
విమానంలో వెంట తీసుకెళ్లే బ్యాగేజీ.. పరిమితికి మించి బరువుందని, అందుకు అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో.. ఫొటోలో భలేగా పోజిస్తున్న ఈ అమ్మాయికి వెంటనే ఓ ఐడియా తళుక్కున మెరిసింది. వెంటనే బరువుగా ఉన్న లగేజీ బ్యాగ్‌ను తెరచి అందులో ఉన్న తన డ్రెస్‌లు అన్నింటినీ ఒకదానిపై మరోటి తొడుక్కుంది. ఇలా దాదాపు మూడు కేజీల బరువున్న డ్రెస్‌లను అదనంగా వేసుకుంది. ఎయిర్‌పోర్ట్ అధికారులకు కట్టాల్సిన ‘అదనపు బరువు బిల్లు’ను తప్పించుకుంది. ఫిలిప్పీన్స్ దేశంలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందీ ఘటన.
Comments
Please login to add a commentAdd a comment