విటమిన్–సి అనేక వ్యాధులను నివారిస్తుందన్న విషయం తెలిసిందే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... చాలామంది అనుకునేదానికి భిన్నంగా నారింజ వంటి పండ్లతో పోలిస్తే జామపండులో ఉండే విటమిన్–సీ మోతాదులు ఇంకా ఎక్కువ. అందుకే జామ అనేక వ్యాధులను సమర్థంగా నివారిస్తుంది. టొమాటోలో ఉన్నట్లుగానే జామపండులోనూ లైకోపిన్ మోతాదులు చాలా ఎక్కువ అనేది యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మాట.
ఈ ‘లైకోపిన్’ అనే పోషకం...ప్రోస్టేట్ క్యాన్సర్ తోపాటు చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఉదాహరణకు ఈసోఫేజియల్ క్యాన్సర్, పెద్దపేగు కేన్సర్లను జామపండు సమర్థంగా నివారిస్తుంది. పచ్చికాయ కంటే కాస్తంత ముగ్గిన జామపండులో పీచు (ఫైబర్) మోతాదులు చాలా ఎక్కువ. దాంతో అది మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొద్దున్నే సాఫీగా మల విసర్జన జరగడమనే మంచి శానిటరీ హ్యాబిట్‌తో చాలా రకాల జబ్బులు నివారితమవుతాయన్నది తెలిసిందే.
అంతేకాదు జామలో పొటాషియమ్ కూడా ఎక్కువే కావడం వల్ల అది హైబీపీ నివారణకూ తోడ్పడుతుంది. దాదాపు 100 గ్రాముల జామపండులో 300 మి.గ్రా. మేరకు కండర నిర్మాణ సామర్థ్యం ఉండటం వల్ల కండరాలు పెరుగుతూ ఎదిగే వయసు పిల్లలకు ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. ఇలా ఏ రకంగా చూసినా జామపండు ఆరోగ్యాన్నిచ్చే నిధి. ఎన్నో వ్యాధుల నివారణకు పనిచేసే పెన్నిధి.
(చదవండి: ∙
Comments
Please login to add a commentAdd a comment