అమెరికాలో విచ్చలవిడి తుపాకీ సంస్కృతి ఓ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది.
లొరైన్ (అమెరికా): అమెరికాలో విచ్చలవిడి తుపాకీ సంస్కృతి ఓ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. నాలుగేళ్ల పిల్లాడు తన మూడేళ్ల వయసు గల చెల్లిలిని తుపాకీతో కాల్చాడు. ఆ చిన్నారి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. లొరైన్లో ఆదివారం ఈ సంఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన సమాచారం మేరకు అన్నాచెల్లెళ్లు ఇద్దరూ బెడ్రూమ్లో ఆడుకుంటున్నారు. పిల్లాడికి బుల్లెట్లు లోడ్ చేసిన కాలిబర్ హ్యాండ్ గన్ దొరికింది. సరదాగా కాల్చడంతో పాప తీవ్రంగా గాయపడింది. పోలీసులు వచ్చేసరికి పాప తండ్రి చికిత్స నిమిత్తం చిన్నారిని ఎత్తుకుని ఆస్పత్రికి బయల్దేరారు. పిల్లాడు పోలీసులకు ఏడుస్తూ కనిపించాడు. పదే పదే క్షమాపణలు చెప్పిన్టటు పోలీసులు తెలిపారు.