భారతదేశపు అతిపెద్ద సోషల్ స్కిల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ విన్‌జో.. తమ సంస్థ ప్రచారకర్తగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. 75 మిలియన్లకు పైగా గేమర్స్‌ను కలిగిన విన్‌జో.. తమ వ్యాపార కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ధోనితో చేతులు కలిపినట్లు పేర్కొంది. తమ రాబోయే మల్టీ ఛానల్, మల్టీ మోడల్ మార్కెటింగ్, బ్రాండింగ్ ప్రచారాలలో ధోని భాగం కానున్నాడని తెలిపింది. గేమింగ్ ను అత్యంత ఇష్టపడే వినోద మాధ్యమంగా మార్చడమే తమ సంస్థ ధ్యేయమని, ఇందుకు ధోని ఇమేజ్ తమకు సహకరించనుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. విన్‌జోతో ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని, నేను కూడా ఓ ఆసక్తిగల గేమర్ కావడంతో సంస్థ విజన్‌తో బాగా కనెక్ట్ అయ్యానని పేర్కొన్నాడు. ఇదే సందర్భంగా విన్‌జో సహ వ్యవస్థాపకుడు పవన్ నందా మాట్లాడుతూ.. ధోనితో ప్రయాణం చేసేందుకు థ్రిల్‌గా ఉన్నామని, సోషల్ గేమింగ్‌ను వయసు, లింగ బేధంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే తమ లక్ష్యమని తెలిపాడు. కాగా, విన్‌జో ప్రో కబడ్డీ లీగ్ జట్లైన బెంగాల్ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, పాట్నా పైరేట్స్ తో అసోసియేట్ స్పాన్సర్‌షిప్ చేస్తోంది.
చదవండి: IPL 2022: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కీలక ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment