Gaming sector
-
సిటీలో.. ఏఐ గేమింగ్ జోన్స్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత తరానికి అనుగుణంగా వస్తున్న నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ ముందంజలో ఉంటుంది. ఇందులో భాగంగానే నగరంలో మొట్టమొదటి ఏఐ–గేమింగ్ జోన్ అడుగుపెట్టింది. దేశంలో ప్రఖ్యాతి చెందిన ప్రముఖ కంప్యూటర్ స్టోర్ విశాల్ పెరిఫెరల్స్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వేదికగా ఏఐ–గేమింగ్ జోన్ మంగళవారం ప్రారంభమైంది. డైరెక్టర్ రాహుల్ మల్హోత్రా, ఇంటెల్ ఇండియా సీనియర్ మేనేజర్ ఛానెల్ డి్రస్టిబ్యూషన్ అరుణ్ రాఘవన్ ఈ సెంటర్‌ను ప్రారంభించారు.ఏ రంగంలోని విద్యార్థులైనా సరే తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు దోహదపడేలా ఈ సెంటర్ రూపొందించడం విశేషం. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కలి్పస్తున్నట్లు, ఏఐ గేమింగ్ జోన్లో సదుపాయాలను వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటింగ్, ఏఐ–గేమింగ్ జోన్లో ప్రోగ్రామింగ్, ఏఐ డెవలప్మెంట్, గేమింగ్ తదితర విభాగాల్లో సేవలు పొందవచ్చు.ఐడీ కార్డులు తప్పనిసరి..నగరంలో ప్రతి విద్యార్థి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ ఏఐ–గేమింగ్ జోన్‌ను ఆవిష్కరించాం. ఈ ఉచిత సేవలు పొందడానికి, అధునాతన టెక్నాలజీ పై అవగాహన పెంచుకోవడానికి విద్యార్థులు తమ ఐడీ కార్డులను వెంట తీసుకురావాలి. ప్రస్తుత టెక్ యుగంలో విద్యార్థులు విజయాలను సాధించేందుకు ఈ ఏఐ–గేమింగ్ జోన్ ఎంతో ఉపయోగపడుతుంది. – విశాల్ పెరిఫెరల్స్, విశాల్ కంప్యూటెక్ డైరెక్టర్ వికాష్ హిసరియాఇవి చదవండి: తెలంగాణకు అలర్ట్.. నేడు ఏడు జిల్లాలో గట్టి వానలు -
Gujarat High Court: మానవ తప్పిద మహావిషాదం
అహ్మదాబాద్: రాజ్‌కోట్‌లో గేమ్‌జోన్‌లో అగి్నప్రమాద ఘటనపై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మానవ తప్పిద మహా విషాదంగా అభివరి్ణంచింది. ఘటనను సూమోటోగా స్వీకరించిన జస్టిస్ బీరెన్ వైష్ణవ్, జస్టిస్ దేవాన్ దేశాయ్‌ల హైకోర్టు ధర్మాసనం ఈ కేసును ఆదివారం విచారించింది. ‘‘ ప్రాథమిక ఆధారాలను చూస్తే ఇది మానవతప్పిదమే స్పష్టంగా తెలుస్తోంది. ఏ చట్టనిబంధనల కింద ఇలాంటి గేమింగ్ జోన్లు, రీక్రియేషనల్ కేంద్రాలను ఏర్పాటుచేశారు?’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ గుజరాత్ కాంప్రిహేన్సివ్ జనరల్ డెవలప్మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్స్(జీడీసీఆర్) నిబంధనల్లో ఉన్న లొసుగులను తెలివిగా వాడుకున్నట్లు తెలుస్తోంది. గేమింగ్ జోన్లు రాజ్కోట్తోపాటు అహ్మదాబాద్, వడోదర, సూరత్‌లలో ఉండటంతో ఆయా నగర మున్సిపల్ కార్పొరేషన్ల తరఫు అడ్వకేట్లు అందర్నీ సోమవారం తమ ఎదుట హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ‘‘ నిరభ్యంతర సరి్టఫికెట్, నిర్మాణ అనుమతులు వంటి వాటి నుంచి తప్పించుకునేందుకు టీఆర్పీ గేమ్‌జోన్ నిర్వాహకులు ఏదో తాత్కాలిక ఏర్పాట్లుచేసి చేతులు దులుపుకుని చిన్నారులు రక్షణను గాలికొదిలేశారు. గేమ్‌జోన్‌లో అనుమతి లేని, మండే స్వభావమున్న పెట్రోల్, ఫైబర్, ఫైబర్ గ్లాస్ïÙట్లను భద్రపరిచిన చోటులోనే అగి్నప్రమాదం జరిగింది’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 15మంది జాడ గల్లంతు ఆదివారం నాటికి మృతుల సంఖ్య 33కు పెరిగింది. మరో 15 మందికిపైగా జనం జాడ తెలీడం లేదని అధికారులు వెల్లడించారు. నానామావా రోడ్‌లోని ఘటనాస్థలిని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదివారం సందర్శించారు. తర్వాత క్షతగాత్రు లను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ‘ ఘటన కారకులందరినీ ఉరితీయాలి. ఏ ఒక్కరికీ బెయిల్ కూడా దొరకొద్దు. బెయిల్ ఇస్తే వారిని నేనే చంపేస్తా’ అని ఏకైక కుమారుడు, నలుగురు బంధువులను పోగొట్టుకున్న ప్రదీప్‌సిన్హ్ చౌహాన్ ఆవేశంగా చెప్పారు. ఇటీవల నిశి్చతార్థమైన ఒక జంట సైతం ప్రమాదంలో అగి్నకి ఆహుతైంది. గేమ్‌జోన్ ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్‌కు ఎలాంటి ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికెట్ లేదని ఎఫ్ఐఆర్లో రాసి ఉంది. -
ఈ–గేమింగ్ కట్టడిపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేసేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడంపై కేంద్ర ఎల్రక్టానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ లా యూనివర్సిటీ, ఈ–గేమింగ్ ఫెడరేషన్ కలిసి పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రతిపాదనలను సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిశ్రమ మెరుగైన నిర్వహణ కోసం నియంత్రణ ఉండక తప్పదని ఎన్ఎల్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాఘవ్ పాండే తెలిపారు. అయితే, ఇటు పరిశ్రమ వృద్ధికి దోహదపడటం, అటు నియంత్రించడం మధ్య సమతౌల్యం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ, ఇతర నియంత్రణ సంస్థలతో సంప్రదింపులతో పాటు నియంత్రించాల్సిన అంశాలపై సమగ్ర అధ్యయనంతోనే తగిన విధానాలను రూపొందించడానికి వీలవుతుందని చెప్పారు. ఆన్లైన్ గేమింగ్‌కి సంబంధించి గేమింగ్ సంస్థలే స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటూ గతంలో చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా డ్రీమ్11, మొబైల్ ప్రీమియర్ లీగ్, డెల్టాటెక్ గేమింగ్, నజారా, గేమ్స్24 గీ7 వంటి పలు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 3 బిలియన్ డాలర్ల మార్కెట్.. ప్రస్తుతం భారత గేమింగ్ మార్కెట్ దాదాపు 3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఇందులో 80 శాతం వాటా రియల్ మనీ ప్లాట్‌ఫాంలదే ఉంటోంది. అమెరికా, బ్రెజిల్‌ను కూడా దాటేసి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద గేమింగ్ మార్కెట్‌గా మారినట్లు గేమింగ్ కంపెనీ విన్జో ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. భారత్‌లో 56.8 కోట్ల మంది గేమర్స్ ఉండగా, 2023లో 950 కోట్ల పైచిలుకు గేమింగ్ యాప్ డౌన్లోడ్స్ నమోదైనట్లు వివరించింది. ఇంతటి భారీ స్థాయిలో విస్తరించిన ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ.. మనీలాండరింగ్ స్కాములు, భారీ పన్నుల భారం మొదలైన సమస్యలతో సతమతమవుతోంది. తమ పరిశ్రమకు నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తే సక్రమంగా నడుస్తున్న వాటికి ఇలాంటి సమస్యలు తగ్గగలవని గేమింగ్ కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో కంపెనీలు కలిసి స్వీయ నియంత్రణ సంస్థలను (ఎస్‌ఆర్‌బీలు) ఏర్పాటు చేసుకోవచ్చంటూ కేంద్రం ప్రతిపాదించింది. అయితే, బడా సంస్థలు సదరు ఎస్‌ఆర్‌బీలను ప్రభావితం చేయడానికి, అవి నిజంగానే స్వతంత్రంగా పని చేయడానికి అవకాశాలు తక్కువగా ఉండొచ్చని భావించి స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటుపై దృష్టి సారించింది. -
అసలు వీటి గురించి మీకు తెలుసా..!
పోరాటమే ఊపిరిగా.. ట్యాక్టికల్ రోల్ ప్లేయింగ్ గేమ్ ‘యూనికార్న్ వోవర్లార్డ్’ మార్చి 8న విడుదల కానుంది. తన జెనోయిరాన్ సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రాజ్యం నుంచి బహిష్కృతుడైన యువరాజు అలైన్ తన మిత్రులను సమీకరించి చేసే పోరాటమే ఈ గేమ్. అలైన్, అతడి బలగాల పోరాటాన్ని గేమ్‌ప్లే ఫాలో అవుతుంది. అన్ని క్యారెక్టర్లు, లొకేషన్లు, స్ప్రైట్స్ 2డీ ఆర్ట్‌తో డిస్ప్లే అవుతాయి. జానర్: ట్యాక్టికల్ రోల్–ప్లేయింగ్ మోడ్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ ప్లాట్‌ఫామ్స్: నిన్టెండో స్విచ్/ప్లేస్టేషన్ 4/ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ అవును...ఇది నిజమే! ‘ది ఫేస్బుక్’తో కాలేజీ క్యాంపస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు మార్క్ జుకర్ బర్గ్. ఫేస్బుక్ ఎంతోమంది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు పాపులర్ అయిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ‘ఫ్రెండ్ స్టర్’ ఫేస్‌బుక్‌ను కొనుగోలు చేయడానికి ముందుకువచ్చింది. వచ్చిన బంపర్ ఆఫర్లను తిరస్కరించడం ద్వారా మరింత సంచలనం సృష్టించాడు జుకర్ బర్గ్. ఫేస్బుక్ అమ్మడంపై కాకుండా ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి చేరువ కావాలి’ అంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. పెనిషియస్ చెడు ప్రభావం, హాని కలిగిస్తుంది అనే చెప్పే సందర్భంలో వాడే మాట...పెనిషియస్ ఉదా: ది పెనిషియస్ ఎఫెక్స్ట్ ఆఫ్ ఎయిర్ పోల్యూషన్ పెర్ఫిడీ నమ్మకద్రోహం, మోసం జరిగిన సందర్భంలో వాడే మాట పెర్ఫిడీ ఉదా: ఇట్ వాజ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిజ్ పెర్ఫిడీ పెన్యూరీ కొరత. పేదరికం, వేదన.... మొదలైన సందర్భాలలో ఉపయోగించే మాట పెన్యూరీ. ఉదా: హీ వాజ్ బ్రాట్ అప్ ఇన్ పెన్యూరీ. విత్ఔట్ ఎడ్యుకేషన్ ఇవి చదవండి: ఇంటిప్స్: వీటితో ఇబ్బంది పడ్తున్నారా.. మన్నికకై ఇలా చేయండి! -
టాప్ గేర్ లో గేమింగ్.. లక్షల్లో ఉద్యోగాలు..
-
India Game Developers Conference: 8 బిలియన్ డాలర్లకు దేశీ గేమింగ్ మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత గేమింగ్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. 2027 నాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 8.6 బిలియన్ డాలర్లకు చేరనుంది. ప్రస్తుతం ఇది 2.6 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. అలాగే, గేమ్స్ ఆడేందుకు చెల్లించే వారి సంఖ్య 12 కోట్లకు చేరింది. గేమర్లు సగటున 20 డాలర్ల చొప్పున చెల్లిస్తున్నారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్ ల్యూమికాయ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) సదస్సులో దీన్ని విడుదల చేశారు. సుమారు 2,250 మంది గేమర్లు, థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్లు, పరిశ్రమ దిగ్గజాలపై సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. గత రెండేళ్లు దేశీ గేమింగ్ సంస్థల్లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయని ల్యూమికాయ్ వ్యవస్థాపక జనరల్ పార్ట్నర్ సలోని సెహ్గల్ తెలిపారు. మూడు సంస్థలు యూనికార్న్‌లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) ఎదిగాయని, ఒక సంస్థ స్టాక్ ఎక్సే్చంజీల్లో కూడా లిస్ట్ అయ్యిందని ఆమె పేర్కొన్నారు. దేశీ గేమింగ్ పరిశ్రమలో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు రాబోతున్నాయని వివరించారు. నవంబర్ 3న ప్రారంభమైన ఐజీడీసీ మూడు రోజుల పాటు 5 వరకూ జరగనుంది. ఇందులో దేశవ్యాప్తంగా పలు గేమింగ్ సంస్థలు, ఔత్సాహికులు పాల్గొంటున్నారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... ► భారత్‌లో గేమర్ల సంఖ్య 50.7 కోట్లు. ఇందులో పెయిడ్ యూజర్ల సంఖ్య దాదాపు 12 కోట్లు. ► 1500 కోట్ల డౌన్లోడ్లతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొబైల్ గేమ్స్‌కు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద వినియోగ దేశంగా భారత్ నిలుస్తోంది. హిట్‌వికెట్ భారీ నిధుల సమీకరణ హైదరాబాదీ గేమింగ్ యాప్ సంస్థ హిట్‌వికెట్ తాజాగా ప్రైమ్ వెంచర్ పార్ట్నర్స్ నుంచి 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. హిట్‌వికెట్ సూపర్‌స్టార్స్ పేరిట మల్టీప్లేయర్ క్రికెట్ స్ట్రాటజీ గేమ్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు కాశ్యప్ రెడ్డి, కీర్తి సింగ్ వెల్లడించారు. గేమింగ్ స్టూడియో, ప్రపంచ స్థాయికి క్రికెటింగ్ అనుభూతిని అందించే గేమ్‌లను తీర్చిదిద్దేందుకు వీటిని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అలాగే హిట్‌వికెట్ సూపర్‌స్టార్స్ పేరిట మల్టీప్లేయర్ క్రికెట్ స్ట్రాటజీ గేమ్‌ను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గేమింగ్ విభాగంలో స్థానిక స్టార్టప్‌లు ముందు వరుసలో ఉండటం సంతోషకరమని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
అతిపెద్ద గేమింగ్ ప్లాట్‌ఫామ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్
భారతదేశపు అతిపెద్ద సోషల్ స్కిల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ విన్జో.. తమ సంస్థ ప్రచారకర్తగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. 75 మిలియన్లకు పైగా గేమర్స్‌ను కలిగిన విన్జో.. తమ వ్యాపార కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ధోనితో చేతులు కలిపినట్లు పేర్కొంది. తమ రాబోయే మల్టీ ఛానల్, మల్టీ మోడల్ మార్కెటింగ్, బ్రాండింగ్ ప్రచారాలలో ధోని భాగం కానున్నాడని తెలిపింది. గేమింగ్ ను అత్యంత ఇష్టపడే వినోద మాధ్యమంగా మార్చడమే తమ సంస్థ ధ్యేయమని, ఇందుకు ధోని ఇమేజ్ తమకు సహకరించనుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. విన్జోతో ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని, నేను కూడా ఓ ఆసక్తిగల గేమర్ కావడంతో సంస్థ విజన్‌తో బాగా కనెక్ట్ అయ్యానని పేర్కొన్నాడు. ఇదే సందర్భంగా విన్జో సహ వ్యవస్థాపకుడు పవన్ నందా మాట్లాడుతూ.. ధోనితో ప్రయాణం చేసేందుకు థ్రిల్‌గా ఉన్నామని, సోషల్ గేమింగ్‌ను వయసు, లింగ బేధంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే తమ లక్ష్యమని తెలిపాడు. కాగా, విన్జో ప్రో కబడ్డీ లీగ్ జట్లైన బెంగాల్ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, పాట్నా పైరేట్స్ తో అసోసియేట్ స్పాన్సర్షిప్ చేస్తోంది. చదవండి: IPL 2022: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కీలక ఆదేశం -
సినిమా థియేటర్స్‌లో బ్యాటిల్ గ్రౌండ్
న్యూఢిల్లీ: గేమ్స్‌కి సంబంధించి లైవ్ టోర్నమెంట్లను థియేటర్లలో వెండి తెరపై ప్రదర్శించే దిశగా ఈ–స్పోర్ట్స్ కంపెనీ నాడ్విన్ గేమింగ్‌తో జట్టు కట్టినట్లు థియేటర్ల చెయిన్ పీవీఆర్ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు ముంబై, గురుగ్రామ్, ఇండోర్ వంటి నాలుగు నగరాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఆఫ్ స్ట్రాటజీ కమల్ జ్ఞాన్చందాని తెలిపారు. సిల్వర్ స్క్రీన్‌పై ఈ మధ్య ప్రాచుర్యం పొందిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) కాంపిటీషన్‌ను ఆయా నగరాల్లోని థియేటర్లలో లైవ్‌గా చూపించనున్నట్లు వివరించారు. గేమర్లు ప్రారంభ రౌండ్లను మొబైల్లో పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని తదుపరి క్వార్టర్, సెమీస్, ఫైనల్స్‌ను సినిమా హాళ్లలో ప్రదర్శిస్తామని కమల్ వివరించారు. అక్టోబరు 7న తొలి రౌండు చాంపియన్‌షిప్ అక్టోబర్ 7న గురుగ్రామ్‌లోని పీవీఆర్ యాంబియన్స్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో ప్లేయర్లు తమ ఫోన్లు లేదా చేతి పరికరాల్లో ఆడే గేమ్‌ను వెండి తెరపై ప్రదర్శిస్తామని .. అదనంగా కామెంటరీ, గ్రాఫిక్స్, చర్చలు వంటి హంగులన్నీ కూడా ఉంటాయని కమల్ పేర్కొన్నారు. పీవీఆర్‌కు భారత్, శ్రీలంకలోని 72 నగరాల్లో 842 స్క్రీన్లు ఉన్నాయి. చదవండి : Netflix: ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..! -
హైదరాబాద్‌లో ‘ఇమేజ్’ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గేమింగ్, వీఎఫ్ఎక్స్, కంప్యూటర్ విజన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల కోసం భారత్‌లో తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ‘ఇమేజ్’ పేరుతో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) దీనిని నెలకొల్పింది. ఈ రంగాల్లో మేధో సంపత్తిపై దృష్టిసారించిన కంపెనీలకు ఇది తొలి ఇంక్యు బేషన్ సెంటర్ కావడం విశేషం. ఎస్టీపీఐ ఫెసిలిటీలో 10,000 చదరపు అడుగుల్లో దీనిని ఏర్పాటు చేశారు. ఏటా 25–30 స్టార్టప్స్‌కు ఇక్కడ అవకాశం కల్పిస్తామని ఎస్టీపీఐ డీజీ ఓంకార్ రాయ్ తెలిపారు. అయిదేళ్ల కాలానికిగాను రూ.19.68 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 28 ఎక్సలెన్స్ కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించామని, ఇప్పటికే ఏడు అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన 21 సెంటర్లు పలు దశల్లో ఉన్నాయని వివరించారు. ఇమేజ్ కేంద్రంలో చోటు కోసం మార్చి 31లోగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన దరఖాస్తుదారులకు రూ.5 లక్షల సీడ్ ఫండ్ ఇస్తారు. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్, హైదరాబాద్ ఏంజిల్స్, హైసియా, ఐఐఐటీ హైదరాబాద్, టై హైదరాబాద్‌తో ఇమేజ్ కేంద్రం అవగాహన ఒప్పందం చేసుకుంది. కాగా, ఎస్టీపీఐ నుంచి ఎగుమతులు 2018–19లో రూ.4,24,000 కోట్లు నమోదైంది. 2019–20లో 10 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు ఓంకార్ రాయ్ తెలిపారు. -
ఇమేజ్ సిటీలో ఏఎండీ భాగస్వామ్యం
- చిప్ తయారీ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ - ఏఎండీ పరిశోధనల్లో రాష్ట్ర విద్యా సంస్థలకు చోటు! - వీఎల్ఎస్ఐ అకాడమీలో భాగస్వామ్యానికి సుముఖత సాక్షి, హైదరాబాద్: గేమింగ్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇమేజ్ సిటీలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రముఖ చిప్ తయారీ సంస్థ అడ్వాన్స్డ్ మైక్రో డివెసైస్ (ఏఎండీ)ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రామారావు కోరారు. అమెరికా సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం సన్నీవేల్‌లోని ఏఎండీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ పేపర్‌మాస్టర్, వైస్ ప్రెసిడెంట్ రూత్ కాటర్‌లతో భేటీ అయ్యారు. గ్రాఫిక్స్, వర్చువల్ రియాలిటీ, గేమింగ్, మాన్యుఫాక్చరింగ్ రంగాలను ఏఎండీ ప్రతినిధులు తమ ప్రాథమ్యంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు, విస్తరణ అవకాశాలతోపాటు.. ఇమేజ్ సిటీ ప్రత్యేకతలను మంత్రి వివరించారు. ప్రాధాన్య రంగాల్లో పరిశోధనలకు ఏఎండీ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని విద్యా సంస్థలను ఇందులో భాగస్వాములను చేయాలని కోరారు. ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ పిలానీ, వరంగల్ ఎన్ఐటీ, బాసర ట్రిపుల్ ఐటీ తదితర విద్యా సంస్థలకు పరిశోధనల్లో చోటు కల్పించాలనే సూచనకు ఏఎండీ సానుకూలంగా స్పందించింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వివరించిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో ఏఎండీ ఉత్పత్తుల తయారీకి ప్రణాళికలు రూపొందించాలని కోరారు. వీఎల్ఎస్ఐ అకాడమీలోభాగస్వామ్యం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (వీఎల్ఎస్ఐ) అకాడమీలో భాగస్వామ్యం వహించేందుకు ఏఎండీ సుముఖత వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తర్వాతి పరిణామాల్లో హైదరాబాద్‌లోని కంపెనీ కార్యకలాపాలు, భవిష్యత్తుపట్ల అనుమానాలను ప్రభుత్వం పటాపంచలు చేసిందని పేర్కొంది. హైదరాబాద్‌పై తమ నమ్మకాలను కాపాడినందుకు ఏఎండీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ పేపర్‌క్రాఫ్ట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ నూతన ఉత్పత్తులు, మార్కెటింగ్ వ్యూహాలను మంత్రి కేటీఆర్‌కు వివరించారు. తమ సంస్థ నూతన ఉత్పత్తి జెన్ చిప్‌ను పూర్తిగా హైదరాబాద్‌లోనే డిజైన్ చేసినట్లు వెల్లడించారు. తమ చిప్ టెక్నాలజీతో బాహుబలి వంటి ప్రముఖ సినిమాలకు గ్రాఫిక్స్ అందించామని.. తెలుగుతోపాటు ఇతర భాషా చిత్రాలకు గ్రాఫిక్స్ విభాగంలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏఎండీ ప్రతినిధులు కేటీఆర్‌కు వెల్లడించారు.