ముంగేర్: బీహార్‌లోని ముంగేర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంకజ్ యాదవ్‌పై కొందరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంకజ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఖాసిం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్స్‌లో పంకజ్ యాదవ్ మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే పంకజ్‌యాదవ్ కింద పడిపోయారు. స్థానికులు అతనిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పంకజ్‌యాదవ్ ఛాతీ దగ్గర బుల్లెట్ తగిలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కుటుంబసభ్యులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు అన్నిప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ, ముంగేర్ ఘటన బాధాకరమని, దోషులను తప్పకుండా పట్టుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇది కూడా చదవండి: బహ్రాయిచ్‌లో పట్టుబడిన చిరుత
Comments
Please login to add a commentAdd a comment