పోరాటమే ఊపిరిగా..
ట్యాక్టికల్ రోల్ ప్లేయింగ్ గేమ్ ‘యూనికార్న్ వోవర్‌లార్డ్’ మార్చి 8న విడుదల కానుంది. తన జెనోయిరాన్ సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రాజ్యం నుంచి బహిష్కృతుడైన యువరాజు అలైన్ తన మిత్రులను సమీకరించి చేసే పోరాటమే ఈ గేమ్. అలైన్, అతడి బలగాల పోరాటాన్ని గేమ్‌ప్లే ఫాలో అవుతుంది. అన్ని క్యారెక్టర్లు, లొకేషన్‌లు, స్ప్రైట్స్ 2డీ ఆర్ట్‌తో డిస్‌ప్లే అవుతాయి.
జానర్: ట్యాక్టికల్ రోల్–ప్లేయింగ్ మోడ్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్
ప్లాట్‌ఫామ్స్: నిన్‌టెండో స్విచ్/ప్లేస్టేషన్ 4/ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్
అవును...ఇది నిజమే!
‘ది ఫేస్‌బుక్’తో కాలేజీ క్యాంపస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు మార్క్ జుకర్ బర్గ్. ఫేస్‌బుక్ ఎంతోమంది ఇన్వెస్టర్‌ల దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు పాపులర్ అయిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘ఫ్రెండ్ స్టర్’ ఫేస్‌బుక్‌ను కొనుగోలు చేయడానికి ముందుకువచ్చింది. వచ్చిన బంపర్ ఆఫర్‌లను తిరస్కరించడం ద్వారా మరింత సంచలనం సృష్టించాడు జుకర్ బర్గ్. ఫేస్‌బుక్ అమ్మడంపై కాకుండా ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి చేరువ కావాలి’ అంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు.
పెనిషియస్
చెడు ప్రభావం, హాని కలిగిస్తుంది అనే చెప్పే సందర్భంలో వాడే మాట...పెనిషియస్
ఉదా: ది పెనిషియస్ ఎఫెక్స్ట్ ఆఫ్ ఎయిర్ పోల్యూషన్
పెర్ఫిడీ
నమ్మకద్రోహం, మోసం జరిగిన సందర్భంలో వాడే మాట పెర్ఫిడీ
ఉదా: ఇట్ వాజ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిజ్ పెర్ఫిడీ
పెన్యూరీ
కొరత. పేదరికం, వేదన.... మొదలైన సందర్భాలలో ఉపయోగించే మాట పెన్యూరీ.
ఉదా: హీ వాజ్ బ్రాట్ అప్ ఇన్ పెన్యూరీ. విత్‌ఔట్ ఎడ్యుకేషన్
ఇవి చదవండి: ఇంటిప్స్: వీటితో ఇబ్బంది పడ్తున్నారా.. మన్నికకై ఇలా చేయండి!
Comments
Please login to add a commentAdd a comment