వేసవి వేడిమిని తట్టుకోవాలి, కంఫర్ట్‌గా ఉండాలి అదే టైమ్‌లో స్టైలిష్‌గానూ కనిపించాలి. కాటన్ కుర్తీ పైకి బాందినీ, చందేరీ, ఇకత్, సిల్క్ ఓవర్ కోట్లు ఇప్పుడు బెస్ట్ ఛాయిస్‌గా ఉంటున్నాయి. బోహోస్టైల్‌ని తలపిస్తూ, సమ్మర్ స్పెషల్‌గా ఉండే ఈ స్టైల్ ఏ సందర్భానికైనా బాగా నప్పుతుంది.
కలర్‌ఫుల్‌గా.. కంఫర్టబుల్‌గా..
సంప్రదాయ వేడుకల్లో షిమ్మరీ లుక్ ఉండే లాంగ్ ఫ్రాక్ట్, వాటి మీదకు సిల్క్ డిజైనర్ లాంగ్ ఓవర్ కోట్స్ ప్రత్యేకతను చూపుతాయి.
లాంగ్ ఫ్రాక్ లేదా లాంగ్ కుర్తీ ఈ స్టైల్‌కి ఎంచుకోవచ్చు. సౌకర్యాన్ని బట్టి స్లీవ్స్ లేదా స్లీవ్‌లెస్ టాప్స్‌ని సెలక్ట్ చేసుకోవాలి. కాటన్ కుర్తీ ఏ ఫ్యాబ్రిక్ అయినా ఫ్లోరల్స్‌లో లేదా భిన్నమైన ప్రింట్లు ఉన్న ఓవర్ కోట్స్ బాగా నప్పుతాయి. ఈ స్టైల్ డ్రెస్సింVŠ బోహో లుక్‌తో అట్రాక్ట్ చేస్తుంది. ఈ కాలానికి తగినట్టుగా ఫ్యాషన్ జ్యువెలరీ దీనికి సరైన ఎంపిక అవుతుంది.
కాటన్ కుర్తీ–పైజామా మీదకు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న కాటన్ ఓవర్‌కోట్‌ను ధరించవచ్చు. దుపట్టా అవసరం లేని ఈ స్టైల్ క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ సెట్
అవుతుంది.కాటన్ లాంగ్ కుర్తీకి ఇక్కత్ లాంగ్ ఓవర్ కోట్ ధరిస్తే ఉక్కబోతను, స్టైల్‌ని రెండింటినీ బ్యాలెన్స్ చేయవచ్చు.
సింపుల్ అండ్ గ్రేస్‌గా కనిపించే లుక్ టాప్ అండ్ బాటమ్‌కి ఫ్లోరల్ ఓవర్ లాంగ్ కోట్ సూపర్ స్టైలిష్ లుక్‌గా కనిపిస్తుంది.
ప్లెయిన్ డ్రెస్ ధరించినప్పుడు పూర్తి కాంట్రాస్ట్ ఓవర్ కోట్ వేసుకుంటే ఎక్కడ ఉన్నా స్పెషల్‌గా
కనిపిస్తారు.లాంగ్ ఫ్రాక్‌కి అటాచ్ చేసినట్టుగా ఉండే ఫ్రాక్ స్టైల్ ఓవర్ కోట్ పార్టీలో స్టైలిష్ లుక్‌తో వెలిగిపోతుంది.
ఓవర్‌కోట్‌లా అనిపించే లాంగ్ ఫ్రాక్ డ్రెస్‌ను కూడా ఈ స్టైల్‌కి ఎంపిక చేసుకోవచ్చు. సమ్మర్‌లో ఈవెనింగ్ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్‌గా వెలిగి΄ోవచ్చు.
సిల్క్ టాప్స్ అయినా ఈవెనింగ్ టైమ్‌కి ఓకే అనుకున్నవారు అదే కాంబినేషన్‌లో వచ్చే సిల్క్ ఓవర్ కోట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఇదీ చదవండి: Madhumita Murgia: డీప్‌ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు!
Comments
Please login to add a commentAdd a comment