Gaming App
-
సృజనాత్మకతలో దూసుకుపోతున్న పరిశ్రమ
వీడియో గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతలో దూసుకుపోతోందని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్(ఐడీజీసీ)-2024 బుధవారం 16వ ఎడిషన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గేమింగ్ డెవలపర్లు, గేమింగ్ స్టూడియోలు, ఇతర గేమింగ్ ఔత్సాహికులు తమ ఆలోచనలు పంచుకోనున్నారు.ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ..‘ప్రభుత్వం గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ రంగంలో అధిక నాణ్యత ప్రతిభావంతులను తయారు చేసేందుకు పని చేస్తోంది. ప్రపంచ గేమింగ్ రంగంలో ఇండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. వీడియో గేమింగ్, ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ, రియల్ మనీ గేమింగ్ ఇండస్ట్రీకి మధ్య స్పష్టమైన తేడా ప్రభుత్వానికి తెలుసు. వీడియో గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతలో ముందంజలో ఉంది’ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీడీఏఐ) ఛైర్పర్సన్ శ్రీధర్ ముప్పిడి మాట్లాడారు. వీడియో గేమ్ డెవలపర్లు, వీడియో గేమింగ్ స్టూడియోలు ఈ పరిశ్రమలో ఇతర వాటాదారులతో ప్రాతినిధ్యం వహించేలా అపెక్స్ బాడీగా జీడీఏఐ వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దుఈ ఈవెంట్ మొదటి రోజున 6000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం నవంబర్ 15 వరకు జరుగుతుందన్నారు. ఐజీడీసీ 2024 100+ గ్లోబల్, లోకల్ గేమింగ్ డెవలపర్లు, పబ్లిషర్లు, సందర్శకులకు వేదికగా నిలుస్తుందన్నారు. -
ది వార్ విత్ ఇన్! అడుగడుగునా అంతులేని ధైర్యం!
మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘వరల్డ్ క్రాఫ్ట్: ది వార్ విత్ఇన్’ ఈ నెల 26న విడుదల కానుంది. ‘వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్’కు ఎక్స్΄ాన్షన్ ప్యాక్‌గా వస్తున్న గేమ్ ఇది. 2004లో వచ్చిన ‘వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్’లో ప్లేయర్ ‘క్యారెక్టర్ అవతార్’ను క్రియేట్ చేసి థర్ట్ లేదా ఫస్ట్–పర్సన్ వ్యూ నుంచి ఓపెన్ గేమ్ వరల్డ్‌ను ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది.ఇక ‘ది వార్ విత్ఇన్’ విషయానికి వస్తే... ఈ గేమ్‌లో ఖాజ్ అల్గార్ అనేది ప్రైమరీ సెట్టింగ్. ది ఇజెల్ ఆప్ డోర్న్, ది రింగింగ్ డీప్స్, హాలోఫాల్, అజి–కహెట్ అనే నాలుగు జోన్లుగా విభజించబడి ఉంటుంది.ఈ గేమ్‌లో ‘డైనమిక్ ఫ్లైయింగ్’ అనే ఫీచర్ ఉంది. న్యూ గేమ్స్‌ను ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.సిరీస్: వార్‌క్రాఫ్ట్;ప్లాట్‌ఫామ్: విండోస్, మ్యాక్వోఎస్;మోడ్: మల్టీప్లేయర్జానర్: ఎంఎంఆర్పీజీ (మాస్వ్లీ మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్) -
'ది ఫస్ట్ డిసెన్‌డెంట్'.. ఇదొక హైక్వాలిటీ గ్రాఫిక్స్ గేమ్!
థర్డ్–పర్సన్ షూటర్ గేమ్ ‘ది ఫస్ట్ డిసెన్‌డెంట్’ విడుదల అయింది. హైక్వాలిటీ గ్రాఫిక్స్‌తో కూడిన ఈ స్ట్రాటజిక్ గేమ్‌లో యూనిక్ క్యారెక్టర్లు ఉంటాయి. ‘ఇన్గ్రిస్’ కాంటినెంట్‌ను కాపాడడానికి ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ప్లేయర్ పోరాడవలసి ఉంటుంది.ఇది మాత్రమే కాదు ప్లేయర్ రకరకాల మిషన్లలో పాల్గొనవలసి ఉంటుంది. డిస్టింక్టివ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ గేమ్‌లో యూనిక్ స్కిల్ సెట్స్, ఫ్రీ మూమెంట్స్, చైన్ యాక్షన్స్, గ్రాప్లింగ్ హుక్స్, కలర్‌ఫుల్ ఫైర్ఆర్మ్... మొదలైనవి గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటాయి.డెవలపర్: నెక్సన్ గేమ్స్,ఇంజిన్: యునైటెడ్ ఇంజిన్ 5,జానర్: థర్డ్–పర్సన్ షూటర్ యాక్షన్ ఆర్పీజీ,మోడ్: కోఆపరేటివ్ మల్టీప్లేయర్.ఇవి చదవండి: ప్రయాణాలపై ఇష్టంతోనే.. ఈ స్థాయికి! -
త్వరలో రెండు కొత్త గేమ్‌ల ఆవిష్కరణ
భారతదేశ గేమింగ్ పరిశ్రమలో రిడైమెన్షన్ గేమ్స్, షురా గేమ్స్ అనే కొత్త ఆన్లైన్ గేమ్‌లను త్వరలో ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొరియన్ గేమింగ్ పబ్లికేషన్ సంస్థ క్రాఫ్టన్ తెలిపింది. గేమింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు కేఐజీఐ (క్రాఫ్టన్ ఇండియా గేమింగ్ ఇంక్యుబేటర్) ప్రోగ్రామ్ కింద ఈ ఆవిష్కరణలు చేపట్టినట్లు క్రాఫ్టన్ పేర్కొంది.‘నివేదికల ప్రకారం భారతదేశ గేమింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2022 సంవత్సరం చివరి నాటికి దేశంలో 50.7 కోట్ల మంది ఆన్లైన్ ఆటలపై ఆసక్తిగా ఉన్నారు. 2023లో వీరి సంఖ్య 12 శాతం పెరిగి 56.8 కోట్లకు చేరింది. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత గేమింగ్ పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, విలువలకు పెద్దపీట వేస్తూ గేమ్‌లను తయారు చేయాలన్నారు. దాంతో ఈ రంగంలో అపార అవకాశాలున్నాయని గుర్తించాం. ఈ పరిశ్రమలో స్థిరపడాలనుకునే వారికి నిర్మాణాత్మక మెంటార్షిప్ అవసరం ఉంది. దాంతో 2023లో క్రాఫ్టన్ ఇండియా గేమింగ్ ఇంక్యుబేటర్-కేఐజీఐని ప్రారంభించాం. ఈ ప్రోగ్రామ్‌లో చేరిన కంపెనీలకు గేమింగ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లను, క్రాఫ్టన్ గ్లోబల్ స్టూడియోస్ ద్వారా మెంటార్షిప్ను అందిస్తున్నాం. దాంతోపాటు కంపెనీలు తమ ఉత్పత్తులను మరింత అభివృద్ధి చేయడానికి డేటా అనలిటిక్స్‌తోపాటు వాటి అవసరాలను బట్టి రూ.41 లక్షలు-రూ.1.2 కోట్లు వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం’ అని తెలిపింది.ఇదీ చదవండి: యూఏఈలోనూ యూపీఐ చెల్లింపులు!‘కంపెనీ అందిస్తున్న వసతులను, మెంటార్షిప్ను ఉపయోగించుకుని ఇటీవల రిడైమెన్షన్ గేమ్స్, షురా గేమ్స్ అనే రెండు కంపెనీలు తమ ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2018లో నాగాలాండ్‌లోని కోహిమాలో ముగ్గురు సభ్యులతో రిడైమెన్షన్ గేమ్స్ ప్రారంభమైంది. ఈ కంపెనీ 2024లోనే సోజర్న్ పాస్ట్ పేరుతో యానిమేషన్ గేమ్‌ను విడుదల చేయనుంది. బెంగళూరుకు చెందిన షురా గేమ్స్ అనే కంపెనీ స్పైస్ సీక్రెట్స్ పేరుతో ఫజిల్గేమ్ను పరిచయం చేయనుంది. దీన్ని అన్ని వయసుల వారు ఆడేలా రూపొందించారు’ అని క్రాఫ్టన్ పేర్కొంది. -
Gaming: యుద్ధంలో ఒకరోజు...
ఆన్లైన్లో గేమ్స్ ఆడుతుంటే ఆ ఉల్లాసమే వేరు. అందులో ఆ గేమ్ అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్‌ని కలిగి ఉంటే అబ్బో చెప్పనక్కర్లేదు. అలాంటి రకాలనే ఈ గేమ్ కూడా కలిగి ఉంది. మరి అదేంటో ఆడేద్దామా!రియల్–టైమ్ టాక్టిక్స్, రియల్–టైమ్ స్ట్రాటజీ గేమ్ మెన్ ఆఫ్ వార్–2. 2011లో వచ్చిన మెన్ ఆఫ్ వార్: అసల్ట్ స్వా్కడ్ సీక్వేల్‌గా వస్తున్న ఈ గేమ్ వరల్డ్ వార్–2 నేపథ్యంలో సాగుతుంది. 2016లో వచ్చిన ‘మెన్ ఆఫ్ వార్’కు ఇది మోడ్రన్ రీమాస్టర్. లార్జ్ స్కేల్ టాంక్ కంబాట్ చేసే ప్లేయర్స్ కోసం స్కీమిష్ మోడ్ ఉంది.ఇంజిన్: జెమ్ 2ప్లాట్‌ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్జానర్స్: రియల్–టైమ్ టాక్టిక్స్, రియల్–టైమ్ స్ట్రాటజీ మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..! -
గేమింగ్ వరల్డ్‌కు.. పురాణ సౌరభం నింపిన ‘చిత్తం!’
చెన్నైకి చెందిన చరణ్య కుమార్‌కు గేమింగ్ అంటే ఎంతో ఇష్టమో, పురాణాలు అంటే కూడా అంతే ఇష్టం. అందుకే పురాణాలలోని ఆసక్తికర అంశాలను, స్ఫూర్తిదాయకమైన విషయాలను గేమింగ్‌లోకి తీసుకువచ్చింది చరణ్య కుమార్. ఆమెప్రారంభించిన ‘చిత్తం’ గేమింగ్ కంపెనీ విజయపథంలో దూసుకుపోతోంది...యూఎస్‌లో ఇంజినీరింగ్ చేసిన చరణ్య కుమార్ ఎన్నో పెద్ద కంపెనీలలో కన్సల్టింగ్ విభాగంలో పనిచేసింది. కొన్ని సంవత్సరాల క్రితం వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సమస్యల వల్ల పురాణాలకు దగ్గరైంది. వాటిని చదవడం తనకు ఎంతో సాంత్వనగా ఉండేది. అమ్మమ్మ ద్వారా పురాణాలలోని గొప్పదనం గురించి చిన్న వయసులోనే విన్నది కుమార్.‘జీవితంలో ప్రతి సమస్యకు పురాణాల్లో సమాధానం దొరుకుతుంది’ అంటుంది కుమార్. ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకున్న కుమార్ ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘పురాణాలు ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితమైనవి కాదు. పౌరాణిక విషయాలు నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా దారి చూపుతాయి. కష్టకాలంలో పురాణ పఠనం నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు సొంతంగా ఏదైనాప్రారంభించాలనే పట్టుదలను కూడా ఇచ్చింది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు ఎంబీఏ చేయడం’ అంటున్న కుమార్ గేమింగ్ కంపెనీ ‘చిత్తం’ రూపంలో తన కలను నెరవేర్చుకుంది.తక్కువప్రాడక్ట్లతో మొదలైన ‘చిత్తం’ మొదటి సంవత్సరంలోనే పదమూడుప్రాడక్ట్స్కు చేరుకుంది. ‘ఫన్’ ఎలిమెంట్స్‌ను జత చేస్తూ ‘చిత్తం’ రూపొందించిన గేమ్స్, యాక్టివిటీస్, బుక్స్ సూపర్ హిట్ అయ్యాయి. తమిళ సామెతలను దృష్టిలో పెట్టుకొని ‘పార్టీ టాక్స్’ అనే గేమ్‌ను డిజైన్ చేశారు. ‘భరత విలాస్’ అనేది చిత్తం బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ కార్డ్ గేమ్ మన సంస్కృతిలోని రకరకాల నృత్యరూపాలు, వంటల రుచులు... మొదలైన వాటిని వెలికితీస్తుంది.‘సింపుల్ గేమ్ ప్లే–సింపుల్ కంటెంట్ అనే రూల్‌ని నమ్ముకొని ప్రయాణంప్రారంభించాం. మా నమ్మకం వృథా పోలేదు’ అంటుంది చరణ్య. వ్యాపార అనుభవం లేకపోవడం వల్ల మొదట్లో ఫండింగ్ విషయంలో కాస్తో కూస్తో ఇబ్బంది పడినా ఆ తరువాత మాత్రం తనదైన ప్రత్యేకతతో ఇన్వెస్టర్లను ఆకర్షించి విజయపథంలో దూసుకుపోతోంది ‘చిత్తం’.ఇవి చదవండి: కాన్స్‌లో ఆ ముగ్గురు -
ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ప్రముఖ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్స్ తయారీదారు హెచ్‌పీ క్వాలిటీ ప్రొడక్ట్స్‌తో ఇండియన్ యూజర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ గేమింగ్ లవర్స్ కోసం చవకైన గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకురావడంపై దృష్టి సారించింది. తక్కువ ధరలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ల్యాప్టాప్స్ దొరకడం లేదు. దీనివల్ల బడ్జెట్ గేమింగ్ లవర్స్ నిరాశ పడిపోతున్నారు. ఇలాంటి సమయంలో హెచ్‌పీ భారీ డిస్కౌంట్లతో గేమింగ్ ల్యాప్‌టాప్స్‌తోపాటు ఇతర ఉపకరణాలను ఇండియన్ మార్కెట్‌కి తీసుకొస్తుంది. ‘లూట్ డ్రాప్ సేల్’ పేరుతో హెచ్‌పీ కంపెనీ ఒమెన్, విక్టస్ ల్యాప్‌టాప్‌లు, హెడ్సెట్లు, మైక్రోఫోన్లు, కీబోర్డ్, మౌస్, మౌస్ ప్యాడ్ వంటి గేమింగ్ ఉపకరణాలపై తగ్గింపులను ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు అన్ని హెచ్‌పీ స్టోర్లు, హెచ్‌పీ ఆన్లైన్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో మార్చి 3 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. హెచ్‌పీ ఒమెన్ 16 ల్యాప్‌టాప్‌లపై గరిష్టంగా 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. రూ.1,75,930 విలువైన 14వ జనరేషన్ ఒమెన్ 16 ల్యాప్‌టాప్ ఇప్పుడు రూ. 1,49,999కే లభిస్తుంది. 13వ జనరేషన్ ఒమెన్ 16 ల్యాప్‌టాప్ రూ.1,32,645 బదులుగా రూ.1,12,999 వస్తుంది. ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు ఊడనున్నాయా..? ఒమెన్ 16 ల్యాప్‌టాప్ కొనుగోలుపై ప్రముఖ బ్యాంకులతో రూ.10,000 క్యాష్‌బ్యాక్ పొందే సౌకర్యం కూడా ఉంది. హెచ్‌పీ మౌస్, మౌస్ ప్యాడ్, హెడ్‌సెట్‌తో సహా హైపర్ ఎక్స్ కొనుగోలుపై రూ.2,999 తగ్గిస్తున్నారు. హైపర్ ఎక్స్ క్లచ్ గేమ్ కంట్రోలర్‌పై రూ.999 డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. -
అసలు వీటి గురించి మీకు తెలుసా..!
పోరాటమే ఊపిరిగా.. ట్యాక్టికల్ రోల్ ప్లేయింగ్ గేమ్ ‘యూనికార్న్ వోవర్లార్డ్’ మార్చి 8న విడుదల కానుంది. తన జెనోయిరాన్ సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రాజ్యం నుంచి బహిష్కృతుడైన యువరాజు అలైన్ తన మిత్రులను సమీకరించి చేసే పోరాటమే ఈ గేమ్. అలైన్, అతడి బలగాల పోరాటాన్ని గేమ్‌ప్లే ఫాలో అవుతుంది. అన్ని క్యారెక్టర్లు, లొకేషన్లు, స్ప్రైట్స్ 2డీ ఆర్ట్‌తో డిస్ప్లే అవుతాయి. జానర్: ట్యాక్టికల్ రోల్–ప్లేయింగ్ మోడ్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ ప్లాట్‌ఫామ్స్: నిన్టెండో స్విచ్/ప్లేస్టేషన్ 4/ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ అవును...ఇది నిజమే! ‘ది ఫేస్బుక్’తో కాలేజీ క్యాంపస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు మార్క్ జుకర్ బర్గ్. ఫేస్బుక్ ఎంతోమంది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు పాపులర్ అయిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ‘ఫ్రెండ్ స్టర్’ ఫేస్‌బుక్‌ను కొనుగోలు చేయడానికి ముందుకువచ్చింది. వచ్చిన బంపర్ ఆఫర్లను తిరస్కరించడం ద్వారా మరింత సంచలనం సృష్టించాడు జుకర్ బర్గ్. ఫేస్బుక్ అమ్మడంపై కాకుండా ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి చేరువ కావాలి’ అంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. పెనిషియస్ చెడు ప్రభావం, హాని కలిగిస్తుంది అనే చెప్పే సందర్భంలో వాడే మాట...పెనిషియస్ ఉదా: ది పెనిషియస్ ఎఫెక్స్ట్ ఆఫ్ ఎయిర్ పోల్యూషన్ పెర్ఫిడీ నమ్మకద్రోహం, మోసం జరిగిన సందర్భంలో వాడే మాట పెర్ఫిడీ ఉదా: ఇట్ వాజ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిజ్ పెర్ఫిడీ పెన్యూరీ కొరత. పేదరికం, వేదన.... మొదలైన సందర్భాలలో ఉపయోగించే మాట పెన్యూరీ. ఉదా: హీ వాజ్ బ్రాట్ అప్ ఇన్ పెన్యూరీ. విత్ఔట్ ఎడ్యుకేషన్ ఇవి చదవండి: ఇంటిప్స్: వీటితో ఇబ్బంది పడ్తున్నారా.. మన్నికకై ఇలా చేయండి! -
డీప్ ఫేక్‌కు గురైన సచిన్ టెండూల్కర్
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఓ ఇన్వెస్ట్మెంట్ యాప్ కోసం ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. ‘స్వైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్’యాప్‌లో నా కుమార్తె గేమ్ ఆడుతుంది. ఈ గేమ్ ద్వారా రోజుకు 2100 డాలర్లు సంపాదిస్తోంది. చాలా మంది ఈ యాప్ ద్వారా గేమ్ ఆడి డబ్బు సంపాదిస్తున్నారు’అంటూ ఓ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై సచిన్ టెండూల్కర్ సోమవారం స్పందించారు. డీప్ ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాల నుంచి సత్వర చర్యలు చాలా కీలకం’అంటూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్లతో పాటు మహారాష్ట్ర సైబర్ క్రైంలకు ఆయన ట్యాగ్ చేశారు. సచిన్ ట్వీట్‌పై మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఏఐ, డీప్ ఫేక్ వంటి వాటి నుంచి ప్రజలకు రక్షణ కలి్పంచేందుకు త్వరలోనే పటిష్టమైన ఐటీ చట్టాలను అమల్లోకి తీసుకోస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆ యాడ్‌తో బాద్షాకి చిక్కులు
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చిక్కుల్లో ప డ్డారు. ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు ఆయన ఇల్లు ముట్టడికి కొందరు విఫలయత్నం చేశారు. ఆన్లైన్ జూదాన్ని ప్రోత్సహించేలా షారూక్ వ్యవహరించడం వారికి మింగుడు పడడం లేదు. అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్‌కు చెందిన కొందరు బాంద్రాలోని షారూక్ ఇంటి బయట నిరసనలకు దిగడానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. షారూక్ ఇంటికి గట్టి భద్రత ఏర్పాటు చేసి కొందరు యువకుల్ని అదుపులోనికి తీసుకున్నారు. ఏ23 అనే ఆన్లైన్ రమ్మీ పోర్టల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న షారూక్ ఇటీవల దానికి సంబంధించిన ఒక వాణిజ్యప్రకటన(యాడ్)లో నటించారు. ఆ యాడ్‌లో ‘పదండి కలిసి ఆడదాం’ అని షారూక్ వ్యాఖ్యానిస్తారు. ఈ అడ్వర్టయిజ్‌మెంట్‌పై అన్‌టచ్ యూత్ పౌండేషన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. జంగ్లీ రమ్మీ, జూపీ వంటి ఆన్లైన్ గేమింగ్ యాప్స్ యువతని పక్కదారి పట్టిస్తున్నాయని అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్ విమర్శించింది. -
మహిళలు అమితంగా ఇష్టపడే యాప్స్ ఏంటో తెలుసా?
మొబైల్ వినియోగ పోకడలు, భారతీయ వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న ఆలోచనలను విశ్లేషిస్తూ 2022- 2023 డేటా ఆధారంగా భారతీయ మహిళలు, పురుషుల అభిరుచులపై ప్రముఖ బొబ్బల్ ఏఐ (Bobble AI) అనే కీ బోర్డ్ సంస్థ నివేదికను విడుదల చేసింది. అందులో మహిళలు స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఆహారం, మెసేజింగ్ యాప్స్‌ను అమితంగా ఇష్టపడతున్నారని, మగవారు ఫోన్లలో గేమింగ్ యాప్స్‌ను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది. దేశ వ్యాప్తంగా 85 మిలియన్ల ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల డేటా ఆధారంగా బొబ్బల్ ఏఐ ఈ సర్వేను వెలుగులోకి తెచ్చింది. ఇక ఆ రిపోర్ట్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్ఫోన్లపై వెచ్చించే సమయం 50 శాతం పెరిగింది. ఉద్యోగం చేసే మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. స్మార్ట్ఫోన్ల నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కేవలం 11.3శాతమే జరుగుతున్నాయని హైలెట్ చేసింది. మహిళలు, పురుషులు ఆన్లైన్లో గేమ్స్ ఆడేందుకు మక్కువ చూపిస్తున్నారని, వారిలో 6.1శాతం మంది మహిళలు గేమ్స్ ఆడడంలో యాక్టీవ్‌గా ఉన్నట్లు తెలిపింది. ఇక వివిధ యాప్స్ వినియోగంలోనూ మహిళలు వెనకబడినట్లు తెలుస్తోంది. ఏయే యాప్స్‌ను ఎంత శాతం ఉపయోగిస్తున్నారో ఒక్కసారి గమనిస్తే.. వాటిలో కమ్యూనికేషన్ అప్లికేషన్లు (apps) 23.3శాతం, వీడియో అప్లికేషన్లు 21.7 శాతం, ఫుడ్ అప్లికేషన్లు 23.5 శాతం ఉన్నాయి. మగవారితో పోలిస్తే పేమెంట్ అప్లికేషన్లు 11.3శాతం, గేమింగ్ అప్లికేషన్లు 6.1 శాతం తక్కువగా ఉపయోగిస్తున్నారు. కాగా, మొబైల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం ‘గోప్యత-అనుకూల’ పద్ధతిలో 85 మిలియన్ల కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను కవర్ చేసే ఫస్ట్ పార్టీ డేటాను ఉపయోగించి పరిశోధన చేసినట్లు బొబ్బల్ ఏఐ నివేదిక పేర్కొంది. చదవండి👉 ఉద్యోగులకు షాకిస్తున్న కంపెనీలు.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు! -
CrickPe: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు
సాక్షి,ముంబై: భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ సరికొత్త క్రికెట్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ ‘క్రిక్‌పే’ని లాంచ్ చేశాడు. వచ్చే వారం ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్‌కు ముందు ప్రపంచంలోని ఏకైక ఫాంటసీ క్రికెట్ యాప్ క్రిక్‌పేని ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. క్రికెట్-ఫోకస్డ్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్‌ను ‘క్రిక్‌పే’ లాంచింగ్‌ను అష్నీర్ గ్రోవర్ ట్విటర్లో వెల్లడించారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ , యాపిల్ స్టోర్ డౌన్లోడ్ లింక్‌లను కూడా (తన అధికారిక ట్విట్టర్ మార్చి 23న) హ్యాండిల్లో షేర్ చేశారు. ఐపీఎల్ క్రికెట్లో అతిపెద్ద విప్లవం. కేవలం ఫాంటసీ గేమ్ ఆటతీరుతో క్రికెటర్లకు డబ్బు చెల్లిస్తుంది! మీరు గెలిస్తే.. క్రికెటర్ గెలుస్తాడు -క్రికెట్ గెలుస్తుంది !!" అని ట్వీట్‌చేశారు. క్రిక్‌పే అనేది ఒక స్పెషల్ ఫాంటసీ క్రికెట్ గేమింగ్ యాప్. ఇక్కడ ప్రతిరోజూ 'క్రికెట్ గెలుస్తుంది'! ఇందులో ప్రతి మ్యాచ్‌లో, ఆడే క్రికెటర్లు, క్రికెట్ బాడీలు, నిజమైన జట్టు యజమానులు ఫాంటసీ గేమ్-విజేతలతో పాటు నగదు రివార్డులను గెలుచుకుంటారు అని గూగుల్ ప్లే స్టోర్ వివరణ ద్వారా తెలుస్తోంది. అలాగే మనకిష్టమైన జట్లు, ఇష్టమైన క్రికెటర్లందరిపై కూడా ప్రేమను (రివార్డులు) కురిపించవచ్చట. కాగా అష్నీర్ గ్రోవర్ తన వెంచర్ థర్డ్ యునికార్న్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం సుమారు 4 మిలియన డాలర్ల సీడ్ ఫండింగ్‌ను సేకరించారు ఈ ఫండింగ్ రౌండ్లో అన్మోల్ సింగ్ జగ్గీ, అనిరుధ్ కేడియా, విశాల్ కేడియా, ఇతరులతో సహా రెండు డజన్ల ఏంజెల్ ఇన్వెస్టర్లు పాల్గొన్న సంగతి తెలిసిందే. CRICKPE ! Biggest revolution in Cricket since IPL - only fantasy game paying cricketers for performance ! Where you win - cricketer wins - cricket wins !!https://t.co/virVGj27DThttps://t.co/Jl0mu4lFXO@crickpe_app pic.twitter.com/uQuxXEnk4c — Ashneer Grover (@Ashneer_Grover) March 23, 2023 -
ఇదేం బాలేదు.. కొందరి కోసమే గూగుల్ పాలసీ: విన్జో
న్యూఢిల్లీ: ప్లేస్టోర్‌లో ఎంపిక చేసిన కొన్ని ఫ్యాంటసీ, రమ్మీ గేమింగ్ యాప్స్‌ను ప్రయోగాత్మకంగా అనుమతించాలన్న గూగుల్ నిర్ణయాన్ని దేశీ గేమింగ్ ప్లాట్‌ఫాం విన్జో తప్పు పట్టింది. ఇది పూర్తిగా పక్షపాతపూరితమైన, అనుచితమైన, ఆంక్షాపూర్వక విధానమని వ్యాఖ్యానించింది. ప్లాట్‌ఫాంను తటస్థంగా ఉంచుతూ ఒక మధ్యవర్తిగానే వ్యవహరిస్తామనే గూగుల్ ధోరణిపై అనుమానాలు రేకెత్తుతున్నాయని విన్జో పేర్కొంది. దశాబ్దకాలంపైగా గుత్తాధిపత్యం సాగిస్తున్న కొన్ని సంస్థలకే లబ్ధి చేకూర్చేలా గూగుల్ విధానం ఉందని తెలిపింది. ఇది పోటీని దెబ్బతీయడమే కాకుండా నవకల్పనలకు చావుదెబ్బలాంటిదని విన్జో వ్యాఖ్యానించింది. గతంలో ఫ్యాంటసీ గేమింగ్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికీ సెప్టెంబర్ 28 నుంచి ఎంపిక చేసిన కొన్నింటిని పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విన్జో అభ్యంతరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: అన్నింటికీ ఒక్కటే కేవైసీ -
... గేమ్‌లో భాగంగానే అలా చేశాడట సార్!
... గేమ్‌లో భాగంగానే అలా చేశాడట సార్! -
ఈ–నగ్గెట్స్ ప్రమోటర్ల నివాసాల్లో సోదాలు
న్యూఢిల్లీ/కోల్‌కతా: మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కోల్‌కతాకు చెందిన మొబైల్ గేమింగ్ యాప్ కంపెనీ ప్రమోటర్ల నివాసాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.17 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెడ్‌పై పేర్చిన రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టల ఫొటోను ఈడీ విడుదల చేసింది. అమీర్ ఖాన్, అతడి కుమారుడు నెజార్ అహ్మద్ ఖాన్ కలిసి ‘ఈ–నగ్గెట్స్ పేరిట మొబైల్ గేమింగ్ యాప్ ప్రారంభించారు. వారితోపాటు మరికొందరు ఈ కంపెనీ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి చెందిన దాదాపు 6 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టామని ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూ.17 కోట్ల నగదు లభ్యమైందని, నోట్ల కట్టల లెక్కింపు ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. ఈ–నగ్గెట్స్ కంపెనీ గేమింగ్ యాప్ ద్వారా ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, వాటిని తిరిగి వెనక్కి తీసుకొనే అవకాశం ఇవ్వకుండా మోసం చేస్తోందంటూ ఫెడరల్ బ్యాంకు అధికారులు కోల్‌కతా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కంపెనీతోపాటు ప్రమోటర్లపై కోల్‌కతా పోలీసులు 2021 ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. గేమింగ్ యాప్ కంపెనీ ప్రమోటర్ల నివాసాల్లో ఈడీ సోదాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం చెప్పారు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈడీ సొదాలు జరుగుతుండడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న వ్యాపారవేత్తలపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల వల్ల బెంగాల్‌కు పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
గేమింగ్ యాప్ స్కాం: గుట్టలకొద్దీ నగదు,కళ్లు చెదిరే వీడియో
కోలకతా: కోలకత్తా గేమింగ్ యాప్ స్కాంలో ఈడీ దాడుల్లో గుట్టల కొద్దీ నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. గేమింగ్ యాప్ స్కాంలో ఈడీ ఏకంగా రూ. 17 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ నగ్గెట్స్` అనే గేమింగ్ యాపప్‌కు సంబంధించిన కుంభకోణంలో కోలకతాకు చెందిన గేమ్ ఆపరేటర్స్ కార్యాలయాల్లో శనివారం ఈడీ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలతోసాగిన ఈసెర్చ్ ఆపరేషన్ కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త ఇంటినుంచి సుమారు రూ. 17 కోట్లను రికవరీ చేసింది. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఒకదానితో సహా ఆరు చోట్ల దాడులు చేపట్టింది. రూ. 2వేల నోట్లు, రూ.500 నోట్ల కుప్పలను లెక్కించేందుకు ఈడీ మనీకౌంటింగ్ మెషీన్ల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు గంటల తరబడి కొనసాగుతున్న లెక్కింపులో నగదును తరలించేందుకు పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెలను తీసుకొస్తుండటం గమనార్హం. ప్రజలను నమ్మించి మోసగించి అక్రమాలను పాల్పడిన "ఈ-నగ్గెట్స్" అనే గేమింగ్ యాప్‌ను నిందితుడు నిసార్ ఖాన్ ప్రమోట్ చేశారని దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే దీనికి, ఆపరేటర్లకు ఇతర "చైనీస్ నియంత్రిత" యాప్‌లతో లింక్‌లు ఉన్నాయో లేదో దర్యాప్తు చేస్తోంది. కాగా 2021, ఫిబ్రవరిలో కంపెనీ, దాని ప్రమోటర్లపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫెడరల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ యాప్ డౌన్ లోడింగ్, గేమింగ్ ప్రాసెస్‌లో రివార్డు పేరుతో డబ్బు ఎరగా వేశారు. మొదట్లో విత్ డ్రా చేసుకునే అవకాశం బాగానే కల్పించారు. ఎంత ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే అంత మొత్తంలో రివార్డ్స్ ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించారు. దీంతో యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయడం ప్రారంభించడంతో అక్రమాలకు తెరలేచింది. #WATCH | Kolkata, WB: Stacks of cash amounting to several crores have been recovered from the residence of businessman Nisar Khan during ED's raid ongoing for several hours pic.twitter.com/o2qXzNSmDR — ANI (@ANI) September 10, 2022 #WATCH | Kolkata, WB: Trunks being carried into the residence of businessman Nisar Khan to collect crores in cash that have been recovered during ED's raid ongoing for several hours pic.twitter.com/jJjV3ZJRN6 — ANI (@ANI) September 10, 2022 -
గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 17 కోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ: కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారి ఆవరణలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో ఈడీ సుమారు రూ. 12 కోట్ల నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వ్యాపారవేత్త అమీర్‌ఖాన్ నివాసాలపై బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యాపారి నివాసంలో ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర బలగాలను పటిష్టంగా మోహరించారు. ఈ నగ్గేట్స్ అనే మొబైల్ గేమింగ్ యాప్‌తో వినియోగదారులను మోసం చేసినందుకు నిందితుడు అమీర్ఖాన్తోపాటు మరికొంత మంది పై ఫెడరల్ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేను నమోదు చేశారు. ఈ మేరకు ఈడీ గేమింగ్ స్కామ్ గురించి మాట్లాడుతూ....తొలుత వినియోగ దారులకు గేమింగ్ యాప్ ప్రారంభంలోనే మంచి కమిషన్ వాలెట్లు అందించి విశ్వాసాని పొందుతాయి. ఆ తర్వాత వారి నుంచి ఎక్కుక కొనుగోళ్లను చేయించి అనుహ్యంగా వారి వాలెట్లో ఉన్న మనీ అంతా స్వాహా చేసి అకస్మాత్తగా యూప్ పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత రీ ఇన్స్టాల్ చేసుకోవాలంటు రావడం మొదలవుతుంది. ఈలోగా అందులో ఉన్న మన డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడికి గానీ వినియోగదారుడి మోసపోయినట్లు గ్రహించలేడు అని ఈడీ వివరించింది. (చదవండి: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన అమిత్ షా... సీఎం సొంత గడ్డ నుంచి ప్రచారం) -
కీలక నిర్ణయం, గేమింగ్ యాప్‌ను షట్‌డౌన్ చేయనున్న ఫేస్బుక్!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఫేస్బుక్ గేమింగ్ యాప్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ సంస్థ యూజర్లు భారీగా తగ్గనున్నారు. 2018లో గేమ్ స్ట్రీమింగ్, గేమింగ్ ఫ్లాట్ ఫామ్‌లో ట్విచ్, యూట్యూబ్‌కు పోటీగా ఫేస్బుక్ అడుగు పెట్టింది. రెండేళ్ల తర్వాత అంటే 2020లో గేమింగ్ యాప్, క్రియేటర్ పోగ్రాంను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ స్ట్రీమింగ్ యాప్ మిక్సర్‌ను సైతం కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో స్పష్టమైన కారణాలేంటనే విషయం వెలుగులోకి రానప్పటికీ..ఫేస్బుక్ తన గేమింగ్ యాప్‌ను స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 28 నుంచి ఆ సేవల్ని వినియోగించుకోలేరని, వెబ్ బేస్డ్ వెర్షన్ గేమింగ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పింది. -
రిలయన్స్ జియో కీలక నిర్ణయం...! ఇక యూజర్లకు పండగే..?
యూజర్లకు మరిన్నీ సేవలను అందించేందుకుగాను రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా,మ్యూజిక్, క్లౌడ్, హెల్త్, యూపీఐ లాంటి సేవలను జియో తన యూజర్లకు అందిస్తోంది. వీటితో పాటుగా మరిన్నీ గేమింగ్ సేవలను అందించేందుకు జియో సన్నాద్ధమైంది. జూపీ(Zupee)తో కీలక ఒప్పందం..! స్కిల్డ్ బేస్డ్ గేమింగ్ రంగంలో ప్రసిద్ధి చెందిన జూపీతో రిలయన్స్ జియో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో జియో కస్టమర్లకు క్వాలిటీ గేమ్స్ అనుభూతిని పొందే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యంతో జియో తన యూజర్లు జూపీకి చెందిన అన్నీ గేమ్‌లను యాక్సెస్ చేయవచ్చును. ఈ గేమ్స్ అన్ని భాషలను సపోర్ట్ చేయనున్నాయి. రిలయన్స్ జియో-జూపీ భాగస్వామ్యంతో జూపీ సేవలు మారుమూల గ్రామాలకు చొచ్చుకుపోతాయని జూపీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దిల్షేర్ సింగ్ అన్నారు. ఇప్పటికే తమ ఫ్లాట్‌ఫామ్స్‌లో సుమారు 70 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ను కల్గి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో యూజర్లు గేమ్స్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఏర్పడనుంది. 600 మిలియన్ డాలర్లకు.. సిరీస్ బీ రౌండ్ ఫండింగ్‌లో నేపియన్ క్యాపిటల్, వెస్ట్ క్యాప్ గ్రూప్, టోమల్సె బే క్యాపిటల్, ఏజే క్యాపిటల్, మాట్రిక్స్ పాట్నర్స్ ఇండియా, ఒరిస్ వెంచర్ నుంచి జూమీ సుమారు 102 మిలియన్ డాలర్లను సేకరించింది. గేమింగ్ రంగంలో కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, ఆయా గేమింగ్స్ డిజైన్ అనుభవాలను మెరుగుపరచడానికి, మార్కెటింగ్ పలు ఇతర విషయాల్లో ఈ నిధులను ఉపయోగిస్తామని జూపీ పేర్కొంది. కంపెనీ విలువ ఇప్పటివరకు 600 మిలియన్ డాలర్లకు చేరుకుంది. చదవండి: బెంగళూరు, ఢిల్లీ బాటలో హైదరాబాద్.. స్టార్టప్‌లకు మంచి రోజులు -
ఆన్లైన్ రమ్మీ.. అంతా డమ్మీ.. ఆశకు పోతే ప్రాణాలుండవు!
మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌కు చెందిన సీపతి అభిలాష్ (25) అనే సీఏ విద్యార్థి.. ఆన్లైన్ రమ్మీకి బానిసయ్యాడు. అప్పులు చేసి మరీ ఆడాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. గత ఏడాది డిసెంబర్ 29న విషం తాగి చనిపోయాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన జగదీశ్ ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్టాడు. మొదట్లో కొంత లాభం రావడంతో తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులు, అప్పులు చేసినవి కలిపి ఏడు లక్షలు పెట్టి ఆడాడు. సొమ్మంతా పోగొట్టుకున్నాడు. డబ్బు లన్నీ తిరిగి సాధించాలని మళ్లీ 8 లక్షలు అప్పులు చేశాడు. ఈ సొమ్ము కూడా పోవడంతో.. ఆందోళనకు గురై గత ఏడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీపై నిషేధాన్ని తొలగించుకునేందుకు ముంబై గేమ్ మాఫియా రంగంలోకి దిగింది. పేకాట, ఆన్లైన్ గేమింగ్‌లను బ్యాన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో.. ఆన్లైన్ రమ్మీకి సడలింపు ఇచ్చేలా చేయాలని ఓ కీలక ప్రజాప్రతినిధి, ఓ సీనియర్ ఐఏఎస్‌తో సంప్రదింపులు జరిపింది. దీనికి ఆ ఇద్దరు కీలక వ్యక్తులు అంగీకరించారని.. కొన్నికోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని, అడ్వాన్స్ కూడా తీసుకున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా ప్రయత్నాలు చేసిన సదరు ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారి.. అనుకున్న ‘పని’ సాధించలేకపోయారు. ఈలోగా విషయం పెద్దలకు తెలియడంతో.. చీవాట్లు పెట్టారని తెలిసింది. ఇప్పుడీ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలో పేకాట, ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం టీఆర్ఎస్ సర్కారు 2016లోనే రాష్ట్రంలో పేకాటను నిషేధించింది. దానితోపాటు ఇంటర్నెట్లో ఆడే ‘ఆన్లైన్ రమ్మీ’, ఇతర ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటలపైనా నిషేధం విధించింది. పేకాటతోపాటు యువతను వ్యసనాలకు గురిచేసే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ నిర్ణయంపై మహిళలతోపాటు అన్నివర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే ఆన్లైన్ పేకాట వందలు, వేల కోట్ల వ్యాపారం కావడంతో.. ముంబై వేదికగా ఆన్లైన్ వెబ్సైట్లు, యాప్‌లను నిర్వహిస్తున్న మాఫియా సంస్థలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో ఆన్లైన్ పేకాటకు అనుమతి వచ్చేలా చేయాలంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను సంప్రదించాయి. రెండు, మూడు నెలల నుంచి ప్రయత్నాలు ఆన్లైన్ రమ్మీ మాఫియా ‘ఆఫర్’కు లొంగిపోయిన ఒక కీలక ప్రజాప్రతినిధి, ఓ సీనియర్ ఐఏఎస్.. ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో సదరు సంస్థల ప్రతినిధులతో సమావేశమై, ఒప్పందం కుదుర్చుకున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అడ్వాన్స్‌గా కొన్నికోట్ల మొత్తాన్ని తీసుకున్నారని వెల్లడించాయి. ఇది జరిగి రెండు, మూడు నెలలు కావొస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. దీనితో రమ్మీ మాఫియాకు చెందిన కీలక వ్యక్తి రంగంలోకి దిగి సదరు ప్రజాప్రతినిధిని, సీనియర్ అధికారిని నిలదీశారని.. వారం, పది రోజుల్లో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారని సమాచారం. ఈ పది రోజుల గడువు తీరినా స్పందన లేకపోవడంతో అడ్వాన్స్ తిరిగివ్వాలని ఒత్తిడి పెంచారని.. ఈ క్రమంలో విషయం మరో కీలక ప్రజాప్రతినిధి ద్వారా ప్రభుత్వ పెద్దలకు చేరిపోయిందని తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని, మాఫియాకు డ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. సదరు వ్యక్తులు మధ్యవర్తుల ద్వారా అడ్వాన్స్ సొమ్ము తిరిగి ముంబై మాఫియాకు తిరిగి పంపారని తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై పలువురు ఐపీఎస్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా.. స్పందించలేదు. నిషేధమున్నా.. ఏటా వేల కోట్ల దందా రాష్ట్రంలో ఆన్లైన్ పేకాటపై నిషేధం ఉండటంతో.. గూగుల్ ప్లేస్టోర్/యాపిల్ స్టోర్ వంటివాటిలో సదరు యాప్స్ అందుబాటులో ఉండవు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సైట్ల ద్వారా సదరు ఆన్లైన్ గేమింగ్ సంస్థలు ప్రచారం చేస్తూ.. లింకులు పెడతాయి. ఆ లింక్స్‌ను షేర్ చేస్తే పాయింట్లో, నగదో రివార్డు ఇస్తామని ఆశపెడ్తాయి. అలా ఒకరి నుంచి ఒకరికి లింకులు షేర్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఇలా 12లక్షల మందికి పైగా సదరు యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్నట్టు కేంద్ర నిఘా సంస్థలు గతంలోనే కేంద్ర హోంశాఖకు నివేదికలు ఇచ్చాయి. వీటిద్వారా ఏటా రూ.2 వేల కోట్లకుగా దందా సాగుతోందని అంచనా వేశాయి. 2018లో తెలంగాణ నుంచి రూ.1,200 కోట్ల మేర ఆన్లైన్ యాప్స్‌లో దందా సాగిందని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫేక్ లొకేషన్‌తో జిమ్మిక్కులు ఆన్లైన్ రమ్మీ యాప్‌లు మొబైల్ఫోన్ల లొకేషన్ డేటాను తీసుకుంటాయి. రాష్ట్రంలో అధికారికంగా నిషేధం ఉండటంతో ఇక్కడి మొబైల్ లొకేషన్ ఉంటే గేమ్ ఆడటానికి వీలుకాదని చూపిస్తాయి. అయితే ఆన్లైన్ గేమ్ మాఫియా సంస్థలు ఫోన్లలో ఫేక్ జీపీఎస్ లొకేషన్ చూపించే యాప్స్‌ను షేర్ చేస్తున్నాయి. వీటిసాయంతో ఆన్లైన్ రమ్మీ ఆడేవారు ఫోన్లో అసలు జీపీఎస్ లొకేషన్‌ను డిసేబుల్ చేసి.. ఫేక్ జీపీఎస్‌ను యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్నట్టు లొకేషన్ పెడుతూ.. ఆన్లైన్ పేకాట ఆడుతున్నారు. ఏమిటీ ఆన్లైన్ రమ్మీ వ్యవహారం? పేకాట క్లబ్బుల్లో, బయటా ‘మూడు ముక్కలాట, రమ్మీ’ ఆడినట్టుగానే.. ఆన్‌లైన్‌లోనూ డబ్బులు పెట్టి ఆడేందుకు కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కొన్ని నియంత్రణలను పెట్టింది. అందుకు అనుగుణంగా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు ప్రత్యేక యాప్‌లను రూపొందించి దందా చేస్తున్నాయి. ఆన్లైన్ పేకాట, గ్యాంబ్లింగ్‌ను తమ రాష్ట్రాల్లో అనుమతించాలా, నిషేధించాలా అన్ని నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ పేకాటను నిషేధించాయి. మొదట్లో ‘ఎర’ వేసి.. ఆన్లైన్ పేకాట ఆడేవారు సదరు వెబ్సైట్/యాప్‌లకు బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానించి.. డబ్బులను వాటిలోకి బదిలీ చేసుకుంటారు. ఆ డబ్బులతో పేకాడుతారు. గెలిచినవారికి డబ్బులు ఇవ్వడం, ఓడిపోతే కట్ చేయడం జరుగుతాయి. సర్వీస్చార్జీల పేరిట కొంత మొత్తాన్ని మినహాయించుకుంటాయి. అయితే ఈ ఆన్లైన్ గేమ్స్‌లో చాలా వరకు మోసమే. వీటిలో ఆడటం మొదలుపెట్టినవారికి కొద్దిరోజులు కావాలనే డబ్బులు గెలుచుకున్నట్టు చూపిస్తారని.. వారు ఆన్లైన్ పేకాటకు బానిసలయ్యాక ఉన్న డబ్బంతా ఊడ్చేస్తాయని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో చాలా మంది లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ ఆడుతున్నారు. అవన్నీ పోగొట్టుకుని అఘాయిత్యాలకు పాల్పడటం వంటి ఘటనలు ఎన్నో నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా హాజిపూర్‌కు చెందిన చిందం పోశెట్టి.. ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడ్డాడు. మొదట్లో కొంత డబ్బులు రావడంతో.. తర్వాత అప్పులు చేసి మరీ ఆడాడు. డబ్బులన్నీ పోవడంతో ఆవేదనలో మునిగిపోయాడు. ఈ ఏడాది జనవరి 27న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
తైవాన్ ఎక్సలెన్స్ గేమింగ్ కప్‌లో భారత్ నుంచి 8 వేల మంది..
తైపీ: విభిన్న రకాల ఆన్లైన్ గేమ్స్‌లో పోటీపడేందుకు రూ.10లక్షల దాకా ప్రైజ్ మనీని పొందేందుకు అవకాశం అందించే ఆన్లైన్ ఆటల సందడి మొదలైంది. అత్యధిక సంఖ్యలో ఆన్లైన్ గేమింగ్ ప్రియుల ఆదరణ పొందిన తైవాన్ ఎక్స్‌లెన్స్ గేమింగ్ కప్ (టిఇజిసి) క్వాలిఫైర్స్ 2వ రౌండ్ అక్టోబరు 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని టిఇజిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ తైవాన్ ఎక్స్‌లెన్స్ మార్క్ వ్యూ తెలిపారు. గత 16వ తేదీన ప్రారంభమైన ఈ గేమింగ్ సందడి డిసెంబరు 5తో ముగుస్తుందనీ, ఈ స్పోర్ట్స్ ప్రియులు అత్యధిక సంఖ్యలో ఈసారి భారత్ నుంచి పాల్గొన్నారని వివరించారు. ఈ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 8వేల మందిపైగా నమోదు చేసుకున్నారన్నారు. ఈ ఏడాది పలు ప్రాచుర్యం పొందిన కొత్త గేమ్స్ తాము పరిచయం చేశామని, అత్యాధునిక గేమింగ్ టెక్నాలజీని అందిస్తున్నామని తెలిపారు. చదవండి: తెలుగు క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మ్యాక్స్‌వెల్, కోహ్లి -
రాత్రికి రాత్రే డబ్బులు మాయం..
మార్గాలు వేరు.. గమ్యం ఒకటే! చదువుకుని ఆర్థికంగా స్థితిమంతులైనవారు కూడా ఇలాంటి మోసాల వలలో చిక్కుంటున్నారు. విలాసవంతమైన జీవనం కోసం కావచ్చు, కోవిడ్ వల్ల వచ్చిన నష్టాల వల్ల కావచ్చు. కారణమేదైనా అదనపు ఆదాయం కోసం అన్వేషిస్తుంటారు. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి బెట్టింగ్ యాప్‌లను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ, కొత్త కొత్త మార్గాల ద్వారా యాప్ అప్లికేషన్స్‌ను సెండ్ చేస్తుంటారు. ఈ యాప్‌ల పట్ల ఆకర్షితులు అయినవారు మోసపోతుంటారు. మార్గాలు వేరు కానీ, మోసగాళ్ల గమ్యం ఒకటే... జనం దగ్గర డబ్బులు లాగడం. రాధిక (పేరు మార్చడమైనది) గేమింగ్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంది. తనలాగే దేశవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని తెలిపింది. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మరెవ్వరూ తమలా ఆన్లైన్ గేమింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకోకూడదని తాము మోసపోయిన విధానాన్ని తెలియజేసింది... ‘‘రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తయ్యాక నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగినిగా చేరాను. వచ్చే జీతంలో కొంత ఈఎమ్ఐలకు పోతుంది. మరికొంత అదనపు ఆదాయం కావాలనుకున్నాను. ఈ విషయం గురించి నా స్నేహితులతో మాట్లినప్పుడు ఓ గేమింగ్ యాప్ గురించి చెప్పారు. దాని ద్వారా వాళ్లు రోజూ డబ్బులు సంపాదిస్తున్న విధానం చూసి, నేను ఆ గేమింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాను. మన బదులుగా యాప్ వాళ్లే గేమ్ ఆడి, అందులో వచ్చిన పాయింట్స్ ఆధారంగా మనకు డబ్బులు ఇస్తారు. అందులో జాయిన్ అవాలంటే ఆ యాప్‌లోనే ముందు రూ. 10,000తో అకౌంట్ ప్రారంభించాలి. ఉదయం పెట్టుబడి పెడితే, రాత్రికి రిటన్స్ వచ్చేవి. రోజూ రూ.500 నుంచి రూ.700 వరకు లాభం వస్తుంది. ఏ రోజు డబ్బు ఆ రోజు అకౌంట్లో పడిపోతుంది. అలా వచ్చినప్పుడు 2 నుంచి 3 వేలు అదనంగా మరికొంత ఇన్వెస్ట్ చేయమనే సూచనలు యాప్‌లో కనిపించేవి. నేను నెల రోజులుగా ఆ యాప్ అకౌంట్లో మెంబర్‌గా ఉన్నాను. నా ఫ్రెండ్స్ రెండు నెలలుగా ఇందులో ఉన్నారు. వచ్చిన లాభంలో 40 శాతం ఆ యాప్ పోర్టల్ వారే కమిషన్ రూపేణా కట్ చేసుకుంటారు. కొత్తగా ఎవరినైనా పరిచయం చేస్తే ఆ పర్సంటేజ్ మనీ కూడా మనకే వస్తుంది. నేను అలా మరో ఇద్దరిని పరిచయం చేశాను. యాప్‌లో ఉన్నవారందరినీ టెలీగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేశారు. ∙∙ రోజూ లాభం చూస్తున్నాను కాబట్టి తర్వాత రూ. 20,000 పెట్టుబడి పెట్టాను. రూ.10,000 కన్నా రూపాయి తక్కువ ఉన్నా ఎలాంటి లాభం రాదు. ఒకసారి ఉదయం నేను డబ్బు అకౌంట్ లో వేసే సమయానికి అమౌంట్ మైనస్‌లోకి వెళ్లింది. ప్లస్‌లోకి రావాలంటే అదనంగా డబ్బు కట్టాలన్నారు. అలా రూ.50,000 వరకు కట్టాను. కానీ, అకౌంట్ మైనస్ చూపిస్తోంది. ఇదే విషయాన్ని టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా గ్రూప్‌లో ఉన్నవారితో మాట్లాడాను. మరికొందరికి కూడా ఇదే సమస్య వచ్చింది. అయితే, ఇదేదో మిస్టేక్ జరిగింది. కంపెనీ వాళ్లతో మాట్లాడి సెట్ చేస్తాం అన్నారు. మరో రూ.10,000 చెల్లిస్తే 20 శాతం, రూ.20,000 చెల్లిస్తే 50 శాతం, రూ.30,000 చెల్లిస్తే వంద శాతం అమౌంట్ తిరిగి మీ మీ అకౌంట్లలోకి వస్తుంది అని చెప్పారు. నేను దాదాపు అలా లక్షన్నరూపాయల వరకు నా క్రెడిట్ కార్డుల నుంచి యాప్ అకౌంట్లో వేశాను. నాతోపాటు మిగతా వాళ్లు కూడా డబ్బు అకౌంట్లో వేశారు. ముందు రూ.40,000 వేలు అకౌంట్లో చూపించింది, కానీ విత్‌డ్రా ఆప్షన్ లేకపోవడంతో ‘రాత్రి మొత్తం బెట్టింగ్ జరుగుతుంది, మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు డబ్బును విత్‌డ్రా చేయడం కుదరదు’ అన్నారు. సరే అనుకున్నాను. మరుసటి రోజు ఉదయం అకౌంట్ చూస్తే జీరో బ్యాలెన్స్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ నుంచి యాప్ పోర్టల్ వాళ్లు ఎగ్జిట్ అయిపోయారు. దేశవ్యాప్తం గా దాదాపు 3 వేల మంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం అనే విషయం అర్ధమైంది. రోజుకు రూ.500–రూ.700 వరకు వస్తాయనుకుంటే వేలల్లో, లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం. ఇలా ఎవరూ ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోకూడదని ఈ విషయాన్ని చెబుతున్నాను’’ అని వివరించారు రాధిక. ఆశనే ఆసరా చేసుకొని క్రైమ్ సోషల్‌మీడియాలో బాగా పేరున్నవారిని ఆయుధంగా చేసుకొని, ఇలాంటి మనీ ఫ్రాడ్‌కి తెరలేపుతారు. వారి మాటలను మిగతా వాళ్లు నమ్ముతారనే ఆశే ఇలాంటి ఫ్రాడ్స్‌కి పెట్టుబడి. జనం ఆశను ఆసరా చేసుకొని క్రైమ్ చేస్తారు. సోషల్‌మీడియాలో ఎవరి ద్వారా అయినా సరే.. ► ఏదైనా లింక్ ద్వారా ఏ అప్లికేషన్ మనకు వచ్చినా వాటిని డౌన్లోడ్ చేసుకోకూడదు. ∙ ► యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆండ్రాయిడ్‌లో వచ్చే అప్లికేషన్స్ అన్నీ ఎపికె ఫైల్స్ అంటారు. ఐఒఎస్లో వచ్చే ఫైల్స్ అన్నీ డిఎమ్‌జెడ్ ఫైల్స్ అంటారు. ఈ ఫైల్స్‌ని లింక్స్ ద్వారా పంపిస్తారు. సోషల్ మీడియాలో పేరున్నవాళ్లను ఎంచుకొని ఈ యాప్స్ గురించి గొప్పగా చెప్పి, వారిని ఇన్ఫ్లూయెన్స్ చేస్తారు. పేరున్నవారు, తెలిసినవారు వీటిని చెప్పారు కదా అని నమ్మి ఆ దొంగ యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ యాప్స్‌లలో డబ్బులు పెట్టించి, గెలిచినట్టుగా 4, 5 సార్లు చూపించి, తర్వాత మైనస్‌లో అకౌంట్ చూపిస్తారు. డబ్బులు మరిన్ని వేస్తే, మరింత మొత్తం వస్తుందని నమ్మబలుకుతారు. ఇలా రూ.5000 నుంచి 10 లక్షల వరకు పోగొట్టుకున్నవారున్నారు. ఈ ఫ్రాడ్స్ వాట్సప్ కన్నా టెలీగ్రామ్ గ్రూప్‌ని ఎంచుకుంటారు. దీనికి కారణం టెలీగ్రామ్‌లో ఎక్కువమందిని గ్రూప్‌గా యాడ్ చేయవచ్చు. ఎంతమంది ఎక్కువ మొత్తంలో చేరితే జనంలో అంత నమ్మకం పెరుగుతుంది. దాంతో పాటే మోసమూ పెరుగుతుందని గ్రహించి, జాగ్రత్తపడాలి – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ప్రాణాంతక యాప్‌లు!
చైనా గేమింగ్ యాప్‌లు, ఇతర యాప్‌లు కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తరుణంలో, ఆ దేశానికి చెందిన వస్తువులు కొనకపోవడం దేశభక్తికి నిదర్శనమని కొందరు ప్రచారం చేస్తున్న సమయంలో అందరి కళ్లూ కప్పి చాపకింద నీరులా చైనా మూలాలున్న లోన్ యాప్స్ దేశంలో అనేకచోట్ల స్వైరవిహారం చేసిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ యాప్స్ బారినపడి మూడు నిండు ప్రాణాలు బలికాగా, నిత్యం వీరి వేధింపులు చవిచూస్తున్నవారు మరెందరో. ఇక్కడే కాదు... కేరళ మొదలుకొని ఢిల్లీ వరకూ ఈ యాప్స్ నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నవారికి వలపన్ని, సాయం చేసే పేరిట అడ్డగోలుగా దోచుకుతిన్నారని, వారిని మానసికంగా వేధిస్తూ నరకం చవిచూపించారని ఇప్పుడిప్పుడు బయటపడుతున్న కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంస్థలను నమ్మొద్దని, వారి బారినపడి నష్టపోవద్దని బుధవారం రిజర్వ్‌బ్యాంక్ సైతం హెచ్చరించింది. ఇంతక్రితం చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కాల్‌మనీ సెక్స్ రాకెట్ యధేచ్ఛగా సాగింది. అందులో ఆయన పార్టీకి చెందినవారే అనేకులు వుండటంతో నిందితులంతా తేలికపాటి సెక్షన్లకింద అరెస్టయి బెయిల్ కూడా తెచ్చుకోగలిగారు. ఈ యాప్స్ కూడా దాదాపు అటువంటివే. లాక్డౌన్ల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులు, కొలువు పోగొట్టుకుని రోడ్డునపడిన యువతీయువకులు, అనుకోకుండా అనారోగ్యంలో చిక్కుకుని చికిత్స కోసం డబ్బు అవసరమైనవారు, వినియోగ వస్తు వ్యామోహంలో పడేవారు... ఇలా అనేకమంది అభాగ్యులు ఈ సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ లోన్ యాప్‌ల పేర్లు కూడా తమాషాగా వుంటాయి. బబుల్ లోన్, లిక్విడ్ క్యాష్, రుపీ ఫ్యాక్టరీ, పైసాలోన్, ఫ్లిప్‌క్యాష్, ఇన్‌నీడ్, రుపీప్లస్, పాన్‌లోన్, క్యాష్‌పాట్, వన్‌హోప్... ఇలా వీటికి అంతేలేదు. ఒక లెక్క ప్రకారం గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ బాపతు మారీచ సంస్థలు 500పైగానే వున్నాయి. వీటిల్లో అధికభాగం మూలాలు చైనాలోనే వుంటాయి. ఒక్కో యాప్‌కు దాదాపు పది లక్షలకుపైగా డౌన్లోడ్లు వున్నాయంటే ఇవి ఎంతగా అల్లుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. వీటికి ఒక వెబ్‌సైట్‌గానీ, చెప్పుకోవడానికి కార్యాలయంగానీ వుండవు. కనీసం సంప్రదించడానికి ఫోన్ నంబరైనా ఉండదు. అన్నిటికీ యాప్ ఒక్కటే మార్గం. ఇవ్వడమైనా, గుంజుకోవడమైనా ఆన్లైనే! యాప్‌ల నిర్వాహణ తీరు కూడా విలక్షణమైనది. ఎక్కడో చైనాలో గుట్టుగా వుంటూ అనేకానేక సంస్థల చాటున దీన్నంతా కొనసాగిస్తారు. ఔట్సోర్సింగ్ సంస్థలతో కూడా వీరికి నేరుగా సంబంధాలుండవు. మనదేశంలో వున్న నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లోగానీ, నేరుగాగానీ రుణాలిచ్చే సంస్థలు తప్పనిసరిగా రిజిస్టరైన బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు అయివుండాలి. లేదా రాష్ట్రాల్లోని చట్టాలకింద వడ్డీ వ్యాపారం చేసే సంస్థలైనా అయివుండాలి. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొనివుండాలి. ఏమీ లేకుండా ఇలా రుణాలిచ్చే వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. కానీ ఈ యాప్స్ నిర్వాహకుల తీరు చూస్తే వీళ్లు నకిలీగాళ్లనే అనుమానం ఎవరికీ రాదు. లోన్ కోసం ఆశ్రయించినప్పుడు తీయగా మాట్లాడటం, సరిగా చెల్లించే స్థితిలో లేరని తెలియగానే దుర్భాషలాడటం ఈ యాప్స్ నిర్వాహకులకు అలవాటు. పోలీసు కేసులు పెడతామని బెదిరించడం, కోర్టుకీడుస్తామని హెచ్చరించటం రివాజు. దక్షిణాది రాష్ట్రాలవారికి హిందీ భాషా ప్రాంతవాసులతో ఫోన్ చేయించి బెదిరించటం, ఇంటికొస్తున్నామని హడలెత్తించటం వీరనుసరించే విధానం. ఏదోవిధంగా ఇచ్చిన సొమ్ముకంటే అనేక రెట్లు అధికంగా గుంజటం వీరి ధ్యేయం. ఏం చేసినా కట్టే స్థితిలో లేరని నిర్ధారణయ్యాక యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సేకరించిన డేటా ఆధారంగా వారి బంధుమిత్రులందరి ఫోన్లకూ వారిని దారుణంగా చిత్రిస్తూ సందేశాలు పంపి పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని చూస్తారు. డబ్బు చెల్లించకపోతే తమతో నగ్నంగా వీడియో చాటింగ్ చేయాలని యువతిని బెదిరించిన ఉదంతం, అప్పు తీసుకున్న యువకుడి తల్లి ఫొటోను మార్ఫింగ్ చేసి అతని పరిచయస్తులకు పంపిన ఉదంతంవంటివి వెల్లడయ్యాయి. వీరు ఇంకేం చేశారో, ఎందరు వీరి ఆగడాలకు బలయ్యారో మున్ముందు చూడాల్సివుంది. లాక్డౌన్ తర్వాత సాధారణ జనం ఆర్థికంగా ఎంత కుంగిపోయారో చెప్పడానికి ఈ యాప్‌ల స్వైరవిహారమే ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ తరహాలో సాధారణ ప్రజానీకం చేతుల్లో డబ్బుండేలా చూసే పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాలు దేశంలో చాలా తక్కువ. ఈ పరిస్థితిని లోన్ యాప్స్ నిర్వాహకులు చక్కగా వినియోగించుకున్నారు. రుణం ఇచ్చేటపుడు ఆధార్ నంబర్ మినహా మరే డాక్యుమెంటూ అవసరం లేదనడం వల్ల చాలామంది వీటికి ఆకర్షితులవుతారు. కానీ యాప్ డౌన్లోడ్ సమయంలోనే ఫోన్లోని సమస్త సమాచారమూ వారికి పోతుంది. అప్పు తీసుకున్నవారు కదలికలేమిటి... ఏ బ్యాంకులో వారికి ఖాతా వుంది... వారు ఏఏ దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేస్తారు వంటి వివరాలన్నీ ఆ యాప్స్ నిర్వాహకుల చేతుల్లోకి పోతాయి. అన్నిటికీ ఆన్లైన్ వ్యవస్థపైనే ఆధారపడేలా, అత్యధిక లావాదేవీలు డిజిటల్ మార్గాల్లోనే జరిగేలా చూసేందుకు గత దశాబ్దకాలంగా కేంద్రం అనేక విధానాలు అమల్లోకి తెచ్చింది. ఆధార్‌తో మొదలుపెట్టి అన్నీ డిజిటల్ మార్గంలోకి పోయాయి. కానీ దీనికి దీటుగా ప్రజలకు డిజిటల్ అవగాహన కల్పించడంలో మాత్రం పాలకులు విఫలమయ్యారు. ఫలితంగా తమ విలువైన డేటా ప్రమాదకర వ్యక్తుల చేతుల్లోకి పోతోందని జనం గ్రహించలేకపోతున్నారు. దాదాపు ఏడాదినుంచి లోన్ యాప్‌లు స్వైరవిహారం చేస్తుంటే రిజర్వ్‌బ్యాంకు మొన్న జూన్‌లో తొలిసారి హెచ్చరించింది. ఆ తర్వాతైనా దానిపై గట్టి ప్రచారం జరగలేదు. మళ్లీ ఇప్పుడే అది మాట్లాడటం! గూగుల్ వంటి సంస్థలు జవాబుదారీతనంతో వుండేలా చూడటం, యాప్‌లపై నిపుణుల సాయంతో నిఘా పెట్టడంవంటి చర్యలతోనే ఈ మాయదారి యాప్‌లకు అడ్డుకట్టవేయగలం. -
మన ఆట మొదలైంది
గోరో మజిమా తెలుసా? ఎందుకు తెలియదు, జపాన్ డిజిటల్ గేమ్ ‘యకుజ’లో ఒక క్యారెక్టర్. ‘క్రొటాస్’ ఎవరో చెప్పుచూద్దాం? ‘గాడ్ ఆఫ్ వార్’ గేమ్‌లో వారియర్. అమెరికా నుంచి జపాన్ వరకు ఏ ‘డిజిటల్ గేమ్’ గురించి అడిగినా చెప్పగలిగే మన ‘జ్ఞానం’ ఇప్పుడు సృజనాత్మకత వైపు పరుగులు +తీస్తోంది. ‘గేమ్’ను ఆస్వాదించడమే కాదు మనవైన దేశియ గేమ్స్‌ను రూపొందించడానికి యువత సై అంటోంది.... కోవిడ్ చాస్తున్న కోరలకు చిన్నా,పెద్దా పరిశ్రమలు తుఫాను ముందు చిగురుటాకులా వణికిపోయాయి. గేమింగ్ కంపెనీలు మాత్రం తడబడకుండా అరేబియన్ గుర్రంలా దూసుకెళ్లాయి. లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉన్న ప్రజలకు వినోదాన్ని కలిగించడానికి వీలుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లాంటి సంస్థలు ప్రముఖ గేమింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం, సినిమాలు, టీవీ షోల కంటే రాబోయేకాలం ‘గేమింగ్’ పరిశ్రమదే అని రిలయన్స్ అధినేత అనడం....వాటి శక్తి ఏమిటో ఊహించుకోవచ్చు. గూగుల్–కెపీఎంజీ రిపోర్ట్ ప్రకారం 2021 నాటికి మన దేశంలో ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ ఏడు వేల కోట్లు, 2023 నాటికి పదకొండువేల కోట్లు దాటుతుందట. అమెరికన్, జపాన్ కంపెనీల స్ఫూర్తితో డిజిటల్ గేమ్ రంగంలోకి దిగిన ధృవ, నజర, గేమ్స్ 2 విన్...మొదలైన సంస్థలు ‘లోకల్ కంటెంట్’ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. అయితే అప్పట్లో స్మార్ట్ఫోన్ల హవా లేకపోవడం, వేరే దేశాల్లోలాగా గేమింగ్ యాప్స్‌ను కొనడం లేదా చందాల రూపంలో డబ్బు వెచ్చించడానికి సుముఖంగా ఉండకపోవడం, గేమింగ్ అనేది పనిపాటలేని వ్యవహారం అనుకోవడంలాంటి పరిమితులు ఉండేది. స్మార్ట్ఫోన్ల ప్రభంజనంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. మరోవైపు గేమింగ్ అనేది మరీ అంత తీసిపారేయతగినది కాదని, మల్టీటాస్కింగ్ నైపుణ్యం పెరుగుతుందనే స్పృహ వచ్చింది. ఒకప్పుడు పిల్లల పత్రిక ‘చందమామ’ను పెద్దలు కూడా పిల్లలై చదివినట్లే, ఇప్పుడు పిల్లలు, యువతే కాకుండా పెద్దలు కూడా గేమింగ్ పట్ల ఆసక్తి చూపడం మరో సానుకూల అంశంగా మారింది. గేమింగ్ రంగంలో ఉజ్వల భవిష్యత్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించడానికి ద్వారాలు తెరిచింది గేమింగ్ ఇండస్ట్రీ. బార్డర్స్ల్యాండ్, సూపర్ మారియో, రాకెట్ లీగ్, లీగ్ ఆఫ్ లెజెండ్స్,లెజెండ్ ఆఫ్ జెల్డా....ఇంకా ఎంత కాలం మనవి కాని ఆటలు! మన ఆట మొదలుపెట్టడానికి ఇదే సరిౖయెన టైమ్. ‘డిజిటల్ గేమింగ్ సెక్టర్లో అద్భుత అవకాశాలు ఉన్నాయి.మన సంస్కృతి,జానపదకథల్లో నుంచి సబ్జెక్ట్‌లను డెవలప్ చేయండి’ అని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. గేమింగ్ అంటే ఇష్టం ఉందా? కొత్తగా ఆలోచించే సృజనాత్మకత మీ సొంతమా? ...ఇక మీరు గేమింగ్ ప్రియులుగా మాత్రమే ఉండనక్కర్లేదు. మీకు ఇష్టమైన రంగంలోనే కాలరెత్తుకోదగ్గ ఉద్యోగాలతో పదిమంది మెప్పు పొందవచ్చు. అటు చూడండి...గేమ్ప్రొగ్రామర్, గేమ్ డిజైనర్, నెరెటీవ్ డిజైనర్, టెక్చర్ ఆర్టిస్ట్, గేమ్ రైటర్, ఆర్ట్ డిజైనర్,టూల్ డెవలపర్...ఇలా రకరకాల అవకాశాలు ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ,పీజీ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదండి...మీ ఇష్టాన్నే పెట్టుబడిగా పెట్టి గేమింగ్ స్టార్‌గా ఎదగడానికి. గేమింగ్ స్టార్స్ ఆన్లైన్ గేమింగ్ సెక్టర్లో వుమెన్ ఎంటర్ప్రెన్యూర్లు పెరుగుతున్నారు.వీరిలో కొందరు: కీర్తిసింగ్– హిట్ వికెట్(క్రికెట్ స్ట్రాటజీ గేమ్), హర్ష సచ్దేవ–ఫనీయరన్(మనీ గేమింగ్ ప్లాట్‌ఫాం),అర్పిత కపూర్–మెక్ మోకా(మల్టీ ప్లేయర్ సోషల్ గేమింగ్ ప్లాట్‌ఫాం), నేహా పాండే–లీగ్స్ఎక్స్ (ఫాంటసీ ఫుట్‌బాల్ గేమింగ్ ప్లాట్‌ఫాం) సరిలేరు మీకెవ్వరు కథల గురించి ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. మన పురాణాల నుంచి స్ఫూర్తి పొందవచ్చు. ఆ పనే చేసింది ఓగ్రి హెడ్ స్టూడియో. ఓగ్రి వారి ‘అసుర’ బంపర్‌హిట్ అయింది. తాజాగా ఇండియన్ గేమ్ డెవలపింగ్ కంపెనీ ఎన్కోర్, ఫౌజీ(ఫీయర్లెస్ అండ్ యునైటెడ్) అనే యాక్షన్ గేమ్‌ను ప్రకటించింది.మన సైనికుల సత్తా చాటే షూటింగ్ గేమ్ ఇది. ► టెక్...టాక్ apple ipad air 4 టస్క్రీన్ సైజ్: 10.9 అంగుళాలు టరెజల్యూషన్: 2360x1640 పిక్సెల్స్ టస్టోరేజ్: 64జీబి, 256జీబి కలర్స్: సిల్వర్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్, గ్రీన్, స్కై బ్లూ టచ్ ఐడీ సెన్సర్ స్టీరియో స్పీకర్స్ యాపిల్ పెన్సిల్ 2 సపోర్ట్ మ్యాజిక్ కీ బోర్డ్ సపోర్ట్ రిలీజ్: అక్టోబర్ jebjuke bar జెబ్రోనిక్స్ jeb-juke సౌండ్‌బార్ ఇండియాలో లాంచ్ అయింది. మల్టీపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్, సింపుల్ సెటప్‌తో వస్తున్న ఈ సౌండ్‌బార్ శబ్దసౌందర్యాన్ని మరింత దగ్గర చేస్తుంది, 2.1 స్పీకర్ సెటప్ 5.0 బ్లూటూత్, రిమోట్ సౌకర్యం ధర: రూ:17,999 ► గ్యాడ్జెట్ బజార్ పే–పవర్డ్ వాచ్ ప్రముఖ వాచ్ కంపెనీ టైటాన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా ‘టైటాన్ పే’ పేరుతో పే–పవర్డ్ వాచ్‌ని లాంచ్ చేసింది. డెబిట్ కార్డు ఉపయోగించాల్సిన పనిలేకుండానే ‘టైటాన్ పే’ను టాప్ చేసి పాయింట్–ఆఫ్–సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. వాచ్ ‘స్ట్రాప్’లో ఉండే ఎన్ఎఫ్సి (నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్) సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్లకు పరిమితం. పురుషులు(రూ.2,995), స్త్రీలకు(రూ.3,895) వేరు వేరు ధరల్లో ఈ వాచ్‌లను తయారుచేశారు. ► రైడర్ యువర్ హైనెస్... ఇటీవల హార్నెట్ 2.0 లాంచ్ చేసిన హోండా మోటర్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) ఈ నెలాఖరులో తమ బ్రాండ్ న్యూ మోటర్ సైకిల్‌ను లాంచ్ చేయనుంది. ‘యువర్ హైనెస్...గెట్ రెడీ ఫర్ మెజెస్టిక్ లాంచ్’ అంటూ టీజర్ కూడా రిలీజ్ చేసింది. సరికొత్త అప్డెట్స్తో ఇండియన్ మార్కెట్‌కు అనుగుణంగా క్రూయిజర్ స్టైల్లో రాబోతున్న ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ అంటున్నారు. కొత్త బైక్‌కు సంబంధించి అధికారికంగా మాత్రం ఇంకా పూర్తి వివరాలు ప్రకటించలేదు. ► సోషల్ మీడియా ఫేస్బుక్ క్యాంపస్ ఫేస్బుక్ అనేది క్యాంపస్‌లోనే పుట్టిన ఆలోచన. ఎఫ్బీ తన మూలాలను వెదుక్కుంటూ క్యాంపస్‌లోకి వెళుతుంది. ‘ఫేస్బుక్ క్యాంపస్’ పేరుతో తాజాగా కొత్త ఫీచర్‌ను ప్రకటించింది కంపెనీ. క్లాస్మెట్లతో కనెక్ట్ కావడానికి, గ్రూపులలో చేరడానికి, క్యాంపస్ ఈవెంట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, క్యాంపస్ డైరెక్టరీ ద్వారా క్లాస్మెట్లతోనే కాకుండా తమ విద్యాసంస్థలోని ఇతర విద్యార్థులు, మాజీ విద్యార్థులతో స్నేహం చేయడానికి ప్రైవేట్ స్పేస్‌గా ఎఫ్బీ క్యాంపస్ ఉపయోగపడుతుంది. ‘కరోనా ప్రభావంతో చాలామంది విద్యార్థులు క్యాంపస్‌కు రావడం లేదు. ఇప్పుడు క్యాంపస్‌ను కళ్ల ముందుంచడానికి మా ఫీచర్ ఉపయోగపడుతుంది’ అంటుంది ఫేస్బుక్ క్యాంపస్ ప్రొడక్ట్ మెనేజర్ ఛార్మిన్ హంగ్. యంగ్ జెనరేషన్పై ఎఫ్బీ పట్టుకొల్పోతుందని కొన్ని ‘స్టడీ’లు చెబుతున్న నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసుకోవడానికే ‘ఫేస్బుక్ క్యాంపస్’ ఫీచర్‌తో ముందుకు వస్తుందనేది కొందరి అంచనా. అమెరికాలో ప్రస్తుతం 30 విశ్వవిద్యాలయాల్లో ‘పైలట్‌ప్రాజెక్ట్’గా పరీక్షించబడుతున్న ‘ఫేస్బుక్ క్యాంపస్’లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. -
భారత్‌లో రీ ఎంట్రీకి పబ్జీ మాస్టర్ ప్లాన్
భారత్‌లో మరోసారి అడుగుపెట్టేందుకు పబ్జీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. పబ్జీకి అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌లో ఈ యాప్‌ను బ్యాన్ చేయడంతో పబ్జీ డెవలపర్ప్‌ఆర్థికంగా భారీ నష్టాలు చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా స్టేక్ హోల్డర్స్‌కు బై చెప్పి ఇండియన్ గేమింగ్ దిగ్గజంతో చేతులు కలిపితే తమకు పూర్వ వైభవం ఖాయమన్నది వారి అంచనా. ఈ దిశగా చర్చలు కూడా పూర్తయ్యాయని కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. తమ చర్చలు సఫలమైతే భారత్‌లో పబ్జీపై బ్యాన్ లిఫ్ట్ చేస్తారని ‘బ్లూహోల్’గట్టిగా నమ్ముతోంది. చైనా సంస్థలకు భాగస్వామ్యం ఉండడంతోపాటు యూజర్ల డేటా ప్రమాదంలో పడిందని, వీటన్నింటితోపాటు మరికొన్ని కారణాల వల్ల ఈ యాప్‌ను భారత్‌లో బ్యాన్ చేశారని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. మెజారిటీ షేర్ హోల్డర్ ఎవరంటే.. పబ్జీలో ప్రధాన వాటా దక్షిణ కొరియాకు చెందిన ‘బ్లూహోల్ గేమ్స్’ వద్ద ఉంది. చైనాకు చెందిన ‘టెన్సెంట్ గేమ్స్’తో పార్ట్నర్షిప్ టైఅప్ చేసుకున్న ‘బ్లూహోల్’.. ప్రపంచ వ్యాప్తంగా తమ గేమింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. ‘దేశ ప్రయోజనాల’ను కాపాడడంలో భాగంగా దాదాపు వందకు పైగా చైనా యాప్ప్‌ను ఇటీవల భారత్ బ్యాన్ చేసింది. ఇందులో పబ్జీ ప్రధానమైంది. కోట్ల సంఖ్యలో ఇండియన్స్ ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 2019లో భారత్ ద్వారా దాదాపు 100 మిలియన్ డాలర్లు ‘బ్లూహోల్’ ఖాతాలో పడినట్టు తెలుస్తోంది. పబ్జీ మేనేజ్మెంట్ ఆలోచన ఇదే.. చైనాకు చెందిన ‘టెన్సెంట్ గేమ్స్’కు కటీఫ్ చెబితే భారత్‌లో రీ ఎంట్రీ ఇవ్వొచ్చన్నది ‘బ్లూహోల్ గేమ్స్’ ఐడియా. ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా భారత్‌కు చెందిన గేమింగ్ యాప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కొన్ని గేమింగ్ యాప్ డెవలపర్లతో చర్చలు కూడా పూర్తయ్యాయని కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ చర్చలు సఫలమైతే భారత్‌లో పబ్జీపై బ్యాన్ లిఫ్ట్ చేస్తారని ‘బ్లూహోల్’ గట్టిగా నమ్ముతోంది. భారత అధికారులేమంటున్నారంటే.. ‘బ్లూహోల్’ ప్రయత్నాలపై భారత అధికారుల వాదన మరోలా ఉంది. పబ్జీలో చైనా సంస్థలకు భాగస్వామ్యం ఉండడంతోపాటు ఇక్కడి యూజర్ల డేటా ప్రైవసీ ప్రమాదంలో పడిందన్నది వారి అనుమానం. వీటన్నింటితోపాటు మరికొన్ని కారణాల వల్ల ఈ యాప్‌ను భారత్‌లో బ్యాన్ చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ యాప్‌ను బ్యాన్ చేసిన వెంటనే.. డేటా ప్రైసీకి సంబంధించిన తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా పబ్జీ మేనేజ్మెంట్ను భారత్ ప్రభుత్వం కోరిందని.. ఇందుకు మూడు వారాలు గడువిచ్చిందని అధికారులు వివరిస్తున్నారు. ఆ సంస్థకే ఛాన్స్? పబ్జీ వంటి ‘భారీ’ యాప్ప్‌ను మేనేజ్ చేసే సత్తా భారత్‌లో అతికొన్ని సంస్థలకే ఉందని ఇక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పబ్జీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ‘గరేనా ఫ్రీఫైర్’తో ఇప్పటికే టైఅప్ అయిన‘పేటీఎం ఫస్ట్ గేమ్స్’ వంటి ఒకట్రెండు సంస్థలకే ఈ కెపాసిటీ ఉందని చెబుతున్నారు. భారత్‌లో పబ్జీ లైసెన్స్‌ను పొందేందుకు బిగ్ షాట్ రిలయన్స్ ఇప్పటికే రంగంలోకి దిగిందని వార్తలొచ్చినప్పటికీ ఆ సంస్థ వీటిపై నోరు మెదపలేదు.