avoid
-
గుంపులో చిక్కుకుపోయారా? మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోండి
రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదాలు పొంచివుంటాయి. అనియంత్రిత జనసమూహం కారణంగా సంతోషకరమైన వాతావరణం కూడా కొద్ది క్షణాల్లోనే భయానకంగా మారిపోతుంటుంది. ఇటువంటి ఘటనలు అప్పుడప్పుడూ ఊహించని విధంగా సంభవిస్తుంటాయి.ముందుగానే పసిగట్టవచ్చుఇటువంటి సందర్భాల్లో గుంపులో చిక్కుకున్నప్పుడు సురక్షితంగా బయటపడటం ప్రధానం. ఇలాంటి భారీ కార్యక్రమాల నిర్వహణ సందర్బంలో ప్రజల భద్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులపై ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలను ముందుగానే పసిగట్టడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంగ్లాండ్‌లోని సఫోల్క్ విశ్వవిద్యాలయానికి చెందిన క్రౌడ్ సైన్స్ ప్రొఫెసర్ జి. కేథ్ స్టిల్ మాట్లాడుతూ జనసమూహం చాలా నెమ్మదిగా ముందుకు కదులుతుంటే, రద్దీ పెరుగుతోందని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. ఇటువంటి సందర్భాల్లో జనసమూహం నుంచి వచ్చే శబ్దాన్ని వినడం చాలా ముఖ్యం. జనం అసౌకర్యంగా, బాధతో కేకలు వేస్తున్నట్లు గుర్తిస్తే, అది పరిస్థితులు అదుపు తప్పవచ్చనడానికి సంకేతమని కేథ్ తెలిపారు. అటువంటి పరిస్థితిలో బయటపడే ప్రయత్నం చేయాలని కేథ్ సూచించారు.పరిస్థితి నియంత్రణలో లేనప్పుడునార్తంబ్రియా విశ్వవిద్యాలయానికి చెందిన క్రౌడ్ నిపుణుడు, ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రొఫెసర్ మార్టిన్ అమోస్ మాట్లాడుతూ జనసమూహం చదరపు మీటరుకు ఐదుగురి వరకూ చేరుకుంటే, పరిస్థితి ప్రమాదకరంమని గుర్తించాలన్నారు. అయితే జనసమూహం సాంద్రతను అంచనా వేయడం కష్టం. అందుకే మీకు జనంలో బాగా ఇరుక్కుపోయానని అనిపించినప్పుడు వెంటనే బయటపడే ప్రయత్నం చేయాలని సూచించారు. అయితే పరిస్థిని మీ నియంత్రణలో లేనప్పడు మీరు ముందుకు తోసుకుంటూ వెళ్లకుండా, జనసమూహం మిమ్మల్ని కదిలిస్తున్న విధంగా ముందుకు కదలాలని ఆమోస్ సూచించారు.చేతులను మీ ఛాతీకి రక్షణగా..ఒకవేళ జనసమూహం కదలడం ఆగిపోయినప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడటం, మీ చేతులను మీ ఛాతీకి రక్షణగా ఉంచుకోవడం చేయాలి. అయితే అటువంటి పరిస్థితిలో ఎప్పుడూ జనసమూహానికి వ్యతిరేకంగా వెళ్లకూడదని అమోస్ సూచించారు. లాస్ ఏంజిల్స్ క్రౌడ్ సేఫ్టీ అడ్వైజరీ సర్వీస్ నిర్వహణ వ్యూహకర్త పాల్ వెర్డెమియర్ మాట్లాడుతూ పిల్లలను రద్దీగా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లకపోవడమే ఉత్తమమన్నారు. అలాగే రద్దీలో మీ ఫోన్ లేదా ఏదైనా పడిపోయి ఉంటే, దానిని వదిలివేయాలని, కాదని దానిని తీసుకునే ప్రయత్నం చేస్తే ప్రమాదంలో పడతారని ఆయన హెచ్చరించారు.కింద పడిపోయినప్పుడు..రద్దీ సమయంలో ఊపిరి ఆడకపోవడమే మరణానికి కారణమవుతుంది. జనంలో ఇరుక్కుపోయినప్పుడు మీ ఊపిరితిత్తులు శ్వాస తీసుకునేందుకు అనువుగా విస్తరించడానికి అవకాశం తగ్గుతుంది. శ్వాసకోశ అవరోధం ఏర్పడుతుంది. గుంపులో ఎవరైనా కింద పడిపోయినప్పుడు, అతనిపై ఇతరులు పడిపోతారు. అప్పడు కిందనున్న వ్యక్తి ఊపిరి తీసుకోలేక ప్రాణాపాయానికి చేరుకుంటాడు. ఈ సమయంలో ఊపిరితిత్తులు, గుండె దెబ్బతినడంలాంటివి జరుగుతాయి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నాణ్యత కలిగిన బూట్లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ధరించనప్పుడు గుంపులో కూడా బలంగా నిలబడగలుగుతామని వారు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు అప్రమత్తంగా ఉండటమే దీనికి ఏకైక పరిష్కారం అని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు -
శాకాహారుల గ్రామం.. ఉల్లి, వెల్లుల్లి కూడా ముట్టరు
జెహనాబాద్: బీహార్‌లోని జెహనాబాద్ జిల్లా హులాస్‌గంజ్ బ్లాక్‌లోని ఓ గ్రామంలోని వారంతా విచిత్రమైన నిబంధనలు పాటిస్తుంటారు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిలోకి బిఘా గ్రామంలోని వారు మాంసం, మద్యం ముట్టరు. పైగా ఇక్కడి వృద్ధులు ఉల్లి, వెల్లుల్లి కూడా తినరు. గ్రామంలో ఎవరైనా ఈ నిబంధనలకు విరుద్ధంగా వెళితే వారి ఇంటిలో అనర్థం జరుగుతుంది స్థానికులు నమ్ముతుంటారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇక్కడ ఎవరింటికి కొత్త కోడలు వచ్చినా ఇక్కడి నిబంధనలు పాటించాల్సిందే. గ్రామంలోని యువత ఈ మధ్య కాలం నుంచే ఉల్లి, వెల్లుల్లి తింటున్నారు. అయితే వారు మాంసం, చేపలను అస్సలు ముట్టుకోరు. కొన్ని శతాబ్దాలుగా తమ గ్రామంలో మాంసం, చేపలు తినకూడదనే ఆచారం కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు.ఈ నియమాన్ని తమ పూర్వీకులు రూపొందించారని పేర్కొన్నారు. ఈ నియమాన్ని ఉల్లంఘించి గతంలో కొందరు ఇక్కట్ల పాలయ్యారని, గ్రామంలో మద్యం కూడా ఎవరూ ముట్టరని తెలిపారు. ఈ గ్రామానికి చెందిన ఏ యువతికైనా వివాహం జరిగి, అత్తవారింటి వెళ్లాక కూడా ఆమె మాంసాహారం తినదు.ఇది కూడా చదవండి: ట్రెండ్: 12 రోజుల్లో పెళ్లి.. పది నిమిషాల్లోనే ముగించేశారు! -
బయట తినేటప్పుడు జర భద్రం..!
వీధి వీధికి ఒక రెస్టారెంట్, చిన్న చిన్న ఫుడ్ సెంటర్లు తెగ ఆకర్షణీయంగా దర్శనమిస్తుంటాయి. అందులోకి ఇప్పుడూ స్విగ్గీ, జోమాటో వంటి ఆన్లెన్ ఫుడ్ డెలివరీల పుణ్యమా అని బయట భోజనంపై ఆధారపడిపోతున్నారు చాలామంది ప్రజలు. కానీ ఇటీవల కాలంలో ప్రముఖ రెస్టారెంట్లలోనే నాసిరకం భోజనం, ఎక్స్పైరీ తేదీ దాటిని వాడుతున్నట్లు ఆహార భ్రద్రత అధికారులు జరిపిన దాడుల్లో తేలింది. ఇవి మరువక మునుపమే రీసెంట్గా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే..అందులో ఏకంగా చికెన్ పీస్‌లో పురుగులు బయటపడ్డాయి. వాటికి మించి..అన్నట్లుగా బయట ఆహారానికి సంబంధించి వెలుగులోకి రాని భయానక ఘటనలు కొన్ని ఇక్కడ జరిగాయి. ఇవి చూస్తే బయట భోజనం సురక్షితమేనా..? అనే సందేహం వచ్చేస్తుంది. అవేంటో చూద్దామా..మనం ఎప్పుడూ ఒకరు తిని వదిలేసిన ఆహారాన్ని లేదా కుళ్ళిన ఆహారాన్ని తినము. కానీ భారతదేశంలో ఇప్పుడు ఈ పరిస్థితే దాపురించింది!. ఎలా అనే కదా..? ఇటీవల రియల్‌గా జరిగిన ఘటన ఇది. కాస్త పేర్లు మార్చాం. కొద్ది రోజుల క్రితం రవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన స్నేహితుడుతో కలిసి ఒక ప్రసిద్ధ రెస్టారెంట్‌కు వెళ్లారు. సాధారణంగా రవికి బయటన భోజనం తినే అలవాటు లేదు. వాళ్లు తమ దర్పానికి తగ్గట్టు పనీర్ వంటకాలు ఆర్డర్ చేశారు. అయితే సర్వర్ తెచ్చిన పనీర్ ముక్కలు విభిన్న పరిమాణాలు, వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. వాటిని చూడగానే రవికి ఏదో తేడా కొడుతుందని అనిపించింది రవికి. అవి చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగా కట్ చేసి వండినట్లు తెలుస్తోంది. దీంతో రవి వెయిటర్ని పిలిచి వంట చేసే వ్యక్తి తీసుకు రావాల్సిందిగా కోరాడు. అతడు వచ్చిన వెంటనే రవి నేరుగా పనీర్ ముక్కలు ఎందుకు విభిన్న పరిమాణాలు, రంగుల్లో ఉన్నాయని ప్రశ్నించాడు. రవికి ఇది మా ప్రత్యేకం వంటకం అని గర్వంగా చెప్పాడు ఆ వంటవాడు. అయితే తాను మరో ప్లేట్ ప్యాక్ చేసి తీసుకువెళ్తాను..దాన్ని మా ముందే తయారు చేయండని కాస్త పెద్ద స్వరంతో అడిగాడు రవి. దెబ్బకు రెస్టారెంట్ మొత్తం వణికిపోయింది. అక్కడున్న చాలామంది భోజనం ఆపేసి మరీ ప్రేక్షకుల్లా చూస్తున్నారు. దీంతో హోటల్ సిబ్బంది వివిధ కారణాలు చెప్పడం ప్రారంభించారు. చివరకు పోలీసుల భయంతో, వెయిటర్ అసలు కారణాన్ని తెలియజేసి తప్పును అంగీకరించాడు. ఇది అందరూ చేసే తప్పు..కస్టమర్లు చాలా సార్లు తమ ప్లేట్లలో అన్నం, కూరగాయలు, సలాడ్లు, చపాతీలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. హోటల్ సిబ్బంది వాటిని అన్నీ పడేయడం లేదు. పెద్ద పనీర్ ముక్కలను, కూరగాయలను తిరిగి మరొక వంటకంలో కలిపి వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది. ప్లేట్లలో మిగిలిన సలాడ్ కొత్త ఆర్డర్ కోసం ఉపయోగిస్తున్నారు నిర్వాహకులు. ఇలా పెద్ద పెద్ద హోటల్స్‌లోనే జరగడం బాధకరం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి..ఇక మీదట, ఎప్పుడు హోటల్లో భోజనం చేయడానికి వెళ్తే, మిగిలిన భోజనం ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకుని, బయటకు వెళ్లి జంతువులకు ఆహారంగా ఇవ్వండి లేదా ఆ సంచి చెత్తబుట్టలో మీరే స్వయంగా వేయండి. లేదంటే, మీ ప్లేట్లోని భోజనం మరొకరి ప్లేట్లోకి వచ్చిన ఎంగిలి ఆహారమై ఉండొచ్చు లేదా మీరు తినగా మిగిలిన భోజనం మరొకరికి ఆహారం కావచ్చు. జాగ్రత్త!! మరో సంఘటన.. శ్రీకృష్ణుని జన్మస్థానం అయిన బృందావనంలో జరిగింది. బృందావనాన్ని ఎంతో పవిత్రమైన భూమిగా చూస్తారు. కౌశల్ అతడి బృందం బృందావనానికి పయనమయ్యారు. ఢిల్లీ నుంచి సుదూర ప్రయాణం చేసిన తర్వాత వారంతా ఎంతో ఆకలితో ఉన్నారు. అందుకే ఒక శుభ్రంగా కనిపించే భోజనశాలలో ప్రవేశించాము. ఆర్డర్‌కు ఆలస్యం కాకుండా ఉండటానికి డిష్‌ల కంటే రెడీమేడ్ భోజన థాళిలను ఆర్డర్ చేసాము. ఒక శుభ్రమైన ట్రే ద్వారా దాల్, కూరగాయలఅన్నం, రైతా మరియు ఒక బుట్టలో చపాతీలు తీసుకువచ్చారు. మొదటి కొద్దిముక్కల తిన్నప్పుడు గుర్తించలేదు, కానీ తర్వాత ఏదో తేడాగా అనిపించింది. చపాతీ పుల్లగా ఉండగా, కూరగాయల రంగు విభిన్నంగా ఉంది. అన్నం రుచి కూడా అసహజంగా ఉంది. అందరం భోజనం అలాగే వదిలేసి, కౌంటర్ వద్దకి బిల్లు ఎంత అని అడిగాము, 650 రూపాయల బిల్లు ఇచ్చారు. ఆ తర్వాత బాబు.. తాము చెల్లిస్తాం కానీ ఒక్కసారి కిచెన్ చూపించండి అని అడిగారు వారంతా. అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ..ఏమయ్యింది అని అడిగాడు. ఒక కస్టమర్‌గా..! భోజనం ఎలా తయారయ్యిందో చెక్ చేయడం తన బాధ్యత అని చెబుతూ..వాళ్లంతా కిచెన్‌లోకి వెళ్లి చూసి కంగుతింటారు. కొన్ని చపాతీలు బుట్టలో ఉండగా, ఫ్రిజ్‌లో వేరే వేరే రకాలుగా వండిన కూరగాయలు, మూతలు లేని వంట పాత్రలు దర్శనమిచ్చాయి. కొన్ని మరీ దుర్వాసన కొడుతున్నాయి. అదంతా చూసి కోపంతో వంటవాడికి నాలుగు చివాట్లు పెట్టగా..అసలు విషయం బయటపెట్టాడు. ఈ కూరగాయలు వారం రోజులుగా ఉన్నాయి. అతను మరొక విషయం కూడా చెప్పాడు, వండేటప్పుడు పాత కూరగాయలను, కుళ్ళిన కూరగాయలను మళ్లీ నూనెతో వేడి చేసి కొత్తిమీర టమాటాలతో అలంకరించి కొత్త వంటకం లాగ వేరే కస్టమర్లకు వడ్డిస్తాం. చపాతి పిండిని కూడా రెండు రోజులకు ఒకసారి తయారు చేస్తాము. కరెంటు కోత కారణంగా ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలు చెడిపోతాయి. ఆ చెడిన వాసనను తెలియనివ్వకుండా మరిన్ని మసాలాలు, కారము కలిపి వంట చేసి సర్వ్ చేస్తాము. పులిసిపోయిన చపాతి పిండిని నాన్ తయారీకి ఉపయోగిస్తామంటూ వరుసగా తాము చేసే పాపాలను వరుసగా బయటప్టెటాడు. ఎప్పుడైనా మీరు కూడా యాత్రలు చేసినప్పుడూ..మీకు కూడా ఓ హోటల్ సర్వర్ ఇలాంటి భోజనమే పెట్టాలి అప్పుడు అర్థమవుతుంది తమ బాధ అంటూ ఉద్వేగంగా చెప్పారు. ఈ రోజు మనకు జరిగే ఇటువంటి ప్రమాదాలు, మోసాల నుంచి కేవలం మన అప్రమత్తత మాత్రమే రక్షిస్తుంది. భారతదేశంలో సత్యం అసత్యం మధ్య తేడా దారుణంగా క్షీణిస్తోంది. ప్రతి దుకాణం లేదా సంస్థల వద్ద ఒక మూలలో దేవాలయం ఉంటుంది. వ్యాపారి ఉదయం వచ్చినప్పుడు దేవుని విగ్రహం ముందు ధూపం, దీపం వెలిగించి, కౌంటర్‌కి నమస్కరించి, ఆ తర్వాత యథావిధిగా మంచి మనిషి ముసుగు తీసి రాక్షసుడి మాదిరి మోసాలకు పాల్పడతాడు. పైగా దేవుడిని ఈ కోరిక తీర్చమంటూ సాగిలపడుతుంటాడు. అస్సలు ఇన్ని మోసాలు చేస్తూ ఎలా కోరికలు లిస్ట్ దేవుడికి చెప్పగలడనేది అర్థం కానీ మిస్టరీ..!. కనీసం ఇసుమంత మేలు చేసి అడిగినా ఓ అందం..కానీ ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే. కేవలం స్వలాభమే ముఖ్యం అందుకు ఏమైనా చేస్తారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు బయట భోజనం తినకుండా ఉండేందుకు ప్రయత్నించండి. (చదవండి: మల్టీవిటమిన్లు మరణ ప్రమాదాన్ని తగ్గించగలవా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
అద్భుతమైన క్రెడిట్ స్కోర్.. ఈ ఆరు తప్పులు అస్సలు చేయొద్దు!
క్రెడిట్ స్కోర్ అనేది ఆర్థిక ఆరోగ్యానికి కీలకమైన అంశం. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే అధిక రుణాలు వేగంగా పొందవచ్చు. అలాగే అనుకూలమైన వడ్డీ రేట్లు కూడా లభిస్తాయి. అయితే మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడానికి శ్రద్ధ, తెలివైన ఆర్థిక నిర్ణయాలు అవసరం. సాధారణంగా చేసే కొన్ని తప్పుల కారణంగా క్రెడిట్ తగ్గిపోతుంది. క్రెడిట్ స్కోర్‌ను 700 కంటే ఎక్కువగా ఉండాలంటే సరిదిద్దుకోవాల్సిన ఆరు తప్పుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. క్రెడిట్ రిపోర్ట్‌లో లోపాలు క్రెడిట్ నిర్వహణలో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించడం. ఇందులో ఏవైనా లోపాలుంటే వెంటనే పరిష్కరించుకోవడంలో విఫలమైతే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకావశం ఉంటుంది. చెల్లింపులు విస్మరించడం ఆలస్యంగా చేసిన లేదా విస్మరించిన చెల్లింపులు క్రెడిట్ స్కోర్‌పై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అది క్రెడిట్ కార్డ్ అయినా, తనఖా అయినా లేదా మరేదైనా రుణమైనా, సకాలంలో చెల్లింపులు చాలా కీలకం. గడువు తేదీలు దాటిపోకుండా రిమైండర్లు లేదా ఆటోమేటిక్ చెల్లింపులను సెటప్ చేసుకోండి. హైరిస్క్ లోన్లలో సహ సంతకం చేయడం తెలిసిన వారి ఎవరైనా రుణాలు తీసుకుంటున్నప్పుడు చాలా మంది సహ సంతకాలు చేస్తుంటారు. ఇది సహాయకమైన చర్యగా అనిపించినా సహ సంతకం చేసిన వ్యక్తి చెల్లింపుల్లో విఫలమైతే అది మీ క్రెడిట్ స్కోర్ నేరుగా ప్రభావితమవుతుంది. సహ సంతకం చేయడానికి ముందు, రుణగ్రహీత ఆర్థిక బాధ్యత, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయండి. క్రెడిట్ కార్డ్ పరిమితిని దాటడం క్రెడిట్ కార్డ్ పరిమితిని దాటడం లేదా అధిక బ్యాలెన్స్‌ని కలిగి ఉండటం మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. బాధ్యతాయుతమైన క్రెడిట్ వినియోగాన్ని ప్రదర్శించడానికి మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను పరిమితి కంటే తక్కువగా ఉంచడం, ఆదర్శంగా 30% కంటే తక్కువగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకోండి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు సానుకూలంగా దోహదపడుతుంది. ఏకకాలంలో ఎక్కువ దరఖాస్తులు రుణాలు లేదా క్రెడిట్ కార్డ్‌ల కోసం ఏకకాలంలో ఎక్కువ దరఖాస్తులు చేస్తే రుణదాతలు ఆర్థిక అస్థిరతగా భావించవచ్చు. ప్రతి అప్లికేషన్ కోసం మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుంది. పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం అనేది వివేకవంతమైన చర్యగా అనిపించవచ్చు. అయితే ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు హాని కలిగించే అవకాశం ఉంది. ఎక్కువ క్రెడిట్ హిస్టరీ ఉండటం అనేది క్రెడిట్ స్కోర్‌ను లెక్కించడంలో ఒక అంశం. పాత ఖాతాలను మూసివేయడం వల్ల క్రెడిట్ హిస్టరీ తగ్గిపోయే అవకాశం ఉంది. -
పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయా..?
పాములు కాటేసే ముందు ముందుగానే హెచ్చరిస్తాయట. ఆ ఒక్క పాము మినహా మిగిలిన అన్ని పాములు ముందుగానే వివిధ శబ్ధాలతో మన్నల్ని హెచ్చరిస్తాయి. నిజానికి అవి నేరుగా కాటేయవని ముందుగా సిగ్నల్ ఇస్తాయని నిపుణుల అంటున్నారు. దాన్ని నిశితంగా గమనిస్తే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చట. నిజానికి పాములను చూసి మనం భయపడతాం గానీ వాటికి మనం అంటేనే భయం. అందువల్లే అవి ప్రాణ భయంతో కాటేసే యత్నం లేదా సంకేతం ఇస్తాయట. ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కట్లపాము ఒక్కటే ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేం. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ "బుస్స్" "బుస్స్".. అని శబ్ధం చేస్తాయి. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్ధం చేసే ప్రయత్నం చేస్తాయి. పాముల ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు అని స్నేక్ క్యాచర్ ధర్మేంద్ర త్రివేది అన్నారు. కట్లపాము విషయానికి వస్తే, రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటచేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, నలుపు, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయని చెబుతున్నారు. పాము కాటు వేసిన వెంటనే ఏం జరుగతుందంటే.. పాము కాటుకు గురైన 15-20 నిముషాల నుంచి విషం ప్రభావం శరీరంలో కనిపించడం మొదలవుతుంది. 30 నుంచి 45 నిముషాల సమయంలో విషం శరీరమంతా వ్యాపిస్తుంది. విషపూరిత లక్షణాలు కనిపించడానికి సుమారు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది. దాదాపు 4 నుంచి 6 గంటల్లో తీవ్రత గరిష్టస్థాయికి చేరుకుంటుంది. పాము కాటు వేసిన భాగంలో మాత్రమే నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే, పాము కాటు వేస్తే, లక్షణాలు వెంటనే కనిపించవు” అని అన్నారు. పాము కాటు వేస్తే ఏం చేయాలి పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆందోళన పడకోడదు. సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. ఏం చేయకూడదు..? పాము కాటుకు గురైన వ్యక్తిని కదల్చకూడదు. దీని వలన విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. గాయానికి కట్టు కట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. పాము కాటుని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి. వేసకి కాలంలో బయట సంచరిస్తాయట. శీతకాలంలో నిద్రాణ స్థితిలో ఉంటాయట. వర్షాకాలంలో గుడ్లు పెడతాయట. శీతకాలం వచ్చేలోపు ఈ సమయంలో కావల్సిన ఆహరం కోసం వేట మొదలుపెడతాయట. అందువల్ల ఈ కాలంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. (చదవండి: నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్! కొరియన్ల బ్యూటీ రహస్యం ఇదేనా!) -
ఢిల్లీలో ట్రాఫిక్‌ను తపించుకునేందుకు ఆటో డ్రైవర్ ఎమ్ చేసాడో తెలుసా..!
-
జంక్ ఫుడ్‌నే జంకేలా..తినడం స్టాప్ చేద్దాం ఇలా!
బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చాట్ బండ్లు.. ఎక్కడ చూసినా ఎక్కువ శాతం టీనేజర్లే కనిపిస్తూ ఉంటారు. అంతకంటే చిన్న పిల్లలకు స్వయంగా తల్లిదండ్రులే మురిపెంగా తీసుకువెళ్లి తినిపిస్తుంటారు. అయితే బర్గర్లు, పిజ్జాలు, చాట్లు, మిల్క్‌షేక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటివి తినటం వల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరుతుంటాయి. వాటిని కరిగించటానికి సరిపడా వ్యాయామం లేక పిల్లలు ఊబకాయుల్లా తయారవుతున్నారు. జంక్‌ఫుడ్‌కు అలవాటు పడకుండా ఉండాలంటే ఇంట్లోనే కొత్తరుచుల్లో స్నాక్స్ తయారు చేయటం నేర్చుకోవాలి. తక్కువ నూనె, తీపి, మసాలాలతో రుచికరమైన స్నాక్స్ చేసి పెడితే ఫాస్ట్ ఫుడ్స్‌కు పిల్లలు ఆకర్షితులవకుండా ఉంటారు. ఏ అలాగే ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకుంటే ప్రొటీన్ ఫుడ్ వల్ల మలబద్ధకం తలెత్తకుండా ఉంటుంది. ఏ అల్పాహారంలో బ్రెడ్, శాండ్విచ్లకు బదులు గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, పెసలతో చేసిన పొంగల్, పెసరట్టు, రాగి, క్యారట్ ఇడ్లీ లాంటివి ఇవ్వాలి. ఏ బాదం, పిస్తా, వాల్నట్స్, ఉడకబెట్టిన సెనగలు, మొలకలు అందుబాటులో ఉంచాలి. ఏ ఫ్రిజ్ ట్రేలలో చాక్లెట్లు, బిస్కెట్లకు బదులు తాజా పండ్లు, సలాడ్లు, పాలు, గుడ్లు, పళ్లరసాలు, చెరుకు రసం, టమాటా రసం లాంటివి ఉండాలి. ఏ పిల్లలు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినేలా చూసుకోవాలి. ఏ ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి కాబట్టి ఔట్ డోర్ గేమ్స్ ఆడే పిల్లలకు వీటిని శ్నాక్స్‌గా ఇస్తూ ఉండాలి. జంక్ ఫుడ్ నుంచి రక్షించుకోవాలంటే..? పెద్ద వాళ్ళు జంక్ ఫుడ్స్ తింటూ, కాఫీలు, టీలు తాగేస్తుంటే వారిని చూస్తూ పెరిగే పిల్లలు అదే అలవాటు చేసుకుంటారు. అందువల్ల అలాంటి వాటిని ముందు పెద్దలు మానేయాలి. పెద్దవాళ్ళు పండ్లు, డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటే పిల్లలు కూడా అవే తింటారు. నిమ్మరసం, క్యారెట్ రసం, బీట్రూట్ రసం రోజూ తీసుకోండి. పిల్లలు కూడా అవే ఇష్టపడతారు. (చదవండి: డయాబెటిస్ పేషెంట్స్‌కి ఈ వ్యాధుల ఎటాక్ అయితే..డేంజర్లో ఉన్నారని అర్థం!) -
ఎన్కౌంటర్లలో నేరస్తులు చనిపోకుండా ఉండాలంటే..
ఎన్కౌంటర్లో నేరస్తులు చనిపోకుండా ఉండాటానికి ఏం చేయాలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్శ కొన్ని చిట్కాలను అందించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే ఓటింగ్‌పై జరిగిన చర్చకు సీఎం సమాధానమిస్తూ.. దీని గురించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసులు బుల్లెట్‌తో బుల్లెట్‌కి సమాధానం ఇస్తున్నారు. అందువల్లే రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని అన్నారు. నేరస్తులను కాల్చి చంపకుండా ఉండాలంటే ..క్రిమినల్స్ పట్టుబడ్డప్పుడూ చేతులు పైకెత్తాలని అన్నారు. అప్పుడూ పోలీసులు రివ్వాల్వర్‌కి పనికి చెప్పాల్సిన అవసరం ఉండదన్నారు. " మీరంతా ఎన్కౌంటర్లు గురించి అడుగుతున్నారు. తెలిసి ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తారా? అని ప్రశ్నించారు. మతహింస తెలిసి జరుగుతుందా..అలాగే ఎన్కౌంటర్ కూడా ఆలోచించి జరగదు. ఇప్పుడూ వారు పాత అస్సాం పోలీసులు కాదు. అందుకే వారు బుల్లెట్లతో సమాధానం ఇస్తున్నారని అందుకు తాను సంతోషిస్తున్నాను" అని అన్నారు. అయితే పోలీసులు కూడా చట్ట పరిధిలోనే ఉండాలని చెప్పారు. పోలీసు సిబ్బంది అతను లేదా ఆమె తప్పుచేసినప్పుడూ సీనియర్ అధికారి అయినప్పటికీ శిక్షార్హమైన చర్యలు ఎదర్కొనక తప్పదని ముఖ్యమంత్రి శర్మ అన్నారు. ఐతే అటవీ ప్రాంతాలలో జరగుతున్న అక్రమ కార్యకలాపాలు, బాల్యవివాహాలు, ఇతర నేర కార్యకలాపాలు వంటి వాటిపై తమ ప్రభుతం అణిచివేతను కొనసాగిస్తుందని, అలాగే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడానికి సిగ్గుపడరని నొక్కి చెప్పారు. (చదవండి: మంత్రిని ప్రశ్నించినందుకు యూట్యూబర్ అరెస్టు..పైగా నేరస్తుడిలా..) -
వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా?
అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): వెసక్టమీ.. ఈ పేరు వింటేనే మగవారు పరుగులు తీస్తున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో భాగంగా చేసుకోవాల్సిన ఈ ఆపరేషన్లకు వెనకంజ వేస్తున్నారు. కేవలం అపోహలే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెసక్టమీ ఆపరేషన్ల గణాంకాలు పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. వెసక్టమీకి తాము దూరమంటూ.. భారం బాధ్యతంతా ఇల్లాలిదే అన్నట్లుగా కొందరు ప్రదర్శిస్తున్న ధోరణి ఈ లెక్కలకు కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. దీంతో ఒకరిద్దరు పిల్లల్ని కనగానే ఆడవాళ్లకు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత నాలుగున్నరేళ్లులో కేవలం 559 మంది పురుషులు మాత్రమే వెసక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడం గమనార్హం. చదవండి: స్టార్టప్ కలలు కంటున్నారా.. ఈ స్కూల్ మీకోసమే..! సింగిల్ డిజిట్‌కే పరిమితం.. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవడంలో మగవారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండేవారు. క్రమేణా వారిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్లు చేయించుకునే బాధ్యత మహిళలదే అన్న భావనలో ఉంటున్నారు. వంద మంది మహిళలు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటుంటే.. వెసక్టమీ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ప్రభుత్వ లక్ష్యాలు వేలల్లో ఉంటే అమలు సింగిల్ డిజిట్లు దాటడం లేదు. ప్రస్తుత సమాజంలో దాదాపుగా విద్యావంతులు అన్నింట్లో అవగాహన కలిగిఉన్నప్పటికీ.. వెసక్టమీ వంటి ఆపరేషన్ల విషయంలో ముందుకు రావడం లేదు. పైగా ఇలాంటి వాటిపై ఎలాంటి చర్చలకు ఆస్కారమివ్వడం లేదు. ఎక్కడో భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటేనే కొందరు భర్తలు వెసక్టమీలకు అంగీకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అపోహలే కారణమా.. వెసక్టమీ చేయించుకుంటే పురుషుల శక్తిహీనులవుతారని, పనులు సమర్ధంగా చేయలేరన్న అపోహ చాలా మందిలో ఉంది. ♦భర్త కంటే తామే శస్త్రచికిత్సలు చేయించుకుంటామంటున్న మహిళలే అధికంగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ♦ప్రస్తుతం ప్రసవానంతరం మహిళలే ట్యుబెక్టమీ చేయించుకోవడం రివాజుగా మారిపోయింది. ♦అపోహలు తొలగించేందుకు వైద్యారోగ్య శాఖ బుర్రకథలు, వీధి నాటకాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా...ఫలితం మాత్రం కనబడడం లేదు. ♦మహిళలకు ట్యుబెక్టమీ చేయడం మేజర్ ఆపరేషన్ లాంటిదే అని వైద్యులు చెబుతున్నారు. అదే పురుషుల విషయంలో వెసక్టమీ మాత్రం చాలా సులువైన, సులభమైన ప్రక్రియ అని అంటున్నారు. ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేకుండానే సాంకేతిక పరిజ్ఞానంతో వెసక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో జిల్లా వైద్యారోగ్య శాఖ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగున్నరేళ్లుగా ఈ శస్త్రచికిత్సల లెక్కలు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. తాజాగా 2022–23 (జూన్ నాటికి)లో వెసక్టమీ సర్జరీలు 654, ట్యుబెక్టమీ సర్జరీలు 12,430 వరకు లక్ష్యంగా నిర్ణయించగా ప్రస్తుత జూన్ నెలాఖరు నాటికి కేవలం ఆరు వెసక్టమీ, 840 ట్యుబెక్టమీ సర్జరీలు నమోదయ్యాయి. లక్ష్య శాతాలను పరిగణనలోకి తీసుకుంటే 3.67 శాతం వెసక్టమీ, 27.03 శాతం ట్యుబెక్టమీ లక్ష్యాలను మాత్రమే సాధించారు. అవగాహన కల్పిస్తున్నాం.. కుటుంబ నియంత్రణకు వీలుగా పురుషులకు వెసక్టమీ, మహిళలకు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకునేలా ఎప్పటికప్పుడు అవగాహన కలి్పస్తున్నాం. అయినప్పటికీ అపోహలతో పురుషులు ముందుకు రావడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో సాధించిన లక్ష్య శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతోంది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అపోహలు లేకుండా వెసక్టమీకి పురుషులు సిద్ధం కావాలి. అన్ని పీహెచ్‌సీలు, ప్రభుత్వ వైద్యశాలల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తాం. చాలా మంది వైద్యులు ఈ సర్జరీలపై దృష్టి సారించడం లేదన్నది వాస్తవం. – డాక్టర్ బి.మీనాక్షి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి -
పెరుగుతో ఆరోగ్యం.. వీటితో కలిపి తిన్నారంటే మాత్రం అంతే ఇక!
పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని మన పెద్దలు చెప్పేవారు. అంతేగాక వైద్యులు కూడా పెరుగు తినాలని సూచిస్తున్నారు. పెరుగు వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. ఉదాహరణకు పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తినడం ద్వారా వారికి మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇలా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ఔషదంలా పని చేసే పెరుగుని మనం ఎక్కవగా ఇతర ఆహారంతో కలిపే తీసుకుంటుంటాం. ఇందులో ఓ సమస్య దాగుంది, ఇదే పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదన్నది వైద్యుల అభిప్రాయం. అవేంటో వెంటనే తెలుసుకుందాం, ఎందుకంటే ఆరోగ్యమే మహా భాగ్యం కదా. మామిడి ►పెరుగును మామిడి పండుతో కలిపి అస్సలు తినకూడదు. అలా పెరుగుతో మామిడి కలిపి తినడం కారణంగా శరీరంలో అలర్జీ, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వేసవి కాలం వచ్చిందంటే ఈ కాంబో ఎక్కువ కనిపిస్తుంది. ఉల్లిపాయలు ► ఉల్లిపాయలతో పెరుగును కలిపి తినడం కూడా అంత మంచిదికాదు. ఉల్లి శరీరంలో వేడిని పుట్టిస్తే.. పెరుగు చల్లదానానికి కారణమవుతుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల సోరియాసిస్, దద్దుర్ల వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పాలు ►ఇక పెరుగును పాలతో కలిపి తినడం కూడా అంత మంచిది కాదన్నది నిపుణుల సలహా. రెండు తెల్లగానే ఉన్నాయి కదా తింటే ఏం కాదు అనుకోకండి. ఈ కాంబో తినడం వల్ల డయేరియాతో పాటు ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణుల సలహా. చేపలు ►చేపలను పెరుగుతో కలిపి అసలు తినకూడదు. ప్రోటీన్లు పరంగా ఈ రెండింటిలో ఎక్కువగానే ఉన్నాయి కదా రెండింతలు ప్రోటీన్లు లభిస్తుందనుకుంటే పొరపాటే.. వీటిని కలిపి తినడం వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వంటనూనేతో చేసే వంటకాలు ►వీటితో పాటు ఎక్కువ వంట నూనెలు తీసుకునే వంటకాలను సైతం పెరుగుతో కలిపి తినకపోవడమే మంచిదని వైద్యులు చెప్తుంటారు. చదవండి: సన్నగా ఉన్నవాళ్లు వ్యాయామం చేయొద్దా? -
జాగ్రత్తగా ఉండండి
కోవిడ్ 19 (కరోనావైరస్) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే దేశ, విదేశాల్లో ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు తమ వంతు సూచనలను, సలహాలను ప్రజలకు చెబుతున్నాయి. కోవిడ్ 19పై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాయి. సినిమా స్టార్స్ కూడా తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ట్వీట్స్, వీడియోల రూపంలో జాగ్రత్తలు చెబుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి కోవిడ్ 19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను చెప్పిన వీడియో సోమవారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇంకొందరు స్టార్స్ చెప్పిన విషయాలు ఈ విధంగా... త్యాగం చేద్దాం – మహేశ్‌బాబు కరోనా వైరస్ వల్ల వచ్చే సమస్యలను, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఈ విషయం గురించి ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలోని సారాంశం ఏంటంటే.. వరుసగా ఓ యాభై అగ్గిపుల్లలను నిలబెట్టారు. మొదటి అగ్గిపుల్లకు నిప్పు అంటిస్తే ఒక అగ్గిపుల్ల నుండి మరో అగ్గిపుల్ల వేగంగా అంటుకుంటుంది. అవి ఓ సమూహంలా ఉన్నాయి కాబట్టే నిప్పు అంటుకుంది. అయితే ఓ అగ్గిపుల్లని వేరు చేస్తే అక్కడినుండి మిగిలిన అగ్గిపుల్లలకి మంట అంటలేదు. కరోనా వైరస్ కూడా ఓ సమూహంలా ఉంటే వేగంగా అంటుకుంటుంది. గుంపులో ఉంటేనే ఒకరి నుండి మరొకరికి అంటుకుంటుంది. విడిగా ఎవరికి వారుగా ఉంటే ఒకరి ద్వారా ఒకరికి వ్యాప్తి చెందదు అనేది వీడియోలోని సారాంశం. ‘‘ఈ సమయంలో మనందరం సామాజికంగా ఒకరికొకరం దూరంగా ఉండాల్సిన పరిస్థతి. అది కష్టమైనప్పటికీ ఈ నిమిషంలో మనందరం కలిసికట్టుగా సమాజానికి వీలైనంత దూరంగా ఉంటేనే ఈ విపత్తు నుండి బయటపడటానికి సాధ్యమవుతుంది. పబ్లిక్ లైఫ్ బావుండాలంటే పర్సనల్‌గా మనందరం త్యాగం చేయాల్సిందే. వీలైనంతగా ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించండి’’ అంటూ మరికొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ఇది మనందరి ఆరోగ్యాలకు పరీక్షాకాలం. పబ్లిక్ సేఫ్టీకి ఓ చాలెంజ్. కోవిడ్ 19 అనే మహమ్మారిపై విజయం సాధించేందుకు మనమందరం బాధ్యత వహించాలి. ప్రభుత్వ, ఆరోగ్య సంస్థల సూచనలు, సలహాలను పాటిద్దాం. ఈ కోవిడ్ 19 గురించిన తప్పుడు సమాచారానికి దూరంగా ఉందాం. – ప్రభాస్ రాజకీయాలు, కులం, మతం, అధికారం, డబ్బు, కీర్తి.. ఏమీ ఉండవు. చివరికి మనిషికి మనిషే. మనమందరం ఒకే కుటుంబం. ఒకరినొకరం సంరక్షించుకుందాం. బాధ్యతగా ఉండి సురక్షితంగా ఉందాం. – నాని ‘కోవిడ్ 19’ వైరస్‌పై అవగాహన లేనివారికి, మాస్కులు, శానిటైజర్స్‌ను కొనలేనివారికి నా వంతు సహాయం చేస్తున్నాను. సూచనలు, సలహాలు పాటిస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. శానిటైజర్స్ పంచమని తమను పంపారని కొందరు ఇంట్లోకి వచ్చి దొంగతనానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అలా పంపిణీ చేయమని ఎవరినీ ప్రభుత్వం నియమించలేదు. అలాంటి వారి పట్ల జాగ్రత్త వహించండి. – మంచు మనోజ్ కోవిడ్ 19 వైరస్ ప్రపంచంలో సృష్టిస్తోన్న కలకలాన్ని దృష్టిలో ఉంచుకుని మా పూరీ కనెక్ట్స్ సంస్థలోని అన్ని కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. మా అందరి నిర్ణయం ఇది. ప్రభుత్వం, అధికారిక ఆరోగ్య ప్రతినిధులు ఇచ్చే సలహాలు, సూచనలను అందరూ పాటించండి. పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండండి. సమష్టి కృషితో ఈ కోవిడ్ 19 అనే యుద్ధాన్ని గెలుద్దాం. – పూరి జగన్నాథ్, చార్మి కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. ఇలాంటి సమయంలోనే మనం కంగారు పడకూడదు. పుకార్లను ప్రచారం చేయకూడదు. బాధ్యతగల పౌరులుగా మనం పరిశుభ్రంగా, జాగ్రత్తగా ఉండాలి. దగ్గు, జలుబు ఉన్నవారు ఇతరులకు కాస్త దూరంగా ఉండటం మంచిది – గాయని లతా మంగేష్కర్ మన దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భయంకరమైన ఈ వైరస్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. మనందరం ప్రభుత్వాలకు సహకరిద్దాం. వారి సూచనలు, జాగ్రత్తలను పాటిద్దాం – నటి హేమమాలిని ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రస్తుతం మనదేశంలో కూడా వ్యాప్తి చెందుతోంది. అందుకే మా ధర్మ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన అన్ని పనులను నిలిపివేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు, మా సంస్థలో పని చేస్తున్న వారందరి క్షేమం గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సూచనలు, ఆదేశాలు వచ్చిన తర్వాత మా పనులను తిరిగి ప్రారంభిస్తాం. – కరణ్ జోహార్ వ్యాయామం, యోగ వంటివి చేసి మనలోని రోగనిరోధక శక్తిని పెంచుకుందాం. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. – కత్రినా కైఫ్ కరోనా వైరస్ ప్రభావం ఉన్న దేశాల్లో ఎలాంటి చెడు పరిణామాలు జరుగుతున్నాయో అవి మన దేశంలో జరగకుండా జాగ్రత్త పడదాం. అందరం బాధ్యతాయుతంగా ఉందాం. తర్వాత పశ్చాత్తాపం చెంది ప్రయోజనం లేదు. – పరిణీతి చోప్రా -
కరోనాని నిలువరిద్దాం! సరేనా!
మానవుని ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదం వివరించిన అనేక అంశాల్లో ‘ఋతుచర్య’ ఒకటి. వివిధ ఋతువుల్లో చూపే సూర్యుడి ప్రభావం వల్లనే మానవుని బలం, వ్యాధి క్షమత్వక శక్తి మారుతుంటుంది. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువుల్ని (సుమారుగా జనవరి 15 నుంచి జూలై 15 వరకు) ఆయుర్వేదం ‘ఆదాన కాలం’ గా వర్ణించింది. ఇదే ఉత్తరాయణ కాలం. ఈ కాలంలో సూర్యుడు భూమి మీద నుంచి, ప్రకృతిలో నుంచి శక్తిని గ్రహిస్తాడు. కనుక మనిషి నీరసపడతాడు. వర్ష, శరత్, హేమంత ఋతువులు దక్షిణాయన కాలం. ఇది విసర్గ కాలం. సూర్యుడు తన శక్తిని ప్రసాదిస్తాడు. చంద్రుని ఆధిపత్యం వల్ల మనిషిలో శక్తి వృద్ధి చెందుతుంది. ఒక ఋతువు మారి ఇంకొక ఋతువు ప్రవేశించే మధ్య కాలాన్ని ‘ఋతు సంధి’ అంటారు. ఇటువంటి వాతావరణపు మార్పును తట్టుకునేందుకు ఆయుర్వేదం కొన్ని ఆహారవిహార నియమాలతో పాటు మరి కొన్ని జాగ్రత్తలు సూచించింది. ప్రస్తుతం శిశిర వసంతాల మధ్యనున్న ఋతు సంధి. ఇది కఫ ప్రకోపకాలం. ఋతుచర్య: లఘు, రూక్షాహారం సేవించాలి. అంటే తేలికగా జీర్ణమై, శరీరాన్ని తేలికపరచే ఆహారం. వంకాయ, దొండ, కాకర, బీర మొదలైన శాకాహారం, ఆకు కూరల్ని ఉడికించి వండుకుని వేడివేడిగా భుజించాలి. నూనెలు, నెయ్యి వంటి స్నిగ్ధ పదార్థాలు, పాయసాల వంటి బరువైన ఆహారం విడిచిపెట్టి, సెనగలు, బఠాణీల వంటి శాకాలను వండుకు తినాలి. తీపి, పులుపు తగ్గించి, కారంగా ఉన్న ఊరగాయలు తింటే మంచిది. శరీరానికి నలుగు పెట్టుకుని సాన్నం (ఉద్వర్తనం), వ్యాయామాలు మంచిది. స్నానానంతరం ‘కుంకుమ పువ్వు, కర్పూర చందనం’ వంటి సుగంధ్రద్రవ్యాలు శరీరానికి మంచివి. ఇవి క్రిమిహరంగా ఉపకరిస్తాయి. అల్లం లేక శొంఠి (శృంగవేర) వేసి మరిగించిన నీటిని తాగాలి. స్వచ్ఛమైన తేనె వాడుకోవాలి. (వాగ్భటాచార్యుని శ్లోకంలో: తీక్ష›్ణ, లఘు, రూక్ష భోజనైః, వ్యాయామ ఉద్వర్తన; శృంVý,వేరాంబు వంటి పదాలు కనిపిస్తాయి) ప్రాచీన ఆయుర్వేద వైద్య ఆచార్యులు వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములను వివరిస్తూ క్రిమి/కృమి శబ్దంతో పాటు ‘గ్రహ, భూత, పిశాచ, రాక్షస’ పదాలను కూడా ఉపయోగించారు. ఋతు సంధి సమయాలలో వీటి ప్రాబల్యం అధికమౌతుంది. ఇవి హాని చేసే స్రోతస్సుల (సిస్టమ్స్) ను బట్టి కలిగే లక్షణాలను వివరించారు. ప్రాణావహస్రోతస్సు (ముక్కు నుంచి ఊపిరి తిత్తుల వరకు) నకు సంబంధించి, ‘తుమ్ములు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం, జ్వరం’ వంటి లక్షణాల ను వర్ణించారు. కొన్నిరకాల సూక్ష్మాంగ జీవులు వాయు కాలుష్యం ద్వారా సంక్రమించి ప్రజా వినాశనానికి (ఎండెమిక్స్/ఎపిడెమిక్స్) దారి తీస్తాయని చెప్పారు. అటువంటి క్రిములకు మనం పెట్టే పేరు ఏదైనా లక్షణాలను బట్టి చికిత్స వర్ణించారు. పరిశుభ్రత, వ్యాధి క్షమత్వక శక్తిని పెంపొందించుకోవటం నివారణా సూత్రాలలో ప్రాధాన్యత వహిస్తాయి. ప్రస్తుతపు కొరోనా వ్యాధికి సంబంధించి నివారణ, చికిత్సల గురించి చూద్దాం. నివారణ ఆహారం: పైన చెప్పినట్లు తేలికపాటి ఆహారం, వేడివేడిగా ఉండే తాజా శాకాహారం మంచిది. బయటి పదార్థాలు, ముఖ్యంగా జంక్, ఫాస్ట్ ఫుడ్స్, పానీయాలు, ఐస్‌క్రీములు విడిచిపెట్టాలి. విహారం: తేలికపాటి వ్యాయామం. ఇంటబయట పరిశుభ్రత ముఖ్యం. సాంబ్రాణి ధూపాన్ని ప్రతి నిత్యం రెండు సార్లు ప్రయోగించి ఇంటిని, దుస్తుల్ని పరిశుభ్రం చేసుకోవాలి. ముక్కుకు గుడ్డను అడ్డు పెట్టుకోవటం, వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండటం మంచిది. వేప కొమ్మలు, మామిడి ఆకుల తోరణాలు ఇంట్లో ఉంటే అవి సూక్ష్మక్రిముల్ని పీల్చేసుకుంటాయన్నది పరిశోధనా ఫలితాలలో ఒకటి. ఔషధాలు: ‘లశునాది కషాయం’ : 30 మి.లీ. (ఆరు చెంచాలు) రెండు పూటలా తాగాలి. తయారీ విధానం: ఐదు గ్రాముల అల్లం ముక్క, ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా దంచి పావు లీటరు నీళ్లలో మరిగించాలి. మరుగుతున్నప్పుడు రెండు చిటికెల పసుపు, ఆరు చిటికెలు దాల్చిన చెక్క చూర్ణం దాంట్లో వేసి, మూడు వంతులు ఇగరగొట్టాలి. మిగిలినదాన్ని వడగట్టి రెండు భాగాలుగా ఉదయం, సాయంత్రం తాగాలి. ఎంతకాలం తాగినా పరవాలేదు. ఉసిరికాయ: దేశీ ఉసిరి (ఆమలకి) మంచిది. ఒక కాయ రోజూ తినటం మంచిది లేదా 5.మి.లీ. (ఒక చెంచా) రసం తేనెతో సేవించాలి లేదా ఎండబెట్టి తయారుచేసిన పొడి (ఆమలకీ చూర్ణం) 3 గ్రా.లు తేనెతో రోజూ ఒకసారి సేవించాలి. వ్యోషాదివటి లేదా కంఠసుధారస మాత్రలు (ఆయుర్వేద షాపులలో దొరుకుతాయి): ఒక్కొక్క మాత్రను చప్పరిస్తూ తినాలి. రోజులో ఐదారు వరకు తినవచ్చు. చికిత్స: 1. త్రిభువన కీర్తి రస మాత్రలు: ఉదయం ఒక మాత్ర 2. మహాలక్ష్మీవిలాసరస మాత్రలు: రాత్రి ఒక మాత్ర మూడు వారాల వరకు వాడుకోవచ్చు. వైద్యుని పర్యవేక్షణ ముఖ్యం గమనిక: నివారణకు చెప్పినవి కూడా చికిత్సకు ఉపకరిస్తాయి. మహాలక్ష్మీవిలాసరస మాత్రలు నివారణకు కూడా వాడుకోవచ్చు. ఊపిరితిత్తుల క్షమత్వం పెరుగుతుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
'ముద్దులకు దూరంగా ఉండాల్సిందే!'
లండన్ : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలు పరస్పర కరచాలనాలకే కాకుండా సోషల్ కిస్సింగ్లతో పాటు ప్రేమ, ముద్దులకు కొంతకాలం దూరంగా ఉండాలంటూ లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్, ప్రముఖ శాస్త్రవేత్త లార్డ్ విన్స్టన్ పిలుపునిచ్చారు. ఆయన కరోనా వైరస్పైపై లండన్‌లో మంగళవారం జరిగిన ఓ చర్చాగోష్ఠిలో మాట్లాడుతూ... ఈ రోజు తనకు ఇద్దరు మిత్రులు సోషల్ కిస్సింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే వారిని వారించానని చెప్పారు. కరచాలనం కంటే సోషల్ కిస్సింగ్ వల్ల వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. తన మాటలను తన భార్య కూడా వింటుండవచ్చని, ఆమెను ఉద్దేశించి కూడా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. (హైటెక్ సిటీలో కరోనా కలకలం.. ఆఫీసులు ఖాళీ!) ఓ మనిష ముక్కును, కళ్లను రోజుకు 70 నుంచి వందసార్లు తాకే అవకాశం ఉందని ఆయన అన్నారు. చేతులతోని ముక్కు, నోరు, కళ్లను తాకకుండా జాగ్రత్త వహించాలని కూడా ఆయన సూచించారు. చేతులు శుభ్రంగా ఉంటే ఫర్వాలేదుగానీ లేకపోనట్లయితే ప్రమాదమే కదా! అని ఆయన చెప్పారు. 20 సెకండ్లకు తక్కువ కాకుండా తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఆయన సూచించారు. (ఇరాన్లో 92కు చేరిన కరోనా మృతుల సంఖ్య) -
బట్టలు ఫుల్.. బిల్లు నిల్..
విమానంలో వెంట తీసుకెళ్లే బ్యాగేజీ.. పరిమితికి మించి బరువుందని, అందుకు అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో.. ఫొటోలో భలేగా పోజిస్తున్న ఈ అమ్మాయికి వెంటనే ఓ ఐడియా తళుక్కున మెరిసింది. వెంటనే బరువుగా ఉన్న లగేజీ బ్యాగ్‌ను తెరచి అందులో ఉన్న తన డ్రెస్‌లు అన్నింటినీ ఒకదానిపై మరోటి తొడుక్కుంది. ఇలా దాదాపు మూడు కేజీల బరువున్న డ్రెస్‌లను అదనంగా వేసుకుంది. ఎయిర్పోర్ట్ అధికారులకు కట్టాల్సిన ‘అదనపు బరువు బిల్లు’ను తప్పించుకుంది. ఫిలిప్పీన్స్ దేశంలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందీ ఘటన. -
కలప అక్రమ రవాణాకు అడ్డేదీ..?
సాక్షి, త్రిపురారం : అడవుల సంరక్షణకు అధికార యంత్రాంగం చర్యలెన్నీ చేపడుతున్నా నిష్ప్రయోజనమే అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో స్వార్థపరుల గొడ్డలి వేటుకు అటవీ సంపద గురవుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఫారెస్ట్ భూముల నుంచి పెద్ద ఎత్తున కలప అక్రమ రవాణా జరుగుతుండటం అధికారుల నిర్లక్ష్యానికి తేటతెల్లం చేస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు, త్రిపురారం మండలాలకు సరిహద్దున ఉన్న ఫారెస్టు భూముల్లో గల వృక్ష సంపద నానాటికీ కనుమరుగవుతోంది. కొందరు స్వార్థపరులు తమ వ్యక్తి గత ప్రయోజనాల కోసం ఫార్టెస్టు భూముల్లో ఉన్న చెట్లను నరికి కలప అక్రమంగా రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కొందరు యజమానులు సోమ్ముచేసుకుంటున్నారు. నాణ్యతా లేని కలపను కోత మిషన్ల వ్యాపారులకు ఇటుక బట్టీలు కాల్చ డానికి వినియోగిస్తుండగా నాణ్యతా ఉన్న కలప ద్వారా అధిక ఆదాయం గడిస్తున్నారు. అధిక ధరకు విక్రయం.. నియోజకవర్గంలోని పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు, త్రిపురారం మండలాలకు సరిహద్దున ఫారెస్టు భూములు విస్తరించి ఉన్నాయి. అయితే ఈ అటవీ భూముల్లో లభిస్తున్న అడవివేప, మద్ది తదితర విలువైన చెట్లతో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చెట్లను నరికి వాటి నుంచి లభించే కలపను ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. అధికారుల కళ్లుకప్పి నిత్యం ట్రాక్టర్లను తరలిస్తున్నారు. కలప వ్యాపారులు పగటివేళల్లో నరికివేసిన చెట్లను రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు నిఘా ఏర్పాటు చేసి చెట్లను నరికివేస్తున్న కలప వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మామూళ్లు పుచ్చుకుంటూ.. ఫారెస్టు భూముల్లోని వృక్ష సంపదపై పర్యవేక్షణ ఉంచి దాన్ని కాపాడుకోవడానికి చర్యలు చేపట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఎవరైన అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడినా మామూళ్లు పుచ్చుకుంటూ వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఫారెస్టు భూముల్లోని వృక్ష సంపదను కాపాడుకోలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాల్టాకు తూట్లు.. పర్యావరణ పరిరక్షణకు నీరు, భూమి, చెట్లు ప్రధానం. వీటిని కాపాడుకుంటేనే మానవమనుగడ సాధ్యమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని విచ్ఛలవిడిగా వినియోగించకుండా ప్రభుత్వం ‘వాల్టా’చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ అక్రమార్కులు నిబంధనలు ఉల్లఘిస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. -
జడ్జీలు రాజకీయాలకు దూరంగా ఉండాలి
న్యూఢిల్లీ: రాజస్తాన్ హైకోర్టు సీజే జస్టిస్ ప్రదీప్ నంద్రజాగ్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ రాజేంద్ర మీనన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించకపోవడంపై సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ మదన్.బి.లోకూర్ స్పందించారు. జస్టిస్ ప్రదీప్, జస్టిస్ రాజేంద్ర మీనన్‌ల నియామకంపై 2018, డిసెంబర్ 12న కొలీజియం చేసిన సిఫార్సుల్ని ప్రజలకు అందుబాటులోకి తేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 10న సమావేశమైన కొత్త కొలీజియం జస్టిస్ ప్రదీప్, జస్టిస్ మీనన్‌ల పేర్లను తొలగించి జస్టిస్ ఖన్నా, జస్టిస్ మహేశ్వరిల పేర్లను సిఫార్సు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కొలీజియం సిఫార్సుకు కేంద్రం గత వారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం ది లీఫెల్ట్ న్యూస్‌పోర్టల్ నిర్వహించిన స్టేట్ ఆఫ్ ఇండియన్ జ్యుడీషియరీ అనే కార్యక్రమంలో జస్టిస్ లోకూర్ మాట్లాడుతూ.. ‘2018, డిసెంబర్ 12న కొలీజియం సమావేశం జరిగింది. అందులో కొన్ని నిర్ణయాలను తీసుకున్నాం. కానీ డిసెంబర్ 12 నుంచి 2019, జనవరి 10 మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు. కాబట్టి నేనేం చెప్పలేను. కానీ మేము ఆమోదించిన తీర్మానాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం నన్ను నిరాశ పరిచింది. అయితే ఆ తీర్మానాన్ని వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయలేదో నాకు అనవసరం’ అని వ్యాఖ్యానించారు. విశ్వాసఘాతకానికి పాల్పడలేను.. కొలీజియం నిర్ణయాలపై స్పందిస్తూ.. ‘కొలీజియంలో నిర్ణయాలను పరస్పరం నమ్మకంతో రహస్యంగా తీసుకుంటారు. కాబట్టి ఆ సమావేశంలో చర్చించిన విషయాలను బయటపెట్టి విశ్వాసఘాతుకానికి పాల్పడలేను. కానీ ఈ సమావేశంలో మేం కొన్ని నిర్ణయాలను తీసుకున్నాం. వీటిని సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. కొలీజియం భేటీలో ఆరోగ్యకరమైన చర్చ సాగింది. అందులో సమ్మతి, అసమ్మతి రెండూ ఉన్నాయి’ అని జస్టిస్ లోకూర్ తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల సుప్రీంకోర్టు ప్రాంగణాన్ని సందర్శించడంపై మాట్లాడుతూ.. ‘జడ్జీలు రాజకీయాలకు దూరంగా ఉండాలి. అంతమాత్రాన రుషిలా, ఒంటరిగా గడపాల్సిన అవసరం లేదు. దూరం పాటించాలంటే అర్థం ఏంటి? ప్రధాని మోదీ ముఖాన్ని కూడా చూడకూడదంటున్నారా? సాధారణ కార్యక్రమాలకు ప్రధానిని ఆహ్వానించడం తప్పుకాదు. ఇలాంటి కార్యక్రమాలకు సుప్రీంకోర్టు తలుపులు తెరవడం మంచిదే‘ అని వెల్లడించారు. న్యాయవ్యవస్థలో బంధుప్రీతి ఉందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. కొలీజియం వ్యవస్థ విఫలమైందని తాను భావించడం లేదని లోకూర్ అన్నారు. విధివిధానాలు రూపొందించాలి కొన్నిసార్లు న్యాయవ్యవస్థ కూడా తన పరిధి దాటి వ్యవహరించిందని జస్టిస్ లోకూర్ తెలిపారు. కొలీజియం తీసుకునే నిర్ణయాలను నిర్ణీత గడువులోగా అమలుచేసేలా ఓ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ గడువులోగా కేంద్రం నుంచి జవాబు రాకుంటే ఆమోదం లభించాలని వ్యాఖ్యానించారు. ఇందుకోసం కొలీజియంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గతంలో జస్టిస్ ఏఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి కల్పించే విషయంలో కేంద్రం ఫైలును కొన్నినెలల పాటు తనవద్దే అట్టిపెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థ, కేంద్రానికి ఇలా ఫైళ్లను తొక్కిపెట్టే అధికారం లేదన్నారు. భవిష్యత్‌లో కేంద్రం ఇచ్చే ఎలాంటి బాధ్యతలను తాను స్వీకరించబోనని చెప్పారు. జస్టిస్ ప్రదీప్, జస్టిస్ మీనన్‌ల పేర్లను ప్రతిపాదించిన కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ లోకూర్.. గత డిసెంబర్ 30న పదవీవిరమణ చేశారు. -
సెన్సార్ తెరలతో యాక్సిడెంట్లకు చెక్
సాక్షి, టెక్నాలజీ : ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్ లైట్లు పడినా వాహనదారులు ఒక్కోసారి దూసుకుపోవటం.. లేదా వాహనాల మధ్య నుంచే రోడ్డును దాటాలని పాదాచారులు చేసే ప్రయత్నం ప్రమాదాలకు దారి తీయటం చూస్తున్నాం. అయితే సాంకేతికతకు మరింత ఆధునీకరణ తోడైతే అలాంటి ఘటనలను నివారించొచ్చని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. సెన్సార్ స్క్రీన్ల ద్వారా యాక్సిడెంట్లకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. దీని ప్రకారం సిగ్నల్ వద్ద ముందుగా ఇరు పక్కల పెద్ద తెరలు కనిపిస్తాయి. వాటి మీద టైమ్ పడుతుంది. ఈ సమయంలో వాహనాలు ఫ్రీగా వెల్లిపోతుంటాయి. వాటిని దాటి ఎవరైనా రోడ్డు దాటాలని ప్రయత్నిస్తే వెంటనే అలారం మోగి ట్రాఫిక్‌ను పర్యవేక్షించేవారికి సందేశం వెళ్తుంది. మరోవైపు వాహనాలు వెళ్తున్న దిశలో కూడా ఈ స్క్రీన్లు దర్శనమిచ్చినప్పుడు వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోతాయి. అప్పుడు పాదాచారులు నిరభ్యరంతంగా రోడ్డును దాటేయొచ్చు. ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్ నగరంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించగా.. అది సత్ఫలితాన్ని ఇస్తోంది. త్వరలో దీనిని వివిధ దేశాలకు విస్తరించాలని ప్రాజెక్టును చేపట్టిన యూ-కోరీచన్ సంస్థ ఆలోచన చేస్తోంది. -
ఐ-టీ ఉద్యోగులకు సీబీడీటీ తాజా ఆదేశాలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఆదాయ పన్ను శాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. అధికారిక నిర్ణయాలను ట్విట్టర్, ఫేస్బుక్ ,వాట్సాప్ లాంటి ఇతర సామాజిక మీడియా వేదికల్లో చర్చించ వద్దంటూ ఆదాయం పన్ను శాఖ అధికారులను తాజాగా సీబీడీటీ ఆదేశించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అన్ని ప్రాంతీయ కార్యాలయాల ముఖ్య అధికారులకుజారీ చేసింది. సోషల్ మీడియా వేదికలపై కొన్నికీలక సమావేశాలు మినిట్స్ సహా అధికారిక నిర్ణయాలు చర్చకురావడంపై స్పందించిన సంస్థ ఈ ఆదేశాలిచ్చింది. ఆదాయ పన్ను శాఖకు సంబంధించి కొన్నిముఖ్యమైన నిర్ణయాలను తరచుగా సోషల్ మీడియాలో చర్చకువస్తున్న విషయాన్ని గమనించిన శాఖ ఈ ఆదేశాలను జారిచేసింది. సంబంధిత అధికారులు తప్ప, ఇలాంటి చర్చలను ఇతర ఉద్యోగులు అనధికారిక చర్చలను, ప్రచారాన్ని నిరోధించాలని కోరింది. ఈ మేరకుఇలాంటి చర్చల్ని తప్పనిసరిగా నివారించాలంటూ ఇటీవల సీబీడీటీ సుశీల్ చంద్ర ప్రాంతీయ అధికారులకు సూచిస్తూ ఒకలేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమాలు, 1964 రూల్ 11 ను సూచిస్తూ తాజా నోటీసులు జారీ చేసింది. ఇకముందుఎలాంటి సమాచారాన్ని చర్చించడానికి వీల్లేదని ఉద్యోగులకు మరోసారి స్పష్టం చేసింది. కాగా ప్రజలకు అధికారిక సమాచారం జారీ కోసం ఆదాయ పన్ను శాఖ మైక్రో బ్లాగింగ్ సైట్ 'Twitter-- '@IncomeTaxIndia' పేరుతో ఒక అధికారిక అకౌంట్ ను కలిగి ఉంది. -
బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే అంతేనట!
న్యూఢిల్లీ: ప్రజల జీవన విధానం కారణంగా ఆహార ఆలవాట్లలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బిజీ బిజీ జీవితంలో వ్యాయామం చేయడానికి కూడా తీరికలేనంతగా అలసిపోతున్నారు. దీనికి తో్డు ఫాస్ట్ ఫుడ్ కు అలవాటుపడటం కూడా ఊబకాయానికి దారి తీస్తోంది. ముఖ్యంగా రాత్రి ఎనిమిదిలేదా ఆరుగంటల విరామం తర్వాత ఆహారం శరీర బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు సూచిస్తున్న అయిదు చిట్కాలు. 1. బ్రేక్ ఫాస్ట్ ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. సాధారణంగా పని ఒత్తిడిలో పడి ఉదయం పూట అల్పాహారం సంగతి పక్కన పెడతాం. కానీ రోజులో మనం తీసుకునే అతి ముఖ్యమైన ఆహారాన్ని తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయకూడదు. శరీర మెటబాలిజం నియంత్రణకు ఉదయం ఆహారంచాలా కీలకమైందని సూచిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. 2. ఆహారం ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారంపై, కాలరీలపై దృష్టిపెట్టాలి. తక్కువ శాతం సుగర్, కొవ్వు ఉన్నపదార్దాలను తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా.. కొంచెం కొంచెం గా తీసుకో్వడం ద్వారా ఊబకాయాన్ని నియంత్రించవ్చని సలహా ఇస్తున్నారు. 3.ప్రతిరోజు అరగంట వ్యాయామం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఒబెసిటీ ద్వారా వచ్చిప్రమాదకరమైన వ్యాధులనుంచి బయటపడవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, గుండె జబ్బు నిరోధించవచ్చు. దీనితోపాటు అధిక రక్తపోటు, ఒత్తిడిలనుంచి కూడా ఇది సహాయం చేస్తుంది. ముఖ్యంగా నడుము, పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించుకోవడానికి వ్యాయామం అవసరం. 4. నిద్ర కంటి నిండా నిద్రకూడా శరీర బరువు నియంత్రణలో చాలా కీలకమైంది. నిద్ర లేమి అధిక బరువుకు దారి తీస్తుంది. రోజువారీ తగినంత నిద్ర శరీరానికి కావాలి. నిద్ర లేమితో బాధపడుతున్న వారు త్వరగా ఆలసిపోతారు. వ్యాయామం చేయలేనంత నీరసం ఆవహిస్తుంది. సో..రోజూ సరియైన నిద్రపోవడం అవసరం. 5. డాక్టర్ల సలహా వీటన్నింటికి మరో ముఖ్యమైన విషంయ అధిక బరువుతో బాధపడుతున్నపుడు డాక్టర్ ను సంప్రదించిన సరియైన చికిత్స తీసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి అపోహలు భయాలు, లేకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా అవసరమని పేర్కొంటున్నారు. -
టీడీపీ అక్కడ అలా ఇక్కడ ఇలా!
-
రొమ్ము క్యాన్సర్‌ను జయిద్దాం..
కేఎల్ వర్సిటీ మహిళా సంఘ కన్వీనర్ డాక్టర్ లలిత గుంటూరు ఈస్ట్: రొమ్ము క్యాన్సర్‌పై అందరూ అవగాహన కలిగి ఉండాలని కేఎల్ యూనివర్సిటీ మహిళా సంఘ కన్వీనర్ డాక్టర్ లలిత పేర్కొన్నారు. శంకర్ విలాస్ సెంటర్లో కేఎల్ యూనివర్సిటీ మహిళా ఫోరం, బయో టెక్నాలజీ, బీఫార్మసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్‌పై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆమె మాట్లాడారు. మహిళలు ప్లకార్డులు, పింక్ రిబ్బన్లు, బెలూన్లు పట్టుకుని నినాదాలు చేశారు. ఉన్నత విద్య అభ్యసించిన వారు కూడా క్యాన్సర్ గురించి తెలుసుకునేందుకు సిగ్గు పడుతున్నారనీ, ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసన్న, బయో టెక్నాలజీ విభాగం కన్వీనర్ హిమత, మహిళా ఫోరం కో–కన్వీనర్ శ్రీదేవి పాల్గొన్నారు. -
అనవసరం రాద్ధాంతం నాకు నచ్చదు
న్యూఢిల్లీ: రచయతలు, సినీ దర్శకులు, చరిత్రకారులు తీసుకున్న నిర్ణయంపై వ్యాఖ్యానించేందుకు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తిరస్కరించారు. అవసరమైన వ్యాఖ్యానాలు చేసి లేనిపోని వివాదాలు సృష్టించడం తనకు ఇష్టంలేదన్నారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీగాగా పేరున్న అమితాబ్.. సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని సూచించారు. సెలబ్రిటీ వీడియో బ్లాగింగ్ అప్లికేషన్ వాకౌను గురువారం లాంచ్ చేసిన అమితాబ్ అవార్డులను వెనక్కి ఇస్తున్న వైనం స్పందించాలని మీడియా కోరినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ''అది ఒక ప్రత్యేక పరిస్థితి. ఆచితూచి మాట్లాడాల్సిన సమయం. సెల్రబిటీలు విచక్షణ మర్చిపోయి వ్యాఖ్యానిస్తే పరిస్థితి విషమించే అవకాశం ఉంది'' అని ఆయన కామెంట్ చేశారు. కొంతమంది సెల్రబిటీలు మనసుకు తోచిన అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారన్నారు. రెండో ఆలోచన లేకుండా ఇలా చేస్తున్నారని, నిజంగా వాళ్ల ధైర్యానికి మెచ్చుకోవాలంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాస్పద అంశాలపై మాట్లాడేటపుడు సంయమనాన్ని పాటిస్తానని చెప్పుకొచ్చారు. వివాదాన్ని సృష్టించడం తనకు ఇష్టం ఉండదని, అనసర రాద్ధాంతం చేయడం తనకు నచ్చదన్నారు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను, అనుభవాలను సోషల్ మీడియాలో అభిమానులతో తరచూ షేర్ చేసుకుంటూ సోషల్ మీడియా్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ టైటిట్ కొట్టేసిన బిగ్ బి.. మేధావులు, రచయితలు తమ ప్రతిష్ఠాత్మక అవార్డులను వెనక్కి ఇచ్చేయడంపై మాత్రం స్పందించడానికి నిరాకరించారు కాగా కల్బుర్గి దారుణహత్య, దేశంలో పెరుగుతున్న మత ఘర్షణలు, అసహనానికి నిరసనగా చాలామంది రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను, సినీ దర్శకులు తమ ప్రతిష్ఠాత్మక అవార్డులను వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించారు. అటు ఈ వ్యవహారంపై భిన్న స్వరాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
తాగింది దిగాలంటే..!
న్యూయార్క్: అలసటతోకావచ్చు.. ఆనందానికి కావచ్చు.. చిరాకుతో కావచ్చు.. విరక్తితో కావచ్చు.. ఏ కారంణంతో రాత్రంతా పీకలదాకా తాగి పడుకున్నా.. దానివల్ల పొద్దున్నే తలెత్తే హ్యాంగోవర్ నుంచి తొందరగా బయటపడాలంటే మాత్రం కొన్ని ఆహార నియమనిబంధనలు పాటించాలని నిపుణులు చెప్తున్నారు. లేదంటే వికారంగా ఉండి జీర్ణ వ్యవస్థ కుదురుకోక ఓ వారం రోజులపాటు అలసట తలెత్తి.. చిరాకుతో చిర్రెత్తిపోయి.. ఏకాగ్రత మొత్తం పాడై పోతుందని వారు చెప్తున్నారు. హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు ఏంచేయాలి.. బెడ్‌పైనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి ఆరెంజ్ జ్యూస్ జీర్ణాశయానికి ఆ సమయంలో చాలా మంచిది. ఆ రోజు సాధారణంగా కేలరీలు ఎక్కువ అవసరం అని చాలామంది సాండ్ విచ్ తీసుకుంటారు.. కానీ అలాంటి వాటికి బదులు గ్రుడ్లు తినాలి. కాఫీ హ్యాంగోవర్‌ను ఎక్కువ చేస్తుంది.. అందుకే దీనికి బదులు ఎక్కువ మొత్తంలో నీళ్లుగాని, హెర్బల్ టీగానీ తాగాలి. గ్రే ఫుడ్ తీసుకోవాలి. మాంసం కొంచెం తినొచ్చుగానీ.. పూర్తి స్థాయిలో తినకూడదు. హ్యాంగోవర్ పోవడానికి చాలామంది మరింత ఆల్కహాల్ తాగుతారు. కానీ దీనివల్ల డీహైడ్రేషన్ జరుగుతుంది. అది మంచిది కాదు.