సీతాఫలం, రామా ఫలం గురించి విన్నాం కానీ ఇదేంటి కృష్ణఫలం?. ఔనండి! మీరు విన్నది నిజమే. మనకు నిజంగానే దీని గురించి పెద్దగా తెలియదు గానీ దీని వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. భారతదేశంలో ఈ పండుని ప్యాషన్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం పాసిఫ్లోరా ఎడులిస్. ఇది ఉష్ణమండల పండు, ఇది ఒక విలక్షణమైన రూపాన్ని కలిగి ఉంటుంది. చూడటానికి గుండ్రంగా లేదా ఓవెల్ ఆకారంలో ఉంటుంది. దీని బయటి భాగం గట్టిగా ఉంటుంది. లోపలి భాగం జ్యూ'సీగా మెత్తగా ఉంటుంది. ఎక్కువగా ఊదా లేదా తిక్ మెరూన్ కలర్‌లో లేదా పసుపు రంగులో ఉంటాయి. ఈ పండును ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
ఆరోగ్య ప్రయోజనాలు
- ఇది శక్తిమంతమైన ఫైబర్ మూలం.
- పిసిటానాల్' అనే సమ్మేళనం మదుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
- ఇందులో ఉండే పోటాషియం రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
- అలాగూ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచుతుంది
- ఈ పండులో విటమిన్ ఏ బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. అందువల్ల దీని తీసుకుంటే అంధత్వం రాదు. పైగా కంటి పనితీరు మెరుగుపడుతుంది.
- అంతేగాదు బరువును తగ్గించే గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. నిజానికి, కృష్ణఫలం సారం యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. పెరిగిన శరీర బరువు, కొవ్వు పదార్ధం , గ్లూకోస్ టాలరెన్స్ ద్వారా ఈ లక్షణాలు సులభంగా మెరుగుపడతాయి. బరువు పెరగడం వల్ల కలిగే జీవక్రియ రుగ్మతలను తొలగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించే ఆహారంలో ఈ పండును చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది
- ఇక ఇందులో కేన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.
(చదవండి: మెంతులు..ఇంతులు అంటూ తెగ తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!)
Comments
Please login to add a commentAdd a comment