీ.. ఇకపై భారీ మొత్తంలో బయోమాస్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు గాను టొర్రిఫైడ్ పెల్లెట్లను వాడాలని నిర్ణయించింది. సాధారణ బయోమాస్‌లో తేమను పూర్తిగా తొలగించి తీవ్ర ఉష్ణోగ్రతలో ఒత్తిడికి గురిచేసి గట్టిగా ఉండే పెల్లెట్లను తయారు చేస్తారు. బాగా మండేందుకు వీలుగా కొన్ని రసాయనాలు కలుపుతారు. వీటినే టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లు అంటారు. ఈ తరహా పెల్లెట్ల నుంచి ఎక్కువ మంట, ఉష్ణోగ్రత వెలువడతాయి. -
కరెంటుకు కటకట
న్యూఢిల్లీ: మండే ఎండలతో ఓవైపు అల్లాడుతున్న జనానికి కరెంటు కోతలు చుక్కలు చూపిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, యూపీ సహా 16కి పైగా రాష్ట్రాల్లో డిమాండ్ పీక్స్‌కు చేరింది. సరిపడా కరెంటు పంపిణీ చేయలేకపోవడంతో గంటల తరబడి కోతలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా కరెంటు వాడకం భారీగా పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటలకు దేశ చరిత్రలోనే అత్యధికంగా 207.11 గిగావాట్లకు చేరిందని కేంద్ర విద్యుత్ శాఖ ట్వీట్ చేసింది. కేంద్రం చేతగానితనమే విద్యుత్ సంక్షోభానికి కారణమంటూ కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి దుయ్యబట్టారు. ‘‘మోదీ జీ! దేశమన్నా, ప్రజలన్నా మీకు అస్సలు పట్టదా?’’ అంటూ నిలదీశారు. ఇకనైనా విద్వేషపు బుల్డోజర్లను ఆపి విద్యుత్కేంద్రాలను నిరంతరాయంగా నడపడంపై దృష్టి పెట్టాలన్నారు. ఢిల్లీలో ఒక్క రోజు బొగ్గు నిల్వలే థర్మల్ విద్యుత్‌పైనే అత్యధికంగా ఆధారపడ్డ నేపథ్యంలో విద్యుత్కేంద్రాలకు బొగ్గు సకాలంలో అందక సంక్షోభం ముంచుకొచ్చింది. ఢిల్లీలో ఒక్క రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలున్నాయి. బొగ్గు అందకుంటే ఆస్పత్రులకు, మెట్రోకు కరెంటివ్వలేమని కేజ్రివాల్ ప్రభుత్వం పేర్కొంది. ‘‘ఇప్పటిదాకా ఎలాగోలా సర్దుబాటు చేశాం. పరిస్థితులు చెయ్యి దాటుతున్నాయి’’ అంటూ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. విద్యుత్కేంద్రాలకు బొగ్గు పంపిణీకి వీలుగా 657 పాసింజర్ రైళ్లను కేంద్రం నిరవధికంగా రద్దు చేసింది. వాటికి బదులు యుద్ధప్రాతిపదికన బొగ్గు వాగన్లను రవాణా చేస్తామని రైల్వే శాఖ పేర్కొంది. 165 థర్మల్ విద్యుత్కేంద్రాలకు గాను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం 56 కేంద్రాల్లో 10% బొగ్గు నిల్వలే ఉన్నాయి. 26 కేంద్రాల్లోనైతే 5% కంటే తక్కువకు పడిపోయాయి. బొగ్గు నిల్వలు 21 రోజులకు సరిపడా లేకుంటే నిరంతరాయ విద్యుత్ పంపిణీ వీలు పడదు. కేంద్రం వర్సెస్ కేజ్రివాల్ ఢిల్లీలో డిమాండ్ రోజుకు 6 వేల మెగావాట్లకు పెరగడంతో పంపిణీ కష్టంగా మారింది. బొగ్గు నిల్వలు ఒక్క రోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం చెప్పగా, అదేమీ లేదంటూ ఎన్టీపీసీ ట్వీట్ చేసింది. ‘‘ఢిల్లీకి కరెంటు సరఫరా చేసే ఉంచహార్, దాద్రి విద్యుత్కేంద్రాలు 100% సామర్థ్యంతో పని చేస్తున్నాయి. బొగ్గు పంపిణీ సక్రమంగానే జరుగుతోంది. దాద్రిలో 1.4 లక్షల మెట్రిక్ టన్నులు, ఉంచహార్లోని ఐదు యూనిట్లలో 95 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి’’ అని చెప్పింది. -
ఎన్టీపీసీ ఆర్‌ఈడీగా నరేశ్ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నరేశ్ ఆనంద్ సోమవారం కవాడిగూడలోని సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్లతో పాటు దక్షిణ భాతర దేశంలోని సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా 1984లో చేరిన ఆయన.. 37 ఏళ్ల సర్వీసు కాలంలో పలు హోదాల్లో పనిచేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సభ్యుడిగా కూడా వ్యవహరించారు. -
ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ప్రకటించింది. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పెట్టుబడుల అవకాశాలపై సీఎంతో చర్చించినట్లు ఎన్టీపీసీ ట్వీట్ చేసింది. పునరుత్పాదక ఇంధనం, పంప్డ్ స్టోరేజ్, ఇంధన సామర్థ్యం పెంపు వంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశాలపై సీఎం జగన్‌తో చర్చించినట్లు ఎన్టీపీసీ పేర్కొంది. రాష్ట్రానికి నమ్మకంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఎన్టీపీసీని సీఎం అభినందించారని తెలిపింది. కాగా, గురుదీప్ సింగ్‌ను సీఎం సత్కరించి, వేంకటేశ్వరస్వామి ప్రతిమ అందించారు. చదవండి: (అక్షయపాత్ర సిద్ధం) -
విశాఖలో హైడ్రోజన్ ఎనర్జీ ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతి పెద్దదైన, దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. విశాఖపట్నంలోని సింహాద్రి పవర్ ప్లాంట్‌లో స్టాండలోన్ ఫ్యూయల్–సెల్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్టును నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లిమిటెడ్ స్థాపించబోతోంది. విద్యుదుత్పత్తికి అవసరమైన చమురులో 85 శాతం, గ్యాస్‌లో 53 శాతం దిగుమతి చేసుకునే మన దేశంలో ఈ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఓ గేమ్‌చేంజర్ కానుందని ఎన్టీపీసీ వర్గాలు చెబుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ కొనుగోలు తప్పనిసరి? స్వచ్ఛమైన ఇంధనాలను ప్రోత్సహించడానికి.. ఎరువుల కర్మాగారాలు, చమురు శుద్ధి కర్మాగారాలు గ్రీన్ హైడ్రోజన్‌ను కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా పవన, సౌర వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా శక్తినిచ్చే ఎలక్ట్రోలైజర్‌ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టును రాష్ట్రంలో ఎన్టీపీసీ ద్వారా స్థాపించనుంది. దేశంలో ఇంధన భద్రతా చర్యల్లో భాగంగా నాలుగు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ సామర్థ్యాన్ని సాధించడానికి త్వరలో కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. సింహాద్రి థర్మల్ కేంద్రం సమీపంలో ఉన్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు (నీటిలో తేలియాడే సౌర ఫలకలు) నుండి ఇన్పుట్ పవర్ తీసుకోవడం ద్వారా 240 కిలోవాట్ల సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైజర్ ఉపయోగించి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. సూర్యరశ్మి సమయంలో ఉత్పత్తి చేసిన ఈ హైడ్రోజన్‌ను అధిక పీడనం వద్ద నిల్వచేస్తారు. 50 కిలోవాట్ల సాలిడ్ ఆక్సైడ్ ఇంధన కణాన్ని ఉపయోగించి విద్యుదీకరిస్తారు. ఇది సా.5 నుండి ఉ.7 వరకు స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇక దేశంలో మరికొన్ని హైడ్రోజన్ శక్తి నిల్వ ప్రాజెక్టులను స్థాపించడానికి అవసరమైన అధ్యయనానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. లద్దాఖ్‌తో ఒప్పందం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌తో ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఆర్ఈఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు డీజిల్ జనరేటర్లపై ఆధారపడిన లద్దాఖ్, జమ్మూ–కశ్మీర్ వంటి దేశంలోని సుదూర ప్రాంతాలను డీకార్బోనైజ్ చేయడానికి ఈ ప్రాజెక్టు నమూనా కానుంది. 2070 నాటికి లద్దాఖ్‌ను కార్బన్ రహిత భూభాగంగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో హైడ్రోజన్ ప్రాజెక్టును ఎన్టీపీసీ పైలెట్ ప్రాజెక్టుగా స్థాపిస్తోంది. -
ఎన్టీపీసీలో ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు 60 వేల జీతం
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ).. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 15 ► పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హైడ్రో) మెకానికల్–05, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హైడ్రో) సివిల్–10. ► ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హైడ్రో) మెకానికల్: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హైడ్రో) సివిల్: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఆన్లైన్ స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021 ► వెబ్సైట్: ntpc.co.in -
దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్టీపీసీ పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్టీపీసీ పాత్ర కీలకమైనదని ఆ సంస్థ సీజీఎం(ఐటీ) శైలేష్ శ్రీనివాసన్ అన్నారు. 46 ఏళ్ల ప్రస్థానంలో నిరంతర విద్యుత్ సరఫరాతో ఎన్టీపీసీ దేశంలో స్ఫూర్తిదాయక సంస్థగా కొనసాగుతుందన్నారు. సంస్థ సదరన్ రీజియన్ క్వార్టర్స్‌లో ‘ఎన్టీపీసీ రైజింగ్‌డే –2021’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శైలేష్ శ్రీనివాసన్ జెండాను ఎగరవేసి మాట్లాడారు. కరోనా విజృంభించిన సమయంలోనూ సంస్థ మంచి పనితీరును కనబరించిందని కితాబిచ్చారు. దక్షిణ ప్రాంతంలోని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ల పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టు, సోలార్ పీవీ ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. అనం తరం ‘హిందీ పక్వాడా’, ‘విజిలెన్స్ అవేర్నెస్ వీక్’ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీ ల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ జీఎం మణికాంత్ పాల్గొన్నారు. -
NTPC: భారత విద్యుత్తేజం ఎన్టీపీసీ
జ్యోతినగర్ (రామగుండం): భారతావనికి వెలుగులు అందిస్తూ విద్యుత్తేజంగా విరాజిల్లుతున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నేటికి 46 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో ఎన్టీపీసీ 74 విద్యుత్ కేంద్రాల ద్వారా 67,657.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోంది. 2032 నాటికి 1,28,000 మెగావాట్ల లక్ష్యంతో నూతన ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తూ ముందుకు సాగుతోంది. నవంబర్ 7న ‘రైజింగ్ డే’.. స్వాతంత్య్రం అనంతరం దేశం తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంది. కేంద్రం పరిధిలో ఒక విద్యుత్ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఆ విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రానికి ఎక్కువ శాతం విద్యుత్ కేటాయించి, మిగతా విద్యుత్‌ను ప్రాంతాల వారీగా పంపిణీ చేయాలని తీర్మానం చేశారు. అప్పటికప్పుడు నిర్మించాలంటే సమయం పడుతుందనే ఉద్దేశంతో ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని టేకోవర్ చేసింది. 1975 నవంబర్ 7న ఎన్టీపీసీని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌గా నమోదు చేసి, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంగా నామకరణం చేసి, ఎన్టీపీసీగా గుర్తించారు. దీంతో ఈ రోజును సంస్థ ‘రైజింగ్ డే’గా నిర్వహిస్తోంది. 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం ఎన్టీపీసీ దేశంలో బొగ్గు గనులు, గ్యాస్, నీరు, స్థలం ప్రాంతాలను గుర్తించి, విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఇలా దినదినాభివృద్ధి చెందుతూ అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచస్థాయి విద్యుత్ సంస్థలతో పోటీ పడుతూ భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పవర్ ప్లాంట్ సామర్థ్యం, పీఎల్ఎఫ్, మెయింటెనెన్స్, రక్షణ, విద్యుత్ పొదుపు, పర్యావరణ సమతౌల్యం, మేనేజ్మెంట్ విధానాలతో మొదటి స్థానంలో నిలిచింది. అలా నవరత్న కంపెనీగా ఉన్న ఎన్టీపీసీ 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం చెందింది. ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఎన్టీపీసీ సొంతంగా బొగ్గు, గ్యాస్, హైడ్రో, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, జాయింట్ వెంచర్స్‌తో పాటు మొత్తంగా 74 విద్యుదుత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. ప్రస్తుతం సూపర్ క్రిటికల్ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఎన్టీపీసీ తన ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి కన్సల్టెన్సీ, పవర్ ట్రేడింగ్, విద్యుత్ నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల రంగాల్లో ముందుకు సాగుతోంది. మైనింగ్‌లో ఎన్టీపీసీ వేగవంతమైన ప్రగతిని సాధించింది. ప్రపంచంలోని ప్రముఖ విద్యుత్ సంస్థగా అవతరించే దిశగా పయనిస్తోంది. కరోనా సమయంలోనూ నిరంతర విద్యుత్ సరఫరా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ దేశానికి ఎన్టీపీసీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసింది. కోవిడ్–19కు వ్యతిరేకంగా పోరాడటంలో ప్రభుత్వానికి మద్దతుగా పీఎం కేర్ ఫండ్‌కు రూ.257.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తంలో రూ.250 కోట్లు కంపెనీవి కాగా, సంస్థ ఉద్యోగులు తమ వేతనాల నుంచి రూ.7.5 కోట్లు అందించారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించారు. కరోనా ఉధృతిలో కాంట్రాక్టు, వలస కార్మికులకు నిత్యావసరాలు, వైద్యసేవలు అందించారు. సంస్థ ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికీ భౌతిక దూరం పాటిస్తున్నారు. ఎన్టీపీసీ ప్రపంచంలో నంబర్ వన్ స్థాయిలో నిలిచేందుకు సమన్వయంతో ముం దుసాగాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇతర సంస్థలతో కలసి వ్యాపారాలు ఒకప్పుడు విద్యుదుత్పత్తి మాత్రమే చేసిన ఎన్టీపీసీ భవిష్యత్ పోటీని ఎదుర్కొని ఉత్పత్తి, పంపిణీ, విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు, సొంతంగా బొగ్గు గనుల ఏర్పాటు, జాయింట్ వెంచర్లు తదితర ఎన్నో రంగాల్లో ఇతర సంస్థలతో కలసి వ్యాపారాలు చేస్తోంది. జాయింట్ వెంచర్ల పేరిట బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాల్లో వాటి భాగస్వామ్యంతో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మి స్తోంది. భవిష్యత్‌లో అణు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేయాల్సి వస్తే మొదట ఎన్టీపీసీకే అవకాశం దక్కనుంది. -
కొత్త థర్మల్ ప్లాంట్లపై వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం విషయంగా ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 4,000 మెగావాట్ల యాదాద్రి, 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ తొలిదశ పూర్తయితే.. రాష్ట్ర అవసరాలుపోగా విద్యుత్ మిగులు కూడా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని విరమించుకోవాలనే భావనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది. సింగరేణి సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే 1,200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను నిర్మించింది. విస్తరణలో భాగంగా మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి 2019 డిసెంబర్ 18న కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇంకా నిర్మాణ పనులు మొదలుపెట్టలేదు. ఇక ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు.. తెలంగాణలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో తొలిదశ కింద 1,600 మెగావాట్ల ప్లాంట్‌ను రామగుండంలో చేపట్టారు. రెండో దశ కింద 2,400 మెగావాట్ల ప్లాంట్ కట్టాల్సి ఉంది. ఎన్టీపీసీ దీనికి పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటివరకు దరఖాస్తే చేసుకోలేదు. రెండోదశ ప్లాంట్‌కు సంబంధించి ఇంతవరకు కేంద్రం నుంచి అనుమతి రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా విజ్ఞప్తులు లేవని ఎన్టీపీసీ అధికారవర్గాలు తెలిపాయి. 800 మెగావాట్ల సింగరేణి, 2,400 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టినట్టు కనిపిస్తున్నా.. కొద్దిరోజులుగా విద్యుత్ రంగంలో జరుగుతున్న పరిణామాలను బట్టి భవిష్యత్తులోనూ వాటిని చేపట్టే అవకాశాలు తక్కువని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. భారీగా అందుబాటులోకి.. ప్రస్తుతం రాష్ట్రంలో.. 3,772.5 మెగావాట్ల తెలంగాణ జెన్కో, 1,200 మెగావాట్ల సింగరేణి, 2,645 మెగావాట్ల కేంద్ర ప్లాంట్లు, 839 మెగావాట్ల సెమ్‌కాబ్ (ప్రైవేటు) కలిపి మొత్తం 8,456 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉంది. ఇక నిర్మాణంలో ఉన్న 270 మెగావాట్ల భద్రాద్రి, 4 వేల మెగావాట్ల యాదాద్రి, 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ తొలిదశ పూర్తయితే.. రాష్ట్ర థర్మల్ విద్యుత్ సరఫరా సామర్థ్యం 14,326.5 మెగావాట్లకు పెరుగుతుంది. దీనికి అదనంగా 2,531.76 మెగావాట్ల జెన్కో జలవిద్యుత్ కేంద్రాలు, 3,472 మెగావాట్ల సౌర, 128 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా థర్మల్, హైడల్, సోలార్, విండ్ ప్లాంట్లు అన్నీ కలిపి దాదాపు 25 వేల మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరనుంది. పెట్టుబడి గిట్టుబాటు కాదు.. కాళేశ్వరం, పాలమూరు వంటి కొత్త ఎత్తిపోతల పథకాల వల్ల రాష్ట్రంలో 8వేల మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. 2022–23 నాటికి పూర్తికానున్న యాదాద్రి, ఎన్టీపీసీ ప్లాంట్లతో ఈ డిమాండ్ తీరిపోయి, ఇంకా మిగులు విద్యుత్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఆశించిన మేర విద్యుత్ డిమాండ్ పెరగకపోతే.. కొత్త థర్మల్ ప్లాంట్లపై పెట్టే వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు నష్టం కలుగుతుందని పేర్కొంటున్నారు. అందువల్ల కొత్త థర్మల్ ప్లాంట్లు చేపట్టకపోవడమే మేలు అని చెప్తున్నారు. -
సింహాద్రిలో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ
పరవాడ (పెందుర్తి): విశాఖ జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీ 2వ యూనిట్లో సాంకేతిక కారణాల వలన నిలిచిపోయిన విద్యుదుత్పత్తిని మరమ్మతుల అనంతరం బుధవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో తిరిగి పునరుద్ధరించారు. సంస్థలో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్ బాయిలర్‌లో అమర్చిన ట్యూబ్‌కు లీకేజీ ఏర్పడి సోమవారం రాత్రి 6.30 గంటలకు విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. యూనిట్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలపై నిపుణులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి బుధవారం సాయంత్రానికి లైటప్ చేశారు. సాయంత్రం 6.30 గంటల నుంచి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరిగిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం నాలుగు యూనిట్ల నుంచి రెండు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతున్నదని ఎన్టీపీసీ అధికార వర్గాలు వెల్లడించాయి. -
పీఎస్‌యూల నుంచి రూ. 2,593 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజాలు ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్(పీజీసీఐఎల్) సంయుక్తంగా ప్రభుత్వానికి రూ. 2,593 కోట్ల డివిడెండ్‌ను అందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021–22)గాను ఎన్టీపీసీ రూ. 1,560 కోట్లు, పీజీసీఐఎల్ రూ. 1,033 కోట్లు చొప్పున ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ పీఎస్‌యూల నుంచి డివిడెండ్ల రూపేణా ప్రభుత్వానికి రూ. 7,515 కోట్లు అందినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో మరోపక్క ప్రభుత్వ రంగ కంపెనీలలో మైనారిటీ వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 9,110 కోట్లు సమకూర్చుకున్నుట్లు తెలియజేశారు. -
అవన్నీ అనవసరమైన భయాందోళనలు
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడే పరిస్థితి వస్తుందని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పలు రాష్ట్రాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సంక్షోభ నివారణకు కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోకుండా అవసరమైన అన్ని వనరులు వినియోగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్.కె.సింగ్ ఎన్టీపీసీ, రిలయెన్స్ ఎనర్జీ సహా వివిధ విద్యుదుత్పత్తి కేంద్రాలు, విద్యుత్ సరఫరా కంపెనీలు, విద్యుత్ అధికారులతో ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్‌కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసర భయాందోళనలు వద్దని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ సరఫరాకు ప్రమాదం ఏమీ లేదని భరోసా ఇచ్చారు. సమాచార లోపమే కారణం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), ఢిల్లీలోని డిస్కమ్‌ల మధ్య సమాచార లోపం వల్లే అనవసర ఆందోళనలు తలెత్తాయని చెప్పారు. ఢిల్లీ డిస్కమ్‌లకి, గెయిల్‌కి మధ్య కాంట్రాక్టు పూర్తి అయిపోవడంతో ఇక గ్యాస్ సప్లయ్ చేయలేమని గెయిల్ రాసిన లేఖతో విద్యుత్ ప్రమాదం ముంచుకొస్తోందన్న భయం తలెత్తి ఉండవచ్చునని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాసిన లేఖపై లెఫ్ట్‌నెంట్ జనరల్ నాతో మాట్లాడారు. అలాంటి పరిస్థితి రాదని వాళ్లకి చెప్పాను. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే గ్యాస్ సరఫరా చేయమని గెయిల్ సీఎండీని ఆదేశించాం. సరఫరా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు’అని మంత్రి తెలిపారు. బొగ్గు గనులున్న ప్రాంతాల్లో భారీ వర్షాలతో తవ్వకాలు నిలిచిపోవడం, సరఫరా మందగించడం, అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరగడంతో భరించలేని కంపెనీలు ఉత్పత్తిపై చేతులెత్తేస్తున్నాయి. గుజరాత్లో టాటా పవర్ ఉత్పత్తి నిలిపివేత విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపైనే ఆధారపడిన టాటా పవర్ అధిక ధరలకు బొగ్గు కొనలేక గుజరాత్‌లోని ముంద్రా ప్లాంట్‌లో ఉత్పత్తి ఆపేసింది. ఈ ప్లాంటు ద్వారా గుజరాత్‌కు 1,850 మెగావాట్లు, పంజాబ్‌కు 475, రాజస్తాన్‌కు 380, మహారాష్ట్రకు 760, హరియాణాకు 380 మెగావాట్లు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయంటే.. బొగ్గు నిల్వలపై కేంద్ర విద్యుత్ శాఖ, బొగ్గు గనుల శాఖ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ, క్యాప్టివ్ కోల్‌మైన్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అన్నీ కలుపుకుంటే అక్టోబర్ 9న మొత్తంగా 19.2 లక్షల టన్నులు సరఫరా చేస్తే , విద్యుత్ ప్లాంట్లలో 18.7 లక్షల టన్నులు వినియోగించారు. అంటే వినియోగానికి మించి సరఫరా ఉందని, కొన్ని రోజులు గడిస్తే బొగ్గు నిల్వలు పెరుగుతాయని విద్యుత్ శాఖ వెల్లడించింది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మరో ప్రకటనలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు దాదాపుగా 72 లక్షల టన్నులున్నాయని, ఇవి నాలుగు రోజులకి సరిపోతాయని పేర్కొంది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) దగ్గర 400 లక్షల టన్నుల స్టాకు ఉందని, విద్యుత్ ప్లాంట్లకు దానిని సరఫరా చేస్తున్నట్టుగా వివరించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకి రోజుకి 18.5 లక్షల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం రోజుకి 17.5 లక్షల టన్నులు సరఫరా చేస్తున్నామని, వర్షాల కారణంగా పంపిణీ కాస్త నెమ్మదించిందని అంగీకరించింది. గత ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు దేశీయంగా లభించే బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి 24 శాతం పెరిగిందని వివరించింది. అప్పట్లో ఆక్సిజన్‌కూ కొరత లేదన్నారు: సిసోడియా కేంద్రం ప్రతీ సమస్యని తేలిగ్గా తీసుకుంటోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. బొగ్గు సంక్షోభం తరుముకొస్తున్నా ఏమీ లేదని అంటోందని మండిపడ్డారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆస్పత్రులు, డాక్టర్లు ఆక్సిజన్‌కి కొరత ఉందని మొరపెట్టుకున్నా అలాంటిదేమీ లేదని మభ్యపెట్టిందని, ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసరంగా లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కే. సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో సిసోడియా విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్ర విద్యుత్ మంత్రి బొగ్గుకి కొరత లేదని అంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధానికి అలా లేఖ రాసి ఉండకూడదని కూడా అన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఆయన చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు’’అని సిసోడియా అన్నారు. సమస్య నుంచి పారిపోవాలని కేంద్రం భావిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతని, ఇప్పటి బొగ్గు సమస్యతో పోలుస్తూ కేంద్రంపై సిసోడియా విరుచుకుపడ్డారు. -
4 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో బొగ్గు కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 108 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వివిధ ప్రాంతాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద బుధవారం నాటికి సగటున 4 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు లభ్యత లేక గురువారం ఇతర రాష్ట్రాల్లోని 14,500 మెగావాట్ల సామర్థ్యం గల 15 థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి జరగలేదు. మరోవైపు బొగ్గు కొరత ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా పడింది. అయితే జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి బొగ్గు గనుల సంస్థ.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను తగ్గించి ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లకు మళ్లిస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుత అవసరాలకు మించి బొగ్గును వృథాగా నిల్వ ఉంచడానికి బదులుగా, ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న విద్యుత్ కేంద్రాలకు సింగరేణి బొగ్గును తరలిస్తున్నారు. అయితే సింగరేణి బొగ్గు సరఫరా తొలి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రమేనని, రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నట్లు సింగరేణి సంస్థ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. దేశంలో బొగ్గు కొరత ఎంత పెరిగినా, రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకు కొరత రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. (చదవండి: విద్యుత్ సంక్షోభం.. జనాలకు ఢిల్లీ ప్రభుత్వం వింత రిక్వెస్ట్) మనవద్దా నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే.. రాష్ట్రంలోని తెలంగాణ జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీల థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సాధారణంగా 15 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా, బుధవారం నాటికి నాలుగైదు రోజులకు సరిపడ నిల్వలే ఉన్నాయి. 810 మెగావాట్ల భద్రాద్రి టీపీపీ, 1,000 మెగావాట్ల కొత్తగూడెం టీపీఎస్(న్యూ), 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం, 1,200 మెగావాట్ల సింగరేణి టీపీపీ వద్ద 4 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలే ఉన్నాయి. పిట్‌హెడ్ ప్లాంట్లలో 5 రోజులు, అంతకన్న తక్కువ రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే ఉంటే ‘ఆందోళనకర (క్రిటికల్)’ పరిస్థితిగా పరిగణిస్తారు. రాష్ట్రంలోని తెలంగాణ జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సజావుగా ఉత్పత్తి జరగడానికి రోజుకు 96 వేల టన్నుల బొగ్గు అవసరం. కనీసం 15 రోజుల అవసరాలకు 14.37 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉండాల్సి ఉండగా, 5.98 లక్షల టన్నుల బొగ్గు నిల్వలే ఉన్నట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ గురువారం తన వెబ్సైట్లో పేర్కొంది. పిట్‌హెడ్ ప్లాంట్లు కాబట్టి ఇబ్బంది లేదు.. బొగ్గు గనులకు 50 కి.మీ.ల పరిధిలో ఉంటే ‘పిట్‌హెడ్’థర్మల్ విద్యుత్ ప్లాంట్లు అంటారు. వీటికి బొగ్గు రవాణా చేసేందుకు.. అయ్యే వ్యయం, పట్టే సమయం తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం తప్పిస్తే.. మిగిలిన థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ‘పిట్‌హెడ్’ప్లాంట్లే. సింగరేణి గనులకు సమీపంలో ఉండటంతో వీటికి బొగ్గు సరఫరాకు చాలా తక్కువ సమయం పట్టనుంది. అందువల్ల వీటిల్లో బొగ్గు నిల్వలు తగ్గినా ఆందోళన అవసరం లేదని, గనులకు సమీపంలో ఉండటంతో తక్షణమే అవసరమైన బొగ్గును సరఫరా చేయగలమని సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. కొరత ఎందుకంటే? కరోనా మహమ్మారి, లాక్డౌన్ల అనంతరం అన్ని రంగాలు కుదుటపడుతున్నాయి. మళ్లీ పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకోవడం, ఇతర రంగాలూ సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీంతో విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గుకు సైతం డిమాండ్ పెరిగి కొరత ఏర్పడింది. పొరుగు దేశం చైనాలో గత వారం రోజులుగా తీవ్ర బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి తగ్గి పరిశ్రమలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. (చదవండి: విద్యుత్ సంక్షోభంపై తక్షణం స్పందించండి) గతేడాదితో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు సైతం 100 శాతానికి మించి పెరిగిపోయాయి. దేశంలో సైతం విద్యుత్ డిమాండ్ పెరిగి బొగ్గు వినియోగం పెరిగిపోయింది. దీంతో ఇక్కడా బొగ్గు కొరత నెలకొంది. విదేశీ బొగ్గు ధరలు భారీగా పెరిగిపోవడంతో .. దేశీయంగా తక్కువ ధరకు లభిస్తున్న కోల్ ఇండియా, సింగరేణి బొగ్గుకు డిమాండ్ పెరిగింది. -
మానిటైజేషన్‌కు ఎన్టీపీసీ రెడీ
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ తాజాగా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలు ఆవిష్కరించింది. మూడు అనుబంధ సంస్థలను లిస్టింగ్ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా రూ. 15,000 కోట్ల సమీకరణకు వీలున్నట్లు తెలియజేసింది. జాబితాలో ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్(ఎన్‌వీవీఎన్), నార్త్ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(నీప్కో)తోపాటు.. ఏడాది కాలమే ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ(ఎన్ఆర్ఈఎల్) ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా స్టీల్ పీఎస్‌యూ సెయిల్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ నుంచి సైతం వైదొలగనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాదిలో ఎన్‌ఆర్‌ఎల్‌ను వచ్చే ఏడాది అక్టోబర్‌కంటే ముందుగానే లిస్టింగ్ చేయనున్నట్లు ఎన్టీపీసీ చైర్మన్, ఎండీ గురుదీప్ సింగ్ పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన విభాగంలో 2020 అక్టోబర్‌లో ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఏడాదికి 7–8 గిగావాట్ల సామర్థ్యాన్ని జత కలుపుకుంటున్నట్లు గురుదీప్ తెలియజేశారు. పవర్ ట్రేడింగ్‌కు ఏర్పాటు చేసిన కంపెనీ ఎన్‌వీవీఎన్ తదుపరి ఫ్లై యాష్ ట్రేడింగ్, వినియోగం, ఎలక్ట్రిక్, హైడ్రోజన్ మొబిలిటీ, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను చేపట్టింది. గతేడాది మార్చిలో నీప్‌కోలో ఎన్టీపీసీ 100 శాతం వాటాను సొంతం చేసుకుంది. కంపెనీ 7 హైడ్రో, 3 థర్మల్, 1 సోలార్ పవర్ స్టేషన్లను నిర్వహిస్తోంది. 2,057 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 50:50 శాతం వాటాతో ఏర్పాటైన ఎన్టీపీసీ– సెయిల్ జేవీ దుర్గాపూర్, రూర్కెలా, భిలాయ్‌లలో సెయిల్ సొంత అవసరాలకు వీలుగా 814 మెగావాట్ల విద్యుదుత్పత్తి యూనిట్లను నెలకొలి్పంది. -
మార్చికి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలోని జైపూర్ లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం రిజర్వాయ ర్‌పై తలపెట్టిన నీటిపై తేలియాడే 15 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఇందులో తొలి విడతగా 5 మెగావాట్ల ప్లాంట్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచిం చారు. గురువారం ఆయన సింగరేణి భవన్లో సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ వివిధ ప్రాంతాల్లో మూడు దశల్లో సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికే 172 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మొదటి దశలో మిగిలి ఉన్న 10 మెగావాట్ల ప్లాంట్ (రామగుండం– 3), రెండవ దశలో మిగిలిఉన్న కొత్తగూడెంలోని 37 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ నెలాఖరుకల్లా ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. అలాగే కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశ యంపై నిర్మించతలపెట్టిన 250 మెగావాట్ల తేలి యాడే సోలార్ ప్రాజెక్టుకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని వచ్చే ఏడాది మార్చిలో టెండర్లు పిలవడా నికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది దేశంలోని అత్యుత్తమ విద్యుత్ కేంద్రాల్లో ఏడవ స్థానం సాధించినందుకు ఆయన అధికారులను అభినందించారు. ఈ ఏడాది 93 నుంచి 94 శాతం సామర్థ్యం (పీఎల్ఎఫ్)తో విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని, దేశంలో అత్యుత్తమ 25 ప్లాంట్లలో మొదటి ఐదు స్థానాల్లో ఈ కేంద్రం నిలిచేలా కృషి చేయాలని అన్నారు. కాగా, సింగరేణి సంస్థ త్వర లోనే 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించబోతోందని తెలిపారు. -
పిచ్చోడి వీరంగం.. రోడ్డుపై, ఆస్పత్రిలో రచ్చ రచ్చ
గుత్తి: గుత్తిలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. అతను విసిరిన రాయి తగిలి ఎన్టీపీసీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత అతన్ని స్థానికులు చితకబాదగా గాయాలు కావడంతో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా వీరంగం సృష్టించాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పామిడి మండలం పాల్యం తండాకు చెందిన మునినాయక్ గుత్తి సమీపంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) సబ్ స్టేషన్లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం స్వగ్రామం నుంచి బైక్‌పై సబ్‌స్టేషన్‌కు బయలుదేరారు. గుత్తి శివారులోని ఎస్కేడీ ఇంజినీరింగ్ కళాశాల వద్దకు చేరుకోగానే ఓ పిచ్చోడు అకారణంగా విసిరిన రాయి మునినాయక్‌ను బలంగా తాకింది. దీంతో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిన ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో వీరంగం..: ఎన్టీపీసీ ఉద్యోగిపై దాడి చేసిన పిచ్చోడిని స్థానికులు చితకబాదారు. అనంతరం గాయపడిన అతన్ని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు, స్టాఫ్‌నర్సులు చికిత్స చేస్తుండగా అతను మరోసారి రెచ్చిపోయాడు. సెలైన్ స్టాండ్ తీసుకుని వైద్య సిబ్బందిపై దాడికి యత్నించడంతో అంతా చెల్లాచెదురయ్యారు. అద్దాలను ధ్వంసం చేశాడు. అతి కష్టంపై కొందరు యువకుల సాయంతో పోలీసులు అతన్ని పట్టుకుని, కాళ్లూచేతులు కట్టేసి చికిత్స చేయించారు. అతని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. తనది హైదరాబాద్ అని మాత్రమే చెప్పి, ఆ తర్వాత కేకలు వేస్తూ దాదాపు ఐదు గంటల పాటు ఆస్పత్రిలో వీరంగం సృష్టించాడు. -
ఎన్టీపీసీ లాభం హైజంప్..!
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు మూడు రెట్లు ఎగసింది. రూ. 4,649 కోట్లకుపైగా ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 1,630 కోట్లు మాత్రమే సాధించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 31,330 కోట్ల నుంచి రూ. 31,687 కోట్లకు నామమాత్రంగా పుంజుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 3.15 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. ఫిబ్రవరిలో రూ. 3 మధ్యంతర డివిడెండును చెల్లించిన సంగతి తెలిసిందే. క్యూ4లో స్థూల విద్యుదుత్పత్తి 68.27 బిలియన్ యూనిట్ల నుంచి 77.63 బి.యూకి పెరిగింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 11,192 కోట్ల నుంచి రూ. 14,969 కోట్లకు జంప్‌చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,12,373 కోట్ల నుంచి రూ. 1,15,547 కోట్లకు ఎగసింది. రుణాల ద్వారా నిధుల సమీకరణ పరిమితిని బోర్డు రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.25 లక్షల కోట్లకు పెంచింది. గతేడాది విద్యుదుత్పత్తి 259.61 బిలియన్ యూనిట్ల నుంచి 270.9 బీయూకి పెరిగింది. మొత్తం గ్రూప్ కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 314.07 బీయూని సాధించినట్లు కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది. 2019–20లో ఇది 290.19 బీయూ మాత్రమేనని తెలియజేసింది. కాగా.. క్యూ4లో బొగ్గు ఉత్పత్తి 2.6 మిలియన్ టన్నుల నుంచి 3.7 ఎంటీకి పుంజుకుంది. పూర్తి ఏడాదికి మాత్రం 9.63 ఎంటీ నుంచి 9.46 ఎంటీకి తగ్గింది. క్యూ4లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) 69.52 శాతం నుంచి 77.12 శాతానికి మెరుగుపడింది. పూర్తి ఏడాదికి 68 శాతం నుంచి 66 శాతానికి నీరసించింది. సగటు విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ. 3.9 నుంచి రూ. 3.77కు తగ్గింది. చదవండి: 5జీ నెట్వర్క్: ఎయిర్టెల్ కీలక నిర్ణయం..! -
బూడిదకు భలే డిమాండ్
సాక్షి, జ్యోతినగర్ (రామగుండం): వ్యర్థం అనుకున్న బూడిదకు నేడు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఎన్టీపీసీ చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలిస్తోంది. బూడిద వినియోగంపై సంస్థ చర్యలు పలు పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నూతనంగా జియో పాలిమర్ గుళికల (కంకర), టైల్స్ తయారీకి శ్రీకారం చుట్టడంతో మరింత వినియోగంలోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బూడిద వినియోగం 118.23 శాతం మార్కుకు చేరిందంటే డిమాండ్ ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమవుతోంది. బ్రిక్స్, జియో పాలిమర్ గుళికల తయారీకి విరివిగా వినియోగిస్తున్నారు. తాజాగా టైల్స్ తయారీపైనా దృష్టి సారించారు. 32 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగం ఎన్టీపీసీలో 2,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నిత్యం 32 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగిస్తారు. దీంతో సుమారు 13 వేల మెట్రిక్ టన్నుల బూడిద వెలువడుతుంది. దీన్ని చిన్నతరహాæ పరిశ్రమలతోపాటు సిమెంట్, కాంక్రీటు, ఇటుకల తయారీ, రోడ్ ఎంబ్యాంక్మెంట్, వాణిజ్యపరంగా సిమెంటు, రహదారుల నిర్మాణం, లోతట్టు ప్రాంతాల్లో నింపడం కోసం టెండర్ల ద్వారా విక్రయిస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 25,06,533 మెట్రిక్ టన్నుల బూడిద విడుదల కాగా 19,78,750 మెట్రిక్ టన్నుల బూడిదను వినియోగంచుకుని 78.94 శాతంగా నమోదు చేశారు. రానున్న రోజుల్లో 100 శాతం వినియోగానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వినియోగం ఇలా.. భవిష్యత్ ప్రణాళిక ►తెలంగాణ ప్రాజెక్టు యాష్‌పాండ్ కట్ట నిర్మాణం, రోడ్డు నిర్మాణాలు, సింగరేణి సంస్థ భూగర్భ గనులను నింపేందుకు పూర్తిస్థాయిలో బూడిద వినియోగానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ►తెలంగాణ ప్రాజెక్టు సమీపంలో పైలట్ ప్రాజెక్టుగా జియోపాలిమర్ రోడ్డు నిర్మించింది. సిమెంట్ వాడకుండా 70 శాతం బూడిదతోపాటు సిలికాన్, సోడియం హైడ్రాక్సైడ్‌తో రోడ్ల నిర్మాణం చేపట్టారు. ►కంకరకు బదులుగా బూడిద గుళికలను తయారు చేస్తున్నారు. 80 శాతం బూడిద, 20 శాతం రసాయన పదార్థాలతో యంత్రాల ద్వారా గుళికలను 10 ఎంఎం, 20 ఎంఎం, 40 ఎంఎం పరిమాణంలో తయారు చేస్తున్నారు. ►గుళికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి వరంగల్ నిట్ ఆధ్వర్యంలో ప్రయోగాలు ప్రారంభించారు. 118.23 శాతం వినియోగం ఎన్టీపీసీ బూడిదను ప్రస్తుతం 118.23% వినియోగంలోకి తీసుకొచ్చాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 78.94% వినియోగించు కుంటూ రానున్న రోజుల్లో 100 శాతం వినియోగంలోకి తీసుకురానున్నాం. భవిష్యత్‌లో కూడా ఇదే విధానాలను అనుసరించి పూర్తిస్థాయి పలు అవసరాలకు ఉపయోగించేందుకు పరిశోధనలు చేయనున్నాం. బూడిదను వినియోగించే సంస్థలు, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవగాహ న కల్పిస్తున్నాం. – సునీల్‌కుమార్, సీజీఎం,ఎన్టీపీసీ రామగుండం -
నష్టాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: స్టాక్ మార్కెట్‌కు నష్టాలు ఒకరోజుకే పరిమితం అయ్యాయి. సూచీలు మళ్లీ రికార్డుల బాట పట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేయడంతో పాటు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ఎఫ్ఎంజీసీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 139 పాయింట్లను ఆర్జించి 46 వేలపైన 46,099 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్లను ఆర్జించి 13,514 వద్ద నిలిచింది. ఫార్మా, ఐటీ, ఆటో షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,310 వద్ద గరిష్టాన్ని, 45,706 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 13,579–13,403 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,195 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,359 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 1019 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 255 పాయింట్లను ఆర్జించింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 604 పాయింట్ల రేంజ్లో, నిఫ్టీ 176 పాయింట్ల పరిధిలో కదలాడాయి. ప్రభుత్వ రంగ కంపెనీ కౌంటర్లలో సందడి..: కొన్ని రోజులుగా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్న ప్రభుత్వరంగ కంపెనీల కౌంటర్లో శుక్రవారం సందడి నెలకొంది. ఫలితంగా ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గెయిల్, కోల్ ఇండియా షేర్లు 5 శాతం నుంచి 3 శాతం దాకా లాభపడ్డాయి. ఆరుశాతం పెరిగి స్పైస్‌జెట్... స్పైస్‌జెట్ కంపెనీ షేరు బీఎస్ఈలో ఆరుశాతం లాభపడింది. కోవిడ్–19 వ్యాక్సిన్ల సరఫరాకు రవాణా సంస్థలైన ఓం లాజిస్టిక్స్, స్నోమన్ లాజిస్టిక్స్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో ఎనిమిది శాతం ర్యాలీ రూ.108 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 6.52 శాతం లాభంతో రూ. వద్ద స్థిరపడింది. బర్గర్ కింగ్ లిస్టింగ్ సోమవారం: గతవారంలో పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న బర్గర్ కింగ్ షేర్లు సోమవారం స్టాక్ ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. -
ఎన్టీపీసీ షేర్ల బైబ్యాక్ @ రూ. 2,276 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ రూ. 2,276 కోట్ల విలువ చేసే షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సంస్థ బోర్డు సోమవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 115 చొప్పున మొత్తం 19.78 కోట్ల దాకా షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. దీనికోసం నవంబర్ 13 రికార్డు తేదీగా ఎన్టీపీసీ నిర్ణయించింది. మరోవైపు, సీఎండీ గుర్దీప్ సింగ్ పదవీకాలాన్ని 2025 జూలై 31 దాకా పొడిగించే ప్రతిపాదనకు ఎన్టీపీసీ బోర్డు ఆమోదం తెలిపింది. 2021 ఫిబ్రవరి 4 నుంచి పొడిగించిన పదవీకాలం అమల్లోకి వస్తుంది. 2016 ఫిబ్రవరి 4న ఆయన ఎన్టీపీసీ చైర్మన్, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 1987లో ఎన్టీపీసీలో ఇంజనీర్ ట్రెయినీగా కెరియర్ ప్రారంభించిన గుర్దీప్ సింగ్ ఆ తర్వాత పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. క్యూ2లో నికర లాభం 8 శాతం డౌన్ .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ నికర లాభం (కన్సాలిడేటెడ్) సుమారు 8 శాతం క్షీణించి రూ. 3,495 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో లాభం రూ. 3,788 కోట్లు. ఇక తాజా క్యూ2లో ఆదాయం రూ. 26,569 కోట్ల నుంచి రూ. 28,678 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో విద్యుదుత్పత్తి స్థూలంగా 61.64 బిలియన్ యూనిట్ల (బీయూ) నుంచి 67.67 బీయూకి పెరిగింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి స్థాపిత సామర్థ్యం 57,106 మెగావాట్ల నుంచి 62,910 మెగావాట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో సగటున విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ. 3.86గా ఉన్నట్లు ఎన్టీపీసీ తెలిపింది. సోమవారం బీఎస్ఈలో ఎన్టీపీసీ షేరు సుమారు రెండు శాతం పెరిగి రూ. 89.25 వద్ద క్లోజయ్యింది. -
పులి పయనం ఎందాక?
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): పక్షం రోజులుగా జిల్లాలో తిరుగుతున్న పులి అనువైన ఆవాసం దొరకక ప్రయాణం కొనసాగిస్తోంది. జిల్లాలో రోజుకో ప్రాంతంలో అడుగులు దర్శనమిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో అడుగులు కనిపించిన ప్రాంతానికి అటవీశాఖ అధికారులు చేరుకుని పులివే అని నిర్ధారించి వదిలేస్తున్నారు. పులిని పట్టుకుని తరలించే ప్రయత్నంకానీ, అనువైన ఆవాసం కల్పించే ప్రయత్నంకానీ, జిల్లా దాటించే ప్రయత్నం కానీ చేయడం లేదు. దీంతో ప్రజలు ఏరోజు ఎక్కడ పులిని చూడాల్సి వస్తుందో.. ఎవరిపై దాడిచేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఆరు మండలాల్లో సంచారం.. ఈనెల 7వ తేదీన ముత్తారం మండలం ఓడేడు శివారులో భూపాల పల్లి జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ప్రయాణం నిరంతరం కొనసాగిస్తోంది. ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, పెద్దపల్లి, పాలకుర్తి మండలాల మీదుగా, రామగుండం మండలం ఎన్టీపీసీ రిజర్వాయర్ వరకు సాగింది. అయితే ముత్తారం మండలం మచ్చుపేట శివారులోని బగుళ్ల గుట్ట అడవుల్లో ఆవుల మందపై దాడిచేసిన సమయంలో మాత్రమే పెద్దపులి పశువుల యజమానికి కనిపించింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మంథని–పెద్దపల్లి రహదారి మీదుగా కారులో వెళ్తున్న యువకులు పులి రోడ్డు దాటుతుండగా చూశామని చెబుతున్నారు. ఈరెండేసార్లు మినహా ఎక్కడా ఎవరికీ పులి కనిపించలేదు. బగుళ్ల గుట్టవద్ద మినహా ఎక్కడా పశువులకు, మనుశులకు ఎలాంటి హాని తలపెట్టకుండా తన ప్రయాణం కొనసాగిస్తోంది. ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీపంలో పాద ముద్రలు ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు రిజర్వాయర్ సమీపప్రాంతంలో పులి సంచరించినట్లు అటవీ అధికారులు తెలిపారు. పుట్నూరు ప్రాంతంలో నుంచి పులి శనివారం తెల్లవారుజామున బుగ్గ గుట్ట మీదుగా భామ్లా నాయక్ తండా గుండా ఎన్టీపీసీ రిజర్వాయర్ అటవి ప్రాంతానికి చేరుకుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి మళ్లీ ఇంధన నిల్వల కేంద్రం, గాడిదల గండి వైపు వెళ్లిందని అడుగుల ఆధారంగా గుర్తించామని అటవీ శాఖ సెక్షన్ అధికారి రహ్మతుల్లా, బీట్ అధికారులు నరేశ్, రమేశ్ వివరించారు. వీరితోపాటు భీమ్లా నాయక్ తండా సర్పంచ్ రాజు నాయక్ కూడా ఉన్నారు. రాజీవ్ రహదారి ఎలా దాటింది..? పులి పుట్నూరు నుంచి బుగ్గ గుట్ట మీదుగా ఎన్టీపీసీ రిజర్వాయర్‌కు చేరుకునే క్రమంలో నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారిని దాటాలి. రోడ్డు దాటే క్రమంలో ఎవరికీ కనిపించకపోవడం ప్రశ్నగా మారింది. పులి సంచరించినట్లు తెలు పుతున్న అధికారులు పులి ఏ వైపుకు వెళుతుందో.. అటవీ ప్రాంతం వివరాలు అధికారులకు తెలిసినా రాత్రి సమయంలో కాపు కాయకపోవడంతోనే పులి సంచారాన్ని కనుక్కోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పులి బుగ్గ గుట్ట నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి వెళ్లిందా అనే విషయాలపై కూడా పూర్తి స్పష్టత కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం కూడా పులి సంచారం.. ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలోకి 2018, జూన్‌లో రెండు పులులు సంచిరించినట్లు అధికారులు ధ్రువీకరించారు. రెండు పులులలో ఒకటి చిన్నది, మరొకటి పెద్దదిగా ఉన్నాయని పాద ముద్రల ఆధారంగా నిర్ధారించారు. ఆ తర్వాత పులులు ఎటు వెళ్లాయో కూడా పూర్తి సమాచారం లేదు. రెండేళ్ల వచ్చిన చిన్న పులి పెరిగి పెద్ద అయి మళ్లీ ఈ ప్రాంతంలో సంచరిస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్టీపీసీ రిజర్వాయర్ ప్రాంతం పూర్తి రక్షిత ప్రాంతం అందులోకి అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించరు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనువుగా ఉంటే పులి ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ధర్మారం క్రాస్‌రోడ్డు సమీపంలో.. పాలకుర్తి(రామగుండం): మండల పరిధిలో శుక్రవారం పుట్నూర్ గ్రామంలోని అల్లం రవి పొలంలో పెద్దపులు పాదముద్రలు కనిపించగా, శనివారం ధర్మారం క్రాస్‌రోడ్డు సమీపంలోని ముత్యాల లింగయ్య పొలం వద్ద పాద ముద్రలను బోడగుట్టపల్లి గ్రామస్తులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా రామగుండం సెక్షన్ అధికారి రహ్మతుల్లా వచ్చి పరిశీలించి పెద్దపులివే అని నిర్ధారించారు. నాగులగుట్ట సమీపంలోని పత్తి చేలల్లో కూడా పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. బుధవారం కన్నాల గ్రామ శివారులోని నాగుల గుట్ట నుంచి రాఘావాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని గుప్తా కోల్వాషరీష్ మీదుగా ఎస్సారెస్పీ డి–83 కాలువ వెంబడి పయనించి బుగ్గగుట్టకు చే రుకుని అక్కడి నుంచి ఈసాలతక్కళ్లపల్లి మీదుగా పుట్నూర్ గ్రామ శివారుకు గురువారం రాత్రి చేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం బుగ్గగుట్ట నుంచి కుందనపల్లి ఐవోసీ ఇంధన నిల్వల కేంద్రాల సమీపం నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్ ప్రాంతానికి వచ్చి ఉంటుందని పేర్కొంటున్నారు. -
ఎన్టీపీసీ- సన్ టీవీ.. వెలుగులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో అంచనాలకు మించిన ఫలితాలు ప్రకటించడంతో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగిది. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు అంచనాలను చేరడంతో ఎంటర్టైన్మెంట్, మీడియా రంగ సంస్థ సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ సైతం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్‌ల అమలు నేపథ్యంలోనూ ఈ రెండు కంపెనీలూ పటిష్ట ఫలితాలు సాధించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎన్టీపీసీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఎన్టీపీసీ లిమిటెడ్ నికర లాభం 6 శాతం క్షీణించి రూ. 2,949 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా 3 శాతం నీరసించి రూ. 26,195 కోట్లకు చేరింది. పన్నుకుముందు లాభం 16 శాతం పెరిగి రూ. 4,280 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. సన్ టీవీ నెట్వర్క్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో సన్ టీవీ నెట్వర్క్ నికర లాభం దాదాపు 34 శాతం క్షీణించి రూ. 257 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 37 శాతం నీరసించి రూ. 715 కోట్లకు చేరింది. పన్నుకుముందు లాభం 40 శాతం వెనకడుగుతో రూ. 352 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. అయితే సబ్స్క్రిప్షన్ ఆదాయం 18 శాతం పెరిగి రూ. 442 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో సన్ టీవీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 424 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 10 శాతం దూసుకెళ్లి రూ. 445 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
ఎన్టీపీసీ బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్ : ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (దక్షిణ)గా సీవీ ఆనంద్ హైదరాబాద్‌లో శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన ఎన్టీపీసీ పశ్చిమ ప్రాంత రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ముంబైలో పనిచేశారు. అదే సమయంలో దక్షిణ ప్రాంత ఆర్ఈడీగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన సీవీ ఆనంద్ 1983లో ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీగా చేరారు. సుదీర్ఘ కెరీర్లో ఆయన ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ల నిర్వహణ, ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు. చదవండి : సర్వే ఆధారంగానే లాక్‌డౌన్‌పై నిర్ణయం -
32,000 పైకి సెన్సెక్స్
కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి మరో ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం త్వరలోనే అందించగలదన్న ఆశలతో మంగళవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేస్తారన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం కలసివచ్చింది. ముడి చమురు ధరలు 2 శాతం మేర తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగానైనా పుంజుకోవడం, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు పుంజుకోవడం.... సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 32,0000 పాయింట్లపైకి నిఫ్టీ 9,300 పాయింట్లపైకి ఎగబాకాయి. ఈ రెండు సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. ఈ రెండు సూచీలు ఏడు వారాల గరిష్ట స్థాయిలకు చేరాయి. సెన్సెక్స్ 371 పాయింట్ల లాభంతో 32,115 పాయింట్ల వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 9,381 పాయింట్ల వద్ద ముగిశాయి. 541 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే మొదలైంది. గంటలోపే నష్టాల్లోకి జారిపోయినా, మళ్లీ లాభాల్లోకి వచ్చింది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణిలో కదలాడింది. ఆ తర్వాత లాభాలు జోరుగా పెరిగాయి. ఒక దశలో 84 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 457 పాయింట్లు ఎగసింది. మొత్తం మీద రోజంతా 541 పాయింట్ల రేంజ్లో కదలాడింది. లాక్డౌన్ తొలగింపు, వ్యాపారాలు మళ్లీ పూర్వపు స్థాయిలకు రావడానికి తీసుకునే చర్యలపై ప్రస్తుత ర్యాలీ ఆధారపడి ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. షాంఘై, జపాన్ సూచీలు మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు 2–3 శాతం రేంజ్లో లాభపడ్డాయి. ►నికర లాభం నిరాశపరిచినా, నికర వడ్డీ మార్జిన్ పెరగడం, నిలకడైన వృద్ధి కారణంగా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 15 శాతం లాభంతో రూ.467 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ►సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి. ►మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 29% వాటా కొనుగోలు చేయనుండటంతో యాక్సిస్ బ్యాంక్ షేర్ 7% లాభంతో రూ. 455 వద్దకు చేరింది. -
పవన, సౌర విద్యుత్ ప్లాంట్లతో రైతులకు లబ్ధి
సాక్షి, అమరావతి: పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా రైతులు అత్యంత ప్రయోజనం పొందేలా ‘విద్యుత్ ఎగుమతి విధానం’ (ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ) రూపొందించాలని విద్యుత్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పెట్టే వారిని ప్రోత్సహించే విధంగా పాలసీ ఉండాలని సూచించారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో పవన, సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. ఇక్కడ ప్లాంట్లు పెట్టి, వేరే చోట అమ్ముకోవడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో రైతుల భూముల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల వారికి లాభదాయకంగా లీజు సొమ్ము లభించే వీలుందని, ప్రభుత్వ భూములు లీజుకిచ్చినప్పుడు ప్రభుత్వానికీ ఆదాయం సమకూరే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు అధికారులు తెలిపారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర నెట్వర్క్ ద్వారా ఇతర ప్రాంతాలకు పంపుతారని, ఫలితంగా విద్యుత్ సంస్థలకూ వీలింగ్ చార్జీల ద్వారా ఆదాయం వస్తుందనే విషయమై చర్చించారు. విండ్, సోలార్ ప్లాంట్లు అటు రైతులకు, ఇటు విద్యుత్ సంస్థలకు లాభదాయకంగా ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. కొత్త ప్లాంట్లు రావడం వల్ల రాష్ట్రంలో యువతకు మరికొన్ని ఉద్యోగాలు వస్తాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిదారులకు సానుకూల వాతావరణం కల్పించాలని సీఎం సూచించారు. భూములు లీజుకిచ్చినా ప్రభుత్వం, రైతులకే హక్కులుంటాయని సీఎం అధికారులతో అన్నారు. త్వరితగతిన మెగా సోలార్ ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు వీలుగా అవసరమైన విధివిధానాలపై అధికారులతో చర్చించారు. నిర్మించడం, నిర్వహించడం, బదిలీ చేయడం (బీవోటీ) పద్ధతిలో ప్లాంట్ నిర్మాణం చేపట్టే అంశం కూడా చర్చకొచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భవిష్యత్‌లో ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఢోకా ఉండదని, ప్రభుత్వంపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుందనే అభిప్రాయం చర్చలో వ్యక్తమైంది. రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ముందుకొచ్చిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. ఎన్టీపీసీకి అవసరమైన భూమి ఇచ్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ అందించేందుకు వీలుగా ఫీడర్ల ఆటోమేషన్ ఏర్పాటు చేయాలని, వచ్చే రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తవ్వాలని ఆయన ఆదేశించారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు. విద్యుత్‌రంగంపై బుధవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్లాంట్లు పెట్టాలనుకునేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపై ఆయన చర్చించారు. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఏటా రైతులకు ఆదాయం వస్తుందని, భూమిపై హక్కులు ఎప్పటికీ వారికే ఉంటాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. (మీ చర్యలు స్ఫూర్తిదాయకం) రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఎన్టీపీసీ ముందుకు వస్తుందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 10వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణంపై కూడా ఈ సమావేశంలో అధికారులతో సీఎం జగన్ చర్చించారు. వీలైనంత త్వరగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర విద్యుత్ కోసం ఫీడర్ల ఆటోమేషన్ ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే రెండేళ్లలోగా ఆటోమేషన్ పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. (అవినీతి ఎక్కడున్నా ఏరివేయాలి) -
త్వరలోనే టీహెచ్‌డీసీలో డిజిన్వెస్ట్‌మెంట్
సాక్షి, న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (నీప్కో)లో వాటాలను మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ డీల్ ద్వారా ఖజానాకు దాదాపు రూ. 10,000 కోట్లు రావొచ్చని అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 65,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పడగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది మార్చి 31 నాటికి నీప్కో నికర విలువ రూ. 6,301 కోట్లుగా ఉంది. అటు టీహెచ్‌డీసీఐఎల్ విలువ రూ. 9,281 కోట్లుగా ఉంది. కేంద్రానికి టీహెచ్‌డీసీఐఎల్‌లో 74.23 శాతం, నీప్‌కోలో 100 శాతం వాటాలు ఉన్నాయి. -
బ్లూచిప్ పీఎస్‌యూల్లో ఆఫర్ ఫర్ సేల్!
న్యూఢిల్లీ: నాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ వంటి బ్లూచిప్ పీఎస్‌యూల్లో ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో షేర్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లక్ష్య సాధన కష్టతరం కానుండటంతో నాల్కో, కోల్ ఇండియా వంటి మంచి పనితీరు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓఎఫ్ఎస్ను చేపట్టాలని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం భావిస్తోంది. నేషనల్ అల్యూమినియమ్ కంపెనీ(నాల్కో), కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్ఎమ్డీసీ, ఎన్బీసీసీ(ఇండియా), భారత్ ఎలక్ట్రానిక్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్.. ఈ కంపెనీలు ఓఎఫ్ఎస్ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల్లో ప్రభుత్వానికి 52–82 శాతం రేంజ్లో వాటాలున్నాయి. అయితే ఈ కంపెనీల ఓఎఫ్‌ఎస్‌కు ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు మార్కెట్ స్థితిగతులు బాగా ఉంటేనే ఈ షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి దండిగా రాబడి రాగలదు. బీపీసీఎల్, ఎయిర్ ఇండియాల వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తికాకవపోచ్చు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యసాధనలో రూ.87,000 కోట్ల మేర కోత పడనున్నది. -
ఎన్టీపీసీ చేతికి ఆర్టీపీపీ?
సాక్షి, అమరావతి : వైఎస్సార్ జిల్లా ముద్దనూరులోని ఏపీ జెన్కోకు చెందిన రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం(ఆర్టీపీపీ) జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) చేతుల్లోకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుందని జెన్కో ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆర్టీపీపీకి ఉన్న అప్పు మొత్తాన్ని ఎన్టీపీసీ చెల్లిస్తుందని తెలిపారు. తీవ్ర నష్టాలతో కునారిల్లుతున్న ఈ ప్లాంటు సంస్థకు భారమని భావించే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. 210 మెగావాట్ల సామర్థ్యంతో 1994లో ఏర్పాటైన ఈ ప్లాంటు ప్రస్తుతం 1,650 మెగావాట్లకు విస్తరించింది. ఇందులో 600 మెగావాట్ల ప్లాంటు నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఆర్టీపీపీలో 1,500 మందికిపైగా శాశ్వత ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌లో మరో 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. విలీనమైతే శాశ్వత ఉద్యోగులు ఎన్టీపీసీలో కొనసాగుతారు. విలీనానికి కారణాలివీ ఆర్టీపీపీని ఆరంభం నుంచీ నష్టాలే వెంటాడుతున్నాయి. నాలుగు దశల ఈ ప్లాంట్‌కు రూ.5,520.76 కోట్ల అప్పులున్నాయి. దీనికి బొగ్గు ప్రధాన సమస్యగా మారుతోంది. మహానది కోల్ ఫీల్డ్ (ఎంసీఎల్) నుంచి బొగ్గు రవాణా విపరీతమైన ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తాల్చేరు నుంచి కృష్ణపట్నం పోర్టుకు, అక్కడ్నుంచి వందల కిలోమీటర్ల దూరంలోని ఆర్టీపీపీకి బొగ్గు రవాణా చేయాల్సి వస్తోంది. దీంతో చర వ్యయం విపరీతంగా పెరుగుతోంది. ప్రతీ యూనిట్‌కూ రూ.4.15 చొప్పున చర వ్యయం (వేరియబుల్ కాస్ట్) చెల్లిస్తున్నారు. దీనికితోడు స్థిర వ్యయం (ఫిక్స్డ్ కాస్ట్) యూనిట్‌కు రూ.1.90 వరకూ ఉంటోంది. రెండూ కలిపి యూనిట్ విద్యుత్ రూ.6.05 అవుతోంది. ఏపీఈఆర్సీ నిబంధనల ప్రకారం తక్కువ ధర ఉన్న విద్యుత్‌నే ప్రోత్సహించాలి. ఈ కారణంగా ఇతర ప్లాంట్లు, పీపీఏలున్న విద్యుత్‌నే తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఫిక్స్డ్ కాస్ట్ చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ఉద్యోగుల వేతనాలూ ఇవ్వాలి. వీటికోసం ఆర్టీపీపీ కోసం అదనంగా అప్పు చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసి, ప్రజలకు చౌక ధరలకు అందించే యోచనలో ఉంది. ఈ కారణంగా భవిష్యత్‌లోనూ ఆర్టీపీపీ మరింత భారమనే జెన్కో భావిస్తోంది. ఎన్టీపీసీకి లాభమేంటి? ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. కేంద్ర సంస్థ కావడం వల్ల బొగ్గు కొరత ఉండదు. అదీగాక ఎన్టీపీసీ థర్మల్తోపాటు సౌర విద్యుత్‌నూ ఉత్పత్తి చేస్తోంది. అనేక రాష్ట్రాలకు హైబ్రిడ్(సోలార్, థర్మల్ కలిపి) విద్యుత్ అందిస్తామని ఒప్పందాలు చేసుకుంది. ఈ కారణంగా ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాల్సి వస్తుంది. ఆర్టీపీపీలో ఉత్పత్తి పెంచితే యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా పూర్తిస్థాయి ఉత్పత్తి చేసే వీలుంది. జరిగే ఉత్పత్తిని కూడా వినియోగంలోకి తెచ్చే వెసులుబాటూ ఎన్టీపీసీకి ఉంది. అయితే విలీనంపై విద్యుత్ ఉద్యోగ సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీపీపీ సిబ్బంది ఉద్యోగాల మాటేంటని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ఎన్టీపీసీ స్పష్టత ఇవ్వాలని పట్టుపడుతున్నాయి. ఉద్యోగ సంఘాల సందేహాలపై పూర్తి స్పష్టత ఇచ్చాకే ముందుకెళతామని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. ఉద్యోగులకు ఢోకా లేదు: శ్రీకాంత్ ఆర్టీపీపీ ఎన్టీపీసీ చేతికెళ్లినా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా ఉండదని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. పైగా వాళ్లందరికీ ఎన్టీపీసీ స్కేల్ వర్తిస్తుందన్నారు. ఇప్పుడున్న అప్పంతా ఎన్టీపీసీకే బదలాయిస్తామని, దీనివల్ల జెన్కోకు భారం తగ్గుతుందని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించాలి: ఇంజనీర్స్ అసోసియేషన్ ఆర్టీపీపీ విషయంలో ఉద్యోగ సంఘాలతో సంప్రదించాలని ఇంజనీర్స్ అసోసియేషన్ జెన్కో విభాగం కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులకు అవసరమైన భద్రత కల్పించాల్సి ఉందన్నారు. తమతో చర్చిస్తే వాస్తవాలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగలమని చెప్పారు. -
సౌర విద్యుత్‌పై ఎన్టీపీసీ దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ 2022 నాటికి మరో 10 గిగావాట్ల మేర సౌర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. దీనికోసం రూ. 50,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గ్రీన్ బాండ్స్ ద్వారా ఇందుకు కావాల్సిన నిధులను సమకూర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సౌర విద్యుత్ సహా ఎన్టీపీసీ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 920 మె.వా.గా ఉంది. 2032 నాటికి 130 గి.వా. కంపెనీగా ఎదగాలని ఎన్టీపీసీ దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకుంది. ఇందులో 30 శాతం వాటా పునరుత్పాదక విద్యుత్‌దే ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 2,300 మె.వా. సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత 2020–21, 2021–22 మధ్య ఏటా 4 గి.వా. మేర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోనున్నట్లు వివరించాయి. 2022కల్లా పర్యావరణహిత విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 175 గి.వా.కు పెంచుకోవాలని కేంద్రం నిర్దేశించుకున్న నేపథ్యంలో ఎన్టీపీసీ ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
నీటిపై సోలార్ ప్లాంట్
జ్యోతినగర్ (రామగుండం): ఎన్టీపీసీ సంస్థ పర్యావరణ హితం దిశగా అడుగులు వేస్తోంది. 1978లో థర్మల్ ప్రాజెక్టుగా పురుడు పోసుకున్న ఎన్టీపీసీ రామగుండం నేడు సోలార్ వైపు దృష్టి సారించింది. సంప్రదాయ ఇంధన వనరుల ఉపయోగంలో భాగంగా నీటిపై తేలియాడే (ఫ్లోటిం గ్) సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చు ట్టింది. డిసెంబర్లో పనులు ప్రారంభించి, ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ సంస్థకు నీరందించే 4 వేల ఎకరాల్లో ఉన్న రిజర్వాయర్‌లో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు పనులు రూ. 400 కోట్లతో చేపడతారు. కాగా, రామగుండం ప్రాజెక్టులోని రిజర్వాయర్‌ను బీహెచ్ఈఎల్ అధికారులు సందర్శించారు. ఏపీ లోని సింహాద్రి ఎన్టీపీసీలో 25 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటుతోపాటు రామగుండంలో 100 మెగావాట్ల సోలార్ ప్లోటింగ్, సోలార్ ప్లాంటు నిర్మాణ పనులను బీహెచ్ఈఎల్ సంస్థ ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) చేపట్టనుంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో ప ర్యావరణ పరిరక్షణ జరగనుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో బొగ్గును వినియోగించడంతో కొంత మేర కాలుష్యం వెలువడుతోంది. కాగా, నీటిపై తేలియాడే సోలార్ ఫలకాలు బెంగళూరులో తయారు చేయనున్నారు. ఈ సోలార్ ప్లాంటు నిర్మాణం పూర్తయితే దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద 100 మెగావాట్ల సోలార్ ప్లాంటు ఉన్న ప్రాంతంగా రామగుండం రికార్డుల్లో నమోదు కానుంది. -
అసలేం జరిగింది?
