సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన రూ.930 కోట్ల బకాయిలను ఈనెల 18 లోగా చెల్లించని పక్షంలో రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో గడువులోగా బకాయిలు చెల్లించేందుకు తెలంగాణ ట్రాన్స్ కో యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.
బకాయిలు చెల్లించడంలో విఫలమైతే ఎన్టీపీసీ నుంచి రాష్ట్రానికి వస్తున్న విద్యుత్ సరఫరా ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి నిలుపుదల కానుంది. ఉత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కి సంబంధించిన బిల్లులను నిర్దేశిత గడువులోగా చెల్లించడంలో విఫలమైతే ఆయా రాష్ట్రాలకు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయాలని రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం లేట్ పేమెంట్ సర్‌చార్జ్ రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది.
దీని ప్రకారమే రాష్ట్రానికి విద్యుత్ ఆపేస్తామని ఎన్టీపీసీ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు సకాలంలో బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment