బొమ్మను చేసి దుస్తులు వేసి | shopping malls mannequins story | Sakshi
Sakshi News home page

బొమ్మను చేసి దుస్తులు వేసి

Published Fri, Aug 12 2016 10:48 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

బొమ్మను చేసి దుస్తులు వేసి - Sakshi

బొమ్మను చేసి దుస్తులు వేసి

సాక్షి,సిటీబ్యూరో: కాలు కదపవు. కావాలని అడగవు. కదలక మెదలక ఉంటాయే గానీ రోజుకో డ్రెస్‌ కావాలి. అవును.. వాటి బాధ్యత చాలా పెద్దది మరి. షోరూమ్‌లోకి కస్టమర్స్‌ని రప్పించాలన్నా.. డిజైన్లతో మెప్పించాలన్నా.. మానెక్విన్‌దే ప్రధాన పాత్ర. అందుకే వీటిని మెరిపించే దుస్తుల డిజైనింగ్‌ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తప్పవంటున్నారు డిజైనర్స్‌.
                                    – శిరీష చల్లపల్లి

మోడల్స్‌ కోసం దుస్తులు డిజైన్‌ చేయడం ఓకే. కానీ మానెక్విన్‌ కోసం డిజైన్‌ చేయడం చాలా కష్టమంటారు డిజైనర్లు. చుడీదార్, జీన్స్, లాంగ్‌ స్కర్ట్స్, శారీస్‌.. ఇలా వేసుకునే డ్రెస్, ప్యాటర్న్, కలర్స్‌ ఏదైనా రోజుకో రకం లుక్‌లో ఫ్యాషన్‌ లవర్స్‌ని ఇంప్రెస్‌ చేయాలని ట్రై చేస్తుంటాయి షాపింగ్‌ మాల్స్, బోటిక్స్‌. అందులో భాగంగానే తమ మూవ్‌మెంట్‌ లేని మోడల్స్‌ను.. అవేనండీ మానెక్విన్‌లను నిత్యం వెరైటీ డిజైన్లతో అలంకరిస్తుంటాయి.

లేటెస్ట్‌కి అ‘డ్రెస్‌’ అవే..
ఆకుపచ్చ రంగు పరికిణి, పింక్‌ కలర్‌ ఓణి అనగానే అబ్బా అది నిన్నటి కాంబినేషన్‌. మరి లేటెస్ట్‌ కాంబినేషన్‌ ఏంటి? అని ప్రశ్నించుకుంటే సమాధానం ఎదురుగా కనిపిస్తుంది. మాల్స్, బొటిక్స్‌లలోని మానెక్విన్స్‌ రూపంలో. ‘పూటకో ఫ్యాషన్‌ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో మానెక్విన్‌ల ద్వారా మాత్రమే అప్‌ టు డేట్‌ ట్రెండ్స్‌ తెలియజేయగలమ’ని చెప్పారు ఓ బొటిక్‌ యజమాని. ఇందుకోసం ఎప్పటికప్పుడు ట్రెండ్స్‌ తెలియజేసేలా మానెక్విన్‌లకు ట్రయల్స్‌ వేసి మరీ డ్రెస్‌లు సెట్‌ చేస్తున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు.

దిమ్మ తిరిగి ‘బొమ్మ’ కనపడుతుంది..
కస్టమర్లకు న్యూట్రెండ్స్‌ తెలియజేయడం ఈ బొమ్మల వస్త్రధారణ వెనుక ఉద్దేశం. అయితే అదంత సులభమైన పని కాదంటున్నారు డిజైనర్లు. ‘శక్తియుక్తులన్నీ డిజైనింగ్‌పైనే వినియోగిస్తాం. కాదేదీ డిజైనింగ్‌కు అనర్హం అన్నట్టుగా పాత పీలికలు, న్యూస్‌ పేపర్, దారాలు, ఆకులు, పువ్వులు, ఇలా దేనితోనైనా ట్రెండ్‌ క్రియేట్‌ చేసేట్టుగా ఫ్యాషన్‌ వేర్‌ని రూపొందించే ప్రయోగాలు చేస్తుంటాం. దీని కోసం మానెక్విన్స్‌పై రకరకాల ట్రయల్స్‌ వేసి కొత్త సై్టల్స్‌ క్రియేట్‌ చేస్తాం. ఈ ట్రయల్‌ ఫొటోలు, వీడియోలు ఫేస్‌బుక్, ట్వీటర్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల లో పోస్ట్‌ చేస్తుంటాం. వాటి ద్వారా రివ్యూలు, కామెంట్స్‌ బేస్‌ చేసుకొని ఫైనల్‌ ప్రొడక్ట్‌ ఓకే చేస్తాం. ఆ తర్వాతే వాటిని మాల్స్‌లోని మానెక్విన్‌లకు ఫిట్‌ చేస్తారు. అప్పుడే అది ఒక ట్రెండ్‌గా మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసినట్టు అవుతుంద’ని సెలబ్రిటీ డిజైనర్‌ నిషా గాల తెలిపారు. ఇందుకోసం సెలెక్టివ్‌ థీమ్స్‌ కూడా ఉంటాయని, థీమ్‌ని బట్టి మేకోవర్‌ మొదలవుతుందని చెప్పారు.

ఎన్నో ప్రయోగాలు..
ట్రెండ్‌ సెట్‌ చేసేందుకు ముందస్తు ప్రయోగాల క్రమంలో వందల రకాల థీమ్స్‌ క్రియేట్‌ చేయాల్సి ఉంటుంది. ఎథినిక్‌ వేర్, బ్లాక్‌ అండ్‌ వైట్, నియాన్‌ కలర్స్, ఫ్లోరల్‌ , డేట్, అకేషనల్, సీజనల్, పిక్నిక్, ప్రామ్‌.. ఇలా ఒక్కో థీమ్‌ను సమయం, సందర్భం, సీజన్‌ని బట్టి ట్రెండ్‌ తెలియజేసేలా బొమ్మలకు బట్టలు కుడుతారు. బొమ్మ వేసుకున్న డ్రెస్‌.. తమ దేహంపై ఎలా ఉంటుందనేది చూపరులకు స్పష్టంగా అర్థమవ్వాలనే విషయం మర్చిపోరీ డిజైనర్లు.

కేవలం చున్నీ మాత్రమే కాకుండా ష్రగ్, డెనిమ్‌ జాకెట్, వెస్ట్‌ కట్‌.. ఇలా కూడా వేసుకోవచ్చని, చుడీదార్‌ల పైనే కాదు షార్ట్‌ టాప్‌ వెస్ట్రన్‌ డ్రెస్‌లపై సైతం చున్నీలను రకరకాలుగా ఫ్లవర్, బ్యాంగిల్స్‌ షేప్‌లలో.. ఎన్నో విధాలుగా సై్టలిష్‌గా వేసుకోవచ్చని, ఒక స్కార్‌్ఫని సింపుల్‌గా ఒక ముడి వేసి ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు.. ఇలా ఎన్నో విషయాలను మాల్స్‌లోని బొమ్మలను చూసి తెలుసుకొని ఫాలో అయ్యేందుకు వీలుగా డిజైన్స్‌ చేస్తుంటార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement