మొదటిసారిగా వినూత్న సాంకేతికతతో విద్యార్థులకు ఉచిత ప్రవేశం
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత తరానికి అనుగుణంగా వస్తున్న నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ ముందంజలో ఉంటుంది. ఇందులో భాగంగానే నగరంలో మొట్టమొదటి ఏఐ–గేమింగ్ జోన్ అడుగుపెట్టింది. దేశంలో ప్రఖ్యాతి చెందిన ప్రముఖ కంప్యూటర్ స్టోర్ విశాల్ పెరిఫెరల్స్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వేదికగా ఏఐ–గేమింగ్ జోన్ మంగళవారం ప్రారంభమైంది. డైరెక్టర్ రాహుల్ మల్హోత్రా, ఇంటెల్ ఇండియా సీనియర్ మేనేజర్ ఛానెల్ డి్రస్టిబ్యూషన్ అరుణ్ రాఘవన్ ఈ సెంటర్‌ను ప్రారంభించారు.
ఏ రంగంలోని విద్యార్థులైనా సరే తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు దోహదపడేలా ఈ సెంటర్ రూపొందించడం విశేషం. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కలి్పస్తున్నట్లు, ఏఐ గేమింగ్ జోన్‌లో సదుపాయాలను వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటింగ్, ఏఐ–గేమింగ్ జోన్‌లో ప్రోగ్రామింగ్, ఏఐ డెవలప్‌మెంట్, గేమింగ్ తదితర విభాగాల్లో సేవలు పొందవచ్చు.
ఐడీ కార్డులు తప్పనిసరి..
నగరంలో ప్రతి విద్యార్థి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ ఏఐ–గేమింగ్ జోన్‌ను ఆవిష్కరించాం. ఈ ఉచిత సేవలు పొందడానికి, అధునాతన టెక్నాలజీ పై అవగాహన పెంచుకోవడానికి విద్యార్థులు తమ ఐడీ కార్డులను వెంట తీసుకురావాలి. ప్రస్తుత టెక్ యుగంలో విద్యార్థులు విజయాలను సాధించేందుకు ఈ ఏఐ–గేమింగ్ జోన్ ఎంతో ఉపయోగపడుతుంది. – విశాల్ పెరిఫెరల్స్, విశాల్ కంప్యూటెక్ డైరెక్టర్ వికాష్ హిసరియా
ఇవి చదవండి: తెలంగాణకు అలర్ట్.. నేడు ఏడు జిల్లాలో గట్టి వానలు
Comments
Please login to add a commentAdd a comment