Himanta Sharma
-
ఎన్కౌంటర్లలో నేరస్తులు చనిపోకుండా ఉండాలంటే..
ఎన్కౌంటర్లో నేరస్తులు చనిపోకుండా ఉండాటానికి ఏం చేయాలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్శ కొన్ని చిట్కాలను అందించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే ఓటింగ్‌పై జరిగిన చర్చకు సీఎం సమాధానమిస్తూ.. దీని గురించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసులు బుల్లెట్‌తో బుల్లెట్‌కి సమాధానం ఇస్తున్నారు. అందువల్లే రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని అన్నారు. నేరస్తులను కాల్చి చంపకుండా ఉండాలంటే ..క్రిమినల్స్ పట్టుబడ్డప్పుడూ చేతులు పైకెత్తాలని అన్నారు. అప్పుడూ పోలీసులు రివ్వాల్వర్‌కి పనికి చెప్పాల్సిన అవసరం ఉండదన్నారు. " మీరంతా ఎన్కౌంటర్లు గురించి అడుగుతున్నారు. తెలిసి ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తారా? అని ప్రశ్నించారు. మతహింస తెలిసి జరుగుతుందా..అలాగే ఎన్కౌంటర్ కూడా ఆలోచించి జరగదు. ఇప్పుడూ వారు పాత అస్సాం పోలీసులు కాదు. అందుకే వారు బుల్లెట్లతో సమాధానం ఇస్తున్నారని అందుకు తాను సంతోషిస్తున్నాను" అని అన్నారు. అయితే పోలీసులు కూడా చట్ట పరిధిలోనే ఉండాలని చెప్పారు. పోలీసు సిబ్బంది అతను లేదా ఆమె తప్పుచేసినప్పుడూ సీనియర్ అధికారి అయినప్పటికీ శిక్షార్హమైన చర్యలు ఎదర్కొనక తప్పదని ముఖ్యమంత్రి శర్మ అన్నారు. ఐతే అటవీ ప్రాంతాలలో జరగుతున్న అక్రమ కార్యకలాపాలు, బాల్యవివాహాలు, ఇతర నేర కార్యకలాపాలు వంటి వాటిపై తమ ప్రభుతం అణిచివేతను కొనసాగిస్తుందని, అలాగే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడానికి సిగ్గుపడరని నొక్కి చెప్పారు. (చదవండి: మంత్రిని ప్రశ్నించినందుకు యూట్యూబర్ అరెస్టు..పైగా నేరస్తుడిలా..) -
షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం
గువహటి: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనకు ఆదివారం ఉదయం 2 గంటలకు ఫోన్ చేశారని తెలిపారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. గువహటిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్‌పై దాడి జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చానని, శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని చెప్పానని వివరించారు. అయితే శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో షారుఖ్ ఖాన్ అంటే ఎవరో తనకు తెలియదన్నారు హిమంత. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నుంచి చాలా మంది తనకు ఫోన్ చేస్తారని, కానీ ఇప్పటివరకు ఆ ఖాన్ ఎవరో తనకు కాల్ చేయలేదని పేర్కొన్నారు. ఒకవేళ అతను ఫోన్ చేస్తే సమస్యల గురించి ఆలోచిస్తానన్నారు. ఆ మరునాడే షారుఖ్ హిమంతకు ఫోన్ చేయడం గమనార్హం. షారఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ఈనెల 25న దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ పాటలో హీరోయిన్ దీపికా పదుకొనే కాషాయం రంగు బికినీలో కన్పించింది. దీన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే గువహటిలోని నరెంగిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్‌పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో షారుఖ్ ఖాన్ స్వయంగా సీఎంకు ఫోన్ చేశారు. చదవండి: జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు -
కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు
మహారాష్ట్రలో నారాయణ్ రాణే, అస్సాంలో హిమంత శర్మ రాజీనామా ముంబై/గువాహటి: లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా రెండు రాష్ట్రాల్లో స్వపక్ష నేతలు పెద్ద షాకిచ్చారు. ఆ పార్టీ పాలనలోని మహారాష్ట్ర, అస్సాంలలో ఇద్దరు అసమ్మతి సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రులపై తిరుగుబాటు చేశారు. మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే, అస్సాం ఆరోగ్య, విద్యా మంత్రి హిమంత బిశ్వాస్ శర్మలు తమ సీఎంల పనితీరుపై అసంతృప్తితో సోమవారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. కొన్ని నెలల కింద కూడా రాజీనామా చేసిన వీరు.. అప్పుడు అధిష్టానంఒత్తిడితో ఉపసంహరించుకున్నారు. అయితే ఈసారి ఉపసంహరించుకోనని, శర్మ స్పష్టం చేశారు. నారాయణ్ రాణే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కలుసుకుని రాజీనామా అందజేశారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. ‘2005లో కాంగ్రెస్‌లో చేరినప్పుడు తనను ఆరు నెలల్లో ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన అధిష్టానం తొమ్మిదేళ్లవుతున్నా దాన్ని నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. తాను పార్టీని వీడనని స్పష్టం చేశారు. మరోపక్క తనకు మద్దతిస్తున్న 38 మంది ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ వద్దకు వెళ్లానని, సీఎం గొగోయ్ నాయకత్వంపై అవిశ్వాసం వ్యక్తం చేశానని హిమంత శర్మ తెలిపారు. తాము పార్టీ కోసం పోరాడుతున్నామని, గొగోయ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఘోరంగా దెబ్బతింటుందన్నారు.