ఎన్‌కౌంటర్లలో నేరస్తులు చనిపోకుండా ఉండాలంటే.. | Himanta Sharma Advise Criminals To Avoid Getting Shot In Encounters | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్లలో నేరస్తులు చనిపోకుండా ఉండాలంటే..: అస్సాం సీఎం సలహా

Published Wed, Mar 15 2023 9:41 PM | Last Updated on Wed, Mar 15 2023 9:46 PM

Himanta Sharma Advise Criminals To Avoid Getting Shot In Encounters - Sakshi

ఎన్‌కౌంటర్‌లో నేరస్తులు చనిపోకుండా ఉండాటానికి ఏం చేయాలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్శ కొన్ని చిట్కాలను అందించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర అసెంబ్లీ గవర్నర్‌ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే ఓటింగ్‌పై జరిగిన చర్చకు సీఎం సమాధానమిస్తూ.. దీని గురించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసులు బుల్లెట్‌తో బుల్లెట్‌కి సమాధానం ఇస్తున్నారు. అందువల్లే రాష్ట్రంలో క్రైమ్‌ రేటు తగ్గిందని అన్నారు. నేరస్తులను కాల్చి చంపకుండా ఉండాలంటే ..క్రిమినల్స్‌ పట్టుబడ్డప్పుడూ చేతులు పైకెత్తాలని అన్నారు.

అప్పుడూ పోలీసులు రివ్వాల్వర్‌కి పనికి చెప్పాల్సిన అవసరం ఉండదన్నారు. " మీరంతా ఎన్‌కౌంటర్‌లు గురించి అడుగుతున్నారు. తెలిసి ఎవరైనా ఎన్‌కౌంటర్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. మతహింస తెలిసి జరుగుతుందా..అలాగే ఎన్‌కౌంటర్‌ కూడా ఆలోచించి జరగదు. ఇప్పుడూ వారు పాత అస్సాం పోలీసులు కాదు. అందుకే వారు బుల్లెట్‌లతో సమాధానం ఇస్తున్నారని అందుకు తాను సంతోషిస్తున్నాను" అని అన్నారు.

అయితే పోలీసులు కూడా చట్ట పరిధిలోనే ఉండాలని చెప్పారు. పోలీసు సిబ్బంది అతను లేదా ఆమె తప్పుచేసినప్పుడూ సీనియర్‌ అధికారి అయినప్పటికీ శిక్షార్హమైన చర్యలు ఎదర్కొనక తప్పదని ముఖ్యమంత్రి శర్మ అన్నారు. ఐతే అటవీ ప్రాంతాలలో జరగుతున్న అక్రమ కార్యకలాపాలు, బాల్యవివాహాలు, ఇతర నేర కార్యకలాపాలు వంటి వాటిపై తమ ప్రభుతం అణిచివేతను కొనసాగిస్తుందని, అలాగే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడానికి సిగ్గుపడరని నొక్కి చెప్పారు. 

(చదవండి: మంత్రిని ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ అరెస్టు..పైగా నేరస్తుడిలా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement