
కివి విదేశీ పండైనా..మనకి మార్కెట్లలో అందుబాటులోనే ఉంది. దీన్ని చైనీస్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు. చాలామంది ఇష్టంగా తింటారు కూడా. అయితే ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అన్నీ లాభాలనందించే ఈ పండుని తొక్కతో తినొచ్చా..? ఏ సమయంలో తింటే మంచిది వంటి వాటి గురించి తెలుసుకుందామా..!
రుచిలో తియ్యగా, పుల్లగా ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే తియ్యగా, పుల్లగా ఉండే ఈ కివీ వివిధ వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా ఈ పండుని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఈ కివి పండుని తీసుకోవండ కలిగే లాభాలేంటంటే..
ఆరోగ్య ప్రయోజనాలు..
కివి పండులో విలువైన ఫైబర్, విటమిన్‌లు ఉంటాయి.
ఉబ్బరం తగ్గిస్తుంది
గట్ బ్యాక్టీరియాకు ఉపయోగపడుతుంది
సెరటోనిస్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి హాయిగా నిద్రపడుతుంది ∙బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది ∙రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఒమేగా ఫ్యాటీ అమ్లాల వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.
ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది
మల బద్దకం సమస్య లేకుండా చేస్తుంది.
కివీలో ఉండే ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది ∙
శరీరం కోల్పోయిన నీటిని అందించడంలో కివీలోని విటమిన్‌లు సి, ఇ, పొటాషియం... ఉపయోగపడతాయి.
ఏ సమయంలో తినాలి
కివి తినడానికి సరైన సమయం ఉదయం. కివిలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. కివి ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. పుల్లటి పండ్లను ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి కాబట్టి ఖాళీ కడుపుతో తినకుండా కాస్త బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తినడం మంచిది.
ఎలా తింటే మంచిదంటే..
కివీ పండ్లతో ప్రయోజనాలోన్నో. దీని తొక్కను తీసి పారేస్తుం టాం. కానీ అందులో చాలా విషయం ఉంది. తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెంట్లు పూర్తి పీచు పదార్థంతో నిండిన గుజ్జు ఉంటుంది. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియిన్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో శరీరం లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు.
(చదవండి: బీట్‌రూట్‌ని మజ్జిగతో కలిపి ఎందుకు తీసుకోవాలంటే..!)
Comments
Please login to add a commentAdd a comment