
బిలాస్‌పూర్‌లో కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై గుర్తు తెలియని దుండగులు 12 రౌండ్లు కాల్పులు జరిపారు. శుక్రవారం.. బిలాస్‌పూర్‌లోని తన నివాసంలో జరిగిన ఈ కాల్పుల్లో ఠాకూర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు సెక్యురిటీ అధికారి కూడా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలుకు బుల్లెట్ దిగినట్లు సమాచారం. ఈ దాడి ఎవరు చేశారనేదానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
ఠాకూర్‌ను మొదట సురక్షిత ప్రదేశానికి తరలించగా, ఆయన పీఎస్ఓను నేరుగా ఆసుపత్రికి తరలించారు. తరువాత, ఠాకూర్‌ను కూడా ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం బిలాస్‌పూర్ ప్రాంతీయ ఆసుపత్రి నుండి ఎయిమ్స్ బిలాస్‌పూర్‌కు తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
बंबर ठाकुर पर गोली लगने का CCTV आया सामने#Bilaspur #BumberThakur #CCTVVideo #HimachalPradesh pic.twitter.com/PEdY1VMye9
— Punjab Kesari-Himachal (@himachalkesari) March 14, 2025
Comments
Please login to add a commentAdd a comment