సాక్షి, గోదావరిఖని(కరీంనగర్): సింగరేని సంస్థ రామగుండం డివిజన్ – 2 పరిధిలోని ఓసీపీ – 3 ప్రాజక్టులో సోమవారం ఉదయం జరిగిన డంపర్ ప్రమాదంపై డీడీఎంఎస్(డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ) అధికారులు కూపీ లాగుతున్నారు. ప్రమాదంలో కార్మికుడు మృతిచెందడాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు అసలు ఏం జరిగింది.. ప్రమాదం ఎలా జరిగింది.. అనే వివరాలు ఆరా తీస్తున్నారు. డీడీఎంఎస్ అధికారులు బాలసుబ్రహ్మణ్యం, రంగారావు మంగళవారం ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే ఆర్జీ–2 ఏరియాకు చేరుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతోపాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరించారు. సోమవారం రాత్రి 9గంటల వరకు సంఘటనపై విచారణ జరిపారు. నిబందనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నట్లు గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో బొగ్గు, ఓబీ వెలికితీత పనులు నిలిపివేయాలని ఆదేశించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన డీడీఎంఎస్‌లు ప్రమాదంపై డీడీఎంఎస్ అధికారులు ప్రాజెక్టు క్వారీ, హాలేజీ రోడ్లు, డంప్‌యార్డులను క్షుణ్ణంగా రక్షణ చర్యలను తనిఖీ చేశారు. సేఫ్టీ కమిటీ టీంలను మూడు బృందాలుగా విభజించి షావల్స్, హాలేజీ రోడ్లు, డంప్‌యార్డు వైపు రక్షణ చర్యలు తనిఖీ నిర్వహించారు. సేఫ్టీ మెజర్స్ ప్రకారం షావల్స్ పనిచేస్తున్నాయా లేదా? అనే విషయాలను సేఫ్టీ బృందం ద్వారానే చెప్పించారు. షావల్ నిలిచే ప్రాంతం ఎగుడు, దిగుడుగా ఉందా.. రెస్ట్ షెల్టర్ సేఫ్టీ ప్రాంతంలో ఉందా? ఆప్రాంతంలో రాత్రి పూట లైటింగ్ ఏవిధంగా ఉంది అనే విషయాలను సేఫ్టీ బృందం సభ్యులతో చెప్పించారు. సేఫ్టీ రూ ల్స్ ఏమి చెబుతున్నాయి? ఇక్కడ అమలు ఏవిధంగా ఉందనే విషయాలని సేఫ్టీటీం సభ్యుల ద్వారా తనిఖీ చేయించారు. రక్షణ విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడేది లేదని, పూర్తిస్థాయిలో రక్షణచర్యలు చేపట్టిన త ర్వాతే పనులకు నిర్వహించేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఉత్పత్తి నిలివేయడం ఇదే ప్రథమం.. ప్రమాదంపై సీరియస్‌గా ఉన్న డీడీఎంఎస్ అధికారులు ప్రాజెక్టుకు చేరుకున్న వెంటనే పూర్తిగా పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు తాము చెప్పే వరకు పనులు ని ర్వహించొద్దని సూచించారు. సోమవారం రోజుంతా ఉత్పత్తి నిలిచిపోగా, మంగళవా రం ఉదయం 10 గంటల వరకు పనులు ప్రా రంభం కాలేదు. ఆతర్వాత కొద్దిగా వె నక్కి తగ్గిన డీడీఎంఎస్ అధికారులు మూడు షా వల్స్ ద్వారా ఓబీ పనులు నిర్వహించుకోవాలని, ఇంటర్నల్ డంప్‌యార్డు వద్దకే పనులు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. దీంతో పాక్షికంగా పనులు సాగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదాలపై విచారణ చేపట్టడం, సాక్షుల నుంచి వివరాలు సేకరించడం సాధారణంగా జరుగుతుండగా, ప్రాజెక్టులో పూ ర్తిగా ఉత్పత్తి నిలిపివేయడం ఇదే ప్రథమం. బాధ్యులపై చర్య తీసుకోవాలి ఓసీపీ–3లో జరిగిన ప్రమాద ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని టీబీజీకేఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు డీడీఎంఎస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రక్షణ చర్యలు పాటించడంలో యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఏదైనా సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే కార్మికుడిని ప్రాజెక్టు అధికారి వ్యక్తిగతంగా బెదిరించి క్రమశిక్షణ లేఖలు ఇస్తున్నారని ఆరోపించారు. రక్షణ వైఫల్యంతోనే ప్రమాదం ఏఐటీయూసీ ఓసీపీ–3లో ప్రమాదానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఈమేరకు డీడీఎంఎస్‌కు వినతిపత్రం అందజేశారు. వంద టన్నుల సామర్థ్యం గల డంపర్ సంస్థాగతమైన రక్షణ ఏర్పాట్ల లోపాలతో ప్రమాదం జరిగి ఈపీ ఆపరేటర్ రమేశ్ మృతిచెందాడని తెలిపారు. అధిక పనిభారంతోనే ప్రమాదాలు.. సింగరేణి యాజమాన్యం పనిభారం పెంచడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని జీఎల్బీకేఎస్ రాష్ట్ర నాయకులు ఐ.కృష్ణ, ఇ.నరేష్, మల్యాల దుర్గయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. ఓసీపీ–3లో డంపర్ ఆపరేటర్ రమేశ్ ప్రమాదానికిగురై మరణించాడని తెలిపారు. సరైన రక్షణ చర్యలు యాజమాన్యం పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. రమేశ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
23 ఏళ్ల ఎన్టీసీపీ ప్రస్థానం
అది ఒకప్పుడు ఓ కుగ్రామం. గాఢాంధకారంలో ఉండేది. జనసంచారం కూడా అంతంత మాత్రమే. కనీసం వీధి దీపాలు లేకుండా ఓ అడవిని తలపించేది. అదంతా గతం.ఇప్పుడా కుగ్రామం పగలు కన్నా రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల్లో ధగధగలాడుతోంది. అంతేకాదు.. మన రాష్ట్రంతో పాటు పక్కనే ఉన్న ఐదు రాష్ట్రాలకు ఎంతో అవసరమైన విద్యుత్ సరఫరా చేస్తూ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోంది. ఆ కుగ్రామం పరవాడ. ఈ వెలుగులుకు కారణం 22 ఏళ్ల కిందట ఏర్పాటైన సింహాద్రి జాతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రం(ఎన్టీపీసీ). భారీ పరిశ్రమ అంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ తప్ప తెలియని పరవాడ ప్రజలకు తమ చెంత ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ కేంద్రం ఏర్పాటవుతున్నట్టు తమ కలలో కూడా ఊహించలేదు. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అడుగుపెట్టి అనతి కాలంలో అంచెంచెలుగా ఎదిగి 2వేల మెగావాట్ల సామర్థ్యానికి చేరుకున్న పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ సోమవారం 23వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. సాక్షి, పరవాడ(పెందుర్తి): సింహాద్రి జాతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రం(ఎన్టీపీసీ) 23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకోవడానికి ముస్తాబైంది. పరవాడ సమీపంలో 1997 జూలై 8న ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఎన్టీపీసీ ఆవిర్భవించింది. 3,400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎన్టీపీసీలో తొలి విడతగా రూ.3700 కోట్ల వ్యయంతో వెయ్యి మెగావాట్ల యూనిట్ల పనులను పూర్తి చేసింది. మలి విడతలో మరో రెండు 500 మెగావాట్ల యూనిట్లను ఏర్పాటు చేసి వెయ్యి మెగావాట్ల ఉత్పత్తికి 2007లో శంకుస్థాపన చేసింది. ఈ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2011 నాటికి పూర్తి స్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. సేవలతో మమేకం సామాజిక సేవల్లో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్వాసిత గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కల్యాణ మండపాలు, పాఠశాలలు, కళాశాలల భవనాలు, సీసీ రహదారులు, కాలువలు, వీధి దీపాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. వికలాంగ సంక్షేమం, మహిళలకు కుట్టు శిక్షణ, నిరుద్యోగ యువకులకు డ్రైవింగ్‌లో శిక్షణ, ఆస్పత్రుల అభివృద్ధి, సౌర విద్యుత్ కల్పన, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నారు. మచ్చుకు కొన్ని.. ► సీఎస్సార్ విభాగం ద్వారా 2018–19లో రూ.1.60 కోట్ల వ్యయంతో పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు భవన నిర్మాణం చేపట్టారు. సైన్స్ పరికరాలు, ఫర్నిచర్ వంటి సామగ్రిని సమకూర్చారు. ► వెన్నలపాలెంలో కోటి రూపాయల నిధులతో విశాలమైన కల్యాణ మండపాన్ని నిర్మించారు. ► రాష్ట్రంలో పలు తీర ప్రాంతాల్లో అంతరించిపోతున్న ఆలీవ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు రూ.5.6 కోట్లు వెచ్చించారు. ఈ నిధులను ఐదేళ్ల పాటు వాటి సంరక్షణ కోసం వినియోగిస్తారు. ► బాలిక సాధికారత కార్యక్రమంలో భాగంగా రూ.60 లక్షలు వెచ్చించి మండలంలో 125 మంది బాలికలకు నాలుగు వారాల పాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చారు. ► విశాఖలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ఫిజియోథెరఫీ సెంటర్లలో యంత్ర పరికరాలు సమకూర్చడానికి రూ.1.87 కోట్లను వెచ్చించారు. ‘మహారత్న’ంగా గుర్తింపు అనతి కాలంలోనే రెండు వేల మెగావాట్ల సామర్థ్యానికి చేరుకున్న సింహాద్రి ఎన్టీపీసీ పలు రాష్ట్రాల ప్రజలకు వెలుగులు ప్రసాదిస్తూ ప్రగతి పథంలో పయనిస్తోంది. సంస్థకు వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని వెచ్చించి నిర్వాసిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంపకం వంటి పనులు చేపడుతూ అందరి మన్ననలు పొందుతూ ‘మహారత్న’ కంపెనీగా పేరు గాంచింది. భద్రత ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తూ స్వర్ణశక్తి, గ్రీన్‌టెక్ సేఫ్టీ, ఇందిరా ప్రియదర్శిని, వృక్షమిత్ర వంటి అవార్డులను సింహాద్రి ఎన్టీపీసీ సొంతం చేసుకుంది. ఇతర రాష్ట్రాలకు వెలుగులు సింహాద్రి ప్లాంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో నాణ్యమైన విద్యుదుత్పాదనలో మేటిగా నిలిచి ‘మహారత్న’ కంపెనీ బిరుదును సొంతం చేసుకుంది. బొగ్గు దిగుమతి ఇలా.. సింహాద్రి ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును ఒడిశా, సింగరేణి, ఇండోనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. రెండు వేల మెగావాట్ల విద్యుదుత్పతికి 30 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును ఉపయోగిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటిని ఏలేరు కాలువ, ముత్యాలమ్మపాలెం సముద్రం నుంచి పైపులైన్ల ద్వారా తీసుకు వచ్చి వినియోగిస్తున్నారు. తప్పని కాలుష్య కష్టాలు పరిశ్రమలో ఏర్పాటు చేసిన చిమ్నీల ద్వారా ఎగిరిపడుతున్న బొగ్గు రేణువులతో సోమునాయుడుపాలెం, స్వయంభూవరం గ్రామాల ప్రజలు సతమతమవుతున్నారు. తమ గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు. అందరి సహకారంతో ప్రగతి పథం కార్మికులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజల సహకారంతో సంస్థ ప్రగతి పథంలో పయనిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, భద్రత ప్రమాణాలు, ఆరోగ్య పరిరక్షణ, సమయ పాలనలపై అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. కార్మిక భద్రత, కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది శతశాతం బూడిదను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశాం. సీఎస్సార్ విభాగం ద్వారా కోట్లాది రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, మినరల్ వాటర్ ప్లాంట్లు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించాం. త్వరలో మరికొన్ని ఆర్వో ప్లాంట్లను ప్రారంభిస్తాం. భవిష్యత్‌లో గ్రామీణ ప్రాంతాలను మరింత ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాం. – వి.సుదర్శన్‌బాబు, సీజీఎం, సింహాద్రి ఎన్టీపీసీ 800 ఎకరాల్లో బూడిద చెరువుల ఏర్పాటు ప్లాంటు నుంచి విడుదలైన ఫ్లైయాష్(బూడిద)ను నిల్వ చేయడానికి పిట్టవానిపాలెం సమీపంలో సుమారు 800 ఎకరాల్లో చెరువులను ఏర్పాటు చేశారు. ప్లాంట్ నుంచి విడుదలయ్యే బూడిదను పైపుల ద్వారా చెరువులకు తరలించి నిల్వ చేస్తున్నారు. ఈ బూడిద గాలికి ఎగరకుండా పింకలర్స్ ఏర్పాటు చేశారు. అయితే వాటి పనితీరు తూతూ మంత్రంగా ఉంది. ధూళి ఎగిరి పిట్టవానిపాలెం, దేవాడ, కలపాక, గొల్లలపాలెం, దలాయిపాలెం, స్వయంభూవరం, సోమునాయుడుపాలెం గ్రామాలను ముంచెత్తుతోంది. ఆయా గ్రామాల ప్రజలు వేసవి కాలంలో నరకయాతన అనుభవిస్తున్నారు. ఎన్టీపీసీ బూడిద వల్ల దలాయిపాలెంలో సాగు చేస్తున్న ఉప్పు మడులు దెబ్బతింటున్నాయి. పరిశ్రమ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి చేరి మత్స్య సంపద నాశనమవుతుందని ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిక్కవానిపాలెం తీరంలో నిర్మించిన జెట్టీ, పిట్టవానిపాలెంలో ఏర్పాటు చేసిన బూడిద చెరువు దేశంలో అతిపెద్ద జెట్టీ సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంటులో ఏర్పాటు చేసిన బ్రాయిలర్లను చల్లార్చడానికి వీలుగా తిక్కవానిపాలెం సమీపంలోని సముద్రం నుంచి ఉప్పు నీటిని వినియోగిస్తున్నారు. ఇందు కోసం తీరంలో 1450 మీటర్ల పొడవైన పంప్ హౌస్‌ను నిర్మించారు. పంపుహౌస్ నుంచి సముద్రం నీటిని ప్లాంటుకు తరలించడానికి మూడు పంపులను ఏర్పాటు చేశారు. పంపుహౌస్‌లో సముద్రపు నీటిని తరలించడానికి 11 కేవీ మోటారును ఏర్పాటు చేసి ఒక్కొక్క పంపు ద్వారా గంటకు 90 లక్షల లీటర్ల సముద్రపు నీటిని సీడబ్ల్యూ పంప్ హౌస్‌కు పంపి కూలింగ్ టవర్లను చల్లార్చడానికి వినియోగిస్తున్నారు. ప్లాంటులో ఈడీపీ పంప్‌హౌస్ నుంచి విడుదలైన వేడి నీటిని తీరానికి 750 మీటర్ల దూరంలో సముద్రంలో పంపు ద్వారా విడుదల చేస్తారు. ఇందు కోసం తిక్కవానిపాలెం తీరంలో 700 మీటర్ల లోపల దేశంలో ఎక్కడలేని అతి పెద్ద జెట్టీని నిర్మించారు. 275 మీటర్ల ఎత్తులో నిర్మించిన రెండు చిమ్నీలు ఆసియా ఖండంలోనే అతి పెద్దవి. 165 మీటర్ల ఎత్తులో నిర్మించిన నాలుగు కూలింగ్ టవర్లు దేశంలోనే పెద్దవి. -
రాష్ట్రాలకు కేంద్రం షాక్!
సాక్షి, అమరావతి: విద్యుత్ సరఫరా విషయంలో కేంద్రం రాష్ట్రాలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇక మీదట విద్యుత్‌ను అప్పుగా ఇవ్వరాదని తీర్మానించింది. కేంద్రం నుంచి ఎంత విద్యుత్ తీసుకుంటారో అంత మొత్తానికి లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) విధిగా కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అంటే...తీసుకునే విద్యుత్ మొత్తానికయ్యే సొమ్మును ముందే బ్యాంకులో డిపాజిట్ చేసి, బ్యాంకు నుంచి భరోసా ఇప్పించాలనే షరతు విధించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఇంధనశాఖ గత నెల 28న జారీ చేసింది. ఈ కొత్త నిబంధన వచ్చే నెల ఒకటవ తేదీ నుంచే అమలులోకి వస్తుందని వెల్లడించింది. కేంద్రం తాజా నిర్ణయంపై రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్నామని, కేంద్ర నిర్ణయం పిడుగుపడ్డ చందంగా ఉందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పంపిణీ సంస్థలు ఏకమై దీనిపై పునరాలోచన చేయాలని కేంద్రాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నాయి. ఎల్సీ అస్త్రం.. కేంద్ర విద్యుత్ సంస్థ ఎన్టీపీసీకి దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలున్నాయి. అంతేగాక ప్రైవేటు విద్యుత్‌ను కూడా తీసుకుని డిస్కమ్‌లకు అందిస్తోంది. ఇప్పటిదాకా చెల్లింపుల విషయంలో చూసీచూడనట్టుగా వెళ్తోంది. డిస్కమ్‌లు ఆలస్యంగా చెల్లించినా ఉదాసీనంగానే ఉంటోంది. అయితే పలు డిస్కమ్‌ల నుంచి ఎన్టీపీసీకి రూ.45 వేల కోట్ల మేరకు బకాయిలు రావాల్సి ఉంది. వీటిని రాబట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఒక్కటే మార్గమని భావించింది. ముందుగా డిస్కమ్‌లు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం ఇవ్వాలి. తర్వాత కేంద్రం నుంచి తీసుకునే విద్యుత్‌కు నెలకయ్యే ఖర్చును ముందే బ్యాంకులో డిపాజిట్ చెయ్యాలి. బ్యాంకు ఇచ్చే ఎల్సీని బట్టి క్రెడిట్ లిమిట్ ఉంచుతారు. దీనివల్ల ఒక్కపైసా కూడా ఎన్టీపీసీకి ఎవరూ బకాయి పడే అవకాశం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రీపెయిడ్ చెల్లింపులాంటిదేనని అధికారులం టున్నారు. ఎల్సీ లేని విద్యుత్ పంపిణీ సంస్థ దేశంలో మరెక్కడి నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం లేకుండా చేశారు. ఎల్సీ లేని డిస్కమ్‌లకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రం రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్లు(ఆర్ఎల్డీసీలు)కు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. -
విద్యుదుత్పత్తి పెరగాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుదుత్పత్తి జరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఐటీ, సాగునీటి ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఆధ్వర్వంలో రామగుండంలో నిర్మిస్తున్న తెలంగాణ విద్యుత్ కార్మాగారాన్ని శనివారం సీఎం సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శులు స్మితా సబర్వాల్, నర్సింగరావు, సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ విద్యుత్ అవసరాలు, ప్రస్తుత ఉత్పత్తి, భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమయ్యే డిమాండ్ వంటి అంశాలపై వీరితో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావొచ్చిందని.. రోజుకు 2టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు పనులు వేగవంతమయ్యాయన్నారు. వచ్చే సంవత్సరం జూన్ నాటికి రోజుకు 3టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని, దానికి దాదాపు 6వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా.. పునర్విభజన చట్టంలో 4వేల మెగావాట్ల పవర్ప్లాంట్లను కేటాయించినందున.. తెలంగాణ విద్యుత్ కర్మాగారానికి ప్రధానమంత్రి 2016 ఆగస్టులో శంకుస్థాపన చేశారని ఎన్టీపీసీ అధికారులు గుర్తుచేశారు. వేగంగా ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో అల్ట్రాసూపర్ టెక్నాలజీని వినియోగిస్తూ.. ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. 1,600 మెగావాట్ల సామర్థ్యమున్న మొదటి ప్లాంట్‌ను అక్టోబర్ 2020లోగా.. 2,400 మెగావాట్ల సామర్థ్యమున్న రెండవ యూనిట్‌ను ఫిబ్రవరి 2021 వరకు పూర్తి చేస్తామని తెలిపారు. అయితే.. నిర్ణీత గడువుకంటే ముందే ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం వారిని కోరారు. తెలంగాణలో రైతులకు సాగునీరందించడానికి గోదావరి నుంచి నీటిని ఎత్తిపోయడం ఒకటే మార్గమని, దానికి విద్యుత్ అందించేందుకు ఎన్టీపీసీ సైతం సహకరించాలని సీఎం కోరారు. ప్రస్తుతం నడుస్తున్న ఎన్టీపీసీ ప్లాంట్ల ద్వారానే విద్యుత్ తీసుకుంటే వెంటనే మన అవసరాలు తీరతాయని, ధర కూడా కలిసొస్తుందని సీఎం అన్నారు. జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు.. ఈ విషయంపై సమన్వయం చేస్తారని ముఖ్యమంత్రి చెప్పారు. బొగ్గు విధానం మార్చాలి విద్యుదుత్పత్తి కోసం చేసే బొగ్గు కేటాయింపు విధానంలో ఉత్పత్తి వ్యయం తగ్గించేలా సమూల మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం డిమాండ్ చేశారు. ఈ విషయంలో త్వరలో ఏర్పడే కొత్త ప్రభుత్వం దగ్గర తానే చొరవ తీసుకుంటానన్నారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున ఎన్టీపీసీ నుంచి 2వేల మెగావాట్లు సరఫరా చేయాలని కోరారు. విద్యుదుత్పత్తి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్టీపీసీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తుందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లపై సౌర విద్యుదుత్పత్తి కోసం ఎన్టీపీసీకి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. మొదట పైలట్ ప్రాజెక్టు కింద చిన్న రిజర్వాయర్ కేటాయిస్తామని, తర్వాత పెద్ద రిజర్వాయర్లను కేటాయిస్తామని వెల్లడించారు. విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరుగుతోందన్నారు. పీజీసీఎల్ విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణం, నిర్వహణ విషయంలో కూడా మెరుగైన విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఎన్టీపీసీ సంస్థ 13.5లక్షల మొక్కలు నాటినందుకు సీఎం అభినందించారు. బొగ్గు గనుల వద్దే ప్లాంట్లుండాలి ‘విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కేటాయింపులు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరిగా లేదు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంటుకు పక్కనే ఉన్న సింగరేణి నుంచి కాకుండా.. 950 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని మందాకిని నుంచి బొగ్గు తెచ్చి వాడుతున్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. విద్యుత్ ధర పెరుగుతుంది. అంతిమంగా ప్రజలపై భారం పడుతుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ విద్యుత్ కేంద్రం ఉంటే, దానికి దగ్గరలోని గనుల బొగ్గును వాడాలి. పిట్‌హెడ్ ప్లాంట్ల స్థాపన లక్ష్యం కూడా అదే. దూర ప్రాంతాల నుంచి బొగ్గు తేవడం వల్ల రవాణా చార్జీలు పెరుగుతాయి. తెలంగాణ జెన్కో సింగరేణి బొగ్గునే వాడుతోంది. రామగుండం ఎన్టీపీసీ కూడా సింగరేణి బొగ్గునే వాడాలి. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కేటాయించే విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వానికి తానే లేఖ రాస్తానని, విధానంలో మార్పు తీసుకురావడానికి చొరవ చూపుతా’అని సీఎం స్పష్టం చేశారు. 2,400 మెగావాట్ల ఎన్టీపీసీ స్టేజ్–2కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీఏ) పూర్తి కాలేదని అధికారులు సీఎంకు వెల్లడించారు. నిర్మాణానికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉన్నప్పటికీ, పీపీఏ పూర్తయితేనే పనులకు ఆమోదం లభిస్తుందని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఈనెలలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో చర్చించి స్టేజ్–2కి సంబంధించిన అగ్రిమెంట్ పూర్తయ్యేలా కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది నుంచే రామగుండం ఫర్టిలైజర్స్ రామగుండంలో ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మూతపడ్డ ఎఫ్‌సీఐని తిరిగి తెరిపించేందుకు తాను కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎఫ్‌సీఐఎల్ సీఈఓ రాజన్ థాపర్ చెప్పారు. రామగుండలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైతే.. తెలంగాణ రైతులకు కావాల్సిన ఎరువులు ఇక్కడ నుంచే తీసుకోవచ్చని సీఎం అన్నారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ నాయకత్వంలో బొగ్గు ఉత్పత్తి పెరుగుతోందని ప్రశంసించారు. తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ జె.సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు చందర్, మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, కలెక్టర్ దేవయాని తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎం ఎన్టీపీసీ జ్యోతినగర్‌లో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. కన్నెపల్లికి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: సీఎం కేసీఆర్ ఆదివారం జయశంకర్ భూపాలపల్లిలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. దాదాపు 7గంటల పాటు ఆయన కన్నెపల్లి, మేడిగడ్డ వద్ద జరుగుతున్న పనుల తీరును పర్యవేక్షిస్తారు. ఉదయం 6.30 గంటలకు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జయశంకర్ భూపాపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. స్వామి దర్శనం తర్వాత కన్నెపల్లికి అక్కడినుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి వెళ్తారు. మధ్యాహ్నం 1.30 వరకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనుల పరిశీలన, ప్రగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. అక్కడినుంచి రామగుండంలో మధ్యాహ్న భోజనం, విరామం తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరతారు. -
రామగుండం ఎన్టీపీసీని సందర్శించిన కేసీఆర్
సాక్షి, రామగుండం: పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రామగుండం ఎన్టీపీసీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఎన్టీపీసీలో సీఎం కేసీఆర్ విస్త్రత సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలుత రామగుండం ఎన్టీసీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్-1 ప్లాంట్‌ను సీఎం కేసీఆర్ సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. పవర్ ప్లాంట్‌కు సంబంధించిన పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్లాంట్‌కు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పెద్దపలి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు కేసీఆర్ రామగుండం వచ్చారు. పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రికి ఎన్టీపీసీలోని జ్యోతిభవన్‌లో కేసీఆర్ బస చేస్తారు. ఇక రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని కేసీఆర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపు హౌస్, మేడిగడ్డ బరాజ్ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లో భాగంగా తెలంగాణ కోసం రామగుండం ఎన్టీపీసీలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తుండగా, తొలి విడుతలో చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు శరవేగం గా జరుగుతున్నాయి. రూ.10,598.98 కోట్ల వ్యయంతో రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను 2016 ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పవర్ స్టేషన్ కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయించారు. ప్లాంట్ నిర్మాణం కోసం మే 2015లోనే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. కాగా, దీనికి ఒడిశాలోని మందాకిని-బీ మైన్ నుంచి బొగ్గు సరఫరా చేస్తారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ పర్యావరణ అనుమతులను కూడా సాధించగా, పనులు శరవేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన -
‘మహారత్న’లను మించిన సింగరేణి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి బొగ్గు గనుల సంస్థ లాభాలు, అమ్మకాల వృద్ధి రేటులో దేశంలోని ప్రతిష్టాత్మకమైన ‘మహారత్న’కంపెనీలను తలదన్ని కొత్త రికార్డు సృష్టించింది. గడచిన ఆరేళ్ల కాలంలో (2013–19) అద్భుత వృద్ధి రేటుతో దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలకు తలమానికంగా నిలిచింది. 2013–14లో రూ.11,928 కోట్ల అమ్మకాలు జరగగా, 2018–19 నాటికి 116.5 శాతం వృద్ధి రేటుతో రూ.25,828 కోట్లకు పెరిగాయి. 2013–14లో రూ.419 కోట్ల నికర లాభాలు గడించగా, 2018–19 నాటికి 282 శాతం వృద్ధి రేటుతో రూ.1,600 కోట్లకు చేరుకున్నాయి. లాభాల్లో వృద్ధిని పరిశీలిస్తే ‘మహారత్న’ కంపెనీలలో అగ్రగామి సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గడచిన ఐదేళ్లలో 104.5 శాతం వృద్ధిని, గెయిల్ (ఇండియా) 49 శాతం వృద్ధిని, ఓఎన్జీసీ 36.5 శాతం వృద్ధిని, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 31.2 శాతం వృద్ధిని, కోలిండియా లిమిటెడ్ 0.6 శాతం వృద్ధిని సాధించగా, సింగరేణి ఏకంగా 281.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. అమ్మకాల్లో కోల్ ఇండియా 55.1 శాతం, ఓఎన్జీసీ 30.9 శాతం, గెయిల్ (ఇండియా) 28.6 శాతం, ఎన్టీపీసీ 26.5 శాతం, భారత్ పెట్రోలియం 24.4 శాతం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 23.8శాతం, బీహెచ్ఈఎల్ 2 శాతం వృద్ధిని నమోదు చేయగా, సింగరేణి ఏకంగా 116.5 శాతం వృద్ధిని నమోదుచేసింది. ప్రభుత్వ తోడ్పాటుతో ముందడుగు తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఫలించాయి. ఇందుకు సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో సీఎండీ ఎన్.శ్రీధర్ తీసుకున్న చర్యలతో సంస్థ వృద్ధి రేటులో దూసుకుపోయింది. అత్యధిక బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాలు సాధిస్తూ, లాభాలు, అమ్మకాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలచింది. సింగరేణి సంస్థ కొత్త గనులకు అనుమతులు రాబట్టడం, ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకుకు అదనంగా కొత్తగా ‘న్యూపాత్రపురా’బ్లాకును సింగరేణి సాధించడంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. 2025 కల్లా వంద మిలియన్‌టన్నుల ఉత్పత్తి లక్ష్యం: సీఎండీ ఎన్.శ్రీధర్ గత ఐదేళ్లలో తమ సంస్థ లాభాలు, అమ్మకాల వృద్ధి రేటులో దేశంలోనే అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా నిలవడం సంతోషకరమని, అయితే తాము సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అన్నారు. 2025 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం దాటే విధంగా సింగరేణిని రూపుదిద్దుతున్నామని వివరించారు. -
ఐఓసీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ... బెస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలో 2017–18 సంవత్సరంలో అత్యంత లాభదాయక కంపెనీలుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ ముందున్నాయి. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ ఇండియా అధిక నష్టాలతో ఉన్నవిగా నిలిచాయి. పార్లమెంటు ముందు ప్రభుత్వం ఉంచిన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వేలో ఈ వివరాలు పేర్కొన్నారు. ప్రభుత్వరంగ కంపెనీల పనితీరుకు సంబంధించి సమగ్ర వివరాలు చూస్తే... ► ప్రభుత్వానికి ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన వాటిల్లో ఐవోసీఎల్ వాటా 13.37 శాతం, ఓఎన్జీసీ 12.49 శాతం, ఎన్టీపీసీ 6.48 శాతం వాటా కలిగి ఉన్నాయి. కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లాభదాయత పరంగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. ► టాప్–10 లాభదాయక ప్రభుత్వ కంపెనీల్లో పవర్ ఫైనాన్స్ కూడా చోటు సంపాదించింది. ► ప్రభుత్వరంగంలో 184 కంపెనీలు లాభాలను నమోదు చేస్తే, ఈ లాభాల్లో 61.83 శాతం అగ్ర స్థాయి 10 కంపెనీలదే. ► 2017–18లో 71 ప్రభుత్వరంగ కంపెనీలు నష్టాలను నమోదు చేయగా, మొత్తం నష్టాల్లో 84.71 శాతం టాప్–10 కంపెనీలవే ఉన్నాయి. ఇందులోనూ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ఇండియా ఉమ్మడి నష్టాలే 52.15 శాతం. ► భారత్ కోకింగ్ కోల్, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ నష్టాలను ఎదుర్కొంటున్న జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 52 ప్రభుత్వరంగ సంస్థల ఉమ్మడి మార్కెట్ క్యాప్ ఈ ఏడాది మార్చి నాటికి రూ.15.22 లక్షల కోట్లు. ప్రభుత్వ ఖజానాకు రూ.3.5 లక్షల కోట్లు ఇక ప్రభుత్వరంగ సంస్థల ద్వారా 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్టు ప్రభుత్వ సర్వే తెలియజేసింది. ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను, డివిడెండ్ రూపంలో ఈ మొత్తాన్ని సమకూర్చాయి. అయితే, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంతో చూస్తే 2.98 శాతం తక్కువ. 2016–17లో ప్రభుత్వరంగ కంపెనీల నుంచి వచ్చిన ఆదాయం రూ.3.6 లక్షల కోట్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క డివిడెండ్ రూపంలోనే రూ.76,578 కోట్లు సమకూరింది. క్యాజువల్, కాంట్రాక్టు కార్మికులకు అదనంగా 10.88 లక్షల మందికి ప్రభుత్వరంగ సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 11.35 లక్షల మందితో పోలిస్తే 4.14 శాతం తగ్గింది. కానీ, అదే సమయంలో వేతనాల బిల్లు రూ.1,40,956 కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,57,621 కోట్లకు పెరిగింది. -
ఆమడ దూరంలో!
సాక్షి, పెద్దపల్లి : రామగుండం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వాలు మారినా.. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పట్టణవాసులు మా పరిస్థితి ఇంతేనా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీ-థర్మల్ పరిరక్షణతో పాటు నూతన విద్యుత్కేంద్రం ఏర్పాటు, బీపీఎల్ భూముల సమస్య, రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా మార్చడం, పెద్ద చెరువును మినీట్యాంక్ బండ్‌గా చేయడం.. అంతర్గాం టెక్స్టైల్ కార్మికుల సమస్యలు ఏళ్లకు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడంలేదు. విస్తరణకు నోచుకోని బీథర్మల్.. రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)ను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1965 జూలై 19న శంఖుస్థాపన చేశారు. అప్పుడు రూ. 14.8 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత దీనిని జవహర్లాల్ నెహ్రూ థర్మల్ విద్యుత్తు కేంద్రంగా నామకరణం చేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడడంతో ఆంధ్రాలోనూ థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయాలని తలిచి విజయవాడ సమీపంలో నిర్మించతలపెట్టారు. దీంతో రామగుండం బి-థర్మల్ను 62.5 మెగావాట్లకు సరిపెట్టారు. ఆ తర్వాత బిథర్మల్ కేంద్రం విస్తరణకు నోచుకోలేదు. నేటి పాలకులు రామగుండంను విద్యుత్ హబ్‌గా మార్చుతామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. నిరుపయోగంగా వేలాది ఎకరాలు.. 1994లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బెంగళూరుకు చెందిన మారుబెని, తోషీబా, ఎలక్ట్రిక్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జపాన్)లకు దశలవారీగా పనులు చేపట్టేందుకు ప్రాజెక్టును కట్టబెట్టారు. స్థానికంగా ఉన్న ఏపవర్‌హౌస్ స్థలం 750 ఎకరాలతో పాటు మరిన్ని అవసరాల నిమిత్తం మరో 1,050 ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ చేశారు. 520 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో రూ.2813.9 కోట్ల వ్యయంతో అంచనా రూపొందించి రూ. 150 కోట్ల వ్యయమంతో ప్రహరీ నిర్మాణాలు ఎకరాల విలువైన భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ఎవరికీ పట్టని రాముని గుండాలు.. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిన రామగుండం సమీపంలోని రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం ఉంది. స్థానికంగా రామునిగుండాలు ఉండడం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయం కావడంతోనే ప్రపంచ దేశ, రాష్ట్ర చిత్రపటాలలో రామగుండంకు ప్రత్యేక పేరుంది. రామునిగుండాలలో రామలక్ష్మణుడు సంచరించినట్లు ఆనవాళ్లుఉన్నాయి. కొండపై 108 గుండాలున్నాయి. గుట్టపై 200 ఫీట్ల లోతు, 50 ఫీట్ల వెడల్పుతో ఓలోయ ఉంది. లోయకు పైభాగాన ఉన్న బావిలో సీతాదేవి స్నానమాచరించిందని ప్రతీతి. రాముడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పాదముద్రికల స్థానంలో ఏర్పడిన గుంతలు గుండాలుగా మారి రామగుండంగా పేరువచ్చింది. 108 గుండాలలో అన్ని కాలాల్లో నీరు సమృద్ధిగా ఉండడం విశేషం. దీనిని ఆధ్యాత్మికంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవికూడా నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆమడదూరం పెద్ద చెరువు.. పట్టణంలోని 210 ఎకరాల విస్తీర్ణంలో నియోజకవర్గ పరిధిలోనే పెద్దచెరువు. ఇందులోకి ఎన్టీపీసీకి చెందిన బూడిద నీరు చేరుతుండడంతో పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క పెరగడంతో పాటు కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్లలో సేకరించిన చెత్తను ఇందులో వేయడంతో చెరువు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయి కలుషితమవుతుంది. దీని కింద సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిని గడిచిన పాలకవర్గం మినీ ట్యాంకుబండ్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ వర్గ విభేధాలతో మరో చెరువును ఎంపిక చేశారు. దీంతో అభివృద్ధికి పుల్‌స్టాప్ పడింది. -
టార్గెట్–2020!
గోదావరిఖని/జ్యోతినగర్(రామగుండం): దక్షణ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థ రామగుండం ఎన్టీపీసీ అని.. తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు అందించడం కోసమే వడవడిగా నూతన ప్రాజెక్టు నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర అన్నారు. సంస్థ 40వ ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని మిలీనియం హాలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంస్థ 52,946 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అగ్రభాగాన నిలిచిందన్నారు. భారతావనికి 22.74 శాతం విద్యుత్‌ను అందిస్తున్న సంస్థగా చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. రామగుండం ప్రాజెక్టు 1978లో శంకుస్థాపన కాగా 1983లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిదని వెల్లడించారు. దినదినాభివృద్ధి చెందుతూ తెలంగాణలో అతిపెద్ద వెలుగుల కేంద్రంగా నిలిచిందని అన్నారు. రూ.10598.98 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తెలంగాణ స్టేజీ నిర్మాణపు పనులు ప్రమాదరహితంగా కొనసాగుతున్నాయని ప్రకటించారు. తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణం.. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజీ–1లో నిర్మాణంలో యూనిట్–1 టర్బైన్ జనరేటర్ 18 మీటర్లు. చిమ్నీ నిర్మాణం 180 మీటర్లు పూర్తయిందన్నారు. ఇంకా చాలా పనులు కొనసాగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో బాయిలర్ సీలింగ్, బాయిలర్ ప్రెజర్ పార్ట్స్, టర్భైన్ జనరేటర్ యూనిట్–2 పనులు, బూడిద పైపులైన్ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జూన్–2019లో స్టీమ్ బాయిలింగ్ విధానం ప్రారంభం కానుందన్నారు. యూనిట్–1, మే–2020, యూనిట్–2, నవంబర్–2020న విద్యుత్ ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని ప్రకటించారు. సమావేశంలో జనరల్ మేనేజర్లు అరవింద్‌కుమార్ జైన్, పుష్ఫేందర్ కుమార్ లాఢ్, డాక్టర్ సశ్మితా డ్యాష్, శ్రీరామారావు, సౌమేంద్రదాస్, ఉమాకాంత్ గోఖలే, విజయ్‌సింగ్, యం.ఎస్.రమేష్, సీఎస్సార్ మేనేజర్ జీవన్‌రాజు, ఉద్యోగ వికాస కేంద్రం మేనేజర్ ప్రవీణ్‌కుమార్, పీఆర్వో సహదేవ్సేథీ, విష్ణువర్ధన్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.