Gujarat high court
-
కీలక ఫైళ్ల గల్లంతు.. గుజరాత్ హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్!
న్యూఢిల్లీ: పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ గల్లంతు అయిన వ్యవహారం గుజరాత్ హైకోర్టు(Gujarat High Court)ను కుదిపేస్తోంది. మరోవైపు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్‌ను బదిలీ చేయాల్సిందేనంటూ తోటి జడ్జిలు, అడ్వొకేట్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమర్శల నేపథ్యంలో ఆమెను సెలవులపై వెళ్లగా.. జస్టిస్ అనిరుధ్ వైష్ణవ్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.గుజరాత్ హైకోర్టు పరిధి నుంచి పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ మాయం(Files Missing) కావడంపై జడ్జి సందీప్ భట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది న్యాయవ్యవస్థలోని పారదర్శకతను, నమ్మకాన్ని దెబ్బ తీసే అంశమని ఆందోళన వ్యక్తం చేశారాయన. ఈ క్రమంలో న్యాయ ప్రక్రియలకు సత్వర సంస్కరణలకు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఫైళ్ల మాయంలో హైకోర్టు రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి పాత్రపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఇది ఊహించని పరిణామానికి దారి తీసింది.జస్టిస్ సందీప్ భట్ రోస్టర్‌ను మార్చేస్తూ చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్(Chief Justice Sunitha Agarwal) ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర అభ్యంతరాలకు కారణం కావడం మాత్రమే కాదు పలు అనుమానాలకూ దారి తీసింది. గుజరాత్ హైకోర్టు అడ్వొకేట్ అసోషియేషన్స్ సోమవారం అత్యవసరంగా సమావేశమై చీఫ్ జస్టిస్ నిర్ణయంపై చర్చించాయి. మరోవైపు.. హైకోర్టు జడ్జిలు, లాయర్లు జస్టిస్ సందీప్ భట్‌కు సంఘీభావం ప్రకటించారు. అయితే.. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ ఇలా జడ్జిల విధులకు అడ్డుపడడం ఇదే తొలిసారేం కాదు. ఇంతకు ముందు.. నలుగురు జడ్జిల విషయంలోనూ ఆమె ఇలాగే ప్రవర్తించారు. అలాగే.. న్యాయవాదులతోనూ ఆమె వ్యవహరించే తీరుపైనా తీవ్ర విమర్శలు ఉన్నాయితాజాగా.. మొన్న శుక్రవారం(ఫిబ్రవరి 14)న అక్రమ కట్టడాలకు సంబంధించిన దాఖలైన పిల్‌పై వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆ పిల్‌ను విచారించింది. ఆ టైంలో జీహెచ్సీఏఏ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ బ్రిజేష్ త్రివేదికి చీఫ్ జస్టిస్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వాదనలు పూర్తిగా వినాలంటూ తీవ్ర స్వరంతో ఆయన చీఫ్ జస్టిస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఆమె అవేం పట్టనట్లు గాల్లో చూస్తూ ఉండిపోయారు. దీంతో ఆయన మరోసారి వ్యాఖ్యలు చేయడంతో.. ఆమె మందలించారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. ఈ పరిణామాలన్నింటిని దృష్ట్యా దీంతో ఆమెను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ జడ్జిలు, లాయర్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ అంశంపై మంగళవారం మరోసారి జీహెచ్సీఏఏ జనరల్ బాడీ అత్యవసర సమావేశం నిర్వహించాలనుకుంది. కానీ ఈలోపు.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ సెలవులపై వెళ్లగా.. ఆమె స్థానంలో జస్టిస్ బీరెన్ అనిరుధ్ వైష్ణవ్‌ను తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా నియమించింది. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 2వ తేదీదాకా ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం ఈ నియామకం చేపట్టినట్లు న్యాయ విభాగం(నియామకాల) కేంద్ర సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.ఆ పెద్దావిడ పిటిషన్‌తో..జయశ్రీ జోషి(71) 2020లో రాధాన్పూర్ కోర్టులో ఓ కేసు నమోదు చేసింది. అయితే అందుకు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిందని హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ సందీప్ భట్ బెంచ్ విచారణ జరిపి.. కనిపించకుండా పోయిన ఆ ఫైల్స్ ఆచూకీ కనిపెట్టాలంటూ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో..2024 డిసెంబర్లో ఈ పిటిషన్‌కు సంబంధించి సమగ్రమైన నివేదిక అందించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అప్పుడే.. సూరత్ కోర్టుకు సంబంధించిన 15 కేసుల ఫైల్స్ కనిపించకుండా పోయాయనే విషయం వెలుగు చూసింది. కొసమెరుపు ఏంటంటే.. ఆ టైంలో సంబంధిత అధికారిగా, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి ఉండడం గమనార్హం. సూరత్ కోర్టులో ఆరేళ్లపాటు పని చేసి.. బదిలీ మీద కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం ఫైల్స్ మాయం అయిన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.ఎవరీ సునీతా అగర్వాల్ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జస్టిస్ సునీతా అగర్వాల్.. గతంలో అలహాబాద్ కోర్టులో జడ్జిగా పని చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో మానవ హక్కుల గురించి చర్చ ద్వారా ఆమె వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆహారం పంచుతున్న కొందరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వాళ్లందరినీ విడుదల చేయాలని ఆమె ఆదేశించారు. అంతేకాదు.. యూపీలో పని చేసే చోట్ల లైంగిక వేధింపుల కట్టడికి ఏర్పాటు చేసిన కీలక కమిటీలోనూ ఆమె సభ్యురాలిగా పని చేశారు. -
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు
గాందీనగర్: గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శనివారం బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రంతిజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గజేంద్రసిన్హ్ పర్మార్ 2020 జూలై 30న గాందీనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్‌కు తనను పిలిపించుకున్నారని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకున్నారని దళిత బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత తన ఫోన్‌కాల్స్‌కు ఆయన స్పందించలేదని తెలిపింది. ఓసారి మాత్రం తమ మధ్య సంబంధం విషయం ఎవరికైనా చెబితే కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెడతానంటూ కులం పేరుతో దూషించారని పేర్కొంది. ఈ మేరకు ఆమె అందజేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో, బాధితురాలు 2021లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల తీరును ప్రశ్నించింది. ఎమ్మెల్యేపై వెంటనే అత్యాచారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గాం«దీనగర్ సెక్టార్–21 పోలీస్‌స్టేషన్ పోలీసులు అత్యాచారం, పోక్సో తదితర కేసులు పెట్టారు. -
ప్రభుత్వం నిద్ర పోతుందా? రాజ్‌కోట్ ఘటనపై హైకోర్టు సీరియస్
గాంధీనగర్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందారు. మరో 15 మందిపైగా జనం జాడ తెలీడంలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనను సూమోటోగా స్వీకరించిన గుజరాత్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.‘‘అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ నిద్ర పోతున్నారు? మాకు గుజరాత్ ప్రభుత్వంపై మీద ఏ కోశానా కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ఆసహనం వ్యక్తం చేసింది. ‘‘ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న రెండు గేమింగ్ జోన్లను గత రెండు దశాబ్దాలుగా రాజ్‌కోట్‌లో నిర్వహింస్తున్నారు. వాటి నిర్వహణకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. ఫైర్ సేఫ్టీ అనుమతి పత్రాలు కూడా లేవు. అందుకే గుజరాత్ ప్రభుత్వం పట్ల కొంచం కూడా నమ్మకం లేదు’’ అని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రెండున్నరేళ్ల నుంచి రాజ్‌కోట్ గేమింగ్ జోన్ నడుస్తోంది. ప్రభుత్వం కళ్లు ముసుకుందని మేము అనుకోవాలా? అసలు అధికారులు ఏం చేస్తున్నారు?’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. గేమింగ్ జోన్‌కు సంబంధించిన ఫొటోలను చూపించిన రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కూడా హైకోర్టు మండిపడింది. ‘‘ఈ అధికారులంతా ఎవరూ? అక్కడికి వారంతా ఆడుకోవడానికి వెళ్లారా?’’ అని కోర్టు విమర్శించింది. ‘‘అంతపెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీకు కంటి చూపు పోయిందా? లేదా నిద్రపోతున్నారా? ఇంత జరిగాక మాకు స్థానిక వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయింది’’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.రాజ్‌కోట్‌లోని మనా-మవా ప్రాంతంలో ఉన్న టీఆర్పీ గేమింగ్ జోన్లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ ఘటనలో 33 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గేమింగ్ జోన్లో వెల్డింగ్ పనులు జరగుతున్నాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు. -
Gujarat High Court: మానవ తప్పిద మహావిషాదం
అహ్మదాబాద్: రాజ్‌కోట్‌లో గేమ్‌జోన్‌లో అగి్నప్రమాద ఘటనపై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మానవ తప్పిద మహా విషాదంగా అభివరి్ణంచింది. ఘటనను సూమోటోగా స్వీకరించిన జస్టిస్ బీరెన్ వైష్ణవ్, జస్టిస్ దేవాన్ దేశాయ్‌ల హైకోర్టు ధర్మాసనం ఈ కేసును ఆదివారం విచారించింది. ‘‘ ప్రాథమిక ఆధారాలను చూస్తే ఇది మానవతప్పిదమే స్పష్టంగా తెలుస్తోంది. ఏ చట్టనిబంధనల కింద ఇలాంటి గేమింగ్ జోన్లు, రీక్రియేషనల్ కేంద్రాలను ఏర్పాటుచేశారు?’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ గుజరాత్ కాంప్రిహేన్సివ్ జనరల్ డెవలప్మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్స్(జీడీసీఆర్) నిబంధనల్లో ఉన్న లొసుగులను తెలివిగా వాడుకున్నట్లు తెలుస్తోంది. గేమింగ్ జోన్లు రాజ్కోట్తోపాటు అహ్మదాబాద్, వడోదర, సూరత్‌లలో ఉండటంతో ఆయా నగర మున్సిపల్ కార్పొరేషన్ల తరఫు అడ్వకేట్లు అందర్నీ సోమవారం తమ ఎదుట హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ‘‘ నిరభ్యంతర సరి్టఫికెట్, నిర్మాణ అనుమతులు వంటి వాటి నుంచి తప్పించుకునేందుకు టీఆర్పీ గేమ్‌జోన్ నిర్వాహకులు ఏదో తాత్కాలిక ఏర్పాట్లుచేసి చేతులు దులుపుకుని చిన్నారులు రక్షణను గాలికొదిలేశారు. గేమ్‌జోన్‌లో అనుమతి లేని, మండే స్వభావమున్న పెట్రోల్, ఫైబర్, ఫైబర్ గ్లాస్ïÙట్లను భద్రపరిచిన చోటులోనే అగి్నప్రమాదం జరిగింది’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 15మంది జాడ గల్లంతు ఆదివారం నాటికి మృతుల సంఖ్య 33కు పెరిగింది. మరో 15 మందికిపైగా జనం జాడ తెలీడం లేదని అధికారులు వెల్లడించారు. నానామావా రోడ్‌లోని ఘటనాస్థలిని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదివారం సందర్శించారు. తర్వాత క్షతగాత్రు లను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ‘ ఘటన కారకులందరినీ ఉరితీయాలి. ఏ ఒక్కరికీ బెయిల్ కూడా దొరకొద్దు. బెయిల్ ఇస్తే వారిని నేనే చంపేస్తా’ అని ఏకైక కుమారుడు, నలుగురు బంధువులను పోగొట్టుకున్న ప్రదీప్‌సిన్హ్ చౌహాన్ ఆవేశంగా చెప్పారు. ఇటీవల నిశి్చతార్థమైన ఒక జంట సైతం ప్రమాదంలో అగి్నకి ఆహుతైంది. గేమ్‌జోన్ ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్‌కు ఎలాంటి ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికెట్ లేదని ఎఫ్ఐఆర్లో రాసి ఉంది. -
కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్
అహ్మదాబాద్: ప్రధాని మోదీ డిగ్రీపై వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోదీ డిగ్రీపై దూషణపూర్వక, వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో కేజ్రీవాల్‌కు కింది కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ హస్ముఖ్ సుతార్ నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది. ఇద్దరు నేతలు తమ వాదనలను ట్రయల్ కోర్టు ముందే వినిపించాలని సూచించింది. ప్రధాని డిగ్రీపై తమ వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ యూనివర్సిటీ సెషన్స్‌కోర్టులో కాకుండా మెజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టడాన్ని తొలుత సెషన్స్ కోర్టులో కేజ్రీవాల్ సవాల్ చేశారు. కేజ్రీవాల్ రివిజన్ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తోసిపుచ్చడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు సూచనలతో హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. ఇదీ చదవండి.. కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. కాసేపటికే -
భర్త చేసినా అత్యాచారమే
అహ్మదాబాద్: ‘అత్యాచారం ఎవరు చేసినా అత్యాచారమే. భర్త అత్యాచారానికి పాల్పడినా అది నేరమే’ అని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. మహిళలపై లైంగిక హింస పట్ల నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన అవసరముందని న్యాయమూర్తి జస్టిస్ దివ్యేశ్ జోషి అన్నారు. ఓ మహిళ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోడలి పట్ల క్రూరత్వం, నేరపూరిత ప్రవర్తన కారణంగా పిటిషనర్‌కు బెయిలిచ్చేందుకు నిరాకరించారు. భర్త, కొడుకు కలిసి కోడలిపై అత్యాచారం చేస్తూ వాటిని వీడియోలు తీసి పోర్నోగ్రఫీ సైట్లలో పెట్టి డబ్బు సంపాదిస్తున్నారని తెలిసినా ఆమె మిన్నకుండిపోవడంపై జడ్జి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
పరువు నష్టం కేసులో రాహుల్ శిక్షపై స్టేకు నిరాకరణ.. జడ్జి బదిలీ
న్యూఢిల్లీ: ‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జైలు శిక్షపై స్టే విధించేందుకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు జడ్జిపై బదిలీపై వెళ్లనున్నారు. పై పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లనున్నారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జాబితాలో ఆయన కూడా ఉన్నారు. మెరుగైన న్యాయ నిర్వహణ కోసం జస్టిస్ ప్రచక్ను పాట్నా హైకోర్టుకు పంపుతున్నట్లు కొలీజియం తెలిపింది. గుజరాత్ హైకోర్టు జడ్జి అయిన హేమంత్ ఎమ్ ప్రచక్.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ జూలైలో 123 పేజీల తీర్పు వెల్లడించారు.అంతేగాక 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ బీజేపీ మంత్రి మాయా కొద్నానీ తరుపున వాదించిన న్యాయవాదులలో జస్టిస్ ప్రచ్చక్ ఒకరిగా గతంలో ఉన్నారు. జస్టిస్ ప్రచక్తోపాటు 2002 గోద్రా అల్లర్లకు సంబంధించి హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ బెయిల్ కేసు విచారణ నుంచి తప్పుకున్న గుజరాత్ హైకోర్టు జడ్జి మరో జస్టిస్ సమీర్ దవే.. రాహుల్ గాంధీ జైలు శిక్షను రద్దు చేయాలనే పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ గీతా గోపి కూడా ఉన్నారు.వీరితోపాటు పంజాబ్, హర్యానా హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు నుంచి ఒకరు కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన తొమ్మిది పేర్ల జాబితాలో ఉన్నారు. సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన కొలీజియం ఈనెల 3న సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. మెరుగైన న్యాయం అందించేందుకే బదిలీలు సిఫార్సు చేస్తున్నట్లు కొలీజియం గురువారం పేర్కొంది. చదవండి: మణిపూర్ అంశం.. మోదీపై అమెరికా సింగర్ మిల్ బెన్ కీలక వ్యాఖ్యలు కాగా గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన జస్టిస్ ప్రచక్.. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గుజరాత్ ప్రభుత్వంలో అసిస్టెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో గుజరాత్ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఇక 2021లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మరోవైపు అత్యాచారానికి గురైన మైనర్ బాలిక గర్బం దాల్చగా.. అబార్షన్‌కు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సమీర్ దవే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మనుస్మృతి ప్రకారం చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, 17 ఏళ్లు రాకముందే పిల్లల్ని కనడం ఒకప్పుడు సహజమేనని వ్యాఖ్యానించారు. ‘కావాలంటే మీ అమ్మ.. అమ్మమ్మను అడగండి.. అప్పట్లో వివాహానికి గరిష్ఠ వయసు 14, 15 ఏళ్లే.. 17 ఏళ్లు రాక మునుపే తన తొలి బిడ్డకు జన్మనిచ్చేవారు.. అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందుగానే పెద్దవారు అవుతారు.. మీరు మనుస్మృతి చదవలేదేమో.. ఓసారి చదవండి’ జస్టిస్ దవే అన్నారు. -
సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ‘మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల కేసు’లో ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన అనర్హత వేటుతో ఎంపీ పదవిని సైతం కోల్పోయారు. ఈ శిక్షపై స్టే విధించాలంటూ ఆయన కింది కోర్టులను ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. అందుకే ఆయన సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కర్ణాటక కోలార్‌లో జరిగిన ర్యాలీలో మోదీ అనే పదం ప్రస్తావన తెచ్చి ఇంటి పేరు ఉన్నవాళ్లంతా దొంగలే అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ ఏడాది మార్చి 23వ తేదీన సూరత్ కోర్టు ఈ క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ మరుసటి రోజు అంటే మార్చి 24వ తేదీన ఆయన లోక్‌సభ స్థానంపై అనర్హత వేటు పడింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 బలమైన సెక్షన్ 8 ప్రకారం ఆయనపై వేటు వేసినట్లు లోక్‌సభ కార్యదర్శి ప్రకటించారు. తక్షణం వేటు అమలులోకి వస్తుందని ప్రకటించారు. ► అయితే బెయిల్ దక్కించుకున్న రాహుల్ గాంధీ తన శిక్షపై స్టే విధించడం ద్వారా.. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ► ఈ క్రమంలో సెషన్స్ కోర్టు ఆయనకు శిక్షపై స్టే విధించేందుకు అంగీకరించలేదు. దీంతో గుజరాత్ హైకోర్టుకు వెళ్లారాయన. ► జులై 7వ తేదీన గుజరాత్ హైకోర్టు ఆయన రివ్యూ పిటిషన్‌పై స్పందిస్తూ.. దిగువ కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయడానికి(స్టే విధించడానికి) రాహుల్ గాంధీ చూపించిన కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు. అందరుదైన సందర్భాల్లో మినహా శిక్షపై స్టేవ ఇవ్వడం తప్పనిసరేం కాదు. ఆయనపై ఇప్పటికే 10 కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత కేసులో ఆయనకు కింది కోర్టు శిక్ష విధించడం సరైందే.. అలాగే న్యాయబద్ధమైందే. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నాం అని తీర్పు ఇచ్చింది. ► సెషన్స్ కోర్టు, గుజరాత్ హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. ► ఒకవేళ సుప్రీంకోర్టులోనూ ఆయనకు వ్యతిరేక తీర్పు(ఊరట దక్కకున్నా) వెలువడితే.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడు అవుతారు. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాం«దీకి ఎదురు దెబ్బ తగిలింది. గుజరాత్లో కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ శుక్రవారం తోసిపుచ్చారు. ఆ శిక్షను నిలుపుదల చేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని అన్నారు. ‘‘రాహుల్ గాం«దీపై 10కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పరువు నష్టం కేసులో రాహుల్ గాం«దీకి కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేయడానికి తగిన కారణాలు ఏమీ లేవు’’అని జస్టిస్ హేమంత్ వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు రాహుల్ గాం«దీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. రాహుల్ గొంతు నొక్కేయడానికి కొత్త టెక్నిక్కులు : కాంగ్రెస్ గుజరాత్ హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాహుల్ అన్నీ నిజాలు మాట్లాడుతూ ఉండడంతో ఆయన గొంతు నొక్కేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నిక్కులు ఉపయోగిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. గుజరాత్ హైకోర్టు రాహుల్ పిటిషన్‌ను కొట్టేయడం తీవ్ర అసంతృప్తికి లోను చేసిందని, కానీ తాము ఊహించిన తీర్పే వచి్చందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ బీజేపీ రాజకీయ కుట్రలకు ఎవరూ భయపడడం లేదన్నారు. పార్లమెంటులో రాహుల్ గొంతు నొక్కేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించిన ఖర్గే రాహుల్ గాంధీ న్యాయం కోసం , నిజం కోసం తన పోరాటం కొనసాగిస్తారని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఇలాంటి తీర్పు రావడం పట్ల తమకు ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో గుజరాత్ వంటి రాష్ట్రం నుంచి న్యాయం జరుగుతుందని మేము ఎలా భావిస్తాం. ఈ తీర్పులు రాసేవారు, కోర్టుల్లో పిటిషన్లు వేసేవారంతా ఒక్కటి గుర్తు ఉంచుకోవాలి. రాహుల్ లాంటి నాయకుడిని ఏ తీర్పులు , అనర్హత వేటులు ఆపలేవు’’అని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఏకం చేసే మిషన్ నుంచి రాహుల్‌ని అడ్డుకునే శక్తి దేనికీ లేదన్నారు. పరువు తీయడం కాంగ్రెస్‌కు అలవాటే: బీజేపీ గుజరాత్ హైకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతించింది. ఇతరుల పరువు తీయడం , వారిని దూషించడం కాంగ్రెస్‌కు తరతరాలుగా వస్తున్న ఒక అలవాటేనని ఆరోపించింది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై క్షమాపణ కోరడానికి రాహుల్ నిరాకరించడం ఆయనకున్న అహంకారాన్ని సూచిస్తుందని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రవర్తన ఇలాగే ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. రాహుల్ గాం«దీకి విధించిన శిక్ష అత్యంత కఠినమైనదని అంటున్న వారంతా అంత కఠినమైన నేరాన్ని ఆయన ఎందుకు చేశారో సమాధానం ఇవ్వాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. -
గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
-
గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురయింది. పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వడానికి తగిన కారణాలు కనిపించలేదని హైకోర్టు పేర్కొంది. "దొంగలందరి ఇంటిపేరు మోదీయే" అంటూ వ్యాఖ్యానించిన కేసులో తనకు శిక్ష నిలుపుదల చేయాలని రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించగా, ఈ తీర్పును రాహుల్.. హైకోర్టులో సవాలు చేశారు. మే 2న విచారణ పూర్తి చేసిన గుజరాత్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగానే ఉందన్న జడ్జి.. రాహుల్ పిటిషన్‌ను కొట్టేశారు. సావర్కర్‌ను కించపరిచారని ఆయన మనవడు వేసిన పిటిషన్‌ను ప్రస్తావించిన న్యాయస్థానం.. రాహుల్‌పై 10 పరువు నష్టం కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ.. ‘దొంగలందరి ఇంటిపేరు మోదీయే’ ఎందుకంటూ.. ప్రశ్నించారు. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో రెండోసారి కూడా కాంగ్రెస్సేనా?.. ఆ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది? రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతం వ్యక్తం చేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావావేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ తన వాదనను వినిపించారు. విచారణ అనంతరం కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న ఆయనను దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసులో నేడు గుజరాత్ హైకోర్టు తీర్పు
-
గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్‌కు నిరాశే!
గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్‌కు నిరాశే! -
గుజరాత్ హైకోర్టులో రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. తుది తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు వేసవి సెలవుల అనంతరం(జూన్ 4 తర్వాత) ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. దీంతో పరువు నష్టం కేసులో హైకోర్టు ఆర్డర్ వచ్చే వరకు తన శిక్షపై స్టే విధించాలని రాహుల్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కాగా 2019 కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీ దోషిగా తేలడంతో సూరత్ కోర్టు రేండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అలాగే దీన్ని పైకోర్టులో సవాల్ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇస్తూ అప్పటి వరకు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్‌పై ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. అయితే ట్రయల్ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందంటూ రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అయితే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును.. రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ రాహుల్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ ముంజూరు చేసింది. అనంతరం ఏప్రిల్ 20న రాహుల్ అభ్యర్థనను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇదే కేసులో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గత బుధవారం గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ గీతా గోపి ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవడంతో జస్టిస్ హేమంత్ ప్రచ్చక్‌కి విచారణను అప్పగించారు. చదవండి: నేను రాహుల్ అభిమానిని..కాంగ్రెస్ ర్యాలీలో కన్నడ సూపర్ స్టార్ -
రాహుల్ కేసులో ట్విస్ట్.. బాధ్యతల నుంచి తప్పుకున్న జస్టిస్ గీతా గోపి
అహ్మదాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతల నుంచి జస్టిస్ గీతా గోపి అనూహ్యంగా వైదొలిగారు. ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆమె సూచించారు. దీంతో, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసు విచారణను జస్టిస్ గీతా గోపి ధర్మాసనానికి గుజరాత్ హైకోర్టు కేటాయించింది. కాగా, ఈ కేసు విచారణ నేపథ్యంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తాజాగా జస్టిస్ గీతా గోపి బాధ్యతల తప్పుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆమె సూచించారు. అయితే, బుధవారం రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను ముందుగా విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది పీఎస్ చాపనెరి, జస్టిస్ గీతా గోపి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆమె సూచించినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో పిటిషన్‌పై ఏ ధర్మాసనం విచారణ చేపడుతుందనే దానిపై స్పష్టత వస్తుందని పీఎస్ చాపనెరి తెలిపారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మోదీ ఇంటి పేరుపై చేసిన కామెంట్స్ కారణంగా పరువు నష్టం కేసులో సూరత్‌లోని ట్రయల్ కోర్టు ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో, ట్రయల్ కోర్టు తీర్పును రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. కాగా, రాహుల్ పిటిషన్‌ఫై ఏప్రిల్ 3న విచారణ చేపట్టిన కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 13న ఇరు పక్షాల వాదనలు విని 20న తీర్పు వెలువరించింది. తాజాగా దీనిని సవాల్ చేస్తూ రాహుల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇది కూడా చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం.. ఇక్కడ క్లిక్ చేయండి: అనర్హత వేటు.. రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -
‘మోదీ’ తీర్పు దేశానికే షాక్: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశమంతా షాకైందని ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ విద్యార్హతలపై అనుమానాలను ఈ తీర్పు మరింత పెంచింది. ఆయన నిజంగానే గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల్లో చదివి ఉంటే ఆ విషయాన్ని అవి గర్వంగా చెప్పుకోవాలి. అలాకాకుండా వివరాలు దాచేస్తున్నాయి. మోదీకి నిజంగానే డిగ్రీ ఉంటే దాన్ని గుజరాత్ వర్సిటీ ఎందుకు చూపించడం లేదు? ఇందుకు మోదీ అహంకారమైనా కారణం అయ్యుండాలి. లేదంటే ఆయన సర్టిఫికెట్లు నకిలీవైనా అయ్యుండాలి’’ అని అన్నారు. మోదీ విద్యావంతుడై ఉంటే నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేసేవారు కాదని అభిప్రాయపడ్డారు. మోదీ విద్యార్హతలు కోరినందుకు కేజ్రీవాల్‌కు కోర్టు రూ.25 వేల జరిమానా కూడా విధించడం తెలిసిందే. -
నాలుగు హైకోర్టులకు సీజేలు
న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు హైకోర్టులకు నూతనంగా ప్రధాన న్యాయమూర్తు(సీజే)లు నియమితులయ్యారు. వీరిలో ఇద్దరు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనుండటం గమనార్హం. గుజరాత్ హైకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ సోనియా గిరిధర్ గోకానీని అదే హైకోర్టు సీజేగా నియమించారు. అదేవిధంగా, ఒరిస్సా హైకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి జస్టిస్ జస్వంత్ సింగ్ త్రిపుర హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. ఈయన ఈ నెల 22న రిటైర్ కానున్నారు. ఇంతకుముందు జస్టిస్ సింగ్‌ను ఒరిస్సా హైకోర్టు సీజేగా నియమించాలంటూ చేసిన సిఫారసును కొలీజియం ఆతర్వాత ఉపసంహరించుకుంది. రాజస్తాన్ హైకోర్టుకు చెందిన జడ్జి జస్టిస్ సందీప్ మెహతాను గౌహతి హైకోర్టు సీజేగా నియమించారు. గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ జమ్మూకశ్మీర్ అండ్ లద్దాఖ్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. తాజా నియామకాలను న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆదివారం ట్విట్టర్లో ప్రకటించారు. కాగా, జస్టిస్ గోకానీ బాధ్యతలు స్వీకరించాక దేశంలో ఉన్న 25 హైకోర్టుల్లో ఏకైక మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. గుజరాత్ జ్యుడిషియల్ సర్వీస్ నుంచి వచ్చిన ఈమెకు 62 ఏళ్లు నిండటంతో ఫిబ్రవరి 25న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ సబీనా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్నారు. గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జస్టిస్ గోకానీని తక్షణమే నియమించాలంటూ గత వారం కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇలా ఉండగా, రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమితులైన జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. -
మోరల్ పోలీసింగ్ వద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: పోలీసు అధికారులు మోరల్ పోలీసింగ్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితుల నుంచి వస్తు తదితర రూపేణా ప్రతిఫలాలు ఆశించడం, డిమాండ్ చేయడం తగదంటూ హితవు పలికింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జె.కె.మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. సంతోష్ కుమార్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగిస్తూ క్షమశిక్షణ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. సంతోష్ 2001 అక్టోబర్ 26న అర్ధరాత్రి వడోదరలో నైట్ డ్యూటీ సందర్భంగా నిశ్చితార్థమైన ఓ జంట రోడ్డుపై వెళ్తుండగా ఆపి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలొచ్చాయి. తనకు కాబోయే భార్యతో కాసేపు గడుపుతానంటూ వెకిలిగా ప్రవర్తించాడని బాధితుడు మర్నాడు ఫిర్యాదు చేశాడు. అది నిజమని విచారణలో తేలడంతో అతన్ని డిస్మిస్ చేశారు. అతడు హైకోర్టులో సవాలు చేయగా, విధుల్లోకి తీసుకోవడంతో పాటు డిస్మిస్ కాలానికి 50 శాతం వేతనమివ్వాలని 2014లో కోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘దోషి తీవ్ర నేరానికి పాల్పడ్డాడు. ఇంతా చేస్తే అతను లా అండ్ ఆర్డర్ పోలీస్ కాదు. వాళ్లయినా సరే, ఇలా మోరల్ పోలీసింగ్‌కు దిగకూడదు. భౌతిక తదితర ప్రతిఫలాలు డిమాండ్ చేయకూడదు’’ అని స్పష్టం చేసింది. -
తెలివి ప్రదర్శిస్తున్నారా?.. మోర్బీ విషాదంపై కోర్టు సీరియస్
అహ్మదాబాద్: గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై మంగళవారం సుమోటోగా విచారణ చేపట్టిన గుజరాత్ హైకోర్టు.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రమాద ఘటనపై నేరుగా తమకు కొన్ని సమాధానాలు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. బ్రిడ్జి పునరుద్దరణ కాంట్రాక్ట్‌ను ఒవేరా కంపెనీకి కట్టబెట్టిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మోర్బీ మున్సిపాలిటీ.. అజంతా బ్రాండ్ వాల్ క్లాక్‌లు తయారు చేసే ఒరేవా గ్రూప్‌నకు 15 ఏళ్లపాటు వేలాడే వంతెన కాంట్రాక్ట్‌ను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ‘‘పబ్లిక్ బ్రిడ్జి మరమ్మతు పనులకు టెండర్ ఎందుకు వేయలేదని, అసలెందుకు టెండర్లను ఆహ్వానించలేదు? అని ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్, గుజరాత్ చీఫ్ సెక్రెటరీని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వ విభాగమైన మున్సిపాలిటీ(మోర్బీ మున్సిపాలిటీ).. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగానే 135 మంది మరణించారు. అసలు ఈ ఒప్పందం.. 1963 గుజరాత్ మున్సిపాలిటీస్ చట్టానికి లోబడి ఇదంతా జరిగిందా?’’ అని గుజరాత్ హైకోర్టు ప్రాథమిక పరిశీలన ఆధారంగా వ్యాఖ్యానించింది. గుజరాత్ హైకోర్టు మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశ్‌తోష్ శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆరు ప్రభుత్వ విభాగాల నుంచి వివరణ కోరింది ధర్మాసనం. అయితే.. మోర్బీ మున్సిపాలిటీ తరపు ప్రతినిధులెవరూ ఈ విచారణకు హాజరు కాలేదు. ఇక నోటీసులు అందుకున్నప్పటికీ రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బెంచ్. తెలివి ప్రదర్శిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంతెన పునఃప్రారంభానికి ముందు దాని ఫిట్‌నెస్‌ని ధృవీకరించడానికి ఏదైనా షరతు ఒప్పందంలో భాగమేనా?, అసలు ధృవీకరించడానికి బాధ్యత వహించే వ్యక్తి ఎవరు అనే దానిపై సమాధానాలతో తిరిగి రావాలని అధికారులను గట్టిగా మందలించింది. అసలు అంత ముఖ్యమైన పనికి సంబంధించిన కీలకమైన ఒప్పందం.. కేవలం ఒకటిన్నర పేజీలతో ఎలా పూర్తి చేశారు? అని సీజే, సీఎస్‌ను నిలదీశారు. కాంట్రాక్ట్ పత్రాల ఫైల్స్‌ను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదీ చదవండి: బలవంతపు మతమార్పిళ్లు... దేశభద్రతకే పెనుసవాలు! -
‘ఇన్‌స్టా’ ప్రేమ టు హెబియస్ పిటిషన్!
సాక్షి, హైదరాబాద్: కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన యువతికి ఆన్లైన్ ట్యూటోరియల్ ప్రోగ్రాం ద్వారా అహ్మదాబాద్ వాసితో పరిచయం ఏర్పడింది. ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా పరిచయం పెరిగి ప్రేమగా మారింది. అప్పటికే వివాహితుడైనప్పటికీ అతను ఆ విషయం దాచి సదరు యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె వెనక్కు వచ్చేయడంతో సైబర్ వేధింపులకు దిగాడు. దీంతో అతడిపై హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు అహ్మదాబాద్‌లోని వెజల్పూర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అతగాడు అరెస్టులు తప్పించుకోవడానికి గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. రెండు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగరం నుంచి న్యాయమూర్తితో మాట్లాడిన యువతి అసలు విషయం వివరించింది. నగరానికి వచ్చి యువతిని తీసుకెళ్లి.. అహ్మదాబాద్‌కు చెందిన ముసద్ధిఖ్ సోన్యావాలాకు (30) అతడి సోదరి నిర్వహించే ఆన్లైన్ ట్యుటోరియల్ ప్రోగ్రామ్ ద్వారా కిషన్‌బాగ్‌కు చెందిన యువతితో (18) పరిచయమైంది. ఆపై ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చాటింగ్ చేసుకున్న వీళ్లు ప్రేమికులయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో నగరానికి వచ్చిన ముసద్ధిఖ్ ఆమెను తీసుకెళ్లి అహ్మదాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. యువతి అదృశ్యమైనట్లు భావించిన ఆమె తల్లిదండ్రులు గాలింపు చేపట్టి అసలు విషయం తెలుసుకున్నారు. స్థానిక పోలీసులతో కలిసి అహ్మదాబాద్ వెళ్లినప్పటికీ ఆమెను తమ వెంట తీసుకురాలేకపోయారు. ఆమె వెనక్కు రావడంతో వేధింపులు... ముసద్ధిఖ్ తనను రెండో పెళ్లి చేసుకున్నాడని యువతికి తెలిసింది. భార్యతో సన్నిహితంగా ఉండగా సెల్ఫోన్లో రికార్డు చేసుకోవడం అతడి బలహీనతగా గుర్తించింది. దీంతో విసుగు చెందిన ఆమె ఈ ఏడాది మార్చిలో తిరిగి వచ్చేసింది. విచక్షణ కోల్పోయిన ముసద్ధిఖ్ తన వద్ద ఉన్న ‘వీడియోలు’ లీక్ చేసి ఆమెను వేధించాడు. యువతితో సన్నిహితంగా ఉండగా చిత్రీకరించిన 12 వీడియోలు, ఫొటోలను ఆమెకే పంపిస్తూ ‘సెక్స్ యాద్ రఖ్నా’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కంగుతిన్న బాధితురాలు మార్చిలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ముసద్ధిఖ్పై కేసు నమోదైంది. అహ్మదాబాద్ వెళ్లిన యువతి కుటుంబీకులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి అతడి సెల్‌ఫోన్‌ను వారి ఆధీనంలోకి చేర్చారు. అక్కడి ఠాణాలో మరో ఫిర్యాదు... బాధితురాలు అక్కడి వెజల్పూర్ ఠాణాలోనూ భర్త వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే నిందితుడు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అరెస్టు తప్పించుకోవడానికి ఇటీవల తన న్యాయవాది ద్వారా గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. హైదరాబాద్ వెళ్లి కనిపించకుండా పోయిన తన భార్యను వెతికి అప్పగించాలని కోరాడు. దీంతో అహ్మదాబాద్ వెళ్లిన యువతి కుటుంబీకులు న్యాయవాది ద్వారా కౌంటర్ దాఖలు చేశారు. కేసును పక్కదారి పట్టించడానికే అతను ఈ పిటిషన్ దాఖలు చేయించాడని ఆరోపిస్తూ పూర్వాపరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘ఉగ్ర’ కోణమూ వెలుగులోకి... గుజరాత్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన యువతి కుటుంబీకులు ‘ఉగ్ర కోణాన్నీ’ బయటపెట్టారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో పరారీలో ఉన్న ముఫ్తీ సూఫియాన్‌కు ముసద్ధిఖ్ సమీప బంధువని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా విదేశాల్లో తలదాచుకున్న సూఫియాన్ సహాయంతో ఇతగాడూ దేశం దాటిపోయే ప్రమాదం ఉందని, అలా జరగకుండా నిరోధించాలంటూ కోర్టును కోరారు. అతడిపై ఉన్న కేసు విచారణ తప్పించుకోవడానికే హెబియస్ పిటిషన్ వేశాడని నివేదించారు. 2003 మార్చి 26న అహ్మదాబాద్‌లో జరిగిన హరేన్ పాండ్య హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిలో హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. అప్పట్లో అక్కడి పోలీసులు నగరానికి వచ్చి నిందితులను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. బాధితురాలి వాంగ్మూలం.. వెజల్పూర్ పోలీసులు సైతం హైకోర్టుకు సమాధానం ఇస్తూ నిందితుడి ఫోన్ నుంచి 3200 ఫైల్స్ కాపీ చేశామని, వీటిలో అత్యధికం తన భార్యలతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలేనంటూ నివేదించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఆ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అమిత్ వసావను ఆదేశించింది. రెండు రోజుల క్రితం నగరం నుంచి సదరు యువతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ హైకోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. ఇందులో తనకు జరిగిన అన్యాయాన్ని, వాస్తవాలను వివరించింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. (చదవండి: వెంబడించి లైంగిక దాడి.. చెప్తే చంపేస్తా.. భర్తకు ఆలస్యంగా తెలియడంతో) -
క్రిమినల్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్‌కు ఊరట
Gujarat HC Relief To Shah Rukh Khan Over Criminal Case: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు గుజరాత్ హైకోర్టు ఊరట ఇచ్చింది. షారుక్ ‘రయీస్’ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో మృతుడు కుటుంబ సభ్యులు వడోదర కోర్టులో షారుక్‌పై కేసు నమోదు చేశారు. అయితే తనపై ఉన్న క్రిమినల్ కేసు, దిగువ కోర్టు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ షారుక్ ఇటీవల గుజరాత్ హైకోర్టులో పటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌పై బుధవారం(ఏప్రిల్ 27న) విచారణ చేపట్టిన గుజరాత్ హైకోర్టు ఈ కేసును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటనతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తి షారుక్ ఖాన్‌పై ఫిర్యాదు చేశారని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. చదవండి: గుండెపోటుతో ప్రముఖ సీనియర్ నటుడు మృతి షారుక్ తన మూవీ ప్రమోషన్లో భాగంగానే అలా చేశాడని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టమవుతోందని పేర్కొంటూ హైకోర్టు షారుక్‌పై ఈకేసును ఎత్తివేసింది. వివరాలు.. షారుక్ 2017లో నటించిన రయీస్ సినిమా ప్రమోషన్ భాగంగా వడోదర రైల్వేస్టేషన్ సమీపంలో షారుక్ ఆకస్మాత్తుగా పర్యటించాడు. దీంతో అతడిని చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఫర్హీద్ ఖాన్ పఠాన్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అంతేకాదు మరికొందరు గాయపడ్డారు. దీంతో జితేంద్ర సోలంకి అనే వ్యక్తి షారుఖ్‌పై మొదట స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చదవండి: హీరోల మధ్య ట్వీట్ల వార్, బాలీవుడ్ స్టార్స్‌పై వర్మ సంచలన కామెంట్స్ అయితే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో షారుఖ్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సోలంకి వడోదర కోర్టును ఆశ్రయించాడు. షారుఖ్ అభిమానులను ఉత్సాహపరచడానికి స్మైలీ బాల్స్‌ను విసరడం, టీషర్ట్స్ విసరడం నేరపూరిత నిర్లక్ష్యమని ఆరోపించాడు. అదే ఈ తొక్కిసలాటకు, అందులో ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైందని పేర్కొన్నాడు. దీంతో వడోదర కోర్టు షారుక్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి సమన్లు ఇచ్చింది. దీంతో తనపై ఉన్న క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ షారుఖ్ గుజరాత్ హైకోర్టు జస్టిస్ నిఖిల్ కరీల్ను విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27న షారుక్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి అతడికి అనుకూలంగా తుది తీర్పును వెలువరించారు. -
కోకాకోలా రాథోడ్.. ఎస్సైకి ఊహించని షాక్
కోర్టు ప్రొసీడింగ్స్ అనేవి.. సినిమాల్లో చూపించినట్లు కాదు. చాలా సున్నితంగా.. హుందాగా ఉంటాయి. వాదనలు వింటూనే న్యాయమూర్తులు ప్రతీ విషయాన్ని గమనిస్తుంటారు కూడా. అయితే అది తెలియని ఓ ఎస్సై.. అడ్డంగా బుక్కై మూల్యం చెల్లించుకున్నాడు. తాజాగా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్‌తో ప్రస్తుతం ఇంకా వర్చువల్ వాదనలే నడుస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ హైకోర్టులో ఓ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగా.. ఎస్సై ఏఎం రాథోడ్ కూల్‌గా కోకా కోలా టిన్ను కూల్‌గా సిప్ చేస్తూ ఉన్నారు. అది గమనించిన గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్.. వెంటనే అదనపు గవర్నమెంట్ ప్లీడర్ డీఎం దేవ్నానితో ‘వీడియో కాన్ఫరెన్స్‌లో మిస్టర్ రాథోడ్ కూల్ డ్రింక్ తాగుతున్నారా ఏంటి?’ అని ప్రశ్నించారు. దీనికి ఏజీపీ వెంటనే క్షమాపణలు తెలియజేశాడు. అయినా సీజే శాంతించలేదు. ‘ఇదేం మీ ఆఫీస్ కాదంటూ..’ ఎస్సై రాథోడ్‌ను సున్నితంగా మందలించింది కోర్టు. అంతేకాదు కోకాకోలా తాగినందుకు శిక్షగా.. వంద కోకాకోలా టిన్లను బార్ అసోషియేషన్ సభ్యులకు పంచాలని సీజే అరవింద్ కుమార్, జస్టిస్ అశ్‌తోష్ శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం ఆ ఎస్సైని ఆదేశించింది. లేకుంటే క్రమశిక్షణ ఉల్లంఘనల కింద శిక్ష తప్పదని హెచ్చరించింది. ‘‘మిస్టర్ కోకా కోలా రాథోడ్.. మీరొక్కరే తాగడానికి వీల్లేదు. సాయంత్రం కల్లా బార్ మెంబర్స్ అందరికీ కోకా కోలాను అందించండి’’ అంటూ ఆదేశించింది. దీంతో సదరు ఎస్సై మంగళవారం సాయంత్రమే ఆ ఆదేశాల్ని పాటించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఇద్దరు మహిళల్ని రాథోడ్, తోటి సిబ్బంది కలిసి చితకబాదారనే పిటిషన్ మీద వాదనల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గతంలో వర్చువల్ వాదనల సందర్భంగా ఓ అడ్వొకేట్ సమోసా తింటూ కనిపించగా.. ‘ఇలాంటివి చూసి ఇతరులకు కూడా తినాలని అనిపించదా? నోరురదా? ఇతరులకు ఇవ్వకుండా మీరొక్కరే తింటారా?’’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ..అందరికీ సమోసాలు పంచాలంటూ సదరు న్యాయవాదిని ఆదేశించింది. తాజా ఘటన నేపథ్యంలో.. సమోసా ఘటనను మరోసారి గుర్తు చేశారు సీజే. -
హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు
సూరత్: నాలుగేళ్లు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అరెస్టయిన వ్యక్తికి 30 రోజుల్లోనే శిక్ష విధించింది గుజరాత్ కోర్టు. అతను దోషిగా తేలడంతో జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని ట్రయల్ కోర్టు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే .. అజయ్ నిషద్ అనే వ్యక్తి.. అక్టోబర్ 12న సూరత్‌లోని సచిన్ డీఐడీసీ ప్రాంతంలో తన ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారికి మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ఆ బాలికను హత్యచేసి ఎవరూ లేని ప్రదేశంలో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు లో నిషద్ దోషిగా తేలడంతో అతన్ని అక్టోబర్ 13న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిపై పది రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుని ప్రత్యేక కోర్టు అక్టోబర్ 25న విచారణను ప్రారంభించి ఐదు రోజుల్లోనే ముగించింది. దోషికి జీవిత ఖైదుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి పీఎస్ కాలా గురువారం తీర్పునిచ్చారు. కాగా గుజరాత్‌లోని ట్రయల్ కోర్టు ఇంత తక్కువ వ్యవధిలో తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. చదవండి: karnataka: బస్సులో ఫుల్ సౌండ్‌తో పాటలు వింటున్నారా.. ఇకపై జాగ్రత్త! -
వీర్యం కావాలని కోర్టుకెక్కిన భార్య.. సేకరించిన కాసేపటికే భర్త మృతి
అహ్మదాబాద్: కరోనా సోకి చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం కావాలని కోర్టుకెక్కిన భార్య వార్త గుర్తుందా? అయితే, కోర్టు అనుమతితో వీర్యం సేకరించిన కొద్ది గంటల్లోనే అతను ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని మృతుడి భార్య తరపు న్యాయవాది తెలిపారు. ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలను కంటానని ఆ మహిళ తెలపగా, ఆ విధానానికి అనుమతి ఇవ్వడంపై తదుపరి విచారణను శుక్రవారం జరగాల్సి ఉంది. వివరాల ప్రకారం.. కోర్టు అనుమతి పొందాక ఆస్పత్రి సిబ్బంది తన క్లయింట్ భర్త వీర్యాన్ని సేకరించారని, అనంతరం అతడు గురువారం కన్నుమూశారని మహిళ తరఫు న్యాయవాది చెప్పారు. కాగా గుజరాత్‌కు చెందిన దంపతులకు సంతానం లేదు. ఇటీవల సదరు మహిళ భర్త కరోనా కారణంగా పలు అవయవాలు దెబ్బతిని స్టిర్లింగ్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి పరిస్థితి క్షీణిస్తోందని వైద్యులు తెలపడంతో, తన భర్త ప్రతిరూపాన్నైనా చూసుకునేందుకు వీలుగా బిడ్డను కంటానని, అందుకు భర్త వీర్యం కావాలని ఆమె కోరింది. అయితే ఐవీఎఫ్ కోసం అతని స్పెర్మ్ సేకరించాలని, అందుకు కోర్టు అనుమతి ఉండాలని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేసింది. ఈ క్రమంలో సదరు మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, తన భర్త బతికే అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయని పిటిషన్లో విన్నవించింది. ఈ నేపథ్యంలో.. సదరు కరోనా రోగి ఆరోగ్య పరిస్థితిని, మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని వీర్య సేకరణకు కోర్టు అత్యవసర అనుమతులు జారీ చేసింది. కానీ, వీర్యం సేకరించిన కొన్ని గంటల్లోనే అతడు మృతిచెందడం విషాదకరం. -
న్యాయ వ్యవస్థలో సుపరిపాలన పునాదులు
అహ్మదాబాద్: ప్రజల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడంలో భారత న్యాయవ్యవస్థ తనవంతు కర్తవ్యాన్ని భేషుగ్గా నిర్వర్తిస్తోందని, భారత రాజ్యాంగాన్ని ఇది బలోపేతం చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకల్లో మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. కరోనా వైరస్ సంక్షోభంలో భారత న్యాయస్థానాలు ఉత్తమ పనితీరు కనపర్చాయన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అధికంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలు చేపట్టిందని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్ న్యాయవ్యవస్థ అవసరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు మోదీ చెప్పారు. గుజరాత్ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా మోదీ తపాలా బిళ్లను విడుదల చేశారు. ప్రత్యక్ష ప్రసారాల ఆరంభం.. కోవిడ్ సందర్భంలో ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిగా ప్రారంభించింది గుజరాత్ హైకోర్టేనని మోదీ చెప్పారు. ‘దేశంలో 18,000 పైగా కోర్టులు కంప్యూటీకరించబడ్డాయి. వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ కాన్ఫరెన్సింగ్‌లకు సుప్రీంకోర్టు అనుమతించడంతో దేశంలోని అన్ని కోర్టుల్లో ఆన్లైన్ విచారణలు సాధ్యమయ్యాయి’ అని మోదీ అన్నారు. డిజిటల్ విభజనను తగ్గించడానికి హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో కూడా ఈ సేవా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు మోదీ చెప్పారు. దేశంలో తొలి లోక్ అదాలత్ గుజరాత్‌లోని జునాగఢలో నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైందని మోదీ తెలిపారు. -
కరోనా ఎఫెక్ట్: హైకోర్టు మూసివేత
అహ్మదాబాద్: కరోనా ఎఫెక్ట్‌తో గుజరాత్ హైకోర్టు మూతపడింది. కోర్టులో పనిచేసే ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కోర్టు ఆవరణను శానిటైజ్ చేసేందుకు బుధవారం నుంచి శుక్రవారం వరకు కోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. కాగా.. ఈ మూడు రోజుల్లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జ్యూడిషియల్ అకాడమీ, ఆడిటోరియంతో పాటు చాంబర్లు, కార్యాలయాలు, రికార్డ్ రూమ్‌లు అన్నీ శుభ్రం చేయనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు హైకోర్ట్ న్యాయవాదుల విధులను సస్పెండ్ చేస్తున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. చదవండి: కరోనా: పరిస్థితులు చేజారిపోయాయా..! -
ఆ అక్కాచెల్లెళ్లు.. నిత్యానంద ‘కైలాస’లో
అహ్మదాబాద్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆశ్రమంలో చేరి కనిపించకుండా పోయిన అక్కాచెల్లెళ్లు ప్రస్తుతం.. ‘‘కైలాస’’లో ఉన్నట్లు తెలిసిందని గుజరాత్ పోలీసులు వెల్లడించారు. భారత- కరేబియన్ సంస్కృతుల మేళవింపుతో కూడిన ‘చట్నీ మ్యూజిక్’ అనే కళను అభ్యసిస్తూ.. వారిద్దరు అక్కడ ప్రదర్శనలు కూడా ఇస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. అదే విధంగా కరేబియన్ దీవుల్లో నిత్యానంద కొనుగోలు చేసిన ‘కైలాస’ నిర్వహణ బాధ్యతల్లో కూడా పాలుపంచుకుంటున్నట్లు తెలిసిందన్నారు. కాగా కర్ణాటకకు చెందిన జనార్థన శర్మ కూతుళ్లే ఈ అక్కాచెల్లెళ్లు. శర్మకు నలుగురు కూతుళ్లు ఉండగా.. 2013లో వీరిని నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యా సంస్థలో చేర్పించారు.(నిత్యానంద దేశం.. కైలాస!) ఈ క్రమంలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే వారిని 2019లో అహ్మదాబాద్‌లో ఉన్న యోగిని సర్వజ్ఞాన పీఠానికి పంపించారు. విషయం తెలుసుకున్న శర్మ దంపతులు.. అహ్మదాబాద్ ఆశ్రమానికి వెళ్లగా నిర్వాహకులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించిన బాధితులు.. వారి సాయంతో లోపల ప్రవేశించి తమ ఇద్దరు మైనర్ కూతుళ్లను ఇంటికి తీసుకురాగా.. మేజర్లైన మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ(21), నందిత(18) వారితో వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో బెదిరింపులకు లొంగి ఆశ్రమంలో ఉండిపోయిన.. తమ ఇద్దరు కూతుళ్లను అప్పగించాలని కోరుతూ శర్మ దంపతులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నిత్యానంద వారిని విదేశాలకు తీసుకువెళ్లినట్లు తాజా సమాచారం ద్వారా వెల్లడైంది.(నిత్యానందకు నోటీసులపై వింత జవాబు) ఈ విషయం గురించి ఓ పోలీసు ఉన్నతాధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘నిత్యానందకు వ్యతిరేకంగా ఇంతవరకు మేము రెడ్ కార్నర్ నోటీసు పొందలేకపోయాం. ఇప్పుడు వాళ్లు ఒకవేళ కైలాసలో ఉన్న విషయం నిజమే అయినా.. వారిని ఎలా వెనక్కి తీసుకురావాలో అర్థం కావడంలేదు. అప్పగింత ఒప్పందం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భావించినా.. ఏ దేశంతో ఈ మేరకు సంప్రదింపులు జరపాలో అన్న విషయంపై స్పష్టత లేదు’’అని వాపోయారు. కాగా ఆధ్మాత్మికత ముసుగులో మహిళలపై అకృత్యాలకు పాల్పడిన నిత్యానంద దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించాడు. అంతేగాక తన దేశానికి ఒక పాస్‌పోర్ట్, జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసినట్లు పేర్కొన్నాడు. అదే విధంగా ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేసి పాలన చేస్తున్నట్లు వెల్లడించాడు. -
చిన్నారి హత్య కేసు; దోషికి మరణశిక్ష
గాంధీనగర్: సూరత్‌లో మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గుడికి గుజరాత్ హైకోర్టు మరణశిక్ష విధించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడు అనిల్ యాదవ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. బిహర్‌కు చెందిన అతడు సూరత్‌లో నివాసం ఉంటూ గత ఏడాది అక్టోబర్‌లో దారుణానికి ఒడిగట్టాడు. అక్కడ తెలిసిన వారి పాపను ఏడాది క్రితం కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు. తన ఇంట్లోనే లైంగికదాడికి పాల్పడి, ఆ తర్వాత చిన్నారిని హతమార్చి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి అక్కడి నుంచి పారిపోయాడు. తమ కూతురు కనిపించడం లేదని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యల్లో మృతదేహం అనిల్ ఇంట్లో ప్లాస్టిక్ సంచిలో ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. తర్వాత అనిల్ యాదవ్‌ను పోలీసులు గాలించి పట్టుకున్నారు. కేసు విచారణలో భాగంగా 38 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. చిన్నారి మృతదేహానికి జరిపిన వైద్య పరీక్షలు, అటాప్సీని చార్జిషీట్లో పొందుపరిచారు. సూరత్‌లో ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో అనిల్ యాదవ్‌కు ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష కూడా విధించింది. స్పెషల్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. -
మా కూతుళ్లను అప్పగించండి ప్లీజ్..!
అహ్మదాబాద్ : స్వామి నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించిన తమ కూతుళ్లను విడిపించాలంటూ ఓ జంట గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. తమ ఇద్దరు కూతుళ్లను తమకు అప్పగించాలని కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. వివరాలు... జనార్థన శర్మ దంపతులకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. 2013లో వీరిని బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడికి వెళ్లి వస్తూ వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో శర్మ నలుగురు కూతుళ్లను నిత్యానంద ధాన్యపీఠం నుంచి అహ్మదాబాద్‌లోని యోగిని సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు. విషయం తెలుసుకున్న వీరు తమ కూతుళ్లను కలిసేందుకు వెళ్లగా... సర్వఙ్ఞాన పీఠ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల సహాయంతో శర్మ దంపతులు ఆశ్రమానికి వెళ్లి తమ ఇద్దరు మైనర్ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. అయితే మేజర్లైన మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ(21), నందిత(18) తల్లిదండ్రులతో వచ్చేందుకు నిరాకరించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన శర్మ దంపతులు.. తమ ఇద్దరు కూతుళ్లను ఆశ్రమ నిర్వాహకులు బెదిరించి.. తమతో రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. దయచేసి తమ అభ్యర్థనను మన్నించి తమ కూతుళ్లు ఇంటికి తిరిగి వచ్చేలా ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. పోలీసుల సహాయంతో వారిద్దరినీ కోర్టు ఎదుట ప్రవేశపెట్టిన తర్వాత తమకు అప్పగించాలని కోరారు. కాగా స్వామీజీగా చెప్పుకొనే నిత్యానంద రాసలీల వీడియోలు బయటపడటంతో తీవ్ర ప్రకంపనలు రేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై పలు అత్యాచార కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇవి కర్ణాటక కోర్టులో విచారణలో ఉన్నాయి. -
గుజరాత్ హైకోర్టు సీజేగా విక్రమ్‌నాథ్
న్యూఢిల్లీ: గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం విక్రమ్‌నాథ్ అలహాబాద్ హైకోర్టులో జడ్జీగా పనిచేస్తున్నారు. జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది ఏప్రిల్‌లో సిఫార్సు చేసింది. అయితే ఈ నియామకానికి మోకాలడ్డిన కేంద్రం ఆయన పేరును తిప్పిపంపింది. దీంతో జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం ఆగస్టు 22న తీర్మానించింది. దీంతో కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. గుజరాత్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి పదవి దాదాపు ఏడాది కాలంగా ఖాళీగానే ఉంది. -
ఆయన నియామకాన్ని తిరస్కరించిన కేంద్రం!?
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అఖిల్ ఖురేషిని నియమించాలన్న కొలీజియం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. గుజరాత్ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న అఖిల్ ఖురేషి పదోన్నతి విషయమై కొలీజియం మే 10న కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ విషయంపై మంగళవారం స్పందించిన కేంద్రం..కొలీజియం సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు అడ్వకేట్ల సంఘం బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అఖిల్ ఖురేషి నియామకాన్ని అడ్డుకుంటోందని పిటిషన్లో న్యాయవాదులు ఆరోపించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఈ విషయంలో కేంద్రం, కొలీజియం మధ్య చర్చలు జరిగిన తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు తెలిపింది. కాగా నిబంధనల ప్రకారం కొలీజియం రెండోసారి గనుక అఖిల్ ఖురేషి పేరును ప్రతిపాదించినట్లైతే కేంద్రం తప్పనిసరిగా ఆయన నియామకాన్ని ఆమోదించాల్సిందే. ఇక గతేడాది ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పదోన్నతి విషయమై కేంద్రం, కొలీజియంల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జడ్జిగా జోసెఫ్ పేరును కొలీజియం ప్రతిపాదించిగా.. కేరళ నుంచి సర్వోన్నత న్యాయస్థానంలో తగిన ప్రాతినిథ్యం ఉన్నందు వల్ల ఆయన పేరును పునఃసమీక్షించాలని కేంద్రం కోరింది. అయితే మరోసారి కొలీజియం ఆయన పేరునే సిఫారసు చేసింది. ఈ క్రమంలో ఇందుకు అంగీకరించిన కేంద్రం మద్రాసు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు సీజే జస్టిస్ వినీత్ సరన్‌ల తర్వాత మూడో స్థానంలో జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే కేంద్రం కావాలనే జోసెఫ్ సీనియారిటీని తగ్గించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జడ్జీల వరుస క్రమం ఆధారంగానే సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక సీనియారిటీ ఆధారంగానే అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టే అవకాశం లభిస్తుంది. -
నేడు అమేథీకి రాహుల్
అమేథీ (యూపీ)/అహ్మదాబాద్: తాజా సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీచేసి ఓడిన అమేథీ నియోజకవర్గంలో నేడు రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ప్రత్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడారు. తన పర్యటన సందర్భంగా రాహుల్ పార్టీ ప్రతినిధులను కలుస్తారు. సలోన్, అమేథీ, గౌరిగంజ్, జగదీశ్‌పూర్, తిలోయి అసెంబ్లీ నియోజకవర్గ బూత్ అధ్యక్షులను కలుసుకుంటారు. అలాగే కొన్ని గ్రామాలను సందర్శించే అవకాశం ఉందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తెలిపారు. రాహుల్ 1999 నుంచి అమేథీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. రాహుల్‌కి గుజరాత్ కోర్ట్ సమన్లు హోంమంత్రి అమిత్ షాను హత్య కేసులో నిందితుడిగా పేర్కొని ఆయన పరువుకు నష్టం కలిగించారన్న కేసులో రాహుల్‌కు గుజరాత్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. స్థానిక బీజేపీ నేత ఒకరు రాహుల్‌పై ఈ కేసువేశారు. ఈ కేసులో ఆగస్టు 9న హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మే 1న ఇదే కేసులో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాహుల్‌కి సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన లోక్‌సభ సభ్యుడు కావడంతో లోక్‌సభ స్పీకర్ నోటీసును తిరస్కరించారు. దీంతో ఆగస్టు 9న హాజరు కావాలంటూ తాజాగా సమన్లు జారీ చేశారు. ఈ నోటీసును రాహుల్ నివాసంలో నేరుగా అందించనున్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ అమిత్ షాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆరోపించారు. సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్‌ను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. -
హరేన్ను కాల్చి చంపింది అస్ఘరే..
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసు విచారణలో కీలకమలుపు చోటుచేసుకుంది. మహ్మద్ అస్ఘర్ అలీ హంతకుడని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ కేసుకు సంబంధించి 2011లో గుజరాత్ హైకోర్టు కొట్టివేసిన శిక్షల్ని అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. 2003 మార్చి 26న జరిగిన ఈ హత్యకేసులో అస్ఘర్ అలీతోపాటు మరో 11 మందికి అహ్మదాబాద్ పోటా కోర్టు విధించిన జీవితఖైదు శిక్షను సమర్థించింది. దీంతో పీడీ యాక్ట్ కింద నల్లగొండ జైల్లో ఉన్న అస్ఘర్అలీ గుజరాత్ జైలుకు వెళ్లడం తప్పనిసరైంది. హరేన్పాండ్యపై తుపాకీ ఎక్కుపెట్టి, కాల్చి చంపింది అస్ఘర్ అలీనే అని అప్పట్లో సీబీఐ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులోనూ అస్ఘర్ నిందితుడిగా ఉన్నాడు. నల్లగొండకు చెందిన మహ్మద్ అస్ఘర్ అలీకి జునైద్, అద్నాన్, ఛోటు అనే పేర్లు కూడా ఉన్నాయి. 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాద చర్యలపట్ల ఆకర్షితుడయ్యాడు. కశ్మీర్‌కు చెందిన ముస్లిం ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడి ఉగ్రవాద శిక్షణాశిబిరాల్లో తుపాకులు కాల్చడం, ఆర్డీఎక్స్ బాంబులను పేల్చడంపై శిక్షణ తీసుకున్నాడు. తిరిగి వచ్చి నల్లగొండకు చెందిన మహ్మద్ అబ్దుల్ బారిసహా మరికొందరితో కలసి ముఠా ఏర్పాటు చేశాడు. హత్య కేసుల్లోని నిందితుడిని తప్పించి... బాబ్రీని కూల్చివేసిన ‘కర సేవకులు’అనే ఆరోపణలపై నగరంలో రెండు దారుణహత్యలు జరిగాయి. 1993 జనవరి 22న వీహెచ్‌పీ నేత పాపయ్యగౌడ్, అదే ఏడాది ఫిబ్రవరి 2న మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నందరాజ్ గౌడ్ హత్య కేసుల్లో మీర్జా ఫయాజ్ బేగ్‌ను కోర్టు దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న అస్ఘర్‌ను మిగిలిన కేసుల విచారణ నిమిత్తం పోలీసులు తరచూ నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చేవారు. ఈ క్రమంలో అస్ఘర్, బారి తదితరులు 1996 డిసెంబర్ 19న నాంపల్లి న్యాయస్థానం నుంచి మీర్జా ఫయాజ్ను తప్పించారు. కశ్మీర్‌కు పంపించి ముస్లిమ్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేసేలా సంబంధాలు కల్పించాడు. జైలు నుంచి తప్పించుకున్న మీర్జా కొన్నిరోజులకే అక్కడ జరిగిన ఓ ఎన్కౌంటర్లో భద్రతాదళాల చేతిలో హతమయ్యాడు. నాంపల్లి వద్ద పట్టుబడి... 1997 ఫిబ్రవరిలో అస్ఘర్, బారి సహా పదిమంది నిందితుల్ని సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పట్టుకున్నారు. ఆ సమయంలో వీరి వద్ద నుంచి 3 కిలోల ఆర్డీఎక్స్, 3 హ్యాండ్ గ్రనేడ్లు, రెండు పిస్టళ్లు, 40 రౌండ్ల తూటాలు స్వాదీనం చేసుకున్నారు. నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. కేసును విచారిస్తుండగా మీర్జా ఎస్కేప్‌లో అస్ఘర్ పాత్ర కీలకమనే విషయం వెలుగులోకి వచ్చింది. హరేన్‌పాండ్యను హత్య చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని గుజరాత్‌కు చెందిన లిక్కర్ డాన్, ఉగ్రవాది రసూల్‌ఖాన్ పాఠి ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. 2003 మార్చి 26న హరేన్ తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా కారులో వెళ్లిన అస్ఘర్ ఐదురౌండ్లు కాల్చడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి అదే ఏడాది ఏప్రిల్ 17న మేడ్చల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అస్ఘర్ తదితరులను పట్టు కుంది. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిపై విచారణ జరిపిన అహ్మదాబాద్‌లోని పోటా కోర్టు అస్ఘర్ తదితరులను దోషులుగా తేల్చింది. అస్ఘర్‌కు జీవితఖైదు విధించింది. 2011లో ఈ కేసు గుజరాత్ హైకోర్టు లో వీగిపోవడంతో వాళ్లు బయటపడ్డారు. హైకోర్టు తీర్పు ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు పోటా న్యాయస్థానం విధించిన శిక్షల్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. -
హార్దిక్ పటేల్‌కు హైకోర్టు షాక్
అహ్మదాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమైన పటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. 2015లో ఓ అల్లర్ల కేసులో దిగువ కోర్టు దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని హార్దిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హార్దిక్ పటేల్‌పై 17 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని గుజరాత్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వీటిలో రెండు దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయని వెల్లడించింది. హార్దిక్‌కు నేరచరిత్ర ఉందని పేర్కొంది. దీంతో హార్దిక్ పటేల్‌పై నమోదైన కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పటీదార్ రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా 2015, జూలైలో ఆందోళనకారులు బీజేపీ ఎమ్మెల్యే హృషీకేశ్ పటేల్ కార్యాలయంపై దాడిచేశారు. ఈ కేసును విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్‌ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో హార్దిక్ గతేడాది గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన శిక్షపై స్టే విధించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువకాలం జైలుశిక్ష పడ్డవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తనను దోషిగా తేలుస్తూ విస్నగర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్లో నామినేషన్ల దాఖలుకు గడువు ఏప్రిల్ -
హార్ధిక్ పటేల్‌కు హైకోర్టు షాక్
అహ్మదాబాద్ : కాంగ్రెస్‌లో చేరిన పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశలకు గుజరాత్ హైకోర్టు గండికొట్టింది. మెహసనా జిల్లాలో ఓ అల్లర్ల కేసులో సెషన్స్ కోర్టు తనను దోషిగా పేర్కొనడాన్ని కొట్టివేయాలని కోరుతూ హార్థిక్ పటేల్ అభ్యర్ధనను హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగాలని పటేల్ భావిస్తుండగా, గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులు ఆయన ఆశలపై నీళ్లుచల్లాయి. మెహసనా జిల్లాలో జరిగిన ఘర్షణల కేసులో సెషన్స్ కోర్టు హార్ధిక్ పటేల్‌ను గత ఏడాది జులైలో దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తనను దోషిగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని హార్ధిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హార్ధిక్‌కు శిక్షను రద్దు చేసిన హైకోర్టు ఆయనకు గత ఏడాది ఆగస్టులో బెయిల్ మంజూరు చేసింది. దిగువ కోర్టు హార్ధిక్‌ను దోషిగా తేల్చడంపై మాత్రం హైకోర్టు స్టే ఇవ్వలేదు. అయితే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పటేల్ కాంగ్రెస్ నుంచి జామ్‌నగర్ లోక్‌సభ స్దానం నుంచి బరిలో దిగాలని యోచిస్తుండగా, గుజరాత్ హైకోర్టు ఆయన అభ్యర్ధనను తోసిపుచ్చడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం హార్థిక్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. -
జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డికి పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డికి పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఆయన పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఎ.కె.సిక్రీ, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన కొలీజియం బుధవారం సమావేశమై కేంద్రానికి సిఫారసు పంపించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రతీ రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఉంది. అయితే తెలంగాణ నుంచి సుప్రీంకోర్టులో ఒక్క న్యాయమూర్తి కూడా లేరు. దీంతో తెలంగాణకు చెందిన జస్టిస్ ఆర్.సుభాష్రెడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పోస్టుకు సిఫారసు చేసింది. అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా జస్టిస్ సుభాష్‌రెడ్డికి న్యాయవర్గాల్లో మంచిపేరు ఉంది. ఆయన నియామకానికి త్వరలోనే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయనున్నారు. జస్టిస్ సుభాష్‌రెడ్డి నేపథ్యం... జస్టిస్ సుభాష్‌రెడ్డి 1957 జనవరి 5న మెదక్ జిల్లా, శంకరంపేట మండలం, కమరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశాలాదేవి, జగన్నాథరెడ్డి. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం శంకరంపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో సాగింది. హైదరాబాద్, ఆంధ్రా కాలేజీ నుంచి ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1980 అక్టోబర్ 30న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి వద్ద న్యాయవాద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన అంశాల్లో వృత్తి నైపుణ్యాన్ని సాధించారు. తక్కువ సమయంలో స్వతంత్రంగా ప్రాక్టీస్ చేసే స్థాయికి ఎదిగారు. సంస్కృతి, కళలు, సంగీతంపై మక్కువ చూపే జస్టిస్ సుభాష్‌రెడ్డి ఎస్వీ యూనివర్సిటీ, జేఎన్టీయూలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2001–02లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సౌమ్యుడు, వివాదరహితుడు కావడంతో అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2002 డిసెంబర్ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 జూన్ 24న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించారు. 2016 ఫిబ్రవరి 13న పదోన్నతిపై గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్నారు. జస్టిస్ సుభాష్‌రెడ్డి న్యాయ నైపుణ్యాన్ని, నిజాయితీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పోస్టుకు సిఫారసు చేసింది. ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్... కర్ణాటక హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ రాఘవేంద్ర ఎస్.చౌహాన్‌ను ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రా నికి సిఫారసు చేస్తూ ఈ నెల 29న కొలీజి యం తీర్మానం చేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలోకి జస్టిస్ చౌహాన్ వస్తున్నారు. ఆయన నెంబర్ టు స్థానంలో కొనసాగుతారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కొలీజియంలో జస్టిస్ చౌహాన్ సభ్యులుగా ఉంటారు. జస్టిస్ చౌహాన్ ఉమ్మడి హైకోర్టుకు వచ్చిన తర్వాత కొలీజియం మరికొందరు న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఎవ రిని చేర్చాలన్న విషయంపై కొలీజియంలోని న్యాయమూర్తులు ఇప్పటికే ఓ ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
శాకాహారులకు, మాంసాహారులకు వేరువేరు సీట్లు
న్యూఢిల్లీ : దేశీయ రైళ్లు శాకాహారులు, మాంసాహారులను వేరు చేయనున్నాయా? ఆన్‌బోర్డు రైళ్లలో శాకాహారులకు, మాంసాహారులకు వేరు వేరు సీట్లు కేటాయించనున్నారా? అంటే ఏమో అది జరగవచ్చు అంటున్నారు కొందరు. ఆహారపు అలవాట్లను ఆధారంగా చేసుకుని రైళ్లలో వేరు వేరు సీట్లు కేటాయించేలా కోర్టు జోక్యం చేసుకోవాలని గుజరాత్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌ను అహ్మదాబాద్‌లోని ఖాన్పూర్కు చెందిన ఈఈ సైద్ అనే న్యాయవాది దాఖలు చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు ప్రకారం ప్రయాణికుల ఆహారపు ఎంపికలను బట్టి రైళ్లలో సీట్లను కేటాయించేలా దేశీయ రైల్వేను ఆదేశించాలని కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. వచ్చే వారం ఈ పిల్ విచారణకు రానుంది. తాను వేసిన ఈ పిల్లో ఎలాంటి రాజకీయ కోణం లేదని పిటిషనర్ చెప్పారు. ప్రయాణికులకు మంచి ఆహారాన్ని అందించడంలో దేశీయ రైల్వే అత్యంత జాగ్రత్త వహించాలని సైద్ అన్నారు. ట్రైన్ బుక్ చేసుకునేటప్పుడే ఈ ఆప్షన్‌ను కల్పించాలని, దీంతో శాకాహార ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వారి ఆహారపు అలవాట్లకు తగ్గట్టు సీట్లను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించవచ్చన్నారు. సైద్ తాను శాకాహారిగా చెప్పారు. ఈ పిల్లో రైల్వే మంత్రిత్వ శాఖను, దేశీయ రైల్వే కేటరిగింగ్, టూరిజం కార్పొరేషన్‌ను, పశ్చిమ రైల్వే జోన్‌ను, గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. -
సబ్ర్మతి రైలు దహనం; మరో ఇద్దరికి జీవిత ఖైదు
-
గోద్రా దుర్ఘటన; మరో ఇద్దరికి జీవిత ఖైదు
అహ్మదాబాద్: గుజరాత్ అల్లర్లకు కారణమైన గోద్రా రైలు దహనం కేసులో సిట్ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో అల్లరిమూకలు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్దమవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న 59 మంది కరసేవకులు సజీవ దహనం అయ్యారు. దీంతో గుజరాత్ వ్యాప్తంగా ఒక్కసారిగా మత ఘర్షణలు చెలరేగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో దాదాపు వెయ్యి మంది మరణించారు. ఈ కేసులో సుదీర్ఘ కాలం విచారణ చేపట్టిన సిట్ ప్రత్యేక న్యాయస్థానం 2011 మార్చి 1న ఈ కేసులో 31 మందిని దోషులుగా తేల్చింది. వారిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో వారు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు 2017 అక్టోబర్‌లో మరణశిక్ష ఖరారైన 11 మంది శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించింది. మిగతా 20 మందికి ప్రత్యేక న్యాయస్థానం విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్ధించింది. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ఫరూఖ్ బానా, ఇమ్రాన్ షేరు, హుస్సేన్ సులేమాన్, ఫరూఖ్ ధాంతియా, కసమ్ బమేదీలను పోలీసులు 2015-16 మధ్య కాలంలో అరెస్ట్ చేశారు. వీరిలో ఫరూఖ్ బానా, ఇమ్రాన్ షేరులకు కోర్టు జీవిత ఖైదు విధించగా, మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో మరో 8 మంది నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. -
మాయా కొద్నానీ నేరం చేయలేదా!????!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌లోని నరోదా పాటియాలో 2002లో జరిగిన మారణ హోమం కేసులో భజరంగ్ దళ్ నాయకుడు బాబు భజరంగీని దోషిగా నిర్ధారించిన గుజరాతీ హైకోర్టు నిన్న (శుక్రవారం) బీజేపీ మాజీ మంత్రి మాయా కొద్నాని నిర్ధోషిగా ప్రకటించింది. 97 మంది ముస్లింలు, మహిళలు, పిల్లలను బలిగొన్న నరోదా పాటియా మారణహోమానికి కీలక సూత్రదారి మాయా కొద్నాని అంటూ 2012లో ట్రయల్ కోర్టు నిర్ధారించి 20 ఏళ్లకు పైగా జైలు శిక్షకూడా విధించింది. భారత్‌లో జరిగిన మత ఘర్షణల్లో ఓ మంత్రికి జైలు శిక్ష పడడం తొలిసారి అంటూ నాడు పత్రికలు, టీవీలు వ్యాఖ్యానించాయి. బీజేపీ, దాని సంఘ్ పరివారుకు చెందిన వారు వరుసగా హైకోర్టుల్లో విజయం సాధిస్తూ వస్తున్న నేపథ్యంలోనే మాయా కొద్నానీకి కూడా విముక్తి లభించింది. అసీమానంద్, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్లు ఇటీవలనే కేసుల నుంచి విముక్తి పొందిన విషయం తెల్సిందే. బరోడా వైద్య కళాశాలలో మెడిసిన్ చదువుతున్నప్పుడే ఆరెస్సెస్ మహిళా విభాగమైన రాష్ట్రీయ సేవికా సమితిలో మాయా కొద్నాని చేరారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. 1995లో రాజకీయాల్లోకి వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.1998లో ఆమె బీజేపీ తరఫున నరోడా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అహ్మదాబాద్ సిటీ బీజేపీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నరోదా పాటియా, నరోదా గ్రామ్‌లలో మాయా కొద్నానీ ముస్లిలకు వ్యతిరేకంగా అల్లర్లను రెచ్చగొట్టారు. ఈ సంఘటనలపై దర్యాప్తు జరిపిన ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ 2003లో వెల్లడించిన నివేదిక ప్రకారం మహిళలను, బాలికలను బహిరంగంగా గ్యాంగ్ రేప్‌లు చేశారు. అనంతరం వారిని దహనం చేశారు. మగవాళ్లను కత్తులతో నరికి చంపారు. నూరాని మసీదును గ్యాస్ సిలిండర్లతో పేల్చి వేశారు. ఈ రెండు సంఘటనలకు నాటి నరోడా బీజేపీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, గుజరాత్ విశ్వహిందూ పరిషద్ జనరల్ సెక్రటరీ జైదీప్ పటేల్‌లు రింగ్ లీడర్లని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక పేర్కొంది. అయినప్పటికీ కొద్నానీపై న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు. 2007లో ఆమె నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. ఆ తర్వాత పోలీసు అధికారి రాహుల్ శర్మ 2002లో అల్లర్ల సందర్భంగా మాయా కొద్నానీ తన అనుచర వర్గంతో మాట్లాడిన ఫోన్‌కాల్ డేటాను పూర్తిగా బయటపెట్టారు. అల్లర్లప్పుడు భావ్‌నగర్ ఎస్పీగా పనిచేసిన రాహుల్ శర్మ 400 మంది విద్యార్థులున్న మదర్సాను తగులబెట్టేందుకు కుట్ర జరిగిందని తెల్సి అక్కడికెళ్లి 400 మంది విద్యార్థులను రక్షించారు. దీంతో ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌లో డెస్క్జాబ్కు బదిలీ చేసింది. దాంతో ఆయన 2002 అల్లర్ల నాటి నిందితుల కాల్ డేటాను వెలుగుతీయడం ప్రారంభించారు. అలా మాయా కొద్నానీ కాల్ డేటాను పూర్తిగా బయటకుతీశారు. సుప్రీం కోర్టు గుజరాత్ అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్ ఆ కాల్ డేటాను పరిగణలోకి తీసుకొని 2009లో ఆమెకు సమన్లు జారీ చేసింది. సమన్లకు ఆమె ఎంతకు స్పందించకపోవడంతో సుప్రీం కోర్టు ఆమెను పరారీలో ఉన్న నిందితురాలిగా ప్రకటించింది. కొంతకాలం అజ్ఞాతవాసంలోకి వెళ్లిన మాయా కొద్నానీ తన పదవికి రాజీనామా చేసి కోర్టు ముందు లొంగిపోయారు. ఆమె కేసును విచారించిన ట్రయల్ కోర్టు కేసులో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతోపాటు కాల్ డేటాను అనుబంధ సాక్ష్యంగా తీసుకొని 2012, ఆగస్టు 29వ తేదీన ఆమెకు 28 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నాడు తీర్పు విన్న కొద్నానీ కోర్టులోనే ఏడుస్తూ కుప్పకూలి పోయారు. ఇదే కేసులో అప్పీల్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు శుక్రవారం మాయా కొద్నానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమ్మశక్యంగా లేవంటూ కేసును కొట్టి వేసింది. కాల్ డేటా గురించి అసలు పట్టించుకున్నట్లు లేదు. బాబు భజరంగీని దోషిగా తేల్చిన ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలాలు కొద్నాని ఎందుకు దోషిగా తేల్చలేకపోయాయో! మాయా కొద్నానీ ‘రాజకీయ క్రీడలకు’ బలయ్యారని 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆయన ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లో, అంటే జూలై నెలలో అనారోగ్య కారణాలతో మాయా కొద్నాని జైలు శిక్షను గుజరాత్ హైకోర్టు రద్దుచేసి ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇది రాజకీయ క్రీడ కాదంటారా?! -
‘నరోడా’ కేసులో కొడ్నానీ నిర్దోషి
అహ్మదాబాద్: నరోడా పటియా అల్లర్ల కేసులో నిందితురాలిగా ఉన్న బీజేపీ మాజీ మంత్రి మాయా కొడ్నానీని శుక్రవారం గుజరాత్ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో బజరంగ్దళ్ మాజీ నేత బాబూ భజరంగీని దోషిగా తేల్చింది. 2002లో గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన నరోడా అల్లర్లలో 97 మంది మృతి చెందారు. కొడ్నానీ నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని కోర్టు పేర్కొంది. కాగా, భజరంగీని దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అల్లర్లకు భజరంగీ కుట్ర పన్నినట్లు నిరూపి తమైందని కోర్టు పేర్కొంది. భజరంగీకి హైకోర్టు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు దోషులుగా తేల్చిన 32 మందిలో 13 మందిని హైకోర్టు దోషులుగా నిర్ధారించింది. -
గుజరాత్ అల్లర్ల కేసులో మాజీ మంత్రికి ఊరట
-
గుజరాత్ అల్లర్ల కేసులో మాజీ మంత్రికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అల్లర్ల కేసులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మాజీ మంత్రి మాయా కొద్నానీ నిర్దోషిగా విడుదల అయ్యారు. 2002 గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌లోని నరోదా పటియాలో నరమేథం జరిగింది. ఈ నరమేథం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాయా కొద్నానీని శుక్రవారం గుజరాత్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సంశయ లాభం కింద కొద్నానీని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. 2002లో నరోదా నరమేథంలో 100 మంది ముస్లింలు హత్యకు గురయ్యారు. వృత్తి రీత్యా వైద్యురాలైన కొద్నానీ అల్లర్లకు పురిగొల్పారని ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఘటన మరుసటి రోజున ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం అల్లర్లకు కొద్నానీయే రెచ్చగొట్టారని తేల్చింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. అప్పటినుంచి 10 ఏళ్ల పాటు సాగిన విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు కొద్నానీకి జీవిత ఖైదును విధించింది. 2014లో కొద్నానీ బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న భజరంగ్ దళ్ నేత బాబు భజరంగీని దోషిగా తేల్చిన న్యాయస్థానం క్రింది కోర్టు ఇచ్చిన శిక్షను ఖరారు చేసింది. భజరంగీకి 2012లో ప్రత్యేక కోర్టు 28 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఇరువురితో పాటు ఆరోపణలను ఎదుర్కొంటున్న మరో 29 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. -
‘గోధ్రా’ దోషులకు శిక్ష తగ్గింపు
-
‘గోధ్రా’ దోషులకు శిక్ష తగ్గింపు
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గోధ్రా రైలు దగ్ధం కేసులో దోషులకు శిక్ష తగ్గిస్తూ గుజరాత్ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరణ శిక్ష పడిన 11 మంది దోషులకు ఆ శిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పునిచ్చింది. అలాగే జీవిత ఖైదు పడిన మరో 20 మందికి అదే శిక్షను ఖరారు చేసింది. ఆ ఘటన సమయంలో శాంతి భద్రతలను సరిగా పరిరక్షించలేకపోయారంటూ రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ గోధ్రా ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం అందజేయాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అనంత్ ఎస్ డేవ్, జస్టిస్ జీఆర్ ఉద్వానీ ఆదేశాలు జారీ చేశారు. గోధ్రా స్టేషన్లో 59 మంది మృతి: 2002, ఫిబ్రవరి 27న సబర్మతీ ఎక్స్‌ప్రెస్ రైలులో అయోధ్య నుంచి వస్తున్న ప్రయాణికులపై కొందరు ఆందోళనకారులు గోధ్రా స్టేషన్లో దాడిచేశారు. ఎస్–6 కోచ్‌కు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది మృతిచెందారు. వీరిలో చాలా మంది కరసేవకులు ఉన్నారు. ఈ ఘటన అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో సుమారు 1,200 మంది మరణించారు. ఈ మారణహోమంపై విచారణ జరిపేందుకు అప్పటి గుజరాత్ ప్రభుత్వం జస్టిస్ నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. గోధ్రా ఘటన వెనుక కుట్ర దాగి ఉందని విచారణలో కమిషన్ తేల్చింది. 31 మంది దోషులు.. 63 మంది నిర్దోషులు గోధ్రా రైలు దహనం కేసులో 2011, మార్చి 1న ప్రత్యేక సిట్ న్యాయస్థానం 31 మందిని దోషులుగా పేర్కొంటూ అందులో 11 మందికి మరణ శిక్ష మరో 20 మంది జీవిత ఖైదును ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. 63 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంది. వారిలో ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొన్న మౌలానా ఉమర్జీ, గోధ్రా మున్సిపాలిటీ అధ్యక్షుడు మొహమ్మద్ కలోటా, మొహమ్మద్ అన్సారీ, నానుమియా చౌదరి ఉన్నారు. కాగా, సిట్ కోర్టు తీర్పుపై ఉరిశిక్ష పడిన 11 మంది దోషులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు 63 మందిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలి.. 11 మంది దోషుల మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దీపావళిలోగా సుప్రీంకోర్టును ఆశ్రయిం చాల్సిందిగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వ హిందూ పరిషత్ చీఫ్ ప్రవీణ్ తొగాడియా సూచించారు. పక్కా ప్రణాళికతో కుట్రపూరితంగా హిందువులను చంపిన ఆ జిహాదీలకు ఉరి శిక్ష ఎందుకు విధించకూడదంటూ ఆయన ప్రశ్నించారు. హిందువులకు కనీస న్యాయం కూడా జరగడం లేదని తొగాడియా ఆరోపించారు. గోధ్రా కేసు తీరుతెన్నులు - 2002, ఫిబ్రవరి 27: అయోధ్య నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు గోధ్రా స్టేషన్లో నిప్పుపెట్టిన అగంతకులు. అగ్నికి ఆహుతైన 59 మంది కరసేవకులు. - మార్చిలో ఈ ఘటనతో ప్రమేయమున్న రాజకీయ నాయకులు హజీబలాల్, మహ్మద్ హుస్సేన్ కొలాట, పలువురు స్థానిక వ్యాపారులతో సహా 50 మందికిపైగా అరెస్టు. - మే 24న 54 మందిపై చార్జిషీటు దాఖలు. మే 27న సీనియర్ పోలీసు అధికారి రాఖేష్ ఆస్థానా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు. - జూలై 9న స్థానిక టీ కొట్టు యజమాని స్టేట్మెంట్కు అనుగుణంగా స్థానిక వ్యాపారి రజాక్ కుర్కుర్ ›ప్రధాన సూత్రధారిగా సింగ్లా ఫాలియాకు చెందిన ముస్లింల బృందం ఎస్–6 బోగీకి నిప్పుపెట్టినట్లు (140 లీటర్ల పెట్రోలు పోసి) ఎఫ్ఐఆర్ నమోదు. - 2004, మార్చి 18న అనుమానితులపై ‘పోటా’ విధింపు. - 2005, మేలో సబర్మతి జైలులో 134 మంది అనుమానితులపై ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభం. - 2011 ఫిబ్రవరిలో 11 మందికి మరణశిక్ష, 20 మంది యావజ్జీవ ఖైదును విధించడంతో పాటు 63 మందిని (ప్రధాన నిందితుడు మౌలానా ఉమర్జీ సహా) నిర్దోషులుగా తీర్పు వెలువడింది. - 2017 అక్టోబర్ 9న గుజరాత్ హైకోర్టు కిందికోర్టు ఉత్తర్వులకు స్వల్ప మార్పులు.11 మందికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా కుదింపు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గుజరాత్ అల్లర్లు.. ప్రభుత్వానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మత ఘర్షణల్లో ధ్వంసమైన 500 మత కట్టడాలను తిరిగి నిర్మించే బాధ్యత ప్రభుత్వానిదేనని అహ్మదాబాద్ హైకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అల్లర్లలో ధ్వంసమైన పలు దుకాణ సముదాయాలకు, కట్టడాలకు, ఇళ్లకు ఇప్పటికే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, పీసీ పంత్ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలతో ఏకీభవిస్తూ మసీదులను పునఃనిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదంటూ తేల్చేసింది. గుజరాత్ అల్లర్ల సమయంలో నరోదా గామ్ నర మేథం(11 మంది హత్య కేసు)కు సంబంధించి నాలుగు నెలల్లో తీర్పు వెలువరించాలంటూ దిగువ న్యాయస్థానికి సుప్రీంకోర్టు ఈ మధ్యే ఆదేశాలు జారీ చేసింది. గోద్రా ఘటన తర్వాత జరిగిన గుజరాత్ లో చెలరేగిన అల్లర్లలో సుమారు 2000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
అహ్మద్ పటేల్ ఎన్నిక చెల్లదు!
అహ్మదాబాద్: నాటకీయ పరిణామాల నడుమ గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నేత బల్వంత్ సింగ్ రాజ్‌పుత్ అహ్మదాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు(బల్వంత్) వేసిన ఓట్లు చెల్లుతాయని, పైగా ఎన్నికల ముందు 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూర్ తరలించి ఎన్నికల్లో ‘అవినీతి ప్రవర్తన’ కు అహ్మద్ పటేల్ పాల్పడ్డారని పిటిషన్ లో బల్వంత్ పేర్కొన్నారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఆరుగురు కాంగ్రెస్ నేతలు సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు ముందే పార్టీకి గుడ్ బై చెప్పగా, బల్వంత్ తోపాటు మరో ముగ్గురు బీజేపీలోకి చేరిపోయారు. ఆపై కాంగ్రెస్ పార్టీ తరపున అహ్మద్ పటేల్, బీజేపీ తరపున బల్వంత్ బరిలోకి దిగారు . ఇద్దరు రెబల్ బ్యాలెట్ ఎమ్మెల్యేలు బల్వంత్ కు ఓటు వేసిన అనంతరం బ్యాలెట్ పేపర్లను బహిరంగంగా చూపించారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, అవి చెల్లవని ఈసీ స్పష్టం చేసింది. చివరకు అహ్మద్ పటేల్ 44, బల్వంత్ రాజ్ పుత్ కు 38 ఓట్లు పోలు కావటంతో కాంగ్రెస్ సీనియర్ నేతనే విజయం వరించింది. -
మేనిఫెస్టోల నిషేధంపై హైకోర్టు విచారణ
అహ్మదాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలపై నిషేధం విధించడంతోపాటు హామీలకు పార్టీలను జవాబుదారులను చేయాలంటూ వచ్చిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. రాబోయే కాలంలో ఈ పిటిషన్‌ను కోర్టు విచారిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ వీఎం పంచోలీలు వెల్లడించారు. కాగ్రెస్ పార్టీకి చెందిన జయేశ్ షా ఈ పిటిషన్ వేశారు. 2014లో బీజేపీ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందనీ, వాటిని చాలా వరకు నెరవేర్చలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఇలాగే అనేక పార్టీలు అమలు సాధ్యం కాని హామీలను ప్రకటిస్తూ ఓటు వేసే సమయంలో ప్రజలను మభ్యపెడుతున్నాయనీ, అధికారంలోకి వచ్చాక అవి కాగితాలకే పరిమితమవుతున్నా యని జయేశ్ పిటిషన్లో విమర్శించారు. -
‘నీట్’ ఫలితాలపై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2017 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ ఫలితాల వెల్లడిపై ఇంకా స్పష్టత రావట్లేదు. ఈ నెల 8న ఫలితాలు రావాల్సి ఉండగా, మద్రాస్, గుజరాత్ హైకోర్టుల్లో పిటిషన్లు వేయడం, మద్రాస్ కోర్టు స్టే ఇవ్వడంతో పరిస్థితి గందరగోళంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో 8న ఫలితాలు రావన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కొందరైతే ఈ నెల 12న ఫలితాలు రావొచ్చని అంటున్నారు. 15లోపు ఎప్పుడైనా రావొచ్చని మరికొందరు అంటున్నారు. మరోవైపు సుప్రీంకోర్టులోనూ ఇదే అంశంపై పిటిషన్ విచారణకు రావాల్సి ఉందన్నారు. మొత్తంగా చూస్తే ‘నీట్’ఫలితాలపై అస్పష్టత కొనసాగుతోంది. మద్రాస్ హైకోర్టు స్టేతో.. మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించ డంపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఎటువంటి సమాచారం లేక ఆవేదన చెందు తున్నారు. తమిళ, ఆంగ్ల భాషల ప్రశ్న పత్రాల మధ్య తేడా ఉందని, అందువల్ల పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అక్కడి విద్యార్థులు కొంద రు కోర్టును ఆశ్రయించడంతో స్టే విధిం చింది. రాష్ట్రంలోనూ తెలుగు మాధ్యమానికి బదులు ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఇచ్చారంటూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం లో నీట్ విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. హన్మకొండలోని ఓ పరీక్ష కేంద్రంలో సుమారు 600 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. అందులో 100 మందికి పైగా తెలుగు మీడియంలో రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారికి ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఇవ్వడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. చివరికి ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్ష రాయాలని తేల్చ డంతో.. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి పరీక్ష కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఎట్టకేలకు వారి కోసం మరోసారి తెలుగు ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించారు కూడా. అంతేగాక సిలబస్‌లో లేని ప్రశ్నలు కూడా ఇచ్చారని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. -
యువత సహజీవనం: హైకోర్టు సంచలన తీర్పు
అహ్మదాబాద్: ఆమె 19 ఏళ్ల హిందూ యువతి. అతను 20 ఏళ్ల ముస్లిం యువకుడు. స్కూల్ మేట్స్ అయిన ఆ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దవాళ్ల బలవంతం కారణంగా కొన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్న వీళ్లు ఇకపై నిరభ్యంతరంగా సహజీవనం చెయ్యొచ్చని అహ్మదాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్లో పాక్ సరిహద్దు గ్రామం ధనేరా(బనస్కాంత జిల్లా)కు చెందిన ముస్లిం యువకుడు, అదే ఊరికి చెందిన హిందూ అమ్మాయి మధ్య కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. గత జులైలో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అబ్బాయి మైనర్ కావడంతో(భారత వివాహ చట్టాల ప్రకారం 21 ఏళ్లు నిండితేగానీ అబ్బాయి పెళ్లికి అర్హుడు) పెళ్లి సాధ్యం కాలేదు. దీంతో ఇద్దరూ కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్‌లో పెద్దవాళ్లు ఎంటర్ అయి.. అమ్మాయిని ఇంటికి తీసుకుపోయారు. చివరికి ఆ అబ్బాయి.. ప్రియురాలితో కలిసే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. కోర్టు ఆదేశాల మేరకు బనస్కాంత్ పోలీసులు అమ్మాయిని విచారణకు హాజరుపర్చగా, ‘నేను ప్రేమించిన వాడితోనే ఉంటాన’ని ఈ కేసు విచారణకు ఏర్పాటైన ద్విసభ్య ధర్మాసనం ముందు అమ్మాయి చెప్పింది. ఇరు పక్షాల వాదనలు విన్న సీనియర్ జడ్జిలు జస్టిస్ అఖిల్ ఖురేషీ, జస్టిస్ బీరేన్ వైష్ణవ్‌లు సోమవారం తుది తీర్పు చెప్పారు. ‘భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. సహజీవన సంబంధాలు(లివ్ ఇన్ రిలేషన్స్) మెట్రో నగరాలు, పట్టణాల్లోనే మాత్రమే గోచరిస్తాయి. ఈ నేపథ్యంలో ఒక మేజర్ అమ్మాయి ఏ ప్రాంతంలో(గ్రామమో, పట్టణమో) ఉంటున్నప్పటికీ ఆమెకు న్యాయసహకారం అందించకుండా ఉండలేం. ఆమెకు ఇష్టమైన చోట ఉండగోరే హక్కును కాదనలేం. దరిమిలా 19 ఏళ్ల అమ్మాయి తనకు ఇష్టమైతే 20 ఏళ్ల యువకుడి(పిటిషనర్)తో కలిసే ఉండొచ్చు(సహజీవనం చెయ్యొచ్చు)’అని తీర్పు సందర్భంగా జడ్జిలు వ్యాఖ్యానించారు. 21 ఏళ్లు నిండగానే అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా అబ్బాయితో అఫిడవిట్ దాఖలుచేయించారు. -
రూ.50 కేసు 28 ఏళ్లకు తేలింది!
అహ్మదాబాద్ : ఓ వ్యక్తికి తన అపరాధం ఒప్పుకోవడానికి దాదాపు 28 ఏళ్లు పట్టింది. సురేంద్రనగర్‌కు చెందిన మన్షుక్లాల్ దేవ్‌రాజ్ అనేవ్యక్తి 1988లో ఓ పేద కుటుంబం నుంచి రూ.50 లంచం తీసుకున్నాడు. అది ఒప్పుకోవడానికి మాత్రం తటపటాయించాడు. ఒకటా రెండా ఏకంగా 28 ఏళ్ల దాకా సతాయించాడు. చివరికి గుజరాత్ కోర్టులో తన తప్పును ఒప్పుకున్నాడు. అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం దేవరాజ్‌కి ఆరు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. ఇదే కేసులో దేవరాజ్ సీనియర్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్స్పెక్టర్ భాంజీభాయ్ గోవాభాయ్ కూడా నిందితుడే. అయితే అతను మరణించడంతో భాంజీభాయ్పై ఫిర్యాదును హైకోర్టు పక్కనపెట్టింది. 25 ఏళ్ల తర్వాత దేవ్‌రాజ్ అప్పీల్‌ను విచారించింది. హైకోర్టులో ఈ కేసు డాక్యుమెంట్లు లేకపోవడంతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న పేపర్‌బుక్ రికార్డుల బట్టి ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతి వారికి సబ్సిడీ కింద రుణాలు ఇప్పించడాన్ని ఓ సంస్థకు బాధ్యతలు అప్పటించారు. ఆ సంస్థ తరుఫున దేవ్‌రాజ్ టీమ్ క్రెడిట్ కార్యకలాపాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి బాధ్యత వహిస్తున్నారు. ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకున్న ఓ పేద కుటుంబానికి రుణాన్ని పెంచడానికి దేవ్‌రాజ్ రూ.50 డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఆ కుటుంబం అవినీతి నిరోధక బ్యూరోలో తెలపడంతో దేవ్రాజ్పై కేసు నమోదైంది. దేవ్‌రాజ్‌ను నిర్దోషిగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయ్యారని జస్టిస్ ఎస్జీ షా తెలిపారు. ప్రాసిక్యూషన్ మూడు కోర్టులోనూ దేవ్‌రాజ్ లంచం డిమాండ్ చేయలేదని నిరూపించలేకపోయారు. కానీ లంచానికి అడిగినమొత్తాన్ని అడ్డం పెట్టుకుని దేవ్‌రాజ్ న్యాయవాది ఈ కేసుపై పోరాటం చేశారు. కానీ వారి ఆలోచనలకు బిన్నంగా కోర్టు అవినీతి కేసులో శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది. -
గుజరాత్ సర్కారుకు ఎదురుదెబ్బ
ఈబీసీల 10 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్సును కొట్టేసిన హైకోర్టు అహ్మదాబాద్: గుజరాత్లో బీజేపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ! ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీలు)కు గుజరాత్ ప్రభుత్వం కల్పించిన 10 శాతం కోటా ఆర్డినెన్స్‌ను రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టేసింది. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా ఈ ఆదేశాల అమలుపై హైకోర్టు రెండు వారాలు స్టే విధించింది. పటేళ్ల ఆందోళన చల్లార్చేందుకు ఈబీసీలకు విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మే నెలలో గుజరాత్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం తెలిసిందే. కుటుంబ వార్షికాదాయం రూ. ఆరు లక్షల కంటే తక్కువ ఉన్నవారికి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపినకోర్టు ఈబీసీ కోటాను రద్దు చేస్తూ, ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకం ఈ ఆర్డినెన్సు వల్ల రిజర్వేషన్ లేని వర్గాలకు సీట్లు తగ్గిపోతాయని.. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశానికి ఇది వ్యతిరేకమన్న పిటిషనర్ల వాదనను కోర్టు సమర్థించింది. అయితే రిజర్వేషన్లు లేని వర్గాలను మరింతగా వర్గీకరించి ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తింపజేస్తామని పేర్కొంది. కాగా, కోర్టు ఆదేశాలను పటేళ్ల నేత హార్దిక్ పటేల్ స్వాగతించారు. ‘మేం రాజ్యాంగం ప్రకారం కోటా పొందాలనుకుంటున్నాం’ అని ఆయన అన్నారు -
హార్దిక్ పటేల్ కు బెయిల్
-
హార్దిక్ పటేల్ కు బెయిల్
అహ్మదాబాద్: రాజద్రోహం కేసులో అరెస్టైన పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. దాదాపు 9 నెలల తర్వాత అతడికి బెయిల్ వచ్చింది. గుజరాత్ హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గుజరాత్ వెలుపల ఉండాలని ఆదేశించింది. రాజద్రోహం కేసులో సూరత్ పోలీసులు గతేడాది అక్టోబర్ లో అతడిని అరెస్టు చేశారు. బెయిల్ వచ్చినా హార్దిక్ జైల్లోనే ఉంటారని అతడి తరపు న్యాయవాది జుబిన్ భద్ర తెలిపారు. అతడిపై ఇతర కేసులున్నాయని చెప్పారు. పటేళ్ల ఉద్యమంలో భాగంగా.. అక్టోబర్ 3న తన అనుచరులతో మాట్లాడుతూ.. ‘ఆత్మహత్యలు చేసుకోవటం ఎందుకు? అవసరమైతే ఇద్దరు పోలీసులను చంపండి’ అంటూ హార్దిక్ పటేల్ వ్యాఖ్యలు చేయడంతో అతడిపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. సాధారణంగా.. రాజద్రోహం కేసులో కనీసం మూడేళ్లు.. గరిష్ఠంగా జీవిత ఖైదు శిక్ష పడుతుంది. -
విమ్ ప్లాస్ట్ ఎయిర్ కూలర్స్ ఇక కూల్ కూల్!
హైదరాబాద్: విమ్ ప్లాస్ట్ కంపెనీ తన ఎయిర్ కూలర్స్ విక్రయించుకోడానికి మార్గం సుగమం అయ్యింది. ఇందుకు గుజరాత్ హైకోర్ట్ తగిన ఆదేశాలు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే... సింఫనీ కంపెనీ గాంధీనగర్ జిల్లా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ... విల్ ప్లాస్ట్కు చెందిన సెల్లో బ్రాండ్ ఎయిర్ కూలర్ మోడళ్లు- మార్వెల్, వేవ్, టోవర్లు తమ కంపెనీ రిజిస్ట్రర్ డిజైన్లయిన వింటర్, సుమో, డైట్ మోడళ్లను పోలివున్నాయని పేర్కొంది. వీటి విక్రయాలను నిలుపుచేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరింది. దీనితో జిల్లా కోర్టు సింఫనీకి అనుకూలంగా రూలింగ్ ఇస్తూ... విమ్ ప్లాస్ట్ కూలర్ మోడళ్లు టవర్-25, టోవర్-50, వేవ్, మార్వెల్ అమ్మకాన్ని నిలుపుచేసింది. దీనిని సవాలుచేస్తూ... విమ్ ప్లాస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు మంగళవారం దిగువకోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది. దీనితో విమ్ ప్లాస్ట్ తమ మోడళ్లను ఎటువంటి ఇబ్బందులూ లేకుండా విక్రయించుకోడానికి మార్గం సుగమం అయ్యింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేర్ ధర రూ.36 పెరిగి (2 శాతం) రూ.1,825కు చేరింది. -
డెలివరీ కోసం మహిళకు 11నెలలు బెయిల్
అహ్మదాబాద్: గుజరాత్ హైకోర్టు మానవతా దృక్పథంతో ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న మహిళకు.. డెలివరీ కోసం బెయిల్ మంజూరు చేసింది. వరకట్న వేధింపుల కోసులో శిక్ష అనుభవిస్తున్న అయిదు నెలల గర్భిణికి న్యాయస్థానం 11 నెలల పాటు బెయిల్ ఇచ్చింది. అన్న భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో దోషిగా తేలిన భావనా ప్రజాపతి(30) అనే మహిళకు ప్రసవించేందుకు కోర్టు ఈ వెసులుబాటును కల్పించింది. ప్రసవం అనంతరం బిడ్డతో సహా ఈ ఏడాది డిసెంబర్ 31న కోర్టుకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పదివేల రూపాయల పూచీకత్తుతో ఈ బెయిల్ మంజూరు చేసింది. మానవతా దృక్పథంతో శిక్షా కాలాన్ని తగ్గించాల్సిందిగా భావన పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ కె సయీద్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భావనా ప్రజాపతికి మంజూరు చేసింది. దీంతోపాటుగా జైలుకి తిరిగి వచ్చిన అనంతరం రెండేళ్ల కుమార్తె సహా, నవజాత శిశువు ఉండేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జైలు అధికారులకు సూచించింది. అటు కోర్టు నిర్ణయంపై భావన హర్షం వ్యక్తం చేసింది. అయితే తప్పు ఏమీ లేకపోయినా తన బిడ్డలు శిక్ష అనుభవించడం బాధ కలిగిస్తోందని వాపోయింది. ఇక కేసు పూర్వపరాల్లోకి వెళితే... భావన సోదరుడు భార్య జల్పా ప్రజాపతి ఆత్మహత్య కేసులో భావనతో పాటు తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులను దోషులుగా తేల్చిన సెషన్స్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో హైకోర్టులో అప్పీల్ చేశారు. అదనపు కట్నం కోసం కుటుంబం తీవ్రంగా హింసించడం మూలంగానే ఆమె ఆత్యహత్య చేసుకుందన్న కిందికోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. -
గుజరాత్ సీజేగా జస్టిస్ సుభాష్‌రెడ్డి
♦ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర ♦ ఈ వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం ♦ జస్టిస్ జయంత్ పటేల్ బదిలీ తరువాతే బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గుజరాత్ హైకోర్టు సీజే పదవికి జస్టిస్ సుభాష్‌రెడ్డి పేరును సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఆ సిఫారసుకు ఆమోదముద్ర వేస్తూ సంబంధిత ఫైల్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శనివారం సాయంత్రం సంతకం చేశారు. అందుకు సంబంధించిన వారెంట్ సైతం సుభాష్‌రెడ్డికి అందింది. గుజరాత్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుభాష్‌రెడ్డి నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయ శాఖ ఈ వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ జయంత్ ఎం.పటేల్ కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్లిన తరువాత జస్టిస్ సుభాష్‌రెడ్డి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. ఇందుకు పది, పదిహేను రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. న్యాయమూర్తిగా జస్టిస్ సుభాష్‌రెడ్డి పలు కీలక తీర్పులు వెలువరించారు. సుభాష్‌రెడ్డి ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో నంబర్ టూగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కోటాలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ కుటుంబం నుంచి సీజే వరకు వివాదరహితుడిగా పేరున్న జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి 1957లో మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం కామారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రామయ్యగారి జగన్నాథరెడ్డి, విశాలదేవి ఆయన తల్లిదండ్రులు. శంకరంపేటలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత ఓయూ నుంచి లా డిగ్రీ పొందారు. 1980 అక్టోబర్ 30న ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి(హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత లోకాయుక్త) వద్ద న్యాయవాద జీవితాన్ని ప్రారంభించారు. సుభాష్‌రెడ్డి సోదరినే జస్టిస్ సుభాషణ్‌రెడ్డి వివాహం చేసుకున్నారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి న్యాయమూర్తిగా నియమితులైన తరువాత తన సహచరులు రఘువీర్‌రెడ్డితో కలసి సుభాష్‌రెడ్డి సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నిజామాబాద్‌లో ప్రముఖ న్యాయవాది అయిన బి.ఆర్.గంగారెడ్డి కుమార్తె రజితను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు ఆర్.అశ్విన్‌రెడ్డి ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేస్తుంటే, రెండో కుమారుడు సుశాంత్‌రెడ్డి తండ్రి అడుగుజాడల్లో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన అంశాల్లో జస్టిస్ సుభాష్‌రెడ్డికి పట్టు ఉంది. పలు సంస్థలకు, వర్సిటీలకు ఆయన న్యాయవాదిగా పనిచేశారు. 2001-02లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2002, డిసెంబర్ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 జూన్‌లో శాశ్వత న్యాయమూర్తి అయ్యా రు. న్యాయమూర్తిగా ఆయన హైకోర్టులో పలు కీలక కమిటీలకు నేతృత్వం వహించారు. ఎంత పెద్దోడైనా ఊరును మరవలే.. జస్టిస్ సుభాష్‌రెడ్డి ఎంత పెద్దోడు అయినా సొంత ఊరును మరువలేదు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారని తెలిసి ఎంతో సంబరపడ్డాం. గ్రామానికి ఎప్పుడు వచ్చినా యోగక్షేమాలు అడుగుతారు. గ్రామంలో ఎందరికో సహాయం చేశారు. ఊరు నుంచి ఎవరు వెళ్లినా ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టనిదే వదలరు. - చిన్ననాటి గురువు తారక పోచయ్య, కామారం మా ఊరు చేసుకున్న అదృష్టం మా గ్రామానికి చెందిన సుభాష్‌రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం మా ఊరు చేసుకున్న అదృష్టం. గ్రామంలో రోడ్ల అభివృద్ధి ఆయన చలవతోనే సాధ్యమైంది. ఆయన సొంత నిధులతో హనుమాన్ దేవాలయం ప్రహరీని నిర్మించారు. మా కష్టసుఖాల్లో పాలు పంచుకున్న ఆయనను మేము ఎప్పటికీ మరచిపోలేం. - హేమలత, కామారం సర్పంచ్ పురిటిగడ్డలో హర్షాతిరేకాలు చిన్నశంకరంపేట: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడంపట్ల ఆయన పురిటిగడ్డ మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం కామారం గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నా.. సాధారణ పౌరుడిలా గ్రామానికి వస్తూ అందరినీ పలకరిస్తూ యోగక్షేమాలను కనుక్కునేవారని స్థానికులు గుర్తుచేసుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం ఆయన కృషి వల్లే జరిగిందన్నారు. ఇటీవల గ్రామంలో తన సోదరుడి కుమారుడి పెళ్లికి వచ్చి పోచమ్మ గుడిలో మొక్కులు తీర్చుకున్నారని చెప్పారు. -
ప్రధానికి ఊరట
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి ఊరట లభించింది. ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు దాఖలు చేసిన పిటిషన్ విషయంలో కిందిస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. తాజాగా దాఖలు చేసిన పిటిషన్లో పెద్దగా మెప్పించే విషయాలేమీ లేవని, గతంలో పేర్కొన్న ఆరోపణలే ఉన్నాయని తెలిపింది. 2014లో ఏప్రిల్ 30న లోక్ సభ ఎన్నికలు జరిగిన సందర్భంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే మోదీ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంలో తాను ఓటు వినియోగించుకున్నట్లు సిరా గుర్తు ఉన్న వేలిని చూపిస్తూ దానితోపాటు పార్టీ గుర్తు కమలాన్ని ప్రదర్శించారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త ఒకరు నాడు పిటిషన్ వేయగా కిందిస్థాయి కోర్టు మోదీని సమర్థించి పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో అతడు హైకోర్టుకు వెళ్లగా మరోసారి అదే పరాభవం ఆప్ కార్యకర్తకు ఎదురైంది. కిందిస్థాయి కోర్టు సరైన తీర్పునే ఇచ్చిందని హైకోర్టు స్పష్టం చేసింది. -
హార్దిక్ పటేల్‌ది దేశద్రోహమే: గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్లకోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్.. దేశద్రోహి అని నిరూపించేలా ప్రాథమిక ఆధారాలున్నాయని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులను చంపాలనటం దేశద్రోహం కిందకే వస్తుందని.. అందువల్ల సూరత్ పోలీసులు హార్దిక్ పటేల్‌పై నమోదు చేసిన కేసు కొట్టేసేది లేదని జస్టిస్ జేబీ పార్దివాలా తీర్పునిచ్చారు. అయితే హార్దిక్‌పై నమోదు చేసిన కేసులో 153(ఏ) - రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించటంను తొలగించాలని పోలీసులను ఆదేశించారు. -
హార్దిక్‌కు హైకోర్టు మందలింపు
అహ్మదాబాద్: గుజరాత్లో మంగళవారం ఓ బహిరంగ సభ తర్వాత తనను ఆగంతకులు కిడ్నాప్ చేశారంటూ పటీదార్ అనామత్ అందోళన్ నేత హార్దిక్ పటేల్ చెప్పేదంతా కట్టుకథలా ఉందంటూ గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అనవసరంగా కోర్టును దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని హార్దిక్‌ను, ఆయన న్యాయవాదిని మందలించింది. మంగళవారం ఆరావళి జిల్లాలో ప్రజాసభ తర్వాత హార్దిక్ అదృశ్యం నేపథ్యంలో ఆయన అనుచరుడు హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను గురువారం డివిజన్ బెంచ్ విచారించింది. అవసరమనుకుంటే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తుచేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదావేసింది. -
అబార్షన్‌కు అనుమతించం
అహ్మదాబాద్: అత్యాచారానికి గురైన తన కూతురికి అబార్షన్ చేయించేందుకు అనుమతించాలని ఓ తండ్రి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు అందుకు నిరాకరించింది. 20 వారాలు దాటిన తర్వాత భారతీయ చట్టం ఇలాంటి పనులకు అంగీకరించదని స్పష్టం చేసింది. టైపాయిడ్ జ్వరంతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలిక వైద్యం నిమిత్తం ఓ వైద్యుడిని సంప్రదించగా అతడు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అబార్షన్‌కు అనుమతించాలంటూ ఆమె తండ్రి గతవారం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన ధర్మాసనం.. గర్భం దాల్చిన తర్వాత 20 వారాలు దాటితే భారతీయ చట్టం అబార్షన్‌కు అనుమతించదని.. ప్రస్తుతం ఆ అమ్మాయికి 24 వారాలు పూర్తయినందున రేప్ బాధితురాలు అయినా అబార్షన్‌కు చట్టం ఒప్పుకోదని స్పష్టం చేసింది. ప్రసవం పూర్తయ్యేవరకు ఆమె మంచిచెడులు చూసుకోవాలని, పరిహారంగా ఆమెకు లక్ష రూపాయలు చెల్లించాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.