Passion
-
మ్యాగ్నెటిస్ట్.. విపిన్..
సాక్షి, సిటీబ్యూరో: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని నానుడి.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ ఉంటుంది. కొందరికి కాయిన్స్ సేకరించడం అలవాటు అయితే మరికొందరికి స్టాంప్స్ సేకరించడం అలవాటు. కానీ అందరికీ భిన్నంగా ఫ్రిడ్జ్ లకు అంటించే బొమ్మల మ్యాగ్నెట్స్ సేకరించడం ఆయనకు అలవాటు. ఆయన వృత్తి కంటి వైద్యం.. ఆయన ప్రవృత్తి ట్రావెలింగ్. అందరి లాగా ఏదో వెళ్లామా.. వచ్చామా అన్నట్టు కాకుండా ఆ ప్రదేశం చరిత్రను అందరికీ తెలియజేసేలా మ్యాగ్నెట్స్ సేకరించడం హాబీగా మలుచుకున్నాడు. అతడి పేరే డాక్టర్ అంథోనీ విపిన్ దాస్.ట్రావెల్లింగ్ ప్రాణం..విపిన్ దాస్ వృత్తి రీత్యా ఎంత బిజీ అయినా కూడా ఖాళీ సమయాల్లో ట్రావెలింగ్ చేయడం ఇష్టం. ట్రావెలింగ్‌తో ఎన్నో అనుభవాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎంతో తెలుసుకున్నానని విపిన్ చెబుతున్నాడు. అయితే ఏదైనా విభిన్నంగా చేయాలనే తలంపుతో కొత్తగా మ్యాగ్నెట్స్ సేకరించడం ప్రారంభించాడు.అలా దాదాపు ఏకంగా 500లకు పైగా మ్యాగ్నెట్స్ సేకరించాడు. అలా ఒక్కో ప్రదేశం చరిత్రను ఒక్కో మ్యాగ్నెట్ రూపంలో ఉండేలా చూసుకున్నాడు. అలా ఎన్నో దేశాలు, ప్రదేశాల చరిత్ర, సంప్రదాయాల గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా ట్రావెరి్నయా ఫెస్ట్‌ను నవంబర్ 15న హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరుపనున్నారు.తెలంగాణ చరిత్ర తెలుసుకునేలా.. సాధారణంగా ఒక్కో దేశం గురించి మ్యాగ్నెట్స్ సేకరించడం విపిన్ కు అలవాటు. కానీ తెలంగాణపై మక్కువతో తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై వినూత్నంగా మ్యాగ్నెట్స్ రూపొందించాడు విపిన్. అంతే కాకుండా తెలంగాణ సంస్కృతిపై మ్యాగ్నెట్స్ తో పాటు.. త్రీడీ బొమ్మలు కూడా రూపొందించారు. దీంతోపాటు అరౌండ్ ది వరల్డ్ పేరుతో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాడు. -
ఆటల రాజ్యంలో.. గెలుపు పాట!
గేమ్ ప్లేలోకి వెళితే... యాక్షన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘ఫైనల్ ఫాంటసీ’లో క్లైవ్ రాస్పెల్ అవుతారు. సాహస దారుల్లో ప్రయాణం చేస్తారు. జియోలొకేషన్–బేస్డ్ రోల్‌ప్లేయింగ్ గేమ్ ‘డ్రాగన్ క్వెస్ట్ వాక్’లోకి వెళ్లి మాన్స్టర్లతో తలపడతారు. హిట్ పాయింట్స్ కొడతారు. గేమింగ్ జోన్లోకి అడుగు పెడితే యూత్‌కు ఉత్సాహమే ఉత్సాహం. నిన్నటి వరకు అయితే ‘గేమింగ్’ అనేది యూత్‌కు ప్యాషన్ మాత్రమే. ఇప్పుడు మాత్రం ఫ్యాన్సీ కెరీర్ కూడా. గేమ్ డెవలపర్ నుంచి నెరేటివ్ డిజైనర్ వరకు ఎన్నో అవకాశాలు వారి కోసం ఎదురు చూస్తున్నాయి. ఆన్లైన్ కోర్సులు చేయడం నుంచి పుస్తకాలు చదవడం వరకు ఎన్నో విధానాల ద్వారా గేమింగ్‌కు సంబంధించిన సాంకేతిక విషయాలపై పట్టు సాధిస్తున్నారు...వీడియో గేమ్స్ అనేవి యూత్‌కు ఇక ‘జస్ట్ ఫర్ ఫన్’ ఎంతమాత్రం కాదు. తమకు నచ్చిన రంగంలోనే యువత ఉపాధి అవకాశాలు చూసుకుంటోంది. వీడియో గేమ్‌లపై అంతకంతకూ పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో డెవలపర్లు, డిజైనర్లు, టెస్టర్స్... మొదలైన నైపుణ్యవంతులకు డిమాండ్ పెరిగింది.‘గేమింగ్ అనేది ఇప్పుడు కేవలం రీక్రియేషన్ కాదు. సీరియస్ కెరీర్ ఆప్షన్’ అంటుంది భోపాల్‌కు చెందిన అనీష. ఆమె గేమింగ్ లోకంలోకి వెళితే మరో లోకం తెలియదు. అలాంటి అనీష ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలోనే కెరీర్‌ను వెదుక్కునే ప్రయత్నం చేస్తోంది.‘గేమింగ్’ అనే మహాప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు... ఇన్–డిమాండ్ రోల్స్, స్కిల్స్, కోర్సులు....మొదలైన వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటుంది యువతరం. ‘గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కు వ్యయప్రయాసలు అక్కర్లేదు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు’ అంటుంది ముంబైకి చెందిన కైరా. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఆన్లైన్ కోర్సు చేయడంతో పాటు బుక్స్ చదువుతోంది. గేమ్ డిజైన్‌కు సంబంధించి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ చేసింది.గేమ్ మెకానిక్స్ క్రియేట్ చేసే గేమ్ డెవలపర్లు, వోవరాల్ కాన్సెప్ట్, స్టోరీలైన్, క్యారెక్టర్లు, గేమ్‌ప్లేపై దృష్టి పెట్టే గేమ్ డిజైనర్లు, బగ్స్ బాధ లేకుండా చూసే అసూరెన్స్ టెస్టర్లు, విజువల్ ఎలిమెంట్స్‌ను క్రియేట్ చేసే గ్రాఫిక్ ఆర్టిస్లు, యానిమేటర్లు, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, వాయిస్ వోవర్లాంటి ఆడియో యాస్పెక్ట్స్కు సంబంధించిన సౌండ్ డిజైనర్లు...గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.‘ఆసక్తి, ప్రతిభ ఉండాలేగానీ యువతరం తమను తాము నిరూపించుకోవడానికి గేమింగ్ ఇండస్ట్రీలో బోలెడు అవకాశాలు ఉన్నాయి’ అంటున్నాడు వీఆర్ సొల్యూషన్స్ కంపెనీ ‘ఆటోవీఆర్’ సీయివో, కో–ఫౌండర్ అశ్విన్ జైశంకర్. ‘ఎలాంటి అవకాశాలు ఉన్నాయి’ ‘ఏ కోర్సు చేస్తే మంచిది’లాంటి వాటి గురించి అశ్విన్ జైశంకర్లాంటి నిపుణులు చెబుతున్న విషయాలను యువతరం జాగ్రత్తగా వింటోంది.‘అన్రియల్ ఇంజిన్ డెవలపర్ కోర్సు, యూనిటీ సర్టిఫైడ్ డెవలప్ కోర్సు, గేమ్ డిజైన్ అండ్ క్రియేషన్ స్పెషలైజేషన్... మొదలైనవి గేమ్ క్రియేషన్‌కు సంబంధించిన సరిౖయెన దారులు’ అంటున్నాడు అశ్విన్ జైశంకర్. గేమింగ్ కంటెంట్‌కు పెరుగుతున్న డిమాండ్, గేమింగ్ కంపెనీల విస్తరణ కారణంగా గేమింగ్ పరిశ్రమలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కోసం క్యాంపస్ నియామకాలు గణనీయంగా పెరిగాయి. ఎన్నో కంపెనీలు తమప్రాజెక్ట్లను దృష్టిలో పెట్టుకొని యూనివర్శిటీల నుంచి ప్రతిభావంతులైన వారిని నియమించుకుంటున్నాయి.మరోవైపు గేమింగ్ సెక్టార్లో ‘ఫ్రీలాన్సింగ్ ట్రెండ్’ పెరుగుతోంది. గేమ్ డెవలప్మెంట్కు సంబంధించి కీలక దశలో ఫ్రీలాన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. గేమ్ డెవలపర్ల నుంచి నెరేటివ్ డిజైనర్ల వరకు ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.మార్పు వచ్చింది..గేమింగ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే విషయంలో పిల్లల ఆసక్తి సరే, తల్లిదండ్రుల స్పందన ఏమిటి? అనే విషయానికి వస్తే... కొన్ని సంవత్సరాల క్రితం వరకు ‘గేమింగ్ అనేది కెరీర్ ఆప్షన్ కాదు’ అనే భావన వారికి బలంగా ఉండేది. ఈ పరిస్థితిలో ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది.‘ఒకప్పుడు గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో సందేహాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం తమ పిల్లలను గేమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన కోర్సులలో చేర్పించడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ పరిణామం ఇండస్ట్రీకి ఎంతో బలాన్ని ఇస్తుంది’ అంటున్నాడు గేమింగ్ కంపెనీ ‘బ్యాక్‌స్టేజ్ పాస్’ ఫౌండర్ సూర్య. -
50 ఏళ్ల వయసులో బైక్ రైడ్, డ్యాన్స్, ట్రెక్కింగ్..!
చుట్టుపక్కల వాళ్లంతా ఈ ఏజ్‌లో ఇవి నేర్చుకుంటున్నావా అని ఒకటే హేళన చేసేవారు ఆమెను. సోషల్ మీడియాలో సైతం ఈ వయసులో ఎందుకు మీకు..హాయిగా కృష్ణ.. రామా.. అనుకుంటూ కూర్చొక అన్న మాటలు వినిపిస్తున్నే ఉన్నాయి. అయినా లెక్కచేయకుండా ఉత్సాహభరితంగా తనకు నచ్చినవి అన్నీ చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు నీరూ సైనీ. ఆమె హర్యానాలోని పంచకులకి చెందిన 54 ఏళ్ల నీరూ సైనీ . సమాజంలో వృద్దులు అంటే ఇలానే ఉంటారనే మూస భావనను బ్రేక్ చేసింది నీరూ. ఆమె 40 ఏళ్ల వయసులో డ్యాన్సులు, బైకింగ్, ట్రెక్కింగ్ వంటివి నేర్చుకుని ఆదర్శంగా నిలిచింది. నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే వయసు అడ్డంకి కాదని ప్రూవ్ చేసి చూపించింది. ఇంతకీ ఆమె ఈ వయసులో ఇలా ఇవన్నీ నేర్చుకోవడానికి గల కారణం ఏంటంటే..చండీగఢ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నీరు కుంటుబ నేపథ్యం ఏంటంటే..నీరుకి 20 ఏళ్ల వయసులో పెళ్లయింది. ఆమె భర్త నేవీలో పనిచేస్తారు. ఆయనతో కలిసి సుమారు 26 దేశాలకు వెళ్లారు. అయితే ఆమె భర్తకు కేన్సర్ వచ్చిందని తెలిసిందో అప్పుడే ఆమె ప్రపంచం అంతా తలకిందులైపోయింది. 2000 సంవత్సరం అంతా నీరుకి బ్యాడ్ టైం అని చెప్పొచ్చు. భర్త మందులకే లక్షకు పైగా ఖర్చు అయ్యేది. ఎంతలా డబ్బు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆయన కేన్సర్‌తో పోరాడుతూ 2002లో మరణించారు. అప్పటికి ఆమెకు నాలుగు, పది సంవత్సరాల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ భారం అంతా నీరుపై పడింది. భర్త చికిత్స కోసం దాచుకున్న డబ్బంతా ఖర్చు అయ్యిపోవడంతో ఒంటరిగా కూతుళ్లను పెంచడం ఆమెకు పెను భారమయ్యింది. అయినా అలానే ట్యూషన్, చెబుతూ కాలం వెళ్లదీసింది. ఈలోగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంది. అలా ఆమె పదేహేనేళ్లు కూతుళ్ల బాధ్యతను నిర్వర్తించడంలోనే మునిగిపోయింది. నీరు పెద్ద కుమార్తె ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొంది మంచి ఉద్యోగం సంపాదించగా, చిన్న కుమార్తె కూడా మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యింది. ఇద్దరూ ఆమెను వదిలి విదేశాలకు వెళ్లిపోవడంతో ఒంటిరిగా అయిపోయింది నీలు. ఒక్కసారిగా వచ్చిపడ్డ ఒంటరితనం భరించలేకపోయింది. ఇది ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో అనూహ్యంగా బరువు తగ్గిపోయింది. ఆమె బాధను చూడలేక చిన్న కూతురు తల్లితో గడిపేందుకు ఒక ఏడాది సెలవు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ టైంలోనే ధ్యానం చేయడం స్కూబా డ్రైవింగ్, స్కై డైవింగ్ వంటి సాహస క్రీడలపై దృష్టిసారించింది. తన కూతుళ్ల సాయంతోనే తనకు నచ్చినవన్నింటిన అలవోకగా నేర్చుకుంది. అంతేగాదు 52 ఏళ్ల వయసులో రెండు సోలో బైక్ రైడ్లను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఆమె చండీగఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా చేస్తూ ఇవన్నీ నేర్చుకుంది. పైగా ప్రతి స్త్రీ తన కోసం తను జీవించాలని తన కలలను కొనసాగించాలని చెబుతోంది నీరు. వ్యక్తిగత జీవితంలోని విషాదం నుంచి తేరుకుని నిలదొక్కుకోవడమే గాక పిల్లల భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దింది. మళ్లీ జీవితంలో వచ్చి చేరిన శ్యూన్యతను చెదరగొట్టి కొత్త జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలిపింది. జీవితమనేది సవాలని దాన్ని నీకు నచ్చినట్లుగా మలుచుకుంటూ ముందుకు సాగిపోవాలని నీరు కథే చెబుతోంది కదూ..!.(చదవండి: ప్రపంచ సంగీత దినోత్సవం: సంగీతం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదా..?) -
రిపబ్లిక్ డే స్పెషల్.. 'మూడు రంగుల ముస్తాబు'
దేశీయ స్ఫూర్తి కోసం ఈ రోజు ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు తిరంగా రంగులను ట్రై చేయచ్చు. అయితే ఆరెంజ్, తెలుపు, పచ్చ మూడు రంగులను ఒకే డ్రెస్‌లో ఉండాలనుకునేవారు కొందరైతే, ఒకే కలర్ కాన్సెప్ట్‌తో స్పెషల్‌గా వెలిగిపోవాలనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాగని, గాఢీగా కాకుండా లేత రంగుల ప్రత్యేకతతోనూ మెరిసిపోవాలనుకుంటారు. అభిరుచికి తగినట్టుగా డ్రెస్‌ను ఎంపిక చేసుకునే స్పెషల్ డే కి స్పెషల్ లుక్. యాక్ససరీస్.. ► ఔట్ఫిట్స్లో ట్రై కలర్స్‌కి నో చెప్పేవాళ్లు ఇతర అలంకరణలో ప్రత్యేకతను చూపవచ్చు. అందుకు ట్రై కలర్ గాజులు, బ్రేస్లెట్స్ మంచి ఎంపిక అవుతుంది. ట్రై కలర్స్‌లో నెయిల్‌పాలిష్ డిజైన్‌నూ ఎంచుకోవచ్చు. ► వైట్ కుర్తా మీదకు ట్రై కలర్ దుపట్టా ఒక మంచి ఎంపిక అవుతుంది. ప్రత్యేకంగానూ ఉంటుంది. ► పూర్తి వైట్ గాగ్రా చోళీ లేదా మూడు రంగుల కలబోతగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయచ్చు. ► ఆరెంజ్ కలర్ శారీ, వైట్ కలర్ బ్లౌజ్ లేదా సేమ్ ఆల్ ఓవర్ ఒకే కలర్‌ని ఎంచుకోవచ్చు. ► జీన్స్ మీదకు గ్రీన్ కలర్ కుర్తా లేదా లాంగ్ ఓవర్ కోట్, ట్రై కలర్ జాకెట్ ధరించినా చాలు. ప్రఖ్యాత డిజైనర్స్ సైతం తమ డిజైన్స్‌లో తెలుపు, పచ్చ, ఆరెంజ్‌ల ఒకే కలర్ కాన్సెప్ట్‌తో డిజైన్ చేస్తుంటారు. సందర్భాన్ని బట్టి మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ ఔట్‌ఫిట్‌ను మనమే సొంతంగా రీ డిజైన్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సీతాఫలం, రామా ఫలం గురించి విన్నాం కానీ ఇదేంటి కృష్ణఫలం?. ఔనండి! మీరు విన్నది నిజమే. మనకు నిజంగానే దీని గురించి పెద్దగా తెలియదు గానీ దీని వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. భారతదేశంలో ఈ పండుని ప్యాషన్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం పాసిఫ్లోరా ఎడులిస్. ఇది ఉష్ణమండల పండు, ఇది ఒక విలక్షణమైన రూపాన్ని కలిగి ఉంటుంది. చూడటానికి గుండ్రంగా లేదా ఓవెల్ ఆకారంలో ఉంటుంది. దీని బయటి భాగం గట్టిగా ఉంటుంది. లోపలి భాగం జ్యూ'సీగా మెత్తగా ఉంటుంది. ఎక్కువగా ఊదా లేదా తిక్ మెరూన్ కలర్లో లేదా పసుపు రంగులో ఉంటాయి. ఈ పండును ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. ఆరోగ్య ప్రయోజనాలు ఇది శక్తిమంతమైన ఫైబర్ మూలం. పిసిటానాల్' అనే సమ్మేళనం మదుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే పోటాషియం రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అలాగూ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచుతుంది ఈ పండులో విటమిన్ ఏ బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. అందువల్ల దీని తీసుకుంటే అంధత్వం రాదు. పైగా కంటి పనితీరు మెరుగుపడుతుంది. అంతేగాదు బరువును తగ్గించే గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. నిజానికి, కృష్ణఫలం సారం యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. పెరిగిన శరీర బరువు, కొవ్వు పదార్ధం , గ్లూకోస్ టాలరెన్స్ ద్వారా ఈ లక్షణాలు సులభంగా మెరుగుపడతాయి. బరువు పెరగడం వల్ల కలిగే జీవక్రియ రుగ్మతలను తొలగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించే ఆహారంలో ఈ పండును చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఇందులో కేన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. (చదవండి: మెంతులు..ఇంతులు అంటూ తెగ తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!) -
కమ్మని కాఫీలాంటి కళ
యువతరంలో చాలామంది..తమ క్రియేటివ్ స్కిల్స్‌ను అభిరుచికి మాత్రమే పరిమితం చేసుకోవడం లేదు. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ఆసక్తి, అభిరుచులనే కెరీర్ ఛాయిస్‌గా తీసుకుంటున్నారు. కాపీరైటర్ కావాలనే కల కూడా అందులో ఒకటి. ‘మేకిట్ సింపుల్. మేకిట్ మెమొరబుల్’ ‘రైట్ వితౌట్ ఫియర్. ఎడిట్ వితౌట్ మెర్సీ’... లాంటి మాటలను గుండెలో పెట్టుకొని తమ కలల తీరం వైపు కదులుతున్నారు.. పశ్చిమ బెంగాల్‌లోని చిన్న పట్టణం నుంచి తన కలల తీరమైన ముంబైకి వచ్చింది అనూష బోస్. మాస్ కమ్యూనికేషన్లో పట్టా పుచ్చుకున్న అనూష ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో చేరింది. జింగిల్స్, డైలాగులు రాయడంలో తనదైన శైలిని సృష్టించుకుంది. మూడురోజుల్లో రాసే టైమ్ దొరికినా కేవలం 30 సెకండ్లలో మాత్రమే రాసే అవకాశం ఉన్నా.. ఎక్కడా తడబాటు ఉండకూడదనేది తన ఫిలాసఫీ. ‘ఇండస్ట్రీలో నేను కూడా ఒకరిని అనుకోవడం కాదు. మనలోని ప్రత్యేకత గురించి ఇండస్ట్రీ మాట్లాడుకునేలా క్రియేటివిటీకి సానబట్టాలి’ అంటుంది సీనియర్ కాపీ రైటర్ అయిన అనూష బోస్. ట్రైనీ కాపీరైటర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ముంబైకి చెందిన ఆకృతి బన్సాల్. చిన్నప్పటి నుంచి తనకు టీవీలో వచ్చే యాడ్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనని అడ్వర్టైజింగ్ ఫీల్డ్‌కు తీసుకువచ్చింది. అది ఏ వ్యాపారానికి సంబంధించినది అనేదానికంటే ఆ యాడ్ వెనుక ఉన్న ఐడియా తనకు బాగా నచ్చేది. ‘హోం సైన్స్’ చదువుకున్న ఆకృతికి ‘ఎడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్రిలేషన్’ ఒక సబ్జెక్ట్‌గా ఉండేది. ఆ సబ్జెక్ట్ ఇష్టంగా చదువుకున్న తరువాత ‘ఈ రంగంలో నేను ప్రయత్నించవచ్చు’ అనుకుంది. ఫీల్డ్‌కు వచ్చిన తరువాత ప్రతిరోజు, ప్రతి డెడ్‌లైన్‌ను ఒక సవాల్‌గా స్వీకరించింది. ‘చాలెంజ్ ఉన్నప్పుడే మజా ఉంటుంది’ అంటుంది ఆకృతి బన్సాల్. మరి ఆమె భవిష్యత్ లక్ష్యం ఏమిటి? ‘ప్రతిష్ఠాత్మకమైన ఎడ్వర్టైజింగ్ అవార్డ్ తీసుకోవాలి లేదా నా తల్లిదండ్రులు రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి నచ్చిన యాడ్ హోర్డింగ్ నేను రాసినదై ఉండాలి’ అంటుంది ఆకృతి బన్సాల్. రాధిక నాగ్‌పాల్ టీనేజ్ నుంచి పుస్తకాల పురుగు. భాషలోని సొగసు అంటే ఇష్టం. రాధిక జర్నలిజం కోర్స్ చేసింది. అందులో ఒక సబ్జెక్ట్ అయిన ఎడ్వర్టైజింగ్ తనకు బాగా నచ్చింది. రాధిక ఇప్పుడు ‘సోషియోవాష్’లో సీనియర్ కాపీ రైటర్. ‘యాడ్ ఏజెన్సీలో పనిగంటలు అంటూ ఉండవు. కాలంతో పరుగెత్తాల్సిందే. బ్రాండ్‌ను అర్థం చేసుకోవడంతో పాటు క్లయింట్ ఆశిస్తున్నది ఏమిటి? ఆడియెన్స్‌ను వేగంగా ఎలా చేరుకోవాలి? అనే దానిపై అవగాహన ఉండాలి. మనం చెప్పదల్చుకున్నది సింగిల్ లైన్లోనే క్యాచీగా చెప్పగలగాలి’ అంటుంది రాధిక. విస్తృతంగా చదవాలి. గత అనుభవాల నుంచి రెఫరెన్స్ తీసుకోవడానికి ఎంతో ఉంది’ అనేది ఔత్సాహిక కాపీరైటర్లకు రాధిక ఇచ్చే సలహా. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన అంజు న్యూస్పేపర్లలో వచ్చే ఎడ్వర్టైజింగ్లను ఫైల్ చేస్తుంటుంది. ఆమె ఎన్నోసార్లు చదివిన పుస్తకం క్లాడ్ సీ.హాప్కిన్స్ రాసిన సైంటిఫిక్ ఎడ్వర్టైజింగ్ (1923). ఈ పుస్తకంలోని సరళమైన భాష అంటే అంజుకు ఇష్టం. ‘జస్ట్ సేల్స్‌మన్‌షిప్’ ‘ఆఫర్ సర్వీస్’ ‘హెడ్ లైన్స్’ ‘బీయింగ్ స్పెసిఫిక్’ ‘ఆర్ట్ ఇన్ ఎడ్వర్టైజింగ్’ ‘టెల్ యువర్ ఫుల్స్టోరీ’ ‘ఇన్ఫర్మేషన్’ ‘స్ట్రాటజీ’ ‘నెగెటివ్ రైటింగ్’... మొదలైన చాప్టర్ల గురించి అనర్గళంగా మాట్లాడగలదు. అంజు భవిష్యత్ లక్ష్యం ‘కాపీ రైటర్’ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు! వీరు కూడా.. ప్రముఖ సినీ నటి రాశీఖన్నా న్యూ దిల్లీ, లేడీ శ్రీరామ్ కాలేజీ స్టూడెంట్. కాలేజీ రోజుల నుంచి చదవడం రాయడం అంటే ఇష్టం. కాపీరైటర్ కావాలనేది తన కల. కలను నిజం చేసుకోవడానికి ముంబైకి వెళ్లింది. అయితే సినిమాల్లో అవకాశాలు రావడంతో తన రూట్ మారింది. కాపీరైటర్ కాబోయి యాక్టర్ అయిందన్నమాట! సినిమారంగంలో ఉన్నప్పటికీ గుడ్ కాపీరైటింగ్ కోసం వెదుకుతుంది. బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ కాలేజీ చదువు పూర్తికాగానే ఒక యాడ్ ఏజెన్సీలో కాపీరైటర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. ఇప్పటికీ చిన్న చిన్న రచనలు చేస్తుంటాడు. మన ప్రత్యేకతే మన శక్తి ఇండస్ట్రీలో నేను కూడా ఒకరిని అనుకోవడం కాదు. మనలోని ప్రత్యేకత గురించి ఇండస్ట్రీ మాట్లాడుకునేలా క్రియేటివిటీకి సాన పట్టాలి. – ఆకృతి బన్సాల్, కాపీ రైటర్ ఒక ఐడియా... వెయ్యి ఏనుగుల బలం ఒక ఐడియా స్ట్రైక్ అయ్యేవరకు మనసులో భయంగా ఉంటుంది. తళుక్కుమని ఒక ఐడియా మెరిసిందా...ఇక అంతే. వెయ్యి ఏనుగుల బలం దరి చేరుతుంది! క్రియేటివ్ బ్లాక్స్ రాకుండా ఉండడానికి పుస్తకాలు చదువుతాను. నచ్చిన పుస్తకాలు మళ్లీ చదువుతాను. – రాధిక నాగ్‌పాల్, సీనియర్ కాపీ రైటర్ (చదవండి: కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయ్! ) -
డిప్రెషన్‌తోనే ప్రత్యూష ఆత్మహత్య: పోలీసుల ప్రాథమిక నిర్థారణ
-
Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ప్రత్యూష.. శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్ బాటిల్ లభ్యమైంది. దీంతో ఆమె కార్బన్‌మోనాక్సైడ్ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రత్యూష గుర్తింపు పొందారు. బాలీవుడ్, టాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్లకు ప్రత్యూష డ్రెస్‌లు డిజైన్ చేశారు. దేశంలోని 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్‌లో ప్రత్యూష ఒకరుగా గుర్తింపు ఉంది. రిటైర్డ్ ఐఆర్ఎస్ కృష్ణారావు కుమార్తె ప్రత్యూష. సూసైడ్ నోట్ రాసిన ప్రత్యూష ప్రత్యూష ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. తల్లి దండ్రులకు భారం కాలేనని, క్షమించండి అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. తాను కోరుకున్న జీవితం ఇది కాదని లేఖలో పేర్కొంది. కాగా, నిన్న రాత్రి జూబ్లీహిల్స్‌లోని సొంతింటి నుంచి బోటిక్‌కు వచ్చిన ప్రత్యూష.. అక్కడకు కేవలం ఒక బ్యాగ్‌తోనే వెళ్లింది. తనను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని లోపలికి వెళ్లేముందు వాచ్‌మెన్‌కు ప్రత్యూష చెప్పింది. ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో వాచ్మెన్ వెళ్లి చూడగా.. ఆమె కిందపడిపోయి ఉండటంతో అతను పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు.. ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం నిమ్మితం ఆసుపత్రికి తరలించారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టులో ప్రత్యూష కార్బన్‌మోనాక్సైడ్ వాయువు పీల్చుకోవడం వల్లే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకెళ్లండి.. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
1957 నుంచి సేకరిస్తూ.. చివరికి ఆ ఇల్లే మ్యూజియంగా మారింది
సాక్షి,డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. కానీ, విశాఖ నగరంలోని రెడ్డి కంచరపాలెం వాసి బసవ రవిశంకర్‌రెడ్డికి మాత్రం చాలా అభిరుచులున్నాయి. వాటన్నింటినీ పట్టుదలతో సాధించుకున్న ఘనత ఆయనది. రవిశంకర్‌రెడ్డి విదేశీ కాయిన్స్, కరెన్సీతో పాటు పురాతన వస్తువులను కూడా భద్రపరచడంలో దిట్ట. 1957 నుంచి భారతదేశంలో వాడే ద్విచక్రవాహనాలు ఆయన వద్ద ఉన్నాయి. అరుదైన భారతీయ నాణాలు, నోట్లను సేకరించడమే కాకుండా 122 దేశాల విదేశీ కరెన్సీ, డాలర్లతో పాటు 67 దేశాల స్టాంపులు సేకరించారు రవి. చదివింది డిప్లమో అయినా తన మెదడుకు పదునుపెట్టి కువైట్, అబుదబీ దేశాల్లో పనిచేసిన అనుభవంతో తయారు చేసిన రిమోట్‌తో అర కిలోమీటరు దూరం నుంచే ఇంట్లో లైట్లు వేయడం ఆపడం చేస్తుంటారు. ఇది ఆయన సొంతంగా తయారు చేసుకున్నదే. 1957 నుంచి 27 ద్విచక్రవాహనాలు జావా, లాంబ్రెట్టా, మినీ రాజ్‌దూత్, ఏజీడీ ఇలా పాత వాహనాలను సేకరించి భద్రపరిచారు. 1990లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో వంద మీటర్ల ఎత్తు, 32 టన్నుల బరువును ఉపయోగించి రెండు అతిపెద్ద క్రేన్ నమూనాలు(ఎలక్ట్రిక్ ఓవర్ హెడ్ ట్రావెల్ క్రేన్, రష్యన్ క్రేన్) తయారు చేశారు. ఈ రెండు క్రేన్లను మ్యూజియంకు అందజేశారు. తన ఇంటి గేట్‌ను రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఆపరేటింగ్ చేయడం, రిమోట్ లైట్ సిస్టమ్, జీరో పవర్ కన్జంప్షన్‌తో ఆటోమేటిక్ ఓవర్ హెడ్, డబుల్ షీటర్ సైకిల్ వంటివి సృష్టించారు. ఇలాంటి మరెన్నో వినూత్నమైన వస్తువులను రూపొందిస్తున్నారు రవిశంకర్‌రెడ్డి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 50 ఏళ్లు పురస్కరించుకున్న సందర్భంగా కోల్‌కతా మింట్ విడుదల చేసిన రూ.50 మొదటి కాయిన్‌ను 2018లో రవిశంకర్‌రెడ్డి రూ.3,560కు బుక్ చేసుకుని పొందారు. ఆ తర్వాత రూ.500 కాయిన్ సంపాదించారు. మూడేళ్ల కిందట రూ.200 నాణెం సేకరించారు. రెండేళ్ల కిందట రూ.1000 నాణెం సొంతం చేసుకున్నారు. గతంలో రూ.10, రూ.20, రూ.100, రూ.150..వంటి కాయిన్లను సేకరించారు. నాలుగు నెలల కిందట రూ.75, రూ.350, రూ.550 నాణాలు సేకరించిన రవిశంకర్‌రెడ్డి.. రాజ్యసభ 250వ సమావేశాన్ని పురస్కరించుకుని ముంబాయి మింట్ విడుదల చేసిన రూ.250 కాయిన్‌ను సొంతం చేసుకున్నారు. రూ.4,390కు ఈ కాయిన్‌ను కొనుగోలు చేశారు. 40 గ్రాముల సిల్వర్‌తో కూడిన ఆ కాయిన్ ఇటీవల ఆయన చెంతకు చేరింది. బ్యాక్‌వర్డ్స్ బ్రెయిన్ సైకిల్ ఇదే.. రవిశంకర్‌రెడ్డి తాజాగా బ్యాక్‌వర్డ్స్ బ్రెయిన్ సైకిల్‌ను రూపొందించారు. హ్యాండిల్ ఎడమ వైపు తిప్పితే టైర్ కుడి వైపు, హ్యాండిల్ కుyì వైపు తిప్పితే టైర్ ఎడమవైపు వెళ్తుంది. ఈ సైకిల్ నడిపేవారు రెగ్యులర్ సైకిల్ నడపలేరన్నారు. ఈ సైకిల్ రూపొందించేందుకు 2 నెలల సమయం పట్టిందని, రూ.8,500 ఖర్చుతో దేశంలోనే తొలిసారిగా తానే రూపొందించానని చెప్పారు. దీని పేటెంట్స్ కోసం దరఖాస్తు చేయలేదని, చూడడానికి మామూలు సైకిల్గానే కనిపిస్తుందన్నారు. బుర్రపెట్టి నడపాలన్నారు. అక్కడ అన్నీ ప్రత్యేకం ఆ ఇల్లు ఓ జంతర్ మంతర్. ఇంట్లోకి అడుగుపెట్టగానే లైట్ వెలుగుతుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మరో గదిలో లైట్ వెలుగుతుంది. ముందు గది లైట్ ఆగిపోతుంది. యాప్ ద్వారా అలెక్సా.. బెడ్రూమ్ స్విచ్ ఆన్ లైట్ అనగానే వెలుగుతుంది. అలెక్సా.. స్విచ్ ఆన్ ఫ్యాన్ అనగానే ఫ్యాన్ తిరుగుతుంది. మూడంతస్తుల మేడ పై నుంచి అలెక్సా.. ఓపెన్ ద మెయిన్ గేట్ అనగానే వెంటనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ గేట్ ఓపెన్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఇళ్లంతా జంతర్‌మంతర్‌లా ఉంటుంది. సాంకేతికతను ఉపయోగించి.. నోటి మాటతో లైట్లు, ఫ్యాన్లు ఆపరేట్ చేస్తున్నారు. వినూత్న సైకిళ్లు తన మేధాశక్తితో అధునాతనంగా సైకిళ్లు రూపొందిస్తున్నారు. యునీ సైకిల్, డ్యూయల్ సైకిల్, కోస్టర్ బ్రేక్, రెట్రా డ్రైవ్, సైడ్ వేస్, బైసింపిల్(చెయిన్ లెస్) తదితర మోడళ్లను తయారు చేశారు. గతేడాది రెట్రా డ్రైవ్ సైకిల్‌ను రూపొందించారు. ఇండియాలోనే తొలి సైకిల్ ఇది అని రవిశంకర్ ‘సాక్షి’కి తెలిపారు. ముందుకు తొక్కితే డబుల్ స్పీడ్(గంటకు 10 కిలోమీటర్లు)తో వెళ్తుందని, వెనక్కి తొక్కితే సింగిల్ స్పీడ్(గంటకు 5 కిలోమీటర్లు)తో నడుస్తుందని చెప్పారు. వ్యాయామం చేసేందుకు ఈ సైకిల్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. -
పదేళ్లలో దేశాన్ని చుట్టి వచ్చారు
మధురవాడ (భీమిలి): ఆయన రాజకీయ నాయకుడే కాదు. ఓ గొప్ప ఆధ్యాత్మిక వాది. అనుకున్నదే తడువుగా పదేళ్లలో తీర్థయాత్రలు చుట్టివచ్చాడు. హిమాలయాల్లో జిరో డిగ్రీల ఉండే డార్జిలింగ్ నుంచి సముద్ర మట్టానికి 20 వేలు కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ప్రాంతాన్ని చూశారు. ఆయనే జీవీఎంసీ 7వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు. దర్శించుకున్న క్షేత్రాలు 2008లో చార్దామ్ యాత్ర చేసిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని పుణ్య క్షేత్రాలను పర్యటించాలని ఆలోచన వచ్చిందని శ్రీనివాసరావు చెప్పారు. 2018 నాటికి భార్యతో కలిసి అన్ని పుణ్యక్షేత్రాలను చూసివచ్చా. జ్యోతిర్లింగాలు, హిమాలయాలు, జ్వాలాముఖి, భూటాన్, గుజరాత్ ఇలా ముఖ్య ప్రాంతాలు అన్నీ చుట్టి వచ్చా.. పంచకైలాసాలు హిమాలయాల్లోని మాసన సరోవరం, ఓంకార్ పర్వతం, ఆది కైలాష్, మణికంఠ కైలాసం, కిన్నెర కైలాసాన్ని దర్శించుకున్నా.. శక్తి పీఠాలు 18 ఉంటే 14 సందర్శించాను. గంగోత్రి, యమునోత్రి, కేధార్నాథ్, బద్రీనాథ్, చార్దామ్ యాత్రలు పూర్తి చేశా.. షిరిడి, తిరుపతి, కాశీ యాత్రలు ఏడాది ఒకటి రెండు సార్లు వెళతామని చెప్పారు. మానస సరోవరంలో 48 కిలో మీటర్ల నడక భార్యతో కలసి మానస సరోవరం యాత్రకు వెళ్లా. మార్గ మధ్యలో గైడ్‌తో పాటు వెళుతున్న క్రమంలో గుర్రం నన్ను కిందకు పడేసింది. నా భార్యను గుర్రంపై ఎక్కించి నేను ఆ గమ్యాన్ని చేరుకోవడానికి 48 కిలోమీటర్లు రెండు రోజులు పాటు నడవాల్సి వచ్చింది. ఇదే కాదు హిమాలయాలు, దేవ భూమి ఉత్తరాఖండ్‌లో ఉన్న యాత్రలు అన్నీ చేయడం దైవం కల్పించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని శ్రీనివాసరావు చెప్పారు. -
ట్విటర్లో మహిళలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా!
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు మూతపడటంతో ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితమైన విషయం తెలిసిందే. బయట తిరిగేందుకు వీలు లేకపోవడం, చేయడానికి పని కరువవ్వడంతో సోషల్ మీడియాపై అధిక సమయం వెచ్చించారు. సమాచారానికి, వినోదానికి, కాలక్షేపానికి ఇదే ప్రధాన మార్గంగా అవతారమెత్తింది. దీనిలోనూ ట్విటర్దే పైచేయి. అయితే తాజాగా ఈ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ఓ సర్వేను నిర్వహించింది. త్వరలో (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతున్న క్రమంలో మహిళపై ఓ పరిశోధన చేసింది. 2019 ఫిబ్రవరి 2021 వరకు భారతీయ మహిళలు ట్విటర్లో ఎక్కువగా ఏం మాట్లాడారనే విషయంపై ఈ సర్వే చేపట్టారు. దీనిలో 10 నగరాల నుంచి ట్విటర్లో 5,22,992 మంది చేసిన ట్వీట్లతోపాటు ట్విట్టర్‌లోని 700 మంది మహిళలను ఆధారంగా ఈ సర్వే జరిగింది. మరి ఈ ఫలితాల్లో సరికొత్త విషయాలు తెలిశాయి. రీసెర్చ్ ప్రకారం మొత్తంగా తొమ్మిది ముఖ్య అంశాలపై చర్చ ఎక్కువగా జరిగినట్లు తేలింది. ఇందులో అభిరుచులు, ఆసక్తులు టాప్‌లో నిలిచాయి. వీటి శాతం 24.9 శాతం వాటా కలిసి ఉంది. ఇందులో ఫ్యాషన్, పుస్తకాలు, అందం, వినోదం, సంగీతం, ఆహారం, టెక్నాలజీ, స్పోర్ట్స్ కలిసి ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై(కరెంట్ అఫైర్స్) 2.08 శాతం మంది మాట్లాడుకున్నారు. ఇక సెలబ్రిటీ మూమెంట్స్‌పై-14.5 శాతం, కమ్యూనిటీలపై-11.7 శాతం, సామాజిక మార్పుపై-8.7 శాతం మంది మహిళలు చర్చించారు. ట్విట్లలో లైకులు, రిప్లైల విషయానికొస్తే ఎక్కువగా రోజువారీ ముచ్చట్లు, సెలబ్రిటీల మూమెంట్లపై ఎక్కువగా జరిగాయి. ఫ్యాషన్, ఆసక్తులు, కమ్యూనిటీస్, ఛాలెంజ్‌లపై ఎక్కువగా రీట్వీట్లు చేశారు. చదవండి: ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్ ఒక అమ్మాయి కోసం నలుగురు ఫైట్.. లక్కీ డ్రా! -
‘తన ఆసక్తిని కరోనా ఏ మాత్రం తగ్గించలేదు’
ముంబై: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నివారించేందుకు గత కాలంగా సీనిమా షుటింగ్లను నిలిపివేశారు. తాజాగా సీనియర్ నటులకు సినిమా, షుటింగ్‌లో పాల్గొనవచ్చని బాంబే హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సినిమాలపై తమకున్న ఇష్టాన్ని, అభిరుచిని ఏ మాత్రం తగ్గించలేదని ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత సతీష్ కౌశిక్ సోషల్ మీడియాలో తెలిపారు. ఐదు నెలల తర్వాత పాల్గొన్న తాను పీపీఈ కిట్లను వేసుకుంటే ఏదో షూటింగ్లో పాల్గొన్న అనుభూతి కలుగుతుందని అన్నారు. మరోవైపు సీరియల్ నటుడు అనిరుద్ దవే స్పందిస్తూ.. సినిమాలపై దిగ్గజ నటుడుకున్న ఆసక్తిని అనిరుద్ అభినందించారు. అయితే తమిళ్ సేతు చిత్రం, తెలుగులో శేషుగా బాలీవుడ్లో తేరే నామ్‌గా రీమేక్ చేశారు. బాలీవుడ్లో సతీష్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తేరే నామ్’ చిత్రంలో కండల వీరుడు బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్ హీరోగా నటించాడు. 2003లో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: అప్పుడు సల్మాన్ తటపటాయించాడు -
అక్టోబర్ 13న అమ్మ చనిపోతే..మరి ఇదెలా జరిగింది!
నిద్రలో మరణం సహజమే కావచ్చు. కాని సహజంగా కనిపించే ప్రతి మరణం సహజం కాకపోవచ్చు. చీకటిలో కోరికలు ఉంటాయి. అవి తీరే ఏకాంతం దొరకడం మనుషులకు ప్రమాదకరం. బుద్ధి చీకటి దారి తప్పితే జీవితం అంధకారంలో పడుతుంది. నేరం జరిగిన తర్వాత వగచే కన్నా నేరం జరిగే పరిస్థితులను ముందే నివారించడం తెలివైన పని. 2012– అక్టోబర్ 13.కాజీపేట ప్రశాంత్ నగర్.ఉదయం 6 గంటల 3 నిమిషాలు.వేంకటేశ్వర గుడిలో నుంచి మైకులో వస్తున్న సుప్రభాతం వింటూ రెండు కప్పుల కాఫీ తయారు చేసింది సుజాత. తను ముందుగా కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేసింది. అరగంట టీవీ చూసి తర్వాత గిన్నెలో ఉన్నకాఫీని మళ్ళీ వేడి చేసి కప్పులో పోసి, అత్త సువర్ణమ్మ రూమ్వైపుగా వెళ్లింది. బయట నుంచే డోర్ మీద తడుతూ ‘అత్తయ్యా..అత్తయ్యా..’ అని పిలిచింది. ఎలాంటి అలికిడి వినిపించలేదు. ‘అదేంటీ.. రోజూ ఈ టైమ్‌కి లేస్తారు. ఈ రోజు ఇంకా లేవలేదా?’ అనుకుంటూ డోర్ తీసుకొని లోపలికి వెళ్లి మళ్లీ పిలిచింది. పడుకున్న మనిషి పడుకున్నట్టే ఉంది. దగ్గరగా వెళ్లి తట్టింది. చెయ్యి చల్లగా తగిలింది. ఆందోళనగా టీపాయి మీద కాఫీ కప్పు పెట్టి, మరోసారి అత్తను లేపే ప్రయత్నం చేసింది. కానీ, సువర్ణమ్మ లేవలేదు. సుజాతకు మాటరాలేదు. ‘ఇప్పుడేం చేయాలి...’ కంగారుగా కాలనీలోనే ఉంటున్న తల్లిగారింటికి ఫోన్ చేసింది. అప్పటికి సమయం 7.15.సుజాత తల్లీదండ్రితో పాటు ఇరుగు పొరుగూ సువర్ణమ్మ మంచం చుట్టూ చేరారు. ‘అకస్మాత్తుగా ఇలా జరిగిందంటే నిద్రలోనే గుండెపోటు వచ్చి ఉండవచ్చు’ అన్నారంతా! సుజాత ఏడుస్తూ ఉంటే.. ‘కోడలివైనా ఇన్నాళ్లూ కూతురులా చూసుకున్నావు. ఆమె అదృష్టవంతురాలు.నిద్రలోనే పోయింది.’ అంటూ సముదాయిస్తున్నారు సుజాతని.. సువర్ణమ్మ (పేరుమార్చాం) అటవీశాఖ కార్యాలయంలో ఉద్యోగినిగా పని చేసేది. వయసు 55 పైనే. ఇద్దరు కొడుకులు. ఇద్దరూ ఉద్యోగరీత్యా విదేశాలలో ఉంటున్నారు. మూడేళ్ల క్రితం భర్త చనిపోయాడు. కొడుకులు కోడళ్లతో కలిసి పండగలకు వచ్చిపోతుండేవారు. సంవత్సరం క్రితం పెద్ద కొడుకు వచ్చినప్పుడు తల్లికి ఆరోగ్యం బాగుండడం లేదని భార్య సుజాతను ఇక్కడే వదిలి వెళ్లాడు. అందువల్ల సుజాత అత్తతోనే ఉంటోంది.విషయం తెలిసిన వెంటనే కొడుకులు ఇద్దరు బయల్దేరారు. అక్టోబర్ 17న ఇంటికి చేరుకున్నారు. అదే రోజున తల్లి దహన సంస్కరాలు పూర్తి చేశారు. నెలమాసికం తర్వాత తిరుగు ప్రయాణం పెట్టుకుందామనుకున్నారు. కానీ, కుదరక మరో నెల రోజులకు ప్రయాణం వాయిదా వేసుకున్నారు. నవంబర్ 19. ‘వదినా... అమ్మ సెల్‌ఫోన్ కనిపించడం లేదేంటీ..’ అన్నాడు çసువర్ణమ్మ రెండో కొడుకు సతీష్ ఏదో గుర్తుచ్చినట్టు.‘ఏమో సతీష్. ఫోన్ రిపేర్‌కు ఇచ్చిందనుకుంట. ఎక్కడ ఇచ్చిందో నాకూ దాని గురించి తెలియదు’ అంది సుజాత.‘అలాగా. సరే వదినా. నేను బయటకెళ్లొస్తా. అన్నయ్య వస్తే చెప్పు’ అంటూ వెళ్లిపోయాడు సతీష్. షోరూమ్కెళ్లి తల్లి మొబైల్ నెంబర్ పై కొత్త సిమ్ తీసుకుని తన దగ్గర ఉన్న మరో ఫోన్లో వేశాడు. సిమ్ యాక్టివేట్ అయిన కొద్దిసేపట్లోనే ఆంధ్రా బ్యాంక్ నుంచి మూడు మెసేజ్‌లు ఆ నంబర్‌కు వచ్చాయి. అక్టోబర్ 15న, నవంబర్ 2న మొత్తం 75 వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా అయినట్టు ఉందా సమాచారం. ఆంధ్రాబ్యాంక్ అకౌంట్‌ను తన ఫోన్ నెంబర్‌కు జత చేసుకుంది సువర్ణమ్మ. డబ్బు డ్రా చేస్తే మెసేజ్ వస్తుంది. అలాంటి మెసేజులే అవి.వాటిని చూడగానే సతీష్ ఆశ్చర్యపోయాడు. ‘అక్టోబర్ 13న అమ్మ చనిపోయింది. మేమెవరమూ డబ్బు డ్రా చేయలేదు. అక్టోబర్ 15న నవంబర్ 2న డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చిందేంటి?’ అనుమానంతో వెంటనే బ్యాంక్‌కు వెళ్లి అధికారులను అడిగితే వాళ్లు స్టేట్మెంట్ తీసిచ్చారు. ఏయే ఏటీఎమ్‌ల నుంచి డబ్బులు డ్రా అయ్యాయో బ్యాంక్‌వాళ్లు చెప్పారు. ‘ఏటీఎం కార్డులు ఎవరు తీసుకెళ్ళి డ్రా చేశారు? ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగిందా? అసలు ఇన్ని రోజులు తాత్సారం చేయడం తనదే తప్పు’ అనుకుంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు సతీష్. సువర్ణమ్మ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఏయే బ్యాంక్ ఏటీఎంల నుంచి డ్రా అయ్యాయో పూర్తి వివరాలు తీసుకున్నారు పోలీసులు. కాజీపేటలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అయినట్లు తెల్సింది. దీంతో యాక్సిస్ బ్యాంక్ అధికారులను కలిశారు. ‘అక్టోబర్ 15న, నవంబర్ 2న సాయంత్రం సమయంలో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న సీసీ పూటేజీ కావాలి’ అని సీఐ కోరాడు. బ్యాంక్ అధికారులు ఆ పుటేజీని పోలీసులకు అప్పగించారు. ఫుటేజ్ పరిశీలిస్తే ఒక మనిషి కనిపించాడు. పురుషుడు. 35 ఏళ్లు ఉండొచ్చు. అతనే డబ్బులు డ్రా చేసినట్టు తెలుసుకున్నారు. ‘ఆ వ్యక్తికి సువర్ణమ్మ ఏటీఎమ్ కార్డులు ఎలా దొరికాయి? వన్నాట్ టూ... ఈ కేసులో క్లూ దొరికిందయ్యా. పద’ అంటూ బయటకు దారి తీశాడు. అతన్ని అనుసరించారు మిగతా సిబ్బంది. డిసెంబర్ 3 సాయంత్రంపోలీసులు సువర్ణమ్మ ఇంటికి వచ్చారు.మగ్గురు అన్నదమ్ములతో మాట్లాడారు.పెద్దకోడలు సుజాతను పిలిచాడు సీఐ. ‘సువర్ణమ్మతో పాటు మీరొక్కరే ఈ ఇంట్లో ఉంటున్నారు కదా. అందరికంటే మీకే బాగా తెలియాలి. ఆ రోజు ఏం జరిగింది?’ అన్నాడు. ‘రోజులాగే అత్తయ్యకు భోజనం పెట్టి, నేను తిని పడుకోవడానికి నా రూమ్‌కి వెళ్లిపోయాను. ఉదయం 6 గంటలకే ఆవిడ నిద్రలేస్తారు. ఆ రోజు ఏడు అయినా లేవలేదు. నేనే కాఫీ తీసుకెళ్లి లేపాను. కానీ అప్పటికే ఆవిడ చనిపోయింది. నాకేం చేయాలో అర్ధం కాలేదు. మా నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పాను. గతంలో ఆమెకు ఓసారి గుండెపోటు వచ్చింది. ఆ రోజు నిద్రలోనే గుండెపోటువచ్చి ఉంటుంది’ అంది సుజాత. మరిన్ని వివరాలు అడిగి వెళ్లిపోయారు పోలీసులు. సుజాత ఫోన్ నెంబర్ తెలుసుకొని ఆమె కాల్ డేటాను తీయించారు పోలీసులు. ఒక ఫోన్ నెంబర్‌తో ఏడాది నుంచి తరచూ మాట్లాడినట్టు రికార్డ్ అయి ఉంది. సువర్ణమ్మ చనిపోవడానికి కొన్ని రోజుల ముందుగంటల తరబడి మాట్లాడినట్టు రికార్డ్‌లో ఉంది. ఆ నెంబర్ ఎవరిదో వెరిఫై చేయిస్తే నరేష్ అనే వ్యక్తిదని తెలిసింది.2012అక్టోబర్ 12న అర్థరాత్రి నరేష్, సుజాత సెల్లు ఒకే సెల్ టవర్ పరిధిలో ఉండటంతో పోలీసులకు మరింత అనుమానం కలిగింది. çసువర్ణమ్మ చనిపోయిన రోజున ఇద్దరి కాల్ లిస్టులను పరిశీలించగా ఆ సమయంలో ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్లుగా వెల్లడయ్యింది. సుజాతను ఎన్నిసార్లు అడిగినా తన సమా«ధానం ఒక్కటే .. ‘నాకేం తెలియదు’ అని. కానీ పోలీసుల నిఘా మాత్రం సుజాతను నీడలా వెంటాడింది. డిసెంబర్ 4న ఉదయం సుజాత, నరేష్ ఇద్దరూ వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం. ఇది గమనించిన పోలీసులు రైల్వేస్టేషన్లోనే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరినీ విచారించడం మొదలుపెట్టడంతోనే తామే సువర్ణమ్మను హత్య చేశామని ఒప్పుకున్నారు. నిజాలను బైట పెట్టారు. కుటుంబసభ్యులంతా మౌనంగా తలదించుకున్నారు. సుజాత భర్త నాలుగేళ్ల క్రితం తమ్ముడితో కలిసి విదేశాలకు వెళ్లాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.సుజాత కూడ కొన్నాళ్లు అక్కడే ఉంది. ఏడాది క్రితం పండక్కి అందరూ వచ్చారు. ఆ సమయంలో సువర్ణమ్మకు ఆరోగ్యం బాగుండకపోవడంతో సుజాతను అమ్మకు తోడుగా ఉండమన్నాడు భర్త. దీంతో సుజాత ఏడాదిగా ఇక్కడే ఉంటోంది. ఈ సమయంలోనే సుజాతకు నరేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సువర్ణమ్మ ఉద్యోగానికి వెళ్లిపోవడంతో సుజాత ఒక్కర్తే ఇంట్లో ఉండేది.ఓసారి ఇంట్లో సుజాతతో నరేష్ ఉండటం చూసి సువర్ణమ్మ కోడలిని హెచ్చరించింది. కొడుకుతో చెబుతానని తల్లిదండ్రినిపిలిపించి నిలదీస్తానని మందలించింది. అత్త అడ్డుతొలగిపోతే తమ సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుందనుకుంది సుజాత.ఇద్దరూ సువర్ణమ్మను ఎవరికీ అనుమాన ం కలగకుండా హత్య చేయాలని ప్లాన్ చేశారు. దీనికి నరేష్ ఫ్రెండ్స్ కిరణ్, క్రాంతిలు కూడా తోడయ్యారు. అక్టోబర్ 12 అర్ధరాత్రి.సువర్ణమ్మ గాఢ నిద్రలో ఉంది. ఆమె ముఖంపై దిండు పెట్టి, నలుగురూ ఊపిరి ఆడకుండా చేసి చంపివేశారు. ఏటీఎమ్ కార్డులను పిన్‌నెంబర్‌తో సహా నరేష్‌కి ఇచ్చింది సుజాత. ఏటీఎంలలో డబ్బులను డ్రా చేసిన నరేష్ ఆ డబ్బుతో ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాలు చేశాడు.డిసెంబర్ 5న ఈ నలుగురిని రిమాండ్‌కు తరలించారు పోలీసులు. – గజవెల్లి షణ్ముఖరాజు, వరంగల్ రూరల్ స్టాఫ్ రిపోర్టర్ -
'ఏడవ'నివ్వలేదు
పుట్టాక చంపేవాళ్లు నేరస్తులైతే పుట్టక ముందే చంపేవాళ్లు ఏమవుతారు?ప్రాణం పోయాల్సిన చోటులోనే ప్రాణం తీసేవాళ్లు తయారైతే?చేసిన నేరం ఊరికే పోదు. కటకటాల వెనక్కు తోస్తుంది.పుట్టిన బిడ్డ ఏడిస్తే తల్లికి ఆనందం.బిడ్డను పుట్టనివ్వకపోతే అదే తల్లికి ఆక్రోశం.ఆ ఆక్రోశానికి కారకులెవ్వరు? వనపర్తి.జనవరి 11, 2009.‘చూడమ్మా! మమ్మల్ని చూసి పోలీసులని భయపడనక్కర్లేదు. ఓ అన్నలా అనుకొని చెప్పు. అసలేం జరిగింది?’ చేతులు ఒళ్లో పెట్టుకొని, తల దించుకొని కుర్చీలో కూర్చున్న ఆమెనే చూస్తూ అనునయంగా అడిగాడు ఎఎస్పి.ఆమె మౌనంగా ఉంది. చుట్టూ చూశాడు ఎఎస్పి. తలుపు దగ్గర ఆమె తల్లీదండ్రి ఉన్నారు. వారి వల్లనే ఏమీ చెప్పలేకపోతుందని గమనించి బయటకు వెళ్లమన్నట్టు సైగ చేశాడు. కొన్ని క్షణాలు అక్కడే తచ్చాడిన వాళ్లు ఇక తప్పదన్నట్టు బయటకు వెళ్లారు. ‘మీ అమ్మనాన్న బయటకు వెళ్లారు. నీకేం భయం లేదు. ఏం జరిగిందో చెప్పు. నీకేం సాయం కావాలన్నా చేస్తాం’ మరోసారి అడిగాడు ఎస్సై. ఆమె తల ఎత్తి ‘మా ఆయన్ని జైల్లో పెట్టారు. విడిపించండన్నా’ అంది చేతులు జోడిస్తూ! ఆ కళ్ల నిండుగా నీళ్లు. ఆమె పరిస్థితికి జాలి కలిగింది ఎఎస్‌పికి. బదిలీ మీద వచ్చిన ఎఎస్పి (అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) కొత్తగా ఛార్జ్ తీసుకున్నాక పెండింగ్ ఫైల్స్‌ని వెరిఫై చేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క ఫైల్ తీసుకొని పరిశీలనగా చూస్తున్నాడు. వాటిలో ఒక ఫైల్ ఆసక్తికరంగా అనిపించింది.డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. పేరు: రాధ (పేరు మార్చడమైనది)వయసు: 16. అదే ఊరుకు చెందిన 22 ఏళ్ల మాణిక్యం, రాధ ప్రేమించుకున్నారు.ఇంటి నుంచి వెళ్లిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. రాధ తల్లిదండ్రులు మాణిక్యం మీద కేసు పెట్టారు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్నందుకు అతని మీద కేసు నమోదైంది. పోలీసులు రాధ, మాణిక్యం ఉన్న చోటు కనుక్కొని వాళ్లని పట్టుకునేసరికి ఆరేడు నెలలు గడిచాయి. మాణిక్యాన్ని అరెస్ట్ చేశారు. అతను తిరుపతి జైలులో ఉన్నాడు. అయితే రాధ అప్పటికే 5 నెలల గర్భవతి. ఫైల్ మూశాడు ఎఎస్పి.ఆలోచనలో పడ్డాడు.. ‘ఈ కేసు ఫైల్ అయ్యి మరో మూడు నెలలు గడిచాయి. అంటే ప్రస్తుతం ఆ అమ్మాయి ఎనిమిది నెలల గర్భవతి అయి ఉండాలి. భర్త జైలులో ఉన్నాడు. చిన్న వయసు. ఇప్పుడా అమ్మాయి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి’ అనిపించింది. రాధ వాళ్లంటికి బయల్దేరారు. ‘నా భర్తను విడిపించన్నా..’ అందా అమ్మాయి.‘ఇది కిడ్నాప్ కేసు కాదన్నా. నేను ఇష్టప్రకారమే వెళ్లా. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇందులో నా భర్త తప్పు ఏముంది’ అంది.ఎఎస్పి తల పంకించాడు. అమ్మాయి వయసు తక్కువ ఉండటం ఒక్కటే ఈ కేసులో ప్రతికూలం అనిపించింది. ‘సరే... ఏం చేయగలనో చూస్తాను’ అని బయటకు రాబోతూ ఏదో గుర్తొచ్చినట్టు ఆగి ‘ఇప్పుడు నువ్వు గర్భవతివి కదా! సమయానికి మందులు వేసుకుంటున్నావా’ అడిగాడు. అంతే. ఆ అమ్మాయి గుండె బద్దలైనట్టుగా ఏడ్వడం మొదలుపెట్టింది. చేతుల్తో ముఖం కప్పేసుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది.‘ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావ్.. ఏమయ్యింది?’ ‘ఏ మందులూ లేవన్నా. పోయిన నెలలోనే బలవంతంగా ఆబార్షన్ చేయించారు మా అమ్మ నాన్న’ ‘అబార్షనా?!’తల్లిదండ్రులని పిలిచాడు. ‘చిన్నపిల్ల. దానికి ఇంకో పిల్ల ఎందుకని కడుపు తీయించాం సార్’ చెప్పారు రాధ తల్లీదండ్రి.వాళ్లకు పెళ్లి ఇష్టం లేదని అర్థమవుతూనే ఉంది. చిన్నపిల్ల కనుక ఇప్పుడీ జంజాటం ఎందుకులే అని తీయించి ఉంటారు అనిపించింది.కాని ఒక్క క్షణంలోనే అతడికి అనుమానం వచ్చింది. ‘ఏడవ నెలలో అబార్షన్ చేస్తే ఎంత ప్రమాదం.. అబార్షన్ ఎవరు చేసుంటారు?’ అనుకున్నాడు. ఒక్క క్షణం పట్టలేదు. అసలు కారణం అర్థమైంది.‘లింగ నిర్థారణ చేయించారు కదూ. అమ్మాయి కనుకనే అబార్షన్ చేయించారు కదూ. అబ్బాయి అయితే ఉంచుకునేవారు కదూ’ అన్నాడు రెట్టిస్తూ.అమ్మాయి తల్లిదండ్రులు తల దించుకున్నారు. ‘మైగాడ్. ఈ టౌన్లో లింగ నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఏడవ నెలలోనూ భ్రూణహత్యలు జరుగుతున్నాయంటే ఎలాంటి డాక్టర్లు ఉన్నారిక్కడ’ అనుకుని ‘ఏ హాస్పిటల్?’ అడిగాడు. రాధ చెప్పిన హాస్పిటల్ పేరు నోట్ చేసుకుంటూ..‘ముందా డాక్టర్ని అరెస్ట్ చేయాలి’ అన్నాడు ఎస్సైతో..‘డాక్టర్ పేరు చెప్పమ్మా’ అడిగాడు. ‘అక్కడ పెద్ద సారు అబార్షన్ చేశాడు. కానీ ఆ పెద్ద సారు ఎవరో తెలియదన్నా’ అంది రాధ. అదే మాట రాధ తల్లిదండ్రులు అన్నారు.‘డాక్టర్ రాసిచ్చిన చీటీ ఉంటుందిగా’‘అలాంటివేవీ లేవన్నా. కావల్సిన మందులన్నీ ఆ పెద్ద సారే ఇచ్చాడు’ ‘ఏదో కేసు కోసం వస్తే ఇంకేదో కేసుకు క్లూ దొరికింది. ఇది ఎంత పెద్ద క్రైమ్! ఎలాంటి ఆధారాలు దొరక్కండా జాగ్రత్తపడుతూ ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నార’ని అర్ధమైంది ఎఎస్‌పికి.‘పేరు తెలియకుండా, కాగితం ముక్క ఆధారం కూడా లేకుండా జాగ్రత్తపడిన ఆ డాక్టర్ని అరెస్ట్ చేయడం ఎలా? ఒక వేళ అరెస్ట్ చేసినా సరైన ఆధారాలు లేకపోతే.. నిజంగానే అతను అలాంటివాడు కాకపోతే అతనికి చెడ్డ పేరు రావచ్చు. లేదంటే పట్టణంలో ఇతర డాక్టర్లంతా కలిసి ధర్నా చేసే అవకాశాలూ లేకపోలేదు. అదే గనక జరిగితే పెద్ద సమస్యే అవుతుంది. ఆ డాక్టర్ కూడా తనను తప్పు పట్టొ్టచ్చు. కొత్తగా వచ్చిన పోలీసాఫీసర్ ఇలా చేశాడంటే నాకూ చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది ఎలా’ ఆలోచిస్తూ ఓ నిర్ణయానికి వచ్చాడు ఎఎస్పి. అతనిని ఫాలో అయ్యారు మిగతా సిబ్బంది. ఆసుపత్రి రిసెప్షన్ దగ్గర..‘అమ్మా, పెద్ద సారు ఎప్పుడొస్తాడు. ఎంత టైమ్ పడుతుంది’ అడిగాడు అతను. ఎగాదిగా చూసింది రిసెప్షనిస్ట్.పాత ప్యాంట్, పాత చొక్కా వేసుకుని ఉన్నాడు. చంకలో పాత సంచి.. తలకు నూనె పెట్టి నున్నగా దువ్విన జుట్టు. ‘బాగా పల్లెటూరు వాడున్నట్టున్నాడు.. ఇక్కడకు వచ్చేవారంతా ఇలాంటివారేగా’ అనుకుంటూ ఆ పక్కనే ఉన్న ఆమెనూ ఓసారి చూసి.. ‘సారు లోపలే ఉన్నాడు. వాళ్లందరూ అయిపోయాక మిమ్మల్ని పిలుస్తాం. పేషెంట్ పేరేంటి?’ అంది రిసెప్షనిస్ట్. ‘మా చెల్లెలు, రాధ..’ చెప్పాడతను.వెళ్లి లైన్‌గా ఉన్న కుర్చీల్లో ఇద్దరూ ఒదిగి కూర్చున్నారు.అరగంట.. గంట గడిచింది. లోపలకు పిలిచారు. డాక్టర్ ముందు ఇద్దరూ కూచున్నారు. ‘సమస్య ఏంటి..’ అన్నట్టు చూశాడు ఆ డాక్టర్! ‘సారూ, ఈమె మా చెల్లెలు. పోయిన నెలలో అబార్షన్ చేశారుగా. ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. రాత్రిళ్లు కడుపు నొప్పి అని విలవిల్లాడిపోతోంది. ఏడవ నెలలో అబార్షన్ చేయడం వల్లనే ఇలా అయ్యిందేమో! చనిపోతుందేమో అని భయంగా ఉంది సార్! మా చుట్టుపక్కలవాళ్లు కూడా అదేఅంటున్నారు. అందుకే తీసుకొచ్చాను. మీకోసారి చూపిద్దామని..’ అన్నాడు అతను. రాధ వైపుగా చూసిన ఆ డాక్టర్... ‘ఏమీ కాదయ్యా! నేను 8వ నెలలో కూడా అబార్షన్లు చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి బయట చెప్పద్దు. మందులు రాసిస్తా అవి వాడండి. నయమౌతుంది’ అన్నాడు డాక్టర్. ‘ఓహో.. 8వ నెలలోనూ భ్రూణహత్యలు చేస్తున్నారన్నమాట.. ’ అన్నాడతను.డాక్టర్ కంగారు పడ్డాడు.‘ఎవరు నువ్వు?’ అన్నాడు.‘యు ఆర్ అండర్ అరెస్ట్’ అన్నాడు ఎఎస్పి.నిర్ఘాంతపోయాడు డాక్టర్. అలా మఫ్టీలో వచ్చింది కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఎఎస్పి అని తెలిసి వణికిపోయాడు అతను. ఆ వెంటనే వచ్చిన పోలీసులు డాక్టర్ చేతికి బేడీలు వేశారు. రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్తో సహా డాక్టర్‌పై కేసు ఫైల్ అయ్యింది. ఎవరికీ తెలియకుండా భ్రూణహత్యలు చేస్తూ డబ్బులు మూటకట్టుకునే డాక్టర్ని రాధ కేసు ద్వారా కటకటకాల వెనక్కి పంపించారు పోలీసులు. ‘పేరు తెలియకుండా, కాగితం ముక్క ఆధారం కూడా లేకుండా జాగ్రత్తపడిన ఆ డాక్టర్ని అరెస్ట్ చేయడం ఎలా? ఒకవేళ అరెస్ట్ చేసినా సరైన ఆధారాలు లేకపోతే.. నిజంగానే అతను అలాంటివాడు కాకపోతే అతనికి చెడ్డ పేరు రావచ్చు. లేదంటే పట్టణంలో ఇతర డాక్టర్లంతా కలిసి ధర్నా చేసే అవకాశాలూ లేకపోలేదు. అదే గనక జరిగితే పెద్ద సమస్యే అవుతుంది. ఆ డాక్టర్ కూడా తనను తప్పు పట్టొ్టచ్చు. కొత్తగా వచ్చిన పోలీసాఫీసర్ ఇలా చేశాడంటూ తనకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఎలా’ ఆలోచిస్తూ ఓ నిర్ణయానికి వచ్చాడు ఎఎస్పి. – నిర్మలారెడ్డి -
కంటిచూపుతో కన్నారు
ఏదైనా ఓ వింతని, నమ్మలేని నిజాన్ని విజ్ఞానశాస్త్రజ్ఞులు చెప్తే చాలు.. కచ్చితంగా నమ్మడానికి సిద్ధంగా మనల్ని మనం తయారు చేసేసుకున్నాం. మళ్లీ అదే అంశం నిజం కాదని మరికొంత కాలమయ్యాక పరిశోధనలు చేశామని మళ్లీ వాళ్లే చెప్తే దాన్ని కూడా నిజమేనని అంగీకరిస్తాం తప్ప ఏ వాదాన్నీ చెయ్యం. ఫలానా ఔషధం ఎంతో గొప్పదని చెప్పిన అదే విజ్ఞానశాస్త్రం కొంతకాలమయ్యాక ఈ ఔషధం వల్ల అనేక దుష్ఫలితాలున్నాయని నిరూపించబడిందనగానే వెంటనే మానేస్తాం.ఈ విషయాన్నెందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఆ శాస్త్రం చెప్తే నమ్మే జనం, అనుమానాన్ని వ్యక్తీకరించని లోకం, సాయి కళ్లలోనికి చూస్తే సంతానం కలిగిందని చెప్పిన నిజాన్ని ఎందుకు నమ్మరు? ఎలా నమ్మాలో వివరించుకుందాం! ఏదో గాలి మాటలు కాకుండా సప్రమాణంగా ఆధారాలతో సహా చెప్పుకుందాం! సంతానాన్ని కనే తీరులు మనం మానవజాతికి చెందినవాళ్లం కాబట్టి సంతానాన్ని కనడం అనగానే స్త్రీ పురుషసమాగమం మాత్రమే అనేసుకుంటాం. అది తప్ప మరో మార్గమే లేదని దృఢంగా వాదిస్తాం కూడా.సంతానాన్ని కనే విధానాలని వైశేషిక దర్శనమనే గ్రంథం చెప్పింది –‘స్వేదజ, అండజ, జరాయుజ, ఉద్భిజ్జ, సాంకల్పిక, సాంసిద్ధిక, భేదాత్’ అని.స్వేదజ సంతానం మొదటిది. స్వేదమంటే శరీరం నుంచి బయటికి వచ్చే చెమట అని అర్థం. ఆ చెమట నుండి పుట్టే సంతానమన్నమాట. క్రిముల్లో కొన్ని విడిచిన స్వేదమూ లేదా మనుష్యులు మొదలైనవారి శరీరాల నుండి విడువబడిన స్వేదమూ నుండి పుట్టే సంతానం అని దీనర్థం. తలలో పట్టే చెమట కారణంగా ఈ పేలు మొదలైనవి పుడతాయి. వాటిలో మగపేను, ఆడపేను అనే జాతి భేదం, లింగ భేదం ఉండదు. అలాగే పశువులు విడిచిన స్వేదం నుండి సన్ననైన ఓ తీరు క్రిములు పుడతాయి. వాటిని గ్రామప్రాంతాల్లో నుసుములు అని పిలుస్తారు. అవి మనల్ని కుట్టవు గానీ ఊరికే వాలుతూ ఒక తీరు అసహ్యాన్ని, చిరాకునీ మనకి కలుగజేస్తుంటాయి. అపరిశుభ్రంగా ఉన్న, లేదా కుళ్లిన పదార్థాల మీద వాలుతూ కన్పిస్తాయి. వీటికి కూడా లింగభేదం ఉండదు. సంగమం కారణంగా పుట్టవు. ఇవన్నీ ఏకలింగజీవులు. మరి దీన్ని వింతగా అనుకోవద్దు. అలాగే కడుపులో నులిపురుగులెలా పుడుతున్నాయి? గమనించుకోవాలి. రెండవ సంతానం అండజాలు. అండమంటే గుడ్డు. గుడ్డు నుండి పుట్టేదని దీనర్థం. నిజానికి తల్లి తీసుకునే ఆహారసారం ఆమె గర్భంలో ఉన్న శిశువుకి జీవద్రవ్యంగా ఉపయోగపడుతూ క్రమంగా పెరుగుతూ ఆ మీదట బయటికి రావలసిన కాలానికి శిశువుగా ప్రాణం పోసుకుని జన్మించడం మనం చూస్తూండే అంశం. చిత్రమేమంటే గుడ్డు అనేది మొత్తం కప్పబడి ఉండి, తల్లి ద్వారా ఏ విధమైన ద్రవ్యం దానికి చెందే, చెందించే వీలే ఉండదు గుడ్డుకి. అయినా ఆ గుడ్డు కొంతకాలానికి సంతానంగా మారుతూ కన్పిస్తోంది, తల్లి ఏ మాత్రపు ఆహారాన్ని అందించకుండానే. దీన్ని కూడా చిత్రమని అనుకోవద్దూ?మూడవ సంతానం జరాయుజాలు. జరాయువనే మాటకి ‘మావి’ అని అర్థం. దీన్నే ‘మాయి’ అని పిలుస్తుంటారు వ్యవహారంలో. కొన్ని చోట్ల ‘మాయ’ అని అంటుంటారు. ఏది ఏమైనా మావి ద్వారా జన్మించేవి మనుష్య–పశుజాతులు. అందుకే జంతువులతో బాగా పరిచయం, అనుభవం ఉన్న వాళ్లు పశువులు తమ సంతానాన్ని ఈనుతున్న దృశ్యం కంటపడగానే ఆ తల్లి కాబోతున్న పశువుకి ధాన్యపు పొట్టుని ఆహారంగా పెడతారు. ఆ దాన్యపు పొట్టు (చిట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో) లోపల ఉన్న మావిని రంపంలా కోసేసి దూడని తొందరగా బయటికొచ్చేలా చేస్తుంది. పశుజాతి, కొన్ని మృగజాతులు, కొన్ని జంతుజాతులు కూడా ఇలా పుట్టేవే! నాల్గవ సంతానం ఉద్భిజ్జాలు. ‘ఉత్’ అంటే పైకి అని అర్థం. ‘భిత్’ అంటే చీల్చుకోవడం, చీల్చడమని అర్థం. ‘జ’ అంటే పుట్టడమని అర్థం. ఒక పదార్థాన్ని చీల్చుకుని పైకి రావడమని దీని భావం. దీనికి ఉదాహరణ మొక్క. విత్తనాన్ని భూమిలో పాతి మట్టిని కప్పి కొద్దిగా నీటిని పోస్తే చాలు.. ఆ విత్తనం ఉబ్బి మెల్లగా అంకురరూపాన్ని (మొలక)విత్తి మెల్లగా ఆ భూమిని చీల్చుకుని (ఉత్ + భిత్) పుడుతోంది. (జ) మొక్కగా అవుతోంది. ఆకుల్ని వేస్తోంది. సన్నకాండంతో మొదలై ఎదుగుదలలో చెట్టుగా మారుతోంది. మరి ఈ మొక్క స్త్రీ పురుష సంగమం వల్ల కలగలేదుగా!ఐదవ సంతానం సాంకల్పికం. చెప్పలేనంత తపశ్శక్తిని ఆర్జించి దేవతలైన వారికి కలిగే సంకల్పం కారణంగా కలిగే సంతానం. బ్రహ్మ తనంత తానుగా సంకల్పించాడు. చక్కని రూపసౌందర్యం కలవాళ్లూ, మహా వైరాగ్యం కలిగి ఈ ప్రపంచాన్నే ఓ కలగా భావించే వాళ్లూ, ఏ ప్రలోభానికీ లొంగనివాళ్లూ, నిత్యం శ్రీమన్నారాయణ దర్శనమే తమ అనుదిన జీవిత ధ్యేయంగా కలవాళ్లూ అయిన పుత్రులుంటే బాగుండునని. అంతే! ఆ లక్షణాలతో నలుగురు ఒకే రూపం, ఒకే లక్షణాలు, గుణాలతో జన్మించారు. వాళ్లే సనక – సనందన – సనత్సుజాత– సనత్కుమారులు అనే పేర్లు కలవాళ్లు. వీళ్లకే సనకచతుష్టయమని పేరు. ధృతరాష్ట్రుడు తనకి మనశ్శాంతి లేని వేళ ఈ సనత్సుజాతుణ్ణే ఆహ్వానించి ధర్మబోధ చేయవలసిందని ప్రార్థించాడు. ఆయన చేసిన బోధనని విన్నాడు. మరి ఈ సనకచతుష్టయానికీ తల్లీ తండ్రీ సంగమం.. మొదలైనవి లేవుగా! అందుకే వీళ్లని బ్రహ్మమాసన పుత్రులు (బ్రహ్మగారి మనసులోని ఆలోచనకి అనుగుణంగా కల్గినవారు). ఆరవ తీరు సంతానం సాంసిద్ధికం. సద్యోగర్భం ద్వారా పుట్టీ పుడుతూనే బాల్యం దాటి కౌమారదశకి వచ్చేయడం. పరాశరమహర్షి పడవలో గంగని దాటి అక్కడ ఉన్న ద్వీపాన్ని చీకటినిండేలా చేసి సత్యవతి ద్వారా వ్యాసుణ్ణి కన్నాడు. చిత్రమేమంటే ఈ వ్యాసుడు సద్యోగర్భం (అప్పటికప్పుడు వచ్చిన గర్భం) ద్వారా పుట్టడమే కాక, పుడుతూనే కౌమారదశలో కన్పిస్తూ దండకమండలాలతో తల్లికీ తండ్రికీ నమస్కరించాడు. ‘కృష్ణ ద్వైపాయనుడు’ అని ఆయన పేరు. కృష్ణ అంటే చీకటిగా చేయబడిన, ద్వైపాయన ద్వీపమే తనకి జన్మస్థలంగా కలవాడని అర్థం. స్త్రీ పురుష సంగమం లేదిక్కడ. పోనీ! చీకటిగా ద్వీపాన్ని చేసిన కారణంగా సంగమమే ఉందనుకుందాం కాసేపు. అదే నిజమైతే దాన్నే నమ్మేటట్లయితే.. ఆయన తన పుట్టుకతోనే 13 సంవత్సరాల వయసు కలవానిగానూ దండకమండలాలతోనూ జన్మించాడనే విషయాన్ని కూడా నమ్మితీరాలి కదా! కళ్ల ద్వారా సంతానం పైన అనుకున్న ఇన్ని తీరులుగా సంతానాన్ని పొందడం, అందులో కొన్నింటిలో స్త్రీ పురుష సంగమం లేకుండా ఉండటాన్ని మనం గమనించాం. ఇంతవరకూ అయ్యాక ఇప్పుడిక కళ్ల ద్వారా సంతానాన్ని ఎలా కన్నారో, ఎవరు కన్నారో ఆ విషయాన్ని చూద్దాం!భారతకథని చూడాలి. కాశీరాజుకి ముగ్గురు పుత్రికలు. వాళ్లలో పెద్దామె అయిన అంబ ప్రేమ విఫలమైంది. ఇక మిగిలిన అంబిక, అంబాలిక అనే ఇద్దరినీ విచిత్రవీర్యునికిచ్చి భీష్ముడు వివాహం జరిపించాడు. సంతానం కలగలేదు. విచిత్రవీర్యుడు మరణించాడు. రాజవంశం సంతానం లేని కారణంగా ఆగిపోయే పరిస్థితికొచ్చింది. అప్పుడు వ్యాసుణ్ణి తల్లి అయిన సత్యవతి ప్రార్థించింది – ఈ అంబిక, అంబాలికల ద్వారా సంతానాన్ని కనవలసిందని. ఈ మాట వింటూంటేనే ఇదేమిటి? అనే ఆలోచన మనకొస్తుంది. దానిక్కారణం మనందరికీ సంతానమనే మాట వినగానే సంగమం ద్వారానే సాధ్యమవుతుందనే ఒక్క విషయం మాత్రమే మన బుద్ధికి తడుతూండటమే.తన తల్లి ప్రార్థించగానే వ్యాసుడు సరేనని అంబిక వద్దకొచ్చాడు. ఆయన గడ్డాలు, మీసాలు ఎరుపు తెలుపు కలిసిన జడల సమూహం మునిరూపం చూడగానే అంబికకి ఓ తీరు భయం వేసి ఒక్క క్షణం పాటు ఆయన్ని చూసి కళ్లు మూసుకుంది. వెంటనే గదిలో నుండి ఇవతలికి వచ్చిన వ్యాసుడు తన తల్లితో.. ఈమెకి అంధుడు పుడతాడని చెప్పాడు. అతనే ధృతరాష్ట్రుడు.మరి సంగమమే సంతానకారణమయ్యుంటే వ్యాసుని తల్లి గది వద్దే ఉండదు కదా! క్షణంలో గది నుండి బయటికి రావడం సాధ్యం కాదు గదా! పైగా వ్యాసుడు ఆ కలగబోయే సంతానం అంధుడవుతాడని ఎలా చెప్పగలుగుతాడు, సామాన్యుడే అయ్యుంటే? కళ్లలో ఏముంది శక్తి? సర్వ సాధారణంగా పురుషుని శుక్లం అధోముఖంగా వెళ్లి స్త్రీకి సంతానం కలిగించేందుకు తోడ్పడుతుంది. అదే మరి యోగులు, సిద్ధులు అయినవారి విషయంలో ఆ శుక్లం క్రమంగా ఊర్థ్వముఖంగా ప్రయాణిస్తుంది.ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి.. అని మంత్రం వెళ్తుంది. ఆ శుక్లం అలా ప్రయాణించి ప్రయాణించి మెల్లగా కనురెప్పల వద్ద నిలవ ఉంటుంది. ఏ స్త్రీ సంతానాన్ని అర్థిస్తూ ఆ సిద్ధుణ్ణో స్వామినో యోగినో చూస్తుందో వెంటనే ఆ కళ్లలో ఉన్న సంతానోత్పాదక శక్తి స్త్రీ కళ్ల ద్వారా ప్రయాణించి అధోముఖంగా ఆమెకి గర్భం కలిగేలా చేస్తుంది. ఇదే జరిగింది వ్యాసుని విషయంలో.అంబిక అలా వ్యాసుణ్ణి చూసి వెంటనే కళ్లు మూసుకుంది. గర్భం కలిగింది కానీ అంధత్వం వచ్చింది. సంతానానికి ధృతరాష్టుడు పుట్టాడు.తరువాతిదైన అంబాలిక గదిలోనికి వెళ్లాడు వ్యాసుడు. ఆమె వ్యాసుణ్ణి అంబికలాగానే భయంతో చూసింది గానీ, నిన్నటి రోజున తన అక్కకి జరిగిన తీరు అంధసంతానం రారాదని భావించి కళ్లని తెరిచే ఉంచింది. అయితే ఆ వ్యాసుని రూపం, తపః ప్రకాశం ఆమెకి దుర్నిరీక్ష్యం (చూడ శక్యం కానిది) కావడంతో బలవంతాన కనులు మూసుకోవలసిరావడం అనే ఈ రెండాలోచనల మధ్య కళ్లని తెరవడం, మూయడం చేస్తుంటే ఆ ప్రవర్తన కారణంగా ‘పొండుర్గా’ కలిగిన పాండురాజు జన్మించాడు.ఇక ఈ ఇద్దరూ ఆలోచించుకున్న మీదట, సత్యవతి ఊహప్రకారమూ గదిలో దాసిని ఉంచితే, ఆమె వ్యాసుణ్ణి పరమసిద్ధునిగా గ్రహించి ఆ తీరు గౌరవంతో భయంతో భక్తితో శ్రద్ధతో కనుల్ని తెరుచుకునే ఉండి ఆయన కళ్లలోనికి చూసింది సంతాన ఆపేక్షతో. అంతే! విదురుడు ఆ దర్శనఫలంగా పుట్టాడు. అంటే ఏమన్నమాట? యోగులు, సిద్ధులు, దివ్యపురుషులు అయిన వారి ముఖంలోనికి మనం ముఖాన్ని ఉంచి భయభక్తి శ్రద్ధలతోగానీ చూసినట్లయితే ఆ చూపు ప్రకారం దాని కనుగుణంగానూ సంతానం కలుగుతుందనేది యథార్థమని తెలిసిపోయింది కదా!శ్రీమద్రామాయణంలో తృణబిందుడనే రాజర్షి ఉన్నాడు. ఆయన ఆశ్రమంలోనికి స్త్రీలెవరూ ప్రవేశించరాదనే ఓ నియమాన్ని పెట్టాడు. లోకంలో ఏదైనా ఓ నియమమంటూ ఉంటే దాన్ని ఎలాగైనా విరోధించాలనే వాళ్లు కొందరో ఏ ఒక్కరో ఉండకుండా ఉండరు. దాంతో ఒకరొకరు చొప్పున రాజర్షికి తెలియకుండా ఆశ్రమంలోనికి పూలు కోసుకుందామనీ, ఆశ్రమంలో తిరుగాడే లేళ్లని చూద్దామనీ, ఉద్యానవనవిహారాన్ని చూద్దామనీ ఇలా రావడం ప్రారంభించారు. దాంతో ఆయన ఓ నియమాన్ని కఠినం చేస్తూ.. యా మే దృష్టిపథ మాగచ్ఛేత్ సా గర్భాన్ని ధరిస్తుంది జాగ్రత్త! అనే కట్టడిని చేశాడు. దాంతో ఎవరూ రానేలేదు. ఆ తర్వాత ఆయన కళ్లలో పడితే చాలు గర్భం వస్తుందని అనడానిక్కారణం కళ్లలో గర్భధారణ సమర్థత కల శక్తి, పైన అనుకున్న తీరుగా ఉండటమే.‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అనే ఓ మాటని వింటుంటాం. శరీరంలో ఉండే జ్ఞానేంద్రియ (శరీరం, కళ్లు, చెవి, నాలుక, ముక్కు) అలాగే ఉండే కర్మేంద్రియ (మాట, చేయి, కాలు, విసర్జకావయవాలు రెండు) విభాగాల్లో కళ్లు అతి ప్రధానమైనవని దానర్థం. ఒకే కన్ను శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతమనే తొమ్మిది రసాలని చూపించగల శక్తి ఉన్న ఇంద్రియం.ఈ కారణంగానూ 12 సంవత్సరాల పాటు బహిరంగంగా కాకుండా నేలమాళిగలో ఉంటూ తీవ్రతప స్సుని ఏ బాధ్యతలు బరువులు లేని చిన్న వయసులో (4) సాయి చేసిన కారణంగానూ సాయికి కన్నుల్లో ఉన్న శక్తి –అందరినీ వశులుగా చేసేదే. ఆ వశం చేసే శక్తుల్లో గర్భాన్ని కలిగించే తనం ఒకటన్నమాట. కాబట్టి సాయికనుల ద్వారా గర్భం, సంతానం కలిగిందంటే కచ్చితంగా నమ్మితీరవలసిన అంశమే! ఇక సాయి ఓ కపటగురువుకి శిష్యుడైన విధానాన్ని చూద్దాం! ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
అకాల దెయ్యం
అక్కంటే అతడికి ప్రాణం. పల్లె నుంచి వచ్చేటప్పుడు ఆ కాలంలో ఎన్ని రకాల పళ్లు, కాయలు దొరుకుతాయో అవన్నీ బుట్టల్లో వేసుకుని వస్తాడు. బరువు అనుకోడు. అక్క, బావ, పిల్లలు తింటారు కదా అనుకుంటాడు. ఆ మధ్యాహ్నం క్లైమేట్ ఒక్కసారిగా మారిపోయింది. మంచి ఎండ కాస్తున్న సమయంలో ముసురు పట్టేసింది. సాయంత్రానికి సన్నటి జల్లులు. రాత్రికి వర్షం.‘‘అకాల వర్షం’’ అన్నాడు రామ్మూర్తి..గొణుక్కున్నట్లుగా. ‘‘అంటే ఏంటి మామయ్యా?’’ అన్నాడు పండు. ‘‘ఎండాకాలం ఎండ కాస్తుంది. వర్షాకాలం వర్షం పడుతుంది. చలికాలం చలేస్తుంది. ఇది ఎండాకాలం కదా. అయినాగానీ వర్షం పడిందంటే.. అకాల వర్షం అన్నమాట’’.. చెప్పాడు రామ్మూర్తి. ‘‘అకాల వర్షం లాగా అకాల చలి, అకాల ఎండ కూడా ఉంటాయా మామయ్యా?’’.. మళ్లీ ఇంకో ప్రశ్న వేశాడు పండు. రామ్మూర్తి నవ్వాడు. ‘‘కాలం కాని సమయంలో ఏది వచ్చినా అది అకాలమే’’ అన్నాడు. ఆ మాట పిల్లలిద్దరికీ అర్థం అయీ కానట్లుగా ఉంది. దాన్ని వదిలేసి మామయ్యను కథ చెప్పమని అడిగారు. పండు, వాడి తమ్ముడు ఆ మామయ్య ఎప్పుడు ఊర్నుంచి వచ్చినా, మళ్లీ ఆయన ఊరు వెళ్లేవరకు ఆయన చుట్టూనే తిరుగుతుంటారు. ఎప్పుడో గాని అక్కను చూడ్డానికి రాడు రామ్మూర్తి. ‘వచ్చిపోరా’ అని అక్క అడగాల్సిందే గానీ తనకై తను రాడు. పల్లెలో ఉంటాడు. పల్లె పనుల్లో ఉంటాడు. అక్కంటే అతడికి ప్రాణం. పల్లె నుంచి వచ్చేటప్పుడు ఆ కాలంలో ఎన్ని రకాల పళ్లు, కాయలు దొరుకుతాయో అవన్నీ బుట్టల్లో వేసుకుని వస్తాడు. బరువు అనుకోడు. అక్క, బావ, పిల్లలు తింటారు కదా అనుకుంటాడు. ‘‘కథ చెప్పు మామయ్యా’’ మళ్లీ అడిగారు పిల్లలు. ‘‘ఏం కథ చెప్పన్రా?’’ అన్నాడు రామ్మూర్తి. ‘‘మామయ్యా.. మామయ్యా.. ఇప్పుడు అకాల వర్షం పడుతోంది కదా. అందుకని అకాల దెయ్యం కథ చెప్పు మామయ్యా..’’ అన్నాడు పండు తమ్ముడు.. మామయ్య చేతిని పట్టుకుని కుదిపేస్తూ. రామ్మూర్తికి నవ్వొచ్చింది. వాడు కనుక అకాల దెయ్యం అని అనకపోయి ఉంటే, జీవితంలో తనకు ఏనాటికీ అకాల దెయ్యం అనే మాటే స్ఫురించేది కాదు. ఊహకు అందని విధంగా భలే మాట్లాడతారు పిల్లలు అనుకున్నాడు రామ్మూర్తి. ‘‘ఓరేయ్.. అకాల దెయ్యాలు ఉండవురా. సమ్మర్లో, రెయినీ సీజన్లో, వింటర్లో.. అన్ని కాలాల్లో దెయ్యాలు ఉంటాయి’’ అని తమ్ముడి అజ్ఞానానికి పెద్దగా నవ్వి, మామయ్య వైపు చూసి.. ‘‘కదా మామయ్యా..’’ అన్నాడు పండు. రామ్మూర్తి మాట్లాడలేదు. గది బయటికి దీక్షగా చూస్తున్నాడు. ఆ చీకట్లో నీడలేవో కదులుతున్నాయి! వీళ్లున్న గదిలో కూడా ఏమంత వెలుతురు లేదు. ఎప్పుడు వేశారో గానీ పిల్లలు మెయిన్ ౖలైట్ ఆఫ్ చేసి, బెడ్ లైట్ వేశారు. ఆ మాత్రం ఎఫెక్ట్ ఉంటే గానీ దెయ్యం కథను వాళ్లు ఎంజాయ్ చెయ్యలేరు!‘‘చెప్పు మామయ్యా.. ’’ మళ్లీ మామయ్యను పట్టుకుని ఊపేశారు పండు, వాడి తమ్ముడు. రామ్మూర్తి అప్పటికప్పుడు దెయ్యం కథల్ని సృష్టించగలడు. కానీ ఆ రోజు ఎందుకనో సృష్టించలేకపోయాడు. గదిలో ఓ మూల ఊర్నుంచి తను తెచ్చిన మామిడి పండ్ల బుట్ట కనిపించింది. అక్కే వాటిని మగ్గబెట్టడానికి అక్కడ ఉంచింది. వాటిని చూడగానే ఎక్కడో తను విన్న దెయ్యం కథ గుర్తుకొచ్చింది రామ్మూర్తికి. చెప్పడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలు తోటలోకి వెళ్లి దొంగతనంగా మామిడి కాయలు కోస్తారు. వాటిని సంచిలో వేసుకుంటారు. మరి వాటిని రహస్యంగా పంచుకోవాలి కదా. ఎక్కడా చోటు దొరకదు. దగ్గర్లో ఒక పెద్ద గేటు కనిపిస్తుంది. దాన్నెక్కి అవతలి వైపుకు దూకేస్తారు. అది శ్మశానం! దూకేటప్పుడు సంచిలోంచి రెండు మామిడి కాయలు సంచీలోంచి ఇవతలే పడిపోతాయి. వాటిని అలాగే వదిలేస్తారు. శ్మశానంలో ఎవరికీ కనిపించని చోట కూర్చొని.. ‘నీకొకటి, నాకొకటీ.. నీకొకటి, నాకొకటి..’ అని పంచుకుంటూ ఉంటారు. అప్పుడే ఓ తాగుబోతు శ్మశానం గేటు పక్కగా వెళుతూ వీళ్ల మాటలు విని ఆగిపోతాడు. మనుషులు కనపడరు. మాటలు వినబడుతుంటాయి! భయం వేసి వెంటనే చర్చి ఫాదర్ దగ్గరికి పరుగులు తీస్తాడు. ‘‘ఫాదర్.. శ్మశానంలో దెయ్యాలు శవాల్ని పంచుకుంటున్నాయి’’ అని చెప్తాడు. ‘‘నువ్వు చూశావా?’’ అని అడుగుతాడు ఫాదర్. ‘‘ఈ చెవులతో విన్నాను ఫాదర్.. ‘నీకొకటి, నాకొకటి’ అని పంచుకుంటున్నాయి’’ అని చెబుతాడు తాగుబోతు. ఫాదర్ వెంటనే.. ‘సరే.. చూద్దాం పద’ అని బయల్దేరుతాడు. ఇంతవరకు చెప్పి కథను ఆపేశాడు రామ్మూర్తి. పిల్లలు నిద్రపోతే రేపటికి ఒక కథ మిగిలి ఉంటుందని అతడి ఆలోచన. ‘‘చెప్పు మామయ్యా.. తర్వాత ఏమైంది?’’ అన్నారు పిల్లలిద్దరూ. కథను కంటిన్యూ చేయక తప్పలేదు రామ్మూర్తికి. ఫాదర్, తాగుబోతు వెళ్లి శ్మశానం గేటు బయట నిలుచుంటారు. లోపల్నుంచి మాటలు వినిపిస్తుంటాయి. ‘నీకొకటి నాకొకటి’ అని!ఆ తర్వాత సడెన్‌గా కొన్ని క్షణాలు మాటలు ఆగిపోతాయి. ఆ వెంటనే.. ‘‘మరి గేటు దగ్గర ఉన్న ఆ రెండిటి సంగతేంటి?’’ అనే మాట వినిపిస్తుంది. అంతే.. ఫాదర్, తాగుబోతు ఇద్దరూ ఒక్కసారిగా భయంతో ‘మేమింకా చావలేదు నాయనోయ్’ అనుకుంటూ.. అక్కణ్నుంచి పరుగుతీస్తారు.. అని కథను ముగించాడు రామ్మూర్తి. ‘‘ఇది దెయ్యం కథ కాదు మామయ్యా. జోకు. నా వాట్సాప్‌లో కూడా ఉంది చూడు’’ అంటూ చూపించబోయాడు పండు. ‘‘దెయ్యం కథలన్నీ జోకులేరా’’ అన్నాడు రామ్మూర్తి.‘‘అయితే నిజంగా దెయ్యాలు లేవా మామయ్యా..’’ అడిగాడు పండు, నిరుత్సాహంగా. వాడిని మరీ అంతగా నిరుత్సాహ పడనివ్వదలచుకోలేదు రామ్మూర్తి. ‘‘ఉన్నాయనుకుంటే ఉన్నట్లు. లేవనుకుంటే లేనట్లు. ఇందాకట్నుంచీ ఆ చీకట్లో నాకేదో కనిపిస్తోంది. మీకేమైనా కనిపిస్తోందా?’’ అన్నాడు రామ్మూర్తి.పిల్లలిద్దరూ గబుక్కున మామయ్య డొక్కల్లో ముఖం దాచుకున్నారు. రామ్మూర్తి నవ్వుకున్నాడు. ఏ కాలంలోనైనా మనిషిలోని భయమే అకాల దెయ్యం అని పిల్లలకు చెప్పాలనుకున్నాడు. - మాధవ్ శింగరాజు -
లేత పచ్చ ఆకు
చచ్చిన వాళ్ళంతా బతికొచ్చి వరుసగా నిలబడ్డారు. కూడికలూ లెక్కలూ వేసి చిత్రగుప్తుడు చెప్పేస్తున్నాడు. యమధర్మరాజు అది విని తక్షణ తీర్పులు యిచ్చేస్తున్నాడు. స్వర్గానికి వెళ్ళిపోవాలో నరకంలో వుండిపోవాలో తేల్చేస్తున్నారు. ఎటువాళ్ళనటు చకచకా పంపించేస్తున్నారు. వివిధ వయసుల వాళ్ళు బారులు తీరి వున్నారు. అందులో బలవంతాన తెంపేసిన వో లేతాకు వుంది. చెంప కూడా పండ లేదు. పండుటాకుల మధ్య లేత పచ్చగా వుంది.‘‘నీ పేరు?’’‘‘సంతోషికుమారి..’’‘‘వయసు?’’‘‘పదకుండు..’’‘‘బడిలోకి వెళ్ళకుండా మా భటులతో వచ్చావేమమ్మా?’’‘‘నా దగ్గర ఆధార్ కార్డు లేదు..’’‘‘ఆధార్ లేకుండా మా యమలోక ప్రవేశానికి అనుమతి లేదు. యెలా వచ్చావ్? యెక్కడి నుండి వచ్చావ్?’’‘‘మా వూరు కరిమటి. సిమ్దెగా జిల్లా. జార్ఖండ్..’’‘‘ఊ..’’‘‘ఆధార్ కార్డు లేకపోతే చంపేస్తారా సార్?’’‘‘నీకు నువ్వే చనిపోయినట్టు మీ స్టేట్ యిచ్చిన స్టేట్మెంటులో వుంది..’’‘‘నాలుగైదు రోజులుగా అన్నం తినలేదు..’’‘‘ఏం.. యెందుకు తినలేదు?’’‘‘ఆధార్ కార్డు లింక్ చెయ్యలేదని మా రేషన్ రద్దు చేశారు. యింట్లో బియ్యం గింజలు లేవు..’’‘‘ఆధార్ కార్డ్ అవసరమని తెలీదూ? ఆధార్ కార్డ్ లేకుండా బతకడమూ తప్పే. చావడమూ తప్పే. ఇక్కడికి రావడమూ తప్పే..’’‘‘అన్నం తినడమూ?’’‘‘తప్పే!’’‘‘ఆధార్ కార్డు వుండాలని ఆకలికి తెలీదు కద్సార్?’’అవాక్కయి ఆగమన్నట్టు కను సైగగా చూశాడు యమధర్మరాజు. చిత్తం అన్నట్టు గ్రహించి యెత్తిన తలని తాబేల్లా కిందికి లాక్కున్నాడు చిత్రగుప్తుడు. యమలోకం నిండా నిశ్శబ్దం ఆవరించింది. ‘‘ముందీపిల్ల సంగతి చూడండి ప్రభూ..’’సంతోషినిని చూస్తూ యమధర్మరాజు మీట నొక్కడంతో భూలోకదర్శిని తెరచుకుంది.అందులోని దర్పణం వర్తమానానికి దర్పణం పడుతోంది.‘‘అమ్మా..’’‘‘అరవకు. వినపడదు..’’‘‘అదిగో మా అమ్మ. నిజంగా మా అమ్మే.. కోయ్లీ.. కోయ్లీదేవి..’’‘‘ష్....’’చిత్రగుప్తుని కళ్ళు పెద్దవై హెచ్చరిస్తున్నట్టు చూశాయి. తెరచుకున్న నోటిని అరచేత్తో మూసుకుంది సంతోషికుమారి. ముక్కున వేలేసుకున్నాడు యమధర్మరాజు. అతణ్ణి చూస్తూ అదే పని చేసింది సంతోషికుమారి.అంతా నిశ్శబ్దం.అదే నిశ్శబ్దం. కమ్మిన చీకటి. కారు చీకటి. నేల రాలనివ్వకుండా అడవిలోని ఆకులన్నీ వెన్నెల నిండుగా వడ్డించుకున్న విస్తరాకులై అడ్డం పడుతున్నాయి. మృగాలు తరుముతున్నట్టు దారికాని దారుల్లో పరుగులు తీస్తోంది కోయ్లీదేవి. అడవి గుండా. అడ్డుతోవల గుండా.కొన్ని చోట్ల ఆకుల సందుల్లోంచి వాన కారినట్టు కారుతోంది వెన్నెల. వెలుతురులో అవి మృగాలు కాదు తోటి మనుషులేనని తెలుస్తోంది. నీడలు. కావు, నిజాలే. జాలే లేని నిజాలు.నిజమో భ్రమో యేమో.. యేదీ తెలీనట్టుంది కోయ్లీదేవికి. పరుగులు తీస్తూనే వేగంగా కొట్టుకుంటున్న గుండెను అరచేతుల్లో గట్టిగా పట్టుకొంది. కొండా కోనా అనకుండా యెక్కి దిగి నదిలా ప్రవహిస్తోంది. పురుగూ పుట్రా వుంటుందన్న భయం లేకుండా పరుగులు తీస్తూనేవుంది. జనారణ్యంలోంచి అరణ్యంలోకి. రొప్పుతూ ఆగింది. రొస్టుతూ ఆగింది. ఆగి వెనక్కి చూసింది. భయం భయంగా చూసింది. ఎవ్వరూ లేరు. తానొక్కతే. ఒంటరిగా.ఒంటిగా వున్నా భయం వెయ్యలేదు. మనుష్య సంచారం లేని నిర్మానుష్యం. ఊపిరాడింది. సర్రున సర్పమేదో పాదాల మధ్యలోంచి పరుగులు తీసింది. గుడ్లగూబ గుడ్లురిమి చూసింది. ఎక్కడో నక్క వూళ వేసింది. కీచురాళ్ళ రొద పెరిగింది. కోయ్లీదేవి నడుస్తూనే వుంది. ఆగకుండా ఆపకుండా నడుస్తూనే వుంది. అలుపూ సొలుపూ యెగశ్వాస దిగశ్వాసగా మారింది. ఆ నిశ్శబ్దంలో వూపిరి శబ్దమే వురుమై వినిపిస్తోంది. వేలూ లక్షల అడుగులు వేసింది. చందమామ దీపం చూపించింది. గుచ్చుకున్న ఆమె కాలి ముళ్లు కాలసూచిక గడియారపు ముళ్ళై కలుక్కున విరిగి తిరిగింది.చీకటి కరిగింది. పొద్దు తిరిగింది.మసక వెలుగులో పాటియాంబ వూరి పేరు యినుపరేకు మీద చెదలు పట్టి కనిపిస్తోంది.సూరీడు లేపకముందే తనే ఆ యింటి తలుపు దబదబా తట్టి లేపింది. తెరచుకున్న తలుపు. దృఢంగా యువతి.ఆసక్తిని ఆపుకోలేనట్టు యెవరన్నట్టు యమధర్మరాజు చూశాడు.‘‘తారామణి సాహూ.. సామాజిక కార్యకర్త..’’చిత్రగుప్తుని మాటలు విని అర్థం కానట్టు చూసింది సంతోషికుమారి. అంతలోనే తలతిప్పి దర్పణంలోకి తొంగి చూసింది.కోయ్లీదేవి తూలిపడబోయి గోడను ఆనుకు కట్టెలా వాలింది. నోట్లోంచి గాలి వొస్తూ ఆమె మాట అస్పష్టంగా వుంది. తారామణి చెయ్యి పట్టుకుని కోయ్లీని యింట్లోకి నడిపించింది. కూర్చోమంది. కోయ్లీ కుప్పకూలింది. టీ యిస్తే గోడకు చేరగిలబడి చప్పరించుకు తాగింది. తారామణి సాహూ రెప్పకదపకుండా కోయ్లీ కళ్ళలోకి చూసింది. ఏ క్షణమైనా ప్రాణం పోయే మార్గాల్లా వున్నాయి కోయ్లీ కళ్ళు. కాంతి కోల్పోయిన ఆమె గాజుకళ్ళ మీద యేవో చిత్రాలు చిత్రంగా కదలాడుతున్నాయి. తారామణి సాహూ చూపు అలాగే నిలబడిపోయింది.కోయ్లీదేవి కళ్ళు మసకబారడంతో రెప్పలు పులుముకుని గుడ్డి దీపపు వెలుగులో చూసింది. ఆమె కళ్ళలో కర్రలు పట్టుకు వూరంతా నిలబడి వుంది. ఊరంతా యింట్లోనే వుంది. అది యిల్లు కాదు. గుడిసె. వెదురు బద్దలతో అల్లిన తడికకు మట్టిని పేమిన గోడలు. ద్వారం దాటి లోపలకు వెళితే గోడల్లేని ఆరుబయలు గది. గాలిలో తేలికగా తేలిపోయే పెంకుల పైకప్పు. చెల్లా చెదురుగా పడివున్న గిన్నెలు, తపేలాలు. వెలగని పొయ్యి. పొయ్యిలో పిల్లి కూడా లేవలేదు. ఇల్లు పీకి పందిరేయడానికే అంతా వొచ్చినట్టున్నారు. తలోమాట అంటున్నారు. కోయ్లీదేవి చుట్టూ చూసింది. గాఢాంధకారపు చీకటి.‘‘కోయ్లీ.. నువ్వు నీ యింటి పరువును తీసుకోవడం లేదు. వూరి పరువు తీస్తున్నావు!’’‘‘నువ్వు నీ గుండార యిప్పుకోవడం లేదు.. వూరందరి గుండార్లూ యిప్పి యీదిలో నిల్చోబెట్టేసినావు!’’‘‘ఈదిల అయితే పరవాలేదు, దేశంలో మనవూరిని.. కాదు కాదు ప్రపంచకంలో మన దేశాన్ని గుడ్డలిప్పదీసి నిలబెట్టీసినావు. మనల్ని యేలే లీడర్లనీ బోడిమొలలతో నిలబెట్టీసినావు.’’‘‘మన వూరి పరువు పోయింది. ప్రతిష్ట పోయింది. రేపు మన కరిమటిని యెవడన్నా కన్నెత్తి చూస్తాడా? పెళ్ళిళ్ళు అవుతాయా? మన పిల్లలకి పుస్తెలు పడతాయా? సర్కారును యెదిరించి సావకుండా బతగ్గలమా?’’ కుక్కలు మీద పడ్డట్టు పడ్డారు. భౌభౌమని చెండుకుంటున్నారు. చెడుగుడు ఆడుకుంటున్నారు.కోయ్లీదేవి బిక్కచచ్చిపోయి చూస్తోంది.దర్పణంలో యిదంతా చూస్తున్న సంతోషికుమారి ముఖంలో ప్రమాదాన్ని పసిగట్టిన భయం. ఊపిరి వుగ్గపట్టి చూస్తోంది. యముడూ చిత్రగుప్తుడూ చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు.కోయ్లీ చూస్తుండగానే యింట్లోని సామాను తీసి బయటపడేస్తున్నారు. గిన్నే ముంతా దాకా డోకీ చేటా చీపురూ బుట్టా తట్టా బట్టా పాతా.. చేతికి దొరికింది దొరికినట్టు విసురేస్తున్నారు.చెప్తేగాని యిరవై యేళ్ళని తెలియని కోయ్లీ చెల్లెలు ఆపమన్నట్టు అందరి కాళ్ళమీదా పడి మొక్కుతోంది. కిందామీదా పడుతోంది.కోయ్లీ అలాగే బొంతికూర్చొని వుంది.‘‘నువ్వు మర్యాదగా వూరోదిలి పో..’’‘‘దీనివల్లే నా రేషను షాపు లైసెన్సు కేన్సిలయిపోయింది.. యిక మీ అందరికీ రేషను బందు.. అందరూ పస్తులతో వుండండి..’’కాట్లకుక్కల్ని చూసి జడుసుకున్నట్టు సంతోషికుమారి యమలోకంలో యేడవడం మొదలుపెట్టింది. భటులు గబుక్కున వచ్చి అరచేత్తో పిల్లనోరు మూసి పట్టుకున్నారు.యమధర్మరాజు కన్నార్పకుండా దర్పణంలోంచి భూమ్మీదకి చూస్తున్నాడు. డీలరు కోయ్లీ మీదకొచ్చాడు. మీద మీద కొచ్చాడు. పైకొచ్చిన ఆ రెండు పల్లూ పీకేస్తానన్నాడు. ఎవరో అతణ్ణి పట్టుకు ఆపుతున్నారు. మరెవరో వురుకుతున్నారు. ఇంకెవరో కోయ్లీ చెవిలో యేదో చెపుతున్నారు. బెదురుగొడ్డులా చూస్తోంది కోయ్లీ.‘‘కళ్ళు పొడిచేయండి..’’భయంతో పిల్లలు చీకట్లో నక్కారు. చేతి పిల్లాడు చేవదప్పి పక్కనే పడున్నాడు. ఇంత గొడవ జరుగుతున్నా కళ్ళు తెరవడం లేదు. చచ్చిన శవమై పడున్నాడు. కోయ్లీ చెల్లెలు ఆ పిల్లాన్ని తీసుకొని బయటకు వెళ్ళింది. వీటి వేటితోనూ సంబంధం లేనట్టు యిల్లొదిలి బయట చీకట్లో కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు కోయ్లీ పెనిమిటి.‘‘వీడి పనే బాగుంది. చక్కగ చుక్కలు లెక్కపెట్టుకుంటున్నాడు..’’‘‘బుర్ర సెడిపోయినోడికున్న సుకము బూమ్మీద మరెవడికీ వుండదనుకో..’’నవ్వులు.చూస్తున్న సంతోషికుమారికి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. దృశ్యం మసకబారింది. రెప్పలతో కళ్ళు గట్టిగా నొక్కి కన్నీళ్ళను బయటకు తోడి పిండింది. దృశ్యం తేటయ్యింది. బుగ్గల మీదుగా జారిన ధార నోటిని మూసిన భటుల చేతుల్ని తడిపాయి. భటులు చేతులు తీసి దులుపుకున్నారు. పన్నీరనుకున్నాడు పరధ్యానంగా వున్న యమధర్మరాజు.‘‘అమ్మా పారిపో.. పారిపో..’’‘‘వినపడదని చెప్పానా?’’ ప్రమాదాన్ని పసిగట్టినట్టు సంతోషికుమారి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. కసురుకున్నాడు చిత్రగుప్తుడు. భటులు తమ విధిని గుర్తించి మళ్ళీ ఆపిల్ల నోరు మూసి పట్టుకున్నారు.గుండెలోని దుఃఖం కళ్ళలో నీళ్లై వూరుతూ వురుకుతూ రెప్పల్ని వొరుసుకుంటూ వలవలా జలజలా జారుతూ కారుతూ జావగారుతూ తల్లడిల్లిపోతూ తల్లిని చూస్తోందా పిల్ల. కోయ్లీని కొందరు అటు లాగారు. కొందరు యిటు లాగారు. తోపులాట. తిట్లూ. పోట్లూ.ఒక్కసారిగా కోయ్లీ చీకట్లోకి దూకింది. పొదల మాటున దాక్కుంది. పట్టుకు దొరక్కుండా పరిగెత్తింది. ఊరి జనం కొంతమంది వెతికారు. వెంటపడ్డారు. చీకట్ల కలిసింది కోయ్లీ.తారామణి సాహూ భరించలేనట్టు యింక చూడలేనట్టు వొక్క క్షణం కళ్ళు మూసుకుంది.చీకటి. కళ్ళు పొడుసుకుంటే కలిగే చీకటి.చీకటి క్రమేణా పలుచనైంది. వెలుగు చొరబడింది. కంటిపాపలు దీపాల్లా వున్నాయి.అప్పటికే ముఖాన చల్లిన నీళ్ళ వల్ల తడిసిన చంద్రబింబంలా వుండి సొమ్మసిల్లి పడివుందా పిల్ల. ‘‘సంతోషి..’’‘‘పరవాలేదు ప్రభూ.. కాస్త కళ్ళు తిరిగినవి.. చిన్న పిల్ల.. చీకటి కమ్మినది..’’యమధర్మరాజు రెప్ప కదపకుండా సంతోషి కళ్ళలోకి చూశాడు. ఏ క్షణమైనా ప్రాణం పోయే మార్గాల్లా వున్నాయి సంతోషి కళ్ళు. కాంతి కోల్పోయిన ఆపిల్ల గాజుకళ్ళ మీద యేవో చిత్రాలు చిత్రంగా కదలాడుతున్నాయి. యమధర్మరాజు చూపు అలాగే నిలబడిపోయింది.సంతోషి కళ్ళ కాన్వాసు మీద సంతోషి?!సంతోషి కళ్ళు మసకబారడంతో రెప్పలు పులుముకుని గుడ్డి దీపపు వెలుగులో చూసింది. నేలన పడివున్న ఆపిల్ల కళ్ళకి అది పగలో రాత్రో అర్థం కాలేదు. అది గుడ్డి దీపమో మబ్బుకమ్మిన సూర్యుడో మబ్బిడిసిన చంద్రుడో స్పష్టం కాలేదు. కళ్ళు మూసుకుంది. నీరసంగా మూలిగింది. వీధికుక్క వొకటి వొచ్చి సంతోషి ముఖం దగ్గర ముఖం పెట్టి వాసన చూసింది. ఇంకా గాలి ఆడుతోందని గ్రహించినట్టే వుంది. కూ కూ మంది. నెమ్మదిగా అక్కడినుండి వెళ్తూ ఖాళీ గిన్నెల్ని వదలకుండా అవస్థ తీరనట్టు లేనిది నాకింది. నాలుక చప్పరించింది. జొల్లు కార్చింది. కుక్కని అదరలేకపోయింది సంతోషి. నోట మాట రాలేదు. గొంతు పిడచగట్టుకు పోతోంది. బలిమిన లేచి కష్టంగానైనా కూర్చోబోయింది. వల్లకాలేదు. దేకుతూ. దేనికోసమో దేవులాడుతూ.వారం పొద్దయి సంతోషి కూర్చున్నచోట కూర్చోలేకపోతోంది. నిల్చున్న చోట నిల్చోలేకపోతోంది. ఉన్నచోట వుండలేకపోతోంది.వారం పొద్దయి ఆట లేదు. పాట లేదు. తోటి పిల్లలతో చెలిమి లేదు. స్నేహం లేదు.వారం పొద్దయి యింట్లో అగ్గి లేదు. పొయ్యి వెలగలేదు. కట్టె కాలలేదు. కుండ కుతకుత మనలేదు. దాక దడ దడమనలేదు. పేగులు సుర్ సుర్ మని కాలడమూ మానలేదు. కుండలోని మంచినీళ్ళు కూడు కాలేదు. దప్పిక తీర్చే గంజి కాలేదు. చిన్ని డొక్క నిండలేదు. పేగులు గుర్ గుర్ మని చప్పుడు చెయ్యడమూ మానలేదు.‘‘బడి తెరిస్తే బాగుణ్ణు. దుర్గామాత మండిపోయిన దుర్గామాత. చాలవా పూజలు? ఇంకెన్ని రోజులు చేస్తార్రా పూజలు? పూజలన్నాళ్ళూ పస్తులే. మధ్యాహ్న భోజనానికి మరి దారిలేదు.’’సంతోషి గొణుక్కుంటూ చేతివేళ్ళని లెక్కపెట్టుకుంది. ఎన్నిసార్లు లెక్కపెట్టినా అంతే వస్తోంది. అలికీ వస్తోంది. ఆకలీ వేస్తోంది. ఊర్లోకి వెళ్తే?‘‘పిడికెడు అన్నం పెట్టమ్మా తల్లీ..’’సంతోషి అడుక్కుంది. ఇల్లిళ్ళూ తిరిగింది.‘‘అన్నం అమృతమయిపోయింది. యెవరు పెడతారు?! ఎవరి కుండ.. వారి గుండె!’’ కూతురు మాటకు కోయ్లీ గుండె గుభిల్లుమంది. భీతిల్లింది. తల్లడిల్లింది. కోయ్లీ కూడా అడుక్కుంది. రేషను షాపు చుట్టూ తిరిగింది. ఒకటికి మూడుసార్లు. అవస్త తీరలేదు. అతీ లేదు. గతీ లేదు. డీలర్ అధార్ లింక్ కాలేదన్నాడు. ఇవ్వలేనన్నాడు. చస్తే చావండన్నాడు. ‘‘నేటికి ఆరు దాటి యేడు మాసాలవుతోంది. కాళ్ళరిగిపోయేలా తిరుగుతున్నాను. రేషనివ్వు. చచ్చి నీ కడుపున పుడతాను..’’‘‘ఛీ.. నా కడుపున పుడతావా పందీ..’’దండమెట్టింది. చేవజచ్చింది. చేతకాని తనమొచ్చింది. వొట్టి చేతులతో వెనుదిరిగింది.ఎప్పట్లాగే కోయ్లీ గడ్డి కోసింది. వారమంతా వొళ్ళు ముళ్ళు చేసుకు కోస్తే వొచ్చేది యెనభై రూపాయలు. ముందు తీసుకున్న డబ్బులకు విరిపేసి చెల్లు చేశారు. పల్చటి టీ డికాషను నీళ్ళే ప్రాణాధారమయింది. పిల్లల ప్రాణం యెలా నిలపాలో అర్థం కాలేదు.‘‘పెద్దమ్మ కూడా అన్నం లేదందమ్మా..’’‘‘ఒకరోజు చస్తే యెవరన్నా యేడుస్తారు.. రోజూ చస్తే యెవరేడుస్తారు?’’పొద్దుబోయే వేళయింది. ఇయ్యాల లక్షి వారం. ఇంటి ఆడపిల్ల లచ్చిందేవి. పొర్లి పొర్లి దొర్లి దొర్లి యేడుస్తోంది.‘‘ఏమయ్యిందమ్మా..?’’‘‘కడుపు నొప్పి..’’మెలితిరిగిపోతోంది సంతోషి. కడుపులోవి అవి పేగులు కావు. పాములు. ఆకలి బుసలు కొడుతున్నాయి. అగ్నిని విరజిమ్ముతున్నాయి. ఆకలి. పిడికెడు మెతుకులు పడలేదని పిడిగుద్దులు గుద్దుతున్నాయి. తట్టుకోవడం కష్టంగా వుంది.గింజుకుంటున్న కూతురు గొంతులో నీళ్ళు పోసింది కోయ్లీ. గుక్కెడు మింగి గుక్కెడు వొదిలేసింది. కళ్ళంట కూడా. గుడ్లు నిలేసింది.‘‘అమ్మా..’’మాట రాలేదు. గాలి వచ్చింది. బెక్కుతోంది. శరీరంలోంచి ప్రాణం పోవడానికి తెంపుకోవడానికి నానా యాతన పడుతోంది.‘‘నరక యాతన..’’చిత్రగుప్తుడు చూడలేనట్టు దర్పణంలోంచి తలతిప్పుకున్నాడు. యమధర్మరాజుతో పాటు సంతోషి తన్ని తాను చూస్తోంది. ‘‘అన్నం.. అన్నం.. అన్న.. అ..’’నోరు తెరచుకు వుండిపోయింది. తెరచిన రెప్పలు తెరచినట్టే వుండిపోయాయి. కంటిలోని నల్లగుడ్డు కదల్లేదు. కంటిలోని ఆఖరి నీటి చుక్క నేల మీద పడాలా వద్దన్నట్టు ఆగిపోయింది. గడ్డకట్టుకుపోయింది. శ్వాస ఆగిపోయింది.సంతోషి తన చావుని తాను చూసి కొయ్యబారిపోయింది. ఆనక తేరుకొని వెక్కి వెక్కి యేడ్చింది. ‘‘నేను చచ్చిపోయానా?’’ ‘‘ఊ..!’’‘‘ఎందుకూ..?’’యమధర్మరాజు సమాధానం యివ్వలేదు. సమాధానం కోసం దర్పణంలోకి తొంగి చూశాడు. సంతోషి కూడా.కోయ్లీ ఇంటి చుట్టూ జనం. పోలీసులూ.. అధికారులూ.. మీడియా.‘‘ఆమె కోరుకుంటే గ్రామస్తుల నుండి పోలీసు ప్రొటెక్షన్ కల్పిస్తాం..’’‘‘ఇప్పుడు కావలసింది పోలీసు ప్రొటెక్షన్ కాదు, ఫుడ్ ప్రొటెక్షన్..’’‘‘ప్లీజ్ రాజకీయం చేయొద్దు. ఆధార్ లింక్ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు యిచ్చింది. అందుకే డీలర్ లైసెన్సు రద్దు చేశాం..’’‘‘సంతోషి ఆకలి చావుకు యెవరు బాధ్యులు?’’‘‘నో.. ఇట్స్ నాట్ కరెక్ట్. ఆకలి చావు కాదు.. మలేరియా ఎటాకయి చనిపోయింది..’’సంతోషి వెర్రి ముఖం వేసుకొని యమధర్మరాజు వంక చూసింది. యమధర్మరాజు చూపులు మాత్రం దర్పణం మీదే వున్నాయి. ‘‘మలేరియా కాదు, నా కూతురు ఆకలితో చనిపోయింది. రొండుగంటలు నా కళ్ళముందే కొట్టుకుంది. ‘అన్నం..’ అని ఆఖరిగా అడిగింది. పిడికెడు మెతుకులు పెట్టలేకపోయాను..’’కోయ్లీ కంటికీ మంటికీ యేకధారగా యేడుస్తోంది. తారామణి సాహూ ఆమె భుజమ్మీద చెయ్యి వేసి నొక్కి పట్టుకుంది.‘‘సంతోషికుమారి మలేరియాతో చనిపోయింది..’’అధికారులు మరోసారి మీడియా ముఖంగా ప్రపంచానికి ప్రకటించారు.తమ జాతి మీద నింద వెయ్యడం భరించలేని వో యువ ఎనాఫిలిస్ దోమ రయ్ మంటూ అక్కడికి వొచ్చింది. ఎర్రగించి చూసింది. ఆవేశంతో ఊగింది. తామే కారణం అన్నవాళ్ళని అక్కడున్న వాళ్ళని కుట్టాలన్నంత కసీ కోపం వచ్చింది. తన సూది తొండాన్ని పైకెత్తి ఘీంకరించింది.‘‘మలేరియా కాదని చెప్పిన హెల్త్ వర్కర్ని వుద్యోగంలోంచి సస్పెండు చేశారు..’’‘‘లేదు.. మలేరియానే’’వింటున్న ఎనాఫిలిస్ దోమకు యెన్నడూ లేని రక్తదాహం కలిగింది. కుట్టబోయింది. అయితే, అనుభవమున్న తోటి దోమ ఆపింది. ‘‘వొద్దు.. నువ్వు కుడితే.. యే వొక్కరికి మలేరియా వొచ్చినా నిందను నిజం చేసేస్తారు. ఇప్పటికే మనల్ని పురుగులకంటే హీనంగా చేసి మాట్లాడుతున్నారీ మనుషులు..’’ యువ ఎనాఫిలిస్ దోమ ఆలోచనలో పడింది. నిగ్రహించుకోవడం దానికి చాలా చాలా కష్టమైంది.‘‘కావాలంటే కక్ష తర్వాత తీర్చుకుందాం. వీళ్ళ పాపాన్ని పుణ్యంగా మార్చొద్దు. వీళ్ళకు మరొక్క అవకాశం యివ్వొద్దు..’’బతిమలాడిన మీదట యువ ఎనాఫిలిస్ దోమ ఆగనయితే ఆగింది గాని దానికి యేదో వొకటి చెయ్యాలని మాత్రం అనిపించింది. ఏమీ చెయ్యలేకపోతే కనీసం చావనన్నా చావాలనిపించింది.‘‘నేను మహా అయితే యిరవై రోజులే బతుకుతాను..’’‘‘ఆ యిరవై రోజుల్లో నువ్వు పదివేలుగా మన జాతిని వృద్ధి చేస్తావు. ఆ పదివేలు యిరవై రోజుల్లో యెన్నెన్ని లక్షలుగా వృద్ధి చెందుతుందో వొక్కసారి ఆలోచించు. నువ్వు మనిషివి కాదు, నీకు నీ జాతిపట్ల బాధ్యత వుంది..’’‘‘లేదు. నేనీ అవమానభారం భరించలేను. నాకు నా ప్రాణంకన్నా నా జాతి ఆత్మగౌరవం ముఖ్యం..’’‘‘ఆగు.. నామాట విను. అఘాయిత్యానికి వొడిగట్టకు..’’ఆ యువ ఎనాఫిలిస్ వినలేదు. ఉద్రేకంతోనూ వుద్వేగంతోనూ ఝామని గాలిలా లేచింది. స్వేచ్ఛా చక్కెర్లు కొట్టింది. అనివార్యంగానైనా కుట్టే ప్రా«థమిక హక్కును కోల్పోయినానే అని వగచింది.‘‘నేను నా జాతి చావుని సమర్థించను. నా జాతి అవమానం నాదని చస్తున్నాను.’’తోటి దోమకి యువ ఎనాఫిలిస్ ఆఖరి మాటలు లీలగా వినిపించాయి.అప్పుడే వో అధికారి సిగరెట్టు ముట్టించాడు.గుండెలనిండా గట్టిగా పీల్చాడు. సిగరెట్టు యెర్రగా రాజుకుంది. యువ ఎనాఫిలిస్ యెగిరి వెళ్ళింది. అగ్గిలోకి దూకింది. రాజుకున్న సిగరెట్టులోకి దూరింది. మలమల మాడింది. కాలిన సిగరెట్టు బూడిదతో నేల రాలింది. నింగికెగసింది.యమలోకంలో యు వ ఎనాఫిలిస్ దోమ ప్రత్యక్షమయ్యింది.ఇదంతా చూస్తున్న యమధర్మరాజు దిగ్భా్రంతికి లోనయి దోమని మెచ్చుకోలుగా తన చేతుల్లోకి తీసుకున్నాడు.‘‘నీకు ఆధార్ కార్డ్ వుందా..?’’అలవాటులో పొరపాటన్నట్టు నాలుక్కరుచుకున్నాడు చిత్రగుప్తుడు.ఎనాఫిలిస్ దోమ కొండితో యమధర్మరాజు చేతిమీద వొక్క పోటు పొడిచింది.అంతే. యమధర్మరాజు చలిజ్వరమొచ్చినట్టు గజగజా వాజవజా వణకడం మొదలుపెట్టాడు. - బమ్మిడి జగదీశ్వరరావు -
హీరో కొత్త బైక్స్, కొత్త టెక్నాలజీతో
సాక్షి, న్యూఢిల్లీ: హీరో మోటార్ కార్ప్ కొత్త మోటార్ సైకిళ్లను లాంచ్ చేసింది. పాషన్ ప్రో, పాషన్ ఎక్స్ ప్రో, సూపర్ స్ల్పెండర్ పేరుతో మూడు బైక్స్‌ను విడుదల చేసింది. ఐ3ఎస్ టెక్నాలజీతో అప్డేటెడ్ వెర్షన్‌గా వీటిని అందుబాటులోకి తెచ్చింది. అయితే జనవరి 2018లో వీటి ధరను ప్రకటించనున్నట్లు హీరో మోటో వెల్లడించింది. సూపర్ స్ల్పెండర్‌ను 125 సీసీ ఇంజిన్, పాషన్ ప్రో, పాషన్ ఎక్స్ ప్రో మోడల్స్‌లో 110 సీసీ ఇంజిన్‌ను పొందుపర్చింది. దీని ఇంజిన్ 7500 ఆర్పీఎంవద్ద 8.4 పీఎస్ పవర్‌ను, 11ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. సూపర్ స్ల్పెండర్లో ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్, ఆటోమ్యాటిక్ హెడ్ ల్యాంప్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, వైడర్ రియర్ టైర్, సీటు కింద ఎక్కువ ప్లేస్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. పాషన్ ప్రో, ఎక్స్ ప్రోలో ఆటోమ్యాటిక్ హెడ్ ల్యాంప్‌తోపాటు ఫ్యూయల్ లెవల్, ట్రిప్ మీటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ తదితర వివరాలు అందించేలా డిజిటల్ అన్‌లాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుపర్చింది. అయితే పాషన్ ప్రోతో పోలిస్తే ఎక్స్ ప్రోను స్టయిలిష్‌గా తీర్చిదిద్దింది. స్కల్ప్డ్ ఫ్యూయల్ ఇంధన ట్యాంక్, డబుల్ టోన్ రియర్ మిర్రర్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ అమర్చింది. -
ఊపిరి బంద్!
నోట్ల రద్దుతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాణాలు చిత్తు కాగితాలయ్యాయి. ఇంకెన్నో సామాన్యుల జీవితాలకు... ఊపిరి బంద్ అయింది. నోటు రద్దయింది... పెద్ద నోటు రద్దయింది.పెద్దవాళ్లకు కష్టం వచ్చిందా? ఏమో! ఇప్పటి దాకా పెద్దవాళ్లెవరూ క్యూలో కనపడలేదు. లాఠీ దెబ్బలు తినలేదు. గుండెపోటుతో చనిపోలేదు. అయినవాళ్లను... ఆసుపత్రుల గడప దగ్గర పోగొట్టుకోలేదు. మరి పెద్ద నోటు రద్దయి... ఎవరి చావుకొచ్చింది? చిల్లరతో సాగించే జీవితాల చావుకొచ్చింది. కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు... అసలు వాళ్లకేం కాలేదు కానీ... అత్తెసరు వాళ్ల ఉసురుకొచ్చింది! ఒక శుభ నిర్ణయం తీసుకున్నప్పుడు పరిణామాలు కూడా శుభప్రదంగా ఉండాలి కదా! టైస్టుల దగ్గరున్న దొంగనోటు ఖతం అవ్వాల్సిందే... అలాగని సగటు మనిషి టైకు గురి కావడం కరెక్టు కాదేమో! లేబర్‌కి కూలీ దొరకడం లేదు. రైతుకు గంజి నిలవడం లేదు. మధ్యతరగతికి మర్యాద మిగలడం లేదు. రోగికి మందు... పెళ్లికి మేళం... చావుకు డప్పు... ఊ(హు(! ఇంత పెద్ద నిర్ణయానికి ప్రణాళిక, ముందుచూపు... మానవత్వం... ఏమయ్యాయి? నల్లధనం మకిలీయే. దాంతో ఆడుకోవడం వెకిలియే. ఓటుకు నోటు... థూ!! ఉండకూడదు దానికి చోటు! నీతులు చెప్పే నాయకులపై, వాళ్లకు బాకాలూదే నాయాళ్లపై... పడాలి వేటు. ఈ పచ్చకామెర్లగాళ్లని కడిగేయాలి. పచ్చనోటుకు పట్టిన మకిలిని కడిగేయాలి. దాని వల్ల జబ్బు పడ్డ ఆర్థిక వ్యవస్థను నయం చేయాల్సిందే. పారలల్ ఎకానమీకి పాడె కట్టాల్సిందే. పవర్ఫుల్ డెసిషన్లు తీసుకోవాల్సిందే. ఫైట్ చేయాల్సిందే! కానీ, పెద్దోడికో నీతి, పేదోడికో నీతి ఉండకూడదు. పెద్దోడికి స్పెషల్ ట్రీట్మెంట్, మనలాంటోళ్లకి స్ట్రీట్ ట్రీట్మెంట్ నహీ చలేగా! సైన్యంలా పోరాడటానికి జనం సిద్ధం... తయార్ హై! మంచి నిర్ణయానికి అందరం సమ్మతులమే, సైనికులమే. మరి పోరాడాలంటే సైనికుడికి కూడా... కూడు కావాలిగా! ప్రభుత్వాలు సైనికుడికి ఇచ్చినంత పోషణ మనకూ కలిగించాలి. పెరిషబుల్ ప్రాడక్ట్స్లా... అంటే... ఆకుకూరలు, టమాటాల్లా... జనం వాడిపోకూడదు, కుళ్లిపోకూడదు కదా! అన్నం లేక, మందుల్లేక, వైద్యం అందక, పాల డబ్బాలు లేక వెన్నూదన్నూ లేక, కాలసర్పాల్లాంటి క్యూలలో నిలబడ లేక మనబోటి సామాన్యులైన దేశభక్తులు కూలబడిపోతుంటే, కొందరు కాటికెళ్లిపోతుంటే కుఛ్ కరో... కుఛ్తో కరో. మా డబ్బుల్లోంచే మాకు... కొంత చిల్లర ఇవ్వండి మహాప్రభో! ప్రాణం తీసిన పోపుల పెట్టె ఆమె వేదన ఆమె ప్రాణం తీసింది. ఆమెను పోగొట్టుకున్న భర్త ఒంటరి వాడయ్యాడు. పెద్ద నోట్ల రద్దు ఒక దంపతుల జీవితంలో తుపాను రేపుతుందని ఊహించామా? అనంతపురం జిల్లా తనకల్లు మండలం బాలసముద్రంలో నివసించే 28 ఏళ్ల రెడ్డెమ్మ పొదుపు మనిషి. ఏ కష్టం ఎప్పుడొస్తుందో... ఇంట్లో నాలుగు డబ్బులు పొదుపు చేసి ఉంచడం మేలు కదా అని... తినీ తినక, ఆడంబరాలకు పోక దాదాపు రూ. 40 వేలు దాచింది. ఆ డబ్బును పెద్ద నోట్లలోకి మార్చి పోపులడబ్బాలో దాచుకుంది. కానీ, నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడ్డాక ఆమె సతమతమయ్యింది. చివరకు భర్తకు ఈ విషయం తెలియచేసి డబ్బును ‘ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్’ (ఏ.పి.జి.బి)లో తన ఖాతాలో వేయాల్సిందిగా కోరింది. కానీ, ఆమె భర్త కొండప్పలో ఎన్నో భయాలు రేగాయి. అప్పటికే భార్య పేరున ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు మంజూరైంది కనుక బ్యాంకులో ఈ డబ్బు కడితే మంజూరైన ఇంటిని రద్దు చేస్తారా? పన్నులు వేస్తారా? వంటి సందేహా లతో ఆ డబ్బును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సంగతి తెలిసిన రెడ్డెమ్మ కష్టపడి దాచిన సొమ్ము తన చేతి కింద లేకపోవడంతో కలత చెందింది. భర్తతో గొడవ పడింది. నవంబర్ 20 ఆదివారం రాత్రి భర్త కొండప్ప వ్యాపారం పని మీద ధర్మవరం వెళ్లగా జీవితం మీద విరక్తి పుట్టి ఉరి వేసుకుంది. మధ్యలో లేచిన పిల్లలు అమ్మను అలా చూసి కేకలు పెట్టినా ఫలితం లేకపోయింది. పెద్ద నోట్ల రద్దు బాధలు, కుటుంబ కష్టాలు భరించలేక పండంటి కాపురాన్ని వదులుకోని ఆ తల్లి వెళ్ళిపోయింది. ఇంట్లో అత్య వసరాల నిమిత్తం ఆడవాళ్లు దాచుకునే ప్రతి పైసా ఎంతో విలువైనది. దాని మీద సర్వహక్కులు వారివే. పెద్దనోట్ల రద్దుతో ఇలాంటి గృహిణులు ఎందరో తమ డబ్బు మీద హక్కు కోల్పోయారు. ప్రాణం ఒదులుకున్నారు. కూర వండమన్నాడు... అన్నం తినలేదు! నవంబర్ 16. చిత్తూరుకి చెందిన రిటైర్డ్ టీచర్ రత్నపిళ్లై ప్రాణం విడిచిన రోజు. మరణానికి కారణం- బ్యాంకు ముందు క్యూ. ఆ రోజు అతనికి ఇంట్లో అద్దెకున్న వాళ్లు అద్దె డబ్బు పదివేలిచ్చారు. అదివరకే దాచుకున్న 40 వేల డబ్బు కూడా ఉండింది. అదంతా 500, 1000 నోట్లే. ఆ డబ్బుతో బ్యాంకులో కుదవ పెట్టిన బంగారాన్ని విడిపించాలని నిర్ణయించుకుని ఆ ఉదయం నడుచుకుంటూ వెళ్లి చికెన్ తెచ్చిచ్చాడు. కూర వండిపెట్టమని కొడుకుతో స్కూటర్లో బ్యాంకుకు వెళ్లాడు. ఆ తరువాత భార్యకు ఫోన్. క్యూలో నిలబడి... నిలబడి... ఉన్నట్టుండి కూలబడిపోయాడని వార్త. హాస్పిటల్‌కు తీసుకుని పోతే అప్పటికే ప్రాణం పోయిందన్నారు. ‘ఇదిగో వస్తానని చెప్పినాయన మాటామంతీ లేక కట్టెలా నా ముందు కనిపిస్తే ఏం చేసేది! మా కుటుంబంలో పెద్ద దిక్కు ఆరి పోయినాది. నోట్ల మార్పిడి దేశాన్ని మార్చిందో లేదో తెలీదు కానీ మా కుటుం బాన్ని దిక్కులేకుండా చేసి రోడ్డున పడేసినాద’ని దుఃఖిస్తోంది భార్య జ్ఞానేశ్వరి. బతుకు ఖరీదు 4 వేలు డెబ్భై మూడేళ్ల సాయిల్ల అయిలయ్యది సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పంచాయితీ లోని సంగుపల్లి. అతని దగ్గర నాలుగు వేల రూపాయల పాత నోట్లున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ నెల 16న తన దగ్గర ఉన్న ఆ నోట్లను మార్పిం చుకోడానికి గజ్వేల్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్‌కి వెళ్లాడు. గంటల తరబడి క్యూలో నిలుచోలేక సొమ్మసిల్లి పడిపోయాడు. కుడి కాలు తుంటి విరిగింది. రోజు రోజుకూ నొప్పి ఎక్కువైంది. బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితి. నాలుగు వేలు ఏమైపోతాయో అని బెంగ. దీంతో ఆవేదనకులోనై వారం క్రితం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని చనిపోయాడు. పాతనోటు... గుండెపోటు కరీంనగర్ జిల్లాకు చెందిన అంజాద్ ఆలీ వ్యవసాయ మార్కెట్లో సెక్యూరిటీ గార్డు. వచ్చే జీతంతో ఇంటి అవసరాలు తీరక, పదివేలు అప్పు చేశాడు. అప్పు వడ్డీతోపాటు పెరుగుతోంది. ఇంకా ఎప్పుడు తీరుస్తావంటూ అప్పు ఇచ్చిన వాళ్లు నిలదీస్తున్నారు. విధి లేక చెల్లెలింటికి వెళ్లాడు ఆలీ. అప్పులోళ్లు ప్రాణం నిలవనివ్వడం లేదని, ఆదుకోమన్నాడు. అన్న బాధ చూడలేక తన దగ్గరున్న పదివేలు ఇచ్చిందామె. ఆ డబ్బుతో అప్పు తీరుద్దామని వెళ్లాడు ఆలీ. అయితే ఆ సమయంలోనే ఐదు వందలు, వెయ్యి నోట్లు చెల్లవనే ప్రకటన వచ్చింది. ఈ నోట్లు నాకొద్దు, కొత్త నోట్లతో అప్పు తీర్చమన్నారు అప్పులవాళ్లు. చేతిలో డబ్బు ఉంది... అప్పు తీరడం లేదు. ఆ నోట్లు మార్చడానికి చేసిన ఏ ప్రయత్నమూ సఫలం కాలేదు. రోజు రోజుకీ ఆందోళన పెరిగిపోయింది. అది గుండెపోటు రూపంలో అతడి ప్రాణాలను బలి తీసుకుంది. బ్యాంకుతో యమగండం రమాబాయి, చంద్రమణి ఆలుమగలు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని చిన్న పల్లె వాళ్లది. 20 రోజుల కిందట భర్త చంద్రమణికి సుస్తి చేసింది. భార్య చంద్రమణి చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎన్ని దవాఖానాల్లో చూపించినా గుణం కనిపించలేదు. చివరకు ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకుపోతే చంద్రమణి రెండు కిడ్నీలు పనిజేస్తలేవని, లివర్ ప్రాబ్లమ్ కూడా ఉందని చెప్పారు. హైదరాబాద్‌కు తీసుకుపోండి అని సలహా ఇచ్చారు. అప్పటికే అయిదు వందలు, వెయ్యి నోట్లు రద్దయినాయి. పైసల్లేకుండా హైదరాబాద్ ఎట్ల పోవాలే అని డబ్బు కోసం బ్యాంక్‌కి పోతే చెక్ ఆమె పెనిమిటి చంద్రమణి పేర్న ఉన్నది కాబట్టి అతడే రావాలని పైసలియ్యకుండా వెనక్కి పంపాడు బ్యాంక్ మేనేజర్. దాంతో ఆమె రిమ్స్కొచ్చి మొన్న 23 తారీఖున ప్రైవేట్ వెహికిల్‌లో భర్తను దీస్కోని, వాళ్ల ఖాతా ఉన్న నార్నూర్ ఎసీబీహెచ్ బ్యాంక్‌కి పోయింది. అతణ్ణి చూసి 24 వేల రూపాయలను రమాబాయి చేతిలో పెట్టారు బ్యాంక్ సిబ్బంది. అది చూసి ఆమె ‘మా ఎక్కౌంట్ల లక్షకు పైనే ఉంటే.. మీరు 24 వేలే చేతిల వెడ్తిరి?’ అని నిలదీసింది. రూల్స్ ప్రకారం అంతే ఇస్తాం అని చెప్పాడు బ్యాంక్ మేనేజర్. ఎంత ప్రాథేయపడినా వినలేదు. చేసేదేమీ లేక ఆ డబ్బుతోనే హైదరాబాద్ చేరుకున్నారు ఆ భార్యాభర్తలు. ఇప్పడు వాళ్ల పరిస్థితి దేవుడికే ఎరుక! వ్యాపారం పోయింది! ఊపిరి ఆగింది!! పోలేపల్లె వెంకట నారాయణ వై.ఎస్.ఆర్ కడపజిల్లా వేంపల్లెలో ఓ చిన్న వ్యాపారి. కూరగాయలు అమ్ముతూ భార్య, ముగ్గురు పిల్లల్ని పోషించు కుంటున్నాడు. సాధారణరోజుల్లోనే వ్యాపారం అంతంతమాత్రమే అనుకుంటే పెద్ద నోట్ల తర్వాత పరిస్థితి పూర్తిగా కుదేలయ్యింది. రూపాయి బేరం రావడం లేదు. పైగా కూరగాయలు కొనడానికి రోజువారీ చేసే అప్పు, దాని మీద వడ్డీ పెరిగిపోసాగాయి. చేతిలో డబ్బు ఆడట్లేదు... ఇంట్లో కుంపటి వెలగడం లేదు. దాంతో అతడు హఠాత్తుగా జబ్బు పడ్డాడు. ‘కూరగాయలు అమ్మగా వచ్చే సొమ్మే మా కుటుంబానికి ఆధారం. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా వ్యాపారాలు పడిపోయాయి. పెద్ద నోట్లు చెల్లని పరిస్థితి. చిన్న నోట్లు దొరకని దుఃస్థితి. మా ఆయన అప్పటికే వ్యాపారం కోసం లక్ష రూపాయల దాకా అప్పులు చేశారు. అవన్నీ మా ఆయనను బాగా కుంగ దీశాయి’ అని వెంకట నారాయణ భార్య జ్యోతి కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. కడపలో చికిత్స చేయిస్తున్న సమయంలోనే వెంకట నారాయణ పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే కన్నుమూశాడు. భార్య, పసివాళ్ళయిన ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి అగమ్యంగా మారింది. నోట్ల ఉపసంహరణతో వ్యాపారాలు లేక, ప్రాణాల మీదకొచ్చిన ఇలాంటి కుటుంబాల కథలు దేశవ్యాప్తంగా ఎన్నెన్నో! -
విశ్వమంతా ఆత్మజ్యోతి ప్రకాశమే
అంగిరసుడు శౌనకునికి బ్రహ్మవిద్యను ఇలా కొనసాగిస్తున్నాడు. శౌనకా! నేను చెప్పేది నిత్యసత్యం. బాగా మండే మంటల్లో నుంచి వేల సంఖ్యల్లో నిప్పురవ్వలు పుట్టినట్టు అక్షరపరబ్రహ్మం నుంచి సాకారమైన అనేకజీవులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తాయి. మళ్లీ అక్కడే లీనమవుతాయి. దివ్యమూ, రూపరహితమూ. అతిప్రాచీనమూ, లోపలా బయటా ఉన్నదీ, పుట్టుకలేనిదీ, ప్రాణం లేనిదీ, మనస్సు లేనిదీ, స్వచ్ఛమైనదీ, నాశనం లేనిదీ, సృష్టి అంతటికీ అవతల ఉండేదే పరబ్రహ్మం. దానినుంచి ప్రాణం, మనస్సు, అగ్ని, ఇంద్రియాలు, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, విశ్వాధారమైన భూమి(పంచభూతాలు) ఏర్పడుతున్నాయి. పరబ్రహ్మమే అగ్ని శిరస్సు. చంద్రసూర్యులు నేత్రాలు. దిక్కులు చెవులు. తెరిచి ఉంచిన వేదాలు నోరు. వాయువు ప్రాణం. విశ్వం హృదయం. పరబ్రహ్మ పాదాలనుంచే భూమి ఏర్పడుతోంది. అన్ని ప్రాణుల్లో ఉండే అంతరాత్మ పరబ్రహ్మమే! దానినుంచి అగ్ని పుట్టింది. అది వెలగటానికి సూర్యుడు సమిధ అవుతున్నాడు. చంద్రుణ్ణించి మేఘాలు, భూమినుంచి ఓషధులు జన్మిస్తున్నాయి. పురుషుడు ఆ ఓషధులను తినటం ద్వారా ఏర్పడిన వీర్యాన్ని స్త్రీయందు నిక్షేపించ గా, అసంఖ్యాకంగా జీవులు పుడుతున్నాయి. ఇవన్నీ పరబ్రహ్మం నుంచే ఆవిర్భవిస్తున్నాయి. దానినుంచే ఋక్కులు, సామ, యజుర్వేదాలు, యజ్ఞదీక్షలు, క్రతువులు, దక్షిణలు, సంవత్సరం, యజమానుడు (యజ్ఞం చేసేవాడు) సూర్యచంద్రులు ప్రకాశించే లోకాలు పుడుతున్నాయి. ఆ పరబ్రహ్మం నుంచే దేవతలు, అనేకరూపాల సాధ్యులు, మనుష్యులు, పశువులు, పక్షులు, ప్రాణ, అపానవాయువులు, వరి, గోధుమ వంటి ధాన్యాలు, తపస్సు, శ్రద్ధ, సత్యం, బ్రహ్మచర్య విధులు ఏర్పడుతున్నాయి. దానిలోనుంచే ఏడుప్రాణాలు, ఏడు అగ్నులు, సమిధలు, ఏడు హోమాలు, ఏడులోకాలు, గుండెగుహలో ఉండే ప్రాణాలు అన్నీ ఏడు ఏడుగా సృష్టింపబడుతున్నాయి. ఆ పరమాత్మ నుంచే సముద్రాలు, కొండలు, అన్ని నదులూ, అన్ని ఓషధులూ, పంచభూతాలతో ఏర్పడే శరీరాన్ని పోషించే రసమూ, మూలికలూ అన్నీ వస్తున్నాయి. పురుష ఏ వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతమ్ ఏ తద్యో వేద నిహితం గుహాయాం సో విద్యాగ్రంథం వికి ర తీహసౌమ్య నాయనా! ఈ విశ్వం, కర్మలు, తపస్సు అన్నీ అమృత స్వరూపమైన పరబ్రహ్మమే. దీనిని ఎవరు తెలసుకుంటారో వారి హృదయంలో ఉండే అవిద్య, అజ్ఞానం అనే ముడి విడిపోతుంది. శౌనకా! అంతటా ప్రత్యక్షస్థితి కలిగినదై, సన్నిహితమై, హృదయమనే గుహలో ఉండే పరబ్రహ్మానికి అత్యున్నత స్థానం ఇవ్వబడింది. కదిలేది, ఊపిరి పీల్చేది, కనురెప్పలు ఆర్పేది, ఆర్పనిది ఏ జీవి అయినా పరబ్రహ్మలోనివే అది కంటికి కనపడే, కనపడని వాటన్నింటికంటే శ్రేష్ఠం. మానవ విజ్ఞానానికి అందనంత గొప్పది. మహాకాంతిమంతం, అణువుకన్నా పరమాణువు, అన్ని లోకాలు, వాటిలో ప్రాణులు తానే అయినది అక్షర పరబ్రహ్మం. అదే ప్రాణం. వాక్కు, మనస్సు, సత్యం, అమృతం. తెలియవలసినది, తెలుసుకోవలసిందీ అదే. సౌమ్యా! తెలుసుకో. లక్ష్యాన్ని సాధించు. ఉపనిషత్ విజ్ఞానమనే ధనుస్సు తీసుకుని, ఉపాసన అనే బాణాన్ని సంధించు. ఎటూ చెదరని ఏకాగ్రమైన మనస్సుతో ఆ వింటి త్రాటిని చెవిదాకా లాగు. అక్షరమైన పరబ్రహ్మాన్నే లక్ష్యంగా ఎంచుకో. ఓంకారమే ధనుస్సు. బాణం ఆత్మ. పరబ్రహ్మమే లక్ష్యం. అప్రమత్తతతో గురిచూసి కొట్టాలి. బాణంలాగా నువ్వు దానిలోకి ప్రవేశించాలి. ఆకాశం, భూమి, అంతరిక్షం, మనస్సు, పంచప్రాణాలు అన్నీ అల్లుకున్న కేంద్రమే ఆత్మ అని తెలుసుకో. అనవ సరమైన మాటలు విడిచిపెట్టు. చావుపుట్టుకలనే రెండు గట్టులను కలిపే అమృతమనే వంతెన ఇదే. రథచక్రంలోని ఆకులన్నిటికీ ఇరుసు కేంద్రమైనట్టు నాడులన్నీ కూడిన హృదయంలో ఆత్మ ఉంటుంది. ఓంకారధ్యానంతో అది తెలుస్తుంది. చీకటికి అవతలి వెలుగు కనిపిస్తుంది. సర్వజ్ఞుడూ, సర్వవేత్త అయిన పరబ్రహ్మమే సర్వవ్యాప్తం. హృదయాకాశంలోని వెలుగు అనే బ్రహ్మపురంలో పరమాత్మ ప్రతిష్ఠితుడై ఉంటాడు. అతడు మనస్సంతా నిండి ఉంటాడు. ప్రాణ, శరీరాలను నడిపిస్తాడు. ఈ విజ్ఞానంతో ధీరులు అమృతమైన ఆనందరూపమైన పరమాత్మను చూడగలుగుతున్నారు. వారిలోని అజ్ఞానం తొలగిపోతోంది. కర్మలన్నీ తగ్గిపోతున్నాయి. ఆ బంగారు గుహలో వెలిగే పరబ్రహ్మ నిర్మలుడు, నిర్గుణుడూ, వెలుగులకు వెలుగు, పరమపవిత్రుడు. అతనేనని ఆత్మవేత్తలు తెలుసుకోగలరు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు, తారలు, మెరుపులు ఏవీ వెలగవు. అగ్ని అసలు ఉండదు. ఆ పరమాత్మ వెలుగులోనుంచి ఇవన్నీ కాంతిని పొంది ప్రకాశిస్తాయి. విశ్వమంతా ఆత్మజ్యోతిప్రకాశమే. శౌనకా! ఈ విశ్వమంతా శాశ్వత పరబ్రహ్మమే. ముందు, వెనక, కుడిపక్క, ఎడమపక్క, కింద, పైన, అంతటా పరబ్రహ్మమే వ్యాపించి ఉంది. అదే అత్యున్నతం. అథశ్చోర్థ్యం చ ప్రసృతం బ్రహ్మైదం విశ్వమిదం వరిష్ఠమ్ఇలా అంగిరసుడు శౌనకునికి ద్వితీయ ముండకం ప్రథమ ఖండంలో సాకారంగా, ద్వితీయ ఖండంలో సర్వవ్యాప్తంగా ఉన్న పరబ్రహ్మాన్ని బోధించాడు. తృతీయ ముండకం రెండు ఖండాల్లో మరింత లోతుగా సాగే ఈ విశ్లేషణను వచ్చే వారం తెలుసుకుందాం. - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ఉపనిషత్ విజ్ఞానమనే ధనుస్సు తీసుకుని, ఉపాసన అనే బాణాన్ని సంధించు. ఎటూ చెదరని ఏకాగ్రమైన మనస్సుతో ఆ వింటి త్రాటిని చెవిదాకా లాగు. అక్షరమైన పరబ్రహ్మాన్నే లక్ష్యంగా ఎంచుకో. ఓంకారమే ధనుస్సు. బాణం ఆత్మ. పరబ్రహ్మమే లక్ష్యం. అప్రమత్తతతో గురిచూసి కొట్టాలి. బాణంలాగా నువ్వు దానిలోకి ప్రవేశించాలి. ఆకాశం, భూమి, అంతరిక్షం, మనస్సు, పంచప్రాణాలు అన్నీ అల్లుకున్న కేంద్రమే ఆత్మ అని తెలుసుకో. అనవ సరమైన మాటలు విడిచిపెట్టు. చావుపుట్టుకలనే రెండు గట్టులను కలిపే అమృతమనే వంతెన ఇదే. -
ప్రాణభయం... పోయేదెలా?!
జీవన గమనం నేనో కాలేజీ ప్రొఫెసర్ని. మొదట్లో చాలా భక్తిగా ఉండేవాణ్ని. కానీ భక్తి పేరుతో కొందరు పాటించే విధానాలు, వాటి కోసం డబ్బు వేస్ట్ చేయడం చూశాక నా ఆలోచనలు మారిపోయాయి. కళ్లముందు కనిపించే మనిషికి సాయం చేయకుండా కనిపించని దేవుడి కోసం తపన పడటం నచ్చలేదు నాకు. దాంతో నాస్తికుడిగా మారిపోయాను. నేను ఇతరులకు చేస్తోన్న సాయమే నన్ను కాపాడుతుందని నమ్ముతున్నాను. కానీ మా ఇంట్లోవాళ్లతో సహా ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను తప్పు చేస్తున్నానని, పాపం చుట్టుకుంటుందని అంటున్నారు. నిజమా? నేను తప్పు చేస్తున్నానా? - బి.శ్రీనివాసరావు, కనిగిరి నాస్తికత్వం వేరు, విగ్రహారాధన వేరు. అందర్నీ వినాలి. మనకు నచ్చింది పాటించాలి. అనుభవం వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం మనిషిని జ్వలింప జేస్తుంది. మీరు నమ్మిన జ్ఞానం మీకు సంతోషాన్ని ఇస్తున్నదైతే, దానివల్ల ఇతరులకి నష్టం లేకపోతే నిర్భయంగా, నిస్సంకోచంగా దాన్ని అనుసరించండి. మీకో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతాను. నాపై ప్రభావం చూపించిన ఓ వేదాంతి ఉన్నారు... పేరు ఎపిక్యురస్. ‘తిను తాగు సంతోషంగా ఉండు’ అన్న సామెతను ప్రాచుర్యంలోకి తెచ్చింది అతడేనని చాలామంది అతడి గురించి తప్పుగా మాట్లాడతారు. కానీ ‘ప్యాషన్‌తో జీవించు, ఆనందించడానికి పని చెయ్యి, పంచుకోవడానికి సంపాదించు, ఇవ్వడాన్ని ఆనందించు, దాచుకోవడాన్ని విసర్జించు’ అని అతడు కొత్త థియరీ చెప్తాడు. అతని గురించి ఓషో చాలా బాగా చెప్పాడు. బుద్ధుడు, మహావీర్ లాంటివారు సాధారణ జీవనాన్ని గడిపేటందుకు ఆస్తులను, అంతస్తులను వదిలేశారు. జీవితాన్ని ఒక గాడిలో పెట్టుకున్నారు. కాని ఎక్కడైనా క్రమశిక్షణ ఉంటే అక్కడ సంక్లిష్టత ఉంటుంది అంటాడు ఎపిక్యురస్. అతడో చిన్న తోటలో తన స్నేహితులతో కలిసి చాలా సాధారణ జీవితాన్ని గడిపాడు. భోగపూరితమైన, విలాసవంతమైన జీవితాన్ని గడుపు తున్నాడని భావించి ఆ దేశపు రాజు ‘వారి విలాసానికి అడ్డుకట్ట వేస్తాను, పన్ను కట్టకపోతే శిక్షిస్తాను’ అంటూ వెళ్తాడు. కానీ చెట్లకు నీళ్లు పోస్తూ గడుపుతోన్న వాళ్ల సాధారణ జీవనాన్ని చూసి ఆశ్చర్య పోతాడు. బతకడానికి సరిపడా వస్తువులు మాత్రమే వాళ్ల దగ్గర ఉంటాయి. రొట్టెకి రాసుకోడానికి వెన్న కూడా ఉండదు. దాంతో ఆశ్చర్యపోయి ‘తిను, తాగు ఆనందించు’ అనడంలో అర్థమేమిటి అని అడుగుతాడు. అప్పుడు ఎపిక్యురస్... ‘‘రాజా.. మేం దేవుణ్ని ఏమీ కోరుకోవడం లేదు కనుక ఇక్కడ ఆనందగా సుఖంగా జీవిస్తున్నాం. దేవుడే ఈ కష్టాలు సృష్టించాడని మీరు మనస్ఫూర్తిగా విశ్వసిస్తే, వాటి నుంచి విముక్తి కోసం తిరిగి అతడినే ప్రార్థించడంలో ఏమైనా అర్థం ఉందా? ప్రజలంతా తనను ప్రార్థించడం మర్చిపోతారేమోనన్న ఉద్దేశంతో భగవంతుడు ఈ కష్టాలను సృష్టించి ఉంటే అతడికన్నా స్వార్థపరుడు ఇంకెవరైనా ఉంటారా? పాపులకు, భయస్తులకు మాత్రమే భగవంతుడి అవసరం ఉంది. చేతులు జోడించి ఆకాశం వైపు చూసి ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు అన్నిచోట్లా వ్యాపించి వున్నాడు. ప్రార్థన ఒక వైఖరి’ అని వివరిస్తాడు. ‘విజ్ఞులు మూర్ఖులు కారు, భగవంతుడు అన్ని చోట్లా ఉంటే ప్రత్యేకంగా గుడులూ చర్చిలూ ఎందుకు కట్టడం’ అని ప్రశ్నిస్తాడు రాజు. ‘అన్ని చోట్లా గాలి ఉన్నా పంఖాలు ఎందుకు? పంఖా సౌకర్యం కావలసినవారికే భగవంతుడు. ప్రకృతిసుఖం కావలసిన వారికి అవసరం లేదు’ అని చెప్పాడు ఎపిక్యురస్. కాబట్టి మిత్రమా! తెల్లవారుజాము నుంచి సాయంసంధ్య వరకూ మనస్ఫూర్తిగా చేసే ప్రతి పనీ ప్రార్థనే. మీరు నమ్మిన సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణా నిర్భయంగా ఆచరించండి. నా వయసు ఇరవై. నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్లతో ఆమధ్య డబ్బుల విషయమై గొడవపడ్డాను. అప్పట్నుంచీ నాకు చాలా భయమేస్తోంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కనిపించినా నా కోసమే మాటు వేశారని అనిపిస్తోంది. భయంతో గుండె దడదడ లాడుతోంది. ఇంట్లో చెబితే తిడతారని చెప్పలేదు. కానీ ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలియడం లేదు. సలహా ఇవ్వండి. - కేఎస్, చిత్తూరు స్నేహితులు విడిపోరు. విడిపోయే వారు స్నేహితులు కారు. ఆ విషయం పక్కన పెడదాం. మాటు వేయడం, దొంగచాటుగా దెబ్బతీయడం మీరనుకున్నంత సులభం కాదు. మీకు తెలిసిన పెద్దవాళ్లని మీ మాజీ స్నేహితుల దగ్గరకు తీసుకు వెళ్లండి. విషయాన్ని స్పష్టంగా చర్చించండి. వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. మాటల సందర్భంలో మీరు మీ ప్రాణభయం గురించి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసివుంచాను అని ఓ మాట చూచాయగా చెప్పండి. దాంతో పరిస్థితులు చక్కబడవచ్చు. దీనివల్ల వాళ్లు మీమీద ఏ చర్యా తీసుకోకపోయినా... మీ భయం మాత్రం తప్పనిసరిగా తగ్గిపోతుంది. -
గంగను తెచ్చిన భగీరథుడు
బృహత్తరం పల్లె ప్రాణం పోస్తుంది.. పెంచి పోషిస్తుంది.. పెద్దవాణ్ని చేస్తుంది.. కానీ పట్నంలో అడుగుపెట్టగానే పల్లె గుర్తుండదు.. తాను అప్పటిదాకా పడిన .. జనాలు ఇప్పటికీ పడుతున్న కష్టాలు మరిచిపోతారు. తాను పుట్టి పెరిగిన పల్లెనే చిన్నచూపు చూస్తారు. అమ్మో అక్కడ బతకడం నా వల్ల కాదంటారు.. పట్నపు సౌఖ్యానికి అలవాటు పడిన ఒకప్పటి పల్లెవాసులు. కానీ భగవతి అగర్వాల్ అలా కాదు. భగవతి అగర్వాల్ పల్లెలో పుట్టాడు.. అక్కడి కష్టాల మధ్య పెరిగాడు. పట్నం బాట పట్టాడు.. ఆపై దేశ విదేశాలు తిరిగాడు.. కోట్లు సంపాదించాడు.. ఇలా సుఖంగా జీవితం సాగిపోతున్న దశలో ఆయనకు బాధ్యత గుర్తొచ్చింది.. పల్లెవాసులు కష్టాల తీరుద్దామన్న సంకల్పం మొదలైంది. ఆ సంకల్పం.. వేలమంది దాహం తీరుస్తూ.. కోట్లమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆకాశ గంగ పేరుతో ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో అగర్వాల్ చేస్తున్న భగీరథ ప్రయత్నం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి. దేశ జనాభాలో రాజస్థాన్ వాటా 5.5 శాతం. దేశ విస్తీర్ణంలో 10.5 శాతం ఆ రాష్ట్రానిదే. కానీ దేశంలోని భూగర్భ జలాల్లో రాజస్థాన్ వాటా ఎంతో తెలుసా..? కేవలం 1 శాతం. ఈ గణాంకాలు చాలు.. రాజస్థాన్ వాసుల నీటి కష్టాలు ఎలాంటివో చెప్పడానికి. అక్కడి నగరాలు, పట్టణాలకే నీటి కష్టాలు తప్పనపుడు.. ఇక పల్లెల సంగతి చెప్పాల్సిన పని లేదు. వాళ్లను పట్టించుకునే నాథుడుండడు. ఇలా నిరాదరణకు గురైన ఓ చిన్న పల్లెలో ఏడు దశాబ్దాల కిందట పుట్టాడు భగవతి అగర్వాల్. బాల్యంలో తోబుట్టువులతో కలిసి కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి.. గంటల కొద్దీ కష్టపడి నీళ్లు తెచ్చుకున్న రోజులు అగర్వాల్‌కు ఇంకా గుర్తే. తన బాల్యమంతా ఇలాగే సాగింది. కేవలం నీళ్లు తేవడం కోసమే కొందరమ్మాయిలు చదువు మానేయడం.. శుద్ధమైన నీళ్లు అందుబాటులో లేక ఎంతోమంది చనిపోవడం కళ్లారా చూశాడు అగర్వాల్. ఈ అనుభవాలన్నీ చూస్తూనే ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసిన అగర్వాల్.. ఉద్యోగం తెచ్చుకున్నాక వియెన్నా (ఆస్ట్రియా)లో స్థిరపడ్డాడు. ఆ తర్వాత యుఎస్‌కు వెళ్లి అక్కడ భారీగానే ఆర్జించాడు. ఐతే ఉద్యోగం నుంచి రిటైరై ప్రశాంతంగా కాలం గడిచిపోతున్న సమయంలో అగర్వాల్‌కు స్వగ్రామం గుర్తుకొచ్చింది. తానిక్కడ స్నానానికి కూడా పరిశుద్ధమైన నీళ్లు వాడుతుంటే.. తమ చుట్టుపక్కల గ్రామాల్లో తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి తలుచుకుని మథనపడ్డాడు. ఓ రోజు తన మిత్రులకు ఓ పార్టీ ఇచ్చిన ఆయన భారత్‌లోని గ్రామాలకు ఏమైనా చేయగలమా అని అందరినీ అడిగాడు. కొందరు విరాళాలివ్వడానికి ముందుకొచ్చారు. ఆర్థిక సాయం చేద్దామన్నారు. ఐతే డబ్బులిస్తే పరిష్కారం కాదని.. నేరుగా కార్యక్షేత్రంలోకి దిగి.. పల్లెవాసుల కష్టాలు తీర్చాలని భావించాడు అగర్వాల్. మిత్రుల నుంచి పోగుచేసిన విరాళాలు, సొంత డబ్బు తీసుకుని.. రాజస్థాన్‌లోని తన స్వస్థలానికి బయల్దేరాడు. ఇక్కడికి వచ్చి పరిస్థితి చూస్తే.. ఒకప్పటి కంటే దుర్భరంగా ఉందని అర్థమైంది. ఒకప్పటి కంటే భూగర్భ జలాలు అడుగంటి పోయి గ్రామీణులు పడుతున్న నీటి కష్టాలు చూశాడు. ఈ ఇబ్బందులకు తెరదించేందుకు వర్షపు నీటిని ఒడిసిపట్టడమే మార్గమని భావించి.. ఆకాశ గంగ పేరుతో ఓ ప్రాజెక్టు ఆరంభించాడు. వర్షపు నీరు వృథాగా పోకుండా.. ప్రతి నీటి చుక్కా ఓ చోటికి చేరేలా తక్కువ ఖర్చుతో, గ్రామీణుల శ్రమదానంతో చెక్‌డ్యామ్‌లు, నీటి గుంతలు, వాటర్ ట్యాంకులు నిర్మించాడు. ప్రతి ఇంటిమీద పడే వర్షపు నీరంతా కూడా నేరుగా వీటిలోకి చేరే ఏర్పాట్లు చేశాడు. నీటి శుద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి.. గ్రామీణుల అవసరాలకు సమృద్ధిగా.. పరిశుద్ధమైన నీటిని అందించాడు. చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు కూడా పెరిగాయి. మూణ్నాలుగేళ్లుగా వేసవిలోనూ నీటి కష్టాలు కనిపించట్లేదు ఈ గ్రామాల్లో. ప్రపంచబ్యాంకు కూడా సహకరించడం.. ఎన్జీవోలు సాయం చేయడంతో మరిన్ని గ్రామాలకు ‘ఆకాశ గంగ’ను విస్తరిస్తున్నాడు అగర్వాల్. ఆయన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ‘పర్పస్’ ప్రైజ్ పురస్కారంతో పాటు మరికొన్ని అవార్డులు దక్కాయి. అగర్వాల్ ప్రయత్నాన్ని రాజస్థాన్ ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆయన ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించి.. రాష్ట్రంలోని అన్ని గ్రామాల దాహార్తి తీర్చడానికి ప్రణాళికలు రచిస్తోంది. ‘ఆకాశ గంగ’ పేరుతో ఈ అభినవ భగీరథుడు చేసిన ప్రయత్నం.. కొన్ని కోట్లమంది దాహార్తిని తీర్చబోతోంది. -
అభిమానం అంటే అదే!
అభిమానులు లేనిదే హీరోలు లేదులే అంటూ హీరో వెంకటేష్ ఒక పాటలో అంటారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లగా నటీనటులు భావి స్తారు. అభిమానం అనేది వెలకట్టలేనిది. కొందరి అభిమానం మధురంగా మనసు మీటుతుంది. ఇలియానా అనూహ్యంగా ఇలాంటి అనుభూతినే పొందారు. ఇంతకుముందు తెలుగు చిత్ర పరిశ్రమను తన అందచందాలతో ఊపేసిన ఇలియానా, ప్రస్తుతం తన సౌందర్య సంపదతో బాలీవుడ్ ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు. అక్కడ హీరోయిన్గా ఆమె పరిస్థితి ఎలా వున్నా తన ముగ్ధ మనోహర రూపానికి చాలామంది అభిమానులు ఫ్లాట్ అయిపోతున్నారు. ఇటీవల జరిగిన ఒక సంఘటన ఇందుకు ఉదాహరణ. మెరుపుతీగ ఇలియానా ముంబయి విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈమెను చూడటానికి అభిమానగణం చుట్టుముట్టారు. అలాంటి కలకల వాతావరణంలో ఒక అభిమాని ఇలియానా ముందుకు దూసుకొచ్చి ఒక చీటి ముక్కను ఆమె చేతిలో పెట్టి కొంచెం సేపు తరువాత చదవమని వెళ్లిపోయాడు. అందులో ఏమి రాశాడు అంటూ అక్కడి వారడిగిన ప్రశ్నలకు అప్పుడు ఇలియానా బదులివ్వలేదు. ఆ అభిమాని చీటిలోని సారాంశాన్ని ఇలియానా తన ట్విట్టర్లో పోస్ట్ చేసి ముచ్చటపడ్డారు. ‘‘హే ఇలియానా తెరపైనా అయినా నేరుగా అయినా చూడటానికి అందంగా ఉంటారు. మీరు నటించిన బర్ఫీ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందులో మీ నటన ప్రశంసనీయంగా ఉంది. సినీ రంగంలో మీరు పయనించాల్సిన దూరం చాలా ఉంది.’’అని ఆ అభిమాని చీటి ముక్కలో పేర్కొన్న విషయం. ఇందులో అంత గొప్పగా అభినందించిందేముంది అని అడిగితే, అయితే ఆ అభిమాని చిన్న చీటి ముక్కలో తన స్వహస్తాలతో అభినందిస్తూ రాయడం తనకు బాగా నచ్చిందని ఏదేమైనా ఆ చీటి తన మనసు లోతుల్ని హాయిగా తాకిందని ఇలియానా పేర్కొన్నారు. నిజమైన అభిమానికి సరైన నిర్వచనం ఇదేనేమో. -
కరౌకేయుడు ఏ పాటైనా.. ఎవరితోనైనా..
వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన డాక్టర్ కె.ఎ.గౌస్ హైదర్ వృత్తిరీత్యా వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు. ప్రవృత్తి రీత్యా కరౌకే కళాకారులు. గత పద్దెనిమిది ఏళ్లుగా కరౌకే సంగీతంలో ప్రయోగాలు చేస్తూ వస్తున్న హైదర్ సొంత ఇంటిని కరౌకే అకాడమీగా మార్చేసి ఆ కళకు ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నారు. ఆయనతో ఇంటర్వ్యూ... కరౌకే మీకు ఎలా పరిచయమైంది? 1992లో కాకినాడ ఫెర్టిలైజర్స్‌లో పనిచేసేటప్పుడు నా సహాధ్యాయి కరౌకేట్రాక్లతో ఎంజాయ్ చేసేవాడు. నాకు ఒక కరౌకే డెక్‌ను బహుమతిగా ఇచ్చాడు. అలా మొదలైన పరిచయం కరౌకేతో విడదీయలేని బంధంగా మారింది కరౌకే మ్యూజిక్ అంటే..? కరౌకే అంటే అన్ని రకాల సంగీత వాయిద్యాలతో పూర్తిస్థాయిలో ఒక పాట ట్యూన్ ఉంటుంది. సింగర్ చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ పాట పాడాలో గ్రహిస్తూ మ్యూజిక్కు అనుగుణంగా గాత్రం ఇవ్వడం. నేపథ్య సంగీతంతో పాటు వచ్చే పాట చరణాలు పక్కాగా ఆర్కెస్ట్రాలో పాడినట్టుగా ఉండడమే కరౌకే ప్రత్యేకత. జపాన్‌లో ఆదరణ పొందిన సంగీత కళ ఇది. కరౌకే ప్రాచుర్యానికి మీరేం చేస్తున్నారు? ‘అన్మోల్ కరౌకే మ్యూజికల్ అకాడమీ’ నెలకొల్పి కరౌకేను వ్యాప్తి చేసే పనిలో ఉన్నాను. వరంగల్, హైదరాబాద్‌లల్లో ఇప్పటి వరకు దాదాపు 400 షోలు ఇచ్చాను. ఎన్నో ఆల్బమ్‌లు తెచ్చాను. దుబాయ్‌లో సైతం కరౌకే మ్యూజిక్ ఇష్టపడే అభిమానులు పెరిగారు. అక్కడి నుంచి సీడీలు కావాలని మా అకాడమీకి ఫోన్లు వస్తుంటాయి. కరౌకేలో మీ ప్రత్యేకత ఏమిటి? ప్రతి ప్రోగ్రాంలో ఏదో ఒక ప్రయోగం చేస్తుంటాను. అంధబాలలు, మానసిక వికలాంగులతో సైతం కరౌకే ట్రాక్‌లతో పాటలు పాడిస్తున్నాను. హన్మకొండలోని ‘అతిథి’, ‘మల్లికాంబ’ మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులతో ఎక్కువగా పాడిస్తుంటాను. సాధారణంగా పిల్లలతో స్టేజి మీద పాటలు పాడించటమే కష్టం. అలాంటిది కరౌకే ట్రాక్‌లో పాడించాలంటే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. రెండురోజుల్లో ఎవరికైనా సులభంగా పాడడం నేర్పిస్తాను. సామాజిక సేవలో మీ పాత్ర ? నా తల్లిదండ్రుల పేరిట ఏటా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. ‘వలీహైదర్ మెమోరియల్’ పేరిట పేద కళాకారులకు ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఇప్పటివరకు రాష్టంలో వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది అంధులకు కరౌకేలో శిక్షణ ఇచ్చాను. హిందీ, తెలుగు భాషలలోని మంచి పాటలను నేను పాడి కరౌకే ట్రాక్‌లో సీడీలు చేశాను. వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నా. ఇప్పటికీ 20 వేలకు పైబడి పంపిణీ చేశాను. హైదర్ సాధించిన అవార్డులు 2002లో మిలీనియం అవార్డు. 2003లో లతామంగేష్కర్ అవార్డు. 2004 జూన్‌లో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మిలీనియం అవార్డు. 2005లో హైదరాబాద్ సమాజ సేవ సొసైటీ అవార్డు. 2013లో మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా ఉత్తమ సమాజ సేవ అవార్డుతో పాటు మరెన్నో పురస్కారాలు. - కోన సుధాకర్ రెడ్డి