దేశీయ స్ఫూర్తి కోసం ఈ రోజు ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు తిరంగా రంగులను ట్రై చేయచ్చు. అయితే ఆరెంజ్, తెలుపు, పచ్చ మూడు రంగులను ఒకే డ్రెస్‌లో ఉండాలనుకునేవారు కొందరైతే, ఒకే కలర్ కాన్సెప్ట్‌తో స్పెషల్‌గా వెలిగిపోవాలనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాగని, గాఢీగా కాకుండా లేత రంగుల ప్రత్యేకతతోనూ మెరిసిపోవాలనుకుంటారు. అభిరుచికి తగినట్టుగా డ్రెస్‌ను ఎంపిక చేసుకునే స్పెషల్ డే కి స్పెషల్ లుక్.
యాక్ససరీస్..
► ఔట్‌ఫిట్స్‌లో ట్రై కలర్స్‌కి నో చెప్పేవాళ్లు ఇతర అలంకరణలో ప్రత్యేకతను చూపవచ్చు. అందుకు ట్రై కలర్ గాజులు, బ్రేస్‌లెట్స్ మంచి ఎంపిక అవుతుంది. ట్రై కలర్స్‌లో నెయిల్‌పాలిష్ డిజైన్‌నూ ఎంచుకోవచ్చు.
► వైట్ కుర్తా మీదకు ట్రై కలర్ దుపట్టా ఒక మంచి ఎంపిక అవుతుంది. ప్రత్యేకంగానూ ఉంటుంది.
► పూర్తి వైట్ గాగ్రా చోళీ లేదా మూడు రంగుల కలబోతగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయచ్చు.
► ఆరెంజ్ కలర్ శారీ, వైట్ కలర్ బ్లౌజ్ లేదా సేమ్ ఆల్ ఓవర్ ఒకే కలర్‌ని ఎంచుకోవచ్చు.
► జీన్స్ మీదకు గ్రీన్ కలర్ కుర్తా లేదా లాంగ్ ఓవర్ కోట్, ట్రై కలర్ జాకెట్ ధరించినా చాలు.
ప్రఖ్యాత డిజైనర్స్ సైతం తమ డిజైన్స్‌లో తెలుపు, పచ్చ, ఆరెంజ్‌ల ఒకే కలర్ కాన్సెప్ట్‌తో డిజైన్ చేస్తుంటారు. సందర్భాన్ని బట్టి మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ ఔట్‌ఫిట్‌ను మనమే సొంతంగా రీ డిజైన్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment