అహ్మదాబాద్: ప్రధాని మోదీ డిగ్రీపై వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోదీ డిగ్రీపై దూషణపూర్వక, వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో కేజ్రీవాల్‌కు కింది కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈమేరకు కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ హస్ముఖ్ సుతార్ నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది. ఇద్దరు నేతలు తమ వాదనలను ట్రయల్ కోర్టు ముందే వినిపించాలని సూచించింది. ప్రధాని డిగ్రీపై తమ వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ యూనివర్సిటీ సెషన్స్‌కోర్టులో కాకుండా మెజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టడాన్ని తొలుత సెషన్స్ కోర్టులో కేజ్రీవాల్ సవాల్ చేశారు.
కేజ్రీవాల్ రివిజన్ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తోసిపుచ్చడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు సూచనలతో హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి.. కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. కాసేపటికే
Comments
Please login to add a commentAdd a comment