రాజ్‌కోట్ గేమ్‌జోన్ దుర్ఘటనపై గుజరాత్ హైకోర్టు వ్యాఖ్య
33కు పెరిగిన మరణాల సంఖ్య
అహ్మదాబాద్: రాజ్‌కోట్‌లో గేమ్‌జోన్‌లో అగి్నప్రమాద ఘటనపై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మానవ తప్పిద మహా విషాదంగా అభివరి్ణంచింది. ఘటనను సూమోటోగా స్వీకరించిన జస్టిస్ బీరెన్ వైష్ణవ్, జస్టిస్ దేవాన్ దేశాయ్‌ల హైకోర్టు ధర్మాసనం ఈ కేసును ఆదివారం విచారించింది.
‘‘ ప్రాథమిక ఆధారాలను చూస్తే ఇది మానవతప్పిదమే స్పష్టంగా తెలుస్తోంది. ఏ చట్టనిబంధనల కింద ఇలాంటి గేమింగ్ జోన్లు, రీక్రియేషనల్ కేంద్రాలను ఏర్పాటుచేశారు?’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
‘‘ గుజరాత్ కాంప్రిహేన్సివ్ జనరల్ డెవలప్‌మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్స్(జీడీసీఆర్) నిబంధనల్లో ఉన్న లొసుగులను తెలివిగా వాడుకున్నట్లు తెలుస్తోంది. గేమింగ్ జోన్లు రాజ్‌కోట్‌తోపాటు అహ్మదాబాద్, వడోదర, సూరత్‌లలో ఉండటంతో ఆయా నగర మున్సిపల్ కార్పొరేషన్ల తరఫు అడ్వకేట్లు అందర్నీ సోమవారం తమ ఎదుట హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ‘‘
నిరభ్యంతర సరి్టఫికెట్, నిర్మాణ అనుమతులు వంటి వాటి నుంచి తప్పించుకునేందుకు టీఆర్‌పీ గేమ్‌జోన్ నిర్వాహకులు ఏదో తాత్కాలిక ఏర్పాట్లుచేసి చేతులు దులుపుకుని చిన్నారులు రక్షణను గాలికొదిలేశారు. గేమ్‌జోన్‌లో అనుమతి లేని, మండే స్వభావమున్న పెట్రోల్, ఫైబర్, ఫైబర్ గ్లాస్ïÙట్లను భద్రపరిచిన చోటులోనే అగి్నప్రమాదం జరిగింది’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
15మంది జాడ గల్లంతు
ఆదివారం నాటికి మృతుల సంఖ్య 33కు పెరిగింది. మరో 15 మందికిపైగా జనం జాడ తెలీడం లేదని అధికారులు వెల్లడించారు. నానామావా రోడ్‌లోని ఘటనాస్థలిని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదివారం సందర్శించారు. తర్వాత క్షతగాత్రు లను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ‘ ఘటన కారకులందరినీ ఉరితీయాలి. ఏ ఒక్కరికీ బెయిల్ కూడా దొరకొద్దు. బెయిల్ ఇస్తే వారిని నేనే చంపేస్తా’ అని ఏకైక కుమారుడు, నలుగురు బంధువులను పోగొట్టుకున్న ప్రదీప్‌సిన్హ్ చౌహాన్ ఆవేశంగా చెప్పారు. ఇటీవల నిశి్చతార్థమైన ఒక జంట సైతం ప్రమాదంలో అగి్నకి ఆహుతైంది. గేమ్‌జోన్ ఉన్న అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు ఎలాంటి ఫైర్ ఎన్‌ఓసీ సర్టిఫికెట్ లేదని ఎఫ్‌ఐఆర్‌లో రాసి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment