clothes
-
ఒళ్లు కనిపించేలా దుస్తులు.. ఢిల్లీ కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ:ఒళ్లు కనిపించేలా పబ్లిక్ ప్లేసుల్లో చిన్న దుస్తులు వేసుకోవడంపై ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు తాజాగా కీలక తీర్పు చెప్పింది. అదేమీ నేరం కాదని స్పష్టం చేసింది. బార్లో చిన్న దుస్తులు వేసుకుని డ్యాన్సులు చేసిన ఏడుగురు బార్ డ్యాన్సర్లపై ఉన్న కేసును కొట్టేసింది. ఇక ముందు కేవలం డ్యాన్సులు చేసినందుకు కాకుండా డ్యాన్సుల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులెదురైతేనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది.ఢిల్లీలోని ఓ బార్లో యువతులు చిన్న దుస్తులు వేసుకుని అశ్లీల నృత్యాలు చేశారని అదే సమయంలో బార్ వైపు వెళ్లిన ఓ కానిస్టేబుల్ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ డ్యాన్సుల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులెదురయ్యాయ అన్నదానిని పోలీసులు నిరూపించలేకపోయాడని కోర్టు పేర్కొంది.పోలీసుల ఫిర్యాదు,వాంగ్మూలాలకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్షులు కూడా బార్‌కు ఎంజాయ్ చేయడానికి వెళ్లామే తప్ప తమకు ఏమీ తెలియదని చెప్పారని కోర్టు పేర్కొంది. -
కుంభమేళాలో ఆకర్షించిన ప్రధాని వస్త్రధారణ
ప్రయాగ్‌రాజ్:ప్రధాని మోదీ తాను ధరించే దుస్తుల ప్రత్యేకత గురించి వేరే చెప్పనవసరం లేదు. దుస్తుల విషయంలో ఆయన ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్‌ను అనుసరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించే సందర్భం ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదాయానికి తగట్టు వ్యవహరిస్తూనే ఫ్యాషన్‌ను ఫాలో అవుతుంటారు.బుధవారం(ఫిబ్రవరి5) ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఏకంగా మూడు రకాల దుస్తులు ధరించారు. అరాలీ ఘాట్ నుంచి త్రివేణి సంగమానికి బోట్లో వెళుతున్న సమయంలో సంప్రదాయ కుర్తా,పైజామా పైన నెహ్రూ జాకెట్ ధరించారు.ఇక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించే సమయంలో మాత్రం ప్రధాని సంప్రదాయానికి భిన్నంగా అథ్లీజర్ దుస్తులను ధరించారు. మెడలో నీలిరంగు స్కార్ఫ్ వేసుకుని మణికట్టుకు రుద్రాక్ష మాల చుట్టుకున్నారు.స్నానం పూర్తయి హారతి ఇచ్చే సమయంలో కుర్తా,చుడీదార్ పైజామా వేసుకున్నప్పటికీ కుర్తాపై పఫ్ఫర్ జాకెట్ ధరించారు.తలపై రంగురంగుల పహారీ టోపీ ధరించారు. ప్రధాని కుంభమేళా పర్యటన సమయంలో ధరించిన దుస్తుల విషయంలో సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. -
దుస్తులు పాతబడ్డాయా.. అమ్మేయండి..!
సాక్షి, అమరావతి: ఇంటినిండా బట్టలున్నట్టే ఉంటాయి. కానీ సమయానికి కట్టుకుందామంటే ఒక్కటీ సరైనది కనిపించదు. ఇలా పాతబడిపోయిన దుస్తులను ఏం చేయాలో తెలియదు. ఎవరికైనా ఇద్దామంటే ఏమనుకుంటారోననే సందేహం. వాటిని దాచుకోలేక, పడేయలేక సతమతమవుతుంటారు చాలామంది. ముఖ్యంగా మహిళలు. ఇకపై ఆ సందేహాలు, సతమతాలు అవసరం లేకుండా ఇళ్లల్లో ఉన్న పాత దుస్తులను కొనే యాప్‌లు, వెబ్సైట్లు వచ్చేశాయి. వీటిద్వారా వాడకుండా పక్కన పెట్టేసిన దుస్తులను ఆన్లైన్లో అమ్మేసేయొచ్చు. అంటే..పాత దుస్తులకూ డబ్బులొస్తాయన్నమాట. వాటిని కొనేందుకు కొన్ని వెబ్సైట్లు ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తుంటాయి. ఆలస్యమెందుకు.. ఆ యాప్‌లు, వెబ్సైట్లు ఏమీటో తెలుసుకొని.. పాత వాటిని అమ్మేద్దాం..అమ్మడానికి ఆన్లైన్లో అనేక వేదికలుఆన్లైన్ల్లో పాత దుస్తులు కొనే వెబ్ సైట్లు, యాప్‌లు చాలానే ఉన్నాయి. ప్రీ అప్, బేచ్ దే, పోష్ మార్క్, ఓఎల్ఎక్స్, పీ పాప్, ఒయేలా, క్లాతింగ్ క్లిక్, ఈబే, ఓల్డ్ కార్ట్..వంటి పేర్లతో ఆన్లైన్ వ్యాపారాలు జరుగుతున్నాయి. కొన్ని సైట్లు, యాప్‌లు నేరుగా దుస్తులు కొనుగోలు చేసి వాటికి కొంత నగదును ఇస్తున్నాయి. అందుకోసం మీ దుస్తులను యాడ్ చేసి ధరను నిర్ణయించిన తర్వాత, కంపెనీ వాటిని చెక్ చేసి ఆమోదిస్తుంది. అనంతరం వాటిని నేరుగా వినియోగదారులకు విక్రయిస్తుంది. మరికొన్ని వినియోగదారులకు నేరుగా అమ్మకందారులే దుస్తులను విక్రయించేందుకు అవకాశం ఇస్తున్నాయి. ఈ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయ్యాక సేల్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, అమ్మాలనుకుంటున్న దుస్తులను క్లోజప్‌లో ఫొటో తీసి పోస్ట్ చేయాలి. వాటికి సంబంధించిన చిన్నపాటి సమాచారం (డిస్క్రిప్షన్)ను కూడా రాయాలి. ఆ తర్వాత డ్రెస్ ఏ కండీషన్లో ఉంది, ఎవరికి సరిపోతుంది (కేటగిరీ) అనే వివరాలను సెలక్ట్ చేసి దాని ధర (అమౌంట్) ను కూడా తెలపాలి. కొన్ని సంస్థలు అమ్మకం రుసుము (సెల్లింగ్ ఫీజు) తీసుకోవు. ఇంటికే వచ్చి మనం అమ్మిన పాత దుస్తులను తీసుకెళుతున్నాయి. దుస్తులు అమ్మే సమయంలో క్రెడిట్ పాయింట్స్ లేదా క్యాష్ ఆప్షన్ పెట్టుకునే వీలు కూడా ఉంటుంది. బట్టలతో పాటు వాచీలు, చైన్లు, రింగులు, క్యాపులు, బూట్లు వంటి యాక్ససరీస్, డెకరేటివ్ ఐటమ్స్ కూడా అమ్ముకునేలా, కొనుక్కునేలా ఈ యాప్‌లలో ఆప్షన్లు ఉన్నాయి. మీషో వెబ్సైట్లో దేశవ్యాప్తంగా ఎవరైనా మీ దుస్తులను కొనే అవకాశం ఉంటుంది. ఫ్రీఅప్ అనే వెబ్ సైట్ కూడా మరో ఫేమస్ వెబ్ సైట్. ఈ యాప్ లో మీరు మీ పాత బట్టల ఫొటోలు పెట్టగానే వాటి క్వాలిటీని బట్టి ధర నిర్ణయిస్తుంది. ధర నచ్చితే హ్యాపీగా అమ్మేయొచ్చు. రీలవ్ వెబ్ సైట్ ద్వారా కూడా ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవచ్చు. క్లెటెడ్ అనేది ప్రత్యేకంగా ఇంటింటికీ సేవలందించడంలో ప్రసిద్ధి చెందిన యాప్. వెబ్ సైట్ నిర్వాహకులే ఇంటికొచ్చి పాత దుస్తుల బ్రాండ్, ప్రస్తుత పరిస్థితిని చూసి సరైన ధర నిర్ణయించి డబ్బులు కూడా ఇస్తారు. వ్యాపారం మీరే చేయొచ్చుఆన్లైన్లో పాత దస్తులను సేకరించి విక్రయించే వ్యాపారం చేయడానికి ఇటీవల యువత కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. కొంత మంది లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. ఒక యాప్ లేదా వెబ్ సైట్ తయారు చేసి సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేయొచ్చు. నగరాల్లో కమిషన్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకుని దుస్తులు సేకరించవచ్చు. వాటిని రీసైక్లింగ్ చేసే కంపెనీలకు బల్‌్కగా అమ్మొచ్చు. ఇలా కొన్న పాత బట్టలను ఉపయోగించి కొందరు పిల్లోస్, పరుపులు, డెకరేషన్ ఐటమ్స్ తయారు చేస్తారు. అలాంటి వారిని సంప్రదించి మంచి ధరకు అమ్మేయొచ్చు. దీని ద్వారా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. -
పిలవని పెళ్లిళ్లకు.. పోలీసులు రెడీ..
పాత తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ చివర్లో డిష్యూం డిష్యూం ఫైటింగ్‌లు అయిపోయాక పోలీసులు వచ్చి శుభం కార్డు పడటం అందరం చూసే ఉంటాం. ఆగ్రా పోలీసులు మాత్రం పెళ్లిళ్లలో చిట్టచివర్లో కాకుండా ముందే వస్తారు. అదీ కూడా పిలవకుండానే వచ్చి పెళ్లిలో అత్యంత కీలకమైన, విలువైన వధువు నగలు, పెళ్లివారి నగదు వంటి వాటిపై నిఘా పెడతారు. ఎందుకంటే వాటిని కొట్టేసేందుకు చోరశిఖామణులు పెళ్లి మండపాల్లో తచ్చాడుతారని పోలీసులుకు బాగా తెలుసు. అందుకే మఫ్టీల్లో వచి్చమరీ పటిష్ట భద్రత కల్పిస్తారు. ఇదంతా ఉచితమే. ఇలా అదనపు మొహరింపు వెనక ఒక పెద్దకారణమే ఉంది. ఈ వివరాలను ఆగ్రా సిటీ డెప్యూటీ పోలీస్ కమిషనర్ సూరజ్ రాయ్ వెల్లడించారు. టీనేజర్లూ డేంజరే ‘‘రాత్రిళ్లు దొంగలు పడటం సర్వసాధారణం. పట్టపగలు పెళ్లి పందిళ్లు, మండపాల్లో దొంగలు చేతవాటం చూపించడం ఈమధ్య మరీఎక్కువైంది. ముఖ్యంగా పెళ్లి నగలు, నగదుపై కన్నేసి కొట్టేసిన ఘటనలు చాలా జరిగాయి. అందుకే పోలీసు సిబ్బందిని సాధారణ దుస్తుల్లో వివాహవేడుకలకు బందోబస్తుగా మేమే పంపిస్తున్నాం. బంధువుల్లా కలిసిపోయి అందరిపైనా ఓ కన్నేస్తాం. వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ముఖ్యంగా గమనిస్తాం. ఎందుకంటే వాళ్ల దగ్గర ఉండే నగలు, నగదునే దొంగలు కొట్టేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల సాయంతోనూ నిఘా కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగ్రా జిల్లాలోని ప్రతి కీలకమైన వేడుకకు మేం పిలవకున్నా వెళ్తున్నాం. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను గమనిస్తాం. కొన్ని సార్లు ఆ అనుమానాస్పద వ్యక్తుల వెంట వచ్చే టీనేజర్లనూ ఓ కంట కనిపెడతాం. ఎందుకంటే ఆ మధ్య ఒక పెళ్లిలో టీనేజీ పిల్లాడే కోట్లవిలువైన చోరీకి పాల్పడ్డాడు. పెళ్లిమంటపాలు, బాంకెట్ హాళ్లు, వివాహ వేదికలు ఇలా మొత్తం 18 క్లస్టర్లకు పోలీసులను పంపుతున్నాం. స్థానికులు సైతం తమ పెళ్లికి నిఘా కావాలంటే ముందస్తుగా సమీప పోలీస్‌స్టేషన్‌ను సంప్రదిస్తే ప్రతి పెళ్లికి కుదిరితే బందోబస్తును ఏర్పాటుచేస్తాం’’అని ఆయన వివరించారు. – ఆగ్రా -
అవుట్ ఫిట్.. వ్యాయామం హిట్..
ఎన్ని గంటలు చేయాలి? ఏం డైట్ తీసుకోవాలి? సరిగా వర్కవుట్ చేస్తున్నానా లేదా? వ్యాయామం చేయాలనుకునే/ చేసే వారిలో ఎన్నో సందేహాలు.. మరి డ్రెస్ సంగతేంటి? వ్యాయామానికి తగ్గ అవుట్ ఫిట్ ధరిస్తున్నానా?అనేది ఆలోచించకపోతే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు వ్యాయామ నిపుణులు. దీనిపై నగరానికి చెందిన వ్యాయామ నిపుణులతో కలిసి హామ్స్టెక్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన డిజైనర్లు అందిస్తున్న సూచనలివి.. నిశ్చల జీవనశైలి, ఎక్కువ గంటలు కూర్చోడం వల్ల వచ్చే మధుమేహం, రక్తపోటు గుండె సమస్యలు వంటి జీవనశైలి వ్యాధులను ఎదుర్కోడంలో రెగ్యులర్ వ్యాయామం అవసరం. ఇది ఎండార్ఫిన్స్‌ను రిలీజ్ చేసి ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మంచి నిద్రనిస్తుంది. అయితే వర్కవుట్ సమయంలో సరైన యాక్టివ్ వేర్ ఉంటేనే ఇవన్నీ సాధ్యం. అనుచితమైన జిమ్‌వేర్ వ్యాయామాలకు అవసరమైన కండరాల సపోర్ట్‌ని అందించవు. మన ఫిట్నెస్ లక్ష్యాలకు సహకరించవు. జిమ్ వేర్.. టేక్ కేర్.. వ్యాయామ సమయంలో సరైన యాక్టివ్‌వేర్ ఉత్సాహం పెంచడంతో పాటు అధిక చెమట, దుర్వాసనల నుంచి రక్షిస్తుంది. గాయాలను నివారించి శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి పనిచేసే కండరాలకు ఆక్సిజన్‌ను అందించడంతో పాటు సామర్థ్యం మేరకు వ్యాయామాలు చేసేలా ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. సులభమైన కదలికలకు సహకరిస్తూ బరువులు ఎత్తడంలో సహాయపడి కండరాల పునరుద్ధరణను సులభతరం చేస్తుంది.శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి శరీరం నుంచి తేమ ఆవిరైపోవాలి. కాబట్టి తేమను సులభంగా ఆరబెట్టడానికి, చెడు వాసనను నిరోధించడానికి చల్లగా, సౌకర్యవంతంగా ఉంచడానికి మైక్రోఫైబర్‌తో కూడిన ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. పాలియెస్టర్, స్పాండెక్స్, పాలీ–డ్రై, నైలాన్ కూడా మంచివే. 👉 కొన్నిరకాల దుస్తులు అంటువ్యాధులు, దద్దుర్లు, దురదలకు దారితీయవచ్చు. శరీరపు సహజ ఉష్ణోగ్రతను దెబ్బతీసి, డీ హైడ్రేషన్, అలసట లేదా బరి్నంగ్ సెన్సేషన్‌కు దారితీస్తాయి. 👉 వేసవి కాలంలో సౌకర్యవంతమైన, చల్లదనాన్నిచ్చే దుస్తులు, వర్షాకాలంలో అంటువ్యాధులు, అలెర్జీలు, చర్మ వ్యాధులను నివారించడానికి పొడిగా, తాజా అనుభూతిని కలిగించే దుస్తులను ఎంచుకోవాలి. శీతాకాలంలో వెచ్చగా ఉంచేవి, అవుట్డోర్ వ్యాయామ సమయంలో లేయర్లలో దుస్తులు ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రతను అనుసరించి ఒక్కో లేయర్‌ను తొలగించొచ్చు. 👉 గుండె ఆరోగ్యానికి, శక్తికి రన్నింగ్, సైక్లింగ్ వంటి కార్డియోవాస్క్యులర్ వ్యాయామాలు అవసరం. రన్నింగ్, జాగింగ్ చేసేవారి కోసం లైట్ వెయిట్ స్వెట్ అబ్సార్బింగ్, టీషర్ట్స్, షార్ట్స్, బి రన్నింగ్ అండ్ కార్డియో హెచ్ఆర్ఎక్స్ తదితర బ్రాండ్స్ అందిస్తున్నాయి. 👉కీళ్ల మధ్య సమన్వయం, బ్యాలెన్సింగ్‌కి యోగా, స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు ఉపకరిస్తాయి. దీనికి యోగా ఫ్లెక్సిబులిటీ, బ్లిస్ క్లబ్ వంటి బ్రాండ్స్ హై స్ట్రెచ్ లెగ్గింగ్స్, తేమను పీల్చుకునే స్పోర్ట్స్ బ్రాల తదితర అవుట్‌ఫిట్స్‌ను అందిస్తున్నాయి. జీవమే బ్రాండ్ కూడా ఫ్లెక్సిబులిటీ, సౌకర్యంగా ఉండే స్ట్రెచ్బుల్ యోగా గేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 👉 బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్‌కి, మన దేశపు నేలకు తగ్గట్టుగా మెత్తగా ఉండే కుషన్ కలిగిన షూస్‌ని ప్యూమా ఇండియా అందిస్తోంది. యోగాతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌కి ఉపకరించే లైట్ వెయిట్, ఎకో ఫ్రెండ్లీ దుస్తుల్ని ప్రయోగ్ తయారు చేస్తోంది. 👉 స్టైలిష్ అత్లీజర్, ఫ్యాషన్, ఫంక్షన్ రెండింటి మేలి కలయికతో డి.అథ్లీజర్ అం ఆల్ డే యాక్టివ్ వేర్‌ను లులులెమన్ ఇండియా అందిస్తోంది. తేలికపాటి వ్యాయామాలతో పాటు రోజువారీ ఉపకరించే దుస్తులను నష్ యాక్టివ్ సమరి్పస్తోంది. 👉 చేసే వ్యాయామంపై అవగాహనతో పాటు ధరించే అవుట్ఫిట్పై కూడా జాగ్రత్తలు అవసరం. ప్రస్తుతం పలు రకాల బ్రాండ్స్, ఏ వ్యాయామ శైలికి తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను అందిస్తున్నాయి. వాటిలో నుంచి లేదా తామే ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కస్టమైజ్డ్ దుస్తులను ఫిట్నెస్ లవర్స్ వినియోగించుకోవచ్చు. – హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ అవుట్ ఫిట్.. ఇంపార్టెంట్వ్యాయామం చేసే సమయంలో సరైన అవుట్ ఫిట్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఇప్పుడు చాలా మందిలో అవగాహన పెరిగింది. చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి జిమ్ వర్కవుట్‌కి డ్రై ఫిట్ పేరిట అందుబాటులోకి వచ్చిన దుస్తులు, అదే విధంగా యోగ డ్రెస్సింగ్‌కు వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ వినియోగిస్తున్నారు. జాగింగ్ చేసేవారికి జాగర్స్ సూట్స్, సైక్లింగ్కి స్కిన్ టైట్ ప్యాంట్ ఇలా వర్కవుట్ స్టైల్‌ని బట్టి ప్రత్యేక దుస్తులు అందుబాటులోకి వచ్చేశాయి. – విజయ్ గంధం, ఫిట్నెస్ ట్రైనర్ -
మనిషికి మనిషిని జతకలిపే దర్జీలు
వారధి నిర్మాణ పనుల్లో ‘నేనెంత’ అనుకోలేదు ఉడుత. ‘నేను కూడా కొంత’ అనుకొని పనుల్లోకి దిగింది. వయనాడ్ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులకు అండగా నిలవడానికి, తమ వంతు సహాయం అందించడానికి స్థాయి భేదాలు లేకుండా ఎంతోమంది మహిళలు వస్తున్నారు. శిబిరంలోని మహిళలకు బట్టలు కుట్టి ఇవ్వడం నుంచి పరిసరాల శుభ్రత వరకు దీక్షతో పనిచేస్తున్నారు...శృతికి చారమాలలో చాలా మంది బంధువులు ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన సంఘటనలో కొందరు చనిపోయారు. మరికొందరు మెప్పడిలోని సహాయ శిబిరంలో ఉన్నారు. కొంతమంది మహిళలు స్నానం చేయడానికి శృతి ఇంటికి వచ్చినప్పుడు తమకు ఇచ్చిన దుస్తులకు సంబంధించిన సమస్యల గురించి చెప్పుకున్నారు. ఆల్ట్రేషన్కు అవకాశం లేకపోవడంతో తమకు సరిపోయే ఒకే జత దుస్తులనే వాడాల్సి వస్తోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని స్నేహితురాలి దగ్గర కుట్టుమిషన్ తీసుకొని నిర్వాసిత కుటుంబాల సహాయ శిబిరానికి బయలుదేరింది శృతి.ప్రతి గదికి వెళ్లి ‘నేను రెండు రోజులు ఇక్కడే ఉంటాను. దుస్తుల సైజ్ సర్దుబాటు సమస్యలు ఉంటే నాకు చెప్పండి’ అని అడిగింది. ఇక ఆరోజు నుంచి చిరిగిపోయిన దుస్తులు, సైజు సరిగా లేని దుస్తులను సరి చేసే పని మొదలైంది.టైలరింగ్ వల్ల జరిగిన మరో మేలు ఏమిటంటే మనసును దారి మళ్లించడం. ఈ శిబిరంలో కొద్దిమంది టైలరింగ్ పని తెలిసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రమ్య మనోజ్ ఒకరు.‘భయపెట్టే జ్ఞాపకాల నుంచి బయటపడడానికి టైలరింగ్ అనేది చికిత్సామార్గంలా ఉపయోగపడింది. చాలా రోజులుగా మేము శిబిరంలో ఖాళీగా ఉన్నాం. ప్రతిరోజూ విషాద జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉండేవి. మెషిన్‌పై ఆల్ట్రేషన్ పనులు మొదలు పెట్టిన తరువాత నాకు ఎంతో ఉపశమనం లభించింది’ అంటుంది రమ్య మనోజ్.శృతి, రమ్య... మొదలైన వారిని దృష్టిలో పెట్టుకొని సహాయ శిబిరానికి కుట్టుమిషన్లను ఒక స్వచ్ఛంద సంస్థ విరాళంగా ఇవ్వనుంది.‘మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు రెండు రోజులు ఉండాలనుకున్నాను. ఇప్పుడు మాత్రం శిబిరం ఉన్నంతవరకు రోజూ వచ్చి పోవాలనుకుంటున్నాను’ అంటుంది శృతి.సహాయ శిబిరానికి శృతి రోజూ రావాలనుకోవడానికి కారణం కేవలం టైలరింగ్ పనులు కాదు. ఇప్పుడు అక్కడ ఆమె ఎంతోమంది బాధితులకు ఓదార్పునిస్తోంది. బాధితులు విషాద జ్ఞాపకాల నుంచి బయటపడడానికి సినిమాల నుంచి ఆటల వరకు ఎన్నో విషయాలు మాట్లాడుతుంటుంది.‘శిబిరానికి శృతి రావడానికి ముందు మా మాటల్లో బాధలు, కష్టాలు, చేదు జ్ఞాపకాలు మాత్రమే ఉండేవి. అయితే శృతి మమ్మల్ని అటువైపు వెళ్లనివ్వకుండా రకరకాల విషయాలు మాట్లాడుతుంటుంది. ధైర్యం చెబుతుంటుంది’ అంటుంది సహాయ శిబిరంలో తలదాచుకుంటున్న ఆశ.హరిత కర్మ సేన ఆల్ ఉమెన్ గ్రూప్పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిలో కొందరు జ్వరం, దగ్గులాంటి సమస్యలతో బాధ పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పునరావాస శిబిరం పరిసరప్రాంతాల్లో అపరిశుభ్రత ఆనవాలు లేకుండా చేస్తున్నారు. పునరావాస శిబిరాలుగా మారిన పాఠశాలలు శుభ్రంగా కనిపించడానికి కారణం హరిత కర్మ సేన–ఆల్ ఉమెన్ గ్రూప్. భోజనాల తరువాత టేబుళ్లు, నేలను శానిటైజ్ చేస్తున్నారు. క్రిములు పెరగకుండా, వ్యాధులు వ్యాప్తి చెందకుండా, సహాయ శిబిరం చుట్టుపక్కల ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు కనిపించకుండా చూస్తున్నారు.కేరళలో మొత్తం 1018 హరిత కర్మ సేన యూనిట్లు పని చేస్తున్నాయి. పట్టణప్రాంతాల్లో 4,678, గ్రామీణప్రాంతాల్లో 26, 546 మంది మహిళలు పనిచేస్తున్నారు. ‘వేస్ట్ ఫ్రీ కేరళ’ నినాదాన్ని భుజాల కెత్తుకున్న హరిత కర్మ సేన కలెక్టింగ్, ట్రాన్స్‌పోర్టింగ్, ప్రాసెసింగ్, రీసైకిలింగ్, వేస్ట్ మెటీరియల్స్ డిస్పోజల్ అండ్ మేనేజ్మెంట్కు సంబంధించి వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ‘సమాజానికి ఉపయోగపడే మంచి పని చేస్తున్నాను అనే భావన మనసులో ఉండడం వల్ల కావచ్చు ఎంత పని చేసినా శ్రమగా అనిపించదు’ అంటుంది హరిత కర్మ సేన సభ్యురాలు ఉద్విత. -
రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్!
మన పూర్వీకుల కాలంలో ఎంతో కొంత ఫ్యాషన్ ఉండేది. అయితే ఇప్పటిలా దానికి అంతలా క్రేజ్ లేకపోయినా నాటి రాజరికపు కుటుంబాలు గొప్ప గొప్ప డిజైనర్ వేర్ దుస్తులను ధరించేవారు. నాటి కాలంలో చేతిలో ఎంబ్రాయిడరీ చేసిన డిజైనర్‌వేర్ చీరలు గురించి చాలమందికి తెలియదు. నాటి కాలంలో ఎంబ్రాయిడరీ చేయడం ఉందా అనుకుంటారు. కానీ ఆ కాలంలోనే హస్తకళాకారులు నైపుణ్యం ఆశ్చర్యచకితులను చేసేలా అద్భుతంగా ఉండేది. నాటి స్మృతుల్ని మరచిపోకుండా చేసేలా మన రాజరికపు దర్పానికి గుర్తుగా అలనాటి సాంప్రదాయ దుస్తులను చక్కటి బ్రాండ్ నేమ్‌తో అందరికీ చేరువయ్యేలా చేస్తోంది నందినిసింగ్. ఎవరీ నందిని సింగ్? ఎలా అలనాటి రాజరికపు సాంప్రదాయ దుస్తులను వెలుగులోకి తీసుకొస్తోందంటే..అవద్ రాజ కుటుంబానికి చెందిన నందిని సింగ్ కరోనా మహమ్మారి సమయంలో రాజుల కాలం నాటి దుస్తులకు సంబంధించిన బ్రాండ్‌ని నెలకొల్పింది. అంతేగాదు అలనాటి సాంప్రదాయ హస్తకళాకారులను ప్రోత్సహించడమే కాకుండా నాటి సాంప్రదాయ చీరలను ప్రస్తుత జనరేషన్ తెలుసుకునేలా మంచి బ్రాండ్ నేమ్‌తో పరిచయం చేస్తోంది. ఈ రాజరికపు సంప్రదాయ దుస్తులను చాస్మీ అనే బ్రాండ్‌తో ప్రదర్శిస్తోంది. ఈ బాండ్‌కి చెందిన దుస్తులు రాయల్ ఫేబుల్స్ వెడ్డింగ్ ఎడిట్లోనూ, ప్యాలెస్ అటెలియర్స్ అండ్ డిజైన్ స్టూడియోలలో ప్రదర్శనలిచ్చింది. ఈ మేరకు నందిని తన బ్రాండ్ జర్నీ గురించి మాట్లాడుతూ..తన గ్రామంలోని ఒక ఎన్జీవోకి సంబంధించిన పనిపై..ఝూన్సీ, లక్నో వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడూ.. ఎందరో హస్తకళకారులు తన వద్దకు వచ్చి తమ సమస్యను వివరించడంతో దీనిపై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చింది. అప్పుడే వారందర్నీ ఒక కమ్యూనిటీగా చేసి..షిఫాన్లు, ఆర్గాంజస్ వంటి బట్టలపై ఎంబ్రాయిడీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తట్టింది.. అది ఒకరకంగా వారికి పని కల్పించినట్లు అవుతుంది కూడా అని భావించింది నందిని. అందుకోసం అని హోల్‌సేల్ వ్యాపారులను సంప్రదించి మరీ హస్తకళకారులకు ఉపాధి దొరికేలా చేసింది. ఆ దుస్తులను చాస్మీ అనే బ్రాండ్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ పేరుని మహాభారతం నుంచి తీసుకుంది. ఆ పురాణ గాథలో శ్రీకృష్ణుడు అనే చా అస్మీ (నేను అన్నాను) అనే సంస్కృత పదాన్ని తన దుస్తులకు బ్రాండ్ నేమ్‌గా ఎంపిక చేసుకుంది. ఈ సంప్రదాయ డిజైన్లను మంచి బ్రాండ్ నేమ్‌తో తీసుకురావడంలో ప్రేరణ తన తల్లి, అమ్మమ్మ, అత్తలే కారణం అంటోంది. ఎందుకంటే వారు ధరించే ఎంబ్రాయిడరీ చీరలతో తనకున్న చిన్న నాటి జ్ఞాపకాలే దీన్ని ఫ్యాషన్వేర్గా తీసుకొచ్చేందుji దారితీసిందని చెబుతోంది. "ఇక ఈ చాస్మీ బ్రాండెడ్ చీరలను హస్తకళకారులు సింగిల్-థ్రెడ్ వర్క్ లేదా 'సింగిల్ టార్'తో ఎంబ్రాయిడరీ చేయడం విశేషం. అందుకోసం పట్టుదారాలను ఉపయోగిస్తారు. అయితే ఈ ఎంబ్రాయిడరీ ప్రక్రియ వేగవంతం అయ్యేలా ఎక్కువ దారాలను మిక్స్ చేయడం జరుగుతుంది. కానీ హస్తకళాకారులు మాత్రం సింగిల్ దారంతోనే ఎక్కువ సమయం కేటాయించి మరీ తీర్చిదిద్దుతారు. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది కూడా. అలాగే పిట్టా, జాలీ, రేషం ఎంబ్రాయిడరీతో సహా వివిద రకాల వర్క్‌లు చేస్తారు. అంతేగాదు శాలువాలు, లెహంగాలు, దుపట్టాలు, చీరలు, బ్లౌజ్‌లపై కూడా ఎంబ్రాయిడరీ చేస్తాం". అని నందిని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం అలనాటి రాజవంశ మహిళలు ధరించే ఎంబ్రాయిడరీ చీరలను ఎలా ఉంటాయో చూసేయండి. View this post on Instagram A post shared by Chaasmi (@chaasmiofficial) (చదవండి: కట్టడితో పిల్లలను గడప దాటేలా చెయ్యొద్దు..!) -
స్టార్ హోటల్ బాల్కనీలో ఎండకు బట్టలు : అయితే ఏంటట? వీడియో వైరల్
నగరాల్లోని అపార్టమెంట్లలో ఉండేవాళ్లు బట్టలు బాల్కనీలోనే ఆరేసుకోవాలి తప్పదు. కానీ స్టార్ హోటల్ అయినా, లగ్జరీ హోటల్ అయినా హోటల్‌కి వెళ్లినపుడు, తడి బట్టలు ఎక్కడ ఆరేయాలి. ఇది టూర్లలో, ప్రతీ తల్లికి ఉండే ఇబ్బందే. (ఎందుకంటే బట్టలు ఆరేయడం గురించి మగవాళ్లు పెద్దగా పట్టించుకోరు కాబట్టి) అయినా తప్పదు ఆరేయ్యాలి కదా.. తడి బట్టలు అలాగే పట్టుకెళ్లలేం. ముక్కి, వాసన వస్తాయి అందుకేనేమో దుబాయ్ వెళ్లిన ఒక తల్లి బట్టలు ఆరేయడం ఇంటర్నెట్లో చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టోరీ ఏంటంటే..ఇండియాకు చెందిన ఒక కుటుంబం దుబాయ్‌లో విహార యాత్రకు వెళ్లింది. అక్కడ అత్యంత ప్రసిద్దమైన, విలాసవంతమైన ‘అట్లాంటిస్, ది పామ్’ హోటల్లో దిగారు. అక్కడ పొద్దున్నే బాల్కనీలో మహిళ దుస్తులు ఆరేసింది. తన తల్లి బట్టలు ఆరేసిన వీడియోను పల్లవి వెంకటేశ్ అనే యువతి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘పొద్దున్నే అమ్మ పని ఇది’ అంటూ ఫన్నీగానే వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎక్కడైనా అమ్మ.. అమ్మే..తన బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోదు అని కొందరు కామెంట్ చేశారు. హాటల్లో అలా చేయడం మర్యాద కాదని కొందరు, ఈ అమ్మలు ఇంతే మారరు అని మరికొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pallavi Venkatesh (@iam.pallavivenkatesh) అయితే హోటల్ యాజమాన్యం స్పందన విశేషంగా నిలిచింది. తల్లి బాధ్యతలు అని కామెంట్ చేసింది. అలాగే దుస్తులు ఆరేసుకునేందుకు ప్రతి బాత్రూంలో డ్రైయింగ్ త్రాడును చేర్చుతాం తద్వారా అక్కడే దుస్తులను ఆరబెట్టుకోచ్చు అనే కూడా వివరణ ఇచ్చారు. ఏడు రోజుల కిందట పోస్ట్ అయిన ఈ వీడియో దాదాపు 12 మిలియన్ల వ్యూస్‌ను, లక్షకు పైగా లైక్స్‌ను దక్కించు కోవడం విశేషం. -
యూఎస్‌లోని సాయి దత్తపీఠం ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ
అమెరికాలోని సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం దుస్తుల పంపీణీ కార్యక్రమాన్ని చేపట్టింది. సమాజ సేవ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం యునీకో(UNICO) సౌత్ ప్లెయిన్ఫ్లీల్డ్ చొరవతో విజయవంతమయ్యింది. దీనికి సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం డైరెక్టర్ సుభద్ర పాటిబండ్ల, డెబ్బీ బాయిల్, క్రిస్టీన్ల తదితరులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ నిస్వార్థ ప్రయత్నాలు నిరుపేద కుటుంబాలకు మంచి ప్రయోజనం చేకూర్చడమే గాక కావాల్సిన దుస్తులు ఉపకరణాలను పొందగలుగుతారు.ఆయా సంఘం నుంచి వచ్చిన విశేష స్పందన ఫలితంగా దుస్తులతో నిండిన ట్రక్కులు తరలివచ్చాయి. ఈ పంపిణీకి సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉపేంద్ర చివుకుల, కమిషనర్ ఎమిరిటస్, మురళి మేడిచర్ల పూర్తి సహాయసహకారాలు అందించారు. ఇలాంటి కార్యక్రమాలు ఐక్యతను, సమాజ స్ఫూర్తి ప్రాముఖ్యతలను నొక్కి చెబుతాయని ఈ కార్యక్రమ నిర్వాహకులు అన్నారు. (చదవండి: యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!) -
అయోధ్య బాలరామునికి పెడన కలంకారి వస్త్రాలు
పెడన: అయోధ్య బాలరాముని ఆలయానికి కృష్ణా జిల్లా పెడన నుంచి సహజ సిద్ధ కలంకారి వస్త్రాలను పంపించగా వాటిని మంగళవారం అలంకరించినట్లు పెడన కోరమండల్ కలంకారి వస్త్ర సంస్థ యాజమాని పిచ్చుక వరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. అయోద్య బాలరాముని ఆలయానికి చెందిన డిజైనర్ సహజ సిద్ధ కలంకారి వస్త్రాలు కావాలని కోరడంతో ఇటీవల ఆల్ ఆవర్, ఫ్లోరల్ డిజైన్‌తో రూపొందించిన ఎరుపు వస్త్రాన్ని పంపించామన్నారు. 10.5 మీటర్ల వస్త్రాన్ని స్వామి వారికి అలంకరించి ఆలయ వర్గాలు ఫొటోలు పంపించారని తెలిపారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్ కలర్, శనివారం నీలం, ఆదివారం పింకు రంగులలోని వస్త్రాలను కావాలని సూచించారని, ప్రస్తుతం ఎరుపు రంగు వస్త్రాన్ని డిజైన్ చేసి పంపించామన్నారు. మిగిలిన రంగులలో వస్త్రాలను కూడా త్వరలోనే పంపుతామన్నారు. డాక్టర్ వైఎస్సార్ లైఫ్ ఎచీవ్మెంట్ అవార్డు గ్రహీత పిచ్చుక శ్రీనివాసరావు కుమారుడినయిన తనకు ఈ అవకాశం రావడం స్వామి అనుగ్రహమని వరుణ్ కుమార్ తెలిపారు. -
ప్రధాని మోదీ దగ్గర ఎన్ని జతల దుస్తులు ఉన్నాయి?
తన మాటల చతురతతోనే కాదు తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ప్రధాని మోదీ అందరినీ ఆకట్టుకుంటారు. ఇంతకీ ప్రధాని మోదీ దగ్గర ఎన్ని జతల దుస్తులు ఉన్నాయి? ఈ ప్రశ్నకు ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఏమి సమాధానమిచ్చారు?తన రాజకీయ జీవితంలో తాను 250 జతల దుస్తులు కలిగి ఉన్నానని తనపై ఒకమారు ఆరోపణ వచ్చిందని మోదీ తెలిపారు. ఈ ఆరోపణను కాంగ్రెస్ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అమర్‌సింగ్ చౌదరి చేశారని, ఓ బహిరంగ సభలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారని ప్రధాని మోదీ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఆ సమయంలో తాను ప్రజలతో.. ‘250 కోట్లు దోచుకున్న ముఖ్యమంత్రి కావాలా? లేక 250 జతల బట్టలు ఉన్న ముఖ్యమంత్రి కావాలా?’ అని అడిగానని మోదీ గుర్తుచేసుకున్నారు. అప్పుడు గుజరాత్ ప్రజలు 250 జతల దుస్తులు కలిగిన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పారన్నారు. ప్రధాని మోదీ ఆ ఇంటర్వ్యూలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. నాడు చౌదరి ఆరోపణలను తాను అంగీకరించానని మోదీ తెలిపారు. అయితే ఆ మాజీ ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలు చెప్పారని, ఆ రోజు జరిగిన బహిరంగ సభలో.. ఆయన చెప్పిన సంఖ్య(250)లో సున్నా తప్పు లేదా రెండు తప్పు అని తాను చెప్పానని మోదీ అన్నారు. అయినప్పటికీ ఆ ఆరోపణను స్వీకరిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.ప్రధాని డ్రెస్సింగ్ స్టైల్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. మోదీ నెలకు రూ.1.6 లక్షల జీతం తీసుకుంటూ, అత్యంత ఖరీదైన దుస్తులు ధరిస్తున్నారని ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాగా బ్రాండ్ మోదీ గురించి ప్రధానిని అడిగినప్పుడు, బ్రాండ్ అంటే ఏమిటో? అది ఎలా పనిచేస్తుందో తనకు తెలియదన్నారు. జనం మోదీ జీవితాన్ని, పని తీరును చూస్తున్నారన్నారు. ఒక రాష్ట్రానికి 13 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి.. వృద్ధురాలైన తన తల్లి చివరి రోజుల్లో ఉన్నప్పుడు తల్లితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో గడపడానికి మించిన బ్రాండ్ ఏముంటుందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. దీనిని చూసి తన జీవితం భిన్నమైనదని దేశం అర్థం చేసుకున్నదని మోదీ పేర్కొన్నారు. -
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: గుజరాత్ సీఎంగా ఉన్నపుడు తాను ధరించే దుస్తుల విషయంలో మాజీ సీఎం ఒకరు తనపై చేసిన ఆరోపణలను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘మోదీకి 250 జతల దుస్తులు ఉన్నాయంటూ మాజీ సీఎం అమర్‌సిన్హా చౌధరీ అప్పట్లో ఆరోపించారు. అది నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోపణ. నాపై వచ్చిన ఆరోపణలను అంగీకరిస్తున్నట్లు ఓ బహిరంగ సభలో చెప్పాను. రూ. 250 కోట్లు దోచుకునే సీఎం కావాలా? 250 జతల దుస్తులున్న సీఎం కావాలా? అని ప్రజలను అడిగాను. ప్రజలు మాత్రం 250 జతల దుస్తులున్న సీఎం పనిచేస్తాడంటూ ముక్తకంఠంతో నినదించారు. ఆ తర్వాత నాపై ఆరోపణలు చేసే ధైర్యం ప్రత్యర్థులు చేయలేదు’ అని మోదీ పాత స్మృతులను పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ తాజాగా గుర్తు చేసుకున్నారు. -
Summer Special: వేసవిని తట్టుకునేలా.. కంఫర్ట్ & స్టైలిష్‌గా లాంగ్ ఫ్రాక్స్
వేసవి వేడిమిని తట్టుకోవాలి, కంఫర్ట్‌గా ఉండాలి అదే టైమ్‌లో స్టైలిష్‌గానూ కనిపించాలి. కాటన్ కుర్తీ పైకి బాందినీ, చందేరీ, ఇకత్, సిల్క్ ఓవర్ కోట్లు ఇప్పుడు బెస్ట్ ఛాయిస్‌గా ఉంటున్నాయి. బోహోస్టైల్ని తలపిస్తూ, సమ్మర్ స్పెషల్‌గా ఉండే ఈ స్టైల్ ఏ సందర్భానికైనా బాగా నప్పుతుంది.కలర్ఫుల్గా.. కంఫర్టబుల్‌గా..సంప్రదాయ వేడుకల్లో షిమ్మరీ లుక్ ఉండే లాంగ్ ఫ్రాక్ట్, వాటి మీదకు సిల్క్ డిజైనర్ లాంగ్ ఓవర్ కోట్స్ ప్రత్యేకతను చూపుతాయి.లాంగ్ ఫ్రాక్ లేదా లాంగ్ కుర్తీ ఈ స్టైల్‌కి ఎంచుకోవచ్చు. సౌకర్యాన్ని బట్టి స్లీవ్స్ లేదా స్లీవ్‌లెస్ టాప్స్‌ని సెలక్ట్ చేసుకోవాలి. కాటన్ కుర్తీ ఏ ఫ్యాబ్రిక్ అయినా ఫ్లోరల్స్లో లేదా భిన్నమైన ప్రింట్లు ఉన్న ఓవర్ కోట్స్ బాగా నప్పుతాయి. ఈ స్టైల్ డ్రెస్సింVŠ బోహో లుక్‌తో అట్రాక్ట్ చేస్తుంది. ఈ కాలానికి తగినట్టుగా ఫ్యాషన్ జ్యువెలరీ దీనికి సరైన ఎంపిక అవుతుంది.కాటన్ కుర్తీ–పైజామా మీదకు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న కాటన్ ఓవర్‌కోట్‌ను ధరించవచ్చు. దుపట్టా అవసరం లేని ఈ స్టైల్ క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ సెట్ అవుతుంది.కాటన్ లాంగ్ కుర్తీకి ఇక్కత్ లాంగ్ ఓవర్ కోట్ ధరిస్తే ఉక్కబోతను, స్టైల్‌ని రెండింటినీ బ్యాలెన్స్ చేయవచ్చు.సింపుల్ అండ్ గ్రేస్‌గా కనిపించే లుక్ టాప్ అండ్ బాటమ్‌కి ఫ్లోరల్ ఓవర్ లాంగ్ కోట్ సూపర్ స్టైలిష్ లుక్‌గా కనిపిస్తుంది. ప్లెయిన్ డ్రెస్ ధరించినప్పుడు పూర్తి కాంట్రాస్ట్ ఓవర్ కోట్ వేసుకుంటే ఎక్కడ ఉన్నా స్పెషల్‌గా కనిపిస్తారు.లాంగ్ ఫ్రాక్‌కి అటాచ్ చేసినట్టుగా ఉండే ఫ్రాక్ స్టైల్ ఓవర్ కోట్ పార్టీలో స్టైలిష్ లుక్‌తో వెలిగిపోతుంది.ఓవర్కోట్లా అనిపించే లాంగ్ ఫ్రాక్ డ్రెస్‌ను కూడా ఈ స్టైల్‌కి ఎంపిక చేసుకోవచ్చు. సమ్మర్లో ఈవెనింగ్ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్‌గా వెలిగి΄ోవచ్చు.సిల్క్ టాప్స్ అయినా ఈవెనింగ్ టైమ్‌కి ఓకే అనుకున్నవారు అదే కాంబినేషన్లో వచ్చే సిల్క్ ఓవర్ కోట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.ఇదీ చదవండి: Madhumita Murgia: డీప్‌ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు! -
ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె స్టయిలే వేరు; రూ. 50వేలనుంచి 35కోట్ల దాకా
పురుషులతో తామేమీ తక్కువ కాదంటూ చిన్నవయసులో మహిళా పారిశ్రామికవేత్తలుగా పలువురు యువతులు ముందుకు వస్తున్నారు. తమ అభిరుచికి తగ్గట్టు, ఆధునిక శైలిని అవగాహన చేసుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్న వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో దుస్తుల బ్రాండ్‌తో కోట్లు సంపాదిస్తున్న పరి పూనమ్ చౌదరి ఒకరు. ఆమె సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం! ఫ్యాషన్ పరిశ్రమ ఎప్పుడూ డైనమిక్‌గా ఉండాలి. వినియోగదారుల ప్రాధాన్యతలే మార్కెట్‌కు ప్రాణం. యుక్తవయసులో ఉన్నప్పటినుంచి పరికి మహిళలను ఆకట్టుకునే ఫ్యాషన్, అందమైన దుస్తులను తయారు చేయడం అంటే ఇష్టం. 13 ఏళ్లకు సొంతంగా తనకుంటూ ఒక బ్రాండ్ఉండాలనే ఆలోచన మొదలైంది. ఆ పట్టుదలే 23 ఏళ్లకే దేశంలోనే అత్యంత ప్రియమైన దుస్తుల బ్రాండ్ బునాయ్కు నాంది పలికింది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రాణిస్తోంది. బునాయ్ ఏర్పాటు, సక్సెస్ సుమారు 5-6 సంవత్సరాలు ఇతర సంస్థలకు పనిచేసినఅనుభవంతో 2016లో పరి చౌదరి కేవలం ముగ్గురితో కలిసి బునాయ్ని లాంచ్ చేసింది. అప్పటినుంచి ఆ టీమ్ అలా పెరుగుతూ వందలాదిమందికి చేరింది. కేవలం 50 వేల పెట్టుబడితో కుర్తా సెట్లు, లెహంగాలు లాంటివాటితో వ్యాపారాన్ని మొదలు పెట్టింది. రాజస్థానీ, జైపూర్, డిజైన్స్, చందేరి నుండి ఎంబ్రాయిడరీ దాకా వివిధ రకాల ఫ్యాబ్రిక్లను అందిస్తూ, బునాయ్ నైట్‌వేర్, ఇతర యాక్సెసరీస్, జ్యెయల్లరీని జోడించింది. హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్, హ్యాండ్-డైడ్, హ్యాండ్పెయింటెడ్, ఆకర్షణీయంగా అందమైన డిజైన్లు, సిగ్నేచర్ స్టైల్ కలర్స్, కాటన్ ఫ్యాబ్రిక్ ఇలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆదరణ పొందింది. ఆధునిక శైలి, సంప్రదాయకళను మిళితం చేస్తూ స్టైలిష్ ఫ్యాషన్ ప్రపంచంలో బునాయ్ను పరుగులు పెట్టిస్తోంది. అంతేనా క్లాసిక్ బట్టల నుండి హెయిర్, స్టైలిష్ హోమ్ డెకార్ దాకా మంచి నాణ్యత ,స్టైల్‌ని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ‘బునాయ్’ వినపడేలా చేసింది. 2021లో 12 కోట్టుగా ఉన్న బునాయ్ ఆదాయం కాస్త 2022లో 35 కోట్లకు పెరిగిందంటేనే ఈ బ్రాండ్‌కు లభించిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఇండోర్, జైపూర్‌లో రెండు స్టోర్లను కూడా ప్రారంభించారుబునాయ్ 800 విభిన్న ఉత్పత్తులతో దాదాపు 90K కస్టమర్ల బేస్‌తో రాణిస్తోంది. సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్, శివలీకా ఒబెరాయ్, రిధి డోగ్రా, దివ్యాంక త్రిపాఠి లాంటి ప్రముఖులు బునాయ్ స్టైల్స్ ఫ్యాన్స్. అంతేకాదు అనేక బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ , బిజినెస్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది పరి చైదరి. స్థానిక కళాకారులచేత,రాజస్థానీ సంస్కృతి మూలాలతో ముడిపడి ఉన్న ప్రాంతాల ద్వారా ఉత్తమంగా తయారు చేస్తాం. అన్నీ ఉత్పత్తులు ప్రేమతో చేతితో తయారు చేసినవే. మెటీరియల్ నాణ్యతలో కూడా రాజీలేదు. ఫెయిర్‌ట్రేడ్, హెరిటేజ్, మేడ్ ఇన్ ఇండియా,సుస్థిరత ,మహిళా సాధికారత ఇవే తమ కంపెనీ బలం - పరి పూనం చౌదరి పరి చౌదరి విద్య పరి జైపూర్‌లోని నీర్జా మోడీ స్కూల్లో తన పాఠశాల విద్యను, ఆ తరువాత, IIS విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది. ఫ్యాషన్/అప్పరల్ డిజైన్ చ విజువల్ ఆర్ట్స్ & స్టిల్ ఫోటోగ్రఫీలో నైపుణ్యం సాధించింది. 2019లో ఉన్నత చదువుల కోసం యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్‌కు వెళ్లింది. ఇక్కడే ఈమె వ్యాపార ఆలోచనలకు మరింత పదును ఏర్పడింది. లగ్జరీ బ్రాండ్లకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ఫ్యాషన్ మీడియా స్టైలింగ్ , ఫ్యాషన్ కొనుగోలు మరియు అమ్మకాలపై దృష్టి సారించింది. బునాయ్ ప్రారంభించే ముందు దాదాపు 3 సంవత్సరాలు అర్బన్ విమెన్ కంపెనీలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. ఫ్యాషన్ ప్రపంచంలో తన అనుభవం ఇతరులకు ఉపయోగపడాలని, ప్రతిభ , వాస్తవికత మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడాలని కోరుకుంటోంది. -
రిపబ్లిక్ డే స్పెషల్.. 'మూడు రంగుల ముస్తాబు'
దేశీయ స్ఫూర్తి కోసం ఈ రోజు ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు తిరంగా రంగులను ట్రై చేయచ్చు. అయితే ఆరెంజ్, తెలుపు, పచ్చ మూడు రంగులను ఒకే డ్రెస్‌లో ఉండాలనుకునేవారు కొందరైతే, ఒకే కలర్ కాన్సెప్ట్‌తో స్పెషల్‌గా వెలిగిపోవాలనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాగని, గాఢీగా కాకుండా లేత రంగుల ప్రత్యేకతతోనూ మెరిసిపోవాలనుకుంటారు. అభిరుచికి తగినట్టుగా డ్రెస్‌ను ఎంపిక చేసుకునే స్పెషల్ డే కి స్పెషల్ లుక్. యాక్ససరీస్.. ► ఔట్ఫిట్స్లో ట్రై కలర్స్‌కి నో చెప్పేవాళ్లు ఇతర అలంకరణలో ప్రత్యేకతను చూపవచ్చు. అందుకు ట్రై కలర్ గాజులు, బ్రేస్లెట్స్ మంచి ఎంపిక అవుతుంది. ట్రై కలర్స్‌లో నెయిల్‌పాలిష్ డిజైన్‌నూ ఎంచుకోవచ్చు. ► వైట్ కుర్తా మీదకు ట్రై కలర్ దుపట్టా ఒక మంచి ఎంపిక అవుతుంది. ప్రత్యేకంగానూ ఉంటుంది. ► పూర్తి వైట్ గాగ్రా చోళీ లేదా మూడు రంగుల కలబోతగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయచ్చు. ► ఆరెంజ్ కలర్ శారీ, వైట్ కలర్ బ్లౌజ్ లేదా సేమ్ ఆల్ ఓవర్ ఒకే కలర్‌ని ఎంచుకోవచ్చు. ► జీన్స్ మీదకు గ్రీన్ కలర్ కుర్తా లేదా లాంగ్ ఓవర్ కోట్, ట్రై కలర్ జాకెట్ ధరించినా చాలు. ప్రఖ్యాత డిజైనర్స్ సైతం తమ డిజైన్స్‌లో తెలుపు, పచ్చ, ఆరెంజ్‌ల ఒకే కలర్ కాన్సెప్ట్‌తో డిజైన్ చేస్తుంటారు. సందర్భాన్ని బట్టి మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ ఔట్‌ఫిట్‌ను మనమే సొంతంగా రీ డిజైన్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
ఫ్యాషన్ ట్రెండ్స్: పాత బట్టలను కొత్తగా మార్చేయొచ్చు..
కొత్తగా మెరిసిపోవాలంటే కొత్త డ్రెస్సులు వేసుకోవాల్సిందేనా! ట్రెండ్‌కు తగినట్టు ఉండాలంటే మార్కెట్లో రెడీమేడ్‌గా ఉండే వాటిని కొనుగోలు చేయాల్సిందేనా! ఈ మాటలకు కాలం చెల్లిపోయేలా వినూత్నంగా ఆలోచన చేస్తున్నారు నేటి మహిళలు. పర్యావరణ అనుకూలంగా ఫ్యాషన్‌లోనూ మార్పులు చేసుకుంటున్నారు. అప్‌సైక్లింగ్ పేరుతో పాత డ్రెస్సులను, చీరలను కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. ఈ యేడాది వచ్చిన ఈ మార్పు రాబోయే రోజులను మరింత పర్యావరణ హితంగా మార్చేయనున్నారు అనేది ఫ్యాషన్ డిజైనర్ల మాట. పాత వాటిని కొత్తగా మెరిపించడంలో ఖర్చు కూడా తగ్గుతుంది. పర్యావరణంపై కార్బన్ ఉద్గారాల ప్రభావమూ తగ్గుతుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మన దగ్గర ఉన్న డ్రెస్సులనే కొత్తగా మార్చేయవచ్చు. చిన్నపాటి సృజనతో డ్రెస్సింగ్‌లో మెరుగైన మార్పులు తీసుకురావచ్చు. డెనిమ్.. ప్యాచ్ పాతవి అనే పేరే గానీ చాలామంది ఇళ్లలో పక్కన పెట్టేసిన డెనిమ్ జాకెట్స్, ప్యాంట్స్, కుర్తాలు.. ఉంటాయి. వాటిని తిరిగి ఉపయోగించుకోవాలంటే రకరకాల మోడల్స్‌ని తయారు చేసుకోవచ్చు. ప్యాచ్‌వర్క్‌తో రీ డిజైనింగ్ చేసి ఓవర్‌కోట్స్ లేదా హ్యాండ్ బ్యాగ్స్ డిజైన్ చేసుకోవచ్చు. శారీ ఖఫ్తాన్ కుర్తాల మీదకు సిల్క్ ష్రగ్స్ లేదా లాంగ్ ఓవర్ కోట్స్ వాడటం ఇండోవెస్ట్రన్ స్టైల్. పాత సిల్క్ లేదా కాటన్ చీరలను కూడా లాంగ్ కోట్స్‌కి ఉపయోగించ వచ్చు. అలాగే, ఖఫ్తాన్ డిజైన్స్‌కి కూడా శారీస్‌ను వాడచ్చు. పర్యావరణ అనుకూలం ఆర్గానిక్ కాటన్స్, వీగన్ క్లాత్స్.. స్లో ఫ్యాషన్ కిందకు వస్తాయి. వీటితో చేసే డిజైన్స్‌లో ప్రత్యేకంగా మెరిసిపోవడమే కాదు పర్యావరణ ప్రేమికులుగా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మన దగ్గర ఉన్న పాత బట్టలను ఎలా తీసేయాలా అనుకునేవారు కొందరు, అవసరమైన వారికి తక్కువ ధరకు అమ్ముదాం అనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాంటివాళ్లకోసం కొన్ని వెబ్స్టోర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్స్ అమ్మకందారుల దగ్గర నుంచి దుస్తులు సేకరించి కావల్సిన వారికి అందజేసే మాధ్యమంగా పనిచేస్తున్నాయి. -
పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
జైపూర్: పార్లమెంట్లో అలజడి సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఫోన్లను దహనం చేసిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ కాలిపోయి శిథిలావస్థలో ఉన్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బట్టలు కాల్చి వేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. Parliament security breach: Police recover burnt phone parts of accused in Rajasthan Read @ANI Story | https://t.co/Jpwc9HIqR6#ParliamentSecurityBreach #Parliament #LokSabha #RajyaSabha pic.twitter.com/OkVJKYfMM7 — ANI Digital (@ani_digital) December 17, 2023 పార్లమెంట్లో మొత్తం ఏడుగురు నిందితులు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. లోక్‌సభ లోపల, పార్లమెంట్ ఆవరణలో పొగ బాంబులతో నిందితులు అరాచకం సృష్టించే పనిచేశారు. ఒంటికి మండే లేపనాలు పూసుకుని ఆత్మాహుతికి పాల్పడటానికి ప్రయత్నించారు. కానీ చివరికి స్మోక్ క్యానిస్టర్లను ప్రయోగించాలని నిర్ణయానికి వచ్చారు. సాగర్ శర్మ, డి.మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, ప్రధాన నిందితుడు లలిత్ ఝాలను పోలీసు ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం విచారిస్తోంది. నిందితులకు ఏడు రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్‌సభ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్‌సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్ రీ కన్స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. లలిత్‌కు సహకరించిన మహేశ్ కుమావత్, కైలాశ్‌లకు క్లీన్చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. లలిత్‌ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్‌లో తలదాచుకున్న నగౌర్‌కు కూడా తీసుకెళ్లారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు దేశంలో అరాచకం సృష్టించాలని భావించినట్లు కీలక సూత్రధారి లలిత్ ఝా కస్టడీ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు తెలిపాడు. లలిత్ ఝా తన ఫోన్‌ను ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు. ఇతర నిందితుల ఫోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా కైలాష్ చౌదరి -
క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే సౌకర్యాల వేర్!
సాధారణంగా రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారెవరైనా... ‘ఇన్నాళ్లూ పనిచేసి అలసిపోయాం, ఇక విశ్రాంతి తీసుకుందాం’ అనుకుంటారు. అయితే సుకన్య, సంధ్యారావులు మాత్రం ఇలా అనుకోలేదు. రిటైర్మెంట్ తరువాత కొత్త వ్యాపారం చేయాలనుకున్నారు. అరవై ఏళ్లకు దగ్గరలో ఉన్నా వారిలోని హుషారు, ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అక్క సుకన్య ఎమ్మెస్సీ చేసింది. దానికితోడు టీచింగ్, ఫార్మా, ఆడిటింగ్, ఆర్ట్స్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. టెక్స్టైల్ టెక్నాలజీ ఇంజినీర్ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్‌లో పనిచేసిన అనుభవం వాటికి తోడైంది. అయితే అనుకోకుండా ఎదురైన ఒక సంఘటన వల్ల వారు క్యాన్సర్ రోగులకు ముఖ్యంగా స్త్రీలకు అవసరం అయిన ప్రత్యేక తరహా దుస్తులను రూపొందిస్తూ తమ వైవిధ్యాన్ని కూడా చాటుకుంటున్నారు. అత్తయ్య అవస్తలు చూసి... దుస్తుల పరిశ్రమలో ఇరవై ఏళ్లపాటు పనిచేసిన సంధ్య తనకు తనే బాస్ కావాలి అనుకునేది. ఈ క్రమంలోనే ఏదైనా దుస్తుల తయారీ కంపెనీ పెడితే బాగుంటుందని అనుకున్నారు అక్కాచెల్లెళ్లు. వీరు ఇలా ఆలోచిస్తున్న సమయంలో... వీరిద్దరికీ ఎంతో ఇష్టమైన వీరి మేనత్తకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. సుకన్య, సంధ్యలకు మంచి స్నేహితురాలిలా ఉండే మేనత్త క్యాన్సర్‌తో బాధపడడం వారిని కలచి వేసింది. ఒకపక్క క్యాన్సర్ బాధిస్తుంటే మరోపక్క ఆమె ధరించే దుస్తులు ఆమెకు సౌకర్యంగా లేకపోవడాన్ని ఇద్దరూ గమనించారు. క్యాన్సర్‌తో బాధపడే ఎంతోమంది రోగులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్ రోగులు ధరించడానికి వీలుగా ఉండే దుస్తులు రూపొందిస్తే వందలాది మంది క్యాన్సర్ రోగులకు సాయం చేసినట్లే అనుకుని ‘వీకీ వేర్’ పేరిట క్యాన్సర్ రోగులకు దుస్తులు తయారు చేయడం ప్రారంభించారు. సలహాలు... సూచనలతో... ఆంకాలజిస్టులు, క్యాన్సర్ రోగుల సలహాలు, సూచనలు తీసుకుని 2017లో తలకు పెట్టుకునే టోపీని రూపొదించారు. కాటన్‌తో తయారు చేసిన ఈ టోపీని కీమోథెరపీ చేయించుకునేటప్పుడు ధరించడానికి అనుకూలంగా తయారు చేశారు. తరువాత మాస్టెక్టమీ బ్రాలను రూపొందించారు. చర్మానికి సౌకర్యంగా ఉండే బ్రాలను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా క్యాన్సర్ రోగులకు అవసరమైన వాటిని స్వయం సహాయక గ్రూపులతో తయారు చేయిస్తూ సాటి మహిళ లకు ఉపాధి కల్పిస్తున్నారు. వీరి వీకీ వేర్ ఉత్పత్తులు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. రోగులకు ఇలా... వీకీ వేర్ ఉత్పత్తులు తయారయ్యాక క్యాన్సర్ రోగులకు టెస్టింగ్ కోసం పంపించి, వారికి అన్నివిధాల సౌకర్యంగా ఉన్నాయన్న నిర్ధారణ అయిన తరువాత మార్కెట్లో విక్రయిస్తున్నారు. క్యాన్సర్ కేర్ ఆసుపత్రుల్లోని డాక్టర్లను కలిసి వీకీ వేర్ గురించి చెప్పడం, క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్న రోగులకు వాటిని ఇవ్వడం ద్వారా వీకీ వేర్ రోగులకు చేరుతున్నాయి. వీకీ వేర్ వెబ్సైట్, సోషల్ మీడియా, ఈ కామర్స్ సైట్ల ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తున్నారు సుకన్య, సంధ్యారావులు. ‘‘మీ కలలను ఎప్పటికీ వదులుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు కంటోన్న కల మీద నమ్మకం ఉంచండి. అది తీరడానికి సుదీర్ఘ కాలం పట్టవచ్చు. అయినా వెనక్కి తగ్గవద్దు. కలను నిజం చేసుకునే క్రమంలో ఎవరినైనా సాయం అడగడానికి సిగ్గుపడవద్దు. ఇలా నిజాయితీగా ముందుకు సాగితే వ్యాపారం ఏదైనా రాణించగలుగుతారు’’ అని సుకన్య, సంధ్యలు యువతరానికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. (చదవండి: పడుకునే ముందు ముఖం కడుగుతున్నారా? ) -
గడ్డిదారంతో దుస్తులు.. పట్టుపురుగులొద్దు, పత్తి వద్దు. పాలిస్టర్ వద్దు
‘పట్టు కోసం పట్టుపురుగుల ్రపాణాలు తీయవద్దు. పత్తి కోసం రైతులు కష్టాలను కొని తెచ్చుకోవద్దు. మట్టిలో కలవడానికి మొరాయిస్తుంది పాలియెస్టర్. ఆ దుస్తులతో పర్యావరణానికి హాని కలిగించద్దు.గడ్డి దారంతో ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్ తీసుకువద్దాం.స్టైల్ స్టేట్మెంట్కి కొత్త నిర్వచనం ఇద్దాం’... ...అంటోంది నేచర్ లవర్ శృతి రావల్. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన శృతి అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించింది. పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే తన సంకల్పానికి వస్త్ర ప్రపంచాన్ని వేదికగా మార్చుకుందామె. ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పట్ల తన ఆసక్తిని సాక్షితో పంచుకున్నదీ యువతి. ఫ్యాషన్ – పర్యావరణం ‘‘నేను పుట్టింది హరియాణాలోని పంచకుల. అమ్మ పుట్టిల్లు పంజాబ్. నాన్నది హరియాణా. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేటప్పటికి నేను సిక్తŠస్ క్లాస్‌లో ఉన్నాను. ఇక నా చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడిపోయింది. ఫ్యాషన్ ప్రపంచాన్ని బాగా అధ్యయనం చేసే కొద్దీ ఈ ఇండస్ట్రీ నుంచి పర్యావరణానికి కలిగే హాని అర్థమైంది. చాలా ఆందోళన కలిగింది. మన వస్త్రాల మోజు భూమిని అతలాకుతలం చేస్తోంది. భూమాతను కలుషితం చేస్తున్న ఇండస్ట్రీలలో ఫ్యాషన్ ఇండస్ట్రీ రెండవది. దీనికి పరిష్కారం ఈ రంగంలోనే వెతకాలనిపించింది. పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని చూపించాలనేదే నా ప్రయత్నం. నా స్టూడియోకి ‘ఎవోక్’ అని పేరు పెట్టడంలోని ఉద్దేశం కూడా పర్యావరణం పట్ల నిద్ర మేల్కొనండి’ అని పిలుపునివ్వడం. రిస్క్ అని హెచ్చరించారు! ఎవోక్ ్రపాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్. ఈ ఎకో ఫ్రెండ్లీ క్లోతింగ్ స్టూడియోని 2020 మార్చిలో ్రపారంభించాను, అదే నెలలో లాక్డౌన్ మొదలైంది. ఆ మెటీరియల్‌తో మాస్కులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి విరాళంగా ఇచ్చాను. ఈ ్రపాజెక్టు ్రపారంభానికి ముందే... ‘రిస్క్ చేస్తున్నావు’ అన్నారు తెలిసిన వాళ్లందరూ. పర్యావరణ పరిరక్షణ గురించి దశాబ్దాలుగా చెప్తున్నా కూడా సమాజంలో తగినంత చైతన్యం రానేలేదు. ఈ గడ్డి దుస్తుల గురించి అసలే తెలియదు. రంగు భరోసా, వస్త్రం మన్నిక ఉంటుందని కూడా తెలియదు. అలాంటప్పుడు మార్కెట్ ఎలా? పెట్టుబడి వెనక్కి వచ్చేదెప్పటికి? అన్నారు. అందరూ అలా అనుకుని తమను తాము సేఫ్జోన్లో ఉంచుకుంటే చాలా? బాగా లాభాలు వచ్చే రంగాన్నే ఎంచుకోవాలనే స్వార్థం తప్పు కాదు. కానీ లాభాల కోసం కొన్నేళ్లపాటు ఎదురు చూడగలిగిన ఆర్థిక పరిపుష్టి ఉన్నవాళ్లయినా ఒక ప్రయత్నం చేయాలి. ఇరవై ఏళ్ల కిందట ఎవరూ ముందుకు రాకపోతే మనం ఈ రోజు ఎలక్ట్రానిక్ వెహికల్‌ను వాడగలిగేవాళ్లమా? అలాగే వీగన్ డైట్ గురించి కూడా ఎంతోమంది సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చైతన్యవంతం చేశారు. నేను కూడా గత నెల 23వ తేదీన హెంప్, బెంబెర్గ్, టెన్సెల్, సిట్రస్ పీల్ వస్త్రాలతో రూపొందించిన డిజైనర్ వేర్‌తో ఫ్యాషన్ పెరేడ్ నిర్వహించాను. ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉద్యమంలో మమేకమయ్యే క్రమంలో నేను వెజిటేరియన్‌గా మారిపోయాను’’ అని చెప్పింది శృతి. ‘భవిష్యత్తులో మనం ప్రతి విషయంలోనూ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిందే. అందులో భాగంగా నేను నా ఫ్యాషన్ రంగాన్నే మాధ్యమంగా ఎంచుకున్నాను’ అని చె΄్పారు శృతి రావల్. ఆకులతో దారం ! ఒక రైతు పొలం దున్ని పత్తి పంట వేసి ఒక కేజీ పత్తి పండించాలంటే ఇరవై వేల లీటర్ల నీరు కావాలి. ఒక టెక్స్టైలర్ ఒక టీ షర్టుకి రంగులద్దడానికి రెండున్నర వేల లీటర్ల నీరు కావాలి. పత్తి పండడానికి పట్టే నీటిని భూమి పీల్చుకుంటుంది, ఇది కొంతలో కొంత నయం. కానీ హాట్ డైయింగ్ పద్ధతిలో రసాయన రంగులద్దిన నీరు భూమిని కలుషితం చేస్తుంది. అందుకే నేను గడ్డి మొక్కల దారంతో వడికిన వస్త్రాలను పరిచయం చేస్తున్నాను. మనదేశంలో ఇలాంటి సంస్థలు నాలుగైదుకి మించిలేవు. ఇక పూర్తి స్థాయి హెంప్ (నార) క్లోతింగ్ స్టూడియో హైదరాబాద్‌లో ఇదొక్కటే. ఆకులను శుభ్రం చేసే ్రపాసెస్లో బూజు పట్టకుండా సహజసిద్ధమైన వనరులనే జత చేస్తారు. ఎండిన ఆకులతో దారం వడుకుతారు. మొక్కల ఆకుల దారంతో వస్త్రాలు తయారు చేసే పరిశ్రమలు మనదేశంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో మాత్రమే ఉన్నాయి. ఈ గడ్డి రకం మొక్కలు పత్తిలాగ ఎక్కువ నీటిని తీసుకోవు, పత్తికంటే త్వరగా పెరిగి చేతికి వస్తాయి. వీటి పరిరక్షణ కోసం శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఈ దారం ఇప్పుడు చైనా నుంచి దిగుమతి అవుతోంది. ఈ దుస్తులు ఎలా ఉంటాయోననే ఆందోళన అక్కర్లేదు. నేను ధరించింది హెంప్ వీవింగ్ డ్రస్సే. క్లాత్ మీద డిజైన్లు నేను రూపొందించి డిజిటల్ ప్రింట్ చేయిస్తాను. కోల్డ్ డై కలర్స్ కాబట్టి క్లాత్‌తోపాటు ఎక్కువ కాలం మన్నుతాయి. – శృతి రావల్, ఫౌండర్, ఎవోక్ స్టూడియో,హైదరాబాద్ - – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వానకు తడిచిన బట్టల నుంచి వాసన రాకుండా ఇలా చేయండి..
ఇంటిప్స్ ►వానాకాలంలో బట్టలను ఉతికాక కర్పూరం కలిపిన నీటిలో జాడించడం వల్ల దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. ► ఆరీ ఆరని దుస్తులను ఇస్త్రీ చేసినా అదోవిధమైన వాసన వస్తాయి. అందువల్ల దుస్తులు పూర్తిగా ఆరిన తర్వాతనే ఐరన్ చేయాలి. ► అల్మారాలో బట్టలను పెట్టేముందు అక్కడక్కడ కొన్ని కర్పూరం బిళ్లలు ఉంచాలి. దీనివల్ల చిమటల వంటి కీటకాలు చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా బట్టల్లో దుర్వాసన తొలగితుంది. -
ఆ ఊర్లో మహిళలు దుస్తులే ధరించరు.. 5 రోజుల పాటు!
భారతదేశంలోని నివసిస్తున్న ప్రజలు.. వారు పాటించే ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు ప్రాంతం బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇక ప్రత్యేకించి గ్రామాల్లో నివసించే ప్రజలు వారి ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఒక వింత ఆచారాన్ని స్థానికులు పాటిస్తున్నారట. సంవత్సరంలో కొన్ని రోజులు అక్కడి మహిళలు దుస్తులు ధరించరట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఆచారాన్ని అక్కడి వాళ్లు పాటిస్తున్నారు. అయితే దీనికి వెనుక ఒక కారణముందని అంటున్నారు. అదేంటంటే..! ఈ గ్రామం ఎక్కడ ఉంది? అవును, మనం మాట్లాడుకుంటున్న గ్రామం పరాయి దేశంలో కాదు, మన దేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలోని పిని అనే గ్రామంలో, శతాబ్దాలుగా ఒక సంప్రదాయం కొనసాగుతోంది, ఇందులో మహిళలు సంవత్సరంలో 5 రోజులు దుస్తులు ధరించరు. ఈ ఐదు రోజులు పిని గ్రామానికి బయటి వ్యక్తులెవరూ రాలేరు. ఈ ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలు కూడా దాన్ని కచ్చితంగా పాటిస్తున్నారు. మహిళలు బట్టలు ధరించరు ఈ ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరించరు. మహిళులు వారి ఇంటి వద్దనే ఉంటారు, బయటకు రారు. మరోవైపు ఈ ఐదు రోజులు నియమనిష్టలతో ఈ ఆచారాన్ని మహిళలు కొనసాగిస్తారట. ఈ సమయంలో స్త్రీలే కాదు, పురుషులు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. అలాంటి వారు మద్యం తాగలేరు, నాన్ వెజ్ తినరు. అంతే కాదు ఈ ఐదు రోజులు భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. గ్రామస్తులు ఈ సంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారు? గ్రామస్తుల ప్రకారం, ఈ సంప్రదాయం పాటించకపోతే కొన్ని రోజుల తర్వాత మహిళకు చెడు జరుగుతుందని అక్కడి గ్రామస్తులు నమ్ముతున్నారు. ఇది పాటిస్తున్నప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు చూసి నవ్వకూడదట. పురుషులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించడం తప్పనిసరి. సంప్రదాయం చరిత్ర సంప్రదాయ చరిత్ర పుటలు ఆసక్తికరంగా ఉన్నాయి. శతాబ్దాల క్రితం తమ గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించాయి. గ్రామంలోని వివాహిత స్త్రీలకు అందమైన దుస్తులు ధరింపజేసి రాక్షసులు ఎత్తుకెళ్లేవారట. అప్పుడు లహువా ఘోండ్ అనే దేవత ప్రత్యక్షమై ఆ రాక్షసులను ఓడించి మహిళలను విడిపించిందట. అప్పటి నుంచి మహిళలు అందమైన దుస్తులు ధరిస్తే రాక్షసులు వస్తారని, అందుకే సంవత్సరంలో 5 రోజులు మహిళలు బట్టలు లేకుండా ఉంటారని అక్కడి గ్రామ పెద్దలు చెబుతున్నారు. చదవండి: చైనా కంపెనీ వింత నిబంధన: అఫైర్లు వద్దు.. విడాకుల మాటే ఎత్తొద్దు...! -
ఆ డైరెక్టర్ లోదుస్తులు చూపించమన్నాడు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో మెప్పించింది. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను 2018లో పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కూతురు కూడా పుట్టిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నా ఇద్దరు కూతుర్లు ఇప్పటికీ నిత్యానంద దగ్గరే ఉన్నారు: నటుడు) అయితే ఇటీవలే ముంబయిలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులను చూడాలనుకున్నారని వెల్లడించింది. 2002-03లో మధ్య కాలంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'అప్పుడప్పుడే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. నేను ఒక సినిమాను అంగీకరించా. అందులో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దర్శకుడు నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు లో దుస్తులన్నీ తీసేయాలన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజే నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా. ఇందులో నాకు నటించడం ఇష్టం లేదు.' అంటూ ప్రియాంక చోప్రా గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. అయితే దీనిపై దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపింది. (ఇది చదవండి: ఆ నిర్మాతకు అమ్మాయిల పిచ్చి.. ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు: నటి) -
స్టైలిష్ దుస్తులను మార్కెట్ లోకి తెస్తున్న ఈషా అంబానీ
-
ఇషా అంబానీ ఇండియాకు తీసుకురానున్న చైనా బ్రాండ్ ఇదే..
Shein India: అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' గురించి అందరికి తెలుసు. వ్యాపార రంగంలో తండ్రికి తగ్గ తనయురాలిగా పేరు తెచ్చుకున్న ఈమె త్వరలో భారతదేశానికి చైనీస్ ఫ్యాషన్ బ్రాండ్ 'షీన్' (Shein) తీసుకురావడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు మూడేళ్ల తర్వాత షీన్ను ఇండియాకు తీసుకురావడానికి ఇషా అంబానీ సిద్ధమైంది. ఇండియాకు తిరిగి రావడానికి షీన్ రిలయన్స్ రిటైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సరసమైన ధరలో ట్రెండింగ్ అండ్ స్టైలిష్ దుస్తుల కోసం చూస్తున్న మహిళలకు షీన్ ఒక మంచి షాపింగ్ ప్లాట్‌ఫారమ్. ఈ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందగలిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2020 జూన్‌లో ఈ కంపెనీ భారతదేశంలో నిషేధానికి గురైంది. అయితే సుదీర్ఘ సమయం తరువాత మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. 2020లో నిషేదానికి గురైన సమయంలో కూడా బ్రాండ్ ప్రోడక్ట్స్ ఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ద్వారా ఢిల్లీ కోర్టు నోటీస్ జారీ చేసే వరకు అమ్ముడవుతూనే ఉన్నాయి. నిజానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో షీన్ బ్రాండ్ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఒకదానితో ఒకటి ప్రయోజనం పొందుతాయి. (ఇదీ చదవండి: ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!) రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంలో ఇప్పటికే జిమ్నీ చూ, జార్జియా అర్మానీ, హ్యూగో బాస్, వెర్సస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్చేంజ్, బర్బెర్రీ వంటి బ్రాండ్స్ ఉన్నాయి. ఈ జాబితాలో షీన్ కూడా త్వరలోనే చేరే సూచనలు కనిపిస్తున్నాయి. 2022లో రిలయన్స్ రిటైల్‌కు కొత్త లీడర్‌గా ఎంపికయ్యే సమయాన్ని బ్రాండ్ నికర విలువ రూ. 2కోట్లు, అయితే ఇప్పుడు బ్రాండ్ విలువ ఏకంగా రూ. 4 కోట్లకు చేరింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
అమ్మాయిల దుస్తులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఇండోర్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేత వివాదంలో చిక్కుకున్నారు. అసభ్యకరమైన బట్టలు(డర్టీ క్లాత్స్) ధరించే అమ్మాయిలు రామాయణంలో శూర్పణఖ మాదిరి కనిపిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో మహవీర్ జయంతి సందర్భంగా జైన సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను ఆయన తప్పుపట్టారు. రాత్రిపూట బయటకు వెళ్లినప్పుడు మద్యం మత్తులో డాన్స్ చేస్తున్న యువతీ యువకులు కనిపిస్తుంటారని.. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను.. వారిని చూస్తుంటే గట్టిగా చెప్పుతో కొట్టాలన్నంత కోపం వస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలను మనం దేవతలా ఆరాధిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అసభ్యకరంగా దుస్తులు ధరించిన కొంతమంది ఆడవాళ్లను చూస్తుంటే శూర్పణఖలా కనిపిస్తారు. దేవుడు మీకు మంచి శరీరాన్ని ఇచ్చాడు. మంచి దుస్తులు వేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్దులు నేర్పాలి’ అని సూచించారు. అయితే విజయ్‌వర్గియా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళల పట్ల ద్వేషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలతో పురుషాధిక్యత, పితృస్వామ్య భావజాలన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయ నేతలు ఇలా మాట్లాడటం సరికాదని.. బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కైలాష్ విజయవర్గియా ఇంలాటి వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన వివాదంలో ఇరుకున్నారు. చదవండి: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి తృటిలో తప్పిన ప్రమాదం.. BJP Leader @KailashOnline says girls dress badly & look like ‘Shurpanakha’. This is a reprehensible & demeaning insult to every woman of this country Where is @smritiirani now? Does she condone this disgusting statement? Or does she only find her voice to attack @RahulGandhi! pic.twitter.com/hzoxrnZpl1 — Dr. Shama Mohamed (@drshamamohd) April 8, 2023 -
నాకు ఇది ముందే ఎందుకు కనిపించలేదబ్బా: ఆనంద్ మహీంద్ర
సాక్షి,ముంబై: ప్రముఖ పారిశశ్రామికవేత్త, మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో గురువారం మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. సాధారణంగా ఇంట్లో బట్టలు ఉతికిన తరువాత మడతపెట్టి బీరువాలోనో,కప్‌బోర్డ్‌లోనే సర్దడం అనేది ఒక పెద్ద టాస్క్. అందులోనూ ఏదైనా ఊరికి వెళ్లేటపుడు తక్కువప్లేస్లో ఎక్కువ లగేజీ సర్దడం అంటే నిజంగా బిగ్గెస్ట్ టాస్క్. ఈ విషయానికి సంబంధించిన వీడియోనే ఆనంద్ మహీంద్ర తన ఫాలోయర్లతో షేర్ చేశారు. పొందికగా, అందంగా దుస్తులను మడతపెట్టుతున్న ఈ వీడీయో ఆనంద్ మహీంద్రను బాగా ఆకర్షించింది. సాధారణంగా చేసుకునే పనులలో సింపుల్ టెక్నిక్స్ కొత్త ఇన్నోవేషన్ & డిజైన్ నైపుణ్యాలు ఆవిష్కారానికి నాంది పలుకుతాయి. ఈ వీడియో చాలా ఫ్యాసినేటింగ్ ఉంది అంటూ కొనియాడారు. దశాబ్దాలుగా ప్యాకింగ్‌ల మీద ప్యాకింగ్‌లు చేసుకుంటూ ప్రపంచమంతా కలియదిరుగుతున్న తనకు ముందే ఈ వీడియో ఎందుకు కనిపించలేదంటూ ఫన్నీగా కమెంట్ చేశారు. Fascinating. How innovation & design skills can bring huge productivity in such simple activities. Wish I had seen this video decades ago when I traveled like a maniac and was packing & re-packing every few days. https://t.co/mEXfa4TFP1 — anand mahindra (@anandmahindra) March 2, 2023 -
పరిస్థితి ఇంత దారుణమా!.. చలికి ఏకంగా బట్టలే గడ్డకట్టిపోయాయి
-
కొత్త రకం హ్యాంగర్.. దగ్గరకు వెళ్తే పరిమళాలు వెదజల్లుతుంది!
దుస్తులు వేలాడదీసుకోవడానికి కలప హ్యాంగర్లు, లోహపు హ్యాంగర్లు చాలాకాలంగా వాడుకలో ఉన్నవే! వార్డ్‌రోబ్‌లలో దుస్తులు దాచుకోవడానికి చాలామంది హ్యాంగర్లు వాడుతుంటారు. సాదాసీదా హ్యాంగర్లకు అంతకు మించిన ఉపయోగం ఇంకేమీ లేదు. అయితే, అమెరికాకు చెందిన చైనీస్ సంతతి డిజైనర్ సూవా షోయి ఇటీవల ‘ప్లౌడ్’ పేరుతో పరిమళాలను వెదజల్లే హ్యాంగర్‌కు రూపకల్పన చేసింది. ఈ హ్యాంగర్‌ను విడిభాగాలుగా విడదీసుకోవడం, తిరిగి జోడించడం చాలా తేలిక. ఈ హ్యాంగర్‌లో గొట్టంలా ఉండే భాగంలో నచ్చిన పరిమళాలతో కూడిన సెంట్ పాడ్స్‌ను నింపుకొని, తిరిగి బిగించేసి, దుస్తులు తగిలించుకుంటే చాలు. ఈ హ్యాంగర్ అన్నివైపులా సమానంగా తిరుగుతూ దుస్తులను పరిమళభరితం చేస్తుంది. ఈ పరిమళాల హ్యాంగర్ ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. -
దుస్తుల ఎగుమతులు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల ఎగుమతులు దేశం నుంచి నవంబరులో 11.7 శాతం వృద్ధి చెందాయి. అంతర్జాతీయంగా ఉన్న సవాళ్ల నేపథ్యంలో గడిచిన కొన్ని నెలలుగా ఎగుమతులు తిరోగమనం చెందాయని అపారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తెలిపింది. ‘యూకే, ఈయూ, యూఎస్ వంటి సంప్రదాయ మార్కెట్లు మాంద్యం, ఎదురుగాలులు చవిచూస్తున్నందున దేశం నుంచి రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. ద్రవ్యోల్బణం, ముడిసరుకు, రవాణా ఖర్చులు పెరగడంతోపాటు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎగుమతిదారులపై భారం పెరిగింది. కొన్ని నెలల తర్వాత ఎగుమతులు సానుకూలంగా మారాయి. ప్రబలంగా ఉన్న సవాళ్లను ఎదుర్కోవడానికి పరిశ్రమకు ఉన్న స్థితిస్థాపకతను ఇది సూచిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దుస్తుల ఎగుమతి లక్ష్యం రూ.1.45 లక్షల కోట్లు. ఏప్రిల్–నవంబరులో రూ.82,740 కోట్లకుపైగా ఎగుమతులు నమోదయ్యాయి’ అని కౌన్సిల్ వివరించింది. చదవండి: ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీబ్యాగర్ స్టాక్.. కలలో కూడా ఊహించని లాభం! -
కోడి ఈకలతో కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు
-
మహిళ దుస్తులు చింపి, అనుచిత దాడి...కాదు దోపిడి అంటున్న యజమాని
న్యూఢిల్లీ: ఒక క్లబ్‌లోని బౌన్సర్లు ఒక మహిళ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు. సదరు మహిళ బట్టలు చింపి, దారుణంగా దాడి చేశారు. దీంతో సదరు మహిళ ఇద్దరు బౌన్సర్లు తన పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదులు చేసింది. సెప్టంబర్ 18న ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... సదరు బాధిత మహిళ నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. తాము సంఘటన స్థలానికి వచ్చేటప్పటికీ మహిళ దుస్తులు చిందరవందరగా ఉన్నట్లు గుర్తించామన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కి తరలించామని తెలిపారు. అలాగే సదరు క్లబ్‌లోని బౌన్సర్ల వివరాలను సేకరించడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళ స్నేహితులతో కలిసి క్లబ్‌కి వచ్చానని, ఎంట్రీపై వాగ్వాదం చోటు చేసుకోవడంతో బౌన్సర్లు ఈ ఘటనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కానీ విచారణలో క్లబ్ యజమాని సురేంద్ర్ సింగ్ చౌదరి మరో కథ చెబుతన్నాడు. తాము ప్రతినెల స్థానిక పోలీస్ సిబ్బందికి దాదాపు రూ. 5 లక్షలు చెల్లించాల్సి వస్తుందని తెలిపాడు. ఐతే తాను చెల్లించడానికి ప్రస్తుతం నిరాకరించడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పోడియం వద్ద నుంచి బలవంతంగా సుమారు రూ. 1.5 లక్షలు తీసుకుని పోలీసులకు ఫోన్ చేశారని తెలిపాడు. చచ్చిన ఆ పోలీసులు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని, ఇవ్వకపోతే తీవ్ర పరిణామలు ఎదుర్కొవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారని వివరిస్తూ..స్పెషల్ సీపీకి లేఖ రాశాడు. అలాగే పోలీసులు తమ క్లబ్ సిబ్బందిలో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అంతేగాదు సదరు క్లబ్ యజమాని తమ క్లబ్లో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేయాలని పోలీసులను అభ్యర్థించారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం) -
ఇదేం రూల్ సామీ.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ.20 వేలు ఫైన్!
మన ఇంటి బాల్కనీలో లేదా టెర్రస్‌పైన ఉతికిన దుస్తులను ఆరబెట్టడం సహజమే. అయితే ఓ ప్రాంతంలో మాత్రం అలా బాల్కనీలో బట్టలు ఆరబెడితే ఫైన్ కట్టాల్సివస్తుంది. ఎక్కడనుకుంటున్నారా.. ఈ వింత రూల్ యూఏఈలోనిది. అయితే ఇలాంటి నిబంధన తీసుకురావడానికి కారణం ఉందని ఆ ప్రాంత అధికారులు చెప్తున్నారు. అసలు ఆ కథేంటని తెలుసుకుందాం! వివరాల్లోకి వెళితే.. అబుదాబిలోని మున్సిపాలిటీ అధికారులు అపార్ట్మెంట్ల బాల్కనీలు, కిటికీలపై బట్టలు ఆరబెట్టవద్దని ఆ ప్రాంత నివాసితులకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 20,000) లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఓ కారణం ఉందని అంటున్నారు అక్కడి మున్సిపల్ అధికారులు. బాల్కనీలో దుస్తులు ఆరేయడం వల్ల నగర అందం దెబ్బతింటుందని, అందుకే బాల్కనీలో, కిటికీలకు బట్టలు వేలాడదీయవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయంగా లాండ్రీ డ్రైయింగ్ గానీ, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చదవండి: ‘ఇది కరెక్ట్ కాదు.. రష్యా వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తోంది’ -
బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!
బెంగళూరు: కరోనా మహమ్మారి సమయంలో పేదలు జీవనోపాధి కోల్పోయి నానా అవస్థలు పడ్డారు. చాలా మంది ఎన్జీవోస్, స్యచ్ఛంద సంస్థలు తమ వంతు సాయం అందిచడానికీ ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే నిరుపేదలను ఆదుకునేలా బెంగళూరులోని నలుగురు స్నేహితులు సరికొత్త ఆలోచనతో ముందుకు రావడమే కాక కార్యాచరణలోకి తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు. (చదవండి: ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్‌కు గిఫ్ట్ ఇస్తాడట) ఈ మేరకు మెలిషా నొరోన్హా అనే ఆమె తన భర్త వినోద్ లోబో, తల్లి గ్లాస్గో, మరో ఇద్దరు స్నేహితులు నితిన్ కుమార్, విఘ్నేశ్‌తో సహా కలసి 2013లో పేద ప్రజల కోసం ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కరోనా మహమ్మారి తర్వాత ప్రజల దీనస్థిత చూశక వారికి క్లాత్ బ్యాంక్ అనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలోనే తాము ఇమాజిన్ క్లాత్స్ బ్యాంక్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 2021లో బెరటేన అగ్రహారంలో లవకుశ లే అవుట్‌లోని ఒక చిన్న డబల్ బెడ్రూం అపార్ట్మెంట్లో షాపును ప్రారంభించారు. అయితే ఈ షాపుకి అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు బట్టలను విరాళంగా ఇచ్చారు. ఈ క్లాత్ బ్యాంక్‌లో పేదవాళ్లు తమకు నచ్చిన దుస్తులను ఎన్నుకోవచ్చు. పైగా వాటి ధర రూ.1 మాత్రమే. పైగా ఈ క్లాత్ షాపులోని క్లాత్‌లు అమ్మగా వచ్చిన డబ్బులను కూడా వారు నిరుపేద కుటుంబాల పిల్లల చదువు, వైద్య ఖర్చుల అవసరాలకు నిధులుగా సమకూరుస్తున్నారు. అంతేకాదు ఒక పేద కుటుంబం సంవత్సరానికి దుస్తులు కోసం రూ. 2000 ఖర్చు చేస్తున్నారు. అదే ఈ బ్యాంక్ ద్వారా వారికి డబ్బు ఆదా కూడా అవుతుంది. ఈ మేరకు వినోద్, నితిన్ మాడుతూ.."2002లో మంగళూరులోని సెయింట్ అలోసియస్లో మా కాలేజ్ డేస్‌లోనే ఈ క్లాత్ బ్యాంక్ ఆలోచన ఉంది. మేము అప్పుడు కూడా మా స్నేహితు సాయంతో దుస్తులను సేకరించి పేదలకు పంపిణీ చేసేవాళ్లం." అని అన్నారు. (చదవండి: ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..) -
Quilt Craft: పాత బట్టలను జ్ఞాపకాల బొంతలుగా మార్చిన తోబుట్టువులు...
నేటి తరానికి క్విల్ట్గా పరిచయమైన నిన్నటి తరం బొంతను జ్ఞాపకాల పుంతలా అందిస్తున్నవారిని గుర్తించింది ఢిల్లీ ఎన్‌సిఆర్. అంతేకాదు, ఈ అందమైన కళను కాపాడేందుకు ముందుకు వచ్చింది. ఢిల్లీతో పాటు అక్కడి చుట్టుపక్కల పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసే ఎన్‌సిఆర్ (నేషనల్ కాపిటల్ రీజియన్) ఇటీవల పాత బట్టలతో కొత్తగా రూపొందించే రెండు క్విల్ట్ (బొంతల తయారీ) క్రాఫ్ట్ వెంచర్లను గుర్తించి, ఈ తయారీకి సపోర్ట్‌గా నిలిచింది. మెమరీ క్విల్ట్‌లుగా గతకాలపు జ్ఞాపకాలతో నిండిన పెట్టెలుగా మనల్ని హత్తుకునేలా తీర్చిదిద్దుతున్నారు వీటి రూపకర్తలైన మనీషా దేశాయ్, ఆయేషా దేశాయ్. నలభై ఏళ్ల మనీషా దేశాయ్, నలభై మూడేళ్ల ఆయేషా దేశాయ్‌లు తోబుట్టువులు. ఇద్దరూ గురుగ్రామ్‌లోని గార్డెన్ ఎస్టేట్‌లో ఉంటున్నారు. వారి ట్రంక్ పెట్టెల నిండా గత కాలంలో ఉపయోగించిన అత్యుత్తమ దుస్తులు దొంతర్లుగా ఉంటాయి. మనీషా మాట్లాడుతూ ‘నేను పూణెలో ఉన్నప్పుడు 2016లో కర్ణాటక బెల్గాంలో ఉన్న మా పుట్టింటికి వచ్చాను. మా చిన్ననాటి నుంచి మేం వాడిన పాతబట్టలతో నిండిన పెద్ద ట్రంకు పెట్టె ఉంది. ఆ డ్రెస్సులన్నీ తీసేస్తానన్నప్పుడు మా అమ్మ పెద్ద గొడవ చేసింది. వాటిని ఏదైనా చేయాలనుకుంటే కూతుళ్లు అని కూడా చూడనని బెదిరించింది. ఎంత చెప్పినా తను వినలేదు. మా ఇంట్లో అందరం కూర్చొని వాటిని ఏం చేయాలో చర్చించుకున్నాం’ అని తమ క్రాఫ్ట్స్ తయారీ మూలం గురించి వివరించింది మనీషా. గతంలో తాము ధరించిన దుస్తులకు మరింత ప్రత్యేకత జత చేయాలనే ఉద్దేశ్యంతో ఓ కుట్టు మిషన్‌ని కొని, కొన్ని బట్టలను ఎంచుకొని, వాటిలోని నాణ్యమైన భాగాలను ఎంపిక చేసుకుంటూ ఓ బొంతను కుట్టాం. అది చూసి అమ్మ ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేను. కుటుంబసభ్యులు, స్నేహితులు అందరికీ బాగా నచ్చింది. అడిగారు అని మా స్నేహితుల కోసం కొన్ని బొంతలు కుట్టి ఇచ్చాం’ అని తెలిపిన ఈ సోదరీమణులు ఆ మరుసటి ఏడాది ఎంతగా అంటే, ఇదే కాన్సెప్ట్‌తో ‘కార్నోకోపియా’ అనే పేరుతో ఒక సంస్థనే ఏర్పాటు చేశారు. గతం ఇచ్చిన కానుకగా జత కట్టి ‘చాలా మంది తమ పాత బట్టలను వదులుకోవడానికి ఇష్టపడరు. వాటితో వారికి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. తమ కుటుంబసభ్యులు ప్రేమగా ఇచ్చినవి, ప్రత్యేక సందర్భాలలో కొనుగోలు చేసినవి, తమకు తాముగా కుట్లు అల్లికలు చేసుకున్నవి.. ఇలా వాడిన దుస్తుల జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. వాటిని ఎవరికైనా ఇవ్వాలంటే ఆ జ్ఞాపకం దూరం చేసుకున్నట్టే అని భావిస్తారు. అలాగే ఉంచేయాలనుకుంటే వాటి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. వారి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ‘థీమ్ ఆధారిత ఎంబ్రాయిడరీ బొంతల’ను నాలుగేళ్ల క్రితం నుంచి తయారుచేయడం మొదలుపెట్టాం. ‘మెమరీ క్విల్ట్’లుగా పిల్లల పాత బట్టల నుండి ప్యాచ్‌లను తయారుచేయడం ప్రారంభించాం. టీ షర్టుల నుంచి ప్యాంటు వరకు అన్నీ వీటిల్లో ఉపయోగించాం. కొన్ని సమయాల్లో షాపుల నుండి ఫాబ్రిక్ వ్యర్థాలు కూడా సేకరించాం. గురుగ్రామ్ గార్డెన్ ఎస్టేట్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో ఢిల్లీ–ఎన్‌సిఆర్ పాల్గొంది. నివాసితులకు ఇవ్వడానికి కొన్ని బొంతలను తయారుచేయించింది. 4 అడుగుల వెడల్పు ఆరు అడుగుల పొడవు ఉండే మెత్తని బొంత రూ.7,500 ఉంటుంది. బొంత పరిమాణాన్ని బట్టి ధర పెరుగుతుంది’ అని వివరిస్తారు ఈ సోదరీమణులు. అంతే కాదు పాత వస్త్రాలను, క్లాత్ ముక్కలను నూలుగా మార్చడం, వీటి నుండే దారాలు తీయడంతో పాటు ప్యాకేజీకి పనికివచ్చే బ్యాగులను కూడా తయారుచేస్తారు ఈ అక్కాచెల్లెళ్లు. జ్ఞాపకాలకే డిమాండ్ ‘ఫ్యాబ్రిక్ వ్యర్థాల నుండి తయారుచేసిన క్విల్ట్‌ల కంటే మెమరీ క్విల్ట్లకు డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. కోవిడ్ తర్వాత ఈ తరహా మెత్తని బొంతల తయారీకి ఆర్డర్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. జ్ఞాపకాలకు న్యాయం చేయడం అనేది చాలా క్లిష్టమైన బాధ్యత. కానీ, కుటుంబాలు తమ జీవితాంతం ఉపయోగించుకునేలా మనపై నమ్మకం ఉంచినప్పుడు దానినే గౌరవంగా భావిస్తున్నాం. చంటిపాప అయినా, జీవిత భాగస్వామి లేదా అమ్మమ్మ, తాతయ్య అయినా వారు చెప్పే అందమైన కథలో మేమూ భాగం అవుతున్నాం. ఆ జ్ఞాపకాలకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని వివరించారు ఈ తోబుట్టువులు. మనసు లోతులను తడమాలే కానీ ఇలాంటి ఎన్నో మధురానుభూతులను మిగిల్చే కళలు లోకంలో ఎక్కడో చోట పుడుతూనే ఉంటాయి. వీరి కళ నచ్చితే ఎవరైనా ఓ ప్రయత్నంతో ఈ జ్ఞాపకాల బొంతను సొంతంగా తయారుచేసుకోవచ్చు. బిడ్డలను కథలా అల్లుకుపోయేలా.. ఫరీదాబాద్‌లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ రాశీ మాలిక్ తన సోదరి కోసం మొట్టమొదటి జ్ఞాపకాల బొంతను సృష్టించినట్టు గుర్తుచేసుకుంది. ‘మా అక్క లండన్‌లో ఉంది. ఆమె బిడ్డ కోసం తన దుస్తులను ఉపయోగించి, ఒక అందమైన మందపాటి దుప్పటిని రూపొందించాను. అది ఎంత అందంగా అంటే, కొన్ని కథలు రోజూ కళ్ల ముందు కదలాడుతున్నట్టే ఉంటాయి. హృదయానికి హత్తుకున్న దృశ్యమవుతుంది. మా అక్క ఎంత ఆనందించిందో మాటల్లో చెప్పలేను’ అని తన మొదటి జ్ఞాపకాల క్విల్ట్ రూపకల్పన గురించి వివరిస్తుంది రాశీ. ‘మామ్–ఎంటోస్’ పేరుతో క్విల్ట్ వర్క్‌షాప్‌ను ప్రారంభించి, బేబీ క్విల్ట్‌లను సృష్టిస్తోంది. ఆ తర్వాత కొన్నేళ్లుగా తన వెంచర్‌ను విస్తరిస్తూనే ఉంది. ఇప్పుడు తన వెంచర్ నుంచి పాత దుస్తులను ఉపయోగిస్తూ కుషన్లు, దిండు కవర్లు, బొమ్మలను కూడా తయారుచేస్తోంది. దుప్పట్లు, బొంతలు జ్ఞాపకాలను ఎలా స్పర్శిస్తాయో చెబుతూ ‘మంచం మీద పొరలుగా ఉన్నప్పడు చిన్ననాటి కథలు, మధురమైన జ్ఞాపకాలను మన కళ్ల ముందు ప్రదర్శిస్తాయి. పిల్లలకి వారు పెద్దయ్యాక తమ బాల్యం గురించి తెలుసుకోవడానికి ఇదొక మార్గం అవుతుంది. పెద్దలకు కానుక ఇస్తే.. పిల్లలు తల్లిదండ్రులకు తమ డిగ్రీపట్టాను కానుక ఇచ్చినంత సంబరాన్నిస్తుంది’ అని చెబుతుంది రాశీ మాలిక్. చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. -
గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలి.. నిందితుడికి కోర్టు ఆదేశం
పాట్నా: లైంగిక దాడికి యత్నించిన ఓ వ్యక్తికి బిహార్‌లోని కోర్టు వింత షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలలపాటు గ్రామంలోని మహిళలందరి బట్టలు ఉచితంగా ఉతకడంతోపాటు ఇస్త్రీ చేయాలని స్థానిక కోర్టు బుధవారం తీర్పిచ్చింది. దీనికి అవసరమైన డిటర్జెంట్, ఇతర ఖర్చులను అతడే భరించాలని పేర్కొంది. కోర్టు నిర్ణయంతో ఆ గ్రామంలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని మజోర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల లాలన్ కుమార్ బట్టలు ఉతుకుతూ జీవనోపాధి పొందేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చదవండి: తన పెట్ డాగ్ కోసం విమానంలోని బిజినెస్ క్లాస్ సీట్లన్ని.. అప్పటి నుంచి అతడు జైల్లో ఉండగా.. అతని తరపు న్యాయవాది బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కొన్ని వింత షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గ్రామంలోని 2 వేల మంది మహిళల దుస్తులు ఉతికి, శుభ్రంగా ఇస్త్రీ చేయాలని షరతు విధించింది. ఈ పనికి ఎటువంటి డబ్బులు తీసుకోరాదని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దుచేస్తామని కోర్టు హెచ్చరించింది. చదవండి: వారెవ్వా ఆయుషి ! సర్దుకుపోలేదు.. సమస్యకు పరిష్కారం చూపింది అయితే కోర్టు బుధవారం ఇచ్చిన ఈ తీర్పుపై గ్రామంలోని సుమారు 2 వేల మంది మహిళలు హర్షం వ్యక్తం చేసినట్లు గ్రామ సర్పంచ్ నసీమా ఖాటూన్ తెలిపారు. ‘ఈ తీర్పు చారిత్రాత్మకమైంది. మహిళల గౌరవాన్ని పెంపొందిస్తుంది. మహిళల గౌరవాన్ని కాపాడటానికి సహాయపడుతుంది’ అని ఆమె అన్నారు. అలాగే మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి సమాజంలో చర్చించడంపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆ గ్రామంలోని మహిళలు తెలిపారు. -
నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్
బీజింగ్: వీగర్ ముస్లింల అణిచివేత అంశంలో చైనా వైఖరిని వ్యతిరేకిస్తున్న విదేశీ కంపెనీలను కట్టడి చేయడంపై డ్రాగన్ దేశం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో హెచ్అండ్ఎం, నైకీ, జారా తదితర విదేశీ బ్రాండ్స్ .. పిల్లలకు హానికరమైన బొమ్మలు, దుస్తులు మొదలైనవి దేశంలోకి దిగుమతి చేస్తున్నాయంటూ ఆరోపించింది. ఈ వారంలో అంతర్జాతీయ బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇలాంటి 16 కంపెనీలకు చెందిన టీ-షర్టులు, బొమ్మలు, టూత్‌బ్రష్షులు మొదలైన వాటిని ‘‘నాణ్యత, భద్రత పరీక్షలో అర్హత పొందని’’ ఉత్పత్తులుగా చైనా కస్టమ్స్ ఏజెన్సీ ఒక జాబితా తయారు చేసింది. వీటిని ధ్వంసం చేయడం లేదా వాపసు పంపడం చేస్తామని పేర్కొంది. అయితే, వివాదాస్పదమైన షాంజియాంగ్ ప్రావిన్స్ పరిణామాల గురించి గానీ, విదేశీ కంపెనీల విమర్శలను గానీ ఈ సందర్భంగా ప్రస్తావించలేదు. దుస్తులు, బొమ్మల్లో హానికారకమైన అద్దకాలు, ఇతర రసాయనాలు ఉన్నాయని మాత్రమే తెలిపింది. షాంజియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లింలను అణిచివేస్తూ, వెట్టిచాకిరీ చేయిస్తోందంటూ చైనా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అక్కడి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల తమపైనా విమర్శలు వస్తుండటంతో హెచ్అండ్ఎం ఇకపై షాంజియాంగ్ ప్రావిన్స్‌లో ఉత్పత్తయ్యే పత్తిని తమ ఉత్పత్తుల్లో వినియోగించబోమంటూ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆగ్రహించిన చైనా ఈ-కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి హెచ్అండ్ఎం ఉత్పత్తులను తొలగించాయి. ఆ కంపెనీతో పాటు నైకీ, అడిడాస్ వంటి ఇతర విదేశీ బ్రాండ్స్‌కి సంబంధించిన యాప్స్‌ను కూడా యాప్ స్టోర్స్ తొలగించాయి. అయితే తాజా పరిణామంపై నైక్, జారా, హెచ్ అండ్ ఎం ఇంకా స్పందించలేదు. -
ఆలియాభట్ స్టార్టప్.. పిల్లల దుస్తులు
వెండితెరపై రకరకాల పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆలియాభట్ ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ పాత్రలోకి ప్రవేశించింది. అయితే ఇది ‘రీల్’ జీవిత పాత్ర కాదు ‘రియల్’ జీవిత పాత్ర. 2 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు పిల్లల దుస్తుల కోసం ‘ఎడ్–ఎ–మమ్మా’ అనే స్టార్టప్ లాంచ్ చేసింది. మన ప్రధాని నినాదం ‘వోకల్ ఫర్ లోకల్’తో గొంతు కలిపింది. ఆలియా క్లాతింగ్ లైన్‌ను ఎందుకు ఎంచుకుంది అనే విషయాన్ని పక్కనపెడితే ఈ స్టార్టప్ ప్రత్యేకత నేచురల్ ఫ్యాబ్రిక్స్. ప్లాస్టిక్‌తో తయారైన బటన్స్ ఉపయోగించకపోవడం ఇందులో ఒకటి. ‘ఎడ్–ఎ–మమ్మా’ ద్వారా ‘బ్యాక్ టు నేచర్’ నినాదానికి బలం చేకూర్చాలనే సంకల్పబలం ఆలియాలో కనిపిస్తుంది. స్టోర్ల సంఖ్య పెంచడంతో పాటు పిల్లల పుస్తకాల ద్వారా స్టోరీలు కూడా చెబుతుందట. పిల్లలను ప్రకృతికి మరింత దగ్గరికి తీసుకువెళ్లే కథలన్నమాట! ‘ప్రతి గార్మెంట్ ఒక కథ చెబుతుంది. ప్రకృతి పట్ల ప్రేమను పెంచుతుంది’ అంటున్న ఆలియా నుంచి వచ్చిన మరో మంచి మాట: ‘చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. భూమాతకు అందరం బిడ్డలమే. చిన్నపిల్లలమే!’ -
ప్లీజ్.. సంప్రదాయ దుస్తుల్లో రండి: షిర్డి
ముంబై: బాబా దర్శనానికి వచ్చే వారు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా షిర్డి సాయిబాబా ఆలయ ట్రస్టు నిర్వహకులు భక్తులను అభ్యర్థించారు. ఇది కేవలం అభ్యర్థన మాత్రమే అని.. భక్తులపై ఎలాంటి డ్రెస్ కోడ్ విధించలేదని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్హురాజ్ బాగటే మాట్లాడుతూ.. ‘బాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే గతంలో కొందరి వస్త్రధారణ పట్ల పలవురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకర దుస్తులు ధరించి ఆలయంలోకి వచ్చారని కొందరు ఫిర్యాదు చేశారు. అందుకే ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం. కనుక మోడర్న్ దుసుల్లో వచ్చే వారికి మా విజ్ఞప్తి ఇదే.. దయచేసి భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రండి. ఇది కేవలం విన్నపం మాత్రమే. భక్తుల మీద ఎలాంటి డ్రెస్ కోడ్ విధంచలేదు’ అని తెలిపారు. (చదవండి: సమసిన షిర్డీ వివాదం) -
వైరస్ ఫ్రీ వస్త్రాలు!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌పై పోరుకు ఐఐటీ మద్రాస్‌లోని మ్యూజ్ వేరబుల్స్ సంస్థ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. వస్త్రాలపై కరోనా వైరస్ అంటుకోకుండా చేసే నానోస్థాయి కోటింగ్ పదార్థాన్ని అ భివృద్ధి చేసింది. ఎన్95 మాస్కులు మొదలుకొని సర్జికల్ మాస్కు లు, వ్యక్తిగత రక్షణ కిట్లు.. ఆహారాన్ని పార్శిల్ చేసేందుకు వాడే బ్యాగుల్లాంటి వాటిపై ఈ కొత్త పదార్థపు పూతను పూస్తే ఆ ఉపరితలంపై పడ్డ వైరస్ వెంటనే నిర్వీర్యమైపోతుంది. ఈ నానో పూత ఉన్న వస్త్రా న్ని సుమారు అరవైసార్లు ఉతికినప్పటికీ దాని ప్రభావం ఏమాత్రం తగ్గదు. మ్యూజ్ వేరబుల్స్ అభివృద్ధి చేసిన యంత్రం కొన్ని నిమిషా ల వ్యవధిలోనే దాదాపు వంద మీటర్ల నిడివి గల వస్త్రంపై నానో పూ త పూయగలదు. అంటే.. ఈ యంత్రాన్ని వెంటనే వాణిజ్యస్థాయిలో వాడుకోవచ్చన్నమాట. కోవిడ్–19పై పోరును వేగవంతం చేసే లక్ష్యంతో ఐఐటీ మద్రాస్ ఇచ్చిన పిలుపు మేరకు అక్కడి ఇన్క్యూబేషన్ సెల్లో ఏర్పాటైన సంస్థ మ్యూజ్ వేరబుల్స్. ఈ సెల్లో బోలెడన్ని స్టార్టప్ కంపెనీలు కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు వేర్వేరు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయని.. వీటిల్లో చౌకగా లభించే వెంటిలేటర్లు మొదలుకొని వైరస్ ఉనికిని నిర్ధారించే పరీక్షలు కూడా ఉన్నాయని ఐఐటీ మద్రాస్ ఇన్క్యూబేషన్ సెల్ సీఈవో డాక్టర్ తమస్వతి ఘోష్ తెలిపారు. ప్రస్తుతం మ్యూజ్ వేరబుల్స్ కోటింగ్ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉందని, వేర్వేరు వస్త్రాలపై వేర్వేరు నానో పదార్థపు పూతను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే వారం రోజుల్లోనే నానో పూత తో కూడిన వస్త్రాలు అందుబాటులోకి రానున్నాయి. మాస్కులు తయారు చేసే కంపెనీతో కలసి నానోపూత కలిగిన, ఐదు పొరల మాస్కును సిద్ధం చేస్తోంది ఈ కంపెనీ. ఒక్కో మాస్కు ఖరీదు దాదా పు రూ.300 వరకూ ఉండవచ్చని అంచనా. కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఈ నానో పూత ఎంతో ఉపయోగపడుతుందని నానోపూత కలిగిన మాస్కును వాడితే వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువని మ్యూజ్ వేరబుల్స్ సీఈవో కేఎల్ఎన్ సాయి ప్రశాంత్ తెలిపారు. కరోనా వైరస్‌తోపాటు ముప్ఫై నానోమీటర్ల సైజున్న సూక్ష్మజీవులనూ ఈ కోటింగ్ నాశనం చేయగలదు. -
కుచ్చుల బొమ్మలు
పుట్టినరోజు, ఫ్యామిలీ గెట్ టు గెదర్స్, క్రిస్టమస్, న్యూ ఇయర్ ఇలా ఈ నెలలో వచ్చే వేడుకల జాబితా ఎక్కువే. ఈ సందర్భాలలో పిల్లల దుస్తుల విషయంలో అమ్మలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. వేడుక ఏదైనా నలుగురిలో తమ చిన్నారులు మరింతగా వెలిగిపోవాలని కోరుకుంటారు. పిల్లలకు సౌకర్యంతో పాటు గ్రాండ్‌గా ఉండే కుచ్చుల గౌన్లు ఇవి.. సౌకర్యం ముఖ్యం పిల్లలకు ఏ దుస్తులు సౌకర్యంగా ఉంటే ఆ డ్రెస్‌లో ఎక్కువ సేపు ఉంటారు. సాధారణంగా కాటన్, ఖాదీ బట్టలైతే వారి లేత చర్మానికి గుచ్చుకోవు. వీటిని బేస్ చేసుకుంటూ పిల్లల కోసం నెటెడ్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన ఈవెనింగ్ పార్టీవేర్ ఇది. కుచ్చుల వేడుక... వేడుకలో పిల్లలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కనిపించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలు కూడా నలుగురిలో తిరుగుతూ సందడి చేస్తుంటారు. తమ చుట్టూ తాము రౌండ్‌గా తిరగడం అంటే పిల్లలకు చాలా ఇష్టం. అలాంటప్పుడు తాము వేసుకున్న గౌన్ ఎంత ఫ్లెయిర్ వస్తే అంత బాగుంటామనుకుంటారు పేస్టల్ కలర్స్... ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నవి పేస్టల్ కలర్స్. పిల్లలు కూడా ఆ రంగులను ప్లెజంట్‌గా భావిస్తారు. జర్దోసీ వర్క్స్ కొంతవరకు కావాలనుకుంటే చిన్న చిన్న పువ్వులు, కట్ బీడ్స్ వాడుకోవచ్చు. ఇవి పిల్లల చర్మానికి గుచ్చుకోవు. చూడ్డానికీ బాగుంటుంది. ►పిల్లలకు ఎంత తక్కువ యాక్ససరీస్ వాడితే అంత సౌకర్యంగా ఉంటారు. ►జుట్టుకు చిన్న బ్యాండ్, మెడలో పల్చగా ఉండే చిన్న చైన్, చేతికి సన్నని బ్రేస్లెట్ వేస్తే చాలు. ►పిల్లల చర్మానికి హాని కలిగించనవి ఏవైనా బాగుంటాయి. ►చెప్పులు హీల్స్ కాకుండా ప్లాట్‌గా ఉండే షూస్‌ను ఎంచుకుంటే సౌకర్యంగా ఉంటాయి. ►ఇలాంటి డ్రెస్సుల మీదకు ఏ ఇతర యాక్ససరీస్ కూడా అంతగా ఎలివేట్ అవ్వవు. అందుకని ఏ ఇతర హంగులూ అక్కర్లేదు. నిహారిక ఫ్యాషన్ డిజైనర్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్ instagram: Niharika Design Studio -
బట్టలు ఫుల్.. బిల్లు నిల్..
విమానంలో వెంట తీసుకెళ్లే బ్యాగేజీ.. పరిమితికి మించి బరువుందని, అందుకు అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో.. ఫొటోలో భలేగా పోజిస్తున్న ఈ అమ్మాయికి వెంటనే ఓ ఐడియా తళుక్కున మెరిసింది. వెంటనే బరువుగా ఉన్న లగేజీ బ్యాగ్‌ను తెరచి అందులో ఉన్న తన డ్రెస్‌లు అన్నింటినీ ఒకదానిపై మరోటి తొడుక్కుంది. ఇలా దాదాపు మూడు కేజీల బరువున్న డ్రెస్‌లను అదనంగా వేసుకుంది. ఎయిర్పోర్ట్ అధికారులకు కట్టాల్సిన ‘అదనపు బరువు బిల్లు’ను తప్పించుకుంది. ఫిలిప్పీన్స్ దేశంలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందీ ఘటన. -
పట్టరాని కోపం
చాలా రోజుల తర్వాత కొత్త బట్టలు ధరించే అవకాశం ఇచ్చిన అల్లాహ్ కు కృతజ్ఞతలు చెప్పుకొని నమాజ్ కోసం మసీదుకు వెళుతున్నాడు ఒక వ్యక్తి. అసలే తెల్లని బట్టలు. ఎక్కడ మట్టి అంటుకుంటుందోనని చాలా జాగ్రత్తగా నడుస్తున్నాడు.దారిలో ఆడుకుంటున్న పిల్లాడు రాయి విసిరాడు. అది కాస్తా పక్కనే ఉన్న బురదలో పడి దాని చిందులు అటుగా వెళ్తున్న ఆ వ్యక్తి తెల్లని దుస్తులపై పడ్డాయి. ఆ వ్యక్తికి కోపం నషాళానికి ఎక్కింది. పట్టరాని ఆగ్రహంతో ఆ కుర్రాడి మీదకు పరిగెత్తాడు.అంతలో ‘‘కోపం సైతాన్ ప్రేరణతో వస్తుంది. నిలబడి ఉండగా కోపం వస్తే వెంటనే కూర్చోండి. కూర్చోని ఉండగా కోపం వస్తే వెంటనే పడుకోండి’’ అన్న ప్రవక్త ముహమ్మద్ గారి ప్రవచనం గుర్తుకు వచ్చింది. ఆ వ్యక్తి వెంటనే ఆ బురదలో కూర్చున్నాడు. కోపం తగ్గలేదు. వెంటనే బురదలో పడుకున్నాడు.బట్టలు పాడైతే మళ్లీ కొనుక్కోవచ్చు. కాని సైతాన్ కోపంలో ఏదైనా చెయ్యరాని పని చెయిస్తే. శాశ్వతమైన స్వర్గానికి దూరం కావాల్సి ఉంటుంది.కుస్తీ పట్టి ఇతరుల్ని చిత్తు చేసేవాడు అసలైన శూరుడు కాడు. తనకు ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపే వాడే వాస్తవానికి ధీరుడు. అన్నారు ప్రవక్త (స).ఉపవాసాల అసలు ఉద్దేశం దైవభీతి జనింపజేయడం. సహన గుణం అలవర్చకోవడం.ఈ నెల రోజుల ఉపవాస దీక్షలు మనలో కోపాన్ని అదుపు చేసే గుణం అలవర్చకోగలిగే వారు నిజంగా అదృష్టవంతులు. – షేక్ అబ్దుల్ బాసిత్ -
ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
న్యూయార్క్: ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లేటపుడు ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావట్లేదా? తాజా ట్రెండ్ ఏదో తెలీక తికమకపడుతున్నారా? అయితే జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గూగుల్ బ్రెయిన్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తప్పక మీకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ రూపకర్త అలెగ్జాండర్ క్లెగ్ మాట్లాడుతూ.. వేసుకోవాల్సిన డ్రెస్ ఎంపిక కాస్త కష్టమైన అంశమని, దీనికై ఆ వ్యక్తి అభిరుచిని కూడా పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని మెషీన్ లెర్నింగ్ విధానం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు నేర్పిస్తున్నామని తెలిపారు. దీనికై యానిమేషన్ సహకారం తీసుకుంటున్నామని, యానిమేషన్ క్యారెక్టర్ల ద్వారా వేలాది ట్రయల్స్‌లో తగిన దుస్తులు ఎంపిక చేసేలా శిక్షణ ఇస్తున్నామని స్పష్టం చేశారు. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా పెద్ద పనులను చిన్న టాస్క్‌లాగా విభజించుకొని పని చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, రోజూవారీ జీవితంలో పనిచేసేలా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి యానిమేషన్ క్యారెక్టర్స్‌కు వివిధ దుస్తులను ఎంపిక చేసేలా రూపొందించిన ఏఐని టోక్యోలో జరుగనున్న సిగ్రాఫ్ ఆసియా 2018 కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించనున్నారు. -
అద్దెకు పురుషుల ‘ఫ్యాషన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బట్టలు కొనాలంటే మనం ఏం చేస్తాం. షోరూమ్‌కు వెళ్లి నచ్చిన బట్టలను ఎంచుకొని.. సరిపోతాయో లేదోనని ట్రయల్ వేసుకొని కొంటాం! సేమ్.. క్యాండిడ్ నాట్స్లోనూ అంతే. కాకపోతే ఇక్కడ కొనాల్సిన పనిలేదు. అద్దెకు తీసుకుంటే చాలు! అంతేకాదు దుస్తులే కాదు టైలు, బెల్టులు, కళ్లద్దాలు, పర్సులు పురుషులకు సంబంధించిన ప్రతి ఒక్క ఫ్యాషన్ ఉత్పత్తులనూ అద్దెకివ్వటమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు క్యాండిడ్నాట్స్.కామ్ ఫౌండర్ శ్వేత పొద్దార్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది తమిళనాడు. వీఐటీలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. అకామాయ్ టెక్నాలజీస్, హెచ్ఎస్బీసీ వంటి కంపెనీల్లో పనిచేశా. కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుండటంతో మీటింగ్ లేక పార్టీ ఇతరత్రా ప్రత్యేక సందర్భాలు కామన్‌గా జరుగుతుండేవి. ప్రతిసారీ ఖరీదైన బట్టలు కొనాలంటే ఇబ్బంది. దీంతో స్థానికంగా అద్దెకు తీసుకునేదాన్ని. ఇదే పరిస్థితి నా తోటి సహోద్యోగులదీనూ. కాకపోతే పురుషుల ఫ్యాషన్స్ అద్దెకు దొరకటం చాలా తక్కువ. ఇదే క్యాండిడ్నాట్స్ స్టార్టప్‌కు బీజం వేసింది. 2016 ఆగస్టులో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా క్యాండిడ్నాట్స్ను ప్రారంభించా. 8 కేటగిరీలు; వెయ్యి ఉత్పత్తులు.. జోధ్‌పురీ సూట్స్, బ్లేజర్స్, జాకెట్స్, కుర్తా అండ్ పైజామా, శేర్వాణీ, వెస్ట్రన్, డిజైనర్ అండ్ ఎత్నిక్ వేర్ దుస్తులుంటాయి. వీటితో పాటు టై, బెల్ట్‌లు, పాదరక్షలు, కళ్లద్దాలు, గడియారాలు, పర్సులు వంటి పురుషుల ఫ్యాషన్‌కు సంబంధించిన అన్ని రకాల యాక్ససరీలుంటాయి. సంజయ్ షానీ, సోలా ఫ్యాషన్స్, మాక్రో ఇటలీ వంటి 6 డిజైనర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా డిజైనర్ దుస్తులను అద్దెకిస్తాం. మొత్తంగా 8 కేటగిరీల్లో 1,000 రకాల ఉత్పత్తులుంటాయి. ఏడాది కాలంలో 2 వేల ఉత్పత్తులకు చేర్చాలన్నది లక్ష్యం. 2 నెలల్లో హైదరాబాద్‌లో.. ప్రస్తుతం బెంగళూరులో సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు 12 వేల మంది కస్టమర్లు మా యాక్ససరీలను అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం నెలకు 800 ఆర్డర్లు వస్తున్నాయి. సూట్లు ఎక్కువగా అద్దెకు తీసుకుంటున్నారు. ఉత్పత్తుల గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ)లో 10–15% అద్దె ఉంటుంది. కనీస ఆర్డర్ విలువ రూ.1,500. ఏటా రూ.80 లక్షల ఆదాయం వస్తుంది. 2 నెలల్లో హైదరాబాద్‌లో సేవలను ప్రారంభించనున్నాం. ఏడాదిలో ఆఫ్‌లైన్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తాం. 2020 నాటికి ఢిల్లీ, ముంబై, పుణే నగరాలకు విస్తరించాలన్నది లక్ష్యం. రూ.2 కోట్ల నిధుల సమీకరణ.. పెళ్లి ఫొటో షూట్స్, ఫ్యాషన్ షోలు, మీటింగ్స్, సమావేశాలు, ఇంటర్వ్యూలు, కార్పొరేట్ ఈవెంట్లకు, కాలేజ్ ఫేర్వెల్, కాన్వొకేషన్స్, వార్షికోత్సవాలకు అద్దెకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులున్నారు. 4 నెలల్లో రెట్టింపు ఉద్యోగులను తీసుకుంటాం. ఏడాదిలో రూ.2 కోట్ల ఆదాయం లక్ష్యం. క్యాండిడ్ నాట్స్‌కు సొంత డెలివరీ, లాజిస్టిక్ వ్యవస్థ ఉంది. త్వరలోనే రూ.2 కోట్ల నిధులను సమీకరించనున్నాం. వీటితో మహిళలు, పిల్లల దుస్తులు, యాక్ససరీల అద్దె విభాగంలోకి విస్తరిస్తామని శ్వేత వివరించారు. -
చెడు వాసన దూరం
బట్టలు ఉతికాక అందులో కొన్ని చుక్కల వైట్ వెనిగర్ వేసి నానబెట్టి, పది నిమిషాల తర్వాత ఆరేయాలి. ఇలా చేస్తే బట్టల దుర్వాసన వదులుతుంది. ఇంట్లో పొగ, ఇతర మాడు వాసన త్వరగా పోవాలంటే వైట్ వెనిగర్‌ను ఒక చిన్న గిన్నెలో పోసి గదిలో ఉంచాలి. అర సగం నిమ్మ ముక్కను ఉప్పులో అద్ది, దాంతో వంటగదిలోని పొయ్యి గట్టు తుడిచి కడిగితే క్రిములు, దుర్వాసన దరిచేరకుండా ఉంటాయి.డ్రై వాష్ నుంచి తెచ్చిన దుస్తులను అలాగే ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచకుండా, తీసి అల్మరాలో భద్రపరచాలి. కొన్నాళ్లుగా ప్లాస్టిక్ బ్యాగులో దుస్తులు అలాగే ఉంచితే చెడువాసన రావడంతో పాటు అవి అక్కడక్కడా పసుపు రంగుమారే అవకాశం ఉంది. కొత్త షూస్ బిగుతుగా ఉంటే లోపలివైపు హెయిర్ డ్రయ్యర్‌తో వెచ్చగా చేసి, కొద్దిగా అటూ ఇటూ లాగి వదలాలి. ఇలా చేయడం వల్ల షూస్ వదులు అవుతాయి. పాదాలకు నొప్పి ఉండదు. రోజూ వాడుతున్న షూస్‌కి ఇలా అప్పుడప్పుడు హెయిర్ డ్రయ్యర్‌ని ఉపయోగిస్తే షూ దుర్వాసన తగ్గుతుంది. వానకాలం తడిగా అయిన లెదర్ చెప్పులు, షూష్లోపల చెమ్మను పోగొట్టాలంటే డ్రయ్యర్‌ని ఉపయోగిస్తే త్వరగా పొడిబారుతాయి. -
ఇలా చేస్తే మరకలు మాయం
బ్యూటిప్స్ కొత్త తువ్వాళ్లను ఉతికేటప్పుడు సాధారణంగా రంగుపోతుంది. అలా పోకుండా ఉండాలంటే, తువ్వాళ్లను మొదటిసారి ఉతికేటప్పుడు అర కప్పు ఉప్పు జత చేసిన నీళ్లలో నానబెడితే సరి.స్కెచ్ పెన్నుల గీతలు దుస్తుల మీద పడినప్పుడు, ముందు కాస్తంత నెయిల్‌పాలిష్ రిమూవర్ వేసి రుద్ది, ఆ తరవాత సబ్బుతో రుద్దితే ఆ మరకలు ఇట్టే పోతాయి.బట్టలపై చాకొలేట్ మరకలు పడితే, ముందుగా కొద్దిగా బట్టల సోడా కలిపిన నీటిలో ఉంచి, కాసేపయ్యాక సబ్బుతో ఉతికేయాలి.పట్టుచీరలు ఉతికేటప్పుడు ఆ నీళ్లలో కొంచెం నిమ్మరసం వేస్తే, రంగు, మెరుపుపోకుండా ఉంటాయి. బట్టల మీద పడిన ఇంకు మరకలను పోగొట్టాలంటే, ముందుగా ఇంకు మరక ఉన్న చోట నిమ్మ చెక్కతో కాని, టూత్‌పేస్ట్‌తో గాని రాసి ఉతికితే సరి. మరో చిట్కా కూడా ఉంది. ఇంకు మరకలు పడిన చోట నీళ్లు జల్లి ఉప్పుతో రుద్ది, గోరువెచ్చటి నీళ్లలో ఉతికినా కూడా మరకలు మాయమవుతాయి.గ్రేవీ చిక్కగా రావాలంటే, కొద్దిగా కొబ్బరి పాలు లేదా గిలక్కొట్టిన పెరుగు వేసుకోవచ్చు.కూరలో నూనె ఎక్కువైతే, రెండు బ్రెడ్‌స్లైసుల్ని పొడిలా చేసి అందులో వేస్తే సరి. -
వైరల్ వీడియో : అబ్బో ఏం దాచారు...!
-
చేనేత విక్రయాలపై 30 శాతం రాయితీ ఇవ్వాలి
జనతా వస్త్రాల పథకం ప్రారంభించాలి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలి చేనేత సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు రాము దానవాయిపేట (రాజమహేంద్రవరం) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల వస్త్ర విక్రయాలపై 30 శాతం రాయితీ మంజూరు చేసి చేనేత రంగాన్ని అదుకోవాలని చేనేత సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు సిహెచ్.రాము డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని లాలాచెరువు ఆప్కో భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రాము మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు జనతా వస్త్రాల పథకాన్ని ప్రారంభించి నేత కార్మికులకు హామీతో కూడిన ఉపాధి కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని చేనేతలకూ వర్తింపజేయాలని, వర్క్షెడ్లతో కూడిన గృహాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత సహకార సంఘాల అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సహకార చట్టంలోని 116 (సీ) నిబంధన నుంచి చేనేత సహకార సంఘాలను మినహాయించాలని తీర్మానించారు. సమావేశంలో రాష్ట్ర చేనేత సంఘాల సమాఖ్య చైర్మన్ దొంతంశెట్టి విరూపక్షం, ఆప్కో డైరెక్టర్లు ముప్పన వీర్రాజు, దొంతంశెట్టి సత్యనారాయణ మూర్తి, డీసీసీబీ డైరెక్టర్ పి.లాలయ్య, మోరి చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు చింతా వీరభద్రేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
లేడీస్ హాస్టల్
ఇవన్నీ ఉతికి ఆరేసిన బట్టలు అనుకునేరు. ఉతక్కుండా అరేసిన బట్టలు కూడా. ఇవన్నీ ఆడా మగా బట్టలు అనుకునేరు. ఓన్లీ అమ్మాయిల బట్టలు. అందుకే ఇన్ని రంగులు! ఇదొక లేడీస్ హాస్టల్. యూనివర్శిటీ హాస్టల్. క్యాంపస్ చుట్టుపక్కల కొన్నాళ్ల పాటు సూర్యుడన్న మహానుభావుడే లేకుండా పోయాడు. దట్టమైన మబ్బులు, చల్లటి మంచు, చెదురు మదురుగా చినుకులు.. క్యాంపస్‌లో తిష్ట వేశాయి. గదులకు చెమ్మపట్టి, బట్టలు తడవకుండానే తడిసి ముద్దైపోయినట్లుగా అయ్యాయి. ఎండ లేదు కాబట్టి, ఉతికి ఆరేసినా లాభం లేదు కాబట్టి హాస్టల్ లోని గదుల్లో గుట్టలు గుట్టలుగా బట్టలు పేరుపోయాయి. ఉతికి, ఇస్త్రీ చేసి శుభ్రంగా ఉంచుకున్న బట్టలు కూడా మంచులో మెత్తగిల్లిన పువ్వులయ్యాయి. ఇదిగో... ఇప్పుడు కాస్త ఎండ వచ్చాక, అన్నీ ఒకచోటుకు చేరి దండేల మీద ఒళ్లు విరుచుకుంటున్నాయి. -
ఇచట సినిమా దుస్తులు అమ్మబడును
‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో బన్నీ వేసుకున్న ట్రౌజర్ అదిరిపోయింది కదరా... అచ్చం అలాంటిది దొరికితే ఎంతైనా పెట్టి కొనేస్తాను అంటాడో కుర్రాడు. ‘‘జనతా గ్యారేజ్’ మూవీలో సమంత వేసుకున్న టాప్ చాలా బాగుందే. వాళ్లకి అలాంటివి దొరుకుతాయి. మనకెందుకు దొరకవు? అంటూ నిట్టూరుస్తుందో యువతి. అయితే ఇలాంటి సరదాలు తీర్చడానికి ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు సిద్ధమయ్యాయి. చెర్రీలా దుస్తుల్లో చెలరేగాలనుకునే చిన్నోళ్లు... తమన్నాలా త‘లుక్’మనాలనుకునే తరుణీమణులూ... బీరెడీ. – శిరీష చల్లపల్లి తెరపై కథానాయికలు ధరించే అందమైన చీరలు, డ్రెస్సులు జీవితంలో ఒక్కసారైనా మనం వేసుకోగలమా? అని ఆలోచించే అమ్మాయిలు... లైఫ్ అంటే హీరోలదే... మనకా అదృష్టం లేదని చింతించే అబ్బాయిలూ ఉన్నారు. అలాంటి వాళ్లను చూసి ‘వీరి సినిమా పిచ్చి తగలెయ్య..’ అనుకుంటూ నవ్వుకోవడం నిన్నటిమాట.. ఇప్పుడు సీన్ మారిపోయింది. తమకి ఇష్టమైన సినిమాల్లో, రియాలిటీ షోలో... తమ ప్రియ హీరోయిన్/హీరో ఫలానా సీన్/పాటలో... ధరించిన డ్రెస్ వేసుకోవాలని అనిపించడమే ఆలస్యం.. ఒక్క క్లిక్‌తో అవి ఒంటి మీద వాలుతున్నాయి. హవా స్టైల్... లివాస్టార్ ‘స్టార్’ దుస్తుల ఫ్యాషన్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్సైట్లలో లివాస్టార్ ఒకటి. లివాస్టార్ వెబ్సైట్లోకి వెళ్లి మనకు కావాల్సిన సినిమా డ్రెస్సింగ్ స్టైల్ ని ఫొటోతో సహా వారికి పోస్ట్ చేయాలి. వెంటనే రిప్లై మెసేజ్ వస్తుంది. అలా మీ టెస్ట్‌కు తగ్గట్టూ, సైజును బట్టి మీరు కోరుకున్న స్టార్ కాస్ట్యూమ్ నాలుగు రోజుల్లో కళ్ల ముందుంటుంది. హీరో, హీరోయిన్లు ధరించిన కాస్ట్యూమ్స్ మీ సైజ్‌కు తగ్గట్టుగా రెడీమేడ్‌గా డెలివరీ అయిపోతాయి. కేవలం దుస్తులు మాత్రమే కాదు సినిమా స్టార్స్ ధరించే యాక్ససరీస్, ఆభరణాలు, రిస్ట్‌వాచ్‌లు సైతం ఈ తరహా వెబ్‌సైట్స్‌లో ఆర్డర్ చేయొచ్చు. అ‘డ్రెస్’ చెబుతారు కొంతమందికి కొన్ని సినిమాల్లో డ్రెస్‌లు నచ్చినా ఆ తర్వాత అవి ఎక్కడ చూశామో గుర్తుండకపోవచ్చు. అలాంటి వారు ఫలానా హీరోయిన్/హీరో పేరుని పోస్ట్ చేస్తే వారికి సంబంధించి, వారు ధరించగా హిట్ అయిన ఫ్యాషన్ కలెక్షన్స్ డిస్ప్లే చేస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటిలో కావాల్సిన కాస్ట్యూమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్స్ దుస్తులు మక్కీకి మక్కీ కావాలనుకునేవారు కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. యాక్టర్స్ రేంజ్లో డ్రెస్ వేసుకోవాలంటే ఆ మాత్రం తప్పదు కదా. -
ఎత్నిక్ వేర్ షో
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: డిజైనర్ సృజనకు మోడల్స్ అద్దిన మెరుపులు ఆకట్టుకున్నాయి. విస్టార్ ఎంటర్టైన్మెంట్, ఎస్పీఎల్ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ది గ్రేట్ హైదరాబాద్ లైఫ్‌స్టైల్ ఎక్స్పో’లో భాగంగా కూకట్‌పల్లిలోని సుజనా ఫోరం మాల్లో శనివారం జరిగిన ఫ్యాషన్ షో ఆ కట్టుకుంది. సందర్శకులకు సరికొత్త డిజైన్లు పరిచయం చేసింది. ఎక్స్పోలోని అత్యాధునిక ఉత్పత్తులకు దీటుగా ఈ ఎత్నిక్ వేర్ షో నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. -
దండెం..మృత్యుపాశం
బట్టలారేస్తుండగా విద్యుదాఘాతంతో వివాహిత మృతి చండ్రుగొండ: ఉతికిన బట్టలు ఆరేస్తుండగా బైండింగ్ వైర్లతో కట్టిన దండేనికి విద్యుత్ ప్రసారమై ఓ మహిళ దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం పోకలగూడెం పంచాయతీ వెంకటియాతండాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..వెంకటియాతండాకు చెందిన ఇస్లావత్ కాంతి (25) శుక్రవారం సాయంత్రం దుస్తులను ఉతికి..ఇంటి దండెంపై ఆరేయబోయింది. ఇంటి విద్యుత్ సర్వీస్ వైరు తెగి..బైండింగ్ వైర్లతో ఉన్న దండేనికి కరెంట్ ప్రసారమైంది. ఇది గమనించని ఆమె దుస్తులను దీని మీద వేయగానే షాక్ కొట్టి అక్కడిక్కడే మరణించింది. మృతురాలికి భర్త చిన్న, పిల్లలు చరణ్, వరుణ్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏఎస్ఐ హుసేన్ వివరాలు సేకరించారు. -
బొమ్మను చేసి దుస్తులు వేసి
సాక్షి,సిటీబ్యూరో: కాలు కదపవు. కావాలని అడగవు. కదలక మెదలక ఉంటాయే గానీ రోజుకో డ్రెస్ కావాలి. అవును.. వాటి బాధ్యత చాలా పెద్దది మరి. షోరూమ్‌లోకి కస్టమర్స్‌ని రప్పించాలన్నా.. డిజైన్లతో మెప్పించాలన్నా.. మానెక్విన్దే ప్రధాన పాత్ర. అందుకే వీటిని మెరిపించే దుస్తుల డిజైనింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తప్పవంటున్నారు డిజైనర్స్. – శిరీష చల్లపల్లి మోడల్స్ కోసం దుస్తులు డిజైన్ చేయడం ఓకే. కానీ మానెక్విన్ కోసం డిజైన్ చేయడం చాలా కష్టమంటారు డిజైనర్లు. చుడీదార్, జీన్స్, లాంగ్ స్కర్ట్స్, శారీస్.. ఇలా వేసుకునే డ్రెస్, ప్యాటర్న్, కలర్స్ ఏదైనా రోజుకో రకం లుక్‌లో ఫ్యాషన్ లవర్స్‌ని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తుంటాయి షాపింగ్ మాల్స్, బోటిక్స్. అందులో భాగంగానే తమ మూవ్మెంట్ లేని మోడల్స్‌ను.. అవేనండీ మానెక్విన్‌లను నిత్యం వెరైటీ డిజైన్లతో అలంకరిస్తుంటాయి. లేటెస్ట్కి అ‘డ్రెస్’ అవే.. ఆకుపచ్చ రంగు పరికిణి, పింక్ కలర్ ఓణి అనగానే అబ్బా అది నిన్నటి కాంబినేషన్. మరి లేటెస్ట్ కాంబినేషన్ ఏంటి? అని ప్రశ్నించుకుంటే సమాధానం ఎదురుగా కనిపిస్తుంది. మాల్స్, బొటిక్స్లలోని మానెక్విన్స్ రూపంలో. ‘పూటకో ఫ్యాషన్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో మానెక్విన్ల ద్వారా మాత్రమే అప్ టు డేట్ ట్రెండ్స్ తెలియజేయగలమ’ని చెప్పారు ఓ బొటిక్ యజమాని. ఇందుకోసం ఎప్పటికప్పుడు ట్రెండ్స్ తెలియజేసేలా మానెక్విన్‌లకు ట్రయల్స్ వేసి మరీ డ్రెస్‌లు సెట్ చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. దిమ్మ తిరిగి ‘బొమ్మ’ కనపడుతుంది.. కస్టమర్లకు న్యూట్రెండ్స్ తెలియజేయడం ఈ బొమ్మల వస్త్రధారణ వెనుక ఉద్దేశం. అయితే అదంత సులభమైన పని కాదంటున్నారు డిజైనర్లు. ‘శక్తియుక్తులన్నీ డిజైనింగ్‌పైనే వినియోగిస్తాం. కాదేదీ డిజైనింగ్‌కు అనర్హం అన్నట్టుగా పాత పీలికలు, న్యూస్ పేపర్, దారాలు, ఆకులు, పువ్వులు, ఇలా దేనితోనైనా ట్రెండ్ క్రియేట్ చేసేట్టుగా ఫ్యాషన్ వేర్ని రూపొందించే ప్రయోగాలు చేస్తుంటాం. దీని కోసం మానెక్విన్స్పై రకరకాల ట్రయల్స్ వేసి కొత్త సై్టల్స్ క్రియేట్ చేస్తాం. ఈ ట్రయల్ ఫొటోలు, వీడియోలు ఫేస్బుక్, ట్వీటర్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్‌ల లో పోస్ట్ చేస్తుంటాం. వాటి ద్వారా రివ్యూలు, కామెంట్స్ బేస్ చేసుకొని ఫైనల్ ప్రొడక్ట్ ఓకే చేస్తాం. ఆ తర్వాతే వాటిని మాల్స్‌లోని మానెక్విన్‌లకు ఫిట్ చేస్తారు. అప్పుడే అది ఒక ట్రెండ్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేసినట్టు అవుతుంద’ని సెలబ్రిటీ డిజైనర్ నిషా గాల తెలిపారు. ఇందుకోసం సెలెక్టివ్ థీమ్స్ కూడా ఉంటాయని, థీమ్‌ని బట్టి మేకోవర్ మొదలవుతుందని చెప్పారు. ఎన్నో ప్రయోగాలు.. ట్రెండ్ సెట్ చేసేందుకు ముందస్తు ప్రయోగాల క్రమంలో వందల రకాల థీమ్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎథినిక్ వేర్, బ్లాక్ అండ్ వైట్, నియాన్ కలర్స్, ఫ్లోరల్ , డేట్, అకేషనల్, సీజనల్, పిక్నిక్, ప్రామ్.. ఇలా ఒక్కో థీమ్‌ను సమయం, సందర్భం, సీజన్‌ని బట్టి ట్రెండ్ తెలియజేసేలా బొమ్మలకు బట్టలు కుడుతారు. బొమ్మ వేసుకున్న డ్రెస్.. తమ దేహంపై ఎలా ఉంటుందనేది చూపరులకు స్పష్టంగా అర్థమవ్వాలనే విషయం మర్చిపోరీ డిజైనర్లు. కేవలం చున్నీ మాత్రమే కాకుండా ష్రగ్, డెనిమ్ జాకెట్, వెస్ట్ కట్.. ఇలా కూడా వేసుకోవచ్చని, చుడీదార్ల పైనే కాదు షార్ట్ టాప్ వెస్ట్రన్ డ్రెస్‌లపై సైతం చున్నీలను రకరకాలుగా ఫ్లవర్, బ్యాంగిల్స్ షేప్‌లలో.. ఎన్నో విధాలుగా సై్టలిష్‌గా వేసుకోవచ్చని, ఒక స్కార్్ఫని సింపుల్‌గా ఒక ముడి వేసి ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు.. ఇలా ఎన్నో విషయాలను మాల్స్‌లోని బొమ్మలను చూసి తెలుసుకొని ఫాలో అయ్యేందుకు వీలుగా డిజైన్స్ చేస్తుంటార -
ఇంటిప్స్
బట్టలపై బురద మరకలు పడితే వాటిని బంగాళాదుంపలు ఉడకబెట్టిన నీళ్లలో నానబెట్టి ఉతకాలి. బట్టల మీద హెన్నా మరకలు అయిన చోట ఆ భాగాన్ని పాలలో నానబెట్టి చల్లని నీటితో ఉతకాలి. ప్లాస్క్ వాడనప్పుడు దానిలో పావు చెంచా పంచదార వేసి ఉంచితే తర్వాత ఉపయోగించేటప్పుడు దుర్వాసన రాదు. కర్పూరం డబ్బా అడుగు భాగాన కొన్ని బియ్యపు గింజలు వేస్తే కర్పూరం కరిగిపోదు. ఉప్పు ఉంచిన డబ్బాలో అడుగున కొన్ని బియ్యపు గింజలు వేస్తే ఉప్పు ఉండలు కట్టకుండా ఉంటుంది. విరిగిపోయిన, మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలను ఎండలో పెట్టి, పొడి చేసి నిల్వ చేసుకుంటే గ్రేవీలు, కూరల తయారీలో వాడుకోవచ్చు. మిక్సీలో పిండి గ్రైండ్ చేసేటప్పుడు ఫ్రిజ్ నీళ్లు పోస్తే పిండి బాగా పొంగుతుంది. అన్నం ముద్దవకుండా ఉండాలంటే బియ్యానికి నీళ్లు చేర్చే ముందు దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండాలి. -
13వ అంతస్తులో ఏం జరిగింది?
చందానగర్: బాల్కనీలో దుస్తులు ఆరవేస్తూ ఓ యువతి 13వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. చందానగర్ సీఐ తిరుపతిరావు కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిచా గుప్తా(17) నల్లగండ్ల అపర్ణ సరోవర్ లెక్వ్యూ అపార్ట్మెంట్లో ఉండే తన అక్కాబావల వద్దకు 15 రోజుల క్రితం వచ్చింది. మంగళవారం రాత్రి 8 గంటలకు తాము నివాసం ఉండే 13వ అంతస్తులోని బాల్కనీలో దుస్తులు ఆరవేస్తూ అక్కడి నుంచి కిందపడి అక్కడికక్కడే చనిపోయింది. దుస్తులు ఆరవేస్తూ కిందపడి చనిపోయిందా? లేక మరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త ట్రెండ్ సృష్టించిన జూ జీన్స్!
టోక్యో: ఫ్యాషన్ డిజైనింగ్ లో మనుషులు మాత్రమే కాదు జంతువులు రాణిస్తున్నాయి. అదేంటీ వాటికి డిజైన్ల గురించి ఏం తెలుసు అని సందేహం అక్కర్లేదు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం మరి. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ నటించిన 'ఆ ఒక్కడీ అడక్కు' మూవీ తెలుసు కదండీ. అందులో నష్టాల్లో ఉన్న బట్టల కంపెనీని రాజేంద్రప్రసాద్ లీజుగా తీసుకుని భిన్న రకమైన షర్ట్స్, ప్యాంట్స్ డిజైన్లను తయారుచేయిస్తాడు. సిగరెట్లతో చొక్కాలకు రంద్రాలు చేయడం, పాన్ మసాలా లాంటివి తిని డ్రెస్సుపై రంగు పడేలా చేయడం, సింగిల్ షోల్డర్ చొక్కాలు చేసి కొత్త ట్రెండ్ తీసుకొచ్చి లాభాలు తీసుకొస్తాడు. ప్రస్తుతం జపాన్ వాళ్లు ఇలాంటి ఫార్ములాను వాడుతున్నారు. జూ టీన్స్ పేరుతో బ్రాండింగ్ జీన్స్ అమ్ముతున్నారు. పులులు, సింహాలు, కొన్ని రకాల ఎలుగుబంట్లు అక్కడి ఓ జూలో ఉంటున్నాయి. అయితే జూ జీన్స్ వాళ్లు జూ వాళ్ల సహకారంతో జీన్స్ ప్యాంట్లు కుట్టేందుకు వాడే ముడిసరకును కారు, జీపు టైర్లకు, ఫుట్ బాల్స్ కు పూర్తిగా చుట్టేసి పార్కులోని జంతువుల మధ్య పడవేస్తారు. ఆ వెంటనే పులులు, సింహాలు ఆ జీన్స్ ముడిసరుకును చీల్చి చెండాడుతాయి. దీంతో బట్ట చాలా చోట్లు చీరుకుపోయినట్లుగా తయారవుతుంది. జూ జీన్స్ సంస్థ వాళ్లు ఆ ముడిసరుకును మళ్లీ సేకరించి ప్యాంట్లు, కొన్ని మోడల్ జీన్స్ షర్టులను రూపొందిస్తారు. ఆ తర్వాత జూ జీన్స్ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తారు. ఈ విధానం మొదలుపెట్టిన తర్వాత అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ జంతువులను గౌరవించేందుకు పులుల సాయంతో చేసిన డ్రెస్సులకు టీ1, లయన్స్ తో అయితే ఎల్1, ఎలుగుబంట్లు రబ్ చేసిన వాటి జంతువుల సహాయంతో డిఫరెంట్ ప్రాసెస్ వాడుతున్నారని తెలిసే కస్టమర్లు వీటిని కొనుగోలు చేయడం విశేషం. ఈ నెల 6 నుంచి 21 వరకూ హిటాచీ నగరంలో ఉత్పత్తులను అమ్మి, వచ్చే లాభాలను కమైన్ జూతో పాటు మరో సంస్థకు విరాళం ఇవ్వనున్నట్లు జీన్స్ సంస్థ ఉద్యోగి తెలిపారు. -
'పంబలో దుస్తులు వేస్తే కఠిన చర్యలు'
కేరళ: శబరిమల యాత్రికులకులు పంబలో తమ వస్త్రాలను పడేయడం పట్ల కేరళ హై కోర్టు తీవ్రంగా స్పందించింది. నదీ జలాలను కలుషితం చేసే చర్యలను సమర్థించబోమని తెలిపింది. వస్త్రాలను, ఇతర వస్తువులను నదిలో పడేసినట్లయితే వారికి చట్ట ప్రకారం శిక్షల ఉంటాయని తెలిపింది. దీని ప్రకారం ఈ చర్యలకు పాల్పడిన వారికి గరిష్టంగా ఆరేళ్ల శిక్షతో పాటు జరిమానా విధించనున్నారు. హైకోర్టు తీర్పుపై శబరిమల స్పెషల్ కమీషనర్ బాబు మాట్లాడుతూ.. శబరిమల యాత్రికులు పుణ్యం కోసం లేదా మరే ఇతర కారణాల చేతనైనా తమకు సంబంధించిన తమ దుస్తులు, ఇతర వస్తువులను పంబ నదిలో వేసి నదిని కలుషితం చేసే చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలుంటాయన్నారు. -
రాధేమా భక్తులపై కేసు వేయాలి: సోనూ నిగమ్
ముంబై: తనది అపర కాళీకాదేవి అవతారమంటూ వివాదాస్పద ఆహార్యం, ప్రవర్తనతో సంచలనం సృష్టిస్తోన్న రాధే మాకు మద్దతుగా బాలీవుడ్ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ ఓ సామాజిక వెబ్సైట్లో చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాన్ని సృష్టిస్తున్నాయి. 'కురచ దుస్తులు ధరించారంటూ రాధేమాపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారుగానీ మరి అదే కాళికాదేవి అంతకన్న తక్కువ దుస్తుల్లో కనిపిస్తారు గదా! మరి ఆ సంగేతేమిటి ? అసలు బట్టలంటూ ధరించకుండా నగ్నంగా సంచరించే, అసభ్యంగా నృత్యం చేసే సాధు పుంగవుల సంగతేమిటీ?' అంటూ సోను నిగమ్ ఆదివారం ట్విట్టర్లో ట్వీట్ చేయడం ద్వారా కొత్త వివాదాన్ని రాజేశారు. 'ఆడవాళ్లకో న్యాయం, మగవాళ్లకో న్యాయమా?' అంటూ సోనూ నిగమ్ మరో ట్వీట్లో ప్రశ్నించారు. కుంభమేళా లాంటి కార్యక్రమాల్లో కొన్ని తెగల సాధువులు నగ్నంగా సంచరించినా, జుగుస్పాకరంగా నృత్యం చేసినా పట్టించుకోరని, వారిపై అత్యాచార ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు స్పందిస్తారని, మరి ఇది ద్వంద్వ ప్రమాణాల కిందకు రాదా? అంటూ కూడా ఆయన విమర్శకులను సూటిగా ప్రశ్నించారు. భగవత్ స్వరూపిణీగా, అపర కాళీమాతాగా ప్రచారం పొందుతున్న రాధే మాపై కేసులు వేయడం న్యాయం కాదని, ఆమెను అలా చిత్రీకరిస్తున్నవారిపై, ఆమెను అలా కొలుస్తున్న భక్తజనంపై ఈ సమాజం, ఈ వ్యవస్థ కేసులు వేయాలని సోనూ నిగమ్ మరో ట్వీట్లో సూచించారు. కురచ దుస్తులు ధరిస్తూ, భక్తులను కౌగిలింతలు, ముద్దులతో ముంచెత్తుతూ దేవతలను అవమానపరుస్తున్నారంటూ హిందూ సంస్థలు గొడవ చేస్తున్న విషయం తెల్సిందే. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న రాధే మా అలియాస్ సుఖ్విందర్ కౌర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ ముంబైకి చెందిన న్యాయవాది ఫాల్గుని బ్రహ్మభట్ కేసు కూడా వేశారు. మాజీ కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్, కురచ దుస్తుల్లో వున్న రాధే మా ప్రైవేట్ ఫొటోలను ఆగస్టు ఐదవ తేదీన మీడియాకు విడుదల చేయడం సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అవి పూర్తిగా తన ప్రైవేట్ ఫొటోలని, ఇంట్లో ఎవరైనా అలాంటి దుస్తులు ధరించవచ్చని, దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏమిటని ఆమె మీడియా ముందు సమర్థించుకోవడం విశేషం. Just my 2 pence. Kaali Maa is depicted in lesser clothes than Radhey Maa. Interesting that this country wants to sue a woman for her clothes — Sonu Nigam (@sonunigam) August 16, 2015 Men Saadhus can walk naked. Dance embarrassingly, but it takes a rape charge to put them behind bars. So much for Gender equality? :) — Sonu Nigam (@sonunigam) August 16, 2015 Wanna sue, sue the followers... Sue YOURSELVES.. For making them God men and women. Setting different rules for men and women, not fair. — Sonu Nigam (@sonunigam) August 16, 2015 -
సెక్సిస్ట్ ఔట్లుక్ని ఇకనైనా బద్దలు కొట్టాలి
బిగుతైన దుస్తులు వేసుకుని స్మిత ర్యాంప్ మీద నడుస్తుంటే కెమెరా పట్టుకుని కేసీఆర్ ఆమె వంక చూస్తున్నట్లు వేసిన క్యారికేచర్... తను స్వయంగా అన్నట్లు ప్రజల్లో ఒక ‘అభిప్రాయాన్ని’ ఏర్పరుస్తుంది. ఔట్లుక్ ‘నో బోరింగ్ బాబు’ వివాదం గురించి ఎన్డీటీవీతో మాట్లాడుతూ స్మితా సబర్వాల్ ఈ మొత్తం విషయాన్ని ‘కాన్స్పిరసి’ అ న్నారు. ఈ పదానికి తె లుగులో కుట్ర, దురా లోచన, మంత్రాంగం అనే అర్థాలున్నాయని శబ్దకోశం చెబుతోంది. మన రాజ్యాంగం, ఆర్టికల్ 164(2)లో ముఖ్య మంత్రితోపాటు మంత్రులు కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీకి సమష్టి బాధ్యత వహించాలి అని చెబు తుంది. కాని నేటి మన రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీ య పార్టీలు వ్యక్తి కేంద్రంగా ఉంటూ వస్తున్నా యి. దాంతో ముఖ్యమంత్రి అవుతున్న ఆ పార్టీ నేత సార్వభౌమత్వాన్ని పొందుతున్నాడు. అతని కార్యాలయం ‘పవర్ సెంటర్’గా మారిపోయిం ది. ఆ పవర్ సెంటర్లో అధికారిగా కీలకమైన స్థానంలోకి చిన్న వయసులో అనేక మందిని దాటుకుని చేరుకున్నది స్మిత. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రులు తమ కార్యాలయాల్లో పనిచేసే అత్యున్నత స్థాయి అధికారులను, మంత్రుల్ని ఎంపిక చేసుకున్నట్లే, తమకు అనుకూలంగా పనిచేసేవారిని ఎంపిక చేసుకుని తెచ్చుకోవడం ఇప్పుడొక రివాజుగా ఉంది. మన రాష్ట్రం వరకు వస్తే ఆయా ముఖ్య మంత్రులు వారి కార్యాలయాల్లో అత్యున్నత పదవుల్లో నియమించుకున్న అధికారులను బట్టి ఆ ముఖ్యమంత్రి ప్రాధమ్యాలు ఏ రకంగా ఉం డబోతున్నాయో అనే సూచన కొన్నేళ్లుగా ఉంటూ వస్తోంది. రాజశేఖరరెడ్డి వంటి దార్శనిక ముఖ్య మంత్రులు దళిత మైనారిటీ వర్గాల అధికారు లను నియమించడం ద్వారా ఆ వర్గాలకు ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఆ వర్గాల అభివృ ద్ధిని ఉద్యమ స్థాయిలోకి తీసుకెళ్లడానికి ప్రయ త్నించారు. ఒక సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక ప్రత్యేక అస్తిత్వ పోరాటాన్ని అతి నేర్పుగా నడి పిన ఈ నాయకుడు రాష్ట్ర అవతరణ దినోత్సవా నికి ముందు, దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించి ఉన్నాడు. అలాగే నవ తెలంగాణ నిర్మాణం కోసం ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉన్నత స్థాయి అధికారులను డెప్యుటేషన్ మీద తీసుకొస్తానని కూడా ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయంలో అధికారు లు పూర్తిగా తెలంగాణ నేపథ్యం ఉన్నవారే అయి ఉంటారని.. వారిలో దళితులు, మైనారిటీలు కూడా ఉంటారని చాలామంది అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా.. సుదీర్ఘ అనుభవం, ప్రతిభ ఉన్న ఒక తెలంగాణ వాసిని ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడంతోపాటు బెంగాలీ నేపథ్యం ఉన్న సమర్థులైన యువ అధికారిణిని అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. స్మిత తన నియామకంపై మాట్లాడుతూ, ‘ఇంత వరకు మహిళలు లేని చోట మహిళలను నియ మించి, సీఎం కేసీఆర్ సమాజానికి ఒక సందేశా న్నిచ్చారు’ అని అన్నారు. అయితే ఈ మొత్తం విషయాన్ని పరిశీలిస్తే మనలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. తెలంగాణ ఆత్మగౌరవం పేరిట ఏర్పడ్డ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేయడానికి సమర్థత, ప్రతిభ కలిగిన బలహీ నవర్గాలకు చెందిన ఒక్క తెలంగాణ ఐఏఎస్ కూడా కేసీఆర్‌కి కనిపించలేదా? చరిత్ర పొడవునా అధికారం కోసం జంతు నీతితో మనం పోట్లాడుతూనే వచ్చాం. అది ఇవా ళ కొత్త కాదు. కొత్త ఏమిటంటే ఇక్కడ అధికారం కోసం జరిగిన పాచికలాటలో ఒక మహిళ గెలు పొందింది. గెలుపు సాధించడానికి పురుషుడి కైనా, స్త్రీకైనా పరిచయాలు, కులాలు, మతాలు, నేపథ్యాలు వంటి ఎన్నో అంశాలు కీలకపాత్రలు పోషిస్తాయి. కానీ పురుషుడికి భిన్నంగా అధికా రంలో ఉన్న ఒక స్త్రీ మీద దాడి జరిగేటప్పుడు మాత్రం ఆమె లైంగికత అక్కడ ప్రధాన అంశమై నిలుస్తుంది. ఔట్లుక్ పత్రిక చేసింది కూడా అదే. బిగుతైన దుస్తులు వేసుకుని స్మిత ర్యాంప్ మీద నడుస్తుంటే కెమెరా పట్టుకుని కేసీఆర్ ఆమె వంక చూస్తున్నట్లు వేసిన క్యారికేచర్... స్మిత స్వయంగా ఎన్డీటీవీతో అన్నట్లు ప్రజల్లో ఒక అభి ప్రాయాన్ని ఏర్పరుస్తుంది. స్మితలాగే సమాన ప్రతిభ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నా స్మిత సౌం దర్యం ఆమెని ఆ స్థానానికి తీసుకెళ్లిందని, కేసీ ఆర్ ఆమెని ఒక వస్తువుగానే చూసి తీసుకెళ్లి ఆ స్థానంలో కూర్చోబెట్టాడనేదే ఆ అభిప్రాయం. ఈ తరహా దాడి పురుషులతో పోటీ పడ గలిగే స్థాయికి చేరిన స్త్రీలందరికీ అనుభవమే. ఒక స్త్రీ ఈ పురుషస్వామ్య ప్రపంచంలో కీలక స్థానంలో నిలిచిందంటే ఆమె కత్తిమీద సాము చేసి వచ్చిందని అర్థం. స్మిత కీలక పదవిని పొం దడంలోనే కాదు ఈ ప్రపంచం చేసిన లైంగిక పరమైన దాడిని ధైర్యంగా ఎదుర్కోవడం ద్వారా కూడా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే సోషల్ డార్వి నిజం ప్రకారం ఫిట్టెస్ట్ ఆఫ్ ది ఫిట్టెస్ట్గా నిలి చింది. మన సమాజం స్మిత పట్ల లేదా ఆమె లాం టి స్త్రీలపట్ల వ్యక్తపరుస్తున్న ఈ సెక్సిస్ట్ ఔట్ లుక్ ని ఇకనైనా బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. (వ్యాసకర్త కథా రచయిత్రి) మొబైల్: 80196 00900 - సామాన్య -
మనిషికి విలువ కలిగించే చేనేతలు
మనిషికి తను వేసుకునే బట్టల ద్వారానే ఎనలేని విలువ, గౌరవం కలుగుతాయి. దశావతారాలు ఎత్తిన మహావిష్ణువుకు నూలు దారంతో స్వయంగా పట్టుపంచె నేసి కాను కగా ఇచ్చిన మార్కండేయ మహర్షి వారసు లైన చేనేతకారుల బతుకులు నేడు వెలసి పోతున్నాయి. దివంగత నేత వైఎస్ రాజశే ఖరరెడ్డి చేనేతకారులకు ప్రయోజనం కలిగిం చేందుకోసం ప్రతి ఆదివారం ఎమ్మెల్యే, ఎంపీలు ఖద్దరు దుస్తులు ధరించేలా ఆదేశాలు జారీ చేసి చేనేతలకు చేయూతనిచ్చిన విష యం పద్మశాలి కులస్తులు మరువరు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ సబ్ ప్లాన్ కోసం తెలం గాణ రాష్ట్రంలోని బీసీ కులస్తుల కోసం రూ. 20,000 కోట్లతో సబ్ ప్లాన్ అమలు చేయాలి. సిరిసిల్ల, దుర్బెడు, ఎలగెడు, హుజూరాబాద్, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో గల చేనేతల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆప్కో షాపుల ద్వారా చేనేతల వస్త్రాలు అమ్మించి ఆదుకోవాలి. గత మార్చి 2015లో తెలంగాణ సీఎం వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు కోసం ఎంపీలతో ఆధ్యయనం జరి పించారు. అంతే కాకుండా ఆయన ప్రకటిం చిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో భాగం గా మార్కండేయ టౌన్షిప్ పేరుతో చేనేత లకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కులస్తుడికి పావలా వడ్డీతో రూ.50,000లు రుణం అందించాలి. తెలంగా ణ రాష్ట్రంలో పనిచేస్తున్న బీసీ విభాగంలోని పద్మశాలి కులస్తులకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. బీసీలలోని అన్ని కులాల వారికి సబ్‌ప్లాన్ అమలు చేస్తూ, రూ.20,000 కోట్ల ను కేటాయించినట్లయితే వెనుకబడిన తరగ తుల వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారు. అందుచేత వెంటనే సబ్‌ప్లాన్ అమలుకు ప్రధాని నరేంద్రమోదీ పూనుకోవాలి. - కోలపాక శ్రీనివాసమూర్తి బెల్లంపల్లి -
మీకూ కావాలి మరి రీగల్ ఆ రోజులు...
‘టింకూ లాంటి బాబు మీకూ ఉంటే కావాలి మరి రీగల్’... బట్టలు మురికి చేసుకుని, ముద్దుగా కనిపిస్తున్న ఆ అల్లరి పిల్లవాడి యాడ్ ఆంధ్రప్రభ వీక్లీలోనో చందమామ మంత్లీలోనో. రిన్ కొన్నది లేదు. రీగల్ కొనే ముచ్చట తీరనే లేదు. పెంకుటిళ్లవాళ్లకి, వసారా ఇళ్ల వాళ్లకి, నాలుగు సిమెంటు రేకులను బోల్టులతో బిగించి ‘మాది కొత్తగా కట్టిన రేకుల ఇల్లు గదా’ అని బడాయి పోయేవాళ్లకి, గాడ్రేజీ బీరువా కొనుక్కోగలిగేవారికి, ఇంటికి ఎవరైనా వస్తే నులక, నవారు గాకుండా ఫ్యాషనుగా వైరు మంచాలను వాల్చేవాళ్లకి బట్టలు ఉతకాలంటే డెట్ సోపే దిక్కు. డిఇటి డెట్. అరవై పైసలకు ఒకటి. ఇక తక్కిన సవాలక్షమందికి శెట్టిగారి కొట్టుకు వెళితే దారాన్ని లాఘవంగా తిప్పి పావలాకు కోసి ఇచ్చే మైసూరుపాకులాంటి ముక్క- 501 ఉండనే ఉంది. బట్టల సోప్ రేపర్ని పుస్తకాల మధ్య ఉంచుకుంటే మజా లేదు. ఆ మాటకొస్తే లైఫ్‌బాయ్ కవర్లు కూడా ఎన్ని దాచుకున్నా గౌరవం ఏముంది? హమామ్ ఒక మాదిరిగా సరే. రెగ్జోనా, లక్స్... ఎవరైనా చేసే పనే. కాని సింథాల్ రేపర్ అలా నాన్ డీటైల్‌లో మందంగా దాక్కుని ఉందంటే మరిక ఆ కుర్రవాడు కలిగిన బిడ్డ కిందే లెక్క. ఇస్త్రీ యూనిఫామ్, బాటా షూస్, పై జేబులో హీరో పెన్, టెక్స్ట్బుక్కుల్లో సింథాల్ రేపర్ ఇవన్నీ కలిమికి గుర్తులు. కాని- ప్రతి వీధికీ ఒక మహరాణి ఉండేది. ఆవిడ పియర్స్ తోనే మొహం కడిగేది. అది చూసి మరీ అంత మిడిమేలమా అని సున్నిపిండితో సరిపుచ్చుకునే అమ్మలక్కలందరూ ఆమెను అయినకాడికి ఆడిపోసుకునేవారు. పియర్స్‌ను చాలామంది చాలాసార్లు దూరం నుంచి చూసి ఊరుకునేవారు. ఎప్పుడైనా ముఖం కడుక్కునే చాన్స్ దొరికిందా? పదే పదే చేతులని ముక్కు దగ్గర పెట్టుకుని మురిసిపోవడమే. బ్రాండ్స్ తెలియడం మొదలయ్యింది. కంపెనీ వస్తువుతో ఇంటికి కొత్త మర్యాద వస్తుందనే ప్రచారం ప్రబలింది. ర్యాలీ సైకిల్, హెచ్ఎంటి వాచీ, డయొనారా టీవీ, సోనీ కెమెరా, బజాజ్ స్కూటర్, విమల్ షర్ట్ క్లాత్, కొరియా ప్యాంట్ బిట్, హిందూ పేపర్, గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్, క్యుటికూర పౌడర్... పాతకాలంలోలా పలాస్త్రి వేసుకున్నవాడు పల్లెటూరి బైతు. లేటెస్ట్గా జాన్సన్స్ వారి రోజా పూరంగు బ్యాండ్ ఎయిడ్? ఫ్యాషన్. జలుబు చేస్తే ముక్కు చీదడం ఏం మర్యాద? విక్స్ ఇన్హేలర్ పట్టుకు తిరిగేవాడే హీరో. ప్రాధాన్యాలు మారాయి. శీకాయపొడి, కుంకుళ్లకు ఇన్సల్ట్స్ మొదలయ్యాయి. పేనుజాతికి పెను ప్రమాదం ముంచుకొచ్చింది. కొత్తగా వచ్చిన చిక్ షాంపూ నెత్తికెక్కి వెంట్రుక వెంట్రుకలో రసాయనాలు కూరింది. నిమ్మరసాన్ని రస్నా చప్పరించింది. నిర్మా పౌడర్ కొత్తబంధువుగా స్థిరపడింది. గానుగలో కొబ్బరినూనె కొన్నా కాసింత రీటా కలిపితే తప్ప శ్రీమతికి సంతృప్తి కలగదు. డాల్డాకు కుర్చవేయడం మొదలుపెట్టారు. సేమ్యాల స్థానాన్ని బాంబినో వెర్మిసెల్లి తీసుకుంది. బ్రిటానియా బిస్కెట్లు కొని సాయంత్రం పూట కాఫీతో పాటు తీసుకుంటున్నారంటే ఆ ఏరియాలో ఆ ఇంటికి ప్రత్యేక హోదా. వస్తువులకు స్థలం కావాలి. బ్రాండెడ్ వస్తువులకు మర్యాదగలిగిన ఇల్లు కావాలి. అందుకు తగ్గట్టుగా మనిషి ఎదగాలి. కాసింత పెరడు దొరికితే బంతో, చేమంతో, నీడనిచ్చే వేపో, అమ్మ జ్ఞాపకంగా ఊరి నుంచి తెచ్చిన అంటుమామిడో పెంచుదామని ఆలోచించేరోజుల నుంచి ఇంటి మీద ఇల్లు, ఇంటి ముందు ఇల్లు, ఇంటితోపాటు ఇల్లు, లంకంత ఇల్లు కట్టడం మొదలయ్యింది. మెల్లమెల్లగా ఊరు ఒక పెద్ద సిమెంట్ రూఫ్‌గా మారింది.వస్తువులు లోపలికెళ్లాయి. ఎండలు బయట ఉండిపోయాయి. పాపం, ఏ బ్రాండూ లేని మనుషులు కొందరు వస్తువుల ప్రీతి కోరుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. - ఖదీర్ -
ఉతికి జాడించేశారు!
ప్రపంచం ఉతికి, జాడించడంలో ఆడవాళ్ల తర్వాతే ఎవరైనా. ఆ సంగతి ఇండోనేషియాలోని ‘శాల్వో స్పోర్ట్’ కంపెనీ యజమానులకు బాగా తెలిసివచ్చినట్లుంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా... ‘‘అమ్మ తల్లులూ, మమ్మల్ని అపార్థం చేసుకున్నట్లున్నారు! క్షమించి వదిలేయండి’’ అని లెంపలేసుకున్నారు. అంతగా అక్కడి ఆడవాళ్లకు కోపం రావడానికి కారణం ఏమిటిటంటే... స్థానికంగా పేరున్న ఒక ఫ్లయిట్ సాకర్ క్లబ్బు కోసం శాల్వో గత నెలలో ఒక జెర్సీ షర్ట్‌ను డిజైన్ చేసి ఇచ్చింది. షర్ట్ లోపల దానిని ఎలా ఉతకాలో సూచనలు కూడా ఇచ్చింది. ఆ సూచనలు కూడా ఎన్నో లేవు. సింపుల్‌గా రెండంటే రెండే ఉన్నాయి. ఒకటి: ఈ జెర్సీని మీ ఆవిడతో ఉతికించండి. రెండు: అది ఆవిడ పని. ‘బట్టలు ఉతకడం మహిళల పనే పని’ అర్థం వచ్చేలా ఉన్న ఈ సూచనల్ని ఎవరో ఫొటో తీసి సోషల్ నెట్వర్కింగ్ సైట్‌కు ఎక్కించారు. అలా అలా అది నెట్ అంతా వ్యాపించింది. దీంతో ఇండోనేషియా మహిళల్లో కదలిక వచ్చి ‘శాల్వో’ కంపెనీ తీరుపై విరుచుకుపడ్డారు. అప్పుడు గానీ శాల్వోకు తన తప్పేమిటో అర్థం కాలేదు. ‘‘ఈ సూచనలను మేము పురుషులను ఉద్దేశించి మాత్రమే ఇచ్చాం. ‘తెలియని పని చేసి షర్ట్‌ను నాశనం చేయకండి. ఆడవాళ్లకయితే ఉతకడంలో మెళకువలు తెలిసుంటాయి కనుక వారికే ఇవ్వండి’ అని చెప్పాలనుకున్న మా ప్రయత్నం ఇలా అపార్థానికి దారి తీసినందుకు బాధపడుతున్నాం’’అని ఒక ప్రకటన విడుదల చేసి, సారీ చెప్పింది. -
దిగంబర యోగికి ఆడంబర నివాళి
నేనొక పెద్ద హీరోకి అభిమానిని. నా హీరో కామెడీ చేయకూడదు - యాక్షనే చెయ్యాలి. నా హీరో కంట తడి పెట్టకూడదు - కొట్టాలి. నా హీరో సినిమాలో వేరే ఆర్టిస్టులు ఏం చెయ్యకూడదు, అన్ని డైలాగులూ హీరోనే మాట్లాడాలి. అందరి మాటలూ హీరోనే చెప్పాలి. నా హీరో సిక్స్‌ప్యాక్ బాడీ చూపించకూడదు. ఎప్పుడూ నిండుగా బట్టలేసుకునే కనిపించాలి. నా హీరో టీవీల్లో కనపడ కూడదు. ఆలస్యమైనా వెండితెర మీదే కనిపించాలి. నా హీరో నాకు నచ్చే సినిమాలే చెయ్యాలి. ఆయనకిష్టమైనవి చేయకూడదు. నేను హీరోకి అభిమానినా? దురభిమానినా? వేరే హీరోకి కోవర్టునా? నా అభిమానంతో నా హీరో చరిత్ర చెరిపేసే ప్రయత్నం చేసేవాడినా? నా చిన్నప్పట్నుంచి ఘంటసాల, ఎస్పీబీ పాటల కన్నా నేనెక్కువ సార్లు పాడుకున్న పద్యాలు నా సాంస్కృతిక, సారస్వత హీరో వేమన గారివే. ఆయనకి బట్టల్లేవన్న సంగతి నిన్నే ఎవరో రీసెర్చ్ చేసి టీవీ చానళ్లలో గొడవ చేస్తే తెలిసింది. నలభై రెండేళ్ళుగా నా కళ్లు మూసుకుని పోయాయని చాలా బాధపడ్డా. ఇది ఉపోద్ఘాతం. అసలు ఘాతం ఏంటంటే- వేమన జీవితచరిత్ర. పద్యాల సారాంశం. అవి సమాజానికి బోధించే నైతిక విలువల ప్రస్తావన అన్నీ అందరూ ఏళ్ల తరబడి చెప్పేశాక, ఇంక చెప్పడానికి ఏమీలేదని, ఏమీ మిగల్లేదని కొందరు ఆయనకి బట్టలు తొడగాలని తీర్మానించడం... అందుకు చర్యగా ఆయన విగ్రహం మీదున్న ఆయన పేరుని చెరిపేయడం... ఆయన విగ్రహాన్ని స్త్రీలు చూడలేక అసభ్యంగా భావిస్తున్నారని బాధపడడం... జోక్ ఆఫ్ ది మిలీనియమ్. సారీ టు సే. పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ఠ. ఇదొక చర్చ- దీనికింత రచ్చ. బాగా బతికిన జమీందారు పెదకోమటి వేమారెడ్డి స్త్రీలోలుడై ఆస్తిపాస్తులు పోగొట్టుకుని ప్రేమంటే మైకమనీ, జనన మరణాల మధ్య మానవ సంబంధాలు భ్రమలనీ తెలుసుకుని, లుంబిని మహర్షి శుశ్రూషలో యోగ సిద్ధుడైన వ్యక్తి యోగి వేమనగా అవతరించారు. ఆ యోగసిద్ధిలో ఆయన గ్రహించిన జ్ఞానం - బట్టలు, బాహ్యవేషధారణ మనిషి ఆత్మ సౌందర్యాన్ని కప్పిపుచ్చుతోందని! ఆయన పద్యాల సారాంశం కూడా అదే. పురుషులందు పుణ్యపురుషులు వేరయా - అని వేమన ఎప్పుడో చెప్పాడు. లైనిన్ కాటన్ వేసుకున్న పెద్ద మనుషులంతా చూడ్డానికి ఒకేలా ఉంటారు. కానీ లోపల చూస్తే తెలుస్తుంది ఎవరు నిజంగా ప్రజాసేవకులో, ఎవరు ప్రజాధన భోక్తలో, ఎవరు ప్రజల ముందు వక్తలో..! ఆత్మ సౌందర్యానికి ఆయన్ని ఆయన చిహ్నంగా మార్చుకున్నారనే తప్ప అది సభ్యతకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఎవరికీ అనిపించలేదు. అలా అనిపిస్తే ఆ మహానుభావుణ్ణి కూడా మనం మెటీరియలిస్టిక్‌గా చూస్తున్నామని అర్థం. నగ్నమైన మానవ జీవిత నిజాలకి దర్పణంగా దిగంబరంగా మారిన యోగి. రమణమహర్షి, వేమన, మహాత్మాగాంధీ అందరికీ బట్టలు కప్పేద్దాం. లేదా వీరి పేర్లు చెరిపే ద్దాం. ఆరున్నరవేల సంవత్సరాల భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచిన వారి చరిత్రలని పట్టు బట్టలతో కప్పేసి మనలా మామూలు మనుషుల్ని చేసేద్దాం. వారు ఆంధ్రా వారా, తెలంగాణా వారా అని కొట్టుకుందాం. ఇలాంటి విపరీత ధోరణులున్న వారందరినీ సంఘాలుగా ఏర్పరచి సమాజాన్ని ఎడ్యుకేట్ చేద్దాం. 2015కు ముందు వేమన, 2015 తర్వాత వేమన అని పిల్లలకు రెండు ఫొటోలు చూపిద్దాం. అన్నేళ్లు బట్టల్లేకుండా ఎందుకుంచారు? అని ఏ పిల్లలైనా అమాయకంగా అడిగితే, సిగ్గుతో చచ్చిపోదాం. ఇదీ వేమన నుండి మనం నేర్చు కున్నది. ఆయనకి మనమిచ్చే నివాళి. ఆయన్ని మనం మననం చేసుకునే విధానం. సారీ వేమనగారూ- మీకు బట్టలు తొడగడానికి ఎవరో ముందుకొస్తే అడ్డుపడడం నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని దిగం బరంగానే చూడాలన్న కోరికా నాకు లేదు. మీ నుంచి నేను నేర్చుకున్న జీవిత సత్యాలకి నాగరికత ముసుగు తొడిగి మరుగున పడేస్తారేమోనని బాధతోనే ఈ వ్యాసం. తప్పయితే క్షమించండి. కాదనుకుంటే కార్యాచరణకి దారి చూపండి. ఈ విషయం మీద ఏ బహిరంగ చర్చకైనా నేను సిద్ధమ్. - వి.ఎన్.ఆదిత్య, ప్రముఖ సినీ దర్శకుడు -
చాకిరేవే చావు రేవైంది..
చాకిరేవే చావు రేవైంది.. ముదినేపల్లి : అభం శుభం తెలియని ఇద్దరు బాలికలు చెరువులో బట్టలు ఉతికేం దుకు వెళ్లి నీట మునిగి దుర్మరణం పాలైన హృదయ విదారక సంఘటన మండలంలోని గురజలో సోమవారం జరిగింది. గురజ ఎస్టీ కాలనికి చెందిన డేగల నాగరాజు, అనంత దంపతులకు నలుగురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో రెండో కుమారై చిన్నమ్మ (13) మూగబాలిక. స్థానిక హోటల్లో పనిచేస్తోంది. మూడో కుమారై మాధవి (10) స్థానిక ప్రాథమిక పాఠశాలాలో మూడో తరగతి చదువుతోంది. వీరు రోజూ స్థానికంగా ఉన్న చాకిరేవులో బట్టలు ఉతికేందుకు వెళ్తుంటారు. ఇదే క్రమంలో సోమవారం రెండో పూట చిన్నమ్మ హోటల్ పని నుంచి, మాధవి స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. అనంతరం రెండు బకెట్లలో బట్టలు తీసుకుని చెరువు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతికేందుకు వెళ్లిన కుమారైలు ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లి చూడగా గట్టుపై బట్టలతో ఉన్న బకెట్లు మాత్రమే కనిపించాయి. సమీపంలో ఉన్న కాలనీలో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారని ఆరా తీశారు. అయితే వారు తమ ఇళ్లకు రాలేదని బంధువులు చెప్పడంతో అనుమానం వచ్చి చెరువులో గాలిం చగా బాలికల మృతదేహాలు లభిం చాయి. వాటిని చూసిన తల్లిదండ్రులు భోరున విలపించారు. ఈ సమాచారం అందుకున్న తహశీల్దార్ ఎం.సూర్యారావు, ఆర్ఐ జి.గౌతమ్‌కుమార్, సర్పంచి కె.వెంకటేశ్వరరావు, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు శేవా నాగజగన్‌బాబూరావు, గురజ ఎంపీటీసీ మాజీ సభ్యుడు జోగి శివప్రసాద్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వ పరంగా బాధితులకు సహాయం అందించేందుకు కృషిచేస్తానని తహశీల్దార్ పేర్కొన్నారు. -
‘జూన్’జాటం
నిత్యావసరాల ధరలు ఎన్నిమార్లు పెరిగినా ఎలాగోలా తట్టుకున్నారు. వేసవి రోజులన్నాళ్లు కరెంటు లేక పోయినా ఇంటిలో కాసింతైనా నిశ్చింతగా ఉండగలిగారు. కానీ ఇప్పుడా అవకాశం లేకుండా పోతోంది. వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో నేటినుంచి బడిగంటలు మోగబోతున్నాయి. ఇంటి బడ్జెట్లో పిల్లాడి చదువు ఖర్చులు వచ్చి చేరబోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, దుస్తులు, బూట్లు, స్టేషనరీ సామగ్రి కొనుగోళ్లకు తల్లిదండ్రులు బడ్జెట్ లెక్కలు వేసుకుంటున్నారు. పెరిగిన ఖర్చుతో వారి గుండె ఝల్లుమంటోంది. అంచనాలకు మించిన పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితిల్లో తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అదనపు బడ్జెట్‌తో అన్నీ సమకూర్చి బడికి పంపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బ్యాగులు ... పాఠశాలలు మొదలుకొని కళాశాలల విద్యార్థుల వరకు పుస్తకాల మోతకు బ్యాగులు అవసరం. మార్కెట్లో అన్ని రకాల తరగతులకు సంబంధించిన బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. నర్సరీ నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు రకరకాల అనువైన బ్యాగులు విక్రయిస్తున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు రూ.250 నుంచి రూ.700 ధరల్లో బ్యాగులు దొరుకుతున్నా యి. కళాశాల విద్యార్థులకు పాఠ్య, నోట్‌బుక్స్ పెట్టుకోవడంతోపా టు ల్యాప్‌టాప్ పెట్టుకునే సౌలభ్యం గల బ్యాగులూ లభిస్తున్నాయి. ఒక్కో బ్యాగు రూ.వెయ్యి నుంచి రూ..1500 వరకు ధర ఉంది. నోట్‌బుక్స్ గతంతో పోలిస్తే నోట్ బుక్స్ ధర 20 శాతం మేర పెరిగింది. నిరుడు రూ.10 ధర పలికిన పుస్తకం నేడు రూ.12కు చేరింది. లాంగ్ నోట్‌బుక్ రూ.20 నుంచి రూ.22 పలుకుతోంది. రఫ్ నోట్స్లైతే రూ.12 నుంచి మార్కెట్లో లభ్యమవుతున్నారుు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నోట్ బుక్స్ ధరల్ని విపరీతంగా పెంచేయడంతో బయటి మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. సైకిళ్లు ఇంచుమించు అన్ని ప్రైవేటు పాఠశాలలకు స్కూల్ బస్సులు ఉన్నారుు. బస్సు సౌకర్యం అందుబాటులో లేక, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థులుసైకిళ్లు వినియోగిస్తున్నారు. బాలురు, బాలికలకు సంబంధించి వివిధ రకాల మోడళ్లలో సైకిళ్లు మార్కెట్లో లభ్యమవుతున్నారుు. ఒక్కోటి రూ.3వేల నుంచి రూ.5వేలు పలుకుతోంది. కవర్లు, నేమ్ స్టిక్కర్లు.. ఏడాది పాటు పుస్తకాలు భద్రంగా ఉండాలంటే కనీస జాగ్రత్తలు అవసరం. పుస్తకాలు చిరగకుండా, మారిపోకుండా ఉండేందుకు అట్టలు, నేమ్ సిక్కర్లు తప్పనిసరి. వివిధ రకాల బొమ్మలతోకూడిన కాగితం, సింథటిక్ అట్టలపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. పుస్తకాలకు భ ద్రతతో పాటు అందాన్నిఇచ్చే కవర్లు నాణ్యతనుబట్టి రూ.15నుంచి రూ.75వరకు, స్టిక్కర్లురూ.3 నుంచిరూ.10 వరకుమార్కెట్లో ధరపలుకుతున్నాయి. స్కేలు రూ.10 నుంచి రూ.45, పరీక్ష ప్యాడ్ రూ.20 నుంచి రూ.135 వరకు ధర ఉంది. టిఫిన్ బాక్స్‌లు.. విద్యార్థులు పాఠశాలకు తీసుకెళ్లేందుకు టిఫిన్ బాక్స్‌లు కావా లి. మార్కెట్లో వాటి ధర రూ.200 నుంచి రూ.400 వరకు ఉన్నాయి. రక రకాల కంపెనీలతో కూడిన టిఫిన్ బాక్స్‌లు లభిస్తున్నాయి. టిఫిన్ డబ్బాలను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా బ్యాగులు అమ్ముతున్నారు. ఒక్కో బ్యాగు ధర రూ.60 నుంచి రూ.140 వరకు ఉన్నాయి. వాటర్ బాటిళ్లు.. కొన్ని పాఠశాలల్లో తాగునీరు అందుబాటులో ఉండడం లేదు. విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్స్‌ల వెంట తా గునీరు తీసుకెళ్తున్నారు. నీటిని చల్లగా ఉంచే బాటిల్స్ కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. వర్షాకాలం, చలికాలాల్లో చల్లని నీరు పడని విద్యార్థులు వాటర్ బాటిల్స్‌ను తీసుకెళ్లవచ్చు. వాటర్ బాటిళ్ల ధర రూ.20 నుంచి రూ.100 వరకు ఉంటోంది. నీటిని చల్లగా ఉంచే విధంగా రూపొందించిన ప్రత్యేక బాటిళ్లురూ.200కు విక్రయిస్తున్నారు. షూస్.. సాక్స్‌లు.. నలుపు, తెలుపు బూట్లు, సాక్స్‌లు కూడా పాఠశాల ప్రారంభంతో కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. తరగతి, వయసు పెరగడంతో ఏటా బూట్లు కొనుగోలు చేయక తప్పడం లేదు. నర్సరీ విద్యార్థులకు రూ.150 నుంచి రూ.300 వరకు ఉన్నాయి. పదో తరగతి విద్యార్థులకు రూ.200 నుంచి రూ.500 వరకు బూట్ల ధరలు ఉన్నాయి. సాక్స్‌ల ధరలు రూ.25 నుంచి రూ.40 వరకు ఉన్నాయి. కాటన్, నైలాన్ సాక్స్‌లు కూడా ఉన్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు సాక్స్లపై పాఠశాల పేరును ముద్రించి అక్కడే విక్రయిస్తున్నాయి. పెన్నులు, పెన్సిళ్లు.. పెన్నులు, పెన్సిళ్లు లేకపోతే విద్యార్థులకు చదువు సాగదు. పెన్నులు రూ.3 నుంచి రూ.200 వరకు ఉన్నాయి. పెన్సిల్ రూ.2 నుంచి రూ.50 వరకు, ఎరేజర్ రూ.1 నుంచి రూ.5 వరకు లభిస్తున్నాయి. పలకలు, జామెట్రీ బాక్స్‌లు నర్సరీ నుంచి యూకేజీ వరకు పలకల వినియోగం తప్పనిసరి. మార్కెట్లో పిల్లలను ఆకట్టుకునేందుకు రకరకాల పలకలను ప్రవేశపెట్టారు. నలుపు రంగుపలక రూ.20కు లభిస్తోంది. చిన్నారుల్ని ఆకట్టుకునే మ్యాజిక్ స్లేట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి ఒక్కోటి రూ.200. వివిధ రకాల జామెట్రీ బాక్స్‌లు రూ.20 నుంచి రూ.300 వరకు లభిస్తున్నాయి. యూనిఫాం.. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు తప్పనిసరి. నర్సరీ నుంచి పదో తరగతి వరకు యూనిఫాం ఉండాల్సిందే. వయసు, తరగతిని బట్టి ఒక్కో విద్యార్థికి రూ.300 నుంచి రూ.1000 వరకు యూనిఫాంకు ఖర్చు చేయాల్సి వస్తుంది. యూనిఫాం బట్టల అమ్మకాలు జరుగుతున్నప్పటికీ కుట్టు కూలీ ఖర్చు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు రెడీమేడ్ దుస్తులపై మొగ్గు చూపుతున్నారు. ఒక్కో స్కూల్‌కు ఒక్కో రకమైన యూనిఫాం ఉండడంతో అన్ని షాపుల్లో వాటి అమ్మకాలు సాగుతున్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలల్లోనే యూనిఫాంలు విక్రయిస్తున్నాయి. టై.. బెల్ట్.. టై.. బెల్ట్‌లు కూడా మార్కెట్లో అన్ని పాఠశాలలకు సంబంధించినవి అందుబాటులో ఉన్నాయి. పాఠశాలల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. స్కూళ్లో ఒక్కో టై రూ.50 నుంచి రూ.100 వరకు ఉంటుంది. బయట మార్కెట్లో వ్యాపారులు తక్కువ ధరకే టై, బెల్టుల అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో టై రూ.10 నుంచి రూ.20, బెల్ట్‌లు రూ.15 నుంచి రూ.30లకే లభిస్తున్నాయి. అప్పులు చేస్తున్నాం.. ఈ సంవత్సరం పంటలు బాగా పండలేదు. ఖరీఫ్ కోసం ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు పెట్టే కాలం వచ్చింది. ఎరువులు, విత్తనాలు కొనడానికే అప్పులు చేస్తున్నాం. ఇప్పుడే పిల్లలను స్కూలుకు పంపే సమయం వచ్చింది. వాళ్లకూ పైసలు కావాలి. మరింత అప్పు చేయక తప్పేలా లేదు. - శేఖర్‌రెడ్డి, నారెగూడ భారం పెరుగుతోంది.. పిల్లలను పాఠశాలలకు పంపాలంటే వారికి పుస్తకాలు, బూట్లు, యూనిఫాంలు, బ్యాగులు కొనాలి. సీజన్ కావడంతో వాటి ధరలు మండిపోతున్నాయి. స్కూలు ఫీజులు విపరీతంగా పెరిగిపోయాయి. బస్‌ల ఫీజులు కూడా బాగా పెరిగాయి. ఏం చేస్తాం పిల్లల కోసం భారం మోయాల్సిందే. - ప్రభాకర్, గుబ్బడిపత్తేపూర్ ప్రభుత్వ ఆజమాయిషీ లేదు.. ఫీజుల వసూలపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వేలకువేల రూపాయలు వసూలుచేస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. - డి. లలిత, విద్యార్థి తల్లి అప్పుల నెలగా మారింది.. ప్రైవేటు స్కూళ్ల అడ్డగోలు నిబంధనలతో జూన్ అంటేనే తల్లితండ్రులకు అప్పుల నెలగా మారింది. పుస్తకాలు, టైలు, పెన్నులు తదితర వస్తువులన్నీ పాఠశాలల్లోనే కొనుగోలు చేయలనడంతో ఎక్కువ ధరలు వెచ్చించి అప్పుల పాలవుతున్నాం. - మామిండ్ల ముత్యాలుయాదవ్, విద్యార్థి తండ్రి -
ఈ ప్యాంటు కొవ్వును కరిగిస్తుంది
నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఇతర ఎక్సర్సైజులు చేస్తున్నప్పుడు ఈ ప్యాంటును ధరిస్తే.. ఇది మన శరీరంలోని కొవ్వును కరిగిస్తుందట! ‘స్కినెసియాలజీ ప్యాంటు’గా పేరుపెట్టిన దీనిని న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు తయారు చేశారు. అంతర్గతంగా రబ్బరు బ్యాండ్లతో ఉండే ఈ దుస్తులు కండరాలపై ఒత్తిడి పెంచి, వాటి కదలికలను కొద్దిగా అడ్డుకోవడం ద్వారా కొవ్వు కరిగిపోయేలా చేస్తాయట. అయితే ఈ దుస్తులు ఎక్సర్సైజులకు ప్రత్యామ్నాయం కాదని.. పలు ఎక్సర్సైజులు చేస్తున్నప్పుడు అదనపు కసరత్తు మాదిరిగా మాత్రమే ఇవి పనికొస్తాయని చెబుతున్నారు. మామూలుగా వ్యాయామం చేయలేనివారికీ ఉపయోగకరమని అంటున్నారు. సాధారణ దుస్తులతో వ్యాయామం చేసినప్పటి కన్నా.. వీటిని ధరించినప్పుడు 20 శాతం కొవ్వు అదనంగా కరుగుతుందట. వీటిని త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఇన్నాళ్లు బతికి‘బట్ట’ కట్టింది..
ఈ చిరిగిపోయిన బట్టలు చూశారా.. ఇవి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవట. సరిగ్గా చెప్పాలంటే.. వీటి వయసు 3 వేల ఏళ్లు! ఇటీవల చైనాలోని యాంగాయ్ సమాధుల్లో పురాతత్వ శాస్త్రవేత్తలకు లభ్యమైన ఈ ప్యాం టు తరహా దుస్తులపై చిన్నపాటి డిజైన్లు కూడా ఉన్నాయి. అప్పట్లో అశ్వికులు వీటిని వేసుకునేవారని చెబుతున్నారు. -
వర్ణం: ఏకవస్త్రులు
వీళ్లు జపాన్‌లోని ‘టోక్యో జెంటాయి క్లబ్’ సభ్యులు. జెంటాయి అంటే శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులని అర్థం. ఈ జెంటాయిలు నెలా రెండు నెలలకోసారి సమావేశం అవుతారు, వేడుకలు నిర్వహించుకుంటారు. ఆ సందర్భంలో చేతులూ, కాళ్లూ, ముఖమూ పూర్తిగా మునిగిపోయేలా ఇలాంటి జెంటాయిలు ధరిస్తారు. భౌతిక శరీరానికి ప్రాధాన్యతను తగ్గించడం ద్వారా విముక్తి సాధించడం ఈ సమూహపు లక్ష్యం! రోబో వర్సెస్ రోబో రోబోలు సరదాగా ఫుట్‌బాల్ ఆడటమే కాదు, సీరియస్‌గా కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఇటీవలే ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ‘రోబోకప్ ఇరాన్ ఓపెన్’ జరిగింది. జర్మనీకి చెందిన లీప్జిగ్ యూనివర్సిటీ, నెదర్లాండ్స్‌కు చెందిన వాన్ అమ్‌స్టర్‌డామ్ యూనివర్సిటీ లాంటివి ఇందులో పాల్గొన్నాయి. ఫొటోలోవి జర్మనీ జట్టు. నాలుగు రోబోలు ఒక జట్టుగా ఉండే ఈ పోటీల్లో స్థానిక ఇరాన్ జట్టు విజేతగా నిలిచింది. అన్నట్టూ, రోబోటిక్స్‌ను ప్రమోట్ చేయడంలో భాగంగా జరిగే రోబో సాకర్ ప్రపంచ కప్ పోటీలు 1997 నుంచి జరుగుతున్నాయి. ఈ ఏడాది వేదిక బ్రెజిల్. ముందుముందు మారడోనా, రోనాల్డోల స్ఫూర్తితో రోబోడోనా, రోబోల్డో ఏమైనా వస్తాయేమో! పిల్ల పబ్బులు పబ్బుల్లోని సంగీతహోరు, ఆ మోతపుట్టించే ఊపు కోసమే అక్కడికెళ్తారు యువకులు! కానీ ఇక్కడ మాత్రం పిల్లలకు తగ్గట్టుగా చేసిన ఏర్పాటిది. లండన్‌లో జరిగిన ‘బిగ్ ఫిష్ లిటిల్ ఫిష్’ వేడుకలో ఇది భాగం. చిన్నపిల్లలకు హితకరమైన వాతావరణమూ, వాళ్లకు తగిన విద్యుద్దీపాలూ ఏర్పాటుచేయడమూ, చిన్నారులు వినదగిన పాటలు డీజేలు ప్లే చేయడమూ ఈ ఉత్సవ ప్రత్యేకత! -
ఆజన్మం: సబ్బునురగలాంటి సంగతులు
దుస్తుల్ని ఉతుకడంలో ఈ మజా ఉండదు. అలా కంటిముందట శుభ్రమైపోయే గుణం బట్టల్లో లేకపోవడం వల్లనేమో! సబ్బు నురగను చూస్తే మాత్రం ఉత్తేజం కలుగుతుంది. ‘చిన్నప్పుడు’ అమ్మకోసం గిన్నెలు తోమిపెట్టాను. ఎడమచేత్తో ‘పుష్’ చేస్తూ, కుడిచేత్తో ‘పుల్’ చేస్తూ గిన్నెను గుండ్రంగా తిప్పడం తోమడంలో ఒక టెక్నిక్! ఆ రెండూ నిజంగా జరుగుతున్నాయా అని గుర్తించలేనంత సమన్వయంతో చేతులు పనిచేయడం ఒక ఆశ్చర్యం. అయితే, ఆ గిన్నె అలా తిరుగుతూ, పడే నీటి ధారకు మురికి అలా వదులుతూ పోతూవుంటే చూడ్డానికి బాగుంటుంది. పాత్రలు రాతివెండివై, తోమడానికి వాడింది బూడిదైతే గనక, ఆ ఫీలింగ్ రెట్టింపవుతుంది.అదే, దుస్తుల్ని ఉతుకడంలో ఈ మజా ఉండదు. బహుశా, అలా కంటిముందట శుభ్రమైపోయే గుణం బట్టల్లో లేకపోవడం వల్లనేమో! కానీ సబ్బు నురగను చూస్తే మాత్రం ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా దానిమీద ఏర్పడే గాలి నీడలు! నురగ బుడగలాంటి ఒక ఇల్లుండి, అలా గాల్లో తేలిపోయి, మబ్బుల మీద కాసేపు దొర్లి, ఠప్‌మని అది నిశ్శబ్దంగా చిట్లిపోయినప్పుడు విరిగిపడే తుంపరముక్కలకు చప్పున కళ్లు మూసుకుని చప్పట్లు కొట్టి, కిందపడకుండా జాగ్రత్తగా మేఘాల్ని పట్టుకుని భూమ్మీదకు దుంకి... చిన్నతనపు పెద్దకోరిక! అదే చిన్నతనంలో బ్రెడ్డు నిర్మాణం నన్ను ఆశ్చర్యగొలిపేది. తెరలు తెరలుగా, జాలిజాలిగా, ఆ డబల్రొట్టెలో అన్ని గదులు ఉండటం చిత్రంగా ఉండేది. ఎలా ఏర్పాటు చేసివుంటారు! అవి పాలల్లో మరింత రుచిగా ఉండటానికి నాకు ఈ బుల్లిగదులూ కారణమే! అదే చిరు గదుల నిర్మాణం వల్ల దోమతెరను చూసినా నాకు బాగుంటుంది. అలా నిలబడిపోయి ఎంతసేపైనా చూస్తూవుండొచ్చు. అయితే, ఇది చిత్రపడి చూడటం కాదు. ఒక రొమాన్స్ ఏదో ఉంటుందందులో! ఎందుకో అడ్డు-నిలువు గీతలు, అవి ఏర్పరిచే పటాలు నాకు ముచ్చటేస్తాయి. కాగితం మీద చతురస్రం బాగుంటుంది. అడ్డము, పొడవు మాయమైపోయిన ఒక పూర్ణ ఆకృతి ఏదో అందులో ఉంటుంది. అయితే వస్తురూపంలో మాత్రం దీర్ఘచతురస్రం ఇంపుగా ఉంటుంది. వృత్తం ఉత్తి వృత్తంగా బాగోనిది ఆమ్మాయిల రింగుల రూపంలో మాత్రం సార్థకత చేకూర్చుకుంటుంది. మా ఇంట్లోకి కరెంటు వచ్చిన చారిత్రక సందర్భం నాకు గుర్తుంది. అంతకుముందు ఇంట్లో ‘ఎక్క’లుండేవి. వాటిని పెట్టడానికి చెమ్మలు! సాయమానులో, అర్రలో, చంకలో, ముందింట్లో, వాకిట్లో ఈ చెక్కతో చేసిన చెమ్మలు గోడకు కొట్టివుండేవి. అవి లేకపోతే దీగుట్లో పెట్టేవాళ్లం. పొద్దు గూట్లో పడగానే, అమ్మ దీపాలు ముట్టించేది. కొద్దికొద్దిగా కిరోసిన్‌ను తాగుతూ వత్తి మండటం మొదలయ్యేది. కింద చిక్కటి పసుప్చచ్చ, తర్వాత ఎరుపు, ఆపైన నలుపు ఆవరించివుండే ఈ మంటను ఎంతసేపైనా అలా చూడాలనిపించేది. వత్తి కొన్నిరోజులు కాలాక, దానిమీద ఏర్పడే నల్లటి కొరుకులను చేత్తో దూస్తుంటే అవి వేళ్లకు కలిగించే స్పర్శ బాగుండేది, నల్లటి మసిరంగు అంటినప్పటికీ. ఎప్పుడూ కాదుగానీ ఒక ప్రత్యేక మూడ్‌లో ఉన్నప్పుడు కిరోసిన్ వాసన కూడా బాగుంటుంది. ముదురు కలుపు తీసిన తర్వాతి వరిపొలం కొన్నిసార్లు నా సాయంకాలపు నేత్ర విడిది! వరినాట్లు వేయడంలో శ్రమసౌందర్యం ఉండొచ్చేమోగానీ, అప్పుడే నాటిన వరిపొలంలో సొగసేమీ లేదు. కానీ క్రమంగా- ఒడ్ల మీది బురద తడి ఆరిపోయి, పక్కకు వాలిపోయిన పనలు నిటారుగా నిలబడుతూ, గంట్లు విస్తారమవుతూ, ఆకులు ముదురాకుపచ్చ రంగును సంతరించుకుంటూ... చెడ్డీలనాటి బాల్యంలోని కుదురులేనితనాన్ని వదిలించుకుని, కౌమారంలోకి వచ్చాక ఉండే శారీరక ఒద్దికను అలవర్చుకుని... పొద్దుగుంకే వేళలో ఏకప్రేయసి నియమంలేని చిరుగాలి తుంటరిగా మేను నిమురుతుంటే అలలాగా ఆనందనృత్యం చేస్తూ... తినబోయేది అన్నాన్నా? తినవల్సింది ఈ అందాన్నా? అలా తదేకంగా చూడొద్దంటారుగానీ, నిద్దరోతున్న బుజ్జాయిల ముఖాల్ని చూడగలగడం అదృష్టం! పిల్లి ఒళ్లు విరుచుకోవడం చూడదగిన దృశ్యం! వేసివున్న మెత్తలు, తెరిచివున్న కిటికీ రెక్కలు, గూనపెంకుల ఇండ్లు, ‘జుయ్య్’మని చిరుమండే వెలుగు జాలి కందిళ్లు, పాతకాలపు చేతిరాతలు... వాటితో ముడిపడిన ఏ భావన వల్లనో నాకు ఆత్మీయంగా తోస్తాయి. ఏ టీవీ రీమోట్ ప్యాకింగ్ కోసమో వాడే పాలిథీన్ గాలిబుడగలను చిట్లిస్తూ ఉంటే కూడా సరదాగా ఉంటుంది. ఉత్తి శూన్యమే! కానీ శూన్యంలో ఏమీ లేదని ఎలా అనగలం? - పూడూరి రాజిరెడ్డి -
ఆవిష్కరణం: జిప్పర్ !
కొన్ని కొన్ని విషయాలు మనకసలు స్ఫురించనే స్ఫురించవు. అరె కరెంటు లేకపోతే ఎంత పనయ్యేది, టీవీ లేకుంటే ఏమైపోయేవారం అనుకుంటాం గాని ఏ రోజైనా... జిప్పర్ (జిప్పు) లేకపోతే ఎలా అని ఆలోచించామా... అది ఒక ఇన్వెన్షన్ అనే మనకనిపించదు. కానీ, నేటి కాలంలో అయితే దాని అవసరం మనకెంతో ఉంది. కేవలం మనం వేసుకునే దుస్తుల్లోనే కాకుండా అనేక ఇతర వస్తువుల్లో దాని వాడకం బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే... ఈ ప్రపంచంలో దాని ఆవిష్కరణకు దక్కిన ప్రాధాన్యం తక్కువ.. సైకిల్ని కనిపెట్టిన వారు, రేడియోని కనిపెట్టిన వారు తెలుసుగాని ఈ జిప్పును కనిపెట్టిందెవరో తెలియదు. ప్రస్తుతం మనం వాడుతున్న సౌకర్యవంతమైన జిప్పర్‌ను కనుక్కోవడానికి జిప్పర్ కనిపెట్టాక 80 సంవత్సరాలు పట్టింది. జిప్పర్‌కు మొట్టమొదట పేటెంట్ పొందిన వ్యక్తి ఎలియాస్ హౌవే. (కుట్టు మిషను కనిపెట్టినది కూడా ఈయనే). 1851 లో అతను దీనికి పేటెంట్ పొందారు. దాన్ని ‘ఆటోమేటిక్ కంటిన్యూయస్ క్లోతింగ్ క్లోజర్’ అని పిలుచుకున్నాడు. కానీ దాన్ని అతను పెద్దగా మార్కెట్ చేసుకోలేదు. దానికి విట్కాంబ్ జడ్సన్ మార్పులు చేసి ‘క్లాస్ప్ లాకర్’గా పేరు పెట్టారు. దీన్ని 1893 చికాగో ప్రపంచ ప్రదర్శనలో ప్రదర్శించారు. జడ్సన్ ఆధ్వర్యంలోని టాలోన్ కంపెనీ డిజైనర్ హెడ్ గిడియాన్ సండ్బాక్ జిప్పర్‌కు కొన్ని హంగులు కల్పించి మార్పులు చేసి జనామోదనీయంగా రూపొందించారు. అలా జిప్ కనిపెట్టిన ఎంతో కాలం తర్వాత కానీ అది పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదు. అంటే... ఈ లెక్కన జిప్పర్ వయసు వందేళ్ల లోపే! -
ఆవిష్కరణం: జిప్పర్ !
కొన్ని కొన్ని విషయాలు మనకసలు స్ఫురించనే స్ఫురించవు. అరె కరెంటు లేకపోతే ఎంత పనయ్యేది, టీవీ లేకుంటే ఏమైపోయేవారం అనుకుంటాం గాని ఏ రోజైనా... జిప్పర్ (జిప్పు) లేకపోతే ఎలా అని ఆలోచించామా... అది ఒక ఇన్వెన్షన్ అనే మనకనిపించదు. కానీ, నేటి కాలంలో అయితే దాని అవసరం మనకెంతో ఉంది. కేవలం మనం వేసుకునే దుస్తుల్లోనే కాకుండా అనేక ఇతర వస్తువుల్లో దాని వాడకం బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే... ఈ ప్రపంచంలో దాని ఆవిష్కరణకు దక్కిన ప్రాధాన్యం తక్కువ.. సైకిల్ని కనిపెట్టిన వారు, రేడియోని కనిపెట్టిన వారు తెలుసుగాని ఈ జిప్పును కనిపెట్టిందెవరో తెలియదు. ప్రస్తుతం మనం వాడుతున్న సౌకర్యవంతమైన జిప్పర్‌ను కనుక్కోవడానికి జిప్పర్ కనిపెట్టాక 80 సంవత్సరాలు పట్టింది. జిప్పర్‌కు మొట్టమొదట పేటెంట్ పొందిన వ్యక్తి ఎలియాస్ హౌవే. (కుట్టు మిషను కనిపెట్టినది కూడా ఈయనే). 1851 లో అతను దీనికి పేటెంట్ పొందారు. దాన్ని ‘ఆటోమేటిక్ కంటిన్యూయస్ క్లోతింగ్ క్లోజర్’ అని పిలుచుకున్నాడు. కానీ దాన్ని అతను పెద్దగా మార్కెట్ చేసుకోలేదు. దానికి విట్కాంబ్ జడ్సన్ మార్పులు చేసి ‘క్లాస్ప్ లాకర్’గా పేరు పెట్టారు. దీన్ని 1893 చికాగో ప్రపంచ ప్రదర్శనలో ప్రదర్శించారు. జడ్సన్ ఆధ్వర్యంలోని టాలోన్ కంపెనీ డిజైనర్ హెడ్ గిడియాన్ సండ్బాక్ జిప్పర్‌కు కొన్ని హంగులు కల్పించి మార్పులు చేసి జనామోదనీయంగా రూపొందించారు. అలా జిప్ కనిపెట్టిన ఎంతో కాలం తర్వాత కానీ అది పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదు. అంటే... ఈ లెక్కన జిప్పర్ వయసు వందేళ్ల లోపే!