సరికొత్త బాణీలే.. భవిష్యత్తుకు బాటలు! | Sarigampa Is The 16th Season Of Zee Telugu Show | Sakshi
Sakshi News home page

సరికొత్త బాణీలే.. భవిష్యత్తుకు బాటలు!

Published Thu, Sep 26 2024 11:24 AM | Last Updated on Thu, Sep 26 2024 11:24 AM

Sarigampa Is The 16th Season Of Zee Telugu Show

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి

జీ తెలుగు వేదికగా సరిగమప 16వ సీజన్‌

సాక్షి, సిటీబ్యూరో: సంగీత పరిశ్రమలో సృజనాత్మకతతో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌ సృష్టించేవారు చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సంగీత దర్శకులు కోటి తెలిపారు. జీ తెలుగు వేదికగా ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ షో సరిగమప 16వ సీజన్‌ ఈ నెల 29న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో సరిగమప న్యాయనిర్ణేత కోటి మాట్లాడుతూ.. దాదాపు 5 వేల మందిలో అత్యుత్తమ కళా నైపుణ్యాలున్న 26 మందిని ఎంపిక చేశామన్నారు.

ప్రస్తుతం ఏఐ వంటి మాధ్యమాలు వచ్చి నకిలీ సంగీతాన్ని సృష్టిస్తున్నాయని, ఇలాంటి ఎన్ని సాంకేతికతలు వచ్చినా స్వచ్ఛమైన, సహజమైన సంగీతం ఎప్పుడూ తన ప్రశస్తిని పెంచుకుంటూ పోతుందని అన్నారు. ప్రముఖ లిరిసిస్ట్‌ శ్యామ్‌ క్యాసర్ల ఈ సీజన్‌లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఎంపిక చేసిన మట్టిలో మాణిక్యాలను ప్రముఖ సింగర్లుగా తీర్చిదిద్దేలా సానబెడతామని తెలిపారు. రెండు తరాలకు మధ్య వారధిలా సంగీత, సాహిత్య అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఆయన చెప్పారు. ఈ సీజన్లో విలేజ్‌ వోకల్స్, సిటీక్లాసిక్స్, మెట్రో మెలోడీస్‌ అనే 3 జట్లుగా పోటీలు కొనసాగుతాయని మరో జడ్జి ఎస్పీ శైలజ వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు రువంత్, రమ్య, అనుదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement