shot
-
భాగ్యనగరంలో భలే జోరు
సినిమా షూటింగ్స్ అంటే లోకల్లోనే కాదు... నాన్ లోకల్‌లోనూ జరుగుతుంటాయి. దేశంతో పాటు విదేశాల్లోనూ చిత్రీకరణకు మేకర్స్ ఆసక్తి చూపుతుంటారు. అయితే ప్రస్తుతం భాగ్యనగరంలో (హైదరాబాద్) సినిమా షూటింగ్‌లు భలే జోరుగా సాగుతున్నాయి. బాలకృష్ణ, పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేశ్‌బాబు, నాని, ‘అల్లరి’ నరేశ్, నిఖిల్, సాయిదుర్గా తేజ్ వంటి హీరోలంతా హైదరాబాద్‌తో పాటు పరిసరప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో జోరుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం... నాలుగో సారి... హీరో బాలకృష్ణ–డైరెక్టర్ బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ నిర్మించిన సెట్లో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ, ఆదిలపై చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని మెయిన్ హైలైట్లలో ఒకటిగా ఉండనుంది. ఫైట్ మాస్టర్లు రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: సి. రాంప్రసాద్, సంతోష్ డి. ముచ్చింతల్‌లో వీరమల్లు పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్యప్రొడక్షన్స్పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్‌లో జరుగుతోందని టాక్. పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి కెమేరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్. బిజీ రాజా వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. చిత్ర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయింది. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇలా ఒకవైపు షూటింగ్ మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలతో ‘రాజా సాబ్’ యూనిట్ బిజీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ప్రత్యేకమైన సెట్లో... ప్రభాస్ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇందులో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు ప్రభాస్. బ్రిటిష్ కాలం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారని టాక్. ప్రస్తుతం ప్రభాస్, ఇతర లీడ్ యాక్టర్స్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్‌పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతదర్శకుడు.అల్యూమినియం ఫ్యాక్టరీలో... హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.అమేజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా సెట్స్ వేశారట. ప్రస్తుతం మహేశ్‌బాబుపై కొన్సి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. ఈ షెడ్యూల్ తర్వాత కెన్యాలో షూటింగ్ ఆరంభం కానుందని టాక్. కాగా ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఆమె హీరోయిన్గా కాదు.. విలన్ పాత్ర చేయనున్నారని తాజా టాక్. పవర్ఫుల్ అర్జున్ సర్కార్ ‘హిట్’ సినిమా సిరీస్‌లో వస్తోన్న మూడో భాగం ‘హిట్: ది థర్డ్ కేస్’. నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. యునానిమస్ప్రొడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్‌పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు నాని. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కాశ్మీర్లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు టాకీ పార్ట్‌ని చిత్రీకరించిన తర్వాత తాజా షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. హీరో, హీరోయిన్, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్. మే 1న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్. తప్పించుకోలేరు ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఆర్ 63’ (వర్కింగ్ టైటిల్). ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీ ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నరేశ్ బర్త్‌డే సందర్భంగా జూన్ 30న ‘మీరు అతని కంటి నుంచి తప్పించుకోలేరు’ అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. యుద్ధ వీరుడు ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్ధార్థ్. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జానర్లో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యుద్ధ వీరుడిగా కనిపించనున్నారు నిఖిల్. ఈ పాత్ర కోసం ప్రత్యేకించి మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో జరుగుతోంది. హీరోతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రం ఈ వేసవిలో రిలీజ్ కానుంది. ఏటిగట్టుపై సంబరాలు ‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియాప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరోతో పాటు ఇతర నటీనటులు షూట్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడంలో విడుదల కానుంది. ఇవే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్, పరిసరప్రాంతాల్లో జరుగుతున్నాయి.చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ముచ్చింతల్‌లోని ఆలయంలో ఈ నెల 14 నుంచిప్రారంభం కానుందట. ఈ సాంగ్ షూట్లో చిరంజీవితో పాటు హీరోయిన్లు పాల్గొననున్నారని టాక్. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతదర్శకుడు. ఈ చిత్రం జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. అయితే కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం చిత్రయూనిట్ ప్రకటించలేదు. రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని భూత్ బంగ్లాలో ముగిసింది. రామ్‌చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై రాత్రి వేళ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు బుచ్చిబాబు. ఈ మూవీ చివరి రోజు షూటింగ్‌కి తన కుమార్తె క్లీంకారని రామ్‌చరణ్ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య
ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఉన్న స్నేహ సంబంధాలు మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట(అజిత్‌పవార్) సీనియర్ నేత బాబా సిద్దిఖీని బలి తీసుకున్నాయి. రాజస్తాన్‌లో బిష్ణోయ్ తెగ ప్రజలు పరమ పవిత్రంగా భావించే కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్‌పై కక్షగట్టిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఆయన సన్నిహితుడు సిద్దిఖీని దారుణంగా హత్య చేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో దసరా పండుగ రోజే జరిగిన ఈ హత్యాకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబై బాంద్రా ఈస్ట్ ప్రాంతంలోని నిర్మల్ నగర్లో బాబా సిద్దిఖీ కుమారుడు, మహారాష్ట్ర ఎమ్మెల్యే జీషాన్ సిద్దిఖీ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి 9.30 గంటలకు ముగ్గురు యువకులు ముఖాలకు కర్చీఫ్‌లు ధరించి, కార్యాలయం ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. అక్కడే ఉన్న బాబా సిద్దిఖీపై 9.9 ఎంఎం పిస్తోల్ గురిపెట్టారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపి, వెంటనే పరారయ్యారు.నగరంలో పండుగ సందర్భంగా టపాసుల మోత వల్ల ఈ కాల్పుల శబ్ధం బయటకు వినిపించలేదు. 66 ఏళ్ల సిద్దిఖీ కడుపు, ఛాతీలోకి తూటాలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్రంగా రక్తస్రావం జరిగింది. లీలావతి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించినట్లు రాత్రి 11.27 గంటలకు డాక్టర్లు నిర్ధారించారు. హత్య చేసింది మేమే.. 1998 సెప్టెంబర్‌లో రాజస్తాన్‌లోని జోద్పూర్ సమీపంలో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ఆటవిడుపుగా కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ ఇచి్చంది. కృష్ణ జింకలను చంపేసినందుకు సల్మాన్ ఖాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయన మిత్రులను వేటాడడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే బాబా సిద్దిఖీని హత్య చేశామని ప్రకటించింది. శనివారం రాత్రి సిద్దిఖీ హత్య జరగ్గా, ఆదివారం ఫేసుబుక్‌లో లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు శిబూ లోంకర్ అలియాస్ శుభం రామేశ్వర్ లోంకర్ పేరిట ఓ పోస్టు ప్రత్యక్షమైంది. సల్మాన్ ఖాన్‌కు మిత్రుడు కావడంతోపాటు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో సంబంధాలు కొనసాగిస్తుండడం వల్లే సిద్దిఖీని హత్య చేశామని లోంకర్ తేలి్చచెప్పారు. సల్మాన్‌కు సహకరిస్తే ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సల్మాన్ ఖాన్‌తోపాటు దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధాలు కొనసాగిస్తే సిద్దిఖీకి పట్టిన గతే పడుతుందని స్పష్టం చేశారు. అలాగే తమ ముఠా సభ్యుడైన అనూజ్ థపన్ మరణానికి కారణమైన వారిని శిక్షించామని పేర్కొన్నారు. కాంట్రాక్టు హంతకుల పనే బాబా సిద్దిఖీపై కాల్పులు జరిపినవారిలో ఇద్దరిని గుర్మెయిల్ బల్జీత్ సింగ్(23), ధరమ్‌రాజ్ రాజేశ్ కాశ్యప్(19)గా పోలీసులు గుర్తించారు. ధరమ్రాజ్ను ఉత్తరప్రదేశ్‌లో, బల్జీత్ సింగ్‌ను హరియాణాలో అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులమని దర్యాప్తులో వారు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. గత నెల రోజులుగా సిద్దిఖీ కదలికలపై కన్నేసి, పథకం ప్రకారం హత్య చేసినట్లు నిందితులు వెల్లడించారు. సిద్దిఖీపై మూడు రౌండ్లు కాల్పులు జరపగా, ఒకటి ఆయన ఛాతీలోకి, మరొకటి కడుపులోకి దూసుకెళ్లింది. మరొకటి గురి తప్పడంతో సిద్దిఖీ కారు విండ్‌షీల్డ్ ధ్వంసమైంది. కాల్పులు జరిపినవారిలో మూడో నిందితుడు శివ కుమార్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ హత్యాకాండతో మరో నిందితుడి ప్రమేయం ఉందని, అతడిని మొహమ్మద్ జీషాన్ అఖ్తర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వీరంతా కాంట్రాక్టు హంతకులేనని తెలిపారు.సిద్దిఖీని హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చున్న నిందితులు అడ్వాన్స్ తీసుకున్నారని, కొద్దిరోజుల క్రితమే ఆయుధాలు సమకూర్చుకున్నారని వివరించారు. హత్య జరిగిన సమయంలో సిద్దిఖీ సమీపంలో ఒక కానిస్టేబుల్ ఉన్నాడని చెప్పారు. నిందితుల నుంచి రెండు పిస్తోళ్లు, 28 తూటాలు స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసు కస్టడీకి నిందితుడు బాబా సిద్దిఖీ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం ముంబై కోర్టులో హాజరుపర్చారు. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ వైరంతో ఈ హత్య జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో కుట్ర ఏదైనా జరిగిందా? అనేది తేల్చాల్సి ఉందన్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. నిందితుల్లో ఒకడైన హరియాణా వాసి గుర్మెయిల్ బల్జీత్ సింగ్(23)ను ఈ నెల 21 దాకా పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తాను మైనర్‌నని మరో నిందితుడు వాదించాడు. దాంతో అతడికి వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం తమ ఎదుట హాజరుపర్చాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఏమిటీ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్? పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో జన్మించిన లారెన్స్ బిష్ణోయ్(33) అనే గ్యాంగ్‌స్టర్ ఈ ముఠాను ఏర్పాటు చేశాడు. చండీగఢ్‌లో విద్యార్థి రాజకీయాల ద్వారా నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. అతడిపై 20కిపైగా కేసులున్నాయి. ముఠాలో దాదాపు 700 మంది షూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు అందరికీ తెలిసింది. 2023 నవంబర్‌లో మరో పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్ నివాసం వద్ద ఈ ముఠా కాల్పులు జరిపింది. సల్మాన్ ఖాన్‌ను సోదరుడు అని సంబోధించినందుకు గ్రేవాల్‌ను టార్గెట్ చేసినట్లు ప్రకటించింది. గత నెలలో కెనడాలో గాయకుడు ఎ.పి.థిల్లాన్ను హత్య చేసేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం దేశ విదేశాల్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బిష్ణోయ్ ప్రస్తు తం గుజరాత్లో సబర్మతి జైలులో ఉన్నాడు.నివాళులర్పించారు. సల్మాన్ ఖాన్ తన మిత్రుడు బాబా సిద్దిఖీపై జరిగిన హత్యాయత్నం గురించి తెలిసిన వెంటనే సల్మాన్ ఖాన్ లీలావతి హాస్పిటల్‌కు వచ్చారు. సిద్దిఖీ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. ఆదివారం సాయంత్రం బాంద్రాలోని సిద్దిఖీ అపార్టుమెంట్ వద్దకు సల్మాన్ చేరుకున్నారు. సిద్దిఖీ మృతదేహం వద్ద నివాళులర్పించారు. సల్మాన్ కుటుంబ సభ్యులైన సోహైల్ ఖాన్, షురా ఖాన్, అరి్పతాఖాన్ శర్మ, అల్విరా అగి్నహోత్రి, సల్మాన్ స్నేహితురాలు లులియా వంతూర్తోపాటు పలువురు బాలీ వుడ్ ప్రముఖులు సైతం నివాళులరి్పంచారు. హత్య వెనుక వ్యాపార విభేదాలు? సల్మాన్‌తో సంబంధాలు ఉన్నందుకు బాబా సిద్దిఖీని తామే హత్య చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించినప్పటికీ, వ్యాపార విభేదాలు కారణం కావొచ్చని ప్రచారం సాగుతోంది. 2000 నుంచి 2004 దాకా మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా పనిచేశారు. అప్పట్లో మురికివాడ పునరావాస ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో రూ.2 వేల కోట్ల దాకా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2014లో సిద్దిఖీతోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. 2018లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్దిఖీకి చెందిన రూ.462 కోట్ల ఆస్తులను ఆటాచ్ చేసింది. వ్యాపార గొడవల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దుండగులను కఠినంగా శిక్షిస్తాం: ఏక్నాథ్ షిండే బాబా సిద్దిఖీ హత్యాకాండపై మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా వివిధ పారీ్టల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సిద్దిఖీని పొట్టనపెట్టుకున్న దుండగులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లీలావత్ హాస్పిటల్‌కు చేరుకొని వైద్యులతో మాట్లాడారు. తన విశ్వసనీయ సహచరుడు, సన్నిహి త మిత్రుడైన సిద్దిఖీ హత్యకు గురికావడం బాధాకరమని అజిత్ పవార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటన వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మైనారీ్టల సంక్షేమం, మత సామరస్యం కోసం సిద్దిఖీ నిరంతరం పోరాటం సాగించారని అజిత్ పవార్ కొనియాడారు. కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి.. బాబా సిద్దిఖీ అలియాస్ జియా ఉద్దీన్ సిద్దిఖీ 1953 సెప్టెంబర్ 13న బిహార్ రాజధాని పాట్నాలో జని్మంచారు. బాల్యంలో కుటుంబంతోపాటు ముంబైకి వలస వచి్చ, అక్కడే పెరిగారు. రాజకీయాలపై ఆసక్తితో 1977లో కాంగ్రెస్ పారీ్టలో చేరారు. చురుకైన నాయకుడిగా పేరు సంపాదించారు. స్థానిక ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ తక్కువ కాలంలోనే పార్టీలో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. 1980లో బాంద్రా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లలో బాంద్రా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 1988లో ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నియ్యారు. 1992లో ముంబై మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. 1999లో తొలిసారిగా బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు జయకేతనం ఎగురవేశారు. 2014 దాకా ఎమ్మెల్యేగా కొనసాగారు. 2004 నుంచి 2008 దాకా మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల, కారి్మక శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయ వర్గాలతోపాటు బాలీవుడ్ ప్రముఖులతో సిద్దిఖీకి చక్కటి సంబంధాలున్నాయి. ఆయన ఇచ్చే భారీ ఇఫ్తార్ విందులకు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యేవారు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సంజయ్ దత్తో సిద్దిఖీ సన్నిహితంగా మెలిగేవారు. సల్మాన్, షారుక్ మధ్య ఐదేళ్లపాటు నెలకొన్న వివాదాన్ని స్వయంగా పరిష్కరించారు. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఎన్సీపీలో చేరారు. సిద్దిఖీ కుమారుడు జీషాన్ సిద్దిఖీ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే. ముంబై ముస్లిం ప్రజల్లో గట్టి పట్టున్న బాబా సిద్దిఖీ రాకతో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ లబ్ధి పొందింది. ఇదిలా ఉండగా, కరోనా మహమ్మారి ఉధృతి సమయంలో బాబా సిద్దిఖీ అందించిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ప్రజలకు ప్రాణాధార ఔషధాలు, పీపీఈ కిట్లు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఈ యుద్ధం మేము కోరుకోలేదు ‘‘ఓం జైశ్రీరామ్, జైభారత్. జీవితం గురించి నాకు తెలుసు. నా దృష్టిలో ఆస్తులకు, మానవ శరీరానికి పెద్దగా విలువ లేదు. ఏది సరైందో అదే చేశాం. స్నేహం అనే బాధ్యతను గౌరవించాం. నిజానికి ఈ యుద్ధం మేము కోరుకోలేదు. కానీ, సల్మాన్ ఖాన్ వల్ల మా సోదరుడు అనూజ్ థపన్ ప్రాణాలు కోల్పోయాడు. మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. కానీ, సల్మాన్ ఖాన్‌కు, దావూద్ ఇబ్రహీంకు ఎవరైనా సహరిస్తే వారి లెక్కలు సరిచేస్తాం. గతంలో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద దావూద్‌తోపాటు సిద్దిఖీ కూడా నిందితుడే. మా సోదరుడు థపన్ మరణం, సల్మాన్, దావూద్‌తో సంబంధాలు, బాలీవుడ్, రాజకీయాల్లో భాగస్వామ్యం, ఆస్తుల సెటిల్మెంట్ల వ్యవహారాలే సిద్దిఖీ హత్యకు కారణం. మా సభ్యుల్లో ఎవరినైనా చంపేస్తే తగిన రీతిలో జవాబిస్తాం. మొదట దాడి మేము చేయం. ప్రత్యర్థులు దాడి చేస్తేనే ప్రతిస్పందిస్తాం. అమరులకు మా వందనాలు’’ అని ఫేసుబుక్ పోస్టులో లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు శిబూ లోంకర్ తేలి్చచెప్పాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనూజ్ థపన్ మరణానికి ప్రతీకారం? సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి గత కొన్నేళ్లుగా హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో ఆయనకు మహారాష్ట్ర పోలీసులు పటిష్టమైన భద్రత కలి్పస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బైక్‌పై వచి్చన ఇద్దరు వ్యక్తులు ముంబైలో సల్మాన్ ఇంటి ఎదుట తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఇద్దరిలో అనూజ్ థపన్ ఉన్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న థపన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మే 1న ముంబై క్రైమ్ బ్రాంచ్ లాకప్‌లో శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పగా, పోలీసులే చిత్రహింసలు పెట్టి చంపేశారని థపన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. థపన్ మరణం పట్ల ప్రతీకారంతో రగిలిపోయిన బిష్ణోయ్ ముఠా బాబా సిద్దిఖీని అంతం చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇది కూడా చదవండి: డీయూ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత -
ఆర్జేడీ నేతపై కాల్పులు.. పరిస్థితి విషమం
ముంగేర్: బీహార్‌లోని ముంగేర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంకజ్ యాదవ్‌పై కొందరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంకజ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఖాసిం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్పోర్ట్ గ్రౌండ్స్‌లో పంకజ్ యాదవ్ మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే పంకజ్‌యాదవ్ కింద పడిపోయారు. స్థానికులు అతనిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పంకజ్‌యాదవ్ ఛాతీ దగ్గర బుల్లెట్ తగిలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కుటుంబసభ్యులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు అన్నిప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ, ముంగేర్ ఘటన బాధాకరమని, దోషులను తప్పకుండా పట్టుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.ఇది కూడా చదవండి: బహ్రాయిచ్‌లో పట్టుబడిన చిరుత -
గో హంతకునిపై పోలీసుల కాల్పులు
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసులు వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. తాజాగా పోలీసులు ఉన్నావ్‌లో గో హంతకునిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.గోవులను వధించి, వాటి అవశేషాలను బహిరంగంగా పారవేసిన కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిని గమనించిన నిందితుని సహచరుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పులలో గాయపడిన వ్యక్తిని మహతాబ్ ఆలం ఖురేషీగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.అన్వర్ నగర్, కృష్ణ నగర్లలో గోవులను వధించారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోహత్యపై విచారణ చేపట్టి, వారికి లభ్యమైన ఆవుల అవశేషాలను పాతిపెట్టారు. అయితే దీనిపై కలకలం చెలరేగడంతో పోలీసు అధికారి సోనమ్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు గోహత్య ఘటనలో ప్రమేయమున్న నిందితులపై కాల్పులు జరిపారు. ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు -
రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం..అప్ఘాన్ జిమ్ ఓనర్ మృతి
దేశా రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అప్ఘాన్కి చెందిన 35 ఏళ్ల జిమ్ యజమానికి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తరంజన్ పార్క్‌లో నివశిస్తున్న అఫ్ఘాన్‌కు చెందిన జిమ్ యజమాని నాదిర్ షా పార్క్ చేసిన రెండు కార్ల పక్కన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. సరిగ్గా గురువారం రాత్రి 10.40 గంటలకు గళ్లచొక్కా ధరించిన వ్యక్తి ఆ ఇద్దరు వ్యక్తులపై అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నాదిర్ షా తీవ్రంగా గాయపడగా, మరొక వ్యక్తి ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అనతరం దుండగుడు కొన్ని మీటర్ల దూరంలో పార్క్ చేసిన మోటార్ సైకిల్‌పై ఎక్కి తప్పించుకున్నాడు. దుండగడు దాదాపు ఆరు నుంచి ఎనిమి రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. అలాగే ఘటనా స్థలంలో బుల్లెట్ ప్రక్షేపకాలు, ఖాళీ కాట్రడ్జ్లు లభించాయి. తీవ్రంగా గాయపడిన బాధితుడు నాదిర్ షాను మాక్స్ ఆస్పత్రికి తరలించగా..అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని వెల్లడించారు అధికారులు. అయితే దాడి చేసిన వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి అతడిపై కాల్పులు జరిపి పారిపోయారని చెబుతున్నారు . అయితే బాధితుడు నాదిర్ షాకి దుబాయ్‌లో పలు వ్యాపారాలు ఉన్నాయని, అలాగే అతడిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అంతేగాదు అతడు ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారులకు తెలిసిన పోలీస్ ఇన్ఫార్మర్ అని అధికారిక వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా..ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ సన్నిహితుడు రోహిత్ గోదారా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ పెద్ద దుమారం రేపింది. ఆ పోస్ట్‌లో తీహార్ జైలులో ఉన్న తన సన్నిహితుడు సమీర్ బాబా వ్యాపార ఒప్పందాలను అడ్డుకోవడంతోనే తాను నాదిర్ షాను అంతమొందించాలని తన సహాయకులను ఆదేశించినట్లు రోహిత్ గోదారా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు. పైగా ఎవరైనా ఆ ధైర్యం చేస్తే వారికి అదే గతిపడుతుందని హెచ్చరించడం గమనార్హం.(చదవండి: వేధించే ఎన్ఆర్ఐ భర్తలపై కొరడా) -
హర్యానాలో ఏఎస్ఐ కాల్చివేత
హర్యానాలో పోలీసులకు సైతం రక్షణ కరువయ్యింది. దీనికి కర్నాల్‌లో జరిగిన సంఘటన ఉదాహరణగా నిలిచింది. యమునానగర్‌లోని స్టేట్ క్రైమ్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సంజీవ్‌పై బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐని వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సంజీవ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన సంజీవ్ కుటుంబంతోపాటు స్థానికంగా విషాదాన్ని నింపింది.కర్నాల్‌లో నేరపూరిత ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఓంగాడ్ గ్రామంలో ఒక దుకాణం వెలుపల దుండగులు కాల్పులు జరిపిన ఘటన మరువకముందే ఈ ఘటన చోటుచేసుకుంది. తాజా ఘటన కర్నాల్‌లోని కుటేల్ గ్రామ సమీపంలో జరిగింది.సంజీవ్ ఇటీవలే యమునానగర్‌లోని స్టేట్ క్రైమ్ బ్రాంచ్‌లో ఏఎస్ఐగా నియమితులయ్యారు. ఆయన తన ఇంటి బయట వాకింగ్ చేస్తుంగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ సంజీవ్ నుదిటిపై తగలగా, మరొకటి నడుములోనికి దూసుకెళ్లింది. సంజీవ్ సోదరుడు, తండ్రి ఇటీవలే మృతి చెందారు. సంజీవ్ ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
కెనడాలో ప్రముఖ భారత సంతతి బిల్డర్ దారుణ హత్య
కెనడాలో భారత సంతతికి చెందిన ప్రముఖ బిల్డర్ బూటా సింగ్ గిల్ హత్యకు గురయ్యాడు. సోమవారం (ఏప్రిల్ 8) దుండగులు అతడిని కాల్చి చంపారు. ఎడ్మంటన్ లోని గురునానక్ సిక్కు ప్రార్థనామందిరం అధ్యక్షుడు ఉన్నారు.సివిల్ ఇంజనీర్ సరబ్జీత్ సింగ్ అనే మరో వ్యక్తి కూడా కాల్పులు జరిపారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్తితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్బెర్టా ప్రావిన్స్‌లోని మిల్‌వుడ్ రెక్ సెంటర్ సమీపంలో గిల్ వ్యాపారానికి సంబంధించిన నిర్మాణ స్థలంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. గిల్ హత్య స్థానిక వ్యాపారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పార్లమెంటు సభ్యుడు టిమ్ ఉప్పల్, మేయర్ అమర్జీత్ సింగ్ సోహి, రేడియో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మణిందర్ గిల్, గురుశరణ్ సింగ్ బటర్ లాంటి ప్రముఖులు బాధిత కుటుంబాలకు తమ సంతాపాన్ని , సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ ప్రదేశంలో ముగ్గురువ్యక్తులమధ్య వాగ్వాదం జరిగిందని ఇదే కాల్పులకు దారి తీసి ఉంటుందనేది పోలీసుల అనుమానం. అంతేకాదు తనకుబెదిరింపుకాల్స్ వస్తున్నట్టు గతంలో గిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరుగుతోంది.కాగా ఎడ్మంటన్‌లోని ఇతర బిల్డర్లకు కూడా ప్రాణహాని ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. త కొన్ని రోజులుగా, కొత్తగా నిర్మించిన ఇళ్లకు నిప్పు పెట్టిన సంఘటనలు జరిగినట్టు సమాచారం. అంతేకాదు భారతదేశంలోని క్రిమినల్ ముఠాతో లింకున్నముఠా వాట్సాప్ కాల్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోందని స్థానిక పోలిసు అధికారి డేవ్ పాటన్ వెల్లడించారు. ఆరుగురు యువకులను అరెస్టు చేసి అభియోగాలు మోపినట్లు తెలిపారు. -
పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు.. ఒక పోలీసు మృతి!
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి నేడు పోలింగ్ జరుగుతోంది. నాలుగు ప్రావిన్షియల్ అసెంబ్లీలలోని 336 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ఇవి ఎంతో కీలకం కానున్నాయి. కాగా మూడు ప్రావిన్సుల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మూడు ప్రాంతాల్లో పోటీకి దిగిన అభ్యర్థులు మృతి చెందిన నేపధ్యంలో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటిలో ఎన్ఏ-8 (బజౌర్), పీకే-22 (బజౌర్), పీకే-91 (కోహట్), పీపీ-266 (రహీమ్ యార్ ఖాన్) ఉన్నాయి. ఇదిలా ఉండగా పాక్‌లోని ట్యాంక్ ఏరియాలోని ఒక పోలింగ్ బూత్‌పై దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందాడు. ఈ సమాచారాన్ని ఏఆర్వై న్యూస్ వెల్లడించింది. -
మహారాష్ట్రలో ఉద్రిక్తత.. శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు
ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సదరు శివసేన నేత తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. కొద్దికాలంగా ఓ స్థలం వివాదానికి సంబంధించి శివసేన నేత మహేశ్ గైక్వాడ్, బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్‌లతో పాటు వారి మద్దతుదారులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో గణ్‌పత్ గైక్వాడ్.. మహేశ్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. #WATCH | Thane, Maharashtra: Sudhakar Pathare, DCP says, "Mahesh Gaikwad and Ganpat Gaikwad had differences about something and they came to the Police station to give complaint. At that time, they had a talk and Ganpat Gaikwad fired at Mahesh Gaikwad and his people. 2 people… pic.twitter.com/Qw2Q9iUHHz — ANI (@ANI) February 2, 2024 ఇక, కాల్పుల్లో శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ కూడా గాయపడ్డారు. తక్షణమే స్పందించిన పోలీసులు నేతలిద్దరినీ థానేలోని జూపిటర్ హాస్పిటల్‌కు తరలించారు. గణ్‌పత్ గైక్వాడ్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతడు ఉపయోగించిన తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శివసేన మద్దతుదారులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
అమెజాన్ మేనేజర్ హత్య వెనుక 'మాయా గ్యాంగ్'.. అసలేంటిది..?
ఢిల్లీ: అమెజాన్ మేనేజర్ హత్యా ఉదంతంలో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేనేజర్ హర్‌ప్రీత్ గిల్‌ను హత్య చేసింది కేవలం 18 ఏళ్ల వడిలో అడుగుపెట్టిన ఓ యువకుడి నాయకత్వంలోని మాయా గ్యాంగ్ పనేనని పోలీసులు గుర్తించారు. నిందితులు ఇప్పటికే పలు కేసుల్లో నేరస్థులుగా ఉన్నట్లు తెలిపారు. మహమ్మద్ సమీర్(18).. నాలుగు మర్డర్ కేసుల్లో బాల్యనేరస్థునిగా శిక్షను అనుభవిస్తున్నాడు. అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోనూ తుపాకీలకు పోజులిస్తూ, కాల్చడం వంటి ఫొటోలు ఉన్నాయి. అమెజాన్ మేనేజర్ హర్‌ప్రీత్‌ను హత్యచేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన ఇద్దరిలో ఒకరు సమీర్ కాగా.. మరొకరు 18 ఏళ్ల బిలాల్ గని. గని గతేడాది హత్య, దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని చిల్డ్రన్స్ అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు. కాని బయటకు వచ్చి వెల్డింగ్ షాప్‌లో పని చేస్తున్నాడు. Bhajanpura murder: Delhi Police nabs 18-year-old man, says case solved Read @ANI Story | https://t.co/CwwQ54udMf#BhajanpuraCase #DelhiPolice pic.twitter.com/JjWFK7aA5M — ANI Digital (@ani_digital) August 31, 2023 అమెజాన్ మేనేజర్ హత్య.. ఢిల్లీకి చెందిన హర్‌ప్రీత్ గిల్ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు తన మేనమామ గోవింద్‌తో కలిసి సుభాష్ విహార్‌లోని ఇరుకైన సందులో బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొంతమంది యువకులు ఎదురయ్యారు. ఇరుకైన సందులో ట్రాఫిక్ సమస్యపై వచ్చిన గొడవలో నిందితులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. హర్‌ప్రీత్ గిల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మేనమామ గోవింద్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెళ్లడించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. -
కోర్టు కాంప్లెక్స్‌లోనే లాయర్ దారుణ హత్య..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో దారుణం జరిగింది. కోర్టు కాంప్లెక్స్‌లో తన ఛాంబర్లో ఉన్న మోను చౌదరి అనే లాయర్ని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. న్యాయవాది తన సన్నిహితులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. కోర్టులో సెక్యూరిటీ కళ్లుగప్పి దుండగులు ఎలా ప్రవేశించారనేది మిస్టరీగా మారింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లాయర్లు తమ ఛాంబర్లలోకి వెళ్లి భోజనాలు చేస్తున్నారు. లాయర్ మోను చౌదరి కూడా తన సన్నిహితులతో కలిసి భోజనం చేస్తుండగా.. దుండగులు అకస్మాత్తుగా తన ఛాంబర్లోకి ప్రవేశించి గన్లతో కిరాతకంగా కాల్చి చంపారు. న్యాయవాది రక్తపు మడుగులు పడి ఉండగా.. దుండగులు తప్పించుకుని పారిపోయారు. ఆయితే.. పోలీసులకు న్యాయవాదులకు మధ్య జరుగుతున్న హాపూర్ లాయర్ల ఆందోళన తర్వాత ఈ ఘటన జరగడం పోలీసులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులో సెక్యూరిటీని దాటుకుని దుండగులు పిస్టళ్లతో ఎలా ప్రవేశించగలిగారనేది మిస్టరీగా మిగిలింది. సెక్యూరిటీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం వివాదాస్పదంగా మారింది. లాయర్ మోను చౌదరి హత్యపై లాయర్ల సంఘాలు భగ్గుమన్నాయి. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హాపూర్ లాయర్ల ఆందోళన.. ఓ లాయర్, అతని తండ్రిపై తప్పుడు కేసు పెట్టినందుకు న్యాయవాదుల సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఈ ఆందోళనలను అదుపుచేయడానికి పోలీసులు.. లాయర్లపై లాఠీఛార్జీ చేశారు. దీంతో న్యాయవాదులపై పోలీసుల చర్యలు హక్కులను భంగపరచడమేనని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. శాంతియుత నిరసనలు చేపట్టిన లాయర్లపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని తప్పబట్టింది. ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. -
దారుణం: ప్రముఖ జర్నలిస్టు హత్య..
పాట్నా: బిహార్‌లో దారుణం జరిగింది. నలుగురు గుర్తు తెలియని దుండగులు ఓ జర్నలిస్టుని కిరాతకంగా హత్య చేశారు. రాణిగంజ్ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టు ఇంటి ప్రాంగణంలోనే ఈ దాడి జరిగింది. ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. జర్నలిస్టు విమల్ యాదవ్ దైనిక్ జాగరణ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నలుగురు దుండగులు ఆయన తలుపుతట్టారు. విమల్ గుమ్మం వద్దకు రాగానే దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జర్నలిస్టు విమల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిపై ఆస్పత్రి వద్ధ భారీ సంఖ్యలో గుమికూడిన జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోక్ జన్‌శక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో జర్నలిస్టులు, పోలీసులకే రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన సీఎం నితీష్ కుమార్.. దుండగులను పట్టుకునేందుకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామని అన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ నాయకుడిపై ప్రశంసలు.. కారణం ఏమై ఉంటుందంటారు? -
తండ్రి ప్రేమకు పరాకాష్ట.. కన్నీరు పెట్టిస్తున్న వాంగ్మూలం!
ఏసీ కూలింగ్ విషయమై ఆ తండ్రీ కొడుకుల మధ్య వివాదం జరిగింది. ఆగ్రహంతో రగిలిపోయిన కుమారుడు వెంటనే తుపాకీ తీసుకుని, తండ్రిపై తూటాల వర్షం కురిపించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులతో ఏమి చెప్పాడో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలో ఆ సమయంలో కలకలం చెలరేగింది. ఏసీ కూలింగ్ విషయమై జరిగిన వివాదంలో కుమారుడు తండ్రిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటాలు ఆ వృద్ధుడైన ఆ తండ్రి రెండు కాళ్లలోకి దూసుకుపోయాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మరింత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని అమృత్‌సర్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ ఘటన హోషియార్ పూర్ జిల్లాలోని జలాల్‌చక్క గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వీర్‌సింగ్ తన కుమారుడు అమర్‌సింగ్‌తో పాటు ఇంటిలో ఉంటున్నాడు. వారి ఇంటిలోని ఏసీ సరైన చల్లదనాన్ని అందించడం లేదు. దీంతో కుమారుడు ఏసీకి మరమ్మతు చేయించాలని తండ్రికి చెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ‘వాడు తప్పు చేశాడని.. నేను చేయను’ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి పోలీసులతో మాట్లాడుతూ..‘ నా కొడుకు మద్యం మత్తులో ఉన్నాడు. వాడు ఆగ్రహంతో లైసెన్స్ కలిగిన తుపాకీతో నాపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నా రెండు కాళ్లలోకి బుల్లెట్లు దిగాయి. వాడు మద్యం మత్తులో తప్పు చేశాడు. నేను వాడికి తండ్రిని అయిన కారణంగా అతనిని అరెస్టు చేయించి, తప్పు చేయలనుకోవడం లేదు. నా కుమారునిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వేడుకుంటున్నాను’ అని అన్నాడు. ఘటన ఆధారంగా దర్యాప్తు: పోలీసులు ఈ ఉదంతంపై పోలీసు అధికారి బల్విందర్ సింగ్ మాట్లాడుతూ సమాచారం అందగానే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని అన్నారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందున్నాడు. ఘటనపై తమకు ఫిర్యాదు చేసేందుకు నిరాకరిస్తున్నాడు. ఒకవేళ అతను కుమారునిపై ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామన్నారు. ఇది కూడా చదవండి: ‘ఇక చూసింది చాలు పడుకో’ అని తల్లి అనడంతో.. -
పాక్ చొరబాటుదారుల కాల్చివేత..డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దులు దాటి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరిని కాల్చివేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. రాజస్తాన్‌లోని బార్మేర్ వద్ద పాక్ సరిహద్దులవెంట సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వారినుంచి మూడు ప్యాకెట్లలో హెరాయిన్ దొరికిందని బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. తెలిపింది. వారిద్దరినీ డ్రగ్స్ స్మగ్లర్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. (చదవండి: మహిళల కోసమే 102 అంతస్తుల భవనం! కేవలం వారు తప్ప..) -
వేరొకరి ఇంటి డోర్‌బెల్ మోగించాడని నిర్ధాక్షిణ్యంగా చంపబోయాడు..కానీ..
ఓ టీనేజర్ పొరపాటున మరొకరి ఇంటి బెల్ మోగించాడు. అంతే ఓ వ్యక్తి ఏ మాత్రం కనికరం లేకుండా తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ టీనేజర్ తలలోకి రెండు తూటాలు దూసుకుపోయాయి. దీంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ భయానక ఘటన అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..16 ఏళ్ల అఫ్రికన్ అమెరికన్ రాల్ఫ్ పాల్ యార్ల అనే వ్యక్తి తన కవల సోదరులను స్నేహితుడి ఇంటి నుంచి పికప్ చేసుకునేందుకు వెళ్లాడు. అప్పుడే అతను పొరబడి వేరొకరి ఇంటి డోర్‌బెల్‌ను నాక్ చేశాడు. అంతే ఆ ఇంటి యజమాని ఆండ్రూ లెస్టర్ నిర్ధాక్షిణ్యంగా అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో రెండు తుటాలు సరాసరి టీనేజర్ తలలోకి దూసుకుపోవడంతో అతను కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఐతే అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ఆండ్రూ లెస్టర్ని అదుపులోకి తీసుకున్నారు. ఐతే గంటల కస్టడీ తర్వాత ఎలాంటి ఆరోపణలు మోపకుండానే అతను విడుదలయ్యాడు. దీంతో నల్లజాతీ యువకుడిపై కాల్పులు జరిపితే అలా ఎలా వదిలేస్తారని ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని నిరసనలు వెల్లవెత్తాయి. ఇది జాత్యాహంకారంతో జరిగినే హత్య అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సదరు టీనేజర్ అత్త ఫెయిత్ స్ఫూన్‌మూర్ మాట్లాడుతూ.. తన మేనల్లుడు కెమికల్ ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడని, మంచి ప్రతిభావంతుడైన విద్యార్థి అని చెప్పుకొచ్చారు. అమెరికా సుదీర్ఘ చరిత్రలో నల్లజాతీయులపై హింస జరుగతూనే ఉంది దీనికి జవాబుదారితనం వహించాల్సిందే అంటూ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ మేరకు మిస్సోరీ పోలీస్ చీఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఇది జాతిపరంగా జరిగిన హత్యగా ఆయన పేర్కొనలేదు. తాను వారి ఆవేదనను అర్థం చేసుకుంటానని చెప్పారు. అలాగే జాతి పరంగా జరిగిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేయడమే గాక నిందితుడిని అదీనంలోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. చివరికి నిందితుడు ఆండ్రూ లెస్టర్(85) వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇక కోర్టు కూడా సదరు నిందితుడు సాయుధ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి దోషిగా తేల్చింది. అంతేగాదు అతనికి కోటి రూపాయాల పూచీకత్తుతో కూడిన బెయిల్‌ని మంజూరు చేసింది. అదృష్టవశాత్తు టీనేజర్ కూడా కొద్దిలో ప్రాణాపాయంతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సదరు బాధితుడితో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఫోన్లో సంభాషించి..క్షేమ సమాచారాలను అడిగినట్లు వైట్‌హౌస్ పేర్కొనడం గమనార్హం. (చదవండి: అంతర్గత పోరుతో అట్టుడుకుతున్న సూడాన్.. 200 మంది మృతి) -
కాల్పుల భయంలో అమెరికా..హడావిడి చేసిన యూనివర్సిటీ
అమెరికాలో గతేడాది నుంచి వరుస కాల్పుల ఘటనలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ప్రజలు దుండగులు కాల్పుల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక యూనివర్సిటీ సైతం కాల్పులు జరిగే అవకాశం ఉందంటూ హడావిడి చేసింది. అందుకోసం యూనివర్సిటీ ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించి ట్విట్టర్ వేదికగా విద్యార్థులను అప్రమత్తం చేసింది కూడా. ఈ అనూహ్య ఘటన అమెరికాలోని నార్మన్లో ఉన్న ఓక్లహోమ్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఓక్లహోమ్ యూనివర్సిటీలో ఓ సాయుధుడు కాల్పులు జరుపుతున్నాడని విద్యార్థులను అప్రమత్తంగా ఉండండి అంటూ యూనివర్సటీ అధికారులు ట్విట్టర్ వేదికగా సర్క్యూలర్ జారీ చేశారు. అత్యవసర పరిస్థితని కూడా ప్రకటించింది. పైగా క్యాంపస్‌లో విద్యార్థులు ఉంటే పరిగెత్తండి, దాక్కోండి లేదా ఆత్మరక్షణ కోసం ఫైట్ చేయండి అంటూ ట్వీట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీ మొత్తం సోదా చేయగా.. అలాంటిదేమీ లేదని తేలింది. వెంటనే యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌కి ఎలాంటి ముప్పు లేదంటూ ఆ హెచ్చరికను కూడా రద్దు చేసింది. ఇటీవలే నాషేవిల్లే పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతో సహా ఒక ఉపాద్యాయుడు మృతి చెందిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గత కొంతకాలంగా కళాశాల, పాఠశాలల్లోనే కాల్పులు చోటు చేసుకోవడంతో ఈ తుపాకీ హింసతో అమెరికా వాసులు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది. OU-NORMAN Critical 10:53pm: OUPD has issued an ALL CLEAR. After a thorough search, no threat was found. There is no threat to campus. Alert has been canceled. — Univ. of Oklahoma (@UofOklahoma) April 8, 2023 (చదవండి: పాక్ 2026 నాటికి చైనా, సౌదీ అరేబియాలకు రూ. 63 వేల కోట్లు చెల్లించాలి) -
దారుణం: డీజే సౌండ్ తగ్గించమన్నందుకు..గర్భిణి అని చూడకుండా..
డీజే సౌండ్‌ని తగ్గించమన్నందకు కోపంతో గర్భిణి అని చూడకుండా కాల్పుల జరిపారు. దీంతో ఆమెకు గర్భస్రావం అయ్యింది. ఈ ఘటన ఢిల్లీలోని సిరాస్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..హరీష్ అనే వ్యక్తి కొడుకుకి కువాన్ పూజ అనే వేడుక ఉంది. ఆ ఫంక్షన్ కోసం అని డీజే పెట్టారు చాలా బిగ్గరగా పెట్టడంతో ఆ వీధిలోనే ఉండే రంజు అనే 30 ఏళ్ల మహిళ సౌండ్ తగ్గించమని హరీష్‌ని కోరింది. అంతే హరీష్ తన స్నేహితుడు అమిత్ నుంచి తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో తుపాకీ నేరుగా మెడ మీదకు దూసుకపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. దీంతో ఆమె బంధువులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మెడపై తుపాకీ గుండు తగలడంతో బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోవడం కుదరదని వైద్యులు చెప్పారు. దీంతో ఈ ఘటన జరిగినప్పుడూ ఉన్న పత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించి పోలీసలు కేసు నమోదు చేశారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా బాధితురాలికి గర్భస్రావం అయినట్లు వెల్లడించారు. కాగా, నిందితులు హరీష్ డెలివరీ బాయ్‌గానూ, అమిత్ మొబైల్ రిపేరు షాపు పని చేస్తాడని పోలీసులు తెలిపారు. (చదవండి: గుండెపోటులకు కరోనానే కారణమా! ఆరోగ్యమంత్రి ఏం చెప్పారంటే..) -
తుపాకీ కాల్పుల్లో బీజేపీ నేత మృతి
గుర్తు తెలియని కొందరు దుండగులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేతపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నాయకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పశ్చబెంగాల్లో పుర్బా బర్ధమాన్‌లోని శక్తిగఢ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ చెందిన వ్యాపారవేత్త,బీజేపీ నేత రాజు ఝూ, తన సహచరులతో కలిసి కోల్‌కతాకు వెళ్తుండగా.. శక్తిగఢ్‌లోని దుకాణం వెలుపల కొందరూ దుండగులు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన తదనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు ఝూని హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఝూ సహచరులు కూడా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసుల తెలిపారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, బీజేపీ నాయకుడు ఝూపై అక్రమ బొగ్గు వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తృణమూల్ ప్రభుత్వ హయాంలో కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఆయన 2021 డిసెంబర్లో జరిగిన చివరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో ఆయన బీజేపీలోకి చేరారు. (చదవండి: ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో చార్జిషీట్) -
ఎన్కౌంటర్లలో నేరస్తులు చనిపోకుండా ఉండాలంటే..
ఎన్కౌంటర్లో నేరస్తులు చనిపోకుండా ఉండాటానికి ఏం చేయాలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్శ కొన్ని చిట్కాలను అందించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే ఓటింగ్‌పై జరిగిన చర్చకు సీఎం సమాధానమిస్తూ.. దీని గురించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసులు బుల్లెట్‌తో బుల్లెట్‌కి సమాధానం ఇస్తున్నారు. అందువల్లే రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని అన్నారు. నేరస్తులను కాల్చి చంపకుండా ఉండాలంటే ..క్రిమినల్స్ పట్టుబడ్డప్పుడూ చేతులు పైకెత్తాలని అన్నారు. అప్పుడూ పోలీసులు రివ్వాల్వర్‌కి పనికి చెప్పాల్సిన అవసరం ఉండదన్నారు. " మీరంతా ఎన్కౌంటర్లు గురించి అడుగుతున్నారు. తెలిసి ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తారా? అని ప్రశ్నించారు. మతహింస తెలిసి జరుగుతుందా..అలాగే ఎన్కౌంటర్ కూడా ఆలోచించి జరగదు. ఇప్పుడూ వారు పాత అస్సాం పోలీసులు కాదు. అందుకే వారు బుల్లెట్లతో సమాధానం ఇస్తున్నారని అందుకు తాను సంతోషిస్తున్నాను" అని అన్నారు. అయితే పోలీసులు కూడా చట్ట పరిధిలోనే ఉండాలని చెప్పారు. పోలీసు సిబ్బంది అతను లేదా ఆమె తప్పుచేసినప్పుడూ సీనియర్ అధికారి అయినప్పటికీ శిక్షార్హమైన చర్యలు ఎదర్కొనక తప్పదని ముఖ్యమంత్రి శర్మ అన్నారు. ఐతే అటవీ ప్రాంతాలలో జరగుతున్న అక్రమ కార్యకలాపాలు, బాల్యవివాహాలు, ఇతర నేర కార్యకలాపాలు వంటి వాటిపై తమ ప్రభుతం అణిచివేతను కొనసాగిస్తుందని, అలాగే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడానికి సిగ్గుపడరని నొక్కి చెప్పారు. (చదవండి: మంత్రిని ప్రశ్నించినందుకు యూట్యూబర్ అరెస్టు..పైగా నేరస్తుడిలా..) -
పార్కింగ్ విషయంలో గొడవ.. తండ్రీకుమారులపై కాల్పులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని యమున విహార్‌లో గురువారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. కారు పార్కింగ్ విషయంలో గొడవ తలెత్తి తండ్రీకుమారులపై కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. 15 మంది గ్యాంగ్‌తో వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితులిద్దరినీ వీరేంద్ర అగర్వాల్, శుభం అగర్వాల్‌గా గుర్తించారు. వీరిద్దరూ గురువారం రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు ఓ కారు రోడ్డు మధ్యలో పార్క్ చేసి ఉంది. దీంతో కారును అక్కడి నుంచి వేరే చోట పెట్టుకోవాలని, రోడ్డు బ్లాక్ అయిందని వీరేంద్ర సూచించాడు. ఈ విషయంలో కారు యజమానితో వాగ్వాదం జరిగింది. అయితే కాసేపయ్యాక కారు యజమాని 15 మందితో కలిసి వీరేంద్ర ఇంటికి వెళ్లాడు. ఈ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి వీరేంద్రతో పాటు అతని కుమారుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరికి బుల్లెట్ గాయాలై తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అనంతరం 15 మంది అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఒక్కడిని మాత్రం స్థానికులు పట్టుకుని చితకబాదారు. దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. కారు యజమానిని గుర్తించామని, అతనితో పాటు మిగతా అందరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: ప్రేమ నావలో ప్రయాణం.. సహజీవనం.. పెళ్లి ఊసెత్తితే చాలు! -
Odisha: మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు.. ఛాతీలో దిగిన బుల్లెట్లు..
భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్య మంత్రి నబ కిశోర్ దాస్‌పై ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. ఝార్‌సుగుద జిల్లా బ్రజ్రాజ్నగర్లోని గాంధీ స్క్వేర్‌లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కారులో నుంచి దిగగానే పోలీసు తుపాకీ తీసి నాలుగైదు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో కిశోర్ దాస్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అధికారులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మంత్రిపై కాల్పులు జరిపిన ఏఎస్ఐ పేరు గోపాల్ దాస్ అని ఉన్నతాధికారులు వెల్లడించారు. అతను యూనిఫాంలోనే ఉన్నాడని పేర్కొన్నారు. తన సొంత తుపాకీతోనే కాల్పులు జరిపినట్లు చెప్పారు. అయితే మంత్రిపై ఏఎస్ఐ ఎందుకు కాల్పులు జరిపాడనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మంత్రికి పోలీస్ ఎస్కార్ట్ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం చూస్తుంటే భద్రతా వైఫల్యంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. చదవండి: కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించాం.. 'మన్‌కీ బాత్'లో మోదీ -
విచిత్ర ఘటన: యజమానినే కాల్చి చంపిన కుక్క
ఒక్కోసారి మన పెంపుడు కుక్కలే అనుకోని విధంగా మనకు హాని తలపెడతాయి. విధి రాత లేక వైపరిత్యమో మరి ఏదైనా గానీ ఒక్కోసారి ఇలాంటి షాకింగ్ ఘటనలు మాత్రం కాస్త భయాన్ని కలిగిస్తాయి. ఇక్కడొక వ్యక్తి కూడా తన పెండపుడు కుక్కతో సరదాగా వేటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. చక్కగా పెంపుడు కుక్క, డ్రైవర్ని తీసుకుని కారులో జాలీగా వెళ్తున్నాడు. అంతే అనుహ్యంగా కుక్క కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒక పికప్ ట్రక్కులో 30 ఏళ్ల వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకుని వేటకు వెళ్లాడు. వారితోపాటు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఐతే కుక్క తుపాకీ ఉన్న వెనుక సీటు వద్దకు వెళ్లి బయటకు తీసింది. ప్రమాదవశాత్తు అది పేలడంతో బుల్లెట్ సరాసరి ఆ వ్యక్తి శరీరంలోకి దూసుకుపోవడంతో క్షణాల వ్యవధిలో అతను కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటనలో ప్యాసింజర్ సీటులో కూర్చొన్న ఆ వ్యక్తి మరణించగా, డ్రైవర్ క్షేమంగానే ఉన్నాడు. ఐతే యూఎస్ పోలీసులు రైఫిల్‌పై కుక్క అడుగు పడడంతో పేలినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి కుక్క యజమానినే కాదా అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.40 నిమిషాలకు చనిపోయినట్లు వెల్లడించారు. దీన్ని వేట సంబంధిత ప్రమాదంగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వాస్తవానికి యూఎస్‌లో ప్రమాదవశాత్తు కాల్పులు సర్వసాధారణమే గానీ ఇది మాత్రం కాస్త విచిత్రమైన ఘటనే. (చదవండి: ఫ్యామిలీ తర్వాతే ఏదైనా! అంటూ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన కూతురు) -
వైరల్ వీడియో: కోబ్రాకే గురిపెట్టి.. పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్పులు ఆ తర్వాత..
-
కోబ్రాకే గురిపెట్టి.. పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్పులు ఆ తర్వాత..
వైరల్: పాములకు సంబంధించిన చాలా వీడియోలు చూశాం. కానీ ఈ వీడియోలోని సన్నివేశం మాత్రం సినిమాల్లోనే చూశాం గానీ రియలిస్ట్‌గా సాధ్యం కాదు. నిజంగా పాములపై కాల్పులు జరిపితే కోపంతో వెంటాడి మరీ కాటేస్తాయా! అనుకుంటాం. ఔను! అనిపించేలా ఆ వీడియోలోని వ్యక్తి రియల్స్టిక్గా చేసి చూపించాడు. ఒక వ్యక్తి కారులో కూర్చొన ఉన్నట్లు వీడియోలో. ఎదురుగా కోబ్రా ఉంటుంది. మనోడు ఏకంగా కోబ్రాకే పాయింట్ బ్లాక్‌లో గురి పెట్టి కాల్చేందకు ప్రయత్నించాడు. ఐతే రెండు రౌండ్డలు కాల్చాడు గానీ, అవి గురి తప్పాయి. అంతే కోబ్రాకి కోపం వచ్చి కస్సు బుస్సుమంటూ జరజర అతడిని భయభ్రాంతులకు గురి చేసేలా మీదకు దూసుకువచ్చింది. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఏమైందన్నది తెలియరాలేదు. అందుకు సంబంధించిన వీడియోకి 'కోబ్రాతో ఫైట్‌కి దిగాలనుకుంటే తుపాకీతో దిగొద్దు' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటజన్లు కోబ్రా రెండే ఛాన్సులు ఇస్తుంది, మరో ఛాన్స్ అదే తీసుకుంటుంది అని కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. వీడియో కోసం క్లిక్ చేయండి (చదవండి: ఒంటిపై అండర్వేర్ తప్ప నులుపోగులేదు ..అలానే దొంగలను పరిగెత్తించాడు) -
పారిస్‌లో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి
పారిస్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, నలుగురికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన సెంట్రల్ పారిస్‌లోని కుర్దిష్ సాంస్కృతిక కేంద్రం పరిసరాల వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిందని పారిస్ పోలీసులు చెబుతున్నారు. నిందితుడు 60 ఏళ్ల షుటర్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఒక దుకాణదారురాలు తాను సుమారు ఏడు నుంచి ఎనిమిది దాక కాల్పుల షాట్లు విన్నానని, భయంతో లోపల లాక్ చేసుకుని ఉండిపోయినట్లు పోలీసులుకు తెలిపింది. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమై నిందితుడి పట్టుకున్నందుకు భద్రతా దళాలకు డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ ట్వీట్టర్లో ధన్యవాదాలు తెలిపారు. ALERTE - Fusillade à Paris : plusieurs blessés dans le 10eme arrondissement. Police sur place. Un suspect interpelé. pic.twitter.com/mbQFl2a0vf — Clément Lanot (@ClementLanot) December 23, 2022 (చదవండి: ఘోరంగా పెరుగుతున్న కేసులు..వైద్యం అందించలేక కుప్పకూలిన డాక్టర్) -
టీఎంసీ యువనేతపై కాల్పులు.. బైక్‌పై వచ్చి క్షణాల్లో..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాలు జిల్లా భాట్‌పాడాలో మరోసారి హింస చెలరేగింది. టీఎంసీ యువనేత రాజ్ పాండేపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. అతను కాళీమాత పండల్లో పూజ ఏర్పాట్లు చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఈ దాడి చేశారు. ఆరు రౌండ్ల కాల్పులు జరిపి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. రాజ్ పాండే చెతిలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. దీపావళికి ముందు రోజు ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అనంతరం ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాట్‌పాడాలో ఇటీవల తరచూ హింస చోటుచేసుకుంటోంది. ఈ ఘటనకు రెండు రోజుల ముందే మరో టీఎంసీ నేతపై దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. అతని శరీరంలోకి కూడా బుల్లెట్ దూసుకెళ్లింది. చదవండి: ఓడలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవదహనం -
ఉగ్రవాదుల దాడిలో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి
ఇస్లామాబాద్: ఉగ్రవాదుల దాడిలో పాక్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి చెందారు. ఈ ఘటన బలూచిస్తాన్‌లో ఖరన్ ప్రాంతంలోని మసీదు వెలుపల చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కొంతమంది దుండగులు మసీదు వెలుపల ఉన్న మహ్మద్ నూర్ మొస్కాంజాయ్‌పై బహిరంగంగా కాల్పులు జరిపినట్లు ఖరన్ పోలీస్ సూపరింటెండెంట్ హలీమ్ తెలిపారు. తాము హుటాహుటినా మాజీ ప్రధాన న్యాయమూర్తిని ఆస్పత్రికి తరలించినప్పటికీ... ఆయన తీవ్రగాయాలపాలై మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ మేరకు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ ఖుదూస్ బిజెంజో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాంటి ధైర్య సాహసాల గల న్యాయమూర్తి సేవలను మరిచిపోలేమని అన్నారు. ఇలాంటి ఉగ్ర దాడులతో దేశాన్ని భయపెట్టలేరని, ఇవి పిరికిపందలు చేసే దుశ్చలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో క్వెట్టా బార్ అసోసీయేషన్(క్యూబీఏ) ప్రెసిడెంట్ అజ్మల్ ఖాన్ కాకర్ కూడా న్యాయమూర్తి మొస్కాంజాయ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ప్రతి పాకిస్తానీ పౌరుడు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దేశంలో అధ్వాన్నంగా ఉన్న భద్రతా పరిస్థితిని తేటతెల్లం చేస్తోందన్నారు. అదీగాక గత కొద్ది నెలలుగా పాక్‌లో ఉగ్ర దాడులు ఎక్కువవుతున్నాయని పాక్ న్యాయశాఖ మంత్రి షాహదత్ హుస్సేన్ అన్నారు. అంతేగాదు ఈ ఏడాదిలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే అత్యధికంగా ఉగ్రదాడుల జరిగాయని ఇస్లామాబాద్‌కి చెందిన థింక్ ట్యాంక్ పేర్కొంది. పైగా ఈ హింసాత్మక దాడులు ఫటా, ఖైబర్ పఖ్తుంఖ్వాలలోనే దాదాపు 106 శాతం పెరిగిందని వెల్లడించింది. (చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్) -
యాభై ఏళ్ల తర్వాత.. ప్రభుత్వ లాంఛనాలతో క్వీన్‌కు అంత్యక్రియలు
లండన్: బ్రిటన్‌లో దాదాపు అర్థ శతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలను రాజరిక సంప్రదాయంలో కాకుండా.. ప్రభుత్వా లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1965లో మాజీ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ ఈ గౌరవాన్ని పొందిన చివరి నేత. సుదీర్ఘకాలం రాణిగా పనిచేసిన క్వీన్ ఎలిజబెత్-2 గురువారం బాల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఐతే ఆమెకు ప్రిన్స్ ఫిలిఫ్‌లా.. రాజరిక అంత్యక్రియలు కాకుండా ప్రభుత్వ లాంఛనలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు సైనిక ఊరేగింపులో నేవికి చెందిన నావికులు గన్క్యారేజీపై క్వీన్ ఎలిజబెత్ మృతదేహాన్ని తీసుకువెళ్లడంతో అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వెస్ట్మిన్స్టర్ అబ్బే లేదంటే సెయింట్ పాల్స్ కేథడ్రల్ వరకు ఊరేగింపు జరుగుతుంది. ప్రజలు సందర్శనార్ధం రాణి భౌతికదేహాన్ని ఉంచుతారు. అంత్యక్రియలకు దాదాపు నాలుగు రోజులు ముందు వరకు ఆమె భౌతిక దేహం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంటుంది. ఆ తదనంతరం దేశాధినేతలకు 21 తుపాకుల గౌరవ వందనం ఇస్తారు. ఐతే బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 జ్ఞాపకార్థం డెత్ గన్‌సెల్యూట్ సందర్భంగా శుక్రవారం యునైటెడ్ కింగ్డమ్ నలుమూలల్లో ఫిరంగా కాల్పలు నిర్వహించారు బ్రిటన్ అధికారులు. ఇలా ప్రతి ఏడాది 96 రౌండ్ల గన్ షాట్లతో క్విన్ ఎలిజబెత్‌కి గౌరవ వందనం ఇవ్వాలని బ్రిటన్ అధికారలు నిర్ణయించారు. ఈ మేరకు స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ కోట, నార్తర్న్ ఐర్లాండ్‌లోని హిల్స్‌బరో కోట, వేల్స్‌లోని కార్డిఫ్ కోట నుంచి కాల్పులు నిర్వహించారు. (చదవండి: క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం సెప్టెంబర్ 11న సంతాపదినంగా ప్రకటించిన భారత్) -
ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థినిని తుపాకీతో కాల్చి పరార్!
పాట్నా: తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది 15 ఏళ్ల బాలికను దారికాచి తుపాకీతో కాల్చాడు. మెడపై తూటా దిగటంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది బాధితురాలు. ఈ దుశ్చర్య బిహార్ రాజధాని పాట్నాలో బుధవారం జరిగింది. బాలికపై తుపాకీ పేల్చుతున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రపురి ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. కూరగాయలు విక్రయించే వ్యక్తి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రేమించాలని వెంటపడుతున్నాడు. అతడి ప్రేమను తిరస్కరించిందనే కోపంతో తుపాకీతో వచ్చాడు. బాలిక అతడితో మాట్లాడకుండా వెళ్లగా వెనక నుంచి మెడపై కాల్చాడు. తూటా దిగటంతో బాలిక అక్కడే పడిపోయింది. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా పోలీసులు తెలిపారు. Bihar| A vegetable vendor’s daughter shot yesterday in Indrapuri locality of Sipara area of Beur PS in Patna. Injured girl who was shot in the neck is undergoing treatment in a private hospital. Matter is being said to be a love affair: Patna Police (Visuals: CCTV footage) pic.twitter.com/kHbddcU2L1 — ANI (@ANI) August 18, 2022 ఇదీ చదవండి: లఖింపుర్‌లో 72 గంటల ఆందోళన.. యూపీకి 10వేల మంది రైతులు -
చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ భర్త... కోపంతో కాల్చి చంపిన మహిళ
భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే వాళ్ల పిల్లల సంరక్షణ కోసం డే కేర్ సెంటర్లో పెట్టక తప్పని పరిస్థితి. ఉద్యోగరీత్యానే కాకుండా చిన్నచిన్న కుటుంబాలు కావడం, ఇంట్లోని పెద్దవాళ్లు కూడా చూసే అవకాశం లేకపోవటం తదితర కారణాల వల్ల చాలామంది తల్లిదండ్రులు ఈ డే కేర్ సెంటర్లనే ఆశ్రయిస్తున్నారు. ఎంత డబ్బైన పర్లేదని పెద్ద మొత్తంలో ఈ సెంటర్లకి ఖర్చుపెట్టి మరీ తమ పిల్లలను ఉంచుతున్నారు. అలాంటి సెంటర్లో కూడా అభం శుభం తెలియని చిన్నారుల పై లైంగిక దాడులు జరుగుతున్నాయంటే ఏమనాలి. రక్షణ అనేపదానికి అర్థం వెతుక్కోవాల్సిన స్థితికి వచ్చేస్తున్నాం. అచ్చంల అలానే అమెరికాలోని ఒక డే కేర్ సెంటర్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....యూఎస్‌లోని వాషింగ్టన్లో మాండరిన్ ఓరియంటల్ హోటల్లో ఉంటున్న ఒక జంట డేకేర్ సెంటర్ నడుపుతోంది. అయితే భర్త జేమ్స్ వీమ్స్ జూనియర్ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అతడి భార్య శాంతేరీ వీమ్స్ గుర్తించింది. ముగ్గురు చిన్నారులపై దారుణైన అఘాయిత్యాలకు పాల్పడటంతో ఆమె సహించలేకపోయింది. దీంతో ఆమె ఈ విషయమై అతడిని గట్టిగా నిలదీసింది. కొద్దిసేపు వారి మధ్య ఘర్షణతో కూడిన వాతావరణం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఆమె అతడిని తుపాకితో కాల్చి చంపింది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే అతను పిల్లలను లైంగికంగా వేధించడని ఆరోపణలు చేస్తూ...అందువల్లే తన భర్తను హత్య చేశానని ఆమె చెప్పింది. వారు ఉన్న గదిలో పోలీసులకు దొరికిన ఒక డైరీ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ డైరీలో..తన భర్త ముగ్గురి పిల్లల జీవితాలను నాశనం చేశాడని, పలువురి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు రాసి ఉందన్నారు పోలీసులు. అంతేకాదు ఒక వ్యక్తిని పక్షవాతం వచ్చే వరకు ఎలా కాల్చాలో కూడా వివిరించి ఉందని చెప్పారు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు ఆ మహిళ తాను నేరం చేశానని అంగీకరించటం లేదు. దీంతో పోలీసులకు ఈ కేసు అత్యంత సవాలుతో కూడిన మిస్టరీగా ఉంది. ప్రస్తుతం ఈ విషయమై యూఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. అంతేకాదు సదరు నిందితురాలు ప్రాథమిక విచారణ నిమిత్తం కోర్టు ముందు హాజరు కావాల్సి ఉందని కూడా చెప్పారు. (చదవండి: అంత ఘోరంగా చంపాడు.. వాడి ఉరి దేశమంతా చూడాలి) -
తమ బిడ్డను కరిచిందని ఏకంగా 29 కుక్కలని....
Barbaric Act": Killing Of 29 Dogs: ఖతర్‌లో ఒక భయానక సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఖతర్‌లోని ఫెసిలిటీ అనే కుక్కల సంరక్షణ సంస్థలోని 29 కుక్కలపై సాయుధ బలగాల బృందం కాల్పులు జరిపి హతమార్చింది. ఆ కుక్కలలో ఒక కుక్క తమ బిడ్డను కరిచిందని ప్రతీకారంగా ఆ సంరక్షణ ప్రాంతంలోని కుక్కుల పై కాల్పులు జరిపారు. దోహాకు చెందిన రెస్క్యూ స్వచ్ఛంద సంస్థ పాస్ ప్యాక్టరీకి సమీపంలోని కుక్కుల ఫెసిలిటీలోకి సాయుధ బలగాల బృందం బలవంతంగా చోరబడ్డారని పేర్కొంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదరించి అక్కడున్న కుక్కలపై కాల్పులకు తెగబడినట్లు తెలిపింది. ఫెసిలిటీ అనే సంస్థ వీధి కుక్కులకు ఆహార, ఆరోగ్య సదుపాయాలను అందించే స్వచ్ఛంద సంస్థగా పేర్కొంది . ఈ ఘటనలో కుక్క పిల్లలతో సహా చాలామంది సిబ్బంది గాయప్డడారని తెలిపింది. తమ కొడుకుని కరిచినందుకే ఈ ఘటనకు పాల్లపడినట్లు వారు పేర్కొన్నారని వెల్లడించింది. ఈ భయానక ఘటనతో అక్కడ ఉన్న ప్రజలకి ఆగ్రహాం తోపాటుఆందోళనను రేకెత్తించింది. జంతు హక్కుల కార్యకర్త రోనీ హెలౌ ఈ హత్యను అనాగరిక చర్యగా అభివర్ణించాడు. ఇది ఖతర్ సమాజానికి కళంకం అని పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ఈ హృదయ విదారక ఘటనపై విచారణ జరిపి ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరేమో గల్ఫ్ ప్రాంతం ఈ విషయంలో అభివృద్ధి చెందాలని, మరొకరు తపాకీలను ఇంట్లో పెట్టుకుని ఇలాంటికి వాడుతున్నారా! అంటూ ...విమర్శిస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: కుక్కకు బండరాయి కట్టి వరదలో తోసేసిన కిరాతకులు) -
సహోద్యోగులపై పోలీస్ కాల్పులు.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ పోలీస్ తన వద్ద ఉన్న తుపాకీతో ముగ్గురు సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పోలీసులూ మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిణి ప్రాంతంలోని హైదర్‌పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో సిక్కిం రాష్ట్రానికి చెందిన పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ సిక్కిం పోలీస్(32) తోటి సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సంఘటన స్థలంలోనే మరణించారు. మృతులను కమాండర్ పింటో నామ్‌గ్యాల్ భూటియా, ఇంద్ర లాల్ చెత్రీగా పోలీసులు గుర్తించారు. మరొకరు దన్‌హంగ్ సుబ్బాకు తీవ్ర గాయాలవ్వగా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ అతను కూడా మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితుడిని ప్రబిన్ రాయ్‌గా గుర్తించిన ఢిల్లీ పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా రాయ్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్స్, సిక్కిం పోలీసులకు చెందిన వాడు. రాయ్, భూటియా 2012 బ్యాచ్ నుంచి గ్రాడ్యూయెట్ పూర్తి చేయగా.. సుబ్బా, చెత్రీ 2013 బ్యాచ్‌కు చెందిన వారు. -
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలకలం రేపాయి. జపాన్ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో భాగంగా అబే ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఆయన తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. దుండగుడు తుపాకీతో అబేపై రెండురౌండ్లు కాల్పులు జరిపారని, ఆయనకు తీవ్ర రక్తస్రావం అయిందని జపాన్‌కు చెందిన మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే తన కథనంలో తెలిపింది. హుటాహుటిన అబేను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మరోవైపు అబేకు గుండెపోటు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారని సదరు వార్తా సంస్థ పేర్కొంది. కాగా,2006 నుంచి 2012 వరకు జపాన్ ప్రధానిగా షింజో అబే సేవలందించారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించిన నేపథ్యంలో ఆయనకు కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి👇 మంత్రుల తిరుగుబాటు.. రాజీనామాకు ప్రధాని బోరిస్ ఓకే Russia-Ukraine war: ఎండ్ కార్డ్ ఎప్పుడు? -
రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి..
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలుగా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ భీకరమైన యుద్ధం కారణంగా వేలాది మంది నిరాశ్రయులవ్వగా, లక్షలాది మంది వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో ఒక ఉక్రెయిన్ రష్యా దాడుల్లో తాను ఎదర్కొన్న భయంకరమైన చేదు అనుభవం గురించి వివరించాడు. ఈ మేరకు 33 ఏళ్ల మైకోలా కులిచెంకో తన భయానక అనుభవాన్ని వివరించాడు... "రష్యా ఉక్రెయిన్ పై దురాక్రమణకు తెగబడతూ దాడులు చేసి సరిగ్గా మూడువారాలైంది. మార్చి 18న అనుహ్యంగా ఒక రోజు రష్యా బలగాలు తమ ఇంటిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. తమ ఇంటిని చుట్టుముట్టి రష్యన్ దళాలపై బాంబు దాడి చేస్తున్నవారి కోసం గాలించారు. తమ దళాలలపై దాడిచేసే వాళ్లతో సంబంధం ఉందనే అనుమానంతో మా ఇంటిని సోదా చేయడం మొదలు పెట్టారు. ఐతే మా తాతా పారామిలటరీకి సంబంధించినవాడు కావడంతో ఇంట్లో ఉండే మిలటరీ బ్యాగ్, పతకాలను చూసి ఆర్మీకి చెందిన వారిగా భావించి తమ పై కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నన్ను మా అన్నలిద్దరిని కళ్లకు గంతలు కట్టి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి మూడు రోజులపాలు హింసించారు. ఆ తర్వాత మమ్మల్ని వదిలేస్తారు అనుకున్నాం కానీ వారు కర్కసంగా మా తలల పై గన్‌పెట్టి కాల్పుల జరిపారు. మొదటగా మా పెద్ద అన్న, ఆ తర్వాత రెండో అన్న తదనంతరం నాపై కాల్పుల జరిపారు. ఆ తర్వాత మా ముగ్గుర్ని ఒక గొయ్యిలో పాతిపెట్టి వెళ్లిపోయారు. ఐతే తానుఎంతసేపు ఆ గోతిలో ఉండిపోయానో గుర్తులేదు కానీ ఆ తర్వాత స్ప్రుహ వచ్చాక ఊపిరాడక పోవడంతో తన అన్నలను తనపైనే ఉండటం వల్ల బరువుగా ఉందని గమనించి నా చేతులు కాళ్ల సాయంతో వారిని పక్కకు తోసి ఏదో విధంగా ఆ గోయ్యి నుంచి బయటప్డడానని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి బుల్లెట్ తన చెంప మీద నుంచి కుడి చెవి వైపుకు రాసుకుంటూ వెళ్లిపోవడం వల్ల తాను లక్కీగా బతకగలిగానని చెప్పాడు. ఆ తర్వాత తాను పొలానికి సమీపంలోని ఇంటికి వెళ్లి ఆశ్రయం పోందినట్లు వివరించాడు. తాను ఆ విషాద ఘటన నుంచి బతికి బట్టగట్టగలుగుతానని కూడా అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి విషాద ఘటనలు ఉక్రెయిన్ అంతటా కోకొల్లలు అంటూ ఆవేదనగా చెబుతున్నాడు. (చదవండి: టిట్ ఫర్ టాట్: పుతిన్‌పై బ్యాన్ విధించిన కెనడా) -
నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్‌లో పిస్టల్ కొన్న సురేష్‌రెడ్డి!
నెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తాటిపర్తిలో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో కావ్యారెడ్డిని పిస్టల్‌తో కాల్చి, ఆపై సురేష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సురేష్‌రెడ్డి బిహార్‌లో పిస్టల్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు నిమిత్తం మంగళవారం అక్కడికి వెళ్లారు. సురేష్‌రెడ్డి సెల్ఫోన్లను సీజ్చేసిన పోలీసులు అతడు మాట్లాడిన, చాటింగ్ చేసిన వారి వివరాలు, మెస్సేజ్‌లు సేకరించి ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. అతడి స్నేహితుల వివరాలు సేకరించి పిస్టల్‌పై ఆరాతీస్తున్నారు. çఏడాదిన్నరగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న అతడు గత ఏడాది డిసెంబర్లో సుమారు 20 రోజులు బిహార్‌లో ఉన్నాడని, ఆ సమయంలోనే పిస్టల్ కొనుగోలు చేశాడని గుర్తించినట్లు తెలిసింది. సాంకేతికతను వినియోగించి ఎవరివద్ద కొనుగోలు చేశాడో కూడా తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం బిహార్ వెళ్లారు. పిస్టల్ అమ్మిన వ్యక్తిని పట్టుకుని నెల్లూరు తీసుకొస్తారని తెలిసింది. కొందరు పోలీసులు ముంబై కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. ఐదోసారి తూటా పేలి.. సురేష్‌రెడ్డి వినియోగించిన పిస్టల్ 7.5 ఎంఎంగా గుర్తించారు. మ్యాగజిన్ సామర్థ్యం 9 బుల్లెట్లు. దా న్లో ఏడు బుల్లెట్లు మాత్రమే ఉంచి నట్లు పోలీసు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కావ్యారెడ్డిపై మొదటిసారి కాల్పులు జరపగా ఆమె తప్పించుకుందని, మరో మూడుసార్లు కాల్చినా తూటాలు పేలలేదని, అయిదోసారి కాల్చడంతో తూటాపేలి కావ్యారెడ్డి తలలోకి దూసుకూళ్లిందని భావిస్తున్నారు. మిస్సయిన, పేలని తూటాలను ఘటనాస్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సురేష్‌రెడ్డి ఆరో రౌండ్ కాల్చుకుని మృతిచెందాడు. ఏడో బుల్లెట్ పిస్టల్‌లోనే ఉంది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బుల్లెట్లపై నంబర్లను బట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం.. కావ్యారెడ్డి, సురేష్‌రెడ్డి మృతదేహాలకు నెల్లూరు జీజీహెచ్‌లో ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు శవపంచనామా, వైద్యులు పోస్టుమార్టం చేశారు. తాటిపర్తిలో రెండు కుటుంబాల నడుమ వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
Nellore: పేలిన తూటాలు.. రాలిన ప్రాణాలు.. ఉలిక్కిపడిన తాటిపర్తి
జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి.. ఒకప్పుడు వర్గ రాజకీయ హత్యలతో అట్టుడికిన గ్రామం. ఆ ఊరంతా వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తోంది. నేటితరం యువత ఉన్నత చదువులు చదువుకుని వివిధ రంగాల్లో స్థిరపడుతున్నారు. కాలంతో పాటు ఆ ఊరు రాజకీయ వైషమ్యాలకు దూరమైంది. ఒకరికొకరు కలుపుగోలుగా ఉండడంతో ప్రశాంతంగా ఉంటున్న ఆ పల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు తాను ఇష్టపడిన యువతి పెళ్లికి నిరాకరించిందని తుపాకీతో కాల్చి, తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని.. పొదలకూరు(నెల్లూరు జిల్లా): వ్యవసాయం, పాడి–పంటలతో అలరారుతున్న ఆ పల్లెలో ప్రేమోన్మాద తూటాలు పేలాయి. ఆ ఊరు ఉలిక్కిపడింది. విషయం తెలిసి విషాదంలో మునిగిపోయింది. తాను మనసు పడిన యువతి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువకుడు తుపాకీతో ఆమెను కాల్చి, తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నా డు. మండలంలోని తాటిపర్తిలో దిగువ మధ్య తరగతికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ రెండు కుటుంబాలు ఉన్నంతలో ఉన్నతంగా జీవనం సాగి స్తున్నారు. గౌరవంగా జీవిస్తున్న ఆ కుటుంబాలు విధి ఆడిన వింత నాటకంలో విషాదంలో మునిగిపోయా యి. హతురాలు కావ్య, ఆత్మహత్య చేసుకున్న సురేష్‌రెడ్డి కుటుంబాల నేప«థ్యాలు ఇంచుమించుగా ఒకటే. ఉన్నతంగా ఎదగాలని ఉన్నత చదువులు చదు వుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సాఫ్ట్‌వేర్‌గా సంతోషాన్ని ఆస్వాదిస్తుండగానే.. హతురాలు పలుకూరు కావ్య తండ్రి వెంకటనారపరెడ్డి మూడెకరాల రైతు. ఆయనకు ఇద్దరమ్మాయిలు. ఉన్నంతలో ఇద్దరు ఆడబిడ్డలను బాగా చదివించాడు. కావ్య పెద్దామ్మాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏడాదిన్నర కిందట సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించింది. వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది. చిన్నమ్మాయి కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకుని చదువుతోంది. కావ్య సాఫ్ట్‌వేర్‌గా సంతోషాన్ని ఆస్వాదిస్తుంది. ఇంతలోనే ప్రేమోన్మాదానికి బలైపోయింది. పెళ్లి ఆశ నెరవేరలేదు.. మాలపాటి సురేష్‌రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి సైతం సన్నకారు రైతు. వ్యవసాయంతో పాటు వరిగడ్డి వ్యాపా రం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయనకు కొడుకు, కుమార్తె. ఆడపిల్లకు పెళ్లి చేశాడు. సురేష్‌రెడ్డి పెద్దవాడు కావడంతో బాగా చదివించాడు. ఐదేళ్ల కిందటే సురేష్‌రెడ్డి బెంగళూరులో సాప్‌్టవేర్ ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు నెలకు రూ.లక్షకు పైగా జీతం పొందుతున్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశ పడ్డాడు. ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో ఆమెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో విషాదఛాయలు కాల్పుల ఘటనతో గ్రామం ఉలిక్కి పడింది. విష యం తెలియడంతో విషాదఛాయలు అలముకున్నా యి. ఇరు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఎంతో భవిష్యత్ ఉన్న యువతి, యువ కుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడంతో బంధువర్గాలు తల్లిడిల్లిపోతున్నాయి. పోలీసుల సమగ్ర దర్యాప్తు కాల్పుల ఘటనపై పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ విజయారావు, అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై కరిముల్లా దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ మాట్లాడు తూ కావ్యతో సురేష్‌రెడ్డి చాటింగ్ చేశాడని, అయితే ఆమె మాత్రం తిరిగి చాటింగ్ చేయలేదని తెలిపారు. ఇద్దరి సెల్ఫోన్లను స్వాధినం చేసుకున్న పోలీసులు మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పిస్టల్ చుట్టూ క్రైమ్ స్టోరీ నడుస్తోంది. సురేష్‌రెడ్డి పిస్టల్ ఎక్కడ సంపాదించాడు? ఎవరి వద్ద పిస్టల్ కొనుగోలు చేశాడనే కోణంలో ప్రధానంగా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పిస్టల్‌పై ‘మేడిన్ యూఎస్ఏ’ ఉంది. కావ్య అంటే ఇష్టంతో.. కావ్య, సురేష్రెడ్డిలది ఇద్దరిది ఒకే ఊరు. కావ్య అంటే ఇష్టం పెంచుకున్న సురేష్‌రెడ్డి ఏడాది కాలంగా తల్లిదండ్రుల ద్వారా ఆమెను తనకిచ్చి వివాహం జరిపించాల్సిందిగా కోరుతున్నాడు. ఇదే విషయాన్ని కావ్య కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే కావ్య తల్లిదండ్రులు ఈ వివాహానికి సమ్మతించలేదు. బహుశా ఇద్దరి మధ్య 12 ఏళ్ల వయస్సు తేడా ఉండడంతో ఒప్పుకోలేదని గ్రామస్తుల అభిప్రాయం. కానీ సురే‹Ù రెడ్డి పట్టు వదలకుండా కావ్యతోనే తన పెళ్లి జరగాలని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒంటిరి తనాన్ని అలవాటు చేసుకుని డిప్రెషన్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ దారుణానికి తెగబడినట్లు సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఘోరం ఊహించలేదు ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. మా గ్రామంలో ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు జరగలేదు. అన్యాయంగా నా మనమరాలిని హత్య చేశాడు. ఏ పాపం తెలియని అమ్మాయి బలికావాల్సి వచ్చింది. – పలుకూరు మస్తాన్‌రెడ్డి, కావ్య తాత పిస్టల్ ఎలా వచ్చిందో తెలియదు మా అబ్బాయి సురేష్‌రెడ్డికి పిస్టల్ ఎలా వచ్చిందో తెలియదు. మా దురదృష్టం కొద్ది ఈ ఘటన జరిగింది. ఇంట్లో మా వాడు బాగానే ఉండేవాడు. ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డాడో తెలియడం లేదు. మాకు పుత్రశోకం మిగిల్చి వెళ్లాడు. – మాలపాటి పరమేశ్వరి, సురేష్‌రెడ్డి తల్లి -
ఉక్రెయిన్ వార్: తండ్రిని కోల్పోయినా నిందించని గొప్పగుణం
Russian Invasion Girl Lost Her Father and Arm: ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న రోజుల తరబడి పోరులో వేలాదిమంది ఉక్రెయిన్ పౌరులు, చిన్నారులు మరణిస్తున్నారు. లక్షలాదిమంది ఉక్రెయిన్‌ని విడిచి వలస వెళ్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది ఉక్రెయిన్ వాసులు.. మిలటరీలో చేరి తమ దేశాన్ని కాపాడుకుంటామంటూ ముందుకువచ్చారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులనే భేదం లేకుండా తమ భూభాగంలో జరుగుతున్న పోరులో పాల్గొనేందుకు ఉత్సుకతను కనబర్చారు. అంతేకాదు ఉక్రెయిన్‌వాసుల దేశభక్తి స్ఫూర్తి ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకుంటుంది. ఇందంతా ఒక ఎత్తు అయితే రష్యా దాడిలో సాషా అనే 9 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడటమే కాక తండ్రిని కోల్పోయింది. అయినా ఇదంతా అనుకోకుండా జరిగిందని చెప్పిందే తప్ప రష్యన్లు ఒక మాట కూడా అనలేదు. ఆ దాడిలో ఆమె చేతికి ఒక బుల్లెట్ దిగింది. ఆ చిన్నారి కుటుంబం హాస్టమెల్ నుంచి బయలుదేరుతున్నప్పుడూ రష్యన్ దళాల కాల్పుల్లో చిక్కుకుంది. ఆ కాల్పుల్లో చిన్నారి తండ్రి అక్కడకక్కడే మరణించాడు. దీంతో చిన్నారి తల్లి, సోదరి సెల్లార్లోకి పారిపోతుండగా.. ఆ చిన్నారి ఎడమ చేతికి బుల్లెట్ దిగింది. దీంతో ఉక్రెయిన్ సైన్యం వారిని రక్షించి ఆ చిన్నారిని ఆసుపత్రిలో జాయిన్ చేసింది. అయితే వైద్యుల శస్త్ర చికిత్సలో భాగంగా ఆమె చేతిని తొలగించాల్సి వచ్చింది. కానీ ఆ చిన్నారి మాత్రం రష్యా దళలు మాపై కావాలని దాడి చేశారని అనుకోవడం లేదని చెప్పింది. పైగా ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పిందే తప్ప రష్యా బలగాలను నిందించలేదు. ఉక్రెయిన్ వాసుల మనసు చాలా విశాలమైనది అని నిరూపించింది. (చదవండి: విద్యార్థిని మెడపై మోకాలితో నొక్కి, చేతులను కట్టి.. వీడియో వైరల్) -
అసదుద్దీన్ ఒవైసీని అందుకే చంపాలనుకున్నా
లక్నో: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన నిందితుడు సచిన్ పండిట్ నేరం అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఒవైసీని చంపాలన్న ఉద్దేశంతో కాల్పులు జరిపినట్టు విచారణలో అతడు వెల్లడించాడని తెలిపారు. బుల్లెట్లు తగిలే ఉంటాయనుకున్నా ‘నేనో పెద్ద రాజకీయ నాయకుడిని కావాలనుకున్నాను. కానీ ఒవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు విని కలత చెందాను. అందుకే నా స్నేహితుడు శుభమ్‌తో కలిసి ఒవైసీ హత్యకు పథకం వేశాను. నేను ఒవైసీపై కాల్పులు జరిపినప్పుడు ఆయన వంగిపోయాడు. దీంతో కిందకు కాల్పులు జరిపాను. ఒవైసీకి బుల్లెట్లు తగిలే ఉంటాయని అనుకున్నాను. తర్వాత అక్కడి నుంచి పారిపోయాన’ని పోలీసుల విచారణలో సచిన్ వెల్లడించాడు. దాడికి చాలాసార్లు ట్రైచేశా ఒవైసీపై దాడికి చాలా రోజులు నుంచి ప్రణాళిక తయారు చేసినట్టు చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా ఎంపీ కదలికలను తెలుసుకునేవాడినని, దాడి చేయడానికి పలుమార్లు ఒవైసీ సమావేశాలకు కూడా వెళ్లినట్టు తెలిపారు. అయితే సమావేశాలకు జనం భారీ సంఖ్యలో రావడంతో దాడి చేయడం సాధ్యపడలేదని అన్నాడు. ‘ఒవైసీ మీరట్ నుంచి ఢిల్లీకి వెళతారని తెలుసుకుని.. నేను ఆయన కంటే ముందే టోల్గేట్ వద్దకు చేరుకున్నాను. ఒవైసీ కారు రాగానే కాల్పులు జరిపాన’ని పోలీసుల విచారణలో సచిన్ చెప్పినట్టు సమాచారం. పిస్టల్ ఇచ్చింది అతడే ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇప్పటివరకు సచిన్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు హాపూర్ అడిషినల్ ఎస్పీ తెలిపారు. సచిన్ నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి పిస్టల్ సమకూర్చిన మీరట్‌కు చెందిన తలీమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సచిన్ ఉద్దేశం గురించి అతడికి తెలియదని విచారణలో తేలింది. కాగా, సచిన్ పండిత్ బీజేపీ నాయకులతో కలిసివున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: ఆంక్షలతో బతకలేను, చావుకు భయపడను) -
ఢిల్లీ గ్యాంగ్‌వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు?
దేశ రాజధాని ఢిల్లీలో రెండు హంతక ముఠాల గ్యాంగ్‌వార్ పెను సంచలనం రేపింది. ఏకంగా న్యాయస్థానం ఆవరణలోనే మారణహోమం సృష్టించింది. మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని కోర్టు ప్రాంగణంలోనే పట్టపగలు ప్రత్యర్థులు కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు. దుండగులు టిల్లు తాజ్పూరియా గ్యాంగ్‌కు చెందిన వారని అనుమానిస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే వైరం జితేందర్ గోగి, టిల్లు తాజ్పూరియా ఒకప్పుడు స్నేహితులుగా ఉండేవారు. కాలేజీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు వీరిద్దరి మధ్య వైరానికి దారితీశాయి. 2010లో ఔటర్ ఢిల్లీలో జరిగిన కాలేజీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య మొదలైన గొడవలు గ్యాంగ్‌వార్‌గా మారాయి. 2018లో బూరారీ ప్రాంతంలో ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవల్లో ముగ్గురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. రెండు ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారని సమాచారం. ఎవరీ జితేంద్ర? గ్యాంగ్‌స్టర్ జితేంద్ర మన్ అలియాన్ గోగి.. ఢిల్లీ-హరియాణా సరిహద్దులోని అలీపూర్ ప్రాంతానికి చెందినవాడు. పోలీసులు టాప్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడి పేరే ముందుంది. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను తీహార్ జైలు నుంచి బెదిరించడంతో మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాడు. కారాగారం లోపల నుంచే హంతక దందా నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడుసార్లు జైలు నుంచి పారిపోయాడు. 2016, జూలై 30న బహదూర్‌గఢ్‌లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గతేడాది మార్చి 3న గురుగ్రామ్‌లోని సెక్టార్ 82లో జితేంద్రను పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు రోహిణి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రత్యర్థుల దాడిలో హతమయ్యాడు. దశాబ్ద కాలంగా గ్యాంగ్‌వార్ టిల్లు తాజ్‌పురియా కూడా తీహార్ జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే ముఠా కార్యాలపాలు సాగించినట్టు ఇతడిపైనా ఆరోపణలు ఉన్నాయి. 2010 నుంచి గోగి, టిల్లు ముఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నా 2013లో జరిగిన ఘటనతో గ్యాంగ్‌వార్ మరింత తీవ్రమైంది. ఢిల్లీకి డాన్‌గా చెప్పుకునే మరో గ్యాంగ్‌స్టర్ నీతూ దబోడియా అప్పట్లో పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో జితేంద్ర గోగి, టిల్లు తాజ్‌పురియా మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దశాబ్ద కాలంగా రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 206లో ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో జితేంద్ర హతమయ్యాడు. లాయర్ డ్రెస్‌లో వచ్చిన దుండగులు అతడిని తుపాకులతో కాల్చి చంపారు. -
బ్యాండేజీ కనబడాలంటే షార్ట్స్ వేసుకోండి...
కోల్‌కతా: విరిగిన కాలు మరింత బాగా ప్రదర్శించేందుకు మమతా బెనర్జీ బెర్ముడా షార్ట్స్ వేసుకోవాలన్న బీజేపీ బెంగాల్ నేత దిలీప్‌ఘోష్ ఒక వీడియోలో చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. ఇది అత్యంత హేయమైన వ్యాఖ్యగా టీఎంసీ నిప్పులు చెరగగా, పలువురు మహిళలు సైతం సోషల్‌మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వీడియోలో దిలీప్ ఎవరిపేరును నేరుగా ప్రస్తావించకపోయినా, అది మమత గురించేనని భావిస్తున్నారు. ‘చీర కట్టిన ఆమె ఒక కాలు కవర్ చేస్తూ, కట్టుకట్టిన కాలు మాత్రం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి చీరకట్టు ఎక్కడా చూడలేదు. దీనిబదులు కాలుబ్యాండేజీ ప్రదర్శన కోసం బెర్ముడా షార్ట్స్ ఆమె ధరించడం మంచిది. షార్ట్స్‌తో మంచి ప్రదర్శన చూపవచ్చు’ అని వీడియోలో ఉన్నట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. ఇలాంటి నీచమైన మాటలు దిలీప్ నుంచే వస్తాయని టీఎంసీ ఒక ట్వీట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను ఇంతగా వివాదాస్పదం చేయాల్సిన పనిలేదని బీజేపీ ప్రతినిధి షమిక్ అన్నారు. మీటింగుల్లో మమతాబెనర్జీ తమ పార్టీనేతలపై ఇంతకన్నా ఘోరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. -
ఎమ్మెల్యే అభ్యర్థిపై కాల్పులు.. విషమం
పట్నా : మూడో విడత అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బిహార్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. హయ్‌గ్ఘ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న రవీంద్రనాథ్ అలియాస్ చింటూ సింగ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున దర్భంగా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. తుపాకీ తుటాలకు గురైన అభ్యర్థి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, దర్భాంగా మెడికల్ కాలేజీల్లో ఆయనకు చికిత్స అందిస్తున్నామని స్థానిక ఎస్పీ తెలిపారు. ఘటనపై దర్యాప్తుగా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపాయని.. విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. (మోదీలా ట్రంప్ చేయలేకపోయారు) గతంలో జేడీయూలో కొనసాగిన రవీంద్ర ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి తాజా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఆయన ప్రత్యర్థులు ఈ ఘతుకానికి పాల్పడి ఉంటారని అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు ఈ కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వర్గాలు తెలిపాయి. కాగా బిహార్లోశనివారం మూడో దశ పోలింగ్ జరుగనుంది. దీంతో నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
సాయం కోరిన తల్లి.. కొడుకుపై కాల్పులు
వాషింగ్టన్: మానసిక వికలాంగుడైన తన కుమారుడిని ఆస్పత్రిలో చేర్చడానికి పోలీసుల సాయం కోరి వారికి ఫోన్ చేసింది తల్లి. కానీ పోలీసులు ఆ కుర్రాడిని ఆస్పత్రికి బదులు ప్రాణాపాయస్థితిలోకి తీసుకెళ్లి ఐసీయూలో చేర్చారు. హృదయవిదారకమైన ఈ సంఘటన సాల్ట్ లేక్ సిటీలో చోటు చేసుకుంది. వివరాలు.. గోల్డా బార్టన్‌కు 13 ఏళ్ల కుమారుడు లిండెన్ కామెరాన్ ఉన్నాడు. అతడు ఆస్పెర్గర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు అప్పుడప్పుడు అసాధరణంగా గొడవ చేసేవాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తే.. సెట్ అయ్యేవాడు. గత శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది బార్టెన్కు. దాంతో పోలీసులకు కాల్ చేసి.. లిండెన్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సాయం చేయాల్సిందిగా కోరింది. ఆమె విజ్ఞప్తి మేరకు బార్టెన్ ఇంటికి వచ్చిన పోలీసులు లిండెన్‌ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ కుర్రాడు వీరిని చూసి భయపడి పారిపోయాడు. (చదవండి: పికప్ అవుతోంది) దాంతో పోలీసులు లిండెన్ మీద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడి పేగులు, మూత్రాశయం, భుజం, చీలమండలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్నాడు. సాయం కోసం పోలీసులకు కాల్ చేస్తే.. వారు తన బిడ్డ ప్రాణాల మీదకు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తోంది బార్టెన్. ‘నా బిడ్డ నిరాయుధుడు.. మానసిక వికలాంగుడు. అలాంటి వాడి మీద ఇంత దారుణంగా దాడి చేయడం అమానుషం’ అంటూ కన్నీటి పర్యంతమవుతోంది. అయితే అమెరికాలో ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయి. కుటుంబ సభ్యులను కానీ, జనాలను కానీ ఇబ్బంది పెట్టే మానసిక వికలాంగులను అనేక మందిని పోలీసులు కాల్చి చంపారు. లిండెన్పై కాల్పులు జరపడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సాల్ట్ లేక్ సిటీ మేయర్ ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. -
బాపునగర్‌లో కుక్కను కాల్చి చంపిన వ్యక్తి
-
కఫీల్ సోదరుడిపై హత్యాయత్నం.. కలకలం
లక్నో: డాక్టర్ కఫీల్ ఖాన్.. యూపీలో గోరఖ్‌పూర్ చిన్నారుల మారణహోమానికి బాధ్యుడ్ని చేస్తూ అధికారులు కటకటాలపాలు జేశారు. సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలిండర్లు అందించాడని అతన్ని సోషల్ మీడియా పొగిడిన కొన్ని రోజులకే.. అసలు ఆ మరణాలకు బాధ్యుడే ఆయన అంటూ అధికారులు నివేదిక ఇవ్వటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల తర్వాత ఈ మధ్యే బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పోరాటానికి దిగారు. ఇదిలా ఉంటే ఆయన సోదరుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కఫీల్ సోదరుడు, వ్యాపారవేత్త అయిన కసీఫ్ జమీల్(34)పై ఆదివారం రాత్రి బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. రాత్రి 11 గంటల సమయంలో ఘటన చోటు చేసుకోగా, ఆయన్ని వెంటనే స్థానికంగా ఓ నర్సింగ్ హోమ్‌కు తరలించారు. శస్త్ర చికిత్స చేసి మెడలో దిగిన బుల్లెట్‌ను వైద్యులు తొలగించారని డాక్టర్ కఫీల్ తెలిపారు. ఆ తర్వాత కసీఫ్ను బీఆర్డీ ఆస్పత్రికి తరలించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు కఫీల్ మీడియాకు వెల్లడించారు. కాగా, ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. జిగ్నేశ్ ట్వీట్లు... ఇదిలా ఉంటే గుజరాత్ యువ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేశ్ మెవానీ ఈ ఘటనపై ట్విటర్లో స్పందించారు. ‘ఆక్సిజన్ సిలిండర్ల కోసం డబ్బులు చెల్లించకుండా యోగి ప్రభుత్వం చిన్నారులను బలి తీసుకుంది. కానీ, డాక్టర్ కఫీల్ మాత్రం తన సొంత డబ్బుతో కొందరినైనా కాపాడేందుకు ప్రయత్నించారు. అలాంటి వ్యక్తిని కటకటాల వెనక్కి నెట్టారు. ఇప్పుడేమో ఆయన సోదరుడ్నిపై హత్యా యత్నం జరిగింది. ఇలాంటి మంచి రోజుల(అచ్చెదిన్)ను మాకు అందిస్తున్న మోదీగారికి ధన్యావాదాలు’ అంటూ మెవానీ ఓ ట్వీట్ చేశారు. గోరఖ్‌పూర్ ఉదంతం... ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బాబా రాఘవ దాస్ మెడికల్ కళాశాల ఆస్పత్రి (బీఆర్డీ) మెడికల్ కాలేజిలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. సిలిండర్ల తాలుకూ బకాయిలు చెల్లించకపోవటంతో.. సరఫరాను సదరు సంస్థ నిలిపేయగా, నిర్లక్ష్యంగా వ్యవహిరంచి పిల్లలు మృతి చెందాడానికి కారణమయ్యాడంటూ మెదడు వాపు వ్యాధి నివారణ (ఏఈఎస్) విభాగ హెడ్ కఫీల్‌ఖాన్ జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి పూర్తిగా విషమించడంతో ఏప్రిల్ 19న కఫీల్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కఫీల్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని హైకోర్టు అతనికి ఈ ఏప్రిల్‌లో బెయిల్ మంజూరు చేసింది. -
ఉద్యోగం నుంచి తీసేసారని
సాక్షి,న్యూఢిల్లీ: ఉద్యోగంలోంచి తీసేసారన్న అక్కసుతో ఏకంగా కంపెనీ ఉన్నతోద్యోగిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది.ఢిల్లీలోని ఒక కార్పొరేట్ కంపెనీకి చెందిన ఉద్యోగి ఉన్నతాధికారిపై హత్యాయత్నం చేశాడు. అయితే సదరు అధికారి తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకోవడంతో కంపెనీ ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చు కున్నారు. జర్మనీ లగ్జరీ కారు మేకర్ మిత్సుబిషి కంపెనీ హెచ్ఆర్ హెడ్ బినిష్ శర్మపై ఈ దాడి జరిగింది. గుర్గావ్ కార్యాలయంలో గురువారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. గురువారం ఉదయం బినిష్ శర్మ కార్యాలయానికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన కారును అడ్డగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన కారు ఆపక పోవడమే కాకుండా వేగాన్ని మరింత పెంచారు. అయితే వెనుక కూర్చున్న వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ సంఘటనా స్థలంనుంచి పారిపోయారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు గాయపడిన బాధితుడిని రాక్లాండ్ ఆసుపత్రిలో చేర్చారు. బినిష్కు ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కాగా శర్మని చంపాలనే లక్ష్యంతోనే దుండగులు కాల్పులు జరిపారని గుర్గావ్ పోలీస్ అధికారి రవీందర్ కుమార్ పిటిఐకి తెలిపారు. నిందితుల్లో ఒకరైన జోగిందర్ అనే వ్యక్తిని అనైతిక ప్రవర్తన ఆరోపణలతో బుధవారం విధులనుంచి తొలగించారని చెప్పారు. ఈ నేపథ్యంలో తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేదంటే, భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని వివరించారు. కానీ శర్మ ఆ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోలేదని అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయన బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామనీ, నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. -
ప్రముఖ గాయకునిపై కాల్పులు
చండీఘడ్: పంజాబ్‌కి చెందిన ప్రముఖ గాయకుడు పర్మిష్ వర్మపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్మిష్ వర్మ శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో మొహాలిలోని సెక్టర్91 వద్ద కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. పర్మిష్ కాలి భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావం అయింది. సమయానికి స్థానికులు స్పందించి పర్మిష్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పర్మిష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పర్మిష్ వర్మ ‘గాల్ నహీన్ కదానే’ అనే పంజాబీ పాటతో ఒక్కసారిగా ఫేమస్ సింగర్‌గా మారిన విషయం తెలిసిందే. స్థానిక గ్యాంగ్స్టర్లు పర్మిష్‌పై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
బొమ్మ తుపాకీ అనుకొని అన్నను కాల్చేశాడు..
వాషింగ్టన్ : అమెరికాలోని గన్ కల్చర్ వల్ల కలిగే నష్టానికి, వీడియో గేమ్‌లు పిల్లల మీద చూపే దుష్ప్రభావానికి నిదర్శనంగా నిలిచింది ఈ సంఘటన. నిజమైన తుపాకీని... బొమ్మ తుపాకీగా భావించి ఏడేళ్ల సోదరుడిని కాల్చి చంపాడు ఐదేళ్ల తమ్ముడు. విషాదం నింపిన ఈ సంఘటన అమెరికాలోని వాషింగ్టన్లో చోటు చేసుకుంది. ఏడేళ్ల జెర్మన్ పెర్రి సౌత్ సెంట్ లూయిస్‌లోని తమ ఇంట్లో బెడ్రూమ్లో కూర్చుని వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. తల్లి వంటగదిలో ఉంది. పెర్రి తమ్ముడు చాక్లెట్ల కోసం తన తల్లిదండ్రుల గదిలోకి వెళ్లి కప్‌బోర్డులో వెతకడం ప్రారంభించాడు. కప్‌బోర్డులో చాక్లెట్లకు బదులు ఆ చిన్నారికి గన్ దొరికింది. దాన్ని తీసుకుని తమ గదిలోకి వెళ్లాడు. అక్కడ వీడియో గేమ్ ఆడుకుంటున్న సోదరుడిని కాల్చాడు. ఇదంతా ఆ పసివాడికి తాను నిత్యం ఆడే వీడియో గేమ్‌లానే తోచింది. ఇంతలో తుపాకీ పేలిన శబ్దం విన్న తల్లిదండ్రులు ఆ గదిలోకి వచ్చి చూసేసరికి పెర్రి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెర్రీ మృతి చెందాడు. మృతుడి తండ్రి జెరికో పెర్రీ తరుపు న్యాయవాది మాట్లాడుతూ బాలుడు ఉపయోగించిన తుపాకీకి లైసెన్స్ ఉందని తెలిపారు. -
పరారైన రౌడీల్లో సినీనటి తమ్ముడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై నగరం రౌడీల నిలయంగా మారిపోయిందా...నేరాలు, ఘోరాలు సర్వసాధారణంగా మారిపోతున్నాయా..అని ప్రశ్నించుకుంటే పోలీసుల రికార్డులను బట్టి అవుననే సమాధానం వస్తోంది. బుధవారం తెల్లవారుజాము నాటి సంఘటనతో చెన్నైలో రౌడీల సామ్రాజ్యమే వేళ్లూనుకుని పోయిందనే విమర్శలు వినపడుతున్నాయి. రౌడీలతో కలిసి జన్మదినాన్ని జరుపుకున్న బినును తదితర రౌడీలపై కాల్పులు జరిపైనా పట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. కాగా పట్టుబడిన రౌడీలు గగుర్పొడిచే అనేక విషయాలను పోలీసులకు వెల్లడించారు. చెన్నై శివార్లలో బుధవారం తెల్లవారుజామున 150 మందితో కూడిన రౌడీలతో కలిసి చెన్నై సూలైమేడుకు చెందిన పేరొందిన రౌడీ బిను జన్మదినాన్ని బహిరంగంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా 75 మంది పోలీసులకు పట్టుబడగా 50 మంది పరారయ్యారు. భారీ సంఖ్యలో మారణాయుధాలు స్వాధీనం వార్త స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాపులు, బెదిరింపులతో కూడిన పంచాయితీలు, డబ్బు కోసం ఎంతటి ఘాతుకానికైనా వెనుకాడని 150 మంది యువకులు ఒకేచోట చేరి సంబరాలు జరుపుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రప్రథమమని అంటున్నారు. రౌడీల ఆగడాలను అణచివేసేందుకు ప్రత్యేకంగా ఒక పోలీసు బృందం 15 ఏళ్లుగా పనిచేస్తోంది. గతంలో కొందరు రౌడీలను పోలీసులే ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపారు. అయినా...నగరంలో కొత్త రౌడీలు పుట్టుకురావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. పట్టుబడిన రౌడీల నేర చరిత్రను బట్టీ ఏబీసీలుగా విభజించి రికార్డులను తయారు చేసుకున్నారు. చెన్నైలో హత్య, హత్యాయత్నం, కిడ్నాపు నేరాలకు పాల్పడిన 4,180 మంది జాబితా పోలీసుల రికార్డుల్లో ఉంది. వీరందరిపై పోలీసులు నిరంతర నిఘా పెట్టి ఉంచారు. రౌడీయిజాన్ని అణచివేసేందుకు వారిపై కఠినమైన గూండా చట్టాన్ని కూడా ప్రయోగిస్తున్నారు. గత ఏడాది 880 మంది రౌడీలపై గూండా చట్టం కింద కేసులు పెట్టారు. ఇంత కసరత్తు చేస్తున్నా ఏమాత్రం లెక్కచేయని రీతిలో రౌడీలంతా కలిసి మారణాయుధాలతో జన్మదిన సంబరాలను జరుపుకున్నారు. నకిలీ జర్నలిస్టులు, న్యాయవాదులు: బిను జన్మదిన సంబరాల శిబిరంపై పోలీసులు దాడి చేసినపుడు కొందరు వ్యక్తులు తాము జర్నలిస్టులమని, కవరేజీ కోసం వచ్చామని గుర్తింపుకార్డు చూపి వాదులాటకు దిగారు. అలాగే న్యాయవాదులమంటూ గుర్తింపు కార్డులను చూపిస్తూ కొందరు వ్యక్తులు పోలీసులను ఎదిరించారు. అయితే వారివాదనను పట్టించుకోని పోలీసులు అందరినీ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి గుర్తింపు కార్డులను పరిశీలించగా అన్ని నకిలీవని తేలింది. దీంతో అందరినీ అరెస్ట్ చేసి గురువారం కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు. పట్టుబడిన వారిలో 20 మంది కాలేజీ విద్యార్థులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పరారైన రౌడీల్లో పాతనేరస్తుడైన ఒక మాజీ ప్రముఖ నటి తమ్ముడు సైతం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అంతేగాక వృత్తిపరమైన విభేదాలతో ఐదుగురు రౌడీలను హత్యచేసేందుకే బిను తన జన్మదినానికి వారిని ఆహ్వానించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. బినుపై 25 ఏళ్ల నేర చరిత్ర: ఇదిలా ఉండగా, రౌడీలతో కలిసి బుధవారం జన్మదినం జరుపుకుంటూ పోలీసులకు చిక్కకుండా పరారైన బినుకు 25 ఏళ్ల నేరచరిత్ర ఉందని పోలీసులు తెలుసుకున్నారు. కేరళ రాష్ట్రం నుంచి చిన్నవయసులోనే చెన్నైకి వచ్చిన బిను పూర్తి పేరు బిను పాప్పచ్చన్, చెన్నైలో ఉంటూ చిన్నపాటి నేరాలతో జీవితం ప్రారంభించాడు. క్రమేణా హత్యలు, కిడ్నాపులు, పంచాయితీలకు దిగి రౌడీల నాయకుడిగా ఎదిగాడు. తనను ఎదిరించిన ముగ్గురు వ్యక్తులను తలను నరికి మొండం నుంచి వేరుచేసి, ముఖం గుర్తుపట్టలేకుండా చిదిమివేయడంతో అతడిని ‘తలనరికిన బిను’ అనే కోడ్ నామధేయం అతనికి స్థిరపడింది. మూడు క్రూరమైన హత్యలు చేయడంతో ‘తల’ (నాయకుడా) అని పేరుతో రౌడీల సర్కిల్లో గౌరవం, సహచర ముఠా సంఖ్యను పెంచుకున్నారు. రౌడీయిజంతో ఆర్జించిన సొమ్ముతో తన స్వరాష్ట్రమైన కేరళకు వెళ్లడం, కొన్నాళ్లు జల్సా చేసి చెన్నైకి చేరుకోవడం బినుకు పరిపాటి. బుధవారం నాటి జన్మదిన ఖర్చుల కోసం ఒక బిల్డర్‌ను బెదిరించి రూ.54 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జన్మదిన సంబరాలపై పోలీసులు మెరుపుదాడి చేయడంతో తన సహచరులతో కలిసి బైక్‌లోనే కేరళకు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారైన రౌడీలను పట్టుకునేందుకు ఏర్పడిన నాలుగు ప్రత్యేక పోలీసు బృందాల్లో రెండు బృందాలు కేరళకు వెళ్లాయి. -
క్యాష్ వ్యాన్‌పై కాల్పులు: రూ.11లక్షలు లూటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో దొంగలు చెలరేగి పోయారు. భారీ నగదుతో వెళుతున్న క్యాష్‌వ్యాన్ పై కాల్పులు జరిపి సుమారు రూ.11లక్షల సొమ్మును ఎత్తుకళ్లారు. బైక్ వచ్చిన ముగ్గురు ఆగంతకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. విజయ్ విహార్‌లో శనివారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో క్యాషియర్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
ఢిల్లీలో కలకలం: బస్సుపై కాల్పులు, విద్యార్థి కిడ్నాప్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. నిన్న గుర్గావ్లో స్కూలు బస్సుపై దాడి ఉదంతం రేపిన ఆందోళన ఇంకా చల్లారకముందే ఢిల్లీలో మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. తూర్పుఢిల్లీలో ఒక స్కూలు బస్సుపై అగంతకులు దాడిచేశారు. డ్రైవర్‌పై కాల్పులు జరిపి ఒక విద్యార్థిని కిడ్నాప్ చేశారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని నగరంలో జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతను రాజేసింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు అంగతకులు బస్సును అటకాయించి, డ్రైవర్ పై కాల్పులు జరిపారు. అనంతరం ఒక నర్సరీ విద్యార్థిని బలవంతంగా ఎత్తుకొని పారిపోయారు. బాధిత బాలుడిని వివేకానంద పాఠశాలలో చదువుతున్న నర్సరీ విద్యార్థిగా గుర్తించారు. ఈ షాకింగ్ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు బుధవారం సాయంత్రం గుర్గావ్లో స్కూలు బస్సుపై దాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలో ఈ రోజు చాలా స్కూళ్లను మూసివేశారు. -
అంతా సినీఫక్కీనే..!
సహజ సంఘటనల ఆధారంతో సినిమాలు తీస్తున్నారా లేక సినిమాలు చూసి అదే కోవలో దోపిడీకి పాల్పడుతున్నారా అనే ప్రశ్నకు జవాబు దొరకదు. గుడ్డు ముందా? కోడి ముందా? అని ప్రశ్నించినట్లే అవుతుంది. ఇటీవల విడుదలైన ‘ధీరన్’ తమిళ చిత్రంలోని సన్నివేశాలను అచ్చుగుద్దినట్లుగా తలపించే రీతిలో చోటుచేసుకున్న సంఘటనలు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ను బలిగొన్నాయి. మరో ఇన్స్పెక్టర్, ఐదుగురు పోలీసులు తీవ్ర గాయాలతో రాజస్థాన్ ఆçస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు పోలీసు శాఖను గగుర్పాటుకు గురిచేసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, చెన్నై: నగర శివారు ప్రాంతం కొళత్తూరురెట్టేరి సమీపంలోని లక్ష్మీపురం కడప రోడ్డులోని మహాలక్ష్మి జ్యువెలరీ, కుదువ వ్యాపారం దుకాణం ఉంది. దుకాణ యజమాని ముకేష్‌కుమార్ గత నెల 16న మధ్యాహ్నం 1గంటకు షట్టర్‌కు తాళం వేసి భోజనానికి వెళ్లాడు. సాయంత్రం 4గంటలకు తిరిగి దుకాణానికి వచ్చిన అతను దొంగలు దోచుకున్న సంగతిని గుర్తించాడు. 3.5 కిలోల బంగారు నగలు, 4.5 కిలోల వెండి, రూ.2లక్షల నగదు చోరీకి గురైంది. ఈ దోపిడీపై రాజమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుకాణానికి పై భాగంలో వస్త్రవ్యాపారం పెట్టుకుంటామని యజమానిని నమ్మించి అద్దెకు చేరిన రాజస్థాన్‌కు చెందిన పాత నేరస్థులు నాధూరాం, దినేష్ చౌదరి ముఠాగా గుర్తించారు. చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే.విశ్వనాథన్ ఆదేశాల మేరకు మధురవాయల్ శాంతిభద్రతల విభాగం ఇన్స్పెక్టర్ పెరియపాండి, కొళత్తరు ఇన్స్పెక్టర్ మునిశేఖర్ నేతృత్వంలో 8 ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. ఈ బృందం గత నెల 18వ తేదీ నుంచి రాజస్థాన్‌లో దుండగుల కోసం గాలిస్తున్నారు. దోపిడీతో సంబంధం ఉన్న జెన్రాం (60), శంకారీ (40), ధనరాం (55), టిక్కారాం (49)లను ఒక పోలీసు బృందం అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకొచ్చింది. వీరి నుంచి ప్రధాన నిందితుడి వివరాలు సేకరించి రిమాండుకు పంపారు. ఈ నెల 8వ తేదీన ముఖ్యమైన సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్లు పెరియపాండి, మునిశేఖర్ అదే రోజు విమానంలో రాజస్థాన్ చేరుకున్నారు. పల్లి జిల్లా జయధరన్ పోలీసుస్టేషన్ పరిధిలోని రాంపూర్కలన్ గ్రామంలో నాధూరాం దాక్కుని ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో బుధవారం తెల్లవారుజాము సుమారు 2 గంటల ప్రాంతంలో దుండుగులు దాక్కొని ఉన్న ఇంటిని చుట్టుముట్టి లోనికి చొరబడ్డారు. లోపల ఉన్న దొంగలు పోలీసులపై తూటాల వర్షం కురిపించారు. ఇన్స్పెక్టర్ పెరియపాండియన్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మరో ఇన్స్పెక్టర్ మునిశేఖర్, ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. అనూహ్యరీతిలో సాగిన ఎదురుదాడి నుంచి తమిళనాడు పోలీసులు తేరుకునే లోగా నాథూరాం, దినేష్ చౌదరి వారి అనుచరులు తప్పించుకు పారిపోయారు. రాజస్థాన్ పోలీసులు గాయపడిన తమిళనాడు పోలీసులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సమాచారం అందుకున్న చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ సహాయ కమిషనర్ ముకేష్‌కుమార్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని రాజస్థాన్‌కు పంపారు. పెరియపాండి భౌతికకాయాన్ని చెన్నైకి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాల్పులకు పాల్పడిన ముఠాపై కేసు నమోదు చేసిన రాజస్థాన్ పోలీసులు గాలింపు చేపట్టారు. పరామర్శల వెల్లువ: దొంగల ముఠా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇన్స్పెక్టర్ పెరియపాండి కుటుంబ సభ్యులను బుధవారం పలువురు పరామర్శించారు. చెన్నై కమిషనర్ ఏకే.విశ్వనాథన్, డీఎంకే నేత స్టాలిన్ బుధవారం ఉదయం నేరుగా వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతుని కుటుంబానికి సీఎం ఎడపాడి రూ.కోటి సహాయాన్ని ప్రకటించారు. తిరునెల్వేలి జిల్లా శంకరన్‌కోవిల్‌కు చెందిన పెరియపాండి 1969 మార్చి4వ తేదీన జన్మించారు. 2000 మే 22వ తేదీన పోలీస్‌శాఖలో ఏఎస్ఐగా చేరి ఆ తరువాత ఎస్ఐగా, 2014 జనవరి 21వ తేదీన ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. ఈ ఏడాది అక్టోబర్ 10న మధురవాయల్ పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. పెరియపాండికి భార్య భానురేఖ (40), రూపన్ (17), రామన్ (14) ఇద్దరు కుమారులున్నారు. -
బుల్లెట్ ఎవరిది?
-
బుల్లెట్ ఎవరిది?
♦ మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కొడుకుపై కాల్పులు! ♦ రెండు భుజాల్లోకి దూసుకెళ్లిన తూటాలు ♦ శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటలకు ఘటన ♦ అన్నదానానికి దర్గాకు వెళ్లే యత్నాల్లో ఉండగా కాల్పులు ♦ ఎవరు కాల్చారన్న అంశంపై నోరు విప్పని విక్రమ్ గౌడ్ ♦ అప్పులు, కుటుంబ కలహాల నేపథ్యంలో తానే కాల్చుకున్నారా అని అనుమానాలు సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. కుడి, ఎడమ భుజాల్లోకి రెండు తూటాలు దూసుకెళ్లాయి. శస్త్రచికిత్స చేసిన వైద్యులు పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కాల్పుల ఘటనపై విక్రమ్ నోరు మెదపట్లేదు. దీంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంట్లోని సీసీ కెమెరాలు పని చేయకపోవడం, సమీపంలో కెమెరాలు లేకపోవడంతో కీలకాధారాలు లభించలేదు. అప్పులు పెరిగిపోవడంతోపాటు తనను దూరంగా ఉంచుతున్న కుటుంబీకులను బెదిరించేందు కు ఆయనే కాల్చుకొని ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి ఇంటికి వచ్చి.. విక్రమ్ భార్య షిపాలి ఇచ్చిన ఫిర్యాదు, పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.86లోని ప్లాట్ నం.459లో విక్రమ్ తొమ్మిది నెలల క్రితం అద్దెకు దిగారు. భార్యా పిల్లలతో కలసి నివసిస్తున్నారు. కొన్ని చిత్రాలు కూడా నిర్మించిన విక్రమ్ గౌడ్ ప్రస్తుతం అందుకు సంబంధించి ఓ కార్యాలయం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో బయట నుంచి ఇంటికొచ్చిన విక్రమ్ 9 గంటలకు మరోసారి వెళ్లారు. ఫిల్మ్‌నగర్ రోడ్ నం–1 సమీపంలో ఉండే చాంద్ అనే వ్యక్తిని కలిసిన తర్వాత తెల్లవారుజామున 2–2.20 గంటల మధ్యలో ఇంటికి వచ్చారు. డూప్లెక్స్ ఇంటిపై భాగంలో నిద్రిస్తున్న భార్యను నిద్రలేపి సమీపంలో ఉన్న హకీంబాబా దర్గాలో పేదలకు అన్నదానం చేద్దాం.. సిద్ధమవాలని సూచించారు. రెడీ అయి 3.20 గంటల ప్రాంతంలో కిందికి వచ్చి డ్రాయింగ్ రూమ్‌లో విక్రమ్ కూర్చున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలో భార్య కిందకు వచ్చేందుకు సిద్ధమైంది. ఆమె మెట్లు దిగుతుండగా.. డ్రాయింగ్ రూమ్ నుంచి కాల్పుల శబ్దం, భర్త అరుపులు వినిపించాయి. దీంతో ఆమె కంగారుగా డ్రాయింగ్ రూమ్‌లోకి వెళ్లి చూడగా.. విక్రమ్ సోఫాలో రక్తపుమడుగులో కనిపించారు. ఎవరో వచ్చి తనపై కాల్పులు జరిపారని భార్యతో చెప్పారు. వెంటనే షిపాలి వాచ్మెన్ శ్రీనివాస్‌తో పాటు డ్రైవర్లు శ్రీకాంత్, గోపీల సాయంతో కారులో చేర్చి అపోలో ఆస్పత్రికి తరలించారు. కాల్పుల్లో కుడి చేతి భుజంలో దిగిన తూటా బయటకు వచ్చేయగా.. ఎడమ భుజంలో దిగి ఇరుక్కుపోయిన బుల్లెట్‌ను వైద్యులు ఆపరేషన్ చేసి తీశారు. ఇంటి చుట్టూనే తిరిగిన శునకం.. ఘటనా స్థలంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్టీమ్లతో పోలీసులు ఆధారాలు సేకరించారు. పోలీసు డాగ్ ఇంటి చుట్టూనే తిరిగిందని, ఒకసారి గేటు బయటకు వచ్చి మళ్లీ లోనికి వెళ్లిందని పోలీసులు పేర్కొన్నారు. డ్రాయింగ్ రూమ్‌లో రెండు ఖాళీ తూటాలు (ఖాళీ క్యాట్రిడ్జ్), విక్రమ్ కుడి భుజం నుంచి బయటకు వచ్చిన మరో కాల్చిన తూటాను స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో ఉన్న రక్తాన్ని వాచ్‌మన్ శ్రీనివాస్ కొంతమేర తుడిచేయగా.. ఆయన కుమారుడు నాగేంద్ర అడ్డుకున్నారు. సోఫా, నేలపై పడిన రక్తపు మరకల నుంచి పోలీసుల నమూనాలు సేకరించారు. కాల్పులకు వాడింది నాటు పిస్టల్గా భావిస్తున్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌ను పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తదితరులు ఎంతగా ప్రశ్నించినా.. తనపై కాల్పులు జరిపింది ఎవరో తెలుసునని, బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటానని చెప్పారు. కేసు దర్యాప్తు కోసం పది బృందాలు ఏర్పాటు చేసినట్లు మహేందర్‌రెడ్డి తెలిపారు. విక్రమ్ తనకు తాను కాల్చుకున్నారా? లేక ఎవరైనా కాల్పులు జరిపారా? అన్న కోణాలనూ పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఆద్యంతం మిస్టరీ.. షిపాలి ఫిర్యాదు, ఘటనాస్థలి, వాచ్మెన్ చెబుతున్న విషయాలు, గాయాలను పరిశీలించిన పోలీసులు, ఫొరెన్సిక్ నిపుణులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ ఇటీవల అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. విక్రమ్ ఇటీవలే ఓ స్టూడియో ఏర్పాటు చేశారని, అది రెండున్నర నెలల్లో రూ.1.5 కోట్ల నష్టాల్ని తెచ్చిందని పోలీసులు చెప్తున్నారు. ఆయన ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా.. తమకు చెల్లించాల్సిన రూ.లక్షలు తిరిగి ఇవ్వాల్సిందిగా కొందరు వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా ఆయన్ను కోరినట్టు తెలిసింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 35 సందేశాలను గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే కొద్దిరోజుల నుంచి కుటుంబ కలహాలు మొదలైనట్లు తెలుస్తోంది. తన తండ్రి నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేదని విక్రమ్ కొద్దిరోజుల నుంచి స్నేహితులతో చెప్పుకుంటున్నారని సమాచారం. దీంతో ఈ ఉదంతం చోటు చేసుకోవడానికి ఇవి కూడా కారణమా అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఇష్క్’ సినిమాలకు విక్రమ్ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే విక్రమ్ ఇంట్లో పోలీసులు దాదాపు ఆరు గంటలపాటు తుపాకీ ఆచూకీ కోసం గాలించినా దొరకలేదు. ఇటీవల రద్దయిన తన ఆయుధ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవడానికి విక్రమ్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు హకీంబాబా దర్గాలో పేదలకు అన్నదానం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో కాల్పులు జరిగినట్లు విక్రమ్ భార్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ దర్గా నిర్వాహకులు మాత్రం తమ వద్ద అన్నదానాలు వంటివి జరగవని, తమకు విక్రమ్ ఆయన సంబంధీకుల నుంచి ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. వాచ్‌మన్‌ను పోలీసులు విచారించగా.. కాల్పుల శబ్దం వినిపించిందని, ఆ సమయంలో ఎవరూ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు లేదని తెలిపాడు. -
పూర్ణ అంత పని చేసిందా!
తమిళసినిమా: నటి పూర్ణ అంత పని చేసిందా? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఇదే. ఇంతకీ పూర్ణ ఏం చేసింది? బహుభాషా నటిగా పేరొందిన ఈ అమ్మడికి తమిళం, తెలుగు, మలయాళం ఇలా ఏ భాషలోనూ పెద్దగా అవకాశాలు లేవు. అయితే పూర్ణ మంచి నటి. అంతకంటే మంచి డాన్సర్. దీంతో నటనకు దూరం కావడం ఇష్టం లేక అంది వచ్చిన పాత్రలను చేస్తూ తన ఉనికిని చాటుకుంటోందని చెప్పవచ్చు. దర్శకుడు మిష్కిన్ నిర్మించిన సవరకట్టి చిత్రంలో దర్శకుడు రామ్‌కు భార్యగా ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించింది. ఇందులో తనది నటనకు అవకాశం ఉన్న పాత్ర అని, అంత మంచి పాత్రను తనకిచ్చినందుకు మిష్కిన్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో బోరున ఏడ్చేసింది కూడా. ఆ చిత్రం విడుదల కావలసి ఉంది. తాజాగా కొడివీరన్ అనే చిత్రంలో నటిస్తోంది. ముత్తయ్య దర్శకత్వంలో శశికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో మహిమా నంబియార్ కథానాయకిగా నటిస్తోంది. చెల్లెలిగా రేణుగుంట చిత్రం ఫేమ్ సనూజ నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో నటి పూర్ణ నటిస్తోంది. ఇది చాలా బలమైన పాత్ర అట. ఈ పాత్రలో నటించడానికి ఈ అమ్మడు తన జుత్తునే త్యాగం చేసిందట. అర్థం కాలా? గుండు కొట్టించుకుందట. సాధారణంగా కథానాయకులే గుండు కొట్టించుకోవడానికి సిద్ధపడరు. విగ్‌తో మ్యానేజ్ చేస్తుంటారు. అలాంటిది నటి పాత్ర కోసం గుండు గీయించుకోవడం టాక్‌గా మారింది. దీని గురించి పూర్ణను అడిగితే పాత్రకు అవసరం అయితే గుండు కొట్టించుకోవడం తప్పేంకాదు అని పేర్కొంది. కథానా యకి పాత్రలే కావాలని పట్టుపట్టి కూర్చోకుండా నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న పూర్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక రౌండ్ కొడుతుందేమో! -
మీ దేశానికి వెళ్లిపోండి..
అమెరికాలో మరో భారతీయుడిపై పేలిన విద్వేషపు తూటా - వాషింగ్టన్లో సిక్కు యువకుడు దీప్ రాయ్‌పై కాల్పులు - మీ దేశానికి వెళ్లిపోండని అరుస్తూ పారిపోయిన దుండగుడు - భుజంలోకి దూసుకెళ్లిన బుల్లెట్.. కోలుకుంటున్న దీప్ రాయ్ - సిక్కు సంఘాల ఆగ్రహం.. భారతీయ అమెరికన్లలో ఆందోళన - బాధితుడి తండ్రితో మాట్లాడిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ - భారతీయుల కోసం ట్రంప్‌తో మోదీ మాట్లాడాలి: ఖర్గే వాషింగ్టన్: అమెరికాలో భారతీయులపై విద్వేషపూరిత ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్న కాన్సస్‌లో శ్రీనివాస్ కూచిభొట్ల.. నిన్న దక్షిణ కరోలినాలో హర్నీశ్ పటేల్‌పై దాడులు జరగ్గా ఇప్పుడు మరో భారతీయుడిపై జాత్యహంకార తూటా పేలింది. తాజాగా, న్యూయార్క్‌లో భారత–అమెరికన్ దీప్ రాయ్ (39) అనే సిక్కు యువకుడిపై ముసుగువేసుకున్న ఆగంతకుడు ‘మీ దేశానికి వెళ్లిపోండి’ అని అరుస్తూ కాల్పులు జరిపాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటిముందు కారు వద్ద నిలబడ్డ దీప్ రాయ్ దగ్గరకు వచ్చిన ఆగంతకుడు కాసేపు వాగ్వాదం తర్వాత కాల్పులు జరిపాడని కెంట్ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆగంతకుడు గట్టిగా అరుస్తూ కాల్పులు జరిపి పారిపోయాడన్నారు. దీంతో బాధితుడి భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని కెంట్ పోలీస్ కమాండర్ జరోడ్ కేస్నర్ వెల్లడించారు. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అందుకే ఎఫ్బీఐతోపాటు ఇతర ఏజెన్సీల సాయం తీసుకుంటున్నట్లు ఆగంతకుడి కోసం గాలిస్తున్నామన్నారు. ‘దేశంలో ఇటీవల నెలకొన్న అనిశ్చితి, ఆందోళనకు కొందరు అమెరికన్లు ఎమోషనల్‌గా స్పందించటమే కారణమనిపిస్తోంది. అవతలి వ్యక్తి రంగు, ప్రాంతం ఆధారంగా నేరానికి పాల్పడటం సరికాదు’ అని కేస్నర్ తెలిపారు. భారతీయ–అమెరికన్లలో ఆందోళన వరుస విద్వేషపూరిత ఘటనలతో భారత అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ‘పరిస్థి తులు చాలా భీకరంగా ఉన్నాయి. రోజురో జుకూ ఇబ్బందికరంగా మారుతున్నాయి. బహి రంగ ప్రదేశాల్లోనూ వ్యక్తిగత ప్రదేశాల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వర్ణవి వక్ష దూషణలు, విద్వేషపూరితమైన చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని భారత– అమెరికన్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ వెల్లడిం చింది. కాన్సస్, న్యూయార్క్, వాషింగ్టన్లలో జరిగిన మూడు ఘటనల్లోనూ బాధ్యులు ‘మీ దేశానికి వెళ్లిపోండి’ అని గట్టిగా అరుస్తూ దాడులకు దిగటం ద్వారా ఇవి విద్వేషపూరిత ఘటనలేనని భావిస్తున్నామని తెలిపింది. భారతీయుల హక్కులను కాపాడేందుకు, భద్రతపై భరోసా ఇచ్చేందుకు నాయకులు, సంఘాలను కలుపుకుని ముందుకెళ్తామని ఇండియా సివిల్ వాచ్ అనే సంస్థ తెలిపింది. దీప్‌రాయ్ ఘటనను విద్వేషపూరిత ఘటనగా గుర్తించి విచారణ జరపాలంటూ అమెరికా సిక్కు సంఘాలు డిమాండ్ చేశాయి. అమెరికాలోని సిక్కులపై ఇటీవల వేధింపులు, దాడులు ఎక్కువయ్యాయని రెంటాన్ ప్రాంత సిక్కు వర్గం నేత జస్మీత్ సింగ్ తెలిపారు. ఈ ఘటనతో అతని కుటుంబంతో పాటు భార తీయ అమెరికన్లలో ఆందోళన పెరిగిందన్నారు. ‘సెప్టెంబర్ 11’ ఘటన తర్వాత గురుద్వా రాలు, సిక్కు సమాజంపై దాడులు జరుగు తూనే ఉన్నాయని తెలిపారు. ‘అయితే అప్పట్లో శాంతి భద్రతలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వటంతో కాస్త ధైర్యంగా ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి’ అని జస్మీత్ సింగ్ వెల్లడించారు. దురదృష్టకరం: సుష్మ ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘దీప్ రాయ్‌పై కాల్పుల ఘటన దురదృష్టకరం. బాధితుడి తండ్రి సర్దార్ హర్పాల్ సింగ్‌తో మాట్లాడాను. భుజంలో గాయమైందని ఆయన తెలిపారు. వారికి మేం అండగా ఉంటాం. చికిత్స పొందుతున్న దీప్ రాయ్ పరిస్థితి నిలకడగానే ఉంది’ అని సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. దీప్ రాయ్ మాట్లాడగలుగుతున్నారని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. దక్షిణ కరోలినాలో హర్నీశ్ పటేల్ హత్య ఘటనపైనా విచారణ జరుగుతోందని.. భారత రాయబార కార్యాలయ అధికారులు బాధితుడిని చేరుకుని కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారని సుష్మ తెలిపారు. భారత్‌లో అమెరికా రాయబార కార్యాలయం ఇన్చార్జ్, మేరీకే ఎల్ కార్ల్సన్ కూడా తాజా కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ‘దీప్ రాయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. అమెరికా అధ్యక్షుడు కూడా విద్వేషం ఏ రూపంలో ఉన్నా ఖండించాలని తెలిపారు’ అని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. మోదీ ‘కామ్ కీ బాత్’ చేయాలి: ఖర్గే అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులను అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడాలని.. లోక్‌సభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే కోరారు. బెంగళూరులోని కలబుర్గిలో ఆదివారం మాట్లాడుతూ.. ‘కేంద్రం వెంటనే రంగంలోకి దిగి భారతీయులపై దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో అంతర్జాతీయ సంక్షోభం తప్పదు’ అని హెచ్చరించారు. పదిరోజుల వ్యవధిలో భారతీయులపై మూడుచోట్ల విద్వేషపూరిత దాడులు జరగటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’ను పక్కన పెట్టి ‘కామ్‌కీ బాత్’ను ప్రారంభించాలని ఎద్దేవా చేశారు. మరో విద్వేషపు తూటా! ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’ -
దొంగనుకుని భార్యను కాల్చేశాడు
వాషింగ్టన్: అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన భార్యను దొంగ అనుకుని భర్త తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ కరోలినాలోని గోల్డ్స్బరోలో గినా విలియమ్స్(48), బిల్లీ విలియమ్స్(49)లు నివసిస్తున్నారు. కాగా, గినా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఘటన జరిగిన రోజు నైట్ షిఫ్ట్ కావడంతో గురువారం సాయంత్రమే కార్యాలయానికి వెళ్లింది. మరుసటి రోజే ఆమె తిరిగి వస్తుందని భావించిన బిల్లీ ఇంట్లోకి ఎవరో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండటంతో అప్రమత్తమయ్యాడు. దొంగ భావించిన బిల్లీ తుపాకీతో వ్యక్తి మెడ భాగంలో కాల్చాడు. దీంతో బుల్లెట్ గాయమైన గినా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాగా బిల్లీపై ఇంకా ఎలాంటి కేసు నమోదు కాలేదు. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. -
ట్రంప్ పై కాల్పులు: బీబీసీ ట్వీట్
లండన్: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సమయంలోనే ఆయన్ను కాల్చివేశారంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ చేసిన ట్వీట్ ప్రపంచాన్ని కాసేపు కాలవరపాటుకు గురిచేసింది. కొద్దిసేపటికే తప్పును సరిదిద్దుకున్న బీబీసీ సంబంధిత ట్వీట్‌ను తొలగించింది. తుపాకీ కాల్పుల్లో ట్రంప్ గాయపడ్డారని ట్వీట్లో బీబీసీ పేర్కొంది. దీంతో ఒక్కసారిగా ట్విట్టర్లో కలకలం రేగింది. ట్వీట్‌ను తొలగించిన తర్వాత సంబంధిత పోస్టుకు క్షమాపణలు వేడుకుంటున్నట్లు చెప్పింది. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి పోస్టు చేశారని తెలిపింది. ఘటనపై విచారణ జరపుతామని వెల్లడించింది. -
రచయిత కాల్చివేత
అమ్మన్: జోర్డాన్ కు చెందిన ప్రఖ్యాత రచయిత నహేద్ హత్తర్ ను ఆదివారం ఓ దుండగుడు ఆదివారం కోర్టు ముందు కాల్చిచంపాడు. క్రైస్తవ మతస్తుడైన హత్తర్ ఇస్లాం వ్యతిరేకి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ను సపోర్ట్ చేసేవారు. గత నెలలో బెడ్ మీద మహిళతో ఉన్న ఓ వ్యక్తి దేవుడిని మద్యం తీసుకుని రమ్మని కోరుతున్నట్లు ఆయన గీసిన చిత్రం వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో ఇస్లాం మతాన్ని కించపరిచేవిధంగా బొమ్మను గీసి పోస్టు చేశాడని హత్తర్ పై కేసు నమోదయింది. కేసు విచారణలో భాగంగా కోర్టు విచారణకు హాజరైన హత్తర్ మెట్లు దిగుతుండగా.. ఓ వ్యక్తి కాల్చిచంపాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్తర్ ను కాల్చిచంపిన వ్యక్తికి దాదాపు 50ఏళ్ల వయసు ఉండొచ్చని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. -
టెక్సాస్‌లో కాల్పులు
టెక్సాస్: టెక్సాస్‌లో మరోసారి గన్ పేలింది. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు అధికారులపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు అధికారులు గాయాలుపాలయ్యారు. అయితే ప్రాణాపాయం తప్పింది. ఓ ఆత్మహత్య ఘటనా స్థలి వద్దకు వెళ్లిన పోలీసులపై ఈ కాల్పులు జరిగాయి. టెక్సాస్ పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన ప్రకారం.. ఫోర్ట్ వర్త్ లోని ఓ ఇంట్లో ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం అందింది. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు ఆ ఇంటికి వెళ్లగా అందులో ఓ వ్యక్తి తలకు బుల్లెట్ గాయాలతో ఎలాంటి స్పందన లేకుండా పడిపోయి ఉన్నాడు. అక్కడే ఉన్న ఓ షెడ్ దగ్గర తమకు ఆధారాలు లభించవచ్చని వెళ్లిన పోలీసులు షెడ్ షెటర్ పైకెత్తగానే కాల్పులు జరిగాయి. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. -
అనుకోకుండా బుల్లెట్ల వైపు వెళ్లాడు
శ్రీనగర్: బలగాల కాల్పుల్లో అనుకోకుండా ఓ అంబులెన్స్ డ్రైవర్ గాయపడ్డాడు. ఫైరింగ్ జరుగుతున్న ప్రాంతంవైపు నుంచే ఓ రోగిని తన అంబులెన్స్‌లో తీసుకెళుతున్న అతడికి ప్రమాదవశాత్తు బుల్లెట్ తగలడంతో గాయాలయ్యాయి. బుల్లెట్ గాయంతోనే అతడు డ్రైవ్ చేస్తూ ఆస్పత్రికి వెళ్లాడు. జమ్మూకశ్మీర్‌లో ఆందోళనలు అదుపుచేసే క్రమంలో బలగాలు అప్పుడప్పుడు బాష్పవాయుగోళాలతోపాటు పెల్లెట్ గన్స్‌ను, ఇతర తుపాకులను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే గందీర్ బాల్ జిల్లా నుంచి ఓ పేషెంట్ ను ఎక్కించుకొని గులాం అహ్మద్ సోఫీ అనే డ్రైవర్ తాను పనిచేస్తున్న ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి వస్తుండగా శ్రీనగర్ లోని సఫాకదల్ ప్రాంతంలో బలగాలు తుపాకులు పేల్చారు. అందులోని ఒక బుల్లెట్ అతడి చేతిలోకి దూసుకెళ్లింది. అయినప్పటికీ అతడు అంబులెన్స్ నడుపుకుంటూ వెళ్లి ఆస్పత్రిలో చేరాడు. -
బోయిన్పల్లి కాల్పులలో పోలీసుల విచారణ
-
పేలిన 'రియల్' బుల్లెట్
-
పేలిన 'రియల్' బుల్లెట్
బోయిన్‌పల్లిలో సినీఫక్కీలో కాల్పులు ► ‘అన్నా..’ అని పిలిచి కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై కాల్పులకు దిగిన దుండగుడు ► ప్రాణభయంతో పక్కనున్న ఆసుపత్రిలోకి పరుగు ► అయినా వదలకుండా వెంటాడిన దుండగుడు ► టాయిలెట్ గదిలో దాక్కున్నా అక్కడికి వెళ్లి కాల్పులు ► గోడ దూకి బయటకు పరుగులుపెట్టిన యాదగిరి ► తుపాకీ లాక్కొని కిందపడిపోవడంతో పారిపోయిన దుండగుడు.. ► అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగుబాటు ► భూవివాదాలే కారణం కావొచ్చు: పోలీసులు హైదరాబాద్: వెనుక నుంచి వచ్చాడు.. ‘అన్నా..’ అని పిలిచాడు.. వెనక్కి తిరగ్గానే ఒక్కసారిగా కాల్పులకు దిగాడు.. ఛాతీలోకి బుల్లెట్ దిగింది.. బాధితుడు రక్తమోడుతూనే ప్రాణభయంతో పరుగులు పెట్టాడు.. అయినా దుండగుడు వదల్లేదు.. వెనుక నుంచే తుపాకీతో వెంటాడాడు.. పక్కనే ఉన్న ఆసుపత్రిలోకి పరుగెత్తి డాక్టర్ రూంలోకి వెళ్తే అక్కడకూ వచ్చి తుపాకీ పేల్చాడు.. అక్కడ్నుంచి తప్పించుకొని టాయిలెట్ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నా వదల్లేదు.. అక్కడికి వచ్చి డోర్ పగులగొట్టే యత్నం చేశాడు.. ఎలాగోలా తప్పించుకొని రోడ్డుపైకి వచ్చి దుండగుడి చేతిలోని తుపాకీ లాక్కొని కొంత దూరం పరుగెత్తి కిందపడిపోయాడు.. చనిపోయాడనుకొన్న దుండగుడు అక్కడ్నుంచి జారుకున్నాడు!! సినీఫక్కీలో జరిగిన ఈ కాల్పుల వేట శనివారం బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. శుక్రవారం అల్వాల్ పరిధిలో కాల్పుల ఘటన మరచిపోకముందే బోయిన్‌పల్లిలో కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరిపై జరిగిన ఈ కాల్పుల ఉదంతం కలకలం సృష్టించింది. సుపారీ కిల్లర్ కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన యాదగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భూ వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుడు పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. వెనకాలే వచ్చి.. అన్నా అని పిలిచి.. బోయిన్పల్లి పరిధిలోని మల్లికార్జుననగర్ భాగ్యశ్రీ ఎన్‌క్లేవ్‌లో నివసించే కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరికి కొందరితో సివిల్ వివాదాలున్నాయి. శనివారం ఉదయం 10.35 గంటలకు ఆయన తన ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఇంటికి సమీపంలోని శ్రీనివాస మెటర్నిటీ అండ్ నర్సింగ్ హోమ్ ఆసుపత్రి వద్దకు చేరుకోగానే.. వెనుక నుంచి వచ్చిన దుండగుడు ‘అన్నా’ అని పిలిచాడు. యాదగిరి వెనక్కు తిరిగి చూడగా.. దుండగుడు తన వద్ద ఉన్న తపంచాతో ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. ఓ తూటా యాదగిరి ఛాతి కింద భాగంలోకి దూసుకుపోయింది. దుండగుడు వరుసగా మూడు రౌండ్లు కాల్చగా ఒకటి మాత్రమే యాదగిరికి తగిలింది. వెంటనే ఆయన ప్రాణభయంతో షటర్ ద్వారా ఆస్పత్రిలోకి పరుగులు తీశాడు. నేరుగా వైద్యుడి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. దుండగుడు రహదారి వైపు వైద్యుడి గది కిటికీ అద్దాలను ధ్వంసం చేసి మరోసారి కాల్చేందుకు యత్నించాడు. దీంతో యాదగిరి ఆ గదిలోంచి ఆస్పత్రి లోపలికి పరుగులు పెట్టాడు. ఓ టాయిలెట్లో దూరి గడియ పెట్టుకున్నాడు. ఆస్పత్రిలోకి ప్రవేశించిన దండగుడు మరో రౌండ్ కాల్పులు జరుపుతూ టాయ్‌లెట్ వద్దకు వెళ్లాడు. దాని తలుపు పగులకొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో యాదగిరి టాయ్‌లెట్ గోడ పై భాగంలో ఉన్న అద్దాలను ధ్వంసం చేసి, కమోడ్ ఎక్కి పక్కనే పాథలాజికల్ ల్యాబ్‌లోకి దూకాడు. అక్కడ్నుంచి ఆస్పత్రి వెనుక డోర్ ద్వారా బయటకొచ్చి ప్రహరీ గోడ దూకేందుకు యత్నించినా కుదరలేదు. దీంతో అక్కడే ఉన్న గేటు ద్వారా బయటకొచ్చి రోడ్డుపై పరుగు తీశాడు. అప్పటికీ వెంటాడుతూ వచ్చిన దుండగుడు మరో రౌండ్ కాల్చాడు. ఈ సమయంలో దుండగుడితో పెనుగులాడిన యాదగిరి అతడి చేతిలోని తుపాకీ లాక్కొని వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి కింద పడిపోయాడు. అప్పటికే కాస్త దూరం వెంటాడిన దుండగుడు కింద పడిన యాదగిరి చనిపోయాడని భావించి జారుకున్నాడు. మొత్తమ్మీద ఆరు రౌండ్ల కాల్పులు జరపగా... నాలుగు ఖాళీ తూటాలు ఘటనాస్థలి, ఆస్పత్రి, దాని వెనుక భాగంలో పడి ఉన్నాయి. వైద్యానికి నిరాకరించిన డాక్టర్.. ఛాతీ కింది భాగంగా బుల్లెట్ గాయమైన యాదగిరి కాసేపటికి తేరుకొన్నాడు. దుండగుడు వెళ్లిపోవడంతో లేచి ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయాలని వైద్యుడిని కోరాడు. డాక్టర్ నిరాకరించడంతో ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి బోయిన్పల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. దుండగుడి నుంచి లాక్కున్న నాటు తుపాకీని పోలీసులకు అప్పగించి జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు సికింద్రాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పుల ఉదంతంలో ఇద్దరు దుండగులు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఒకరు సహకరించగా... మరొకరు కాల్పులకు దిగినట్లు చెబుతున్నారు. ఘటనాస్థలికి చుట్టుపక్కల మార్గాల్లోని సీసీ కెమెరాలు ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రెండో తుపాకీ ఎక్కడిది? దుండగుడు కాల్పులకు దిగడంతో ఆస్పత్రిలోకి దూరిన యాదగిరి డాక్టర్ రూం వద్ద ఉన్న డస్ట్‌బిన్‌లో ఓ నాటు తుపాకీ పడేశాడు. ఆస్పత్రి వెనుక పెనుగులాటలో దుండగుడి నుంచి తుపాకీ లాక్కుని, దాన్ని పోలీసుస్టేషన్లో అప్పగించాడు. ఈ నేపథ్యంలో డస్ట్‌బిన్‌లో పడేసిన నాటు తుపాకీ ఎవరిదనే కోణంలో ఆరా తీస్తున్నారు. యాదగిరి దీన్ని తన వద్ద ఉంచుకుని సంచరిస్తున్నాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బోయిన్పల్లి సమీపంలోని మచ్చ బొల్లారంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు, యాదగిరిపై హత్యాయత్నానికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు యాదగిరిపై కాల్పులకు తెగబడింది హస్మత్‌పేటకు చెందిన పాత నేరగాడు డాకూరి బాబుగా తెలుస్తోంది. ఇతడు గతంలో హస్మత్‌పేట చెరువు వద్ద రియల్టర్ శివరాజ్‌ను హత్య చేశాడు. అది సుపారీ హత్య కావడంతో.. ఇది కూడా అదే తరహాకు చెందినదే అని అనుమానిస్తున్నారు. ఇతడు పోలీసు ఎదుట లొంగిపోగా విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. యాదగిరి హత్యకు సుపారీ ఇచ్చిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. బాబుకు సహకరించాడని భావిస్తున్న మరో నిందితుడు రాజు పరారీలో ఉన్నాడని తెలిసింది. -
బీజేపీ నేతపై వంద రౌండ్ల కాల్పులు
ఘజియాబాద్: స్థానిక బీజేపీ నేత బ్రిజ్ పాల్ టియోటియా (54) కారుపై గుర్తుతెలియని దుండగులు వంద రౌండ్ల కాల్పులు జరిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బ్రిజ్ పాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎన్ హెచ్-58పై కాల్పులు జరిగాయని సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని టియోటియాను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిజ్ పాల్ కాన్వాయ్ పై ఫార్చూనర్లో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఏకే-47, 9ఎంఎం పిస్టళ్లతో కాల్పులు జరిపారు. దాదాపు వంద రౌండ్లు కాల్పుల జరిపిన ఈ దాడిలో బ్రిజ్ పాల్ కు ఐదు బుల్లెట్లు తగిలాయి. ఆయన వెంట ఉన్న నలుగురు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా బుల్లెట్లు తగలడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. సెక్యూరిటీ సిబ్బందిని ఘజియాబాద్ లోని సర్వోదయ ఆసుపత్రికి, బ్రిజ్ పాల్ ను నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన బ్రిజ్ పాల్ ను ఎమర్జెన్సీ వార్డులో ఉంచినట్లు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి ఏకే-47, రెండు 9ఎంఎం పిస్టల్స్, రైఫిల్ తో పాటు భారీ మొత్తంలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పాతకక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏడీజీ దల్జీత్ సింగ్ చెప్పారు. కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. నేరస్తులను పట్టుకునేందుకు ఈ కేసును స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్సపొందుతున్న బ్రిజ్ పాల్ కోలుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. గత కొద్ది సంవత్సరాలుగా బ్రిజ్ పాల్ బీజేపీ కిసాన్ మోర్చాలో సభ్యునిగా ఉన్నారు. 2012 ఉత్తరప్రదేశ్ లోని మురద్ నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. -
మూత్ర విసర్జన చేస్తుంటే.. తుపాకీతో కాల్చాడు
భువనేశ్వర్: ఆసుపత్రి ముందు మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ఓ డాక్టర్ కాల్చిన సంఘటన ఆదివారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే.. దారిన వెళ్తున్న ఓ వ్యక్తి ఆసుపత్రి ముందు మూత్ర విసర్జన చేశాడు. ఇది తట్టుకోలేని ఆసుపత్రి డాక్టర్ రివాల్వర్ తో అతని ఎడమకాలు మోకాలి కింద కాల్చాడు. బుల్లెట్ తగలడంతో వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు డాక్టర్ ను అరెస్టు చేసి రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. -
మూత్ర విసర్జన చేస్తుంటే.. తుపాకీతో కాల్చాడు
-
భార్యను వేరేవారితో చూసి భరించలేక..!
పుణె: అనుమానంతో వైద్యురాలైన తన భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అనంతరం కారులో పారిపోతుండగా ఒక్క గంటలోనే పోలీసులు అతడిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనోజ్ పటిదార్(40) అంజలి పటిదార్(34) అనే ఇద్దరు భార్య భర్తలు. అతడు పుణెలోని హింజేవాడికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా అంజలి గైనాకాలజిస్ట్ గా పనిచేస్తోంది. వీరికి ఓ నాలుగేళ్ల బాబు ఉన్నాడు. వాకడ్ చౌక్ లోని ఆశీర్వాద్ రెగెన్సీ భవనంలో వీరు కాపురం ఉంటున్నారు. అందులోనే ఓ విభాగంలో అంజలి క్లినిక్ నడుపుతోంది. అయితే, బుధవారం రాత్రి ఇంటికొచ్చిన మనోజ్ పిల్లాడు ఇంట్లో నిద్రిస్తుండగా.. సోఫాలో కూర్చుని భార్యతో మాట్లాడుతూ అనూహ్యంగా తుపాకీ తీసి కణతకు పెట్టి కాల్చాడు. ఆమె రక్తపు మడుగులోనే పడిఉండగా తన కారు తీసుకొని పరారు అయ్యాడు. తన భార్యను గాయపరిచానని తల్లికి ఫోన్ చేసి చెప్పగా ఆమె పోలీసులకు చెప్పింది. దీంతో అతడిని గంటలోనే అదుపులోకి తీసుకున్నారు. అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇటీవల తన భార్యను వేరే వారితో ఉండటం మనోజ్ చూశాడని, అది భరించలేక ఆమెను హత్య చేశాడని అతడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అంజలి అతడికి మూడో భార్య. అంతకు ముందు చేసుకున్న ఇద్దరు భార్యలు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
సరిహద్దులో ఎన్ కౌంటర్.. ముగ్గురు మృతి
అమృత్‌సర్ః ఇండో-పాక్ సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు చొరబాటుదార్లు సరిహద్దులనుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా బీఎస్ ఎఫ్ అడ్డుకుంది. ఈ నేపథ్యంలో జరగిన కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదార్లు మరణించినట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది. అక్రమంగా భారత్ లో చొరబడేందుకు ప్రయత్నించిన వారిని అమృత్ సర్ లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎదుర్కొంది. దర్యా ముసా గ్రామ సమీపంలో చొరబాట్లకు యత్నించిన ముగ్గురిని సైన్యం ఎన్ కౌంటర్ చేసింది. బీఎస్ఎఫ్ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడమే కాక, అగ్నిమాపక సైనికులపై ప్రతీకారంగా కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన చొరబాటుదార్లు ఎదురు కాల్పుల్లో మరణించినట్లు బీఎస్ ఎఫ్ వెల్లడించింది. అయితే కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదార్లు మరణించగా, వారివద్దనుంచీ 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, ఒకరు తప్పించుకున్నట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. తప్పించుకున్న వ్యక్తికోసం గాలింపులు జరుపుతున్నామని, చొరబాటుదార్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని బీఎస్ ఎఫ్ తెలిపింది. -
ఆ.. మహిళపైనా మృగాళ్ళ దాడి!
మహిళ కనిపిస్తే చాలు మగాళ్ళు.. మృగాళ్ళై పోతున్నారు. రాను రాను మానవత్వం నశించి, రాక్షసులుగా మారుతున్నారు. శారీరక వాంఛలు తీర్చుకోవడం కోసం తన,పర, లింగ, వయో బేధాలను సైతం మర్చిపోతున్నారు. కనిపించిన వారిని కాటేసేందుకు సిద్ధమైపోతున్నారు. అటువంటి మానవ మృగాల దారుణాలకు అభంశుభం తెలియని అమాయకులు బలైపోతున్నారు. పాకిస్తాన్ లో వెలుగులోకి వచ్చిన దారుణం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ ఇరవై ఏళ్ళ ట్రాన్స్ జెండర్ మహిళపై దుండగులు ఒడిగట్టిన కిరాతక చర్య.. మానవ సమాజం తలదించుకునేలా చేసింది. తొడపై తీవ్ర గాయంతో బాధపడుతున్న ఆమె.. పాకిస్తాన్ కు చెందిన ఇరవై ఏళ్ళ ట్రాన్స్ జెండర్ మహిళ. మాన్ సెహరా పట్టణం వాయువ్యప్రాంతంలోని ఆమె నివాసానికి చేరిన ముగ్గురు సాయుధ దుండగులు తలుపు బద్దలుకొట్టిమరీ ఆమెపై దాడికి దిగారు. తుపాకీతో కాల్చి, ఆమెపై ఆఘాయిత్యానికి ప్రయత్నించారు. లైంగిక చర్యలకు తమకు సహకరించలేదన్న కోపంతో ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. బాధితురాలు తీవ్రంగా ఎదుర్కోవడంతో కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసు అధికారి అమ్మర్ నియాజ్ తెలిపారు. దుండగులను నిర్బంధించేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. బాధితురాలు గాయం నుంచి కోలుకొంటోందని, ఆస్పత్రినుంచి ఆమెను డిశ్చాడ్చి చేసినట్లు పోలీసులు తెలపడంతో విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన ఘటనతో పాకిస్తాన్ మాన్ సెహరా ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ లక్ష్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయంటూ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యులు, హిజ్రా కమ్యూనిటీ మద్దతుదారులు వీధుల్లో ఆందోళన చేపట్టారు. అధికారులు నేరస్థులను పట్టుకొని, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాన్స్ జెండర్లకు రక్షణ కల్పించాలని, భద్రత పెంచాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నిజానికి ప్రపంచంలోని ఇతర దేశాల్లోకంటే ట్రాన్స్ జెండర్లు పాకిస్తాన్ లో తమ హక్కులను వినియోగించుకుంటుండగా, విద్య, ఉద్యోగాలు, ఆరోగ్యం, విషయంలో మాత్రం పక్షపాత ధోరణి కనిపిస్తుంది. వాటిలో అట్టడుగున ఉండటంతోపాటు అనేక వేధింపులను, హింసను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేటికీ పాకిస్తాన్ తోపాటు, భారత్, బాంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో పలువురు హిజ్రాలు దాడులు, మానభంగాలకు గురవ్వడమేకాక, వేశ్యలుగా కూడ పనిచేస్తున్నారు. కొందరు పొట్టపోసుకొనేందుకు ట్రాఫిక్ లైట్లవద్ద, వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నారు. కాగా ఇటీవలి కాలంలో ఒక్క ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలోనే తమ కమ్యూనిటీ సభ్యులపై కనీసం ఐదు దాడులు జరిగినట్లు ట్రాన్స్ జెండర్ సంఘాలు చెప్తున్నాయి. మే నెలలో పెషావర్ ప్రాంతంలో ఓ ట్రాన్స్ జెండర్ మహిళపై ఆమె స్నేహితుడు పలుమార్లు దాడి చేయడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పైగా ఆమెను మేల్, ఫిమేల్ వార్డుల్లో ఏ వార్డులో చేర్చాలో తెలియక ఆలస్యం చేయడంతోనే ఆమె చనిపోయినట్లు స్నేహితులు చెప్పడం ఆందోళన రేకెత్తించింది. తమకు ఐడీ కార్డులు జారీచేయాలంటే లింగ నిర్థారణ పరీక్షలు తప్పనిసరి అంటున్నారని, అందుకు తాము అంగీకరించకపోతే కార్డులు ఇవ్వడంలో వివక్ష చూపిస్తున్నారని పాకిస్తాన్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అల్మాస్ బాబీ తెలిపారు. ఇప్పటికైనా వివక్షను విడనాడి, తమనుసైతం మనుషులుగా గుర్తించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
బిహార్ లో కాల్పులు.. జవాన్ మృతి
పాట్నా: బీహార్ లోమరోసారి తుపాకీ మోత మోగింది. వారణాసి-బక్సర్ మధ్య నడిచే పాసింజర్ రైల్లో దుండగులు దోపిడీకి యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జవాన్లు అడ్డుకోవటంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాను మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జవాన్ల వద్ద ఉన్న రైఫిల్స్ ను తీసుకుని పరారయ్యారు. గాయపడినవారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం వారణాసిలోని ఆస్పత్రికి తరలించగా ఓ జవాన్ మృతి చెందాడు. మృతుడు అభిషేక్ సింగ్ గా గుర్తించారు. గాయపడిన మరో జవాను నంద్ లాల్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉంది. అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం వారణాసికి తరలించారు. మరోవైపు రైల్వే సూపరింటిండెంట్ జితేంద్ర మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. -
రాజధానిలో మరో ఘాతుకం
న్యూఢిల్లీ: ఇప్పటికే క్రైమ్ రేట్ లో అగ్రస్థానంలో ఉన్న దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ప్యాసింజర్లుగా ట్యాక్సీ ఎక్కిన ఇద్దరు టీనేజర్లు డ్రైవర్ ను కాల్చిచంపిన ఘటన నైరుతి ఢిల్లీలోని నజఫ్ గఢ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలను బట్టి.. కుల్ దీప్ అనే వ్యక్తి ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఇద్దరు టీనేజర్లు అతని కారులో ఎక్కారు. కారు ప్రయాణిస్తుండగానే ఆ ఇద్దరూ కుల్ దీప్ తో గొడవకుదిగారు. మాటామాట పెరగటంతో టీనేజర్లు తమ దగ్గరున్న తుపాకితో కుల్ దీప్ ను కాల్చి చంపి పారిపోయారు. గంట తర్వాతగానీ కారులో డ్రైవర్ హత్యకుగురై ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఉబెర్ టాక్సీ కస్టమర్ కాల్ డేటా ఆదారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
భూమి అమ్మలేదని గ్యాంగ్ రేప్, కాల్పులు
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో అమానుషం చోటుచేసుకుంది. భూమి అమ్మలేదనే అక్కసుతో వివాహిత మహిళ (34)పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం ఆమెపై కాల్పులు జరిపి పారిపోయారు. పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలి కుటుంబానికి సంబంధించిన భూమిని, నిందితులకు అమ్మడానికి ఆమె భర్త నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన వారు ఆమె ఇంటి నుంచి మహిళను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె కాళ్లపై కాల్పులు జరిపి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితులు మున్నా, కల్లూ, గఫ్ఫార్, కలీంలను అరెస్ట్ చేసినట్లు సీతాపూర్ ఎస్పీ బీబీ సింగ్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందన్నారు. -
ఎస్ఐపై కాల్పులు.. పరిస్థితి విషమం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారెందుకని ప్రశ్నించినందుకు ఓ పోలీస్ అధికారిని దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. రాజేంద్ర ద్వివేది (50) లక్నోలోని టీపీనగర్ ప్రాంతంలో సోమవారం ఉదయం పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఒక బంగారు దుకాణం దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను గమనించి ప్రశ్నించారు. వారిలో ఒకడిని పట్టుకున్నారు. దీంతో మరో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఎస్ఐ నడుము భాగంలో బుల్లెట్ దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ పై కాల్పుల సందర్భంగా మిగిలిన పోలీసులు కాల్పులు జరిపినప్పటికీ వారు తప్పించుకొని పారిపోయారని సరోజినగర్ పోలీస్ స్టేషన్ అధికారి సుధీర్ కుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ద్వివేది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. -
మహిళను కాల్చి చంపిన దుండగులు
ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ప్రాంతంలో అగంతకులు రెచ్చిపోయారు. డబ్బుకోసం ఓ మహిళను కాల్చి చంపారు. లూటీ చేయడానికి వచ్చిన ముగ్గురు దుండగులు డబ్బును కాజేయడంతోపాటు, మహిళను కడతేర్చిన ఘటన ఫూల్ బెహర్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. రెండు లక్షల రూపాయలతో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని వెంటాడిన సాయుధ దుండగులు అగ్గర్ ఖుర్ద్ గ్రామ సమీపంలో మహిళను కాల్చి చంపి వారివద్ద ఉన్న డబ్బును దోచుకు వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. 35ఏళ్ళ ఆర్తీ దేవి, ఆమె భర్త ఆశిష్ కుమార్ తమ రెండేళ్ళ కొడుకు, ఓ బంధువుతోపాటు ప్రయాణిస్తున్నారు. ఉన్నట్లుండి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని సాయుధ దుండగులు వారివద్ద ఉన్న డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించారు. అయితే వచ్చిన ముగ్గురిలో ఒకరిని ఆర్తీ దేవి గుర్తించడంతో వెంటనే ఆమెను పిస్టల్ తో కాల్చి చంపి, డబ్బును లూటీ చేశారు. ఇటీవల తాము కొనుక్కున్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం రెండు లక్షల రూపాయల డబ్బుతో పాటు తమ అత్తమామల వద్దకు బయల్దేరామని, అగ్గర్ ఖుర్ద్ గ్రామ సమీపంలోకి వచ్చేసరికి అగంతకులు డబ్బును లూటీ చేయడమే కాక తన భార్యను తుపాకీతో కాల్చి చంపారని కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దుండగుల జాడ తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు. -
'రాహుల్ ను ఉరి తీయాలి, లేదా కాల్చి చంపాలి'
జైపూర్: జేఎన్‌యూ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఈ వివాదం నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తాజాగా రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే కైలాశ్ చౌదరి... రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జెఎన్యూలో దేశద్రోహులకు మద్దతు పలుకుతున్న రాహుల్ ఒక విద్రోహి అని వ్యాఖ్యానించారు. రాహుల్ ను ఉరి తీయాలి లేదంటే..కాల్చి చంపాలంటూ మండిపడ్డారు. బైతూ అసెంబ్లీ నియోజవర్గ ఎమ్మెల్యే కైలాశ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. అఫ్జల్ గురుని దేశభక్తుడిగా కీర్తిస్తూ, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ద్రోహులను సమర్ధించిన రాహుల్ దేశంలో వుండే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. కాగా జేఎన్‌యూ విద్యార్ధులకు మద్దతు పలికిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా రాజద్రోహం కేసు నమోదు చేయాలన్న ఓ న్యాయవాది పిటిషన్ ను అలహాబాద్ విచారణకు స్వీకరించడం గమనార్హం. ఈ వ్యవహారంలో చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుంది. -
ఆగంతకుల కాల్పులు: నాయకుడి మృతి
మవు(ఉత్తర్ ప్రదేశ్): దుండగులు జరిపిన కాల్పుల్లో సుహెల్దెవ్ భారతీయ సమాజ్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మవులో చోటు చేసుకుంది. సుహెల్దెవ్ భారతీయ సమాజ్ పార్టీకి చెందిన పవన్ యాదవ్ పార్టీ ఆఫీసు నుంచి బయటకు వెళుతున్న సమయంలో అతని పైకి కొందరు దుండగలు కాల్పులు జరిపి పరారయ్యారు. బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చేరిన యాదవ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాయింట్ బ్లాక్ నుంచి కాల్చినా..
కేప్ టౌన్: కేప్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ నిజాం అలెగ్జాండర్ మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నారు. రోజుమాదిరిగానే చెక్‌పోస్ట్‌ల దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న అలెగ్జాండర్ మీద ఓ దుండగుడు తుపాకీతో పాయింట్ బ్లాక్ రేంజ్ నుంచి కాల్చడానికి ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న అతను దుండగునిపైకి తిరిగి కాల్పులు ప్రారంభించి, పట్టుకోవడానికి పరుగు తీశాడు. కానీ అప్పటికే దుండగుడు పరారవ్వడంతో వెంటనే తిరిగి వచ్చి తన డ్యూటీ తాను చేసుకున్నాడు. ఇదంతా అక్కడే వెనకవైపు ఉన్న పోలీసు వాహనంలోని డ్యాష్ బోర్డ్ కెమెరాలో రికార్డయింది. ప్రాణాపాయం నుంచి కొద్దలో తప్పించుకున్నా, కనీసం కొంచెం గ్యాప్ కూడా తీసుకోకుండా మళ్లీ డ్యూటీలో నిమగ్నమైన ఆ అధికారిని పోలీసులు పొగడ్తలతో ముంచెత్తారు. ఈ వీడియోని వెస్టర్స్ కేప్ ప్రొవిన్షియల్ ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. -
సెంట్రల్ యూనివర్సిటీలో జింక కాల్చివేత
-
ట్యూషన్లో కాల్పులు జరిపిన విద్యార్థి అరెస్ట్
ముజఫర్ నగర్: సహచర విద్యార్థిపై సోమవారం కాల్పులు జరిపిన అనంత్ త్యాగి అనే విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదకొండవ తరగతి చదువుతున్న అకాష్ కుమార్, అనంత్ త్యాగిలు ఇద్దరూ సోమవారం పర్కజీ టౌన్‌లోని ట్యూషన్‌కు వెళ్లారు. అదే సమయంలో తనతో తీసుకొచ్చిన గన్‌తో అనంత్ త్యాగి, అకాష్ పై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో గాయపడ్డ ఆకాష్‌ను వెంటనే అస్పత్రికి తరలించి చికిత్స అందింస్తున్నారు. అనంత త్యాగిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చిందనే అంశం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతను ఉపయోగించిన గన్‌తో పాటూ క్యాట్రిడ్జ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యాయత్నం కింద అతని పై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉత్తర్ ప్రదేశ్ లో జర్నలిస్టు కాల్చివేత
ఉత్తర్ ప్రదేశ్ కన్నోజ్ జిల్లాలో ఓ జర్నలిస్టును గుర్తుతెలియని దుండుగులు కాల్చి చంపారు. పోలీసుల కధనం మేరకు సోమవారం సాయంత్రం దీపక్ గుప్తా అనే జర్నలిస్టు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న భార్యను ఇంటికి తీసుకు వచ్చేందుకు బైక్ పై వెళ్లాడు. వీరు ఇంటికి తిరిగి వస్తుండగా.. హసన్ పూర్ వద్ద ద్విచక్ర వాహనాల్లో వచ్చిన గుర్తుతెలియని వ్యకులు వీరిని అడ్డగించారు. వెంటనే ఒక వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకితో దీపక్ గుప్తాపై పాయింట్ బ్యాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపాడు. తొలుత షాక్ గురైన దీపక్ భార్య.. వెంటనే తేరుకు.. సహాయం కోసం కేకలు వేసింది. దీంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని.. దీపక్ ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే దీపక్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దోపిడీ కోసమే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడికి ఎవరైనా శతృవులు ఉన్నారా...? హత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. గత ఆరునెలలుగా.. రాష్ట్రంలో జర్నలిస్టులపై వరస దాడులు బెంబేలెత్తిస్తున్నాయి.