గేమింగ్‌ యాప్‌ల యాక్సెస్‌ ఆపేయండి | Police ultimatum to gaming federation fantasy sports CEOs and founders | Sakshi
Sakshi News home page

గేమింగ్‌ యాప్‌ల యాక్సెస్‌ ఆపేయండి

Jan 30 2025 4:55 AM | Updated on Jan 30 2025 4:55 AM

Police ultimatum to gaming federation fantasy sports CEOs and founders

గేమింగ్‌ ఫెడరేషన్, ఫాంటసీ స్పోర్ట్స్‌ సీఈవోలు, వ్యవస్థాపకులకు పోలీసుల అల్టిమేటం

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌లకు తెలంగాణలో యాక్సెస్‌ లేకుండా చేయాలని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) ఆ సంస్థల నిర్వాహకులను కోరింది. రాష్ట్రంలో ఆన్‌ లైన్‌ గేమింగ్‌ వ్యసనంతో అప్పులై ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత వివరాలతో బుధవారం ఆలిండియా గేమింగ్‌ ఫెడరేషన్‌(ఏఐజీఎఫ్‌), ఫెడరే షన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫాంటసీ స్పోర్ట్స్, ప్రధాన గేమింగ్‌ ప్లాట్‌ఫాం వ్యవ స్థాపకులు, సీఈవోలతో టీజీసీఎస్‌బీ కీలక సమావేశం నిర్వహించింది. 

తెలంగాణలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించడానికి చర్యలను అన్వేషిస్తున్నట్టు టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయెల్‌ స్పష్టం చేశారు. రాష్ట్రం తీసుకొచ్చిన గేమింగ్‌ చట్టం, చట్టపరమైన నిబంధనలు, గేమింగ్‌ కార్యకలాపాలకు వర్తింపచేసే అంశంపై నొక్కి చెప్పారు. ఈవారంలో తెలంగాణలో నమోదైన కేసులకు సంబంధించిన గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. రాష్ట్రంలో వారి ప్లాట్‌ఫారమ్‌లను నిలిపివేయాలని ఆదేశించినట్టు శిఖాగోయెల్‌ స్పష్టం చేశారు. 

ఈ సమావేశంలో జియోఫెన్సింగ్, కఠిన కేవైసీ నిబంధనలు పాటించని, స్థానిక చట్టాలను ఉల్లంఘించే గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లపై నియంత్రణ చర్యలు, అందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. భారతీయ, ఆఫ్‌షోర్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లను పర్యవేక్షించడానికి, రాష్ట్ర నిర్దిష్ట చట్టాల నిబంధనలకు అనుగుణంగా ఉండేలా కేంద్రీకృత నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖకు అధికారికంగా నివేదిక ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు శిఖాగోయెల్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement